T20 WC 2026: కెప్టెన్‌గా సాంట్నర్‌.. అక్షర్‌కు దక్కని చోటు! | Kris Srikkanth Team of the Tourney T20 WC 2026 leaves out Axar Patel | Sakshi
Sakshi News home page

T20 WC 2026: కెప్టెన్‌గా సాంట్నర్‌.. అక్షర్‌కు దక్కని చోటు!

Mar 11 2026 6:15 PM | Updated on Mar 11 2026 6:35 PM

Kris Srikkanth Team of the Tourney T20 WC 2026 leaves out Axar Patel

జగజ్జేత టీమిండియాపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్య సేన విజయాన్ని అభిమానులు ఇంకా సెలబ్రేట్‌ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు.

ముఖ్యంగా వరల్డ్‌కప్‌ హీరోలుగా పేరొందిన సంజూ శాంసన్‌ (Sanju Samson), జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)లతో పాటు.. అక్షర్‌ పటేల్‌ (Axar Patel), శివం దూబే వంటి సైలెంట్‌ హీరోలను కూడా ఫ్యాన్స్‌ హైలైట్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను ఎంపిక చేశాడు. ఇందులో అనూహ్యంగా అక్షర్‌కు మాత్రం చోటు ఇవ్వలేదు.

ఓపెనింగ్‌ జోడీ ఇదే
ఓపెనర్లుగా టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌, న్యూజిలాండ్‌ పవర్‌ హిట్టర్‌ టిమ్‌ సీఫర్ట్‌ను ఎంచుకున్న చిక్కా.. వన్‌డౌన్‌లో భారత యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కు చోటు ఇచ్చాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో విండీస్‌ వీరుడు షిమ్రన్‌ హెట్‌మైర్‌, భారత ఆల్‌రౌండర్‌ శివం దూబేను ఎంపిక చేసుకున్న శ్రీకాంత్‌.. టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా, ఇంగ్లండ్‌ డేంజరస్‌ ప్లేయర్‌ విల్‌ జాక్స్‌కు స్థానం ఇచ్చాడు.

పన్నెండో ఆటగాడిగా
ఇక ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను కాదని.. న్యూజిలాండ్‌ సారథి మిచెల్‌ సాంట్నర్‌ను ఎంచుకున్నాడు చిక్కా. బౌలింగ్‌ విభాగంలో ఆదిల్‌ రషీద్‌, లుంగి ఎంగిడి, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు చోటు ఇచ్చాడు. పన్నెండో ఆటగాడిగా విండీస్‌ వీరుడు జేసన్‌ హోల్డర్‌ను చిక్కా ఎంపిక చేసుకున్నాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో మొత్తంగా పద్నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. వరుణ్‌ చక్రవర్తితో కలిసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. మరోవైపు.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 383 పరుగులతో పాకిస్తాన్‌ ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. కేవలం ఐదు మ్యాచ్‌లలోనే సంజూ 321 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. రెండోస్థానంలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టిమ్‌ సీఫర్ట్‌ (326 పరుగులు) ఉన్నాడు.

టీ20 ప్రపంచకప్‌-2026 చిక్కా టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌
సంజూ శాంసన్‌, టిమ్‌ సీఫర్ట్‌, ఇషాన్‌ కిషన్‌, షిమ్రన్‌ హెట్‌మైర్‌, శివం దూబే, హార్దిక్‌ పాండ్యా, విల్‌ జాక్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఆదిల్‌ రషీద్‌, లుంగి ఎంగిడి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement