టీమిండియా విజయం.. టెక్ దిగ్గజాల రియాక్షన్ ఇలా.. | India Wins T20 World Cup Sundar Pichay and Satya Nadella Tweets | Sakshi
Sakshi News home page

టీమిండియా విజయం.. టెక్ దిగ్గజాల రియాక్షన్ ఇలా..

Mar 9 2026 8:08 AM | Updated on Mar 9 2026 9:28 AM

India Wins T20 World Cup Sundar Pichay and Satya Nadella Tweets

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో.. న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడించింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 255/5 భారీ స్కోరును నమోదు చేసి.. న్యూజిలాండ్‌ను 159 పరుగులకు ఆలౌట్ చేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయం తర్వాత.. ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జస్ప్రీత్ బుమ్రా & సంజు శాంసన్ ప్రదర్శనలను హైలైట్ చేశారు. "టీ20 ప్రపంచ కప్‌లో అద్భుతమైన విజయం సాధించిన టీం ఇండియాకు అభినందనలు, న్యూజిలాండ్‌కు ఈ రోజు అదృష్టం కలిసిరాలేదు'' అని ట్వీట్ చేశారు.

టీమిండియా విజయంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకు అభినందనలు. సెమీఫైనల్‌ వరకు చేరిన సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీములను కూడా ప్రశంసించారు. క్రికెట్ ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరిస్తుండటం చాలా ఆనందంగా ఉందంటూ.. మంచి టోర్నమెంట్ నిర్వహించినందుకు ఐసీసీను కూడా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement