న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ తన లగ్జరీ ఎంపీవీ మోడల్ ‘వి–క్లాస్’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.1.40 కోట్లుగా ఉంది. ఈ కారు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.5 లక్షలతో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ మార్చి చివరి నుంచే డెలివరీలు మొదలుకానున్నాయి.
‘మేక్ ఇన్ ఇండియా’పై కంపెనీ నిబద్ధతను తెలియజేస్తూ.., నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, మహారాష్ట్రలోని పుణెలో ఉన్న తన చాకన్ కర్మాగారంలోనే అసెంబుల్ చేయనుంది. డిజైన్ విషయానికి వస్తే... ఏఎంజీ లైన్ ప్యాకేజీని జోడించడం వల్ల మరింత స్పోర్టీ లుక్ వచ్చింది. విశాలమైన క్యాబిన్, మసాజ్, వెంటిలేషన్ సీట్లు, 64–రంగుల యాంబియెంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పెంపుడు జంతువులను కూడా తమ వెంట తీసుకెళ్లే సదుపాయం ఉంది.
ఇందులో డీజిల్, పెట్రోల్ రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీ300 డీ డీజిల్ మోడల్ 237 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 2–లీటర్ టర్బో ఇంజిన్‌తో వస్తుంది. ఇక వీ300 పెట్రోల్ మోడల్ 231 హెచ్‌పీ పవర్‌ను ఇచ్చే 2–లీటర్ ఇంజిన్‌తో పాటు మైల్డ్–హైబ్రిడ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఈ రెండు ఇంజిన్లకు 9–స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు.
సేఫ్టీ కోసం మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360–డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటివి ఉన్నాయి. అబ్సిడియన్ బ్లాక్, హై–టెక్ సిల్వర్, ఆలై్పన్ గ్రే, సోడాలైట్ బ్లూ, క్రిస్టల్ వైట్ వంటి అద్భుతమైన రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.


