హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు | IDF struck eight military compounds belonging to Hezbollah | Sakshi
Sakshi News home page

హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు

Feb 27 2026 12:38 AM | Updated on Feb 27 2026 12:40 AM

IDF struck eight military compounds belonging to Hezbollah

జెరూసలేం: ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. గురువారం ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) లెబనాన్‌లోని బాల్బెక్ ప్రాంతంలో హెజ్‌బొల్లా ‘రద్వాన్ ఫోర్స్’కు చెందిన ఎనిమిది సైనిక స్థావరాలపై వైమానిక దాడులు జరిపాయి. ఈ స్థావరాల్లో తుపాకులు, రాకెట్లు సహా అనేక ఆయుధాలు నిల్వచేసి ఉన్నాయని  ఐడీఎఫ్‌ వెల్లడించింది.

దాడుల అనంతరం ఐడీఎఫ్‌ ప్రకటన విడుదల చేసింది. తాము దాడి చేసిన హెజ్‌బొల్లా స్థావరాలను ఉగ్రవాదులు అత్యవసర పరిస్థితుల్లో ఎదుర్కొనేందుకు శిక్షణ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడే వారు తుపాకీ టైనింగ్‌, వివిధ రకాల ఆయుధాల వినియోగంపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణలతో పాటు, ఇజ్రాయెల్ సైనికులపై, పౌరులపై దాడులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆరోపించింది.

అయితే హెజ్‌బొల్లా తిరిగి ఆయుధాలను సమకూర్చుకోవడం, కొత్త సామర్థ్యాలను పెంచుకోవడం లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని  పేర్కొంది. ఇది ఇజ్రాయెల్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని స్పష్టం చేసింది.  

హెజ్‌బొల్లా తన సామర్థ్యాలను విస్తరించుకోవడానికి, తిరిగి ఆయుధాలను సమకూర్చుకోవడానికి ఐడీఎఫ్‌ ఎప్పటికీ ఊపేక్షించబోదు. ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకుంటూ ముందుకు సాగుతుంది’అని ఐడీఎఫ్‌ తన ప్రకటనలో హెచ్చరించింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement