breaking news
Hamas
-
గాజా సీజ్ ఫైర్ ఉల్లంఘన నేపథ్యంలో హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
-
Gaza Truce: స్వరం మార్చిన అమెరికా అధ్యక్షుడు
గాజా శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు తూట్లు పొడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. మంచిగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారాయన. హమాస్ సంస్థకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంచిగా ఉండాలని.. లేకుంటే అంతం తప్పదని అన్నారు. సోమవారం మీడియాతో ట్రంప్ ఇలా మాట్లాడారు.. ‘‘మంచిగా ఉండాలనే హమాస్‌తో ఒప్పందం కుదిర్చాం. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామంటే ఊరుకోం. హమాస్ మళ్లీ రక్తపాతం కోరుకుంటే మాత్రం వాళ్లకు అంతం తప్పదు’’ అని పేర్కొన్నారు... కాల్పుల విరమణకు కొంత అవకాశం ఇస్తాం. హింస తగ్గుతుందని ఆశిస్తున్నాం. కానీ దాడులు కొనసాగితే ప్రతిస్పందన తప్పదు. వాళ్లు కొనసాగిస్తే మేమే రంగంలోకి దిగుతాం. ఆ పరిష్కారం చాలా వేగంగా.. తీవ్రంగా ఉంటుంది. అలాగని మా సైనికులను అక్కడికి పంపించబోం. శాంతి ఒప్పందంలో సంతకాలు చేసిన ఇతర దేశాలే ఆ సంగతి చూసుకుంటాయి. ఇజ్రాయెల్‌ను కోరితే కేవలం రెండు నిమిషాల్లో అక్కడ వాలిపోతారు. వెళ్లి వాళ్ల అంతు చూడండి అంటే.. చూసేస్తారు. కానీ, ఇప్పటివరకు నేను అలా చెప్పలేదు. అందుకే హమాస్‌కు మరో అవకాశం ఇస్తున్నా’’ అని ట్రంప్ అన్నారు.2023 అక్టోబర్ 7వ తేదీన మొదలైన గాజా యుద్ధం.. రెండేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికతో ఆగింది. హమాస్, ఇజ్రాయెల కాల్పుల విరమణకు అంగీకరించడంతో పాటు పలు షరతులకు అంగీకరించడంతో అక్టోబర్ 13వ తేదీ నుంచి గాజా శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే.. అక్టోబర్ 19వ తేదీన దక్షిణ గాజా రఫాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించి వైమానిక దాడులు జరపడంతో 19 మంది పాలస్తీనీయులు మరణించారు. తొలుత ఇజ్రాయెల్ బలగాలే దాడులు జరిపాయని హమాస్, హమాసే దాడి చేసిందని ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపించుకున్నాయి.ఈ నేపథ్యంలో.. శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదని, తాజా దాడితో హమాస్ నాయకత్వంతో సంబంధాలు ఉండకపోవచ్చని, అది పూర్తిగా హమాస్ రెబల్స్ పని అయ్యిండొచ్చని ట్రంప్ మొన్న అభిప్రాయపడ్డారు. అయితే.. ఇరు వర్గాల దాడుల నేపథ్యంలో.. శాంతి ప్రణాళిక అమల్లో సంగ్దిగ్దత నెలకొంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా. అమెరికా ప్రతినిధులు జెరెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ కానున్నారు. సరిగ్గా.. ఈ సమయంలో ట్రంప్ మరోసారి స్వరం మార్చేసి హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.ట్రంప్ మొన్న.. గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. కాల్పుల విరమణ ఇంకా అమలులో ఉంది. హమాస్ నాయకత్వానికి ఈ దాడులతో సంబంధం లేకపోయి ఉండొచ్చు. రెబల్స్ గ్రూప్స్ ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చు. ట్రంప్ తాజాగా.. హమాస్ మంచిగా ఉండాలి. లేకుంటే వాళ్లకు అంతు తప్పదు. ఇజ్రాయెల్‌కు ఒక్కమాట చెబితే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కానీ, మరో అవకాశం ఇస్తున్నా. -
గాజా యుద్ధం మళ్లీ మొదటికి! ట్రంప్ ఏమన్నారంటే..
గాజా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విమరణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో.. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు, 97 మంది పాలస్తీనీయులు మరణించారు. శాంతి ఒప్పందం ఉల్లంఘనపై ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో.. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆదివారం రాత్రి మార్-ఎ-లాగో నుంచి వాషింగ్టన్కు తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఓ రిపోర్టర్ గాజా తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లో ఉందని భావిస్తున్నారా? అనే అడగ్గా.. ఆయన ‘అవును’ అనే సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ‘‘గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. మేము హమాస్‌తో పరిస్థితి చాలా శాంతియుతంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాం. కానీ, మీకు తెలుసు కదా.. వాళ్లు కొంచెం అతి చేస్తున్నారు. కొన్ని చోట్ల కాల్పులకు దిగుతున్నారు. అయితే.. ఆ దాడులకు హమాస్ నాయకత్వానికి సంబంధం లేదేమో అనిపిస్తోంది. బహుశా రెబల్స్ ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారేమో. అయినా సరే.. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తాం. అందుకోసం కఠినంగా అయినా వ్యవహరిస్తాం’’ అని ట్రంప్ సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు.ఏం జరిగిందంటే.. దక్షిణ గాజాలోని రఫా (Rafah) వద్ద ఇజ్రాయెల్ రక్షణ బలగాలపై హమాస్ దాడి జరిపింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారు. ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది పాలస్తీనీయులు మరణించారు.ఇజ్రాయెల్ యాక్షన్.. అక్టోబర్ 19వ తేదీన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా పరిగణించారు. ఇది హమాస్ పనేనని, కాల్పుల విరమణ ఒప్పందానికి స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంటూ.. గాజాకు మానవతా సాయం ఆపేశారు. అంతేకాదు.. ప్రతిదాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు.దీంతో.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ఈ తాజా దాడుల్లో 19 మంది పాలస్తీనయులు మరణించారు. హమాస్ ఏమందంటే.. ఇదిలా ఉంటే రఫా దాడికి హమాస్.. రక్షణాత్మక చర్యలుగా చెబుతోంది. ఇజ్రాయెల్ బలగాలే తమపై ముందుగా దాడులు చేశాయని, ప్రతిగానే తామూ దాడులు చేయాల్సి వచ్చిందని చెబుతోంది. దీంతో ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచినట్లైంది. ఈ పరస్పర ఆరోపణలు.. గాజాలో శాంతి స్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేసే పరిస్థితి నెలకొంది. అయితే.. ఈ దాడులతో గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన నష్టమేమీ లేదని ట్రంప్ అంటున్నారు. ఇదీ చదవండి: నువ్వేం రాజువి కాదయ్యా బాబూ! -
గాజాకు సాయం సరఫరా ఆపేశాం: ఇజ్రాయెల్
టెల్ అవీవ్: గాజాలోకి మానవతా సాయం సరఫరాను నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ భద్రతాధికారి ఒకరు ఆదివారం తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు అనుమ తించబోమన్నారు. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడి నట్లు ఆరోపించిన ఇజ్రాయెల్, అనంతరం ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా సారథ్యంలో రెండేళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం కనీసం వారంపాటు కూడా మానవతా సాయం సరఫరా కొనసాగకమునుపే ఈ పరిణా మం చోటుచేసుకుంది. ఆదివారం తమ బలగాలపైకి హమాస్ శ్రేణులు కాల్పులకు పాల్పడ్డాయంటూ ఇజ్రాయెల్ గాజాలోని పలుప్రాంతాలపై దాడులకు దిగింది. పాలస్తీనియన్ల కోసం ఆహారం, మందులు, దుప్పట్లు, టెంట్లు తదితర అత్యవసరాలను తీసుకువస్తున్న ట్రక్కులు ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ ద్వారా గాజాలోకి ప్రవేశిస్తుండటం తెలిసిందే. -
హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ (Hamas) ప్రణాళికలు రచిస్తోందని కలకలం రేపింది. హమాస్ దాడుల ప్రణాళిక గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా (USA) విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో, రంగంలోకి దిగిన అమెరికా.. హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుదీర్ఘ యద్ధం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్- హమాస్ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను సైతం హమాస్ విడుదల చేసింది. అయితే, గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్బంగా అమెరికా (USA) విదేశాంగ శాఖ అలర్ట్ అయ్యింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.తమ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో సాధించిన గణనీయమైన పురోగతిని ఇది దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ ఈ దాడులకు పాల్పడితే.. గాజా ప్రజలను రక్షించడానికి, కాల్పుల విరమణ సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్టు, ఖతార్, తుర్కియేతో సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యూఎస్ తెలిపింది. దీంతో, మరోసారి గాజాలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
శాంతి చర్చల వేళ సంచలనం.. హమాస్ ప్రత్యర్థుల ఊచకోత
గాజా: ఇజ్రాయెల్ బందీల విడుదల అనంతరం హమాస్ సాయుధ గ్రూపు చూపు ఇప్పుడు ప్రత్యర్థి వర్గాలపై పడింది. గాజా ప్రాంతంపై పట్టు తిరిగి సాధించేందుకు విరోధి సాయుధ శ్రేణులను ఏరి పారేసే పనికి పూనుకుంది. ఈ పరిణామం అమెరికా మధ్యవర్తిత్వంతో నెలకొన్న కాల్పుల విరమణ మనుగడపై కొత్త అనుమానాలను తెరపైకి తెస్తోంది. ఇప్పటికైనా శాంతి నెలకొందని సంతోష పడుతున్న పాలస్తీనియన్లను హమాస్ వైఖరి భయపెడుతోంది.వివరాల ప్రకారం.. హమాస్ ఫైరింగ్ స్క్వాడ్ తాజాగా ప్రత్యర్థి వర్గాలకు చెందిన 8 మందిని కాల్చి చంపినట్లు సమాచారం. మొత్తమ్మీద 50 మందిని ఇప్పటి వరకు మట్టుబెట్టి ఉంటుందని వైనెట్ వార్తా సంస్థ తెలిపింది. అంతర్గత భద్రతను హమాస్ చూసుకుంటుందని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ వ్యాఖ్యానించింది. కళ్లకు గంతలు కట్టి, బంధించిన వారిని ముసుగులు ధరించిన హమాస్ సభ్యులు దాదాపు బహిరంగంగానే కాలుస్తున్నట్లుగా ఉన్న వీడియోను షఫఖ్ న్యూస్ ప్రసారం చేసింది.Hamas continues mass executing anyone it sees as a potential threat in Gaza. No trial, no judge, no jury. But yeah, sure, these are the “freedom fighters.” 🤨https://t.co/v8o5CGqild— The Persian Jewess (@persianjewess) October 15, 2025దీనిపై స్పందించిన హమాస్.. ఇజ్రాయెల్ బలగాలకు సహకరించడంతోపాటు నేర కార్యకలాపాల్గో పాల్గొన్నందుకే వీరిని శిక్షించామని తెలిపింది. అయితే, హమాస్ చర్యలు గాజాలోని డొగ్‌ముష్ వంటి గ్రూపులతో హింసాత్మక ఘర్షణలకు దారి తీస్తున్నాయి. డొగ్‌ముష్ వర్గం గాజాలోని అత్యంత శక్తివంతమైన సాయుధ గ్రూపుల్లో ఒకటి. హమాస్ భద్రతా విభాగంతో జరిగిన కాల్పుల్లో డొగ్ముష్కు చెందిన 52 మంది చనిపోయారని వైనెట్ పేర్కొంది. ఈ పోరులో 12 మంది హమాస్ సాయుధులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హమాస్ సీనియర్ నేత బస్సెమ్ నయీమ్ కుమారుడు కూడా ఉన్నట్లు వైనెట్ పేర్కొంది. ప్రత్యర్థుల ప్రాంతాల్లోకి గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్సుల్లో వెళ్లిన హమాస్ శ్రేణులు శత్రు సంహారం చేస్తున్నారని తెలిపింది. పౌరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ హమాస్‌పై విమర్శలు వస్తున్నాయి.కొన్ని గ్రూపులకు ఇజ్రాయెల్ సాయంఅత్యంత అధునాతన, భారీ ఆయుధాలు కలిగిన డొగ్ముష్కు ఎప్పట్నుంచో హమాస్‌తో విభేదాలున్నాయి. ఈ గ్రూపునకు ఇజ్రాయెల్ మద్దతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. రఫాలోని యాసెర్ అబూ షబాబ్ సారథ్యంలోని గ్రూపు సహా గాజాలోని పలు ముఠాలకు పరిమితంగా సాయం, ఆయుధాలు అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇటీవల ప్రకటించడం గమనార్హం. ఇటీవల హమాస్ శ్రేణులు యాసెర్ అబూ షబాబ్ సన్నిహితుడొకరిని చంపేసినట్లు ప్రకటించుకున్నాయి. షబాబ్‌ను వదిలేది లేదని కూడా తెలిపాయి.@DonaldTrump @SecRubio @HowardLutnik32 @StephenM @jaredkushner This isn’t October 7 - it’s from the past few hours. Hamas is parading through Gaza, showing off the bodies of the many people they’ve executed since the ceasefire. pic.twitter.com/oWffZUI0g2— Flor (@HeavensFlor) October 15, 2025హమాస్‌లోని యారో యూనిట్ హింసాత్మక ప్రతీకార చర్యల్లో ఆరితేరిందని నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లూ సొరంగాల్లో రహస్యంగా నక్కుతూ పనిచేసిన హమాస్ సాయుధులు ఇప్పుడు తమ శత్రువుల అంతం చూసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. శాంతి ఒప్పందాన్ని అనుసరించే ఉద్దేశం హమాస్ లేనట్లు కనిపిస్తోందంటున్నారు. ‘ఆయుధాలను ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే హమాస్ ఇప్పటికీ ఉంది. నిరాయుధీకరణ రెండో దశ చర్చలు ప్రారంభమయ్యేటప్పటికి గాజాపై పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది’అని విశ్లేషకులు అంటున్నారు. -
శాంతి పర్వమా?
గాజా కాల్పుల విరమణ అంగీకారం అక్టోబర్ 10 నుంచి అమలులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) పాలస్తీనియన్లను ఊచకోత కోయడం ఆగింది. ట్రంప్ కుదిర్చిన ఈ కాల్పుల విరమణను ఒక అత్యవసర కారణం రీత్యా స్వాగతించవలసి ఉంది. కొడిగడుతున్న మానవతా దీపానికి రెండు చేతులు అడ్డుపెట్టేందుకు ఈ సంధిని సమర్థించవలసి ఉంది. పాలస్తీనా పౌరులపై రెండేళ్ళుగా మోతాదుకు మించి సాగుతున్న దాడుల్లో 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు హతులయ్యారు. పౌరులు, సైనికులతో కలిపి సుమారు 2,000 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 55 లక్షల పాలస్తీనియన్లలో సుమారు ఇరవై లక్షల మంది నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి, మానవతా సంస్థలు, స్థానిక అధికారుల అంచనా.మానవ కల్పిత మహా విపత్తుగాజా శిథిలాల కుప్పగా మారింది. కరవు కాటకాలతో జనం సతమతమవుతున్నారు. ఇతర ప్రాంతాలకు పారిపోయిన పాలస్తీనియన్లు కాల్పుల విరమణ అమలులోకి రావడంతో గాజా నగరానికి, షేక్ రద్వాన్ వంటి ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. నుసేరత్, ఖాన్ యూనిస్ వంటి దక్షిణ ప్రాంత శిబిరాల నుంచి మిగిలిన అరకొర సామాను వేసుకుని అల్ రషీద్ వంటి ఉత్తర ప్రాంతాలకు నడక సాగిస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను ‘మానవ కల్పిత మహా విపత్తు’గా ఐరాస అభివర్ణించింది. ఇపుడు గాజాలోకి రోజూ 600 సహాయ సామగ్రి ట్రక్కులు వస్తున్నాయి కనుక, ఈ కాల్పుల విరమణ ఫలితంగా కరవు తీవ్రత కొద్దిగా తగ్గవచ్చు. సహాయ సామగ్రి రాక పెరగడం, రఫా, ఇతర కూడలి మార్గాలను తిరిగి తెరవడం వల్ల, గాజాలో మిగిలినవారి కష్టాలకు తాత్కాలికంగానైనా ఉపశమనం లభించవచ్చు.అయితే, వాస్తవ పరిస్థితులు ఇప్పటికీ గుబులు రేకెత్తించేవిగానే ఉన్నాయి. సుస్థిర శాంతితో పాటు, సామాజిక–రాజకీయ న్యాయం పాలస్తీనియన్లకు అందని మావి పండుగానే మిగిలిపోవచ్చు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఒక రకంగా బలవంతంగానే ఈ కాల్పుల విరమ ణకు ఒప్పించారు. ట్రంప్, ఇతర ప్రాంతీయ భాగస్వాములు (ఈజిప్టు, ఖతార్, సౌదీ అరే బియా) ఊహిస్తున్నంత సుందర స్వప్నం సాకారం కాకపోవచ్చు. అయినప్పటికీ, పెడ మొహంతో ఉన్న నెతన్యాహూను బలవంతం గానైనా చర్చలకు కూర్చోబెట్టినందుకు ట్రంప్‌ను ఎంతో కొంత అభినందించాల్సిందే. పునర్నిర్మాణం ఎలా?శిథిలాలను తొలగించి, గాజాను పున ర్నిర్మించే పనికి శ్రీకారం చుట్టడం తక్షణ ప్రాధాన్యం కావాలి. యుద్ధానంతరం గాజా పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం వచ్చే పదేళ్ళలో 53.2 బిలియన్ డాలర్ల మేరకు ఉండవచ్చని అధికారిక అంచనాలు వెల్లడి స్తున్నాయి. ఐరాసకు చెందిన నష్టాలు – అవస రాల తాత్కాలిక సత్వర మదింపు సంస్థ, యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంక్ కలసి ఆ రకమైన లెక్కకు వచ్చాయి. అవి 2023 అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు వాటిల్లిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆ అంచనాకు వచ్చాయి. పాలస్తీనాకు అంత పెద్ద మొత్తాలను ఎలా అందుబాటులోకి తెస్తారో ఈ దశలోనే చెప్పడం కష్టం.ఐరాస పరిధికి బయట ఈ ఒడంబడిక కుదరడంతో, ఇది ఎంతవరకు ముందు సాగుతుందనే సందేహాలు రేకెత్తుతున్నాయి. దీన్ని బలమైన ప్రాంతీయ పక్షాల మద్దతుతో అమెరికా నేతృత్వాన సాగిన చొరవగానే చూస్తున్నారు. గాజాకు బయటనున్న స్థావరాల నుంచి హమాస్ ఏ విధంగా నియమాలను పాటిస్తుందో పర్యవేక్షించే ఒక బహుళ దేశీయ సైనిక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిలో అమెరికా దళాలు కూడా 200 వరకు ఉంటాయి. తాత్కాలిక టెక్నికల్ పాలనా బృందానికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నాయకుడిగా ఉంటారు. ఇది ట్రంప్ శైలిలో నయా సామ్రాజ్యవాద పోకడను సూచిస్తోంది. ఈ ఒప్పందానికి భారత్ కూడా మద్దతు తెలిపింది. మొదటి దశకు శుభారంభం చేసినందుకు నెతన్యాహును ప్రధాని మోదీ ప్రశంసించారు. సంక్లిష్టమైన శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో పాల్గొన్న అనుభవం భారతదేశానికి ఉంది. కొరియా యుద్ధ విరమణ (1953) నుంచి తదుపరి ఐరాస ప్రత్యేక విధుల్లో భారత్ పాలుపంచుకుంది. విపత్తుల సహాయ కార్యక్రమాల్లో భారత్ తన సమర్ధతను విజయవంతంగా నిరూపించుకుంది. కనుక,గాజాకు ఇపుడు ఎంతో అవసరమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ పనులకు భారత్ చేదోడువాదోడు కాగలదు. కాల్పుల విరమణ ఒడంబడిక తాత్కాలికమైనది, విఘాతాలకు లోనుకాగల అవకాశం ఉన్నది. ఇది 2023 అక్టోబర్‌లో యుద్ధం మొదలైన తర్వాత సంధి కుదర్చడానికి సాగుతున్న మూడవ పెద్ద ప్రయత్నం. రెండు ప్రయత్నాలు గతంలో విఫలమయ్యాయి. ఈసారైనా సత్ఫలితాలు ఇస్తుందా? నిజానికి, ఐరాస ఆధ్వర్యంలోకి ఈ సంక్లిష్ట ఒప్పందాన్ని తీసుకురావడం వాంఛనీయం. కానీ, అటువంటి పరిణామానికి ఉన్న అవకాశం చాలా తక్కువ.సి. ఉదయ్ భాస్కర్వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
నవోదయమేనా?
ఒక సమస్య పట్ల తీవ్రమైన వైఖరిని తీసుకుని, అందుకు పరిష్కారం అని చెప్పే దానిలో కనిపించే కొద్దిపాటి మంచిని కూడా తిరస్కరించటం ఒక ధోరణి. జరిగిన మంచిని ఒక ముందడుగుగా భావించి మరింత ముందుకు పోజూడటం మరొక ధోరణి. వీటిలో ఏ సమస్య పట్ల ఏ ధోరణి తీసుకోవాలనేది అందుకు సంబంధించిన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. రెండేళ్ళుగా సాగుతున్న గాజా యుద్ధానికి శాంతియుత పరిష్కారం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 9న వైట్‌హౌస్‌లో ప్రకటించిన 20 అంశాల ప్రణాళికపై 13వ తేదీన ఈజిప్టులోని షర్మ్ అల్షేక్ పట్టణంలో తనతోపాటు, ఈజిప్ట్, ఖతార్, తుర్కియే ప్రభుత్వాధినేతలు సంతకాలు చేసి ఆమోదించారు. ఆ ముగ్గురూ హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలకు మధ్య వర్తిత్వం వహించినవారు. దశలు దశలుగా అమలుకు రాగలదనే ఆ 20 అంశాల ప్రణాళికలో మొదటి దశ ఈ 9–13 తేదీల మధ్య అమలు జరిగింది కూడా! అందులో భాగంగా ఉభయ పక్షాలు కాల్పులను విరమించాయి.బందీలను, ఖైదీలను విడుదల చేసుకున్నాయి. మూల సమస్య విస్మరణ హమాస్, ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించినట్లు, ట్రంప్ చొరవ, బలిమి లేనిదే ఇది ఎంత మాత్రం జరిగేది కాదు. హమాస్ ఎన్ని త్యాగాలతో ఎంత పట్టుదలగా పోరాడినా, స్వయంగా అరబ్ దేశాలే ద్వంద్వ వైఖరిని చూపుతున్న స్థితిలో ఇజ్రాయెల్‌ను ఓడించటం సాధ్యమయ్యేది కాదు. ఇజ్రాయెల్ ఒకవేళ హమాస్ సహా గాజా ప్రజలందరినీ తుడిచిపెట్టినా పాలస్తీనా జాతి,స్వదేశ ఆకాంక్షల సమస్య పరిష్కారమయ్యేది కాదు. అయినప్పటికీ ఆ విధంగా తుడిచి పెడతాము, గ్రేటర్ ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేస్తాము తప్ప, స్వతంత్ర పాలస్తీనా ప్రసక్తి ససేమిరా లేదన్నది నెతన్యాహూ వైఖరి. అందువల్ల, మొదటి నుంచి ఎన్ని ఊగిసలాటలాడినా చివరకు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ప్రకటించి, దాని అమలు పర్యవేక్షణకు కూడా సిద్ధపడిన నాయకుడు ట్రంప్.ఇవీ మనకు కనిపిస్తున్న వాస్త వాలు. లేదా వాస్తవాలలో కొన్ని. తక్కిన వాస్తవాలేమిటో చూద్దాము. అన్నింటికన్నా ప్రధానమైనది, దశా బ్దాల ఘర్షణలకు మూలకారణమైన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు. దాని గురించి ట్రంప్ 20 అంశాలలో గల ప్రస్తావన అత్యంత అస్పష్టమైన రీతిలో, ఎటువంటి కాలవ్యవధి లేకుండా, చిట్టచివరన వస్తుంది. షర్మ్ అల్షేక్ సమావేశం తర్వాత విడుదల అయిన సంయుక్త ప్రకటనలోనూ పాలస్తీనా దేశం ప్రస్తావన లేదు. ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు సమాన హక్కులు అవసరమని, గాజా సమస్య మొత్తం పాలస్తీనా సమస్యలో భాగమని మొక్కుబడిగా అనటం మినహా వారికి స్వయం నిర్ణయాధికారం ఉందని ఎక్కడా పేర్కొనలేదు. ఇటీవలనే పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్ దేశపు విద్యా మంత్రి బ్రిడ్జెట్ ఫిలిప్స్, రెండు స్వతంత్ర దేశాలు అవసరమన్నారు. ఆ తర్వాత జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఆ మాట అన్నారు. కానీ, ఆ మాట ట్రంప్‌తో అనిపించటం గానీ, సంయుక్త ప్రకటనలో చేర్చటం గానీ, ఆ మేరకు 20 అంశాల ప్రణాళికలో మార్పులు జరిపించటం గానీ చేయలేకపోయారు.ఇంకా అపనమ్మకమే...ఈ అస్పష్టమైన, అయోమయమైన పరిస్థితుల మధ్య ఏవైనా ఆశారేఖలున్నాయా? మళ్ళీ ట్రంప్‌ను చూద్దాము. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించటంలో ప్రపంచాభిప్రాయపు ఒత్తిడి కూడా పనిచేసిందని ఒక మాట అన్నారాయన. ఇజ్రాయెల్ సేనలు ‘చంపు, చంపు, చంపు’ అన్నట్లుగా వ్యవహరించాయని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో మీడియాతో, గాజా యుద్ధం ఇక శాశ్వతంగా ముగిసిందని ప్రకటించారు. తాము బందీలను విడుదల చేసిన తర్వాత ఇజ్రాయెల్ తమపై తిరిగి దాడులు జరపవచ్చునని హమాస్ సందేహించగా, అటువంటిది జరగబోదని వారికి మధ్యవర్తుల ద్వారా హామీ ఇచ్చారు. హమాస్ నిరాయుధీకరణ షరతును సడలించి, వారు గాజాలో అంతర్గత శాంతిభద్రతలను నిర్వహించవచ్చునని అంగీకరించారు.వీటన్నింటి క్రమంలో నెతన్యాహూ ఎక్కడికక్కడ మొండితనంతో వ్యవహరించగా కఠినంగా మాట్లాడి దారికి తెచ్చారు. ఇటువంటివన్నీ పరిగణించినప్పుడు ఏమని భావించాలి? 3 వేల సంవత్సరాల సమస్య ఒక కొలిక్కి వచ్చిందని, మొత్తం పశ్చిమాసియాకే నవోదయం కలిగిందని, ఇది ఇక శాశ్వతమని అంటున్న ట్రంప్ మాటలు, తనకు సాధారణంగా మారిపోయిన అతిశయోక్తి ప్రాగల్భ్యమా? లేక, పాలస్తీనా ఏర్పాటు ఇక ఆపలేదనిదని గుర్తించి ఆ దిశగా తెర వెనుక నర్మగర్భమైన దౌత్యనీతిని నడుపుతుండటమా? అందువల్ల, మొదటి దశ అమలు వరకు ట్రంప్‌ను అభినందిస్తూనే, ఆయన ప్రకటించినట్లు ఇది శాశ్వత నవోదయం అనదగ్గ సంపూర్ణ సూర్యోదయం అనే నమ్మకం మాత్రం ఇంకా కలగటం లేదనాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శాశ్వత శాంతికి నిరీక్షణ
గత రెండేళ్లుగా అపారమైన ప్రాణనష్టాన్నీ, కనీవినీ ఎరుగని విధ్వంసాన్నీ చవిచూసిన గాజా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా సమకూరిన విజయాన్ని శాంతిగా మలచుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ ఇజ్రాయెల్ పార్లమెంటు కెన్సెట్నుద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పటం... ఆయన గత కాలపు అధ్యక్షులందరికన్నా గొప్ప స్నేహితుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కీర్తించటం ప్రపంచ ప్రజానీకమంతా వీక్షించింది. హమాస్ చెరలో మిగిలిన 20మంది ఇజ్రాయెల్ పౌరులూ విడుదల కావటం, అటు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న దాదాపు 10,000 మంది పాలస్తీనా పౌరుల్లో 1,718 మందిని ఆ దేశం విడుదల చేయటం పూర్తయింది. విముక్తులై సొంతగడ్డపై అడుగుపెట్టిన బందీలకూ, ఖైదీలకూ లభించిన అపూర్వ స్వాగతాలు గమనిస్తే వారి కోసం అయినవారు ఎంత ఆత్రంగా నిరీక్షించారో అర్థమవుతుంది. బందీలది రెండేళ్ల చెర అయితే...ఖైదీలది అంతకన్నా చాలా ఎక్కువ. వారిలో మూడేళ్ల నుంచి ఇరవయ్యేళ్ల వరకూ జైళ్లలో మగ్గుతున్నవారున్నారు. పలువురికి తిరిగి పాలస్తీనాలో అడుగుపెట్టేందుకు అనుమతి లేదంటూ ఈజిప్టుకు తరలించారు. అసలు చాలామందికి వెళ్లి నివసించేందుకు కొంపా గోడూ లేవు. అవన్నీ క్షిపణి దాడుల్లో కుప్పకూలాయి. శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవటమో, కాల్పుల విరమణకు అంగీకరించ టమో కాదు. పశ్చిమాసియాకు సంబంధించినంతవరకూ అదెంత మాత్రమూ సరిపోదు. ఎందుకంటే అక్కడ ఎంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందో, అంత త్వరగానూ ఉల్లంఘనలు కూడా మొదలైపోతాయి. యుద్ధానికీ, యుద్ధానికీ మధ్య ఏర్పడే తాత్కాలిక ఉపశమనంగా అది మారిపోయింది. 1978లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జిమ్మీ కార్టర్ కాలంలో కుదిరిన క్యాంప్ డేవిడ్ ఒప్పందం మొదలుకొని ఇందుకు ఎన్ని ఉదాహరణలైనా చూపవచ్చు. చిత్రమేమంటే 1993లో కుదిరిన ఓస్లో–1 ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్ ఉనికిని పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్ఓ) గుర్తించగా, పాలస్తీనా ప్రజలకు ‘నిజమైన ప్రతినిధి’గా పీఎల్‌ఓను ఇజ్రాయెల్ గుర్తించింది. కానీ అందువల్ల పీఎల్ఓకు ఒరిగింది లేకపోగా, అది వలసవాద పోలీసు దళంగా మిగిలింది. దాన్ని నీరుగార్చేందుకు అనంతర కాలంలో హమాస్‌కు పురుడుపోసింది కూడా ఇజ్రాయెలే. 1995 నాటి ఓస్లో–2 ఒప్పందమూ ఇంతే. ఇలా ఇరుపక్షాల మధ్యా కుదిరిన మధ్య వర్తిత్వాలూ, రాజీలూ అసంఖ్యాకం. కానీ వైమానిక, క్షిపణి దాడులు వాస్తవం... శాంతి మిథ్య. ఇజ్రాయెల్‌కు నిరంతరాయంగా అమెరికా సైనిక సాయం అందుతూనే ఉంటుంది. హమాస్ ఉగ్రదాడి తర్వాత 2023 నుంచి ఇంతవరకూ ఇజ్రాయెల్‌కు లభించిన అమెరికా సైనిక సాయం విలువ 2,200 కోట్ల డాలర్ల పైమాటే.తాజా ఒప్పందం హమాస్ 72 గంటల్లో తన దగ్గరున్న బందీలందరినీ విడుదల చేయాలని, చనిపోయివుంటే మృతదేహాలు అప్పగించాలని నిర్దేశించింది. కానీ మొత్తం 20 అంశాల్లోనూ ఇజ్రాయెల్‌కు నిర్దిష్ట కాలపరిమితిని సూచించే ప్రతిపాదనలేవీ లేవు. అసలు స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుపై స్పష్టత లేదు. ధ్వంసమైన ఆవాసప్రాంతాల పునర్నిర్మాణం సంగతి, జవాబుదారీతనం ఊసు లేదు. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా గాజాను తీర్చిదిద్దుతామని ఇప్పటికే ట్రంప్ చెప్పారు. దాని ప్రసక్తి ఇందులో లేకపోయినా చివరకు ఆ దిశగా పావులు కదిపేలా పరిణామాలు ఉండబోతాయన్నది స్పష్టం. అటు షర్మ్ అల్ షేక్‌లో ఆర్భాటంగా జరిగిన శిఖరాగ్ర శాంతి సదస్సుకు నెతన్యాహూ రాకపై తుర్కియే, ఇరాక్‌లు అభ్యంతరం చెప్పటంతో చివరి నిమిషంలో ఆయన ఆగిపోవటమైనా... ఈ సదస్సుకు ఆఖరి నిమిషంలో ఆహ్వానం అంది వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ ప్రేక్షకుడిగా మిగిలిపోవటమైనా జరగబోయేదేమిటో సూచిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరకు ఆయన్ను తీసుకెళ్లటం, వారిద్దరూ కొన్ని సెకన్లు సంభాషించుకోవటం చిన్నపాటి ఓదార్పు. ఎన్ని లోటుపాట్లున్నా ఇప్పుడు కుదిరిన ప్రశాంతత శాశ్వతం కావాలని ఆశించనివారంటూ వుండరు. అది సాకారం కావాలంటే ప్రపంచ ప్రజాభిప్రాయం ఇంకా పదునెక్కాలి. దురాక్రమణలు కనుమరుగై స్వేచ్ఛాయుత పాలస్తీనా దిశగా అడుగులు పడాలి. -
బందీల విడుదలను స్వాగతిస్తున్నాం: మోదీ
న్యూఢిల్లీ: గాజాలో బందీలుగా ఉన్న మొత్తం 20 మందిని హమాస్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు నిజాయితీతో సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న బందీలందరి విడుదలను స్వాగతిస్తున్నాం. వారి స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి, అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన శాంతి ప్రయత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ బలమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది’అని ప్రధాని మోదీ సోమవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలకు తాము తోడుగా ఉంటామన్నారు. -
సంక్లిష్ట వ్యవహారమిది
షర్మ్ ఎల్ షేక్(ఈజిప్ట్): గాజాలో శాంతి వీచికలు మొదలయ్యాక ఆ శాంతిని శాశ్వతంగా సుస్థిరం చేసేందుకు మొదలైన ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలుచేశారు. ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పంలోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో పలువురు యూరప్ దేశాలు, పశి్చమాసియా దేశాల అగ్రనేతల సమక్షంలో శాంతి శిఖరాగ్ర సదస్సులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ సంతకంచేశారు. ఆయనతోపాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసీ, ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అగ్రనేతల సమక్షంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇది చరిత్రాత్మకమైన ఒప్పందం. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు నెరవేరాయి. మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కియేలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మధ్యవర్తిత్వం విషయంలో ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసి అద్భుతంగా వ్యవహరించారు. మీరు నమ్ముతారో లేదో తెలీదుగానీ అసలు ఈ వివాదం 500 నుంచి మూడువేల సంవత్సరాల నాటిది అని అనుకుంటున్నా. ఇప్పటికి ఓ కొలిక్కి వచి్చంది. ఇంకా ఇందులో ఎంతో సంక్లిష్టత ఉంది. ఈ ఒప్పందం అత్యంత చిక్కుముళ్లతో కూడుకుంది. ఎన్నో నిబంధనలు, షరతులను పొందుపరిచాం. వాస్తవానికి పశ్చిమాసియాలో ఈ యుద్ధం చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చాలా మంది భావించారు. ఇకపై అలాంటిదేమీ ఉండబోదు. నేను గతంలో ఎన్నో సంక్లిష్టమైన సమరాలు, సమస్యలను పరిష్కరించా. ఇది మాత్రం అతిపెద్ద రాకెట్ షిప్లాగా సమస్యాత్మకంగా మారింది. చివరకు పరిష్కరించాం’’ అని ట్రంప్ అన్నారు. తర్వాత నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. తర్వాత నేతలంతా వేరే వేదికపై చేరారు. అక్కడ మళ్లీ ట్రంప్ బ్రిటన్, ఇటలీ, పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్, తుర్కియే తదితర కీలక దేశాల అగ్రనేతలను పొగుడుతూ మాట్లాడారు. భారత్ గొప్పదేశం వెనకాల పలువురు నేతలు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా వాళ్ల సమక్షంలో ట్రంప్ మాట్లాడారు. ‘‘ భారత్ గొప్పదేశం. నాకు అత్యంత మిత్రదేశం. భారత్ గొప్ప పనులెన్నో చేసింది. ఇకమీదట పాకిస్తాన్, భారత్‌లు ఇరుగుపొరుగున హాయిలా కలిసిమెలసి ఉంటాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఆ సందర్భంలో షరీఫ్ నవ్వుతూ కనిపించారు. తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ మాట్లాడారు. ‘‘పాలస్తీనియన్లకు స్వయం నిర్ణయాధికారం ఉండాల్సిందే. వాటిని భవిష్యత్తులో ఏ దేశమూ లాగేసుకోకూడదు. స్వతంత్ర దేశంగా ఎదగాలి’’ అని సిసీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
అవధుల్లేని ఆనందం
డెయిర్ అల్ బాలాహ్(గాజా స్ట్రిప్)/జెరూసలేం: నెలల తరబడి చీకట్లో మగ్గిపోయిన ఇజ్రాయెలీ బందీలు ఎట్టకేలకు హమాస్ బందీ సంకెళ్లను తెంపుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన హమాస్, ఇజ్రాయెల్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక శుక్రవారం అమల్లోకిరాగా బందీల విడుదల సోమవారం మొదలైంది. రెండేళ్లకుపైగా తమ వద్ద బందీలుగా ఉంచుకున్న 20 మంది ఇజ్రాయెలీలను హమాస్ పాలస్తీనాలోని వేర్వేరు చోట్ల ఏకకాలంలో విడిచిపెట్టింది. దీంతో ఇజ్రాయెలీ బందీల కుటుంబాల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బందీలు విడుదలయ్యారన్న వార్త తెలీగానే ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ ప్రధాన కూడళ్ల వద్ద వేలాది మంది జనం పోగయ్యి సంబరాలు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆప్తులు బందీల కోసం ఎదురుచూశారు. చిక్కిశల్యమైన తమ వారిని చూసిన ఆనందంలో బందీల కుటుంబ సభ్యులు కేరింతలు కొట్టారు. వాళ్లను హత్తుకుని ఆనందభాష్పాలను రాల్చారు. ‘‘ మా నాన్న ఓమ్రీ మిరాన్ ఏకంగా 738 రోజుల తర్వాత ఇంటికొచ్చారు. ఆయన రాక కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. వేదన అంతా ఇప్పుడు మటుమాయమైంది’’ అని ఓమ్రీ సంతానం ఆనందం వ్యక్తంచేసింది. ఓమ్రీని వీడియోకాల్‌లో తొలిసారిగా చూసిన ఆయన భార్య లేషే మిరాన్ లావీకు ఆనందంతో మాటలు రాలేదు. నిర్బంధంలో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన పలువురు బందీల పార్థివదేహాలను సైతం హమాస్ రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది. మరికొన్ని మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో తమకు సైతం స్పష్టంగా తెలీదని హమాస్ ప్రతినిధులు చేసిన ప్రకటనపై బందీలు, ఆచూకీగల్లంతైన బాధితుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 20 సూత్రాల శాంతి ప్రణాళికకు హమాస్ కచ్చితంగా కట్టుబడి ఉండాలని డిమాండ్చేసింది. ఇజ్రాయెల్ సైతం ఒప్పందంలో భాగంగా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని ఓపెర్ జైలు నుంచి దాదాపు 2,000 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టింది. వీళ్లలో గతంలో జీవితఖైదు పడిన 250 మంది ఖైదీలు న్నారు. యుద్ధం మొదలయ్యాక గాజాలో అదుపు లోకి తీసుకున్న వందలాది మందిని ఇజ్రాయెల్ విడుదలచేసింది. దీంతో వీళ్లంతా గాజా, వెస్ట్ బ్యాంక్‌లకు బయల్దేరారు. బస్సులో చేరుకున్న తమ వారిని చూసిన ఆనందంలో రమల్లా సిటీలోని పాలస్తీనియన్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు.పీడకల పోగొట్టాం.. శాంతిస్థాపన బాధ్యత మీదే: ట్రంప్బందీల విడుదలతో కీలకపాత్రపోషించిన ట్రంప్ సోమవారం పశ్చిమాసియా పర్యటనలో భాగంగా తొలుత ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌లో ప్రసంగించారు. 2008 తర్వాత అమెరికా అధ్యక్షుడు నెస్సెట్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి. 1949 ఏడాది నుంచి చూస్తే గతంలో కేవలం ముగ్గురు అమెరికా అధ్యక్షులు మాత్రమే కేనేసెట్కు వచ్చారు. స్పీకర్ ఆమిర్ ఒహామా ఘన స్వాగతం తర్వాత పార్లమెంటేరియన్లనుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘‘ నెలలతరబడి పట్టి పీడించిన బాధాతప్త యుద్ధ పీడ కలను మేం పోగొట్టాం. తుపాకులు ఇప్పుడు మౌనం దాల్చాయి. ఇక మీరు రణక్షేత్రంలో సాధించడానికి ఏమీ లేదు. ఇక ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సువర్ణావకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. శాంతిని శాశ్వత చేయండి. పశ్చిమాసియాలో కొత్త శాంతి ఉషోదయం మొదలైంది. మధ్యవర్తిత్వం వహించిన నా అల్లుడు జేడ్ కుష్నర్, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, అరబ్ దేశాలకు కృతజ్ఞతలు. ఇజ్రాయెల్‌కు మాత్రమేకాదు పశ్చిమాసియాలో సువర్ణా« ద్యాయం మొదలుకానుంది. గాజాలో నిస్సైనికీ కరణ జరగాలి. హమాస్ ఆయుధాలను త్యజించాలి. దానికి ఇంకా అంగీకారం కుదరలేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రసంగాన్ని ఒకరు అడ్డుకోబోగా భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు లాక్కెళ్లారు.ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంగాజా ఒప్పందం కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు ట్రంప్‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవంతో సత్కరించనుంది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ను ట్రంప్‌కు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ సోమవారం ప్రకటించారు. త్వరలో ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్‌ను ఈ పురస్కారంతో సత్కరిస్తామని ఇస్సాక్ చెప్పారు. -
ఇజ్రాయిల్ పార్లమెంట్లో ట్రంప్ ప్రసంగానికి నిరసన సెగ
ఇజ్రాయిల్-హమాస్‌ల మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్ పార్లమెంట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా నిరసన సెగ ఎదురైంది. ట్రంప్ ప్రసంగించే సమయంలో ఇద్దరు ఎంపీలు ట్రంప్ ప్రసంగానికి అడ్డుతగిలారు. స్లోగాన్స్తో ట్రంప్ ప్రసంగాన్ని పదే పదే అడ్డుకున్నారు. ఇలా ట్రంప్ ప్రసంగానికి అంతరాయం ఏర్పడటంతో ఆ ఇద్దరు ఎంపీలను బహిష్కరించారు. పార్లమెంట్ నుంచి వారిని మార్షల్స్ సాయంతో బయటకు తీసుకెళ్లిపోయారు. 2023, అక్టోబర్ 7వ తేదీన హమాస్ కిడ్నాప్ చేయబడినప్పటి నుండి వారు బందీలుగా పట్టుకున్న చివరి సజీవ బందీలను ఇజ్రాయెల్‌కు తిరిగి పంపడాన్ని ట్రంప్ గుర్తు చేస్తున్న సందర్భంగా ఆయన ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తమైంది. హమాస్‌తో తొలి దశ ఒప్పందంలోని ఇది సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని ట్రంప్ వ్యాఖ్యలలపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ -
ఇజ్రాయెల్‌లో సంబరాలు.. హమాస్ నుంచి బందీల విడుదల
జెరూసలేం: దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. గాజాలో బందీల విడుదల మొదలైంది. తొలివిడతలో తాజాగా ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్.. రెడ్ క్రాస్‌కు అప్పగించింది. ఆ తర్వాత కొద్ది సేపటికి మిగిలిన వారిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీంతో, ఇప్పటికే రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఖాన్ యూనిస్‌కు చేరుకుంది.ఈ క్రమంలో ప్రధాని నెతన్యాహు, ఆయన సతీమణి బందీలకు స్వాగతం పలుకుతూ సందేశం విడుదల చేశారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. మరోవైపు.. బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు.. తమ వారి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. బందీలు హమాస్ నుంచి విడుదల అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. హమాస్‌పై యుద్ధంలో తాము విజయం సాధించినట్టు సంబురాలు జరుపుకుంటున్నారు. Prime Minister Netanyahu is receiving real-time updates on the ongoing release of the hostages and is in continuous contact with hostage affairs coordinator Gal Hirsch. pic.twitter.com/JRAnwOXTK9— Cheryl E 🇮🇱🎗️ (@CherylWroteIt) October 13, 2025 Fantastisch nieuws.Eerste gijzelaars vrijgelaten.Uit de handen van de islamitische terreurbeweging Hamas.Na twee lange jaren weer vrij.Terug naar hun geliefden en familie in Israël!❤️#HostageRelease #Israel pic.twitter.com/VT7EXuFekX— Geert Wilders (@geertwilderspvv) October 13, 2025ఇదిలా ఉండగా.. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి, 251 మందిని హమాస్ అపహరించిన విషయం తెలిసిందే. వారిలో కొంత మందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించాయి. శుక్రవారం నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.#BREAKING: First Israeli hostages to be released by Hamas at the Re'im base are Alon Ohel, Matan Angrest, brothers Gali and Ziv Berman, Eitan Mor and Omri Miren. #HostageRelease #Israel #Gaza pic.twitter.com/JCci4e7rJQ— OSINT Spectator (@osint1117) October 13, 2025ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న 48 మంది బందీలను హమాస్ విడిచిపెట్టనుంది. ఇందులో 20 మంది సజీవంగా ఉన్నారు. ఇందుకు ప్రతిగా 2వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. వీరంతా సోమవారం సాయంత్రం జైళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం.. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ⚡️BREAKING:Seven Israeli hostages have been handed over to the Red Cross as part of the ongoing peace agreement between Israel and Hamas.#BreakingNews #HostageRelease #Gaza #RedCross #PeaceDeal pic.twitter.com/BiJrOUOBmn— Tabish Rahman (@Tabishtabi11) October 13, 2025In Israel tens of thousands are already out in the streets to experience the return of the hostages, together. pic.twitter.com/Dc36YuGmzO— Israel News Pulse (@israelnewspulse) October 13, 2025 -
కతార్ రాయబారుల మృతి.. ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పంద చర్చల్లో కలకలం
కైరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న ‘షార్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’కు ముందు ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్ షేక్ వద్ద శనివారం (అక్టోబర్ 11న) జరిగిన ఘోర కారు ప్రమాదంలో కతార్‌కు చెందిన ముగ్గురు కీలక దౌత్యవేత్తలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.అక్టోబర్ 13న ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్ షేక్ అనే ప్రాంతంలో ఇజ్రాయెల్-గాజాల మధ్య శాంతి ఒప్పందం కోసం ‘షర్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు కతార్ దేశాధినేతకు సేవలందించే అమిరీ దివాన్(Amiri Diwan) కార్యాలయానికి చెందిన ముగ్గురు దౌత్యవేత్తలు కారులో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా,శాంతి చర్చలు జరిగే ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలో కతార్ రాయబారులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కతార్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శాంతి కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర దౌత్యవేత్తల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి’అని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా పక్షాలు సైతం ఈ ఘటనపై సంతాపం ప్రకటించాయి.ఇజ్రాయెల్-గాజాల మధ్య శాంతి ఒప్పందం ఈజిప్ట్ దేశంలోని రెడ్ సీ తీరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక నగరం షార్మ్ ఎల్ షేక్ వద్ద జరగనున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాన్ని ముగింపు పలికేలా తొలిసారి అక్టోబర్ 6న, అక్టోబర్ 7న రెండోసారి చర్చలు జరిగాయి. యుద్ధానికి ముగింపు, బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించేలా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో అక్టోబర్ 13న ‘షర్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదరనుంది.కతార్ రాయబారుల మరణంతో శాంతి చర్చల్లో కలకలంఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న ‘షార్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’కు ముందు జరిగిన ఘోర ప్రమాదం అంతర్జాతీయ దౌత్యపరంగా కలకలం రేపుతోంది. శాంతి చర్చల్లో పాల్గొనడానికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదం శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకోనున్నాయనే అంతర్జాతీయంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్చలకు ముందు ఇలాంటి విషాద ఘటన జరగడం వల్ల చర్చలు, భద్రతా ఏర్పాట్లు, పక్షాల నమ్మకంపై ప్రభావం పడే అవకాశముంది.మొస్సాద్ ప్రమేయంపై వస్తున్న ఆరోపణలు ఈ ఘటనను మరింత ఉద్రిక్తతకు దారి తీసేలా చేస్తున్నాయి. అయితే, ఈ విషాదం శాంతి ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతుందా? లేక మరింత నిశ్చయంతో ముందుకు సాగుతాయా? అన్నది సమయం చెప్పాలి. -
హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’
హమాస్.. నిన్న, మొన్నటి వరకూ మిలిటెట్లు(నిషేధిత ఉగ్రవాద సంస్థ). ఇప్పుడు వారి పేరు మారింది.. వారి బ్రాండ్ కూడా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడితో ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందంలో భాగంగా ఇప్పుడు హమాస్ కాస్త ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’గా రూపాంతరం చెందింది. తాజాగా వీరి బ్రాండ్ పేరును విడుదల చేసింది హమాస్. దీనిలో భాగంగా సుమారు ఏడు వేల మంది హమాస్ మిలిటెంట్లు సాధారణ పౌరుల వలే మారిపోవడానికి సిద్ధమయ్యారు.. ఈ మేరకు ఇజ్రాయిల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్).. గాజాలో ఇటీవల ఉపసంహరించుకున్న ప్రాంతాలపై నియంత్రణను తిరిగి స్థాపించడానికి పౌర దుస్తులలో దర్శనమిస్తున్నారు. మొన్నటి వరకూ చీకటిలో యుద్ధం చేసిన వీరు.. ఇప్పుడ జన జీవన స్రవంతిలోకి వచ్చి నేరుగా గాజాకు అండగా ఉంటామంటున్నారు. మా వారిని విడిచిపెడతారని ఆశిస్తున్నాం..మరొకవైపు గడువులోగా బందీలను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్ రేపు ఉదయం ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టే సమయానికి హమాస్ చేతిలో బందీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది. రెండేళ్ల నాటి యుద్ధం.. ముగిసిన వేళ..హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సుమారు రెండేళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తు న్నాయి. అక్డోబర్ 10వ తేదీ మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీని యన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది.యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో, సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో గుమికూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు. ఒప్పందం ప్రకారం...గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 48 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. వీరిలో కనీసం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది. వీరి జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఇందులో పాలస్తీనా అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మర్వాన్ బర్ఘౌటి కూడా ఉన్నారు. బందీలు, ఖైదీల విడుదల ఆదివారం రాత్రి లేదా సోమవారం మొదలవుతుందని మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు అధికారులు తెలిపారు. సిద్ధంగా మానవతా సాయంగాజాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో మానవతా సాయం తీసుకువచ్చిన ట్రక్కులు సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు ఈజిప్టు, గాజా మధ్యనున్న రఫా సహా ఐదు సరిహద్దులను తెరిచి ఉంచనున్నారు. సుమారు 1.70 లక్షల టన్నుల మందులు, ఆహారం, ఇతర అత్యవసరా లను గాజాలోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐరాస మానవతా సాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపారు. సానుకూల సంకేతాలు అందిన వెంటనే రంగంలోకి దిగుతామని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కుదిరిన డీల్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు 200 మంది సైనికులను గాజాకు పంపుతామని అమెరికా అధికారులు చెప్పారు.వారి మెడపై కత్తి ఉంది..: నెతన్యాహూఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికలో పేర్కొన్న హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. ‘ట్రంప్ ప్రకటనలో తర్వాతి భాగం హమాస్ నిరాయుధీకరణే. ఇది సులువుగా జరిగితే సరేసరి. లేదంటే బలవంతంగానైనా సాధిస్తాం. మెడపై కత్తి ఉందని తెలిసే హమాస్ ఒప్పందానికి వచ్చింది. ఇప్పటికీ కత్తి మెడపైనే ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొనడం గమనార్హం. కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా కాల్పుల విరమణ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందుగానే బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ చెప్పారు. ఉపసంహరణ అంశం సున్నితత్వం దృష్ట్యా గాజాలోని ఇటీవల స్వాధీనం చేసుకున్న 50 శాతం ప్రాంతంలో బలగాలు కొనసాగుతాయని ఓ సైనికాధికారి పేర్కొనడం విశేషం.ఇది ఇజ్రాయిల్‌కు పరోక్ష వార్నింగేనా? ప్రస్తుతం ఇజ్రాయిల్-హమాస్‌లు అమెరికా ఒత్తిడితో శాంతి ఒప్పందానికి ముందుకొచ్చినా ఇరు వర్గాల్లో ఎక్కడో భయం ఉంది. వారి మధ్య చోటు చేసుకుంది మామాలు యుద్ధం కాదు. విధ్వంసకర యుద్ధం. ఈ క్రమంలోనే వారి మధ్య శాంతి ఒప్పందం జరిగినా కూడా రెండు వర్గాలు జాగ్రత్తగా ఉండాలనే ముందస్తు ప్రణాళికతో సిద్ధమైనట్లు తెలుస్తున్నాయి. హమాస్ ఏమీ చేసే పరిస్థితి లేకే ఒప్పందానికి వచ్చిన ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ స్పష్టం చేసిన నేపథ్యంలో హమాస్ కూడా వారు మొత్తం ఆయుధాలను వదిలేయడానికి సిద్ధంగా లేరనేది అర్ధమవుతోంది. తాము ఉంటాం.. కానీ ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్ గా ఉంటామని చెబుతున్నారు. జస్ట్ మేము మారాం.. అంతే.. మా లక్ష్యం మారలేదు’ అని సందేశాన్ని ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్ ఏర్పాటు ద్వారా పంపినట్లు అయ్యింది. అంటే అవసరమైన పక్షంలో మళ్లీ తాము యుద్ధం చేయడానికి సిద్ధమేనని పరోక్ష సంకేతాలు పంపారు. ఇప్పుడు హమాస్.. ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ రూపొంతరం చెందడానికి ప్రధాన కారణం మాత్రం ఇజ్రాయిల్‌ను పూర్తిగా నమ్మలేని స్థితి. అటు ఇజ్రాయిల్ కూడా హమాస్‌ను పూర్తిగా నమ్మడం లేదు. ఒప్పందానికి కట్టుబడే అటు ఇజ్రాయిల్-ఇటు హమాస్‌లు తమ తమ చెరల్లో ఉన్న బంధీలను విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాయి. ఒకవేళ వీరి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తితే మళ్లీ యుద్ధం రాదనే విషయం కూడా చెప్పలేమనేది విశ్లేషకుల అభిప్రాయం.ఇదీ చదవండి: 58 మంది పాక్ సైనికుల మృతి -
గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ
గాజా/ కైరో: హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రెండేళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తు న్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీని యన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది. యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో, సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో గుమికూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు. 24 గంటల్లో 11 మంది మృతిగురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ భారీగా కాల్పులు జరిపిందని స్థానికులు తెలిపారు. ఆర్మీ ప్రకటన తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించలేదన్నారు. సైనిక విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించాయని చెప్పారు. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో 11 మంది పాలస్తీనియన్లు చనిపోగా మరో 49 గాయపడ్డారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. తమ బలగాలకు ప్రమాదకరమనిపించిన లక్ష్యాలపైనే దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. దీనిపై హమాస్ మండిపడింది. విడుదలవనున్న మర్వాన్ బర్ఘౌటిఒప్పందం ప్రకారం...గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 48 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. వీరిలో కనీసం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది. వీరి జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఇందులో పాలస్తీనా అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మర్వాన్ బర్ఘౌటి కూడా ఉన్నారు. బందీలు, ఖైదీల విడుదల ఆదివారం రాత్రి లేదా సోమవారం మొదలవుతుందని మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు అధికారులు తెలిపారు. సిద్ధంగా మానవతా సాయంగాజాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో మానవతా సాయం తీసుకువచ్చిన ట్రక్కులు సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు ఈజిప్టు, గాజా మధ్యనున్న రఫా సహా ఐదు సరిహద్దులను తెరిచి ఉంచనున్నారు. సుమారు 1.70 లక్షల టన్నుల మందులు, ఆహారం, ఇతర అత్యవసరా లను గాజాలోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐరాస మానవతా సాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపారు. సానుకూల సంకేతాలు అందిన వెంటనే రంగంలోకి దిగుతామని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కుదిరిన డీల్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు 200 మంది సైనికులను గాజాకు పంపుతామని అమెరికా అధికారులు చెప్పారు.కత్తి మెడపైనే ఉంది: నెతన్యాహూఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికలో పేర్కొన్న హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. ‘ట్రంప్ ప్రకటనలో తర్వాతి భాగం హమాస్ నిరాయుధీకరణే. ఇది సులువుగా జరిగితే సరేసరి. లేదంటే బలవంతంగానైనా సాధిస్తాం. మెడపై కత్తి ఉందని తెలిసే హమాస్ ఒప్పందానికి వచ్చింది. ఇప్పటికీ కత్తి మెడపైనే ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొనడం గమనార్హం. కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా కాల్పుల విరమణ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందుగానే బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ చెప్పారు. ఉపసంహరణ అంశం సున్నితత్వం దృష్ట్యా గాజాలోని ఇటీవల స్వాధీనం చేసుకున్న 50 శాతం ప్రాంతంలో బలగాలు కొనసాగుతాయని ఓ సైనికాధికారి పేర్కొనడం విశేషం. -
గాజాలో శాంతి పవనాలు!
