మెర్సిడెస్ బెంజ్ రీకాల్: ఈ మోడల్స్‌పై ఎఫెక్ట్ | Mercedes Benz Issues Recall in India | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ బెంజ్ రీకాల్: ఈ మోడల్స్‌పై ఎఫెక్ట్

Feb 27 2026 4:10 PM | Updated on Feb 27 2026 4:25 PM

Mercedes Benz Issues Recall in India

మెర్సిడెస్ బెంజ్ ఇండియా.. భారతదేశంలో స్వచ్ఛంద రీకాల్‌ ప్రకటించింది. ఈ ప్రభావం 149 వాహనాలపై చూపుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన రీకాల్ నోటీసును ఫిబ్రవరి 15న జారీ చేసింది.

బెంజ్ రీకాల్ ప్రభావం.. సీఎల్ఈ క్యాబ్రియోలెట్, సీఎల్ఈ 53 ఏఎంజీ కూపే & సీ 63 ఎస్ఈ పెర్ఫార్మెన్స్ వాహనాలపై పడింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)లో సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున సంస్థ రీకాల్ జారీ చేసింది. కొన్ని సందర్భాల్లో.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫంక్షన్ పనిచేయకపోవచ్చని కూడా మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది.

రీకాల్ ప్రభావానికి గురైన వాహనాలు 2 సెప్టెంబర్ 2024 & 18 మార్చి 2025 మధ్య తయారు చేసినవని తెలుస్తోంది. రీకాల్ నోటీసు పొందిన కస్టమర్లు అధీకృత మెర్సిడెస్-బెంజ్ సర్వీస్ సెంటర్లు నేరుగా సంప్రదించి.. అవసరమైన తనిఖీ చేసుకోవచ్చు. డబ్బు చెల్లించకుండానే సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement