2026 హ్యుందాయ్ వెర్నా: ధర ఎంతంటే? | 2026 Hyundai Verna Launched in India | Sakshi
Sakshi News home page

2026 హ్యుందాయ్ వెర్నా: ధర ఎంతంటే?

Mar 9 2026 1:32 PM | Updated on Mar 9 2026 1:53 PM

2026 Hyundai Verna Launched in India

హ్యుందాయ్ మోటార్ ఇండియా.. 2026 వెర్నాను రూ. 10.98 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ అప్డేటెడ్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పొందుతుంది.

ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు.. మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేసిన రెండు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇది క్లాసీ బ్లూ, టైటాన్ గ్రే మాట్టే అనే రెండు రంగుల్లో లభిస్తుంది. 

2026 వెర్నాలో ఇప్పుడు బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన బంపర్లు & 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్, కో-డ్రైవర్ సీటు కోసం ఎలక్ట్రిక్ వాక్-ఇన్ పరికరం, వెనుక విండో సన్‌షేడ్, డాష్‌క్యామ్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. సరౌండ్-వ్యూ కెమెరా, లెవల్ 2 ADAS సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ & బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఇతర ఫీచర్లు ఆఫర్‌లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement