breaking news
Abhishek Sharma
-
జపాన్ గడ్డపై స్వర్ణ పతకాలతో టీమిండియా (ఫొటోలు)
-
ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు.. టీమిండియాదే గోల్డ్ మెడల్ (ఫోటోలు)
-
Asian Games Cricket: స్వర్ణం నిలబెట్టుకున్న భారత్
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్ స్వర్ణం నిలబెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరి, తుది సమరంలో పాక్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.- Ruturaj Gaikwad & his team in 2023.- Shreyas Iyer & his team in 2026.TWO GOLDS IN TWO ASIAN GAMES IN MENS CRICKET - Time for Gold in LA 2028 😍❤️ pic.twitter.com/BLruOeaqh0— Johns. (@CricCrazyJohns) October 3, 2026ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 61 పరుగులు) ఆరంభంలో చెలరేగగా.. ఆఖర్లో తిలక్ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించాడు.Dube ne kar diya dhamaal, Sundar ne catch pakda kamaal 🔥Watch 𝐓𝐡𝐞 𝐁𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐌𝐚𝐭𝐜𝐡 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐘𝐞𝐚𝐫 - #INDvPAK in the #AsianGames2026 Gold Medal Match - LIVE NOW on #SonyLIV & #SonySportsNetwork pic.twitter.com/VgTJEXeU37— Sony LIV (@SonyLIV) October 3, 2026మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 15) వరుసగా రెండు సిక్సర్లు బాది జోరు ప్రదర్శించినా, అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (4 బంతుల్లో 2) మరోసారి నిరాశపరిచాడు.𝐀𝐛𝐡𝐢 toh party shuru hui hai! 🔥Watch 𝐓𝐡𝐞 𝐁𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐌𝐚𝐭𝐜𝐡 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐘𝐞𝐚𝐫 - #INDvPAK in the #AsianGames2026 Gold Medal Match - LIVE NOW on #SonyLIV & #SonySportsNetwork 💙 pic.twitter.com/GRRvqSgWZK— Sony LIV (@SonyLIV) October 3, 2026కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 21 పరుగులు (2 ఫోర్లు), ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 20 పరుగులు (3 ఫోర్లు) చేశారు. ఆఖర్లో తిలక్‌కు జతగా శివమ్ దూబే (15 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించాడు.పాక్ బౌలర్లలో అరాఫత్ మిన్హాస్, అహ్మద్ దానియల్ తలో 2, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలోనే తడబడింది. 33, 36, 39 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. హసన్ నవాజ్ (96) వీరోచితంగా పోరాడినా, లక్ష్యం మరీ పెద్దది కావడంతో పాక్ గెలుపుకు కావాల్సిన పరుగులు చేయలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులకే పరిమితమైంది.పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ 29, మాజ్ సదాకత్ 23, కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ 10, ఉస్మాన్ ఖాన్ 3, అబ్దుల్ సమద్ 9, సాద్ మసూద్ 12 (నాటౌట్) పరుగులు చేశారు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్, సుందర్, దూబే తలో 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడినా పాక్ రజతం సాధించింది. ఫైనల్‌కు ముందు జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బంగ్లాదేశ్‌ను ఓడించి కాంస్యం గెలిచింది. ఇదీ చదవండి: అత్యంత అరుదైన ఘనత సాధించిన ఇషాన్ కిషన్ -
IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఆసియా క్రీడలు- 2026 టీ20 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో ఫైనల్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆసియా టీ20 కప్-2025 నాటి మ్యాచ్‌ను గుర్తు చేస్తూ పాక్ బౌలింగ్‌ను మరోసారి చితక్కొట్టాడు.ఈ క్రమంలో పాకిస్తాన్‌పై టీ20లలో తన పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును అభిషేక్ శర్మ సవరించాడు. ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో పాక్‌పై 24 బంతుల్లో ఫిఫ్టీ బాదిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. తాజాగా శనివారం నాటి ఫైనల్లో కేవలం 20 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మఈ మ్యాచ్‌లో మొత్తంగా 28 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అభిషేక్ శర్మ మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 400 సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.UNSTOPPABLE ABHI! ⚡Abhishek Sharma brings up a stunning 20-ball fifty with a six as India are building up the lead against Pakistan! 🔥Watch Pakistan vs India in the 20th Asian Games Gold Medal Match, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/v6Ig2hxV6e— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026గతంలో ఈ రికార్డు మరో టీ20 ఓపెనర్ సంజూ శాంసన్ పేరిట ఉండేది. సంజూ 317 ఇన్నింగ్స్‌లో 400 సిక్సర్లు బాదగా.. 26 ఏళ్ల అభిషేక్ శర్మ కేవలం 208 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.మరో క్రేజీ రికార్డుఅంతేకాదు.. ఓ క్యాలెండర్ ఇయర్లో అతి తక్కువ బంతుల్లోనే టీ20 క్రికెట్లో వంద సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం ఆండ్రీ రసెల్ ముందు వరుసలో ఉన్నాడు. రసెల్ 2019లో 589 బంతుల్లో వంద టీ20 సిక్సర్లు బాదగా.. అభిషేక్ ఈ ఏడాది 651 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు.ఇక పాకిస్తాన్‌తో ఫైనల్లో అభిషేక్ శర్మతో పాటు తిలక్ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 22 బంతుల్లోనే తిలక్ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి మెరుపుల కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కఠినమైన పిచ్‌పై ఏకంగా 211 పరుగులు చేసింది. అనంతరం పాక్‌ను 192 పరుగులకే పరిమితం చేసి స్వర్ణం గెలిచింది.చదవండి: పాక్‌తో ఫైనల్లో వైభవ్ విఫలం.. అభిషేక్ రియాక్షన్ వైరల్ -
చెలరేగిన అభిషేక్, తిలక్.. పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్
పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర అర్ద సెంచరీతో (28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 61 పరుగులు) చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 15) వరుసగా రెండు సిక్సర్లు బాది జోరు ప్రదర్శించినా, అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (4 బంతుల్లో 2) మరోసారి నిరాశపరిచాడు. అభిషేక్ ఔటైన తర్వాత భారత్ స్కోర్ నిదానించింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 21 పరుగులు (2 ఫోర్లు), ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 20 పరుగులు (3 ఫోర్లు) చేశారు. ఆఖర్లో తిలక్ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (15 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో అరాఫత్ మిన్హాస్, అహ్మద్ దానియల్ తలో 2, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.ఇదీ చదవండి: Asian Games Finals: వైభవ్‌కు ఎగతాళి చేసిన పాక్ బౌలర్ -
IND vs PAK: ఫైనల్లో వైభవ్ విఫలం.. అభిషేక్ రియాక్షన్ వైరల్
ఆసియా క్రీడలు- 2026 పురుషుల టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పసిడి పతక పోరులోనూ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీ జోడీని యాజమాన్యం కొనసాగించింది.తొలి ఓవర్లో కష్టంగాకాగా జపాన్‌లోని నిశిన్ పిచ్‌పై స్పిన్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్ ఆల్‌రౌండర్ సయీబ్ ఆయుబ్తో పాక్ తమ బౌలింగ్ ఎటాక్ ఆరంభించింది. ఈ క్రమంలో తొలి ఓవర్లో వైభవ్ రెండు సింగిల్స్ తీయగా.. అభిషేక్ ఒక్క పరుగు మాత్రమే రాబట్టాడు. వైడ్ రూపంలో ఒక పరుగు వచ్చింది.Vaibhav Sooryavanshi started off with a Bossy SIX 💥 Watch Pakistan vs India in the Men's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026… pic.twitter.com/NrxD0MIGKR— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026వరుసగా రెండు సిక్సర్లుఅయితే, రెండో ఓవర్లో వైభవ్ గేరు మార్చాడు. సాద్ మసూద్ బౌలింగ్‌లో రెండు, మూడు బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఇలా భారీ షాట్లతో అలరించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మూడో ఓవర్లో తొలి బంతికే సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ANOTHER ONE! ⚡Vaibhav pulls it high over mid wicket giving a blazing start to India's innings. 🔥Watch Pakistan vs India in the Men's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/HdMpOdL5fS— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026 ఏంటిది వైభవ్?పాక్‌తో ఫైనల్లో మొత్తంగా 9 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వైభవ్ అనవసరమైన రవర్స్ స్వీప్ షాట్ ఆడి అవుటైన నేపథ్యంలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ‘ఏంటిది వైభవ్?’ అన్నట్లుగా అతడు ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.ఇక వైభవ్ స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (2) కూడా నిరాశపరచగా.. అభిషేక్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఈ లెఫ్టాండర్.. మొత్తంగా 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 61 పరుగులు సాధించాడు. అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: IND vs WI: శ్రేయస్ అయ్యర్‌దే తుది నిర్ణయం కావాలి! -
Asian Games Finals, IND VS PAK: అభిషేక్ శర్మ విధ్వంసం
పాకిస్తాన్‌తో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్స్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 20 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అర్ద సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి ఔట్ కాగా.. సంజూ శాంసన్ (4 బంతుల్లో 2) మరోసారి నిరాశపరిచాడు. 6 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 85-2గా ఉంది. అభిషేక్ 54, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ (వైభవ్), అహ్మద్ దానియల్ (సంజూ) తలో వికెట్ తీశారు.కాగా, భారత్ సెమీస్‌లో శ్రీలంకను.. పాకిస్తాన్ సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఓడిన బంగ్లాదేశ్, శ్రీలంక కొద్ది సేపటి క్రితమే కాంస్య పతకం మ్యాచ్‌లో పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజేతగా నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఇదీ చదవండి: Asian Games 2026: స్వర్ణం కైవసం చేసుకున్న భారత గోల్ఫర్ -
IND vs WI: ‘వైభవ్ సూర్యవంశీని తప్పక ఆడించాలి’
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఇప్పుడే చర్చ మొదలైంది. ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లకు సెప్టెంబరు 27- అక్టోబరు 17 మధ్య షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.ఫైనల్ తర్వాత స్వదేశానికితొలుత వన్డే సిరీస్ మొదలు కాగా.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. శనివారం నాటి మూడో వన్డేలోనూ గెలుపొంది క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నమెంట్లో శనివారం నాటి ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశానికి చేరుకోనుంది.వీవీఎస్ లక్ష్మణ్ కీలక నిర్ణయంఅనంతరం అక్టోబరు 6 నుంచి రెగ్యులర్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో భారత టీ20 జట్టు విండీస్‌తో సిరీస్ మొదలుపెడుతుంది. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంకతో సెమీ ఫైనల్ సందర్భంగా లక్ష్మణ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.ఈ ముగ్గురు టాపార్డర్‌లో కుదురుకుంటే..ఓపెనింగ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ.. ఇలా ముగ్గురినీ టాపార్డర్‌లో ఆడించాడు. ఓపెనర్లుగా వైభవ్, అభిషేక్ బరిలోకి దిగగా.. సంజూ వన్‌డౌన్‌లో వచ్చాడు. ఇదే కాంబినేషన్‌ను సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.ఒకవేళ ఈ ముగ్గురు టాపార్డర్‌లో కుదురుకుంటే.. వీరిలో ఒక్కరు మెరుగ్గా ఆడినా భారత జట్టు వరుస విజయాలు సాధించడం ఖాయమని కైఫ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు..గంభీర్‌ను కాదనైనా సరే శ్రేయస్ నిర్ణయం తీసుకోవాలి‘‘విండీస్‌తో సిరీస్‌కు వీవీఎస్ కోచ్‌గా ఉండడు. అయితే కెప్టెన్ మాత్రం శ్రేయస్ అయ్యరే కదా!.. టాపార్డర్ విషయంలో శ్రేయస్ గట్టి నిర్ణయం తీసుకోవాలి. అభిషేక్, వైభవ్, సంజూలను తుదిజట్టులో ఆడించాలి.వాళ్లు ముగ్గురూ గనుక టాపార్డర్‌లో కుదురుకుని.. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయిందంటే అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చు. అయితే, ఇక్కడ కోచ్ (గంభీర్)తో సమస్య రావొచ్చు. అయినా సరే శ్రేయస్ ఒప్పించగలగాలి. ఆ ముగ్గురిలో ఒక్కరు బ్యాట్ ఝులిపించినా టీమిండియా ఆరోజు తప్పక విజయం సాధిస్తుంది.వన్డౌన్లోనైనా వైభవ్వైభవ్ను పక్కన పెట్టడం ఏ రకంగానూ మంచిది కాదు. అతడిని ప్రపంచకప్ టోర్నీకి సిద్ధం చేయాలంటే వరుస అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం అభిషేక్- సంజూను ఓపెనర్లుగా కొనసాగిస్తే వైభవ్‌ను వన్డౌన్లోనైనా ఆడించాలి’’ అని కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సంజూకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల గంభీర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాబట్టి యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదని కుండబద్దలు కొట్టాడు గంభీర్.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా యువ సంచలనం -
ఎస్ఆర్హెచ్ను వీడనున్న అభిషేక్ శర్మ!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టుకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టును ఎస్ఆర్హెచ్ను వీడనున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్స్ కంటే ముందే అభిషేక్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో అభిషేక్ శర్మ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వార్తల్లో నిజం లేదని ఎస్ఆర్హెచ్ సీఈవో షణ్ముగం ఖండించారు. అభిషేక్ శర్మను తాము వదులుకోవడానికి సిద్ధంగా లేమని, అనవసరంగా పుకార్లు పుట్టించొద్దని, ఇది ఎంతమాత్రం నిజం కాదని షణ్ముగం పేర్కొన్నాడు. 2026 ఐపీఎల్ సీజన్లో ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరమవ్వడంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అభిషేక్‌కు నచ్చలేదట. తనకు కెప్టెన్సీ అప్పగిస్తారని భావించినప్పటికీ, ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మాత్రం ఇషాన్‌కు అప్పగించడంపై అభిషేక్ గుర్రుగా ఉన్నాడు. అయితే ఈ వార్తల్లో నిజం లేదనిపిస్తున్నప్పటికీ, ఒకవేళ అభిషేక్ శర్మ వచ్చే సీజన్ నాటికి జట్టును వీడితే మాత్రం అది ఎస్ఆర్హెచ్కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఎన్నో భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్ శర్మ జట్టు సాధించిన చాలా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక 2022 నుంచి అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్తోనే ప్రయాణం సాగిస్తున్నాడు. 2024లో ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరడంలో అభిషేక్ శర్మ కీలకపాత్ర వహించాడు. ఆ సీజన్లో 16 మ్యాచ్‌లాడిన అభిషేక్ 484 పరుగులు సాధించాడు. 2025 సీజన్లో 40 బంతుల్లోనే సెంచరీ సాధించిన అభిషేక్ ఐపీఎల్లో తన తొలి సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 92 మ్యాచ్‌లాడిన అభిషేక్ శర్మ 2,379 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 13 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ప్రస్తుతం ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న అభిషేక్ శర్మ రేపు పాకిస్తాన్‌తో జరగనున్న ఫైనల్ పోరు కోసం సిద్ధమవుతున్నాడు. ఇదీ చదవండి: ఓటమి తప్పించిన భారత బ్యాటర్.. ఆసీస్‌పై సిరీస్ కైవసం -
రేపు పాక్‌తో ఫైనల్.. అందరి కళ్లు ఆ ముగ్గురిపైనే!
ఆసియా గేమ్స్‌లో భాగంగా రేపు జరగనున్న ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు స్వర్ణ పతక పోరు కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆట పరంగా చూస్తే పాకిస్తాన్ కంటే భారత్ అన్నింటిలో మెరుగ్గా కనిపిస్తుంది. వరుసగా రెండోసారి స్వర్ణం చేజేక్కించుకోవాలని టీమిండియా భావిస్తుండగా, టీమిండియాకు పసిడి కలను దూరం చేయాలనే పట్టుదలతో పాక్ బరిలోకి దిగుతోంది. ఐసీసీ సహా మేజర్ టోర్నీల్లో ఎక్కడ చూసుకున్నా పాకిస్తాన్‌పై భారత్‌దే స్పష్టమైన ఆధిపత్యం. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాను పాక్ ఓడించిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. గతేడాది ఆసియా కప్ ఫైనల్ సందర్భాగా ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడగా, టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి భారత్‌ను ఓడించి సొంతం చేసుకోవాలన్న పాకిస్తాన్ గోల్డ్ కలను భగ్నం చేయగల ముగ్గురు భారత స్టార్ల గురించి ఒకసారి చర్చిద్దాం.అభిషేక్ శర్మ..ఏడాది క్రితమే తొలిసారి పాకిస్తాన్‌తో ఆడిన అభిషేక్ శర్మ ఆ జట్టుకు భయాన్ని పుట్టించాడు. పాక్‌పై ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో అతడు తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, ఉన్నంతసేపు పాక్ బౌలర్లను దంచికొట్టాడు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న ఫైనల్లో అభిషేక్ శర్మ వీరవిహారం చేస్తే మాత్రం పాక్‌కు కష్టాలు తప్పవు. పాక్‌తో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 177.41 స్ట్రైక్‌రేట్‌తో 110 పరుగులు చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి పాక్ విధించిన భారీ టార్గెట్‌ను భారత్ సునాయాసంగా ఛేదించడంలో సహాయపడ్డాడు. అయితే గత రెండు ఇన్నింగ్స్‌ల్లో మాత్రం వరుసగా ఐదు, సున్నా స్కోర్లకే పరిమితమైనప్పటికీ, మ్యాచ్‌లో నిలదొక్కుకుంటే మాత్రం అభిషేక్ శర్మ డేంజర్ ఇన్నింగ్స్ ఆడగలడు.జస్ప్రీత్ బుమ్రా..పాకిస్తాన్‌పై బౌలింగ్‌లో టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రాకు మంచి రికార్డు ఉంది. 2023-24 మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు ప్రపంచకప్పుల్లో బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు సొంతం చేసకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లో కూడా పాక్‌తో మ్యాచ్‌లో బుమ్రా తాను వేసిన తొలి రెండు ఓవర్లలోనే పాక్ పతనాన్ని శాసించాడు. ఇప్పటివరకు బుమ్రా పాకిస్తాన్‌పై 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. తాను ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండుసార్లు మాత్రమే వికెట్ తీయడంలో విఫలమైన బుమ్రా, మిగిలిన ఆరు సందర్భాల్లో మాత్రం టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.తిలక్‌వర్మ..టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు పాకిస్తాన్‌పై అమోఘమైన రికార్డు ఉంది. గతేడాది జరిగిన ఆసియా కప్ ఫైనల్లో బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. అంతేకాదు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ తిలక్ వర్మ 25 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు పాకిస్తాన్‌పై 4 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ 155 పరుగులు చేశాడు.ఇదీ చదవండి: Asian Games 2026: రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం -
Asian Games Cricket: సెమీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపులు
ఆసియా క్రీడలు- 2026 పురుషుల టీ20 క్రికెట్ టోర్నీ సెమీ ఫైనల్ సందర్భంగా.. టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ.. చాన్నాళ్ల తర్వాత తుదిజట్టులోకి వచ్చాడు. జపాన్ వేదికగా శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు.అభిషేక్, సంజూ విఫలంతొలి ఓవర్లో లంక స్పిన్నర్ తరిందు రత్ననాయకె బంతితో రంగంలోకి దిగగా వైభవ్.. ఆఖరి బంతికి ఫోర్ బాది ఖాతా తెరిచాడు. రెండో ఓవర్లో సహానే అరాచిగే బౌలింగ్‌లో దూకుడుగా ఆడే ప్రయత్నంలో అభిషేక్ (3 బంతుల్లో 7) పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో వైభవ్‌కు సంజూ శాంసన్ తోడయ్యాడు. అయితే, మూడో ఓవర్ ఆఖరి బంతికే సంజూ (7) తరిందు బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాగా.. వైభవ్ కాస్త దూకుడు పెంచాడు. నాలుగో ఓవర్లో చివరి రెండు బంతులకు వరుసగా ఫోర్లు బాది టచ్‌లోకి వచ్చాడు.వైభవ్ ధనాధన్... 4,6,4ఇక ఐదో ఓవర్లో తరిందుకు వైభవ్ చుక్కలు చూపించాడు. ఆఖరి మూడు బంతుల్లో వరుసగా 4,6,4 లతో చెలరేగాడు. అయితే, ఆరో ఓవర్లో బినుర ఫెర్నాండో తొలుత ఇబ్బంది పెట్టినా.. ఐదో బంతికి వైభవ్ సిక్సర్ బాది అతడిని పనిష్ చేశాడు. ఈ లెఫ్టాండర్ ఓపెనర్ మెరుపుల కారణంగా భారత్ పవర్ ప్లే (తొలి ఆరు ఓవర్లు)లో రెండు వికెట్ల నష్టానికి 58 పరుగుల మేర మెరుగైన స్కోరు చేయగలిగింది.ఊహించని షాక్ అయితే, ఏడో ఓవర్లోనూ దూకుడు కొనసాగించాలని చూసిన వైభవ్ సూర్యవంశీకి ఊహించని షాక్ తగిలింది. లంక కెప్టెన్, స్పిన్నర్ సహాన్ అరాచిగే రెండో బంతికి వైభవ్‌ను ఊరించగా.. భారీ షాట్‌కు యత్నించిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు బంతిని గాల్లోకి లేపాడు. ఇంతలో సినేత్ జయవర్దెనె ఊహించని రీతిలో లో క్యాచ్ అందుకోగా.. వైభవ్ మెరుపులకు తెరపడింది. ఇదిలా ఉంటే.. పది ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 88 పరుగులే చేయగలిగింది. లంక స్పిన్నర్ల ధాటికి అభిషేక్ శర్మ (7), సంజూ శాంసన్ (7), శ్రేయస్ అయ్యర్ (13) చేతులెత్తేయగా.. వైభవ్ మాత్రం ఫర్వాలేదనిపించాడు. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 38 పరుగులు రాబట్టాడు. దూకుడుగా ఆడే క్రమంలోవ్యూహం బెడిసి కొట్టి అర్ధ శతకం కూడా అందుకోకుండానే వైభవ అవుటయ్యాడు.UPDATE: IND vs SL వైభవ్ మెరుపులు.. ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత్ స్కోరెంతంటే?చదవండి: ఇది అసలు క్రికెటే కాదు.. రికార్డుల కోసం మాత్రమేనా?: గంభీర్ అసహనం 𝐅𝐄𝐀𝐑𝐋𝐄𝐒𝐒. 𝐅𝐋𝐀𝐌𝐁𝐎𝐘𝐀𝐍𝐓. 𝐕𝐀𝚰𝐁𝐇𝐀𝐕! 🚀The teenage sensation turns on the heat in the Men's Cricket Semi-Final at Aichi-Nagoya 2026 🔥Watch India vs Sri Lanka, Men’s Cricket Semi-Final 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/DPlqKERcbu— Sony Sports Network (@SonySportsNetwk) October 1, 2026 -
వాళ్లిద్దరిలో ఒకరిపై వేటు.. వైభవ్ సూర్యవంశీకి లైన్ క్లియర్!
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ.. గత కొన్నాళ్లుగా బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో అదరగొట్టినప్పటికీ.. ఈ పదిహేనేళ్ల పిల్లాడిని యాజమాన్యం వరుస మ్యాచ్‌లలో పక్కనపెట్టింది. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్ తిరిగి రాగా.. వైభవ్‌పై వేటు పడింది.సంజూ కోసం తప్పదువైభవ్ సూర్యవంశీ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రపంచకప్ వీరుడు సంజూ కోసం అతడిని పక్కనపెట్టక తప్పదని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తుదిజట్టులో చోటు కోసం మరికొన్నాళ్లు చూడాల్సిందేనని కుండబద్దలు కొట్టాడు.ఈ నేపథ్యంలో జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌లోనూ వైభవ్ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం భారత టీ20 జట్టు ఆసియా క్రీడలు-2026 టోర్నీ కోసం జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా ఈ ఈవెంట్లో నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.అయితే, ఈసారి కూడా వైభవ్ సూర్యవంశీకి మొండిచేయి చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ ఉన్నప్పటికీ త్వరలోనే ఈ బిహారీ పిల్లాడు కూడా తుదిజట్టులోకి వస్తాడని అంచనా వేశాడు.వాళ్లిద్దరిలో ఒకరిని తప్పిస్తే వైభవ్‌కు లైన్ క్లియర్! ఇందుకోసం తిలక్ వర్మ లేదంటే శివం దూబేను యాజమాన్యం పక్కనపెట్టాల్సి ఉంటుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘తిలక్ వైస్ కెప్టెన్ అన్న సంగతి నాకూ తెలుసు. అయితే, గతంలో వైస్ కెప్టెన్‌ను కూడా తుదిజట్టు నుంచి తప్పించిన దాఖలాలు ఉన్నాయి.మరోవైపు.. శివం దూబే. అతడి ఆటలో నిలకడ లేదు. ఫీల్డింగ్‌లో కూడా బలహీనంగా ఉన్నాడు. అతడు సరైన బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా కాదు. కేవలం బ్యాటర్‌గానే తుదిజట్టులో ఉంటున్నాడు. కాబట్టి ఆరు నెలల తర్వాత తిలక్ లేదంటే దూబే తుదిజట్టు నుంచి కనుమరుగు కావడం ఖాయం.వీరిద్దరిలో ఒకరిని తప్పించి వైభవ్‌కు మార్గం సుగమం చేస్తారనుకుంటున్నా. నా ప్రస్తుత అభిప్రాయం. ఆసియా క్రీడల్లో వైభవ్‌ను తప్పక ఆడించాలి. బౌలర్ యశ్ ఠాకూర్‌కు ఇంకా తనను తాను పూర్తిగా నిరూపించుకోలేదు. కాబట్టి అతడిని పక్కనపెట్టవచ్చు’’ అని కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 6 మ్యాచ్‌లు ఆడి 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: వెస్టిండీస్ కెప్టెన్ ప్రపంచ రికార్డు -
టీమిండియాపై జపాన్ బౌలర్ ప్రపంచ రికార్డు
జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా అతి కష్టం మీద నెగ్గింది. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన పోరులో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. వర్షం అంతరాయంతో 5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. రెండువేల సీటింగ్ సామర్థ్యమున్న సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జపాన్ స్పిన్ బౌలర్ చార్లీ హింజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.17 ఏళ్ల వయసున్న చార్లీ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్లు పడగొట్టాడు. ఇందులో అభిషేక్ శర్మను గోల్డెన్ డకౌట్ చేసిన చార్లీ హింజ్.. మ్యాచ్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ వికెట్ కూడా పడగొట్టి జపాన్‌కు బ్రేక్ ఇచ్చాడు. దీంతో చార్లీ హింజ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది.అయితే మ్యాచ్‌కు ముందే చార్లీ హింజ్ ఒక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడి జాబితాలో చార్లీ హింజ్ చోటు దక్కించుకున్నాడు. 17 ఏళ్ల 357 రోజుల వయసున్న చార్లీ హింజ్ భారత్‌పై టీ20 ఆడిన మూడో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. హింజ్ కంటే ముందు నేపాల్ క్రికెటర్ గుల్షన్ ఝా (17 ఏళ్ల 228 రోజులు), నమీబియా క్రికెటర్ మాక్స్ హీంగో (17 ఏళ్ల 341 రోజులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.ఎవరీ చార్లీ హింజ్?చార్లీ హింజ్ విషయానికొస్తే అతడి కుటుంబం మొత్తం క్రికెటర్లతో నిండి ఉండడం విశేషం. అతడి సోదరులు జి హరా హింజ్, ఎమ్ హరా హింజ్‌లు జపాన్ అండర్-19 జట్టుకు ఆడారు. ఈ ముగ్గురిలో చార్లీ హింజ్ సక్సెస్ అయ్యాడు. 2024లో జపాన్ సీనియర్ జట్టుకు ఆడాడు. గణాంకాల విషయానికొస్తే చార్లీ హింజ్ 39 టీ20ల్లో 49 వికెట్లు తీశాడు. జపాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చార్లీ హింజ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే చార్లీ హింజ్ (2-17) అద్భుత ప్రదర్శనతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. అనంతరం జపాన్ అనుభవలేమితో 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసి విజయానికి రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది.ఇదీ చదవండి: కాసేపట్లో లంకతో తొలి వన్డే.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ గుడ్‌బై -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నమెంట్ ఆరంభానికి ముందు టీమిండియా ఆతిథ్య జపాన్‌తో తలపడింది. కాంటోలోని సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఇరుజట్ల మధ్య తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగింది.ఊహించని విధంగావర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో టాస్ బాగా ఆలస్యమైంది. ఈ క్రమంలో మంగళవారం నాటి ఈ మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, జపాన్ బౌలర్లు ఊహించని విధంగా విజృంభించారు.పదిహేడేళ్ల స్పిన్నర్ చార్లీ హారా- హింజే అనూహ్య రీతిలో అభిషేక్ శర్మను గోల్డెన్ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (9)ను ఇబ్రహీం తకాహషి పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (3)ను బెంజమిన్ ఇటో-డేవిస్ అవుట్ చేశాడు.ఆఖరి వరకు ఉత్కంఠకెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ ఒకటి, శివం దూబే సున్నా పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత ఐదు ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జపాన్ నరాలు తెగే ఉత్కంఠ రేపింది. నిర్ణీత 5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ఫలితంగా రెండు పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కిన టీమిండియా చారిత్రక మ్యాచ్‌లో గెలుపొంది ఊపిరిపీల్చుకుంది.కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియాకు ఇది 200వ విజయం (సూపర్ ఓవర్లు సహా)కావడం విశేషం. తద్వారా ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.టీమిండియా ‘డబుల్ సెంచరీ’లో మైలురాళ్లు👉తొలి విజయం: 2006లో జొబర్గ్ వేదికగా సౌతాఫ్రికాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపు👉యాభైవ విజయం: 2017లో కొలంబో వేదికగా శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో గెలుపు👉వందవ విజయం: 2022లో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌పై 8 పరుగుల తేడాతో గెలుపు👉150వ విజయం: 2024లో గ్రాస్ ఐలెట్ వేదికగా ఆస్ట్రేలియాపై 24 పరుగుల తేడాతో గెలుపు👉200వ విజయం: 2026లో సనో వేదికగా జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలుపు. -
జపాన్‌తో మ్యాచ్.. అభిషేక్ శర్మ అట్టర్ ప్లాప్
జపాన్‌తో జరుగుతున్న చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. వెట్ ఔట్‌ఫీల్డ్ కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. ఎదుర్కొన్న తొలి బంతిలోనే అవుటై తీవ్ర నిరాశపరిచాడు. జపాన్ స్పిన్నర్ చార్లీ హారా-హింజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. అభిషేక్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్లు సంజూ శాంసన్(9), ఇషాన్ కిషన్(3) కూడా తీవ్ర నిరాశపరిచారు.అభిషేక్ చెత్త రికార్డుఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధికసార్లు డకౌటైన ప్లేయర్‌గా జప్పీ బిమెన్యిమానా, అయూబ్, తుయిసెంగే సరసన అభిషేక్ నిలిచాడు.ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధికసార్లు డకౌటైన ప్లేయర్లు వీరే7 - జప్పీ బిమెన్యిమానా (రువాండా, 2023).7 -ఆర్చిడ్ తుయిసెంగే (రువాండా, 2023).7 - సైమ్ అయూబ్ (పాకిస్తాన్, 2025).7 -అభిషేక్ శర్మ ( భారత్ 2026)చదవండి: చరిత్ర సృష్టించి టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
అభిషేక్-వైభవ్.. ఇక్కడ సింహాలు.. అక్కడ పిల్లులు!
టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై భారత మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు ప్రమాదకర బ్యాటర్లు అని.. స్వదేశంలో విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడుతున్నారని కొనియాడాడు.విదేశీ గడ్డ మీద మాత్రంఅయితే, అదే సమయంలో విదేశీ గడ్డ మీద మాత్రం అభిషేక్- వైభవ్ తేలిపోతున్నారని సందీప్ పాటిల్ ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా అభిషేక్ శర్మ ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం 131 పరుగులే చేశాడు.మరోవైపు.. సంజూ శాంసన్ స్థానంలో తుదిస్థానంలో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ గడ్డ మీదే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 42 పరుగులే చేయగలిగాడు.ఇక్కడ సింహాలు.. అక్కడ పిల్లులు!ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ స్పోర్ట్స్నెక్ట్స్తో మాట్లాడుతూ.. ఈ ఇద్దరు లెఫ్టాండర్ బ్యాటర్ల ఆట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి నేను ఓ విషయం గమనించాను. ఇండియాకు వెలుపల.. విదేశీ గడ్డపై బాల్ స్వింగ్ అవుతున్న వేళ.. ఇద్దరూ బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఈ సమస్యను అధిగమించే దిశగా ప్రయత్నాలు చేయాలి. లేదంటే.. స్వదేశంలో సింహాలు.. విదేశాల్లో పిల్లుల మాదిరిగా మారిపోతారు. ఇది జరగకూడదు’’ అని సందీప్ పాటిల్ పేర్కొన్నాడు.జింబాబ్వే గడ్డ మీద ఇరగదీసిన వైభవ్ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వైభవ్ సూర్యవంశీ.. మూడు టీ20లలో వరుసగా 19 బంతుల్లోనే 50, 9 బంతుల్లోనే 20, 49 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు.ఫలితంగా ఈ సిరీస్‌లో టీమిండియా జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. వైభవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. అయితే, స్వదేశంలో ఇటీవల అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఓపెనర్‌గా సంజూ శాంసన్ తిరిగి రావడంతో వాటర్ బాయ్‌గా సేవలు అందించాడు.అభిషేక్ 30 బంతుల్లోనేమరోవైపు.. అఫ్గాన్‌తో సిరీస్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా మూడో టీ20లో కేవలం 30 బంతుల్లోనే శతక్కొట్టి.. టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన టీమిండియా బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలో సందీప్ పాటిల్ అభిషేక్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఇదే ఆట తీరు విదేశాల్లోనూ కొనసాగించాలని ఆకాంక్షించాడు.చదవండి: భారత జట్టు హెడ్‌కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ! -
నా కెరీర్లో అదే అత్యంత కఠిన నిర్ణయం: గౌతమ్ గంభీర్
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ అసాంతం శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆఖరి టీ20లో అయితే భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లో శతక్కొట్టి, అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా నిలవగా.. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా శ్రేయస్ సేన ప్రత్యర్ధి ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగల్గింది. అఫ్గాన్ ఈ కొండంత లక్ష్యాన్ని చేధించలేక 94 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తమ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20ల్లో 300 పరుగులు సాధించడమే మా లక్ష్యమని గంభీర్ అన్నాడు."అఫ్గానిస్తాన్‌తో చివరి మ్యాచ్‌లో భారత జట్టుకు మెరుపు ఆరంభం దక్కింది. మరీ ముఖ్యంగా పవర్‌ప్లేలో మనవాళ్లు చాలా దూకుడుగా ఆడారు. ఆరు ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగుల మార్క్ దాటింది. నా కోచింగ్ కాలంలో ఇదే అత్యధికం. దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పుడు అదే జోరు కొనసాగిస్తే భారీ స్కోరు సాధ్యమే. టి20ల్లో ఇప్పటి వరకు మన జట్టు 300 మైలురాయిని అందుకోలేదు.మా తదుపరి లక్ష్యం అదే. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్రతిభతో అదేం పెద్ద కష్టం కాదు. అభిషేక్ దూకుడు అందరికీ తెలిసిందే. అఫ్గాన్‌తో మూడో టి20లో అతడి సెంచరీ డ్రెస్సింగ్ రూమ్‌పై చాలా ప్రభావం చూపింది" అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా సిరీస్‌లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావడంపై గంభీర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, అతడు స్వదేశంలో అరంగేట్రం చేసేందుకు మరికొంత కాలం వేచి చూడక తప్పదని గంభీర్ వెల్లడించాడు.ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ సందర్భంగా సంజూ సామ్సన్ను తుది జట్టు నుంచి తప్పించడం తన కెరీర్లోనే అత్యంత కఠిన నిర్ణయమన్న గంభీర్... వన్డే, టెస్టు సారథి శుబ్‌మన్ గిల్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని వివరించాడు.చదవండి: మరోసారి టీమిండియాకు అదే ‘గండం’.. స్పందించిన బీసీసీఐ -
'సర్' అభిషేక్.. నాకు ఇది ముందే తెలుసు: యువరాజ్
అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన అభిషేక్ శర్మపై అతడి మెంటార్, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అభిషేక్ అద్భుత బ్యాటింగ్‌కు ఫిదా అయిన యువీ.. అతడిని 'సర్ అభిషేక్' అని సంబోధిస్తూ 'ఎక్స్' వేదికగా కొనియాడాడు.కాగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ఈ పంజాబ్ క్రికెటర్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 108 పరుగులు చేసి అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలోనే అతడి గురువు యువరాజ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించాడు."టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన 'సర్' అభిషేక్‌కు హృదయపూర్వక అభినందనలు. నీకున్న టాలెంట్, నువ్వు పడే కష్టానికి ఏదో ఒక రోజు ఈ రికార్డు సాధిస్తావని నాకు ముందే తెలుసు. రాబోయే రోజుల్లో నువ్వు తిరగరాయబోయే రికార్డులకు ఇది ఆరంభం మాత్రమే.'జనాలు నీపై రాళ్లు విసిరినప్పుడు.. వాటిని మైలురాళ్లుగా మార్చుకుని నీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలి' అని ఒక పెద్దాయన చెప్పాడు. నువ్వు ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎప్పుడూ ఇలాగే వినయంగా ఉంటూ మరిన్ని విజయాలు సాధించాలి." అని యువరాజ్ సింగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.గురువు బాటలోనే శిష్యుడుఅభిషేక్ గొప్ప క్రికెటర్‌గా ఎదగడంలో యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. దీర్ఘకాలంగా అభిషేక్‌కు యువీ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. మైదానంలో అద్భుతంగా ఆడితే మెచ్చుకునే యువీ, విఫలమైనప్పుడు అంతే తీవ్రంగా హెచ్చరిస్తుంటాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన అభిషేక్ శర్మ.. యువరాజ్ సింగ్ ఇచ్చిన సలహాలు, మార్గదర్శకత్వమే ఈ విధ్వంసకర శతకానికి కారణమని తెలిపాడు.చదవండి: IND vs AUS: ద్రవిడ్, సెహ్వాగ్ కొడుకుల జోరు.. ఆసీస్‌పై భారత్ సంచలన విజయం -
రెండేళ్లకే కోహ్లి రికార్డు సమం.. అభిషేక్ శర్మ అరుదైన ఫీట్!
-
సెంచరీ తర్వాత పిచ్ పైనే ధ్యానం.. అసలు కారణం ఇదే
-
IND vs AFG: వేరే దారి లేదు.. మా ఓటమికి కారణాలు ఇవే!
భారత్‌లో తొలిసారి టీమిండియాకు టీ20 సిరీస్‌లో ఆతిథ్యం ఇచ్చిన అఫ్గానిస్తాన్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో భారత్.. అఫ్గాన్‌పై ఏకపక్ష విజయాలు సాధించింది.అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగిన మూడో టీ20లో అఫ్గాన్‌ను ఏకంగా 127 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా.. 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ స్పందించాడు.నిరాశ కలిగింది.. పవర్ ప్లేలో పర్లేదు‘‘కచ్చితంగా నిరాశ కలిగించే సిరీస్ ఇది. అయితే, పవర్‌ప్లేలో మేము కాస్త మెరుగయ్యాము. అందుకు నేను కాస్త సంతోషంగా ఉన్నాను. అయితే, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయాము.సిరీస్ మొదటి నుంచే మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయితే, రోజురోజుకీ ఆటను మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నాము. టీ20 ప్రపంచకప్ తర్వాత మాకిదే తొలి సిరీస్. ఇంకా ఎన్నో పటిష్ట జట్లతో మరిన్ని మ్యాచ్‌లు, సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అందుకు తగినట్లుగా ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంది’’ అని ఇబ్రహీం జద్రాన్ పేర్కొన్నాడు.భారత ఓపెనర్లు అద్భుతంమరోవైపు.. అఫ్గానిస్తాన్ హెడ్‌కోచ్ రిచర్డ్ పైబస్ కూడా స్పందించాడు.. ‘‘మా ఆట చాలా చెత్తగా సాగింది. అయితే టాస్ గెలవడం కాస్త ఊరటనిచ్చినా.. తొలి పది ఓవర్ల ఆట మా నియంత్రణలో లేకుండా పోయింది. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108), సంజూ శాంసన్ (35 బంతుల్లో 50) అద్భుతంగా, అందంగా బ్యాటింగ్ చేశారు.మా బౌలర్లు తిరిగి పుంజుకున్నారుఅయితే, తర్వాతి పది ఓవర్లలో మా బౌలర్లు తిరిగి పుంజుకున్నారు. ఇది మాకు సానుకూల అంశం. నిజంగానే మా వాళ్లు అద్బుతంగా పోరాటం చేశారు. ఫీల్డింగ్‌లోనూ రాణించారు. కానీ 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మా వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయారు.వేరే దారి లేకుండా పోయిందిఓవర్కు పదకొండు పరుగుల చొప్పున రాబట్టడం కష్టమే. పరిస్థితిని ఎదుర్కోవడం తప్ప వేరే దారి లేదు. మా ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయాము. ఓపెనర్లు ఇబ్రహీం (25), గుర్బాజ్ (15) దూకుడుగా మొదలుపెట్టినా దానిని కొనసాగించలేకపోయారు. లోపాల్ని సరిచేసుకుని ముందుకు సాగుతాము’’ అని రిచర్డ్ పైబస్ చెప్పుకొచ్చాడు. చదవండి: అభిషేక్ శర్మ అద్భుతం.. అఫ్గాన్ ఆట ప్రశంసనీయం: శ్రేయస్ అయ్యర్! -
ఢిల్లీలో అభిషేక్ తుఫాన్.. 30 బంతుల్లోనే సెంచరీ
-
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన చివరి టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నిజానికి ఇది సులభమైన వికెట్ కాదు. కానీ అభిషేక్ ఆడిన తీరు కంటికి ఇంపుగా ఉంది. అతడొక అద్భుతం. అతడు శతకం సాధించడం చాలా ఆనందం కలిగించింది. అఫ్గానిస్తాన్ సిరీస్ కోల్పోయినప్పటికీ వాళ్లు మా మనసులు గెలిచారు. ఈ సిరీస్‌కు వాళ్లు ఆతిథ్యం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఓడినప్పటికీ ఆఫ్గన్ జట్టు ప్రదర్శన కూడా ప్రశంసనీయం. టాస్కు ముందే ఆఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌తో క్లుప్తంగా మాట్లాడిన తర్వాతే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్‌లో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. అభిషేక్ విధ్వంసానికి తోడు శాంసన్ రాణించడంతో 200లకు పైగా రన్స్‌ను స్కోరుబోర్డుపై చేర్చగలిగాం. అక్షర్ పటేల్ కీలక సమయంలో రాణిండంలో సిద్ధహస్తుడు. గతంలో చాలా సందర్భాల్లో జట్టును గెలిపించాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలనేది అతడికి బాగా తెలుసు. మొదటి నుండి నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి అతడికి నా ప్రత్యేక అభినందనలు.’’ అని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం -
'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్'
అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ సాధించి పలు రికార్డులు బద్దలుకొట్టాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును అభిషేక్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఆ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉండేది. ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో ఆఫ్గన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.ఇక మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 127 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌ను మట్టికరిపించింది. మ్యాచ్ విజయం అనంతరం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ తన ప్రదర్శనపై స్పందించాడు. రికార్డులు తనకు ముఖ్యం కాదని, మ్యాచ్‌లో బరిలోకి దిగితే వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా అన్నట్లుగా తన బ్యాటింగ్ స్టైల్ ఉంటుందని అభిషేక్ తెలిపాడు.Photo Credit: BCCI Twitter"ముందుగా ఇవాళ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. నేను సాధించిన సెంచరీ వారికి గిఫ్ట్ అని భావిస్తున్నా. ఇక రెండు సంవత్సరాల క్రితం, మేము ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆడి అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయించాలని నిర్ణయించుకున్న విషయం నాకు బాగా గుర్తుంది. ఆ ప్రణాళిక ఒక సంవత్సరం పాటు చక్కగానే పనిచేసింది. ఈలోగా రెండు (ఇంగ్లండ్, ఐర్లాండ్) సిరీస్‌లు మాకు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. కానీ ఒకటి రెండు చెడ్డ సిరీస్‌లు మా బ్యాటింగ్‌ను నిర్వచించలేవు. ఆడుతుంది చిన్న జట్టుతోనే, పెద్ద జట్టుతోనా అనేది పక్కనబెట్టి జట్టు విజయం కోసం మేమంతా సమిష్టి ప్రదర్శన చేశాము. ఇక నా విషయానికొస్తే ప్రతీ సిరీస్‌కు ముందు నేను అనుసరించే ప్రక్రియపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని భావిస్తున్నా. ఎవరితో ఆడుతున్నాను, బౌలర్లు ఎవరు అనే విషయాలు నాకు ప్రత్యేకం. కాబట్టి వ్యక్తిగతంగా ఒక బ్యాటర్‌గా నా దృష్టి ఎప్పుడూ బ్యాటింగ్ పవర్ ప్లేపైనే ఉంటుంది. Photo Credit: BCCI Twitterమైదానంలో దూకుడుగా ఆడాలంటే ముందుగా సరైన ప్రిపరేషన్ అవసరం. అదే నా విజయానికి కారణం. ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌లో బ్యాటింగ్‌కు సంబంధించి పెద్దగా ప్రణాళికలంటూ ఏమీ లేవు. ఆది నుంచి వారిపై ఆధిపత్యం ప్రదర్శిస్తే జట్టుకు భారీ స్కోరు ఇవ్వగలననే అంశాన్ని మాత్రమే మైండ్‌లో పెట్టుకొని ఆడుతూ వచ్చాను. రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. జట్టుకు అవసరమైనప్పుడు బాధ్యతాయుతంగా ఆడి పని పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తాను. కెప్టెన్, కోచ్ నుంచి మద్దతు ఉండడం వల్లే ఇదంతా సాధ్యమైంది." అని చెప్పుకొచ్చాడు. ఇక అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు ఆడి 269 స్ట్రైక్‌రేట్‌తో 229 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, అర్థసెంచరీ ఉన్నాయి.ABHISHEK SHARMA SPEAKS: 🗣️“Personally me as a batter, it's always been about the process - How I'm gonna utilize the power play.” pic.twitter.com/IjTqcFZ8lR— Maina Singh (@Maina_Singhx77) September 17, 2026ఇదీ చదవండి: మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్ క్లీన్‌స్వీప్ -
మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్ క్లీన్‌స్వీప్
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 127 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ భారత బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (25) మినహా మిగతావాళ్లు బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయి చెరో 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 2 వికెట్లు, యశ్ ఠాకూర్, బుమ్రాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) శతకంతో విధ్వంసం సృష్టించగా.. సంజూ శాంసన్ (35 బంతుల్లో 50) అర్థసెంచరీ సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29) రాణించాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జయ్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జయ్ చెరొక వికెట్ తీశారు. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించి ఆఫ్గన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శతకంతో చెలరేగిన ఓపెనర్ అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.As clinical and commanding as it gets 🇮🇳#TeamIndia with a massive 1️⃣2️⃣7️⃣-run victory to clinch the Friendship Cup 3️⃣-0️⃣ 🏆Scorecard ▶️ https://t.co/Zixki4RhPt#AFGvIND pic.twitter.com/ZDY4ZzdaxY— BCCI (@BCCI) September 17, 2026ఇదీ చదవండి: అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్ -
అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (221-7) చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడగా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (35 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరు ఔటయ్యాక భారత్ స్కోర్ నెమ్మదించింది. తిలక్ వర్మ (2), శివమ్ దూబే (12), ఇషాన్ కిషన్ (10), నితీశ్ కుమార్ రెడ్డి (1), శ్రేయస్ అయ్యర్ (29) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. అక్షర్ పటేల్ (5), రవి బిష్ణోయ్ (0) అజేయంగా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్ తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు భారత బ్యాటర్లు రనౌటయ్యారు. ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో, భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉంది.ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ -
అరుదైన మైలురాయిని తాకిన సంజూ శాంసన్
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి ఔటైన అతడు.. టీ20 క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల క్లబ్లో చేరాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 34వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 351 మ్యాచ్‌లు ఆడిన సంజూ 140కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 8 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 9027 పరుగులు చేశాడు. భారత్ తరఫున సంజూకు ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే 9000 టీ20 పరుగులు పూర్తి చేశారు.సంజూ విషయాన్ని అటుంచితే.. ఈ మ్యాచ్‌లో మరో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో, భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉంది.ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు.34 బంతుల్లో 11 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 108 పరుగులు చేసిన తర్వాత అభిషేక్ ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 184-3గా ఉంది. శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (13) క్రీజ్‌లో ఉన్నారు.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్.. ఆతర్వాత 50 పరుగులు పూర్తి చేసేందుకు మరో 14 బంతులు మాత్రమే తీసుకున్నాడు. అభిషేక్ ఆ బౌలర్ ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఆఫ్ఘన్ బౌలింగ్ మొత్తాన్ని ఊచకోత కోశాడు.సెంచరీ తర్వాత కూడా అభిషేక్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు 33 బంతులు ఎదుర్కొన్న అతడు, 11 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 108 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్ కూడా ధాటిగానే ఆడుతున్నాడు. సంజూ 25 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 34 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 9.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 142-0గా ఉంది.భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీటీ20ల్లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తాజాగా ఈ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు. టెస్ట్ ప్లేయింగ్ దేశాల్లో మాత్రం అభిషేక్‌దే ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ. ఇదీ చదవండి: ఆఫ్ఘన్‌తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు -
అభిషేక్ మహోగ్రరూపం.. 36 బంతుల్లోనే భారత్ సెంచరీ
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. ఆభిషేక్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఆతర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. అభిషేక్‌కు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా తోడవ్వడంతో భారత్ కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.తొలి ఓవర్ నుంచి ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించిన అభిషేక్.. రెండో, మూడు, ఐదు, ఆరు ఓవర్లలో ఉగ్రరూపం దాల్చాడు. అభిషేక్ ధాటికి భారత్ 6 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. పవర్‌ప్లేలో 100 పరుగుల మార్కును తాకడం భారత్‌కు ఇది తొలిసారి. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 100-0గా ఉంది. అభిషేక్ 22 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగులు, సంజూ శాంసన్ 14 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఇదీ చదవండి: ఆఫ్ఘన్‌తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు -
IND vs AFG: తుదిజట్టు ఇదే.. అభిషేక్, సంజూతో పాటు వైభవ్!
అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. తొలి టీ20లో ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించిన శ్రేయస్ అయ్యర్ సేన... రెండో మ్యాచ్‌లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా- అఫ్గాన్ మధ్య గురువారం నామమాత్రపు మూడో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. దీంతో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరిగింది.ఇషాన్‌కు విశ్రాంతిఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘సిరీస్ గెలిచాం కాబట్టి మూడో టీ20లో వైభవ్‌ను ఆడించడం మంచి ఆప్షనే అవుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. రెండు మ్యాచ్‌లలో సత్తా చాటిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లలో ఎవరో ఒకరికి విశ్రాంతినిచ్చినా బాగానే ఉంటుంది.ఇటీవల దులిప్ట్రోఫీలోనూ ఇషాన్ అదరగొట్టాడు. కాబట్టి అతడికి బ్రేక్ ఇవ్వడం మంచిది. అభిషేక్ లేదంటే సంజూతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేస్తాడు. కావాలనుకుంటే సంజూ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. కాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గాన్ బోర్డు టీమిండియాకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20కి వసీం జాఫర్ సూచించిన భారత తుదిజట్టుసంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. -
పాక్ ప్లేయర్‌ను కిందకు తోసిన అభిషేక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. గత వారం మూడో స్థానంలో ఉన్న అతడు.. ఈ వారం పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌ను ఓ స్థానం కిందకు తోసి, రెండో స్థానానికి ఎగబాకాడు. మరో టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఓ స్థానాన్ని కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోగా.. మరో టీమిండియా డాషింగ్ ఓపెనర్ సంజూ శాంసన్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 30వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరు స్థానాలు కోల్పోయి 29వ స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ భారత ప్లేయర్లు సత్తా చాటారు. వరుణ్ చక్రవర్తి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకగా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి.. మరో పేసర్ అర్షదీప్ సింగ్ 11 స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్-3 ర్యాంక్‌లను కాపాడుకున్నారు.ఆల్‌రౌండర్ల విభాగానికొస్తే.. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా, పాకిస్తాన్ సైమ్ అయూబ్, నేపాల్ దీపేంద్ర సింగ్ టాప-3లో కొనసాగుతున్నారు. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 2 స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేయడంతో భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్ భారీగా మెరుగుపడ్డాయి. ఇదీ చదవండి: టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్..! -
గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
-
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసియా క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. అఫ్గానిస్తాన్‌తో ఆదివారం నాటి తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ ఈ ఫీట్ నమోదు చేశాడు. 13.4 ఓవర్లలోనేకాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గాన్ ఢిల్లీలో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం తొలి టీ20 జరుగగా.. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది.తుఫాన్ ఇన్నింగ్స్ఇందులో అభిషేక్ శర్మదే కీలక పాత్ర. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 32 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌రేటు 256.25. అయితే, మహ్మద్ నబీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా అభిషేక్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పొట్టి క్రికెట్లో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 3420 బంతుల్లోనే అభిషేక్ ఈ మార్కును అందుకున్నాడు.ఆసియాలోనే తొలి ప్లేయర్‌గా..ఈ క్రమంలో అత్యంత వేగంగా టీ20లలో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా నిలిచాడు. కాగా దేశీ క్రికెట్లో పంజాబ్ తరఫున.. ఐపీఎల్లో.. టీమిండియా తరఫున కలిపి అభిషేక్ శర్మ ఈ మేరకు భారీగా పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.ఫాస్టెస్ట్ 6000 రన్స్ (బంతుల పరంగా)👉ఫిన్ అలెన్ (న్యూజిలాండ్)- 3386 బంతుల్లో👉అభిషేక్ శర్మ (ఇండియా)- 3420 బంతుల్లో👉ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్)- 3550 బంతుల్లో👉టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా)- 3681 బంతుల్లో👉విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్)- 3857 బంతుల్లో.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?𝐓𝐇𝐈𝐒 𝐊𝐈𝐍𝐃 𝐎𝐅 𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆. 🤌💥When Abhishek Sharma gets going, the bat does the talking. 🔥Watch #AFGvIND 1st T20I, LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMAX #ExtraaaInnings pic.twitter.com/aLu13MB9JF— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
వైభవ్‌ను కాదని నీకు ఛాన్స్ ఇచ్చి ఏం లాభం?
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20 సందర్భంగా కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో సంజూ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అప్పటి నుంచి విఫలంటీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ.. ఆ ఈవెంట్ తర్వాత టీమిండియా తరఫున ఇప్పటికి ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 43 పరుగులే చేయడం ఇందుకు కారణం.ఈ నేపథ్యంలో సంజూను కాదని అభిషేక్ శర్మకు జోడీగా వైభవ్ సూర్యవంశీని ఫిక్స్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను కాదని.. సంజూను ఆడించడాన్ని తప్పుబట్టాడు.వైభవ్‌ను కాదని ఛాన్స్ ఇచ్చి ఏం లాభం?ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘అప్పుడప్పుడు సంజూకు తుదిజట్టులో అవకాశం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? అతడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఓసారి జట్టు నుంచి తప్పించిన తర్వాత సహజంగానే ఆటగాడు ఫామ్ కోల్పోతాడు. కానీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తాడు.అయితే, సంజూ విషయంలో ఇది జరుగలేదు. అయినా సరే అతడికి ఎందుకు అవకాశం ఇస్తున్నట్లు? ఇదే అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ నిలిచాడు.PC: Xనేనేం తప్పు చేశాను?అయినా సరే జింబాబ్వేలో ఆడిన ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీలను ఎందుకు విడదీసినట్లు? ఇది మరో ప్రశ్న. ఇప్పటికీ టీ20లలో తమ అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్ ఏదోనన్న అంశంపై టీమిండియా స్పష్టతకు రాలేకపోతోందా? ఇంకెంత కాలం ఈ విషయం గురించి ఆలోచిస్తారు?వైభవ్ కచ్చితంగా.. ‘నేనేం తప్పు చేశాను’ అని అడిగే ఉంటాడు. ఇంతటి గందగోళం ఎందుకు? ఓపెనింగ్‌కు సంబంధించిన సరైన కూర్పు ఏదో తెలుసుకోండి’’ అని మహ్మద్ కైఫ్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు.అందుకే ఆడించారేమో!అయితే, అదే షోలో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘సంజూ సీనియర్ ఆటగాడు. ప్రపంచకప్ టోర్నీలో గొప్పగా ఆడాడు. మరో విషయం ఏమిటంటే.. వైభవ్ ఆడితే తుదిజట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య పెరుగుతుంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం కూడా సంజూ వైపు మొగ్గు చూపి ఉంటారు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ అఫ్గాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం (32 బంతుల్లో 82)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42) కూడా రాణించాడు. మరోవైపు.. సంజూ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో డార్విష్ రసూలీకి క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి? -
అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా అఫ్గాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.టీమిండియా బౌలర్ల విజృంభణఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నామమాత్రపు స్కోరు చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) కూడా తేలిపోయాడు. మిగిలిన వారిలో సెదీకుల్లా అటల్ (13), గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) పేలవ ప్రదర్శన కనబరిచారు.దీంతో జట్టు కష్టాల్లో కూరుకుపోగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64)తో ఆదుకున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. దీంతో అఫ్గాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 22 బంతుల్లోనేఅఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీకి చేరువవుతున్న వేళ మహ్మద్ నబీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 8, తిలక్ వర్మ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 13.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 157 పరుగులు సాధించి టార్గెట్ పూర్తి చేసింది. తద్వారా అఫ్గాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.చదవండి: Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్𝐓𝐇𝐈𝐒 𝐊𝐈𝐍𝐃 𝐎𝐅 𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆. 🤌💥When Abhishek Sharma gets going, the bat does the talking. 🔥Watch #AFGvIND 1st T20I, LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMAX #ExtraaaInnings pic.twitter.com/aLu13MB9JF— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
-
కసితీరా బాదిన అభిషేక్.. గిల్‌పై ప్రతీకారం!
భారత వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చూశాం. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు పంజాబ్ క్రికెట్ లీగ్‌లో ప్రత్యర్థులుగా మారిపోయారు. షేర్-ఇ- పంజాబ్ టీ20లీగ్‌లో అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మన్స్కు కెప్టెన్‌గా ఉండగా, గిల్ ఫజిల్కా ఫాల్కన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఈ రెండు జట్లు తలపడగా, అభిషేక్ శర్మ బౌలింగ్‌ను గిల్ చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అభిషేక్ శర్మ బౌలింగ్‌కు రాగా, అప్పటికే గిల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక అభిషేక్ బౌలింగ్‌లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన గిల్, మూడో బంతిని బౌండరీ, ఐదో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఓవర్లో వైడ్ సహా 16 పరుగులు వచ్చాయి. చివరి బంతికి కూడా సిక్సర్ కొట్టి అభిషేక్‌కు సెండాఫ్ ఇవ్వాలనుకున్నప్పటికీ, సీన్ రివర్స్ అయింది. అభిషేక్ వేసిన ఆఖరి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ గాల్లోకి లేపగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న నమన్ ధిర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్ (35 బంతుల్లో 67) ఇన్నింగ్స్‌కు తెరపడింది. గిల్‌తో పాటు ప్రాన్షు ప్రతాప్ (40), సన్వీర్ సింగ్ (40) రాణించడంతో ఫజిల్కా ఫాల్కన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం అమృత్సర్ ఇన్నింగ్స్ సమయంలో తన వంతు రావడంతో అభిషేక్ రెచ్చిపోయాడు. సహజ్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ ఆరంభించిన అభిషేక్ (15 బంతుల్లోనే 49; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఈ దెబ్బకు అమృత్సర్ సూర్మన్స్ 6 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అభిషేక్ ఔటైనప్పటికీ, రాహుల్ కుమార్ (35 బంతుల్లో 53 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో గిల్ (67 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, అభిషేక్ (49) సుడిగాలి ఇన్నింగ్స్‌తో టీమిండియా కెప్టెన్‌ను డామినేట్ చేశాడు. ఈ విజయంతో అమృత్సర్ సూర్మన్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.Abhishek Sharma doing what he does best in the latest round of Sher-E-Punjab T20 League 🔥🔥 pic.twitter.com/UoxZsJxbOn— Cricbuzz (@cricbuzz) September 8, 2026SHUBMAN GILL vs ABHISHEK SHARMA 😍- Incredible battle at Sher-E-Punjab T20 league, The quality of the league. pic.twitter.com/LrTXT8cXgt— Johns. (@CricCrazyJohns) September 8, 2026Read: తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్! -
వరుసగా రెండో మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ విధ్వంసం
భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్వరాష్ట్రంలో జరుగుతున్న షేర్ ఎ పంజాబ్ టీ20 లీగ్‌లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలోకి ఆలస్యం ఎంట్రీ ఇచ్చిన అతడు, వరుసగా రెండో మ్యాచ్‌లో (ఫాజిల్కా ఫాల్కన్స్ కెప్టెన్) దుమ్మురేపాడు. నిన్న లుథియానా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 40 పరుగులు చేసిన గిల్.. ఇవాళ అమృత్సర్ సూర్మాస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయి 35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. గిల్ తన టీమిండియా సహచరుడు, బెస్ట్ ఫ్రెండ్ అయిన అభిషేక్ శర్మ (అమృత్సర్ సూర్మాస్ కెప్టెన్) బౌలింగ్‌లో (నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి) ఔటయ్యాడు. రెగ్యులర్‌గా బ్యాటింగ్‌లో ఓపెనింగ్ చేసే అభిషేక్ ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఓపెనింగ్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడు.. తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి 37 పరుగులకు 2 వికెట్లు తీశాడు. అభిషేక్ గిల్ వికెట్‌తో పాటు అన్షుల్ చౌదరి వికెట్ తీశాడు.ఈ మ్యాచ్‌లో అమృత్సర్ సూర్మాస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 13.4 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. గిల్ (67), విహాన్ మల్హోత్రా (5), అన్షుల్ చౌదరి (0), ప్రన్షు ప్రతాప్ (40) ఔట్ కాగా.. సన్వీర్ సింగ్ (7), ఎయిష్ రావ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. సూర్మాస్ బౌలర్లలో నమన్ ధిర్, సాహిల్ ఖాన్ కూడా తలో వికెట్ తీశారు. కాగా, షేర్ ఎ పంజాబ్ టోర్నీలో గిల్, అభిషేక్‌తో పాటు ప్రభ్‌సిమ్రన్ సింగ్, అర్షదీప్ సింగ్ తదితర టీమిండియా ప్లేయర్లు పాల్గొంటున్నారు. 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ప్రస్తుతం రమన్‌సింగ్ నేతృత్వంలోని మొహాలీ కింగ్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. గిల్ సారథ్యంలోని ఫాల్కన్స్ నాలుగులో, అభిషేక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సూర్మాస్ చివరి స్థానంలో ఉన్నాయి.చదవండి: శుభ్‌మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం -
సన్‌రైజర్స్ సిక్సర్ల కింగ్‌కు హ్యాపీ బర్త్‌డే..ఫోటోలు
-
ప్రభ్‌సిమ్రన్ ఊచకోత.. నమన్ ధిర్ సుడిగాలి శతకం వృధా
షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో టీమిండియా ఆటగాడు, పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్, జలంధర్ వారియర్స్ కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అమృత్సర్ సూర్మాస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేశాడు. ఫలితంగా అతడి జట్టు 265 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.భారీ లక్ష్య ఛేదనలో ప్రభ్‌సిమ్రన్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని కసి తీరా బాదాడు. అతడి ఊచకోత ధాటికి అమృత్సర్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ప్రభ్‌సిమ్రన్‌కు అన్మోల్ మల్హోత్రా (23 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హర్జస్ సింగ్ టాండన్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విశ్వనాథ్ సింగ్ (12 బంతుల్లో 31; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సహకరించారు.అంతకుముందు అమృత్సర్ తరఫున నమన్ ధిర్ కూడా సుడిగాలి శతకం బాదాడు. ధిర్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేశాడు. అతడికి కెప్టెన్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (36 బంతుల్లో 82; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) కూడా జతకలవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన అమృత్సర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కాగా, దీనికి ముందు మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ, నమన్ ధిర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ వారి జట్టు ఓటమిపాలైంది. చదవండి: అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. కేవలం 26 బంతుల్లోనే -
అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. కేవలం 26 బంతుల్లోనే
షేర్-ఎ-పంజాబ్ T20 లీగ్ 2026 సీజన్‌ను అభిషేక్ శర్మ సారథ్యంలోని అమృత్సర్ సూర్మాస్ ఓటమితో ఆరంభించింది. ఆదివారం మొహాలీ వేదికగా మొహాలీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమృత్సర్ 19.5 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 26 బంతుల్లో మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. అతడితో పాటు నమన్ ధీర్(22 బంతుల్లో 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 47), సహజ్ ధావన్(45) రాణించారు. మొహాలీ బౌలర్లలో తేజ్‌ప్రీత్ సింగ్ మూడు వికెట్లు, తన్మయ్ ధరణి, హర్‌ప్రీత్ బ్రార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అన్మోల్ సూపర్ సెంచరీఅనంతరం ఈ భారీ లక్ష్య చేధనలో మొహాలీ ఫస్ట్ డౌన్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్‌లతో 133 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ రమణ్‌దీప్ సింగ్(40 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 69) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా మొహాలీ జట్టు లక్ష్యాన్ని 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది.Abhishek Sharma ⚡️Saddi Apni League Sher E Punjab League 💪🏻 pic.twitter.com/CkUVTSty4H— Shreyas_reign_ (@Shreyas_reign_) August 31, 2026 -
గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇతడే
టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ షేర్- ఈ- పంజాబ్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగం కానున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్‌కు సంబంధించి ఆదివారం ఆటగాళ్ల వేలం జరిగింది.ప్రత్యేక ఆకర్షణగా అభిషేక్ శర్మఇందులో టీమిండియా టీ20 సూపర్‌స్టార్ అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అమృత్సర్ సుర్మాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఆ ఫ్రాంఛైజీ అధికారులతో కలిసి వేలంలో పాల్గొన్నాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరు ఫ్రాంఛైజీలుకాగా ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంఛైజీలు ఫజిల్క ఫాల్కన్స్, అమృత్సర్ సుర్మాస్, లుథియానా లయన్స్, భటిండా రాయల్స్, జలంధర్ వారియర్స్, మొహాలీ కింగ్స్ టైటిల్ కోసం రంగంలోకి దిగనున్నాయి.అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడేఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ లీగ్ 2026 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సన్వీర్ సింగ్ నిలిచాడు. ఫజిల్క ఫాల్కన్స్ రూ. 13.02 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (2023, 2024)కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల సన్వీర్ 25 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్ల ధర ఎంతంటే?టీమిండియా స్టార్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఫజిల్క ఫాల్కన్స్, అభిషేక్ శర్మను అమృత్సర్ సుర్మాస్, అర్ష్‌దీప్ సింగ్‌ను లుథియానా లయన్స్, గుర్నూర్ బ్రార్‌ను భటిండా రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇక ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను జలంధర్ వారియర్స్, రమణ్‌దీప్ సింగ్‌ను మొహాలీ కింగ్స్ కొనుక్కున్నాయి. వీరందరిని ఆయా ఫ్రాంఛైజీలు రూ. 10 లక్షల ధరకు రిజర్వు చేసుకున్నాయి.షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ వేలం-2026లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే1. సన్వీర్ సింగ్ (ఫజిల్క ఫాల్కన్స్)- రూ. 13.02 లక్షలు2. నమన్ ధిర్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 10.80 లక్షలు3. రాహుల్ కుమార్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 8.40 లక్షలు4. అన్మోల్ప్రీత్ సింగ్ (మొహాలీ కింగ్స్)- రూ. 8.20 లక్షలు5. సలీల్ అరోరా (లుథియానా లయన్స్)- రూ. 8 లక్షలు6. హర్నూర్ సింగ్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు7. అశ్వనీ కుమార్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు8. అన్మోల్ మల్హోత్రా (జలంధర్ వారియర్స్)- రూ. 6.20 లక్షలు9. సుఖ్దీప్ బజ్వా (జలంధర్ వారియర్స్)- రూ. 6 లక్షలు10. ఆయుశ్ గోయల్ (మొహాలీ కింగ్స్)- రూ. 4.60 లక్షలు. చదవండి: సిరాజ్ సిక్సర్ల జోరు.. భారత్ గెలుపు View this post on Instagram A post shared by Sher-E-Punjab T20 League (@sherepunjabt20) -
అభిషేక్ శర్మకు నో ప్లేస్.. ఊహించని ఆటగాడికి కెప్టెన్సీ
దులీప్ ట్రోఫీ 2026 కోసం 15 మంది సభ్యుల నార్త్ జోన్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎవరూ ఊహించిన ఆటగాడికి అవకాశం లభించింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కన్హయ్య వాధ్వాన్‌కు సెలెక్టర్లు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. అతడికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీని ఎంపిక చేశారు.ఈ జట్టులో అత్యధికంగా (6) రంజీ ఛాంపియన్ జమ్మూ కశ్మీర్ ఆటగాళ్లకు చోటు లభించింది. టీమిండియా ఆటగాళ్లు అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉన్నందున శుభ్‌మన్ గిల్, ఆకిబ్ నబీని ఎంపిక చేయలేదు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 23న ప్రారంభం కానుండగా.. అదే రోజు నార్త్ జోన్-వెస్ట్ జోన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.నార్త్ జోన్ జట్టు:సనత్ సంగ్వాన్, క్వామ్రాన్ ఇక్బాల్, యశ్ ధుల్, ఆయుష్ దోసేజా, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోనీ (వైస్ కెప్టెన్), కన్హయ్య వాధ్వాన్ (కెప్టెన్), నిశాంత్ సింధు, అర్జున్ శర్మ, అబిద్ ముస్తాక్, అర్ష్‌దీప్ సింగ్, సునీల్ కుమార్, అన్షుల్ కాంబోజ్, యుధ్వీర్ సింగ్, నిఖిల్ కశ్యప్.ఎవరీ కన్హయ్య వాధ్వాన్..?జమ్మూ కశ్మీర్ రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ సాధించడంలో వాధ్వాన్ కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 474 పరుగులు, 36.56 సగటుతో రాణించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు.24 ఏళ్ల వాధ్వాన్ గతేడాది దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున ఆడాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 99 పరుగులు చేశాడు. గత ఎడిషన్‌లో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడిన అతను, ఇప్పుడు తొలిసారి నార్త్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. -
శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం!
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ స్థానిక టీ20 లీగ్‌లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గిల్‌తో పాటు టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రభ్‌సిమ్రన్ సింగ్.. అదే విధంగా రమణ్‌దీప్ సింగ్ ఈ లీగ్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) ... షేర్-ఈ-పంజాబ్ పేరిట తమ సొంత టీ20 లీగ్‌ను నిర్వహించనున్నట్లు ఆదివారం ప్రకటించింది. స్థానిక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చండీగఢ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పాల్గొన్నాడు.ఇదొక చక్కటి ప్లాట్ఫామ్ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యువ ఆటగాళ్లను తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదొక చక్కటి ప్లాట్‌ఫామ్. క్రమంగా పంజాబ్ జట్టు, టీమిండియా స్థాయికి ఎదిగేందుకు షేర్-ఈ-పంజాబ్ దోహదం చేస్తుంది. పంజాబ్ ఎల్లప్పుడూ టీమిండియాకు అత్యుత్తమ క్రికెటర్లను అందించింది.ఈ లీగ్ ద్వారా కూడా మరెంతో మంది వెలుగులోకి వస్తారని నమ్ముతున్నాను. మా గ్రామంలో నాన్న క్రికెట్ అకాడమీ నిర్వహించేవారు. అక్కడ ఉచితంగానే కోచింగ్ ఇచ్చేవాళ్లము. ఇప్పటికీ మా నాన్నకి కాస్త సమయం దొరికితే అక్కడికి వెళ్లి పిల్లల ఆటను గమనిస్తారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిది’’ అని శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.గిల్, బ్రార్ ఆలస్యంగానైనా..కాగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 13 మధ్య షేర్-ఈ-పంజాబ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు ఈ లీగ్‌కు అందుబాటులో ఉన్నప్పటికీ.. శుబ్‌మన్ గిల్, గుర్నూర్ బ్రార్ మాత్రం కాస్త ఆలస్యంగా తమ జట్లతో చేరే అవకాశం ఉంది. వీరిద్దరు ఆగష్టు 15- 28 వరకు శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌తో బిజీగా ఉండనున్నారు. ఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో ఆరుజట్లు పాల్గొననున్నాయి. అమృత్సర్, ఫజిల్క, జలంధర్, లుథియానా, మొహాలీ, భటిండా టైటిల్ కోసం పోటీపడనున్నాయి.చదవండి: అభిషేక్ శర్మ విధ్వంసం... 91 బంతుల్లో 233 పరుగులు -
అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఇదిలా ఉంటే, అభిషేక్ ఇటీవలికాలంలో టీమిండియా తరఫున వరుసగా విఫలమయ్యాడు. గత ఏడు టీ20 మ్యాచ్‌ల్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. చివరిగా ఇంగ్లండ్ పర్యటనలో తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీ చేశాడు. దానికి ముందు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. అతడు చివరి సారిగా మూడంకెల స్కోర్ చేసింది ఐపీఎల్ 2026లో. డీసీతో జరిగిన మ్యాచ్‌లో అతడు 68 బంతుల్లో అజేయమైన 135 పరుగులు చేశాడు.తాజాగా జింబాబ్వేతో ముగిసిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో అభిషేక్ ఫామ్ ఘోరంగా పడిపోయింది. ఆ మూడు మ్యాచ్‌ల్లో అతడు వరుసగా 1, 8, 2 స్కోర్లు చేశాడు. ఈ సిరీస్‌లో అభిషేక్ కనీసం రెండంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టు ఖాళీగా ఉండటంతో స్థానిక వన్డే మ్యాచ్ ఆడిన అభిషేక్ ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు.త్వరలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుండగా, ఆ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో అభిషేక్‌కు చోటు దక్కలేదు. అభిషేక్‌కు గతకొంతకాలంగా టీ20ల్లో మాత్రమే అవకాశం వస్తుంది. తాజా ప్రదర్శనతో అతడు వన్డే జట్టులో స్థానంపై కూడా కన్నేయవచ్చు. టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నిమిత్తం ఆగస్ట్ 4న శ్రీలంక పర్యటనకు బయల్దేరనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15న ప్రారంభం కానుంది. దీనికి ముందు భారత జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. -
బుడ్డోడు దెబ్బకు అభిషేక్ పై వేటు.. వెళ్లి IPL ఆడుకో
-
'అతడిని పక్కన పెట్టాల్సిన టైమ్ వచ్చేసింది'
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ... స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ మాత్రం మేనెజ్మెంట్ను తీవ్ర కలవరపెడుతోంది. ఇంగ్లండ్ టూర్లో ఆశించిన స్థాయిలో రాణించలేపోయిన అభిషేక్.. జింబాబ్వే గడ్డపై అంతకంటే దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బదులుగా సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని శ్రీకాంత్ సూచించాడు.కాగా టీ20 వరల్డ్‌కప్-2026 హీరో శాంసన్‌ను జింబాబ్వే పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అతడి స్ధానంలో అవకాశమిచ్చారు. అంతకుముందు ఇంగ్లండ్ టూర్లోనూ మూడు మ్యాచ్‌లకు సంజూను తుది జట్టు నుంచి పక్కన పెట్టారు. అయితే ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం ఈ కేరళ ఆటగాడు ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ మెరుగ్గా రాణించడంతో ఆసియా గేమ్స్ నుంచి కూడా శాంసన్‌ను తప్పించే అవకాశముంది."అభిషేక్ శర్మ బలహీనతను ప్రత్యర్ధి జట్లు పసిగట్టేశాయి. వన్డే వరల్డ్‌కప్ నుంచి అతడి ప్రదర్శనలు అంతంతమాత్రమే గానే ఉన్నాయి. అతడి విషయంలో సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పుదు. అభిషేక్ శర్మ స్ధానంలో సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలి. అతడికి కచ్చితంగా సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని నమ్ముతున్నాను. అదేవిధంగా జింబాబ్వే పర్యటనలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన యువ పేసర్ మయాంక్ యాదవ్‌పై శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. మయాంక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 6.5 ఏకానమీ రేటుతో 5 వికెట్లు పడగొట్టాడు. -
అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే
జింబాబ్వే పర్యటనలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం జట్టు మేనెజ్మెంట్ను తీవ్ర కలవరపెడుతోంది. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ అభిషేక్ విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరోసారి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజార్బానీ బౌలింగ్‌లో అభిషేక్ దొరికిపోయాడు. ఈ సిరీస్‌లోని ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ సిరీస్‌లోని 3 ఇన్నింగ్స్‌లలో కలిపి అభిషేక్ చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. దీంతో ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతి తక్కువ పరుగులు చేసిన భారత (టాప్-7) బ్యాటర్‌గా అభిషేక్ శర్మ ఘోర రికార్డును మూటగట్టుకున్నాడు.ఇంతకుముందు ఈ చెత్త రికార్డు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. 2019లో వెస్టిండీస్‌పై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అయ్యర్ 14 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో అయ్యర్‌ను అభిషేక్ దాటేశాడు.3-మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతి తక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:అభిషేక్ శర్మ – 11 పరుగులు (విత్ జింబాబ్వే, 2026)శ్రేయస్ అయ్యర్ – 14 పరుగులు (వెస్టిండీస్, 2019)హార్దిక్ పాండ్యా – 15 పరుగులు (న్యూజిలాండ్, 2017)కేఎల్ రాహుల్ – 15 పరుగులు (ఇంగ్లాండ్, 2021)దినేష్ కార్తీక్ – 17 పరుగులు (ఆస్ట్రేలియా, 2022)చదవండి: 'వరల్డ్‌కప్ గెలవాలంటే అతడిని జట్టులోకి తీసుకోండి' -
చెలరేగిన తిలక్, ఇషాన్.. చేతులెత్తిసిన బుడ్జోడు, అభిషేక్..
-
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. బ్యాట్‌తో మరోసారి నిరాశపరిచినప్పటికీ, బంతితో అద్భుత ప్రదర్శన (3-17) చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత ఓపెనింగ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో భారత ఓపెనర్ల అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:* టెస్టులు: వినూ మాంకడ్ – 8/52 (పాకిస్థాన్‌పై, 1952)* వన్డేలు: రవి శాస్త్రి – 5/15 (ఆస్ట్రేలియాపై, 1991)* టీ20లు: అభిషేక్ శర్మ – 3/17 (జింబాబ్వేపై, 2026)అభిషేక్‌కు తోడుగా యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి సిరీస్ విజయం.బ్యాట్‌తో తడబడుతున్న అభిషేక్అభిషేక్ ఈ మ్యాచ్‌లో బంతితో రాణించినా, గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా బ్యాట్‌తో తడబడుతున్నాడు. చివరిగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.నిన్నటి రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. -
మళ్లీ తస్సుమన్న అభిషేక్.. వైభవ్ ధాటిగా ఆడినా..!
టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో అతడు నిరాశపరిచాడు. చివరిగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.ఇవాళ (జులై 25) జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.అభిషేక్ త్వరగా ఔట్ కావడంతో రెండో టీ20లో భారత్ ఆదిలోనే ఒత్తిడిలో పడినట్లైంది. అతడు ఔటైన వెంటనే మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఔటయ్యాడు. తొలి మ్యాచ్ ఫామ్‌ను కొనసాగించిన వైభవ్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావిస్తే.. 9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 29 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అశోక్ కుమార్ స్థానంలో యశ్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. యశ్ ఠాకూర్‌కు ఇది తొలి టీ20 మ్యాచ్. కెప్టెన్ అయ్యాక వరుసగా ఏడు టాస్‌లు గెలిచిన శ్రేయస్ ఎట్టకేలకు ఎనిమిదో మ్యాచ్‌లో టాస్ ఓడాడు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
జింబాబ్వేతో రెండో టీ20.. అభిషేక్‌పై వేటు పడనుందా!
హరారే వేదికగా ఇవాళ జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైన టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవ్వడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకొని మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరోసారి అదే వేదికలో మ్యాచ్ ఆడుతుండడంతో, రెండో టీ20లోనూ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది. అయితే ఓపెనింగ్‌లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అనుకుంటే మాత్రం తొలి టీ20లో ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మను తప్పించి అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఆడించే అవకాశముంది.ఇది మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మూడో స్థానంలో హార్డ్ హిట్టర్ ఇషాన్ కిషన్ రానుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో తిలక్ వర్మ, రింకూ సింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఫినిషర్‌గా శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.ఇక బౌలింగ్ విషయానికొస్తే రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మయాంక్ తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్రభావం చూపించాడు. మయాంక్ యాదవ్‌తో పాటు ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మలతో పేస్ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయి మరోసారి కీలకంగా మారనున్నాడు. టీమిండియా ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, ఒక ఆల్‌రౌండర్ కాంబినేషన్‌తో రెండో టీ20లో బరిలోకి దిగనుంది.భారత తుదిజట్టు అంచనా: వైభవ్ సూర్యవంశీ, ప్రబ్సిమ్రాన్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్. -
భారీ రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ
జింబాబ్వేతో ఇవాళ (జూలై 23) జరగనున్న తొలి టీ20కి ముందు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 16 పరుగులు చేస్తే, టీ20 క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు.ప్రస్తుతం అభిషేక్ 203 టీ20 మ్యాచ్‌ల్లో 199 ఇన్నింగ్స్ ఆడి 5984 పరుగులు చేశాడు. తొలి టీ20లో 16 పరుగులు సాధిస్తే, 200 ఇన్నింగ్స్లోపు 6000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటికే కేఎల్ రాహుల్ (166 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (184), శుభ్‌మన్ గిల్ (185) ఉన్నారు.అంతర్జాతీయంగా ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడు కేవలం 162 ఇన్నింగ్స్‌లోనే 6000 టీ20 పరుగులు పూర్తి చేశాడు.జింబాబ్వేపై అద్భుతమైన రికార్డుఅభిషేక్ శర్మకు జింబాబ్వేపై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆ జట్టుతో ఆడిన ఆరు టీ20ల్లో 179 పరుగులు చేసి, భారత్ తరఫున జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.అంతేకాదు, ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కంటే కనీసం 16 పరుగులు ఎక్కువ చేస్తే, భారత్-జింబాబ్వే మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.నేటి భారత్-జింబాబ్వే మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత యువ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
లండన్‌లో మా తమ్ముడి ఆట చూశా.. అది చాలు! (ఫొటోలు)
-
ఢిల్లీ హైకోర్టులో క్రికెటర్ అభిషేక్ శర్మకు ఊరట
టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో ఈ-కామర్స్ సైట్లలో తన అనుమతి లేకుండా పేరును, ఫొటోలను వాడుకుంటూ కొందరు చేస్తున్న వ్యాపారాలకు, అసభ్యకర ప్రచారాలకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిషేక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతి సింగ్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. అతని అనుమతి లేకుండా పేరు, ముఖచిత్రం, లేదా పర్సనాలిటీ రైట్స్, కమర్షియల్ ప్రయోజనాల కోసం గానీ, సొంత ప్రచారం కోసం గానీ వాడకూడదని థర్డ్ పార్టీలపై కోర్టు నిషేధం విధించింది. అంతేకాదు, ఇలాంటి అభ్యంతరకర లింకులను వెంటనే తొలగించాలంటూ మెటా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌తో పాటు ఈ-కామర్స్ వెబ్సైట్లను ఆదేశించింది.ఏం జరిగిందంటే?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వాడుకుని కొందరు అభిషేక్ శర్మకు సంబంధించిన నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టిస్తున్నారు. దీనిని సవాల్ చేస్తూ అభిషేక్ శర్మ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాజా విచారణలో ఇది అతని గౌరవానికి, బ్రాండ్ వాల్యూకు నష్టం కలిగించేలా ఉన్నాయని అభిషేక్ తరఫు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. కొంతమంది వెబ్సైట్లలో అతని మార్ఫింగ్ ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని ఆరోపించారు. అతని అనుమతి లేకుండా అతని పేరు, ఫొటోలతో టీ-షర్టులు, బట్టలు తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి సింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించే ఇలాంటి నకిలీ కంటెంట్‌ను వ్యాప్తి చేయడం, అలాగే అతని పేరుతో అక్రమంగా దుస్తులు, వస్తువులు అమ్మడంపై నిషేధం విధించారు. అభిషేక్ శర్మ ప్రస్తుతం భారత జాతీయ జట్టులో కీలక ఆటగాడని, అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్న ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా గౌరవించాలని కోర్టు కోరింది. ఒక వ్యక్తికి పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిత్వ హక్కులు) ఉన్నప్పుడు, వారి అనుమతి లేకుండా వారి గుర్తింపును దుర్వినియోగం చేయకుండా రక్షణ పొందే హక్కు సదరు వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు.గతంలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ నటీనటులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, జర్నలిస్ట్ సుధీర్ చౌదరి, పాడ్‌కాస్టర్ రాజ్ శమని వంటి ప్రముఖులు తమ పర్సనాలిటీ, పబ్లిసిటీ రైట్స్ రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఇలాగే మధ్యంతర ఉపశమనాన్ని పొందారు.ఇక అభిషేక్ శర్మ ప్రస్తుత టీమిండియా టీ20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ నుంచి మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లలోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అభిషేక్ బాగా ఆడినప్పటికీ ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతుల్లో టీమిండియా క్లీన్‌స్వీప్‌కు గురైంది.Read: ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్‌తో బరిలోకి అర్జెంటీనా! -
‘అందుకే వైభవ్‌ను తప్పించి.. సంజూను ఆడించాము’
టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ కావడమే ఇందుకు కారణం. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ గురైన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌నూ విజయమన్నదే లేకుండా ముగించింది. ఇంగ్లిష్ జట్టు చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కోసం వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా సంజూ ఐర్లాండ్‌తో రెండు టీ20లు (5, 0).. అదే విధంగా ఇంగ్లండ్‌తో తొలి టీ20 (1)లో విఫలమయ్యాడు.ఈ క్రమంలోనే సంజూను తప్పించి.. అతడి స్థానంలో ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ రెండో టీ20తో అరంగేట్రం చేశాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 13, 14, 15 పరుగులు చేశాడు. అంతేగాక వైభవ్ రాకతో టాపార్డర్‌లో ముగ్గురూ (ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్) లెఫ్టాండర్లే అయ్యారు.ఈ నేపథ్యంలో నామమాత్రపు ఐదో టీ20లో మాత్రం వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్‌ను తిరిగి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ..‘‘సౌతాంప్టన్ పిచ్ పరిస్థితికి తగ్గట్లు మేము అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లాలని అనుకున్నాము. అభిషేక్ శర్మతో కలిసి కుడిచేతి వాటం బ్యాటర్‌తో ఓపెనింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాము. అందుకే వైభవ్‌ను తప్పించాము. ఈ మ్యాచ్‌కు ఇలా చేయడమే సరైన నిర్ణయం. సంజూ గన్ బ్యాటర్. గతంలో ఒంటిచేత్తో ఎన్నో సిరీస్‌లు గెలిపించాడు’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐదో టీ20లో సంజూ 27 పరుగులు చేయగా.. అభిషేక్ 3 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. టీమిండియా 201 పరుగులకే కుప్పకూలింది. -
వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెటర్ల హల్చల్.. స్పెషల్ అట్రాక్షన్ వైభవ్ సూర్యవంశీ (ఫొటోలు)
-
IND vs ENG: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్!
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 రూపంలో టీమిండియా కఠిన సవాలు ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే శ్రేయస్ అయ్యర్ సేన పోటీలో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ 3-0తో సొంతం చేసుకుంటుంది.లెఫ్టాండర్లు ఎక్కువయ్యారుఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మరోసారి చర్చ మొదలైంది. సంజూ శాంసన్ తిరిగి ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువైందని.. ఇది కూడా ఓ సమస్యగా పరిణమించిందని అభిప్రాయపడుతున్నారు.సంజూను కాదని వైభవ్‌కు అవకాశంకాగా ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో సంజూ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు వరుసగా 5, 0, 1. ఈ నేపథ్యంలో సంజూను తప్పించి.. అతడి స్థానంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా బరిలోకి దించింది యాజమాన్యం.రెండు మ్యాచ్‌లలోనూ విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్.. ఇప్పటికి రెండు మ్యాచ్‌లలో వరుసగా 14, 13 పరుగులు చేశాడు. ఇక వైభవ్ రాకతో టాపార్డర్ మొత్తం లెఫ్లాండర్లతో నిండిపోయింది. ఈ పదిహేనేళ్ల పిల్లాడితో పాటు అభిషేక్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా లెఫ్లాండరే.అదే విధంగా.. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఎడమచేతి వాటం గల ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో కుడిచేతి వాటం గల సంజూ అవసరం ఎంతగానో ఉందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.సంజూను ఆడించాల్సిందేఓపెనర్గా కాకపోయినా.. మిడిల్ ఆర్డర్‌లోనైనా సంజూను ఆడించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. టాపార్డర్‌లో ఆడిస్తే మాత్రమే సంజూకు తిరిగి తుదిజట్టులో చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.అలా అయితేనే తుదిజట్టులోకి తీసుకోండి‘‘ఒకవేళ నిజంగా సంజూను తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. అతడు ఏ స్థానంలోనైతే సక్సెస్ అయ్యాడో ఆ స్థానంలోనే ఆడించాలి. అంతేగానీ సంజూను మళ్లీ తీసుకువచ్చి.. నాలుగు, ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడిస్తామంటే ఫలితం ఉండదు.లేదంటే ఆడించకపోవడమే మంచిదిఅతడు మళ్లీ ఇబ్బంది పడతాడు. నిజానికి సంజూ టాప్-3లో మాత్రమే విజయవంతంగా బ్యాటింగ్ చేయగలడు. ఒకవేళ అతడి పట్ల నిజంగానే మీకు నమ్మకం ఉంటే.. టాపార్డర్‌లో ఆడించండి. లేదంటే అసలు ఆడించకపోవడమే మంచిది’’ అని అభిషేక్ నాయర్ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.ఓపెనర్‌గా ఇలా..కాగా సంజూ ఇప్పటికి టీమిండియా టాప్-3 బ్యాటర్‌గా 36 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 1023 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్‌గా నాకౌట్ మ్యాచ్‌లలో ఏకంగా 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొత్తంగా టాప్-3లో 36 ఇన్నింగ్స్‌లో ఆడి ఏకంగా 171కి పైగా స్ట్రైక్‌రేటుతో సంజూ పరుగులు రాబట్టడం విశేషం.మిడిలార్డర్లో అలామరోవైపు.. టాప్-3 బ్యాటర్‌గా కాకుండా మిడిలార్డర్లో వచ్చి సంజూ 21 ఇన్నింగ్స్‌లో కేవలం 382 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 124. ఈ నేపథ్యంలోనే అభిషేక్ నాయర్ సంజూను ఓపెనర్‌గా మాత్రమే పంపాలని నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ చేతిలో 2-0 వైట్‌వాష్ అయింది టీమిండియా. అనంతరం ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్టు గెలిచింది. తద్వారా 2-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉండగా.. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: గంభీర్ -
సంజూతో పోల్చుకుంటే 'ఆ ముగ్గురు' మరీ దారుణం..!
భారత టీ20 జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంజూ శాంసన్‌ను నిలకడలేని ప్రదర్శన కారణంగానే పక్కన పెట్టారని అభిమానులు పేర్కొంటూ, అందుకు విరుద్ధంగా గణాంకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అభిమానులు షేర్ చేస్తున్న వివరాల ప్రకారం..సంజూ శాంసన్ చివరి పది ఇన్నింగ్స్‌లో 107, 109, 22, 24, 97, 89, 89, 5, 0, 1 పరుగులు చేయగా..ఇషాన్ కిషన్ 10, 36, 11, 8, 3, 13, 12, 0, 49, 13 పరుగులు.. తిలక్ వర్మ 1, 44, 27, 21, 8, 19, 55, 13, 24, 3 పరుగులు..అభిషేక్ శర్మ 68, 0, 10, 9, 52, 49, 0, 59, 43, 10 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్‌లో 14, 13 పరుగులే చేశాడు.ఈ గణాంకాలను ఉదహరిస్తూ, "అసలు నిలకడ లేని బ్యాటర్ ఎవరు..?" అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సంజూ శాంసన్‌కు పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందని, ఒకసారి క్రీజులో నిలదొక్కుకుని 30 పరుగుల మార్క్ దాటితే అతడు భారీ స్కోరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, సంజూ పెద్ద స్కోర్లు చేసిన మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయాలు కూడా ఎక్కువగా వచ్చాయని పోస్టుల్లో పేర్కొంటున్నారు.ఇతర బ్యాటర్లు ఒక మ్యాచ్‌లో రాణించి, తర్వాత వరుసగా విఫలమవుతున్నారని వాదిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో సంజూ శాంసన్‌ను మాత్రమే 'నిలకడలేని ఆటగాడి'గా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత బ్యాటింగ్ వైఫల్యాల నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం సంజూ శాంసన్ విషయంలో మరోసారి పునరాలోచించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.కాగా, తాజగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకపడిపోయింది. సిరీస్‌లో నిలవాలంటే బ్రిస్టల్‌లో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాలి. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ చెత్త ప్రదర్శన కొనసాగిస్తోంది. నాటింగ్‌హామ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో శ్రేయస్ సేన ఇంగ్లండ్ చేతిలో మట్టికరిచింది.ఇంగ్లండ్ భారీ స్కోరుఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. కాగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.చతికిల పడ్డ టీమిండియాఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ రెండంకెల స్కోరు చేయగా.. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (13), వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (13) పరుగులతో టాప్ రన్ స్కోరర్లుగా నిలిచారు.ఇక ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 10 పరుగులు చేసి నిష్క్రమించాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, ఇంతటి ఫ్లాప్ షోలోనూ అభిషేక్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ జట్టుపై టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్‌పై టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 28🏏హార్దిక్ పాండ్యా- 27🏏విరాట్ కోహ్లి- 19🏏రోహిత్ శర్మ- 18🏏సూర్యకుమార్ యాదవ్ -18.మూడో టీ20 సందర్భంగా టీమిండియా నమోదు చేసిన చెత్త రికార్డులు ఇవే👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద ఓటమి. (125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తు)👉ఇంగ్లండ్‌లో టీ20 మ్యాచ్‌లో అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా టీమిండియా (76/10).👉ఐదు టీ20 మ్యాచ్‌లలో విజయమన్నదే లేకుండా టీమిండియా పరాజయాల పరంపర కొనసాగించడం ఇదే తొలిసారి. ఐర్లాండ్ చేతిలో రెండు, ఇంగ్లండ్ చేతిలో రెండు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా. ఇక వర్షం వల్ల ఇంగ్లండ్‌తో తొలి టీ20 రద్దు కాగా.. మొత్తంగా వరుసగా ఐదు మ్యాచ్‌లలో టీమిండియాకు గెలుపున్నదే లేకుండా పోయింది.👉టీ20 మ్యాచ్‌లో 11.4 (అతి తక్కువ) ఓవర్లలో టీమిండియా ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్
-
‘వైభవ్ సూర్యవంశీ ఇప్పుడే వద్దు.. అతడికే నా మద్దతు’
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సత్తా చాటిన టీమిండియా స్టార్ సంజూ శాంసన్.. ఈ మెగా ఈవెంట్ తర్వాత మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్‌లలో 5, 0 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.తాజాగా ఇంగ్లండ్ పర్యటనను కూడా సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనతో ఆరంభించాడు. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.అతడిని తప్పించండిఇలా వరుసగా గత మూడు మ్యాచ్‌లలో సంజూ శాంసన్ విఫలమైన నేపథ్యంలో అతడిని తుదిజట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. సంజూకు బదులు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పంపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ మాత్రం భిన్నంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ విషయంలో తొందరపాటు తగదని.. సంజూ- అభిషేక్‌నే ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.సంజూకే నా మద్దతు.. క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ మరోసారి విఫలమైన మాట వాస్తవమే. గత మూడు ఇన్నింగ్స్‌లో అతడు దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి మద్దతు మరింతగా పెరుగుతోంది. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. సంజూ శాంసన్ ఓపెనర్‌గా సరైనోడే.ప్రపంచకప్ టోర్నీలో తీవ్రమైన ఒత్తిడిలోనూ అతడు రాణించి.. జట్టును గెలిపించాడు. చాలా మంది వైభవ్ ఇంకెప్పుడు ఆడతాడంటూ చర్చోపర్చలు చేస్తున్నారు. వారి ఆవేదన, ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను. వైభవ్ ఆ హక్కు సంపాదించుకోవాలికానీ నేను ఇప్పటికీ సంజూ శాంసన్‌కే మద్దతు ప్రకటిస్తాను. ప్రపంచకప్ టోర్నీలో అతడు రాణించిన తీరు అద్భుతం. అలా అని నేనేమీ వైభవ్‌కు వ్యతిరేకం కాదు. అయితే, వైభవ్ తుదిజట్టులో చోటు దక్కించుకునే హక్కును సంపాదించుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఈ పిల్లాడు అద్భుతంగా రాణిస్తాడు’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2026 నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా భారత్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: IND vs ENG: ఇషాన్ రనౌట్.. తప్పు నీదే! -
IND vs ENG: నువ్వసలు ఏం చేస్తున్నావు?.. తప్పు నీదే!
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ పూర్తిగా విఫలమయ్యాడు. తన తొందరపాటు చర్యతో మూల్యం చెల్లించుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఇషాన్ కిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా బుధవారం తొలి టీ20 ఆడింది. చెస్టర్ లీ స్ట్రీట్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (1) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం (24 బంతుల్లో 59) సాధించాడు.నువ్వసలు ఏం చేస్తున్నావు?ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ రెండు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సకీబ్ మహ్మూద్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన ఇషాన్.. అక్కడ పరుగుకు ఆస్కారం లేకున్నా సింగిల్ కోసం పరిగెత్తాడు.మరో ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ బంతిని గమనించి సింగిల్‌కు అవకాశం లేదని అక్కడే ఉండిపోయాడు. ‘‘నువ్వసలు ఏం చేస్తున్నావు?’’ అంటూ ఒకింత అసహనంతో ఇషాన్‌ను హెచ్చరించాడు కూడా!.. దీంతో ఇషాన్ క్రీజులోకి చేరుకునేందుకు డైవ్ కూడా చేశాడు.A costly mix-up in the middle. 🫣Moments after the run-out: Abhishek Sharma and Ishan Kishan share a brief conversation.#ENGvIND 1st T20I 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/1kagvrBjV9— Star Sports (@StarSportsIndia) July 1, 2026కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వికెట్లను గిరాటేయడంతో ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇషాన్- అభిషేక్‌లలో తప్పెవరిది అన్న చర్చ జరుగుతుండగా.. సునిల్ గావస్కర్ అభిషేక్‌కు మద్దతుగా నిలిచాడు.ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే‘‘వీలైనంత త్వరగా క్రీజులోకి చేరుకోవాల్సింది. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో అన్నీ క్షణాల్లో జరిగిపోతాయి. ఇందులో అభిషేక్ శర్మ తప్పేమీ లేదు. ఇది ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదం. ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే’’ అని గావస్కర్ తీవ్ర స్థాయిలో ఇషాన్‌ను విమర్శించాడు.కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ బుధవారమే నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు రెండో ర్యాంక్‌లో ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఒక స్థానం మెరుగుపర్చుకొని 876 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న ఇషాన్ సహచరుడు అభిషేక్ శర్మ (869) రెండో స్థానానికి పడిపోయాడు.గంటల్లోనే హీరో నుంచి జీరోగా..అయితే, నంబర్ వన్‌గా ఎదిగిన కొన్ని గంటల్లోనే ఇషాన్ కిషన్ ఇలా ‘జీరో’ స్కోరుతో పెవిలియన్ చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- టీమిండియా మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68), శివం దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) రాణించారు.చదవండి: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్Another Disappointing start for Team India.Sanju Samson again fails to score.Followed by a run out of in-form Ishan Kishan.Not the Start we imagined.#ENGvINDpic.twitter.com/y9H3qfFIh7— TheFakeFakeer (@TheFakeFakeer) July 1, 2026 -
అభిషేక్, దూబే మెరుపులు
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఐర్లాండ్ చేతిలో రెండు టి20ల్లోనూ ఓడి సిరీస్ కోల్పోయిన టీమ్... ఇంగ్లండ్‌తో పోరును సాధికారికంగా మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా...శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో భారీ షాట్లు ఆడాడు. అభిషేక్, అయ్యర్ మూడో వికెట్‌కు 38 బంతుల్లో 82 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాఖిబ్ మహమూద్‌కు 3 వికెట్లు దక్కాయి. మ్యాచ్ రద్దుఇంగ్లండ్ ఛేదన సమయానికి భారీ వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. కీలక భాగస్వామ్యం... భారత తుది జట్టులో టీనేజర్ వైభవ్ సూర్యవంశీకి మరోసారి చోటు దక్కలేదు. సంజు సామ్సన్ (1) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలం కాగా, ఇషాన్ కిషన్ (0) మళ్లీ రనౌట్ కావడంతో 6 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిషేక్, అయ్యర్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అభిషేక్ తనదైన శైలిలో ధాటిగా చెలరేగగా, కెప్టెన్‌గా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన అయ్యర్ ఈ సారి జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. డాసన్ ఓవర్లో సిక్స్ కొట్టిన అభిషేక్ మహమూద్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ల్యూక్‌వుడ్ ఓవర్లోనూ వరుసగా 3 ఫోర్లు కొట్టిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ అవుటైన తర్వాత భారత్ జోరును నిలువరించడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు. 8 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 87/2 కాగా...తర్వాతి 6 ఓవర్లలో జట్టు 38 పరుగులే చేయగలిగింది. తిలక్‌వర్మ (13) ప్రభావం చూపలేకపోగా, 38 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయ్యర్ వెనుదిరిగాక దూబే దూకుడుతో భారత్ మెరుగైన స్కోరుతో ముగించగలిగింది. రషీద్ బౌలింగ్‌లో అతను కొట్టిన 2 సిక్స్‌లు హైలైట్‌గా నిలిచాయి.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బాంటన్ (బి) మహమూద్ 1; అభిషేక్ (ఎల్బీ) (బి) కరన్ 59; ఇషాన్ కిషన్ (రనౌట్) 0; అయ్యర్ (ఎల్బీ) (బి) మహమూద్ 68; తిలక్ (సి) డాసన్ (బి) మహమూద్ 13; దూబే (నాటౌట్) 42; హర్షిత్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 0; అక్షర్ (రనౌట్) 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–88, 4–124, 5–165, 6–174, 7–189. బౌలింగ్: ల్యూక్‌వుడ్ 3–0–35–0, మహమూద్ 4–0–33–3, డాసన్ 3–0–26–0, జాక్స్ 3–0–30–0, రషీద్ 4–0–39–1, స్యామ్ కరన్ 3–0–25–1. -
ఇంగ్లండ్ గడ్డపై అభిషేక్ అరుదైన రికార్డు
టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అభిషేక్ మాత్రం తన బ్యాటింగ్‌లో దూకుడు కొనసాగించాడు. తద్వారా 20 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకున్న అభిషేక్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అరుదైన ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై టీ20ల్లో టీమిండియా తరఫున తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ 2018లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో 27 బంతుల్లో ఫిఫ్టీ సాధించడమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. తాజాగా అభిషేక్ కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో పాటు అభిషేక్ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా వచ్చి చేరింది. టీ20 క్రికెట్లో అభిషేక్ శర్మ వంద సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ కంటే ముందు టీమిండియా తరఫున రోహిత్ శర్మ (205 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (179 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (126 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (124 సిక్సర్లు) ఉన్నారు. అయితే టీమిండియా తరఫున టీ20ల్లో వంద సిక్సర్లు కొట్టిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. 49 మ్యాచ్‌ల్లోనే అభిషేక్ వంద సిక్సర్లు పూర్తి చేసుకోవడం మరో విశేషం. ఇక అభిషేక్ శర్మకు టీ20ల్లో 48 ఇన్నింగ్స్‌ల్లో ఇది పదకొండో ఫిఫ్టీ కావడం గమనార్హం. Milestone unlocked 🔓1️⃣0️⃣0️⃣ T20I sixes and counting for the power-packed Abhishek Sharma 👏Updates ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia | #ENGvIND | @OfficialAbhi04 pic.twitter.com/lAohcmYvOG— BCCI (@BCCI) July 1, 2026 -
అగ్రపీఠంపై పాకెట్ డైనమైట్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వారాంత ర్యాంకింగ్స్‌లో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ సరికొత్త నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో సహచర టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను రెండో స్థానానికి నెట్టాడు. ఇషాన్, అభిషేక్ మధ్య 7 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇషాన్ ఖాతాలో 876 రేటింగ్ పాయింట్లు ఉండగా.. అభిషేక్ ఖాతాలో 869 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.మరోపక్క టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్‌ను వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌కు చేరాడు. హెడ్ (853), బ్రూక్ (852), రూట్ (840) మధ్య పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ల హవా కొనసాగింది. ఆ జట్టు టాప్-3 ప్లేయర్లు టీ20, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.ముఖ్యంగా ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవాలి. కొంతకాలం కిందట అతడికి టీమిండియాలో చోటే లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. అలాగే భారత వన్డే జట్టులో కూడా చోటు సంపాదించాడు. భారత్ తాజా టీ20 టైటిల్ సాధించడంలో అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఓ దశలో జట్టులో చోటే లేని ఇషాన్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి తానేంటో ప్రపంచానికి చాటాడు.టీమిండియాలో చోటుతో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయిన ఇషాన్.. దేశవాలీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగి మరోసారి టీమిండియా తలుపులు తట్టాడు. జాతీయ జట్టులోకి రీఎంట్రీకి ముందు దాదాపుగా ప్రతి దేశవాలీ టోర్నీలోనూ శతకాలు బాదాడు. కెప్టెన్‌గానూ తన జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. ఈ ప్రదర్శనల కారణంగా భారత టీ20 జట్టులోకి వచ్చి, వచ్చీ రాగానే తన మార్కును చూపించాడు. న్యూజిలాండ్‌పై సెంచరీతో పాటు టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, అలాగే ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ అర్ద సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన తర్వాత వన్డే జట్టులోకీ వచ్చి, అక్కడ కూడా వచ్చీ రాగానే ఆఫ్ఘనిస్తాన్పై శతక్కొట్టాడు. ఇప్పుడు నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ ఇషాన్ జర్నీ చాలా స్పూర్తిదాయకంగా ఉంది. -
భారీ రికార్డులపై కన్నేసిన అభిషేక్ శర్మ
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుంచి (జులై 1) మొదలుకానుంది. తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతంది.ఐర్లాండ్ చేతిలో అనూహ్య పరాభవం (0-2తో టీ20 సిరీస్ కోల్పోవడం) తర్వాత భారత్ ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రేయస్ సేన పుంజుకుంటుందా లేక చెత్త ప్రదర్శన కొనసాగిస్తుందా అన్న అంశం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్ల ముందున్న పలు వ్యక్తిగత రికార్డులు సైతం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అవేంటో చూద్దాం.రోహిత్ రికార్డుపై కన్నేసిన అభిషేక్ఇంగ్లండ్పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ (12 ఇన్నింగ్స్‌లో 387 పరుగులు) చలామణి అవుతున్నాడు. అయితే ఈ రికార్డుపై ప్రస్తుత టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కన్నేశాడు. ఈ సిరీస్‌లో అభిషేక్ మరో 100 పరుగులు చేస్తే రోహిత్ రికార్డును బద్దలు కొడతాడు. ప్రస్తుతం అభిషేక్ ఇంగ్లండ్‌పై టీ20ల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లోనే 288 పరుగులు చేశాడు.హార్దిక్ రికార్డుకు ఎసరుఇంగ్లండ్పై టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా (27 సిక్సర్లు) ముందున్నాడు. ఈ రికార్డుపై కూడా అభిషేక్ కన్నేశాడు. ఇప్పటికే ఆరు ఇన్నింగ్స్‌ల్లో 22 సిక్సర్లు బాదిన అతడు.. ఈ సిరీస్‌లో మరో ఆరు సిక్సర్లు కొడితే హార్దిక్ రికార్డు బద్దలు కొడతాడు.సంజూను ఊరిస్తున్న ధోని రికార్డుఇంగ్లండ్పై టీ20ల్లో ఇప్పటివరకు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది ఇద్దరే ఇద్దరు భారత వికెట్కీపర్లు. ధోని, సంజూ ఇంగ్లీష్ టీమ్‌పై తలో హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో శాంసన్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ధోనిని వెనక్కునెట్టి ఈ రికార్డు సోలోగా సాధించవచ్చు.వరుణ్‌కు సువర్ణావకాశంఇంగ్లండ్పై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా హార్దిక్ పాండ్యా (21) చలామణి అవుతున్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో ఈ రికార్డును సాధించేందుకు వరుణ్ చక్రవర్తికి మంచి అవకాశం ఉంది. వరుణ్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై 6 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో అతడు మరో 7 వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు. -
అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట
ఐర్లాండ్‌తో జరిగిన నిన్న జరిగిన రెండో టీ20లో భారత జట్టు అత్యంత అవమానకరమైన రికార్డును మూటగట్టుకుంది. ఓపెనర్లు ఇద్దరూ (సంజూ శాంసన్, అభిషేక్ శర్మ) గోల్డెన్ డకౌటై టీమిండియాను అప్రతిష్టపాలు చేశారు. భారత టీ20 చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ ఓపెనర్లిద్దరూ గోల్డెన్ డకౌట్ కాలేదు. మొత్తంగా అంతర్జాతీయ చరిత్రలో ఇలా జరగడం కేవలం నాలుగోసారి మాత్రమే. తొలిసారి ఈ అవాంఛనీయ రికార్డును బంగ్లాదేశ్ మూటగట్టుకుంది. ఆతర్వాత మలేసియా, కామెరూన్ ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియాకు పసికూన్ ఐర్లాండ్ చేతిలో ఘోర అవమానం ఎదురైంది. వరుసగా రెండో టీ20లోనూ ఓడిన భారత్.. సిరీస్‌ను సైతం కోల్పోయింది. ఐర్లాండ్‌కు ఏ ఫార్మాట్లో అయినా భారత్‌పై గెలవడం ఇదే మొదటిసారి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా.. భారత్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు సంజూ, అభిషేక్ చెత్త ప్రారంభం తర్వాత ఓ మోస్తరుగా నిలదొక్కుకున్న భారత్.. 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా బ్యాట్ ఝులిపించడం చూసి భారత్ గట్టెక్కుతుందని అంతా భావించారు. అయితే చివరి ఓవర్ ఐదో బంతికి అతడు ఔట్ కావడంతో భారత్ ఓటమి ఖరారైపోయింది. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్సర్ బాదినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఓటమితో భారత్ వరుస సిరీస్ విజయాల యాత్రకు బ్రేక్ పడింది. 16 సిరీస్‌ల తర్వాత భారత్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి. ఈ సిరీస్ విశేషంగా రాణించిన (5 వికెట్లు) ఐర్లాండ్ పేసర్ జై మూండ్రకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీ అవార్డులు లభించాయి. రెండో మ్యాచ్‌లో మూండ్ర 3 వికెట్లు తీసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ ఓటమితో టీమిండియా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై విమర్శలు వెత్తుతున్నాయి. -
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకో తెలుసా?
ఐర్లాండ్ పర్యటన ఆరంభంలోనే టీమిండియాకు చుక్కెదురైంది. టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్స్ నిలిచిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆతిథ్య ఐరిష్ జట్టు వరల్డ్‌కప్ విజేతను ఓ ఆట ఆడుకుంది.బెల్ఫాస్ట్ వేదికగా సమిష్టి కృషితో రాణించి టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా అన్ని ఫార్మాట్లలోనూ ఐర్లాండ్ తొలిసారిగా భారత్‌పై గెలుపు రుచిచూసింది. ఇక ఈ సిరీస్‌తో టీమిండియా టీ20 కెప్టెన్‌గా ప్రయాణం ఆరంభించిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా ఇది కోలుకోలేని దెబ్బే!పెవిలియన్‌కు క్యూఇదిలా ఉంటే.. ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆదిలోనే టపటపా వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్ సంజూ శాంసన్ (5) జై ముంద్రా పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (3)ను మ్యాట్ హోలార్డ్ అవుట్ చేశాడు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3)ను కూడా హోలార్డ్ సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశాడు. తిలక్ వర్మ (19)ను మాథ్యూ హాంఫ్రేస్, వాషింగ్టన్ సుందర్ (9)ను హోలార్డ్ వెనక్కి పంపగా.. ఒంటరి పోరాటం చేసి శివం దూబే (14 బంతుల్లో 25) వికెట్‌ను జై ముంద్రా దక్కించుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నామిగిలిన వారిలో అక్షర్ పటేల్ (15), హర్షిత్ రాణా (8), అర్ష్‌దీప్ సింగ్ (2) సైతం ఇలా వచ్చి అలా వెళ్లారు. అయితే, ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఏకైక భారత ఆటగాడు అభిషేక్ శర్మ మాత్రమే. ఓవైపు వికెట్లు పడుతున్నా ఈ ఓపెనింగ్ బ్యాటర్ మాత్రం దూకుడుగానే ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు జమ చేశాడు.ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఇందుకు సంబంధించిన బీసీసీఐ ట్వీట్ కూడా చేసింది. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సైతం తన కెరీర్‌లోని మరో ‘ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ’ని సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, ఆ వెంటనే లియామ్ మెకర్తీ బౌలింగ్‌లో బెంజమిన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్‌కు చేరాడు.కథలో అసలు మలుపు అప్పుడే కథలో అసలు మలుపు వచ్చింది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీని రద్దు చేసినట్లు స్కోరు బోర్డులో రివైజ్డ్ స్కోరు వచ్చింది. ఇందుకు కారణం జై ముంద్రా బౌలింగ్ (భారత్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్)లో అభిషేక్ శర్మ సింగిల్ తీశాడు. అయితే, ఆ తర్వాత అది లెగ్‌బైగా తేలింది. దీంతో అభిషేక్ ఖాతా నుంచి ఆ పరుగు మైనస్ అయింది. ఫలితంగా 20 బంతుల్లో అభిషేక్ శర్మ 49 పరుగులు చేసినట్లు తేలింది.నిబంధనలు ఏం చెబుతున్నాయి?వైడ్ల మాదిరే లెగ్‌బై కూడా అదనపు పరుగుల్లో భాగం. బంతి బ్యాట్‌కు కాకుండా బ్యాటర్ శరీరానికి (బ్యాట్ పట్టుకున్న చేయి, గ్లోవ్స్ మినహా) తాకినా.. ఆ సమయంలో బ్యాటర్‌కు పరుగులు తీసే అవకాశం వచ్చినా.. లేదంటే బంతి బౌండరీని తాకినా జట్టు ఖాతాలో పరుగులు జమ అవుతాయి.కానీ బ్యాటర్ వ్యక్తిగత ఖాతాలో మాత్రం ఈ పరుగులు కౌంట్ అవ్వవు. అభిషేక్ శర్మ విషయంలో ఇదే జరిగింది. ముంద్రా బౌలింగ్‌లో వచ్చిన లెగ్‌బై టీమిండియా ఖాతాలో చేరి.. అతడి ఖాతా నుంచి మైనస్ అయింది. అయితే, ఇక్కడ అభిషేక్ అవుటైన తర్వాత అంపైర్లు ఈ విషయాన్ని గుర్తించడం వివాదానికి, గందరగోళానికి కారణమైంది. Same old story when Abhishek Sharma gets going. 🔥Watch #IREvIND LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/4SMkYA5LT6— Sony Sports Network (@SonySportsNetwk) June 26, 2026ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 49 పరుగులతో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా... మిగిలిన బ్యాటర్ల వైఫల్యం కారణంగా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 34 పరుగుల తేడాతో ఓటమి పాలై 0-1తో వెనుబడింది.చదవండి: కెప్టెన్‌గా నాకిది గొప్ప ఆరంభం -
అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు
ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకోవడం ద్వారా పలు రికార్డులను సవరించాడు. ఆ రికార్డులు ఏంటనేవి ఒకసారి పరిశీలిద్దాం.👉అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేయడం అభిషేక్ శర్మకు ఇది ఐదోసారి కావడం విశేషం. టీ20 క్రికెట్లో ఒక ఫుల్ మెంబర్ టీమ్ తరఫునఅత్యధిక సార్లు తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు.👉ఐర్లాండ్‌పై అత్యంత తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన మూడో బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. గతంలో 2014లో స్టీఫెన్ మైబర్గ్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, 2023లో బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ 18 బంతుల్లో, తాజాగా అభిషేక్ 19 బంతుల్లో, 2025లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిల్ సాల్ట్ 20 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.👉టీమిండియా తరఫున టీ20ల్లో తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ శర్మ వెయ్యి పరుగులు పూర్తి చేసుకునేందుకు 528 బంతులు తీసుకున్నాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ (573 బంతులు), శివమ్ దూబే (648 బంతులు), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా (679 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
ఐర్లాండ్ బయల్దేరిన టీమిండియా.. ప్రత్యేక ఆకర్షణగా వైభవ్!
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా మంగళవారం చెన్నై నుంచి బయల్దేరింది. ఈ నేపథ్యంలో సిరీస్‌కు ఎంపికైన నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చెన్నై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో టీమిండియా బృందం ప్రత్యేక ఫ్లైట్ ఎక్కింది. 'ఐర్లాండ్ టూర్‌కు సిద్ధం’ అన్నట్లుగా వైభవ్ సూర్యవంశీ తన సహచర ప్లేయర్ అభిషేక్ శర్మతో కలిసి సెల్ఫీని పంచుకున్నాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఇదే తొలి అంతర్జాతీయ సిరీస్ కానుండడం విశేషం. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడనున్న వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కనున్నాడు. శ్రీలంక పర్యటనలో ఇండియా-ఏ జట్టు ట్రై సిరీస్ విజేతగా నిలవడంలో వైభవ్ కూడా కీలకపాత్ర పోషించాడు. శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన ఫైనల్లో వైభవ్ 29 బంతుల్లోనే 94 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఊపులోనే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుదిజట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో వైభవ్ తన ప్రతాపం చూపించాల్సిన అవసరముంది. ఇక డుబ్లిన్ వేదికగా రెండు వన్డేలు ఆడనున్న టీమిండియా ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 1 నుంచి 11 మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు, ఆ తర్వాత జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. వన్డే జట్టును గిల్ నడిపించనుండగా, టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి సిరీస్ కానుంది. VAIBHAV SOORYAVANSHI HAS DEPARTED TO CREATE HISTORY IN IRELAND. 🇮🇳- Youngest ever to receive the Indian jersey. 🔥 pic.twitter.com/uq2ZxEceWQ— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2026Read: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్.. అల్జీరియా సంచలన విజయం -
వైభవ్ ఎంట్రీ ..డేంజర్ లో అభిషేక్, ఇషాన్ కిషన్
-
పాపం రా బుడోడా అభిషేకే కే ఎసరు పెట్టిన వైభవ్
-
బిసీసీఐ మాస్టర్ ప్లాన్ డేంజరస్ ఓపెనింగ్ జోడీ రెడీ..
-
Asian Games: వైభవ్‌కు చోటు.. భారత జట్టు ఇదే!
ఆసియా క్రీడల అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. ఆసియా క్రీడలు-2026 ఎడిషన్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి అందజేసింది. ఇందులో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.ఓపెనర్ల విభాగంలో పోటీఓపెనర్ల విభాగంలో సీనియర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ల నుంచి వైభవ్ సూర్యవంశీకి గట్టి పోటీ ఉంది. అయితే, రాయల్స్‌లో తన సహచర ఆటగాడు జైసూ కంటే వైభవ్ ఈసారి గొప్పగా ఆడిన సంగతి తెలిసిందే.ఐపీఎల్-2026లో వైభవ్ 776 పరుగులతో సత్తా చాటగా.. జైస్వాల్ 427 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్ విజేత అభిషేక్ శర్మ 563 పరుగులతో రాణించగా.. భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 477 పరుగులు సాధించాడు.ఇషాన్‌కు చోటు లేదు!ఇక ఇషాన్ కూడా సన్‌రైజర్స్ తరఫున 602 పరుగులతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఓపెనర్ల విభాగంలో అభిషేక్, ఇషాన్ సత్తా చాటగా.. అందరికంటే వైభవ్ అత్యధిక పరుగులతో ముందు వరుసలో ఉన్నాడు. అభిషేక్‌కు జోడీగా వైభవ్‌ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆల్‌రౌండర్లు, బౌలర్లు వీరేఇక సంజూను వన్‌డౌన్‌లో పంపినా.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ బ్యాటర్ల విభాగంలో సెట్ అయిపోతారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, హర్ష్ దూబేలను ఎంపిక చేసే అవకాశం ఉంది.బౌలర్ల విషయానికొస్తే.. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయిలకు అవకాశం ఉండొచ్చు. కాగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈసారి కూడా విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.పసిడి పతకాలతో సత్తా చాటిన భారత జట్లుకాగా 2022లో తొలిసారిగా బీసీసీఐ సీనియర్ పురుషుల, మహిళల క్రికెట్ జట్టును ఆసియా క్రీడలకు పంపింది. టీ20 ఫార్మాట్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పసిడి పతకం సాధించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళా జట్టు స్వర్ణం గెలుచుకుంది.అయితే, ఈసారి ప్రధాన టీ20 జట్టులోని సభ్యులను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా జపాన్‌లోని ఐచీ- నగోయాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు ఆసియా క్రీడలు-2026 ఎడిషన్ నిర్వహించనున్నారు. ఇక గత పర్యాయం చైనా ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆసియా క్రీడలు-2026: భారత అత్యుత్తమ టీ20 జట్టు ఇదేఅభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రింకూ సింగ్, హర్ష్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయి, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి.ప్రాబబుల్స్ జాబితాయశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: ‘అతడు 3 ఓవర్లు వేస్తే ఆర్సీబీ ఖేల్ ఖతం’ -
‘అతడు ప్లే ఆఫ్స్‌లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు’
ఐపీఎల్-2026లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అసలు సమరంలో మాత్రం చేతులెత్తేసింది. రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యంతో ఇంతటితో ప్రయాణం ముగించింది. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన సన్‌రైజర్స్ టాపార్డర్ రాజస్తాన్ బౌలింగ్ ధాటికి కుదేలు కావడం తీవ్ర ప్రభావం చూపింది.టాపార్డర్ కుదేలుఓపెనర్లలో అభిషేక్ శర్మ డకౌట్ కాగా.. ట్రవిస్ హెడ్ (8 బంతుల్లో 17) కాసేపు వేగంగా ఆడినా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33) మెరుపులు కూడా ఎక్కువసేపు కొనసాగలేదు. ఈ ముగ్గురిని రాజస్తాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పెవిలియన్‌కు చేర్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లే ఆఫ్స్‌లో ఎల్లప్పుడూ అతడు విఫలం అవుతున్నాడని.. ఇంతకంటే చెత్త విషయం మరొకటి ఉండదన్నాడు. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ..అతడు ప్లే ఆఫ్స్‌లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు‘‘2024 నుంచి సన్‌రైజర్స్‌కు ఇదే సమస్య. అభిషేక్ శర్మ ప్లే ఆఫ్స్‌లో ప్రతిసారీ విఫలమవుతూనే ఉన్నాడు. ఆర్చర్ ఈసారి పవర్‌ప్లేలో అతడితో పాటు ఇషాన్ కిషన్‌నూ వెనక్కి పంపి దెబ్బకొట్టాడు. ట్రవిస్ హెడ్ అయితే గుడ్డిగా ఆడుతూ పోయాడే తప్ప ప్లాన్ ఉన్నట్లు కనిపించలేదు.ఇక హెన్రిచ్ క్లాసెన్ కంటే ముందు స్మరణ్ రవిచంద్రన్ ఎందుకు బ్యాటింగ్‌కు వచ్చాడో తెలియదు. అభిషేక్ శర్మ అవుటైనా ఇషాన్ వేగంగా ఆడాడు. మూడు ఓవర్లలోనే దాదాపుగా 50 పరుగులు తెచ్చారు. అయితే, ఇషాన్ అవుటైన తర్వాత సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది.Bowled ’em! 🔥Jofra Archer strikes as Travis Head departs early, and #SRH are in deep trouble in this must-win clash 😮💨#TATAIPL 2026 Eliminator 👉 #SRHvRR | LIVE NOW 👉https://t.co/AsF9BnOMCE pic.twitter.com/RAEXQ0WmL7— Star Sports (@StarSportsIndia) May 27, 2026రాయల్స్‌ను గెలిపించిన వైభవ్ఏదేమైనా ప్లే ఆఫ్స్‌లో అభిషేక్ శర్మ విఫలం కావడం సన్‌రైజర్స్‌కు అతిపెద్ద సమస్యగా మారింది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా ముల్లన్పూర్ వేదికగా బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 243 పరుగులు సాధించింది.ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 97) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులు చేసి ఆలౌట్ అయింది.చదవండి: ‘జైస్వాల్ రాయల్స్‌ను విడిచి వెళ్లాలి’ -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి ఇండియన్‌గా
ఐపీఎల్-2026లో ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. తనదైన శైలిలో ఆర్సీబీ బౌలర్లను అభిషేక్ ఉతికారేశాడు.తన ఓపెనింగ్ పార్టనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అభిషేక్ కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో రెండు సీజన్లలో 40కు పైగా సిక్సర్లు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ అందుకున్న రెండో ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఒకటి కంటే ఎక్కువ ఐపీఎల్ సీజన్లలో (3 సార్లు) 40+ సిక్సర్లు కొట్టాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ మాత్రం అభిషేక్ శర్మనే కావడం గమనార్హం. ఒకే ఐపీఎల్ సీజన్లో 40 సిక్సర్ల మార్కును ఒకసారి దాటడమే కష్టమైన తరుణంలో, అభిషేక్ ఏకంగా రెండు సార్లు ఈ ఘనత సాధించి తన నిలకడను చాటుకున్నాడు. అభిషేక్ శర్మ 2024 ఐపీఎల్ సీజన్లో 42 సిక్సర్లు బాదగా.. ప్రస్తుత సీజన్లోనూ 40 సిక్సర్ల మార్క్‌ను దాటేశాడు.చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్ -
ఎస్ఆర్హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 255 పరుగులు భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరుజట్లు ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఎస్ఆర్హెచ్ రెండో స్థానంలో ప్లేఆఫ్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ చేయడంతో రెండో స్థానంలో నిలవాలంటే 90 ప్లస్ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ సంగతి పక్కనబెడితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెనిరిచ్ క్లాసెన్‌లు ఒక అరుదైన రికార్డు తమ పేరిట లిఖించుకున్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఈ ముగ్గురు త్రిమూర్తులు అర్థసెంచరీలతో చెలరేగారు. ఈ సీజన్లో అభిషేక్, క్లాసెన్, ఇషాన్‌లు 500 పరుగుల మార్క్‌ను దాటారు. తద్వారా ఒకే ఎడిషన్‌లో ఒక జట్టు నుంచే ముగ్గురు బ్యాటర్లు 500 ప్లస్ పరుగులు సాధించడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. గతంలో గుజరాత్ టైటాన్స్ 2025లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. ఆ సీజన్లో సాయి సుదర్శన్ (600 పరుగులు), శుబ్‌మన్ గిల్ (759 పరుగులు), బట్లర్ (538 పరుగులు) సాధించారు. తాజా సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున క్లాసెన్ (606 పరుగులు), అభిషేక్ శర్మ (563 పరుగులు) ఐదొందల మార్క్ దాటగా, తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫిఫ్టీ సాధించడం ద్వారా ఇషాన్ కిషన్ కూడా 500 మార్క్ దాటి 569 పరుగులతో ఆరెంజ్‌క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు. MAXIMUMS x 2️⃣🎥 Abhishek Sharma was in his element 👊🧡Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/exdErsz4bp— IndianPremierLeague (@IPL) May 22, 2026A six-hitting Master-KLAAS on show 🍿🎥 Heinrich Klaasen going big against Josh Hazlewood 💥💥Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/DGYE4ND2WN— IndianPremierLeague (@IPL) May 22, 2026 The ball literally flew to every single corner of the ground tonight 🚀Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/8pR8qvDCnC— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయుడిగా
ఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 15 ఏళ్ల వైభవ్ తనదైన శైలిలో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ప్రపంచ స్ధాయి బౌలర్ అయిన మిచెల్ స్టార్క్‌ను సైతం సూర్యవంశీ విడిచిపెట్టలేదు.బౌండరీలు బాదుతూ స్టార్క్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. వైభవ్ కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్‌గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.ఈ ఏడాది సీజన్లో వైభవ్ ఇప్పటివరకు 44 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉండేది. ఐపీఎల్-2024లో అభిషేక్ 42 సిక్సర్లు బాదాడు. తాజా ఇన్నింగ్స్‌తో అభిషేక్‌ను సూర్యవంశీ దాటేశాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో క్రిస్ గేల్ (ఒకే సీజన్లో 59 సిక్సర్లు) ఉన్నాడు. రాజస్తాన్ ప్లే ఆఫ్స్‌కు చేరితే గేల్ రికార్డును కూడా సూర్యవంశీ బ్రేక్ చేసే అవకాశముంది. వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 486 పరుగులు చేశాడు.ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు వీరే:వైభవ్ సూర్యవంశీ: 44 సిక్సర్లు (2026) అభిషేక్ శర్మ: 42 సిక్సర్లు (2024) శ్రేయస్ అయ్యర్: 39 సిక్సర్లు (2025) విరాట్ కోహ్లి: 38 సిక్సర్లు (2016 & 2024) సూర్యకుమార్ యాదవ్: 38 సిక్సర్లు (2025) -
బాదుడే బాదుడు.. కారణం ఇదేనా?
ఒకప్పుడు 180 పరుగులు చేస్తే చాలు మ్యాచ్ గెలిచేసినట్లే అనే నమ్మకం ఉండేది! ఇక 200 మార్క్ దాటితే ఛేదన అసాధ్యమనిపించేది!! కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఐపీఎల్ 19వ సీజన్లో అయితే 220 పరుగులు చేసిన జట్లకు కూడా... విజయంపై ధీమా ఉండటం లేదు.బ్యాటింగ్‌కు అనుకూలించే ఫ్లాట్ పిచ్‌లు... అంతర్జాతీయ మ్యాచ్‌లతో పోలిస్తే చిన్న బౌండరీలు... పవర్‌ప్లేలోనే బౌలర్ల భరతం పట్టే ఓపెనింగ్ జోడీలు.. మధ్య ఓవర్లలో పరుగుల వరద పారించే మిడిలార్డర్ బ్యాటర్లు... డెత్ ఓవర్స్‌లో బంతిని చీల్చిచెండాడే ఫినిషర్లు... అవసరమైతే అదరగొట్టే ‘ఇంపాక్ట్ ప్లేయర్లు’...వెరసి ఎన్ని పరుగులు చేస్తే మ్యాచ్ గెలవొచ్చు అనే సమీకరణాలు మారిపోతున్నాయి. తాజా సీజన్లో 41 సార్లు రెండొందలకు పైగా పరుగులు నమోదు అయ్యాయంటే బాదుడు ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో 200కుపైగా పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా పరాజయం పాలైన జట్లు చాలా ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే అరాచకానికి అర్థం మార్చింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు రికార్డు స్కోరు చేస్తే... దాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించి వారెవ్వా అనిపించింది. ఈ సీజన్లో సాగుతున్న పరుగుల ఊచకోతను ఓసారి పరిశీలిస్తే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. 49 మ్యాచ్‌ల్లో 41 సార్లు రెండొందల పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. బౌలింగ్ చేస్తున్నది గల్లీ బౌలర్లా అన్నట్లు... బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అనిపించేలా బ్యాటర్ల వీరవిహారం కొనసాగుతోంది. గతేడాది ఐపీఎల్లో 200పైగా లక్ష్యాన్ని 9 సార్లు ఛేదించగా... ఈ సీజన్లో ఇంకా లీగ్ మ్యాచ్‌లు ముగియకముందే ఈ సంఖ్య 12గా ఉంది. ఈ ఏడాది సాగుతున్న విధ్వంసకాండ చూస్తుంటే ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయమే. ఒకప్పుడు భారీ స్కోరులా కనిపించిన 200 పరుగుల మార్క్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండొందల పైచిలుకు పరుగులు చేయడం పరిపాటిగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.తొలి 10 ఓవర్లే... టి20ల్లో చేజింగ్ చేసే జట్టుకు గెలుపు సులభం అనేది జగమెరిగిన సత్యం. చేయాల్సిన పరుగులు, అందుబాటులో ఉన్న బంతులపై స్పష్టమైన అవగాహన ఉండటంతో చేజింగ్ జట్లు దాన్ని బట్టి ముందుకు సాగుతుంటాయి. ఈ సీజన్లో 12 సార్లు రెండొందలకు పైగా లక్ష్యాలను ఛేదించగా... వాటిలో 10 సార్లు సగం ఓవర్లకు ముందే లక్ష్యంలోని సగం పరుగుల కన్నా ఎక్కువ సాధించాయి. అది కూడా రెండు కంటే తక్కువ వికెట్లు మాత్రమే కోల్పోయి. దీంతో చేజింగ్ జట్లకు మంచి శుభరంభాలు దక్కాయి. సాధించాల్సిన రన్‌రేట్ పదికి లోపు ఉన్న ప్రతి సందర్భంలో చేజింగ్ జట్లు సునాయాసంగా గెలుపొందుతున్నాయి. ‘ఇంపాక్ట్’ ప్లేయర్... సాధారణంగా క్రికెట్లో ఒక్కో జట్టు తరఫున 11 మంది మాత్రమే బరిలోకి దిగాల్సి ఉన్నా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనతో ఆ సంఖ్య 12కు మారింది. మైదానంలో 11 మందే ఉన్నా... ఒక అదనపు బ్యాటర్ సేవలను వినియోగించుకునేందుకు తోడ్పడే ఈ నిబంధన భారీ స్కోర్లకు కారణంగా నిలుస్తోంది. ‘బ్యాటింగ్ చేసేందుకు జట్టులో ఒక అదనపు ఆటగాడు ఉన్నాడు అని తెలిస్తే... టాపార్డర్ మరింత స్వేచ్ఛగా ఆడుతుంది’ అని కోహ్లి అన్నట్లు... ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ భారీగా పరుగులు చేయకున్నా... అతడున్నాడనే నమ్మకంతో మిగిలినవాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ నిబంధన సరిగ్గా లేదని ఇప్పటికే పలువురు దిగ్గజాలు ఆరోపించినా... నిర్వాహకులు మాత్రం దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. చిన్న బౌండరీలు... దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల మైదానాలతో పోల్చుకుంటే... మన దగ్గర బౌండరీలు చిన్నవి. అందులోనూ ఐపీఎల్లో అవి మరింతగా కుచించుకుపోతున్నాయి. హ్యాపీడేస్ సినిమాలో ‘టచ్ చేస్తే ఫోర్ రా’ అన్న తరహాలో బంతి బ్యాట్‌కు తాకిందే తడువు బౌండరీ వైపు పరుగులు తీస్తోంది. దీనికి వేగవంతమైన ఔట్ ఫీల్డ్ కూడా ఒక కారణమే. తాజా ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో 60 మీటర్ల కంటే తక్కువ దూరం వెళ్లిన బంతి సైతం సిక్స్‌గా మారిందంటే మన గ్రౌండ్లు బ్యాటర్లకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీని వల్లే కొన్ని మ్యాచ్‌ల్లో ఫోర్ల కంటే ఎక్కువ సిక్స్‌లు నమోదవుతున్నాయి.‘పవర్’ ప్లే ఈ ఏడాది నమోదైన రికార్డు లక్ష్యఛేదనలను గమనిస్తే... ‘పవర్ ప్లే’ (1–6 ఓవర్లు)లో దంచికొట్టిన జట్టుదే పైచేయి అనేది స్పష్టమవుతోంది. ఫీల్డింగ్ నిబంధనలు భారీ షాట్లకు అనుకూలంగా ఉండే ఈ సమయంలో భారీగా పరుగులు రాబట్టేందుకు ప్రతీ జట్టు ప్రయత్నిస్తోంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్‡్ష ఆర్య తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాలనే కసితో బాదేస్తుంటే... సన్‌రైజర్స్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ‘పవర్ ప్లే’లోనే మ్యాచ్‌ను డిసైడ్ చేస్తున్నారు. మిగిలిన జట్లు కూడా ఇలా పవర్‌ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ‘‘పవర్ ప్లే’లో 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకే అనుమతి ఉండటంతో... ఈ దశలోనే భారీ షాట్లు ఆడాలని ఓపెనర్లు నిర్ణయించుకుంటున్నారు. బంతి కాస్త అనుకూలంగా ఉన్నా... దాన్ని గీత దాటించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఐపీఎల్–2025లో పవర్ ప్లేలో ఓవర్‌కు 10.48 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టగా... ఈ ఏడాది అది 11.78గా ఉంది. అంటే పవర్‌ప్లే 12 శాతం దూకుడు పెరిగినట్లు లెక్క. బ్యాటింగ్ పిచ్‌లు... టెస్టు క్రికెట్ మాదిరిగా అటు బ్యాటింగ్‌కు ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించే పిచ్‌ల సంఖ్య తగ్గిపోయింది. అభిమానులను అలరించాలనే ఉద్దేశమే తప్ప... ఆటలో బ్యాలెన్స్ పాటించాలనే సోయి లేకుండా పోతోంది. దీంతో బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్లే దర్శనమిస్తున్నాయి. బుమ్రా, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు సైతం... పిచ్ నుంచి ఏమాత్రం సహకారం లభించక చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన కుర్రాళ్లు కూడా... అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటున్నారంటే అందుకు తారు రోడ్ల లాంటి ‘ఫ్లాట్ పిచ్’లు కూడా ఒక కారణమే. చదవండి: భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!ఆ మ్యాచ్ పరాకాష్ట! తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే దూకుడుకు అర్థం మార్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్యాపిటల్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 67 బంతుల్లోనే 16 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో అజేయంగా 152 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అతడికి నితీశ్ రాణా సహకారం తోడవడంతో ఢిల్లీ కొండంత స్కోరు చేసింది.తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం ఆనందంగా కనిపించిన రాహుల్... ఛేదన ప్రారంభమైన ఆరు ఓవర్లలోనే నీరసించిపోయాడు. ప్రతి బంతిని బౌండరీ దాటించడమే పరమావధి అన్నట్లు పంజాబ్ ఓపెనర్లు చెలరేగిపోతుంటే... కేఎల్ రాహుల్ నిచ్చేష్టుడిలా వికెట్ల వెనక నిలబడిపోయాడు. ప్రియాన్ష్ ఆర్య (priyansh arya) 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 43 పరుగులు చేస్తే... ప్రభ్‌సిమ్రన్ సింగ్ 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సక్స్లతో 76 పరుగులు చేశాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (shreyas iyer) 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో అజేయంగా 71 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు సునాయాసంగా మ్యాచ్ గెలిచేసేంది. ఈ మ్యాచ్ గణాంకాలు పరిశీలిస్తే... ఛేదనలో పంజాబ్ ‘పవర్ ప్లే’లోనే మ్యాచ్‌ను లాగేసుకుంది. తొలి ఆరు ఓవర్లలోనే 116 పరుగులు చేసి లక్ష్యంలోని 43.8 శాతం పరుగులను ఖాతాలో వేసుకుంది. దీంతో మిగిలిన పని మరింత సులువైంది. – సాక్షి క్రీడావిభాగం -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లో 4 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 35 పరుగులు చేసి బీభత్సం సృష్టించిన అతను.. విండీస్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఓపెనర్‌గా ఐపీఎల్లో 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో అత్యధిక సార్లు 30+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అతడు 14 సార్లు ఈ ఫీట్‌ను సాధించి గేల్ (13) రికార్డును అధిగమించాడు. నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్ స్ట్రైక్‌రేట్ ఏకంగా 269.23గా ఉండింది. గత సీజన్ నుంచి అభిషేక్ ప్రత్యర్ది బౌలర్లను షేక్ చేస్తున్నాడు. భయంలేని బ్యాటింగ్‌తో మెరుపు ఆరంభాలు అందిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్ గమనాన్ని మార్చేస్తూ.. ప్రత్యర్దులను పోరాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు.ఈ సీజన్లో అభిషేక్ విధ్వంసం పతాకస్థాయిలో ఉంది. 11 మ్యాచ్‌ల్లో అతడు 210.18 స్ట్రైక్‌రేట్‌తో 475 పరుగులు చేశాడు. ఇందులో 36 సిక్సర్లు, 43 బౌండరీలు, ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ దూకుడు కారణంగా హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ మెరుపు ఆరంభం ఇవ్వడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. అనంతరం బౌలర్లు సత్తా చాటడంతో లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మీద రికార్డులు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్, హెడ్లు శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ కుమార్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జంట ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఈ సీజన్లో అభిషేక్, ట్రావిస్ హెడ్ జంట 627 పరుగులు సాధించింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌కు ఈ జంట 54 పరుగులు జోడించడం ద్వారా 600 ప్లస్ మార్కును దాటింది. తద్వారా ఒక సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన జోడీగా అభిషేక్-హెడ్ నిలిచారు. రెండో స్థానంలో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్-వైభవ్ సూర్యవంశీ (457 పరుగులు), గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్-సాయి సుదర్శన్ జంట (402 పరుగులు) సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.More than 600 runs as a pair when no one else has gone past 500 😲Abhishek Sharma and Travis Head miles ahead of everyone else 👏#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/MAw6RNVxem— IndianPremierLeague (@IPL) May 6, 2026Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026 -
పంజాబ్ అంటేనే అభిషేక్‌కు పూనకం!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి చెలరేగింది. తొలి అంచె పోటీలో అభిషేక్ మెరుపు సెంచరీతో భారీ స్కోరు సాధించినప్పటికీ ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసింది. అయితే రెండో అంచె పోటీలో భాగంగా సొంతగడ్డపై ఎలాగైనా పంజాబ్‌పై పైచేయి సాధించాలని భావిస్తున్న ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్‌తో మ్యాచ్‌లో మరోసారి చెలరేగాడు. పంజాబ్‌తో మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోతున్నాడు. మ్యాచ్‌లో ఎక్కువ సేపు నిలవనప్పటికీ ఉన్నంత సేపు అభిషేక్ (13 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దడదడలాడించాడు. 👉 ఈ నేపథ్యంలో పంజాబ్‌పై గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ పరుగుల వరద పారించాడు. అభిషేక్ వరుసగా 66, 141, 74, 35 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై 200 ప్లస్ స్కోరు సాధించడం ఎస్ఆర్హెచ్కు ఇది ఎనిమిదోసారి. 👉ముంబై ఇండియన్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎనిమిది సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 17 సిక్సర్లు కొట్టింది. ఐపీఎల్లో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఎస్ఆర్హెచ్ అత్యధిక సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.👉 ఇక ఐపీఎల్లో 220 ప్లస్ స్కోరు చేయడం ఎస్ఆర్హెచ్కు ఇది పదోసారి. అయితే ఈ పదిసార్లు ఎస్‌ఆర్‌హెచ్‌నే విజయం వరించడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్‌కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు.Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్ సాధిస్తాడు’ -
మళ్లీ విజయం వేటలో..ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ (ఫొటోలు)
-
చారిత్రక మైలురాయిని తాకిన సన్‌రైజర్స్
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌పై బుధవారం జయభేరి మోగించిన కమిన్స్ బృందం... ఈ సీజన్లో వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. మొత్తంగా ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచింది.వాంఖడే వేదికగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. రికెల్టన్ (55 బంతుల్లో 123 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... విల్ జాక్స్ (22 బంతుల్లో 46; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.52 బంతుల్లోనే 129 పరుగులుఅనంతరం హైదరాబాద్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. హెడ్ (30 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లాసెన్ (30 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి జట్టును గెలిపించారు. అభిషేక్, హెడ్ తొలి వికెట్‌కు 52 బంతుల్లోనే 129 పరుగులు జత చేశారు.చారిత్రక మైలురాయిఇదిలా ఉంటే.. ముంబైపై విజయం ద్వారా సన్‌రైజర్స్ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ఇది వందో విజయం. కాగా 2013లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికి 205 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో 104 ఓడిపోగా.. వంద గెలిచింది. ఒకటి ఫలితం తేలకుండా ముగిసిపోయింది.నిలకడైన జట్టుగానూ పేరుఐపీఎల్లో 13 ఏళ్లుగా కొనసాగుతున్న సన్‌రైజర్స్ 2016లో తొలిసారి టైటిల్ గెలిచింది. ఇక 2018, 2024లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. అంతేకాదు మరో నాలుగు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరింది. తద్వారా ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న జట్లలో ఒకటిగా ముందుకు సాగుతోంది. -
అమ్మాయి చేసిన పనికి అభిషేక్ శర్మ షాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగుతుంది. 8 మ్యాచ్‌ల్లో 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్న అభిషేక్ సెంచరీతో పాటు మూడు అర్థశతకాలు సాధించాడు. ఇక శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు హోటల్ రూంకు చేరుకునే సమయంలో అభిషేక్ శర్మకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. అభిషేక్ శర్మను చూసి ఉత్సాహానికి లోనైన ఒక అమ్మాయి చేయి పట్టుకుని లాగింది. ఈ అనూహ్య ఘటనతో అభిషేక్ ఒక్కసారిగా షాకయ్యాడు. కాస్త ఇబ్బందిగానే అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో సెక్యూరిటీ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుస నాలుగు విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.Abhishek Sharma getting pulled by a girl at team hotel. Imagine if roles are reversed? pic.twitter.com/GCqMI05G4f— Deepu (@deepu_drops) April 26, 2026 చదవండి: ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’.. ఎంతమంది ఔటయ్యారంటే? -
పొద్దున్నే విరాట్, రాత్రికి అభిషేక్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్ మ్యాచ్‌లే అయ్యాయి. రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.సాయంత్రానికి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్ క్యాప్‌ను రాహుల్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ తన బ్యాట్‌కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్ నుంచి ఆరెంజ్ క్యాప్ లాగేసుకున్నాడు.ఇలా ఒకే రోజులో ఆరెంజ్ క్యాప్ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్‌లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్‌తో సోషల్‌మీడియా హోరెత్తింది.కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్‌రైజర్స్ మరో ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
ఎస్ఆర్హెచ్ ఘన విజయం.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్ జురేల్ (51) అర్థసెంచరీతో రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా, ప్రఫుల్ హింగే, కెప్టెన్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు విజయాలు సాధించగా.. ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. దీంతో ఎస్ఆర్హెచ్ 10 పాయింట్లు సాధించి రాజస్తాన్‌తో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్తాన్ మూడో ఓటమితో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. 2023 సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్‌పై ఎస్ఆర్హెచ్కు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. గతంలో సీఎస్కే (2010 నుంచి 2013 మధ్య) రాజస్తాన్ రాయల్స్‌పై ఆరు వరుస విజయాలు సాధించింది. 2019 నుంచి 2022 మధ్య ఆర్సీబీ.. రాజస్తాన్‌పై 5 వరుస విజయాలు అందుకుంది. 2018 నుంచి 2020 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వరుస విజయాలు నమోదు చేసింది.ఐపీఎల్లో 200 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఎస్ఆర్హెచ్కు ఇది ఐదోసారి. ఇక పంజాబ్ కింగ్స్ 11 సార్లు 200 ప్లస్ స్కోర్లు ఛేదించి తొలి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ (ఆరు సార్లు) రెండో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లు ఐదేసి సార్లు ఛేదించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఛేదించిన జట్లలో ఎస్ఆర్హెచ్ చోటు దక్కించుకుంది. రాజస్తాన్‌పై 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్హెచ్ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాలు పంజాబ్ కింగ్స్ (ఢిల్లీపై 265, కేకేఆర్‌పై 262 పరుగుల టార్గెట్), ఎస్ఆర్హెచ్ (పంజాబ్‌పై 246 పరుగుల టార్గెట్) మూడో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఆర్సీబీ (లక్నోపై 228 పరుగుల టార్గెట్) ఉంది.జైపూర్ వేదికపై రాజస్తాన్‌పై 228 పరుగుల టార్గెట్‌ను ఛేదించిన ఎస్ఆర్హెచ్ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. 2023లో ఇదే రాజస్తాన్‌పై 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ఆ రికార్డును సవరించింది.4️⃣h consecutive win ✅4️⃣th highest successful chase in #TATAIPL history ✅#SRH paint the Pink City ORANGE with a clinical win 🎨🧡Scorecard ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @SunRisers pic.twitter.com/bKWZOIAgZo— IndianPremierLeague (@IPL) April 25, 2026 -
సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు
-
క్రెడిట్ మొత్తం అతడికే.. క్లాసెన్ అదరగొట్టాడు: ఇషాన్ కిషన్
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ గెలుపు నమోదు చేసింది. సొంతమైదానం ఉప్పల్‌లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి.. వరుసగా మూడోసారి జయభేరి మోగించింది. తద్వారా ఏడింట నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సంతృప్తి వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. ‘‘అభిషేక్ మ్యాచ్ ఆసాంతం అదరగొట్టాడు. క్లాసెన్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఇలాంటి వికెట్ మీద 200కు పైగా స్కోరు చేయడం గొప్ప విషయం.క్రెడిట్ మొత్తం అతడికే.. నిజానికి ఈ పిచ్ మీద ఆరంభంలో బ్యాటర్లకు తడబాటు తప్పదు. అయినా సరే అభిషేక్ అదరగొట్టాడు. మా విజయంలో క్రెడిట్ మొత్తం అతడికే దక్కుతుంది. ప్రణాళికలకు తగినట్లుగా ఆడుతూ ఫలితాలు రాబడుతున్నాము’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.ఇక ఆఖరి ఓవర్లో హర్ష్ దూబేకు బంతి ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘అతడు మెరుగా బౌలింగ్ చేయగలడని నాకు తెలుసు. అతడొక తెలివైన బౌలర్. కీలక ఓవర్లు నువ్వే వేయాల్సి ఉంటుందని నేను ముందుగానే అతడికి చెప్పాను. సరైన సమయంలో మనం అత్యుత్తమం అనుకున్న బౌలర్లను రంగంలోకి దించాలి. ఈరోజు మాకు ఇది కలిసి వచ్చింది’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోరు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 37 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.మలింగ అద్భుతస్పెల్లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 195 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాన్ మలింగ అద్భుత స్పెల్ వేశాడు. నాలుగు కీలక వికెట్లు కూల్చి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. హర్ష్ దూబే ఆఖరి ఓవర్లోఇక హర్ష్ దూబే ఆఖరి ఓవర్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో దిల్షాన్ మధుషాంక, సకీబ్ హుసేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్లో ఢిల్లీకి ఆరింట ఇది మూడో పరాజయం.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
SRH vs DC: ఆ రెండు తప్పులే మా కొంపముంచాయి
సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. అభిషేక్ శర్మ విషయంలో తాము చేసిన ఫీల్డింగ్ తప్పిదాలే కొంపముంచాయని పేర్కొన్నాడు. ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ మంగళవారం సన్‌రైజర్స్‌తో తలపడింది.సొంతమైదానంలో టాస్ ఓడిన సన్‌రైజర్స్ ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్ మెరుపులు (13 బంతుల్లో 37 నాటౌట్) మెరిపించాడు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.రెండుసార్లు మిస్‌అయితే, తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తొలి బంతికి అభిషేక్‌ను రనౌట్ చేసే అవకాశం రాగా.. ఢిల్లీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఛాన్స్ మిస్ చేశాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. 14వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపగా.. నితీశ్ రాణా క్యాచ్ మిస్ చేశాడు.ఆ రెండు తప్పులే మా కొంపముంచాయిఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 195 పరుగులే చేసింది. దీంతో 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ను రనౌట్ చేసే అవకాశం వదులుకున్నాం. క్యాచ్ కూడా జారవిడిచాము. ఈ రెండు తప్పిదాల వల్లే మేము మూల్యం చెల్లించాల్సి వచ్చింది.ఒకవేళ ఈ రెండింటిలో ఒక్క సందర్భంలో మేము అవకాశం సద్వినియోగం చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే, అతడు మా తప్పిదాలను తనకు అనుకూలంగా మలచుకుని పరుగులు రాబట్టాడు. మేము ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేయాల్సింది. కానీ ఈరోజు అలా చేయలేకపోయాము’’ అని అక్షర్ పటేల్ విచారం వ్యక్తం చేశాడు.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’𝐀𝐛𝐡𝐢-cadabra… & it’s a HUNDRED off just 47 balls 🪄🤯2nd TATA IPL Century ✅9th century in T20s - also the joint-most centuries by an Indian ✅Fastest Indian to 9 T20 hundreds (184 innings) ✅#AbhishekSharma | #TATAIPL 2026 | #SRHvDC | LIVE NOW 👉… pic.twitter.com/YHeoeyyahv— Star Sports (@StarSportsIndia) April 21, 2026 -
అభిషేక్ విధ్వంసం.. సెంచరీతో ఉప్పల్‌లో ఉప్పెన!
ఐపీఎల్లో అభిషేక్ మళ్లీ విధ్వంసం సృష్టించాడు. తనకే సాధ్యమైన రీతిలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను సెంచరీతో ఉప్పల్ మైదానంలో ఉప్పెన సృష్టించాడు. బౌండరీలతోనే సరిగ్గా 100 పరుగులు రాబట్టిన అభిషేక్‌కు క్లాసెన్, ఇషాన్ కిషన్, హెడ్ కూడా అండగా నిలవడంతో హైదరాబాద్ భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. అయితే ఢిల్లీ బ్యాటింగ్ ఏమాత్రం రైజర్స్‌కు సరితూగలేకపోయింది. ఏ దశలోనూ కావాల్సిన దూకుడును ప్రదర్శించని క్యాపిటల్స్ లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. సమష్టి బౌలింగ్‌తో రైజర్స్ ఢిల్లీని పడగొట్టి వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్ 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఐపీఎల్లో తన రెండో సెంచరీతో చెలరేగగా... హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు సాధించింది. నితీశ్ రాణా (30 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... సమీర్ రిజ్వీ (28 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (23 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ బౌలర్ ఇషాన్ మలింగకు 4 వికెట్లు దక్కాయి. THE HUNDRED CELEBRATION BY ABHISHEK SHARMA. 🔥- Proud father and Kavya Maran cheering. ❤️ pic.twitter.com/pbBYLZViiL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2026భారీ భాగస్వామ్యాలు... తొలి నాలుగు ఓవర్లలో 6 ఫోర్లతో 36 పరుగులు రాబట్టిన రైజర్స్ ఇన్నింగ్స్ నితీశ్ రాణా వేసిన ఐదో ఓవర్‌తో ఊపందుకుంది. ఈ ఓవర్లో అభిషేక్, హెడ్ కలిసి 3 సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో టీమ్ 67 పరుగులు సాధించింది. అనంతరం 25 బంతుల్లో అభిõÙక్ అర్ధసెంచరీ పూర్తి కాగా, అక్షర్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి హెడ్ వెనుదిరిగాడు. అయితే మరోవైపు అభిషేక్ దూకుడు కొనసాగగా, ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తన ధాటిని ప్రదర్శించాడు. వీరిద్దరు కలిసి కుల్దీప్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 పరుగులు రాబట్టారు. 86 పరుగుల వద్ద డీప్ బ్యాక్వర్డ్లెగ్లో రాణా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్ శర్మ... రాణా ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. అయితే అదే ఓవర్లో దురదృష్టవశాత్తూ రిటర్న్‌లో బౌలర్ చేతికి తగిలిన బంతి నాన్‌స్ట్రయికింగ్ స్టంప్స్‌ను పడగొట్టడంతో కిషన్ రనౌటయ్యాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో అభిషేక్ ను ఆపడంలో ఢిల్లీ సఫలం అయింది. ఈ 30 బంతుల్లో 17 బంతులు ఆడిన అభిషేక్ 2 ఫోర్లతో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు ఉన్న క్లాసెన్ మాత్రం తనదైన శైలిలో చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఎన్గిడి ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు కొట్టిన అతను... ముకేశ్ వేసిన చివరి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మిల్లర్ విఫలం... ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అడుగు పెట్టిన పేసర్ మదుషంక చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. తన 3 ఓవర్ల తొలి స్పెల్‌లో 24 పరుగులే ఇచి్చన అతను నిసాంక (8) వికెట్ తీశాడు. మరోవైపు నితీశ్ రెడ్డి వేసిన రెండు ఓవర్లలో రాణా, రాహుల్ కలిసి 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 29 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 59 పరుగులకు చేరింది. శివాంగ్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాణా 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రాహుల్‌ను సాకిబ్ వెనక్కి పంపించగా, తర్వాతి ఓవర్లో మలింగ వరుస బంతుల్లో రాణా, మిల్లర్ (0)లను అవుట్ చేయడంతో రైజర్స్ పైచేయి సాధించింది. ఆ తర్వాత రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి పోరాడినా లాభం లేకపోయింది. 26 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన దశలో స్టబ్స్ అవుట్ కావడంతో ఢిల్లీ గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలుసన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (నాటౌట్) 135; హెడ్ (సి) రిజ్వీ (బి) అక్షర్ 37; ఇషాన్ కిషన్ (రనౌట్) 25; క్లాసెన్ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–97, 2–176. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–53–0, నితీశ్ రాణా 4–0–55–0, ఎన్గిడి 4–0–41–0, అక్షర్ పటేల్ 2–0–23–1, కుల్దీప్ 2–0–30–0, నటరాజన్ 4–0–40–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) (సబ్) లివింగ్‌స్టోన్ (బి) మదుషంక 8; రాహుల్ (సి) అభిషేక్ (బి) సాకిబ్ 37; నితీశ్ రాణా (సి) అభిషేక్ (బి) మలింగ 57; రిజ్వీ (సి) మదుషంక (బి) దూబే 41; మిల్లర్ (బి) మలింగ 0; స్టబ్స్ (సి) సాకిబ్ (బి) మలింగ 27; అశుతోష్ (సి) అనికేత్ (బి) మలింగ 14; అక్షర్ (సి) నితీశ్ (బి) దూబే 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎన్గిడి (సి) మదుషంక (బి) దూబే 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–21, 2–107, 3–107, 4–107, 5–166, 6–186, 7–192, 8–195, 9–195. బౌలింగ్: మదుషంక 4–0–36–1, నితీశ్ రెడ్డి 4–0–57–0, ఇషాన్ మలింగ 4–0–32–4, సాకిబ్ 4–0–29–1, శివాంగ్ 2–0–28–0, హర్‡్ష దూబే 2–0–12–3. -
అభిషేక్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సమీర్ రిజ్వీ 41 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో తొలిసారి 240 పరుగుల ప్లస్ మార్కును దాటింది. చివర్లో క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. హెడ్ 37, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచరీతో ఢిల్లీ పని పట్టిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.242లో సగం స్కోరు అభిషేక్‌దే..టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాలు మొదలయ్యాయి. ఆరంభం నుంచే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ, హెడ్లు పోటీపడి బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత జట్టు స్కోరు 97 పరుగుల వద్ద హెడ్ వెనుదిరగడంతో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఎండ్‌లో మాత్రం అభిషేక్ శర్మ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో అర్థశతకాలు సాధించినప్పటికీ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచే ధాటిగా ఆడిన అభిషేక్ ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివరి వరకు నిలిచిన అభిషేక్ క్లాసెన్, ఇషాన్‌లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అయితే జట్టు సాధించిన 242 పరుగుల్లో అభిషేక్ ఒక్కడివే 135 పరుగులు ఉండడం గమనార్హం. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండడం విశేషం.తడబడిన ఢిల్లీ..భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్ (37), నితీశ్ రానా (57) రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు వెనుదిరగడం ఢిల్లీని కష్టాల్లోకి నెట్టేసింది. ఆ తర్వాత వచ్చిన మిల్లర్ గోల్డెన్ డకౌట్ కావడంతో మరింత కష్టాల్లో పడింది. ఈ దశలో సమీర్ రిజ్వీ, స్టబ్స్ (27) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఇది నాలుగో విజయం కాగా, సొంతగడ్డపై మాత్రం హ్యాట్రిక్ విక్టరీ. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో పరాజయం. దీంతో ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
IPL 2026: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో మెరిశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 47 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.ఈ క్రమంలో అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉన్న టీ20 సెంచరీల రికార్డును సమం చేశాడు. కోహ్లి తర్వాత పొట్టి క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.అభిషేక్ ధనాధన్..కాగా ఐపీఎల్-2026లో భాగంగా సొంతమైదానం ఉప్పల్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆది నుంచి అభిషేక్ శర్మ తనదైన శైలిలో చెలరేగాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి శతక మార్కు అందుకున్నాడు.కాగా ఐపీఎల్లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్లో తొమ్మిదవ సెంచరీ. దేశవాళీ క్రికెట్లో పంజాబ్ తరఫున ఐదు శతకాలు బాదిన అభిషేక్.. టీమిండియా తరఫునా రెండుసార్లు శతక్కొట్టాడు.క్లాసెన్ ఫటాఫట్‌ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 37 పరుగులతో దుమ్ములేపాడు.Incredible knock, iconic celebration 🙌An Abhishek Sharma special lights up Hyderabad 💯Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers | @OfficialAbhi04 pic.twitter.com/QUWtkWuX0D— IndianPremierLeague (@IPL) April 21, 2026టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీల వీరులు🏏క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 22 సెంచరీలు🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 12 సెంచరీలు🏏డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 10 సెంచరీలు🏏క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 9 సెంచరీలు🏏రిలీ రొసోవ్ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు🏏సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్)- 9 సెంచరీలు🏏అభిషేక్ శర్మ (ఇండియా)-9 సెంచరీలు.చదవండి: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్ -
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన అభిషేక్.. సరికొత్త ప్రపంచ రికార్డు
ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్లో ఆరు సార్లు 20 బంతుల్లోపే హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ కనీసం ఐదు సార్లు కూడా 20 బంతుల్లోపు హాఫ్ సెంచరీలు చేయలేదు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా అభిషేక్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ రికార్డుతో పాటు అభిషేక్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. అతని టీ20 కెరీర్లో 15 అంతకంటే తక్కువ బంతుల్లో నాలుగు సార్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ఈ ఘనతను సాధించిన ఏకైక ఆటగాడు కూడా అతనే.తాజాగా అభిషేక్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతని ఐపీఎల్ కెరీర్లో ఇది అత్యంత వేగవంతమైనది. ఈ ఇన్నింగ్స్‌లో అతను మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే సీఎస్కేపై సన్‌రైజర్స్ గెలుపొందింది.అభిషేక్ ఇచ్చిన మెరుపు ఆరంభం ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్కు గట్టి పునాది వేసింది. అతను అర్ద సెంచరీ తర్వాత ఔటైనా క్లాసెన్ స్కోర్‌ను 200 మార్కు దగ్గరికి (194-9) తీసుకెళ్లాడు. అనంతరం ఛేదనలో సగం మ్యాచ్ వరకు గెలుపు దిశగా సాగిన సీఎస్కే, ఆతర్వాత ఎస్ఆర్హెచ్ బౌలర్లు చెలరేగడంతో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయి, 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2), సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు.ఈ మ్యాచ్‌లో అభిషేక్ చేసిన హాఫ్ సెంచరీకి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15). ఇదే ఇన్నింగ్స్‌తో అభిషేక్ ఐపీఎల్లో 2000 పరుగులు (1192 బంతులు) కూడా పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా తాకిన ఆటగాళ్ల జాబితాలో ఆండ్రీ రసెల్ (1120 బంతులు) తర్వాతి స్థానంలో నిలిచాడు. -
సన్‌రైజర్స్ అదరహో
సన్‌రైజర్స్ బ్యాటింగ్ మొదలైన తీరును బట్టి జట్టు కనీసం 220కు పైగా స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే చివర్లో బ్యాటర్ల వైఫల్యంతో స్కోరు 200 కూడా దాటలేదు. చెన్నై ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే ఆటను చూస్తేసునాయాసంగా ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ రైజర్స్ బౌలర్లు ఒక్కసారిగా చెలరేగిపోయారు. బంతిపై పట్టు చేజారనీయకుండా ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఐదుగురు బౌలర్లు కనీసం ఒక వికెట్ తీయడంతో చెన్నై చతికిలపడింది. హైదరాబాద్ ఖాతాలో మూడో గెలుపు చేరింది. అంతకుముందు అభిషేక్ శర్మ, క్లాసెన్ మెరుపులతో చెన్నైపై హైదరాబాద్ తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జోరును ప్రదర్శిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో వరుస విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (22 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్లాసెన్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... అన్షుల్ కంబోజ్, ఒవర్టన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. మాథ్యూ షార్ట్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), ఆయుశ్ మాత్రే (13 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా, ఇషాన్ మలింగకు 3 వికెట్లు... నితీశ్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం రాగా, ప్రఫుల్ హింగే 7 పరుగులే ఇచ్చాడు. కెప్టెన్ విఫలం... షార్ట్ వేసిన తొలి ఓవర్లో 4 పరుగులే రావడంతో రైజర్స్ ఇన్నింగ్స్ ప్రశాంతంగా మొదలైంది. అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ దూకుడు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదిన అభిషేక్... కంబోజ్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అయితే మరో ఎండ్‌లో ముకేశ్ ఓవర్లో 3 ఫోర్లు బాది ధాటిని పెంచినట్లు కనిపించిన ట్రవిస్ హెడ్ (20 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. హెడ్‌ను అవుట్ చేసిన ముకేశ్ తర్వాతి బంతికే కెప్టెన్ ఇషాన్ కిషన్ (0) వికెట్ కూడా తీయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 75 పరుగులకు చేరింది. కొద్దిసేపటికే ఒవర్టన్ తన తొలి ఓవర్లోనే అభిషేక్‌ను వెనక్కి పంపించాడు. ఈ దశలో క్లాసెన్ కొన్ని చక్కటి షాట్లతో స్కోరు పెంచే బాధ్యత తీసుకున్నాడు. మరోవైపు అనికేత్ వర్మ (2) ప్రభావం చూపలేకపోగా, ఉప్పల్‌లో గత రెండు మ్యాచ్‌లలో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి (12; 1 సిక్స్) ఈసారి విఫలమయ్యాడు. నూర్ అహ్మద్ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన క్లాసెన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివర్లో సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేసి ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమయ్యారు. ఆఖరి 4 ఓవర్లలో రైజర్స్ 31 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు చేజార్చుకుంది. మాత్రే మినహా... ఛేదనలో చెన్నై ఆరంభంలోనే సంజు సామ్సన్ (7) వికెట్ కోల్పోయింది. తొలి బంతికే సిక్స్ కొట్టినా అతను ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సున్నా వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను క్లాసెన్ వదిలేయడంతో బతికిపోయిన మాత్రే ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. హింగే ఓవర్లోనే అతను 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 22 పరుగులు రాబట్టడం విశేషం. అయితే క్లాసెన్ అద్భుత క్యాచ్‌తో మాత్రే ఇన్నింగ్స్ ముగియగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19) వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. పవర్‌ప్లేలో జట్టు 76 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒక్క బ్యాటర్ కూడా బాధ్యతతో జట్టును నడిపించలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు) తడబడుతూనే ఆడగా, షార్ట్ కూడా దూకుడు చూపించలేదు. హైదరాబాద్ మెరుగైన బౌలింగ్‌తో ఒత్తిడి పెరిగి జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. శివమ్ దూబే (16 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)పై ఆశలు ఉండగా... 20 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) సామ్సన్ (బి) ఒవర్టన్ 59; హెడ్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 23; ఇషాన్ కిషన్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 0; క్లాసెన్ (బి) కంబోజ్ 59; అనికేత్ (సి) నూర్ (బి) ఒవర్టన్ 2; నితీశ్ రెడ్డి (సి) షార్ట్ (బి) ఒవర్టన్ 12; అరోరా (సి) బ్రెవిస్ (బి) గుర్జప్నీత్ 13; లివింగ్‌స్టోన్ (సి) బ్రెవిస్ (బి) కంబోజ్ 1; శివాంగ్ (సి) గుర్జప్నీత్ (బి) కంబోజ్ 12; హింగే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–75, 2–75, 3–93, 4–112, 5–147, 6–177, 7–179, 8–193, 9–194. బౌలింగ్: షార్ట్ 3–0–38–0, ముకేశ్ చౌదరి 2–0–21–2, కంబోజ్ 3–0–22–3, నూర్ 4–0–33–0, ఒవర్టన్ 4–0–37–3, గుర్జప్నీత్ 4–0–34–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) క్లాసెన్ (బి) నితీశ్ రెడ్డి 7; రుతురాజ్ (సి) అరోరా (బి) మలింగ 19; మాత్రే (సి) క్లాసెన్ (బి) నితీశ్ రెడ్డి 30; షార్ట్ (సి) అనికేత్ (బి) మలింగ 34; సర్ఫరాజ్ (సి) నితీశ్ రెడ్డి (బి) మలింగ 25; బ్రెవిస్ (సి) లివింగ్‌స్టోన్ (బి) శివాంగ్ 0; దూబే (బి) సాకిబ్ 21; ఒవర్టన్ (సి) లివింగ్‌స్టోన్ (బి) హింగే 16; కంబోజ్ (నాటౌట్) 13; నూర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–15, 2–66, 3–66, 4–112, 5–113, 6–148, 7–154, 8–182. బౌలింగ్: ప్రఫుల్ హింగే 4–0–60–1, నితీశ్ రెడ్డి 4–0–31–2, సాకిబ్ 4–0–32–1, ఇషాన్ మలింగ 4–0–29–3, శివాంగ్ 3–0–18–1, అభిషేక్ 1–0–13–0.షార్ట్‌పై అభిషేక్ దాడి... ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మాథ్యూ షార్ట్ బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 3 బంతులాడిన అభిషేక్ 2 పరుగులే చేయగలిగాడు. అయితే ఆ తర్వాత అభిషేక్ తానేంటో షార్ట్‌కు చూపించాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన అతను... మూడో ఓవర్లో చెలరేగిపోయాడు. తొలి బంతికి హెడ్ సింగిల్ తీయగా... తర్వాతి ఐదు బంతుల్లో వరుసగా 4, 4, 4, 6, 6 బాది 20 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే అభిషేక్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 51 పరుగుల వద్ద దూబే అతని క్యాచ్‌ను వదిలేసినా...దాని వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు.ధోని ఆడలేదు... భారత స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులకు నిరాశ తప్పలేదు. గాయం కారణంగా టోర్నీ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని టీమ్‌తో పాటు హైదరాబాద్‌కు వచ్చాడు. శుక్రవారం ప్రాక్టీస్‌లో కూడా అతను పాల్గొన్నాడు. దాంతో బరిలోకి దిగవచ్చని అనిపించింది. అయితే మరోసారి ధోని పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. 2025 సీజన్ షెడ్యూల్లో భాగంగా ఉప్పల్‌లో హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచే జరగలేదు. ఈసారి ఆ మ్యాచ్ వచ్చినా... ధోని ఆట మాత్రం నగర ఫ్యాన్స్ చూడలేకపోయారు. 2024లో ఆడిన మ్యాచ్‌లో ధోని 2 బంతులే ఎదుర్కొన్నాడు! -
ఉప్పల్‌లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
‘నాడా’ పరీక్షల జాబితాలో అభిషేక్, అక్షర్
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలో నిర్వహించే పరీక్షల్లో అందుబాటులో ఉండేందుకు వీలుగా సిద్ధంగా ఉంచే ‘టెస్టింగ్ పూల్’ జాబితాలో ఇద్దరు భారత క్రికెటర్లను కొత్తగా చేర్చారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ల పేర్లు ఇప్పుడు ‘నాడా’ జాబితాలోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న క్రికెటర్లు స్మృతి మంధాన, శ్రేయస్ అయ్యర్‌లను తప్పించి వారి స్థానంలో ఈ రెండు పేర్లను జోడించారు. ఈ జాబితాలో ఉండే ఆటగాళ్లు ఏడాది పాటు డోపింగ్ పరీక్షల కోసం అందుబాటులో ఉండాలి. నిబంధనల ప్రకారం ఎప్పుడు, ఎక్కడ ఉంటున్నారో తమ గురించి సమాచారం అందించాల్సి ఉంటుంది. లేదంటే డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. మొత్తం 348 మందితో కూడిన జాబితాను ‘నాడా’ విడుదల చేసింది. వీరిలో అత్యధిక సంఖ్యలో 118 మంది అథ్లెట్లు ఉండగా...భారత క్రికెటర్లు గిల్, జైస్వాల్, హార్దిక్ పాండ్యా, పంత్, బుమ్రా, రాహుల్, అర్ష్ దీప్, తిలక్ వర్మ వచ్చే ఏడాది కూడా కొనసాగనున్నారు. మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, షఫాలీ వర్మ, రేణుకా సింగ్ కూడాఈ జాబితాలో ఉన్నారు. -
వైభవ్ టీమిండియా ఎంట్రీ ఖరారు
భారత క్రికెట్‌కు సంబంధించి ఓ సంచలన వార్త అందుతోంది. ఐపీఎల్ 2026 వీరలెవెల్లో రెచ్చిపోతున్న, యువ చిచ్చరపిడుగు, రాజస్థాన్ రాయల్స్ కెరటం వైభవ్ సూర్యవంశీ త్వరలో టీమిండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ తర్వాత జరిగే ఐర్లాండ్, జింబాబ్వే టీ20 సిరీస్‌లలో అతను బరిలోకి దిగడం ఖరారైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.15 ఏళ్ల వైభవ్ ఎంపికపై సెలెక్టర్లు తొలుత ముల్లగుల్లాలు (వయసు రిత్యా) పడినప్పటికీ.. ఆతర్వాత ప్రతిభే కొలమానంగా ఎంపికే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వైభవ్ ఎంపిక కేవలం ఐపీఎల్ ఆధారంగానే కాకుండా అండర్-19 జట్టు తరఫున ప్రదర్శనలు కూడా పరిగణలోకి తీసుకొని చేయనున్నట్లు సమాచారం.వైభవ్ ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్‌లో విశేషంగా రాణించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా భారత్ జగజ్జేతగా అవతరించింది. వైభవ్ ఇటీవలే దేశవాలీ క్రికెట్లోకి (బిహార్ తరఫున) కూడా అరంగేట్రం చేసి, అక్కడ కూడా సత్తా చాటాడు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొన్న భారత సెలెక్టర్లు, వైభవ్ టీమిండియా ఎంపికకు ముహూర్తం ఖరారు చేశారు.ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా ఐర్లాండ్, జింబాబ్వేల్లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లకు వైభవ్‌ను ఎంపిక చేసి టీమిండియాకు గ్రాండ్‌గా పరిచయం చేయాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ సిరీస్‌లలో వైభవ్‌కు జతగా మరో చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ ఉండవచ్చు. ఒకవేళ ఈ ఇద్దరు బరిలోకి దిగితే పసికూనలైన ఐర్లాండ్, జింబాబ్వే పరిస్థితి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. వైభవ్-అభిషేక్ జోడీ టీ20 ఫార్మాట్లో అత్యంత భయంకరమైన ఓపెనింగ్ జోడీగా మారవచ్చని అంచనాలు ఉన్నాయి. చరిత్ర సృష్టిస్తాడుఐర్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో వైభవ్ టీమిండియా అరంగేట్రం జరిగితే సరికొత్త చరిత్ర అవుతుంది. అతి చిన్న వయసులో టీమిండియా అరంగేట్రం చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. వైభవ్ జూన్ 26న ఐర్లాండ్‌పై తొలి టీ20 ఆడితే, ఆ సమయానికి అతని వయసు 15 సంవత్సరాలు 91 రోజులు అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కాకపోయినా, ఐర్లాండ్, జింబాబ్వే సిరీస్‌ల్లో ఏ మ్యాచ్‌లో అరంగేట్రం చేసినా చరిత్రే అవుతుంది. ఎందుకంటే, భారత్ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 16 సంవత్సరాలు 205 రోజుల వయసులో టీమిండియా ఎంట్రీ ఇచ్చాడు. ఈ లెక్కన వైభవ్-సచిన్‌కు చాలా గ్యాప్ ఉంటుంది.ఆకాశమే హద్దుప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో సగటు 40, స్ట్రైక్ రేట్ 263.16తో 200 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్లలో ఒకడిగా చలామణి అవుతున్నాడు. ఈ ఎడిషన్‌లో వైభవ్.. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ లాంటి ప్రపంచ మేటి బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. -
గోల్డెన్ డక్.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ అభిషేక్ శర్మ తొలి బంతికే వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ అయ్యాడు. తద్వారా అభిషేక్ శర్మ తన పేరిట అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అదేంటంటే..2026 సీజన్ టీ20 క్రికెట్లో అభిషేక్ శర్మకు ఇది ఏడో గోల్డెన్ డక్. 2026 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 18 ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యి అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు.అంతకముందు కూపర్ కన్నోలి 17 ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.ఇక ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున తొలి బంతికే వెనుదిరిగిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో శిఖర్ దావన్ 2018 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్ డక్ అయి తొలి బ్యాటర్‌గా నిలిచాడు.భారత్ తరఫున టీ20 క్రికెట్లో ఒకే క్యాలండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలోనూ అభిషేక్ చోటు సంపాదించాడు. ఏడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ తొలి స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (2018లో ఆరుసార్లు), సంజూ శాంసన్ (2024లో ఆరు సార్లు), గురుకీరత్ సింగ్ (2103లో 5 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఐపీఎల్లో తొలి బంతికే వికెట్ తీయడం ఆర్చర్‌కు ఇది నాలుగోసారి. టీమిండియా వెటరన్ క్రికెటర్ మహ్మద్ షమీ ఐపీఎల్లో ఈ ఫీట్‌ను 5 సార్లు నమోదు చేయడం విశేషం.ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ తొలి బంతికే వికెట్ తీయడం ఇది 24వ సారి. ఐపీఎల్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధికం. ముంబై ఇండియన్స్ 22సార్లు ఈ ఫీట్ నమోదు చేసింది. View this post on Instagram A post shared by IPL (@iplt20) -
ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 11) జరుగుతున్న మ్యాచ్‌లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో ఐపీఎల్ చరిత్రలో 20 లోపు బంతుల్లో 5 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తన ఐపీఎల్ కెరీర్లో 16 బంతుల్లో ఓసారి.. 18 బంతుల్లో రెండు సార్లు, 19 బంతుల్లో మరో రెండు సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు.ఈ విభాగంలో అభిషేక్ తర్వాతి స్థానంలో నికోలస్ పూరన్ ఉన్నాడు. పూరన్ 4 సార్లు ఐపీఎల్లో 20 లోపు బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. అభిషేక్, పూరన్ తర్వాతి స్థానాల్లో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (3), వైభవ్ సూర్యవంశీ (3) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ తీశారు. -
అభిషేక్‌కు అన్యాయం చేశారు.. సన్‌రైజర్స్‌పై యువరాజ్ ఫైర్
ఐపీఎల్-2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఫస్ట్ హాఫ్‌కు అందుబాటులో లేకపోవడంతో జట్టు పగ్గాలను కిషన్‌కు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అప్పగించింది.ట్రావిస్ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికి కిషన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఎనిమిదేళ్లుగా జట్టుతో ఉన్న అభిషేక్ శర్మకు కాకుండా కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై యువీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభిషేక్ 2017 నుంచి సన్‌రైజర్స్ జట్టుతో పాటు ఉన్నాడు. కానీ కిషన్ మాత్రం గతేడాదే ఎస్ఆర్హెచ్ జట్టులోకి వచ్చాడు. కిషన్ ఇటీవలే జార్ఖండ్‌కు కెప్టెన్‌గా తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. ఈ క్రమంలోనే అతడిని స్టాండిన్ కెప్టెన్‌గా ఆరెంజ్ ఆర్మీ నియమించింది. అతడికి డిప్యూటీగా మాత్రం అభిషేక్ వ్యవహరిస్తున్నాడు."అభిషేక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకోపోవడం నన్ను నిరాశపరిచింది. ఇషాన్ కిషన్ అంటే నాకు కూడా ఇష్టమే. అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి ఎదిగాడు. కానీ అభిషేక్ శర్మ గత 7 ఏళ్లగా ఎస్ఆర్హెచ్ జట్టుతో పాటు ఉన్నాడు. ప్రతీ సీజన్లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఎస్ఆర్హెచ్ కోసం తన సర్వస్వాన్ని ధారపోస్తున్నాడు. అతడు దేశవాళీ క్రికెట్లో పంజాబ్ జట్టుకు కూడా కెప్టెన్ కూడా వ్యవహరిస్తున్నాడు. అటువంటి వ్యక్తికి కెప్టెన్సీ ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం. గతంలో కూడా నాకు ఇలానే జరిగింది. 2007లో నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. సెహ్వాగ్, భజ్జీ వంటి సీనియర్లు ఉన్నారు.కానీ ఎక్కడి నుంచో ఎంఎస్ ధోనీ వచ్చి కెప్టెన్ అయ్యాడు. అప్పట్లో అది నాకు ఎలా అనిపించిందో, ఇప్పుడు అభిషేక్ కూడా అలాగే ఫీల్ అవుతుంటాడు. అయితే ధోని మాత్రం కెప్టెన్‌గా భారత్‌కు గొప్ప విజయాలు అందించాడు.అందుకు అతడే అర్హడు అన్పించింది. ఇది నేను కేవలం ఉదాహరణగా మాత్రమే చెబుతున్నాను. కానీ ఒక ఆటగాడు కొన్నేళ్లు పాటు జట్టుకు తన సేవలు అందించినప్పుడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు కొంత నిరాశను కలిగిస్తాయి" స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు.చదవండి: PSL 2026: ఉన్నపళంగా పాక్ నుంచి వెళ్లిపోయిన డేవిడ్ వార్నర్? -
గెలుపు జోష్‌లో ఉన్న ఎస్ఆర్హెచ్కు షాక్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్‌కెప్టెన్ అభిషేక్ శర్మకు ఐపీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో అభిషేక్ అసభ్య పదజాలం వాడినట్లు స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.మ్యాచ్‌లో ఆట పరంగా అభిమానులను అలరించినప్పటికీ, మైదానంలో మాత్రం అతని ప్రవర్తన అధికారులను నిరాశకు గురిచేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం (మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం వాడటం) లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు అభిషేక్ అంగీకరించాడు. ఐపీఎల్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా లెవల్ 1 నేరాలు తక్కువ తీవ్రత కలిగినవిగా పరిగణించబడతాయి. అయినా పదేపదే ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే డీమెరిట్ పాయింట్లు పెరుగుతాయి. వీటివల్ల భవిష్యత్తులో మ్యాచ్ ల నుండి కూడా సస్పెన్షన్ కు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అభిషేక్ తన తప్పును అంగీకరించడంతో రిఫరీ శిక్షను ఖరారు చేశారు.అరుదైన రికార్డు..గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులతో సునామి ఇన్నింగ్స్ ఆడాడు. పనిలో పనిగా అభిషేక్ తన ఖాతాలో అరుదైన రికార్డును జమ చేసుకున్నాడు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున వంద సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ (143 సిక్సర్లు) తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ (101 సిక్సర్లు), క్లాసెన్ (89 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (64 సిక్సర్లు), హెడ్ (50 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 65 పరుగుల భారీ తేడాతో కేకేఆర్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 🚨 Meet Abhishek Sharma a FAILURE product of IPL 🚨- Matches: 78- Runs: 1822- AVERAGE : 26.79Strike Rate: 162.39- Ducks- 3- Fifties - 9- Centuries - 1Look at his average 26.79 which is below average of any player.pic.twitter.com/BjRi1v8aMz— manzur shaban (@Manzurshaban123) April 2, 2026చదవండి: రనౌటయ్యి బతికిపోయాడు లేదంటేనా! -
అభిషేక్ శర్మ ఖాతాలో భారీ రికార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతాలో మరో భారీ సిక్సర్ల రికార్డు చేరింది. ఇప్పటికే ఎన్నో సిక్సర్ల రికార్డులను తన పేరిట లిఖించుకున్న అభిషేక్.. తాజాగా సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకొని, మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. వార్నర్ ఎస్ఆర్హెచ్ తరఫున 143 సిక్సర్లు బాదాడు. ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్, అభిషేక్ తర్వాతి స్థానాల్లో క్లాసెన్ (89), కేన్ విలియమ్సన్ (64), ట్రవిస్ హెడ్ (50) ఉన్నారు.కాగా, ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) సన్‌రైజర్స్-కేకేఆర్ తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్‌లోనే అభిషేక్ ఎస్ఆర్హెచ్ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. కేకేఆర్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ తొలి బంతి నుంచి ప్రత్యర్దిపై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (21 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (21 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆతర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (14) అదే జోరును కొనసాగించే క్రమంలో ఔటయ్యాడు. అనికేత్ వర్మ ఒక్క పరుగుకే ఔటై, నిరాశపరిచాడు. క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30) క్రీజ్‌లో ఉన్నారు. 17 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 184-4గా ఉంది. ముజరబానీ 2, కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్ తలో వికెట్ తీశారు. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయర్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ టాప్-2 స్దానాలను నిలబెట్టుకున్నారు. అభిషేక్ 875 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. కిషన్(848) రెండో స్ధానంలో నిలిచాడు. మూడో స్ధానంలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(848) ఉన్నాడు.ఇక ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్‌హ్యూజెన్.. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా సత్తాచాటాడు. ఎస్టర్‌హ్యూజెన్ ఏకంగా 64 స్ధానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రోటీస్ సిరీస్‌లో ఎస్టర్‌హ్యూజెన్ 300 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.ఇక టాప్-10లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ జోస్ బట్లర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 8వ ర్యాంకుకు చేరుకోగా, కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ 9వ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ రాబిన్సన్ రెండు స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ తన అగ్రస్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించిన దక్షిణాఫ్రికా బౌలర్లు తమ ర్యాంక్‌లను మెరుగుపరుచుకున్నారు. జెరాల్డ్ కోయెట్జీ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకును కైవసం చేసుకోగా.. ఒట్నీల్ బార్ట్‌మాన్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 56వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్..! ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ? -
అభిషేక్ శర్మ అట్టర్ ప్లాప్
ఐపీఎల్-2026 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవంగా ఆరంభించాడు. చిన్నస్వామిస్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగుతున్న తొలి మ్యాచ్‌లో అభిషేక్ తీవ్ర నిరాశపరిచాడు. 8 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ స్పీడ్ స్టార్ జాకబ్ డఫీ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క సిక్స్ మాత్రమే ఉంది. అయితే డఫీ మాత్రం తన పేస్ బౌలింగ్‌తో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. అతడి బౌలింగ్ ధాటికి సన్‌రైజర్స్ ట్రావిస్ హెడ్(11), నితీశ్ కుమార్ రెడ్డి(1) వంటి కీలక వికెట్లను కోల్పోయింది. మొత్తం మూడు వికెట్లు కూడా అతడే తీశాడు. ఈ కివీ పేసర్ టీ20 ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణించికపోయినప్పటికి.. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో మాత్రం దుమ్ము లేపాడు. దీంతో సన్‌రైజర్స్ కేవలం 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
నువ్వు ఫెయిలై పోతావు: అభిషేక్ శర్మపై యువీ తండ్రి ఫైర్
గత రెండేళ్లుగా టీ20 ఓపెనర్‌గా టీమిండియాలో పాతుకుపోయాడు అభిషేక్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కొద్దికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ప్రియ శిష్యుడిగా పేరొందాడు ఈ విధ్వంసకర బ్యాటర్.క్రమశిక్షణ అత్యంత ముఖ్యంఅయితే, యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) మాత్రం అభిషేక్ శర్మ ఆట తీరు తనకు నచ్చడం లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఈ పంజాబీ ప్లేయర్ ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే తొందరలో మూల్యం చెల్లిస్తున్నాడని యోగ్రాజ్ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారులకు క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని.. అయితే, ఇప్పటి ఆటగాళ్లలో అది కొరవడిందని పేర్కొన్నాడు.ఒకే సర్ అంటాడు కానీ..ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మకు చెప్పీ చెప్పీ నేను విసిగిపోయాను. ఆటను తేలికగా తీసుకోవద్దని అతడికి ఎన్నోసార్లు మెసేజ్‌లు పెట్టాను. అందుకు బదులుగా.. ‘ఒకే సర్’ అని సమాధానమిస్తాడు.అలా అయితే ఫెయిలై పోతావుమైదానంలో అడుగుపెట్టిన తర్వాత షరా మమూలే. అతడి తీరు నాకు ఏమాత్రం నచ్చడం లేదు. సింగిల్, డబుల్, బౌండరీ అని ఉంటాయి. కానీ ప్రతిసారి బంతిని గాల్లోకి లేపి సిక్సరే బాదుతానంటే ఎలా?.. మైదానంలో ఉన్న ప్రేక్షకులను అలరించేందుకు ప్రతిసారి సిక్స్ బాదితే నువ్వు విఫలమైపోతావు’’ అంటూ యోగ్రాజ్ సింగ్ అభిషేక్ శర్మను ఘాటుగా విమర్శించాడు.కాగా ఇటీవల సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. హ్యాట్రిక్ డకౌట్ల తర్వాత రెండు హాఫ్ సెంచరీలతో ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో అర్ధ శతకం బాదడంతో అతడిపై విమర్శల జడి కాస్త తగ్గింది. మొత్తానికి భారీ అంచనాలతో తొలిసారి వరల్డ్‌కప్ బరిలో దిగిన అభిషేక్ శర్మ ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 141 పరుగులు చేయగలిగాడు. ప్రస్తుతం ఐపీఎల్-2026 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ బరిలోకి దిగాడు.చదవండి: IPL 2026: బంగ్లాదేశ్ యూటర్న్.. కీలక ప్రకటన -
అభిషేక్, ఇషాన్ కాదు.. SRH X ఫ్యాక్టర్ అతనే
-
అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచకోత!
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో అన్ని జట్లను భయపెడుతున్నారు. శనివారం జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.సన్‌రైజర్స్ రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్ చేసింది. తొలుత సన్‌రైజర్స్-ఎ జట్టు తరపున ఆడిన అభిషేక్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు సాధించి అన్ని జట్లకు హెచ్చరిక జారీ చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. అతడితో హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 49), సలిల్ అరోరా (16 బంతుల్లో 47)రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్-ఎ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ మాత్రం కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. సన్‌రైజర్స్-బి బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. నితీష్ రెడ్డి మూడు వికెట్లు తీసాడు. అనంతరం సన్‌రైజర్స్ బి టీమ్ తరపున కూడా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈసారి అభిషేక్ శర్మ(4) నిరాశపరిస్తే.. కిషాన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.ఇషాన్ 25 బంతుల్లో 72 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. అయితే 253 పరుగుల భారీ లక్ష్యాన్ని మాత్రం బి టీమ్ చేరుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్🚨 "ABHISHEK SHARMA" STORM IN PRACTICE MATCH SIMULATION 🚨 He Smashed 94Runs off 42 balls with 7 Sixes and 8 Fours 🔥 He nearly Missed well deserved hundred Will IPL 2026 gonna be going hot for Abhishek's career ?? pic.twitter.com/dDaFiYgKQi— Kiara (@crickiara) March 21, 2026 -
'సెహ్వాగ్‌ను చూసి నేర్చుకో'.. అభిషేక్‌కు కుంబ్లే వార్నింగ్
ఐపీఎల్-2026 సీజన్ మరో వారం రోజుల్లో షురూ కానుంది. మార్చి 28న ఆరంభ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరుపై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అభిషేక్ తన దూకుడుకు కాస్త 'నిలకడ'ను తోడు చేస్తే మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో తిరుగులేని ఆటగాడిగా ఎదుగుతాడని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కాగా 25 ఏళ్ల అభిషేక్ శర్మ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం1 బ్యాటర్ కొనసాగుతున్నాడు.అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌లలో అతడు కేవలం 141 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తనకు కలిసొచ్చిన ఐపీఎల్లో సత్తాచాటాలని అభిషేక్ ఉవ్విళ్లూరుతున్నాడు."అభిషేక్‌ను వీరేంద్ర సెహ్వాగ్ వంటి లెజెండరీ ఆటగాడితో పోల్చాలనుకుంటున్నాను. ఎందుకంటే సెహ్వాగ్ కూడా ప్రతీ బంతినీ బాదడానికే చూసేవాడు. ఇప్పుడు అభిషేక్ కూడా అదే చేస్తున్నాడు. అయితే సెహ్వాగ్ క్రమంగా తన ఆట తీరులో మార్పు చేసుకున్నాడు.టెస్టు నుంచి వన్డేలకు, ఆపై టీ20ల్లో ఆడేటప్పుడు.. ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో అతడు గ్రహించాడు. అయినప్పటికీ సెహ్వాగ్ 140–150 స్ట్రైక్ రేటుతోనే బ్యాటింగ్ చేసేవాడు. కాబట్టి అభిషేక్ ఇప్పుడు అదే బాటలో నడవాలి. అభిషేక్ 200, ఆపై 300 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు.కేవలం దూకుండా ఆడి అవుట్ అవ్వడం కంటే, ఎక్కువ బంతులు ఆడి క్రీజులో గడపడం ముఖ్యం. అభిషేక్ శర్మ క్రీజులో కనీసం 20 బంతులు ఆడితే, అతడు ఖచ్చితంగా 50 పరుగుల మార్కుకు చేరుకుంటాడని మనకు తెలుసు. సంజూ శాంసన్ విషయంలో కూడా మనం అదే చూశాం. అతడు 40, 50 పరుగుల వద్ద అవుట్ కాకుండా, ఎక్కువ సేపు క్రీజులో నిలబడి 85-90 రన్స్ చేసి జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అభిషేక్ కూడా అదే చేయాలి. టీ20 ఫార్మాట్లో జట్టుకు కావాల్సింది అదే. ఈ సీజన్లో అభిషేక్‌లో తన ఆట తీరును మార్చుకుంటాడని ఆశిస్తున్నా" అని జియో స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్ -
సన్‌రైజర్స్‌కు భారీ షాక్!.. ఇషాన్‌కు గోల్డెన్ ఛాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. ఫలితంగా అతడు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.నాలుగు మ్యాచ్‌లు కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్ తాజా ఎడిషన్ మొదలుకానున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్-2026కు సంబంధించి బీసీసీఐ తొలుత కేవలం ఇరవై మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది.ఇందులో భాగంగా సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే సొంత మైదానం ఉప్పల్ (Uppal)లో ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లోనూ కమిన్స్ తమ జట్టుకు సారథ్యం వహిస్తాడని సన్‌రైజర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వెన్ను నొప్పి కారణంగా యాషెస్‌లో కొన్ని మ్యాచ్‌లు సహా టీ20 ప్రపంచకప్-2026 మొత్తానికి దూరమైన కమిన్స్ (Pat Cummins).. గాయం నుంచి ఇంకా కోలుకోలేదని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం పేర్కొంది.వారిద్దరిలో ఒకరు సారథి?ఒకవేళ కమిన్స్ నిజంగానే ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే ఓపెనింగ్ జోడీ ట్రవిస్ హెడ్- అభిషేక్ శర్మలలో ఒకరు సన్‌రైజర్స్‌ను ముందుకు నడిపిస్తారని వార్తలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. దేశీ బాయ్, టీ20 వరల్డ్‌కప్ స్టార్ అభిషేక్ శర్మకే పగ్గాలు దక్కనున్నట్లు వార్తలు వచ్చాయి.ఇషాన్ వైపే యాజమాన్యం మొగ్గు?అయితే, తాజా సమాచారం ప్రకారం జార్ఖండ్ డైనమైట్, సన్‌రైజర్స్ వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు ఈ బంపరాఫర్ దక్కినట్లు తెలుస్తోంది. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో జార్ఖండ్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించి తొలి టైటిల్ అందించాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్.ఈ క్రమంలో జాతీయ జట్టులోకి తిరిగి వచ్చి.. టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇషాన్ కిషన్. మరోవైపు.. అభిషేక్ శర్మకు కూడా దేశీ క్రికెట్లో పంజాబ్‌కు సారథిగా వ్యవహరించిన అనుభవం ఉంది. అయితే, సన్‌రైజర్స్ యాజమాన్యం మాత్రం కమిన్స్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను నియమించేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అభిషేక్‌పై అదనపు భారం పడకుండా ఉండేందుకు ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా ధోని రావాలి: గంభీర్ -
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
-
‘అభిషేక్‌ను అందుకే వెనుకేసుకొచ్చా’
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభ దశ నుంచి సెమీస్ వరకు అభిషేక్ డకౌట్లు లేదా తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. అయినా కూడా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అభిషేక్‌కు అవకాశాలిస్తూ అతడికి వెన్నుదన్నుగా నిలుస్తూనే వచ్చాడు. మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతున్నా జట్టులో చోటు కల్పించడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే గంభీర్ మాత్రం అభిషేక్‌పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అభిషేక్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి అంతకముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాడు. ఎన్ని విమర్శలు వచ్చినా అభిషేక్‌ను వెనుకేసుకు రావడానికి గల కారణాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా వెల్లడించాడు. ‘2014 ఐపీఎల్ సమయంలో నేను చాలా బ్యాడ్ఫేస్ను ఎదుర్కొన్నాను. అప్పట్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా మూడు డకౌట్లు కావడంతో విమర్శలు ఎదురయ్యాయి. ఒక ఆటగాడు పరుగులు చేయలేదంటే అతని స్కోర్ కంటే ఫామ్ గురించే మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అభిషేక్ అక్కడ ఫామ్ కోల్పోలేదు.. కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని అతడికి వివరించాను. అయితే అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతను తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని ఆరాట పడుతుంటాడు. కానీ ఒక బ్యాటర్ 20 నుంచి 30 బంతులు ఆడినప్పుడు మాత్రమే అతని ఫామ్‌ను అంచనా వేయగలం. అయితే అభిషేక్ పట్టుమని 20 బంతులు కూడా ఎదుర్కోలేదు. అందుకే అవకాశమొచ్చిన ప్రతీసారి మరింత అగ్రెసివ్‌గా ఆడాలని చెప్పేవాడిని. అదీగాక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంతిని గ్రౌండ్ అవతలికి పంపించాలనుకోవడం అభిషేక్ నైజం. ఇది ఒక రకంగా మంచిదే.అంతిమంగా బయట ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు.. డ్రెస్సింగ్‌రూమ్‌లో అతడి గురించి ఏమీ ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో మాత్రం 21 బంతుల్లో 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: అభిషేక్‌ను చూసి అసూయపడేవారు! -
అభిషేక్‌ను చూసి అసూయపడేవారు!
టీమిండియా స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మతో ఉన్న స్నేహ బంధాన్ని బయటపెట్టాడు. ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా శాంసన్ అభిషేక్‌తో ఉన్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తమది నిప్పు-నీరు కాంబినేషన్ కాదని, ఇద్దరం నిప్పుకణికలమేణని శాంసన్ పేర్కొన్నాడు.అభిషేక్ పట్ల భారత ఆటగాళ్లు అసూయ పడేవారని తెలిపాడు.‘మేమిద్దరం ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్. ఒకసారి అభిషేక్ మెరిస్తే, మరోసారి నేను మెరుస్తాను. 2024 నుంచే మా కాంబినేషన్ అలా కొనసాగుతూ వస్తోంది. దీనికి తోడు కేరళ-పంజాబ్ ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. మా మధ్య బంధం అంతా సహజంగా సాగిపోతుంది. దానిని కాంప్లికేట్ చేయదలచుకోలేదు. ఇక మైదానంలో మేమిద్దరం కలిసి బరిలోకి దిగినప్పుడు అభిషేక్ బంతి ఎలా వస్తుంది అని అడుగుతాడు. దానికి నేను సాధారణంగా వస్తుంది అని చెప్పడం, ఆ మరుసటి బంతిని అభిషేక్ సిక్స్ కొట్టడం జరిగిపోతాయి. పెళ్లి చేసుకో భాయ్..అభిషేక్ శర్మ చాలా ధైర్యవంతుడు, సమర్థుడు. మైదానం లోపల, వెలుపల అభిషేక్‌తో మంచి అనుబంధముంది. అయితే అభిషేక్ శర్మీ టీమిండియాకు ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో భారత ఆటగాళ్లే అతన్ని చూసి అసూయ పడేవారు. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ చూసినా అభిషేక్.. అభిషేక్ అని వినిపిస్తుండేది. ఒకప్పుడు అభిషేక్ సాధారణ ఆటగాడు కావొచ్చు.. కానీ ఇప్పుడు అతనొక సూపర్‌స్టార్. అందుకే త్వరగా పెళ్లి చేసుకో బాయ్ అని సలహా ఇచ్చాను.’ అని పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేయడం, ఆపై న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది.ఇద్దరి కథ ఒకటే..అయితే టీ20 ప్రపంచకప్ ఆరంభంలో ఇద్దరి కథ దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. ఫామ్ కోల్పోయి అభిషేక్ శర్మ సతమతమవ్వగా, శాంసన్ కూడా అభిషేక్ స్థానంలో తొలుత వచ్చిన అవకాశాలను వృథా చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు విఫలమైతున్నా కూడా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోయాయి. అయితే సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకున్న శాంసన్ దానిని ఫైనల్ వరకు అలాగే కొనసాగించి విమర్శకుల నోళ్లు మూయించాడు. మరోవైపు అభిషేక్‌పై నమ్మకంతో జట్టు మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. చివరకు ఫైనల్లో అభిషేక్ శర్మ తన మార్క్ ఆటతో అలరించడమే గాక టీమిండియా టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
SRH: బెస్ట్ ప్లేయింగ్ XII.. రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2026 ప్రయాణాన్ని మార్చి 28న మొదలుపెట్టనుంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తొలుత తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 2న కోల్‌కతాతో, ఏప్రిల్ 5న లక్నోతో, ఏప్రిల్ 11న పంజాబ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.తొలి విడతలో భాగంగా ఎస్ఆర్హెచ్కు సంబంధించి ఈ నాలుగు మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ సన్‌రైజర్స్ తుదిజట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.టాప్-3లో వీరే‘‘నా దృష్టిలో సన్‌రైజర్స్ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ టాప్-3లో ఆడతారు. నితీశ్ రెడ్డిని నాలుగో స్థానంలో ఆడించాలన్నది నా అభిప్రాయం.టీ20 క్రికెట్లో అత్యుత్తమంగా ఫినిషింగ్ ఇవ్వగల ఆటగాడు అతడు. లేదంటే హెన్రిచ్ క్లాసెన్‌ను నాలుగో స్థానంలో ఆడించి.. నితీశ్‌ను ఐదో ప్లేస్‌లో పంపవచ్చు.ఇక అనికేత్ వర్మ గతేడాది అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదాడు. అతడు ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడించాలి. వీరితో పాటు ఓ అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాటర్‌కూ స్థానం దక్కుతుంది.కమిన్స్ ఎనిమిదో స్థానంలోబౌలర్ల విభాగానికి వస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎనిమిదో స్థానంలో వస్తాడు. బ్యాట్‌తోనూ అతడు అద్భుతం చేయగలడు. ఇక ఆ తర్వాత క్రియాన్స్ ఫులేట్రా, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగలు ఉండాలి.భారత ఫాస్ట్‌బౌలర్లను తీసుకోవాలనుకుంటే జయదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్ బెటర్’’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. కాగా మినీ వేలంలో సన్‌రైజర్స్ అనూహ్య రీతిలో లియామ్ లివింగ్‌స్టోన్‌ను ఏకంగా రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, బంగర్ మాత్రం అతడికి తుదిజట్టులో చోటే దండగ అన్న రీతిలో అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా గతేడాది ఆర్సీబీ తరఫున లివింగ్‌స్టోన్ విఫలమయ్యాడు.ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ జట్టుసలీల్ అరోరా, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరణ్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ మావి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అమిత్ కుమార్, క్రియాన్స్ ఫులెట్రా, ప్రఫుల్ హింజ్, ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, శివంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనాట్కట్, జీషన్ అన్సారీ.సంజయ్ బంగర్ ఎంచుకున్న బెస్ట్ ప్లేయింగ్ XIIట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ఆర్ స్మరణ్, ప్యాట్ కమిన్స్, క్రెయిన్స్ ఫులెట్రా/జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ, జయదేవ్ ఉనాద్క ట్, హర్షల్ పటేల్.చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!? -
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా.. మూడుసార్లు టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక టీమ్‌గా.. సొంతగడ్డపై పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా ప్రపంచ రికార్డులు సాధించింది.సెమీస్ దాకా వైఫల్యాలునిజానికి లీగ్ దశలో భారత్ అజేయంగా నిలిచినా.. ఆయా మ్యాచ్‌లలో తమ ప్రదర్శన కోచ్ గౌతం గంభీర్‌కు సైతం సంతృప్తినివ్వలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్వయంగా చెప్పాడు. ఇక భారీ అంచనాలతో తొలిసారి బరిలోకి దిగిన ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma).. వరుసగా మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా సెమీస్ దాకా వైఫల్యాలు కొనసాగించాడు.మరోవైపు.. సంజూ శాంసన్‌కు ఆది నుంచి తుదిజట్టులో చోటులేని పరిస్థితి. అయితే, నాకౌట్ మ్యాచ్‌లలో అంటే వెస్టిండీస్‌తో సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 నాటౌట్, ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో రాణించి దుమ్ములేపాడు.టైటిల్ పోరులో విధ్వంసకర అర్ద శతకంఇక అభిషేక్ శర్మ సైతం అసలైన టైటిల్ పోరులో విధ్వంసకర అర్ద శతకం (21 బంతుల్లో 52)తో సత్తా చాటాడు. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా జట్టులోని ప్రతి సభ్యుడూ కీలక సమయాల్లో రాణించి తమ వంతు పాత్ర పోషించారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘గేమ్‌ను టీమిండియా బాగా అర్థం చేసుకుంది. ముఖ్యంగా ఫైనల్లో వారు అద్భుతం చేశారు. బుమ్రా ఆడిన తీరు చూస్తే.. సూపర్స్టార్ల నుంచి ఏ జట్టైనా కోరుకునేది ఇదే కదా అనిపిస్తుంది.రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటంఅభిషేక్ శర్మ ఆటకు నేను వీరాభిమానిని. అయితే, టోర్నీ ఆరంభంలో అతడు డకౌట్లు కావడం.. ఆ తర్వాత కూడా విఫలమై దారుణంగా నిరాశపరిచాడు. దీంతో ఒత్తిడిలోకి కూరుకుపోయాడు.అయితే, తప్పక ఆడాల్సిన మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించాడు. కొంతమంది రాస్కెల్స్ ఉంటారు.. నిప్పుతో చెలగాటం ఆడటం వారికి సరదా! ఫైనల్లో అభిషేక్ శర్మ విజృంభించిన తీరు చూస్తే మీకే ఇది అర్థమవుతుంది. అందరూ అతడే ఒత్తిడిలో ఉంటాడనుకుంటే.. అతడు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేశాడు’’ అని బ్రాడ్ హాడిన్ ప్రశంలస వర్షం కురిపించాడు. చదవండి: ‘తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే’ -
T20 WC 2026 Final: అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించాడు..!
నిన్న (మార్చి 8) జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.ఫైనల్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగి ఏకపక్ష విజయాన్ని సాధించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లేలో భారత బ్యాటర్లు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు.వరుస వైఫల్యాల తరువాత ఈ మ్యాచ్‌లో అభిషేక్ విలయతాండవం చేశాడు. కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ తన ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను అతను సహచరుడు శివమ్ దూబే నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో ఆడినట్లు పేర్కొన్నాడు.అభిషేక్ మాటల్లో.. ఇవాళ నేను శివమ్ దూబే బ్యాట్‌తో ఆడాను. ఉదయం ఏదో కొత్తగా ప్రయత్నించాలని అనిపించింది. శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో దూబే దగ్గరికి వెళ్లి అతని బ్యాట్ తీసుకున్నానని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి ఆరంభ మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. హ్యాట్రిక్ డకౌట్లు సహా పేలవ ప్రదర్శనలు చేశాడు. అయితే కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చి భారత్ భారీ స్కోర్ చేయడానికి పటిష్ట పునాది వేశాడు. సంజూ శాంసన్‌తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ దశనే మార్చేసింది. ఇలాంటి కీలక ఇన్నింగ్స్‌ను అతను అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో ఆడటం విశేషం. అభిషేక్‌కు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ. ఇదే ప్రపంచకప్‌లో వరుసగా విఫలమవుతున్నాడని ఓ మ్యాచ్‌లో సిరాజ్ జెర్సీ ధరించి బరిలోకి దిగాడు. అంతకుముందు కూడా టీమిండియా వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో పలు సందర్భాల్లో ఆడాడు. ఫైనల్‌గా ఫైనల్లో అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించి, భారత్ జగజ్జేతగా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు. -
T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది?
క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ కామెంటేటర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రికి పేరుంది. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఛలోక్తులు, చణుకులు విసరడంలో అతడు దిట్ట. ఎన్నో చిరస్మరణీయ విజయాలు, అద్భుతమైన క్షణాలను తన వ్యాఖ్యానంతో మరింత గుర్తుండిపోయేలా చేసిన ఘనత అతడిది.ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్‌కప్‌లో సొంతగడ్డపై శ్రీలంకతో ఫైనల్లో.. నాటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్.. ధోని సిక్స్ బాది విజయాన్ని ఖరారు చేయగానే.. ‘‘ఎంఎస్ ధోని తనదైన శైలిలో ముగింపు ఇచ్చాడు( "MS Dhoni finishes off in style" )’’ అన్న రవిశాస్త్రి మాటలు ఇప్పటికీ.. క్రికెట్ అభిమానుల చెవుల్లో మారుమ్రోగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.అంతటి రవిశాస్త్రి కామెంట్రీలోనూఅయితే, అంతటి రవిశాస్త్రి కామెంట్రీలో కూడా కొన్నిసార్లు తప్పులు దొర్లడం సహజం. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ సందర్భంగా అతడు చేసిన పొరపాటు నెట్టింట ట్రోలింగ్‌కు కారణమైంది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.టాపార్డర్ దుమ్ములేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు సాధించింది. తద్వారా పొట్టి ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను.. భారత్ 159 పరుగులకే ఆలౌట్ చేసింది.తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతోకివీస్ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లోనే.. అక్షర్ పటేల్ తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో జేకబ్ డఫీ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్ వర్మ పట్టడంతో న్యూజిలాండ్ కథ ముగిసింది. అయితే, తిలక్ క్యాచ్ అందుకున్న సమయంలో రవిశాస్త్రి.. న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది అని కామెంట్రీలో చెప్పాడు.అద్భుతమైన ప్రదర్శనఆ వెంటనే తప్పును గ్రహించి.. ‘‘నిజానికి అంతా అయిపోయింది.. టీమిండియా మూడోసారి ప్రపంచకప్ గెలిచింది. వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అంతేకాదు.. సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శన’’ అని రవిశాస్త్రి టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు.వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాకు టైటిల్ కోల్పోయిన వేదికపైనే.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ గెలిచి సత్తా చాటిందని కొనియాడాడు. రవిశాస్త్రి కామెంట్రీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చదవండి: సంజూ, ఇషాన్ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ మాజీ క్రికెటర్Let the celebrations begin 🤩India are #T20WorldCup 2026 champions 🏆 pic.twitter.com/zGgQtwODwH— ICC (@ICC) March 8, 2026 -
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
-
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
-
'త్రి'వర్ణ విజయం
సామ్సన్ కొట్టిన సిక్స్‌లను కరిగే క్షణాలు కూడా కాసేపాగి వీక్షించినట్లు.. అభిషేక్ బాదిన బౌండరీల్ని పదిలంగా దాచుకోవాలని మైదానం తలచినట్లు.. ఇషాన్ ధనాధన్ అర్ధశతకానికి బంతి పెద్ద ఫ్యాన్ అయినట్లు... అహ్మదాబాద్‌లో పరుచుకున్న ‘పరుగుల’ వెన్నెల యావత్ భారతాన్ని మురిపించింది. ఎందుకంటే ఈ ప్రపంచకప్ విజయం...దీని తాలూకు వచ్చే ఆనందం... ఓ పూటకే సరిపోదు.ఒక్క చోటికే పరిమితం కాదు. మొత్తం దేశాన్నే తమ క్రికెట్ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది.ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.2019 వన్డే ప్రపంచకప్‌లో మనల్ని ఫైనల్ చేరకుండా సెమీస్‌లోనే వెళ్లగొట్టిన న్యూజిలాండ్ జట్టుకు... 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మనగడ్డపై మనల్ని ముంచిన అహ్మదాబాద్ వేదికకు.. టీమిండియా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. 2026 టి20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగానిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గాకరీబియన్లో పట్టుకొచ్చిన టి20 ప్రపంచకప్‌ను సొంతగడ్డపైనా నిలబెట్టుకుంది. సెమీస్లోఇంగ్లండ్పై, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత బ్యాటింగ్ దళం గర్జించింది.వందేమాతరం... వందేమాతరం... లక్ష మంది అభిమానులతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తిపోయింది... ఇందులో రెండున్నరేళ్ల క్రితం ఇదే మైదానంలో గుండెకోతను అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు అది గతం.. నాటి గాయానికి మందు రాసేలా సొంతగడ్డపై, ఫ్యాన్స్ సమక్షంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్‌ను సగర్వంగా అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా ఘనత సాధించింది. రెండేళ్ల క్రితం విశ్వ విజేతగా నిలిచిన నాటి నుంచి ఏ రోజూ స్థాయి తగ్గకుండా అదే దూకుడు, జోరుతో ఆడిన టీమిండియా అదే తీవ్రతను కొనసాగిస్తూ టైటిల్ నిలబెట్టుకోవడం విశేషం.ఫైనల్లో న్యూజిలాండ్‌తో సమరం అంటే ముందుగా మనదే కొంత పైచేయిగా కనిపించింది... దానికి తగినట్లుగా ఆరంభం నుంచే టాప్–3 బ్యాటర్లు విరుచుకుపడ్డారు. సామ్సన్ తన ధాటిని కొనసాగించగా అభిషేక్ అసలు పోరులో తన సత్తాను ప్రదర్శించాడు. తోడుగా ఇషాన్ కిషన్ కూడా చెలరేగడంతో బౌండరీల విధ్వంసం సాగింది. ప్రతీ బంతీ బౌండరీ దాటుతుండగా భారత్ ఆట చూస్తే 300 స్కోరు ఖాయమనిపించింది. అక్కడి వరకు చేరకపోయినా 255 పరుగులతో మ్యాచ్‌ను శాసించే స్థితిలో టీమిండియా నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు వేదికపై ఛేదన ఎంత కష్టమో కివీస్‌కు తెలిసే సరికి మ్యాచ్ ముగిసిపోయింది... బుమ్రా, అక్షర్ బౌలింగ్‌తో ఆ జట్టు కునారిల్లింది. సంపూర్ణ ఆధిపత్యంతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది.అభిషేక్ బౌలింగ్‌లో డఫీ కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద హైదరాబాదీ తిలక్ వర్మ అందుకోవడంతో అన్ని వైపుల నుంచి వేడుకలు మొదలయ్యాయి. గత టోర్నీ గెలుపు అనుభవాన్ని కొందరు మళ్లీ రుచి చూస్తే... తొలిసారి వరల్డ్ కప్ నెగ్గిన కుర్రాళ్ల ఆనందానికి అవధుల్లేవు... వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌గా సూర్యకుమార్ చరిత్రకెక్కగా... గత వరల్డ్ కప్ విజేతలు కపిల్, ధోని, రోహిత్ శర్మ గ్యాలరీ నుంచి అభినందిస్తుండగా టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో మువ్వన్నెల జెండాతో సంబరాలు చేసుకున్నారు. అహ్మదాబాద్: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది. గతంలో 2007, 2024లో టైటిల్ సాధించిన టీమిండియా ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), సాంట్నర్ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 27 కోట్ల 48 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ధనాధన్ దూకుడు... తొలి ఓవర్లో 7 పరుగులు, రెండో ఓవర్లో 5 పరుగులు... ఇంత వరకు భారత్ కాస్త జాగ్రత్త పడింది. డఫీ వేసిన మూడో ఓవర్‌తో మొదలైన బ్యాటింగ్ విధ్వంసం చివరి ఓవర్ వరకు సాగింది. టాప్–3 బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి కివీస్ పనిపట్టారు. ఫెర్గూసన్ ఓవర్లో అభిషేక్, సామ్సన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి. హెన్రీ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్ బాదగా, డఫీ ఓవర్లో అభిషేక్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 92 పరుగులకు చేరింది. 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అభిషేక్ వెనుదిరిగినా, కిషన్ వచ్చి అదే జోరును కొనసాగించాడు. 33 బంతుల్లో సామ్సన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఫెర్గూసన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 2 సిక్స్‌లు బాదగా, కిషన్ మరో సిక్స్ కొట్టాడు. రచిన్ వేసిన 14వ ఓవర్లోనైతే సామ్సన్ వరుసగా 6, 6, 6తో చెలరేగిపోగా, కిషన్ కూడా 23 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకున్నాడు. అయితే ఎట్టకేలకు తర్వాతి 16–19 వరకు నాలుగు ఓవర్ల పాటు భారత్‌ను కట్టడి చేయడంలో కివీస్ సఫలమైంది. నీషమ్ వేసిన ఒకే ఓవర్లో సామ్సన్, కిషన్, సూర్యకుమార్ (0) అవుట్ కాగా... పాండ్యా (18)ను హెన్రీ అవుట్ చేశాడు. ఈ నాలుగు ఓవర్లలో కలిపి 28 పరుగులే వచ్చాయి. అయితే నీషమ్ వేసిన చివరి ఓవర్లో దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. దాంతో స్కోరు 250 దాటింది. సీఫెర్ట్ మినహా... తమ జట్టుకు శుభారంభం అందించడంలో కివీస్ ఓపెనర్లు విఫలమయ్యారు. పాండ్యా ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాది సీఫెర్ట్ జోరు ప్రదర్శించినా... మరోవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 బంతుల వ్యవధిలో అలెన్ (9), రచిన్(1) అవుట్ కాగా, ఫిలిప్స్‌ను (5) అక్షర్ బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు చేయగలిగింది. వరుణ్ ఓవర్లో 2 సిక్స్‌లతో 23 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే నాలుగు బంతుల వ్యవధిలో చాప్మన్ (3), సీఫెర్ట్‌లు వెనుదిరగడంతో సగం టీమ్ పెవిలియన్ చేరింది. మిచెల్ (17), సాంట్నర్ కొద్దిసేపు పోరాడగలిగారు.అయితే బుమ్రా అద్భుత బంతితో సాంట్నర్‌ను అవుట్ చేయడంతో కివీస్ ఓటమి లాంఛనమే అయింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) (సబ్) మెక్‌కోన్‌కీ (బి) నీషమ్ 89; అభిషేక్ (సి) సీఫెర్ట్ (బి) రచిన్ 52; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) నీషమ్ 54; పాండ్యా (సి) సాంట్నర్ (బి) హెన్రీ 18; సూర్యకుమార్ (సి) రచిన్ (బి) నీషమ్ 0; తిలక్ (నాటౌట్) 8; దూబే (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–98, 2–203, 3–204, 4–204, 5–226. బౌలింగ్: హెన్రీ 4–0–49–1, ఫిలిప్స్ 1–0–5–0, డఫీ 3–0–42–0, ఫెర్గూసన్ 2–0–48–0, సాంట్నర్ 4–0–33–0, రచిన్ రవీంద్ర 2–0–32–1, నీషమ్ 4–0–46–3. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 52; అలెన్ (సి) తిలక్ (బి) అక్షర్ 9; రచిన్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 1; ఫిలిప్స్ (బి) అక్షర్ 5; చాప్మన్ (బి) పాండ్యా 3; మిచెల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 17; సాంట్నర్ (బి)బుమ్రా 43; నీషమ్ (బి) బుమ్రా 8; హెన్రీ (బి) బుమ్రా 0; ఫెర్గూసన్ (నాటౌట్) 6; డఫీ (సి) తిలక్ (బి) అభిషేక్ 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–31, 2–32, 3–47, 4–70, 5–72, 6–124, 7–141, 8–141, 9–152, 10–159. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–32–0, పాండ్యా 4–0–36–1, అక్షర్ 3–0–27–3, బుమ్రా 4–0–15–4, వరుణ్ 3–0–39–1, అభిషేక్ 1–0–5–1. -
ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగి
భయం లేదు, బెదురు లేదు... మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన మాత్రమే ఉంది. ఒక వికెట్ పడితే నెమ్మదించిపోయే తత్వం ఎప్పుడో అంతరించిపోయింది. ఒకడు పోతే మరొకడు అన్నట్లుగా అవుటైన బ్యాటర్ తర్వాత వచ్చే ఆటగాడు అంతకంటే ఎక్కువ కసితో చెలరేగిపోయేందుకు సిద్ధం... గత రెండేళ్ళలో భారత టి20 జట్టు బ్యాటింగ్ ప్రతాపం ఇదే తరహాలో సాగింది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడేజా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. కానీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ఐపీఎల్లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్న వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎక్కడా తగ్గకుండా అదే స్థాయిని ప్రదర్శించారు. ఓపెనర్‌గా ప్రతీ మ్యాచ్‌కు కొత్త రికార్డు నెలకొల్పుతూ వచ్చిన అభిషేక్ ఇచ్చిన ఆరంభాలు టీమిండియా విజయాలు సులువు చేస్తే, మిడిలార్డర్లో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కీలకంగా మారాడు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్ జట్టులో తిలక్ విలువను చూపించింది. ఇక అనూహ్యంగా టీమ్‌కు దూరమై తిరిగి వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ మరింత చెలరేగిపోయాడు. అసాధారణ ఫామ్‌తో అతను వరల్డ్ కప్‌లోకి అడుగు పెట్టాడు. టోర్నీలో కూడా పాకిస్తాన్‌పై మ్యాచ్‌తోపాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కీలక సమయంలో భారత జట్టు వ్యూహం మార్చిన తీరు టోర్నీలో మన రాతను మార్చింది. టాప్–3లో అభిషేక్, కిషన్, తిలక్లవంటి ముగ్గురు ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటంతో ప్రత్యర్థులు ఆఫ్‌స్పిన్నర్‌ను ప్రయోగించి జట్టును దెబ్బ తీస్తూ వచ్చారు. దీనిని గుర్తించిన యాజమాన్యం సామ్సన్ను మళ్లీ ఆడించి కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. అంతే... ఆ తర్వాత టీమ్ ప్రదర్శన ఒక్కసారిగా మారిపోయింది. జింబాబ్వేపై 256 పరుగులు, విండీస్‌పై 196 పరుగుల అలవోక ఛేదన, ఇంగ్లండ్‌పై 253, న్యూజిలాండ్‌పై 255... ఇలా పరుగుల వరద పారింది. ఒక్క అమెరికాపై మ్యాచ్ మినహా బ్యాటర్‌గా సూర్యకుమార్ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. కానీ సహచరుల ప్రదర్శనలతో భారత్ వరుస విజయాలు సాధించడం సారథిగా అతనిపై ఒత్తిడిని తగ్గించింది. ఇక అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లోనూ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా విలువ వెలకట్టలేనిది. బ్యాటింగ్‌లో భారీ హిట్టింగ్తో పరుగులు రాబట్టిన అతను బౌలర్‌గా అటు కొత్త బంతితో, ఇటు చివరి ఓవర్లలో కూడా సత్తా చూపించాడు. ఇంగ్లండ్‌పై సెమీస్‌లో అతను వేసిన 19వ ఓవర్ ఎంత కీలకంగా మారిందో చెప్పనవసరం లేదు. ఈసారి జట్టు విజయంలో శివమ్ దూబే కూడా తోడయ్యాడు. స్లాగ్ ఓవర్లలో మొత్తం 17 సిక్సర్లతో దూబే చూపించిన దూకుడు జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. బౌలింగ్‌లో బుమ్రా ఒంటి చేత్తో జట్టుతో నడిపించిన తీరు అతను ‘ఆల్‌టైమ్ గ్రేట్’ ఎందుకో చెబుతుంది. 2024 టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన బుమ్రా ఈసారి కూడా వన్నె తగ్గకుండా తన పదునును చూపించాడు. ఏడుకంటే తక్కువ ఎకానమీతో అతను పరుగులు ఇచ్చిన తీరు ప్రత్యర్థి బ్యాటర్లను ఏమాత్రం కోలుకోకుండా చేసింది. ఫైనల్లో తీసిన 4 వికెట్లు బుమ్రా స్పెషల్. తనదైన శైలిలో బ్యాటర్లను నిలువరించడంలో అర్‡్షదీప్ కూడా పూర్తిగా సఫలమయ్యాడు. వరుణ్ చక్రవర్తి టోర్నీ ద్వితీయార్ధంతో కొంత తడబడినా... ఓవరాల్‌గా అతని స్పిన్ ప్రభావం బాగానే కనిపించింది. టీమ్ కూర్పు కారణంగా సిరాజ్, కుల్దీప్ ఒకే ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాగా, రింకూ సింగ్‌కు కూడా ఎక్కువ అవకాశం రాలేదు. 2024 ఆరంభం నుంచి భారత జట్టు ఆరుసార్లు 250కు పైగా స్కోర్లు నమోదు చేసింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా భారీ షాట్లతో విరుచుకుపడింది. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత 50 మ్యాచ్‌లలో 41 విజయాలు మన స్థాయిని, అసాధారణ ప్రదర్శనను చూపించాయి. ఈ టోర్నీలో కూడా ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మినహా మిగతా ఎనిమిది మ్యాచ్‌లలో టీమిండియా అసలు స్థాయిని ప్రదర్శించాయి. గత రెండేళ్లుగా సాగించిన సన్నాహాలు, వరుస సిరీస్‌లలో విజయాలు, ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు వరుసగా రెండో వరల్డ్ కప్‌ను అందించాయి. –సాక్షి క్రీడా విభాగం సక్సెస్ఫుల్ కోచ్ భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో క్లీన్‌స్వీప్‌నకు గురి కావడం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడటం హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. కోచ్‌గా సమర్థుడు కాకపోయినా... బీసీసీఐ పెద్ద అండదండలంతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ‘డ్రా’గా ముగించినా అతనికి తగిన క్రెడిట్ దక్కలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సంబంధించి మాత్రం గంభీర్‌ను విజయవంతమైన కోచ్‌గా అంగీకరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోర్నీల్లో జట్టు విజేతగా నిలవడంతో కోచ్‌గా అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్‌కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్ కప్‌లను గెలిపించిన కెప్టెన్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టి20 వరల్డ్‌కప్ గెలిచిన గంభీర్ ఇప్పుడు కోచ్‌గా తన ఖాతాలో మరో ప్రపంచకప్ జమ చేసుకున్నాడు. -
Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు
భారత టీ20 ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్- అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో యాభైకి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జంటగా ప్రపంచ రికార్డు సాధించారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ లేదంటే ఫైనల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్‌తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత ఓపెనర్లు సంజూ- అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి సంజూ 14 బంతుల్లోనే 24, అభిషేక్ శర్మ 10 బంతుల్లోనే 23 పరుగులు సాధించారు.CHETTA POWER! 💪Outrageous six from Sanju Samson as 21 runs came off Matt Henry's over! 🥶ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/LGg4snOIuP— Star Sports (@StarSportsIndia) March 8, 2026దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో 50కి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా భారత స్టార్లు నిలిచారు. ఇక ఆ తర్వాత కూడా సంజూ- అభిషేక్ జోరు కొనసాగించారు. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.Cometh the hour, cometh the man! 😍Abhishek Sharma brings up his fifty in just 18 balls, fastest of the tournament! 💪ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/mcmGhlxJxe— Star Sports (@StarSportsIndia) March 8, 2026మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపిన అభిషేక్.. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో టిమ్ సీఫర్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సంజూతో కలిసి అభిషేక్ తొలి వికెట్‌కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించాడు.కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా పాకిస్తాన్ స్టార్లు కమ్రాన్ అక్మల్- షాజైబ్ హసన్ రికార్డు సాధించాడు. వీరు 2009లో లార్డ్స్ వేదికగా శ్రీలంక మీద 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా వీరి రికార్డును బద్దలు కొడుతూ సంజూ- అభిషేక్ శర్మ కలిసి కేవలం నాలుగు ఓవర్లలోనే 51 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. -
ఫైనల్లో అభిషేక్ శర్మ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక మ్యాచ్‌లో తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తన పేలవ ఫామ్‌కు చెక్ పెడుతూ కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.నరేంద్ర మోడీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ నాకౌట్స్ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన ప్లేయర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఇదే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో 19 బంతుల్లో ఆర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో వీరిద్దరిని అభిషేక్ అధిగమించాడు.ఓవరాల్‌గా 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ స్కోర్ కేవలం 7 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ దాటింది.🚨 ABHISHEK SHARMA SELECTION UNDER QUESTION 🚨Fans said – “Why is GG wasting a spot for this blind slogger?”Management said – Abhishek has only 89 runs in 7 matches with 3 ducks, but we won’t change the winning combination for the Final! 🤯pic.twitter.com/05OFSZf4PT— Sam (@Cricsam01) March 7, 2026 -
సంజూ మాట!.. కోహ్లి మాదిరే విశ్వరూపం చూపిస్తాడా!
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేక కిందామీదా పడింది టీమ్ ఇండియా. ముంబై వేదికగా గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓవరాల్‌గా నాలుగోసారి, వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే, జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.వాస్తవానికి అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఓ పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతడు కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అభిషేక్.. కనీసం ఖాతా తెరవకుండానే డకౌటయ్యి వెనుదిరగడం గమనార్హం. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై మళ్ళీ విఫలమయ్యాడు. దీంతో ఫైనల్లో అభిషేక్ ప్లేస్‌లో ఫినిషర్ రింకూ సింగ్‌నైనా టీమ్‌లోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమవుతుందన్న వాదన వినిపిస్తోంది.అయితే.. అభిషేక్ ఫామ్ లేమిపై సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ఫైనల్లో అభిషేక్ దుమ్మురేపుతాడేమోనని అన్నాడు. కాగా.. గత టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గత వరల్డ్‌కప్‌లో ఇలానే వరుస ఫెయిల్యూర్లతో ఆందోళన రేకెత్తించాడు. చివరికి సెమీస్‌లోనూ రాణించలేకపోయాడు.ఆ సమయంలో అప్పటి కెప్టెన్‌గా ఉన్న రోహిత్ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశాడు. కోహ్లీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ అన్నట్టే కోహ్లీ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజృంభించాడు. ఆసక్తికరంగా ఫైనల్లో అంతా విఫలమవగా కోహ్లీ ఒక్కడే ఆదుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.దీంతో ఇప్పుడు సంజూ అన్నట్టు.. ఈసారి అభిషేక్ కూడా ఫైనల్లో విశ్వరూపం చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే జరిగితే అంతకంటే సంతోషం ఉండదు. చూడాలి మరి అభిషేక్ శర్మ అభిమానులతో పాటు యాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటాడో లేదో!! -
ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?
-
IND vs NZ: అభిషేక్ శర్మ వద్దు.. అతడిని ఆడించండి!
న్యూజిలాండ్‌తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్‌కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.విశ్రాంతినివ్వాలి‘‘అభిషేక్ శర్మకు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్‌లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.టీమిండియాతో సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్.. ఫామ్‌లో లేని బ్రాండన్ కింగ్‌కు బదులు.. రోస్టన్ ఛేజ్‌ను ఓపెనర్‌గా ఆడించింది. బ్రాండన్‌రు ఐదు- ఆరు మ్యాచ్‌లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్ అయినా సరే అతడికి బ్రేక్ ఇచ్చారు.టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్‌లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.రింకూను ఆడించండిటెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.అవును.. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్‌ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు. సంజూతో పోలిక వద్దుఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఫైనల్లో అభిషేక్ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
T20 WC Final: ఆ ఇద్దరిపై వేటు!.. అతడికి చోటు?
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల, బౌలర్ల జాబితాలో అగ్రస్థానం టీమిండియా ఆటగాళ్లదే. ఓపెనింగ్ స్టార్ అభిషేక్ శర్మ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్, వరుణ్ స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ దారుణమైన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 89.ఏకంగా 64 పరుగులుమరోవైపు.. వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఆరంభ మ్యాచ్‌లలో రాణించినా.. కీలక నాకౌట్ దశలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 64 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్ కూల్చాడు.ఆ ఇద్దరిపై వేటు వేయాలి!ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి వరుణ్ 8.85 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఫైనల్ నేపథ్యంలో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలపై వేటు వేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.ముఖ్యంగా వరుణ్‌ను తప్పించి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశం గురించి స్పందించాడు.నలుగురు విఫలమైనా.. ‘‘ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్న. అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఎందుకు కొనసాగించవచ్చో చెబుతాను. మనకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. మరీ గ్రహచారం బాగాలేకపోతే నలుగురు విఫలమైనా.. మరో నలుగురు పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది.బౌలర్లలో ఒక్కరు విఫలమైనా..అభిషేక్ శర్మ పరుగులు చేయకుండానే టీమిండియా ఫైనల్ వరకూ వచ్చింది. అయితే, బౌలర్ ఒక్క ఓవర్లో విఫలమైనా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఐదుగురు బౌలర్లలో ఒక్కరు చెడ్డగా ఆడినా అంతే సంగతులు.ఇన్నింగ్స్‌లో ఓ బౌలర్‌కు 20 శాతం బౌలింగ్ కోటా ఉంటుంది. నిజానికి గత మ్యాచ్‌లో వరుణ్ పేలవంగా ఆడాడు. అందుకే కుల్దీప్ను తీసుకురావాలనే ఆలోచన రావొచ్చు. అనుభవజ్ఞుడైన లెఫ్టార్మ్ స్పిన్నర్ అందుబాటులో ఉంటే బాగుంటుంది.నేను మాత్రం ఆ ఇద్దరినీ కొనసాగిస్తాఅయితే, నేను మాత్రం తుదిజట్టును ఎంపిక చేసే స్థానంలో ఉంటే.. వరుణ్ చక్రవర్తినే కొనసాగిస్తా. అతడితో పాటు అభిషేక్ శర్మనూ కొనసాగిస్తా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌లో తుదిజట్టులో మార్పులు అంతగా మంచిది కాదని.. తమదైన రోజున చెలరేగే సత్తా ఉన్న అభిషేక్, వరుణ్ వంటి స్టార్లపై వేటు వేయడం తగదని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్‌కు షెడ్యూల్ ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్ శర్మపై అశ్విన్ ఆగ్రహం
అభిషేక్ శర్మ.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడి డకౌట్ అయినా యాజమాన్యం అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్‌గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తేలిపోయాడు. తొందరపడి వికెట్ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్మరో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ ఓపెనింగ్ బ్యాటర్ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‘‘ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి అభిషేక్ గేమ్‌ప్లాన్‌కు నేను వీరాభిమానిని. విల్ జాక్స్ బౌలింగ్‌లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్‌ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్ తీసి మరో ఎండ్‌కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్ అభిషేక్‌పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్‌తో ఫైనల్ నేపథ్యంలో.. ‘‘అభిషేక్ మంచి బ్యాటర్. న్యూజిలాండ్‌తో ఇటీవలి సిరీస్‌లో సూపర్ ఫామ్ కనబరిచాడు. మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్, హెడ్‌కోచ్ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్మెంట్ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. అభిషేక్ కోసం లెగ్‌సైడ్‌లో ఒకే ఒక్క ఫీల్డర్‌ను ఉంచాడు. అతడికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రంచకప్-2026 ఫైనల్‌కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
T20 WC 2026 Final: అభిషేక్‌పై వేటు పడుతుందా..?
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడతుంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఎన్ని అవకాశాలు ఇచ్చినా గాడిలో పడలేకపోవడంతో యావత్ భారతం ఆందోళన చెందుతుంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్లైన అతను.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో జరిగిన కీలక సమరాల్లోనూ చేతులెత్తేశాడు. టోర్నీ మొత్తంలో జింబాబ్వే మ్యాచ్ మినహాయించి ఒక్క మ్యాచ్‌లో కూడా కనీస ప్రదర్శనలు చేయలేకపోయాడు. మొత్తంగా 7 ఇన్నింగ్స్‌ల్లో 12.71 సగటున 89 పరుగులు మాత్రమే చేశాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో మార్చి 8న న్యూజిలాండ్‌తో జరుగబోయే ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్‌కు ఆడించాలా వద్దా అన్న చర్చ భారత క్రికెట్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతుంది. మేనేజ్మెంట్ అభిషేక్‌ను వెనకేసుకొస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత దేశ పరువు సమస్య కాబట్టి, ఛాన్స్‌లు తీసుకోవద్దని సూచిస్తున్నారు.క్లిష్ట సమయంలో మేనేజ్మెంట్తో పాటు సహచరులు, కోచ్ గౌతమ్ గంభీర్ అభిషేక్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. భారత జట్టు అభిషేక్‌పై నమ్మకం కోల్పోలేదని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా పాజిటివ్‌గా ఉంది. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమే అని వెనకేసుకొచ్చాడు. ఒకట్రెండు మంచి షాట్లు ఆడితే ఫామ్ తిరిగి వస్తుంది. ఫైనల్ అతని రోజు కావచ్చని సహచరుడికి పూర్తి స్థాయి మద్దతు తెలిపాడు.వాస్తవానికి అభిషేక్ వరుస వైఫల్యాలకు అతనిపై ఉన్న అధిక అంచనాలే కారణమని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి అధికం కావడం వల్ల అభిషేక్ తడబడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు. అతనికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే సత్ఫలితాలు రావచ్చని అంటున్నారు. పరుగులు రాబట్టేందుకు కష్టపడుతున్న మాట కూడా వాస్తమే అయినప్పటికీ.. ఒక్కసారి లైన్లోకి వచ్చాడంటే, అతన్ని ఆడపం కష్టమని అంటున్నారు. ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో లోపాలు సరిదిద్దుకుంటే రాణించగలడని అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, కీలకమైన ఫైనల్లో రాణిస్తే మాత్రం అభిషేక్ భారత క్రికెట్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాడు.ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్ ప్రదర్శనలు..యూఎస్ఏపై 0 (1)నమీబియాపై ఆడలేదుపాకిస్తాన్పై 0 (4)నెదర్లాండ్స్‌పై 0 (3)సౌతాఫ్రికాపై 15 (12 బంతులు; 2 ఫోర్లు, సిక్స్)జింబాబ్వేపై 55 (30 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)వెస్టిండీస్‌పై 10 (11 బంతులు; 2 ఫోర్లు)ఇంగ్లండ్‌పై 9 (7 బంతులు; 2 ఫోర్లు)కాగా, టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్‌కు చేరాయి. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను.. భారత్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ సమరం మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ పేలవ ఆట తీరుతో తేలిపోయాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా అభిమానులు సైతం అభిషేక్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026 ఆరంభం నుంచి అభిషేక్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ డకౌట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్-8 దశలో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పదిహేను పరుగులకే పెవిలియన్ చేరిన అభిషేక్.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకంతో రాణించాడు.పాత కథే పునరావృతంఅయితే, సూపర్-8లో కీలకమైన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మరోసారి తేలిపోయాడు అభిషేక్ శర్మ. పట్టుమని పది పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్లో అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, యాజమాన్యం మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. అతడు పాత కథనే పునరావృతం చేశాడు.తొమ్మిది పరుగులే చేసిముంబై వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఏడు బంతుల్లో రెండు ఫోర్లు బాది కేవలం తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఓవర్లో విల్ జాక్స్ బంతితో రంగంలోకి దిగి ఆఖర్లో స్లోబాల్ వేశాడు. ఈ క్రమంలో భారీ షాట్‌కు యత్నించిన అభిషేక్.. బంతిని గాల్లోకి లేపగా డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫిల్ సాల్ట్ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. మరోసారి ఆఫ్ స్పిన్నర్ చేతికి చిక్కి నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు అభిషేక్ శర్మ ఈ టోర్నీలో చేసిన పరుగులు 89. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా అభిమానులు అభిషేక్‌పై భగ్గుమంటున్నారు. ‘‘ నువ్విక మారవా?.. అతడిని జట్టు నుంచి తీసేయండి’’ అని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట -
IND vs ENG: అభిషేక్ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొంతకాలంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అతడి వైఫల్యాలే ఇందుకు కారణం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కెరీర్లో తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్నాడు.మూడు డకౌట్లువిధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ బరిలోకి దిగాడు. అయితే, ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 80.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్‌కు ముందు భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుస వైఫల్యాల కారణంగా అతడు మానసికంగా కాస్త కుంగిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. అలాంటపుడు తుదిజట్టు నుంచి అభిషేక్ శర్మను తప్పించడమే సరైన నిర్ణయమని పేర్కొన్నాడు.అదొక్క మార్పు సరిపోతుందిఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘నెట్స్‌లో బ్యాటింగ్ తీరును చూసి అంచనాకు రాకూడదు. అతడితో ప్రత్యేకంగా మాట్లాడాలి. మానసికంగా అతడు ఎంత దృఢంగా ఉన్నాడో తెలుసుకోవాలి.ఒకవేళ అభిషేక్ శర్మను కొనసాగించకూడదని అనుకుంటే.. ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించాలి. లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్‌ను తీసుకువస్తే సరి. సెమీ ఫైనల్లో తుదజట్టులో అదొక్క మార్పు సరిపోతుంది.అయితే, అభిషేక్ శర్మ గత సిరీస్‌లో ఇంగ్లండ్ మీద అదరగొట్టిన తీరును మర్చిపోకూడదు. వాంఖడేలో గతంలో అతడి ప్రదర్శన అద్భుతం. అక్కడ అతడు భారీ, వేగవంతమైన శతకాలు బాదాడు. కాబట్టి అభిషేక్ శర్మను కొనసాగిస్తే బాగుంటుందనీ అనుకుంటున్నాను ఒకవేళ రింకూను తీసుకురావాలని అనుకుంటే మాత్రం ఓపెనింగ్ జోడీ మారక తప్పదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌పై ఇరగదీసిన అభిషేక్కాగా గతేడాది వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం వేదికగా భారత్- ఇంగ్లండ్ సెమీ ఫైనల్లో తలపడేందుకు రంగం సిద్ధమైంది.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
బ్యాటింగ్ చేయడు.. చెత్త ఫీల్డింగ్: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆట తీరుపై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ చేసిన పరుగులు 80. ఇందులో మూడు డకౌట్లు.. ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి.సూపర్-8 దశలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్‌కు ముందు భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆట తీరుపై మండిపడ్డాడు. నిర్లక్ష్యంగా ఆడితే.. తుదిజట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ..తక్కువ సమయంలోనే సూపర్ స్టార్‌గా‘‘వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే చెత్త షాట్లతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతి తక్కువ సమయంలోనే అభిషేక్ శర్మ సూపర్ స్టార్ అయ్యాడు. భవిష్యత్తులోనూ సూపర్‌స్టార్‌గా కొనసాగాలంటే జట్టుకు విజయాలు అందించాలి.భారత జట్టులో చోటు కోసం ఎంతో మంది పోటీపడుతున్నారు. ఎంతో మంది మ్యాచ్ విన్నర్లుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. వాళ్లందరినీ దాటి జట్టులో కొనసాగాలంటే మెరుగ్గా ఆడాలి. బ్యాటింగ్ చేయడు.. చెత్త ఫీల్డింగ్వెస్టిండీస్తో మ్యాచ్‌లో అతడు బ్యాట్ ఝులిపించాల్సింది. అంతేకాదు రెండు క్యాచ్‌లు జారవిడిచి.. చెత్త ఫీల్డింగ్‌తోనూ నిరాశపరిచాడు. అతడి మైండ్‌సెట్ ఇప్పటికైనా మారాలి’’ అని మనోజ్ తివారి అభిషేక్ శర్మ ఆట తీరును విమర్శించాడు. మరోవైపు.. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం అభిషేక్ ఫామ్‌లేమిపై ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న ఈ టీమిండియా ఓపెనర్ ఆటపై అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
Abhishek Sharma: పరుగులు చేయకుంటే.. అవుటైపో!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. గ్రూప్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లతో మ్యాచ్‌లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ డకౌట్ అయ్యాడు. ఇక నమీబియాతో మ్యాచ్‌కు అనారోగ్యం వల్ల దూరం అయ్యాడు.జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రంఅనంతరం సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో పోరులోనూ అభిషేక్ (Abhishek Sharma) విఫలమయ్యాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకం (30 బంతుల్లో 55) చేయగలిగాడు. అయితే, తాజాగా వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌లో మాత్రం మరోసారి అభిషేక్ తేలిపోయాడు.అవుటైపోవడం బెటర్‌ఈ ఓపెనింగ్ బ్యాటర్ 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేసి నిష్క్రమించాడు. అకీల్ హొసేన్ బౌలింగ్‌లో షిమ్రన్ హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అభిషేక్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్ ఎంత వేగంగా ఆడితే అంత మంచింది.తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. అయితే, విండీస్‌తో మ్యాచ్‌లో అభిషేక్ ఆ పని చేయలేకపోయాడు. ఒకవేళ పరుగులు రాబట్టడంలో విఫలమైతే అవుటైపోవడం బెటర్. టీ20 క్రికెట్లో ఇది కీలకం.పవర్‌ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడుపరుగులు తీయలేక ఇబ్బంది పడుతున్న బ్యాటర్ అవుటైతే వేరొకరికి అవకాశం వస్తుంది. నిజానికి వెస్టిండీస్ ఓపెనర్ షాయీ హోప్ ఈ నియమాన్ని పాటించకుండా పవర్ ప్లేలో మొత్తం క్రీజులో ఉండి జట్టును వెనుకపడేశాడు. పవర్‌ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడు.ఇక అభిషేక్ శర్మ తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులే చేసి.. ఆ తర్వాత మరీ వెనుకబడ్డాడు. ఆ వెంటనే అవుటైపోయాడు. జట్టు ప్రయోజనాల కోసం అతడు రిస్క్ తీసుకునే సాహసం చేయలేదు’’ అని అభిషేక్ నాయర్.. అభిషేక్ శర్మ ఆట తీరును విశ్లేషించాడు.కాగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సంజూ శాంసన్ (50 బంతుల్లో 97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే.. విండీస్ కెప్టెన్, ఓపెనర్ షాయీ హోప్ 33 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతడి స్లో బ్యాటింగ్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌లో విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. భారత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
సంజూది చెత్త టెక్నిక్.. కోచ్‌ల మాట వినడు: భారత మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ తర్వాత భారత ఓపెనింగ్ జోడీ మారిపోయింది. వరుస వైఫల్యాల కారణంగా సంజూ శాంసన్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్‌గా స్థానం కోల్పోయాడు. కివీస్‌తో సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చి అదరగొట్టిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. అభిషేక్ శర్మకు జోడీగా సంజూ స్థానాన్ని భర్తీ చేశాడు.రెండో అవకాశంఅయితే, నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ (Abhishek Sharma) అనారోగ్యం కారణంగా దూరం కాగా.. సంజూకు ఇషాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో అతడు 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితమైన సంజూ (Sanju Samson).. సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.ఘనంగా ఆరంభించిచెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో సంజూ 15 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, రెండు సిక్స్‌లు బాది 24 పరుగులు చేశాడు. అయితే, బ్లెసింగ్స్ ముజర్బానీ బౌలింగ్‌లో షార్ట్ బంతిని తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సంజూ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.ఈ నేపథ్యంలో మరోసారి సంజూ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ అభిమానులు సైతం విమర్శించారు. భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా ఇదే మాట అంటున్నాడు. సంజూ టెక్నిక్ తప్పుగా ఉందని.. ఇప్పటికైనా పొరపాటు సరిచేసుకోవాలని సూచించాడు.మరోసారి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు‘‘చెపాక్‌లో సంజూను ఆడించడం వల్ల చెన్నై ప్రేక్షకులు సంతోషించారు. అందుకు తగ్గట్లుగానే అతడు మంచి ఆరంభమే అందుకున్నాడు. కానీ మరోసారి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు.లెగ్ సైడ్ దిశగా వచ్చిన బంతిని ఆడేందుకు పక్కకు జరిగి మూల్యం చెల్లించాడు. మూడు స్టంప్స్‌ను ప్రత్యర్థి బౌలర్‌కు చూపి ఈజీ టార్గెట్ అయ్యాడు. క్రికెట్లో ఓనమాలు దిద్దినపుడే ప్రతి ఆటగాడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. మూడు స్టంప్స్ బౌలర్‌కు కనిపించేలా ఎప్పుడూ ఓ బ్యాటర్ ఎప్పుడూ తప్పు చేయకూడదు.కోచ్‌ల మాట వింటాడో లేదో!అలా చేయడం ప్రాథమిక తప్పిదం. అసలు అతడు కోచ్‌ల మాట వింటాడో లేదో నాకు తెలియదు. నిజానికి టీమిండియాలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత కోచ్ ఉన్నాడు. కాబట్టి అతడు ఎవరి మాట విని ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. టెక్నికే తప్పుగా ఉంటే.. ఆటలో ఇంకేం ముందుకు వెళ్లగలవు?.. ఈ టోర్నీలో అతడు టెక్నిక్ సరి చేసుకోవడం కష్టమే అనిపిస్తోంది’’ అంటూ ఘాటుగా సంజూను విమర్శించాడు బద్రీనాథ్.కాగా కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ గత ఏడాది కాలంగా భారత టీ20 ఓపెనర్‌గా రాణించాడు. అయితే, ఇటీవలి కాలంలో అతడు ఫామ్ కోల్పోయాడు. కివీస్‌తో సిరీస్‌లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. గత కొంతకాలంగా అతడు షార్ట్ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుట్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బద్రీనాథ్ సంజూ టెక్నిక్ సరిగ్గా లేదంటూ చివాట్టు పెట్టాడు.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
అభిషేక్ డిఫెన్స్ ఆశ్చర్యపరిచింది
న్యూఢిల్లీ: డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ డిఫెన్స్ ఆటతీరు తనను ఆశ్చర్యపరిచిందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నారు. మొత్తానికి జట్టుకు ఉపయోగపడే అర్ధసెంచరీతో విమర్శకుల నోళ్లకు తాళం వేశాడని కితాబిచ్చారు. లీగ్‌లో అసలు ఖాతానే తెరువలేకపోయిన అభిషేక్ ఎట్టకేలకు సూపర్–8లో దక్షిణాఫ్రికాతో 15 పరుగులు చేయగలిగాడు. ‘హిట్టర్‌గా అభిషేక్ ఎలాంటి ఆట ఆడతాడో మనందరికి తెలుసు. జింబాబ్వేపై మ్యాచ్‌లో మెరుపు ఫిఫ్టీతో తన ప్రదర్శనపై లేవనెత్తుతున్న సందేహాలకు చెక్ పెట్టాడు. కుదురుగా ఆడేందుకు కాస్త సమయం తీసుకున్నప్పటికీ... ఆడేకొద్ది తన శైలి బ్యాటింగ్‌కు మారాడు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లను గుడ్డిగా ఎదుర్కోకుండా గౌరవించిన తీరు, అనవసర రిస్క్ తీసుకోకుండా తన పరుగుల పనిలో నిమగ్నమైన ఆటతీరు నన్ను బాగా ఆకట్టుకుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో డిఫెన్స్ షాట్లను ఆడటం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆడేది అభిషేకేనా అని అనిపించింది. నేర్చుకోవడం అంటే ఇదే! వైఫల్యాల్ని అధిగమించిన ప్రదర్శన నాకు ముచ్చటేసింది’ అని సన్నీ... అభిషేక్ ఆటను ప్రశంసించారు. సంజూ సామ్సన్తో ఓపెనింగ్ చేయించి లెఫ్ట్–రైట్ బ్యాటింగ్ కాంబినేషన్‌తో దిగడం మంచి ఎత్తుగడగా గావస్కర్ అభివర్ణించారు. అయితే వెస్టిండీస్‌తో ఎదురయ్యే సవాల్ భిన్నంగా ఉంటుందని, ఆదివారం జరిగే సూపర్–8 పోరు అంత ఆషామాషీగా ఉండదని సన్నీ టీమిండియాను జాగ్రత్త పరిచారు. -
T20 WC 2026, IND VS ZIM: అభిషేక్ ఖాతాలో అనవసర రికార్డు
టీ20 ప్రపంచకప్ 2026లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. అంచనాలను తల్లకిందులు చేస్తూ హ్యాట్రిక్ డకౌట్లు సహా నాలుగో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్‌కే (15) ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో నిన్నటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్‌కు ముందు అభిషేక్‌పై భారీ ఒత్తిడి ఉండింది. అయితే ఈసారి అతను ఒత్తిడిని అధిగమించి 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసినా, ఓ అనవసర రికార్డు మూటగట్టుకున్నాడు. అభిషేక్‌కు ఇది తన టీ20 కెరీర్లో రెండో నిదానమైన (బంతుల పరంగా) హాఫ్ సెంచరీగా నిలిచింది. అభిషేక్ కెరీర్లో అత్యంత నిదానమైన హాఫ్ సెంచరీ కూడా జింబాబ్వేపైనే రావడం విశేషం. 2024లో హరారే వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 33 బంతులు తీసుకున్నాడు. వాస్తవానికి సాధారణ ప్లేయర్లకు 26 బంతుల్లో అర్ద శతకం అంటే చాలా పెద్ద అఛీవ్మెంట్. అయితే అభిషేక్ లాంటి విధ్వంసకర ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాడికి మాత్రం ఇది అనవసర రికార్డుగా మిగిలిపోయింది.తాజా ప్రదర్శనలతో అభిషేక్ మరో ఘనత కూడా సాధించాడు. భారత ఓపెనర్లలో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధవన్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. శిఖర్, అభిషేక్ తమ టీ20 కెరీర్లలో 11 సార్లు ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (32 ఫిఫ్టి ప్లస్), కేఎల్ రాహుల్ (21) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. పై జాబితాలోని ఆటగాళ్లలో అభిషేకే అతి తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అతని కెరీర్ ఇంకా ఆరంభ దశలోనే ఉండటంతో రోహిత్ శర్మను కిందకు దించి ఈ విభాగంలో టాప్ ప్లేస్‌కు చేరే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ సహా జట్టులోని ప్రతి ఒక్క బ్యాటర్ సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ 55, సంజూ శాంసన్ 24, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33, హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 నాటౌట్ పరుగులు చేశారు. భారత ఇన్నింగ్స్ మొత్తంలో 17 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఇది కూడా ఓ ప్రపంచకప్ రికార్డు.అనంతరం ఛేదనలో జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (97 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా, తన జట్టును విజయతీరాలు దాటించలేకపోయాడు. కెప్టెన్ సికందర్ రజా (31) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. అంతిమంగా జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 184 పరుగులకే పరిమితమై 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో అర్షదీప్ 3, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డై మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా, మ్యాచ్ రద్దైనా విండీస్‌కే సెమీస్ బెర్త్ దక్కుతుంది. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. -
IND vs ZIM: వెస్టిండీస్‌పై గెలిస్తే సెమీఫైనల్‌కు..
భారత జట్టు తమ కసినంతా జింబాబ్వేపై చూపించింది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన టీమిండియా తర్వాతి పోరులో విధ్వంసకర రీతిలో నష్టనివారణ చేసింది. సామ్సన్ శుభారంభం అందిస్తే, అభిషేక్ శర్మ ఫామ్‌లోకి వచ్చి దూకుడుగా ఆడాడు. మధ్యలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ తమదైన శైలిలో ధాటిని ప్రదర్శిస్తే చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇలా భారత బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి సిక్సర్లతో విరుచుకుపడటంతో జింబాబ్వే బెంబేలెత్తిపోయింది. ఆ జట్టు బౌలర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా రికార్డు స్కోరు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఛేదనలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్‌ను ముగించింది. ఇక నెట్‌రన్‌రేట్ వంటి గందరగోళపు లెక్కలు అవసరం లేకుండా నాకౌట్ పంచ్ మిగిలింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే చివరి పోరులో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిపోతే నిష్క్రమిస్తుంది. చెన్నై: టి20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా గురువారం జరిగిన ‘గ్రూప్–1’ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తాజా ఫలితంతో జింబాబ్వే సెమీస్ చేరే అవకాశాలు ముగిసిపోయాయి. ఎంఎ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. పాండ్యా, తిలక్ ఐదో వికెట్‌కు 31 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ (59 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం మినహా అంతా విఫలమయ్యారు. పోటీ పడి పరుగులు... ఇన్నింగ్స్ రెండో బంతికే సంజు సామ్సన్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొట్టిన సిక్స్‌తో ఆరంభమైన భారత్ జోరు చివరి వరకు సాగింది. మపోసా వేసిన మూడో ఓవర్లోనే భారత్ 23 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అభిషేక్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు సామ్సన్ ధాటిగా ఆడాడు. సామ్సన్ వెనుదిరిగిన తర్వాత ఇషాన్ అదే వేగాన్ని కొనసాగించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 80 పరుగులు చేసింది. 26 పరుగుల వద్ద ఇషాన్‌కు లైఫ్ లభించగా, 26 బంతుల్లో అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తయింది. రజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కిషన్ తర్వాతి బంతికి అవుటయ్యాడు. కొద్దిసేపటికి అభిషేక్ కూడా పెవిలియన్‌కు చేరాడు. 8 పరుగుల వద్ద ముజరబాని క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ మపోసా ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. తర్వాతి ఓవర్లోనూ వేగంగా ఆడే క్రమంలో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది. 4 ఓవర్లలో 69 పరుగులు... 16 ఓవర్లు ముగిసేసరికి నిస్సహాయంగా మారిపోయిన జింబాబ్వే బౌలర్లపై చివర్లో పాండ్యా, తిలక్ మరింత విరుచుకు పడ్డారు. 17–20 ఓవర్లలో భారత్ వరుసగా 14, 19, 21, 15 పరుగులు రాబట్టింది. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. ఎన్గరవా వేసిన 19వ ఓవర్లో తిలక్ వరుసగా 2 సిక్స్‌లు కొట్టగా, ఇవాన్స్ వేసిన ఆఖరి ఓవర్లో పాండ్యా వరుసగా రెండు భారీ సిక్స్‌లతో ముగించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో పాండ్యా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బ్యాటింగ్‌కి దిగిన ఆరుగురు కనీసం ఒక సిక్స్ బాదగా భారత్ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్ కోసం భారత్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ స్థానాల్లో అక్షర్ పటేల్, సంజు సామ్సన్ జట్టులోకి వచ్చారు. బెన్నెట్ పోరాటం వృథా... భారీ ఛేదనను జింబాబ్వే ఓపెనర్లు బెన్నెట్, మరుమని (20) జాగ్రత్తగా ప్రారంభించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 38 బంతుల్లో 44 పరుగులు జత చేశారు. మరుమని, మైయర్స్ (6) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... బెన్నెట్, సికందర్ రజా (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు ఇన్నింగ్స్ కాస్త సానుకూలంగా కదిలింది. అక్షర్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన బెన్నెట్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత దూబే ఓవర్లో కూడా బెన్నెట్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే మూడో వికెట్‌కు బెన్నెట్‌తో 42 బంతుల్లో 72 పరుగులు జత చేసిన అనంతరం రజా అవుట్ కావడంతో జింబాబ్వే ఆశలు పూర్తిగా కోల్పోయింది. 256/4 టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్‌పై టీమిండియా చేసిన 217 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఓవరాల్‌గా శ్రీలంక 260/6 (కెన్యాపై 2007లో) తర్వాత వరల్డ్ కప్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బర్ల్ (బి) ముజరబాని 24; అభిషేక్ (సి) రజా (బి) మపోసా 55; ఇషాన్ కిషన్ (సి) ఎన్గరవా (బి) రజా 38; సూర్యకుమార్ (సి) ముసెకివా (బి) ఎన్గరవా 33; పాండ్యా (నాటౌట్) 50; తిలక్ (నాటౌట్) 44; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–48, 2–120, 3–150, 4–172. బౌలింగ్: ఎన్గరవా 4–0–62–1, ముజరబాని 4–0–43–1, మపోసా 2–0–40–1, ఇవాన్స్ 4–0–52–0, రజా 3–0–29–1, బెన్నెట్ 2–0–16–0, బర్ల్ 1–0–10–0. జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (నాటౌట్) 97; మరుమని (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 20; మైయర్స్ (సి) తిలక్ (బి) వరుణ్ 6; రజా (సి) అభిషేక్ (బి) అర్‡్షదీప్ 31; బర్ల్ (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మున్యోంగా (బి) అర్‡్షదీప్ 11; ముసెకివా (సి) సామ్సన్ (బి) దూబే 7; ఇవాన్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–44, 2–72, 3–144, 4–144, 5–162, 6–173. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–24–3, పాండ్యా 3–0–21–0, బుమ్రా 3–0–21–0, వరుణ్ 4–0–35–1, అక్షర్ 4–0–35–1, దూబే 2–0–46–1. గెలిచే జట్టు సెమీస్‌కు... జింబాబ్వేపై భారత్ విజయంతో ‘గ్రూప్–1’ నుంచి సెమీఫైనల్ చేరే జట్ల విషయంలో స్పష్టత వచ్చింది. రెండు విజయాలతో దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ సెమీస్ స్థానం ఖాయం చేసుకోగా, జింబాబ్వేతో ఆ జట్టు ఆడే మ్యాచ్ నామమాత్రమే. మరోవైపు జింబాబ్వేపై నెగ్గి, దక్షిణాఫ్రికా చేతిలోనే ఓడిన భారత్, వెస్టిండీస్ ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య ఆదివారం కోల్‌కతాలో జరిగే మ్యాచ్ క్వార్టర్ ఫైనల్‌లాంటిది. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారికి ఎలాంటి సమీకరణాలు, రన్రేట్లతో సంబంధం లేకుండా సెమీస్‌లో చోటు ఖాయమవుతుంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో ఆ్రస్టేలియా, శ్రీలంకలను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే ‘సూపర్ ఎయిట్స్’లో వెస్టిండీస్, భారత్‌లకు 254, 256 పరుగులు ఇచ్చి ఓటములను ఆహ్వానించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్‌లో నేడుఇంగ్లండ్ X న్యూజిలాండ్ వేదిక: కొలంబో, రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా.. స్ట్రైక్‌రేటు పరంగా అత్యంత అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ సేన ఈ ఫీట్ నమోదు చేసింది.మెరుపులుచెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ ఓడిన టీమిండియా.. జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా తిరిగి వచ్చిన సంజూ శాంసన్ (Sanju Samson) 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు 160. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి.. 183కు పైగా స్ట్రైక్‌రేటుతో 55 పరుగులు సాధించాడు.వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేయగా.. స్ట్రైక్‌రేటు 158.33గా నమోదైంది. మరోవైపు.. ధనాధన్ దంచికొట్టిన కెప్టెన్ సూర్యకుమార్ 13 బంతుల్లో 253కు పైగా స్ట్రైక్‌రేటుతో 33 పరుగులు రాబట్టాడు.𝙈𝙖𝙥𝙤𝙨𝙖 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙡𝙡, 𝙎𝙆𝙔 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙧𝙩𝙝𝙚𝙧. 🚀Total control from Suryakumar Yadav as he steers India forward!ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/QZBUsVXD6e— Star Sports (@StarSportsIndia) February 26, 2026అతడి స్ట్రైక్‌రేటు 275ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుని.. 217కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేయగా.. తిలక్ వర్మ 16 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 275గా ఉండటం విశేషం. హార్దిక్, తిలక్ ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టపోయి.. 256 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది.టీమిండియా ప్రపంచ రికార్డుఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డు సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో... ఓ జట్టులోని ఆరుగురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్‌రేటుతో.. ఇరవైకి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, కెప్టెన్ సికందర్ రజా, టినోటెండా మపోసా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకికాగా మొదటిసారి 2007లో ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా.. 2024లో రెండోసారి టైటిల్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ లీగ్ దశలో సత్తా చాటింది. అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.అయితే, సూపర్-8 తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో పాటు తదుపరి వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలిస్తేనే సూర్యసేనకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్! -
IND vs ZIM: హార్దిక్, తిలక్ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు
జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించింది. బ్యాటర్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక గెలవాల్సిన పరిస్థితి.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీఇలాంటి దశలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (24) నిరాశపరచగా.. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55) చాన్నాళ్ల తర్వాత బ్యాట్ ఝులిపించాడు. అభి అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) 24 బంతుల్లో 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.హార్దిక్, తిలక్ విధ్వంసంకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు (13 బంతుల్లో 33) మెరిపించగా.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya), తిలక్ వర్మ దంచికొట్టారు. హార్దిక్ 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులతో అజేయంగా నిలవగా.. తిలక్ వర్మ 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హార్దిక్ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్ సికందర్ రజా తలా ఒక వికెట్ పడగొట్టారు.రికార్డు స్కోరుకాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగానూ భారత్ నిలిచింది. తాజాగా భారత్ జింబాబ్వేతో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 2007లో శ్రీలంక కెన్యా మీద ఆరు వికెట్ల నష్టానికి 260 రన్స్ రాబట్టింది.చదవండి: T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత.. ఎట్టకేలకు
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్‌లో ఈ లెఫ్టాండర్ బ్యాట్ ఝులిపించాడు. ఇరవై ఆరు బంతుల్లోనే అర్ధ శతకం బాది సత్తా చాటాడు.ఆది నుంచి దారుణంగా విఫలంటీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్ శర్మ ఆది నుంచి దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ తర్వాత కడుపు నొప్పి వల్ల నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూఅనంతరం జట్టులోకి తిరిగి వచ్చిన అభిషేక్ శర్మ పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లతో మ్యాచ్‌లలోనూ డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం జట్టులో కొనసాగించగా.. సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.దీంతో అభిషేక్ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తుదిజట్టు నుంచి తప్పించి.. అతడికి కాస్త బ్రేక్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.A well-constructed half-century for #AbhishekSharma! 👏His first in the ICC Men’s T20 World Cup and what an occasion to bring it up! 💙ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/vIVUWHYhSe— Star Sports (@StarSportsIndia) February 26, 2026అర్ధ శతకంతోజింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ.. ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా కెరీర్లో తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్‌కు.. ఐసీసీ ఈవెంట్లో ఇదే తొలి ఫిఫ్టీ కావడం విశేషం. అయితే, మపోసా బౌలింగ్‌లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 16, తిలక్ వర్మ 11 పరుగులతో క్రీజులో నిలిచారు. ఓపెనర్ సంజూ శాంసన్ 24, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 38 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య 13 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు సంజూ శాంసన్. నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరం కావడంతో.. ఓపెనర్‌గా అతడి స్థానంలో వచ్చాడు. పసికూనతో మ్యాచ్‌లో ఎనిమిది బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) మెరుగ్గా ఆడగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం అతడిని కొనసాగించింది. సంజూను బెంచ్‌కు పరిమితం చేసింది.మరో అవకాశంఅయితే, తాజాగా జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్ సందర్భంగా మరోసారి సంజూ శాంసన్‌కు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లెఫ్టాండర్ అభిషేక్ శర్మతో కలిసి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గురువారం భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభించాడు. 𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026ఘనంగానే ఆరంభించాడు.. కానీఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్ బాది ఘనంగా ఆరంభించాడు సంజూ. రెండో ఓవర్లోనూ ఓ సిక్సర్ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ రాబట్టాడు. ఇలా మంచి ఫామ్‌లోకి వచ్చిన సంజూ.. నాలుగో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.బ్లెసింగ్ ముజర్బానీ సంధించిన షార్ట్ బాల్‌ను సంజూ గాల్లోకి లేపగా.. డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చి ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా సంజూ శాంసన్ పెవిలిన్ చేరగా.. భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మారవా సంజూ!జింబాబ్వేతో మ్యాచ్‌లో మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాది 24 పరుగులు చేయగలిగాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిమానులు ఉసూరుమంటున్నారు.ఇక తుదిజట్టులో సంజూను చూడటం కష్టమేనని వాపోతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సంజూ వరుసగా విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్ భర్తీ చేశాడు. ఇక జింబాబ్వేతో మ్యాచ్‌తో సంజూ తిరిగి రాగా.. ఇషాన్ వన్‌డౌన్‌లో దిగాడు. పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 80-1(6). ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి ఇషాన్ 15, అభిషేక్ శర్మ 33 పరుగులతో క్రీజులో నిలిచారు. చెన్నై వేదికగా టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్! -
అతడికి బ్రేక్ ఇవ్వండి.. సంజూను జట్టులోకి తీసుకోండి: వీరేంద్ర సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే సూర్య సేన కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచన చేశాడు. ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మను తప్పించి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీలో అభిషేక్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు డకౌట్లు ఉండడం గమనార్హం. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు."నేను గనుక టీమ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఉంటే, అభిషేక్‌కు విశ్రాంతి ఇచ్చే వాడిని. అతడి స్ధానంలో సంజూ శాంసన్‌ను అవకాశమిస్తాను. ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఈ మ్యాచ్‌లోనే చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే, టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. ఇది చాలా కీలకమైన మ్యాచ్. కాబట్టి ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా భా తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలి.తుది జట్టు ఎంపికలో మార్పులు కచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. భారత్ సరైన వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశముంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇద్దరూ మంచి ఫామ్‌లో లేరన్న విషయం మెనెజ్‌మెంట్ గుర్తుంచుకోవాలి" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. అతడిపై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధమైంది. సూపర్-8 దశలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఇషాన్ హిట్.. అభిషేక్ ఫ్లాప్‌కాగా ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మలకు అవకాశాలు వస్తుండగా.. సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అయితే వరల్డ్‌కప్ టోర్నీలో ఇషాన్ మెరుగ్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో తొలి మూడు మ్యాచ్‌లలోనూ డకౌట్ అయ్యాడు.ఇక సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో టీమిండియా తలపడగా.. ఈసారి ఇషాన్ డకౌట్ కాగా.. అభిషేక్ 15 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. సంజూ లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్‌లో బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.తిలక్ వర్మపై విమర్శలుఇదిలా ఉంటే.. మూడో స్థానంలో ఆడుతున్న తిలక్ వర్మ ఇప్పటి వరకు పెద్దగా బ్యాట్ ఝులిపించనేలేదు. అతడి స్ట్రైక్‌రేటుపై విమర్శలు వస్తున్నాయి. ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్లు ఇషాన్- అభిషేక్.. వన్‌డౌన్‌లో వచ్చే తిలక్.. ఈ ముగ్గురూ లెఫ్టాండ్ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు, కెప్టెన్‌కు పని సులువు అయిపోతోంది. వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేకుండానే వాళ్లు అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నారు.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసంఇలాంటి తరుణంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా టాపార్డర్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో సంజూ శాంసన్‌ను చేర్చే విషయమై చర్చ నడుస్తోంది.సంజూ వస్తాడని సంకేతంజింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా మార్పులు ఉండవచ్చు. మా ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చే ఆటగాడు కూడా లెఫ్టాండర్ బ్యాటరే కావడం ఇందుకు కారణం. అందుకే ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నాం. అయితే, మ్యాచ్ సమయంలోనే మేము తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కొటక్ తెలిపాడు.ఎవరిపై వేటు?ఒకవేళ సంజూ గనుక తుదిజట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రింకూ సింగ్ స్థానంలో సంజూను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజూను వన్‌డౌన్‌లో ఆడించి.. తిలక్‌ను డిమోట్ చేయడం ఓ ఆప్షన్. అయితే, ఇప్పటికే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినా రింకూ జట్టుతో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కొటక్ తెలిపాడు.రింకూ, తిలక్, అభిషేక్!అంటే రింకూ జింబాబ్వేతో మ్యాచ్ ఆడటం ఖాయమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో రీసెట్ అయ్యేందుకు.. లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ కోసం అతడిని పక్కనపెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. అభిషేక్- ఇషాన్ జోడిని కొనసాగిస్తే.. తిలక్ వర్మపై వేటు వేసి.. సంజూను మూడోస్థానంలోనే ఆడిస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. సితాన్షు కొటక్ చెప్పినట్లు మ్యాచ్ ఆరంభానికి ముందు వరకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం ఈసారి కాస్త కష్టమే అనిపిస్తోంది. కాగా చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడిన భారత తుదిజట్టులో ఏకంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ -
అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం తర్వాత టీమిండియా జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశలో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుదిజట్టు కూర్పు గురించి ముఖ్యంగా.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ల గురించి కొటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.సంజూకు మొండిచేయికాగా ఇషాన్ కిషన్ రాకతో భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా సంజూ శాంసన్ స్థానం గల్లైంతైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ- ఇషాన్ జోడీగా బరిలో దిగారు. అయితే, నమీబియాతో మ్యాచ్‌కు మాత్రం అభిషేక్ గైర్హాజరీలో సంజూ ఓపెనర్‌గా వచ్చాడు.తిలక్ వర్మ ఆట తీరుపై విమర్శలుమరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. అతడి స్ట్రైక్‌రేటు కూడా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌లో తిలక్‌ను తప్పించి సంజూను మూడో స్థానంలో ఆడించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.తిలక్ గురించి బాధ లేదుఈ పరిణామాల నేపథ్యంలో సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి మాకు ఎలాంటి సమస్య లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు చక్కగా ఆడాడు. రెండు, మూడు బౌండరీలు బాదితే అంతా అదే సర్దుకుంటుంది. అతడు బంతులు వృథా చేస్తున్నాడన్న అంశంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు.అభిషేక్ శర్మ గురించి కూడా మేము ఆందోళన చెందడం లేదు. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి గురించి కూడా పెద్దగా ఆందోళన లేదు. తదుపరి మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం మీదే మేము ప్రస్తుతం దృష్టి సారించాము.సంజూ రావొచ్చుప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను అర్థం చేసుకుని.. సరైన జవాబు ఇచ్చే విధంగా మా బ్యాటర్లు సంసిద్ధం అవుతున్నారు. ప్రణాళిక, సన్నాహకాలపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అతడి (సంజూ) గురించి చర్చ నడుస్తోంది. అయితే, మేము ముందుగానే తుదిజట్టును నిర్ణయించబోము. అతడిని ఆడించే ఆలోచన లేదని మాత్రం చెప్పము’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడిన రింకూ సింగ్ బుధవారం సాయంత్రం టీమ్‌తో కలుస్తాడని తెలిపాడు.సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతోఇదిలా ఉంటే.. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై గెలుపొంది అజేయంగా నిలిచింది టీమిండియా. అయితే, సెమీస్ దిశగా అడుగులు వేసే క్రమంలో ఊహించని రీతిలో సూపర్-8 తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓడిపోయింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై నెగ్గితేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: T20 WC 2026: పాక్ జట్టులో కలకలం -
'వరల్డ్‌కప్ ఒక ఫారెస్ట్ లాంటిది.. వారిద్దరి ఆట తీరు మారాలి'
టీ20 వరల్డ్‌కప్-2026లో టీమిండియా యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. అభిషేక్ శర్మ వరుసగా మూడు డకౌట్లు కాగా.. తిలక్ కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఆదివారం అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ 13 పరుగులు చేయగా, తిలక్ డకౌటయ్యాడు. ఇప్పటివరకు తిలక్ ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 21.40 సగటుతో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు.అతని స్ట్రైక్ రేట్ 119 కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై భారత మాజీ క్రికెటర్ సదాగోపన్ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతే ఇటువంటి ఫలితాలే ఎదురవతాయని అతడు హెచ్చరించాడు."అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు వారు చూసింది కేవలం గార్డెన్ మాత్రమే, కానీ ప్రపంచకప్ అనేది ఒక అడవి లాంటిది. ఇక్కడ వేటాడాలి, లేదంటే మీరే బలి అవుతారు. ఇటువంటి ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానిని తట్టుకుని ఆడడం నేర్చుకోవాలి" అని రమేష్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తమ తొలి సూపర్-8 మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. భారత్ సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో విజయం సాధించాలి. -
అతడొక అద్భుతం.. కానీ: పాక్ మాజీ క్రికెటర్ యూటర్న్
టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. కెరీర్లో తొలిసారి వరల్డ్‌కప్ ఈవెంట్లో ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.హ్యాట్రిక్ డకౌట్లులీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లతో ఆడిన మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ అభిషేక్ బ్యాటింగ్ శైలిని విమర్శించాడు. కేవలం పవర్ హిట్టింగ్‌పైనే ఆధారపడతాడని.. అతడి టెక్నిక్ సరిగ్గా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా అతడిని ‘స్లాగర్’గా అభివర్ణించాడు.పరుగులు చేయాలనే తొందరలో వికెట్ పారేసుకుంటున్నాడని.. టెక్నిక్‌తో ఆడటం అతడికి చేతకాదని ఆమిర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీమిండియా అభిమానులు అతడిపై ఫైర్ అయ్యారు. అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్ అని.. ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమంటూ భారత ఆటగాడికి మద్దతుగా నిలిచారు.మరోసారి విఫలంఇక సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి పోరులో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 12 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది 15 పరుగులు చేశాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో కార్బిన్ బాష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఆమిర్ యూటర్న్!ఈ నేపథ్యంలో మహ్మద్ ఆమిర్ మరోసారి అభిషేక్ శర్మ గురించి వ్యాఖ్యలు చేశాడు. తన మాటలను అందరూ అపార్థం చేసుకున్నారంటూ యూటర్న్ తీసుకున్నాడు. ‘‘బౌలర్ వైపు నుంచి నేను అభిషేక్ శర్మ ఆటను విమర్శించాను. అతడి టెక్నిక్ గురించి మాత్రమే నేను మాట్లాడాను.కానీ నేను స్లాగర్ అన్న పదం వాడటం చాలా మందికి నచ్చలేదు. పటిష్ట జట్టు, బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కాస్త ఓపికగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే అభిషేక్ శర్మ బలహీనత ఏమిటో అందరికీ తెలిసిపోయింది. వాళ్లు అతడిని ఈజీగా ట్రాప్ చేయగలరు.అద్భుతమైన నైపుణ్యాలు.. కానీతాజా మ్యాచ్‌లో అతడు పద్నాలుగు పరుగులను ఒకే వైపు నుంచి రాబట్టాడు. అవి కూడా చెత్త బంతుల ద్వారా వచ్చిన పరుగులే. రబడ బౌలింగ్ మొదలుపెట్టాగానే.. అభిషేక్ శర్మ తెల్లముఖం వేశాడు.సీనియర్ ఆటగాడిగా నేను అభిషేక్ శర్మకు ఓ సలహా ఇస్తున్నా. నీ టెక్నిక్ గురించి ప్రత్యర్థులకు తెలిసిపోయింది. కాస్త ఓపికగా ఉండి.. బంతి ఎలా వస్తుందో అర్థం చేసుకుని ఆడితే నువ్వు మళ్లీ మునుపటిలా విజృంభించగలవు.అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని అతడు ఎలా ఉపయోగించుకుంటాడన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఇదే. కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని మహ్మద్ ఆమిర్ చెప్పుకొచ్చాడు. చదవండి: కెప్టెన్, హెడ్‌కోచ్ ఏం చేస్తున్నారు?.. భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం -
వాళ్లిద్దరు సూపర్.. తిలక్ వర్మ విఫలం: భారత దిగ్గజం
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. చెత్త ప్రదర్శనతో భారీ మూల్యమే చెల్లించారంటూ భారత మాజీ క్రికెటర్లు సూర్యకుమార్ సేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తుదిజట్టు కూర్పు విషయంలో తప్పు జరిగిందంటూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను సైతం విమర్శిస్తున్నారు.ఇదే అతిపెద్ద పరాజయంకాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా.. ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద పరాజయం. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు బదులు వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడం విమర్శలకు దారి తీసింది.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) తనదైన శైలిలో స్పందించాడు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఆడలేదని విమర్శించాడు. ముఖ్యంగా వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ ఆడిన తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు.వారిద్దరు సూపర్‘‘సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis), డేవిడ్ మిల్లర్ అద్భుత రీతిలో భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కించారు. అయితే, టీమిండియా బ్యాటర్లు మాత్రం వారి నుంచి ఏమీ నేర్చుకోలేకపోయారు. వచ్చీ రాగానే బౌండరీ కొట్టాలనే తలంపుతో వికెట్ పారేసుకున్నారు.టీ20 క్రికెట్లో ఇలా ఆడటం సరికాదు. ప్రత్యర్థి జట్టు ఏం చేసిందో చూసిన తర్వాత కూడా ఇలాగే చేస్తారా? వికెట్ అంతగా అనుకూలించకపోయినా వాళ్లు మెరుగ్గా ఆడారు. కానీ మనం.. ఇగోకు పోయాము. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వికెట్లు పోగొట్టుకున్నాం. సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేసింది.తిలక్ వర్మ నిరాశపరిచాడుఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు. ఇక తిలక్ వర్మ (Tilak varma) విషయానికొస్తే.. అతడు తెలివైన బ్యాటర్. కానీ ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన తీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఓవర్‌కు 9.5 పరుగులు రాబట్టాల్సింది. కానీ మనోళ్లు 15 పరుగులు చేయాలి అన్నట్లుగా తొందరపడ్డారు.తిలక్ ఇంకాసేపు సమయం తీసుకుని క్రీజులో నిలదొక్కుకోవాల్సింది. అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో తిలక్ కాస్తైనా బాధ్యతాయుతంగా ఆడాల్సింది. కానీ అతడు పూర్తిగా విఫలమయ్యాడు’’ అని గావస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.దూబే ఒక్కడేకాగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 111 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ 15 పరుగులు చేయగలిగాడు. తిలక్ వర్మ రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. మిగిలిన వారంతా కూడా విఫలం కాగా.. శివం దూబే 42 పరుగులతో రాణించడంతో భారత్ వంద పరుగుల మార్కు దాటగలిగింది.చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్ -
T20 WC 2026: టీమిండియాలో కలకలం
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్ వర్గాల్లో కలకలం రేగింది. హ్యాట్రిక్ డకౌట్లు సహా వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ (15) విఫలమైన అభిషేక్ శర్మ గాయంతోనే ఈ మ్యాచ్‌లన్నీ ఆడాడని వైభవ్ భోలా అనే క్రీడా జర్నలిస్ట్ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్టే కలకలానికి కారణమైంది.వైభవ్ భోలా పోస్ట్ ప్రకారం.. అభిషేక్ శర్మ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు ముందే గాయపడ్డాడు. టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన అధికారిక ఫోటోషూట్ కార్యక్రమంలో అభిషేక్ చేతికి గాయమైంది. దీని వల్ల అతనికి కుట్లు కూడా పడ్డాయి. అయినా, భారత మేనేజ్మెంట్ దాన్ని దాచి అభిషేక్‌ను యూఎస్ఏతో మ్యాచ్‌లో ఆడించింది. ఆ మ్యాచ్‌లో అతను గోల్డెన్ డకౌటయ్యాడు. ఆ తర్వాత అతనికి కడుపు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అప్పటి వరకు మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ వరుస వైఫల్యాల బాట పట్టడానికి ఇదే కారణమా అని వైభవ్ తన పోస్ట్ ద్వారా టీమిండియా మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. ఈ పోస్ట్‌కు అభిషేక్ చేతికి బ్యాండ్ ఎయిడ్ ఉన్న ఫోటోను జోడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. అభిషేక్ శర్మకు నిజంగానే గాయమైందా.. దాన్ని దాచిపెట్టే భారత మేనేజ్మెంట్ అతన్ని బరిలోకి దించుతుందా అని భారత క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ పోస్ట్‌లో నిజానిజాలు ఎంతో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై భారత మేనేజ్మెంట్ తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.ఒకవేళ అభిషేక్‌కు నిజంగా గాయమై ఉంటే, కీలకమైన సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఎందుకు ఆడించారని ప్రశ్నిస్తున్నారు. దీని మూల్యం జట్టు మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు.ఈ సంచలన వార్తలో నిజానిజాలను పక్కన పెడితే.. ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్ ఇబ్బంది పడుతున్నాడన్నది కాదనలేని సత్యం. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న అభిషేక్‌పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. భారీ అంచనాలు ఆ ఒత్తిడిని మరింత అధికం చేశాయి. ఇదే అతని వైఫల్యాలకు ప్రధాన కారణమయ్యుండవచ్చు. అభిషేక్ ఫామ్ కోల్పోవడంపై తాజాగా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడని.. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే అతను ఆత్మవిశ్వాసం లేకుండా కనిపిస్తున్నాడని.. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ఆతృత పక్కన పెట్టి, సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తే మంచిదని సలహా ఇచ్చాడు. గవాస్కర్ విషయాన్ని కూడా పక్కన పెడితే.. సౌతాఫ్రికా మ్యాచ్‌లో అభిషేక్ 15 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండి ఉంటే భారత్‌కు ఈ ఘోర పరాభవం తప్పేది. అప్పటికి అభిషేక్ ఆచితూచి ఆడాలనే ప్రయత్నం చేసినా, సౌతాఫ్రికా బౌలర్ల ఎత్తుగడల ముందు నిలబడలేకపోయాడు. ఏదిఏమైనా సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం భారత సెమీస్ అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసేసింది. ఈ ఓటమి తర్వాత భారత రన్‌రేట్ -3.80కి పడిపోయింది. జింబాబ్వే, విండీస్‌తో జరిగే మిగతా రెండు సూపర్-8 మ్యాచ్‌ల్లో నెగ్గినా టీమిండియా తప్పక సెమీస్‌కు చేరుతుందని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.


