t20 world cup
-
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
-
బాబర్ ఆజం సంచలన నిర్ణయం
టీ20 ప్రపంచకప్-2026లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగాంగానే బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంను సెలెక్టర్లు తప్పించారు. వన్డే జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా ఉన్న బాబర్‌ను తప్పించడం పెద్ద చర్చానీయంశమైంది.దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో అతడు ఆడడం కష్టమేనని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో బాబర్ దారుణ ప్రదర్శన కనబరిచాడుటీమ్ మేనేజ్మెంట్ అతని బ్యాటింగ్ ఆర్డర్ మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది.బాబర్ 4 ఇన్నింగ్స్‌ల్లో 22.75 సగటుతో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే పీసీబీ సెలెక్షన్ కమిటీ అతడిపై వేటు వేసింది. ఇక జట్టు నుంచి ఉద్వాసనకు గురైన బాబర్ ఆజం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ నుండి అతడు తప్పుకున్నాడు.కొన్నాళ్లపాటు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు 'జియో న్యూస్' తమ కథనంలో పేర్కొంది. బాబర్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.బాబర్‌ను తిరిగి మళ్లీ పాకిస్తాన్ సూపర్-2026 సీజన్లో చూసే అవకాశముంది. ఈ టోర్నీలో పెషావర్ జల్మీ కెప్టెన్‌గా ఆజం వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు' -
ఊహకందని విధంగా పెరిగిన బీసీసీఐ నజరానా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచకప్ విజేతకు నగదు బహుమతి ప్రకటించే సంప్రదాయాన్ని కొనసాగించింది. తాజాగా 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు రూ. 131 కోట్లు రివార్డుగా ప్రకటించింది. ఈ మొత్తం 2007 పొట్టి ప్రపంచకప్ విజేత అయిన నాటి టీమిండియాతో పోలిస్తే ఏకంగా 1091.67 శాతం ఎక్కువ.2007 పొట్టి ప్రపంచకప్ గెలిచినప్పుడు ధోని నేతృత్వంలోని భారత జట్టుకు బీసీసీఐ రూ. 12 కోట్ల నగదు నజరానాను ప్రకటించింది. ప్రత్యేక బహుమతిగా ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్‌కు రూ. 1 కోటి అందించింది. అలాగే సపోర్ట్ స్టాఫ్‌లో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు ఇచ్చింది.అదే 2026 ప్రపంచకప్‌కు వచ్చేసరికి.. సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 19 ఏళ్లలో బహుమతి మొత్తం 13 రెట్లు పెరిగింది.ఈ మధ్యలో 2024 పొట్టి ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మ సేనకు బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. 2007తో పోలిస్తే ఈ మొత్తం రూ. 113 కోట్లు ఎక్కువ.భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన సందర్భాల్లో బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతి..- 2007లో రూ. 12 కోట్లు- 2024లో రూ. 125 కోట్లు- 2026లో రూ. 131 కోట్లుఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన 2026 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. -
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
-
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
-
టీమిండియా వరల్డ్ కప్ విన్.. పెద్ది సాంగ్ వీడియో వైరల్
టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ఇండియా క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ విజయాన్ని ప్రతి ఒక్కరు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ గెలుపును తమకు నచ్చినట్లుగా పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా ఈ విజయాన్ని పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సనా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవల రిలీజైన పెద్ది సెకండ్ సింగిల్ రైరా రారా అంటూ సాగే పాటతో టీమిండియా వీడియోను షేర్ చేశారు. రైరా రారా అంటూ సాగే ఈ పాటకు టీమిండియా ఆటగాళ్లతో వీడియోను రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.🔥🔥🔥🔥🔥 pic.twitter.com/xLVcvmd1yM— BuchiBabuSana (@BuchiBabuSana) March 8, 2026 -
టీమిండియా విజయం.. టెక్ దిగ్గజాల రియాక్షన్ ఇలా..
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో.. న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడించింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 255/5 భారీ స్కోరును నమోదు చేసి.. న్యూజిలాండ్‌ను 159 పరుగులకు ఆలౌట్ చేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయం తర్వాత.. ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జస్ప్రీత్ బుమ్రా & సంజు శాంసన్ ప్రదర్శనలను హైలైట్ చేశారు. "టీ20 ప్రపంచ కప్‌లో అద్భుతమైన విజయం సాధించిన టీం ఇండియాకు అభినందనలు, న్యూజిలాండ్‌కు ఈ రోజు అదృష్టం కలిసిరాలేదు'' అని ట్వీట్ చేశారు.Congratulations to Team India on a fantastic T20 World Cup win 🇮🇳 Tough luck today, New Zealand. @Jaspritbumrah93, once again a match winner when it mattered most. @IamSanjuSamson, what a tournament and what an impact. Absolutely incredible.— Satya Nadella (@satyanadella) March 8, 2026టీమిండియా విజయంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకు అభినందనలు. సెమీఫైనల్ వరకు చేరిన సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీములను కూడా ప్రశంసించారు. క్రికెట్ ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరిస్తుండటం చాలా ఆనందంగా ఉందంటూ.. మంచి టోర్నమెంట్ నిర్వహించినందుకు ఐసీసీను కూడా అభినందించారు.Congrats India on winning the ICC Men's T20 World Cup! chose the wrong game to go watch:) what a stadium and atmosphere. Well played to the other semi finalists, SA, Eng and Nz!! Also so exciting to see the game expand to so many countries and congrats to ICC for a great…— Sundar Pichai (@sundarpichai) March 8, 2026 -
టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ ప్రశంస
సాక్షి, తాడేపల్లి: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు మొత్తం టీమ్ ఇండియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by YS Jagan Mohan Reddy (@ysjagan)అద్భుతమైన ఆటతీరు కనబరిచిన అభి, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు ప్రత్యేక అభినందనలు. దేశం అంతా గర్వపడే లాంటి విజయం సాధించారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది అని పేర్కొన్నారు. భారత్ జట్టు కృషి, పట్టుదల, జట్టు స్పూర్తి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగిందని జగన్ అన్నారు. ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. BSNL కొత్త ఆఫర్!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ప్రకారం 16 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 4జీబీ డేటా లభిస్తుంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''వరల్డ్ కప్ అంటే కేవలం ఒక టోర్నమెంట్ కాదు, ప్రతి ఇంట్లోనూ జరిగే ఒక వేడుక. పవర్ ప్లేల నుంచి చివరి ఓవర్ల వరకు చూడండి. కేవలం రూ.16కే 4జీబీ డేటా పొందండి. ఒక రోజు వ్యాలిడిటీ మాత్రమే. మ్యాచ్ ఇప్పుడు అంతరాయం లేకుండా చూడండి. ఎందుకంటే ప్రపంచ కప్ సమయం వచ్చినప్పుడు, మీ డేటా ఛాంపియన్ లాగా ఉండాలి'' అని బీఎస్ఎన్ఎల్ ఇండియా ట్వీట్ చేసింది.The World Cup isn’t just a tournament, it’s a celebration in every home. 🏏From power plays to nail-biting last overs, don’t let buffering steal the thrill.Get 4GB data with 1-day validity at just ₹16 and stream every match live, loud, and uninterrupted.Because when it’s… pic.twitter.com/VJyYEDtt7z— BSNL India (@BSNLCorporate) March 8, 2026 -
భారత్ ను టెన్షన్ పెడుతున్న కీలక అంశాలు..
-
ఫిన్ అలెన్ వరల్డ్ రికార్డ్.. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి బ్యాట్స్‌మెన్..!
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ సెమీస్‌లో విధ్వంసం సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే చేధించారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఫిన్ అలెన్ ఘనత సాధించారు. ఈ విజయంతో న్యూజిలాండ్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ భీభత్సం సృష్టించాడు. ఏకంగా పది ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. -
పెళ్లిలో టీ 20 మ్యాచ్
ఇండియా, వెస్టిండీస్ మధ్య టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ నేపథ్యంలో ఆదివారం కూకట్‌పల్లిలోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన పెళ్లి వేడుకలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. హాలులో, పెళ్లి విందులో అతిథులతో పాటు నూతన దంపతులు మ్యాచ్ తిలకించారు. సంగీతం శ్రవణానందంహైదరాబాద్ లైఫ్స్టైల్లో మరో ట్రెండీ హైలైట్‌గా ‘రూట్ ఫర్ మాంగ్రోవ్స్’ లైవ్ కాన్సర్ట్ నిలిచింది. ట్రైబ్ వైబ్ ఎంటర్టైన్మెంట్, సిగ్నేచర్ బ్రాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత సంబరం.. పర్యావరణ పరిరక్షణను వినోదంతో మేళవించిన వినూత్న ప్రయత్నంగా నగరవాసులను ఆకట్టుకుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా జరిగిన ఈవెంట్లో ప్రముఖ సింగర్స్ విశాల్, శేఖర్ తమ ఎనర్జిటిక్ హిట్స్‌తో ప్రేక్షకులను ఊపేశారు. -
టీమిండియా టార్గెట్ 196
కోల్‌కతా: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో భారత్‌కు 196 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది వెస్టిండీస్, ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆది నుంచి బ్యాట్ ఝుళిపించింది. ఓపెనర్లు షాయ్ హోప్( 32: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రోస్టన్ ఛేజ్(40: 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత హెట్ మెయిర్ ( 27: 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు) చెలరేగి ఆడే యత్నం చేశాడు. విండీస్ స్కోరు బోర్డు వేగం పుంజుకునే క్రమంలో బూమ్రా బౌలింగ్ లో హెట్ మెయిర్ అవుటయ్యాడు. బూమ్రా బౌలింగ్ లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెట్ మెయిర్. అప్పటికి విండీస్ స్కోరు 11.3 ఓవర్లలో 102 పరుగులుగా ఉంది. అయితే హెట్ మెయిర్ రెండో వికెట్‌గా ఔటైన తర్వాత విండీస్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది. అయితే రావెన్ పావెల్(34 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాసన్ హోల్డర్(37 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.భారత బౌలర్లలో బుమ్రా మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బుమ్రా నాలుగు ఓవర్లలో 36 పరుగులే ఇవ్వగా, హార్దిక్ పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు, అర్షదీప్ 43 పరుగులు, వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చారు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.పావెల్ అరుదైన ఘనతఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా రోవ్మాన్ పావెల్ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్ తరుఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పావెల్ టీ20ల్లో 150 సిక్సర్లు మార్కును చేరుకోవడంతో విండిస్ తరుఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో నికోలస్ పూరన్ 149 సిక్సర్లు కొట్టిన జాబితాలో ఉండగా, వెవిన్ లూయిస్ 136 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్ గేల్ 124 సిక్సర్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.పొలార్డ్, హెట్‌మెయిర్‌లు 99 సిక్సర్లతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. -
నేడు కోల్ కతా వేదికగా హై ఓల్టేజ్ ఫైట్
-
IND vs ZIM: వెస్టిండీస్‌పై గెలిస్తే సెమీఫైనల్‌కు..
భారత జట్టు తమ కసినంతా జింబాబ్వేపై చూపించింది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన టీమిండియా తర్వాతి పోరులో విధ్వంసకర రీతిలో నష్టనివారణ చేసింది. సామ్సన్ శుభారంభం అందిస్తే, అభిషేక్ శర్మ ఫామ్‌లోకి వచ్చి దూకుడుగా ఆడాడు. మధ్యలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ తమదైన శైలిలో ధాటిని ప్రదర్శిస్తే చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇలా భారత బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి సిక్సర్లతో విరుచుకుపడటంతో జింబాబ్వే బెంబేలెత్తిపోయింది. ఆ జట్టు బౌలర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా రికార్డు స్కోరు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఛేదనలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్‌ను ముగించింది. ఇక నెట్‌రన్‌రేట్ వంటి గందరగోళపు లెక్కలు అవసరం లేకుండా నాకౌట్ పంచ్ మిగిలింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే చివరి పోరులో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిపోతే నిష్క్రమిస్తుంది. చెన్నై: టి20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా గురువారం జరిగిన ‘గ్రూప్–1’ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తాజా ఫలితంతో జింబాబ్వే సెమీస్ చేరే అవకాశాలు ముగిసిపోయాయి. ఎంఎ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. పాండ్యా, తిలక్ ఐదో వికెట్‌కు 31 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ (59 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం మినహా అంతా విఫలమయ్యారు. పోటీ పడి పరుగులు... ఇన్నింగ్స్ రెండో బంతికే సంజు సామ్సన్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొట్టిన సిక్స్‌తో ఆరంభమైన భారత్ జోరు చివరి వరకు సాగింది. మపోసా వేసిన మూడో ఓవర్లోనే భారత్ 23 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అభిషేక్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు సామ్సన్ ధాటిగా ఆడాడు. సామ్సన్ వెనుదిరిగిన తర్వాత ఇషాన్ అదే వేగాన్ని కొనసాగించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 80 పరుగులు చేసింది. 26 పరుగుల వద్ద ఇషాన్‌కు లైఫ్ లభించగా, 26 బంతుల్లో అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తయింది. రజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కిషన్ తర్వాతి బంతికి అవుటయ్యాడు. కొద్దిసేపటికి అభిషేక్ కూడా పెవిలియన్‌కు చేరాడు. 8 పరుగుల వద్ద ముజరబాని క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ మపోసా ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. తర్వాతి ఓవర్లోనూ వేగంగా ఆడే క్రమంలో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది. 4 ఓవర్లలో 69 పరుగులు... 16 ఓవర్లు ముగిసేసరికి నిస్సహాయంగా మారిపోయిన జింబాబ్వే బౌలర్లపై చివర్లో పాండ్యా, తిలక్ మరింత విరుచుకు పడ్డారు. 17–20 ఓవర్లలో భారత్ వరుసగా 14, 19, 21, 15 పరుగులు రాబట్టింది. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. ఎన్గరవా వేసిన 19వ ఓవర్లో తిలక్ వరుసగా 2 సిక్స్‌లు కొట్టగా, ఇవాన్స్ వేసిన ఆఖరి ఓవర్లో పాండ్యా వరుసగా రెండు భారీ సిక్స్‌లతో ముగించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో పాండ్యా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బ్యాటింగ్‌కి దిగిన ఆరుగురు కనీసం ఒక సిక్స్ బాదగా భారత్ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్ కోసం భారత్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ స్థానాల్లో అక్షర్ పటేల్, సంజు సామ్సన్ జట్టులోకి వచ్చారు. బెన్నెట్ పోరాటం వృథా... భారీ ఛేదనను జింబాబ్వే ఓపెనర్లు బెన్నెట్, మరుమని (20) జాగ్రత్తగా ప్రారంభించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 38 బంతుల్లో 44 పరుగులు జత చేశారు. మరుమని, మైయర్స్ (6) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... బెన్నెట్, సికందర్ రజా (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు ఇన్నింగ్స్ కాస్త సానుకూలంగా కదిలింది. అక్షర్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన బెన్నెట్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత దూబే ఓవర్లో కూడా బెన్నెట్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే మూడో వికెట్‌కు బెన్నెట్‌తో 42 బంతుల్లో 72 పరుగులు జత చేసిన అనంతరం రజా అవుట్ కావడంతో జింబాబ్వే ఆశలు పూర్తిగా కోల్పోయింది. 256/4 టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్‌పై టీమిండియా చేసిన 217 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఓవరాల్‌గా శ్రీలంక 260/6 (కెన్యాపై 2007లో) తర్వాత వరల్డ్ కప్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బర్ల్ (బి) ముజరబాని 24; అభిషేక్ (సి) రజా (బి) మపోసా 55; ఇషాన్ కిషన్ (సి) ఎన్గరవా (బి) రజా 38; సూర్యకుమార్ (సి) ముసెకివా (బి) ఎన్గరవా 33; పాండ్యా (నాటౌట్) 50; తిలక్ (నాటౌట్) 44; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–48, 2–120, 3–150, 4–172. బౌలింగ్: ఎన్గరవా 4–0–62–1, ముజరబాని 4–0–43–1, మపోసా 2–0–40–1, ఇవాన్స్ 4–0–52–0, రజా 3–0–29–1, బెన్నెట్ 2–0–16–0, బర్ల్ 1–0–10–0. జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (నాటౌట్) 97; మరుమని (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 20; మైయర్స్ (సి) తిలక్ (బి) వరుణ్ 6; రజా (సి) అభిషేక్ (బి) అర్‡్షదీప్ 31; బర్ల్ (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మున్యోంగా (బి) అర్‡్షదీప్ 11; ముసెకివా (సి) సామ్సన్ (బి) దూబే 7; ఇవాన్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–44, 2–72, 3–144, 4–144, 5–162, 6–173. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–24–3, పాండ్యా 3–0–21–0, బుమ్రా 3–0–21–0, వరుణ్ 4–0–35–1, అక్షర్ 4–0–35–1, దూబే 2–0–46–1. గెలిచే జట్టు సెమీస్‌కు... జింబాబ్వేపై భారత్ విజయంతో ‘గ్రూప్–1’ నుంచి సెమీఫైనల్ చేరే జట్ల విషయంలో స్పష్టత వచ్చింది. రెండు విజయాలతో దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ సెమీస్ స్థానం ఖాయం చేసుకోగా, జింబాబ్వేతో ఆ జట్టు ఆడే మ్యాచ్ నామమాత్రమే. మరోవైపు జింబాబ్వేపై నెగ్గి, దక్షిణాఫ్రికా చేతిలోనే ఓడిన భారత్, వెస్టిండీస్ ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య ఆదివారం కోల్‌కతాలో జరిగే మ్యాచ్ క్వార్టర్ ఫైనల్‌లాంటిది. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారికి ఎలాంటి సమీకరణాలు, రన్రేట్లతో సంబంధం లేకుండా సెమీస్‌లో చోటు ఖాయమవుతుంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో ఆ్రస్టేలియా, శ్రీలంకలను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే ‘సూపర్ ఎయిట్స్’లో వెస్టిండీస్, భారత్‌లకు 254, 256 పరుగులు ఇచ్చి ఓటములను ఆహ్వానించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్‌లో నేడుఇంగ్లండ్ X న్యూజిలాండ్ వేదిక: కొలంబో, రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సెమీస్‌లో దక్షిణాఫ్రికా
అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్‌లో 2024 టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికా దూసుకుపోతోంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన సఫారీ టీమ్ ఇప్పుడు ‘సూపర్ ఎయిట్స్’లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు చెన్నైలో జింబాబ్వేపై భారత జట్టు గెలుపొందడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా జట్టుకు సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. గురువారం జరిగిన ‘గ్రూప్–2’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ‘సూపర్ ఎయిట్స్’లో రెండు విజయాలతో దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లతో గ్రూప్–1లో అగ్రస్థానంలో ఉంది. తమ చివరి ‘సూపర్–8’ మ్యాచ్‌ను ఢిల్లీలో ఆదివారం జింబాబ్వేతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయినా ఆ జట్టుకు 4 పాయింట్లు ఉంటాయి. ఆదివారమే కోల్‌కతాలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే చివరి ‘సూపర్–8’ మ్యాచ్‌లో గెలిచిన జట్టు కూడా నాలుగు పాయింట్లతోనే ముగిస్తుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్లు ఎన్గిడి (3/30), రబాడ (2/22), కార్బిన్ బాష్ (2/31) చెలరేగడంతో విండీస్ 83 పరుగుల వద్దే 7 వికెట్లు కోల్పోయింది. షై హోప్ (16), హెట్‌మైర్ (2), బ్రెండన్ కింగ్ (21), ఛేజ్ (2), రూథర్‌ఫర్డ్ (12), రావ్మన్ పావెల్ (9) పూర్తిగా విఫలమయ్యారు. 83/7 నుంచి విండీస్ జట్టును రొమారియో షెఫర్డ్ (37 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హోల్డర్ (31 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 బంతుల్లో 89 పరుగులు జోడించారు. దాంతో విండీస్ మెరుగైన స్కోరును నమోదు చేసింది. అయితే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై దక్షిణాఫ్రికా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 16.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 177 పరుగులు చేసి జట్టు విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్క్రమ్ (46 బంతుల్లో 82 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగి ఆడగా... డికాక్ (24 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికెల్టన్ (28 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహకరించారు. డికాక్‌తో తొలి వికెట్‌కు 48 బంతుల్లో 95 పరుగులు జోడించిన కెపె్టన్ మార్క్రమ్... రెండో వికెట్‌కు రికెల్టన్‌తో 50 బంతుల్లో అభేద్యంగా 82 పరుగులు జత చేశాడు. 89 అంతర్జాతీయ టి20ల్లో ఎనిమిదో వికెట్‌కు షెఫర్డ్–హోల్డర్ కొత్త ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గతంలో స్కాట్లాండ్ ప్లేయర్లు షరీఫ్–మోమ్సెన్ జోడించిన 80 పరుగుల రికార్డు (2015లో నెదర్లాండ్స్‌పై) కనుమరుగైంది. -
టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు పరీక్షా సమయం
-
భారీ విజయం కావాలి
టి20 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌లో పరాజయం భారత్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే దర్జాగా సెమీఫైనల్ చేరాల్సిన టీమ్ ఇప్పుడు ఒత్తిడిని అధిగమించి తప్పనిసరిగా వరుస రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు రన్‌రేట్‌పై కూడా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఒకవైపు మన బ్యాటింగ్‌లో తడబాటు కనిపిస్తుండగా, మరోవైపు లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకలను ఓడించిన జింబాబ్వేను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే వెస్టిండీస్‌తో జరిగే తర్వాతి పోరులో వ్యూహాల గురించి చర్చించేందుకు భారత్‌కు ఇంకా అవకాశం మిగిలి ఉంటుంది! చెన్నై: వరల్డ్ కప్ ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు టీమిండియా సన్నద్ధమైంది. నేడు జరిగే ‘గ్రూప్–1’ పోరులో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. ఇరు జట్లూ తమ తొలి మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి రన్‌రేట్‌లో బాగా వెనుకబడిపోయాయి. ఓడిన జట్టు సెమీస్ ఆశలు ఇక్కడే ముగిసిపోతాయి. బలాబలాలపరంగా జింబాబ్వేకంటే భారత్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. అయితే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో టీమిండియా అజేయమేమీ కాదని తేలగా... పోరాడితే పోయేదేం లేదన్నట్లుగా ఆడే జింబాబ్వే మరో సంచలన ప్రదర్శనపై గురి పెట్టింది. సామ్సన్‌కు చాన్స్! గత మ్యాచ్ ఆడిన తుది జట్టు నుంచి కనీసం రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. టోర్నీలో ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో విఫలమైన సంజు సామ్సన్ను ఇప్పుడు టీమ్ వ్యూహంలో భాగంగా మళ్లీ ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. భారత్ టాప్–3 ఎడంచేతి వాటం బ్యాటర్లే కావడం, ప్రత్యర్థి జట్లు ఆరంభంలోనే ఆఫ్ స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించి కట్టడి చేస్తుండటం జట్టును ఇబ్బంది పెట్టింది. మూడు డకౌట్ల తర్వాత గత మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కొన్ని పరుగులు చేసినా అతని బ్యాటింగ్‌లో తడబాటు కనిపించింది. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా ఆఫ్‌స్పిన్నర్‌కే అవుటయ్యాడు. దాంతో కుడిచేతి వాటం సామ్సన్ను టాపార్డర్‌లో ఆడించేందుకు టీమిండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సామ్సన్ను ఆడించేందుకు తిలక్ వర్మ లేదా రింకూ సింగ్‌లలో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. దక్షిణాఫ్రికాతో అక్షర్ పటేల్‌ను కాకుండా వాషింగ్టన్ సుందర్‌ను ఆడించి తీవ్ర విమర్శలపాలైన మేనేజ్మెంట్ ఇప్పుడు మళ్లీ అక్షర్‌ను టీమ్‌లోకి తీసుకోవచ్చు. జింబాబ్వే బ్యాటర్లలో ఎక్కువ మంది కుడిచేతి వాటంవారే కావడం అక్షర్ రాకకు మార్గం సుగమం చేసింది. మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు అభిషేక్‌కు ఇది సరైన సమయం కాగా... సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా ఎంత దూకుడుగా ఆడతారన్నది చూడాలి. బౌలింగ్ విషయంలో భారత్‌కు ఎలాంటి ఆందోళన లేదు. బుమ్రా, అర్‡్షదీప్‌లతో పాండ్యా పేస్ భారం మోస్తుండగా... ప్రధానాస్త్రం వరుణ్ జింబాబ్వేను బాగా ఇబ్బంది పెట్టగలడు. సొంతగడ్డపై ఇప్పుడు వరుణ్ వరల్డ్ నంబర్‌వన్ బౌలర్‌గా బరిలోకి దిగనున్నాడు. రజాపై భారం... జింబాబ్వే జట్టుపై ఈ మ్యాచ్‌కు సంబంధించి ఎలాంటి ఒత్తిడీ లేదు. లీగ్ దశలో ఆ్రస్టేలియాను, సొంతగడ్డపై శ్రీలంకను ఓడించిన సంతృప్తితో ఆ జట్టు స్వదేశానికి వెళ్లవచ్చు. అందువల్ల కూడా ఇప్పుడు జింబాబ్వే మరింత ప్రమాదకరం. పోరాడితే భారత్‌పై కూడా పైచేయి సాధించవచ్చనే ధైర్యం ఆ జట్టులో కనిపిస్తోంది. ప్రధాన పేసర్లయిన ఎన్గరవా, ముజరబాని పవర్‌ప్లేలో వికెట్లు తీసి శుభారంభం అందించగలరు. లెగ్ స్పిన్నర్ క్రీమర్ కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సమర్థుడు. టోర్నీలో జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉన్న బెన్నెట్‌తో పాటు ర్యాన్ బర్ల్ కీలకం కానున్నారు. జట్టులో ఇద్దరు ఆల్‌రౌండర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బ్రాడ్ ఇవాన్స్ తన మీడియం పేస్‌తో టోర్నీలో ప్రభావం చూపించగా, ప్రధాన గెలుపు భారం కెపె్టన్ సికందర్ రజాపైనే ఉంది. బ్యాటింగ్‌లో ముందుండి నడిపిస్తున్న రజా, తన ఆఫ్‌స్పిన్‌తో నిలకడగా రాణించాడు. విండీస్‌తో గత పోరులో భారీ తేడాతో ఓడినా... జింబాబ్వే పట్టుదలగా ఆడితే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలదు.పిచ్, వాతావరణం చిదంబరం స్టేడియంలోని పిచ్‌లు ఈ టోర్నీ మొత్తంలో బ్యాటింగ్‌కు బాగా అనుకూలించాయి. బౌలర్లకు ఏమాత్రం సహకరించలేదు. కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు.1 టి20 వరల్డ్ కప్‌లో భారత్, జింబాబ్వే మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది. 2022లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 71 పరుగులతో గెలిచింది.1 భారత్‌లో భారత్‌తో టి20ల్లో జింబాబ్వే తలపడటం ఇదే తొలిసారి. గతంలో భారత గడ్డపై జింబాబ్వే 5 టెస్టులు, 19 వన్డేల్లో టీమిండియాను ఎదుర్కొంది.భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, దూబే, పాండ్యా, రింకూ/ తిలక్, అక్షర్, అర్ష్ దీప్, వరుణ్, బుమ్రా. జింబాబ్వే: రజా (కెప్టెన్), మరుమని, బెన్నెట్, మైర్స్, బర్ల్, మున్యోంగా, ముసెకివా, ఇవాన్స్, క్రీమర్, ముజరబాని, ఎన్‌గరవ -
శ్రీలంక ఖేల్ ఖతం
కొలంబో: టి20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక సొంతగడ్డపై కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన లంక... ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలోనూ ఓడింది. ఫలితంగా రెండు పరాజయాలతో సెమీస్ అవకాశాలు కోల్పోయింది. బుధవారం జరిగిన ‘గ్రూప్–2’ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరగా, తాజా విజయంతో కివీస్ అవకాశాలు మెరుగయ్యాయి. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే కివీస్ కూడా సెమీస్‌లోకి అడుగు పెడుతుంది. ఓడితే శనివారం పాక్, లంక మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. పాక్ ఓడితే కివీస్‌కు చోటు ఖాయమవుతుంది. పాక్ గెలిస్తే అప్పుడు రన్‌రేట్‌లో పోటీ పడాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (26 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), కోల్ మెక్‌కోన్‌కీ (23 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. 9.2 ఓవర్లు ముగిసేసరికి కివీస్ 75/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే లంక బౌలర్లు చెలరేగడంతో 9 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 84/6కు చేరింది. ఈ దశలో సాంట్నర్, మెక్‌కోన్‌కీ ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చివరి 4 ఓవర్లలో న్యూజిలాండ్ 6 సిక్స్‌లు, 4 ఫోర్లతో 70 పరుగులు రాబట్టడం విశేషం. ఆరు వికెట్లు కోల్పోయే సమయానికి 84 పరుగులు చేసిన కివీస్... తర్వాతి వికెట్ భాగస్వామ్యంలో సరిగ్గా అన్నే పరుగులు చేయడం విశేషం. టి20 వరల్డ్ కప్‌లో గతంలో ఏడో వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం 74 పరుగులు (మైక్ హస్సీ, స్టీవ్ స్మిత్ మధ్య 2010లో) కాగా...సాంట్నర్, మెక్‌కోన్‌కీ దీనిని సవరించారు. మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో లంక పూర్తిగా తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే నిసాంక (0) బౌల్డ్ కావడంతో మొదలైన పతనం వేగంగా సాగింది. అసలంక (5), కుశాల్ మెండిస్ (11), పవన్ రత్నాయకే (10), షనక (3) వరుస కట్టి పెవిలియన్‌కు చేరడంతో 10.3 ఓవర్లలో 46 పరుగులకే జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కమిందు మెండిస్ (31; 4 ఫోర్లు), వెలలాగె (29; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా దాని ప్రభావం ఫలితంపై పడలేదు. రచిన్ రవీంద్ర (4/27) లంకను కుప్పకూల్చగా, హెన్రీకి 2 వికెట్లు దక్కాయి. రచిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ సమరం.. ఈ మ్యాచ్‌పై మన కన్ను
అహ్మదాబాద్: భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్‌కు ముందు జరిగే మరో సమరంపై కూడా టీమిండియా అభిమానుల దృష్టి నిలిచింది. ‘గ్రూప్–1’లోనే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం కూడా చివర్లో భారత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి. ఈ మ్యాచ్‌తో పాటు జింబాబ్వేపై కూడా దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌కు రన్‌రేట్ లెక్కల అవసరం రాదు. జింబాబ్వేతో పాటు చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ గెలిస్తే సరిపోతుంది. కానీ దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే మాత్రం... మనం మిగతా రెండూ గెలిచినా సెమీఫైనల్ స్థానంపై గ్యారంటీ లేదు. మూడు జట్లూ రెండేసి విజయాలతో సమానమైతే రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా, విండీస్‌లకు వెనక్కి నెట్టడం భారత్‌కు అంత సులువు కాదు! జింబాబ్వేతో మ్యాచ్ బరిలోకి దిగడానికి ముందు టీమిండియాకు మరింత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం . -
బ్రూక్ శతకంతో ఇంగ్లండ్ సెమీస్‌కు
టి20 వరల్డ్ కప్‌లో ‘సూపర్ ఎయిట్స్’లోకి అడుగు పెట్టినా ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌లో ఇంకా తడబాటు... వరుసగా నాలుగు మ్యాచ్‌లలో తానూ విఫలం కావడంతో విమర్శల ఒత్తిడి... ఇలాంటి స్థితిలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదనపు బాధ్యత తీసుకున్నాడు... 61 మ్యాచ్‌ల కెరీర్లో తొలిసారి మూడో స్థానంలోకి దిగి జట్టును గెలిపించే భారాన్ని భుజాన వేసుకున్నాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో తనొక్కడే 100 పరుగులు చేసి ఒంటిచేత్తో టీమ్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైన పాకిస్తాన్... బౌలింగ్‌లో ఇతర బ్యాటర్లను నిలువరించగలిగింది గానీ బ్రూక్‌ను ఆపలేక మ్యాచ్‌ను అప్పగించింది. ఫలితంగా ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి! పల్లెకెలె: టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ వరుసగా ఐదోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ‘సూపర్–8’లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్–2 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై నెగ్గింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఫర్హాన్ (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో తొలి టి20 సెంచరీతో జట్టును గెలిపించాడు. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన ఇంగ్లండ్ ఇప్పుడు పాక్‌పై గెలిచి ముందంజ వేసింది. మరోవైపు పాక్ సెమీస్ చేరే అవకాశాలకు గండిపడింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై తప్పనిసరిగా గెలవడంతో పాటు ఇతర సమీకరణాలు, రన్‌రేట్‌లపై ఆ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది. దక్కని శుభారంభం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌కు శుభారంభం లభించలేదు. సయీమ్ అయూబ్ (7), కెప్టెన్ సల్మాన్ ఆగా (5) తమ వైఫల్యాలను కొనసాగించారు. ఈ దశలో ఫర్హాన్, బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లేలో ఒక్క సిక్సర్ కూడా లేకుండా పాక్ 46 పరుగులు చేసింది. ఆ తర్వాతా ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జట్టు ఒకదశలో వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే కొట్టలేకపోయింది! ఈ క్రమంలో బాబర్ వెనుదిరగ్గా, ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రం కాస్త దూకుడుగా ఆడాడు. మరోవైపు 37 బంతుల్లో ఫర్హాన్ అర్ధసెంచరీ పూర్తయింది. 16 ఓవర్లలో స్కోరు 126/4. అయితే చివరి 4 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసిన టీమ్ 5 వికెట్లు కోల్పోయింది. షాదాబ్ (11 బంతుల్లో 23; 4 ఫోర్లు) కాస్త ధాటిని ప్రదర్శించడంతో స్కోరు 160 పరుగులు దాటింది. హడలెత్తించిన అఫ్రిది ఛేదనలో ఇంగ్లండ్‌ను ఆరంభంలోనే షాహిన్ షా అఫ్రిది దెబ్బ తీశాడు. తన తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను... తన రెండో ఓవర్లో జోస్ బట్లర్ (2)ను, మూడో ఓవర్లో బెతెల్ (8)ను వెనక్కి పంపించాడు. అయితే ఈ స్థితిలో బ్రూక్ ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. నవాజ్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లేలో టీమ్ స్కోరు 53 పరుగులకు చేరింది. తక్కువ వ్యవధిలో బాంటన్ (2), స్యామ్ కరన్ (16) అవుటైనా... మరోవైపు బ్రూక్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతను అదే ధాటిని కొనసాగించగా, విల్ జాక్స్ (23 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అలవోకగా షాట్లు ఆడిన బ్రూక్... అఫ్రిది బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా భారీ సిక్స్‌తో శతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత తడబడినా... చివరకు ఐదు బంతుల ముందే ఇంగ్లండ్ గట్టెక్కింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (ఎల్బీ) (బి) ఒవర్టన్ 63; అయూబ్ (సి) బెతెల్ (బి) ఆర్చర్ 7; సల్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 5; బాబర్ (బి) ఒవర్టన్ 25; ఫఖర్ (సి) డాసన్ (బి) రషీద్ 25; షాదాబ్ (రనౌట్) 23; ఉస్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 8; నవాజ్ (ఎల్బీ) (బి) డాసన్ 0; అఫ్రిది (సి) స్యామ్ కరన్ (బి) ఆర్చర్ 2; సల్మాన్ మీర్జా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–14, 2–27, 3–73, 4–122, 5–132, 6–146, 7–146, 8–149, 9–164. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2, ఒవర్టన్ 3–0–26–2, డాసన్ 4–0–24–3, స్యామ్ కరన్ 3–0–24–0, రషీద్ 4–0– 31–1, జాక్స్ 2–0–27–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 0; బట్లర్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 2; బ్రూక్ (బి) షాహిన్ అఫ్రిది 100; బెతెల్ (సి) ఫర్హాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; బాంటన్ (సి) ఉస్మాన్ (బి) తారిఖ్ 2; స్యామ్ కరన్ (సి) నవాజ్ (బి) తారిఖ్ 16; జాక్స్ (బి) నవాజ్ 28; ఒవర్టన్ (స్టంప్డ్) ఉస్మాన్ (బి) నవాజ్ 0; డాసన్ (నాటౌట్) 1; ఆర్చర్ (నాటౌట్) 5; మొత్తం (19.1 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–35, 4–58, 5–103, 6–155, 7–160, 8–161. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–30–4, సల్మాన్ మీర్జా 3.1–0–26–0, సయీమ్ అయూబ్ 2–0–21–0, నవాజ్ 3–0–26–2, షాదాబ్ ఖాన్ 3–0–31–0, ఉస్మాన్ తారిఖ్ 4–0–31–2. 3 ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా హ్యారీ బ్రూక్ నిలిచాడు. గతంలో జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ మాత్రమే ఈ ఘనత నమోదు చేశారు. ఓవరాల్‌గా ఏ జట్టు తరఫునైనా టి20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా కూడా బ్రూక్ గుర్తింపు పొందాడు. టి20 ప్రపంచకప్‌లో నేడుశ్రీలంక X న్యూజిలాండ్వేదిక: కొలంబో రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయం
టీ 20 ప్రపంచకప్ సూపర్-8లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం, బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు వికెట్ల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విరవిహారం సృష్టించాడు. 51 బంతుల్లో సెంచరీ చేశాడు. వరుసగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతో సూపర్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ ఫినిషర్ విల్ జాక్స్ దూకుడు ప్రదర్శించాడు. 28 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించారు. ఇక పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ 4 వికెట్లు,మహ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ చెరో రెండు వికెట్లు తీశారు. -
దక్షిణాఫ్రికాకు దాసోహం
భయపడినట్లే జరిగింది. గ్రూప్ దశలో మూడు చిన్న జట్లతో పాటు పాకిస్తాన్‌లాంటి బలహీన టీమ్‌పై గెలిచినా భారత జట్టు ప్రదర్శనపై ఎక్కడో కొంత సందేహం. తమ స్థాయికి తగ్గ ఆట కనబర్చడం లేదని, ప్రత్యర్థులను పూర్తిగా తొక్కేసే విధంగా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడంలేదని అనిపించింది. బలమైన ప్రత్యర్థి ఎదురైతే ఇలాంటి ఆటతో ఇబ్బంది తప్పదని సందేహం వచ్చింది. చివరకు దక్షిణాఫ్రికా మన బలహీనతలను బాగా గుర్తించి దెబ్బ కొట్టింది. అహ్మదాబాద్ మైదానంలో ఎంత భారీ స్కోరు అయినా ఛేదన సులువు అని రికార్డులు చెబుతుండటంతో టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోవడం తప్పు చేసినట్లుగా మ్యాచ్‌కు ముందు చర్చ మొదలైంది. కానీ ఈ టోర్నీలో ఇప్పటికే ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడిన సఫారీలు పిచ్‌ను సరిగ్గా అంచనా వేశారు. భారీ స్కోరు సాధించి కాపాడుకోగలమని నమ్మారు. పదునైన బౌలింగ్‌తో భారత్‌ను ఏ దశలోనూ కోలుకోనీయకుండా పడగొట్టారు. 2024 టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి వరల్డ్ కప్ వేదికపైనే ప్రతీకారం తీర్చుకున్నారు. గత మ్యాచ్‌లలో ఒకరు విఫలమైనా... మన జట్టును ఆదుకునేందుకు మరొకరు సిద్ధమయ్యారు. ఈసారి అంతా సమష్టి వైఫల్యమే. చివర్లో శివమ్ దూబే మెరుపులు కూడా ఒక లాంఛనం మాత్రమే. ఈ ఓటమి అనుభవంతో భారత్ తర్వాతి మ్యాచ్‌లకు ఎలాంటి వ్యూహంతో ఆడుతుందో చూడాలి. అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 2024 టి20 ప్రపంచకప్ టోర్నీ నుంచి మొదలు పెడితే వరుసగా 13 మ్యాచ్‌లు నెగ్గిన భారత్ గెలుపు పరుగు ఎట్టకేలకు ఆగింది. ‘సూపర్–8’ దశలో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్–1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా, బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 51 బంతుల్లోనే 97 పరుగులు జోడించగా, చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే (37 బంతుల్లో 42; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. మార్కో యాన్సెన్ (4/22) భారత్‌ను దెబ్బ తీయగా, కేశవ్ మహరాజ్‌కు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ తర్వాతి సూపర్ ఎయిట్స్ మ్యాచ్‌లో గురువారం చెన్నైలో జింబాబ్వేతో తలపడుతుంది. కీలక భాగస్వామ్యం... బుమ్రా, అర్ష్ దీప్ పదునైన బౌలింగ్ కారణంగా దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. బుమ్రా తన వరుస ఓవర్లో డికాక్ (6), రికెల్టన్ (7)లను వెనక్కి పంపించగా, ఈ రెండు వికెట్ల మధ్య ఓవర్లో మార్క్రమ్ (4)ను అర్ష్ దీప్ అవుట్ చేశాడు. దాంతో సఫారీ టీమ్ 20/3తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో బ్రెవిస్, మిల్లర్ కలిసి దూకుడుగా ఆడుతూ జట్టును ఆదుకున్నారు. పవర్‌ప్లేలో జట్టు 41 పరుగులు చేసింది. ఆరు బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు బాది మిల్లర్ జోరు ప్రదర్శించగా, వరుణ్ ఓవర్లో బ్రెవిస్ వరుసగా 4, 6 కొట్టాడు. అదే ఓవర్లో మిల్లర్ కూడా సిక్స్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దూబే ఓవర్లోనూ ఫోర్, సిక్స్ బాదిన బ్రెవిస్ అతని తర్వాతి ఓవర్లో అవుట్ కావడంతో ఎట్టకేలకు భారీ భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు 26 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. 15 ఓవర్ల తర్వాత 144/4తో సఫారీ జట్టు 200 స్కోరుపై కన్నేసింది. అయితే ఇక్కడ ప్రత్యర్థిని కట్టడి చేయడంలో టీమిండియా సఫలమైంది. బుమ్రా చక్కటి బౌలింగ్‌తో తన రెండు ఓవర్లలో 8 పరుగులే ఇవ్వడంతో 16–19 మధ్య మొత్తం 23 పరుగులే రాగా, దక్షిణాఫ్రికా 3 వికెట్లు కూడా చేజార్చుకుంది. కానీ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో స్టబ్స్ ఫోర్, 2 సిక్స్‌లు సహా 20 పరుగులు రాబట్టాడు. టపటపా... భారీ ఛేదనలో ఏ దశలోనూ భారత్ గెలిచేలా కనిపించలేదు. తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ (0) అవుటైన తర్వాత తర్వాతి ఓవర్ తొలి బంతికే తిలక్ వర్మ (1) వెనుదిరిగాడు. ఎట్టకేలకు వరల్డ్ కప్‌లో ఖాతా తెరిచిన అభిషేక్ శర్మ (15) కూడా క్రీజ్‌లో ఉన్నంతసేపు తడబడ్డాడు. 6 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 31/3. బ్యాటింగ్‌లో ముందుగా వచ్చిన వాషింగ్టన్ సుందర్ (11) ప్రభావం చూపలేకపోగా, కెప్టెన్ సూర్యకుమార్ (22 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ కూడా పేలవంగా ముగిసింది. హార్దిక్ పాండ్యా (18), రింకూ సింగ్ (0) ఒకే స్కోరు వద్ద అవుట్ కావడంతో భారత్ గెలుపు ఆశలు కోల్పోయింది. 30 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేయాల్సిన స్థితిలో దూబే కొంత ధాటిని ప్రదర్శించాడు. అతను మూడు సిక్స్‌లతో గెలుపు అంతరాన్ని తగ్గించగలిగాడు! మ్యాచ్‌లో సుందర్ పిచాయ్... భారత పర్యటనలో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు అతిథిగా హాజరయ్యారు. మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్‌తో కలిసి ఆయన టి20 వరల్డ్ కప్ ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కామెంటరీ బాక్స్‌లో కూడా రవిశాస్త్రితో ఆయన ముచ్చటించారు. క్రికెట్‌కు తాను వీరాభిమానినని, 80వ దశకంలో భారత మ్యాచ్‌లను చూస్తూ నాటి ఆటగాళ్లకు అభిమానిగా మారానని సుందర్ గుర్తు చేసుకున్నారు. ఐసీసీ ‘గ్లోబల్ పార్ట్నర్స్’లో ఒకటిగా ఉన్న గూగుల్ సంస్థ వరల్డ్ కప్ స్పాన్సర్‌గా కూడా వ్యవహరిస్తోంది. 76 పరుగుల పరంగా టి20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టుకిదే అతిపెద్ద ఓటమి.33 టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. 32 వికెట్లతో అశ్విన్ పేరిట ఉన్న రికార్డును బుమ్రా 33 వికెట్లతో బద్దలు కొట్టాడు. 2 2022 టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత భారత జట్టు ఐసీసీ పరిమిత ఓవర్ల (వన్డే, టి20) టోర్నీల్లో మొత్తం 29 మ్యాచ్‌లు ఆడింది. 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ రెండు పరాజయాలు అహ్మదాబాద్ (2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్) వేదికపైనే వచ్చాయి.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్ 4; డికాక్ (బి) బుమ్రా 6; రికెల్టన్ (సి) దూబే (బి) బుమ్రా 7; బ్రెవిస్ (సి) అభిషేక్ (బి) దూబే 45; మిల్లర్ (సి) తిలక్ (బి) వరుణ్ 63; స్టబ్స్ (నాటౌట్) 44; యాన్సెన్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 2; బాష్ (సి) అండ్ (బి) బుమ్రా 5; రబాడ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–10, 2–12, 3–20, 4–117, 5–152, 6–158, 7–167. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–28–2, బుమ్రా 4–0–15–3, వరుణ్ 4–0–47–1, సుందర్ 2–0–17–0, పాండ్యా 4–0–45–0, దూబే 2–0–32–1. భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) రికెల్టన్ (బి) మార్క్రమ్ 0; అభిషేక్ (సి) బాష్ (బి) యాన్సెన్ 15; తిలక్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 1; సూర్యకుమార్ (సి) బ్రెవిస్ (బి) బాష్ 18; సుందర్ (సి) డికాక్ (బి) బాష్ 11; దూబే (సి) ఎన్గిడి (బి) యాన్సెన్ 42; పాండ్యా (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 18; రింకూ (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 0; అర్ష్ దీప్ (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 1; వరుణ్ (నాటౌట్) 0; బుమ్రా (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–0, 2–5, 3–26, 4–43, 5–51, 6–86, 7–86, 8–88, 9–111, 10–111.బౌలింగ్: మార్క్రమ్ 1–0–5–1, యాన్సెన్ 3.5–0–22–4, రబాడ 4–0–32–0, ఎన్గిడి 4–0–15–0, మహరాజ్ 3–0–24–3, బాష్ 3–0–12–2. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X జింబాబ్వేవేదిక: ముంబై; రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
స్పిన్‌కు ఎదురొడ్డి... స్పిన్‌తోనే పడగొట్టి...
పల్లెకెలె: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఇంగ్లండ్ జట్టు టి20 ప్రపంచకప్ ‘సూపర్–8’లో శుభారంభం చేసింది. ఆదివారం గ్రూప్–2లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను బోల్తా కొట్టించింది. గ్రూప్ దశలో పడుతూ లేస్తూ సాగిన ఇంగ్లండ్... ‘సూపర్ ఎయిట్’లో సాధికారిక విజయం ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జోస్ బట్లర్ (7), జాకబ్ బెథెల్ (3), టామ్ బాంటన్ (6), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (14), స్యామ్ కరన్ (11), డాసన్ (6) విఫలమయ్యారు. స్పిన్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ (21; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. సొంతగడ్డపై శ్రీలంక బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఒక్క సాల్ట్ తప్ప మిగిలిన వాళ్లెవరూ భారీ షాట్లు ఆడలేకపోయారు. లంక బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగె 3 వికెట్లు పడగొట్టగా... మధుషనక, తీక్షణ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక పూర్తిగా తడబడింది. 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షనక (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఒక్కడే పోరాడగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ 3 వికెట్లు తీయగా... ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సాల్ట్ ఒక్కడే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాల్ట్ ఒక్కడే దూకుడు కనబర్చాడు. లంక బౌలర్ల ధాటికి సహచర బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరుతున్నా... సాల్ట్ మాత్రం తనదైన శైలిలో షాట్లు ఆడాడు. వరల్డ్‌కప్ తొలి పోరులో నేపాల్ చేతిలో ‘చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు’ గెలిచిన ఇంగ్లండ్...‘సూపర్ –8’లోనూ అలాంటి అనుభవమే చవిచూసేలా కనిపించింది. అయితే సాల్ట్ మెరుపులకు బౌలర్ల సహకారం తోడవడంతో ... ఇంగ్లండ్ పని సులువైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 15 బౌండరీలు మాత్రమే నమోదైతే... శ్రీలంక కేవలం 12 బౌండరీలకే పరిమితమైంది. పవర్ ప్లేలోనే 34/5... ఓ మాదిరి లక్ష్యఛేదనలో లంక తడబడింది. ఇంగ్లండ్ బౌలర్లు ఆర్చర్, జాక్స్ ధాటికి... ఆరు ఓవర్లు ముగిసేసరికి 34/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. నిసాంక (9), కమిల్ (6), కుశాల్ మెండిస్ (4), పవన్ రత్నాయకే (0), దునిత్ వెల్లలాగె (10) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. కెప్టెన్ షనక కాస్త పోరాడే ప్రయత్నం చేసినా... ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వికెట్ల పతనం అలాగే కొనసాగింది. దీంతో శ్రీలంక లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. తదుపరి ‘సూపర్–8’ మ్యాచ్‌ల్లో మంగళవారం పాకిస్తాన్‌తో ఇంగ్లండ్; బుధవారం న్యూజిలాండ్‌తో శ్రీలంక తలపడతాయి. -
T20 World Cup: ఇంగ్లండ్ దెబ్బకు చేతులెత్తేసిన శ్రీలంక
పల్లెకెలె: టీ 20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. సూపర్-8లో భాగంగా గ్రూప్-2లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్.. ఆపై శ్రీలంకను 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూల్చి విజయాన్ని అందుకుంది. శ్రీలంక ఆటగాళ్లలో దసునా షనాకా(30) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో సొంత గడ్డపై శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ మూడు వికెట్లు సాధించగా, జోఫ్రా ఆర్చర్, డావ్సన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు తీసి.. శ్రీలంక పతనాన్ని శాసించారు. ఫలితంగా శ్రీలంకకు ఘోర పరాజయం తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(62) ఒంటరి పోరాటం చేసి ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఇంగ్లండ్ వికెట్లు ఓ వైపు పడుతున్నా సాల్ట్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ కొనసాగించాడు. దాంతో ఇంగ్లండ్ మూడంకెల స్కోరును దాట కల్గింది. -
పునరావృతమా... ప్రతీకారమా...
రెండేళ్ల క్రితం టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్... ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 7 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచింది. అభిమానులెవరూ దీనిని మరచిపోలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఎనిమిది మ్యాచ్‌లు జరిగినా...వరల్డ్ కప్ లెక్కే వేరు. నాటి ఫైనల్ తర్వాత ఇప్పుడు రెండు టీమ్‌లు అదే వరల్డ్ కప్ అసలు మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఫైనల్ కాని ఫైనల్ లాంటి మ్యాచ్‌లో 2024 ఫలితాన్ని భారత్ పునరావృతం చేస్తుందా లేక దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంటుందా ఆసక్తికరం.అహ్మదాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అన్నింటా గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించింది. కానీ ఎదురుపడిన జట్లు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ గట్టి ప్రత్యర్థులైతే కానే కావు. దాయాది పాకిస్తాన్ అయినా పోటీ ఇస్తుందనుకుంటే ఆ మూడింటి సరసనే నిలిచింది. ఈ నేపథ్యంలో ఆడిన అన్ని గెలిచాం. అజేయమని ఆదమరిస్తే మాత్రం టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ‘సూపర్ ఎయిట్స్’ దశలో భాగంగా నేడు (ఆదివారం) జరిగే పోరులో దక్షిణాఫ్రికాను భారత్ ఎదుర్కొంటుంది. దక్షిణాఫ్రికా కూడా తమ గ్రూప్‌లో ఆడిన నాలుగూ గెలిచి టాపర్‌గా ముందంజ వేసింది. బలాబలాలను బట్టి చూస్తే సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం. అభిషేక్ ‘జీరో’ నుంచి ‘హీరో’ అయ్యేనా... సూపర్ హిట్టర్, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత్ గంపెడాశలు పెట్టుకుంది. మెరుపులతో మురిపిస్తాడని, మ్యాచ్‌లను ఏకపక్షంగా మలిచేస్తాడని భావించింది. కానీ ఈ ప్రపంచకప్‌లోనే అభిషేక్ ఖాతా తెరువలేదు. అన్ని ‘జీరో’లే! భారత్ స్థాయికి తగని ప్రత్యర్థులతోనే అతను ఆడలేకపోవడం జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతుంది. నేడు దక్షిణాఫ్రికాతో కీలకమైన సూపర్ పోరులో అయినా ఖాతా తెరవాలని, సఫారీ బౌలింగ్‌పై మెరిపించాలని జట్టే కాదు యావత్ దేశం గట్టిగా కోరుకుంటుంది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు భారత్ ఈ మెగా ఈవెంట్లో గొప్ప మ్యాచ్ అయితే ఆడలేదు. అమెరికాతో జరిగిన పోరులో ఒకే ఒక్కడు సూర్యకుమార్ మెరిపించాడు. ఇంకెవరూ 30 పరుగులైనా చేయలేదు. నమీబియాలాంటి ప్రత్యరి్థపై కూడా ఆడింది ఇద్దరే! ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలు ఫిఫ్టీలు చేశారు. పాక్‌తో కీలకమైన పోరు జరిగినా దంచింది మాత్రం ఇషాన్ కిషన్ ఒక్కడే! నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి పోరులోనూ భారత ఇన్నింగ్ ఒక్కడి ఫిఫ్టీపైనే ఆధారపడింది. శివమ్ దూబే రాణించాడు. క్రికెట్ కూనలే ఎదురైనా, పాక్‌తో జాగ్రత్తగా ఆడాల్సివున్నా... ప్రతీ మ్యాచ్‌లో ఏ ఒకరో లేదంటే ఇద్దరో ఆడారు. ఇకపై కూడా ఎవరో ఒకరిద్దరు ఆడితే గెలిచేయొచ్చనుకుంటే భారత్ కథ ఈ సూపర్–8కే పరిమితమవుతుంది. స్పీడ్‌స్టర్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు భారత టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని ప్రతి మ్యాచ్‌లోనూ నిలబెడుతున్నారు. దుర్బేధ్యంగా దక్షిణాఫ్రికా ఈ ప్రపంచకప్‌లో గత ఫైనలిస్టు దక్షిణాఫ్రికా పట్టుదలతో ఆడింది. ప్రధాన బ్యాటర్లే కాదు.... లోయర్ మిడిలార్డర్లోనూ దంచేసిన ఆటగాళ్లున్నారు. అమెరికాపై 200 పైచిలుకు చేసిన సఫారీ... అఫ్గాన్‌పై 187/6 స్కోరు చేసింది. ఇక కివీస్‌పై అయితే 176 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఛేదించింది. యూఏఈని తక్కువ స్కోరు (122/6)కే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా 13.2 ఓవర్లలోనే ఛేదంచింది. కెప్టెన్‌మార్క్‌రమ్, డికాక్, రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్ ఇలా అందరూ ఫామ్‌లో ఉన్నారు. అంతకుమించి సమష్టిగా రాణిస్తున్నారు. ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఒకరిద్దరితో గెలిచిన సందర్బాలే లేవు. ఇక బౌలింగ్ బలం గురించి చెప్పాల్సిన పనిలేదు. రబడా, ఎన్గిడి, కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్, యాన్సెన్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించగలరు. పిచ్–వాతావరణం అహ్మదాబాద్ వికెట్ బ్యాటింగ్‌కే అనుకూలం. ప్రత్యేకించి టి20లైతే ధనాధన్ షో గ్యారంటీ. ఈ మైదానంలో ఛేదన సులువు కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. మ్యాచ్‌కు వర్షం ముప్పయితే లేదు. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ, అక్షర్ పటేల్, వరుణ్, బుమ్రా, అర్ష్ దీప్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, బాష్, రబడా, ఎన్గిడి, కేశవ్ మహరాజ్. -
పాకిస్తాన్, న్యూజిలాండ్ ‘సూపర్–8’ మ్యాచ్ రద్దు
టి20 వరల్డ్ కప్ ‘సూపర్ ఎయిట్స్’ దశ పోటీలు వర్షం ప్రభావంతో మొదలయ్యాయి. గ్రూప్–2లో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. టాస్ నెగ్గిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత సమయానికే మ్యాచ్ ఆరంభమవుతున్నట్లు కనిపించిన దశలో ఒక్కసారిగా వాన ముంచెత్తింది. స్వల్పంగా చినుకులతో మొదలైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది.ప్రేమదాస స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా వాన తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సూపర్–8లో పాక్ తమ తర్వాతి మ్యాచ్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో... న్యూజిలాండ్ బుధవారం శ్రీలంకతో తలపడతాయి. నేటి సూపర్ – 8 మ్యాచ్లుశ్రీలంక X ఇంగ్లండ్‌వేదిక: పల్లెకెలె ; మ.3.00 గంటల నుంచి భారత్ X దక్షిణాఫ్రికావేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘సూపర్–8’ సమయం
టి20 ప్రపంచ కప్‌లో మరింత వినోదానికి నేటితో తెర లేవనుంది. పసికూనలు, పస లేని జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా టాప్–8 టీమ్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మాజీ చాంపియన్ పాకిస్తాన్ తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో మూడు మ్యాచ్‌లు గెలిచి పాక్ ముందంజ వేయగా, గ్రూప్ ‘డి’ నుంచి కూడా మూడు విజయాలతో కివీస్ తర్వాతి దశకు అర్హత సాధించింది. కొలంబో: పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఇటీవల వన్డేలు, టి20 ఫార్మాట్లలో తరచుగా తలపడ్డాయి. రెండున్నరేళ్ల వ్యవధిలో ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్‌లు జరగ్గా... ఇందులో 17 వన్డేలు, 24 టి20లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి బలాబలాల గురించి ఇరు జట్లకు మంచి అవగాహన ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లను మినహాయిస్తే... 2022 టి20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత రెండు జట్లు ఒక పెద్ద టోర్నీలో పోటీకి దిగడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ జట్టు లీగ్ దశను దాటినా... అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోతోంది. సీఫెర్ట్, అలెన్ మాత్రమే బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించగా... రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, డరైల్ మిచెల్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బౌలింగ్‌లో కూడా డఫీ, సోధి భారీగా పరుగులిస్తున్నారు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వైఫల్యం కూడా వరల్డ్ కప్‌లో జట్టును ఇబ్బంది పెట్టింది. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్ ఆశలు మిగలాలంటే కివీస్ బృందం సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు పాకిస్తాన్‌కు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడటం కాస్త కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో మ్యాచ్ ఆడిన ఆ జట్టుకు పిచ్ పరిస్థితిపై మంచి అవగాహన ఉంది. అందుకే తమ స్పిన్ బలగాన్ని జట్టు నమ్ముకుంది. ప్రధాన పేసర్ షాహిన్ అఫ్రిది ఘోరంగా విఫలం కాగా... మరో పేసర్ ఫహీమ్ ఒక్క ఓవర్ కూడా బౌలింగే చేయలేదు. స్పిన్నర్లు ఉస్మాన్ తారిఖ్, అబ్రార్, షాదాబ్, నవాజ్‌లపై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే బ్యాటింగ్‌లో ఫర్హాన్ మినహా సయీమ్ అయూబ్, సల్మాన్, బాబర్ ఆజమ్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఇరు జట్లు ఫామ్‌లో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఆసక్తికర పోరు ఖాయం. మ్యాచ్ రోజున వర్షసూచన ఉంది. -
అటు ఆల్బీ... ఇటు మోర్నీ...
అహ్మదాబాద్: టి20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్, గత రన్నరప్ మధ్య రేపు జరిగే ‘సూపర్ ఎయిట్స్’ మ్యాచ్‌పై అందరి దృష్టీ నిలిచింది. తమ ఆధిక్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుండగా, ప్రతీకారం తీర్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. ఇరు జట్లు తమ గ్రూప్‌లలో అన్ని మ్యాచ్‌లూ గెలిచి టాపర్లుగా ముందంజ వేశాయి. అయితే మైదానం లోపలే కాకుండా బౌండరీ బయట కూడా ఒక ‘పోరు’ ఆసక్తిని రేపుతోంది. ఇరు జట్ల సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న సొంత అన్నదమ్ములు ఆల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ ప్రత్యర్థులుగా తమ వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు.రేపు మ్యాచ్ జరిగే సమయంలో వేర్వేరు డగౌట్లలో వీరు కనిపించనున్నారు. మోర్నీ గత కొంతకాలంగా భారత బౌలింగ్ కోచ్‌గా పని చేస్తుండగా, ఈ టోర్నీ కోసమే ఆల్బీని ‘ప్రత్యేక సలహాదారుడు’గా దక్షిణాఫ్రికా తీసుకుంది. శుక్రవారం ఇరు జట్ల ప్రాక్టీస్ సందర్భంగా ఆల్బీ, మోర్నీ గ్రౌండ్లోకి వచ్చినా ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదు! ‘ఇప్పటి పరిస్థితుల్లో మా గురించి కాదు. మా అమ్మ గురించే అసలు ఆలోచన. ఆమెనే మా ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలా అని ఎక్కువగా ఆందోళన చెందుతోంది’ అని ఆల్బీ వెల్లడించాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆల్బీ దక్షిణాఫ్రికా తరఫున 58 వన్డేలు, 50 టి20 మ్యాచ్‌లు ఆడగా... స్ట్రయిక్ పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందిన మోర్నీ 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20ల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ తరఫున స్యామ్ కరన్ బరిలోకి దిగగా... అతని సోదరుడు బెన్ కరన్ జింబాబ్వే జట్టులో ఉన్నాడు. -
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
-
ఘనంగా ముగించిన అఫ్గానిస్తాన్
చెన్నై: 2024 టి20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కు చేరినా... ఈ సారి లీగ్ దశకే పరిమితమైన అఫ్గానిస్తాన్ భారీ గెలుపుతో టోర్నీని ముగించింది. గ్రూప్ ‘డి’లో బలమైన జట్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల చేతిలో పరాజయంతో ‘సూపర్ ఎయిట్స్’ అవకాశాలు కోల్పోయిన అఫ్గానిస్తాన్ ... కెనడాతో గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇబ్రహీమ్ జద్రాన్ (56 బంతుల్లో 95 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)... సాదిఖుల్లా (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గుర్బాజ్ (20 బంతుల్లో 30; 5 ఫోర్లు) మెరిపించారు. కెనడా బౌలర్లలో జస్కరణ్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కెనడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులే చేయగలిగింది. హర్ష్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), సాద్ బిన్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. నబీ 4 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ ఓడిన రెండో జట్టుగా (నమీబియాతో పాటు) కెనడా నిలిచింది. అంతర్జాతీయ టి20ల్లో కెనడా తరఫున అత్యధిక పరుగులు (1305) సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందిన నవనీత్ ధలివాల్ ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు గత నాలుగేళ్లుగా అఫ్గానిస్తాన్‌ను బలమైన జట్టుగా తీర్చిదిద్ది టీమ్ సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ జొనాథన్ ట్రాట్ కూడా ఈ మ్యాచ్ తర్వాత తన పదవి నుంచి తప్పుకుంటున్నాడు. టి20 ప్రపంచకప్‌లో నేడుఆస్ట్రేలియా X ఒమన్‌వేదిక: పల్లెకెలె; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
శ్రీలంకకు జింబాబ్వే షాక్
కొలంబో: టి20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను సంచలన రీతిలో ఓడించిన జింబాబ్వే ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆసీస్‌పై గెలవడం గాలివాటం కాదని నిరూపిస్తూ ఆ జట్టు మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ్రస్టేలియాని చిత్తు చేసి సత్తా చాటిన ఆతిథ్య జట్టు శ్రీలంకను వారి సొంతగడ్డపైనే ఓడించి జింబాబ్వే షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి రద్దు కాగా, మిగిలిన మూడూ నెగ్గి అజేయంగా, అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ‘సూపర్ ఎయిట్స్’లో తమను తక్కువగా అంచనా వేయవద్దంటూ హెచ్చరికను జారీ చేసింది. గురువారం జరిగిన పోరులో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేయగా...జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసి నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఇన్నింగ్స్‌లో నిసాంక (41 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, పవన్ రత్నాయకే (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. నిసాంక, కుశాల్ పెరీరా (22; 4 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత జింబాబ్వే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యరి్థని నిలువరించింది. చివర్లో రత్నాయకే, వెలలాగె (15 నాటౌట్) కలిసి ధాటిగా ఆడారు. 19వ ఓవర్లో రత్నాయకే వరుసగా 4, 6, 4 బాదగా...ఆఖరి ఓవర్లలో వెలలాగె మూడు ఫోర్లు కొట్టాడు. ఛేదనలో జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు), మరుమని (26 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బెన్నెట్ జాగ్రత్తగా ఆడగా ఇతర సహచరులు దూకుడు ప్రదర్శించడంతో జింబాబ్వే లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (26 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మరుమని, ర్యాన్ బర్ల్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 64 బంతుల్లో 102 పరుగులు సాధించడం విశేషం. 10 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉండటంతో జింబాబ్వే విజయంపై సందేహాలు ఉన్నా...చివరకు జింబాబ్వే బ్యాటర్లు దానిని చేసి చూపించారు. ముఖ్యంగా హేమంత ఓవర్లో రజా వరుసగా 6, 6, 4 బాదడంతో పరిస్థితి మారిపోయింది. తీక్షణ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా ...తొలి బంతికి మున్యోంగా సిక్స్, మూడో బంతికి బెన్నెట్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించారు. -
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
-
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
-
అజేయంగా ముగించాలని...
అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్‌లో ఈ రోజు మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. నెదర్లాండ్స్ జట్టుతో భారత్... యూఏఈతో దక్షిణాఫ్రికా... నమీబియాతో పాకిస్తాన్ తలపడనున్నాయి. టీమిండియా మ్యాచ్ సహా దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా నామమాత్రమైందే! పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కీలకమైంది. ఎందుకంటే ఇప్పటికే ‘సూపర్–8’ బెర్తుల్లో ఏడు (భారత్, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్) ఖరారయ్యాయి. మిగిలింది ఒక్క బెర్త్ మాత్రమే. అది కూడా భారత జట్టున్న గ్రూప్ ‘ఎ’లోనే ఉండటంతో ఆఖరి బెర్త్ ఎవరిదో నేడే తేలుతుంది. దీంతో ఈ రాత్రికే ‘సూపర్–8’లో ఎవరెవరు ప్రత్యర్థులనేది కూడా తెలిసిపోతుంది. ఇక మన మ్యాచ్ విషయానికొస్తే డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ ఆడిన మూడు గెలిచి దర్జాగా ‘సూపర్–8’కు చేరింది. నేడు జరిగే అనామక పోరులో భారత్... నెదర్లాండ్స్‌పై గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించడమే పనిగా పెట్టుకుంది. టీమిండియాకు ఓడినా నష్టం లేదు. అలాగని నెదర్లాండ్స్ గెలిస్తే ఒరిగే ప్రయోజనం కూడా లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఇరుజట్లకు అక్కర్లేని మ్యాచ్. వరల్డ్‌కప్ షెడ్యూల్లో ఉన్న మ్యాచ్... కాబట్టే ఆడాలి అంతే! ఈ మెగా ఈవెంట్లో టైటిల్ ఫేవరెట్, ఆతిథ్య భారత్‌పై ఎవరికి ఏ బెంగా లేదు. సమష్టిగా రాణిస్తోంది. ప్రపంచకప్‌లో దూసుకెళుతోంది... కానీ ధనాధన్ హిట్టర్ అభిషేక్ శర్మ ఫామ్‌పైనే జట్టు మేనేజ్మెంట్ కన్నేసింది. రెండు ‘డకౌట్లు’ కాస్త ఇబ్బందికరం కావడంతో కీలకమైన ‘సూపర్–8’కు ముందే ఈ ఓపెనర్ కూడా ఫామ్‌లోకి వస్తే టీమిండియాకు ఎదురుండదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే ఈ మ్యాచ్‌లోనే కాదు... వరల్డ్‌కప్‌లోనే భారత్‌కు పరుగుల పండగ ఖాయమవుతుంది. భారత్ జోరుకు ఎదురుందా... జట్టు జోరుపై, విజయాల తీరుపై ఎవరికీ ఎలాంటి సందేహాలే లేవు. ఇలాంటి జట్టుపై నెదర్లాండ్స్‌లాంటి కూన సంచలనానికి అవకాశమే లేదు. ఇషాన్ కిషన్ మెరుపులకు అభిషేక్ హిట్స్ తోడైతే జట్టుకు ఇది భలే బ్యాటింగ్ ప్రాక్టీసుగా పనికొస్తుంది. తిలక్ వర్మ,కెప్టెన్ సూర్య, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్‌లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్‌కు ప్రత్యర్థి శిబిరం నుంచి పెద్దగా సవాళ్లయితే ఉండవు. బౌలింగ్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే హైదరాబాదీ పేసర్ సిరాజ్ బరిలోకి దిగుతాడు. మొత్తానికి పేస్, స్పిన్, బ్యాటింగ్ ఇలా అన్ని రంగాల్లో భారత జట్టు పటిష్టంగా ఉంది. మరోవైపు డచ్ టీమ్ మూడు మ్యాచ్‌లాడి ఒకటే గెలిచింది. టోర్నీ నుంచి ఈ ‘ఒకటే’ విజయంతో నిష్క్రమిస్తుంది తప్ప అసాధారణ, అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియానైతే ఢీకొట్టలేదు. పిచ్, వాతావరణం అహ్మదాబాద్ వికెట్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. దీంతో టాస్ నెగ్గిన జట్టు చేజింగ్‌కే మొగ్గు చూపొచ్చు. మంచు ప్రభావం ఉంటుంది. వర్షం ముప్పు లేదు.టి20 ప్రపంచకప్‌లో నేడుదక్షిణాఫ్రికా X యూఏఈవేదిక: న్యూఢిల్లీ; ఉ.గం. 11 నుంచిపాకిస్తాన్ X నమీబియావేదిక: కొలంబో; మ.గం. 3 నుంచి భారత్ X నెదర్లాండ్స్వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆస్ట్రేలియా ఇంటికి... జింబాబ్వే ముందుకు...
పల్లెకెలె: ఆ్రస్టేలియాకు షాక్. అప్పుడు జింబాబ్వే సంచలనంతో షాక్ ఇస్తే, ఇప్పుడు వానొచ్చి మరో షాక్ ఇచ్చింది. జింబాబ్వే–ఐర్లాండ్ల మ్యాచ్ జరగకుండా వరుణుడు అడ్డుపడటంతో ఈ లీగ్ మ్యాచ్ రద్దయ్యింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. ఫలితంగా సికందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే 5 పాయింట్లతో తాజా టి20 ప్రపంచకప్‌లో సూపర్–8కు అర్హత సంపాదించింది. ఆఖరి మ్యాచ్ మిగిలుండగానే ఆ్రస్టేలియా మెగా ఈవెంట్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. 2009 తర్వాత టి20 ప్రపంచకప్‌లో తదుపరి దశకు అర్హత పొందకుండా గ్రూప్ దశలోనే ఆ్రస్టేలియా వెనుదిరగడం ఇదే ప్రథమం. గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్, జింబాబ్వేల మధ్య మ్యాచ్ జరగాల్సింది. భారీ వర్షం వల్ల మ్యాచ్ ఎంతకీ మొదలవలేదు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మ్యాచ్ జరిగే అవకాశమే లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నట్లు... టీమిండియాకు సూపర్–8లో ముందుగా ఎదురుపడే ప్రత్యర్థి కూడా జింబాబ్వేనే! ఈ నెల 26న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. పరాభవాల ప్రభావంతో... ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆ్రస్టేలియా ఈ ప్రపంచకప్‌లో మాత్రం సూపర్–8 చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై అధారపడాల్సిన స్థితికి వచ్చింది. జింబాబ్వే, శ్రీలంక చేతుల్లో ఓడిన కంగారూ ఒక్క ఐర్లాండ్‌పై గెలిచి 2 పాయింట్లతో ఉంది. శుక్రవారం ఒమన్‌తో జరిగే నామమాత్రమైన మ్యాచ్‌లో గెలిస్తే 4 పాయింట్లతో ఆసీస్ ఇంటికి పయనమవుతుంది. పది టి20 ప్రపంచ కప్‌లలోనూ ఆడిన ఆస్ట్రేలియా లీగ్ దశలో నిష్క్ర మించడం ఇది రెండోసారి మాత్రమే. 2007లో సెమీఫైనల్ చేరిన ఆసీస్... 2009లో గ్రూప్ దశలో వెనుదిరిగింది. 2010లో రన్నరప్‌గా నిలిచింది. 2012లో సెమీఫైనల్లో ఓడింది. 2014, 2016లలో సూపర్–10లో ఓyì.... 2021లో తొలిసారి విజేతగా అవతరించింది. 2022లో సూపర్–12లో, 2024లో సూపర్–8లో వెనుదిరిగింది. -
ఇంగ్లండ్ దర్జాగా...
కోల్‌కతా: టి20 ప్రపంచకప్‌లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మెరిపించింది. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇటలీ జట్టు కడదాకా పోరాడింది. చివరకు మాజీ చాంపియన్ చేతిలో 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో గ్రూప్ ‘సి’ నుంచి ఇప్పటికే ‘సూపర్–8’కు చేరిన వెస్టిండీస్ సరసన ఇంగ్లండ్ చేరింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హ్యారీ బ్రూక్ బృందం నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు మెరిపించినా... బట్లర్ (3) మళ్లీ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో నాలుగో మ్యాచ్ ఆడిన బట్లర్ ఇప్పటివరకు కనీసం మూడు పదుల స్కోరైనా చేయలేకపోయాడు. జాకబ్ బెథెల్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ బ్రూక్ (14), స్యామ్ కరన్ (25; 2 సిక్స్‌లు) ఇలా టాప్–6 బ్యాటర్లు ఇటలీ బౌలింగ్‌కు ఇబ్బంది పడితే... ఏడో వరుస బ్యాటర్ విల్ జాక్స్ (22 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ సిక్స్‌లతో తేలికపడింది. అతను 21 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. జాక్స్ మెరుపుల వల్లే ఇంగ్లండ్ 200 పైచిలుకు స్కోరు చేసింది. గ్రాంట్ స్టివార్ట్, కలుగమగే చెరో 2 వికెట్లు తీశారు. ‘సిక్స్’ల పిడుగు మనెంటి కొండంత లక్ష్యం ఎదురైనా... టాప్–3 బ్యాటర్లలో ఆంథోని మోస్కా (0), స్మట్స్ (0) డకౌటైనా... ఇటలీ ఆందోళన చెందలేదు. పోరాటం వీడలేదు. లక్ష్యఛేదన కోసం కడదాకా పోరాడి 20 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ జస్టిన్ మోస్కా (34 బంతుల్లో 43; 7 ఫోర్లు), బెన్ మనెంటి (25 బంతుల్లో 60; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగారు. జస్టిన్ బౌండరీలతో ధాటిగా ఆడితే... మనెంటి భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో బెన్ 22 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. దీంతో ఇటలీ 22/3 దయనీయ స్థితి నుంచి 114/4 స్కోరుతో రేసులో పడింది. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో లక్ష్యానికి దూరమైంది. అయినా సరే ఇటలీ ఆట ఆగిపోలేదు. గ్రాంట్ స్టివార్ట్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) సైతం ఇంగ్లండ్ శిబిరంపై విరుచుకుపడటంతో ప్రత్యర్థి జట్టు ఆఖరి బంతిదాకా చెమటోడ్చింది. కరన్, ఓవర్టన్ చెరో 3 వికెట్లు తీయగా... ఆర్చర్‌కు 2 వికెట్లు దక్కాయి. -
సంజయ్, మోనాంక్ మెరుపులు
చెన్నై: భారత సంతతి ఆటగాళ్లు సంజయ్ కృష్ణ మూర్తి (33 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), కెపె్టన్ మోనాంక్ పటేల్ (30 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ షోతో అదరగొట్టారు. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టు రెండో విజయం అందుకుంది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అమెరికా 31 పరుగుల తేడాతో నమీబియాపై గెలిచింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమెరికా నిరీ్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. మోనంక్, జహంగీర్ (22) ఓపెనింగ్ వికెట్‌కు 68 పరుగులు జోడించి మెరుపు ఆరంభమిచ్చారు. తర్వాత సంజయ్, మిలింద్ కుమార్ (28; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 87 పరుగులు జతచేశారు. ఈ రెండు భాగస్వామ్యాలు అమెరికా భారీస్కోరుకు బాట వేశాయి. నమీబియా బౌలర్లపై ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజయ్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. నమీబియా బౌలర్లలో విలెమ్, ఎరాస్మస్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ఓడింది. లారెన్ స్టీన్కాంప్ (39 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. స్మిత్ (31; 1ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. షాడ్లే వాన్‌కు 2 వికెట్లు దక్కాయి. నిరీ్ణత నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అమెరికా రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానానికి చేరింది. -
భారత్ కు మహాశివరాత్రి.. పాక్ కు కాళరాత్రి...
-
‘పాకిస్తాన్ మనకు శత్రువే.. అది క్రికెటైనా, ఇంకేదైనా..’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ సుఖిందర్ సింగ్ రంధావా. పాకిస్తాన్‌తో టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటూ అభివర్ణించారు. ఇది భారత్-పాకిస్తాన్ల మ్యాచ్ కాదని, కేవలం జై షా-పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్ మాత్రమేనన్నారు. యావత్ భారతావని.. పాకిస్తాన్‌తో సంబంధాలను వద్దనుకుంటుంటే, వారితో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. ‘ పాకిస్తాన్ అనేది మనకు దాయాది దేశం. వారిని శత్రువులుగానే చూడాలి. వారితో ఎటువంటి సంబంధాలు ఉండొద్దు. సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు పాకిస్తాన్ దుశ్చర్యలు బాగా తెలుసని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది భారతావని కోరుకునే మ్యాచ్ మాత్రం కాదు. జై షా-పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ మాత్రమే. భారతీయులు ఎవరూ పాక్‌తో మ్యాచ్‌ను కోరుకోవడం లేదు. ఐసీసీ చీఫ్‌గా ఉన్న జై షా ప్రోద్బలంతోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత్‌కు రెండో నరేంద్ర మోదీగా పేర్కొంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షానే.. పాకిస్తాన్‌తో మ్యాచ్ జరగడానికి కారణమయ్యాడు’ అంటూ విమర్శించారు.#WATCH | Jaipur, Rajasthan: On India vs Pakistan #ICCT20WorldCup, Congress MP Sukhjinder Singh Randhawa says, "... Pakistan is the enemy of our country, and it should be treated like that only. We have no dealings with them. Those who are on the border know how Pakistan is… pic.twitter.com/3FlPP06UIX— ANI (@ANI) February 15, 2026 -
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
-
అసలు సమరానికి సమయం
ఫిబ్రవరి 1...టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్... ఫిబ్రవరి 5...మాకు అవన్నీ తెలీదు...మా కొలంబో ఫ్లయిట్ బుక్ అయిపోయిందన్న సూర్యకుమార్... ఫిబ్రవరి 9...భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు మేం సిద్ధమంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన... ఫిబ్రవరి 15...భారత్, పాక్ మధ్య కొలంబోలో మ్యాచ్‌కు రంగం సిద్ధం...ప్రపంచకప్‌లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు...1992 నుంచి అభిమానులు ఇది చూస్తూనే వచ్చారు...ఫలితం ఎలా ఉన్నా, ఏకపక్షంగా సాగినా ఈ మ్యాచ్‌కు ఉండే ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై సాగే సుదీర్ఘ వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ లేదంటే సహజంగానే పెద్ద చర్చే జరిగింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది...కొలంబో వెళ్లే ఫ్లయిట్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటే హోటళ్లలో ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనా ఖాళీ లేదనే సమాధానం వచ్చేస్తోంది. మైదానంలోనే ఉండి జట్టుకు మద్దతుగా నిలవాలనుకునే వేలాది మంది మాత్రమే కాదు...తమ ఇళ్లనుంచి కన్నార్పకుండా ప్రతీ బంతిని చూసే ఫ్యాన్స్ సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మరో వరల్డ్ కప్ పోరుకు ఇరు జట్లు సై అంటున్నాయి. ఇటీవల ఆసియా కప్‌లో 3–0తో పాక్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో చెలరేగుతుందో చూడాలి. కొలంబో: టి20 వరల్డ్ కప్‌లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్, పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతీ టి20 వరల్డ్ కప్‌లో తలపడుతున్న ఇరు జట్లు ఈ సారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో నేడు (ఆదివారం) జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత్ ఎదుర్కొంటుంది. రెండు జట్లూ తమ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా...ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈ సారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కుల్దీప్కు అవకాశం... భారత బ్యాటింగ్ లైనప్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్‌ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకూ సింగ్‌కు తగిన అవకాశం రాకపోగా, తిలక్ వర్మ కూడా రెండు సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా గత మ్యాచ్ తరహాలో భారీ స్కోరు ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న సామ్సన్ మాత్రం విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే సామ్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్ అయిన అభిషేక్ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో అతను అందించే ఆరంభం భారత్ భారీ స్కోరుకు పునాది అవుతుంది. బౌలింగ్‌కు సంబంధించి తుది జట్టులో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఇక్కడి పిచ్‌ను బట్టి చూస్తే భారత్ మూడో రెగ్యులర్ స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు ‘మిస్టరీ’గానే ఉన్న వరుణ్ చక్రవర్తి, అక్షర్‌లతో పాటు కుల్దీప్ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అర్ష్ దీప్ స్థానంలో అతను ఆడతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్ భారం పంచుకుంటారు కాబట్టి రెగ్యులర్ పేసర్‌గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవలి ఫామ్, బలాబలాలను చూస్తే పాక్‌కంటే టీమిండియా ఎంతో ముందుంది. బాబర్ ఆజమ్ రాణించేనా... అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. పాక్ ఇప్పటికే ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు అబ్రార్, తారిఖ్‌లతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్లు నవాజ్, షాదాబ్‌లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. వీరిలో తారిఖ్ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా, చర్చనీయాంశమైన యాక్షన్‌తో ఆడే ఆఫ్‌స్పిన్నర్ తారిఖ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరం. భారత్ తమ సన్నాహకాల్లో దీనిపై కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు. పేసర్ షాహిన్ అఫ్రిది చాలా కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్‌లో టాప్–4 మాత్రమే రెగ్యులర్ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్ ఆగా ఆసియా కప్‌లో భారత్‌పై వరుసగా విఫలమవగా, ఫర్హాన్ ఒక్కడే రాణించాడు. కెప్టెన్ అయిన తర్వాత సల్మాన్ ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తమ జట్టుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాబర్ ఆజమ్ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇంతకంటే సమయం, వేదిక ఉండవని పాక్ అభిమానులు భావిస్తున్నారు. 13 భారత్, పాక్ మధ్య ఓవరాల్‌గా 16 మ్యాచ్‌లు జరగ్గా...13 గెలిచిన భారత్ 3 ఓడింది.7-1 టి20 ప్రపంచ కప్‌లో భారత్, పాక్ మధ్య 8 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 7 గెలిచి ఒకటే ఓడింది.పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. అయితే బౌలర్లూ ప్రభావం చూపించగలరు. మ్యాచ్‌కు ముందు రోజు మాత్రమే భారత్ ఇక్కడ సాధన చేసింది. పాక్ జట్టు కొలంబోలోనే ఉన్నా... తమ రెండు మ్యాచ్‌లను ఎస్ఎస్సీ మైదానంలో ఆడింది కాబట్టి తేడా ఉండకపోవచ్చు. అయితే మ్యాచ్‌ను వాన గండం వెంటాడుతోంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్ ), ఫర్హాన్, అయూబ్, బాబర్ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్, నవాజ్, ఫహీమ్, షాహిన్ అఫ్రిది, తారిఖ్, అబ్రార్ టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X నేపాల్వేదిక: ముంబై; ఉదయం 11 గంటల నుంచిఅమెరికా X నమీబియావేదిక: చెన్నై; మధ్యాహ్నం 3 గంటల నుంచి -
మార్క్రమ్, యాన్సెన్ జోరు
అహ్మదాబాద్: బౌలింగ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కో యాన్సెన్ జోరు (4/40), బ్యాటింగ్‌లో కెప్టెన్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (44 బంతుల్లో 86 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుతో దక్షిణాఫ్రికా ఖాతాలో మరో విజయం చేరింది. గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన మార్క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్ (26 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలిచింది. ఫెర్గూసన్, నీషమ్, రచిన్ రవీంద్రలకు తలా ఒక వికెట్ దక్కింది. టాపార్డర్ టపటపా... ఇన్‌గిడి మూడో ఓవర్లో అలెన్ 3 ఫోర్లు, 1 సిక్స్‌తో కివీస్ శిబిరానికి జోష్ తెచ్చాడు. యాన్సెన్ తర్వాతి ఓవల్‌లో సీఫెర్ట్ (13) అవుటైనా... అలెన్ 4, 6తో జోరు కొనసాగించే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఆరో ఓవర్ వేసిన యాన్సెన్ ఈ సారి రచిన్ రవీంద్ర (13), అలెన్ (17 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుకు చెక్‌పెట్టాడు. కివీస్ పవర్ ప్లే కష్టాల నుంచి కోలుకోకముందే కేశవ్ మహరాజ్... ఫిలిప్స్ (1)ను బౌల్డ్ చేయడంతో 64 పరుగుల వద్ద కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.ఈ దశలో చాప్మన్ ధాటిగా ఆడి న్యూజిలాండ్ స్కోరు పెంచాడు. డారిల్ మిచెల్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో నీషమ్ (15 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో న్యూజిలాండ్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యాన్సెన్ సగటున ఓవర్‌కు 10 చొప్పున పరుగులిచ్చినా కీలక వికెట్లు తీశాడు. రఫాడించిన మార్క్రమ్ కివీస్ చేసిందేమీ తక్కువ స్కోరు కాదు. దీంతో ఈ గ్రూప్‌లో రెండు పోటీ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందనుకుంటే మార్క్రమ్ ఏకపక్షంగా మార్చేశాడు. అతను ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా మూడో ఓవర్లోనే 50 స్కోరుకు చేరుకుంది. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద డికాక్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. కాసేపటికే మార్క్రమ్ 19 బంతుల్లోనే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున వేగవంతమైన అర్ధశతకాన్ని సాధించాడు. రికెల్టన్ (11 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా కెప్టెన్‌లాగే కివీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 7.2 ఓవర్లలోనే వంద పరుగులు దాటింది. తర్వాత వచ్చిన బ్రెవిస్ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), మిల్లర్ (17 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ఇంకో 2.5 ఓవర్లముందే సఫారీ లక్ష్యాన్ని దాటేసింది. -
వారెవ్వా జింబాబ్వే
ఆ్రస్టేలియా సొంతగడ్డపై ఆడినా... గడప దాటినా... ఫార్మాట్ ఏదైనా... చాంపియన్ జట్టు. ప్రొఫెషనలిజానికిమారుపేరు. అలాంటి జట్టు జింబాబ్వేలాంటి చిన్న జట్టుతో ఓడటం ఎవరి అంచనాలకూ అందని సంచలనమే! ఓ దుర్బేధ్యమైన జట్టు మళ్లీ అదే ప్రత్యర్థి చేతిలో రెండోసారి ఓడితే సంచలనానికి సీక్వెలే కదా! అవును... దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే... ఆస్ట్రేలియాపై సీక్వెల్ బొమ్మ చూపించింది. 2007లో మొదలైన టి20 వరల్డ్‌కప్‌లో అప్పటి వన్డే వరల్డ్ చాంపియన్‌ను కంగుతినిపించి ఔరా అనిపించిన జింబాబ్వే... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రస్తుత వన్డే విశ్వవిజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించి తాజా టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. కొలంబో: జింబాబ్వే జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియాను మరోసారి ‘0’ను చేసింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జింబాబ్వే తమ ఆధిక్యాన్ని ‘2’తో రెట్టింపు చేసుకుంది. 2007 టి20 ప్రపంచకప్‌లో కంగారూ జట్టుపై సాధించిన సంచలన విజయాన్ని 19 ఏళ్ల తర్వాత జింబాబ్వే తాజాగా రిపీట్ చేసింది. అప్పుడు మొదటి ప్రపంచకప్ అయితే ఇది పదోది. మధ్యలో 8 మెగా ఈవెంట్లు జరిగినా... ఇరుజట్లు తలపడలేదు. శుక్రవారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (56 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన ముగ్గురు బ్యాటర్లు తదివనషె మరుమని (21 బంతుల్లో 35; 7 ఫోర్లు), రియాన్ బర్ల్ (30 బంతుల్లో 35; 4 ఫోర్లు), కెప్టెన్ సికందర్ రజా (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు. ఆసీస్ ఈ 120 బంతులు ఆడలేదా? జింబాబ్వే లాంటి కూన జట్టు బ్యాటర్లు 120 బంతులెదుర్కొని ఇద్దరే అవుటైతే... జగజ్జేత కంగారు పడటమేంటి? పది మంది బ్యాటర్లు 117 బంతులకే అవుట్ కావడమేంటి? హెడ్ బృందానికి 170 లక్ష్యఛేదన ఏమాత్రం కష్టమైంది కాదు. కఠినమైంది కాదు. కానీ 19.3 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్లెసింగ్ ముజరబాని (4/19), బ్రాడ్ ఇవాన్స్ (3/23) ధాటికి ఓపెనర్లు ఇన్‌గ్లిస్ (8), కెప్టెన్ హెడ్ (17) గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0)... ఇలా టాప్–4 స్పెషలిస్టు బ్యాటర్లంతా పవర్‌ప్లేలో 29 పరుగులకే పెవిలియన్‌కు వెళ్లి ప్రేక్షకులైపోయారు.ఒకే ఒక్కడు మ్యాట్ రెన్షా (44 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ (32 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించడంతో 100 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే తర్వాతి బ్యాటర్లు స్టొయినిస్ (6), డ్వార్షుయిస్ (6), ఎలిస్ (7 నాటౌట్), జంపా (2), కునెమన్ (0)ల స్కోర్లు చూస్తే ఏ అత్యల్ప స్కోరుకో పరిమితమయ్యేదేమో! ఔరా మన్యొంగా... జింబాబ్వే ఫీల్డర్ మన్యొంగా కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఇవాన్స్ వేసిన 18వ ఓవర్లో డ్వార్షుయిస్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. మున్యొంగా దూరంగానే ఉన్నప్పటికీ డీప్ మిడ్‌వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో డైవ్ చేసి అందుకున్న క్యాచ్ ఔరా అనిపించింది. టేలర్ స్థానంలో బెన్ కరన్... జింబాబ్వే సీనియర్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ గాయం కారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో గాయపడిన అతను ఆసీస్‌తో పోరులో బరిలోకి దిగలేదు. టేలర్ స్థానంలో ఐసీసీ అనుమతితో బెన్ కరన్‌కు జింబాబ్వే చోటు కల్పించింది. బెన్ కరన్ తమ్ముడు స్యామ్ కరన్ ఇప్పటికే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ తరఫున ఆడుతున్నాడు.2 ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టుతో జింబాబ్వే నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. ఆసీస్‌పై జింబాబ్వే సాధించిన రెండు విజయాలు ప్రపంచకప్‌లోనే రావడం విశేషం.టి20 ప్రపంచకప్‌లో నేడుఐర్లాండ్ X ఒమన్‌వేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి ఇంగ్లండ్ X స్కాట్లాండ్వేదిక: కోల్‌కతా; మ.గం. 3 నుంచి దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రాణించిన సాయితేజ, హర్మీత్
చెన్నై: దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ చేతిలో ఓడిన అమెరికా ఎట్టకేలకు నెదర్లాండ్స్‌పై గెలిచి ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో బోణీ చేసింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మోనాంక్ పటేల్ సారథ్యంలోని అమెరికా 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గిన డచ్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేపట్టిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మోనాంక్ (22 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), జహాంగీర్ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడే క్రమంలో అవుటయ్యారు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ సాయితేజ ముక్కామల (51 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభమ్ రంజనే (24 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. బాస్ డి లీడె 3 వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 15.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. బాస్ డి లీడె (23), కెపె్టన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (20)లు మాత్రమే రెండు పదుల స్కోరు చేయగలిగారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మీత్ సింగ్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు, వాన్ షాల్విక్ 3 వికెట్లు, మోసిన్ 2 వికెట్లు తీశారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాతో అమెరికా తలపడుతుంది. -
నమీబియాను చిత్తు చేసిన భారత్
-
ఇషాన్, పాండ్యా చెలరేగగా...
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు కాబట్టి భారత జట్టు ఈసారి ‘300’ కొడుతుందా అనే చర్చ మధ్య నమీబియాతో మ్యాచ్ మొదలైంది. ఆరంభంలో ఆట చూస్తే అది సాధ్యమే అని కూడా అనిపించింది. చివరకు వచ్చేసరికి ఇది జరగకపోయినా గత మ్యాచ్‌తో పోలిస్తే భారత బ్యాటింగ్ పదును పెరిగింది. అమెరికాతో ఆశించిన స్కోరుకంటే చాలా తక్కువగా నమోదు చేసిన టీమిండియా ఈసారి మాత్రం 200 దాటింది. ఆపై సమష్టి ప్రదర్శనతో బలహీన ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు తమ టి20 ప్రపంచకప్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ మెరుపులు, వరుణ్ చక్రవర్తి పొదుపైన బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టును గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది. న్యూఢిల్లీ: టి20 వరల్డ్‌కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్ ‘ఎ’లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించారు. నమీబియా కెప్టెన్, ఆఫ్‌స్పిన్నర్ గెరార్డ్ ఎరాస్మస్ (4/20) పొదుపైన బౌలింగ్ సహా 4 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్ చివరి 11 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు చేజార్చుకుంది. అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. లౌరెన్ స్టీన్కాంప్ (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా...వరుణ్ చక్రవర్తి 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజు సామ్సన్‌కు అవకాశం దక్కగా... బుమ్రా తిరిగి రావడంతోసిరాజ్‌ను తప్పించాల్సి వచ్చింది. తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్ ఈ నెల 15న కొలంబోలో పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఇషాన్ 6, 6, 6, 6, 4... అభిషేక్ గైర్హాజరులో అదృష్టవశాత్తూ మ్యాచ్ అవకాశం దక్కించుకున్న సంజు సామ్సన్ (8 బంతుల్లో 22; 1 ఫోర్, 3 సిక్స్‌లు) సిక్స్‌తో స్కోరింగ్ మొదలు పెట్టినా అది ఎక్కువసేపు సాగలేదు. షికోంగో ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ఇషాన్ తన జోరును మొదలు పెట్టాడు. 8 బంతుల వ్యవధిలో 4 ఫోర్లు కొట్టిన అతను... స్మిట్ వేసిన ఓవర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. పవర్‌ప్లే ముగిసేసరికి 86 పరుగులు చేసిన భారత్... 6.5 ఓవర్లలోనే 100 పరుగులను అందుకుంది. టి20 వరల్డ్ కప్‌లో అతి తక్కువ బంతుల్లో (35 బంతుల్లో) వంద పరుగులు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇషాన్ అవుటైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ (12), హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) కూడా తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే పాండ్యా, శివమ్ దూబే (16 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) భారీ భాగస్వామ్యంతో స్కోరు 200 దాటింది. వీరిద్దరు 39 బంతుల్లో 81 పరుగులు జత చేశారు. షికోంగో ఓవర్లో వరుసగా సిక్స్, 2 ఫోర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టపటపా... ఛేదనలో దాదాపు సగం ఓవర్ల వరకు నమీబియా ప్రదర్శన మెరుగ్గానే ఉంది. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. స్టీన్‌కాంప్‌తో పాటు ఫ్రైలింగ్ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), ఎరాస్మస్ (11 బంతుల్లో 18; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. 9.1 ఓవర్లలో జట్టు 86/2 వద్ద నిలిచింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిది. భారత బౌలర్లు చెలరేగడంతో నమీబియా బ్యాటర్లు ఎవరూ నిలవలేకపోయారు. 8 పరుగుల వ్యవధిలో తర్వాతి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ కోలుకోలేకపోయింది. ఒకే స్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు పడ్డాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) షికోంగో (బి) ఎరాస్మస్ 61; సామ్సన్ (సి) స్టీన్కాంప్ (బి) షికోంగో 22; తిలక్ (సి) స్మిట్ (బి) ఎరాస్మస్ 25; సూర్యకుమార్ (స్టంప్డ్) గ్రీన్ (బి) స్కాల్ 12; పాండ్యా (సి) (సబ్) లీషర్ (బి) ఎరాస్మస్ 52; దూబే (రనౌట్) 23; రింకూ (సి) ఎరాస్మర్ (బి) స్మిట్ 1; అక్షర్ (బి) ఎరాస్మస్ 0; వరుణ్ (నాటౌట్) 1; అర్‡్షదీప్ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–25, 2–104, 3–120, 4–124, 5–205, 6–205, 7–206, 8–206, 9–209. బౌలింగ్: రూబెన్ 4–0–38–0, షికోంగో 3–0–41–1, స్మిట్ 4–0–50–1, హీన్‌గో 1–0–18–0, ఎరాస్మస్ 4–0–20–4, స్కాల్ 4–0–41–1. నమీబియా ఇన్నింగ్స్: స్టీన్కాంప్ (బి) వరుణ్ 29; ఫ్రైలింక్ (సి) దూబే (బి) అర్‡్షదీప్ 22; జాన్ నికోల్ (సి) అక్షర్ (బి) వరుణ్ 13; ఎరాస్మస్ (సి) తిలక్ (బి) అక్షర్ 18; స్మిట్ (బి) వరుణ్ 0; గ్రీన్ (హిట్‌వికెట్) (బి) దూబే 11; క్రూగర్ (సి) బుమ్రా (బి) అక్షర్ 5; రూబెన్ (బి) బుమ్రా 6; స్కాల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 4; షికోంగో (ఎల్బీ) (బి) పాండ్యా 0; హీన్‌గో (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–86, 4–86, 5–88, 6–94, 7–111, 8–116, 9–116, 10–116. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–21 –2, అర్‡్షదీప్ సింగ్ 3–0–36–1, శివమ్ దూబే 2.2–0–11–1, జస్ప్రీత్ బుమ్రా 4–0–20–1, వరుణ్ చక్రవర్తి 2–0–7–3, అక్షర్ పటేల్ 3–1–20–2. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా x జింబాబ్వేవేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి కెనడా x యూఏఈవేదిక: న్యూఢిల్లీ; మ.గం. 3 నుంచి నెదర్లాండ్స్ x అమెరికావేదిక: చెన్నై; రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..!
-
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ నమీబియాతో భారత్
-
IND vs NAM: మరో కూనతో పోరు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి పోరులో అమెరికాపై విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం నమీబియాతో తలపడనుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తదుపరి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్ తో ఆడనున్న టీమిండియా దానికి ముందు నమీబియాతో మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా వాడుకోవాలని భావిస్తోంది. బలాబలాలు, అనుభవం దృష్ట్యా ఇరుజట్లలో చాలా అంతరం ఉంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన టీమిండియా... నమీబియాపై కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. అస్వస్థత కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పితో రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నాడు. బుధవారం డిశ్చార్జి అయి జట్టుతో కలిశాడు. అయితే నేటి పోరులో అతను ఆడే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ అభిషేక్ దూరమైతే సంజూ సామ్సన్‌కు అవకాశం లభించవచ్చు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకోగా... ప్రాక్టీస్ సందర్భంగా ఇషాన్ కిషన్ కాలికి గాయమైంది. ఇక తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన నమీబియా... ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న చందంగా రాణించాలని చూస్తోంది. ఢిల్లీ పిచ్ అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు సమానంగా సహకరించనుంది. మైదానం చిన్నది కావడంతో కుదురుకుంటే భారీ స్కోర్లు ఖాయమే! అభిషేక్‌పైనే అందరి దృష్టి గత రెండేళ్లుగా భారత జట్టు టి20 ఫార్మాట్లో నిలకడగా విజయాలు సాధించడంలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కృషి ఎంతో ఉంది. ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి చూస్తుండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ఈ ‘బిగ్ హిట్టర్’ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో ‘డకౌట్’ అయ్యాడు. ‘పవర్ ప్లే’ లోపే మ్యాచ్‌ను లాగేసుకునే సత్తా గల అభిషేక్... రెండో మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే రూపంలో బ్యాటర్లకు కొదవలేదు. గత మ్యాచ్‌లో సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు మంచి స్కోరు చేయగలిగింది. వరల్డ్‌కప్‌నకు ఒక్క రోజు ముందు పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అమెరికాతో పోరులో ఆడని బుమ్రా తుది జట్టులోకి వస్తే ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. వాషింగ్టన్ సుందర్ కోలుకున్నా... ఇప్పడు అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయడం కష్టమే. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ భారం మోయనున్నారు. పోటీనిచ్చేనా! అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా అనుభవం లేని నమీబియా... టీమిండియాపై సంచలన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. 2021 ప్రపంచకప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఏకైక మ్యాచ్ జరగ్గా... టీమిండియా అలవోక విజయం సాధించింది. అదే జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌తో ప్లేయర్లంతా ఫామ్‌లోకి రావాలని భారత మేనేజ్మెంట్ భావిస్తోంది. నెదర్లాండ్స్‌తో పోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నమీబియాపై అంచనాలు లేకపోయినా... ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అని టీమిండియా యోచిస్తోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నమీబియాపై ఫుల్ ప్రాక్టీస్ చేయాలని మనవాళ్లు చూస్తున్నారు. వరల్డ్‌కప్‌నకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు చేతిలోనూ నమీబియా పరాజయం పాలైంది. అలాంటిది బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ బౌలింగ్‌ను ఎదుర్కొని నమీబియా బ్యాటర్లు నిలవగలరా చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్/సామ్సన్, ఇషాన్, తిలక్, హార్దిక్, రింకూ, శివమ్ దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా/సిరాజ్, వరుణ్. నమీబియా: ఎరాస్మస్ (కెప్టెన్ ), స్టీన్ కాంప్, ఫ్రైలింక్, జాన్ నికోల్, జేజే స్మిత్, జెన్ గ్రీన్, లైచెర్, విలియమ్ మైబుర్గ్, రూబెన్, బెర్నార్డ్ స్కాట్జ్, బెన్ షికొంగో.టి20 ప్రపంచకప్‌లో నేడుశ్రీలంక X ఒమన్‌వేదిక: పల్లెకెలె; ఉ.గం. 11 నుంచి నేపాల్ X ఇటలీవేదిక: ముంబై; మ.గం. 3 నుంచిభారత్ X నమీబియావేదిక: న్యూఢిల్లీ; రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘డబుల్ సూపర్’ ధమాకా
ప్రపంచకప్‌లో డజను మ్యాచ్‌లు ముగిసినా అభిమానులకు ఇంకా ఏదో వెలితి... కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లు, మరికొన్ని మంచి బౌలింగ్ ప్రదర్శనలు వచ్చినా అసలైన టి20 మజా మాత్రం ఇంకా కనిపించలేదు... ఇలాంటి సమయంలో బుధవారం జరిగిన పోరు ఫుల్ మీల్స్‌ను అందించింది... దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ కలిసి ఉత్కంఠతో నిండిన అద్భుత మ్యాచ్‌ను చూపించాయి... 20 ఓవర్ల సమరంలో ఇరు జట్లూ 187 పరుగులతో సమఉజ్జీలుగా నిలవగా, సూపర్ ఓవర్ తప్పలేదు. అక్కడా ఎవరూ తగ్గకుండా సమం–సమం అనడంతో మరో సూపర్ ఓవర్ ముందుకు వచ్చింది. ఈసారి మాత్రం ఆధిపత్యం ప్రదర్శించిన సఫారీ టీమ్ ఎట్టకేలకు గట్టెక్కింది. ప్రధాన పోరుతో పాటు రెండు సూపర్ ఓవర్లతో సాగిన డ్రామా టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికా ప్రదర్శనకంటే కీలక సమయాల్లో వరుస తప్పులు చేసిన అఫ్గానిస్తాన్ స్వయంకృతమే ఫలితాన్ని నిర్దేశించింది. అఫ్గాన్ బెస్ట్ బౌలర్ రషీద్ ఖాన్ రెండు సూపర్ ఓవర్లలో ఒక్కటి కూడా బౌలింగ్ చేయకపోగా... రెండో సూపర్ ఓవర్లో ఫామ్‌లో ఉన్న గుర్బాజ్‌ను కాకుండా నబీకి స్ట్రయిక్ అవకాశం ఇవ్వడం కూడా జట్టును ఓడించాయి. అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్‌లో డజను మ్యాచ్‌ల తర్వాత అద్భుతమైన వినోదాన్ని చూసే అవకాశం అభిమానులకు దక్కింది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా ‘డబుల్ సూపర్ ఓవర్’లో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రికెల్టన్ (28 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), డికాక్ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 61 బంతుల్లో 114 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులకే ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (42 బంతుల్లో 84; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్గిడి (3/26) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. స్కోర్లు సమం కావడంతో నిర్వహించిన తొలి ‘సూపర్ ఓవర్’లో ఇరు జట్లు సరిగ్గా 17 పరుగులే చేశాయి. దాంతో రెండో ‘సూపర్ ఓవర్’ను ఆడించాల్సి వచ్చింది. ఇందులో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేయగా, 19 పరుగులు చేసిన అఫ్గానిస్తాన్ 4 పరుగులతో ఓడింది. దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం అందుకొని గ్రూప్ ‘డి’ నుంచి ‘సూపర్ ఎయిట్స్’కు చేరువ కాగా... వరుసగా రెండో ఓటమితో అఫ్గానిస్తాన్ ముందంజ వేసే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. చివరి ఓవర్ డ్రామా సాగిందిలా... ఆఖరి ఓవర్లో అఫ్గానిస్తాన్‌కు 13 పరుగులు అవసరం కాగా, ఒకటే వికెట్ ఉంది. తొలి బంతికి నూర్‌ను రబడ బౌల్డ్ చేసినా అది నోబాల్ అయింది. తర్వాతి బంతి వైడ్ కాగా, ఆ తర్వాత వేసిన బంతికి నూర్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను యాన్సెన్ వదిలేశాడు. ఆ వెంటనే నూర్ సిక్స్ బాదడంతో తొలి రెండు బంతుల్లోనే 8 పరుగులు వచ్చినట్లయింది. ఇక చేయాల్సింది 4 బంతుల్లో 5 పరుగులే. తర్వాతి బంతికి షాట్ ఆడి నూర్ సగం దూరం వచ్చినా... ఫరూఖీ వెనక్కి పంపడంతో పరుగు రాలేదు.ఓవర్ నాలుగో బంతి మళ్లీ నోబాల్ కావడంతో పాటు 2 పరుగులు తీయడంతో సమీకరణం మరింత సులువుగా మారింది. 2 బంతుల్లో 3 పరుగులు కావాలి, పైగా ఫ్రీ హిట్...బహుశా బ్యాటర్లకు ఇదే సూచన ఇచ్చేందుకు ‘వాటర్ బాయ్స్’ను పంపించగా, అంపైర్లు అనుమతించలేదు! నూర్ లాంగాఫ్ దిశగా కొట్టిన షాట్‌కు తొలి పరుగు సులువుగా రాగా, రెండో పరుగు తీసే ప్రయత్నంలో ఫారుఖీ నెమ్మదించడంతో రనౌటయ్యాడు. దాంతో స్కోర్లు సమమయ్యాయి. ఫీల్డర్ వైపు చూడకుండా వేగంగా పరుగెత్తి బ్యాట్‌తో డైవ్ చేసే ప్రయత్నం చేస్తే ఫారుఖీ పరుగు సునాయాసంగా పూర్తయ్యేది. అంతకుముందు మూడో బంతికి సింగిల్ నిరాకరించిన ఫారుఖీ అసలు సమయంలో సరిగా పరుగెత్తక తన జట్టుకు గెలుపును దూరం చేశాడు. దీని తర్వాత మరో రెండు బంతులు కూడా ఉన్నాయి కాబట్టి అఫ్గానిస్తాన్ ఈ రిస్క్ చేయకుండా ఉండాల్సింది.మొదటి సూపర్ ఓవర్: ఎన్గిడి బౌలింగ్‌లో అజ్మతుల్లా 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. అనంతరం ఫారుఖీ బౌలింగ్‌లో 5 బంతుల్లో 11 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా తప్పనిసరిగా సిక్స్ కొట్టాల్సిన స్థితిలో నిలిచింది. లో ఫుల్‌టాస్‌ను లాంగాఫ్ మీదుగా స్టబ్స్ సిక్స్ బాదడంతో దక్షిణాఫ్రికా కూడా 17 పరుగులే చేయగలిగింది. రెండో సూపర్ ఓవర్: అజ్మతుల్లా బౌలింగ్‌లో స్టబ్స్ వరుసగా 6, 1 రాబట్టగా, మిల్లర్ వరుసగా 2, 6, 6, 2 బాదడంతో 23 పరుగులు లభించాయి. ఆ తర్వాత కేశవ్ మహరాజ్ ఓవర్లో అఫ్గానిస్తాన్ తొలి 2 బంతుల్లో పరుగులేమీ చేయకుండా వికెట్ కోల్పోయింది. అయితే గుర్బాజ్ చెలరేగి వరుసగా 6, 6, 6 కొట్టడంతో పాటు తర్వాతి బంతి వైడ్‌గా పడింది. ఈసారి కూడా సిక్స్ కొడితే అఫ్గాన్ గెలిచే అవకాశాలు ఉండగా, చివరి బంతికి గుర్బాజ్ క్యాచ్ ఇచ్చాడు. 38 ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20ల్లో ‘సూపర్ ఓవర్’ ద్వారా ఫలితాలు వచ్చిన మ్యాచ్‌లు.2 అంతర్జాతీయ టి20ల్లో ‘డబుల్ సూపర్ ఓవర్’ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లు. ఈ రెండింటిలోనూ అఫ్గానిస్తాన్ ప్రత్యర్థిగా ఉండటం గమనార్హం. 2024లో అఫ్గానిస్తాన్‌పై భారత్ ‘డబుల్ సూపర్’లో గెలిచింది. 2025లో నేపాల్‌పై నెదర్లాండ్స్ ‘ట్రిపుల్ సూపర్ ఓవర్’లో నెగ్గింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) నబీ (బి) ఫారుఖీ 5; డికాక్ (సి) జద్రాన్ (బి) రషీద్ 59; రికెల్టన్ (ఎల్బీ) (బి) రషీద్ 61; బ్రెవిస్ (సి) నబీ (బి) ఒమర్జాయ్ 23; మిల్లర్ (నాటౌట్) 20; స్టబ్స్ (సి) ముజీబ్ (బి) ఒమర్జాయ్ 1; యాన్సెన్ (సి) అటల్ (బి) ఒమర్జాయ్ 16; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–12, 2–126, 3–127, 4–155, 5–159, 6–187. బౌలింగ్: ఫరూఖీ 4–0–32–1, ముజీబ్ 3–0–30–0, ఒమర్జాయ్ 4–0–41–3, నబీ 2–0–20–0, రషీద్ 4–0–28–2, నూర్ 3–0–35–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) లిండే (బి) మహరాజ్ 84; జద్రాన్ (బి) ఎన్గిడి 12; నైబ్ (సి అండ్ బి) ఎన్గిడి 0; అటల్ (సి) యాన్సెన్ (బి) రబడ 0; రసూలీ (రనౌట్) 15; ఒమర్జాన్ (సి) స్టబ్స్ (బి) ఎన్గిడి 22; నబీ (సి) మార్క్రమ్ (బి) లిండే 5; రషీద్ (సి) మిల్లర్ (బి) యాన్సెన్ 20; ముజీబ్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 15; ఫారుఖీ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 187. వికెట్ల పతనం: 1–51, 2–51, 3–52, 4–121, 5–121, 6–139, 7–164, 8–169, 9–175, 10–187. బౌలింగ్: ఎన్గిడి 4–0–26–3, యాన్సెన్ 4–0–42–1, రబడ 3.4–0–38–1, లిండే 3–0–39–1, మహరాజ్ 4–0–27–1, మార్క్రమ్ 1–0–14–0. -
పాకిస్తాన్‌దే పైచేయి
కొలంబో: గత టి20 ప్రపంచకప్‌లో అమెరికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. టోర్నీలో శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి పోరులో కష్టమ్మీద గట్టెక్కిన పాక్... అమెరికాపై మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా మ్యాచ్‌ను ముగించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో పాక్ 32 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాహిబ్జాదా ఫర్హాన్ (41 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా... బాబర్ ఆజమ్ (32 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), షాదాబ్ ఖాన్ (12 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సయీమ్ అయూబ్ (19)తో తొలి వికెట్‌కు 54 పరుగులు (31 బంతుల్లో) జోడించిన ఫర్హాన్... మూడో వికెట్‌కు బాబర్ ఆజమ్‌తో 53 బంతుల్లో 81 పరుగులు జత చేశాడు. అమెరికా బౌలర్ షాల్విక్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. శుభమ్ రంజనే (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో పాటు జహంగీర్ (49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిలింద్ కుమార్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శన జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. ఆఫ్ స్పిన్నర్ తారిఖ్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, షాదాబ్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. 1982లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇ చ్చిన సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఫ్లడ్లైట్లతో ఇదే తొలి డే అండ్ నైట్ మ్యాచ్ కావడం విశేషం. టి20 ప్రపంచకప్‌లో నేడుదక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్వేదిక: అహ్మదాబాద్; ఉదయం 11 గం‘‘ నుంచిఆ్రస్టేలియా X ఐర్లాండ్వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గం‘‘ నుంచిఇంగ్లండ్ X వెస్టిండీస్ వేదిక: ముంబై; రాత్రి 7 గంటల నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్‌తో మ్యాచ్ ఆడండి: పాకిస్తాన్ జట్టుకు ప్రభుత్వ ఆదేశం
టి20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్ ఆడమంటూ మొండికేసిన పాకిస్తాన్ జట్టు వెనక్కి తగ్గింది. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌లో టీమిండియాతో తలపడాలని ఆ దేశ ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను ఆదేశించింది. క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లనుంచి వచ్చిన అభ్యర్థనలకు స్పందిస్తూ భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఓకే చెప్పారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతక ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా వెల్లడించారు. వరల్డ్ కప్‌నుంచి దూరమైన బంగ్లాదేశ్‌కు మద్దతు పలకడంతో పాటు పలు డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది. వీటిపై ఐసీసీ సానుకూలంగా స్పందించింది. బంగ్లా బోర్డుపై ఎలాంటి జరిమానాలు, ఆంక్షలు విధించమని హామీ ఇవ్వడంతో పాటు 2028 నుంచి 2031 మధ్య ఒక ఐసీసీ ఈవెంట్‌కు బంగ్లా ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని కూడా ఐసీసీ చెప్పింది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్ ఆటగాడు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒమన్ ఆటగాడు ఆమిర్ కలీమ్ 44 ఏళ్ల 81 రోజుల వయసులో పొట్టి ప్రపంచకప్ మ్యాచ్ ఆడి, టోర్నీ చరిత్రలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒమన్ ఇవాళ (ఫిబ్రవరి 9) కొలంబో వేదికగా జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో కలీమ్ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు హాంగ్‌కాంగ్‌కు చెందిన ర్యాన్ క్యాంప్‌బెల్ పేరిట ఉండేది. క్యాంప్‌బెల్ 2016 ప్రపంచకప్‌లో 44 ఏళ్ల 30 రోజుల వయసులో బరిలోకి దిగాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 40లు దాటిన వారు చాలామంది ఉన్నారు. ఒమన్‌కే చెందిన మొహమ్మద్ నదీమ్ 43 వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. ఇటలీ కెప్టెన్ వేన్ మ్యాడ్సన్ 42, ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ, నెదర్లాండ్స్ ఆటగాడు వాన్‌డర్ మెర్వ్ 41 ఏళ్ల వయసులో ప్రస్తుత ప్రపంచకప్ బరిలో ఉన్నారు.కలీమ్ విషయానికొస్తే.. ఇతను పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించి క్రికెట్ కెరీర్ కోసం ఒమన్‌కు వలస వెళ్లాడు. ఈ జట్టు తరఫున అతను 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 15 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కలీమ్.. ఫిబ్రవరి 3న శ్రీలంక-ఏతో జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను 47 బంతుల్లో 80 పరుగులు చేసి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ప్రస్తుతం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కలీమ్ (5) తేలిపోయాడు. అతనితో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి ఒమన్ జట్టు విలవిలలాడింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే గెలుపు దిశగా సాగుతోంది. 7.3 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి, లక్ష్యానికి 75 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. -
అమెరికా క్రికెట్ జట్టులో నంద్యాల యువకుడు
సంజామల: వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ టీ–20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భాగంగా ఇండియాతో తలపడిన అమెరికా(యుఎస్ఏ) జట్టు తరఫున బరిలో దిగాడు. సాయితేజకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చదువుకుంటూనే హైదరాబాద్‌లోని వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. 2022లో 18 ఏళ్ల వయసులో యుఎస్ఏ జాతీయ జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ–20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో యుఎస్ఎ తరఫున ఆడుతున్నాడు. శనివారం టీ–20 ప్రపంచ కప్‌లో భాగంగా టీం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా తరఫున బరిలో దిగాడు. నంద్యాల జిల్లా యువకుడు అమెరికా దేశం తరఫున టీ–20 ప్రపంచ కప్‌లో ఆడుతుండడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంగ్లండ్‌ను వణికించిన నేపాల్
ముంబై: ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో చిన్న జట్ల జోరు సాగుతోంది. తొలి రోజు పాకిస్తాన్‌పై నెదర్లాండ్స్ గెలిచినంత పనిచేయగా... స్టార్లతో నిండి ఉన్న టీమిండియాను అమెరికా భయపెట్టింది. రెండో రోజు ఇదే తరహాలో రెండుసార్లు చాంపియన్ ఇంగ్లండ్ జట్టును నేపాల్ వణికించింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. నేపాల్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా... అప్పటి వరకు చక్కటి షాట్లు ఆడుతూ జట్టులో ఆశలు రేపిన లోకేశ్ బామ్... స్యామ్ కరన్ వేసిన ఆఖరి ఓవర్లో భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఫలితంగా ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ ఇంగ్లండ్ 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. గ్రూప్ ‘సి’లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెపె్టన్ హ్యారీ బ్రూక్ (32 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (18 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ఆఖర్లో మెరుపు షాట్లు ఆడగా... జోస్ బట్లర్ (26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఫిల్ సాల్ట్ (1), టామ్ బాంటన్ (2), స్యామ్ కరన్ (2) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్ (29 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ రోహిత్ పౌడెల్ (34 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లోకేశ్ బామ్ (20 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ (29; 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. నేపాల్ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో... ఇన్నింగ్స్ 18వ ఓవర్లో లోకేశ్ రెండు సిక్స్‌లతో కలిపి 22 పరుగులు వచ్చాయి. తదుపరి ఓవర్లో మరో రెండు ఫోర్లతో లోకేశ్ 14 పరుగులు రాబట్టాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులకు చేరగా... స్యామ్ కరన్ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నేపాల్ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. టి20 ప్రపంచకప్‌లో నేడుస్కాట్లాండ్ X ఇటలీవేదిక: కోల్‌కతా; ఉదయం 11 గంటల నుంచిజింబాబ్వే X ఒమన్‌వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గంటల నుంచిదక్షిణాఫ్రికా X కెనడా వేదిక: అహ్మదాబాద్; రాత్రి 7 గంటల నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టీ20 ప్రపంచకప్: ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం
కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించింది. 20 పరుగులతో తేడాతో గెలిచేసింది. ఐర్లాండ్ జట్టు చివరివరకు పోరాడినప్పటికీ 143 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక గెలుపు లాంఛనమైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 54, కమిందు మెండిస్ 44 పరుగులు చేశారు. ఐర్లాండ్ జట్టులో బ్యారీ,జార్జ్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్‌కి మంచి ఆరంభం దక్కింది. కానీ వరస విరామాల్లో వికెట్లు వరసగా పడిపోవడంతో 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది.హ్యారీ టెక్టర్ 40, రాస్ అడైర్ 34 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ, తీక్షణ తలో మూడు వికెట్లు తీయగా.. పతిరాణా 2 వికెట్లు తీశారు. -
‘గత్యంతరం లేక’ ఆడటం లేదు! ఐసీసీకి పీసీబీ వివరణ
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ తిరస్కరించిన వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంత సులువుగా వదిలిపెట్టేలా లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్‌ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. భారత్‌తో మ్యాచ్ ఆడే అంశం తమ చేతుల్లో లేదని, తమ ప్రభుత్వ ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవచ్చని ఐసీసీ నిబంధన (ఫోర్స్ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది. అయితే ఐసీసీ దీనికి సరైన రీతిలో స్పందించింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలులాంటి అనూహ్య పరిణామాలు సంభవించినప్పుడే ఈ నిబంధనన వర్తిస్తుందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటంలో కానీ, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడంలో గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా స్పష్టం చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దాంతో ఇరకాటంలో పడ్డ పీసీబీ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించే అవకాశాలూ కనిపిస్తున్నాయి! -
'పది'oతల విధ్వంసానికి ‘సై’
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్... సిక్స్‌గా మారిందనుకున్న క్షణాన వైడ్ లాంగాన్ నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్... అసాధారణ రీతిలో బౌండరీ గీత అంచున గాల్లోకి ఎగిరి అందుకున్న క్యాచ్ భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టింది... ఈ ఘట్టం ఇంకా సగటు అభిమానుల కళ్లల్లో మెదులుతుండగానే మరో టి20 ప్రపంచ కప్ వచ్చేసింది... నాడు హీరోగా నిలిచిన సూర్యకుమార్ నేడు నాయకుడిగా జట్టును నడిపిస్తున్నాడు... జూన్ 29, 2024 గత టి20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన రోజు... కాగా ఫిబ్రవరి 7, 2026న తాజా టి20 ప్రపంచకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య విరామం 588 రోజులు... ఇన్ని రోజుల్లో తేదీ మాత్రమే మారింది... భారత్ ఆటలో దూకుడు, గెలుపు బాట ఏమాత్రం మారకుండా సేమ్ టు సేమ్... అద్భుత ఫామ్‌తో టైటిల్ నిలబెట్టుకొని చరిత్ర సృష్టించేందుకు, సొంతగడ్డపై సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమైంది.రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఇరవై నెలలకే మళ్లీ ‘ప్రపంచకప్’ రావడం కొంత ఆసక్తిని తగ్గించడం సహజమే అయినా పోటీ విషయంలో ఏ జట్టూ తక్కువ కాదు అంటూ సమరానికి ‘సై అంటున్నాయి. బిగ్‌బాష్‌లో చెలరేగిన కుర్రాళ్లతో ఆ్రస్టేలియా రెండో టైటిల్ కోసం సన్నద్ధమై రాగా, టి20 స్పెషలిస్ట్‌లతో ఇంగ్లండ్ తమ మూడో ట్రోఫీని అందుకోవాలని పట్టుదలగా ఉంది. మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ కూడా మూడో టైటిల్ అందుకొని ఈ ఫార్మాట్లోనైనా తమ స్థాయిని ప్రదర్శించాలని భావిస్తుండగా, సహ ఆతిథ్య జట్టుగా దక్కిన అవకాశాన్ని వాడుకోవాలని శ్రీలంక ఆశిస్తోంది. వివాదాల పాకిస్తాన్ రెండో ట్రోఫీని అందుకోగలదా అనే చర్చ సాగుతుండగా, ఒక్క వరల్డ్ కప్ వేటలో న్యూజిలాండ్ తమ పోరాటాన్ని కొనసాగించాలని సన్నద్ధమైంది. క్రితంసారి చేజారిన ట్రోఫీని ఈసారైనా దక్షిణాఫ్రికా గెలుచుకోగలదా చూడాలి. బంగ్లాదేశ్ నిష్క్రమించిన చోట ఇతర చిన్న జట్లు ఏమాత్రం ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరం. ముంబై: టి20 ఫార్మాట్లో పదో ప్రపంచ కప్‌కు సమయం ఆసన్నమైంది. భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి నేడు తెర లేవనుంది. తొలి రోజు మూడు వేర్వేరు వేదికల్లో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. గత టోర్నీ తరహాలోనే 20 జట్లు ఇందులో బరిలోకి దిగుతున్నాయి. 30 రోజుల్లో 55 మ్యాచ్‌ల పాటు ఈ ధనాధన్ వినోదం సాగుతుంది. ఇటలీ జట్టు తొలిసారి అర్హత సాధించగా... భద్రతా కారణాలరీత్యా భారత్‌లో ఆడలేమంటూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగింది. మార్చి 8న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. భారత్‌లో ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. శ్రీలంకలో కొలంబో, పల్లెకెలె వేదికలుగా ఉన్నాయి. మొత్తం జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్ నుంచి టాప్–2 టీమ్‌లు ‘సూపర్–8’ దశకు క్వాలిఫై అవుతాయి. ‘సూపర్–8’లోని రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. కొలంబోలో నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్ (ఉదయం 11 గంటల నుంచి), కోల్‌కతాలో వెస్టిండీస్‌తో స్కాట్లాండ్ (మధ్యాహ్నం 3 గంటల నుంచి) తలపడతాయి. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేదు! ఐసీసీ టోర్నీలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఈసారి లీగ్ దశలో ఉండటం లేదు. భారత్‌తో మ్యాచ్ ఆడరాదని పాక్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ తేదీ సమయానికి ఏదైనా అనూహ్యం సంభవిస్తే తప్ప మ్యాచ్ జరిగే అవకాశం లేదు. ఈ రెండు టీమ్‌లు నాకౌట్లో ఆడాల్సి వస్తే ఏమిటనేది కూడా ఆసక్తికరం. టి20 వరల్డ్ కప్‌లో 2009, 2010 మినహా... 2007లో రెండు మ్యాచ్‌లతో పాటు గత ఆరు వరుస వరల్డ్ కప్‌లలో ఇరు జట్లు తలపడ్డాయి. భారీ విజయంపై భారత్ దృష్టినేడు అమెరికాతో తొలి పోరుముంబై: ఆడిన 41 మ్యాచ్‌లలో 31 విజయాలు, 6 పరాజయాలు మాత్రమే... 2 మ్యాచ్‌లు ‘టై’ కాగా వాటిలో కూడా ‘సూపర్ ఓవర్’ గెలుపుతో కలిపి మొత్తం విజయాల సంఖ్య చూస్తే 33.. మొత్తం 9 సిరీస్‌లు ఆడితే అన్నింటిలోనూ విజేత... గత టి20 వరల్డ్ కప్‌లో విజయం సాధించిన తర్వాత భారత జట్టు అసాధారణ రికార్డు ఇది. ఇలాంటి స్థితిలో డిఫెండింగ్ చాంపియన్‌గా టీమిండియా మళ్లీ తమ జైత్రయాత్రకు సిద్ధమైంది. వాంఖెడే మైదానంలో జరిగే తమ తొలి పోరులో అమెరికాతో భారత్ తలపడనుంది. బలాబలాలపరంగా ఇరు జట్ల మధ్య ఉన్న అంతరాన్ని చూస్తే ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మ్యాచ్ విన్నర్లతో నిండిన సూర్యకుమార్ బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సునాయాస విజయం ఖాయం. గత టోర్నీలో పాక్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అమెరికా ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. 2024లో భారత్ 7 వికెట్ల తేడాతో అమెరికాను అలవోకగా ఓడించింది. గాయంతో భారత బౌలర్ హర్షిత్ రాణా టోర్నీకి దూరం కాగా... అతని స్థానంలో హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మొహమ్మద్ సిరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది.ఏ గ్రూప్‌లో ఎవరెవరు...గ్రూప్ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ. గ్రూప్ ‘బి’: ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్. గ్రూప్ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ. గ్రూప్ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ. సూపర్–8 గ్రూప్, సీడింగ్స్ వివరాలు గ్రూప్–1: భారత్ (ఎక్స్1), ఆస్ట్రేలియా (ఎక్స్2), వెస్టిండీస్ (ఎక్స్3), దక్షిణాఫ్రికా (ఎక్స్4). గ్రూప్–2: ఇంగ్లండ్ (వై1), న్యూజిలాండ్ (వై2), పాకిస్తాన్ (వై3), శ్రీలంక (వై4). -
ఈ కప్‌లో మనమే ప్రమాదకరం
న్యూఢిల్లీ: ఐసీసీ మొదలుపెట్టిన తొలి టి20 ప్రపంచకప్‌నే చేజిక్కించుకున్న భారత కెప్టెన్ ధోని. తర్వాత మరో రెండు ఐసీసీ (వన్డే ప్రపంచకప్, చాంపియన్స్) ట్రోఫీలను అందించిన విజయవంతమైన సారథిగా ఘనతకెక్కిన ‘మిస్టర్ కూల్’ ఎమ్మెస్ ధోని శనివారం మొదలయ్యే టి20 ప్రపంచకప్ గురించి వ్యాఖ్యానించాడు. ఇంకా కొనసాగుతున్న 38 ఏళ్ల రోహిత్ శర్మ, 37 ఏళ్ల విరాట్ కోహ్లి కెరీర్‌పై స్పందన కోరితే ఘాటుగానే జవాబిచ్చాడు. ఎక్కడా తగ్గలేదు. అన్నింటికి తగిన సమాధానాలిచ్చాడు. మైదానంలో వికెట్ల వెనక చురుకైన వికెట్ కీపర్‌గా, తెలివైన కెప్టెన్ వ్యవహరించిన ధోని కామెంట్రీ మాత్రం కష్టమంటున్నాడు. స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని ఇంకా ఏమన్నాడంటే... వయసు అడ్డంకి కాదు రోహిత్, కోహ్లి బాగానే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడతారు. అయితే ఏంటి? ఎందుకు ఆడకూడదు? పెరిగిన వయసే అడ్డంకా? నా దృష్టిలో వయసు అసలు ప్రాతిపదికే కాదు. ప్రదర్శనే ప్రామాణికం. ఫిట్‌నెస్సే ప్రధానం. అలాంటప్పుడు వయసును పరిగణించాల్సినపనేంటి చెప్పండి. ఆ వయసులో ఉన్న వారందరూ ఒకటేనా... అందరిని ఒకేలా చూస్తామా? నా విషయమే చెబుతా... నేను 24 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాను. అప్పుడెవరూ మాట్లాడలేదు. పదేళ్లకు పైగానే భారత్‌కు ఆడాను. 20 ఏళ్లయినా ఇంకా (ఐపీఎల్) ఆడుతున్నాను. ఇప్పుడు ఎవరూ మాట్లాడరు. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గురించే ఎందుకు ఈ చర్చంతా! ఎంతకాలం ఆడాలనేది వాళ్లకే వదిలేయండి ఆ విషయాన్ని. ఫామ్, ప్రదర్శన బాగున్నంత కాలం ఆడతారు. ఇందులో తప్పేంటి. నొప్పి ఎవరికి?. ఆ అనుభవం ఒక్క సచిన్‌కే అనుభవమనేది ఆడుతుంటేనే వస్తుంది. ఒక్క సచిన్ తప్ప 20 ఏళ్లకే అనుభవజు్ఞలైన ఆటగాళ్లుండటం అరుదు. 16, 17 ఏళ్లకు అరంగేట్రం చేస్తేనో రాదు. క్రమంగా ఆడితేనే వస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొంటేనే అబ్బుతుంది. పరిస్థితులకు ఎదురొడ్డి నిలిస్తేనే అలవాటవుతుంది. అనుభవమంటే అదే. ఏదో 20, 25 మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన అనుభవజు్ఞలైపోరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉంటుందో అనే అనుభవజ్ఞున్ని చేస్తుంది. భారత జట్టే ప్రమాదకారి సొంతగడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌లో మనకు ఎదురుపడే ప్రత్యర్థులకు మనతోనే ముప్పు. ఈ మెగా ఈవెంట్లో ప్రమాదకర జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. ఒక మేటి జట్టులో ఏమేమి ఉండాలో అవన్నీ మన బృందంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫార్మాట్‌నే పరిగణిస్తే మన టీమ్‌కు మంచి అనుభవం ఉంది. ఈ విశేషానుభవం మన జట్టుకు అదనపు బలంగా పనికొస్తుంది. ఎంతటి ఒత్తిడిలోనైనా ఆడగలిగే స్థయిర్యం అనుభవంతోనే వస్తుంది. అయితే నాకు జట్టుపై ఎలాంటి బెంగా లేదు కానీ మంచుతోనే ఏదైనా సమస్య ఉండొచ్చు. శీతాకాలం కాబట్టి ఇది బాగా ఇబ్బంది పెట్టొచ్చు. దీంతో టాస్ కీలకంగా మారుతుంది. కామెంట్రీ కష్టం... అందుకే దూరం మైదానంలో మైక్ పట్టుకొని మాట్లాడటం వేరు. టీవీల్లో మైక్ పట్టుకొని వ్యాఖ్యానించడం వేరు. అందుకే కామెంటరీ కష్టమనే అంటాను. మ్యాచ్ జరుగుతున్నప్పుడు దీన్ని వివరించే ప్రక్రియలో ఆడుతున్న ఆటగాళ్లను విమర్శించే వైనానికి మధ్యలో సన్నని గీత ఒకటి ఉంటుంది. దాన్ని చెరపలేం... అతిక్రమించలేం. వ్యాఖ్యాతగా మాట్లాడుతుంటే ఆ గీత ఒకటుంది అది తప్పని అనిపించదు. మ్యాచ్ వివరించేందుకు ఓ వైపు ఉండటానికే ఇష్టపడతారు. మ్యాచ్ సమయంలో తప్పని అనిపిస్తే వెంటనే దాన్ని బయటికి చెప్పాల్సి ఉంటుంది. సున్నితంగా విమర్శించగలితే నేర్పుండాలి. హుందాగా వ్యాఖ్యానించాలి. ఎవరినీ లక్ష్యపెట్టకుండా, నొప్పించకుండా వ్యాఖ్యానించగలిగే నైపుణ్యం కూడా ఉండాలి. నాకు ఇవేమీ లేవు. అందుకే కామెంట్రీకి దూరం. అంతెందుకు గణాంకాలు సైతం గుర్తుండాలి. నాకేమో నా గణాంకాలే తెలియవు. కొందరైతే ఇందులోనిష్ణాతులై ఉంటారు. వారైతేనే కామెంటేటర్ పాత్రకు న్యాయం చేస్తారు. నేనో మంచి స్పీకర్‌ను కాదు నాకు వినడం మీద ఉన్న శ్రద్ద మాట్లాడటం మీద ఉండదు. వాదించడం నా వల్ల కానేకాదు. అందుకే అనిపిస్తుంది... నేను మంచి స్పీకర్‌ను కాదు. ఎప్పటికీ కాలేను కూడా! నేను మాట్లాడేది చాలా తక్కువ. నాకు అనువైన, నా మాటలు అర్థం చేసుకోగలిగిన వారితోనే మాట్లాడతాను. అందరితోనూ మాట్లాడలేను. కానీ ఎవరు చెప్పినా వినే ఓపికైతే నాకు చాలానే ఉంది. ఎంత సేపయినా వింటాను. -
మెరుపుల పండక్కి భారత సంతతి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌లో ఒక్కో జట్టు నుంచి 11 మంది ప్లేయర్లు మాత్రమే మైదానంలో అడుగు పెడతారు. కానీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌లో మాత్రం లెక్కకు మిక్కిలి భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. అదేంటి ఏ జట్టుకైనా ఒకటే నిబంధన కదా అనే అనుమానం రాకమానదు. ఇక్కడే అసలు మెలిక ఉంది. టీమిండియా తరఫున ఆడేది పదకొండు మందే... కానీ, ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతున్న 20 జట్లలో భారత్‌తో పాటు మరో తొమ్మిది జట్ల తరఫున మనదేశ సంతతి ఆటగాళ్లు ఆడనున్నారు. రెండోసారి టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన కెనడా జట్టులో అత్యధికంగా 11 మంది భారత సంతతి ప్లేయర్లు ఉండగా... అమెరికా జట్టులో 9 మంది మనవాళ్లు ఉన్నారు. ప్రవాస భారతీయులు అధికంగా ఉండే ఒమన్, యూఏఈ నుంచి ఏడుగురు చొప్పున మన మూలాలున్న ప్లేయర్లు వరల్డ్‌కప్ ఆడనుండగా... ఇష్ సోధి, రచిన్ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్ నుంచి ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున వరల్డ్‌కప్‌లో ఆడనున్నారు. ఇందులో కెనడా, అమెరికా, ఒమన్ జాతీయ జట్లకు సారథ్యం వహిస్తుంది కూడా మనవాళ్లే కావడం విశేషం. మరో మూడు రోజుల్లో టి20 వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి ఆటగాళ్లపై ఓ కన్నేద్దాం! పాకిస్తాన్ పనిపట్టి... సౌరభ్ నేత్రావల్కర్... ఈ పేరు గత టి20 ప్రపంచకప్ సమయంలో బాగా వినిపించింది. అమెరికా వేదికగా జరిగిన ఆ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను అమెరికా ఓడించడంలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీలక పాత్ర పోషించాడు. గ్రూప్ దశలో పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగిన పోరులో స్కోర్లు సమం కాగా... సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన నేత్రావల్కర్... పాక్ బ్యాటర్లను కట్టడి చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లోనూ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులకే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముంబైలో పుట్టి పెరిగి... ఒకప్పుడు అండర్–19 స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సౌరభ్ ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. లెఫ్టార్మ్ మీడియం పేస్ బౌలింగ్‌తో రాణించి అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత వరల్డ్‌కప్‌లో అమెరికా జట్టు ‘సూపర్–8’ దశకు చేరడంతో కీలకంగా వ్యవహరించిన 34 ఏళ్ల సౌరభ్... సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సెలవు పెట్టి మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఒకప్పుడు సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మ్యాచ్‌లు ఆడిన సౌరభ్ ఈ శనివారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా అతడికి ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ‘ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. కానీ, ఇది చాలా భావోద్వేగ క్షణం. జీవితం ఒక చక్రం లాంటిది. నేను ఇక్కడే క్రికెట్ ఆడటం ప్రారంభించా... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడే టీమిండియతో మ్యాచ్ ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు’ అని నేత్రావల్కర్ అన్నాడు. మోనాంక్ పటేల్ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఒకప్పుడు మ్యాచ్‌లు ఆడిన మోనాంక్ పటేల్... ప్రస్తుతం అమెరికా జట్టుకు కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌నకు సిద్ధమయ్యాడు. 2024 టి20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో పోరులో చక్కటి అర్ధశతకంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన మోనాంక్... ఈసారి కూడా మెగా టోర్నీలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. గుజరాత్లో పుట్టి పెరిగిన 32 ఏళ్ల మోనాంక్... అండర్–19 స్థాయిలో బుమ్రాతో మ్యాచ్‌లు ఆడాడు. ‘మేమిద్దరం చిన్నప్పుడు కలిసి మ్యాచ్‌లు ఆడాం. ఆ తర్వాత ఇద్దరి దారులు వేరయ్యాయి. బుమ్రా ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ స్థాయికి ఎదిగాడు. టీమిండియాతో మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం అని తెలుసు. మా వరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని అనుకుంటున్నాం’ అని మోనాంక్ అన్నాడు. జస్ప్రీత్ సింగ్ మొదటిసారి ఐసీసీ టి20 ప్రపంచకప్ ఆడనున్న ఇటలీ జట్టులో పంజాబ్‌లో పుట్టి పెరిగిన జస్ప్రీత్ సింగ్ చోటు దక్కించుకున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం మెరుగైన జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్ప్రీత్... అక్కడ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూనే క్రికెట్ కొనసాగించాడు. తన ప్రదర్శనతో జాతీయ జట్టుకు ఎంపికైన 32 ఏళ్ల జస్ప్రీత్... వరల్డ్‌కప్ కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు. ఆర్యన్ దత్ ఇప్పటికే 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా నెదర్లాండ్స్ తరఫున భారత్‌లో మ్యాచ్‌లాడిన ఆర్యన్ దత్... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్‌నకు సిద్ధమవుతున్నాడు. 22 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్నర్ భారత్‌లో పుట్టకపోయినా... అతడి తల్లిదండ్రులది పంజాబే. మెరుగైన జీవనోపాధి కోసం ఆర్యన్ కుటుంబం నెదర్లాండ్స్‌కు వలస వెళ్లగా... అక్కడ తన స్పిన్‌తో సత్తాచాటిన ఆర్యన్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దిల్‌ప్రీత్ బాజ్వా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగనున్న కెనడా జట్టయితే పూర్తిగా భాతర సంతతి ఆటగాళ్లతో నిండి ఉంది. ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్న దిల్‌ప్రీత్ బాజ్వా ఇటీవలే కెనడాకు వలస వెళ్లాడు. అనతి కాలంలోనే తన ప్రతిభతో అక్కడి జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్‌ప్రీత్... కెనడా గ్లోబల్ టి20 లీగ్‌లో విజృంభించి వెలుగులోకి వచ్చాడు. జతిందర్ సింగ్ పంజాబ్‌లోని లుధియానాలో పుట్టి పెరిగిన జతిందర్ సింగ్... ఈ ప్రపంచకప్‌లో ఒమన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దశాబ్దానికి పైగా భారత దేశవాళీల్లో ఆడిన 36 ఏళ్ల జతిందర్... అవకాశాలు రాకపోవడంతో ఒమన్‌కు వలసవెళ్లి ఆ దేశ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు వినాయక్ శుక్లా, కరణ్ సోనావాలె, జై, ఆశిష్, వసీం, జితేన్ రామనంది ఇలా ఏడుగురు భారత సంతతి ఆటగాళ్లు ఒమన్ తరఫున బరిలోకి దిగనున్నారు. టి20 ప్రపంచకప్‌లో భారత సంతతి ఆటగాళ్లు కెనడా (11): దిల్‌ప్రీత్ బాజ్వా (కెప్టెన్ ), అజయ్‌వీర్ హుండల్, అంశ్ పటేల్, హర్ష్ థాకెర్, జస్కరణ్దీప్ బుట్టర్, కన్వర్పాల్ తత్ఘుర్, నవ్‌నీత్ ధలీవాల్, రవీందర్‌పాల్ సింగ్, శివం శర్మ, శ్రేయస్ మొవ్వ, యువరాజ్ సామ్రా. అమెరికా (9): మోనాంక్ పటేల్ (కెప్టెన్ ), జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నోస్తుష్ కెంజిగె, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, శుభం రంజనె. ఒమన్ (7): జతిందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, కరణ్ సోనావాలె, జై ఒడెద్రా, ఆశిష్ ఒడెద్రా, వసీం అలీ, జితేన్ రామనంది. యూఏఈ (7): అలీషాన్ షరాఫు, ఆర్యాంశ్ శర్మ, ధ్రువ్ పరాశర్, హర్షిత్ కౌశిక్, మయాంక్ కుమార్, సిమ్రన్‌జీత్ సింగ్, సొహైబ్ ఖాన్. న్యూజిలాండ్ (2): ఇష్ సోధి, రచిన్ రవీంద్ర దక్షిణాఫ్రికా (1): కేశవ్ మహరాజ్ వెస్టిండీస్ (1): గుడకేశ్ మోతీ ఇటలీ (1): జస్ప్రీత్ సింగ్ నెదర్లాండ్స్ (1): ఆర్యన్ దత్ తెలుగువాళ్లు కూడా...అమెరికా తరఫున ఆడుతున్న ముక్కామల సాయితేజ రెడ్డి... కెనడా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రేయస్ మొవ్వ తెలుగు మూలాలున్న ఆటగాళ్లే. అమెరికాలోనే పుట్టి పెరిగిన సాయితేజ రెడ్డి అమెరికా జాతీయ జట్టు ఓపెనర్‌గా 37 వన్డేలు, 18 టి20లు ఆడాడు. మంచి స్ట్రయిక్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయితేజ... ఈ మెగాటోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. భారత్‌లో పుట్టి కెనడాకు వలస వెళ్లిన శ్రేయస్ మొవ్వ ఆ దేశ జట్టు తరఫున ఇప్పటి వరకు 24 వన్డేలు, 24 టి20లు ఆడాడు. -
పొట్టి ప్రపంచకప్ రికార్డులు, విశేషాలు
టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన విశేషాలు, రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీ తొలి ఎడిషన్ 2007లో ప్రారంభమైంది. నాడు ఈ టోర్నీ ICC World Twenty20 పేరుతో జరిగింది. 2018లో దీనిని ICC Men’s T20 World Cupగా పునర్నామకరణం చేశారు. 2007 నుంచి 2009 వరకు ప్రతి బేసి (ODD) సంవత్సరంలో, 2010 నుంచి ప్రతి జత (EVEN) సంవత్సరంలో ఈ టోర్నమెంట్ జరిగింది. 2018, 2020లో మాత్రం జరగలేదు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ఈ మూడు జట్లు తలో రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. భారత్ 2007, 2024 ఎడిషన్లలో.. ఇంగ్లండ్ 2010, 2022లో.. వెస్టిండీస్ 2012, 2016 ఎడిషన్లలో ట్రోఫ్రీలు దక్కించుకున్నాయి. పాక్ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2022) తలోసారి ఛాంపియన్లుగా అవతరించాయి.టోర్నీ చరిత్రలో అత్యుత్తమ రికార్డులు..అత్యధిక ఎడిషన్లలో పాల్గొన్న ఆటగాళ్లు- రోహిత్ శర్మ, షకీబ్ అల్ హసన్ (9)అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు- రోహిత్ శర్మ (47)అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన రికార్డు- ఎంఎస్ ధోని (33 మ్యాచ్‌లు)అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి (1292)అత్యధిక వ్యక్తిగత స్కోర్- బ్రెండన్ మెక్కల్లమ్ (123)అత్యధిక సగటు- విరాట్ కోహ్లి (58.72)అత్యధిక స్ట్రయిక్‌రేట్- సూర్యకుమార్ యాదవ్ (158.94 స్ట్రయిక్‌రేట్)అత్యధిక సెంచరీలు- క్రిస్ గేల్ (2)అత్యధిక 50 ప్లస్ స్కోర్లు- విరాట్ కోహ్లి (15)అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు- విరాట్ కోహ్లీ (8)ఫాస్టెస్ట్ ఫిఫ్టి- యువరాజ్ సింగ్ (12)ఫాస్టెస్ట్ సెంచరీ- క్రిస్ గేల్ (47)అత్యధిక సిక్సర్లు- గేల్ (63)అత్యధిక బౌండరీలు- రోహిత్ శర్మ (115)ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు- గేల్ (11)ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు- గిబ్స్ (14)ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి (2014లో 319 పరుగులు)అత్యధిక వికెట్లు- షకీబ్ (50)అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు- అజంత మెండిస్ (6-8)అత్యుత్తమ ఎకానమీ- సునీల్ నరైన్ (5.17)ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు- అర్షదీప్, ఫజల్హక్ ఫారూఖీ (2024లో తలో 17 వికెట్లు)హ్యాట్రిక్‌లు- మొత్తం 9 (బ్రెట్ లీ, కర్టిస్ క్యాంఫర్, హసరంగ, రబాడ, కార్తిక్ మైయప్పన్, జోష్ లిటిల్, కమిన్స్, క్రిస్ జోర్డన్) నమోదు కాగా.. కమిన్స్ ఒక్కడే రెండు (2024) తీశాడు.అత్యధిక క్యాచ్‌లు- డేవిడ్ వార్నర్ (25)అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టు- శ్రీలంక (54)అత్యధిక విజయాల శాతం కలిగిన జట్టు- భారత్ (67.30)అత్యధిక స్కోర్ చేసిన జట్టు- ఇంగ్లండ్ (2016లో సౌతాఫ్రికాపై 230-8)అత్యల్ప స్కోర్ చేసిన జట్టు- నెదర్లాండ్స్ (39 ఆలౌట్, 2014లో శ్రీలంకపై)అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచ్- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (2016లో 459 పరుగులు)అత్యధిక మార్జిన్‌తో (పరుగులు) గెలిచిన జట్టు- శ్రీలంక (2007లో కెన్యాపై 172 పరుగుల తేడాతో)అత్యధిక ఛేదన- ఇంగ్లండ్ (2016లో సౌతాఫ్రికాపై 230 పరుగులు)అత్యధిక టైటిళ్లు సాధించిన కెప్టెన్- డారెన్ సామీ (2012, 2016) -
పాక్, సౌతాఫ్రికా కాదు.. సెమీస్‌కు చేరే జట్లు ఇవే
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్-2026కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ.. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. అయితే ఈ పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకొంది. దీంతో బంగ్లా స్ధానాన్ని స్కాట్లాండ్తో ఐసీసీ భర్తీ చేసింది. తాజాగా పాకిస్తాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే తీవ్ర చర్చనీయాంశమైంది.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు వాన్ షాకిచ్చాడు. తను ఎంచుకున్న టాప్-4 జట్ల జాబితాలో సౌతాఫ్రికాకు వాన్ చోటు ఇవ్వలేదు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత్‌కు వాన్ మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం పాకిస్తాన్‌ను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా భారత్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీ సన్నాహల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ దుమ్ములేపింది.చదవండి: పాక్‌కు ఇదేమి కొత్త కాదు.. కచ్చితంగా వెనక్కి తగ్గుతుంది: గావస్కర్ -
ముగ్గురు భారత అంపైర్లకు చోటు
దుబాయ్: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే టి20 ప్రపంచ కప్‌లో పని చేయనున్న అంపైర్లు, రిఫరీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 24 మంది అంపైర్లతో పాటు ఆరుగురు మ్యాచ్ రిఫరీలు ఈ జాబితాలో ఉన్నారు. భారత మాజీ పేసర్, సీనియర్లలో ఒకడైన జవగల్ శ్రీనాథ్ రిఫరీగా కొనసాగనుండగా...అతనితో పాటు డీన్ కోస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మదుగలే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్ రిఫరీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంపైర్లలో భారత్ నుంచి నితిన్ మేనన్, అనంత పద్మనాభన్, జె.మదన్ గోపాల్‌లకు అవకాశం దక్కింది. ఐసీసీ ఎలీట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడైన నితిన్ మేనన్‌కు ఇది నాలుగో టి20 వరల్డ్ కప్ కానుంది. గతంలో అతను 2021, 2022, 2024లలో కూడా అంపైర్‌గా వ్యవహరించాడు. భారత్, న్యూజిలాండ్ సిరీస్‌లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించనున్న 42 ఏళ్ల మేనన్‌కు ఇది మూడు ఫార్మాట్లలో కలిపి 150 అంతర్జాతీయ (పురుషుల) మ్యాచ్ కానుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత అంపైర్‌గా అతను నిలవనున్నాడు. మదన్‌గోపాల్‌కు ఇది రెండో టి20 వరల్డ్ కప్ కాగా, పద్మనాభన్‌కు తొలిసారి ప్రపంచ కప్ చాన్స్ లభించింది. రోలండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిసన్ గాఫ్నీ, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, వేన్ నైట్స్, డొనొవాన్ కాచ్, స్యామన్ నొగాస్కీ, అల్లావుద్దీన్ పలేకర్, అహ్సాన్ రజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫెల్, లాంగ్టన్ రూసెర్, షర్ఫుద్దౌలా షాహిద్, గాజీ సొహెల్, రాడ్నీ టకర్, అలెక్స్ వార్స్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాఖూబ్ కూడా అంపైర్లుగా టి20 వరల్డ్ కప్‌లో పని చేయనున్నారు. -
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అతి పెద్ద సంచలనాలు ఇవే..!
టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే, తక్కువ వ్యవధిలో ఆట స్వరూపమే మారిపోతుంది. ఒక్క చిన్న తప్పిదం.. ఒక్క ఆటగాడి అద్భుత ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. ఇక్కడ చిన్న జట్టు, పెద్ద జట్టు అన్న తేడా పెద్దగా ఉండదు. ఆ సమయానికి ఎవరిది పైచేయి అయితే, వారే మ్యాచ్ గెలుస్తారు. చిన్న జట్లతో పోలిస్తే పెద్ద జట్లే అధిక అంచనాల ఒత్తిడిలో ఉంటాయి. ఈ కారణంగానే ఫలితాలు తారుమారవుతాయి. పొట్టి ఫార్మాట్లో ఇలాంటి ఘటనలను తరుచూ చూస్తుంటాం.మెగా టోర్నీ అయిన ప్రపంచకప్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఈ టోర్నీ తొలి ఎడిషన్ నుంచే ఇలాంటి సంచలనాలు నమోదవుతూ వచ్చాయి. త్వరలో ప్రారంభం కానున్న 2026 ఎడిషన్ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నమోదైన టాప్-5 అతి పెద్ద సంచలనాలపై ఓ లుక్కేద్దాం.తొలి ఎడిషన్‌లోనే..!పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్‌లోనే (2007) అతి పెద్ద సంచలనం నమోదైంది. కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పసికూన జింబాబ్వే 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. జింబాబ్వే ఆటగాళ్లు బ్రెండన్ టేలర్ (60*), ఎల్టన్ చిగుంబురా (3/20) ఈ మ్యాచ్ హీరోలుగా నిలిచారు.ఇంగ్లండ్‌కు నెదర్లాండ్స్ షాక్రెండో ఎడిషన్‌లో (2009) మరో సంచలనం నమోదైంది. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై చిన్న జట్టు నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో అనూహ్య విజయం సాధించింది. ఇక్కడ గమనించదగ్గ మరో విశేషమేమిటంటే.. నెదర్లాండ్స్ ఇంగ్లండ్‌ను వారి స్వదేశంలోనే ఓడించడం. టామ్ డి గ్రోత్ (49), ర్యాన్ టెన్ డోషాటే (2/35) నెదర్లాండ్స్ హీరోలుగా నిలిచారు.పెను సంచలనాల ఎడిషన్2022 ఎడిషన్‌లో రెండు భారీ సంచలనాలు నమోదయ్యాయి. శ్రీలంకకు నమీబియా.. సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ ఊహించని షాక్‌లు ఇచ్చాయి. నమీబియా తరఫున జాన్ ఫ్రైలింక్ (44), డేవిడ్ వీజ్, బెర్నార్డ్ స్కోల్జ్ (తలో 2 వికెట్లు) హీరోలుగా నిలువుగా.. నెదర్లాండ్స్ తరఫున కాలిన్ అకర్మాన్ (41*), బ్రాండన్ గ్లోవర్ (3/9) అద్భుతం చేశారు.పాక్‌ను మట్టికరిపించిన పసికూన2024 ఎడిషన్‌లో మరో పెను సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన యూఎస్ఏ.. బలాడ్యులమని విర్రవీగే పాక్‌కు కర్రు కాల్చి వాత పెట్టింది. ఈ మ్యాచ్‌లో యూఎస్ఏ ఆటగాళ్లు మోనాంక్ పటేల్ (50), సౌరభ్ నేత్రవల్కర్ (2/18 + సూపర్ ఓవర్ ) అద్భుత ప్రదర్శనలు చేసి యూఎస్ఏకు చారిత్రక విజయాన్ని అందించారు. ఇదే ఎడిషన్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా పెను సంచలనాలు నమోదు చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి మెగా జట్లకు షాకిచ్చి సెమీఫైనల్ వరకు వెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు త్వరలో ప్రారంభం కాబోయే 2026 ఎడిషన్‌లోనూ పెను సంచలనాలు సృష్టించే ఆస్కారం ఉంది. ఆఫ్ఘన్‌తో పాటు యూఎస్ఏ, నేపాల్ కూడా పెద్ద జట్లకు షాకిచ్చే అవకాశం ఉంది. -
హార్దిక్, అర్ష్ దీప్ కీలకం: రోహిత్
న్యూఢిల్లీ: భారత జట్టు టి20 వరల్డ్ కప్ నిలబెట్టుకోవాలంటే అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జట్టు మాజీ కెప్టెన్, బ్యాటర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. కొత్త బంతితో అర్ష్ దీప్ చాలా ప్రమాదకారి అని, మిడిలార్డర్లో పాండ్యా బలమైన బ్యాటింగ్ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందని రోహిత్ అన్నాడు. రోహిత్ నాయకత్వంలోనే 2024లో టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ‘కొత్త, పాత బంతులను ఒకే తరహాలో స్వింగ్ చేయడం అర్ష్ దీప్ ప్రత్యేక బలం కాగా రెండు సందర్భాల్లోనూ వికెట్లు పడగొట్టగలడు. 2024 ఫైనల్లో అతను చాలా బాగా బౌలింగ్ చేసాడు. ఆరంభంలో డికాక్ వికెట్ తీసిన అర్ష్ దీప్ 19వ ఓవర్లో తక్కువ పరుగులు ఇవ్వడం విజయానికి బాటలు వేసింది. ఈసారీ అదే జరుగుతుంది. జట్టులో పాండ్యా కూడా ఆల్‌రౌండర్‌గా ఎంతో విలువైన ఆటగాడు. బ్యాటింగ్ చివరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు రాబట్టగలడు. అవసరమైతే 50/4 స్కోరు నుంచి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టగలడు. పైగా ఏ దశలోనైనా బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా అతని సొంతం’ అని రోహిత్ ప్రశంసించాడు. -
ఊచకోత అంటే ఇదే..
-
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
-
బంగ్లాదేశ్ ఖేల్ ఖతం!
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. బంగ్లా టీమ్‌ను వరల్డ్ కప్‌నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మంకు పట్టు వీడలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్‌పై ఐసీసీ వేటు వేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ ఈ టోర్నమెంట్లో బంగ్లా స్థానంలో బరిలోకి దిగుతుంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు మద్దతు పలికింది. దాంతో వేటు లాంఛనంగానే మారింది. టీమ్‌ను వరల్డ్ కప్‌ను తొలగిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ శుక్రవారం బీసీబీకి తెలియజేసింది. ఐసీసీలోని ఇతర సభ్య దేశాలకు కూడా ఈ సమాచారం అందించింది. టోర్నీకి దూరం కావడం బంగ్లా బోర్డుపై ఆరి్థ కపరంగా కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు ఇచ్చే 5 లక్షల డాలర్లతో పాటు ఐసీసీనుంచి ప్రతీ ఏటా అందే 27 మిలియన్ డాలర్లు కోల్పోనుంది. బంగ్లా నిష్క్రమణ నేపథ్యమిదీ... తాజా పరిణామాలను బట్టి చూస్తే వరల్డ్ కప్‌కు దూరం కావడం బంగ్లా స్వయంకృతమే. ఐపీఎల్ వేలంలో బంగ్లా పేసర్ ముస్తఫిజుర్ రహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 9.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆటగాడిని ఐపీఎల్లో ఆడించాలనే ఆలోచనపై భారత్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. వీటికి స్పందిస్తూ కేకేఆర్ యాజమాన్యం ముస్తఫిజుర్‌ను లీగ్ నుంచి తప్పించింది. తమ ఆటగాడిని అర్ధాంతరంగా తొలగించడం బీసీబీకి నచ్చలేదు. దీనిని ఆ దేశ బోర్డు ఒక రకమైన అవమానంగా భావించింది. దాంతో భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదంటూ కొత్త విషయాన్ని ముందుకు తెచ్చింది. టి20 వరల్డ్ కప్‌లో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ అంశంపై స్పందించిన ఐసీసీ బంగ్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. టోర్నీకి చాలా తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు షెడ్యూల్ మార్పు సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత్‌లో ఆ దేశపు ఆటగాళ్లు, మీడియా, ఇతర సిబ్బందికి ఎలాంటి సమస్య రాకుండా అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. -
చితక్కొట్టాడు.. యువీ దెబ్బకు అల్లాడినా..
ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు స్టువర్ట్ బ్రాడ్. టెస్టుల్లో ఏకంగా 604 వికెట్లు కూల్చి.. సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 178 వన్డే, 65 అంతర్జాతీయ టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.ఇంతటి గొప్ప రికార్డు కలిగి ఉన్న స్టువర్ట్ బ్రాడ్‌కు కెరీర్ ఆరంభంలోనే ఓ చేదు అనుభవం ఎదురైంది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007లో టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) బ్రాడ్‌కు పీడకల మిగిల్చాడు. అతడి బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది.. అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.21 ఏళ్ల వయసులో..మరోవైపు.. ఇలా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా బ్రాడ్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 క్రికెట్లో యువీ ఐకానిక్ ఫీట్ నమోదు చేసిన ఆ సమయంలో.. ఈ రైటార్మ్ పేసర్ వయసు 21 ఏళ్లే. అయితే, ఆ చేదు అనుభవం నుంచి బ్రాడ్ త్వరగానే కోలుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి మేటి బౌలర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.యువీ దెబ్బకు అల్లాడినా..తాజాగా... గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న స్టువర్ట్ బ్రాడ్.. యువీ దెబ్బకు అల్లాడినా.. ఆ తర్వాత ఎలా నిలదొక్కుకున్నాడో చెప్పుకొచ్చాడు. ‘‘అప్పటికి నేను ఏడు నుంచి ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడి ఉంటాను. ఇంకా టెస్టు క్రికెట్లో అరంగేట్రమే చేయలేదు. అప్పుడు నా జట్టు పొడవుగా.. బంగారు వర్ణంలో ఉండేది.ఐదేళ్ల కెరీర్ సేవ్ అయింది20-21 ఏళ్ల మధ్య వయసు. ఉరకలెత్తే ఉత్సాహం. అలాంటపుడు ఊహించని విధంగా.. నా ముఖం మీద కొట్టినట్లుగా బ్యాటర్ బాదుతూ ఉంటే నేను ఏమైపోవాలి?.. అయితే, ఆట ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆరంభంలోనే అంతా సజావుగా సాగిపోతే 26-27 ఏళ్లకే అంతా సాధించేశాము అన్న భావన వచ్చేస్తుంది. అంకితభావం కొరవడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.వారియర్ మోడ్ఫామ్లో లేకుంటే జట్టు నుంచి తప్పించనూ వచ్చు. 31 ఏళ్లు వచ్చే సరికి అంతా ముగిసిపోతుంది. కానీ నాకు 21 ఏళ్ల వయసులో తగిలిన ‘దెబ్బ’ నాలో కసిని రగిల్చింది. మరుసటి ఐదేళ్లు ఎలా ఆడాలో.. ఆటను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలిసేలా చేసింది. నన్ను ‘వారియర్ మోడ్’లోకి తీసుకువెళ్లింది.ప్రతి మ్యాచ్‌కు ముందు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా చేసింది. అలా 25-26 ఏళ్ల వయసు వచ్చే సరికి ఎలైట్ పర్ఫార్మర్ కావాలనే కోరిక పెరిగింది. అందకు తగినట్లుగా కృషి చేశా. కానీ ఒక్కోసారి నా శరీరం ఇందుకు సహకరించలేదు. కాబట్టి అనుకున్నది అనుకున్న సమయంలో సాధించకలేకపోయాను.అందుకే ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేనింకా మెరుగ్గా ఆడాల్సింది అని అనిపిస్తుంది’’ అని మాథ్యూ హెడెన్ పాడ్‌కాస్ట్‌లో స్టువర్ట్ బ్రాడ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా 344 మ్యాచ్‌లలో కలిపి 847 వికెట్లు కూల్చిన 39 ఏళ్ల బ్రాడ్.. 2023లో ఆటకు గుడ్‌బై చెప్పాడు.చదవండి: బంగ్లాదేశ్‌కు భారీ షాక్ -
ప్రపంచకప్‌లు... ప్రతిష్టాత్మక ఈవెంట్లు...
జూనియర్, సీనియర్, మహిళల వరల్డ్ కప్‌లతో పరుగుల లెక్కలు... మెస్సీ, రొనాల్డోల మెరుపులను చివరిసారి చూసేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూపులు... భిన్న క్రీడాంశాల్లో సత్తా చాటి అందరి దృష్టినీ ఆటగాళ్లు తమ వైపు తిప్పుకునేే కామన్వెల్త్, ఆసియా క్రీడల రూపంలో రెండు నెలల వ్యవధిలో రెండు చాన్స్‌లు... ఇక స్వదేశంలో మన షట్లర్ల స్థాయిని ప్రదర్శించేందుకు 17 ఏళ్ల తర్వాత వచ్చిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ నిర్వహణావకాశం... ఇలా 2026లో పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లు క్రీడాభిమానులను అలరించనున్నాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకు నిరంతరాయంగా పది నెలల పాటు ఫుల్ స్పోర్ట్స్ జోష్ కనిపించడం ఖాయం.కామన్వెల్త్ క్రీడలు23 జులై–2 ఆగస్టు(వేదిక: గ్లాస్గో, స్కాట్లండ్)అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఆటగాళ్లు సత్తా చాటేందుకు కామన్వెల్త్ క్రీడలు సరైన వేదికగా నిలుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మన వర్ధమాన ఆటగాళ్లు ఈ క్రీడల ద్వారా గుర్తింపు దక్కించుకుంటున్నారు. 2022 క్రీడల్లో భారత్ 22 స్వర్ణాలు సహా మొత్తం 61 పతకాలు గెలిచి నాలుగో స్థానంతో ముగించింది. అయితే ఆర్థికపరమైన, నిర్వహణాపరమైన ఇతర సమస్యల కారణంగా 2026 పోటీలను కేవలం 10 క్రీడాంశాలకే పరిమితం చేశారు. భారత ఆటగాళ్లు కచ్చితంగా పతకం గెలిచే అవకాశం ఉన్న హాకీ, బ్యాడ్మింటన్, టి20 క్రికెట్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్‌లను తప్పించడంతో ఈ సారి భారత్ పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అన్నీ కలిపి 215 ఈవెంట్లలో దాదాపు 3 వేల మంది ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. 2014లోనే కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన గ్లాస్గో తక్కువ వ్యవధిలో మరోసారి ఈ పోటీలకు వేదిక కానుండటం విశేషం. గతంలో బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న 74 దేశాలు తలపడే ఈ పోటీలు ఎలిజబెత్ మహరాణి–2 మరణించిన తర్వాత జరుగుతున్న తొలి గేమ్స్ కానున్నాయి. టి20 వరల్డ్ కప్7 ఫిబ్రవరి–8 మార్చి(వేదిక: భారత్, శ్రీలంక)బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ అత్యద్భుత క్యాచ్... రోహిత్ శర్మ మెస్సీ స్టయిల్లో ట్రోఫీని అందుకున్న క్షణాలు ఇంకా మనసునుంచి చెరిగిపోక ముందే మరో టి20 వరల్డ్ కప్ వచ్చేసింది. ఈ సారి డిఫెండింగ్ చాంపియన్‌గా, అదీ సొంతగడ్డపై బరిలోకి దిగుతుండటం ఇప్పటికే బలంగా ఉన్న భారత జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. ఈ ఏడాది క్రికెట్ అభిమానులను ఎక్కువగా అలరించే అవకాశం ఉన్న టి20 వరల్డ్ కప్‌కు భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. గతంలో తరహాలోనే 20 జట్లు టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలతో పాటు ఫైనల్ జరిగే అహ్మదాబాద్ కూడా మన దేశంలో వేదికలుగా ఉన్నాయి. 2024 వరల్డ్ కప్‌తో పోలిస్తే రోహిత్, కోహ్లిలాంటి స్టార్లు ఈ టోర్నీలో కనిపించరు కానీ అభిõÙక్, తిలక్‌లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలిసారి ఇటలీ జట్టు వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కించుకోవడం విశేషం. ఇప్పటి వరకు జరిగిన 9 టి20 వరల్డ్ కప్‌లలో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండేసి సార్లు విజేతలుగా నిలవగా... పాకిస్తాన్, శ్రీలంక, ఆ్రస్టేలియా ఒక్కో టైటిల్ గెలిచాయి. మహిళల టి20 వరల్డ్ కప్12 జూన్–5 జులై(వేదిక: ఇంగ్లండ్)తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచి శిఖరాన నిలిచిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు ఈ సారి టి20 వరల్డ్ కప్‌పై గురి పెట్టింది. 2020లో జరిగిన టోర్నీలో అత్యుత్తమంగా రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు మిగతా 8 ప్రయత్నాల్లోనూ పేలవ ప్రదర్శనతో విఫలమైంది. అయితే ఇటీవల జట్టులో వచ్చిన మార్పులు, టి20 స్పెషలిస్ట్‌ల ప్రదర్శన మన టీమ్‌లో ఆశలు పెంచుతున్నాయి. దానికి తగినట్లుగా ఇప్పటినుంచి వరల్డ్ కప్ కోసం జట్టు సన్నాహకాలు కొనసాగుతున్నాయి. 2009లో తొలి టోర్నీని నిర్వహించిన తర్వాత ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ నిర్వహిస్తారు. టి20 వరల్డ్ కప్‌లో ఆ్రస్టేలియా ఏకంగా 6 సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. న్యూజిలాండ్ డిఫెండింగ్ చాంపియన్. పురుషుల అండర్–19 వరల్డ్ కప్ 15 జనవరి–6 ఫిబ్రవరి(వేదిక: జింబాబ్వే, నమీబియా)యువ క్రికెటర్లు చెలరేగి భవిష్యత్తులో సీనియర్ జట్టుకు ప్రమోట్ అయ్యేందుకు అండర్–19 ప్రపంచ కప్ చక్కటి అవకాశం కల్పిస్తోంది. భారత జట్టులో అలాంటి యువ ఆటగాళ్లకు కొదవ లేదు. తమ ప్రతిభతో ఐపీఎల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే, భారత జట్టుకు వరల్డ్ కప్ అందించేందుకు అండర్–19 స్థాయిలో బరిలోకి దిగుతున్నారు. కొత్త ఏడాదిలో అన్నింటికంటే ముందుగా క్రికెట్ అభిమానులకు అలరించే సిద్ధమైన ఈ కుర్రాళ్ల పోరులో మొత్తం 16 టీమ్‌లు బరిలోకి దిగుతున్నాయి. 2024లో టైటిల్ సాధించిన ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... ఫైనల్లో ఓడిన భారత్ రన్నరప్‌గా నిలిచింది. అయితే మొత్తం 15 సార్లు జరిగిన అండర్–19 వరల్డ్ కప్‌లో 5 సార్లు కప్ గెలుచుకొని భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఆసియా క్రీడలు19 సెప్టెంబర్–4 అక్టోబర్(వేదిక: నగోయా, జపాన్)కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన రెండు నెలల లోపే మన భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆసియా గేమ్స్ రూపంలో మరో అవకాశం దక్కుతోంది. ముఖ్యంగా అథ్లెటిక్స్ విభాగంలో ఆసియా క్రీడల్లో సుదీర్ఘ కాలంగా భారత్ బలమైన ముద్ర వేసింది. కోవిడ్ కారణంగా ఏడాది కాలం వాయిదా పడటంతో 2022లో జరగాల్సిన గేమ్స్‌ను 2023లో నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల ఈవెంట్‌గా షెడ్యూల్ ప్రకారం 2026లో నిర్వహిస్తున్నారు. జపాన్‌లోని నగోయా నగరం ప్రధాన వేదిక కాగా, ఐచి రాష్ట్రంలోని ఇతర వేదికల్లో కూడా పోటీలు జరుగుతాయి. 41 క్రీడాంశాల్లో కలిపి 45 దేశాల నుంచి సుమారు 15 వేల మంది అథ్లెట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఆసియా క్రీడలను జపాన్ నిర్వహించడం ఇది మూడో సారి. 2023 ఏషియాడ్‌లో 28 స్వర్ణాలు సహా 106 పతకాలు నెగ్గిన భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.‘ఫిఫా’ వరల్డ్ కప్ 12 జూన్–20 జులై(వేదిక: అమెరికా, కెనడా, మెక్సికో)ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను అలరించేందుకు ఈ ఏడాది వరల్డ్ కప్ వచ్చేసింది. మూడు దేశాలు కలిసి టోర్నీని నిర్వహిస్తుండటం ఇదే మొదటిసారి కాగా, మొత్తం 16 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ‘ఫిఫా’ వరల్డ్ కప్ చరిత్రలో 2022 వరకు 32 జట్లతోనే టోర్నమెంట్‌ను నిర్వహించగా... తొలిసారి 48 జట్లు బరిలోకి దిగుతుండటం ఈ సారి అన్నింటికంటే పెద్ద విశేషం. కేప్ వెర్డె, క్యురాకో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ తొలిసారి ప్రపంచ కప్ ఆడనున్నాయి. అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో దిగ్గజ స్థాయి ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన లయోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో చివరి సారిగా వరల్డ్ కప్ బరిలోకి దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 2026 వరల్డ్ కప్ మ్యాచ్‌లను మైదానంలో చూసేందుకు దాదాపు 70 లక్షల టికెట్లు అందుబాటులో ఉండగా...తొలి 15 రోజుల్లోనే 15 కోట్లకు పైగా టికెట్ దరఖాస్తులు రావడం ఈ టోర్నీ స్థాయికి చూపిస్తోంది. ఎప్పటిలాగే భారత్ మాత్రం ప్రపంచకప్ టోర్నీలో కనిపించదు. ఆసియా నుంచి క్వాలిఫై అయ్యేందుకు 9 జట్లకు అవకాశం ఉండగా... అతి పేలవమైన ఆటతో భారత్ అర్హతకు సుదూరంగా ఉండిపోయింది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ఆగస్టు 17–23(వేదిక: న్యూఢిల్లీ)బ్యాడ్మింటన్‌లో గత కొన్నేళ్లుగా తమదైన ముద్ర వేసిన భారత్ రెండో సారి వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ టాప్ షట్లర్లంతా పాల్గొనే ఈ మెగా ఈవెంట్ ఢిల్లీలో జరుగుతుంది. గతంలో భారత్‌లో ఒకే ఒకసారి వరల్డ్ చాంపియన్‌షిప్ (2009లో హైదరాబాద్‌లో) జరిగింది. వాస్తవానికి 2023లో భారత్ సుదిర్మన్ కప్‌ను నిర్వహించాల్సి ఉండగా... కోవిడ్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పలు వేదికల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో భారత్‌కు వరల్డ్ చాంపియన్‌షిప్ అవకాశం దక్కింది. 2025లో పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్లో భారత్ తరఫున సాత్విక్–చిరాగ్ కాంస్యపతకం గెలుచుకున్నారు. స్వదేశంలో మన ఆటగాళ్లు ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చే అవకాశం ఉంది. -
శుబ్‌మన్ గిల్ అవుట్!
టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపికకు సంబంధించి సెలక్టర్లు అనూహ్య షాక్ ఇచ్చారు. వరుసగా విఫలమవుతున్నా, అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోతున్నా పదే పదే తాము అండగా నిలిచిన శుబ్‌మన్ గిల్‌పై సరిగ్గా ప్రపంచ కప్‌కు ముందు వేటు వేశారు. భారత టెస్టు, వన్డే కెప్టెన్ అయిన ఆటగాడికి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ప్రదర్శనను గుర్తిస్తూ జట్టులోకి తీసుకున్న సెలక్టర్లు, ఇప్పటికే రెండో కీపర్‌గా నిలదొక్కుకున్న జితేశ్‌పై వేటు వేశారు. ఫలితంగా ఫినిషర్‌గా మరోసారి రింకూ సింగ్‌కే అవకాశం దక్కింది. 2024లో విజేతగా నిలిచిన జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు ఈ సారి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.ముంబై: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సొంతగడ్డపై టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగేందుకు భారత సైన్యం సిద్ధమైంది. టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తాడు. 15 మంది సభ్యుల ఈ జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. బ్యాటింగ్ ఫామ్‌తో సంబంధం లేకుండా కెప్టెన్సీ విషయంలో సూర్యకుమార్‌పైనే నమ్మకం ఉంచగా, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో 2026 వరల్డ్ కప్ జరుగుతుంది. రెండేళ్ల తర్వాత... ఇషాన్ కిషన్ 2023 నవంబర్‌లో చివరిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను జట్టుకు దూరమయ్యాడు. ప్రదర్శనపరంగా కాకుండా నాటి కోచ్ ద్రవిడ్ దృష్టిలో క్రమశిక్షణ తప్పిన కుర్రాడిగా ముద్ర పడింది. దేశవాళీ మ్యాచ్‌లు ఆడకపోవడంతో బీసీసీఐ హెచ్చరికకు కూడా గురయ్యాడు. ఇక భారత జట్టులో అటు పంత్, ఇటు సామ్సన్లతో పాటు జురేల్, జితేశ్ కూడా నిలదొక్కుకోవడంతో ప్రాధాన్యతపరంగా కిషన్ వెనుకబడిపోయాడు. దాంతో అతను తనను తాను మార్చుకున్నాడు. వరుసగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఫిట్‌గా మారి నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. క్రమశిక్షణ విషయంలో కూడా మరో ఫిర్యాదు రాకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు ఇటీవలి ముస్తాక్ అలీ ట్రోఫీతో ఒక్కసారిగా పైకెగిసాడు. ఏకంగా 517 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్‌గా జార్ఖండ్‌ను చాంపియన్‌గా నిలపడంతో అందరి దృష్టీ పడేలా చేశాడు. ఫలితంగా అతను కూడా ఊహించని విధంగా వరల్డ్ కప్ టీమ్‌లో స్థానం లభించింది. ప్రత్యామ్నాయ ఓపెనర్ కం కీపర్‌గా అతను సిద్ధమయ్యాడు. ఆ ఇద్దరు ఇలా... దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో రింకూ సింగ్‌పై వేటు పడినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అతని గురించి చెప్పేందుకు వైఫల్యాలేమీ లేవు. తనకు లభించిన పరిమిత అవకాశాల్లో అతను బాగానే ఆడాడు. కానీ వికెట్ కీపర్‌గా జితేశ్‌ను ఎంపిక చేస్తూ సెలక్టర్లు అతడిని ఫినిషర్ పాత్రను కూడా ఇచ్చారు. దాంతో రింకూకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు గిల్‌పై వేటు సామ్సన్‌కు ఓపెనింగ్ స్థానం ఖాయం చేశారు. ఫలితంగా ఫినిషర్‌గా జితేశ్కంటే రింకూ మెరుగైన ఆటగాడని అగార్కర్ బృందం భావించింది. దాంతో జట్టులోకి మళ్లీ పిలుపు రాగా...పెద్దగా ప్రభావం చూపలేకపోయిన జితేశ్‌ను పక్కన పెట్టక తప్పలేదు.7 మార్పులు... 2024 చాంపియన్ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ఈ సారి కనిపించడం లేదు. రోహిత్, కోహ్లి, జడేజా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించగా...జైస్వాల్, పంత్, చహల్, సిరాజ్ తమ స్థానాలు కోల్పోయారు. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు ఇదే తొలి టి20 వరల్డ్ కప్ కానుంది.‘నిప్పు–నిప్పు కావాలి’అగార్కర్ సెలక్టర్‌గా వచ్చిన దగ్గరినుంచి గిల్‌ను అసాధారణ ఆటగాడిగా చెబుతూ అండగా నిలుస్తూ వచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా రోహిత్‌ను కాదని గిల్‌కు వన్డే కెప్టెన్సీ అప్పగించడంతో పాటు త్వరలోనే మూడు ఫార్మాట్లలో కూడా కెప్టెన్ అంటూ ప్రచారం చేశారు. ఐపీఎల్లో అతని నిలకడైన ప్రదర్శన కూడా టి20ల్లోనూ నమ్మకం కలిగించింది. ఇదే క్రమంలో దాదాపు ఏడాది తర్వాతి జట్టులోకి వచ్చినా నేరుగా అతనికి ఆసియా కప్ వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అయితే బ్యాటింగ్ పరంగా ఓపెనింగ్‌లో గిల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయా డు. ఒక వైపు అభిషేక్ శర్మ చెలరేగుతుండగా, మరో వైపు గిల్ నెమ్మదిగా ఆడుతూ వచ్చాడు. దీనికి ఆరంభంలో ‘నిప్పు–నీరు’ అంటూ కాంబినేషన్ గురించి సానుకూల వ్యాఖ్యలు చేసినా...ప్రస్తుతం టి20ల్లో ఓపెనింగ్ అంటే ‘నిప్పు–నిప్పు’గానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గిల్‌కు ఓపెనింగ్ ఇవ్వడంతో మూడు అంతర్జాతీయ టి20 సెంచరీల తర్వాత కూడా సంజు సామ్సన్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అతడిని అలవాటు లేని మిడిలార్డర్‌కు తీసుకురావడంతో సామ్సన్ కూడా ఆశించిన విధంగా ఆడకపోవడంతో గిల్‌పై విమర్శలు మొదలయ్యాయి. అయినా సరే టీమ్ మేనేజ్మెంట్ సమర్థిస్తూ వచ్చింది. స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉండటమే కాదు అసలు పరుగులు రావడమే గగనంగా మారిపోయింది. గత 18 ఇన్నింగ్స్‌లలో ఓపెనర్‌గా ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోవడం పరిస్థితిని చూపిస్తోంది. శుక్రవారం దక్షిణాఫ్రికాపై గిల్ స్థానంలో వచ్చిన సామ్సన్ దూకుడుగా ఆడి తన విలువను మళ్లీ చూపించాడు. మరో వైపు సూర్యకుమార్ కూడా ఘోరంగా విఫలమవుతున్నా...కీలక టోర్నీకి ముందు ఇద్దరినీ ఒకే సారి తప్పించలేని పరిస్థితి వచ్చింది. పైగా ఇప్పుడు ఫామ్‌లో లేకపోయినా...అంతకు ముందే టి20ల్లో తన స్థాయిని సూర్యకుమార్ నిరూపించుకున్నాడు కాబట్టి అతనిపై ఎంతో కొంత నమ్మకం మిగిలి ఉంది. దాంతో గిల్‌పై వేటు పడింది. టీమ్ కాంబినేషన్ కారణంగానే 2024 టి20 వరల్డ్ కప్‌లో కూడా గిల్‌కు చోటు దక్కలేదు.భారత జట్టు వివరాలుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్‌వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా. -
ఆ చూపు ప్రపంచంకప్పు దాకా..
కూతురు అంధురాలుగా పుడితే వదిలి వెళ్లిపోయే తండ్రి ఉండొచ్చుగాని తల్లి ఉండదు. అస్సాం అంధ క్రికెటర్ సిము దాస్‌ని తల్లి అంజు దాస్ ఒక్కతే ఎన్నో కష్టాలతో పెంచింది. ఫలితంగా ఇవాళ కూతురు భారత జట్టు తరఫున ప్రపంచ కప్పు సాధించిన విజేతగా నిలిచింది. ఆమెకు అస్సాం ప్రభుత్వం 10 లక్షల నగదు బహుమతి, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఇదంతా ఆ తల్లి ఓర్పుకు దొరికిన ప్రతిఫలం.నవంబర్ 23, ఆదివారం రోజు అంజు దాస్ ఎప్పట్లాగే పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమె అస్సాంలోని నగావ్ జిల్లా కొతియటోలి అనే పల్లెలో వంట మనిషిగా, పని మనిషిగా జీవిస్తోంది. ఇల్లు మరికాస్త దూరంలో ఉందనగా ఊళ్లో ఉన్న కుర్రాళ్లంతా చప్పట్లతో, కేరింతలతో ఆమెకు ఎదురు వచ్చారు. ‘అక్కా. నీ కూతురు సాధించింది. మనం వరల్డ్ కప్ గెలిచాం’ అని మెచ్చుకోలుగా వాళ్లు మాట్లాడుతుంటే అంజుదాస్ కళ్ల నుంచి ధారాపాతంగా ఆనందబాష్పాలు రాలిపడ్డాయి.→ ఆమె కూతురు విజేతఅంధ మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి మొట్ట మొదటిసారి ‘టి 20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ విమెన్’ను కొలంబోలో నవంబర్ 11 నుంచి 23 తేదీల మధ్య నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా సహా మన పొరుగున ఉన్న దేశాలతో కలిపి మొత్తం ఆరు దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియా జట్టు అప్రతిహతంగా సాగి ఫైనల్స్‌లో నేపాల్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ జట్టులో అంజుదాస్ కూతురు సిము దాస్ ఉంది. ఇండియా గెలవడానికి టోర్నమెంట్లో మొత్తం 68 విలువైన పరుగులు చేసింది. అస్సాం మారుమూల పల్లెలో నిలువ నీడ లేని కుటుంబం నుంచి కేవలం తల్లి అందించిన ప్రోత్సాహంతో సిము దాస్ ఈ అద్భుతం సాధించింది. ఆ ప్రయాణం అంతా గుర్తుకొచ్చి అంజుదాస్ కళ్లు వర్షించాయి.→ ప్రధానే స్పందించారుఅంధ మహిళల జట్టు సభ్యులు వరల్డ్ కప్‌తో ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఆ తర్వాత అస్సాంకు సిము దాస్ చేరుకుంటే ఆమెకు ఘన స్వాగతం లభించింది. అయితే ఆ వెంటనే ఒక తెల్లవారు జామున ప్రధాని నుంచి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ వచ్చింది. ‘నువ్వు సిము దాస్‌ను కలిశావా’ అని ప్రధాని అడిగారు. ‘వెంటనే కలిసి ఆమెకు కావాల్సిన సాయం చేయి’ అన్నారు. అప్పటికి బిశ్వ శర్మకు సిము దాస్ గురించి తెలియదు. ఆగమేఘాల మీద తెలుసుకుని ఆమెకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. అస్సాం గవర్నర్ ఆమెను తన నివాసానికి ఆహ్వానించి మరో లక్ష రూపాయల నజరానా ఇచ్చారు. ఇన్ని ప్రశంసలు సిము దాస్ గెలుపుకు. కాదు కాదు ఆమె తల్లి గెలుపునకు.→ తండ్రి పారిపోతే...అంజుదాస్కు వివాహం అయ్యాక మొదట కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అంధుడే కాదు బధిరుడు కూడా. రెండవసారి కుమార్తె పూర్తి అంధత్వంతో పుట్టింది. కూతురు అంధత్వ వార్త విన్న వెంటనే భర్త మొత్తం కుటుంబాన్ని వదిలేసి పారిపోయాడు. వాళ్లకు ఇల్లు కూడా లేదు. ఊరిపెద్ద తన పొలంలో చిన్న గుడిసె వేసుకోమన్నాడు. ఆరోజు నుంచి నేటి వరకూ వాళ్లు ఆ గుడిసెలోనే ఉన్నారు. ఊరి ఉపాధ్యాయుడు సిమును చదివించమని సూచించడంతో తల్లి ధైర్యం చేసి గువహతిలో అంధ బాలికల స్కూల్లో చేర్చించింది. అక్కణ్ణుంచి సిము ఢిల్లీ వరకూ వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. 2022లో క్రికెట్లో ప్రవేశించిన వెంటనే ప్రతిభ చూపుతూ జాతీయ జట్టుకు ఎంపికై ట్వంటీ ట్వంటీ కప్ గెలుపులో కీలకపాత్ర పోషించింది.→ అమ్మ లేకపోతే...‘అమ్మ లేకపోతే నేను లేను. ఆమె తన జీవితం మొత్తం పోరాడుతూనే ఉంది. నేటికీ మా అన్నయ్యకు ఆమె సేవలు చేస్తోంది. మా కోసమే ఆమె బతికింది. నేను ఆమె కోసమే గెలిచాను. ఇంకా ఆడతాను. మా అమ్మను సంతోషంగా ఉంచాలనేదే నా కోరిక’ అంది సిము దాస్. -
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
-
ఫిబ్రవరి 15న పాక్‌తో భారత్ పోరు
ముంబై: భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నీలో పోరుకు రంగం సిద్ధమైంది. 2026 టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌తో వరల్డ్ కప్ ముగుస్తుంది. ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ చైర్మన్ జై షా విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టు హోదాలో భారత్ ఫిబ్రవరి 7న ముంబైలో జరిగే టోర్నీ తొలి పోరులో అమెరికాతో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో... ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ లీగ్ దశను ముగిస్తుంది. గత టోర్నీ తరహాలోనే మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, అమెరికాతో పాటు నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. లీగ్ దశ తర్వాత తమ గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు తర్వాతి దశ ‘సూపర్–8’కు అర్హత సాధిస్తాయి. ‘సూపర్–8’కు చేరిన 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్–8’ మ్యాచ్‌ల తర్వాత రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 3న తొలి సెమీఫైనల్... మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. మార్చి 8న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఎనిమిది వేదికలు ఖరారు... టి20 వరల్డ్ కప్‌లో భాగంగా మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 8 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌లో అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నైలలో మ్యాచ్‌లు నిర్వహించనుండగా... శ్రీలంకలో కొలంబో (ప్రేమదాస), కొలంబో (ఎస్ఎస్సీ), పల్లెకెలెలను వేదికలుగా నిర్ణయించారు. గతంలోనే ఐసీసీ స్పష్టం చేసినట్లుగా పాక్ జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లకు కోల్‌కతా, ముంబై వేదికలు కాగా... ఒకవేళ పాక్ సెమీస్ చేరితే ఆ జట్టు తమ సెమీఫైనల్‌ను కోల్‌కతాలో కాకుండా కొలంబోలోనే ఆడుతుంది. పాక్ ఫైనల్ చేరినా ఇదే వర్తిస్తుంది. భారత్, పాక్ ఏ దశలో తలపడినా...ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే నిర్వహిస్తారు. బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ... భారత మాజీ కెప్టెన్, 2 టి20 ప్రపంచకప్‌ల విజేత రోహిత్ శర్మను ఐసీసీ 2026 టి20 వరల్డ్ కప్ ప్రచారకర్తగా నియమించింది. తన కొత్త పాత్ర పట్ల రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఆటగాడిగా కొనసాగుతున్న సమయంలో ఇలా ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని తెలిసింది. నాకు దక్కిన ఈ గౌరవం పట్ల ఆనందంగా ఉన్నా. 9 వరల్డ్ కప్‌లు ఆడిన తర్వాత ఆటగాడిగా మైదానంలో కాకుండా ప్రేక్షకుడిగా భారత్ ఆడే టి20 మ్యాచ్‌లను చూడటం కొత్తగా అనిపించడం ఖాయం’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా, భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పాల్గొన్నారు.గ్రూప్‌ల వివరాలు గ్రూప్ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా. గ్రూప్ ‘బి’: ఆ్రస్టేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్. గ్రూప్ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.గ్రూప్ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ. -
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 (ICC Mens T20 World Cup) షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. భారత్, శ్రీలంక ఆతిథ్య దేశాలుగా ఫిబ్రవరి 7వ తేదీ ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ.. మార్చి 8వ తేదీ వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీకి రోహిత్ శర్మ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.భారత్‌లోని ఐదు వేదికల్లో అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైలో మ్యాచ్‌లు జరగనున్నాయి. శ్రీలంక నుంచి మూడు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు భాగం కానున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఒక్కో గ్రూప్‌లో ఐదు టీంలుగా మొత్తం నాలుగు గ్రూపులు టోర్నీలో ఆడనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు టీంలు సూపర్ 8కి అర్హత సాధిస్తాయి. ఈసారి ఒకే గ్రూప్‌లో(గ్రూప్-ఏ) భారత్, పాక్ టీమ్‌లు ఉండనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్, నెదర్లాండ్, నమీబియా, అమెరికా ఉన్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన భారత్ అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15వ తేదీన భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది.గ్లోబల్ ట్రోఫీ టూర్ డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ Sanjog Gupta వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుందని ప్రకటించారు. ఒకవేళ పాక్ గనుక ఫైనల్‌కు చేరితే గనుక వేదిక మారనుందని ఐసీసీ స్పష్టత ఇచ్చింది. -
ప్రపంచకప్ విజేతలకు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహించిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సమష్టితత్వం, అంకితభావానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆదివారం టీమిండియా 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘మొదటిసారి జరిగిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఓటమి ఎరగకుండా ట్రోఫీ నెగ్గడం మరింత గొప్పవిషయం. ఇది నిజంగా చారిత్రాత్మక విజయం. జట్టు సమష్టి కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం. ప్రతీ క్రీడాకారిణీ ఒక చాంపియన్. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది’ అని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సెమీస్‌లో ఆ్రస్టేలియాపై విజయం సాధించిన భారత్ అంతకుముందు లీగ్ దశలో శ్రీలంక, ఆ్రస్టేలియా, నేపాల్, అమెరికా, పాకిస్తాన్‌పై నెగ్గింది. అదే విధంగా.. మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నీలోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి వరుసగా రెండోసారి చాంపియన్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భారత మహిళా కబడ్డీ జట్టును కూడా అభినందించారు. -
టీ20 వరల్డ్‌కప్ విజేత భారత్
అంధుల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ రోజు నేపాల్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. నేపాల్‌ను 114 పరుగులకే కట్టడి చేసిన భారత్ జట్టు, ఆపై కేవలం 12 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి టైటిల్‌ను గెలుచుకుంది. కొలంబోలో జరిగిన తుదిపోరులో భారత మహిళల అంధుల జట్టు ఆద్యంతం ఆకట్టుకుంది. నేపాల్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి భారత జట్టు.. అటు తర్వాత ఇంకా ఎనిమిది ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. భారత వైస్ కెప్టెన్ పూలా సారెన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇదిలా ఉంచితే, సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి పైనల్‌కు చేరిన భారత జట్టు.. ఫైనల్లో కూడా మెరిసింది. ఏమాత్రం తడబాటు లేకుండా ఫైనల్ అడ్డంకిని కూడా అధిగమించి ఔరా అనిపించింది. ఇది భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు తొలి టీ20 వరల్డ్‌కప్. ఈ వరల్డ్‌కప్‌తో(వన్దేలు, టీ20లు) కలిపి భారత అంధుల జట్లు(పురుషులు, మహిళలు) మొత్తం ఆరు టైటిల్స్ సాధించాయి.వివరాలు 2002 (టీ20, పురుషులు): మొదటి అంధుల టీ20 వరల్డ్‌కప్ విజయం2012 (టీ20, పురుషులు)2014 (వన్డే, పురుషులు)2017 (టీ20, పురుషులు)2018 (వన్డే, పురుషులు)2025 (టీ20, మహిళలు) -
‘మన ఫిట్నెస్ ఇంకా మెరుగవ్వాలి’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫిట్నెస్ స్థాయి పరంగా చూస్తే భారత జట్టు ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని, మన టీమ్ ఈ విషయంలో అత్యుత్తమ స్థాయిని అందుకోలేదని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘టి20 ప్రపంచకప్‌లో ఇది చాలా కీలకంగా మారుతుంది. మనం చాలా చురుగ్గా ఉండాలి, ఇదే విషయాన్ని ఆటగాళ్లతో చర్చించాం కూడా. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా నిజాయితీగా తమ అభిప్రాయాలు చెప్పారు. ఎంత ఫిట్‌గా మానసికంగా అంతే చురుగ్గా ఉంటాం. ఎందుకంటే తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేందుకు ఇది కూడా అవసరం. వరల్డ్ కప్‌కు ముందు అలాంటి స్థాయిని అందుకునేందుకు మనకు ఇంకా మూడు నెలల సమయం ఉంది’ అని గంభీర్ అన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ విజయం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తాము కొన్ని కొత్త తరహాలో ప్రణాళికలు రచిస్తే, అవన్నీ సఫలమయ్యాయని గంభీర్ అన్నాడు. పవర్‌ప్లేలోనే బుమ్రాతో మూడు ఓవర్లు వేయించడం కూడా అలాంటిదేనని అతను చెప్పాడు. ‘తొలి ఆరు ఓవర్లలో మూడు బుమ్రావే కావడం మంచి ప్రణాళిక. ఇది చాలా బాగా పని చేసింది. ఆరంభంలోనే మూడు మంచి ఓవర్లు పడితే ప్రత్యరి్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత ఎలాగూ స్పిన్నర్లు వస్తారు’ అని కోచ్ విశ్లేషించాడు. బౌలింగ్ విషయంలో మన జట్టుకు కనీసం 7–8 ప్రత్యామ్నాయాలు ఉంటే మంచిదన్నాడు. ‘దూబే, అక్షర్, సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. గతంలో ఆరుకు మించి బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఉండకపోయేవి. ఇప్పుడు అంతకు మించి మనకు అవకాశం ఉంటోంది’ అని కోచ్ చెప్పాడు. మరో వైపు వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టు విజయాలే తనకు ముఖ్యమని కోచ్ పునరుద్ఘాటించాడు. ‘మ్యాచ్ ఓడాక మన జట్టులో బాగా ఆడిన వారిని ప్రశంసించడంలో అర్థమే లేదు. నేను వ్యక్తిగత రికార్డులకంటే టీమ్ గెలవడం గురించే ఆలోచిస్తాను. ఎవరైనా బాగా ఆడితే మంచిదే కానీ జట్టు గెలిస్తేనే నాకు సంతోషం. అందుకే వన్డే సిరీస్‌లో ఓటమి నిరాశకు గురి చేసింది’ అని గంభీర్ అన్నాడు. -
ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా?
హాంకాంగ్ సిక్సెస్-2025 విజేతగా పాకిస్తాన్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కువైట్‌ను చిత్తు చేసిన పాక్.. రికార్డు స్దాయిలో ఆరోసారి హాంకాంగ్ సిక్సెస్ టైటిల్‌ను ముద్దాడింది. అబ్బాస్ అఫ్రిది నాయకత్వంలో పాక్ జట్టు భారత్‌పై ఓటమి పాలైనప్పటికి.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఫైనల్లో విజయం తర్వాత పాక్ ఆటగాడు మహ్మద్ షాజాద్ ఓవరాక్షన్ చేశాడు.భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐకానిక్ ట్రోఫీ సెలబ్రేషన్‌ను మహ్మద్ షాజాద్ కాపీ చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత పాండ్యా ట్రోఫీని తన ముందు పెట్టుకుని భుజాలు ఎగరేస్తూ ఫోటోలకు పోజ్ ఇచ్చాడు. ఇప్పుడు షాజాద్ కూడా అదే విధంగా చేశాడు.ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అందుకు క్యాప్షన్‌గా హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ ఫన్ ముగిసింది. ఇక్కడ మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోవడం ఎల్లప్పుడూ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది అని షాజాద్ ఇచ్చాడు.అయితే షాజాద్ భారత కెప్టెన్ దినేష్ కార్తీక్‌కు కౌంటర్‌గా ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో పాక్‌పై విజయం తర్వాత కార్తీక్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. పాకిస్తాన్‌పై విజయంతో హాంకాంగ్ సిక్సెస్ ఫన్ మొదలైంది అంటూ కార్తీక్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Muhammad Shahzad (@mshahzad.official)ఇప్పుడు ఫన్ ముగిసిందని షెజాద్ అతి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో షెజాద్‌పై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచమైనా మీకు సిగ్గు ఉందా? సెలబ్రేషన్స్ కూడా కాపీనేనా అనా ఓ యూజర్ కామెంట్ చేశాడు. మీరు ఏమైనా వరల్డ్‌కప్ ట్రోఫీని సాధించారా? ఆ పోజులు ఏంటి? అని సొంత అభిమానుల సైతం షెజాద్‌పై ఫైరవతున్నారు. -
టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు (Men's T20 World Cup 2026) సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్ వేదికలు ఖరారయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫైనల్ వేదిక విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.20 దేశాలు పాల్గొనే ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్‌లోని ఐదు నగరాలు (ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా), శ్రీలంకలోని మూడు మైదానాల్లో (కొలొంబోలో 2, క్యాండీలో ఓ మైదానం) ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.పాక్ మ్యాచ్‌లన్నీ అక్కడే..!ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నీ కొలంబోలో జరుగుతాయి. ఒకవేళ పాక్ సెమీస్‌కు, ఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా కొలొంబోలోనే జరుగుతాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్ జట్లను తమ దేశంలో అడుగుపెట్టనివ్వకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.పాక్‌తో ఏ క్రీడలో అయినా ద్వైపాక్షిక సిరీస్‌లను సైతం రద్దు చేసుకుంది. ఇతర దేశాలు పాల్గొనే మెగా టోర్నీల్లో మాత్రం తటస్థ వేదికలపై పాక్‌తో ఆడుతుంది.2026 ప్రపంచకప్ ఆడే దేశాలు ఇవే..!టీ20 ప్రపంచకప్‌కు మొత్తం 20 దేశాలు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక.. గత ప్రపంచకప్‌లో (2024) సూపర్-8 దశకు చేరిన 7 జట్లు (ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్ఏ) ఈ మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. అమెరికా రీజియనల్ క్వాలిఫయర్ ద్వారా కెనడా అర్హత సాధించింది.యూరప్ క్వాలిఫయర్స్ ద్వారా నెదర్లాండ్స్, ఇటలీ అర్హత సాధించాయి. అఫ్రికా క్వాలిఫయర్ ద్వారా నమీబియా, జింబాబ్వే క్వాలిఫై అయ్యాయి. చివరిగా ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్ ద్వారా ఒమన్, నేపాల్, యూఏఈ జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే..?ఈ టోర్నీలో తలో ఐదు జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్ దశ అనంతరం సూపర్-8 పోటీలు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో తలో నాలుగు జట్లు రెండు గ్రూప్‌లు విభజించబడి పోటీపడతాయి. సూపర్-8లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ విజేతలు ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. ఈ టోర్నీ షెడ్యూల్, గ్రూప్ తదితర వివరాలు మరికొద్ది రోజుల్లో వెలువడతాయి. చదవండి: శతక్కొట్టిన మావీ.. కుషాగ్రా డబుల్ సెంచరీ -
టి20 వరల్డ్‌కప్‌లో నమీబియా, జింబాబ్వే
దుబాయ్: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ప్రపంచకప్‌నకు నమీబియా, జింబాబ్వే అర్హత సాధించాయి. ఆఫ్రికా రీజినల్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరడం ద్వారా ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకున్నాయి. సెమీఫైనల్లో జింబాబ్వే 7 వికెట్ల తేడాతో కెన్యాపై విజయం సాధించగా... నమీబియా 63 పరుగుల తేడాతో టాంజానియాపై గెలుపొందింది. తద్వారా మెగా టోర్నీకి అర్హత సాధించాయి. 2026 ఫిబ్రవరి, మార్చి మధ్య జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటాయి. అందులో భారత్, శ్రీలంక ఆతిథ్య హక్కులతో నేరుగా అర్హత సాధించగా... 2024 వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అఫ్గానిస్తాన్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ జట్లు వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకున్నాయి. ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ర్యాంకింగ్స్ ప్రకారం అర్హత సాధించాయి. దీంతో మొత్తం 12 జట్లు మెగా టోర్నీ బెర్త్ దక్కించుకోగా... మిగిలిన ఎనిమిది జట్లను వివిధ క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే జరిగిన అమెరికా క్వాలిఫయర్స్‌లో కెనడా జట్టు... యూరప్ క్వాలిఫయర్స్‌లో ఇటలీ, నెదర్లాండ్స్ జట్లు టోర్నీకి బెర్త్ దక్కించుకోగా... తాజాగా ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి నమీబియా, జింబాబ్వే ముందంజ వేశాయి. దీంతో వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 17 జట్లపై స్పష్టత రాగా... ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా మరో మూడు జట్లను ఎంపిక చేయనున్నారు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన జింబాబ్వే ప్లేయర్
39 ఏళ్ల జింబాబ్వే (Zimbabwe) వెటరన్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ (Brendan Taylor) లేటు వయసులోనూ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్‌లో (ICC Mens T20 World Cup Africa Regional Final 2025) బోట్స్వానాపై (Botswana) 46 శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 54 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.ఈ మ్యాచ్‌లో టేలర్ మరో 11 పరుగులు చేసుంటే టీ20ల్లో జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు. అయితే అనూహ్యంగా అతను 123 పరుగుల వద్ద రిటైర్డ్ ఔట్‌గా తప్పుకున్నాడు. ఈ రికార్డు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా పేరిట ఉంది. రజా 2024లో గాంబియాపై 133 పరుగులు చేశాడు. గత 21 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టేలర్.. ఐసీసీ నిషేధం ముగించుకుని మూడేళ్ల తర్వాత ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు.బోట్స్వానాతో మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. బ్రెండన్ టేలర్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ (33 బంతుల్లో 65) కూడా అర్ద సెంచరీతో మెరిశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బోట్స్వానా ఆది నుంచే చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి కేవలం 89 పరుగులకే చేసింది. ఫలితంగా జింబాబ్వే 170 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. గత టీ20 వరల్డ్‌కప్‌కు (2024) అర్హత సాధించని జింబాబ్వే.. ఈసారి (2026) ఎలాగైనా వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ జట్టు 2022లో తమ చివరి ఐసీసీ టోర్నీ ఆడింది.చదవండి: Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం -
అంధుల T20లో వైజాగ్ అమ్మాయి
‘నాకు బాల్ కనపడదు. కాని నా మైండ్‌తో, చెవులతో దాని రాకను పసిగట్టి కొడతాను’ అంటోంది విశాఖ అంధబాలిక పాంగి కరుణ కుమారి. పదో తరగతి చదువుతున్న కరుణ బ్యాటింగ్‌లో దిట్ట. అందుకే నవంబర్ 11న ఢిల్లీలో తొలిసారి నిర్వహించనున్న అంధుల టి20 వరల్డ్ కప్‌కి భారత జట్టులో ఎంపికైంది. తెలుగువారు సంతోషపడాల్సిన సందర్భం ఇది. స్ఫూర్తినిస్తున్న కరుణ కుమారి పరిచయం.స్కూలు పుస్తకాల్లో అక్షరాలు కనపడటం లేదని చదువు మానేసి ఇంట్లో కూచున్న అమ్మాయి నేడు భారత దేశ అంధ మహిళల క్రికెట్ జట్టులో స్థానం సం పాదించింది. ఆ అమ్మాయి పాంగి కరుణకుమారి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన అరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఢిల్లీలో నవంబర్ 11 నుంచి జరగనున్న అంధ మహిళల టి20 వరల్డ్ కప్‌లో ఆమె భారత్ తరఫున ఆడనుంది. అంధ మహిళల కోసం టి20 వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే ప్రథమం.ఆమె ఆల్రౌండర్వంట్ల మామిడిలో కూలినాలి చేసుకునే రాంబాబు, సంధ్యల మొదటి కుమార్తె కరుణ పుట్టుకతోనే దృష్టిలోపంతో పుట్టింది. ఒక కన్ను కొద్దిగా మరో కన్ను పూర్తిగా కనిపించేది కాదు. ఏడవ తరగతి వచ్చేసరికి చూపు దాదాపుగా పోవడంతో చదువు మానేసి ఇంట్లో కూచుంది. అయితే చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండేది. ఫోన్లో క్రికెట్ చూసేది. ఈ విషయం తెలిసి అంధ బాలికలను వెతికి చదివించే బాధ్యతతో విశాఖ అంధ బాలిక ఆశ్రమ పాఠశాల వారు కరుణ తల్లిదండ్రులను ఒప్పించి తమ స్కూల్లో చేర్పించారు. రెసిడెన్షియల్ స్కూల్ కావడం వల్ల అక్కడ కరుణ తిరిగి చదువులో, ఆటల్లో పడింది. క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి గమనించిన పీటీ మేడమ్ కరుణనుత్సహించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. మూడింటిలో ప్రతిభ చూపుతూ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది కరుణ. నేషనల్ సెలక్షన్స్‌లో భాగంగా 2023లో హైదరాబాద్‌లో, 2024లో హుగ్లీలో, 2025లో కొచ్చిలో మేచెస్ ఆడింది. సెలెక్టర్ల దృష్టిలో పడింది.60 బాల్స్‌లో 100 పరుగులుఅంధ మహిళల టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక కోసం ఆగస్టు నెలలో బెంగళూరులో 20 రోజుల క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్‌లో కరుణ 60 బంతుల్లో 100 పరుగులు చేయడమే కాక 114 నాటౌట్‌గా నిలిచింది. బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో కూడా ప్రతిభ చూపింది. దాంతో భారత జట్టుకు కరుణను సెలెక్ట్ చేశారు. ‘నాకు బాల్ కనపడదు. కాని దాని రాకను పసిగట్టగలను. బాల్ రాకను అర్థం చేసుకోలేనప్పుడు అది ఒంటికి తగిలి దెబ్బలయ్యేవి’ అని తెలిపింది కరుణ. ఆమె ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. ఇన్ని ప్రతికూలతల్లోనూ ప్రతిభ చూపుతోంది కరుణ.ఆరు దేశాలతో...అంధ మహిళల టి20 వరల్డ్ కప్‌లో మొత్తం ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ, బెంగళూరుల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, నే పాల్, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కలిసి 21 లీగ్ మేచ్‌లు, 2 సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్‌ను ఆడనున్నారు. ఈ వరల్డ్ కప్‌లో మన దేశం కప్పు గెలవాలని, మన కరుణ గొప్ప ప్రతిభ చూ పాలని కోరుకుందాం. -
రెండు ప్రపంచకప్‌లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్‌పై చోరీ కేసు
ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఓ వార్త క్రికెట్ సమాజాన్నంతా షాక్‌కు గురి చేస్తుంది. రెండు టీ20 ప్రపంచకప్‌లు, 97 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న పపువా న్యూగినియా క్రికెటర్ కిప్లింగ్ డోరిగా (Kipling Doriga) చోరీ కేసులో బుక్కాయ్యాడు.ఆగస్టు 25వ తేదీ ఉదయం జెర్సీ ద్వీప రాజధాని సెయింట్ హెలియర్స్ (St Heliers) ప్రాంతంలో ఓ చోరీ జరిగింది. ఈ ఘటనలో డోరిగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు తెలుస్తుంది. డోరిగాను స్థానిక పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా నేరాన్ని ఒప్పుకున్నాడని సమాచారం.రిలీఫ్ మేజిస్ట్రేట్ రెబెక్కా మోర్లే-కిర్క్ ఈ కేసును తీవ్రమైందిగా పరిగణించి రాయల్ కోర్టుకు బదిలీ చేశారు. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేశారు. ఈ కేసులో డోరిగాకు బెయిల్ నిరాకరించబడింది. తదుపరి వాయిదా వరకు డోరిగా పోలీసుల కస్టడీలో కొనసాగనున్నాడు.ఈ పరిణామం పపువా న్యూగినియా క్రికెట్ బోర్డును అప్రతిష్ఠపాలు చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆ జట్టు తల దించుకునేలా చేసింది. ఓ అంతర్జాతీయ క్రికెటర్ చోరీ కేసులో ఇరుక్కోవడం ఐసీసీ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఈ ఘటన అంతర్జాతీయ క్రీడా సమాజంలో క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీసింది. పపువా న్యూగినియా ఐసీసీ అసోసియేట్ సభ్య దేశంగా ఉంది.వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన 29 ఏళ్ల డోరిగా 2021, 2024 టీ20 ప్రపంచకప్‌లలో పపువా న్యూగినియాకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ స్థాయిలో 97 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న డోరిగా, ప్రస్తుతం CWC ఛాలెంజ్ లీగ్ రెండో రౌండ్లో పపువా న్యూగినియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. -
‘ఆసియా కప్ ఆడకపోయినా.. వరల్డ్‌కప్ జట్టులో తప్పక ఉంటాడు’
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. అతడు చేసిన తప్పేంటో అర్థం కావడం లేదని.. ఓ ఆటగాడిగా ఏం చేయాలో అన్నీ చేసినా ఇలా పక్కకు పెట్టడం సరికాదని మండిపడ్డాడు.మరోసారి మొండిచేయిఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్-2026కు సన్నాహకంగా జరిగే ఈ ఖండాంతర ఈవెంట్లో పాల్గొనే భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు.దేశవాళీ క్రికెట్‌తో పాటు.. ఐపీఎల్-2025లో పరుగుల వరద పారించినా సెలక్టర్లు ఈ ముంబై బ్యాటర్‌కు మొండిచేయి చూపారు. కనీసం స్టాండ్ బై ప్లేయర్‌గానూ శ్రేయస్‌కు చోటివ్వలేదు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ తీరును విమర్శించాడు.ఇంతకంటే ఇంకేం చేయగలడు?‘‘ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ లేకపోవడం అతి పెద్ద చర్చనీయాంశం. ఆటగాడిగా అతడు ఇంతకంటే ఇంకేం చేయగలడు? ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఐపీఎల్లో ఈ ఏడాది 600కు పైగా పరుగులు సాధించాడు.కెప్టెన్‌గా తన జట్టు పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. టీమిండియా తరఫున చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఒక ఆటగాడిగానే కాదు.. మనిషిగా తనకు ఏమేం సాధ్యమవుతాయో.. అవన్నీ చేశాడు’’ అంటూ శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన ఆకాశ్ చోప్రా.. సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్ జట్టులో తప్పక ఉంటాడుఅదే విధంగా.. ‘‘ఇది ఆసియా కప్ జట్టు మాత్రమే. దీనిని వరల్డ్‌కప్ టీమ్‌గా భావించడం తొందరపాటు చర్యే అవుతుంది. ఈ రెండు ఈవెంట్లకు మధ్య 15 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. మరి జట్టు మొత్తం తారుమారయ్యే అవకాశం ఉన్నట్లే కదా!వన్డేల్లో నిలకడగా పరుగులు సాధిస్తూ ముందుకు సాగితే.. అతడు టీ20లలోనూ రీఎంట్రీ ఇవ్వగలడు. శ్రేయస్ అయ్యర్ ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆడే భారత జట్టులో తప్పక ఉంటాడని నాకు గట్టి నమ్మకం’’ అంటూ ఆకాశ్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.చదవండి: ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
పాకిస్తాన్ క్రికెటర్ నన్ను అసభ్యంగా దూషించింది: మిథాలీ రాజ్
భారత్- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ (Indv vs Pak) అంటే అభిమానుల్లో అంచనాలు తారస్థాయిలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరకాల ప్రత్యర్థులు పరస్పరం తలపడుతూ ఉంటే.. ఇరు దేశాల అభిమానులు తామే స్వయంగా పోటీపడుతున్నట్లుగా భావిస్తారు. వీరి పరిస్థితే ఇలా ఉంటే.. మైదానంలో నేరుగా ఢీకొట్టే ఆటగాళ్లు ఒక రకంగా భావోద్వేగాలతో యుద్ధం చేస్తారనడంలో అతిశయోక్తి లేదు.అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ క్రీడా స్పూర్తితో మెలిగే వారే నిజమైన ఆటగాళ్లు అనిపించుకుంటారు. భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ (Mithali Raj) కూడా ఈ కోవకే చెందుతుంది. పాకిస్తాన్ మహిళా జట్టుతో మ్యాచ్ సందర్భంగా తన పట్ల ప్రత్యర్థి టీమ్ ప్లేయర్ అనుచితంగా ప్రవర్తించినా ఆమె సహనం కోల్పోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే సదరు ప్లేయర్‌తో రిఫరీ ద్వారా ‘లెక్క’ తేల్చుకుంది.నన్ను అసభ్యంగా దూషించిందిఈ విషయాన్ని మిథాలీ రాజ్ స్వయంగా తాజాగా వెల్లడించింది. ‘‘టీ20 ప్రపంచకప్ సమయంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు నేను బ్యాటింగ్ చేస్తున్నా. ఇంతలో పాక్ మహిళా క్రికెటర్ వచ్చి మైదానంలో నన్ను అసభ్యంగా దూషించడం మొదలుపెట్టింది.అసలు ఆమె అలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాలేదు. నేను అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ఆమె బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోంది. అప్పుడు కూడా నన్ను దూషించింది. నేను మాత్రం అందుకు బదులు ఇవ్వాలని అనుకోలేదు.కరచాలనం చేసే సమయంలోనూ నా చేతిపై కొట్టింది. ఈ విషయం గురించి మా మేనేజర్‌తో చెప్పాను. వాళ్లు మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇది హై వోల్టేజీ మ్యాచ్.. ఇలాంటివి సహజంగానే జరుగుతూ ఉంటాయి అని రిఫరీ చెప్పారు.తప్పును అంగీకరించి.. క్షమాపణలు చెప్పించారుఅయితే, ఇలాంటి విషయాలు పాక్ జట్టు మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నేను నిశ్చయించుకున్నాను. వాళ్లు తమ తప్పును అంగీకరించడంతో పాటు ఆమెతో నాకు క్షమాపణలు చెప్పించారు. ఆటలో పోటీపడాలి కానీ.. అకారణంగా ఇతరులను దూషించడం సరికాదు’’ అని మిథాలీ రాజ్ ది లలన్‌టాప్‌నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకుంది.కాగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సేవలు అందించిన మిథాలీ రాజ్.. 232 వన్డేలు, 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20లు ఆడింది. టెస్టుల్లో 699 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ.. వన్డేల్లో ఏడు శతకాల సాయంతో 7805 పరుగులు సాధించింది. ఇక పొట్టి ఫార్మాట్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 17 హాఫ్ సెంచరీలు కొట్టి 2364 రన్స్ రాబట్టింది.చదవండి: ‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా’ -
ఫుట్‌బాల్‌లో డీలా... క్రికెట్లో ఇటలీల...
ఫుట్‌బాల్‌కు పెట్టింది పేరైన ఇటలీలో ఇప్పుడు మరో క్రీడ ప్రేక్షకాదరణ పొందుతోంది. ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో నాలుగుసార్లు (1934, 1938, 1982, 2006) చాంపియన్‌గా... మరో రెండుసార్లు (1970, 1994) రన్నరప్‌గా నిలిచిన ఇటలీ... ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. 2018, 2022లో జరిగిన ‘ఫిఫా’ వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత పొందలేకపోయిన ఆ జట్టు... వచ్చే ఏడాది జరగనున్న ఫుట్‌బాల్ విశ్వ సమరంలో బరిలోకి దిగడం కూడా అనుమానంగా మారింది. ఘన చరిత్ర... అంతకుమించిన వారసత్వం... అపార నైపుణ్యం... దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు మెరుగైన మౌలిక వసతులు ఉన్నా ఈ క్రీడలో తిరోగమనం దిశలో పయనిస్తున్న ఇటలీ... కనీస సౌకర్యాలు లేని క్రికెట్లో మాత్రం సత్తా చాటుతోంది. ప్రాక్టీస్ చేసేందుకు కనీసం పచ్చిక పిచ్‌లు కూడా లేకున్నా... ప్రపంచకప్‌నకు తొలిసారి అర్హత సాధించి భళా అనిపించింది. యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటడం ద్వారా వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్‌కప్ బరిలోకి దిగే అవకాశం దక్కించుకున్న నేపథ్యంలో ఇటలీ క్రికెట్‌పై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడా విభాగంఫుట్బాల్ను విపరీతంగా అభిమానించే దేశంలో క్రికెట్‌కు క్రేజ్ దక్కుతుందా అనే స్థాయి నుంచి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించే స్థాయికి ఇటలీ చేరుకుంది. క్లబ్‌లు, ఏజ్ గ్రూప్ మ్యాచ్‌లు, ప్రత్యేక టోర్నీలు, సన్నాహక మ్యాచ్‌లు ఇలా అన్నీ ఉన్న ఫుట్‌బాల్‌లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్న ఇటలీ... ప్రాక్టీస్ చేసేందుకు సరైన మైదానాలు, మెరుగయ్యేందుకు అవసరమైన కనీస వసతులు లేని క్రికెట్లో మాత్రం రాణిస్తోంది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం వలస వచ్చిన ప్లేయర్లతో నిండిన జట్టు... వారం మొత్తం ఉద్యోగాలు చేసుకుంటూ వారాంతాల్లో వీలు చిక్కినప్పుడు మాత్రమే సాధన చేసే ప్లేయర్లతో ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందడం అంటే మామూలు విషయం కాదు. టి20 ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ఇటలీ జట్టు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించగా... తొలి మ్యాచ్‌లో పటిష్ట టీమిండియాతో ఆడాలనుకుంటున్నట్లు ఆ జట్టు సారథి జో బర్న్స్ వెల్లడించాడు. ఆరస్టేలియా నుంచి ఇటలీకి... ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున 23 టెస్టులు, 6 వన్డేలు ఆడిన జో బర్న్స్ కొన్నేళ్ల క్రితం ఇటలీకి వలస వెళ్లాడు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బర్న్స్ పూర్వీకులుఆ్రస్టేలియాకు వెళ్లగా... ఇప్పుడు మెరుగైన కెరీర్ కోసం అతడు తిరిగి ఇటలీకి చేరుకున్నాడు. అప్పటికే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా... వారికి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోగా... బర్న్స్ రాకతో ఆ ఇబ్బంది తీరింది.అతడితో పాటు ఆ్రస్టేలియాలో దేశవాళీ క్రికెట్ ఆడిన హ్యారీ మనెంటి, బెన్ మనెంటి... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడిన గే, స్టివర్ట్ వంటి ప్లేయర్లు... జాతీయ జట్ల తరఫున అవకాశం దక్కని ఉపఖండ ఆటగాళ్లతో ఇటలీ జట్టులో ప్రతిభకు కొదవ లేకుండా ఎదిగింది. బర్న్స్ సారథ్యంలో ఎప్పటికప్పుడు మెరుగవుతున్న ఇటలీ జట్టు... నెదర్లాండ్స్ తర్వాత ఐసీసీ టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన యూరప్ జట్టుగా నిలిచింది. కెవిన్ ఒబ్రియాన్ కోచింగ్‌లో... ఐర్లాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రియాన్ ఓసారి ఇటలీలో పర్యటిస్తున్న సమయంలో అక్కడి యువ ఆటగాళ్ల నైపుణ్యం చూసి ముచ్చట పడ్డాడు. మెరుగైన వసతులు లేకపోయినా... ప్లేయర్లలో ఏదో సాధించాలనే తపనను గమనించాడు. అలాంటి పరిస్థితులను దాటుకొని ప్రపంచకప్ స్థాయిలో మెరుపులు మెరిపించిన ఒబ్రియాన్.. అనంతరం కాలంలో ఇటలీ క్రికెట్ జట్టు సహాయక కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆ జట్టు దశ తిరిగింది. భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ రికార్డు లక్ష్యఛేదనతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన ఒబ్రియాన్... ఇటలీ ప్లేయర్లకు గొప్పగా శిక్షణనిచ్చాడు. ఇటలీ జట్టు టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంతో తను పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లు అయిందని ఒబ్రియాన్ అన్నాడు. ‘కోచ్‌గా ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా. అసలు కోచింగ్ వైపు అడుగులు వేసినప్పుడు ఇదంతా ఊహించలేదు. కానీ ప్లేయర్లు నిబద్దతతో కృషి చేసి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు ఎంతో ప్రత్యేకం’ అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న సమయంలో 2007 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లపై ఐర్లాండ్ జట్టు విజయాలు సాధించడంలో ప్లేయర్‌గా ఒబ్రియాన్ కీలక పాత్ర పోషించాడు. సహాయక కోచ్‌గా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచే ‘ఏజ్ గ్రూప్ క్రికెట్’కు ప్రాధాన్యత ఇచ్చి వాటి ఫలితాలు బోర్డుకు అందించాడు. ప్రపంచకప్‌తో ఆదరణ దక్కేనా! యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీ ప్రారంభానికి రెండు వారాల ముందు... ఇటలీ జాతీయ ఒలింపిక్ కమిటీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను క్రీడాంశంగా ప్రవేశపెట్టడంతో... ఇకపై మరింత తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో షెడ్యూల్లో మార్పులు చేసింది. ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. ఇటలీలో పచ్చిక పిచ్‌లు అందుబాటులో లేకపోవడంతో... కృత్రిమ పిచ్‌లపై సాధన చేసేలా జట్టును సిద్ధం చేసింది. ఇతర జట్లతో మ్యాచ్లసంఖ్యను సైతం పెంచింది. ‘టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించడం ఒక కీలక మలుపు. మా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. సౌకర్యాలు మెరుగైనప్పుడే యువత ఇటువైపు అడుగులు వేస్తుంది.ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో పాల్గొంటే... ఎక్కువ ఆదరణ దక్కుతుంది. తద్వారా దేశంలో ఆటకు ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే స్పాన్సర్లు, ఎండార్స్మెంట్ల రూపంలో ఆదాయం పెరుగుతుంది’ అని ఇటలీ క్రికెట్ జట్టు మేనేజర్ పీటర్ డి వెనుటో అన్నాడు.కలుగమగె కథే వేరు...శ్రీలంకకు చెందిన క్రిషన్ కలుగమగె 15 ఏళ్ల వయసులో ఇటలీకి వలస వెళ్లాడు. మొదట అథ్లెట్ కావాలనుకున్న క్రిషన్ ఆ తర్వాత క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో... ఒక రెస్టారెంట్లో పిజ్జా మేకర్‌గా పనికి కుదిరాడు. జీవన ప్రమాణాలు పెంచుకునేందుకు ఒకవైపు పని కొనసాగిస్తూనే... వ్యక్తిగత ఆసక్తిని చంపుకోలేక క్రికెట్‌ను కొనసాగించాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ 2022లో ఇటలీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటలీలో క్రికెట్‌కు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో... ఆ తర్వాత కూడా అతడు రెస్టారెంట్ ఉద్యోగం కొనసాగించాల్సిన పరిస్థితి. ఇలాంటి దశలో వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం చేసే పనిని పక్కన పెట్టిన క్రిషన్... ఇటలీ జట్టు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించిన తర్వాత వచ్చిన స్పందనతో ఆశ్చర్యపోయాడు. ‘క్వాలిఫయింగ్ టోర్నీ ముగించుకొని ఇంటికి వచ్చిన సమయంలో అక్కడ వందలాది మంది పూలు, స్వీట్లతో నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఏమాత్రం ఊహించనిది. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యా’ అని కలుగమగె అన్నాడు. స్టీరింగ్ పక్కన పెట్టి... 2006లో కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్ప్రీత్ సింగ్... అంచెలంచెలుగా ఎదుగుతూ 2019లో ఇటలీ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత్ మాదిరిగా అక్కడ క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ పొట్ట కూటి కోసం క్యాబ్ డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. 2024 టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సమయంలోనే ఇటలీ జట్టు త్రుటిలో మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం కోల్పోవడంతో... ఈసారి అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో... స్టీరింగ్‌ను పక్కన పెట్టిన జస్ప్రీత్ పూర్తిగా క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. అందుకు తగ్గ ఫలితం దక్కడం ఆనందంగా ఉందని అతడు వెల్లడించాడు. ‘వరల్డ్‌కప్‌కు తొలిసారి అర్హత సాధించిన ఇటలీ జట్టులో భాగస్వామిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. పెద్దవాళ్లమయ్యాక ముందు తరాలకు చెప్పుకునేందుకు ఇంతకు మించి ఇంకేం కావాలి’ అని అన్నాడు. -
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. టీ20 వరల్డ్‌కప్ యూరప్ క్వాలిఫయర్స్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ ఇటలీ తమకంటే చాలా రెట్లు మెరుగైన స్కాట్లాండ్కు ఊహించని షాకిచ్చింది. ఈ గెలుపుతో ఇటలీ వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు దాదాపుగా అర్హత సాధించినట్లైంది. తమ చివరి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోకుంటే ఇటలీ పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించినట్లే.హాగ్ వేదికగా నిన్న (జులై 9) జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఇటలీ 12 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎమిలియో గే (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగగా.. ఆఖర్లో స్టీవార్ట్ (27 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యలో హ్యారీ మనెంటి (38) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క (3-0-18-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. బ్రాడ్ కర్రీ (4-0-38-1), మార్క్ వాట్ (4-0-24-1), క్రిస్ గ్రీవ్స్ (4-0-29-1) కూడా పర్వాలేదనిపించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్ ఆదిలోనే తడబడింది. 29 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జార్జ్ మున్సే (72), కెప్టెన్ బెర్రింగ్టన్ (46 నాటౌట్) స్కాట్లాండ్ను విజయతీరాలవైపు తీసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. హ్యారీ మనెంటీ (4-0-31-5) అద్భుతంగా బౌలింగ్ చేసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. మనెంటీ ధాటికి స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ గెలిచిన అనంతరం ఇటలీ ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. 🚨 ITALY STUNS SCOTLAND IN THE T20 WORLD CUP QUALIFIERS. 🚨- Italy can play the 2026 T20 WC. 🤯pic.twitter.com/t0PrGoSDj2— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2025తొలిసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశం రావడంతో ఆ జట్టు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇటలీ జట్టుకు ఆసీస్ మాజీ ఆటగాడు జో బర్న్స్ సారథ్యం వహిస్తున్నాడు. బర్న్స్ ఆసీస్ తరఫున 23 టెస్ట్‌లు ఆడి, ఆతర్వాత ఇటలీకి వలస వచ్చాడు. -
అది ఆసీస్‌కు రిటర్న్ గిఫ్ట్
న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం... జూన్ 29న భారత జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007లోనూ టి20 వరల్డ్ కప్ విజయంలో భాగంగా ఉన్న రోహిత్ నాయకుడిగా సాధించిన తొలి టి20 టోర్నీ ఇది. ఈ టోర్నమెంట్లో ఎప్పటిలాగే పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో పాటు సెమీస్‌కు ముందు ఆ్రస్టేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ నేపథ్యంలో ‘జియో–హాట్‌స్టార్’ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ నాటి మ్యాచ్‌లకు సంబంధించి పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఆ్రస్టేలియాతో పోరులో భారత్ 24 పరుగులతో విజయం సాధించింది. 41 బంతుల్లోనే 92 పరుగులు చేసిన రోహిత్ శర్మ... స్టార్క్ వేసిన ఒక ఓవర్లో 4 సిక్స్‌లు, ఫోర్‌తో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. అంతకుముందు ఏడు నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియా తీవ్ర నిరాశకు లోనైంది. ఆ ఓటమి తమ మనసుల్లోనే ఉండటంతో ఆసీస్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగామని రోహిత్ చెప్పాడు. ‘మేం ఈ మ్యాచ్ గెలిస్తే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందన్న మాట చాలు మాలో స్ఫూర్తి నింపడానికి. నవంబర్ 19న మాతో పాటు మన దేశ అభిమానులందరికీ ఆనందం దూరం చేశారనే విషయం మనసులో మెదులుతూనే ఉంది. కాబట్టి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావించాం. అయితే అది అంత సులువు కాదని, మైదానంలోనే చూపించాలని భావించాం. అందుకే ఒక్కసారి బ్యాటింగ్‌కు దిగగానే నేను ఏం చేయగలనో అది చేశాను. స్టార్క్‌తో గతంలో చాలాసార్లు తలపడ్డా. ఈసారి అతడు నన్ను అవుట్ చేయడానికి కాకుండా పరుగులు ఇవ్వకుండా ఆపేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నట్లు అర్థమైంది. అక్కడే నేను సగం గెలిచాను. ఆపై విరుచుకుపడ్డాను. సెంచరీలు సాధించడం గొప్పే. కానీ మ్యాచ్ పరిస్థితి, దికను బట్టి చూస్తే ఈ ఇన్నింగ్స్ సెంచరీకంటే ఎంతో విలువైంది. నాకు సంబంధించి ఇది నా అత్యుత్తమ ప్రదర్శన’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. అంతకుముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా 140 చేస్తే గెలుస్తామని భావించామని... 119 పరుగులు చేసిన తర్వాత కూడా 2–3 వికెట్లు తీస్తే పాక్‌ను ఓడించగలమని నమ్మకం ఉందని చెప్పాడు. నిజానికి మ్యాచ్ ఫలితంకంటే దానికి ముందు ఉండే హడావిడే ఎప్పుడూ ప్రత్యేకమని అతను అన్నాడు. ‘బయట మాకు ముప్పు ఉందని చెబుతూ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు నుంచి కూడా హోటల్ బయటకు మమ్మల్ని వెళ్లనీయలేదు. మీడియా, అభిమానులతో నిండిపోయిన హోటల్ కనీసం నడవడానికి కూడా వీలు లేని విధంగా మారిపోయింది. అప్పుడు ఇది సాధారణ మ్యాచ్ కాదని మాకు అర్థమైంది. గ్రౌండ్‌కు వెళ్లిన తర్వాత కూడా ఇరు దేశాల అభిమానుల జోష్‌ను చూస్తే ఆశ్చర్యం వేసింది. పాకిస్తాన్‌పై నేను ఎన్నో మ్యాచ్‌లు ఆడాను. కానీ ఆటకు ముందు కనిపించే వాతావరణం ప్రత్యేకతే వేరు. దానికి ఏదీ సాటి రాదు’ అని రోహిత్ శర్మ వివరించాడు. -
టీ20 ప్రపంచ కప్ 2026కు ఆర్హత సాధించిన కెనడా..
టీ20 ప్రపంచ కప్ 2026కు కెనడా జట్టు ఆర్హత సాధించింది. శనివారం కింగ్ సిటీ వేదికగా జరిగిన అమెరికాస్ క్వాలిఫైయర్‌లో బహామాస్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన కెనడా.. వరల్డ్‌కప్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. పొట్టి ప్రపంపకప్నకు కెనడా క్వాలిఫై కావడం ఇదే రెండో సారి.అమెరికాస్ క్వాలిఫైయర్‌లో భాగంగా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లోనూ విజయం సాధించిన కెనడా.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బహామాస్ కేవలం 57 పరుగులకే ఆలౌటైంది.కెనడా బౌలర్లలో కలీం సానా, శివమ్ శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. అన్షూ పటేల్ రెండు వికెట్లు సాధించారు. అనంతరం 58 పరుగుల లక్ష్యాన్ని కెనడా కేవలం 5.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. కెనడా బ్యాటర్లలో దిల్‌ప్రీత్ బజ్వా(36) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.13వ జట్టుగా..2026 టీ 20 వరల్డ్ కప్‌లో 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో భారత్, శ్రీలంక క్వాలిఫై కాగా.. టీ20 వరల్డ్‌కప్-2024 టాప్-8లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్ నేరుగా ఆర్హత సాధించాయి.గత టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అగ్రస్ధానంలో నిలిచినప్పటికి ఆతిథ్య హోదాలో బరిలోకి దిగనుంది. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ కూడా క్వాలిఫై అయ్యాయి. . మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి.అందులో ఇప్పుడు అమెరికాస్ క్వాలిఫైయర్స్ నుంచి 13వ జట్టుగా కెనడా ఆర్హత సాధించింది. యూరప్ క్వాలిఫైయర్స్, ఆఫ్రికా క్వాలిఫైయర్స్ నుంచి రెండేసి జట్లు చొప్పున క్వాలిఫై కానున్నాయి. ఈస్ట్ ఆసియా ఫసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి మరో మూడు జట్లు ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి.చదవండి: IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు -
టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (ICC Women's T20 World Cup) షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీకి వచ్చే ఏడాది జూన్ 12న తెర లేవనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.ఈ మెగా ఈవెంట్లో పన్నెండు జట్లు భాగం కానున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించనున్నాయి.ఈ పన్నెండు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్, పాకిస్తాన్‌తో పాటు మరో రెండు జట్లు.. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు మరో రెండు టీమ్‌లు పోటీపడనున్నాయి.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి న్యూజిలాండ్కాగా చివరగా 2024లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్-2026 ఏడు వేదికల్లో 24 రోజుల పాటు సాగనుంది. ఇందులో భాగంగా 33 మ్యాచ్‌లు జరుగనున్నాయి.కాగా ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడ్డింగ్లీ, ఓల్డ్ ట్రఫోర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇంగ్లండ్- శ్రీలంక మధ్య మ్యాచ్‌తో జూన్ 12న మొదలయ్యే మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్‌తో ముగియనుంది.భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడే..ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. జూన్ 14న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం గ్లోబ్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన టీమ్‌తో జూన్ 17న భారత్ తలపడుతుంది.ఆ తర్వాత జూన్ 21న సౌతాఫ్రికాతో, జూన్ 25న క్వాలిఫయర్ జట్టుతో, జూన్ 28న పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 పూర్తి షెడ్యూల్జూన్ 12- శుక్రవారం- ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక, ఎడ్జ్బాస్టన్జూన్ 13- శనివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 13- శనివారం: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 13- శనివారం: వెస్టిండీస్ vs న్యూజిలాండ్, హాంప్‌షైర్ బౌల్జూన్ 14- ఆదివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఎడ్జ్బాస్టన్జూన్ 14- ఆదివారం: ఇండియా vs పాకిస్తాన్, ఎడ్జ్బాస్టన్జూన్ 16- మంగళవారం: న్యూజిలాండ్ vs శ్రీలంక, హాంప్‌షైర్ బౌల్జూన్ 16- మంగళవారం: ఇంగ్లండ్ vs క్వాలిఫయర్, హాంప్షైర్బౌల్జూన్ 17- బుధవారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 17- బుధవారం: ఇండియా vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 17- బుధవారం: సౌతాఫ్రికా vs పాకిస్తాన్, ఎడ్జ్బాస్టన్జూన్ 18- గురువారం: వెస్టిండీస్ vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 19- శుక్రవారం: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్జూన్ 20- శనివారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్జూన్ 20- శనివారం: ఇంగ్లండ్ vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 21- ఆదివారం: వెస్టిండీస్ vs శ్రీలంక, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: శ్రీలంక vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్, హెడ్డింగ్లీజూన్ 24- బుధవారం: ఇంగ్లండ్ vs వెస్టిండీస్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్జూన్ 25- గురువారం: ఇండియా vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 25- గురువారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 26- శుక్రవారం: శ్రీలంక vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 27- శనివారం: పాకిస్తాన్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 27- శనివారం: వెస్టిండీస్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 27- శనివారం: ఇంగ్లండ్ vs న్యూజిలాండ్, ది ఓవల్జూన్ 28- ఆదివారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జూన్ 28- ఆదివారం: ఆస్ట్రేలియా vs ఇండియా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జూన్ 30- మంగళవారం: సెమీ ఫైనల్ 1- ది ఓవల్జూలై 2- గురువారం: సెమీ ఫైనల్ 2- ది ఓవల్జూలై 5- ఆదివారం: ఫైనల్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.చదవండి: గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో -
భారత పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. ఎప్పుడంటే?
న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానునున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నహాకాల్లో భాగంగా ఈ టూర్‌ను కివీస్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఆఖరిలో కివీస్ తమ స్వదేశంలో విండీస్‌తో ఆల్‌ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే బ్లాక్ క్యాప్స్ జట్టు భారత్‌కు వచ్చే అవకాశముంది. కాగా టీ20 ప్రపంచకప్-2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీ సన్నాహాల్లో భాగంగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సైతం ఈ ఏడాది ఆఖరిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లు ఆడనుంది. న్యూజిలాండ్ చివరగా వైట్‌బాల్ సిరీస్‌లు ఆడేందుకు 2023లో భారత్ పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో బ్లాక్ క్యాప్స్ టీమ్ మూడు వన్డేల సిరీస్‌లో వైట్ వాష్ కాగా.. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌కు కోల్పోయింది.ఆ తర్వాత ఏడాది మాత్రం టీమిండియా జరిగిన రెడ్‌బాల్ సిరీస్‌లో మాత్రం న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. మూడు టెస్టుల సిరీస్‌లో 3-0 తేడాతో టీమిండియాను కివీస్ చిత్తు చేసింది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో మాత్రం న్యూజిలాండ్‌ను భారత్ మట్టికరిపించింది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! జడేజాకు నో ఛాన్స్? -
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన నేపాల్, థాయ్‌లాండ్
నేపాల్, థాయ్‌లాండ్ జట్లు ఆఖరి నిమిషంలో మహిళల టీ20 వరల్డ్‌కప్-2026 గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పోటీ పడేందుకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో యూఏఈపై విజయాలు సాధించిన నేపాల్, థాయ్‌లాండ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు ఇదివరకే స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి అర్హత సాధించే జట్లేవో తెలియాల్సి ఉంది. ఈ రెండు టోర్నీల నుంచి రెండు జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం గ్లోబల్ క్వాలిఫయర్స్‌లో ఆరు జట్లు పోటీ పడి, నాలుగు జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. కాగా, 2026 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఇంగ్లండ్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడతాయి. ఆతిధ్య దేశ హోదాలో ఇంగ్లండ్ తొలుత ఈ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు బెర్త్‌లు గ్లోబల్ క్వాలిఫయర్స్ ద్వారా డిసైడ్ అవుతాయి. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. -
వన్డే, టెస్టుల్లో కీలక మార్పుల దిశగా ఐసీసీ!.. టీ20 ఫార్మాట్లో కొత్తగా ఈసారి!
జై షా (Jay Shah) నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మూడు ఫార్మాట్లలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. వన్డేల్లో రెండు బంతుల విధానం రద్దు చేయడంతో పాటు.. అండర్-19 స్థాయిలో పురుషుల విభాగంలోనూ ప్రపంచకప్ (Under-19 World Cup) నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.అదే విధంగా.. టెస్టుల్లో ఓవర్ రేటును లెక్కించేందుకు ‘టైమర్’ ను ప్రవేశపెట్టే దిశగా ఐసీసీ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ చైర్మన్ హోదాలో జై షా తొలిసారి బోర్డు సమావేశానికి హాజరవుతున్నారు. జింబాబ్వే వేదికగా ఏప్రిల్ 10- 13 వరకు ఈ మీటింగ్ జరుగనుంది.ఈ నేపథ్యంలో మూడు ఫార్మాట్లలోనూ పైవిధమైన మార్పులు చేయాలనే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సమావేశం ముగిసిన తర్వాత ప్రకటన వెలువడే అవకాశం ఉందని క్రిక్‌బజ్ వెల్లడించింది.రివర్స్ స్వింగ్ కోసంకాగా వన్డే మ్యాచ్‌లో ప్రస్తుతం రెండు బంతులు ఉపయోగించే విధానం కొనసాగుతోంది. ఇరు జట్లు బౌలింగ్ కోసం కొత్త బంతిని ఉపయోగించుకుంటాయి. అదే విధంగా.. 25 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత మరో కొత్త బంతిని కూడా తీసుకునేందుకు వీలుంటుంది. ఇందులో ఏ బంతితో ఆటను కొనసాగించాలనే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా బౌలింగ్ జట్టుకు ఉంటుంది.అయితే, ఇందుకు సంబంధించి ప్లేయింగ్ కండిషన్లలో పూర్తిస్థాయి మార్పులు చేసేందుకు ఐసీసీ సిద్ధంగా లేదు.. కానీ బౌలర్లకు కూడా కాస్త వెసలుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఉంది. కాగా కొత్త బంతి మెరుస్తూనే ఉండటం వల్ల పేస్ బౌలర్లకు రివర్స్ స్వింగ్ రాబట్టడం వీలుకాదు. బంతి పాతబడే కొద్ది వాళ్లకు కాస్త పట్టు దొరుకుతుంది.నాడు పెదవి విరిచిన సచిన్మరోవైపు.. రెండు బంతుల విధానం వల్ల బ్యాటర్లు ఎక్కువగా లబ్ది పొందుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. గతంలో ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా స్పందించాడు. రెండు బంతుల విధానం అనేది వన్డే క్రికెట్‌కు మంచిది కాదని పేర్కొన్నాడు. బంతి పాతబడి.. రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు పేసర్లకు అవకాశం ఉండదని.. అలాంటపుడు డెత్ ఓవర్లలో వారికి పెద్దగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డాడు.మహిళలు ఆడుతున్నారుఇక టీ20ల విషయానికొస్తే.. పురుషుల క్రికెట్లో అండర్-19 వన్డే వరల్డ్‌కప్ మాదిరే.. అండర్-19 టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను కూడా ప్రవేశపెట్టాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మహిళల క్రికెట్లో పొట్టి ఫార్మాట్లో వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రెండు సీజన్లలో భారత జట్టు ఈ ట్రోఫీని గెలుచుకుంది.నిమిషం పూర్తయ్యే లోపేఅదే విధంగా.. టెస్టుల్లో ఓవర్ రేటు లెక్కించేందుకు టైమర్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అంటే.. ఓ ఓవర్ పూర్తైన వెంటనే మరుసటి నిమిషం పూర్తయ్యే లోపే మరో ఓవర్ వేయాల్సి ఉంటుంది. తద్వారా నిర్ణీత సమయంలో ఆటను ముగించేందుకు వీలుగా ఉంటుంది. కాగా టెస్టు మ్యాచ్‌లో రోజుకు తొంభై ఓవర్ల ఆట నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం The multi-day @ICC Board meetings and activities have begun in Harare, with Member Board representatives holding important discussions with @JayShah on hand for the first time as Chair, and great hospitality on display from @ZimCricketv. pic.twitter.com/8kisHdOcYp— ICC (@ICC) April 11, 2025 -
ఒక్క సిరీస్ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్ మాత్రమే: పాక్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గత కొంతకాలంగా ఇంటా.. బయటా పరాభవాలే ఎదురవుతున్నాయి. తొలుత న్యూజిలాండ్- సౌతాఫ్రికాతో సొంతగడ్డపై త్రైపాక్షిక సిరీస్‌లో ఓటమిపాలైన పాక్.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ చేదు అనుభవాలు ఎదుర్కొంది.ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ (NZ vs PAK T20 Series)లో చిత్తుగా ఓడిపోయింది. కివీస్‌తో బుధవారం నాటి ఐదో టీ20లో ఓడి.. 4-1తో సిరీస్‌లో పరాజయం పాలైంది.ఒక్క సిరీస్ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్ మాత్రమేఅయితే, ఓటమి అనంతరం పాకిస్తాన్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇలాంటి సిరీస్‌లలో ఓడిపోయినా ఫర్వాలేదని.. తమ దృష్టి మొత్తం ఆసియా కప్, వరల్డ్‌కప్ టోర్నీల మీదనే ఉందని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడింది.సిరీస్ ఆసాంతం వాళ్లు అదరగొట్టారు. అయినా మాకూ కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. మూడో టీ20లో హసన్ నవాజ్ అద్భుత శతకం సాధించాడు. ఐదో టీ20లో సూఫియాన్ సూపర్‌గా బౌలింగ్ చేశాడు.వన్డే సిరీస్‌లో మేము రాణిస్తాంమేము ఇక్కడికి వచ్చినప్పుడు మా దృష్టి మొత్తం ఆసియా కప్, ప్రపంచకప్లపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ సిరీస్‌లో ఓడినంత మాత్రాన పెద్దగా నిరాశపడాల్సిందేమీ లేదు. ఇక పొట్టి ఫార్మాట్‌కు, వన్డే ఫార్మాట్‌కు ఏమాత్రం పొంతన ఉండదని తెలిసిందే. వన్డే సిరీస్‌లో మేము రాణిస్తాం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.అపుడు డకెట్ కూడా ఇలాగేఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా కామెంట్లపై సోషల్ మీడియాలో సైటైర్లు పేలుతున్నాయి. ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్‌తో పోలుస్తూ నెటిజన్లు సల్మాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి ముందు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ అయింది. అయితే.. ఈ ఘోర ఓటమి తర్వాత బెన్ డకెట్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సిరీస్‌లలో పరాజయాలు పెద్దగా లెక్కలోకి రావు. మేమే చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత దీనిని అందరూ మర్చిపోతారు’’ అని పేర్కొన్నాడు.రెండు జట్లదీ ఒకే పరిస్థితిఅయితే, చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ కనీసం ఒక్క విజయం కూడా సాధించలేదు. అఫ్గనిస్తాన్ చేతిలోనూ చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు సల్మాన్ ఆఘా తమ ఫోకస్ ఆసియా కప్, వరల్డ్‌కప్ మాత్రమే అని చెప్పడం గమనార్హం. అన్నట్లు చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తొలుత న్యూజిలాండ్.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల.. ఆ మ్యాచ్ రద్దైంది. దీంతో ఇంగ్లండ్ మాదిరే ఒక్క గెలుపు లేకుండానే పాకిస్తాన్ ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమిపాక్తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ -
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవికి లూయిస్ గుడ్‌బై
లండన్: ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కోచ్ పదవి నుంచి జాన్ లూయిస్ తప్పుకొన్నాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనకు తోడు యాషెస్ సిరీస్‌లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడంతో జాన్ లూయిస్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2022 నుంచి జాన్ ఇంగ్లండ్ మహిళల జట్టు కోచ్‌గా వ్యవహరిస్తుండగా... ఆ జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశకే పరిమితమైంది.ఇక వేర్వేరు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లోనూ ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చింది. ‘ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. జట్టులో ప్రతిభకు లోటు లేదు. మరో మెరుగైన కోచ్‌ను నియమిస్తాం. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకముంది’ అని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: హైదరాబాద్ పరాజయంగువాహటి: జాతీయ అండర్–23 మహిళల వన్డే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో మమత సారథ్యంలోని హైదరాబాద్ జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 49.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. స్టార్ ప్లేయర్ గొంగడి త్రిష (14 బంతుల్లో 3) విఫలమవ్వగా... కెప్టెన్, వికెట్ కీపర్ మమత (83 బంతుల్లో 77; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.సాక్షి రావు (37 బంతుల్లో 36; 1 ఫోర్), కావ్య (63 బంతుల్లో 30; 3 ఫోర్లు) రాణించారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో గరీమా యాదవ్, సోనమ్ యాదవ్ 3 వికెట్ల చొప్పున తీయగా... ఏక్తాకు 2 వికెట్లు లభించాయి. అనంతరం ఉత్తరప్రదేశ్ జట్టు 44.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించి విజయం ఖరారు చేసుకుంది. తృప్తి సింగ్ (99 బంతుల్లో 73; 10 ఫోర్లు), ముస్కాన్ మాలిక్ (92 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి ఉత్తరప్రదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ బౌలర్లలో కేసరి ధృతి, సాక్షి రావు ఒక్కో వికెట్ తీశారు. -
ముంబై టీ20లో అభిషేక్ శర్మ సెంచరీ
-
సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌కు అభిమానిగా ఉండటం చాలా కష్టం..!
టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా గ్రాము అదృష్టం కూడా లేని క్రికెట్ జట్టు ఏదైనా ఉందా అంటే అది దక్షిణాఫ్రికా (South Africa) జట్టే అని చెప్పాలి. ఇటీవలికాలంలో ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే ఇది వందకు వంద శాతం నిజం అనిపిస్తుంది. జెండర్‌తో, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆ జట్టు ఇటీవలికాలంలో వరుసగా మెగా టోర్నీల ఫైనల్స్‌లో ఓడుతుంది. రెండేళ్ల వ్యవధిలో సౌతాఫ్రికా పురుషుల, మహిళల జట్లు నాలుగు టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఓడాయి. 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ఫైనల్స్‌లో తొలిసారి ఓడిన సౌతాఫ్రికా... ఆ మరుసటి ఏడాది పురుషులు, మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్ ఓటమి చవిచూసింది. తాజాగా ఆ దేశ మహిళల అండర్-19 జట్టు.. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ (Team India) చేతిలో పరాజయంపాలైంది.టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్లపై సానుభూతి వెల్లువెత్తుతుంది. నెటిజన్లు సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లపై తెగ జాలి చూపుతున్నారు. ఏ జట్టుకైనా అభిమానిగా ఉండవచ్చు కానీ.. వరుస ఫైనల్స్‌లో ఓడుతున్న సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లకు అభిమానిగా ఉండటం మాత్రం చాలా కష్టమని అంటున్నారు. సౌతాఫ్రికా క్రికెట్ జట్లకు గతంలో సెమీఫైనల్ ఫోబియా ఉండేది. ప్రస్తుతం అది పోయి ఫైనల్ ఫోబియా పట్టుకున్నట్లుంది. సౌతాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు త్వరలో మరో మెగా ఈవెంట్ ఫైనల్స్‌లో (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్‌లో) ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈసారైనా సౌతాఫ్రికా ఫైనల్ ఫోబియాను అధిగమించి టైటిల్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.కాగా, 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. ఆ మరుసటి ఏడాది జరిగిన పురుషుల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. అదే ఏడాది జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పొట్రిస్ జట్టు.. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన 2025 అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో యంగ్ ఇండియా చేతిలో చావుదెబ్బతింది.ఇదిలా ఉంటే, మలేసియాలో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్లో యంగ్ ఇండియా సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీ ఇనాగురల్ ఎడిషన్‌లోనూ (2023) భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) 3, పరునిక సిసోడియా, ఆయూశి శుక్లా, వైష్ణవి శర్మ తలో 2, షబ్నమ్ షకీల్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మికీ వాన్ వూర్స్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జెమ్మా బోథా (16), కరాబో మెసో (10), ఫే కౌలింగ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు.83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 11.2 ఓవర్లలో (వికెట్ కోల్పోయి) ఆడుతూపాడుతూ విజయం సాధించింది. బంతితో మెరిసిన త్రిష బ్యాటింగ్‌లోనూ చెలరేగి 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 22 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసింది. ఈ టోర్నీ మొత్తంలో భారత్ అజేయంగా నిలిచింది. టోర్నీ ఆధ్యాంతం బ్యాట్‌తో, బంతితో రాణించిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
ఒకటే లక్ష్యం... రెండో ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్ సై
కౌలాలంపూర్: రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మొట్టమొదటి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు జగజ్జేతగా అవతరించింది. రెండేళ్ల తర్వాత అదే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేందుకు ఈసారి దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా ఫైనల్ సంగ్రామానికి సిద్ధమైంది. అజేయంగా తుది పోరుకు అర్హత సాధించిన నికీ ప్రసాద్ నాయకత్వంలోని భారత అమ్మాయిల జట్టు విజయవంతంగా ‘రెండో ప్రపంచకప్ మిషన్’ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. భారత్ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్‌కప్ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో జోరు మీదున్న రెండు అజేయ జట్ల మధ్య నేడు జరిగే అండర్–19 ప్రపంచకప్ టైటిల్ పోరుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారీ భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందా! లేదంటే కొత్త చాంపియన్ ఆవిర్భవిస్తుందా! మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ వనరులతో పూర్తిస్థాయి ఆల్‌రౌండ్ సామర్థ్యంతో ఉన్న టీనేజ్ టీమిండియాను ఎదుర్కోవడమే ఎవరికైనా అతిపెద్ద సవాల్. ఇక అలాంటి అబేధ్యమైన జట్టును ఓడించాలంటే మాత్రం దక్షిణాఫ్రికా మైదానంలో పెద్ద ‘ప్రపంచ’ యుద్ధమే చేయాలనడంలో అతిశయోక్తే లేదు! ఆ ఇద్దరిని కట్టడి చేస్తే... తెలంగాణ స్టార్ బ్యాటర్ గొంగడి త్రిష! మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో తనను విస్మరించిన ఫ్రాంచైజీల కళ్లకు కట్టుకున్న గంతల్ని తన అసాధారణ బ్యాటింగ్‌తో విప్పేసింది. ఇప్పుడు ‘ఫైనల్ మిషన్’ ముంగిట అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ఈ టోర్నీలో ఓపెనర్ త్రిష ఫామ్, క్రీజులో ఆమె కనబరుస్తున్న పోరాటపటిమ ప్రత్యర్థి బౌలర్లకు కఠిన సవాళ్లు విసురుతున్నాయి. మరో ఓపెనర్ కమలిని, సనిక చాల్కెలతో కూడిన భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. దక్షిణాఫ్రికా విజయంపై ఆశలు పెంచుకోవాలంటే మాత్రం ముఖ్యంగా త్రిష, కమలినిలను తక్కువ స్కోరుకు పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో త్రిష 265 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా... కమలిని 135 పరుగులతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్ నుంచి అత్యధిక పరుగులు సనిక చాల్కె (6 మ్యాచ్‌ల్లో 69) చేసింది.భారత బౌలింగ్ విభాగానికొస్తే ఆయుశి శుక్లా, పారుణిక సిసోడియా, వైష్ణవి శర్మలతో కూడిన స్పిన్ త్రయం విశేషంగా రాణిస్తోంది. సహజంగానే సఫారీలకు స్పిన్ అంటేనే కష్టం. అలాంటి జట్టుపై ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు స్పిన్నర్లు తప్పకుండా ప్రభావం చూపిస్తారు. అలాగని ఫైనల్‌కు చేరిన సఫారీ జట్టును తక్కువ అంచనా వేయలేం.కేలా రెనెకి కెప్టెన్సీ లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్లో గట్టి ప్రత్యర్థి ఆ్రస్టేలియాను బౌలింగ్‌తో కట్టడి చేసి... బ్యాటింగ్‌తో చుట్టేసింది. జెమ్మా బోతా, లౌరెన్స్, కరబొ మెసోలతో కూడిన బ్యాటింగ్ లైనప్, ఆష్లే వాన్విక్, ఎన్‌తబిసెంగ్ నిని, శేషిని నాయుడులతో కూడిన బౌలింగ్ దళం కూడా మెరుగ్గా ఉంది.పిచ్, వాతావరణం భారత్‌కు బాగా అలవాటైన పిచ్. అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. సాధారణ వాతావరణమే. వాన ముప్పు దాదాపుగా లేదు. -
T20 World Cup 2025: సూపర్ సిక్స్‌లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన శ్రీలంక
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ 2025 (ICC Under 19 Women's T20 World Cup 2025) చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka) ఆస్ట్రేలియాకు (Australia) షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో ఓటమి ఎరుగని ఆసీస్‌కు శ్రీలంక ఓటమి రుచి చూపించింది. మలేసియాలోకి బంగి వేదికగా ఇవాళ (జనవరి 29) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆసీస్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు శ్రీలంక సైతం ఈ టోర్నీలో అద్భుతంగా రాణించినప్పటికీ.. ఆ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ దశలో శ్రీలంక.. మలేసియా, వెస్టిండీస్ జట్లపై విజయాలు సాధించినప్పటికీ భారత్ చేతిలో ఘోరంగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆతర్వాత సూపర్-6లో తప్పక గెలుస్తుందనుకున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఈ మ్యాచ్ రద్దు కావడం శ్రీలంక సెమీస్ ఆశలను గల్లంతు చేసింది. తాజాగా శ్రీలంక ఆసీస్‌పై గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. శ్రీలంక ఉన్న గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఫైనల్ ఫోర్కు చేరాయి. జనవరి 31న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ ఢీకొట్టనుండగా.. అదే రోజు జరిగే రెండ సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ భారతకాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ ఎడిషన్‌లో (2023) టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో శ్రీలంక ఆసీస్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సంజన కవిండి (19), సుముదు నిసంసల (18), కెప్టెన్ మనుడి ననయక్కార (15), హిరుని హన్సిక (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో లిల్లీ బాస్సింగ్వైత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. హస్రత్ గిల్, టెగాన్ విలియమ్సన్‌లు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి చెరి రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. లంక బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో ఒక్కో పరుగు చేసేందుకు నానా ఇబ్బందులు పడింది. చమోది ప్రబోద, ప్రముది మెత్సర, అసేని తలగుణే తలో రెండు వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. లిమాంస తిలకరత్న ఓ వికెట్ పడగొట్టింది. లంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కూడా 8 వికెట్ల నష్టానికి 87 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బే (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెక్కియోన్ (10), కెప్టెన్ హ్యామిల్టన్ (10), వికెట్ కీపర్ గ్రేస్ లయన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. -
నాన్న కల నెరవేర్చింది
‘కలలు కనడం కష్టం కాదు. కాణీ ఖర్చు కాదు’ లాంటి వెటకారాల మాట ఎలా ఉన్నా.... ఆ కలలే భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.వందమందిలో ఒకరిగా ప్రత్యేకతతో వెలిగిపోయేలా చేస్తాయి. ‘నా కూతురు ఆడితే పరుగులు వెల్లువెత్తాల్సిందే’ ‘మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం... అంటూ నా కూతురు గురించి అందరూ ఘనంగా చెప్పుకోవాలి’... ఇలాంటి కలలు ఎన్నో కనేవాడు భద్రాచలానికి చెందిన రామిరెడ్డి.అయితే ఆయన కలలకు మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం తన కలల సాకారానికి ప్రయత్నించాడు. ఆ ఫలితమే స్టార్ క్రికెటర్... త్రిష గొంగడి(Trisha Gongadi). మలేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్ అండర్ 19, టీ 20 వరల్డ్ కప్(Women World Cup)లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి రామిరెడ్డి క్రికెట్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశించినా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల నెరవేరలేదు. దీంతో ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తూనే పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించేవాడు. ‘మా అమ్మాయిని బాగా చదివించాలి’... అనేది సగటు తండ్రి కోరిక.రామిరెడ్డి మాత్రం అలా కాదు... ‘మా అమ్మాయిని బాగా ఆడించాలి. క్రికెట్లో స్టార్‌ని చేయాలి’ అనుకునేవాడు. సినిమాలు, కామేడీ షోలు కాకుండా టీవీలో క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ ఎక్కువగా చూపించేవాడు. చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల బ్రెయిన్, మజిల్స్ ఆటకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతాయని ఫిటెనెస్ ట్రైనర్‌గా ఆయన బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చిన్నతనం నుంచే త్రిష క్రికెట్లో ప్రతిభ కనబరిచేది. దీంతో తన కల విషయంలో మరింత పట్దుదల పెరిగింది. కూతురిని ప్రోఫెషనల్ క్రికెటర్‌గా చూడాలనే లక్ష్యంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు రామిరెడ్డి. అప్పుడు త్రిష వయసు ఏడేళ్లు. సికింద్రాబాద్‌లోని ‘సెయింట్ జాన్ ్స క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకునేది.ఎంతో ఆశ... చివరికి నిరాశ!్రపోఫెషనల్ ట్రైనింగ్‌లో ఆరితేరిన త్రిష పన్నెండేళ్ల వయస్సులో హైదరాబాద్ అండర్ 19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్ 19 ఇండియా తరఫున సౌత్ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్ర పోషించింది. అయితే త్రిషకు ఈ టోర్నీలో ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. ఆ ఫలితం ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో స్పష్టంగా కనిపించింది. విమెన్ ఐపీఎల్ వేలంలో త్రిషాను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. అ గెలుపులో తాను ఒకరిగా ఉండటం కంటే ‘గెలుపుకు మూలం’ అనిపించేలా ప్రదర్శన చేయాలనే పట్టుదల త్రిషలో పెరిగింది.ఇక చూస్కోండివిమెన్ ఐపీఎల్లో ఎదురైన చేదు అనుభవం ‘పవర్ హిట్టింగ్’పై పట్టు సాధించేందుకు త్రిషకు తోడ్పడింది. గత డిసెంబరులో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో వరుసగా 58 నాటౌట్, 32, 52 పరుగులు సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసిన త్రిష 230 పరుగులు సాధించింది. ఇందులో స్కాట్లాండ్పై చేసిన 110 నాటౌట్ సెంచరీ కూడా ఉంది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ సెంచరీతో అండర్ 19 టోర్నీలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీసింది.అందనంత ఎత్తులో...టోర్నీలో మిగతా అమ్మాయిలకు అందనంత ఎత్తులో బ్యాటింగ్ యావరేజ్ 76.77తో త్రిష కొనసాగుతోంది. ఆమె తర్వాత రెండోస్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ డావినా పేరిన్ ఉంది. ఈ టోర్నీలో రెండుసార్లు త్రిష 40కి పైగా స్కోర్లు సాధించింది. అయితే అప్పటికే ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించే అవకాశం త్రిషకు దక్కలేదు. కానీ స్కాట్ల్యాండ్తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో త్రిష బ్యాట్ నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ (53 బంతుల్లో) జాలువారింది. బ్యాటింగ్ యావరేజ్‌తో పాటు మోస్ట్ రన్స్, హయ్యెస్ట్ స్కోర్ విభాగంలోనూ త్రిష టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ మహిళల అండర్ 19 జట్టు సెమీస్‌కు చేరుకుంది.ఏజెన్సీప్రాంతం నుంచి మొదలైన త్రిష విజయపరంపర అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవిమెన్ వరల్డ్ కప్‌లో ఇండియాకు ఆడాలి అండర్ 19, విమెన్ టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. విమెన్ అండర్ 19 టోర్నీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇండియా మహిళల జట్టుకు ఎంపిక కావాలి. రాబోయే వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో నా పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చాను. నా లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నాను. – గొంగడి త్రిష -
T20 World Cup: త్రిష ఆల్‌రౌండ్ షో.. భారత్ ఖాతాలో వరుసగా ఐదో గెలుపు
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో (ICC Under 19 Women's T20 World Cup 2025) భారత్ (India) వరుసగా ఐదో విజయం సాధించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్, తెలుగమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాట్‌తో విధ్వంసకర శతకం బాదిన త్రిష.. ఆతర్వాత బంతితోనూ చెలరేగి మూడు వికెట్లు పడగొట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న త్రిష.. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.అనంతరం 209 పరుగల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. భారత బౌలర్లు విజృంభించడంతో 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఆయూషి శుక్లా 4, వైష్ణవి శర్మ, గొంగడి త్రిష తలో మూడు వికెట్లు తీసి స్కాట్లాండ్ పతనాన్ని శాశించారు. ఆయూషి, వైష్ణవి శర్మ, త్రిష వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. ఆయూషి 3 ఓవర్లలో 8 పరుగులు.. వైష్ణవి శర్మ 2 ఓవర్లలో 5 పరుగులు.. త్రిష 2 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కరు కూడా 12 పరుగులకు మించి చేయలేదు. కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించింది. గ్రూప్ దశలో వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్లపై ఘన విజయాలు సాధించింది. ఈ మెగా టోర్నీలో భారత్‌తో తలపడిన ఒక్క ప్రత్యర్థి కూడా కనీసం మూడంకెల మార్కును చేరుకోలేకపోయింది. వెస్టిండీస్ 44, మలేసియా 31, శ్రీలంక 58, బంగ్లాదేశ్ 64, తాజాగా స్కాట్లాండ్ 58 పరుగులకు ఆలౌటైంది. -
చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. టీ20 వరల్డ్‌కప్‌లో తొలి శతకం
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో భారత ఓపెనర్ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసర శతకం బాదిన త్రిష.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రికార్డు నెలకొల్పింది. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. HISTORY BY TRISHA 🇮🇳- Trisha becomes the first Player to score a Hundred in Women's U-19 T20I World Cup History 🏆 pic.twitter.com/05mJwdtbMQ— Johns. (@CricCrazyJohns) January 28, 2025ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. సెమీస్‌లో భారత్గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు, సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్.. స్కాట్లాండ్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయాయి..!ఈ టోర్నీలో భారత్‌తో ఇప్పటివరకు తలపడిన ఒక్క జట్టు కూడా కనీసం మూడంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. వెస్టిండీస్ (44), మలేషియా (31), శ్రీలంక (58), బంగ్లాదేశ్ (64) జట్లు 70 పరుగుల లోపే తోకముడిచాయి. -
T20 World Cup 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-205లో భారత్ మరో విజయం సాధించింది. గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన టీమిండియా సూపర్-6లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (జనవరి 26) జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ సుమయ్యా అక్తెర్ 21 నాటౌట్, జన్నతుల్ మౌకా 14 పరుగులు చేశారు. భారత బౌలర్లందరూ చాలా పొదుపుగా బౌల్ చేశారు. వైష్ణవీ శర్మ 3, షబ్నమ్ షకీల్, విజే జోషిత్, గొంగడి త్రిష తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ గొంగడి త్రిష (31 బంతుల్లో 40; 8 సిక్సర్లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపుకు గట్టి పునాది వేసింది. జి కమలిని 3, సనికా ఛల్కే 11 (నాటౌట్), కెప్టెన్ నికీ ప్రసాద్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అనిస అక్తెర్ శోభా, హబిబా ఇస్లాం పింకీ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ సిక్స్‌లో భారత్ తదుపరి స్కాట్లాండ్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ జనవరి 28న జరుగనుంది. కాగా, సూపర్ సిక్స్‌లో భారత్ గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండిటిలోనూ విజయాలు సాధించింది. గ్రూప్-1లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, నైజీరియా, యూఎస్ఏ, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా టాపర్‌గా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, గ్రూప్-1లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ (శ్రీలంక, స్కాట్లాండ్) జరగాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది. -
అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియ జోరు
-
T20 World Cup 2025: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్‌లోకి ఎంట్రీ
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 23) జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేసింది. త్రిషతో పాటు భారత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నికీ ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), వీజే జోషిత (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జి కమలిని 5, సినిక ఛల్కే 0, భవిక అహిరే 7, ఆయుషి శుక్లా 5, పరునిక సిసోడియా ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. షబ్నమ్ షకీల్ (2), వైష్ణవి శర్మ (1) అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో ప్రముది మెత్సర, లిమాంస తిలకరత్న, అసెని తలగుణే తలో 2 వికెట్లు పడగొట్టగా... రష్మిక సేవండి, చమోది ప్రభోద, కెప్టెన్ మనుడి ననయక్కార తలో వికెట్ దక్కించుకున్నారు.119 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వైష్ణవి శర్మ (4-1-3-1), షబ్నమ్ షకీల్ (4-1-9-2), పరునిక సిసోడియా (4-0-7-2), విజే జోషిత (3-0-17-2), ఆయుషి శుక్లా (4-0-13-1) ధాటికి శ్రీలంక నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైష్ణవి శర్మ సంధించిన బంతులను ఎదుర్కోలేక లంక బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు. లంక ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (రష్మిక (15)) రెండంకెల స్కోర్ చేశారు. మిగతా 10 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ టోర్నీలో భారత్.. వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించి సూపర్-6లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగతా గ్రూప్‌ల విషయానికొస్తే.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, యూఎస్ఏ, ఐర్లాండ్.. గ్రూప్-సిలో సౌతాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్.. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్ రెండో విజయం సాధించింది. మలేసియాతో ఇవాళ (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియాను భారత బౌలర్లు 31 పరుగులకే (14.3 ఓవర్లలో) కుప్పకూల్చారు. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో (4-1-5-5) చెలరేగింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా (3.3-1-8-3) మూడు వికెట్లు తీసింది. వీజే జోషిత్ (2-1-5-1) ఓ వికెట్ పడగొట్టింది. HISTORY IN U-19 WORLD CUP 📢Vaishnavi Sharma becomes the first Indian bowler to take the Hat-trick in Women's U-19 WC history. pic.twitter.com/s9ziyvZjpm— Johns. (@CricCrazyJohns) January 21, 2025మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన 11 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధికం. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు 5 పరుగులు, ఇద్దరు 3 పరుగులు, ఒకరు 2, ఇద్దరు ఒక్క పరుగు చేశారు.అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 17 బంతుల్లోనే ఆట ముగించేసింది. ఓపెనర్లు గొంగడి త్రిష, జి కమలిని కళ్లు మూసి తెరిచే లోగా ఖేల్ ఖతం చేశారు. త్రిష పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి 12 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసింది. కమలిని 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో తిరుగులేని రన్‌రేట్‌తో (+9.148) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో భారత్ సహా శ్రీలంక (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో రెండో స్థానం), వెస్టిండీస్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో మూడో స్థానం), మలేసియా (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో నాలుగో స్థానం) జట్లు ఉన్నాయి.కాగా, భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు చెలరేగి వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలనే ఛేదించింది. గొంగడి త్రిష 4 పరుగులకే ఔటైనా.. కమలిని (16 నాటౌట్), సనికా ఛల్కే (18 నాటౌట్) భారత్‌ను గెలుపు తీరాలు దాటించారు. అంతకుముందు భారత బౌలర్లు పరుణిక సిసోడియా (2.2-0-7-3), ఆయూషి శుక్లా (4-1-6-2), వీజే జోషిత్ (2-0-5-2) విజృంభించడంతో వెస్టిండీస్ 44 పరుగులకే ఆలౌటైంది. -
10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం
అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికా జట్టు 10 అంటే 10 బంతుల్లోనే మ్యాచ్ ముగించేసింది. ఇన్నింగ్స్ బ్రేక్‌కు వెళ్లొచ్చేలోగా ఖేల్ ఖతమైంది. గ్రూప్ ‘సి’లో భాగంగా సమోవా జట్టుతో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సమోవా 9.1 ఓవర్లలో 16 పరుగులకే కుప్పకూలింది.సమోవా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. నాలుగు ఒకట్లు (1), రెండు మూడులు (3 పరుగులు) నమోదయ్యాయి. ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 6 పరుగులే సమోవా తరఫున అత్యధిక స్కోర్‌గా ఉంది. సమోవా బ్యాటర్లు చేసిన పరుగులకంటే సఫారీ బౌలర్లు తీసిన వికెట్లే అంకెల్లో టాప్‌గా ఉన్నాయి. ఎన్‌తబిసెంగ్ నిని 3, ఫే కొలింగ్, కేలా రేనెకె, శేషిని నాయుడు తలో 2 వికెట్లు తీశారు.అనంతరం దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఇద్దరే... పలువురు ప్రేక్షకులు బ్రేక్‌కు వెళ్లొచ్చే లోగా 10 బంతుల్లో 17 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. ఓపెనర్లు సిమోన్ లారెన్స్ (6 నాటౌట్), జెమ్మా బోతా (6 నాటౌట్) 1.4 ఓవర్లలోనే మ్యాచ్‌నే ముగించారు. పెను సంచలనంనిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. న్యూజిలాండ్‌పై నైజీరియా 2 పరుగుల తేడాతో గెలుపొందింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది. -
పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-2025లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. ఇవాళ (జనవరి 20) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో నైజీరియా న్యూజిలాండ్‌పై 2 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైజీరియా తరఫున కెప్టెన్ లక్కీ పెటీ (22 బంతుల్లో 18; ఫోర్, సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ లిల్లియన్ ఉడే (25 బంతుల్లో 19; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో నంబర్ బ్యాటర్ ఒమోసిగో ఎగువాకున్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించింది. నైజీరియా ఇన్నింగ్స్ మొత్తంలో 4 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి. న్యూజిలాండ్ తరఫున బౌలింగ్ చేసిన ఆరుగురిలో ఐదుగురు తలో వికెట్ తీశారు.అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పసికూన నైజీరియా విజయవంతంగా కాపాడుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయినా, ఆతర్వాత నిలదొక్కుకున్నట్లు కనిపించింది. ఆ జట్టుకు చెందిన ముగ్గరు మిడిలార్డర్ బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ముగ్గురు ఔట్ కావడంతో న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. నైజీరియా బౌలర్ లిల్లియన్ ఉడే అద్భుతంగా బౌల్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో నైజీరియా సంచలన విజయం నమోదు చేసింది. బ్యాట్‌తో రాణించిన నైజీరియా కెప్టెన్ బంతితోనూ పర్వాలేదనిపించింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆమెకే దక్కింది. ఈ గెలుపుతో నైజీరియా గ్రూప్-సి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ గ్రూప్‌లో నైజీరియాతో పాటు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, సమోవా జట్లు ఉన్నాయి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ నిన్ననే బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం భారత బ్యాటర్లు 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
టి20 ప్రపంచకప్‌లో నేడు (జనవరి 19) భారత్, వెస్టిండీస్ మ్యాచ్
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు తొలి రోజు వర్షం ఆటంకం కలిగించింది. శనివారం మొత్తం 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... అందులో మూడింట మాత్రమే ఫలితం వచ్చింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో స్కాట్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 15.1 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేమీ బ్రే 1 పరుగే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎలెనార్ లరోసా 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ఆ్రస్టేలియా 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి గెలిచింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. మొదట నేపాల్ 18.2 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లాదేశ్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.గ్రూప్ ‘సి’లో భాగంగా దక్షిణాఫ్రికా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా... మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులకు పరిమితమైంది.పాకిస్తాన్, అమెరికా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్... నైజీరియా, సమోవా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా... ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు.మన అమ్మాయిలకు తొలి పరీక్ష డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్–19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ తొలి పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలవగా... ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టులో గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లోనూ భాగస్వాములు కావడం భారత జట్టుకు కలిసిరానుంది. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు టి20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ అమ్మాయిలు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనుకుంటున్నారు. -
యువ సమరం... నేడే ఆరంభం
రెండేళ్ల క్రితం నిర్వహించిన ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన యువ భారత్... ట్రోఫీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. మహిళల క్రికెట్‌కు మరింత తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి నేటి నుంచి తెరలేవనుండగా... రేపు జరగనున్న తొలి పోరులో వెస్టిండీస్‌తో యువ భారత్ తలపడనుంది. షఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి సీనియర్ స్థాయిలో ఆడిన ప్లేయర్లతో బరిలోకి దిగి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్... ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంటే... తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తహతహలాడుతున్నాయి. 2023 వరల్డ్‌కప్ జట్టులోనూ ఆడిన తెలుగు ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నమ్‌లపై ఈసారీ భారీ అంచనాలు ఉన్నాయి. మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరిగే ఆరు మ్యాచ్‌ల్లో స్కాటాండ్తో ఆస్ట్రేలియా (ఉదయం గం. 8 నుంచి); ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ (ఉదయం గం. 8 నుంచి); సమోవాతో నైజీరియా (ఉదయం గం. 8 నుంచి); నేపాల్‌తో బంగ్లాదేశ్ (ఉదయం గం. 8 నుంచి); అమెరికాతో పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి); దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ (మధ్యాహ్నం గం. 12 నుంచి) తలపడతాయి. కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ రెండో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌కు శనివారం తెరలేవనుంది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి వరల్డ్‌కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ట్రోఫీ కైవసం చేసుకోగా... ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న యంగ్ ఇండియా టైటిల్ నిలబెట్టుకుంటుందా చూడాలి. ఫార్మాట్ ఎలా ఉందంటే... మొత్తం 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. వెస్టిండీస్, శ్రీలంక, ఆతిథ్య మలేసియాతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. ఒక్కో గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు (12) ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకుంటాయి. ఈ 12 జట్లను ‘సూపర్ సిక్స్’లో రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్–1లో ఆరు జట్లు... గ్రూప్–2లో మరో ఆరు జట్లు ఉంటాయి. ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్–1, గ్రూప్–2లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సీనియర్ జట్టులోకి దారి... సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్లేయర్లు ఈ టోర్నీలో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. గత ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలిచిన షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా... ఈసారి కూడా అదే ఆధిపత్యం కనబర్చాలని చూస్తోంది. 2023 అండర్–19 ప్రపంచకప్‌లో రాణించడం ద్వారా టిటాస్ సాధు, శ్వేత సెహ్రావత్... ఆ తర్వాతి కాలంలో భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే బాటలో పయనించి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది భారత్‌లో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని యంగ్ ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు. త్రిష రెండోసారి... గత ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. గత నెల మహిళల అండర్–19 ఆసియాకప్‌లో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన త్రిష... ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేసి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతోంది. శనివారం స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా... ఆదివారం జరగనున్న తమ తొలి పోరులో వెస్టిండీస్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. సమోవా, నైజీరియా, నేపాల్, మలేసియా జట్లు తొలిసారి ఐసీసీ టోర్నీలో ఆడనున్నాయి. ఈ టోర్నీలో ప్రధానంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి యంగ్ ఇండియాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఆసియాకప్ నెగ్గి మంచి జోరుమీదున్న అమ్మాయిలు కలసి కట్టుగా కదంతొక్కితే టైటిల్ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత మహిళల అండర్–19 టి20 క్రికెట్ జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సానిక చల్కె, త్రిష, కమలిని, భవిక అహిరె, ఐశ్వరి అవసారె, మిథిలా, జోషిత, సోనమ్, పరుణిక, కేసరి ధ్రుతి, ఆయుషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి. -
టి20 ప్రపంచకప్.. టీమిండియా ఘన విజయం
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వార్మప్ మ్యాచ్‌లో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన ఈ సన్నాహక పోరులో భారత్ ఏకంగా 119 పరుగుల భారీ తేడాతో స్కాట్లాండ్పై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కమలిని (23 బంతుల్లో 32) టాప్‌స్కోరర్ కాగా, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (26), కెప్టెన్ నికీ ప్రసాద్ (25) సనిక చల్కే (17) సహచరులకూ బ్యాటింగ్ ప్రాక్టీస్ అవకాశమిచ్చేందుకు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు.ప్రత్యర్థి బౌలర్లలో అమీ బల్డీ (2/13) కాస్త ప్రభావం చూపింది. 3 ఓవర్లు వేసిన ఆమె 13 పరుగులే ఇచి్చంది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ను భారత బౌలర్లు 18.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌట్ చేశారు. వైజాగ్‌కు చెందిన షబ్నమ్ షకీల్, వైష్ణవి శర్మ, సోనమ్ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు.సోమవారం జరిగిన మిగతా వార్మప్ మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా 140 పరుగుల తేడాతో ఆతిథ్య మలేసియాను ఓడించగా, వెస్టిండీస్ 9 పరుగుల తేడాతో నేపాల్‌పై గట్టెక్కింది. అమెరికా జట్టు 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌కు షాక్ ఇచి్చంది. బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందగా, ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో సమోవాపై ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్ 11 పరుగులతో నైజీరియాను ఓడించింది.ప్రధాన టోర్నీ ఈనెల 18 నుంచి జరుగుతుంది. అయితే భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం వెస్టిండీస్‌తో ఆడుతుంది. రెండేళ్ల క్రితం 2023లో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నిర్వహించిన మహిళల అండర్–19 మెగా ఈవెంట్లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది. -
భారత్‌లో మహిళల అంధుల టీ20 ప్రపంచకప్.. పాక్ మ్యాచ్‌లు నేపాల్‌లో!
మహిళల విభాగంలో తొలిసారిగా భారత్ అంధుల టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. భారత్‌లో ఆడేందుకు మహిళల పాకిస్తాన్ అంధుల జట్టుకు ఏమైనా వీసా సమస్యలు వస్తే... నేపాల్ లేదంటే శ్రీలంకలో వారి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) తమ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయించింది.ముల్తాన్‌లో సమావేశంముల్తాన్లో జరిగిన ఈ ఏజీఎంలో 11 సభ్య దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ బోర్డుల ప్రతినిధులు వర్చువల్ (ఆన్లైన్)గా పాల్గొన్నారు. పురుషుల విభాగంలో అంధుల టీ20 ప్రపంచకప్‌ను 2027లో నిర్వహించనున్నారు. ఇక వేదిక, తేదీలను వచ్చే ఏడాది జరిగే ఏజీఎమ్‌లో ఖరారు చేస్తారు. గతేడాదే ఆతిథ్య హక్కుల్ని భారత్‌కు కట్టబెట్టారని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ) అధ్యక్షుడు జీకే మహంతేశ్ తెలిపారు.ఖర్చులన్నీ భారత బోర్డు భరిస్తుందిఅయితే, తటస్థ వేదికపై పాక్ ఆడితే ఇందుకు సంబంధించిన ఖర్చులన్నీ భారత బోర్డు భరిస్తుందని ఆయన వెల్లడించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు సీఏబీఐ అనుబంధ సంఘం కాదు. ఇది పూర్తిగా ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) గొడుగుకింద పనిచేస్తుంది.ప్రపంచం చాంపియన్‌గా తొలిసారి పాక్ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై పురుషుల అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2024 టైటిల్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా డిఫెండింగ్ చాంపియన్ భారత్ పాక్ పర్యటనకు వెళ్లలేదు. పాకిస్తాన్‌కు ఇది సానుకూలాంశంగా మారింది. ఈ క్రమంలో ముల్తాన్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాక్ కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఇప్పటికి నాలుగు సార్లు ఈ టోర్నీని నిర్వహించగా మూడుసార్లు భారత్ ట్రోఫీని గెలుచుకుంది. తొలి రెండు ప్రయత్నాల్లో ఫైనల్లో పాక్‌ను, ఆఖరిగా బంగ్లాను ఓడించి విజేతగా నిలిచింది. -
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా పాకిస్తాన్
పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన ఫైనల్లో పాక్ బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ముల్తాన్ (పాకిస్తాన్) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆరిఫ్ హుస్సేన్ (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో బాబర్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ సల్మాన్, మతివుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. కేవలం 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ నిసార్ అలీ అజేయమై అర్ద సెంచరీతో (72) సత్తా చాటగా.. మరో ఓపెనర్ మొహమ్మద్ సఫ్దార్ అజేయమైన 47 పరుగులు చేసి తన జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 12 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పాక్ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. ఈ టోర్నీ జరిగిన మూడు ఎడిషన్లలో (2012, 2017, 2022) టీమిండియా విజేతగా నిలిచింది.టోర్నీ తొలి ఎడిషన్ ఫైనల్లో పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో ఎడిషన్ ఫైనల్లోనూ పాక్‌పై 9 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 2022 ఎడిషన్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించి హ్యాట్రిక్ టైటిళ్లు సొంతం చేసుకుంది. ఎట్టకేలకు పాక్ నాలుగో ప్రయత్నంలో సొంతగడ్డపై టైటిల్ సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్ పాల్గొనలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం టీమిండియాను పాక్‌కు పంపలేదు. -
అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్.. కేవలం 7 పరుగులకే ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదైంది. టీ20 వరల్డ్‌కప్ 2026 ఆఫ్రికా సబ్ రీజియనల్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ కేవలం 7 పరుగులకే ఆలౌటైంది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్. దీనికి ముందు టీ20 అత్యల్ప స్కోర్ రికార్డు ఐసిల్ ఆఫ్ మ్యాచ్, మంగోలియా జట్ల పేరిట ఉండేది. ఈ రెండు జట్లు గతంలో 10 పరుగులకే ఆలౌటయ్యాయి.నైజీరియా-ఐవరీ కోస్ట్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. వికెట్‌కీపర్ సెలిమ్ సలౌ విధ్వంసకర శతకం (53 బంతుల్లో 112 రిటైర్డ్ ఔట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది నైజీరియా భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. నైజీరియా ఇన్నింగ్స్‌లో ఐసక్ ఓక్పే (23 బంతుల్లో 65 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సులేమాన్ (29 బంతుల్లో 50; 8 ఫోర్లు) మెరుపు అర్ద శతకాలు బాదారు. ఐవరీ కోస్ట్ బౌలర్లలో పంబా దిమిత్రి, విల్ఫ్రైడ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐవరీ కోస్ట్.. 7.3 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా నైజీరియా 264 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఐవరీ కోస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్లు కాగా.. ముగ్గురు బ్యాటర్లు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్ మొహమ్మద్ చేసిన నాలుగు పరుగులే టాప్ స్కోర్‌గా నిలిచాయి. ఈ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. -
T20 WC: పాకిస్తాన్ పర్యటనకు అనుమతించిన క్రీడా మంత్రిత్వ శాఖ!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా వేదిక విషయంలో ఇంత వరకు స్పష్టత రాలేదు. ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. తమ జట్టును అక్కడికి పంపేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కరాఖండిగా చెప్పేసింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.సౌతాఫ్రికాలో టోర్నీని నిర్వహించాలనే ఆలోచన!ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి చెప్పిన ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానాన్ని సూచించింది. అయితే, ఇందుకు పీసీబీ ససేమిరా అంటున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ నుంచి మొత్తంగా వేదికను తరలించి.. సౌతాఫ్రికాలో టోర్నీని నిర్వహించాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆ జట్టుకు గ్రీన్ సిగ్నల్ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత క్రికెట్ జట్టు ఒకటి పాకిస్తాన్లో పర్యటించేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చిందనే వార్త ఆసక్తికరంగా మారింది. నవంబరు 23- డిసెంబరు 3 వరకు పాక్ వేదికగా అంధుల టీ20 మెన్స్ వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు క్రీడా శాఖ భారత జట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. నిరభ్యంతర పత్రాన్ని(NOC) జారీ చేసినట్లు స్పోర్ట్స్ తక్ కథనం వెల్లడించింది.క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(CABI) ఈ విషయాన్ని తమకు తెలిపినట్లు పేర్కొంది. అయితే, క్రీడా శాఖ నుంచి భారత జట్టుకు అనుమతి లభించినా.. తదుపరి హోం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది.తొలిసారిగా పాక్ ఆతిథ్యం ఈ విషయం గురించి CABI జనరల్ సెక్రటరీ శైలేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘పదిహేను రోజులుగా క్లియరెన్స్ కోసం మేము ఎదురుచూస్తున్నాము. ప్రభుత్వం అంతిమంగా ఏది చెప్తే అదే చేస్తాం. 2014లో చివరిసారిగా మేము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాము. అక్కడ ద్వైపాక్షిక సిరీస్ ఆడాము.అయితే, 2018 నుంచి ప్రభుత్వం మాకు క్లియరెన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అదే విధంగా.. 2023లో భారత్‌లో టోర్నీ జరిగినపుడు పాక్ జట్టు పాల్గొనలేదు’’ అని పేర్కొన్నారు. కాగా అంధుల క్రికెట్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి తొలిసారిగా పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది.ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నేపాల్, అఫ్గనిస్తాన్ దేశాల జట్లు ఇందుకు అర్హత సాధించాయి. పాకిస్తాన్‌లోని లాహోర్, ముల్తాన్ వేదికగా జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనాలంటే భారత జట్టుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కాగా ఇప్పటి వరకు మూడుసార్లు(2012, 2017, 2022) జరిగిన ఈ టోర్నీలో భారత్ మూడుసార్లూ టైటిల్ గెలిచింది.చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్
-
మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ
దుబాయ్: యూఏఈలో త్వరలోనే జరగబోయే మహిళల టి20 ప్రపంచకప్ టికెట్ల విక్రయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రారంభించింది. కేవలం 5 యూఏఈ దిర్హామ్ (రూ. 114)లకే ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు 18 ఏళ్లలోపు వయసున్న బాలబాలికలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అందరు వెచి్చంచగలిగే స్థితిలో టికెట్లను అందుబాటు ధరలో ఉంచాం. ప్రారంభ టికెట్ ఐదు దిర్హామ్‌లకే కొనుగోలు చేయొచ్చు. అత్యధికంగా ప్రీమియం సీట్ల ధర 40 దిర్హామ్ (రూ. 910)లుగా ఉంది. ఒక వేదికపై ఒకే రోజు రెండు మ్యాచ్‌లుంటే ఒక టికెట్‌తోనే ఆ రెండు మ్యాచ్‌ల్ని వీక్షించవచ్చు’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఆఫ్లైన్లోనూ టికెట్లను విక్రయించేందుకు దుబాయ్, షార్జా క్రికెట్ స్టేడియాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. భారత్ సహా 10 దేశాల జట్లు పోటీపడే ఈ మెగా ఈవెంట్ వచ్చే నెల 3 నుంచి యూఏఈలోని రెండు వేదిక (దుబాయ్, షార్జా)ల్లో జరుగుతుంది. -
నేను హార్డ్ హిట్టర్‌ని.. వచ్చే వరల్డ్‌కప్‌లోనూ ఆడతా!
