న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌ను 48 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది
ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ విఫలమైనప్పటికి అభిషేక్ మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లుతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు రింకూ సింగ్(24 బంతుల్లో 44 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, జాకబ్ డఫ్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్, సోధీ, క్లార్క్ తలా వికెట్ సాధించారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఫిలిప్స్ కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు.
అతడితో పాటు చాప్‌మన్(39)రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం(జనవరి 23) జరగనుంది.
చదవండి: అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్


