ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగిలే అవకాశముంది. శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. గత డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో పతిరానాను రూ.18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
అయితే టీ20 వరల్డ్‌కప్-2026 మధ్యలో గాయపడిన అతడు ఇంకా కోలుకోలేదు. పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూపు స్టేజ్ మ్యాచ్‌లో పతిరాన కాలిపిక్క గాయానికి గురయ్యాడు. దీంతో అతడు ప్రపంచకప్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. ఈ జూనియర్ మలింగ తాజాగా తన గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు.
తాను ఇంకా శ్రీలంకలోనే ఉన్నానని, కోలుకోవడానికి మరింత సమయంపడుతుందని బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను పతిరాన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ తక్కువ సమయంలో పతిరాన పూర్తి ఫిట్‌నెస్ సాధించి కేకేఆర్ క్యాంపులో చేరే సూచనలు కన్పించడం లేదు.
ఒకవేళ ఇదే జరిగితే కేకేఆర్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. గతంలో సీఎస్‌కే తరపున ఆడిన అనుభవం ఉన్న పతిరానను, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా భావించి కేకేఆర్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఇప్పుడు టోర్నీ ఆరంభ సమయానికి అతడు కోలుకోకపోతే ప్రత్యామ్నాయ బౌలర్ కోసం కేకేఆర్ వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐపీఎల్-2026కు కేకేఆర్ జట్టు
అజింక్య రహానే, రింకూ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, రాహుల్ త్రిపాఠి, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, క్యామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మతీష పతిరానా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మతీష పతిరానా , వైభవ్ అరోరా