మరో రెండేళ్ల పాటు తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ అన్నాడు. మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్‌గా ఉన్నానని.. టీ20 ప్రపంచకప్-2026లోనూ తనను చూస్తారని పేర్కొన్నాడు. తమ కోచ్ డారెన్ సామీ తనను మరికొన్నాళ్లపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాల్సిందిగా కోరాడని.. అలాంటపుడు తానెలా జట్టుకు దూరమవుతానని ప్రశ్నించాడు.హార్డ్ హిట్టర్కాగా 2010లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన రసెల్.. టీ20 స్పెషలిస్టుగా గుర్తింపు పొందాడు. జాతీయ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొట్టిలీగ్లలో భాగమవుతూ హార్డ్ హిట్టర్‌గా పేరొందాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 82 టీ20లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 60 వికెట్లు తీయడంతో పాటు 1033 పరుగులు చేశాడు.విధ్వంసకర వీరుడుఇక ఐపీఎల్లో అయితే తనబ్యాటింగ్ తీరుతో విధ్వంసకర వీరుడిగా పేరొందిన ఆండ్రీ రసెల్ 126 మ్యాచ్‌లలో.. 2484 పరుగులు చేశాడు. ఇందులో 170 ఫోర్లు, 209 సిక్సర్లు ఉన్నాయి. ఇక మొత్తంగా 115 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడుఇక.. వెస్టిండీస్ తరఫున టీ20 ప్రపంచకప్-2012, 2016 ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడైన రసెల్.. చివరగా టీ20 వరల్డ్‌కప్-2024 సందర్భంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఐసీసీ టోర్నీలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆఖరిగా ఆడాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024తో బిజీగా ఉన్న రసెల్.. ట్రింబాగో నైట్ రైడర్స్‌కు ఆడుతున్నాడు.ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో 207కు పైగా స్ట్రైక్‌రేటుతో 56 పరుగులు రాబట్టిన రసెల్.. కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ త్వరలోనే శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని 36 ఏళ్ల రసెల్ స్పష్టం చేశాడు.బంతిని బాదగల సత్తా నాకు ఉందిఇండియా టు డేతో మాట్లాడుతూ.. ‘‘2026 వరల్డ్‌కప్‌లో నేను కచ్చితంగా ఆడతాను. ఎందుకంటే నాలో క్రికెట్ ఆడగల సత్తా ఇంకా మిగిలే ఉందని మీకు కూడా తెలుసు. నేను ఇప్పటికే అంతర్జాతీయక్రికెట్ నుంచి తప్పుకొని ఉండవచ్చు. అలా చేస్తే యువ ఆల్రౌండర్లకు అవకాశాలు రావచ్చు.అయితే, నేను ఇప్పటికీ బంతిని అనుకున్న చోటకు బాదగలను. అద్భుతమైన పేస్‌తో బౌలింగ్ చేయగలను. ఇంకా ఫిట్‌గానే ఉన్నాను. కాబట్టి ఇక్కడితో ఎందుకు ఆగిపోవాలి’’ అంటూ రసెల్ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. తమ కోచ్ ఈ విషయం గురించి తనతో చర్చించాడని.. మరికొన్నాళ్లపాటు విండీస్‌కు ఆడతానని తెలిపాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ డ్రాప్ చేశా.. నా కెరీర్ అంతటితో ఖతం! -
టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
యూఏఈ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలైసా హీలీ ఎంపిక కాగా.. వైస్ కెప్టెన్‌గా తహిల మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. సీనియర్ స్పిన్నర్ జెస్ జొనాస్సెన్ను పక్కన పెట్టిన ఆసీస్ సెలెక్టర్లు.. పేస్ బౌలర్ తైలా వ్లేమింక్కు చోటు కల్పించారు. ఈసారి ప్రపంచకప్ బరిలో ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. సీనియర్లంతా అంతా జట్టుకు అందుబాటులో ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఈసారి కూడా టైటిల్ సాధించి, వరుసగా నాలుగు టీ20 వరల్డ్‌కప్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతుంది.టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు..అలైసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హ్యారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహిళ మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లిస్ పెర్రీ, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్, తైలా వ్లేమింక్కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్-బిలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్
మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 25) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఫాస్ట్ బౌలర్ ఫాతిమా సనా ఎంపికైంది. మాజీ కెప్టెన్ నిదా దార్ స్థానంలో ఫాతిమాను ఎంపిక చేశారు పాక్ సెలెక్టర్లు. 22 ఏళ్ల సనాకు గతంలో దేశవాలీ జట్లకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. సనా.. నిదా గైర్హాజరీలో అప్పుడప్పుడు పాక్ కెప్టెన్‌గానూ వ్యవహరించింది. 2023 డిసెంబర్లో జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో సనా నేతృత్వంలోని పాక్ థ్రిల్లింగ్ సూపర్ ఓవర్ విక్టరీ సాధించింది.త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ కోసం పాక్ సెలెక్టర్లు పెద్దగా మార్పులు చేయలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లోని జట్టునే యధాతథంగా కొనసాగించారు. 2024 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన వారిలో 2023 టీ20 వరల్డ్‌కప్ సభ్యులు 10 మంది ఉండటం విశేషం. అన్క్యాప్డ్ పేసర్ తస్మియ రుబాబ్ కొత్తగా జట్టులో చోటు దక్కించుకుంది. ఈ టోర్నీ కోసం పాక్ సెలెక్టర్లు ఓ ట్రావెలింగ్ రిజర్వ్, ఇద్దరు నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేశారు.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ ఇటీవలే బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ వేదికను మార్చింది. ఈ మెగా టోర్నీ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి 30వ తేదీ వరకు జరుగనుంది.పాకిస్థాన్ జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ (వికెట్ కీపర్), నష్రా సుంధు, నిదా దార్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్, తుబా హసన్ట్రావెలింగ్ రిజర్వ్: నజిహా అల్వీ (వికెట్ కీపర్)నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రమీన్ షమీమ్, ఉమ్-ఎ-హాని -
అలాంటి ఇన్నింగ్స్ నా కెరీర్లో చూడలేదు
-
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్-ఏ పోటీల్లో భాగంగా సమోవా దేశంతో జరిగిన మ్యాచ్‌లో వనుఅటు దేశ సీమర్ నలిన్ నిపికో ఒకే ఓవర్లో 39 పరుగులు సమర్పించుకున్నాడు. నిపికో బౌలింగ్‌లో సమోవా దేశ బ్యాటర్ డేరియస్ విస్సర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. నిపికో మూడు నో బాల్స్ వేశాడు. ఫలితంగా ఓ ఓవర్లో 39 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఇది సరికొత్త ప్రపంచ రికార్డు.2007 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, 2021లో శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ, 2024 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ టీ20 టోర్నీలో ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ ఒకే ఓవర్లో 36 పరుగులు (6 సిక్సర్లు) సమర్పించుకున్నారు. బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్, ధనంజయ బౌలింగ్‌లో కీరన్ పోలార్డ్, కమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్ ఎయిరీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల ఘనత సాధించారు.మొత్తం 14 సిక్సర్లు..నిపికో బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన డేరియస్ విస్సర్.. ఇన్నింగ్స్ మొత్తంలో ఏకంగా 14 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లో 132 పరుగులు చేసిన విస్సర్.. సమోవా దేశం తరఫున శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. -
ఆస్ట్రేలియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
సిడ్నీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... మహిళల టి20 ప్రపంచకప్ కోసం అక్కడికి వెళ్లడం సరికాదని ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ అభిప్రాయపడింది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న దేశంపై ఇది మరింత ఒత్తిడి కలిగిస్తుందని హీలీ వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ అస్థిరత హింసకు దారితీయగా... వందలాది మంది మృత్యువాత పడ్డారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడగా... మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 19 వరకు బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. మొత్తం 10 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో హీలీ మాట్లాడుతూ... ‘ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆడటం కష్టంగా ఉంది. నైతికంగా ఇది సరైంది కాదనిపిస్తోంది. టోర్నీ అక్కడే నిర్వహించాలా వద్దా అనే విషయం ఐసీసీ పరిధిలోకి వస్తుంది. మా వరకైతే టి20 వరల్డ్‌కప్ కోసం మెరుగ్గా సిద్ధమవుతున్నాం. టోర్నీ ఎక్కడ జరిగినా సత్తా చాటగలమనే నమ్మకం ఉంది’ అని పేర్కొంది. 2014 టి20 ప్రపంచకప్ తర్వాత.. ఇటీవలే ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా ఆడిన 3 వన్డేలు, మూడు టి20ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్‌లో టి20 వరల్డ్‌కప్ నిర్వహించాలా వద్దా అనే విషయంపై ఈరోజు ఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ వేదిక మార్చాలనుకుంటే మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిథ్య రేసులో ముందుంది. -
అండర్ 19 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల
మలేషియాలో జరగబోయే మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 18) ప్రకటించింది. ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. నాలుగు జట్లు ఓ గ్రూప్‌గా విభజించబడి పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.Here's the schedule for the ICC U19 Women's T20 World Cup 2025, which will take place in Malaysia.🏆𝐆𝐫𝐨𝐮𝐩 𝐀: India, West Indies, Sri Lanka, Malaysia𝐆𝐫𝐨𝐮𝐩 𝐁: England, Pakistan, Ireland, USA𝐆𝐫𝐨𝐮𝐩 𝐂: New Zealand, South Africa, Africa Qualifier, Samoa𝐆𝐫𝐨𝐮𝐩… pic.twitter.com/8Z690tEO3K— CricTracker (@Cricketracker) August 18, 2024భారత్ గ్రూప్-ఏలో వెస్టిండీస్, శ్రీలంక మలేషియాలతో పోటీపడనుంది. గ్రూప్-బిలో ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవా దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫయర్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. భారత్.. జనవరి 19న వెస్టిండీస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’
సంజూ శాంసన్.. ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌కు అంతర్జాతీయ క్రికెట్లో తగినన్ని అవకాశాలు రావడం లేదనేది అతడి అభిమానుల వాదన. ప్రతిభ ఉన్నా ఈ కేరళ ఆటగాడి పట్ల సెలక్టర్లు వివక్ష చూపుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి.అందుకు తగ్గట్లుగానే వన్డే ప్రపంచకప్-2023 సమయంలో మెరుగైన గణాంకాలున్న సంజూను కాదని.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు ఇచ్చారు. అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించారు. ఈ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోవడంతో జట్టు యాజమాన్యం విమర్శలపాలైంది. ఈ క్రమంలో ఐపీఎల్-2024 రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా సత్తా చాటిన సంజూ ఎట్టకేలకు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.అయితే, రిషభ్ పంత్ రూపంలో గట్టి పోటీ ఎదురుకావడంతో అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన సంజూకు.. తదుపరి శ్రీలంక టూర్‌కు వెళ్లబోయే జట్టులో చోటు దక్కుతుందో లేదోనన్నది ఆసక్తికరంగా మారింది. వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమేఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంజూ శాంసన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. శుభంకర్ మిశ్రా యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో అమిత్ మిశ్రా టీ20 ప్రపంచకప్-2026 జట్టులో సంజూకు చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు మరో వరల్డ్‌కప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే అతడికి వయసు మీద పడింది. టీ20 జట్టులో యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తామనే సంప్రదాయాన్ని విరాట్ కోహ్లి ప్రవేశపెట్టాడు.వాళ్లే బాగా ఆడతారని అతడి నమ్మకం. అయితే, తనకు 35 ఏళ్లు వచ్చినా కోహ్లి ఆడాడనుకోండి. అది వేరే విషయం. ఒకవేళ శాంసన్ గనుక టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే అత్యద్భుతంగా ఆడాలి.వారి నుంచి తీవ్రమైన పోటీఅలా అయితే, రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు దక్కుతుంది. లేదంటే కష్టమే. నిజానికి ఇషాన్ కిషన్ అత్యంత ప్రతిభ ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్.కానీ అతడిని టీ20ల నుంచి పక్కనపెట్టేశారు. ఇక రిషభ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అతడొక అత్యుత్తమ ప్లేయర్. ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ.. ఇలా వికెట్ కీపర్ల లిస్టు పెద్దగానే ఉంది. కాబట్టి సంజూ శ్రమించక తప్పదు’’ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.కాగా 29 ఏళ్ల సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడి 510 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 28 అంతర్జాతీయ టీ20లలో సంజూ 444 రన్స్ సాధించాడు. చదవండి: హార్దిక్ పాండ్యాకు షాక్!.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే! -
భారత జట్టును ఒక్క మాట అన్నా ఊరుకోం..
-
సిరాజ్‌కు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
-
సంద్రం.. జనసంద్రం
పొట్టి ఫార్మాట్లో 17 ఏళ్ల క్రితం ఆరంభించిన తొలి టి20 ప్రపంచకప్‌ను ధోని బృందం గెలుచుకొచ్చింది. దేశమంతా వరల్డ్‌కప్ విజయంతో పెద్ద పండగే చేసుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రోహిత్ శర్మ జట్టు రెండో టి20 ప్రపంచకప్‌ను తెచ్చి పెట్టింది. మరి అ‘ద్వితీయ’ చాంపియన్‌షిప్ సంబరాలు మామూలుగా ఉండవుగా! ఢిల్లీలో ప్రత్యేక విమానం ల్యాండ్ అవగానే గ్రాండ్‌గా మొదలైన సంబరాలు సాయంత్రం ముంబైలో మెరైన్‌డ్రైవ్‌ను ముంచెత్తాయి. రాత్రయ్యేసరికి వాంఖెడేలో ఆటగాళ్లకు రూ. 125 కోట్ల నజరానా, ఘన సన్మానంతో కనులవిందుగా ముగిసింది. న్యూఢిల్లీ/ముంబై: గత శనివారం టీమిండియా టి20 ప్రపంచకప్ గెలిచింది. యావత్ భారతం చిందేసింది. 17 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచకప్ గెలవడం... ఆ కప్ రాక ఆలస్యం కావడంతో దాని కోసం ఇన్నాళ్లూ వేచి చూసిన అభిమానగణం రాగానే ఊరుకుంటారా? ‘పూనకాలు లోడింగ్’ అని హోరెత్తించరు! అవును సరిగ్గా అదే చేశారు. అడుగడుగునా అ‘ద్వితీయ’ ప్రపంచకప్‌నకు అపూర్వ స్వాగతం పలికారు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానుల్లో కొందరు ‘త్రివర్ణ’ పతాకాలతో... మరికొందరు ‘కంగ్రాట్స్’ ప్లకార్డులతో ఆటగాళ్లను అభినందిస్తూ తెగ సందడి చేశారు. క్రికెట్‌కు మతమైన భారత్‌లో అభిమానులు కప్‌నకు, కప్ కార్యసాధకులకు అడుగడుగునా నీరాజనం పలికారు. ఉదయం ఢిల్లీలో ఆగమనంతో మొదలైనపుడు ఎంతటి జోష్ కనబడిందో... ముంబైలో ఘన సన్మానం పూర్తయ్యేసరికి రాత్రిదాకా అభిమానోత్సాహం అలాగే కొనసాగడం విశేషం! అభిమాన ప్రవాహం ప్రత్యేక విమానంలో 16 గంటల పాటు ఏకబిగిన 14 వేల కిలోమీటర్ల ప్రయాణం బహుశా ఇదే మొదటిసారేమో! ఎందుకంటే 14,000 వేల కి.మీ. అంటే సగం ప్రపంచాన్ని చుట్టేసే దూరమన్న మాట! ఇంత ప్రయాణ బడలిక ఎవరికైనా అసౌకర్యంగానే ఉంటుంది. వెంటనే తనువు–మనసు విశ్రాంతి కోరుతుంది. కానీ అభిమాన ప్రవాహం ముందు ఆటగాళ్లలో ఎలాంటి అలసటే కనిపించలేదు. కిక్కిరిసిన మెరైన్ డ్రైవ్ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక బస్‌లో బయలుదేరిన భారత క్రికెటర్లు నారీమన్ పాయింట్‌కు రాగానే ప్రత్యేకంగా ముస్తాబు చేసిన ఓపెన్ టాప్ బస్‌లో ఎక్కారు. మెరైన్ డ్రైవ్ తీరం వెంట సాగరం (అరేబియా సముద్రం) పక్కన సాగరం (ప్రేక్షకులతో) కనిపించింది. వానచినుకులు పడుతున్నా ఇసుకేస్తే రాలనంత జనం ఎక్కడికీ కదల్లేదు. తమ దేశానికి కప్ సాధించిపెట్టిన క్రికెటర్ల అభివాదాల కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూశారు తప్ప వెనక్కి తగ్గలేదు. ఓపెన్ టాప్ బస్‌లో ప్రపంచకప్‌తో ఉన్న ఆటగాళ్లను క్రికెట్ వీరాభిమానులంతా తమతమ ఫోన్ కెమెరాల్లో అదేపనిగా బంధించేపనిలో పడ్డారు. దారిపొడవునా సాగిన ఈ విజయోత్సవ ర్యాలీ మెరైన్ డ్రైవ్‌కే కొత్త శోభ తెచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కడే సమీపంలో ఉన్న వాంఖెడే స్టేడియంలో సీట్ల సామర్థ్యానికి సరిపడా అభిమానుల్ని అనుమతించగా, ప్రత్యేకంగా నీలిరంగులో ఏర్పాటు వేదికపై తెలుపు రంగులో ‘చాంపియన్స్’ అక్షరాలు ప్రముఖంగా కనిపించేలా తీర్చిదిద్దారు. కోహ్లి, రోహిత్, హార్దిక్ ఇతర సభ్యులందరూ డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రకటించిన నజరానాను ఒక్కొక్కరిగా కాకుండా టీమ్ సాధించిన విజయానికి సూచికగా రూ. 125 కోట్ల చెక్‌ను ఆటగాళ్లకు అందజేసి ఘనంగా సన్మానించారు. ఇక నిష్క్రమించే సమయంలో టీమిండియా ఆటగాళ్లంతా టెన్నిస్ బంతులపై ఆటోగ్రాఫ్ చేసి ప్రేక్షకుల గ్యాలరీ దిశగా కొట్టారు. జగజ్జేతలకు మోదీ జేజేలు కరీబియన్ గడ్డపై టి20 ప్రపంచకప్ సాధించిన భారత క్రికెటర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయ ఆతిథ్యమిచ్చారు. ఉదయం అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని ప్రతి ఒక్క క్రికెటర్ కప్ కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ ఇద్దరు కలిసి మోదీ చేతిలో ప్రపంచకప్‌ను పెట్టారు. ఇరువైపులా జట్టు సభ్యులంతా నిల్చొని ఫొటోకు ఫోజిచ్చారు. ‘చాంపియన్స్‌తో జరిగిన ఈ మీటింగ్ చాలా అద్భుతంగా గడిచింది. వారికి ఇచ్చిన ఆతిథ్యం ఎంతో ఆనందాన్ని పంచింది. కప్ వేటలో వాళ్లు పడిన పాట్లు, చేసిన పోరాటాలు.మొత్తం టోర్నీ జర్నీపై వారు నాతో పంచుకున్న అనుభవాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నా మదిలో పదిలంగా ఉంటాయి’ అని మోదీ ‘ఎక్స్’లో ఫొటోలను జతచేసి ట్వీట్ చేశారు. క్రికెటర్లతో పాటు ప్రధానిని కలిసిన బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షా ఈ సందర్భంగా మోదీకి ‘నమో’ పేరిట నం.1 జెర్సీని అందజేశారు. ఇంతటి జనసందోహం చూస్తుంటే మాలాగే ఈ ప్రపంచకప్ కోసం వాళ్లు ఎంతగా ఆరాటపడ్డారో... టీమిండియా గెలవాలని ఎంత బలంగా కోరుకున్నారో అర్థమవుతోంది. –కెప్టెన్ రోహిత్ శర్మ కిక్కిరిసిన రోడ్లపై ఈ రాత్రి మీరు కురిపించిన ప్రేమాభిమానాల్ని ఇకపై మిస్ అవుతాను. ఈ అనిర్వచనీయ ఆనందాన్ని నేనెప్పటికీ మరచిపోను. –కోచ్ రాహుల్ ద్రవిడ్ 2011లో వన్డే ప్రపంచకప్ నెగ్గినపుడు సీనియర్లు వెలిబుచ్చిన భావోద్వేగాలకు, కన్నీళ్లకు నేను చలించలేదు. కానీ ఇప్పుడు అవే... నన్ను నేను అదుపు చేసుకోలేనంతగా బయటికి వస్తున్నాయి. –విరాట్ కోహ్లి -
జనసంద్రలా ముంబై తీరం.. విశ్వవిజేతల విక్టరీ పరేడ్ (ఫోటోలు)
-
జగజ్జేతల ఆగమనం
ఇక్కడేమో అభిమానులు... అక్కడేమో ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లు... ఎన్నాళ్లీ నిరీక్షణ, ఎందుకీ పరీక్ష అని చూసే ఎదురుచూపులకు నేడు తెర పడనుంది. ప్రతికూల వాతావరణంతో బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయిన టి20 వరల్డ్ చాంపియన్ భారత జట్టు గురువారం తెల్లవారగానే న్యూఢిల్లీకి చేరుకుంటుంది. వీరికి ఘనస్వాగతం పలికేందుకు బోర్డుతో పాటు వీరాభిమానులు తెగ ఆరాటం కనబరుస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సంబరాల్లో మునిగితేలనున్నాయి. ముంబై: టి20 ప్రపంచకప్‌ను జయించిన భారత క్రికెట్ జట్టు సభ్యులు కాస్త ఆలస్యంగా నేడు స్వదేశానికి చేరుకుంటున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఎయిరిండియా సమన్వయంతో చార్టెర్డ్ ఫ్లయిట్లో చాంపియన్లు, జట్టు సహాయక సిబ్బంది, బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షాలతో పాటు భారత్‌కు చెందిన మీడియా ప్రతినిధులు బార్బడోస్‌లోని గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం బయలుదేరారు.ఫ్లయిట్ షెడ్యూల్ టైమ్ ప్రకారం గురువారం ఉదయం గం. 6:20 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. కాసేపు ఆటగాళ్లు ప్రయాణ బడలిక నుంచి సేదతీరాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో 6 గంటలకు ఫ్లయిట్ ల్యాండ్ అవుతుంది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆటగాళ్లు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో భేటీ అవుతారు. ఇదివరకే విజేత సభ్యులను సోషల్ మీడియా ద్వారా, ఫోన్లో అభినందించిన ప్రధాని కాసేపు క్రికెటర్లతో గడుపుతారు’ అని బోర్డు సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ భేటీ ముగిసిన వెంటనే మరో ప్రత్యేక విమానంలో టీమిండియా ముంబైకి పయనమవుతుంది. ముంబైలోనే బోర్డు అంబరాన్నంటే సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడికి చేరుకోగానే ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలు ఘనస్వాగతం పలుకుతాయి. ‘సాయంత్రం 5 గంటలకు నారీమన్ పాయింట్ వద్ద ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓపెన్ టాప్ బస్‌లో క్రికెటర్ల రోడ్‌షో మొదలవుతుంది. అక్కడి నుంచి విఖ్యాత వాంఖెడే స్టేడియం వరకు సుమారు రెండు గంటలపాటు సాగే ఈ షోలో అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతారు. రాత్రి 7 గంటల సమయంలో స్టేడియంలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని ఒక్కోక్కరిగా ఘనంగా సన్మానిస్తారు. బోర్డు ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని కూడా అందజేస్తారు’ అని శుక్లా పూర్తి బిజీ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ విక్టరీ పరేడ్‌లో అభిమానులంతా పాల్గొనాల్సిందిగా బోర్డు కార్యదర్శి జై షా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రోడ్ షో 17 ఏళ్ల క్రితం తొలి టి20 ప్రపంచకప్ గెలిచిన ధోని బృందానికి నిర్వహించారు. కానీ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన అదే ధోని సేనకు ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉండటంతో రోడ్ షోను నిర్వహించలేదు. న్యూయార్క్ టు న్యూఢిల్లీ.. వయా బార్బడోస్ గత నెల 29న రోహిత్ శర్మ బృందం టి20 వరల్డ్‌కప్ గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి లేదంటే సోమవారం ఉదయానికల్లా జగజ్జేతలు భారత్‌కు రావాలి. కానీ కరీబియన్‌లో భీకరమైన హరికేన్ తుఫాన్ వల్ల బార్బడోస్ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా అక్కడే ఇరుక్కుపోయారు. ఎట్టకేలకు కరీబియన్‌లో టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యులు కప్‌తో వచ్చేస్తున్నారు. ఎయిరిండియా చొరవ, న్యూయార్క్‌లోని ప్రయాణీకుల సహకారంతో దారి మళ్లించిన విమానంలో టీమిండియా క్రికెటర్లు, మీడియా సంస్థల ప్రతినిధులు గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంటారు. అయితే వాతావరణ పరిస్థితిలో మార్పురావడంతో న్యూయార్క్ (అమెరికా) నుంచి న్యూఢిల్లీకి ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానాన్ని వయా బార్బడోస్ మీదుగా దారి మళ్లించారు. ఈ విమానం కోసం టికెట్లు బుక్ చేసుకున్న సాధారణ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చి అసౌకర్యం కలుగకుండా చూశారు. ఇంకొందరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక విజేతల కోసం ‘ఏఐసీ24డబ్ల్యూసీ’ (ఎయిరిండియా చాంపియన్స్ 24 ప్రపంచకప్) పేరిట ఈ విమానాన్ని ముస్తాబుచేసి బార్బడోస్‌లో క్రికెటర్లను ఎక్కించుకొని బుధవారం బయలుదేరింది. అయితే నిర్ణీత రూట్ కాకుండా మరో రూట్ మారడంపై డీజీసీఏ (విమానయాన నియంత్రణ సంస్థ) ఎయిరిండియాను నివేదిక కోరింది. -
భారత్, శ్రీలంకల వేదికగా టీ20 వరల్డ్‌కప్ 2026..
దాదాపు నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉరుత్రూలూగించిన టీ20 వరల్డ్‌కప్-2024 ఘనంగా ముగిసింది. జూన్ 29న బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డ్ పడింది.తుది పోరులో విజయం సాధించిన భారత్.. ఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ వరల్డ్‌కప్ విజయంతో 13 ఏళ్ల భారత అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఇక వరల్డ్‌కప్ ముగిసి వారం రోజుల తిరగకుముందే టీ20 వరల్డ్‌కప్-2026కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. టీ20 వరల్డ్‌కప్-2026 భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్నట్లు ఐసీసీ తెలిపింది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్ కప్‌లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.ఇక వచ్చే పొట్టి వరల్డ్‌కప్‌కు 12 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంక, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాలు నేరుగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి. సూపర్-8కు అర్హత సాధించిన అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, అమెరికా వచ్చే ప్రపంచ కప్‌నకు క్వాలిఫై అయ్యాయి. అదే విధంగా ఈ ఏడాది జూన్ 30 నాటికి ఐసీసీ టీ20 ర్యాంక్స్ ఆధారంగా మరో మూడుజట్లు ఈ మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. అంటే న్యూజిలాండ్ (6వ ర్యాంకు), పాకిస్తాన్ (7వ ర్యాంకు), ఐర్లాండ్ (11వ ర్యాంక్) వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్నాయి. మిగితా 8 జట్లు క్వాలిఫియర్స్ ఆడి అర్హత సాధించనున్నాయి. -
17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో తొలి జట్టుగా టీమిండియా
నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది. 17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో భారత్‌తో (2007, 2024) పాటు వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లండ్ (2010, 2022) మాత్రమే రెండేసి సార్లు టైటిల్స్ సాధించాయి. ఈ వరల్డ్‌కప్ విజయంతో భారత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఈ ప్రపంచకప్‌లో అజేయ జట్టుగా నిలిచిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా (సింగిల్ ఎడిషన్) టైటిల్ సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ జట్టు అజేయంగా టీ20 ప్రపంచకప్ గెలవలేదు.కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం భారత ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. తొలుత భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఆనంద బాష్పాలు కార్చిన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని సంబురాలు చేసుకున్నారు.11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ, 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్, 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ గెలవడంతో యావత్ భారతావణి పులకించిపొయింది. ఊరు వాడా విజయోత్సవ సంబురాలు జరిగాయి. టీమిండియా కృష్ణార్జునులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచి టీ20 ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలకగా.. భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్‌కప్ విక్టరీతో ముగిసింది. భారత క్రికెట్ అభిమానులు ఓ పక్క టీమిండియా విజయాన్ని ఆస్వాధిస్తూనే.. మరోపక్క దిగ్గజాల రిటైర్మెంట్ ప్రకటనను తలచుకుంటూ కుమిలిపోయారు. మొత్తంగా నిన్నటి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. -
వరల్డ్ కప్ విక్టరీ.. టీమిండియాకు టాలీవుడ్ తారల విషెస్!
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 2007 తర్వాత పొట్టి ఫార్మాట్లో మరోసారి జగజ్జేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచకప్‌ను ముద్దాడింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వరల్డ్ కప్ గెలిచిన వేళ టాలీవుడ్ సినీతారలు సైతం మన జట్టుకు అభినందనలు తెలిపారు.దర్శకధీరుడు రాజమౌళి విన్నింగ్ మూమెంట్ ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను హత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ అద్భుతమైన విజయాన్ని గుర్తుండిపోయేలా చేసిన టీమిండియాకు, రోహిత్ శర్మకు నా ప్రత్యేక అభినందనలు అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందలు తెలిపారు.🥹🥹🥹 pic.twitter.com/UMojgkRs2U— rajamouli ss (@ssrajamouli) June 29, 2024 Incredible win for Team India! 🇮🇳 Well done, team! Hurrah for @Jaspritbumrah93 👍🏼 and outstanding performances by @imVkohli and @hardikpandya7 ! Kudos to our captain @ImRo45 and all the people behind the scenes for making this win so memorable.#TeamIndia #T20WorldCup #INDvSA…— Ram Charan (@AlwaysRamCharan) June 29, 2024పొట్టి ప్రపంచకప్ గెలిచిన వేళ సూపర్ స్టార్ మహేశ్‌బాబు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ రోజు మనదే.. హీరోస్-ఇన్-బ్లూ.. కొత్త ప్రపంచ ఛాంపియన్స్.. సూర్యకుమార్ క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. జై హింద్' అంటూ పోస్ట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు నా అభినందనలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. Congratulations to the Indian Cricket team on winning the T20 World Cup 🇮🇳— Allu Arjun (@alluarjun) June 29, 2024 It's ours!! 🏆 The Heroes-in-Blue are the new 'World Champions'! Take a bow #TeamIndia for your relentless efforts on the field today! @surya_14kumar, your catch will be etched in history… what a stunner 😍😍😍 Super proud of this historic win. Jai Hind! 🇮🇳 #T20WorldCup… pic.twitter.com/7EI1oQ2ngw— Mahesh Babu (@urstrulyMahesh) June 29, 2024 -
మీరు జీవితకాల ప్రేమ పొందారు: యూపీ పోలీసు వినూత్న ట్వీట్
లక్నో: భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 7 ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడిచింది. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టీ20 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలో రెండో టీ20 ప్రపంచ కప్‌ను అందుకుంది. భారత్ టీ 20 ప్రపంచం కప్ సాధించటంతో ప్రధాని మోదీ నుంచి మొదలు.. సెలబ్రిటీలు అంతా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా భారత జట్టుకు అభినందనలు తెలిపారు. యూపీ పోలీసులు.. తమ ‘ఎక్స్’అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు.‘బ్రేకింగ్ న్యూస్.. భారత జట్టు బౌలర్లు దక్షిణాఫ్రికా హృదయాలను బద్దలు కొట్టడంలో దోషులుగా మిగిలారు. అలాగే భారత్‌లోని బిలియన్ క్రికెట్ అభిమానుల నుంచి జీవితకాల ప్రేమను పొందారు!’ అని పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సరిగా చెప్పారు. భారత జట్టు బిలయన్ అభిమాను జీవితం కాలం పొందారు’అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 𝑩𝒓𝒆𝒂𝒌𝒊𝒏𝒈 𝑵𝒆𝒘𝒔: Indian bowlers found guilty of breaking South African hearts.𝑺𝒆𝒏𝒕𝒆𝒏𝒄𝒆: Lifelong love from a billion fans! ❤️🏏 #INDvSAFinal#T20WorldCupFinal pic.twitter.com/UPaCzgf6vm— UP POLICE (@Uppolice) June 29, 2024 -
టీమిండియా విక్టరీ.. పూనకంతో ఊగిపోయిన టాలీవుడ్ హీరో!
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. బార్బడోస్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ప్రపంచకప్ విన్నింగ్ మూమెంట్‌ను ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలిపారు.అయితే సినీతారలు సైతం విన్నింగ్ మూమెంట్ తనదైన స్టెల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా పూనకంతో ఊగిపోయారు. చివరి ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేస్తుండగా.. వరల్డ్ కప్ మనదే అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు విష్ణు ట్విటర్లో పంచుకున్నారు. మ్యాచ్ ఓవర్ అంటూ విష్ణు సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు పలువురు అగ్రతారలు కనిపించనున్నారు. ఇటీవలే కన్నప్ప టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. Yahooooo! India! India! ❤️❤️❤️❤️ @ImRo45 🙏@imVkohli 🙏 What a memorable night @PDdancing anna ❤️❤️❤️ pic.twitter.com/k8q7WlmroL— Vishnu Manchu (@iVishnuManchu) June 29, 2024 -
T20 World Cup 2024: కసితీరా కప్ కొట్టారు.. టి20 విశ్వ విజేత భారత్
ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు... టైటిల్ వేటలో దక్షిణాఫ్రికా వేగంగా దూసుకుపోతోంది... 30 బంతుల్లో 30 పరుగులు, చేతిలో 6 వికెట్లతో సునాయాసంగా గెలిచే స్థితిలో నిలిచింది. తర్వాత ఓవర్లో బుమ్రా 4 పరుగులే ఇవ్వగా సమీకరణం 24 బంతుల్లో 26 పరుగులుగా మారింది. క్లాసెన్, మిల్లర్‌లాంటి హిట్టర్లు ఉండటంతో భారత్ ఆశలు కోల్పోయింది. కానీ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లో మ్యాజిక్ మొదలైంది. తొలి బంతికే క్లాసెన్ వెనుదిరగ్గా... 18 బంతుల్లో 10 పరుగులే వచ్చాయి. కథ క్లైమాక్స్‌కు చేరింది. 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. మిల్లర్ ఉండటంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. కానీ పాండ్యా వేసిన తొలి బంతికే బౌండరీ వద్ద సూర్యకుమార్ అత్యద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అంతే... తర్వాతి ఐదు బంతులు లాంఛనమే అయ్యాయి... భారత్ప్రపంచ విజేతగా హోరెత్తే సంబరాల్లో మునిగిపోయింది. ఎన్నాళ్లయింది భారత క్రికెటర్లలో ఈ ఆనందాన్ని చూసి... ఎన్నేళ్లయింది భారత క్రికెట్ అభిమానులు ఇలాంటి గెలుపు సంబరాలు చేసుకొని... అందినట్లే అంది చేజారిపోతున్న ఐసీసీ ట్రోఫీ విజయాలు... ఆఖరి మెట్టుపై తడబడిన ప్రపంచ కప్ సమరాలు... అన్నీ దాటి ఇప్పుడు ఆహా అనిపించే ప్రదర్శనతో భారత జట్టు సగర్వంగా నిలిచింది. ఏడు నెలల క్రితం రాల్చిన కన్నీటి చుక్కల స్థానే ఇప్పుడు ఆనంద బాష్పాలు... నియంత్రించలేని భావోద్వేగాలు... ఎన్నోసార్లు చేరువగా వచ్చిన ట్రోఫీని దూరమైన బాధను పూర్తిగా మరిచేలా ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌గా చేతిలో వాలిన కప్... సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ చేజారిన తర్వాత ఈ సారైనా టి20 ప్రపంచకప్ ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా అజేయంగా అద్భుతాన్ని చేసి చూపించింది. రెండోసారి విశ్వ విజేతగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 2007లో తొలి టైటిల్ నెగ్గిన తర్వాత ఆరు ప్రయత్నాల్లో విఫలమైన టీమిండియా ఇప్పుడు మళ్లీ ట్రోఫీని అందుకుంది.అప్పుడెప్పుడో కపిల్ వన్డే కప్ (1983) తెచ్చినపుడు మనలో చాలామందికి తెలీదు. అదొక వార్తగానే తెలుసుకున్నాం. కానీ ధోని తొలి టి20 ప్రపంచకప్‌ను టీవీల్లో చూశాం. తెగ సంబరపడ్డాం. సొంతగడ్డపై మళ్లీ అదే అదే ధోని (2011) వన్డే విశ్వవిజేతను చేస్తే పెద్ద పండగ చేసుకున్నాం. మళ్లీ... మళ్లీ మళ్లీ ఎంత ప్రయత్నించినా సెమీస్ లేదంటే ఫైనల్స్‌తోనే సరిపెట్టుకున్నాం. కానీ ఇప్పుడు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టి20 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కరీబియన్ గడ్డపై సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. రెండోసారి టి20 ప్రపంచకప్‌ను అందుకుంది. రోహిత్ బృందం జగజ్జేతగా అవతరించడంతో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది. బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): భారత జట్టు టి20 వరల్డ్ కప్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా... డికాక్ (31 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టబ్స్ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హార్దిక్ పాండ్యా (3/20) మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా... బుమ్రా, అర్ష్ దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించగా... బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. తదుపరి టి20 ప్రపంచకప్‌కు 2026లో భారత్–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తాయి. కీలక భాగస్వామ్యాలు... టోర్నీలో వరుసగా విఫలమైన కోహ్లి తుది పోరులో మాత్రం తన స్థాయి ఆటను ప్రదర్శించాడు. జాన్సెన్ వేసిన తొలి ఓవర్‌ను కోహ్లి జోరుగా మొదలు పెట్టాడు. అతను 3 ఫోర్లు బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్లో అనూహ్యంగా దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. కేశవ్ మహరాజ్ వేసిన ఈ ఓవర్లో తొలి రెండు బంతులను ఫోర్లుగా మలచినా... నాలుగో బంతికి రోహిత్ శర్మ (9) వెనుదిరిగాడు. చివరి బంతికి రిషభ్ పంత్ (0) కూడా అవుట్ కాగా, సూర్యకుమార్ (3) కూడా విఫలం కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఐదో స్థానంలో వచ్చిన అక్షర్ చక్కటి బ్యాటింగ్‌తో నిలిచాడు. మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో కోహ్లి మరో ఎండ్‌లో నెమ్మదించాల్సి వచ్చింది. పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు చేసింది. నలుగురు వేర్వేరు బౌలర్లు మార్క్రమ్, మహరాజ్, షమ్సీ, రబాడ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టిన అక్షర్ పటేల్ ధాటిగా ఆడి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడు. 13.1 ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే అదే ఓవర్లో అక్షర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి, అక్షర్ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించారు. ఆ తర్వాత కోహ్లి, శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మధ్య 57 పరుగుల భాగస్వామ్యం (33 బంతుల్లో) స్కోరు వేగాన్ని తగ్గకుండా చేసింది. కోహ్లి 48 బంతుల్లో తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. 17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 134/4. చివరి 3 ఓవర్లలో భారత్ 42 పరుగులు (వరుసగా 16, 17, 9) పరుగులు రాబట్టింది. తొలి 13 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసి కోహ్లి తర్వాతి 35 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకుండా 29 పరుగులే చేశాడు. అయితే తన ఆఖరి 11 బంతుల్లో 26 పరుగులు సాధించి మెరుగైన స్ట్రయిక్ రేట్‌తో ముగించాడు. చివరి 8 బంతుల్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్ మెరిసినా... ఛేదనలో దక్షిణాఫ్రికా 12 పరుగులకే హెన్డ్రిక్స్ (4), మార్క్రమ్ (4) వికెట్లు కోల్పోయింది. అయితే డికాక్, స్టబ్స్ ధాటిగా ఆడుతూ స్కోరును నడిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 38 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. 10 ఓవర్లలో స్కోరు 81 పరుగులకు చేరింది. ఒకవైపు డికాక్ చక్కటి బ్యాటింగ్‌తో నిలబడగా... మరోవైపు క్లాసెన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.తర్వాతి 6 ఓవర్లలో దక్షిణాఫ్రికా 51 పరుగులు చేసింది. ఇందులో క్లాసెన్ ఒక్కడే 44 పరుగులు సాధించాడు. మధ్యలో డికాక్ వెనుదిరిగినా క్లాసెన్ తగ్గలేదు. ముఖ్యంగా అర్షద్ వేసిన 15వ ఓవర్లో క్లాసెన్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 24 పరుగులు వచ్చాయి. ఈ దశలో భారత్ ఓటమి ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లాసెన్ (బి) మహరాజ్ 9; కోహ్లి (సి) రబడ (బి) జాన్సెన్ 76; పంత్ (సి) డికాక్ (బి) మహరాజ్ 0; సూర్యకుమార్ (సి) క్లాసెన్ (బి) రబడ 3; అక్షర్ పటేల్ (రనౌట్) 47; శివమ్ దూబే (సి) మిల్లర్ (బి) నోర్జే 27; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 5; జడేజా (సి) మహరాజ్ (బి) నోర్జే 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–34, 4–106, 5–163, 6–174, 7–176. బౌలింగ్: జాన్సెన్ 4–0–49–1, మహరాజ్ 3–0–23–2, రబడ 4–0–36–1, మార్క్రమ్ 2–0–16–0, నోర్జే 4–0–26–2, షమ్సీ 3–0–26–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్డ్రిక్స్ (బి) బుమ్రా 4; డికాక్ (సి) కుల్దీప్ (బి) అర్ష్ దీప్ 39; మార్క్రమ్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 4; స్టబ్స్ (బి) అక్షర్ 31; క్లాసెన్ (సి) పంత్ (బి) పాండ్యా 52; మిల్లర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 21; జాన్సెన్ (బి) బుమ్రా 2; కేశవ్ మహరాజ్ (నాటౌట్) 2; రబడ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 4; నోర్జే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–7, 2–12, 3–70, 4–106, 5–151, 6–156, 7–161, 8–168. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–20–2, బుమ్రా 4–0–18–2, అక్షర్ 4–0–49–1, కుల్దీప్ 4–0–45–0, పాండ్యా 3–0–20–3, జడేజా 1–0–12–0. ఆటగాడిగా... కెప్టెన్‌గా...ఐపీఎల్లో నాయకుడిగా ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన ఘనత ఉన్నా అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు నాయకత్వం అంత సులువు కాదని రోహిత్‌పై చాలా సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్, టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లలో ఓడిన తర్వాత అతని కెపె్టన్సీపై సందేహాలు కూడా వచ్చాయి. కానీ బీసీసీఐ మరోసారి రోహిత్‌నే నమ్మింది. వరల్డ్ కప్‌లో జట్టును గెలిపించగలిగిన సామర్థ్యం ఉందంటూ అప్పజెప్పింది. ఈ అవకాశాన్ని అతను సమర్థంగా వాడుకున్నాడు. 2007లో తొలి టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ 17 ఏళ్ల తర్వాత సారథిగా మరో వరల్డ్ కప్ గెలిపించాడు. 2007 నుంచి 2024 వరకు వరుసగా 9 వరల్డ్ కప్‌లలోనూ ఆడిన రోహిత్ రెండు సార్లు విజేతగా నిలిచాడు. అధికారికంగా ప్రకటించకపోయినా రోహిత్‌కు కూడా ఇదే ఆఖరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ కావచ్చు. మరో వైపు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో ఉన్న కోహ్లి టి20 వరల్డ్ కప్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూశాడు. అద్భుత ప్రదర్శనలతో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచినా...ట్రోఫీ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఈ గెలుపుతో ఆ ఆనందం దక్కింది. పైగా మూడు పరిమిత ఓవర్ల ఐసీసీ ట్రోఫీలు గెలిచినవాడిగా కెరీర్‌ను సంపూర్ణం చేసుకున్న అతను అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ పలికాడు. వీరిద్దరు మినహా 15 మంది సభ్యుల జట్టులో మిగతా 13 మందికి ఇదే తొలి వరల్డ్ కప్ కావడం విశేషం. హైదరాబాద్ పేసర్ సిరాజ్ కూడా అరుదైన జాబితాలో భాగమయ్యాడు. గతంలో అజహర్ సహా హైదరాబాద్ నుంచి భారత్‌కు వరల్డ్ కప్ ఆడినవారెవరూ విజేత జట్టులో లేరు. ఇప్పుడు సిరాజ్ ఆ అదృష్టాన్ని దక్కించుకున్నాడు. కల నిజమాయెగా... ఫైనల్లో తీవ్ర ఒత్తిడి మధ్య బౌండరీ సూర్యకుమార్ పట్టిన క్యాచ్‌కు వెలకట్టగలమా? అతడిని ఏ అవార్డుతో సన్మానించినా తక్కువే? బుమ్రా తన చివరి 2 ఓవర్లలో చేసిన అద్భుత బౌలింగ్‌కు సలామ్ చేయకుండా ఉండగలమా? టోరీ్నలో కేవలం 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీసిన బుమ్రా తన స్థాయి ఏమిటో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. క్లాసెన్‌ను అవుట్ చేసి ఆటను భారత్ వైపు తిప్పిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ తర్వాత కన్నీళ్లపర్యంతం కావడం మరచిపోగలమా? ఐపీఎల్ సమయంలో ఎంతో వేదన అనుభవించిన తర్వాత భారత్ తరఫున తన విలువేంటో చూపించిన పాండ్యాను రోహిత్ ముద్దాడిన దృశ్యం ఎప్పటికీ హైలైట్స్‌గా ఉండిపోదా! బ్యాటింగ్‌లోనూ తన సత్తా ఏమిటో చూపించిన గుజరాతీ ‘బాపు’ అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ విలువ అమూల్యం కాదా...! చావును దగ్గరగా చూసి ఇక ఆడలేనేమో అనుకున్న క్షణం నుంచి కప్‌ను ఎత్తుకోవడం వరకు రిషభ్ పంత్ సాగిన ప్రస్థానం అసాధారణం కాదా...! అనుభవం లేకపోయినా అర్ష్ దీప్ పదునైన బంతులతో గెలిపించి చూపించిన భాంగ్రాకు బల్లే బల్లే అనకుండా ఉండగలమా? కుల్దీప్, శివమ్ దూబే కీలక దశలో జట్టు విజయాల్లో ఇరుసుగా నిలిచినవారే... ఇక కోహ్లి గురించి చెప్పడం అంటే కొత్త పుస్తకం రాయడమే. ఫైనల్‌కు ముందు మొత్తం 75 పరుగులు మాత్రమే చేసిన అతను అసలు పోరు కోసం తన ఆటను దాచి ఉంచాడు. 76 పరుగుల ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుకు బాటలు వేసి విజయగర్వంతో అంతర్జాతీయ టి20 కెరీర్‌ను ముగించాడు. బ్యాటింగ్‌లో రోహిత్ దూకుడు మంత్రం భారత్ విజయాలకు పునాది వేసింది. తనదైన శైలిలో నాయకుడిగా జట్టును నడిపించిన అతను భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. కపిల్, ధోనిల తర్వాత వరల్డ్ కప్ గెలిపించిన సారథిగా శిఖరాన నిలిచాడు. కొన్నాళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది... అందరిలోనూ వేదన, తీవ్రమైన బాధ... గెలుపు కోసం ఇంకా ఏం చేయాలనే నైరాశ్యం... కెప్టెన్ రోహిత్ సహా ఇతర సభ్యులందరికీ కూడా ఆ బాధనుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. కాలం గిర్రున తిరిగింది... చూస్తుండగానే టి20 వరల్డ్ కప్ వచ్చేసింది. ఒక ఫార్మాట్లో చేజారినా... మరో ఫార్మాట్లోనైనా తమ స్థాయిని ప్రదర్శించే విజేతగా నిలిచే అవకాశం వచ్చింది. ఎలాగైనా ఈ సారి పట్టు వదలరాదని గట్టిగా నిశ్చయించుకొని మరో సారి తమ వేటను మొదలు పెట్టింది. లీగ్ దశలో వరుసగా మూడు విజయాలు, ఆ తర్వాత సూపర్–8లో కూడా మూడు విజయాలు. ఆస్ట్రేలియాలాంటి గట్టి ప్రత్యర్థి ని కుప్పకూల్చిన ఉత్సాహంతో సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కూడా ఘన విజయం. తుది పోరుకు ముందు అజేయంగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇలాగే వరుసగా పది విజయాల తర్వాత అజేయంగా ఫైనల్ చేరిన టీమ్ నిరాశచెందాల్సి వచ్చింది. అద్భుతంగా సాగిపోతున్న ఆటలో ఎక్కడైనా ఒక బ్రేక్ వస్తే... అదీ ఫైనల్లో అయితే ఎంతటి బాధ ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సారీ అలాంటిదే జరిగితే అనే ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ భారత్ అలాంటి స్థితిని అధిగమించింది...ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధగమించింది. కెపె్టన్‌గా 2007 వన్డే వరల్డ్కప్నాటి బాధను కోచ్‌గా రూపంలో మర్చిపోయే ప్రయత్నం చేసిన దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. గెలుపు ఖాయమైన క్షణాన గాల్లో ఎగురుతూ అతను విసిరిన పంచ్ ఈ విజయం విలువేమిటో చూపించింది. –సాక్షి క్రీడా విభాగం గడిచిన మూడు, నాలుగేళ్లు ఎంతో కష్టపడ్డాం. కానీ ఆఖరి ఫలితాలే అందుకోలేకపోయాం. ఈసారి మాత్రం ఏ అవకాశాన్ని వదులుకోవద్దనుకున్నాం. జట్టుగా సమష్టిగా రాణించి ప్రపంచకప్‌ను అందుకున్నాం. నాకే కాదు విరాట్ కోహ్లి ఫామ్‌పై మాలో ఎవరిరికి ఏ సందేహం లేదు. అతను ఆడాల్సిన సమయం వస్తే కచ్చితంగా నిలబడతాడు. జట్టును నిలబెడతాడు. వికెట్ అంత సులువుగాలేని చోట కోహ్తి చేసిన 76 పరుగులు, అక్షర్ మెరుపులు చాలా కీలకమయ్యాయి. బుమ్రా గురించి చెప్పాల్సిన పనిలేదు. హార్దిక్ పాండ్యా తీసిన వికెట్లు, సూర్య క్యాచ్ అన్ని కుదిరాయి కాబట్టే విజేతలమయ్యాం. - రోహిత్ శర్మ, భారత్ కెప్టెన్ భారత జట్టుకు రూ. 20 కోట్ల 42 లక్షల ప్రైజ్‌మనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తొమ్మిదో టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి ఒక కోటీ 12 లక్షల 50 వేల డాలర్ల (రూ. 93 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీని కేటాయించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 24 లక్షల 50 వేల డాలర్లు (రూ. 20 కోట్ల 42 లక్షలు) లభించాయి. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 12 లక్షల 80 వేల డాలర్లు (రూ. 10 కోట్ల 67 లక్షలు) దక్కాయి.సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ ఖాతాలో 7,87,000 డాలర్ల చొప్పున (రూ. 6 కోట్ల 56 లక్షల చొప్పున) చేరాయి. ‘సూపర్–8’ నుంచి సెమీఫైనల్ చేరుకోలేకపోయిన నాలుగు జట్లకు 3,82,500 డాలర్ల చొప్పున (రూ. 3 కోట్ల 18 లక్షల చొప్పున) లభించాయి. 9 నుంచి 12 స్థానాల్లోపు నిలిచిన నాలుగు జట్లకు 2,47,500 డాలర్ల చొప్పున (రూ. 2 కోట్ల 6 లక్షల చొప్పున) దక్కాయి. 13 నుంచి 20వ స్థానాల్లోపు నిలిచిన ఎనిమిది జట్లకు 2,25,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 87 లక్షల చొప్పున) అందజేశారు. సెమీఫైనల్స్, ఫైనల్ మినహా సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 31,154 డాలర్ల చొప్పున (రూ. 25 లక్షల 97 వేలు) లభించాయి. 2022 టి20 ప్రపంచకప్‌ను 56 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహించగా, విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు 16 లక్షల డాలర్లు లభించాయి. -
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ ఫైట్
-
ఈసారి వదలొద్దు!
2013లో చాంపియన్స్ ట్రోఫీ విజేత... ఆ తర్వాత ఐదుసార్లు ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు... అన్నింటా నిరాశే... 2014 టి20 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2021 టెస్టు చాంపియన్‌షిప్, 2023 టెస్టు చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్... ఈ ఐదు సందర్భాల్లో బరిలో నిలిచిన భారత జట్టు సభ్యులకే కాదు... గెలుపును ఆశించిన అభిమానులకు కూడా తెలుసు ఆ వేదన ఎలాంటిదో! ముఖ్యంగా గత ఏడాది నవంబర్ 19న లక్ష మంది సొంత అభిమానుల సమక్షంలో ఆస్ట్రేలియా చేతిలో మన జట్టు ఓడిన క్షణాలు ఇంకా కళ్ల ముందే నిలిచాయి. వరుసగా 10 మ్యాచ్‌లలో విజయాల తర్వాత తుది మెట్టుపై రోహిత్ బృందం తడబడింది. ఇప్పుడు ఆ బాధను మరచి కాస్తంత ఉపశమనం పొందే అవకాశం వచ్చింది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను అందుకునే అరుదైన సందర్భం మళ్లీ టీమిండియా ముందు నిలిచింది. ఈసారి కూడా టోర్నీలో అజేయంగా భారత్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ గా వన్డే వరల్డ్ కప్‌లో చేజారిన ట్రోఫీని టి20ల్లో అందుకొని రోహిత్ శర్మ సగర్వంగా నిలుస్తాడా? తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న టి20 ప్రపంచ కప్‌తో విరాట్ కోహ్లి సంబరాలు చేసుకుంటాడా ఈరోజు రాత్రికల్లా తేలిపోతుంది..!మరోవైపు దక్షిణాఫ్రికా అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉంది. సఫారీ బృందం కూడా విజయం కోసం కసిగా, ఆకలిగా ఉంది... ఆ జట్టుకు కూడా వరల్డ్ కప్ టైటిల్ అనేది 32 ఏళ్ల కల... ఎప్పుడో 1998లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినా ఆ లెక్క వేరు... మొత్తంగా ఐదుసార్లు వన్డే వరల్డ్ కప్‌లలో, రెండుసార్లు టి20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ వరకు రాగలిగినా ఆ గండం దాటి ముందుకు వెళ్లలేకపోయింది. ఇప్పుడు మొదటిసారి ఫైనల్ వరకు వచ్చిన టీమ్ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. కీలక సమయాల్లో తడబడే ‘చోకర్స్’ ముద్రను చెరిపేసుకునే విధంగా సౌతాఫ్రికా టీమ్ చెలరేగింది. టోర్నీలో అక్కడక్కడా కాస్త ఇబ్బంది పడ్డా చివరకు ఫలితాన్ని తమవైపు మార్చుకొని వరుసగా ఎనిమిది విజయాలతో ఓటమి లేకుండా తుది పోరుకు అర్హత సాధించింది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమష్టి ప్రదర్శనతో టీమ్ దూసుకుపోతోంది. దశాబ్దం క్రితం అండర్–19 కెప్టెన్‌గా దక్షిణాఫ్రికాకు ఇప్పటి వరకు ఏకైక ప్రపంచకప్ ట్రోఫీని అందించిన మార్క్రమ్ గతంలో తమ దేశపు దిగ్గజాలకు సాధ్యం కాని ఘనతను నాయకుడిగా అందుకుంటాడా ఈరోజు రాత్రికల్లా తేలిపోతుంది...! బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): టి20 క్రికెట్లో ప్రపంచ చాంపియన్‌ను తేల్చే సమయం ఆసన్నమైంది. 27 రోజులు, 54 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొమ్మిదో టి20 వరల్డ్ కప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో నేడు జరిగే తుది పోరులో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.గతంలో భారత్ ఒకసారి ఈ టోర్నీని గెలుచుకోగా, దక్షిణాఫ్రికా ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఆఖరి సమరానికి ముందు ఇరు జట్లు టోర్నీలో ఓటమి లేకుండా అజేయంగా ఉన్నాయి. భారత్ తాము ఆడిన ఏడు మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికా తాము ఆడిన ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి సమరోత్సాహంతో ఫైనల్‌కు ‘సై’ అంటున్నాయి. ఎవరు విజయం సాధించినా... ఓటమి లేకుండా టైటిల్ అందుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. గతంలో జరిగిన డే అండ్ నైట్ ఫైనల్ మ్యాచ్‌లకు భిన్నంగా తొలిసారి టైటిల్ పోరు డే మ్యాచ్‌గా జరగనుండటం విశేషం. మార్పుల్లేకుండా... టీమిండియా ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌లలో 12 మంది బరిలోకి దిగారు. న్యూయార్క్ వేదికగా జరిగిన తొలి మూడు మ్యాచ్‌లలో పేసర్ సిరాజ్ ఆడగా, వెస్టిండీస్‌లో జరిగిన మ్యాచ్‌లలో అతని స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడాడు. ఇది మినహా మిగతా 10 మంది విషయంలో ఎలాంటి మార్పూ జరగలేదు. ఇప్పుడు కూడా సెమీఫైనల్ ఆడిన టీమ్‌తోనే భారత్ తుది పోరుకు వెళ్లే అవకాశముంది. ఒక్క శివమ్ దూబే బ్యాటింగ్ విషయంలోనే కాస్త ఆందోళన కనిపించినా... మిడిలార్డర్లో అతనికి బదులు సంజూ సామ్సన్ను నేరుగా ఫైనల్లో ఆడించే సాహసం చేయకపోవచ్చు. రోహిత్ శర్మ బ్యాటింగ్ పదును ఏమిటో గత రెండు మ్యాచ్‌లలో కనిపించింది. అతను ఇదే జోరు సాగిస్తే ఆరంభంలోనే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేస్తుంది. కోహ్లి వరుసగా విఫలమైనా... రోహిత్ ఆశించినట్లుగా ఫైనల్లో అతని స్థాయి ప్రదర్శన కనబరిస్తే చాలు. సూర్యకుమార్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు పంత్, పాండ్యాలు ధాటిగా ఆడితే జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో టీమిండియా మరింత బలంగా కనిపిస్తోంది. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్‌లను సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రత్యర్థి ఆటగాళ్లు విఫలమవుతుండగా... స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెలరేగితే సఫారీలు కుప్పకూలడం ఖాయం. ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్‌లో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడగా, బుమ్రా ముందు అంతా తలవంచారు. సమష్టితత్వంతో... దక్షిణాఫ్రికా ఇద్దరు ప్రధాన పేసర్లు రబాడ, నోర్జే ఆరుకంటే తక్కువ ఎకానమీతో ప్రత్యర్థి వికెట్లను పడగొట్టారు. వీరు ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటర్లను కట్టడి చేయగల సమర్థులు. జాన్సెన్ రూపంలో లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆ జట్టులో ఉండటం అదనపు ప్రయోజనం. ఇద్దరు స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, షమ్సీ కూడా అన్ని పిచ్‌లపై చెలరేగారు.అయితే పిచ్ పేస్‌కు అనుకూలంగా కనిపిస్తే ఒక స్పిన్నర్ స్థానంలో బార్టన్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఓపెనర్ డికాక్ బ్యాటింగ్‌కు మూల స్థంభంలా ఉండగా, మరో ఓపెనర్ హెన్డ్రిక్స్ చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేదు. టోరీ్నలో ఆకట్టుకోని కెపె్టన్ మార్క్రమ్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఫైనల్లో రావాలని జట్టు ఆశిస్తోంది. మిడిలార్డర్లో క్లాసెన్, మిల్లర్లపైనే జట్టు ఆధారపడుతోంది. ఇప్పటి వరకు అంచనాలకు తగినట్లుగా ఆడకపోయినా స్టబ్స్ దూకుడుగా ఆడగలడు. విడిగా చూస్తే ఒక్కొక్కరి ప్రదర్శన గొప్పగా లేకపోయినా... జట్టుగా తాము ప్రభావం చూపగలమని టీమ్ విశ్వాసంతో ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లి, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్ దీప్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెన్డ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, షమ్సీ, రబాడ, నోర్జే. పిచ్, వాతావరణం కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో తాజా ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్ రద్దు కాగా, మరో మ్యాచ్ స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’ వరకు వెళ్లింది. మిగిలిన వాటిలో 3 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు, 3 సార్లు ముందుగా బౌలింగ్ చేసిన జట్టు గెలిచాయి. కాబట్టి పిచ్ పెద్ద విషయం కాకపోవచ్చు. డే మ్యాచ్ కాబట్టి మంచు ప్రభావం ఉండదు. తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. భారత్ ఇప్పటికే ఈ పిచ్‌పై అఫ్గానిస్తాన్‌తో ఆడగా, దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఆడలేదు. మ్యాచ్ రోజున వర్ష సూచన ఉంది. అయితే సెమీస్ తరహాలోనే అక్కడక్కడా అంతరాయాలు కలగవచ్చు కానీ పూర్తిగా మ్యాచ్‌కు ఇబ్బంది ఉండదు. మ్యాచ్‌ను శనివారమే పూర్తి చేసేందుకు నిర్ణీత సమయంకంటే అదనంగా మరో 190 నిమిషాల సమయం కేటాయించారు. ఫైనల్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు పూర్తయితే శనివారమే ఫలితం తేల్చేస్తారు. అది కూడా సాధ్యం కాకపోతేనే ఎక్కడ ఆట ఆగిందో అక్కడి నుంచి రిజర్వ్ డే రోజు ఆట కొనసాగుతుంది. అదీ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 2 వన్డే, టి20 ఫార్మాట్లలో కేవలం రెండుసార్లు మాత్రమే రెండు జట్లు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరాయి. 1979 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు... 2024 టి20 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ ఘనత సాధించాయి.2 కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) తర్వాత మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) ప్రపంచ చాంపియన్íÙప్లలో జాతీయ జట్టుకు సారథ్యం వహించిన రెండో కెపె్టన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందనున్నాడు.1 నేటి ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు అరుదైన ఘనత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పుతుంది. వన్డే వరల్డ్‌కప్‌లో మాత్రం వెస్టిండీస్ (1975, 1979), ఆస్ట్రేలియా (2003, 2007) జట్లు రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించాయి. 26 అంతర్జాతీయ టి20ల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు జరిగాయి. 14 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... 11 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయింది. టి20 ప్రపంచకప్‌లలో ఈ రెండు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. 4 మ్యాచ్‌ల్లో భారత్, 2 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలుపొందాయి.ఫలానావారి కోసం కప్ గెలవాలనే నినాదాలకు నేను వ్యతిరేకం. బాగా ఆడి మ్యాచ్ గెలవడం ముఖ్యం తప్ప ఇతర విషయాలు పట్టించుకోను. 12 నెలల వ్యవధిలో మూడు ఐసీసీ ఫైనల్స్‌కు చేరడం అదీ మూడు వేర్వేరు ఫార్మాట్లు కావడం మా జట్టు నిలకడను చూపించింది. ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ కోసం సమయం లేకపోయినా ఆటగాళ్లంతా సిద్ధమయ్యే ఉన్నారు. మానసికంగా కూడా ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా తుది పోరుకు రెడీ అయ్యాం. ఇక్కడ ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడటం మాకు సానుకూలాంశమే. వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌నుంచి పాఠాలు నేర్చుకోవడం వంటిదేమీ లేదు. దాని కోసం కూడా బాగా సిద్ధమయ్యాం కానీ ఆ రోజు ప్రత్యర్థి మాకంటే మెరుగ్గా ఆడింది. అయినా పరాజయాలు మరచి ముందుకు సాగిపోవడం ఆటగాళ్ల లక్షణం. రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరగబోతున్న ఈ ఫైనల్ మాకు అనుకూలంగా సాగాలని కోరుకుంటున్నా. –రాహుల్ ద్రవిడ్, భారత హెడ్ కోచ్ వ్యూహాలు... ప్రతివ్యూహాలు... ఆరంభంలో లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో రోహిత్ ఇబ్బంది పడే బలహీనతను సొమ్ము చేసుకునేందుకు జాన్సెన్ను దక్షిణాఫ్రికా ఉపయోగించవచ్చు. ఫామ్‌లో లేని కోహ్లిపై రబాడ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తాడు. డికాక్‌ను బుమ్రా నిలువరించగలిగితే భారత్‌కు ఆధిపత్యం ఖాయం. పంత్ జోరును ఆపేందుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను వాడే అవకాశం ఉంది. మిడిలార్డర్లో అక్షర్, కుల్దీప్, జడేజాల స్పిన్‌ను క్లాసెన్, మిల్లర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది. ఇద్దరికీ చివరి మ్యాచా? భారత్ క్రికెట్‌కు సంబంధించి ఆల్‌టైమ్ గ్రేట్‌లుగా రోహిత్, కోహ్లిలది ప్రత్యేక స్థానం. గత 11 ఏళ్లుగా భారత్ ఓడిన ఐసీసీ ఫైనల్స్‌లో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ చేజారాక టి20 వరల్డ్ కప్ విజయంతోనైనా ముగించాలనే పట్టుదలతోఈ టోర్నీకి సిద్ధమయ్యారు. టెస్టు, వన్డేలను పక్కన పెడితే ఈ ఫార్మాట్లో కొత్త కుర్రాళ్లు దూసుకొచ్చేశారు.సత్తా చాటి తమదైన అవకాశం కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా కొనసాగడం అనేది ఇద్దరికీ మేలు చేయకపోవచ్చు. కాబట్టి గెలిచినా, ఓడినా వీరికి ఇదే చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ అయ్యే చాన్స్ ఉంది. రోహిత్ 2007 టి20 వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యుడు కాగా, కోహ్లి 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్. -
T20 World Cup: ‘ఫైనల్’ అడుగు ఎవరిదో! నేడు ఇంగ్లండ్‌తో భారత్ సెమీఫైనల్
టీమిండియా ఏడు నెలల్లో మరో ప్రపంచకప్ ఫైనల్‌పై గురి పెట్టింది. 2022 టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో తమను ఓడించి తుది పోరుకు అర్హత పొందిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పై బదులు తీర్చుకునేందుకు భారత జట్టు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది.‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్లు ఈ ఒక్క నాకౌట్ విజయంతో ఇంగ్లండ్ ను కసిదీరా ఇంటికి పంపొచ్చు... మనమేమో 10 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో మరోసారి ఫైనల్ చేరవచ్చు. బ్యాటింగ్ ఫామ్, బౌలింగ్ నిలకడ భారత్‌ను ఓ మెట్టుపైనే నిలబెడుతోంది. జార్జ్‌టౌన్: భారత్ ఇక అసలైన పోరుకు సిద్ధమైంది. గడిచిన 26 రోజులుగా ఆడిన మ్యాచ్‌లు వేరు, నేటి సెమీఫైనల్ పోరాటం వేరు. లీగ్, సూపర్–8 దశలు కావడంతో ఇన్నాళ్లూ కచ్చితంగా గెలవకపోయినా... ముందుకెళ్లే అవకాశమైతే ఉండింది. కానీ ఇది నాకౌట్ పోరు. అన్నీ గెలిచామన్న ధీమా కుదరదు. అలాగే ఇదీ గెలుస్తామన్న గ్యారంటీ లేదు. ఇంకా చెప్పాలంటే కప్ గెలవాలన్నా... ఆఖరి మెట్టుపై నిలవాలన్నా... ఈ రెండో మెట్టే గట్టిగా వేయాలి. లేదంటే అమీతుమీకి ముందే మన జైత్రయాత్రకు చెక్ పడుతుంది. పైగా ఇది టి20 ఫార్మాట్. ఈ మెరుపుల ఫార్మాట్‌ను బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లే కాదు... వరుణ దేవుడు కూడా శాసిస్తోంది. ఇది ఒక్కోసారి పెద్ద జట్లకు శాపంగా... ఉన్నపళంగా జఠిలంగా కూడా మారుతోంది. ఏడు జట్లను ఓడించాం కానీ... ఒక వార్మప్ మినహాయిస్తే... నాలుగు లీగ్ దశ పోటీలు, మూడు సూపర్–8 మ్యాచ్‌ల్లో ఏడు వేర్వేరు జట్లనైతే ఓడించాం. కానీ గట్టిగా జయించింది ఇద్దరినే! లీగ్ దశలో పాకిస్తాన్, ‘సూపర్–8’లో ఆ్రస్టేలియా ఈ రెండు మేటి జట్లపై గెలుపే ప్రపంచకప్ స్థాయి గెలుపని చెప్పొచ్చు. ఐర్లాండ్, అమెరికా, కెనడా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించడం టీమిండియా స్థాయికి ఏమాత్రం విషయం కానేకాదు. ఆ్రస్టేలియా లాంటి మేటి జట్టుపై కెపె్టన్ రోహిత్ శర్మ విధ్వంసం భారత బ్యాటింగ్‌ను మరోస్థాయిలో నిలబెడుతోంది. కానీ విరాట్ కోహ్లి వైఫల్యమే జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. బహుశా ఈ సెమీస్‌లో ఆ కరువు తీర్చు కుంటే అభిమానులకు ‘ఫైనల్ పండగే’ మిగులుతుంది. సూర్యకుమార్, దూబే, హార్దిక్ పాండ్యాలు దంచేయడం, బౌలింగ్‌లో బుమ్రాతో పాటు అర్‡్షదీప్ నిప్పులు చెరుగుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్పిన్నర్లు కుల్దీప్, జడేజా, అక్షర్ పటేల్‌లు కూడా జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. తడబడుతూ ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో మెగా ఈవెంట్ ను మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టు ఇక్కడిదాకా వచ్చేందుకు తడబడింది. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడింది కూడా! కానీ ఏ జట్టుపై, ఏ వేదికపై సాధికారికంగా ఆడిన దాఖలాలైతే లేవు. అయితే అసలైన ఈ నాకౌట్ సమరంలో కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్‌లు బ్యాట్ ఝుళిపిస్తే మాత్రం భారత్‌కు కష్టాలు తప్పవేమో! బౌలింగ్‌లో స్పిన్నర్ ఆదిల్ రషీద్ అద్భుతంగా రాణిస్తుండటం ప్రత్యర్థి బౌలింగ్ దళానికి బలంగా మారింది. 23 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 23 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. 12 మ్యాచ్‌ల్లో భారత్, 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. ప్రపంచకప్‌లో నాలుగుసార్లు తలపడగా... చెరో రెండు విజయాలతో సమంగా ఉన్నాయి.వర్షార్పణమైతే..గయానాలో బుధవారం వాన కురిసింది. మ్యాచ్‌కు వరుణ గండమైతే ఉంది. తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్ ఉదయం జరగనుండటంతో నిర్ణీత సమయం కటాఫ్ లేకుండా పొడిగింపు మాత్రం ఉంటుంది. భారీ వర్షంతో సెమీఫైనల్స్ రద్దయితే లీగ్, సూపర్–8 దశల్లో టాపర్‌గా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ చేరుతాయి. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), కోహ్లి, సూర్యకుమార్, రిషభ్ పంత్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్‡్షదీప్, బుమ్రా. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), సాల్ట్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, స్యామ్ కరన్, జోర్డాన్, ఆర్చర్, ఆదిల్ రషీద్, టాప్లీ. పిచ్, వాతావరణం గయానా పిచ్ బౌలర్లకు స్వర్గధామం. ఈ వేదికపై తొలుత బ్యాటింగ్ చేసిన జట్ల సగటు స్కోరు 127. అయితే లక్ష్యఛేదన మరీ దారుణం. సగటు స్కోరు 95 పరుగులే! కాబట్టి మెరుపుల్ని ఆశించడం అత్యాశే! మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. -
చరిత్రకు చేరువలో..
తరూబా (ట్రినిడాడ్): ఓ ఆసక్తికర సెమీస్ సమరం, ఓ కొత్త ఫైనలిస్టుకు వేదికైన ఈ ప్రపంచకప్‌లో అటు దక్షిణాఫ్రికా, ఇటు అఫ్గానిస్తాన్ ఎవరు ఫైనల్ చేరతారో గురువారం మధ్యాహ్నంలోపు తెలిసిపోతుంది. మెగా ఈవెంట్లోనే మేటి జట్లను తోసిరాజని బాగా ఆకట్టుకున్న ఏకైక జట్టు అఫ్గానిస్తాన్. తమ ఆట ఆషామాషీగా లేదని, సంచలన విజయాలు గాలివాటం కానేకాదని రషీద్ ఖాన్ బృందం నిరూపిస్తోంది. ఆతిథ్య విండీస్, పటిష్ట న్యూజిలాండ్ ఉన్న గ్రూప్ ‘సి’లో లీగ్ దశనే అఫ్గానిస్తాన్ దాటడం గొప్పనుకుంటే... ‘సూపర్–8’లో ఏకంగా 2021 చాంపియన్ ఆ్రస్టేలియానే కంగుతినిపించడం, బంగ్లాదేశ్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్న ఆఖరి మ్యాచ్‌లో పోరాడి గెలవడం క్రికెట్ చరిత్రలోనే నిలిచేలా చేసింది. అఫ్గాన్ సెమీస్ చేరడంతోనే రికార్డుల్లోకెక్కింది. ఇప్పుడు ఫైనల్ చేరి చరిత్ర పుటల్లోకెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమష్టిగా రాణిస్తుండటం అఫ్గాన్ పెను సంచలనాలకు కారణం కాగా... మరోవైపు గట్టి జట్టయిన దక్షిణాఫ్రికా మాత్రం ప్రతి మ్యాచ్‌ను కష్టపడుతూనే గెలుపొందడం విడ్డూరం. నెదర్లాండ్స్‌పై 103 పరుగుల లక్ష్యాన్ని 19వ ఓవర్లో ఛేదించడం, బంగ్లాదేశ్‌పై 4 పరుగులు, నేపాల్‌తో ఒక పరుగు తేడాతో గట్టెక్కడం సఫారీ స్థాయిని తక్కువ చేస్తోంది. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన అమెరికాపై 194/4లాంటి భారీస్కోరు చేసినా కేవలం 18 పరుగులతోనే గెలుపొందడం... ఇలా ప్రతీ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా పెద్ద పెద్ద పోరాటాలే చేసింది. ఇలాంటి జట్టుపై జోరుమీదున్న అఫ్గాన్ గెలిస్తే సంచలనమైతే అవుతుందేమో కానీ ఇందులో పెద్ద విశేషమైతే ఉండదు. మొత్తం మీద తొలి ఫైనల్ అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది. జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కేశవ్, రబాడ, నోర్జే, షమ్సీ.అఫ్గానిస్తాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), గుర్బాజ్, ఇబ్రహీమ్, అజ్మతుల్లా, గుల్బదిన్, నబీ, కరీమ్, నంగేయలియా, నూర్ అహ్మద్, నవీనుల్ హక్, ఫరూఖీ. 2 దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు టి20 మ్యాచ్‌లు జరగ్గా... రెండింటిలోనూ దక్షిణాఫ్రికానే గెలిచింది. 2010 ప్రపంచకప్‌లో 59 పరుగులతో, 2016 ప్రపంచకప్‌లో 37 పరుగులతో దక్షిణాఫ్రికా నెగ్గింది. -
T20 World Cup: అఫ్‘గన్’ పేలింది
కన్నీళ్లు ఆగడం లేదు... భావోద్వేగాలను నియంత్రించుకోవడం సాధ్యం కావడం లేదు... పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించేందుకు పదాలు దొరకడం లేదు... ఒకరు కాదు, ఇద్దరు కాదు అందరి ఆటగాళ్లది ఇదే పరిస్థితి... తాము సాధించిన ఘనత ఎంత అసాధారణమైనదో వారికి తెలుస్తున్నా ఇంకా నమ్మశక్యంగా అనిపించని స్థితి... సొంత దేశంలో క్రికెట్ మైదానంలో అడుగు పెట్టడమే కష్టంగా మారిపోగా... జట్టు సభ్యులంతా కలిసి సాధన చేసే అవకాశం లేకపోగా... ఎప్పుడో టోర్నీకి ముందు కలిసి ప్రాక్టీస్ చేయడమే... కానీ తమ పోరాటం, పట్టుదల ముందు వాటన్నంటినీ చిన్న విషయాలుగా మార్చేసింది. అగ్రశ్రేణి జట్లు క్రికెట్‌ను శాసిస్తున్న చోట అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ అసాధారణ ఆటను చూపించింది... అద్భుత ఆటతో సత్తా చాటుతూ ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.టోర్నీకి ముందు అంచనాలు లేవు... అండర్డాగ్ కిందే లెక్క.. కానీ లీగ్ దశలో న్యూజిలాండ్‌పై భారీ విజయం గాలివాటం కాదని, సూపర్–8లో ఆ్రస్టేలియాను చిత్తు చేసిన వైనం అదృష్టం వల్ల కాదని అఫ్గానిస్తాన్ నిరూపించింది... గత టి20 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయానికి కూడా నోచుకోని జట్టు ఇప్పుడు ఏకంగా సెమీస్ చేరింది. బంగ్లాదేశ్‌తో చివరి సూపర్–8 పోరులో విజయం దోబూచులాడింది. 115 పరుగులు మాత్రమే చేసి దానిని కాపాడుకోవడం అంత సులువు కాదు. కానీ అఫ్గాన్ ఆటగాళ్లంతా ప్రాణాలు పణంగా పెట్టినట్లు మైదానంలో పోరాడారు... మళ్లీ మళ్లీ పలకరిస్తూ వచ్చిన వర్షంతో కూడా పోటీ పడాల్సి వచ్చి0ది... చివరకు తాము అనుకున్నది సాధించారు. బంగ్లాపై పైచేయి సాధించి తొలిసారి ఓ ఐసీసీ టోర్నీలో సగర్వంగా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోగా, తాము ఎప్పటికీ మారమన్నట్లుగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు నిష్క్రమించారు. కింగ్స్టౌన్ (సెయింట్ విన్సెంట్): ‘కమాన్ బంగ్లాదేశ్’... భారత్‌తో ఓటమి తర్వాత ఆ్రస్టేలియా కెప్టెన్ మిచెల్ మార్‡్ష మాట ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ జట్టు కూడా మరో టీమ్ ప్రదర్శనను నమ్ముకుంటూ అదృష్టం పలకరిస్తుందేమోనని ఆశపడింది. బంగ్లాదేశ్ గెలిస్తే తాము సెమీఫైనల్ చేరవచ్చని కంగారూలు కలగన్నారు. కానీ అఫ్గానిస్తాన్ ఆ అవకాశం ఇవ్వలేదు. మంగళవారం జరిగిన గ్రూప్–1 చివరి సూపర్–8 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ టీమ్... రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడతాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. రహ్మనుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం రావడంతో ఒక ఓవర్ తగ్గించి లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (49 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం వృథా కాగా... జట్టులో నలుగురు డకౌటయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవీన్ ఉల్ హక్ (4/26), కెపె్టన్ రషీద్ ఖాన్ (4/23) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తాజా ఫలితంతో గ్రూప్–1 నుంచి 2 విజయాలతో 4 పాయింట్లు సాధించిన అఫ్గానిస్తాన్ రెండో స్థానంతో సెమీస్ చేరింది. బంగ్లాదేశ్ ఓటమితో ఆస్ట్రేలియా జట్టు కూడా ‘సూపర్–8’ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆద్యంతం ‘డ్రామా’ సాగి... స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్ పలు మలుపులతో ఆసక్తికరంగా సాగింది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో విజయం దోబూచులాడింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ మినహా అంతా విఫలమయ్యారు. అతను కూడా తన శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. చివర్లో రషీద్ ఖాన్ (10 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్స్‌లు) మెరుపులతో స్కోరు 100 పరుగులు దాటింది. రన్‌రేట్‌లో అఫ్గాన్, ఆసీస్‌లను దాటి సెమీస్ చేరాలంటే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ మైదానంలోకి దిగింది. అయితే సెమీస్ సంగతేమో కానీ ఆ జట్టు మ్యాచ్ గెలిచే అన్ని అవకాశాలను కూడా వృథా చేసుకుంది. ఫజల్ తన తొలి ఓవర్లోనే తన్జీద్ (0)ను అవుట్ చేయగా, నవీన్ వరుస బంతుల్లో నజు్మల్ (5), షకీబ్ (0)లను అవుట్ చేయడంతో స్కోరు 23/3 వద్ద నిలిచింది. ఈ దశలో వాన వచ్చి ఆగిన తర్వాత రషీద్ వరుస ఓవర్లలో సౌమ్య సర్కార్ (10), తౌహీద్ (14)లను వెనక్కి పంపించాడు. అయినా సరే చేతిలో 5 వికెట్లతో 56 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ గెలిచే స్థితిలో నిలిచింది. కానీ రషీద్ మళ్లీ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నాడు. 81/7 నుంచి బంగ్లా డక్‌వర్త్ లూయిస్ స్కోరుతో పోటీ పడుతూ వచ్చింది. ఒక ఎండ్‌లో నిలిచిన దాస్ ఎంతో ప్రయత్నించినా... మరోవైపు మిగిలిన మూడు వికెట్లు తీసేందుకు అఫ్గాన్ బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ముస్తఫిజుర్‌ను నవీన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో అఫ్గాన్ ఆటగాళ్లు, అభిమానుల సంబరాలతో మైదానం హోరెత్తిపోగా... అక్కడి నుంచి దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరంలో కాబూల్‌లో కూడా ఆ విజయధ్వానం బ్రహ్మాండంగా వినిపించింది! ఉత్తమ నటుడు గుల్బదిన్! 11.4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోరు 81/7 వద్ద వానతో మ్యాచ్ ఆగినప్పుడు ఒక ఆసక్తికర ఘటన జరిగింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆ సమయానికి బంగ్లా 2 పరుగులు వెనుకబడి ఉంది. అక్కడే మ్యాచ్ ముగిసిపోతే అఫ్గాన్ గెలుస్తుంది. ఈ దశలో పరిస్థితి మెరుగ్గా ఉంది, తొందరపడ వద్దన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ సైగ చేశాడు. అప్పటి వరకు స్లిప్‌లో చక్కగా ఫీల్డింగ్ చేస్తున్న గుల్బదిన్ ‘అలా అయితే ఓకే’ అన్నట్లుగా ఒక్కసారిగా కండరాలు పట్టేశాయంటూ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే పిచ్‌పై కవర్లు వచ్చేశాయి. అయితే ఆ తర్వాత మళ్లీ చక్కగా మైదానంలోకి దిగిన గుల్బదిన్ తర్వాతి వికెట్ కూడా తీశాడు. దాంతో ఇదంతా నటన అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మ్యాచ్ తర్వాత రషీద్ మాత్రం తన ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. నిజానికి అక్కడే మ్యాచ్ ముగిసి ఉంటే వివాదం జరిగేదేమో కానీ ఆట కొనసాగి ఆలౌట్ వరకు వెళ్లడంతో ఇది సమస్యగా మారలేదు.‘వెల్డన్’ అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్తాన్ ప్రస్థానం అసాధారణంఅగ్రశ్రేణి జట్లకు దీటుగా ఎదిగిన వైనం‘మిమ్మల్ని నిరాశపర్చము, మీ నమ్మకాన్ని నిలబెడతాం’... టి20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు జరిగిన వెల్కమ్ పార్టీలో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాతో రషీద్ ఖాన్ అన్న మాట ఇది. ఎందుకంటే ఈ టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్ల పేర్లు చెప్పమని మాజీలు, విశ్లేషకులతో అడిగితే ఒక్క లారా మాత్రమే అఫ్గానిస్తాన్ పేరు చెప్పాడు. వారి ఆటపై అతనికి ఉన్న నమ్మకాన్ని ఇది చూపించింది. రేపు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలోనే రషీద్ బృందం సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది! గత కొన్నేళ్లుగా అటు వన్డే, ఇటు టి20 ఫార్మాట్లలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన అఫ్గానిస్తాన్ ఇప్పుడు ‘సంచలనాల’ జట్టు నుంచి సమర్థమైన జట్టుగా ఎదిగింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేంద్రంగానే తమ హోం మ్యాచ్‌లు ఆడుతోంది. ఆటగాళ్లంతా కూడా అక్కడే దాదాపుగా స్థిరపడ్డారు. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనే అఫ్గానిస్తాన్ పదును ఏమిటో ప్రపంచానికి తెలిసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్లను ఓడించిన టీమ్, ఆ్రస్టేలియాను కూడా ఒకదశలో 91/7తో ఓటమి దిశగా నెట్టింది. ఆసీస్ అదృష్టవశాత్తూ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ జట్టును గెలిపించినా... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్ లో నాటి పనిని అఫ్గాన్ పూర్తి చేసింది. –సాక్షి క్రీడా విభాగం10 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్ (వన్డే/టి20) టోర్నీల చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన పదో జట్టుగా అఫ్గానిస్తాన్ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (1975), ఇంగ్లండ్ (1975), న్యూజిలాండ్ (1975), వెస్టిండీస్ (1975), పాకిస్తాన్ (1979), భారత్ (1983), దక్షిణాఫ్రికా (1992), శ్రీలంక (1996), కెన్యా (2003) జట్లు ఉన్నాయి. 1 ప్రపంచకప్ టోర్నీల్లో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ తొలిసారి విజయం అందుకుంది. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో (టి20; 2014లో...వన్డే వరల్డ్‌కప్; 2015, 2019, 2023) అఫ్గానిస్తాన్ ఓడిపోయింది.9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం రషీద్ ఖాన్కిది తొమ్మిదిసారి. షకీబ్ అల్ హసన్ (8 సార్లు) పేరిట ఉన్న రికార్డును రషీద్ బద్దలు కొట్టాడు.న్యూజిలాండ్, ఆ్రస్టేలియావంటి జట్లను ఓడించి సెమీస్ వరకు సాగిన మీ ప్రయాణం అద్భుతం. మీ శ్రమకు, పట్టుదలకు ఫలితమే ఈ విజయం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. దీనిని ఇలాగే కొనసాగించండి. – సచిన్ టెండూల్కర్ మైదానంలో దృశ్యాలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. అఫ్గాన్‌కు గొప్ప విజయమిది. తొలిసారి సెమీస్ చేరిన పఠాన్లలో భావోద్వేగాలు బలంగా కనిపిస్తున్నాయి. అత్యుత్తమ క్రికెట్ ప్రదర్శన ఇది. –యువరాజ్ సింగ్ -
జోరు కొనసాగించాలని...
గ్రాస్ ఐలెట్: టి20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు ఆస్ట్రేలియా రూపంలో నేడు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్–1లో టాప్‌లో ఉన్న భారత జట్టు ఆసీస్‌పై నెగ్గితే దర్జాగా సెమీఫైనల్ చేరుకుంటుంది. రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ రాణిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. బుమ్రా, అర్‡్షదీప్ పేస్‌కు తోడు కుల్దీప్ స్పిన్ తోడైతే ఆ్రస్టేలియాకు కష్టాలు తప్పవు. మరోవైపు భారత్‌పై గెలిచి సెమీఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలని ఆ్రస్టేలియా పట్టుదలతో ఉంది. అయితే భారత్, ఆ్రస్టేలియా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్ ఐదు పాయింట్లతో సెమీఫైనల్ చేరుకుంటుంది. ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశాలన్నీ అఫ్గానిస్తాన్–బంగ్లాదేశ్ మధ్య మంగళవారం ఉదయం కింగ్స్టౌన్లో జరిగే మ్యాచ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే ఆ్రస్టేలియా 3 పాయింట్లతో సెమీఫైనల్ చేరుతుంది. అఫ్గానిస్తాన్ గెలిస్తే ఆ జట్టు 4 పాయింట్లతో సెమీఫైనల్ చేరుకొని ఆ్రస్టేలియాను ఇంటిదారి పట్టిస్తుంది. ఒకవేళ భారత జట్టుపై ఆ్రస్టేలియా 41 పరుగుల తేడాతో గెలిచి... అఫ్గానిస్తాన్ జట్టు 81 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే మాత్రం రన్‌రేట్‌లో వెనుకబడి టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. టి20 ప్రపంచకప్‌లో నేడుదక్షిణాఫ్రికా X వెస్టిండీస్వేదిక: నార్త్‌సౌండ్; ఉదయం గం. 6 నుంచిభారత్ X ఆ్రస్టేలియావేదిక: గ్రాస్ ఐలెట్; రాత్రి గం. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
AUS vs AFG : ఉత్కంఠ పోరులో ఆసీస్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్ (ఫొటోలు)
-
T20 World Cup: బంగ్లాపై విజయభేరి.. భారత్ సెమీ ఫైనల్ చేరడం లాంఛనమే!
నార్త్‌సౌండ్: భారత్ ఆల్‌రౌండ్ షోకు బంగ్లాదేశ్ తెల్లమొహం వేసింది. బ్యాటింగ్‌లో కలిపికొట్టి, తర్వాత పేస్, స్పిన్‌తో వికెట్లను చెదరగొట్టింది. టి20 ప్రపంచకప్ సూపర్–8 రెండో మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా ఇక సెమీస్‌కు చేరడం లాంఛనమే. టాస్ నెగ్గిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (28 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (24 బంతుల్లో 34; 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. కెప్టెన్ నజు్మల్ హుస్సేన్ (32 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కొద్దిగా ప్రతిఘటించగలిగాడు. కుల్దీప్ 3, బుమ్రా, అర్ష్ దీప్ చెరో 2 వికెట్లు తీశారు. సూపర్–8 దశలో తమ చివరి మ్యాచ్‌లో సోమవారం ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. కలిసిమెలిసి దంచేసి... కోహ్లితో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ (11 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో ఓవర్లోనే అవుటయ్యాడు. ఈ కాసేపట్లోనే వేయాల్సినంత వేగవంతమైన పునాదిని వేసి వెళ్లాడు. ఇక కోహ్లి, పంత్ తమ కెపె్టన్ వేగాన్ని అందిపుచ్చుకోవడంతో పవర్‌ప్లేలో భారత్ 53/1 స్కోరు చేసింది. పవర్‌ప్లే ఆఖరి ఓవర్ (6)లో కోహ్లి కొట్టిన సిక్సర్‌తోనే జట్టు స్కోరు 50కి చేరింది. రిషాద్ వేసిన 8వ ఓవర్లో కోహ్లి మరో సిక్స్ బాదాడు. పంత్ కూడా బౌండరీ కొట్టడంతో 8 బంతుల ఈ సుదీర్ఘ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇది భారత శిబిరాన్ని ఉత్సాహపరిస్తే... మరుసటి 9వ ఓవర్ భారత్‌ను దెబ్బమీద దెబ్బ తీసింది. తొలి బంతికే కోహ్లి, మూడో బంతికి సూర్యకుమార్ (6)లను తన్జీమ్ పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ వికెట్ల ప్రభావం ఇన్నింగ్స్‌పై పడకుండా తర్వాత వచి్చన బ్యాటర్లు చెలరేగారు. హార్దిక్ మెరుపు ఫిఫ్టీ 11వ ఓవర్ నుంచి శివమ్ దూబే అండతో రిషభ్ పంత్ బ్యాట్ ఝుళిపించాడు. ముస్తఫిజుర్ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్ బాదాడు. మరుసటి ఓవర్లో రిషాద్పై విరుచుకుపడే క్రమంలో 6, 4 కొట్టిన పంత్ అదే జోరులో ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. 14 ఓవర్లలో భారత్ 120/4 స్కోరు చేసింది. ఆ తర్వాత 6 ఓవర్లలోనే (36 బంతులు) 76 పరుగులు చేసింది.ఇంత స్కోరుకు, ఇన్నింగ్స్ జోరుకు హార్దిక్ పాండ్యా కారణమయ్యాడు. 15వ ఓవర్లో 6, 4తో 14 పరుగులు, 16, 17 ఓవర్లలో దూబే ఒక్కో సిక్సర్‌తో వరుసగా 12 పరుగులు, 9 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో సిక్స్ కొట్టిన దూబే అవుట్ కాగా, హార్దిక్ మరో భారీ సిక్సర్ బాదడంతో 15 పరుగులొచ్చాయి. తన్జిమ్, ముస్తఫిజుర్ సహా బౌలర్లందరినీ చితకబాదిన హార్దిక్ 27 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. నజు్మల్ ఒక్కడే... టాప్–3 బ్యాటర్లలో లిటన్ దాస్ (13) విఫలమవగా, తన్జీద్ హసన్ (31 బంతుల్లో 29; 4 ఫోర్లు), కెపె్టన్ నజు్మల్ మెరుగ్గానే ఆడారు. ఒక వైపు నజు్మల్ పోరాడినా... మరోవైపు తౌహీద్ హ్రిదయ్ (4), ప్రతీ ప్రపంచకప్ ఆడిన విశేషానుభవజు్ఞడు షకీబ్ (11), మహ్ముదుల్లా (13) చేతులెత్తేయడంతో బంగ్లా పరాజయం తప్పలేదు. ఆఖర్లో రిషాద్ (10 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు . స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) జాకీర్ (బి) షకీబ్ 23; కోహ్లి (బి) తన్జీమ్ హసన్ 37; పంత్ (సి) తన్జీమ్ హసన్ (బి) రిషాద్ 36; సూర్యకుమార్ (సి) లిటన్ దాస్ (బి) తన్జీమ్ హసన్ 6; దూబే (బి) రిషాద్ 34; పాండ్యా నాటౌట్ 50; అక్షర్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–39, 2–71, 3–77, 4–108, 5–161. బౌలింగ్: మెహదీ హసన్ 4–0–28–0, షకీబ్ 3–0–37–1, తన్జీమ్ హసన్ 4–0–32–2, ముస్తఫిజుర్ 4–0–48–0, రిషాద్ హుస్సేన్ 3–0–43–2, మహ్ముదుల్లా 2–0–8–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 13; తన్జీద్ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 29; నజు్మల్ (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 40; తౌహీద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 4; షకీబ్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 11; మహ్ముదుల్లా (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 13; జాకిర్ అలీ (సి) కోహ్లి (బి) అర్ష్ దీప్ 1; రిషాద్ (సి) రోహిత్ (బి) బుమ్రా 24; మెహిది హసన్ నాటౌట్ 5; తన్జీమ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–35, 2–66, 3–76, 4–98, 5–109, 6–110, 7–138, 8–145. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–30–2, బుమ్రా 4–0–13–2, అక్షర్ 2–0–26–0, హార్దిక్ పాండ్యా 3–0–32–1, జడేజా 3–0–24–0, కుల్దీప్ 4–0–19–3. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: కింగ్స్టౌన్; ఉ.గం.6.00 నుంచి ఇంగ్లండ్ X అమెరికా వేదిక: బ్రిడ్జ్‌టౌన్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2024: సెమీఫైనల్ లక్ష్యంగా...
నార్త్‌సౌండ్ (ఆంటిగ్వా): టి20 వరల్డ్ కప్‌లో ఓటమి లేకుండా అజేయంగా సాగుతున్న భారత్ సెమీఫైనల్ వేటలో మరో కీలక సమరానికి సిద్ధమైంది. సూపర్–8 దశలో భాగంగా గ్రూప్–1లో నేడు జరిగే పోరులో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై అలవోకగా నెగ్గిన టీమిండియా అమితోత్సాహంతో ఉండగా... తమ మొదటి మ్యాచ్‌లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడి మధ్య మరో మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమవుతుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ ఓడితే బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే మరో సందేహం లేకుండా భారత జట్టే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. రోహిత్, కోహ్లి రాణిస్తే... టోరీ్నలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లను బట్టి చూస్తే ఓపెనర్లు రోహిత్, కోహ్లిల బ్యాటింగ్‌పై మాత్రమే కాస్త ఆందోళన కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై రోహిత్ అర్ధ సెంచరీ చేసినా, తర్వాతి మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమైన కోహ్లి...అఫ్గాన్‌పై 24 పరుగులు చేసినా అది అతని స్థాయికి తగిన ఇన్నింగ్స్ కాదు. ఈ నేపథ్యంలో బంగ్లాపై వీరిద్దరు చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. శివమ్ దూబే కూడా ఆశించిన రీతిలో ఆడటం లేదు. మిడిలార్డర్లో లెఫ్ట్ హ్యాండర్‌గా ఏకైక ప్రత్యామ్నాయం కావడంతో అతనికి మరో అవకాశం దక్కవచ్చు. ఇది మినహా ఇతర అంశాల్లో జట్టు పటిష్టంగా ఉంది. సూర్యకుమార్, పంత్‌ల బ్యాటింగ్‌తో పాటు పాండ్యా కూడా దూకుడుగా ఆడటం భారత్‌కు సానుకూలాంశం. బౌలింగ్‌లో అఫ్గాన్‌పై కుల్దీప్ ఆకట్టుకున్న నేపథ్యంలో తుది జట్టులో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. అన్నింటా తడబాటు... సూపర్–8కు చేరినా లీగ్ దశలోనూ బంగ్లాదేశ్ ఆట అంతంతమాత్రమే. ఆసీస్‌తో పోరులో కూడా అది కనిపించింది. టాపార్డర్‌లో ఒక్క దూకుడైన బ్యాటర్ కూడా లేకపోవడం జట్టు ప్రధాన బలహీనత. తౌహీద్ ఫర్వాలేదనిపించడం మినహా ప్రధాన బ్యాటర్లు తన్జీద్, దాస్, కెపె్టన్ నజు్మల్ వరుసగా విఫలమయ్యారు. సీనియర్ మహ్ముదుల్లా కూడా ప్రభావం చూపలేదు. రికార్డు స్థాయిలో 9వ టి20 వరల్డ్ కప్ ఆడుతున్న షకీబ్ ఒక్క మ్యాచ్ మినహా బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. 4 ఇన్నింగ్స్‌లలో కలిపి 2 వికెట్లు తీశాడు. భారత్‌పై అతను ఏమైనా ఆకట్టుకోగలడా అనేది చూడాలి. బౌలర్లు ముస్తఫిజుర్, తన్జీమ్, తస్కీన్ నిలకడగా రాణించడం వల్లే బంగ్లా ఇక్కడి వరకు వచ్చింది. వీరు టీమిండియా స్టార్ బ్యాటర్లను ఎంత వరకు నిలువరిస్తారనేది ఆసక్తికరం. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X అమెరికావేదిక: బ్రిడ్జ్‌టౌన్; ఉదయం గం. 6 నుంచి భారత్ X బంగ్లాదేశ్వేదిక: నార్త్‌సౌండ్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
SA Vs ENG: దక్షిణాఫ్రికా సూపర్...
గ్రాస్ ఐలెట్: టి20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా దాదాపు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో శుక్రవారం చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే అమెరికాను ఓడించింది. ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (38 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిల్లర్ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. డికాక్ దూకుడుతో పవర్‌ప్లేలోనే 63 పరుగులు చేసిన సఫారీ టీమ్ ఆ తర్వాత తడబడింది. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తర్వాతి 84 బంతుల్లో 100 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. హ్యారీ బ్రూక్ (37 బంతుల్లో 53; 7 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 42 బంతుల్లోనే 78 పరుగులు జోడించారు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ 46 పరుగులు చేయాల్సి ఉండగా... బార్త్‌మన్ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 18 బంతుల్లో 25గా మారింది. బ్రూక్, లివింగ్‌స్టోన్ క్రీజ్‌లో ఉండటంతో పాటు చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ గెలిచే స్థితిలో నిలిచింది. అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ, జాన్సెన్, నోర్జే ఒక్కసారిగా ఆటను మార్చేశారు. తర్వాతి 3 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 17 పరుగులే ఇచ్చారు. దాంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. -
T20 World Cup 2024 Super 8: అఫ్గాన్‌పై అలవోకగా...
టి20 ప్రపంచ కప్ ‘సూపర్–8’ దశలో భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. అఫ్గానిస్తాన్ చక్కటి బౌలింగ్‌తో టీమిండియా ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా ఆపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించింది. ఈ ఫార్మాట్లో తన నంబర్‌వన్ హోదాకు న్యాయం చేస్తూ, తనేంటూ నిరూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఛేదనలో అఫ్గాన్ టీమ్ ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. టీమిండియా పదునైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను సమర్పించుకుంది. ఇక మరో ఆసియా జట్టు బంగ్లాదేశ్‌తో శనివారం భారత్ తర్వాతి సమరానికి సిద్ధమైంది. బ్రిడ్జ్‌టౌన్: వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ చేరే దిశగా భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. సూపర్–8 గ్రూప్–1లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రషీద్ ఖాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. బుమ్రా (3/7), అర్‡్షదీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కీలక భాగస్వామ్యం... ఆరంభం నుంచే తడబడుతూ ఆడిన రోహిత్ శర్మ (13 బంతుల్లో 8; 1 ఫోర్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత రషీద్ రెండు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. నబీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో జోరు ప్రదర్శించిన రిషభ్ పంత్ (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోగా...రషీద్ తర్వాతి ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో విరాట్ కోహ్లి (24 బంతుల్లో 24; 1 సిక్స్) అవుటయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు వేగంగా సాగింది. రషీద్ ఓవర్లో సూర్య ఫోర్, సిక్స్ కొట్టగా... అదే ఓవర్లో మరో ఎండ్‌లో శివమ్ దూబే (7 బంతుల్లో 10; 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో సూర్యకు పాండ్యా జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో జట్టు మెరుగైన స్థితికి చేరింది. నూర్ ఓవర్లో పాండ్యా వరుసగా 4, 6 కొట్టగా... ఫజల్ ఓవర్లో సూర్య వరుసగా 6, 4 బాది 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి బంతికే అతను అవుట్ కాగా, మరుసటి ఓవర్లో పాండ్యా ఆట ముగిసింది. జడేజా (5 బంతుల్లో 7; 1 ఫోర్) ప్రభావం చూపలేకపోగా, ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ (6 బంతుల్లో 12; 2 ఫోర్లు) కీలక పరుగులు రాబట్టాడు. తొలి 10 ఓవర్లలో జట్టు 79 పరుగులు చేయగా, తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. మరోవైపు గురువారం మరణించిన భారత మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్‌కు నివాళిగా మన ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బుమ్రా తొలి ఓవర్లో అనవసర షాట్‌కు ప్రయత్నించి గుర్బాజ్ (11; 1 ఫోర్, 1 సిక్స్) అవుట్ కావడంతో మొదలైన జట్టు పతనం వేగంగా సాగింది. ఎవరు కూడా భారత బౌలింగ్ ముందు పట్టుదలగా నిలవలేకపోయారు. చెప్పుకోదగ్గ బౌలింగ్ వనరులు ఉన్నా ...ఎప్పటిలాగే బ్యాటర్ల వైఫల్యం దెబ్బ తీసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ఫజల్ 8; కోహ్లి (సి) నబీ (బి) రషీద్ 24; పంత్ (ఎల్బీ) (బి) రషీద్ 20; సూర్యకుమార్ (సి) నబీ (బి) ఫజల్ 53; దూబే (ఎల్బీ) (బి) రషీద్ 10; పాండ్యా (సి) అజ్మతుల్లా (బి) నవీన్ 32; జడేజా (సి) గుల్బదిన్ (బి) ఫజల్ 7; అక్షర్ (రనౌట్) 12; అర్‡్షదీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–11, 2–54, 3–62, 4–90, 5–150, 6–159, 7–165, 8–181. బౌలింగ్: ఫజల్ హక్ 4–0–33–3, నబీ 3–0–24–0, నవీన్ ఉల్ హక్ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–26–3, నూర్ అహ్మద్ 3–0–30–0, అజ్మతుల్లా 2–0–23–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) పంత్ (బి) బుమ్రా 11; హజ్రతుల్లా (సి) జడేజా (బి) బుమ్రా 2; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 8; గుల్బదిన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 17; అజ్మతుల్లా (సి) అక్షర్ (బి) జడేజా 26; నజీబుల్లా (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 19; నబీ (సి) జడేజా (బి) కుల్దీప్ 14; రషీద్ (సి) జడేజా (బి) అర్ష్ దీప్ 2; నూర్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 12; నవీన్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 0; ఫజల్హక్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–23, 4–67, 5–71, 6–102, 7–114, 8–121, 9–121, 10–134. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–36–3, బుమ్రా 4–1–7–3, అక్షర్ పటేల్ 3–1–15–1, హార్దిక్ పాండ్యా 2–0–13–0, కుల్దీప్ 4–0–32–2, జడేజా 3–0–20–1. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా X బంగ్లాదేశ్వేదిక: నార్త్‌సౌండ్; ఉదయం గం. 6 నుంచి ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికావేదిక: గ్రాస్‌ఐలెట్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కోహీకి షాక్..ఓపెనర్ గా యశస్వి..?


