ఇండియాతో బంధం ఎంతో ప్రత్యేకం.. నెతన్యాహూ | Benjamin interesting comments on ties with India | Sakshi
Sakshi News home page

ఇండియాతో బంధం ఎంతో ప్రత్యేకం.. నెతన్యాహూ

Feb 27 2026 8:14 AM | Updated on Feb 27 2026 11:12 AM

Benjamin interesting comments on ties with India

ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయోల్ పర్యటన ముగిసింది. ఆ దేశంలో ఘనంగా అతిథ్యం స్వీకరించడంతో పాటు రెండు దేశాలు కీలకమైన పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. భారత్‌తో తనకు వ్యక్తిగతంగా ఎంతో కనెక్టివీటి ఉందని తెలిపారు. తన వైఫ్ సారా నెతన్యాహుని మెుదటి సారి కలిసింది ఇండియన్‌ రెస్టారెంట్‌లోనే అని తెలిపారు.

భారత్ -ఇజ్రాయెల్  మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ద్వైపాక్షిక సంబంధాల పరంగా కాకుండా వ్యక్తిగతంగానూ  భారత్ అంటే ఇజ్రాయెల్‌కు ఎంతో అభిమానం. ప్రపంచంలో చాలా దేశాలు యూదులపై దాడులు చేస్తున్న సమయంలో ఇండియా వారికి అండగా నిలిచింది. అందుకు భారత్‌తో ఇజ్రాయిలీలకు ఆత్మీయ అనుబంధం. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు వ్యక్తిగతంగానూ భారత్‌ తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు.

ఆయన మాట్లాడుతూ" నాకు వ్యక్తిగతంగా భారత్ ఎంతో ప్రత్యేకం. నా మెదటి,లేదా రెండవ సారి నా వైప్ సారాను ఇండియన్ రెస్టారెంట్‌లోనూ కలిసాను. ఆఫుడ్‌ మాత్రమే కాదు. ఆ డేట్ ఎంతో అద్భుతంగా సాగింది."  అన్నారు. ఆ రెస్టారెంట్‌ను రీనా పుష్కర్నా అనే భారతీయురాలు నడిపిస్తుంది.  ఆమె కర్రీ క్వీన్‌గా ఎంతో ఫేమస్ అన్నారు. భారతీయ వంటకాలను ఇజ్రాయెల్‌కు పరిచయం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు.

భారత్-ఇజ్రాయెల్ మధ్య సాంస్కృతిక రాయభారిగా తను  పనిచేస్తుందన్నారు. గతంలో భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వచ్చినప్పుడు ఆ రెస్టారెంట్‌లోనూ విందు ఇచ్చామని భోజనం అద్భుతమని మోదీ ప్రశంసించారని తెలిపారు.  ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన మోదీకి  ఇజ్రాయెల్‌లో ఘన స్వాగతం లభించింది.  

Advertisement
 
Advertisement
Advertisement