200 పరుగుల తేడాతో చిత్తుగా! | Amelia Kerr All-round Brilliance Seals NZ 3-0 Sweep Over Zimbabwe | Sakshi
Sakshi News home page

NZ-W Vs ZIM-W: 200 పరుగుల తేడాతో చిత్తుగా!

Mar 11 2026 5:13 PM | Updated on Mar 11 2026 5:15 PM

Amelia Kerr All-round Brilliance Seals NZ 3-0 Sweep Over Zimbabwe

జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. డునెడిన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ అమ్మాయిలు 200 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కెప్టెన్‌ అమెలియా కెర్‌ (106 బంతుల్లో 80), మ్యాడీ గ్రీన్‌ (73 బంతుల్లో 94) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో చటోన్వాజ 2 వికెట్లు తీయగా, మకుశా, అడెల్‌, మరంగేలు తలా ఒక వికెట్‌ తీశారు. 

అనంతరం బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే మహిళల జట్టు 27.1 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. లోరీన్‌ షుమా 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, చిపో టిరిపానో 22 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో అమేలి కెర్‌ 5 వికెట్లతో జింబాబ్వే నడ్డి విరవగా.. రోస్‌మేరీ మెయిర్‌ 2 వికెట్లు పడగొట్టింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన అమెలియా కెర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకుంది. 

చదవండి: భజ్జీ చేసిన గాయం ఇప్పటికీ మానలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement