బాబ‌ర్ ఆజం సంచ‌ల‌న నిర్ణ‌యం | Babar Azam Takes Drastic Step After PCB Drops Him From Pakistan Vs Bangladesh | Sakshi
Sakshi News home page

T20 WC 2026: జ‌ట్టులో నో ఛాన్స్‌.. బాబ‌ర్ ఆజం సంచ‌ల‌న నిర్ణ‌యం

Mar 11 2026 12:36 PM | Updated on Mar 11 2026 12:43 PM

Babar Azam Takes Drastic Step After PCB Drops Him From Pakistan Vs Bangladesh

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఘోర ప‌రాభావం త‌ర్వాత పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (PCB) క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగాంగానే బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజంను సెలెక్ట‌ర్లు త‌ప్పించారు. వ‌న్డే జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా ఉన్న బాబ‌ర్‌ను త‌ప్పించ‌డం పెద్ద చ‌ర్చానీయంశ‌మైంది.

దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో అత‌డు ఆడ‌డం క‌ష్ట‌మేన‌ని క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా ఇటీవ‌ల ముగిసిన పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో బాబ‌ర్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడుటీమ్ మేనేజ్‌మెంట్ అతని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది.

బాబర్ 4 ఇన్నింగ్స్‌ల్లో 22.75 స‌గ‌టుతో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్ర‌మంలోనే పీసీబీ సెలెక్ష‌న్ క‌మిటీ అత‌డిపై వేటు వేసింది. ఇక జ‌ట్టు నుంచి ఉద్వాస‌నకు గురైన బాబ‌ర్ ఆజం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ నుండి అత‌డు తప్పుకున్నాడు.

కొన్నాళ్లపాటు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు 'జియో న్యూస్‌' తమ కథనంలో పేర్కొంది. బాబర్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

బాబర్‌ను తిరిగి మళ్లీ పాకిస్తాన్ సూపర్‌-2026 సీజన్‌లో చూసే అవకాశముంది. ఈ టోర్నీలో పెషావర్ జల్మీ కెప్టెన్‌గా ఆజం వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది పీఎస్‌ఎల్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద త‌ప్పు చేశాడు'

Advertisement
 
Advertisement
Advertisement