జెరూసలేం/న్యూఢిల్లీ: వైమానిక దాడులు, బాంబు పేలుళ్లు, విధ్వంసాలు, ఆకలి చావులతో రెండేళ్లుగా అల్లాడిపోతున్న కల్లోలిత గాజా స్ట్రిప్‌లో శాంతి సాధనకు ఎట్టకేలకు అడుగులుపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మొదటి దశను వైరిపక్షాలైన ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేయబోతున్నాయి. రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం పూర్తిగా ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి దశ ఒప్పందం ప్రకారం.. గాజాలో దాడులు వెంటనే ఆపేయాలి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను అతిత్వరలో హమాస్ మిలిటెంట్లు విడుదల చేయనున్నారు. అందుకు బదులుగా తమ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం విముక్తి కలి్పంచనుంది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోనుంది. హమాస్ అ«దీనంలో 20 మంది బందీలు సజీవంగా ఉన్నట్లు అంచనా. భగవంతుడి దయతో వారందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హమాస్ సైతం స్పందించింది. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సేనలు వెనక్కి వెళ్లిపోవాలని, గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతించాలని పేర్కొంది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను తమకు అప్పగించాలని తేల్చిచెప్పింది. మరోవైపు రెండు కీలకమైన అంశాలపై స్పష్టత రాలేదు. ట్రంప్ ప్లాన్ ప్రకారం హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి. గాజా పరిపాలన బాధ్యతలను నిపుణులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా అథారిటీకి అప్పగించాలి. ఈ రెండింటిపై హమాస్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. గాజాలో ఆనందోత్సాహాలు ట్రంప్ శాంతి ప్రణాళికలో మొదటి దశను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించడంతో గాజాలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. యుద్ధం ఇక ఆగిపోతుందని, రక్తపాతానికి తెరపడుతుందని, తమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నామని అన్నారు. జనం పరస్పరం అభినందనలు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. గాజాలో పనిచేస్తున్న జర్నలిస్టులు సైతం సంబరాల్లో మునిగిపోయారు. కొందరు పాలస్తీనా సంప్రదాయ నృత్యాలు చేశారు. మారణహోమం, అన్యాయం, అణచివేత కారణంగా మానసికంగా, శారీరకంగా అలసిపోయామని, ఇకనైనా ఊపిరి పీల్చుకుంటానని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు చెప్పారు. మరోవైపు శాంతి ప్రణాళిక అమల్లోకి వచ్చినట్లు భావించిన నిరాశ్రయులు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రయత్నించగా ఇజ్రాయెల్ సైనికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జెరూసలేంలో సంబరాలు ఇజ్రాయెల్‌లోని జెరూసలేం నగరంలోనూ జనం హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. బందీల రాకకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా బందీల కుటుంబ సభ్యులు, బంధువులు సంబరాల్లో మునిగిపోయారు. పరస్పరం ఆలింగనాలు చేసుకున్నారు. తాము ఇన్నాళ్లూ చేసిన ప్రార్థనలు ఫలించాయని భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడని విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని యూదు మత గురువు అవీ కోజ్మన్ వ్యాఖ్యానించారు. అన్ని పక్షాలనూ గౌరవిస్తాం: ట్రంప్ ‘‘గాజాలో బలమైన, మన్నికైన, శాశ్వతమైన శాంతి సాధనలో భాగంగా బందీలందరినీ హమాస్ అతిత్వరలో విడుదల చేస్తుంది. ఇజ్రాయెల్ తమ సైనికులను ఉపసంహరించుకుంటుంది. ఈ విషయంలో అన్ని పక్షాలనూ సమానంగానే గౌరవిస్తాం’’ అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. గురువారం అర్ధరాత్రి గానీ, శుక్రవారం ఉదయం నుంచి గానీ ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ ప్రారంభవుతుందని ఆశిస్తున్నట్లు హమాస్ సీనియర్ నేత ఒసామా హమ్దాన్ చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులంతా వెళ్లిపోవాలని కోరారు. ఇజ్రాయెల్ జైళ్లలో 250 మంది పాలస్తీనా ఖైదీలు చాలాఏళ్లుగా మగ్గుతున్నారని, గాజాపై యుద్ధం మొదలైన తర్వాత ఈ రెండేళ్లలో మరో 1,700 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ సైన్యం నిర్బంధించిందని గుర్తుచేశారు. వీరందరినీ విడుదల చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.ఇప్పుడేం జరగొచ్చు? గాజాలో హమాస్‌ను పూర్తిగా నిరీ్వర్యం చేయాలని ఇజ్రాయెల్ పట్టుదలతో ఉంది. వారంతా ఆయుధాలు అప్పగించి, లొంగిపోవాల్సిందేనని చెబుతోంది. ఇదే అంశాన్ని ట్రంప్ ప్లాన్‌లోనూ చేర్చారు. లొంగిపోతే క్షమాభిక్ష ప్రసాదిస్తామని సూచించారు. కానీ, ఆయుధాలు వదిలేయడానికి హమాస్ మిలిటెంట్లు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. గాజా తమ పట్టునుంచి జారిపోకుండా చూసుకోవాలన్నదే వారి ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఖాళీ చేయాలని, మరోసారి దాడులు చేయొద్దని వారు షరతు విధిస్తున్నారు. సైన్యమంతా వెనక్కి వెళ్లిపోయిన తర్వాతే చివరి బందీని విడుదల చేస్తామని తేల్చిచెబుతున్నారు. గాజాలోని బఫర్ జోన్లలో తమ సైన్యాన్ని కొనసాగించక తప్పదని ఇజ్రాయెల్ వాదిస్తుండడం గమనార్హం. మరోవైపు గాజాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కొరవడింది. వెస్ట్‌బ్యాంక్ మద్దతున్న పాలస్తీనా అథారిటీకి గాజా అధికార బాధ్యతలు అప్పగించడం గానీ, స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తించడాన్ని గానీ తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. మిలిటెంట్లు లొంగిపోయి, స్వతంత్ర పాలస్తీనా అథారిటీ చేతిలోకి పాలనా పగ్గాలు వస్తే తప్ప గాజా పునరి్నర్మాణం సాధ్యం కాదు. 20 లక్షల మంది పాలస్తీనా ప్రజల భవిష్యత్తు ఇంకా తేలడం లేదు. గాజాలో శాశ్వతంగా శాంతి ఎప్పుడు నెలకొంటుందన్న సంగతి ఎవరూ చెప్పలేకపోతున్నారు. అప్పుడేం జరిగింది...2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది మరణించారు. మిలిటెంట్లు 251 మందిని బందీలుగా మార్చేసి గాజాకు బలవంతంగా తరలించి, సొరంగాల్లో బంధించారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. హమాస్ దుశ్చర్యపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే ప్రతిస్పందించింది. మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా భీకర యుద్ధం ఆరంభించింది. గాజాలో రెండేళ్లపాటు సాగిన యుద్ధంలో 67,000 మందికిపైగా మృతిచెందారు. 1.70 లక్షల మంది క్షతగాత్రులుగా మారారు. గాజా చాలావరకు ధ్వంసమైపోయింది. శిథిలాల దిబ్బగా మారింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గాజాలో మారణహోమం ఆపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే 20 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఇజ్రాయెల్‌ను, హమాస్‌ను నయానో భయానో ఒప్పించారు. తన మాట వినకుంటే నరకం చూపిస్తామని హమాస్‌ను హెచ్చరించారు. దాంతో ఉభయ పక్షాలు దారికొచ్చాయి. ట్రంప్ పీస్ ప్లాన్‌ను ఇజ్రాయెల్–హమాస్ మధ్య మూడో కాల్పుల విరమణ ఒప్పందంగా చెప్పుకోవచ్చు. 2023 నవంబర్‌లో ఇరుపక్షాల మధ్య తొలి ఒప్పందం కుదిరింది. అప్పట్లో 100 మందికిపైగా బందీలను హమాస్ విడుదల చేసింది. ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. అందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రెండో ఒప్పందం కుదిరింది. హమాస్ మిలిటెంట్లు 25 మంది బందీలను వదిలేశారు. అంతేకాకుండా మరణించిన బందీల్లో 8 మంది మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వం 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ట్రంప్‌కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలియజేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. మోదీ గురువారం ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. గాజాలో శాంతి సాధనకు కృషి చేసినందుకు తన మిత్రు డిని అభినందించానంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ ప్లాన్ చరిత్రాత్మకమని పేర్కొన్నారు. అలాగే భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతిని తాము సమీక్షించామని తెలిపారు. రాబోయే రోజుల్లో పరస్పరం సంప్రదించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు మోదీ స్పష్టంచేశారు. నెతన్యాహుకు మోదీ ఫోన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా మోదీ ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ శాంతి ప్రణాళికలో పురోగతి పట్ల నెతన్యాహుకు అభినందనలు తెలిపారు. గాజా నుంచి బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సాయం పంపిణీ కోసం అడుగులు ముందుకు పడడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని మోదీ తేల్చిచెప్పారు. -
గాజాలో శాంతివీచిక!
రెండేళ్ల నుంచి అవిచ్ఛిన్నంగా క్షిపణులు, బాంబుల వర్షంతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన గాజా ఇకపై గుండెల నిండా ఊపిరి పీల్చుకోనుంది. హమాస్– ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందనీ, ఇరు పక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయనీ, శాంతి ప్రణాళికలో ఇది తొలి దశ అనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గమనిస్తే పూర్తిస్థాయి శాంతి స్థాపనకు మరికొంత సమయం పట్టొచ్చని స్పష్టంగానే తెలుస్తోంది. ఇంత హడావిడిగా సంధి కుదిరినట్టు ప్రకటించటం వెనక శుక్రవారం ప్రకటించబోయే నోబెల్ శాంతి బహుమతికి అర్హత సాధించటం కోసమేనని అందరికీ తెలుసు. ట్రంప్ అందుకు అర్హుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సిఫార్సు చేస్తున్నారు. తమ భూభాగంలోకి చొరబడి 2023 అక్టోబర్ 7న 1,100 మంది పౌరులను హతమార్చి, 251 మందిని అపహరించుకుపోయిన హమాస్ దుందుడుకు చర్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 24 నెలల పాటు గాజాపై నిప్పుల వాన కురిపించింది. ఏ క్షిపణి ఎక్కడ పడుతుందో, ఏ బాంబు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియక గాజా వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జనావాస ప్రాంతాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా క్షిపణులు ప్రయోగించటం, ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు క్షణంలో కూలి శిథిలాల గుట్టగా మారటం ప్రపంచ ప్రజలంతా చూశారు. కనీసం ఇద్దరో ముగ్గురో మరణించని కుటుంబం లేదు. కొన్ని కుటుంబాలైతే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మధ్యలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు... ఇజ్రాయెల్ ఉల్లంఘనల వల్ల పెద్దగా ఉపశమనం ఇచ్చింది లేదు. దీన్ని యుద్ధం అనడం ఇజ్రాయెల్ సాగించిన నరమేధాన్ని కప్పిపుచ్చే యత్నమే అవుతుంది. బలాబలాల్లో ఎంత వ్యత్యాసం ఉన్నా రెండు దేశాల మధ్య పరస్పరం కొన సాగే ఘర్షణల్ని యుద్ధం అంటారు. ఇక్కడ జరిగిందంతా వేరు. ఇజ్రాయెల్ లోపాయకారీ మద్దతుతో ఎన్నికల ద్వారా అధికారం చేజిక్కించుకుని గాజా ప్రజలపై పెత్తనం సాగిస్తూ, పాలస్తీనా అథారిటీని బేఖాతరు చేస్తూ వచ్చిన హమాస్ ఉన్నట్టుండి ఉగ్రవాద దాడికి పూనుకొంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 67,183 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,69,841 మంది గాయాల పాలయ్యారు. వైద్య సిబ్బంది, పాత్రికేయులన్న విచక్షణ లేకపోగా, చాలా సందర్భాల్లో వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యాలు హతమార్చటం ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగనిది. దాడులు ఆగుతాయంటున్నారు గనుక శిథిలాల తొలగింపు మొదలవుతుంది. అప్పుడు గానీ మృతుల అసలు సంఖ్య ఎంతో తెలియకపోవచ్చు. ఇప్పటికీ ఆచూకీ తెలియనివారు వేలల్లో ఉన్నారు. ఇజ్రాయెల్ ఘాతుకాల వెనక జాత్యహంకారం స్పష్టంగా కనబడుతుండగా, ఆ దుండగాన్ని ధర్మబద్ధంగా వ్యతిరేకించినవారిని యూదులపై వివక్ష ప్రదర్శిస్తున్నవారిగా జమకట్టి వేధించటం, విశ్వవిద్యాలయాల్లోకి పోలీసులు చొరబడి అరెస్టులు చేయటం ట్రంప్ నైజానికి అద్దం పడుతుంది. గాజాలో హమాస్ ఒక్కటే లేదు. పాలస్తీనా విమోచన కోసం పోరాడే సంస్థలు డజను వరకూ ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి పోలేదు. గాజాలోనే ఒక హద్దు నిర్ణయించుకుని ఆగింది. ఇప్పుడు కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఎంతవరకూ గౌరవిస్తుందో తెలియదనీ, ఒప్పందంలోని చాలా క్లాజులు అస్పష్టతతో ఉన్నా కేవలం ట్రంప్ హామీని నమ్మి సమ్మతించామనీ ఆ సంస్థల ప్రతి నిధులు చెబుతున్న తీరు గమనార్హం. ట్రంప్‌కు నోబెల్ వస్తే తప్ప ఈ ఒప్పందం సజావుగా ముందుకు పోదు. రెండో దశ చర్చల్లోనే అసలు అంశాలు ప్రస్తావనకొస్తాయి. అప్పుడు మరణమో, శరణమో పాలస్తీనా సంస్థలు తేల్చుకోక తప్పదు. ట్రంప్‌కు పురస్కారం లభిస్తే గాజా వాసులకు ఉన్నంతలో గౌరవప్రదమైన పరిష్కారం దొరకొచ్చు. రాకపోతే పరిణామాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. అయితే నరమేధాన్ని కొనసాగించటం ఇక సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే హమాస్ చెరలోని బందీలంతా విడుదలయ్యారు. అటు ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా పౌరులు దాదాపు 2,000 మంది విడుదలవుతున్నారు. గాజా విషయంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిపోయిన కొన్ని రోజులకే ఆ రెండు దేశాలూ తమకేం పట్టనట్టు ఈ శాంతి ఒప్పందం సాధించటం ఒక వైచిత్రి. -
ముళ్లదారిలో ఒక ముందడుగు
గాజాలో ‘శాంతి సాధన’ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రణాళికలో ‘మొదటి దశ’ అమలుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించినట్లు 8వ తేదీ రాత్రి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ప్రకటనను హమాస్, ఇజ్రాయెల్ వెంటనే ధ్రువీకరించాయి. అది స్థూలమైన అంగీకారం. అమలు ఏ విధంగా అనే వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. యథాతథంగా ఈ మొదటి దశ అనే దానిలో కాల్పుల విరమణతో పాటు రెండు అంశాలున్నాయి. ఒకటి – ఇజ్రాయెలీ బందీలను హమాస్, వారి ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయటం. రెండు – ఇజ్రాయెలీ సేనలు ‘అంగీకృతమైన’ (అగ్రీడ్ అపాన్) రేఖ వద్దకు ఉపసంహరించుకోవటం. ఈ రెండు అంశాల అమలు ఎంత సాఫీగా జరగవచ్చునన్నది వేచి చూడవలసిన విషయం. కాగా, రెండేళ్ళుగా సాగుతున్న గాజా మారణహోమంలో ఇపుడందరూ కొంత ఊపిరి తీసుకోగలరని మాత్రం చెప్పవచ్చు.ఏది అంగీకృత రేఖ?సరిగా రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌పై దాడి జరిపిన హమాస్, 250 మందిని బందీలుగా పట్టుకుంది. వారిలో ప్రస్తుతం సజీవులుగా 20 మంది, మృతదేహాల రూపంలో 28 మంది ఉన్నట్లు అంచనా. ఇజ్రా యెల్ వద్ద 250 మంది పాలస్తీనియన్లు జీవిత ఖైదీలుగా, సుమారు 1,300 మంది యుద్ధ ఖైదీలుగా ఉన్నట్లు చెప్తున్నారు. రెడ్ క్రాస్ ద్వారానో, మరొక విధంగానో వీరందరి విడుదలకు సమస్య ఉండక పోవచ్చు. కానీ, రెండవ అంశమైన ఇజ్రాయెలీ సేనల ఉపసంహరణ విషయం తేలటం తేలిక కాదు. ‘అంగీకృత రేఖ’ వద్దకు మాత్రమే పాక్షిక ఉపసంహరణ అన్నది ట్రంప్ ప్రణాళికలో గల అంశం కాగా, బందీలను తాము విడుదల చేయగానే పూర్తి ఉపసంహరణ జరగా లని హమాస్ షరతు పెడుతూ వచ్చింది. ఆ షరతును హమాస్ ఇప్పుడు సడలించిందా? ఏ విధంగా? ‘అంగీకృత రేఖ’ అర్థం పర స్పర అంగీకారమనా? లేక ట్రంప్, నెతన్యాహూల మధ్య అంగీ కారమా?ఇందులో ‘అంగీకృత రేఖ’ అనే మాట గురించిన సందేహాలు అనవసరమైనవిగా తోచవచ్చు. కానీ, ట్రంప్ 20 సూత్రాల ప్రణా ళికను ఎవరితోనూ సంప్రతించకుండా ట్రంప్, నెతన్యాహూల మధ్య రూపొందిన విషయాన్ని గుర్తు చేసుకుంటే, ఈ సందేహాలు సహేతు కమైన వని అర్థమవుతుంది. పైగా, మొదట తాము ట్రంప్‌కు చేసిన సూచనలను ట్రంప్, నెతన్యాహూ సమావేశం దరిమిలా మార్చివేశా రని అరబ్ నాయకులు బహిరంగంగా ఆరోపించటం కూడా గమనించదగ్గది. ‘అంగీకృత రేఖ’ అన్నది రాగల రోజులలో ఏ విధంగా ‘పరస్పర అంగీకృతం’ అయే రీతిలో రూపొందగలదో చూడవలసి ఉంటుంది.ఆయుధాలు వదిలేస్తారా?కాల్పుల విరమణ జరిగిన అనేక సందర్భాలలో ఏవో కారణా లతో ఏదో ఒక పక్షమో, ఇరుపక్షాలో ఉల్లంఘనలకు పాల్పడటం సర్వసాధారణం. ఇజ్రాయెల్‌కు సంబంధించి వారు లెబనాన్, సిరియా, గోలన్ కనుమలు, జోర్డాన్ ప్రాంతాలలో చేస్తున్నది అదే. అందువల్ల, గాజాలో ఉపసంహరణను పర్యవేక్షించేది, ‘అంగీకృత రేఖ’ వద్దకు ఉపసంహరణ తర్వాత నియంత్రించేది ఎవరో ఇంకా సూచనలు లేవు. గాజా సమస్య కేవలం గాజాకు పరిమితమైనది కాదు. వెస్ట్ బ్యాంక్‌తో కలిపి మొత్తం పాలస్తీనా దేశం ఏర్పాటుకు సంబంధించినది. ఇప్పటికే 150 దేశాలు గుర్తించినప్పటికీ కేవలం ఇజ్రాయెల్ కోసమని అమెరికన్లు భద్రతా సమితిలో పదే పదే వీటో చేస్తున్న తమ విధానాన్ని మార్చుకుని, రెండు స్వతంత్ర దేశ వ్యవస్థలు ఏర్పడే వరకు ఈ సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఈ విషయమై ట్రంప్ 20 సూత్రాలలో అస్పష్టతలు, వంచనా కళలు తప్ప నిజా యతీ లేదు. గాజాకు సంబంధించి పాలస్తీనియన్లు, అరబ్బుల ఆలో చనలు ఒక విధంగా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్ ఆలోచనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.అందుకు కొన్ని ఉదాహరణలను చెప్పుకొనేముందు... బందీలు, ఖైదీల విడుదల, అంగీకృత రేఖ వద్దకు సేనల ఉపసంహరణతో పాటుగా ఆ వెంటనే ముందుకు రాగల అంశాలేమిటో చూద్దాం. వాటిలో మొదటిది గాజా పౌరులకు సహాయం చేరటం. రెండవది హమాస్ నిరాయుధీకరణ. ఈ అంశాలు 20 అంశాలలో చేరి ఉన్నాయి గానీ, 8వ తేదీన ట్రంప్ చేసిన ప్రకటనలో లేవు. ఈజిప్టులో చర్చలు కొనసాగుతున్నందున సహజంగానే ముందుకు వస్తాయి. ఇందులో సహాయాల సరఫరాకు కూడా ఇంతకాలం ఆటంకాలు కల్పించిన ఇజ్రాయెల్, ఆ సహాయం హమాస్‌కు చేరుతున్నదనే వాదనలు చేసింది. సరఫరాలపై తమకు పూర్తి నియంత్రణ ఉండా లన్నది. ఇది పరిష్కారం కావలసి ఉన్న విషయం. హమాస్ నిరాయుధీకరణ జరిగి తీరాలన్నది అమెరికా, ఇజ్రాయెల్‌ల పట్టు దల కాగా, స్వతంత్ర పాలస్తీనాకు మార్గం సుగమం అయ్యే వరకు ఆ పని చేయబోమని హమాస్ ప్రకటిస్తున్నది. కాకపోతే, గాజాలో ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వాములం కాబోమని సూచించింది. అయితే, పాక్షిక నిరాయుధీకరణ కోసం ఒప్పించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారన్నవి 9వ తేదీ నాటి వార్తలు. పాక్షిక మంటే ఏమిటో, హమాస్ నిర్ణయమేమిటో తెలియాలి.ధూర్త ఆలోచనఇవి రెండవ దశగా భావిస్తే, ట్రంప్ ప్రణాళికలోని తక్కినవన్నీ మహా సమస్యాత్మకమైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే, స్వతంత్ర పాలస్తీనా అన్నదే లేకుండా ఆ రెండు భూభాగాలు తమ అధీనంలోకి రావాలన్నది అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఈ రోజు వరకు కూడా ఉన్న పథకం కాగా, అందుకు ససేమిరా అన్నది పాలస్తీనియన్ల చరిత్రాత్మకమైన జాతిపరమైన ఆకాంక్ష. ట్రంప్ 20 సూత్రాలలో హమాస్ సంపూర్ణ నిరాయుధీకరణ, వారి రక్షణ వ్యవస్థలన్నింటి విధ్వంసం, ఆ సంస్థ కొత్త ప్రభుత్వంలో పాల్గొనకపోవటం, గాజాను డీ–ర్యాడికలైజ్ చేయటం, గాజా పరిపాలనకు బయటి వారితో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, అమెరికా ఆధ్వర్యంలో రక్షణ బలాలు, గాజాను సెజ్‌గా మార్చి, బయటివారే అభివృద్ధి ప్రణాళికలు రచించి, బయటి నిధులతో అభివృద్ధి పరచటం వంటివి ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా అథారిటీ తాము ఆశించిన విధంగా ‘తనను తాను పూర్తిగా సంస్కరించుకున్న పక్షంలో’ స్వీయ నిర్ణయాధికారం, పాలస్తీనా ఏర్పాటు విషయాలు అపుడు ఆలోచిస్తారు. ఇదెంత ముళ్ల దారో, ధూర్తమైనదో స్పష్టంగా కనిపిస్తున్నదే!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
యుద్ధానికి ముగింపు.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందం
-
‘అపూర్వ అడుగు’.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
గాజా సంక్షోభం(Gaza War)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas)లు ముందుకు వచ్చాయి. మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. ·రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేసినట్లు ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో ట్రంప్ పోస్టు చేశారు. ‘‘గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు అంగీకరించినందుకు గర్వంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయంతో హమాస్ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుంది. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుంది. .. అన్ని పార్టీలను సమంగా చూస్తాం. అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజు. ఈ చరిత్రాత్మక, అపూర్వసంఘటన. ఇది నెరవేరడానికి మాతో పాటు కలిసి పని చేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, టర్కీ(తుర్కీయే)కు థ్యాంక్స్’’ అని ట్రంప్ పేర్కొన్నారు.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ మిలిటెంట్లు విరుచుపడి 1,200 మందికిపైగా హతమార్చి, 250 మందికిపైనే బందీలుగా చేసుకున్నారు. ఆపై హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాపై భీకరంగా విరుచుకుపడి హమాస్ ముఖ్య నేతలందరిని హతమార్చింది. ఈ రెండేళ్ల యుద్ధంలో 67 వేలమందికిపైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. 1.70 లక్షలమంది గాయపడ్డారు. లక్షకుపైగా భవనాలు నేలమట్టమయ్యాయి. గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను హమాస్ ముందు ఉంచారు. ఈ ప్రణాళికకు ఒప్పుకోకుంటే నరకం చూపిస్తానని ఇటీవల హెచ్చరించారు. మరోవైపు మూడు రోజులుగా శాంతి ప్రణాళికపై ఈజిప్టులో ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మొదటి దశ అమలుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇజ్రాయెల్ ఏమందంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌కు గొప్పరోజుగా అభివర్ణించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు, బందీలందరినీ ఇళ్లకు చేర్చేందుకు రేపు ప్రభుత్వాన్ని సమావేశపరుస్తానని పేర్కొన్నారు. హమాస్ ఏమందంటే.. ఇటు శాంతి ఒప్పందాన్ని హమాస్ ధ్రువీకరిస్తూ.. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్టు, తుర్కియే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ, మానవత సాయానికి అనుమతి, ఖైదీల మార్పిడి చోటుచేసుకోనుందని వెల్లడించింది. గాజా ప్రజలు సాటిలేని ధైర్యం, వీరత్వం ప్రదర్శించారని హమాస్ పేర్కొంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వయం నిర్ణయాలు సాధించేవరకు తమ ప్రజల హక్కులను వదులుకోమని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: దీపావళికి అమెరికాలో సెలవు ప్రకటన -
గాజా@2: యుద్ధం ముగిసేది ఎప్పుడంటే.. నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Gaza War) రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు సుమారు 67 వేలమంది పౌరులు(సగం మహిళలు, చిన్నారులే), దాదాపు 2 వేల మంది ఇజ్రాయెల్ తరఫున మరణించారు. ఈ తరుణంలో యుద్ధం ముగింపు ఎప్పుడనే దానిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. మేము యుద్ధం ముగింపు దశకు చేరుకున్నాం. కానీ ఇంకా పూర్తిగా ముగించలేదు. గాజాలో ప్రారంభమైనది గాజాలోనే ముగుస్తుంది. మిగిలిన మా 46 బందీల విడుదలతో, హమాస్ పాలన అంతమయ్యే వరకు ఇది కొనసాగుతుంది అని ఓ ఇంటర్వ్యూలో తాజాగా వ్యాఖ్యానించారాయన. బెన్ షాపిరోకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో నెతన్యాహు(Netanyahu On gaza War) మాట్లాడుతూ.. ఈ యుద్ధంతో ఇజ్రాయెల్ మరింత బలంగా ఎదిగింది. ఇరాన్ మద్దతు సంస్థల కూటమి(హమాస్, హెజ్బొల్లా, హౌతీలు ఉంటాయి)ని ఎదురించి మరీ నిలిచాం. ఇక మిగిలింది హమాస్ అంతమే అని అన్నారు. ‘‘మేం హమాస్‌ను ఇంకా పూర్తిగా నాశనం చేయలేదు. కానీ, కచ్చితంగా అక్కడిదాకా చేరతాం. యుద్ధం ముగిసింది అంటే.. మా బంధీలు విడుదల కావాలి. అలాగే.. హమాస్ పాలన అంతం అవ్వాలి అని అన్నారాయన. ట్రంప్‌తో సంబంధాల గురించి.. ఇటీవల కొన్ని అభిప్రాయ బేధాలు తలెత్తినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తన సంబంధం బాగానే ఉందని నెతన్యాహు(Trump Netanyahu Relation) చెప్పుకొచ్చారు. హమాస్‌పై పోరాటంలో అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ప్రపంచానికి నిజాన్ని చూపించాయని అన్నారాయన. అయితే.. America First" అంటే అమెరికా ఒక్కటే కాదని, ఇజ్రాయెల్ వంటి మిత్ర దేశాలు అవసరమని నెతన్యాహూ ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇరాన్ 11,000 కిలోమీటర్ల పరిధి ఉన్న అంతర్జాతీయ క్షిపణులు అభివృద్ధి చేస్తోందని.. ఇది అమెరికా తూర్పు తీరాన్ని చేరగలవని హెచ్చరించారాయన. అలా మొదలైన యుద్ధం..2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల విస్తరణ.. వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురి కావడం, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు.. ఈ వరుస పరిణామాలు హమాస్ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 67, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి.. గాజా యుద్ధం రెండో వార్షికోత్సవం (అక్టోబర్ 7, 2025)లో అడుగుపెట్టిన వేళనే.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈజిప్ట్ రాజధాని కైరో వేదికగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20-పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి. ఇదే చివరి అవకాశమని, ఆలస్యం వద్దని, త్వరపడకపోతే భారీ రక్తపాతం తప్పదని ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు కూడా.ఇదీ చదవండి: భారత్ సమాధి కాక తప్పదు! -
సమయం లేదు.. భారీ రక్తపాతం ఎదురు చూస్తోంది
గాజా శాంతి చర్చల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజా శాంతి ప్రణాళిక అమలుకు ఎంతో సమయం లేదని.. త్వరగా ముందుకు కదలాలంటూ ఇజ్రాయెల్, హమాస్లకు సూచించారాయన. ఈ క్రమంలో చర్చలు ఆలస్యమైనా.. అటు ఇటు అయినా.. దారుణమైన పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇది శతాబ్దాల నాటి ఘర్షణ. స్వయంగా ఈ చర్చలను నేనే పర్యవేక్షిస్తుంటా(Trump Gaza Plan). సమయం ఎంతో కీలకం. ఆలస్యం చేస్తే అత్యంత భారీ రక్తపాతం జరుగుతుంది. అలాంటిదాన్ని ఎవ్వరూ చూడాలనుకోరు.. అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా హెచ్చరించారు. ‘‘ఈ వారం చివర్లో గాజా యుద్ధాన్ని ముగించేందుకు.. బందీలను విడుదల చేయడానికి.. అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాంతిని నెలకొల్పేందుకు సానుకూల చర్చలే జరుగుతున్నాయి’’ ట్రంప్ అని ఆ పోస్టు ద్వారా వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ చర్చలు కీలక దశలోనే ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. ట్రంప్ గాజా ప్లాన్‌పై ఇజ్రాయెల్, హమాస్(Israel Hamas Deal) రెండూ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. చర్చలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ తరుణంలో.. ఇవాళ(సోమవారం) ఈజిప్ట్‌లో ట్రంప్ గాజా ప్లాన్‌పై చర్చలు జరగనున్న నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్‌పై ఒత్తిడిని పెంచేందుకేనని స్పష్టంగా తెలుస్తోంది. కైరో(Cairo)లో ఇవాళ జరుగనున్న ఈ చర్చల్లో హమాస్, ఇజ్రాయెల్, అమెరికా, ఈజిప్ట్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. గాజా పట్టణంలో కొనసాగుతున్న యుద్ధం.. మానవీయ సంక్షోభ నేపథ్యంలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించడం వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే హమాస్ విముక్త గాజా అంశమూ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ సరిహద్దులో జరిపిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులతో.. ఇప్పటిదాకా వేల మంది పౌరులు మృతి చెందారు. తీవ్ర ఆహార సంక్షోభం నెలకొందక్కడ. ఈ పరిణామాలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో శాంతి ఒప్పందం త్వరగా కుదరాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. గాజా శాంతి ఒప్పందంలో(Gaza Peace Deal) భాగంగా ట్రంప్ సూచించిన 20 అంశాల శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ సైతం అంగీకారం తెలిపినప్పటికీ.. హమాస్ లక్ష్యంగా గాజా నుంచి పూర్తిగా తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Truth Social వేదికగా చేసిన తాజా పోస్టులో.. గాజా శాంతి ఒప్పందం మొదటి దశ ఈ వారం పూర్తవుతుందని చెబుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: భారత్‌పై నోరు పారేసుకున్న పాక్ మంత్రి -
నేడు ఇజ్రాయెల్, హమాస్ చర్చలు
కైరో: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రధాన లక్ష్యాలుగా సోమవారం ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు మొదలుకానున్నాయి. పరోక్షంగా జరిగే ఈ చర్చల కోసం ఇజ్రాయెల్, హమాస్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ వారంలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల మొదలుకానుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్‌తోపాటు హమాస్ సానుకూలంగా స్పందించడం తెల్సిందే. హమాస్ చెర నుంచి ఇజ్రాయెలీలకు విముక్తి కల్పించడం, బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీని యన్లను విడుదల చేయడంపైనే సోమవారం ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సైతం పాలుపంచుకుంటారని ఈజిప్టు విదేశాంగ శాఖ తెలిపింది. బందీల విడుదల, గాజాలో 2025 ఆగస్ట్‌లో ఉన్న ప్రాంతాల్లోకి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకోవడంపై అంగీకారం కుదిరిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అతి సమీపంలో ఉన్నట్లేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. కాల్పుల విరమణ దిశగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముస్లిం మెజారిటీ కలిగిన 8 దేశాలు ఓ ఉమ్మడి ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. పాలస్తీనా అథారిటీకి గాజాను అప్పగించాలని, గాజాను వెస్ట్‌బ్యాంక్‌లో విలీనం చేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆ దేశాలు డిమాండ్ చేశాయి. ఈ చర్యలన్నిటి కంటే ముందుగా బందీల విడుదల, అందుకు బదులుగా ఖైదీలకు విముక్తి జరగాల్సి ఉందన్నారు. ఇలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాపై బాంబింగ్‌ను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను కోరిన తర్వాతా దాడులు కొనసాగినట్లు సమాచారం. గాజా నగరం, రఫాలపై ఆదివారం జరిగిన దాడుల్లో కనీసం 12 మంది చనిపోయారని వివిధ ఆస్పత్రుల సిబ్బంది చెప్పారు. కాల్పుల విరమణ ఇంకా మొదలుకానందున, గాజాలో ప్రస్తుతానికి బాంబింగ్‌ను పూర్తిగా ఆపేయలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి మీడియాకు చెప్పారు. అదేవిధంగా, చర్చలను జాప్యం చేసేందుకు హమాస్ చేసే ప్రయత్నాలపై ఓ కన్నేసి ఉంచామని కూడా ఆమె తెలిపారు. -
‘త్వరపడండి.. లేదంటే విధ్వంసమే’.. హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు పాలస్తీనా గ్రూప్ హమాస్‌ను హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందానికి త్వరపడి, అంగీకరించాలని లేదంటే గాజాలో మరింత విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.యుద్ధ విరమణ విషయంలో హమాస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి.. లేకుంటే దానికి ఇచ్చిన అన్ని అవకాశాలు నిలిచిపోతాయి. గాజాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే సహించేదిలేదంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పేజీలోని ఒక పోస్టులో పేర్కొన్నారు.బందీల విడుదల, శాంతి ఒప్పందానికి అనుగుణంగా ఇజ్రాయెల్ తాత్కాలికంగా బాంబు దాడులను ఆపివేసిందని ట్రంప్ పేర్కొన్నారు. తమ దేశ సీనియర్ రాయబారి ఒకరు బందీల విడుదల వివరాలను ఖరారు చేయడానికి ఈజిప్టుకు వెళుతున్నారని, ఇకపై ఇజ్రాయెల్‌తో పాటు శాంతి ప్రణాళికను అమలు చేయడంలో హమాస్ జాప్యం చేస్తే సహించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. బందీల విడుదలపై వివరాలను ఖరారు చేసేందుకు, ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు రూపొందించిన ఒప్పందంపై చర్చించేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈజిప్టుకు ప్రాంతానికి వెళుతున్నారని వైట్ హౌస్ అధికారి మీడియాకు తెలిపారు.రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే ప్రణాళికకు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ శుక్రవారం సానుకూలంగా స్పందించింది. బందీలను విడుదల చేయడానికి, ఒప్పంద వివరాలను చర్చించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో యుద్ధంలో దెబ్బతిన్న భూభాగంపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రంప్ ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చారు. అయితే ఇజ్రాయెల్ దళాలు ట్రంప్ మాటను ఉల్లంఘిస్తూ గాజాలో దాడులకు దిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 57 మంది మృతిచెందారని, వారిలో ఒక్క గాజా నగరానికి చెందినవారే 40 మంది ఉన్నారని ఎన్క్లేవ్ పౌర రక్షణ సంస్థ తెలిపింది. -
ట్రంప్ మాటను లెక్కచేయకుండా!! గాజాలో మళ్లీ..
ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్ సిద్ధంగా ఉందని.. బందీల విడుదలకు అంగీకరించిందిని.. గాజాలో దాడులు ఆపాలని.. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటను లెక్కచేయకుండా మళ్లీ దాడులు కొనసాగిస్తోంది. శనివారం గాజాలో ఇజ్రాయెల్ బలగాలు జరిగిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. బందీల విడుదలతో పాటు ట్రంప్ ప్రతిపాదనలో పలు అంశాలకు హమాస్ అంగీకరించిందని.. అమెరికా ఈ యుద్ధాన్ని ముగించే దిశగా ముందుకు వెళ్తోందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అటుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సైతం ‘ట్రంప్ గాజా ప్లాన్’(Trump Gaza Plan) తొలి దశ తక్షణమే అమలు కాబోతోందని అన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ సైతం దీనిని ధృవీకరించారు. దీంతో పలు దేశాల అధినేతలూ ట్రంప్ కృషికి అభినందనలు తెలియజేశారు కూడా. అయితే.. అనూహ్యాంగా.. ఈ ప్రకటనలు వెలువడిన గంటల వ్యవధిలోనే గాజాపై ఇజ్రాయెల్ బలగాలు(Israel Attacks Gaza Agian) విరుచుకుపడ్డాయి. గాజా సిటీలో జరిపిన దాడుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. దక్షిణ భాగంలోని ఖాన్ యూనిస్ వద్ద మరో ఇద్దరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. అయితే తాజా దాడులపై ఇజ్రాయెల్, అమెరికా, హమాస్ వైపుల నుంచి స్పందన రావాల్సి ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల విస్తరణ.. వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురి కావడం, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు.. ఈ వరుస పరిణామాలు హమాస్ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 66, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే తాము హమాస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నామని, పౌరులను రక్షణ కవచంలా వాళ్లు ఉపయోగించుకుంటున్నారంటూ ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఎంట్రీతో పరిస్థితి మారింది. అదే సమయంలో బంధీల విడుదల కోసం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. ఈ తరుణంలో.. ట్రంప్ ప్రతిపాదించిన 20-పాయింట్ల శాంతి ఒప్పందానికి హమాస్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం 48 మంది బంధీలు ఉన్నారని, వారిలో 20 మంది జీవించి ఉన్నారని తెలుస్తోంది. తొలి దశలో భాగంగా.. బంధీల విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపింది. -
ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు
గాజా: గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు.నరకం తప్పదన్న ట్రంప్ హెచ్చరికలతో..దీనిలోని నిబంధనల ప్రకారం హమాస్ తన ఆధీనంలో ఉన్న బందీలను 72 గంటల్లోగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఆయుధాలను విడిచిపెట్టి, పరిపాలన నుంచి తప్పుకోవాలని ప్రధానంగా ట్రంప్ సూచించారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే అంగీకారం తెలిపారు. కాగా ఈ ప్రణాళికను అంగీకరించని పక్షంలో నరకం తప్పదని ట్రంప్ ఇప్పటికే హమాస్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హమాస్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిబంధనలకు తలొగ్గింది. బందీల విడుదల విషయంలో మధ్యవర్తులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇదేవిధంగా గాజా పరిపాలనను స్వతంత్ర టెక్నోక్రాట్ పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఈ ప్రణాళికలోని పలు అంశాలపై పాలస్తీనా వర్గాలతో సంప్రదింపులు అవసరమని తెలిపింది. President Donald J. Trump shares a powerful message in response to Hamas' statement regarding his peace plan: "Very importantly, I look forward to having the hostages come home." pic.twitter.com/RZArVNcXc9— The White House (@WhiteHouse) October 3, 2025ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలుమరోవైపు ట్రంప్ ప్రణాళికకు ఇజ్రాయెల్, అరబ్ తదితర ముస్లిం దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. బందీల విడుదలకు హమాస్ మొగ్గు చూపడం శాంతి దిశగా పడిన కీలక అడుగుగా అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై తుది ఒప్పందం కుదిరి, గాజాలో యుద్ధానికి ముగింపు పడుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. హమాస్ నిర్ణయం దరిమిలా గాజాపై బాంబు దాడులను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. ఇంతలో ట్రంప్ ప్రణాళిక మొదటి దశను తక్షణ అమలు చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది.శాశ్వత శాంతికి హమాస్ సిద్ధం?గాజాలో శాంతిని సాధించగల ఏకైక వ్యక్తిగా తనను తాను అభివర్ణించుకున్న ట్రంప్ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు మద్దతు పలికారు. అలాగే హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలి. తద్వారా బందీలను సురక్షితంగా, త్వరగా బయటకు తీసుకురావచ్చు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్నారు. అదేవిధంగా నెతన్యాహు కార్యాలయం ‘ఇజ్రాయెల్.. నిర్దేశిత సూత్రాలకు అనుగుణంగా యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా, ఉందని, ఇది అధ్యక్షుడు ట్రంప్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది’ అని తెలిపింది. -
నో అంటే నరకమే!
గాజా స్ట్రిప్: గాజాలో శాంతి సాధన కోసం తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల హమాస్ మిలిటెంట్లు ఇంకా స్పందించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా ఒప్పుకోవాలని అల్టిమేటం విధించారు. లేకపోతే నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తామని హమాస్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై ఈ నెల 7వ తేదీకి రెండేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే 20 శాతం శాంతి ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ట్రంప్ ప్లాన్‌ను ఇజ్రాయెల్ అంగీకరించింది. ప్రపంచ దేశాలు సైతం స్వాగతించాయి. హమాస్ మాత్రం ఇంకా స్పందించలేదు. ట్రంప్ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యం కాదని, ఇందులో కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. అభ్యంతకర అంశాలపై చర్చించాల్సి ఉందని మధ్య వర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్ కూడా చెబుతున్నాయి. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతాం గడువులోగా హమాస్ తమతో ఒప్పందానికి రావాల్సిందేనని ట్రంప్ స్పష్టంచేశారు. ఇదే ఆఖరి అవకాశంగా భావించాలన్నారు. ఒప్పందానికి రాకపోతే ఇప్పటిదాకా ఎవరూ చూడని నరకాన్ని హమాస్‌కు చూపిస్తామని ఉద్ఘాటించారు. మిలిటెంట్లపై పూర్తిస్థాయి సైనిక చర్య ప్రారంభమవుతుందన్నారు. ఒక మార్గంలో కాకపోతే.. మరో మార్గంలోనైనా మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతామని ట్రంప్ పేర్కొన్నారు. హమాస్‌ను పూర్తిగా అంతం చేస్తామన్న సంకేతాలిచ్చారు. -
గాజాలో పని పూర్తిచేసే తీరుతాం
ఐక్యరాజ్య సమితి: గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన యుద్ధం మధ్యలో ఆపే ప్రసక్తే లేదని, పని పూర్తిచేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టంచేశారు. గాజా యుద్ధం, పాలస్తీనా విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు పశ్చిమదేశాలు తలొగ్గవచ్చేమో కానీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గదని తేల్చి చెప్పారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని దేశాలు నెతన్యాహూ ప్రసంగాన్ని బహిష్కరించాయి. కొన్ని దేశాల ప్రతినిధులు సభలోనే ఉండి నెతన్యాహూ ప్రసంగిస్తున్నప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మరికొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆమెరికా మాత్రం ఎప్పటిలాగే ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. చాలావరకు ముఖ్య దేశాలన్నీ ఈ సమావేశానికి జూనియర్ అధికారులను పంపి తమ నిరసనను తెలిపాయి. గాజాపై దాడులను ఆపాలని అంతర్జాతీయంగా ఎంతగా ఒత్తిళ్లు వస్తున్నా.. నెతన్యాహూ పట్టించుకోకపోవటంతో ఇటీవలే ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రమంగా అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతున్నా నెతన్యాహూ వెనక్కి తగ్గేదే లేదు అని ప్రకటించారు. పాలస్తీనాను గుర్తించిన దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమదేశాల నేతలు ఒత్తిళ్లకు తలొగ్గవచ్చు. కానీ, మీకు నేను ఒక హామీ ఇస్తున్నా.. ఇజ్రాయెల్ ఎప్పటికీ తలొగ్గదు. మీ అవమానకరమైన నిర్ణయం (పాలస్తీనాను దేశంగా గుర్తించటం) యూదులు, అమాయక పౌరులకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. యూదు వ్యతిరేక భావజాలం ఎప్పటికీ అంతమవదేమో.. కానీ, అది దారుణంగా చావాలి’అని పేర్కొన్నారు. ప్రసంగం సందర్భంగా నెతన్యాహూ, ఆయన బృందం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసి పౌరులను బందీలుగా తీసుకెళ్లిన ఘటనను చూపించే క్యూఆర్ కోడ్‌ను ధరించారు. ‘ది కర్స్’పేరుతో రూపొందించిన ఓ మ్యాప్‌ను కూడా ప్రదర్శించారు. -
ట్రంప్‌నకు హమాస్ రహస్య లేఖ?
మధ్యప్రాచ్యంలో మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. 24 మంది బందీల విడుదలతో పాటు 60 రోజుల కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు హమాస్ రహస్య లేఖ పంపినట్లు సమాచారం. మరోవైపు, గాజా యుద్ధం ముగింపునకు శాంతి ప్రణాళికను ట్రంప్ సిద్ధం చేసినట్లు పలు వార్త కథనాలు వెల్లడిస్తున్నాయి. దోహాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన తర్వాత గాజా శాంతి చర్చలు నిలిచిపోగా.. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌తో హమాస్ సంప్రదింపులకు ప్రయత్నం చేస్తోంది. అయితే, ట్రంప్ బృందం ఈ విషయంపై స్పందించలేదు.కాగా, గాజా నగరంపై గట్టి పట్టున్న హమాస్‌తో అమీతుమీ తేల్చుకుంటామంటూ భారీగా సైనికులను రంగంలోకి దించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. దాడుల తీవ్రతను కొనసాగిస్తోంది. శుక్రవారం( సెప్టెంబర్ 19) రాత్రి నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ గాజా వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో సుమారుగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గాజా నగరంలోని షావా స్క్వేర్ సమీపంలో జరిగిన దాడిలో ఐదుగురు, మరో దాడిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు చనిపోయారు.గత 23 నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగిస్తున్న దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 65,100 దాటిపోయింది. భవనాలను నేలమట్టం చేస్తుండటంతో గాజా ప్రాంతంలో ఉన్న కనీసం 90 శాతం మంది పాలస్తీనియన్లకు నిలువ నీడ కూడా లేకుండాపోయింది. దాదాపు సగం మంది, అంటే సుమారు 4.50 లక్షల మంది గాజా నగరాన్ని వీడి వెళ్లిపోయినట్లు పాలస్తీనా సివిల్ డిఫెన్స్ విభాగం తెలిపింది. ఇలాఉండగా, గాజా ప్రాంతంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారుల కోసం తీసుకువచ్చిన అత్యవసర ఆహార పదార్థాలున్న నాలుగు ట్రక్కులను సాయుధులు వచ్చి తరలించుకుపోయారంటూ యునిసెఫ్ పేర్కొంది. -
మరో 43 మంది పాలస్తీనియన్లు మృతి
కైరో: గాజా నగరంపై గట్టి పట్టున్న హమాస్‌తో అమీతుమీ తేల్చుకుంటామంటూ భారీగా సైనికులను రంగంలోకి దించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. దాడుల తీవ్రతను కొనసాగిస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ గాజా వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో కనీసం 43 మంది ప్రాణాలు కోల్పోయారని అల్‌జజీరా తెలిపింది. వీరిలో గాజా నగరంలోని షావా స్క్వేర్ సమీపంలో జరిగిన దాడిలో ఐదుగురు, మరో దాడిలో ఒకే కుటుంబంలోని ఆరు గురు చనిపోయారని ఆరోగ్య విభాగం తెలిపింది. వీరు షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సెల్మియా బంధువులని ఆస్పత్రి ఎండీ రమీ ఎమ్‌హన్నా చెప్పారు. ఇలాఉండగా, గత 23 నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగిస్తున్న దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 65, 100 దాటిపోయింది. భవనాలను నేలమట్టం చేస్తుండటంతో గాజా ప్రాంతంలో ఉన్న కనీసం 90 శాతం మంది పాలస్తీ నియన్లకు నిలువ నీడ కూడా లేకుండాపోయింది. దాదాపు సగం మంది, అంటే సుమారు 4.50 లక్షల మంది గాజా నగరాన్ని వీడి వెళ్లిపోయినట్లు పాలస్తీనా సివిల్ డిఫెన్స్ విభాగం తెలిపింది. ఇలాఉండగా, గాజా ప్రాంతంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారుల కోసం తీసుకువచ్చిన అత్యవసర ఆహార పదార్థాలున్న నాలుగు ట్రక్కులను సాయుధులు వచ్చి తరలించుకుపోయారని యునిసెఫ్ శుక్రవారం తెలిపింది. -
ఇజ్రాయెల్ ఘాతుకం
గాజాలో రెండేళ్లుగా తాను సాగిస్తున్న దుశ్చర్యలను చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిన ప్రపంచానికి ఇజ్రాయెల్ ఊహించని షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్ రాజధాని దోహాలో సమావేశమైన హమాస్ రాజకీయ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని మంగళవారం వైమానిక దాడులకు తెగబడి ఆరుగురిని హతమార్చింది. రాయబార కార్యాలయాలు, సూపర్ మార్కెట్లు, పాఠశాలలు ఉన్న కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలో దాడి జరపటాన్ని గమనిస్తే ఇజ్రాయెల్ దేన్నీ ఖాతరు చేయదల్చు కోలేదని స్పష్టమవుతోంది. కాల్పుల విరమణ సాకారమై, హమాస్ చెరలోని బందీలు విడుదల కావాలని ఇజ్రాయెల్ కూడా కోరుకుంటోంది. కనీసం పైకి అలా చెబుతోంది. ఒప్పందానికి హమాస్‌కు ఇదే చిట్టచివరి అవకాశమని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలోనే ఆ సంస్థ సమావేశమైంది. రెండేళ్లుగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు ఖతార్ ప్రయత్నిస్తోంది. అందుకు అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుంది. హమాస్‌ను ఒప్పించాల్సిన అవసరం ఏర్పడినప్పుడల్లా ఆ రెండూ ఖతార్నే ఆశ్రయించేవి. పైగా అమెరికాకు అది అత్యంత సన్నిహిత దేశం. పశ్చిమాసియాలోని అతి పెద్ద అమెరికా సైనిక స్థావరం ఆ దేశంలోనే ఉంది. ఇటీవల ట్రంప్ ఖతార్ వచ్చినప్పుడు ఆయనకు అత్యంత విలాసవంతమైన బోయింగ్–747 జెట్ విమానాన్ని కానుకగా సమర్పించుకుంది. అమెరికాతో లక్ష కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇన్ని ‘మంచి లక్షణాలు’ గల దేశంపై ఇజ్రాయెల్ ఎట్లా దాడి చేయగలిగిందన్నదే గల్ఫ్ దేశాల రాజధానుల్లో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. గాజాలో శాంతి నెలకొనకుండా చూడటమే ఇజ్రాయెల్ ఉద్దేశంగా కనబడుతోందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ చేసిన వ్యాఖ్య నిజమే కావొచ్చుగానీ... అందుకు ఖతార్ సహా గల్ఫ్ దేశాల బాధ్యత కూడా ఉంది. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాద చర్యకు పాల్పడి 1,195 మందిని అమానుషంగా కాల్చిచంపి 250 మంది పౌరులను అపహరించింది. ప్రపంచ దేశాలన్నీ ఆ ఘాతుకాన్ని ఖండించాయి. ప్రతీకారం పేరుతో ఈ రెండేళ్లలో ఇజ్రాయెల్ 64,656 మంది పాలస్తీనా పౌరులను పొట్టనబెట్టుకుంది. రేపో మాపో పూర్తిగా గాజాను అధీనంలోకి తెచ్చుకోబోతోంది. ఈ కాలమంతా గల్ఫ్ దేశాలు చోద్యం చూశాయి. సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, యెమెన్లలో అది వైమానిక దాడులు సాగించినా మౌనంగా ఉండిపోయాయి. దాని పర్యవసానంగానే ‘మిత్రదేశం’గా ఉన్న ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. మరో దేశం సార్వభౌమ త్వాన్ని దెబ్బతీసేందుకు ఏ దేశమూ పూనుకోరాదని ఐక్యరాజ్యసమితి చార్టర్ నిర్దేశిస్తోంది. అలాచేస్తే అది దురాక్రమణే అవుతుందంటున్నది. కానీ తాను అన్నిటికీ అతీతమని ఇజ్రాయెల్ భావన.గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఏదో ఒకటి చేయాలని ఖతార్ ఇచ్చిన పిలుపుతో గురువారం సమావేశం జరిగింది. త్వరలో అరబ్–ఇస్లామిక్ శిఖరాగ్ర సదస్సు కూడా ఉంటుందంటున్నారు. అయితే ఆ ‘ఏదో ఒకటి’ సైనిక చర్య అయితే కాదు. కనీసం ఆ ఆలోచన చేసినా అమెరికా నొచ్చుకుంటుందని వాటికి తెలుసు. అమెరికా–గల్ఫ్ దేశాల బంధం ఉభయ తారకం. అమెరికా సైనిక సాయంపై గల్ఫ్ ఆధారపడి ఉండగా... పశ్చిమాసియాలో తన పలుకుబడి చెక్కుచెదరకుండా ఉండటానికి గల్ఫ్ దేశాల అవసరం అమెరికాకుంది. ఈ అమరికను మార్చటమే ఇజ్రాయెల్ ఆంతర్యం కావొచ్చు. ఎటూ గాజా హస్తగతం కాబోతున్నది కనుక, ఇదే అదునుగా ఈ ప్రాంతంలో తానే ప్రధాన కేంద్రంగా ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు కనబడుతోంది. కానీ అదంత సులభం కాదు. సౌదీ, యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్ల సమష్టి మదుపు నిధి 4 లక్షల కోట్ల డాలర్ల పైమాటే. ఈ సంపద ఆసరాతో గల్ఫ్ దేశాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను శాసించగలవు. గణనీయంగా పలుకుబడి పెంచుకోగలవు. అందుకే ‘ఏదో ఒకటి’ చేయాలన్న ఖతార్ పిలుపుపై ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమ చాప కిందకు నీళ్లొస్తుంటే చూస్తూ ఊరుకోవటం ఆత్మహత్యా సదృశమని గల్ఫ్ దేశాలు ఇప్పటికైనా గుర్తించాలి. ఈ సంక్షోభ సమయంలో అమెరికాకు వంతపాడటం కాక, సొంత గొంతుక వినిపిస్తేనే మనుగడ ఉంటుందని తెలుసుకోవాలి. -
ఇస్లాం గడ్డపై ఇజ్రాయెల్ రక్తపాతం
-
హమాస్ నేతలే లక్ష్యంగా ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి
దుబాయ్: ఖతార్‌లో ఉంటున్న హమాస్ నేతలే లక్ష్యంగా మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెరతీసింది. రాజధాని దోహాలోని హమాస్ రాజకీయ ప్రధాన కార్యాలయంపై దాడి జరిపింది. దాడి అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాడిలో అజ్ఞాతంలో ఉన్న హమాస్ గాజా చీఫ్ ఖలిల్ అల్ హయ్యా కుమారుడు సహా తమ సభ్యులు ఐదుగురు చనిపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. కాల్పుల విరమణ చర్చల మధ్యవర్తులు త్రుటిలో తప్పించుకున్నారని తెలిపింది. తమ అంతరంగిక భద్రతా దళం అధికారి కూడా మృతుల్లో ఉన్నారని ఖతార్ తెలిపింది.తామే ఈ దాడికి పాల్పడ్డామని, తమదే పూర్తి బాధ్యతని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా ప్రకటించడం గమనార్హం. జెరూసలేంలో సోమవారం ఆరుగురిని చంపిన ఘటన నేపథ్యంలోనే ఈ దాడికి పథకం వేశామన్నారు. తమకు అందిన అదనపు నిఘా సమాచారంతో హమాస్ నేతలే లక్ష్యంగా దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. దీనిపై ముందుగా అమెరికాకు సమాచారం ఇచ్చామని ఓ అధికారి వెల్లడించారు. అమెరికా మిత్రదేశమైన ఖతార్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడితో సంక్షోభం మరింత ముదురుతుందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది.కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు నిలిచిపోవడమే కాకుండా, బందీల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఇజ్రాయెల్ చర్య అన్ని అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కడమేనని ఖతార్ పేర్కొంది. ఇజ్రాయెల్‌ది పిరికిపంద అని వ్యాఖ్యానించింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ దాడిని ఖండించారు. యూఏఈ, సౌదీ అరేబియా దాడిని తీవ్రంగా తప్పుబట్టాయి. -
‘బందీ ఒప్పందం’పై హమాస్‌కు ట్రంప్ తుది హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హమాస్‌కు తుది హెచ్చరిక జారీ చేశారు. గాజా నుండి బందీలను విడుదల చేయడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ట్రంప్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్‌ను కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ ఏడున ‘ఇజ్రాయెల్ ప్రజలు నా నిబంధనలను అంగీకరించారు. హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో రాశారు.‘ఒప్పందాన్ని అంగీకరించకపోతే వచ్చే పరిణామాల గురించి ఇప్పటికే హమాస్‌ను హెచ్చరించాను. ఇది నా తుది హెచ్చరిక, మరొకటి ఉండదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదేవిధంగా విలేకరులతో మాట్లాడిన ఆయన గాజా ఒప్పందానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ‘గాజాపై మనం త్వరలోనే ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. బందీల తిరిగి తెచ్చుకుంటామని ఆశిస్తున్నాను. గాజా యుద్ధం మేము పరిష్కరించాలనుకుంటున్న పెద్ద సమస్య’ అని ట్రంప్ అన్నారు. .@POTUS: "I think we're going to have a deal on Gaza very soon. It's a hell of a problem... I think we're going to get [all the hostages]." pic.twitter.com/KZmYAEFLQn— Rapid Response 47 (@RapidResponse47) September 7, 2025గాజాలో మిగిలిన బందీల గురించి ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం 23వ నెలలోకి అడుగుపెడుతున్నందున అక్కడ మిగిలిన బందీల సంఖ్య 20 కంటే తక్కువగా ఉండవచ్చన్నారు. వారిలో చాలామంది చనిపోయి ఉండవచ్చన్నారు. కాగా ఈ ఒప్పందం ప్రకారం హమాస్ దగ్గర మిగిలిన 48 మంది బందీలను ఇజ్రాయెల్ జైలులో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా కాల్పుల విరమణ మొదటి రోజునే విడుదల చేయాలి. కాల్పుల విరమణ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలి. కాగా ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ అన్నారు. హమాస్ బందీలను విడుదల చేసి, ఆయుధాలను వదిలివేస్తే గాజాలో యుద్ధం ముగించవచ్చన్నారు. -
హమాస్‌కు నరక ద్వారాలు తెరుస్తాం
గాజా నగరం: గాజా నగరాన్ని పూర్తి స్థాయిలో స్వా«దీనం చేసుకునేందుకు ఆర్మీ ప్రయత్నాలను ముమ్మరం చేసిన వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. షరతులకు అంగీకరించి, లొంగిపోకుంటే హమాస్‌కు నరక ద్వారాలు తెరుచుకుంటాయని వ్యాఖ్యానించారు. గాజా్రస్టిప్‌లో ఇప్పటికే శిథిలాల దిబ్బలుగా మారిన రఫా, బెయిట్ హనౌన్ నగరాలకు పట్టిన గతే గాజా నగరానికీ పడుతుందని శుక్రవాం ‘ఎక్స్’ద్వారా అలి్టమేటమ్ జారీ చేశారు. మిగతా బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని, హమాస్ ఆయుధాలను వదిలివేయాలని ఆయన మరోమారు డిమాండ్ చేశారు. అయితే, బందీల విడుదలకు సిద్ధమని ప్రకటించిన హమాస్..పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయకుండా ఆయుధాలను త్యజించడం మాత్రం అసాధ్యమని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తి స్థాయి ఆక్రమణ కోసం సన్నద్ధతా చర్యలను మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయి సైనిక చర్య మొదలవుతుందని భావిస్తున్నారు. ఇలా ఉండగా, శుక్రవారం గాజా నగరంపై జరిగిన దాడుల్లో కనీసం 17 మంది చనిపోయారని స్థానిక షిఫా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గాజా స్ట్రిప్ ప్రాంతంలో గట్టిపట్టున్న హమాస్ మిలటరీకి, పాలనకు గాజా నగరమే ఆయువు పట్టు. ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల నుంచి హమాస్ శ్రేణులను గాజాలోని భూగర్భ సొరంగాలు పెట్టని కోటలుగా ఉన్నాయని ఇజ్రాయెల్ భావిస్తోంది. బంకర్లలో ఉన్న ఈ షెల్టర్లలోనే వేలాదిగా పౌరులు, కీలక మౌలిక, ఆరోగ్య సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉన్నట్లు అనుమానిస్తోంది. హమాస్‌ను ఓడించడం, బందీలను సురక్షితంగా బయటకు తీసుకురావడం నగరాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడం ద్వారానే సాధ్యమని నెతన్యాహూ ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది. 22 నెలల క్రితం ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి 251 మందిని హమాస్ శ్రేణులు బందీలుగా పట్టుకెళ్లింది. ఇప్పటికీ ఇంకా సజీవులైన 20 మంది సహా మొత్తం 50 మందిని విడుదల చేయాల్సి ఉంది. -
బందీల విడుదలకు ఒప్పందం చేసుకోండి
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గాజాపై సైనిక చర్యకు ప్రణాళికలు వేస్తుండగా.. ఇజ్రాయేలీలు నిరసన బాట పట్టారు. గాజాపై యుద్ధం ముగించాలని, బం«దీలను విడుదల చేయడానికి హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ర్యాలీలను నిర్వహించారు. జెరూసలేం, టెల్ అవీవ్‌లను కలిపే ప్రధాన రహదారిని ప్రదర్శనకారులు దిగ్బంధించారు. ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో వేలాది మంది ఇజ్రాయెలీలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీల్లో ఇజ్రాయెల్ జెండాలను ఊపుతూ, బందీల ఫొటోలను ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. కొమ్ము బూరలు ఊది, డ్రమ్స్ మోగించి నిరసన తెలిపారు. ప్రధాన రహదారులను దిగ్బంధించారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు 38 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్ నటి గాల్ గాడోట్ కూడా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బందీల కుటుంబాలను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీకి ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ హాజరై ప్రదర్శనకారులకు తన సంఘీభావాన్ని తెలిపారు. ‘దేశాన్ని బలోపేతం చేసే ఏకైక విషయం. అద్భుతమైన స్ఫూర్తితో ప్రజలు బయటకు అడుగు పెట్టారు’అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. బందీల కుటుంబాలు నిర్వహించిన ఈ సమ్మెకు వ్యాపార సంస్థలు సైతం మద్దతు ఇచ్చాయి. సిబ్బందిని నిరసనల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా మూసేశారు. వేసవి సెలవుల కారణంగా పాఠశాలలపై ఎలాంటి ప్రభావం పడలేదు. యెమెన్ క్షిపణి ప్రయోగిస్తుందని వైమానిక దాడి సైరన్లు హెచ్చరించడంతో స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రదర్శనలు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే.. హమాస్ లొంగిపోకుండా యుద్ధాన్ని ముగించాలనే పిలుపు ఆ గ్రూపును బలోపేతం చేస్తుందని ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇది బందీల విడుదల మరింత ఆలస్యం చేస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన గాజా నగరాన్ని సైన్యం స్వా«దీనం చేసుకునే ప్రణాళికలను పునరుద్ఘాటించారు. ఈ చర్యను ఇజ్రాయెలీలు, ముఖ్యంగా బందీల కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది బతికి ఉన్న బందీల ప్రాణాలకు ముప్పని భయపడుతున్నారు. -
గాజాని పూర్తిగా ఆక్రమిస్తా నెతన్యాహు సంచలనం
-
మా షరతులు అంగీకరిస్తే బందీలకు సాయం చేస్తాం
కైరో: ఇజ్రాయెల్ కొన్ని షరతులను నెరవేరిస్తే, బందీలకు సహాయం అందించడానికి రెడ్ క్రాస్తో సమన్వయం చేసుకోవడానికి తాము సిద్ధమని హమాస్ ఆదివారం తెలిపింది. రెడ్‌క్రాస్‌తో ఏదైనా సమన్వయం కావాలనుకుంటే.. ఇజ్రాయెల్ శాశ్వతంగా మానవతా కారిడార్లను తెరవాలని, సహాయ పంపిణీ సమయంలో వైమానిక దాడులను నిలిపివేయాలని హమాస్ డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం, గాజాలో ఇప్పుడు 50 మంది బందీలు మిగిలి ఉన్నారు. వారిలో 20 మంది మాత్రమే బతికే ఉన్నారని భావిస్తున్నారు. హమాస్ ఇప్పటివరకు, మానవతా సంస్థలు బందీలను సంప్రదించకుండా నిషేధించింది. వారి పరిస్థితుల గురించి కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కృశించిపోయిన ఇజ్రాయెల్ బందీ డేవిడ్ వీడియో హమాస్ విడుదల చేయగా.. ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వీడియో.. ఇజ్రాయేలీలను భయభ్రాంతులకు గురి చేయగా.. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్‌లు హమాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాజాలో బందీల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హమాస్ తాజా ప్రతిపాదన తీసుకొచ్చింది. దాదాపు రెండేళ్ల యుద్ధం తరువాత.. మానవతా విపత్తు ఎదుర్కొంటున్న గాజాకు ఇంధన సరఫరాను అనుమతించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇంధన కొరత ఆసుపత్రుల కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఆకలి మరణాలు పెరుగుతున్నాయనే భయాల మధ్య ఇజ్రాయెల్ ఈ సడలింపును జారీ చేసింది. ఆదివారం, రెండు ట్రక్కులు ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న కారెం అబు సలేం క్రాసింగ్ ద్వారా గాజాలోకి ప్రవేశించాయి. ఆసుపత్రులు, బేకరీలు, పబ్లిక్ కిచెన్లకు సహాయం చేయడానికి ఈ వారం చివరిలో మరో నాలుగు ట్యాంకర్లు యూఎన్ ఇంధనం వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రులు, బేకరీలు, పబ్లిక్ కిచెన్లు, ఇతర ముఖ్యమైన సేవల కార్యకలాపాలకు సహాయం చేయడానికి నాలుగు యూఎన్ ఇంధన ట్యాంకర్లు ప్రవేశించాయని సహాయాన్ని సమన్వయం చేసే ఇజ్రాయెల్ సైనిక సంస్థ సీఓజీఏటీ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో గాజాలో ఆకలి లేదా పోషకాహార లోపంతో మరో ఆరుగురు మరణించారని దాని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య 175కి పెరిగింది. వీరిలో 93 మంది పిల్లలు ఉన్నారు. 4 -
నా సమాధి నేనే తవ్వుకుంటున్నా!
-
బతుకుతానో లేదో.. ‘నా సమాధి నేనే తవ్వుకుంటున్నా’
ఓ 24ఏళ్ల యువకుడు. బ్రతికుండగానే తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడు. కుటుంబ సభ్యులు సైతం ఆ యువకుడిని సజీవంగా పాతిపెట్టిన సజీవ అస్థి పంజరంతో పోలుస్తున్నారు. అలా అని ఆ యువకుడికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఏదైనా ఉందా? అంటే అదేం లేదు. ఆరోగ్యంగానే ఉన్నాడు. అయినప్పటికీ తాను మరణం అంచునా ఉన్నానని, బతికే అవకాశం లేక తన సమాధిని తానే తవ్వుకున్నానంటూ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇంతకీ ఎవరా యువకుడు?. ఎందుకు తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడుఇజ్రాయెల్- గాజా యుద్ధం నేపథ్యంలో హమాస్ విడుదల చేసిన తాజా వీడియోలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. హమాస్ విడుదల చేసిన వీడియోల్లో 24 ఏళ్ల ఎవ్యాతార్ డేవిడ్ అనే ఇజ్రాయెల్ యువకుడి పరిస్థితి మరింత ధీనంగా ఉంది. మాట్లాడే ఒపిక లేక,చిక్కి శల్యమై కనిపిస్తున్న దృశ్యాలు మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.ఇక హమాస్ విడుదల చేసిన వీడియోలో డేవిడ్ మాట్లాడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఓ చిన్న పారతో తన సమాధిని తవ్వుతూ ఇజ్రాయెల్ అధికారిక భాష హీబ్రూలో తన కష్టాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు.‘రోజు రోజుకి నేను మరింత చిక్కి శల్యమైతున్నాను. నా గమ్యం ఇక సమాధివైపే. అందుకే నేను నా సమాధిని నేను తవ్వుకుంటున్నాను. అదిగో అక్కడే నా సమాధి ఉంది. నేను అక్కడే సమాధినవుతాను. ఈ బంధనాల నుంచి విడుదలై నా కుటుంబంతో నిద్రపోయే సమయం చాలా తక్కువే ఉంది’ అంటూ చెబుతున్న అతని మాటలు చూపురులను కంటతడి పెట్టిస్తున్నాయి.ఎవ్యాతార్ డేవిడ్ ఎవరు?ఎవ్యాతార్ డేవిడ్ 24 ఏళ్ల ఇస్రాయెల్ పౌరుడు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుండి హామాస్ టెర్రరిస్టులు అతడిని బంధించారు. నాటి నుంచి అతను గాజాలో బంధీగా (ఆగస్ట్ 3తో 666రోజులు) ఉన్నాడు. తాజాగా హామాస్ విడుదల చేసిన వీడియోతో డేవిడ్ కుటుంబసభ్యులు సజీవ అస్థి పంజరం,బతికుండగానే సమాధిలో ఉన్నాడని’ వర్ణిస్తున్నారు.వీడియోలో ఏముంది?డేవిడ్ గాజా టన్నెల్లో ఒక గోతిని తవ్వుతూ కనిపించాడు. ఇది నా సమాధి. నా శరీరం రోజుకో రోజు బలహీనమవుతోంది. నా కుటుంబంతో పడుకునే అవకాశం త్వరలో ముగిసిపోతుందని చెప్పుకొచ్చాడు. అతని శరీరం చాలా బలహీనంగా, ఆకలితో క్షీణించినట్లు కనిపించగా.. డేవిడ్‌తో పాటు ఇతర బంధీలు రోమ్ బ్రాస్లావ్స్కీ అనే మరో బంధీ వీడియో కూడా హమాస్ విడుదల చేసింది. అతను 21 ఏళ్ల యువకుడు. నోవా ఫెస్టివల్లో సెక్యూరిటీగా పనిచేస్తుండగా.. హామాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.గాల్లో కలిసిపోతున్న అమాయకుల ప్రాణాలుఇక నిర్విరామంగా కొనసాగుతున్న గాజా,హమాస్ యుద్ధం వేలాది మంది అమాయకుల ప్రాణాల్ని తీసింది. ఇంకా తీస్తూనే ఉంది. 1,219 మంది ఇస్రాయెల్ పౌరులు హమాస్ దాడిలో మరణించారు. 60,000 మంది పాలస్తీనియన్లు గాజాలో మరణించారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఆహార, ఔషధాల కొరత కారణంగా 169 మంది పిల్లలు ఆకలితో మరణించినట్లు తెలుస్తోంది. కాగా, హమాస్ విడుదల చేసిన వీడియోలతో బంధీలను వెంటనే విడిపించాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.సూపర్ నోవా ఫెస్టివల్ అంటే ఏమిటి..?సూపర్ నోవాను యూనివర్సల్ పారలెల్లో ఫెస్టివల్ అని కూడా అంటారు. గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతం రీమ్‌లో జరిగింది. సూపర్ నోవా పండుగను యూదులు వారంపాటు జరుపుకుంటారు. సెప్టెంబర్ 29, 2023 నుంచి అక్టోబర్ 6, 2023 వరకు జరిగే వేడుక. పంట సేకరణను ఉద్దేశించి జరుపుకునే వేడుక ఇది. పిల్లలపై దేవుడి దయకు నిదర్శనంగా సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ ఐక్యమత్యం, ప్రేమలకు గుర్తుగా మనసుకు హత్తుకునే అంశాలతో కూడుకుని ఉంటుంది.పండుగ సందర్భంగా వేలాది మంది యువకులు వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాత్రిపూట గాజా సరిహద్దును దాటుకుని వందిలాది రాకెట్ దాడులు జరిగాయి. ఉగ్రవాదులు మారణాయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. గన్లతో దాదాపు 3500 మంది ఇజ్రాయెల్ యువతపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వేడుకలో చాలా మంది అప్పటికే మద్యం సేవించి మత్తులో ఉండగా.. బైక్‌లపై వచ్చిన దుండగులు ఏకే-47 వంటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. భయంతో పరుగులు తీస్తున్న జనం, క్షతగాత్రుల అరుపులతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. How psychopathic is Hamas?It forced starving hostage Evyatar David to DIG HIS OWN GRAVE for the cameras. pic.twitter.com/iMa404St4s— Eylon Levy (@EylonALevy) August 2, 2025 -
గాజాలో మరణాలు 60 వేల పైనే
దెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య 21 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో 60 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం మంగళవారం తెలిపింది. మంగళవారం నాటికి 60,034 మంది చనిపోగా మరో 1,45,870 మంది క్షతగాత్రులుగా మిగిలారని పేర్కొంది. మృతుల్లో కనీసం సగం మంది మహిళలు, చిన్నారులేనని తెలిపింది. వైద్యరంగ నిపుణులతో కూడిన గాజా ఆరో గ్య విభాగం తెలిపే గణాంకాలను అత్యంత విశ్వసనీయమైనవిగా ఐరాస ఇతర స్వతంత్ర నిపుణులు కితాబునిస్తున్నారు. ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ ఫలితంగా గాజాలోని అత్యధిక ప్రాంతంలో విధ్వంసమే మిగిలింది. 90 శాతం మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులుగా మారారు. ఆ ప్రాంతంలో అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి.తాజాగా మరో 70 మంది మృతి పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు మాత్రం యథా ప్రకారం కొనసాగుతున్నాయని స్థానిక ఆస్పత్రి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో కనీసం 70 మంది చనిపోయారని తెలిపాయి. వీరిలో సగం మంది ఆహార కేంద్రాల వద్ద గుమికూడిన వారేనన్నాయి. సోమవారం దక్షిణ గాజా ప్రాంతంలోకి ప్రవేశించిన ఆహార ట్రక్కుల వద్దకు వచ్చిన వారిపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో 33 మంది చనిపోయినట్లు ఆస్పత్రులు వెల్లడించాయి. మిగతా వారు సెంట్రల్ గాజాలోని ఆహార కేంద్రం వద్ద జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నాయి. అదేవిధంగా, నుసెయిరత్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో లో తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న 12 మంది చిన్నారులు, 14 మంది మహిళలు సహా 30 మంది అసువులు బాశారని అల్–ఔదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరువు వట్టిదే: ఇజ్రాయెల్ గాజాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయంగా తమపై ఒత్తిడి పెంచేందుకు గాజాలో కరువు ఉందంటూ తప్పుడు ప్రచారం మొదలైందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఒత్తిడుల వల్ల కాల్పుల విరమణతోపాటు బందీల విడుదలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి ప్రకటనలతో హమాస్ వైఖరి మరింత కఠినంగా మారితే తమ ప్రతిస్పందన సైతం తీవ్రంగానే ఉంటుందన్నారు. గాజాలో అమానవీయ పరిస్థితులపై ప్రధాని మౌనం సిగ్గు చేటు: సోనియా గాంధీ న్యూఢిల్లీ: గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ నరమేధంతో సమానమైందని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అభివర్ణించారు. మానవీయతే మచ్చ తెచ్చే పరిణామాలు గాజాలో చోటుచేసుకుంటున్నా మోదీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపై ఆమె మండిపడ్డారు. ఇలాంటి వైఖరి మన రాజ్యాంగ విలువలకు ద్రోహం చేసినట్లేనన్నారు. ఈ మేరకు ఆమె దైనిక్ జాగరణ్‌లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. పాలస్తీనా విషయంలో మన దేశం దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని స్పష్టంగా, ధైర్యంగా, నిష్కపటంగా వెల్లడించాలని ఆమె ప్రధాని మోదీని కోరారు. ఇజ్రాయెల్ అమానవీయ చర్యలను ఎప్పటికప్పుడు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ చీఫ్ హతం.. తుర్కియే వ్యక్తిని పెళ్లాడిన సిన్వర్ భార్య
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. హమాస్ ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. దీంతో, గాజాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటికే హమాస్‌కు చెందిన కీలక నేతలు హతమయ్యారు.హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ సహా కీలక ఉగ్రవాదులు చనిపోయారు. గతేడాది అక్టోబర్‌లో యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ బలగాలు హతమర్చాయి. అయితే, అంతకుముందే సిన్వర్ సతీమణి పరారైందని తాజాగా వెల్లడైంది. ఆమె.. తుర్కియేకు వెళ్లి అక్కడ మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది.పలు మీడియా కథనాల ప్రకారం.. యహ్యా సిన్వర్ భార్య సమర్ ముహమ్మద్ అబు జమార్ ప్రస్తుతం తుర్కియేలో రహస్యంగా జీవిస్తోందని సమాచారం. గాజాకు చెందిన ఓ సామాన్య మహిళకు చెందిన పాస్ పోర్టు సాయంతో సమర్ తన పిల్లలను తీసుకుని దేశం దాటిందని, తొలుత ఈజిప్ట్ లోకి అక్కడి నుంచి తుర్కియేలోకి ప్రవేశించిందని తెలిపింది. ఆ తర్వాత అక్కడి స్థానికుడిని వివాహం చేసుకుని మారుపేరుతో తుర్కియేలోనే జీవిస్తోందని వై నెట్ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారం హమాస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసే నెట్ వర్క్ సాయంతో జరిగిందని పేర్కొంది. ఇదే మార్గంలో యహ్యా సిన్వర్ సోదరుడి భార్య నజ్వా కూడా దేశం దాటిందని తెలిపింది. అయితే, నజ్వా ఏ దేశంలో ఆశ్రయం పొందిందనే వివరాలు తెలియరాలేదని వివరించింది.అయితే, హమాస్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్ మరణించడానికి ముందుగానే సమర్ తన పిల్లలతో కలిసి దొంగ పాస్ పోర్టుతో దేశం దాటినట్లు గాజాలోని హమాస్ వర్గాలు వెల్లడించాయని వై నెట్ మీడియా ఓ కథనంలో పేర్కొంది. గాజాలోని స్మగ్లింగ్ ముఠా సమర్‌ను రఫా బార్డర్ గుండా ఈజిప్టులోకి చేర్చిందని వై నెట్ పేర్కొంది. సాధారణంగా ఇలా మనుషులను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు స్మగ్లింగ్ ముఠాలు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తాయని తెలిపింది. దీంతో, ఆమె గురించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, సమర్.. సిన్వర్‌ను 2011లో వివాహం చేసుకుంది. -
ఇక చాలు.. గాజాలో పని ముగించండి
గాజాలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌ను ఉధృతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ సంస్థ తిరస్కరించింది. ఈ పరిణామంతో రగిలిపోయిన ట్రంప్.. ఆ సంస్థ కథ ముగించాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మా ప్రతిపాదనే తిరస్కరిస్తారా?. వాళ్లకు(హమాస్) ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన నిజంగా లేనట్లు ఉంది. వాళ్లు చావాలనుకుంటున్నారేమో. గాజాలో దాడులను ఉధృతం చేయండి. ప్రక్షాళన చేయండి’’ అంటూ ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి పిలుపు ఇచ్చారాయన.హమాస్ ఒప్పందానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వారు శాంతికి కాకుండా హింసకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు చివరి బంధీల వద్దకు వచ్చాం. వాళ్లు ఒప్పందం చేయాలనుకోవడం లేదు. వాళ్లను వేటాడాల్సిందే అని ట్రంప్ అన్నారు.ట్రంప్ తరఫున పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్.. ఇజ్రాయెల్- హమాస్ చర్చల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటిరోజే ట్రంప్ విరుచుకుపడడం గమనార్హం. విట్కాఫ్ ప్రకారం.. ప్రస్తుతానికి ఈ చర్చల నుంచి అమెరికా వెనక్కి తగ్గుతోంది. శాంతి ఒప్పందం పట్ల హమాస్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త వ్యూహాం కోసం దోహా నుంచి తిరిగి వాషింగ్టన్ వెళ్తునట్లు తెలిపారాయన.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ పాలనను ముగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే.. హమాస్ నేత బాసెమ్ నైమ్ మాత్రం, చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయి అని పేర్కొన్నారు. విట్కాఫ్ వ్యాఖ్యలు కేవలం ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఒత్తిడి కలిగించేందుకు చేసినవని విమర్శించారు. మరోవైపు.. మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్ కూడా చర్చలు సానుకూలంగానే సాగుతున్నట్లు చెబుతున్నాయి. చర్చల్లో కొంత పురోగతి సాధించామని, చర్చలు నిలిపివేయడం సాధారణ ప్రక్రియ అని, అమెరికాతో కలిసి కాల్పుల విరమణ కోసం కోసం ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పారు.ఇక.. గాజాలో మానవతా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆహార కొరత, బాలలలో పోషకాహార లోపం, వందల మంది ఆకలితో మరణించడంలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. UNICEF, UNRWA వంటి సంస్థలు తక్షణ సహాయం అవసరం అని హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఆహారం సరిపడా పంపించామని, ఐరాసనే సరైన పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తోంది. -
ఎన్నాళ్లీ జనహననం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ గాజాలో కొనసాగిస్తున్న మారణకాండను ఆపదల్చుకోలేదని తాజా అమానుష ఉదంతం రుజువు చేస్తోంది. నిరాయుధ పౌరులనూ, మరీ ముఖ్యంగా స్త్రీలనూ, పిల్లలనూ హతమార్చటం ఇజ్రాయెల్ సైన్యానికి గత ఇరవైయ్యొక్క నెలలుగా రివాజుగా మారినా... ఆదివారం జరిగిన ఘోరం అత్యంత హేయమైనది. ఐక్యరాజ్యసమితి సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) ఆధ్వర్యాన ఆహార పంపిణీ మొదలుపెట్టబోతుండగా పౌరు లను చుట్టుముట్టి శతఘ్నులతో, స్నైపర్లతో విరుచుకుపడి 90 మందికిపైగా పౌరుల్ని ఇజ్రాయెల్ సైన్యాలు పొట్టనబెట్టుకున్నాయి. 2023 అక్టోబర్ 7న తమ భూభాగంలోకి అడుగుపెట్టి 1,200 మంది పౌరులను కాల్చిచంపి, మరో 251 మందిని అపహరించిన మిలిటెంట్ సంస్థ హమాస్‌ను తుదముట్టించటానికి దాడులంటూ మొదట్లో చెప్పిన ఇజ్రాయెల్ ఆనాటినుంచి మారణకాండ కొనసాగిస్తూనే ఉంది. అధికారిక లెక్క ప్రకారం ఇప్పటికి 60,000 మంది పౌరులు మరణించారంటున్నా... అంతర్జాతీయ మేగజిన్ లాన్సెట్ నిరుడు జూన్‌లో ప్రకటించిన నివేదిక అది దాదాపు రెండు లక్షలంటోంది. మధ్యధరా సముద్ర తీరానవున్న గాజా స్ట్రిప్ అనే చిన్న ప్రాంతాన్ని వదిలి రావటానికి ససేమిరా అంటున్న స్థానికులను హతమార్చయినా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రయ త్నిస్తోంది. ఆ ప్రాంతాన్ని సైతం తమ దేశంలో విలీనం చేసుకోవాలన్నది దాని ఆంతర్యం. గతంలో పాలస్తీనాపై విరుచుకుపడినప్పుడల్లా ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని 51వ అధికర ణాన్ని ఇజ్రాయెల్ ప్రస్తావించేది. సాయుధ ముఠాలు దాడులకు దిగితే ఆత్మరక్షణ చేసుకునే హక్కు దేశాలకుంటుందని ఆ అధికరణ చెబుతోంది. కానీ పాలస్తీనాలో తనదికాని భూభాగాన్ని ఆక్రమించుకుని, దాన్ని విస్తరించాలనుకున్నప్పుడల్లా ఇజ్రాయెల్ ఈ అధికరణను సాకుగా చూపుతోంది. హమాస్ సంస్థ దాడుల్ని ఎవరూ సమర్థించరు. ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెబుతూ వారికే నష్టం కలిగించే ఆ సంస్థ చర్యల్ని మొదటినుంచీ అందరూ వ్యతిరేకి స్తున్నారు. కానీ గత 21 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ మాటేమిటి? కేవలం 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల చిన్న ప్రాంతంపై యుద్ధ విమానాలతో, బాంబులతో, క్షిపణులతో దాడులు సాగించటం ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం సబబవుతుంది?ఇజ్రాయెల్ మిత్ర దేశమన్న సాకుతో పెద్ద పెద్ద దేశాలే అది సాగిస్తున్న మారణకాండను విస్మ రిస్తున్న తరుణంలో ఇటీవల 12 చిన్న దేశాలు కొలంబియాలోని బగోటాలో అత్యవసర శిఖరాగ్ర సదస్సు నిర్వహించి కార్యాచరణకు దిగబోతున్నట్టు ప్రకటించటం ఉన్నంతలో వూరటనిచ్చే అంశం. బొలీవియా, కొలంబియా, క్యూబా, ఇండొనేసియా, ఇరాక్, లిబియా, మలేసియా, నమీ బియా, నికరాగువా, ఒమన్, సెయింట్ విన్సెంట్, దక్షిణాఫ్రికాలు వీటిలో వున్నాయి. ఈ సమావేశానికి హాజరైనా, అది విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై సంతకం చేయాలా వద్దా అన్న మీమాంసలో పడిన మరో 20 దేశాలు వచ్చే సెప్టెంబర్‌కల్లా ఏ సంగతీ తేల్చాలని సదస్సు గడువు విధించింది. ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. తనదికాని ఒక ప్రాంతంపై దండెత్తి, అక్కడి పౌరులు ఎటువైపు కదలాలో హుకుం జారీ చేసే ఇజ్రాయెల్ ఆగడం నాగరిక ప్రపంచ ఉనికికే పెను సవాలు. ఇజ్రాయెల్ ఇష్టారాజ్యంగా మానవ హననానికి పాల్పడుతుంటే చూస్తూ కూర్చున్న దేశాలకు కూడా రేపన్నరోజు ఇదే గతి పట్టదన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే అంతర్జాతీయ చట్టాలకూ, ఐక్యరాజ్యసమితి చార్టర్లకూ, మానవ హక్కులకూ ఇజ్రాయెల్ పెనుముప్పుగా మారిందని 12 దేశాల సదస్సు వ్యాఖ్యానించింది.అయితే ఇజ్రాయెల్ ఏం చేసినా సమర్థించటం అలవాటైన అమెరికాను కాదని ఎన్ని దేశాలు ఈ సదస్సుతో గొంతు కలుపుతాయన్నది ప్రశ్నార్థకం. ఇప్పటికే ‘ఇంకా’ సంతకం చేయని దేశాలకు దూతల్ని పంపి ‘దారికి తేవాలని’ అమెరికా నిర్ణయించుకుంది. ఈ సదస్సుపై ట్రంప్ కారాలూ మిరియాలూ నూరుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఉనికిలోకొచ్చిన అంతర్జాతీయ సంస్థలు మొదటినుంచీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నాయి. అందరికీ ఒకే న్యాయం భావన వదిలి సంపన్న దేశాలతో ఒక విధంగా, బడుగు దేశాలతో మరో రకంగా ప్రవర్తిస్తున్నాయి. అందువల్లే ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి తదితర వేదికలపై ఇప్పుడెవరికీ పెద్దగా భ్రమలు లేవు. ఉన్నంతలో కొలంబియా సదస్సు ఒక ఆశాకిరణం.ఆహార పంపిణీ కేంద్రాలు ఐక్యరాజ్యసమితి సంస్థల కనుసన్నల్లోనే వుంటున్నా అవి పాలస్తీనా ప్రజల పాలిట ఉచ్చుగా మారుతున్నాయి. ఆసుపత్రులు, శరణార్థ శిబిరాలు మాత్రమే కాదు.. చివరకు ఆహార పంపిణీ కేంద్రాలు సైతం ఇజ్రాయెల్ సైనికుల దాడులకు లక్ష్యమవుతున్నాయి. ఆకలితో నకనకలాడుతూ తిండికోసం జనం ఒకచోట గుమిగూడినప్పుడు కాల్చి చంపితే గాజాను ఖాళీ చేయించాలన్న తమ పథకం పారుతుందని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టుంది. ఒకనాడు నాజీ జర్మనీ లక్షలాదిమంది యూదుల్ని చిత్రహింసల శిబిరాలకు చేర్చి అమానుషంగా అంతమొందించింది. ఆ తరహాలోనే పాలస్తీనాలో రఫా వంటి చోట్ల శిబిరాల నిర్మాణం మొదలైంది. మరో జనహననాన్ని నాగరిక ప్రపంచం సహిస్తుందా? ప్రపంచ ప్రజానీకం మేల్కొని తమ తమ దేశాల్లోని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తే తప్ప ఇజ్రాయెల్ దురాగతాలు ఆగవు. -
హమాస్ కమాండర్ హతం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైనిక దళం గాజాలో 75 ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసింది. ఫలితంగా నగరంలో దట్టమైన పొగతో పాటు మంటలు ఎగసిపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. హమాస్ కమాండర్ బషర్ థాబెట్ను ఐడీఎఫ్ హతమార్చింది. హమాస్ అభివృద్ధి ప్రాజెక్టుల విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ కమాండర్ బషర్ థాబెట్ మృతిని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధృవీకరించాయి. హమాస్ ఆయుధ ఉత్పత్తి, పరిశోధన కార్యకలాపాలను పర్యవేక్షించడంలో పేరొందిన థాబెట్.. ఇజ్రాయెల్ దాడుల్లో హతం కావడం హమాస్‌కు తీరనిలోటుగా పరిణమించింది. ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ హమాస్ ఉపయోగించే ఆయుధాల తయారీ ప్రదేశాలు, కీలక ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఎఎఫ్)గాజాలోని సైనిక స్థావరాలు, సెల్ సైట్లతో సహా దాదాపు 75 లక్ష్యాలను విజయవంతంగా ఢీకొట్టిందని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. యుద్ధం కారణంగా పరిస్థితులు అంతకంతకూ క్షీణిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ తాజా ఆపరేషన్ జరిపింది. గడచిన 24 గంటల్లో 115 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా ఆహారం, నీరు, వైద్య సామాగ్రి కొరత ఏర్పడి మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ, ట్యునీషియా, ఇరాక్, టర్కీ, లెబనాన్, మొరాకోతో సహా అనేక దేశాలలో నిరసనలు కొనసాగుతున్నాయి. సంఘర్షణలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్లు.. ఇజ్రాయెల్ స్థిరనివాసుల నీటి వనరులపై దాడులను మరింతగా పెంచారు. ఇరువర్గాల మధ్య శాంతి చర్చలు స్తబ్దుగా ఉండటంతో, కాల్పుల విరమణకు అవకాశాలు అనిశ్చితంగానే ఉన్నాయి. ఫలితంగా గాజాలో మానవతా సంక్షోభం మరింతగా పెరుగుతూ వస్తోంది. -
21 నెలలు.. 58 వేల మరణాలు!
దెయిర్ అల్–బలాహ్: గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో మరణాలు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 58 వేల మంది పాలస్తీనియన్లు అసువులు బాసినట్లు ఆదివారం గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. మృతుల్లో సగానికి పైగా మహి ళలు, చిన్నారులే ఉన్నారంది. క్షత గాత్రుల సంఖ్య లక్ష్యల్లోనే ఉంటుందని అంచనా. యుద్ధ మరణాలపై గాజా ఆరోగ్య విభాగం విడుదల చేసే గణాంకాలను ఐక్యరాజ్యస మితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీ యమైనవిగా భావిస్తున్నాయి. నీళ్ల కోసం వచ్చి ఆరుగురు బాలలు మృతిగాజాపై ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో 30 మంది చనిపోయారు. వీరిలో నీళ్ల ట్యాంకు వద్దకు వచ్చిన ఆరుగురు చిన్నారులున్నారు. సెంట్రల్ గాజా నగరంలో ఓ వీధిలో నడిచి వెళ్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 11 మంది చనిపోగా 30 మంది క్షతగాత్రులుగా మారారు. మృతుల్లో అల్–అహ్లి ఆస్పత్రి జనరల్ సర్జన్ డాక్టర్ అహ్మద్ ఖండిల్ కూడా ఉన్నారు. ఆస్పత్రికి వస్తుండగా దాడికి గురయ్యారని అధికారులు తెలిపారు. జవైదాలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంటిపై దాడి విషయం తమకు తెలీదని, 24 గంటల వ్యవధిలో గాజాలోని 150 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. కాగా, వెస్ట్‌బ్యాంక్‌లో శనివారం ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో చనిపోయిన పాలస్తీనా అమెరికన్ సైఫొల్లా ముసల్లెట్(20), అతని స్నేహితుడు మహ్మద్ అల్ షలాబీలకు ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ సారథ్యంలో సాయుధులు ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపుదాడులు చేసి సుమారు 1,200 మందిని చంపడంతోపాటు 251 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ లక్ష్యంగా గాజాపై యథేచ్ఛగా దాడులు సాగిస్తోంది. -
హమాస్‌కు ఇది హానీమూన్ పీరియడ్.. నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
టెలీ అవీవ్: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం విషయమై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణలో భాగంగా బందీల విడుదల సక్రమంగా జరగని పక్షంలో హమాస్‌ను సమూలంగా నాశనం చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా హమాస్ చెరలో ఉన్న బందీల కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం, నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ చెరలో ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకువస్తాం. తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో సాధ్యమైనంత వరకు బందీలను విడిపిస్తాం. హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇంకా ముగియలేదు. తాత్కాలిక కాల్పుల విరమణ మా ప్రభుత్వ అంతిమ లక్ష్యాన్ని సాధించకుండా నిరోధించింది. ఇరాన్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత హమాస్ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాతో చర్చలు జరిపారు. అందులో భాగంగానే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించింది. చర్చల తర్వాత 60 రోజుల కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని తెలిపాం.గాజాలో పూర్తి నిరాయుధీకరణ, సైనికీకరణను తొలగించడం, బంధీలను విడుదల చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. 60 రోజుల సమయంలో ఇవన్నీ జరిగితే ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయదు. ఒకవేళ హమాస్ కనుక మళ్లీ కాల్పులు విరమణను ఉల్లంఘిస్తే.. ఈసారి ఇజ్రాయెల్ దాడులు మరింత బలంగా ఉంటాయి. హమాస్‌ను లేకుండా చేసి ఇజ్రాయెల్ భద్రతను పునరుద్ధరించే వరకు మేము ఆగము’ అని హెచ్చరించారు.ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్‌కు చాలా గొప్ప విజయాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ యోధుల ధైర్యసాహసాలకు ధన్యవాదాలు. మేము హమాస్ సైనిక సామర్థ్యాలను చాలావరకు నిర్వీర్యం చేశాం. హమాస్ విషయంలో మేము దౌత్యం, సైనిక శక్తి కలయిక ద్వారా పనిచేయాలనుకుంటున్నాము. దౌత్యం పని చేయకపోతే సైనిక శక్తి తమ పని తాము చూసుకుంటుందని హెచ్చరించారు. ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందని స్పష్టం చేశారు. Benjamin Netanyahu:"The war ends only if Hamas surrenders, Gaza is demilitarized, and if it can be done in negotiations, good. If not, it will be done with force by our great Israeli army. Hamas will be gone from Gaza at the end of the war either way."pic.twitter.com/RkMANr0ilV— Vivid.🇮🇱 (@VividProwess) July 10, 2025 -
హమాస్ రహస్య సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్
జెరూసలేం: ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ రహస్య స్థావరాన్ని గుర్తించాయి. గాజా ఆస్పత్రి కింద హమాస్ టన్నెల్ నెట్‌వర్క్‌ను కొనుగొన్నట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా సాగించే హమాస్ కార్యకలాపాలకు ఈ సొరంగం కమాండ్ సెంటర్‌గా ఉపయోగిస్తుంటారని ఇజ్రాయెట్ తెలిపింది. అలాగే ఆయుధాలు, నిఘా సామగ్రితో కూడిన భూగర్భ మౌలిక సదుపాయాలు కలిగివున్న సొరంగపు ఫుటేజీని విడుదల చేసింది.గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఒక కీలక ఆస్పత్రి కింద ఈ సొరంగం ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఉన్న ఈ సొరంగం సీనియర్ హమాస్ నేతల కమాండ్ అండ్ కంట్రోల్‌కు కేంద్రంగా ఉంటూ, ఇజ్రాయెల్ దళాలపై దాడులను సమన్వయం చేయడానికి ఉపయోగపడింది. ⭕️UNCOVERED: An underground tunnel route beneath the European Hospital in Khan Yunis, Gaza. In a special, targeted operation, IDF soldiers located an underground tunnel route containing numerous findings such as command and control rooms, weapons, and additional intelligence… pic.twitter.com/7bPM5ozHN8— Israel Defense Forces (@IDF) June 7, 2025ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలాని బ్రిగేడ్, యాహలోమ్ యూనిట్, ప్రత్యేక దళాలు పాల్గొన్న ఆపరేషన్ సమయంలో ఈ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ తన ఉగ్రవాద ప్రయోజనాల కోసం గాజాలోని ఆస్పత్రులపై దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. 2023లో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి కింద కింద ఒక హమాస్ సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడీఎఫ్ గతంలో పేర్కొంది. అయితే యుద్ధంలో అది పూర్తిగా ధ్వంసమైంది. ఇది కూడా చదవండి: ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది? -
రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని సృష్టిస్తోంది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆహార పంపిణి నిలిపివేత,కరువు నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. ఇటీవలి ఆహార పంపిణీలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. మరోవైపుఆ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్‌మార్కెట్ దందా జోరందుకుంది. ఏ వస్తువును కొందామన్నా ధర వింటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. అతి చవకగా దొరికే పార్లే-జి బిస్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలు ధర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. గాజా నుండి ఇటీవల వైరల్ అయిన పోస్ట్ ప్రకారం ముంబైతె తయారయ్యే పార్లే జి బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడవుతున్నాయి. భారత మార్కెట్లో కేవలం 5 రూపాయలకు లభించే ఈ బిస్కెట్ల ధర చూసి సోషల్ మీడియా యూజర్లు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఈ ధరలు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుండి ఎగుమతి అవుతున్న ఒక్క పార్లే-జికే పరిమితం కాదు, అన్ని వస్తువులు పరిస్థితి అలాగే ఉంది.After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025 "మూడు నెలలకు పైగా సరిహద్దులను మూసివేయడం వల్ల 2 మిలియన్ల మంది ప్రజల అవసరాలను తీర్చలేని చాలా తక్కువ మొత్తంలో ప్రాథమిక అవసరాలు మాత్రమే అనుమతి ఉందనీ, . కాబట్టి కొంతమందిమాత్రమే ఆహారం లభించినపుడు, ఈ ఆహారాలు చాలా ఎక్కువ, భరించలేని ధరలకు అమ్ముడవుతున్నాయని స్థానిక డాక్టర్ అల్షావా చెప్పారని ఎన్డీటీవీ తన స్పెషల్ రిపోర్ట్‌లో తెలిపింది. సమస్య అసలు సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు" "ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయంగా ఉచితంగా గాజాలోకి వస్తాయి. కానీ అవికొంతమందికి లభ్యమవుతున్నాయి. మిగతావి బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు.ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!జూన్ 6 నాటికి ఉత్తర గాజాలో మార్కెట్ ధరలుకిలోల చక్కెర: రూ. 4,914వంట నూనె: రూ. 4,177కిలో బంగాళాదుంపలు: రూ. 1,965కిలో ఉల్లిపాయలు : రూ. 4,423కాఫీ కప్పు: రూ. 1,800 గత గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన తరువాత, గాజాకు ఆహార లభ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మార్చి 2 -మే 19 మధ్య, పాలస్తీనాలో ఆధీన ప్రాంతం దాదాపు మొత్తం దిగ్బంధనను ఎదుర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడి తరువాత కేవలం పరిమిత సంఖ్యలో మానవతా ట్రక్కులను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 54,510 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
హమాస్ చీఫ్ సిన్వర్ మృతిని ధృవీకరించిన ఇజ్రాయెల్
గాజా: గాజాలో మే 13న జరిగిన వైమానిక దాడిలో హమాస్ సీనియర్ నేత మొహమ్మద్ సిన్వర్(Mohammad Sinwar) మృతిచెందాడని ఇజ్రాయెల్ ధృవీకరించింది. గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఒక ఆసుపత్రి కింద ఉన్న భూగర్భ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో సిన్వర్ మృతిచెందట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ధృవీకరించాయి.ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్ సమన్వయంతో యూరోపియన్ హాస్పిటల్ కింద ఉన్న భూగర్భ హమాస్ కమాండ్, నియంత్రణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. కాగా గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో తన సోదరుడు యాహ్యా సిన్వర్ ,సైనిక కమాండర్ మొహమ్మద్ దీప్‌లు మృతిచెందిన అనంతరం మహ్మద్ సిన్వర్ హమాస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఇజ్రాయెల్‌పై దాడులకు ప్లాన్ చేయడంలో, వాటిని అమలు చేయడంలో సిన్వర్ కీలక పాత్ర పోషించాడని ఐడీఎఫ్ పేర్కొంది. "We eliminated the Head of Hamas, again. He happens to be a Sinwar too," posts the Israel Defence Forces on 'X'. pic.twitter.com/Yah9lvGK1p— ANI (@ANI) May 31, 2025మే 13న జరిగిన దాడుల్లో హమాస్‌కు చెందిన మరో ఇద్దరు ఉన్నత స్థాయి నేతలు కూడా మృతిచెందారని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ వీరి మృతిని ధృవీకరించినప్పటికీ, హమాస్ ఈ వాదనలను అంగీకరించడం గానీ, తిరస్కరించడం గానీ చేయలేదు. కాగా హమాస్‌ను పూర్తిగా నిర్మూలించే వరకూ వరకు తమ సైనిక కార్యకలాపాలు ఆగవని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.ఇది కూడా చదవండి: COVID-19: పిల్లలను స్కూళ్లకు పంపొద్దు: కర్నాటక ప్రభుత్వం -
హమాస్ నేత సిన్వార్ హతం
డెయిర్ అల్ బాలాహ్ (గాజా స్ట్రిప్): గాజాలో హమాస్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ సాయుధ సంస్థ సీనియర్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బుధవారం పార్లమెంట్లో ఈ మేరకు ప్రకటించారు. హమాస్‌కు గతంలో అత్యంత కీలక నేతగా నిలిచిన యాహ్యా సిన్వార్ తమ్ముడే మొహమ్మద్. యాహ్యా గతేడాది ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. 🚨 | JUST IN: Israeli PM Benjamin Netanyahu CONFIRMS the elimination of 3 top Hamas leaders -- Mohammed Deif, Yahya Sinwar, and Mohammed Sinwar.Terrorism isn't managed it’s erased.This is what real leadership looks like when evil shows its face. 🇮🇱🔥 pic.twitter.com/h1PsuLBarY— Hank™ (@HANKonX) May 28, 20252023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ మెరుపుదాడి ఘటన సూత్రధారుల్లో యాహ్యా ఒకరని ఇజ్రాయెల్ ఆరోపించడం తెల్సిందే. యాహ్యా అనంతరం ఆయన బాధ్యతలను మొహమ్మదే చూసుకుంటున్నారు. సిన్వార్ సొంతపట్టణమైన ఖాన్ యూనిస్‌పై మే 13న ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేసింది. ‘‘వాటి ధాటికి స్థానిక యూరోపియన్ ఆస్పత్రి భూగర్భంలోని హమాస్ కమాండ్ సెంటర్ నాశనమైంది. అందులో ఉన్న సిన్వార్ చనిపోయాడు’’ అని సైన్యం చెబుతోంది. సిన్వార్ మరణాన్ని హమాస్ ధ్రువీకరించలేదు. అయితే మే 13 నాటి దాడిలో ఆరుగురు చనిపోయారని, 40 మంది గాయపడ్డారని గాజా ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది. -
గాజా ఆక్రమణకు పన్నాగం!
టెల్ అవీవ్: హమాస్ మిలిటెంట్ సంస్థను సమూలంగా నాశనం చేసి, గాజా స్ట్రిప్‌ను పూర్తిగా హస్తగతం చేసుకొనే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. మొత్తం గాజా భూభాగాన్ని నిరవధికంగా ఆక్రమించే ప్రణాళికకు ఇజ్రాయెల్ మంత్రివర్గం సోమవారం ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం ఓటింగ్ నిర్వహించారు. గాజా ఆక్రమణకు కేబినెట్ సంపూర్ణ అంగీకారం తెలిపింది. ఇద్దరు సీనియర్ అధికారులు ఈ విషయం వెల్లడించారు. అక్కడి నుంచి ఎప్పుడు ఖాళీ చేయాలన్న దానిపై ఇజ్రాయెల్ కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే గాజా స్ట్రిప్ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉండిపోయే అవకాశాలు లేకపోలేదు. హమాస్‌ను ఓడించి, బందీలను విడిపించడమే లక్ష్యంగా రంగంలోకి దిగాలని వేలాది మంది రిజర్వ్ సైనికులకు ఇజ్రాయెల్ సైన్యం పిలుపునిచ్చింది. పాలస్తీనా భూభాగంలో అతిత్వరలోనే భీకర స్థాయిలో సైనిక ఆపరేషన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌ను ఖతం చేయాలన్న పట్టుదలతో ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. గాజాను ఆక్రమించడం అంత సులభం కాదంటున్నారు.అమల్లోకి ట్రంప్ ప్లాన్! 40కిలోమీటర్లకుపైగా పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు ఉండే గాజాను ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాలోని పాలస్తీనా పౌరులను ఇతర దేశాలకు తరలించి, గాజాను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. దీనిపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ మిత్రదేశాలు సైతం తప్పుపట్టాయి. ట్రంప్ ప్లాన్‌లో భాగంగానే గాజాను పూర్తిగా హస్తగతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50 శాతం గాజా భూభాగం ఇజ్రాయెల్ అధీనంలోకి వచ్చింది. మిగిలిన ప్రాంతాన్ని సైతం త్వరలో ఆక్రమించబోతోంది. అయితే, గాజా ప్రజలను ఏం చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. వారందరినీ దక్షిణ గాజాకు తరలించనున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ కేబినెట్ తాజా నిర్ణయం పట్ల బందీల తీవ్రస్థాయిలో కుటుంబ సభ్యులు మండిపడ్డారు. హమాస్ మిలిటెంట్ల జోలికి వెళితే బందీలెవరూ ప్రాణాలతో మిగలరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాను ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలని కోరుతున్నారు. హమాస్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగా గాజాకు అంతర్జాతీయ మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించడం లేదు. -
పహల్గాం దాడిలో హమాస్ నేతల ప్లాన్.. POKలో ఏం జరిగింది?
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక హమాస్ కుట్ర ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరేలా మరిన్ని వ్యాఖ్యలు చేశారు.పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై తాజాగా రూవెన్ అజార్ స్పందిస్తూ..‘హమాస్ నాయకులు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు మాకు సమాచారం ఉంది. పహల్గాంలో దాడికి వీటి మధ్య సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. గతంలో ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7, 2023 హమాస్ నరమేధానికి, పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూపత్య ఉంది. ఈ రెండు ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉన్నారు.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ముష్కరులు సంగీత కచేరీలో పాల్గొన్న 1,400 మందికి పైగా పౌరులను హత్య చేశారు. ఉగ్రవాదులు అన్ని స్థాయిల్లో పరస్పరం సహకరించుకుంటున్నారు.. వారు ఒకరికొకరు అనుకరిస్తూ ఒకేలా మారుతున్నారు. ఈ ప్రమాదాలను ఎదుర్కొనడానికి నిఘా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని నాకు నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.ఇదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్యలు, హెచ్చరికలు నాకు ఎంతో ధైర్యం కలిగించాయి. దోషులను వేటాడుతాం అని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం అభినందనీయం. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను ప్రపంచం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదులకు అనేక దేశాలు నిధులు, ఇంటెలిజెన్స్ సమాచారం, ఆయుధాల రూపంలో మద్దతు ఇస్తున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.Watch: On the Pahalgam terror attack, Reuven Azar, Ambassador of Israel to India, says, "You have a similar situation in which people were going to a music festival and were massacred, and people here were going on vacation and they were massacred. It’s the same death cult, the… pic.twitter.com/5obbvzh89V— IANS (@ians_india) April 24, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న భారత్.. పాక్‌పై ముప్పేట దాడికి దిగింది. బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాక్‌కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగిరావాలని ఆదేశించింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది. అటారీ-వాఘా సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో గురువారం రిట్రీట్ వేడుకను బీఎస్ఎఫ్ నామమాత్రంగా నిర్వహించింది. పాక్ గార్డులతో కరచాలనాన్ని రద్దు చేసింది. రిట్రీట్ సందర్భంగా సరిహద్దు గేట్లను తెరవలేదు. మిగిలిన అన్ని డ్రిల్స్‌ను యథావిధిగా నిర్వహించామని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
‘ఇజ్రాయెల్’ను నాశనం చేస్తాం, కిల్ బిల్.. రూ.4 వేల కోట్లు!
జెరూసలేం: ‘ఇజ్రాయెల్’ను సర్వ నాశనం చేయడానికి ఇరాన్ నుంచి హమాస్ ఉగ్రవాద సంస్థ భారీగా సొమ్మును అభ్యర్థించింది. ఈ ‘కిల్ బిల్’… 50 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.4,295 కోట్లు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదివారం ఈ సంగతి వెల్లడించారు.ఇరాన్ నుంచి అంత మొత్తాన్ని హమాస్ నేతలు యాహ్యా సిన్వర్, మహమ్మద్ దీఫ్ ఆర్థిక సాయంగా కోరినట్టు తెలిపే ఆధారసహిత పత్రాలు ప్రస్తుతం ఇజ్రాయెల్ చేతికి చిక్కాయి. సిన్వర్, దీఫ్ ఇద్దరూ ఇటీవల మరణించారు. గాజాపై తాజా దాడుల సందర్భంగా తమ సైనికులకు ఆ పత్రాలు దొరికాయని, వాటిని ఇజ్రాయెల్ రక్షణ బలగాల (ఐడీఎఫ్) ‘ఇంటెలిజెన్స్ కేటలాగ్ యూనిట్’కు పంపామని కాట్జ్ తెలిపారు.(ఫొటో రైటప్: మహమ్మద్ దీఫ్, యాహ్యా సిన్వర్, ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమెనీ (ఎడమ నుంచి కుడికి). వారి వెనుక అక్షరాలతో కనిపిస్తున్నది... హమాస్ సంస్థకు ఇరాన్ ఆర్థిక సాయానికి సంబందించిన రహస్య పత్రం)ఆ పత్రాలు 2020 అక్టోబరు- 2021 జూన్ మధ్య కాలానికి చెందినవని, తాజా యుద్ధం నేపథ్యంలో సిన్వర్ వాటిని భూగర్భ సొరంగంలోకి తెచ్చాడని తెలుస్తోంది. ఇరాన్-హమాస్ దోస్తీకి ఆ పత్రాలు సాక్ష్యాధారాలని కాట్జ్ చెప్పారు. ఇరాన్ అందించిన దన్నుతోనే 2023 అక్టోబరు 7న ఇజ్రాయెలీలపై హమాస్ నరమేధానికి పాల్పడిందని చెప్పారు. 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం కావాలని యాహ్యా సిన్వర్, మహమ్మద్ దీఫ్ చేసిన విజ్ఞప్తికి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ‘కుద్స్ ఫోర్స్’ (పాలస్తీనా వ్యవహారాలు) హెడ్ సయీద్ ఇజాదీ ఆమోదం తెలిపారని కాట్జ్ వెల్లడించారు.ఆంక్షలు, ఆర్థిక సమస్యల్లో ఇరాన్ సతమతమవుతున్నప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలతో నెలకొన్న వైరానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఆ మొత్తాన్ని అందించడానికి ఇజాదీ ఒప్పుకున్నారని చెప్పారు. హమాస్, హెజ్బొల్లా, హౌతీలతోపాటుగా ఇరాక్, సిరియాల్లోని ఉగ్రవాద సంస్థల దుశ్చర్యలకు మూలం ఇరాన్ అని, ‘పాముకు తల’ ఇరాన్ అని ప్రపంచమంతా గ్రహించాలని కాట్జ్ కోరారు.దాడులకు సంబంధించిన కచ్చితమైన సమయం, ‘అక్టోబరు 7 ప్రణాళికల’ గురించి ఇరాన్ నాయకత్వానికి తెలియదని, అయితే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) శిక్షణ, ఆయుధాలు, నిధులు లేకుండా అక్టోబరు 7న హమాస్ ఊచకోతకు పాల్పడేది కాదని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఇరాన్ నుంచి రూ.1,300 కోట్ల (154 మిలియన్ డాలర్లు) నిధులు హమాస్ ఉగ్ర సంస్థకు బదిలీ అయినట్టు తెలిపే పత్రాలను ఖాన్ యూనిస్ భూగర్భ సొరంగాల నుంచి ఇజ్రాయెల్ రక్షణ బలగాలు సంపాదించి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రదర్శించాయి.::జమ్ముల శ్రీకాంత్ -
Israel-Hamas War: గాజాపై మళ్లీ దాడులు..17 మంది మృతి
ఖాన్ యూనిస్: గాజాలోని దక్షిణ ప్రాంత ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం జరిపిన దాడిలో 17 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం స్థానికులు గాలిస్తున్నారు. హమాస్‌ను కట్టడి చేసేందుకు మరో సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయాలని నెతన్యాహూ ప్రభుత్వం పథక రచన చేసింది. ఇందులో భాగంగా పాలస్తీనియన్లను నివాసాలు వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. వారిని భయభ్రాంతులకు గురిచేసేలా దాడులకు పాల్పడుతోంది. అక్కడే ఉన్నవారిని వెళ్లగొట్టేందుకు ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయి. గాజాలోని వేర్వేరు ప్రాంతాలపై గురువారం ఇజ్రాయెల్ చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో 14 మంది చిన్నారులు కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొంది. -
యుద్ధం తక్షణం ఆపండి!
కైరో: ఏడాదిన్నరకు పైగా సాగుతున్న యుద్ధంతో విసిగిపోయిన పాలస్తీనియన్లు హమాస్ ఉగ్ర సంస్థపై కన్నెర్రజేశారు. ఇజ్రాయెల్‌తో యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. హమాస్‌కు వ్యతిరేకంగా అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. ‘హమాస్ గెటౌట్’ అంటూ వీధుల్లోకి వచ్చి మరీ నినాదాలతో హోరెత్తించారు. ‘యుద్ధాన్ని ఆపండి’, ‘పాలస్తీనా పిల్లలు బతకాలనుకుంటున్నారు’, ‘మేమెందుకు చావాలి? మాకు చావాలని లేదు’, ‘మా పిల్లల రక్తం అంత చౌకైనది కాదు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘‘ప్రజలు అలసిపోయారు. గాజాపై హమాస్ అధికారాన్ని వదులుకోవడమే యుద్ధానికి పరిష్కారమైతే అలాగే కానివ్వండి. ప్రజలను కాపాడేందుకు హమాస్ ఎందుకు అధికారాన్ని వదులుకోదు?’’ అంటూ నిలదీశారు. ‘ప్రజలు హమాస్‌ను గద్దె దించాలనుకుంటున్నారు’ అంటూ నినాదాలు చేశారు. మంగళవారం మొదలైన నిరసనలు బుధవారం గాజాలో మరిన్ని ప్రాంతాలకు పాకాయి! టెలిగ్రాం ద్వారా ఆందోళనకు పిలుపులు అందుకున్న ప్రజలు భారీగా నిరసనల్లో పాల్గొన్నారు. వారి సంఖ్య వేలల్లోనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హమాస్, ఇజ్రాయెల్‌తో పాటు యుద్ధానికి తెర దించడంలో విఫలమవుతున్న అరబ్ దేశాలపైనా నిరసనకారులు మండిపడ్డారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి అనంతరం గాజాలో ఇదే అతి పెద్ద ఆందోళన. జాబాలియా, బెయిట్ లహియా తదితర చోట్ల జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘ఇవేమీ రాజకీయ నిరసనలు కావు. మా జీవితాలకు సంబంధించిన విషయమిది’’ అని బెయిట్ హనూన్కు చెందిన మొహమ్మద్ అబూ సకర్ అన్నాడు. ఆయన ముగ్గురు పిల్లల తండ్రి. తామంతా నిత్యం ప్రాణభయంతో వణికిపోతున్నామంటూ ఆవేదన వెలిబుచ్చాడు. అందుకే మరో దారిలేక నిరసనలకు దిగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ హత్యాకాండకు, సొంత గడ్డపైనే శరణార్థులుగా బతకాల్సిన దుస్థితికి అడ్డుకట్ట వేసి తీరతాం. అందుకు ఎంతటి మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించాడు. రెండు నెలల కాల్పుల విరమణ అనంతరం గాజాపై ఇజ్రాయెల్ తిరిగి భారీ బాంబు దాడులు ప్రారంభించడం తెలిసిందే. నిరసన ప్రదర్శనలపై హమాస్ ఉక్కుపాదం మోపింది. ముసుగులు ధరించిన సాయుధ హమాస్ మిలిటెంట్లు తుపాకులు, లాఠీలతో నిరసనకారులపై విరుచుకుపడ్డారు. అనేక మందిని కొట్టారని సమాచారం. 17 నెలల పై చిలుకు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం గాజాను శిథిలావస్థకు చేర్చింది. మార్చి 2న గాజాకు సహాయ సామగ్రి పంపిణీని ఇజ్రాయెల్ మళ్లీ అడ్డుకోవడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. -
గాజాలో హమాస్‌కు బిగ్ షాక్..
ఇజ్రాయెల్-హమాస్ పరస్పర దాడులు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో పాలస్తీనియన్లు నిరసనలు తెలుపుతూ భారీ సంఖ్యలో రోడ్లకు మీదకు వచ్చారు. యుద్ధం ఆపాలంటూ నినాదాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణ భయంతో శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. దీనికి సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే, హమాస్‌కు వ్యతిరేకంగా నిరసనలకు ఎవరు నేతృత్వం వహించారు అనేది తెలియరాలేదు. టెలిగ్రామ్‌లో వచ్చిన సందేశాల ఆధారంగానే తాము ఆందోళనల్లో పాల్గొన్నామని నిరసనకారుల్లో కొందరు తెలిపారు. ఇదిలా ఉండగా.. 2007 నుంచి గాజాను హమాస్ పాలిస్తోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల కారణంగా యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 17 నెలల నుంచి ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం సాగుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు చేసిన దాడులకు 50 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 1.13 లక్షల మంది గాయపడినట్లు వెల్లడించింది.Large protests against Hamas's fascism in Gaza today, with thousands demanding dignity, an end to the war & destruction, and calling on the terror group to "get out." Listen to Palestinians in Gaza; cover these demonstrations; be their voice; amplify their cries. Down with Hamas! pic.twitter.com/c9iHyqvAO5— Ahmed Fouad Alkhatib (@afalkhatib) March 25, 2025ఈ యుద్ధం ప్రారంభం నుంచి గాజాలో హమాస్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ పొడిగింపును హమాస్ నిరాకరించింది. ఇటీవల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత వారం వ్యవధిలోనే మళ్లీ దాడులు మొదలుకాగా.. వీటిలో దాదాపు 673 మంది చనిపోయారు. దీంతో, ఇజ్రాయెల్ దాడులను మరింతగా పెంచడంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈనెల మొదట్లో గాజాలోకి మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో అక్కడి పరిస్థితులు మరింత క్షీణించాయి."Out, out, out! #Hamas get out!"#Gaza residents pour on the streets chanting slogans against the militant organization that ruled Gaza for 20 years.pic.twitter.com/af9PKVZDhg— Ahmed Quraishi (@_AhmedQuraishi) March 26, 2025 -
గాజా మృతులు 50 వేలు
డెయిర్ అల్–బలాహ్: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి బలైన వారి సంఖ్య 50 వేలు దాటింది! ఆదివారం గాజా ఆరోగ్య విభాగం ఈ మేరకు ప్రకటించింది. ‘‘మృతుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులే. 1.13 లక్షల మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా జనాభాలో 90 శాతం మంది నిలువనీడ కోల్పోయారు’’ అని ఆవేదన వెలిబుచ్చింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన తాజా వైమానిక దాడుల్లో హమాస్ రాజకీయ విభాగం సీనియర్ నేత సహా 23 మంది చనిపోయారు. ఖాన్‌యూనిస్ సమీపంలో దాడుల్లో పాలస్తీనా పార్లమెంట్ సభ్యుడు, తమ రాజకీయ విభాగం సభ్యుడు సలాహ్ బర్దావిల్, ఆయన భార్య చనిపోయినట్లు హమాస్ వర్గాలు ప్రకటించాయి. టెంట్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో వీరిపై దాడి జరిగిందని పేర్కొన్నాయి. హమాస్ రాజకీయ వ్యవహారాలపై తరచూ మీడియాకు బర్దావిల్ ఇంటర్వ్యూలిస్తుంటారు. ఖాన్ యూనిస్‌పై జరిగిన దాడిలో దంపతులతో పాటు వారి ఐదుగురు సంతానం చనిపోయారు. మరో దాడిలో దంపతులు, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయినట్టు యూరోపియన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో దాడిలో చనిపోయిన మహిళ, చిన్నారి మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కువైటీ ఆస్పత్రి నిర్వాహకులు చెప్పారు.మారణహోమమే హమాస్ సాయుధులు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి 1,200 మందిని చంపడం, 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధానికి దిగింది. ఆ ప్రాంతాన్ని శ్మశానసదృశంగా మార్చేసింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ రెండు నెలల ముచ్చటే అయింది. వారం రోజులుగా మళ్లీ గాజాపై దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. -
ఇదే నా చివరి హెచ్చరిక.. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హమాస్‌పై భగ్గుమన్నారు. తమ అదుపులో ఉన్న మిగిలిన బందీలను తక్షణమే విడుదల చేయాలని.. లేకుంటే అంతు చూస్తానని హమాస్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలో ఇదే తన చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు. హమాస్(Hamas) విడుదల చేసిన ఎనిమిది మందితో వైట్హౌజ్తో తాజాగా ట్రంప్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘హలోనా? గుడ్‌బైనా?.. ఏదో మీరే ఎంచుకోండి. బందీలందరిని వెంటనే విడుదల చేయండి. అలాగే మీరు చంపిన వాళ్ల మృతదేహాలను తిరిగి అప్పగించండి. లేకుంటే మీ పని ఖతమే. మానసికంగా మూర్ఖులైనవాళ్లు మాత్రమే ఇలా మృతదేహాలను తమ వద్ద ఉంచుకుంటారు. అందుకే.. పని పూర్తి చేసేందుకు అవసరమైనవన్నీ ఇజ్రాయెల్‌కు పంపుతున్నా. నేను చెప్పింది చేయకుంటే.. ఒక్క హమాస్ సభ్యుడు కూడా మిగలడు. ‘‘మీరు చిధ్రం చేసిన కొందరు బందీలను నేను కలిశా. ఇదే మీకు నా చివరి హెచ్చరిక. గాజానుప్పుడే వీడండి. ఇదే మీకు చివరి అవకాశం. గాజా ప్రజల్లారా.. మీ కోసం అందమైన భవిష్యత్తు ఎదురు చూస్తోంది. ఒకవేళ బందీలను గనుక విడుదల చేయకుంటే.. అది మీకు దక్కదు. బందీలందరినిప్పుడే విడుదల చేయండి.. లేదంటే తర్వాత అనుభవించాల్సి ఉంటుంది అని పదే పదే హెచ్చరిక జారీ చేశారాయన. "'Shalom Hamas' means Hello and Goodbye - You can choose. Release all of the Hostages now, not later, and immediately return all of the dead bodies of the people you murdered, or it is OVER for you. Only sick and twisted people keep bodies, and you are sick and twisted! I am… pic.twitter.com/88EjVAyWAe— President Donald J. Trump (@POTUS) March 5, 20252023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం(Gaza War) మొదలైన సంగతి తెలిసిందే. తొలుత హమాస్ జరిపిన మెరుపు క్షిపణుల దాడుల్లో 1,200 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఆ సమయంలోనే కొందరు ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని హమాస్ ఎత్తుకెళ్లి తమ చెరలో బంధీలుగా ఉంచుకుంది. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల్లో.. ఇప్పటిదాకా 46 వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. ఇందులో పిల్లలే ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో లక్షల మంది ప్రాణభయంతో గాజాను విడిచిపెట్టి పోయారు. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు నుంచే హమాస్‌ను బందీల విడుదల విషయంలో హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పాలస్తీనా ఖైదీలు, యుద్ధ ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్-హమాస్ పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అమలు నిదానంగా జరుగుతుండడం.. ఒకానొక దశలో హమాస్ బందీల విడుదలను నిలుపుదల చేయడంతో ట్రంప్ ఇలా చివరి హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. గాజా నుంచి పాలస్తీనా ప్రజలను వెళ్లగొట్టి పునర్ నిర్మిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించడం.. ఓ ఏఐ జనరేటెడ్ వీడియో పోస్ట్ చేయడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
గాజాకు సాయం ఆపేసిన ఇజ్రాయెల్
టెల్ అవీవ్: హమాస్‌తో కాల్పుల విరమణ తొలి దశ ఒప్పందం శనివారం ముగిసిన నేపథ్యంలో గాజాలోకి మానవతా సాయాన్ని నిలిపేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒప్పందాన్ని పొడిగించాలంటే తమ ప్రతిపాదనలకు హమాస్ ఒప్పుకుని తీరాలని షరతు విధించింది. అందుకు హమాస్ ససేమిరా అనడంతో గాజాలోకి నిత్యావసర వస్తువులు, ఔషధాలు, ఇతరత్రా సరకుల రవాణాను ఇజ్రాయెల్ బలగాలు ఆదివారం అడ్డుకున్నాయి. దాంతో మానవతా సాయానికి హఠాత్తుగా అడ్డుకట్టపడింది. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ సాయం ఆపేయం చౌకబారు బెదిరింపు చర్య. తద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడుతోంది. తొలి దశ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘిస్తోంది’’ అని ఆరోపించింది. అమెరికా ఆదేశాల మేరకే గాజాకు సాయాన్ని ఆపేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. రంజాన్ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 దాకా పొడిగించాలన్న అమెరికా అభ్యర్థనకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఆ మేరకు తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఒప్పందంలో తదుపరి దశకు వెళ్లకుండా తొలి దశను పొడిగించడాన్ని హమాస్ తప్పుబట్టింది. తమ బందీల్లో సగం మందిని హమాస్ విడుదల చేస్తేనే రెండోదశ కాల్పుల విరమణకు సిద్ధపడతామని ఇజ్రాయెల్ చెబుతోంది. రెండో దశ చర్చల వేళ మరింతమంది బందీలను వదిలేయాలని డిమాండ్ చేసింది. శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించి, ఇజ్రాయెల్ గాజా నుంచి వెనుతిరిగితేనే మొత్తం బందీలను వదిలేస్తామని హమాస్ తేలి్చచెప్పింది. -
వెస్ట్ బ్యాంక్‌పై పట్టు బిగించిన ఇజ్రాయెల్
కబాటియా: గాజాలో హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడిక వెస్ట్ బ్యాంక్‌పై దృష్టి సారించింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన రెండు రోజుల్లో భారీగా సైన్యాన్ని ఇక్కడికి తరలించింది. శరణార్థులుగా మారిన పాలస్తీనియన్లను తిరిగి వెస్ట్ బ్యాంక్‌లోకి అడుగుపెట్టకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌ను క్రమేపీ విస్తరిస్తూ వచ్చింది. వెస్ట్ బ్యాంక్ నుంచి తమపై దాడులు పెరుగుతున్నందున ఈ ప్రాంతం నుంచి మిలిటెన్సీని రూపుమాపడమే లక్ష్యమని అంటోంది. అయితే, ఇక్కడున్న 30 లక్షల మందిని సైనిక పాలన కిందికి తేవడమే ఇజ్రాయెల్ ఉద్దేశమని పాలస్తీనియన్లు అంటున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరుగుతోందని, వేలాది మందికి నిలున నీడ కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 40వేల మంది పాలస్తీనయన్లు జెనిన్ వంటి పట్టణ ప్రాంత శరణార్థి శిబిరాలను ఖాళీ చేసి వెళ్లిపోయారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. దీంతో, అక్కడ కనీసం ఏడాదిపాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలని మిలటరీకి ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. పాలస్తీనియన్లను తిరిగి అక్కడికి రానిచ్చేది లేదని, ఉగ్రవాదాన్ని పెరగనివ్వబోమని చెప్పారు. అయితే, ఎంతకాలం పాలస్తీనియన్లను అడ్డుకుంటారో ఆయన స్పష్టం చేయలేదు. ఇజ్రాయెల్‌పై సాయుధ పోరుకు కేంద్ర స్థానంగా ఉన్న జెనిన్లోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులను పంపించింది. 2002 తర్వాత ఇజ్రాయెల్ ట్యాంకులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో సొంతప్రాంతాలను వదిలిన శరణార్థుల వారసులే ఈ శిబిరాల్లో ఉంటున్నారు. కాగా, దీర్ఘ కాలంపాటు ఇజ్రాయెల్ ఆర్మీ వెస్ట్ బ్యాంక్‌లో తిష్టవేయడం 2000 తర్వాత ఇదే మొదటిసారని ఐరాస కూడా అంటోంది. గాజాలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో వెస్ట్ బ్యాంక్‌లో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఇజ్రాయెల్ కూడా ఈ ప్రాంతంపై పదేపదే దాడులకు పాల్పడింది. ఇక్కడ కనీసం 800 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మిలిటెంట్లేనని ఆర్మీ పేర్కొంది. అయితే, గాజాతోపాటు లెబనాన్‌లోనూ యుద్ధం జరుగుతున్నందున సంకీర్ణ పక్షాల నుంచి వచ్చిన ఒత్తిడుల కారణంగా ప్రధాని నెతన్యాహూ వెస్ట్ బ్యాంక్‌లో మిలిటెన్సీ అణచివేత చర్యలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. 1967లో జరిగిన యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఈ మూడు ప్రాంతాలను కలిపి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్నది పాలస్తీనియన్ల చిరకాల వాంఛ. -
అలా చేయాలని వాళ్లే బలవంతం చేశారు: ఇజ్రాయెల్ బందీ
టెల్అవీవ్:గాజా కాల్పుల విరమణలో భాగంగా ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ శనివారం(ఫిబ్రవరి22) విడిచిపెట్టారు. ఏడాదిన్నర తర్వాత వీరు హమాస్ చెర నుంచి బయటపడ్డారు.అయితే విడుదల సందర్భంగా ఒమర్ షెమ్‌టోవ్ అనే బందీ హమాస్ ఉగ్రవాదులను ముద్దు పెట్టకుని అందరినీ ఆశ్చర్య పరిచాడు.అయితే గాజా నుంచి రెడ్‌క్రాస్ వాహనంలో ఎక్కి ఇజ్రాయెల్ చేరుకున్న తర్వాత షెమ్‌టోవ్ అసలు విషయం చెప్పాడు.హమాస్ ఉగ్రవాదులే తమను అలా ముద్దు పెట్టుకోవాల్సిందిగా బలవంతం చేశారని చెప్పాడు.‘నన్ను అలా చేయాల్సిందిగా వాళ్లు ఒత్తిడి చేశారు.మీరు కావాలంటే వీడియోలో చూడొచ్చు.. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏం చేయాలో చెప్తున్నాడు’అని వివరించాడు.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని నెగెవ్ జిల్లాపై హమాస్ ఉగ్రవాదులు దాడి జరిపి 1200 మందిని చంపడమే కాకుండా 250 మందిని తమ వెంట గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. వీరిలో షెమ్‌టోవ్ ఒకరు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో ఉండగా షెమ్‌టోవ్ హమాస్ ఉగ్రవాదులకు చిక్కాడు. -
హమాస్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం.. వారం రోజుల్లో..
టెల్అవీవ్:గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఏ క్షణమైనా తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఒప్పందం ప్రకారం హమాస్ తమ వద్ద ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను శనివారం వదిలిపెట్టినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం 620 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టలేదు. తమ దేశానికి చెందిన మిగిలిన బందీలను వదిలిపెట్టేదాకా ఎవరినీ విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది.పాలస్తీనా ఖైదీలను జైలు నుంచి బయటికి తీసుకువచ్చి తిరిగి జైలులోకే పంపించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఆరుగురు బందీల విడుదల సమయంలో హమాస్ వ్యవహరించిన తీరు క్రూరంగా,అవమానకరంగా ఉందని ఇజ్రాయెల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి కూడా ప్రకటించింది. శనివారం బందీలను విడిచిపెట్టే సందర్భంగా గాజాలో ప్రత్యేకంగా వేసిన స్టేజిపై వారిని ప్రదర్శించి వేడుకలాగా చేయడంపై ఇజ్రాయెల్ అభ్యంతరం తెలిపింది.పైగా బందీల వెంటే ఆయుధాలు పట్టుకున్న ఉగ్రవాదులు ఉండడం సరికాదని పేర్కొంది.తొలి విడత గాజా కాల్పుల విరమణ ఒప్పందం కాల పరిమిత మరో వారం రోజుల్లో ముగియనుంది.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి వేలాది మందిని చంపడంతో పాటు కొందరిని వారి వెంట బందీలుగా తీసుకెళ్లారు.అనంతరం ఇజ్రాయెల్ గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో 45 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. -
ఆరుగురు బందీలకు విముక్తి
నుసెయిరత్: కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ ముందుగా ప్రకటించిన విధంగానే హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల్లో ఆరుగురిని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం రెడ్ క్రాస్‌కు అప్పగించింది. గాజాలోని నుసెయిరత్‌లో శనివారం ఉదయం ముందుగా ఏర్పాటు చేసిన వేదికపైకి మాస్క్ ధరించిన హమాస్ సాయు ధులు ముగ్గురు బందీలను తీసుకువచ్చారు. వీరు ఒమెర్ వెన్కెర్ట్(23), ఒమెర్ షెమ్ టోవ్(22), ఎలియా కోహెన్(27). ముగ్గురూ ఆరోగ్యంగానే కనిపించారు. ఎంతో సంతోషంతో ఉన్న ఒమెర్ షెమ్ టోవ్ పక్కనున్న హమాస్ మిలిటెంట్ నుదుటిపై ముద్దిచ్చాడు. వీరి విడుదలను గమనిస్తున్న కుటుంబసభ్యులు ఆనంద బాష్పాలతో సంతోషం పట్టలేక కేకలు వేశారు. అనంతరం వీరిని రెడ్ క్రాస్ వాహనాల్లో ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వీరికి అధికారులు స్వాగతం పలికారు. అంతకుముందు, గాజాలోని రఫాలో జరిగిన కార్యక్రమంలో టల్ షోహమ్(40), అవెరా మెంగిస్టు(38) అనే బందీలను హమాస్ సాయుధులు రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించారు. ఇక, ఆరో బందీ 36 ఏళ్ల బెడోయిన్ సంచార తెగకు చెందిన హిషామ్ అల్– సయేద్ను కూడా విడిచిపెట్టింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఇతడు 2015లో గాజాలోకి ప్రవేశించి, హమాస్ బందీగా మారాడు. 2014 నుంచి బందీగా ఉండి.. శనివారం విడుదలైన వారిలో కోహెన్, షెమ్ టోవ్, వెన్కెర్ట్లు 2023 అక్టోబర్ 7న కిబ్బుట్జ్లో నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ శ్రేణులు జరిపిన మెరుపు దాడిలో చిక్కారు. కిడ్నాపైన సమయంలో సాధారణ దుస్తుల్లో ఉన్న వీరు శనివారం విడుదలైనప్పుడు మాత్రం నకిలీ ఆర్మీ యూనిఫాంతో కనిపించారు. టల్ షోహమ్కు ఆ్రస్టేలియా పౌరసత్వం కూడా ఉంది. మ్యూజిక్ ఫెస్టివల్‌కు వచ్చిన ఇతడిని కుటుంబం సహా హమాస్ బందీలుగా పట్టుకుపోయింది. షోహమ్ భార్య, ఇద్దరు పిల్లలు, మరో ముగ్గురు బందీలను 2023 నవంబర్‌లో బందీల మార్పిడి సమయంలో విడుదల చేశారు. ఇంకా, ఇథియోపియా మూలాలున్న ఇజ్రాయెల్ పౌరుడు మెగిట్సు 2014లో అనుకోకుండా గాజాలోకి ప్రవేశించి హమాస్‌కు పట్టుబడ్డాడు. దశాబ్దానికి పైగా హమాస్ చెరలోనే గడిపిన ఇతడు సజీవంగా రావడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అంతేలేకుండా పోయింది. షిరి బిబాస్ మృతదేహం అప్పగింత గురువారం హమాస్ అప్పగించిన బందీల మృత దేహాల్లో ఒకటి షిరి బిబాస్‌ది కాదని, అది గుర్తు తెలియని మరో పాలస్తీనా మహిళదంటూ ఇజ్రాయెల్ ప్రకటించడం తెలిసిందే. ఇది పొరపాటేనంటూ హమాస్ సైతం అంగీకరించింది. ఈ మేరకు పాలస్తీనియన్ ముజాహిదీన్ బ్రిగేడ్స్ అనే సాయుధ గ్రూపు మరో మృతదేహాన్ని శుక్రవారం రాత్రి రెడ్ క్రాస్‌కు అప్పగించింది. పరిశీలించిన కుటుంబ సభ్యులు, పరీక్షలు జరిపిన ఇజ్రాయెల్ ఫోరెన్సిక్ అధికారులు అది షిరి బిబాస్ మృతదేహమేనని ధ్రువీకరించడంతో కథ సుఖాంతమైంది. మొదటి దశలో సజీవంగా ఉన్న బందీల విడుదల శనివారంతో ముగియగా వచ్చే వారంలో చనిపోయిన నలుగురు బందీల మృతదేహాలను అప్పగించనున్నట్లు హమాస్ ప్రకటించింది. కాగా, హమాస్ చెరలో ఇంకా 60 మంది వరకు బందీలుగా ఉన్నట్లు చెబుతున్న ఇజ్రాయెల్ వీరిలో సగం మందివరకు చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది. -
నెతన్యాహు వార్నింగ్..దిగొచ్చిన హమాస్
టెల్అవీవ్:బందీగా తీసుకెళ్లిన షిరి బిబాస్ మృతదేహం కాకుండా వేరే మృతదేహాన్ని హమాస్ పంపడంపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.ఇది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనేనని, దీనికి ప్రతిగా హమాస్‌ను మొత్తమే లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉగ్రవాద సంస్థ హమాస్ వెంటనే మెట్టుదిగి వచ్చింది. బందీ షిరి బిబాస్ మృతదేహాన్ని వెంటనే ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించింది.తాము షిరిబిబాస్ మృతదేహాన్ని గుర్తుపట్టామని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు.కాగా, హమాస్ గురువారం అప్పగించిన నాలుగు మృతదేహాల్లో మహిళ మృతదేహం 2023 అక్టోబర్ 7 దాడి సమయంలో హమాస్ తీసుకెళ్లిన బందీలకు చెందినది కాదని ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది.మృతదేహాల్లో ఖఫీర్ బిబాస్,అతని నాలుగేళ్ల సోదరుడు ఏరియల్ అనే ఇద్దరు పిల్లలున్నారని, మూడో మృతదేహం వారి తల్లి షిరి బిబాస్‌ది కాదని వెల్లడించింది.మహిళ మృతదేహం ఇతర బందీల పోలికలతో కూడా సరిపోలడం లేదని తెలిపింది. -
ఆ మృతదేహం షిరి బిబాస్‌ది కాదు..
టెల్అవీవ్: హమాస్ గురువారం అప్పగించిన నాలుగు మృతదేహాల్లో మహిళ మృతదేహం.. 2023 అక్టోబర్ 7 దాడి సమయంలో పట్టుబడిన బందీలకు చెందినది కాదని ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది. మృతదేహాల్లో ఖఫీర్ బిబాస్, అతని నాలుగేళ్ల సోదరుడు ఏరియల్ అనే ఇద్దరు పిల్లలున్నారని, మూడో మృతదేహం వారి తల్లి షిరి బిబాస్‌ది కాదని వెల్లడించింది. మహిళ మృతదేహం అపహరణకు గురైన ఇతర వ్యక్తులతో సరిపోలడం లేదని సైనిక ప్రతినిధి తెలిపారు. అంతేకాదు.. కఫీర్ బిబాస్, ఏరియల్ బిబాస్లను హమాస్ చంపిందని ఆరోపించారు. బందీల విడుదల ఒప్పందంలో హమాస్‌ది తీవ్రమైన ఉల్లంఘనని ఇజ్రాయెల్ మండిపడింది. షిరితో పాటు మిగిలిన బందీలందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. అయితే, ఇజ్రాయెల్ ఆరోపణలపై హమాస్ ఇంకా స్పందించలేదు. కాగా, గురువారం మృతదేహాల అప్పగింత సమయంలో జరిగిన హడావుడిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. విడుదల సందర్భంగా వేలాది మంది జనం మధ్య.. సాయుధ హమాస్ ఫైటర్లు నాలుగు శవపేటికలను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా అంతర్జాతీయ నేతలు తీవ్రంగా ఖండించారు. -
ఇజ్రాయెల్‌లో వరుస పేలుళ్లు
టెల్అవీవ్:మధ్య ఇజ్రాయెల్‌లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. బాట్‌యామ్ నగరంలోని ఓ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. మరో రెండు బస్సుల్లో దొరికిన బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు.వరుస పేలుళ్లతో దేశవ్యాప్తంగా బస్సులు,రైళ్లలో తనిఖీలు చేపట్టారు. బాంబులు ఎవరు పెట్టారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌లో దొరికన పేలుడు పదార్థాలను పోలినట్లు తాజాగా దొరికన బాంబులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు హమాస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఖస్సమ్ బ్రిగేడ్స్ కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లోని తమ భూభాగాన్ని ఆక్రమించుకున్నవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని బబ్రిగేడ్స్ తాజాగా సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టింది. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ వెస్ట్‌బ్యాంక్‌పై దాడులు మొదలు పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్న కారణంతో హమాస్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. -
నలుగురు బందీల మృతదేహాలు అప్పగింత
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్‌కు చెందిన నలుగురు బందీల మృతదేహాలను హమాస్ గురువారం విడుదల చేసింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగర సమీపంలో రెడ్ క్రాస్ సంస్థకు అందజేసింది. అనంతరం రెడ్‌క్రాస్ వాహనంలో ఉంచారు. ఆ పేటికల్లో షిరి బిబాస్(32), ఆమె ఇద్దరు పిల్లలు ఏరియల్ బిబాస్(4), కెఫిర్ బిబాస్, రిటైర్డ్ జర్నలిస్ట్ ఓడెడ్ లిఫ్ షిట్జ్గా గుర్తించారు. వీరందరూ హమాస్ 2023 అక్టోబర్ ఏడో తేదీన దాడిలో అపహరించిన వారు. అయితే ఈ నలుగురు గతేడాది నవంబర్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో మరణించారని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ క్రూరమైన నిరంతర బాంబు దాడుల వల్ల అపహరణకు గురైనవారందరినీ రక్షించలేకపోయామని హమాస్ తెలిపింది. చనిపోయినవారు... పిల్లల ప్రాణాలనూ లెక్కచేయని నాయకత్వ తీరుకు బలైపోయారని హమాస్ బాధితుల కుటుంబాలకు తెలిపింది. మృతదేహాల పేటికలు తమకు అందాయని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. మరణించినవారి వివరాలను ఇజ్రాయెల్ అధికారికంగా వెల్లడించలేదు. అప్పగింత సమయంలో.. ఖాన్ యూనిస్ శివార్లలో వేలాది మంది గుమిగూడారు. శవపేటికలను ఉంచడానికి ఏర్పాటు చేసిన వేదికపై ముసుగులు ధరించిన సాయుధులు... ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును రక్త పిశాచిగా చిత్రీకరించిన పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ఒక పెద్ద స్క్రీన్‌లో లిఫ్షిట్జ్, బిబాస్ కుటుంబం ఫొటోలను, వీడియోలను ప్రదర్శించారు. అత్యంత చిన్నవయస్కుడైన కెఫిర్.. బాట్మాన్ దుస్తులు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో అందరినీ కదిలించింది. -
హమాస్‌కు ఇక నరకమే: నెతన్యాహు వార్నింగ్
టెల్అవీవ్:ఇజ్రాయెల్,హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు హమాస్‌పై చేసిన వ్యాఖ్యలు గాజాలో పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చేలా ఉన్నాయి. బందీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయకపోతే హమాస్‌ను లేకుండా చేస్తామని,హమాస్ ఉగ్రవాదులకు నరకం గేట్లు తెరుస్తామని నెతన్యాహు తాజాగా వార్నింగ్ ఇచ్చారు.్హహమాస్ను పూర్తిగా నిర్మూలించడంపై తమ వద్ద ఉన్న వ్యూహాన్ని ఇప్పుడే వెల్లడించలేమన్నారు. అమెరికా కూడా ఇందుకు సహకరిస్తుందన్నారు. ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రుబియోతో కలిసి ఆదివారం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు.గాజాలో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు దాని ప్రభుత్వాన్ని లేకుండా చేస్తామని రుబియో చెప్పారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ వారిని సురక్షితంగా తీసుకువస్తామని నెతన్యాహు అన్నారు. అయితే తాజాగా రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు హమాస్ ప్రతినిధులు చనిపోయారు. దీనిపై హమాస్ ఆగ్రహంగా ఉంది. రెండో దశ కాల్పుల విరమణకుగాను మళ్లీ చర్చలు జరగాలని, కాల్పుల విరమణతో పాటు గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెళ్లిపోవాలని హమాస్ అంటోంది.ఇప్పటికే కుదిరిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఇప్పటికే పలువురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
హమాస్‌ను నిర్మూలించాల్సిందే
జెరూసలేం: హమాస్‌ను గాజా నుంచి తుడిచిపెట్టాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో స్పష్టం చేశారు. సైనికపరమైన లేదా ప్రభుత్వాన్ని నడిపే శక్తిగా హమాస్ ఎంతమాత్రం కొనసాగనివ్వబోమని చెప్పారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంగా, పరిపాలనా శక్తిగా, హింసకు పాల్పడతామంటూ బెదిరించే వ్యవస్థగా హమాస్ ఉన్నంత కాలం శాంతి నెలకొనడం అసాధ్యం. అందుకే హమాస్‌ను నిర్మూలించకతప్పదు’’ అని కుండబద్దలు కొట్టారు. హమాస్‌పై పోరుకు అరబ్ దేశాల సాయం కూడా కోరుతామన్నారు. ఎవరూ ముందుకు రాకుంటే సొంతంగా ఇజ్రాయెలే ఆపని పూర్తి చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగడంపై అనుమానంగా మారింది. దాని గడువు రెండు వారాల్లో ముగియనుంది. రెండో దశలో మిగతా బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉండటం తెలిసిందే. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాపై దాడులకు దిగింది. వీటిలో తమ ముగ్గురు పోలీసులు చనిపోయినట్లు హమాస్ తెలిపింది. -
మెట్టుదిగిన హమాస్..మరో ముగ్గురు బందీల విడుదల
గాజా: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌కు చెందిన మరో ముగ్గురు బందీలను ఉగ్రవాద సంస్థ హమాస్ శనివారం(ఫిబ్రవరి15) విడుదల చేసింది. ముగ్గురు బందీలను రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్ డెకెల్ చెన్ (36),అలెగ్జాండర్ ట్రుఫనోవ్ (29), యైర్ హార్న్(46)బందీలు హమాస్ చెర నుంచి బయటికి వచ్చారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించింది.దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకుంది.తమ బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఈ బెదిరింపులకు భయపడ్డ హమాస్ బందీల విడుదలకు అంగీకరించింది. ముగ్గురు బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ 369 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసింది.ఖతర్,ఈజిప్టు మధ్యవర్తిత్వంతో గత నెల ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా.. హమాస్ తమ చెరలోని 94 మంది బందీల్లో 33 మంది బందీలను విడుదల చేయనుంది.ప్రతిగా దాదాపు 1700 మందికిపైగా పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ ఇప్పటివరకు 21 మంది ఖైదీలకు విముక్తి కల్పించింది. -
షెడ్యూల్ ప్రకారమే బందీలను విడుదల చేస్తాం
కైరో: ఇజ్రాయెల్ బందీల విడుదల విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని హమాస్ తేల్చిచెప్పింది. మందుగా ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారమే బందీలకు విముక్తి కల్పిస్తామని స్పష్టంచేసింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులు తమతో చెప్పారని వెల్లడించింది. ఈ మేరకు హమాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం చూస్తే మరో ముగ్గురు బందీలు శనివారం విడుదల కాబోతున్నారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుందని హమాస్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమాస్ కొద్దిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. గాజాలో షెల్టర్లు నిర్మించుకొనేందుకు, విదేశాల నుంచి మానవతా సాయం సరఫరాకు అనుమతి ఇవ్వకపోతే బందీల విడుదలను ఆలస్యం చేస్తామని ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం బందీలను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, గాజాపై మళ్లీ దాడులు ప్రారంభమవుతాయని హమాస్‌ను హెచ్చరించారు. దీంతో హమాస్ మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హమాస్ ఇప్పటిదాకా 21 మంది బందీలను విడిచిపెట్టింది. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం 730 మంది పాలస్తీనా ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసింది. -
హమాస్, గాజాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్టు కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు.పాలస్తీనాకు చెందిన గాజాపై డొనాల్డ్ ట్రంప్ తన మనసులోకి మాటను బయట పెట్టారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా ఆధ్వర్యంలో గాజాను పునర్ నిర్మించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఇందు కోసం గాజాను కొనుగోలు చేసి సొంతం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఇతరులకు కూడా అప్పగించవచ్చు. ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాం. హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై గాజా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతకుముందు కూడా గాజాపై ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి, అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి, భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతమున్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చు. తుపాకీ కాల్పులు, ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధర సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.ఈ మాటలపై, పాలస్తీనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే, తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురయ్యారు. అరబ్ దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను తప్పుబట్టాయి. ఈజిప్టు, జోర్డాన్ వంటి మిత్ర దేశాలు సైతం పాలస్తీనియన్ల తరలింపును వ్యతిరేకించాయి. ఇటువంటి చర్యవల్ల పశ్చిమాసియా సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టింది. ట్రంప్ ప్రకటన సమస్యాత్మకంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. జాతి నిర్మూలన ఆలోచన వద్దు: గుటేరస్ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పునరుద్ఘాటించారు. జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు. పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి, గాజా నుంచి ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘సమస్య పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో పరిస్థితిని మరింత దిగజార్చరాదు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం అత్యావశ్యకం. ఏ రూపంలో అయినా జాతి నిర్మూలన నివారించాలి’ అని పేర్కొన్నారు. ఆక్రమణలకు ముగింపు పలకాలన్నారు. గాజా అంతర్భాగంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా శాంతి సుస్థిరతలకు ఇదే అసలైన పరిష్కారమని నొక్కిచెప్పారు. -
స్వదేశానికి చేరుకున్న థాయ్ బందీలు
బ్యాంకాక్: 500 రోజులపాటు హమాస్ చెరలో ఉన్న థాయ్‌లాండ్ వ్యవసాయ కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. 2023 అక్టోబర్‌లో జరిగిన దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న పొంగ్సాక్ థేన్నా, సతియాన్ సువన్నాఖమ్, వాచరా శ్రీవూన్, బన్నావత్ సేథావో, సురసాక్ లామ్నావోలను కూడా హమాస్ అపహరించింది. ఎట్టకేలకు వారు ఆదివారం ఉదయం బ్యాంకాక్‌కు చేరకున్నారు. సువర్ణభూమి ఎయిర్‌పోర్టులో దిగిన ఐదుగురు కుటుంబాలను కలుసుకోవడంతో విమానాశ్రయంలో భావోద్వేగ వాతావావరణ నెలకొంది. కాగా, వారు మళ్లీ తిరిగి ఇజ్రాయెల్‌కు వెళ్లకుండా ఉండేందుకు నెలకు 725 పౌండ్ల వేతనంతో పాటు సుమారు 14,510 పౌండ్లను ఒకేసారి ఇవ్వనున్నట్లు థాయ్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. ఒక థాయ్ బందీ ఆచూకీ లభించలేదు. గాజాలో ఇంకా ఉన్న ఆరో థాయ్ బందీ విడుదల కోసం ప్రయత్నిస్తామని, గెలుస్తామనే ఆశ ఉందని విదేశాంగ మంత్రి సంగియంపోంగ్సా అన్నారు. అక్టోబర్ 2023 నుంచి మొత్తం 46 మంది థాయ్ కార్మికులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది హమాస్ దాడిలో, కొందరు హెజ్బొల్లా ప్రయోగించిన క్షిపణుల వల్ల మరణించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి 30న విడుదలయ్యారు. అయితే 10 రోజులపాటు వారికి ఇజ్రాయెల్ ఆసుపత్రిలోనే ఉంచి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. అనంతరం స్వస్థలాలకు పంపించారు. బ్యాంకాక్ చేరుకున్న అనంతరం బందీలు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మేం ఇక్కడ నిలబడానికి సహాయం చేసిన అధికారులందరికీ కృతజ్ఞతలు. స్వదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం’’అని చెప్పారు. తమవారిని మళ్లీ ఇంటికి దూరంగా పంపించాలనుకోవడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
ఆ కారిడార్ నుంచి వెనక్కు
టెల్ అవీవ్: హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా గాజాలోని కీలకమైన నెట్జరిమ్ కారిడార్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. ఉత్తర, దక్షిణ గాజా ప్రాంతాలను నెట్జరిమ్ కారిడార్ విడదీస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటం, ఆంక్షల కారణంగా లక్షలాదిమంది పాలస్తీనియన్లు దక్షిణ భాగంలో చిక్కుకుపోయారు. ఒప్పందంలో భాగంగా వీరిని నెట్జరిమ్ మీదుగా తిరిగి ఉత్తర గాజాలోకి వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. ఇందులో భాగంగానే బలగాల ఉపసంహరణ అమలైంది. అయితే, ఆదివారం ఎన్ని బలగాలు వెనక్కి వెళ్లిపోయిందీ ఇజ్రాయెల్ వెల్లడించలేదు. మొత్తం 42 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు సగం రోజులు గడిచాయి. ఒప్పందం ప్రకారం..22వ రోజైన ఆదివారం గాజాలో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలి. గాజాలోని దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తరం వైపు వెళ్లే పాలస్తీనియన్లను ఎలాంటి తనిఖీలు జరపకుండా ఇజ్రాయెల్ బలగాలు అనుమతించాల్సి ఉంటుంది. మొదటి విడతలో హమాస్ తమ వద్ద ఉన్న 33 మంది ఇజ్రాయెలీలను విడతల వారీగా విడిచిపెట్టాల్సి ఉంది.ఒప్పందం పొడిగింపు ప్రశ్నార్థకమేకాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇరుపక్షాలు మరోసారి చర్చలు ప్రారంభించాల్సి ఉంది. పొడిగింపుపై ఏకాభిప్రాయం కుదిరిన పక్షంలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న మొత్తం ఇజ్రాయెలీలకు, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వందలాది మంది పాలస్తీనియన్లకు స్వేచ్ఛ లభించనుంది. మళ్లీ చర్చలపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరచక పోవడంతో కాల్పుల విరమణ పొడిగింపు అంశం ప్రశ్నార్థకంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ కీలక మధ్యవర్తిగా ఉంది. ఈ దఫా చర్చలకు తక్కువ స్థాయి అధికారులను ఖతార్‌కు పంపనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను పొడిగించే అవకాశాలపై ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు పరిశీలకులు. ఈ వారంలో నెతన్యాహూ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఒప్పందంపై చర్చిస్తారని భావిస్తున్నారు. అయితే, ఈ సమావేశం ఎప్పుడు జరగనుందనే విషయంలో స్పష్టత రాలేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడులు జరిపి 250 మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుపోవడంతో ఇరుపక్షాల మధ్య యుద్ధం మొదలుకావడం తెలిసిందే. -
హమాస్ చెర నుంచి మరో ముగ్గురికి విముక్తి
డెయిర్ అల్–బలాహ్: కాల్పుల విరమణ ఒప్పందం మేరకు శనివారం హమాస్ మిలిటెంట్లు మరో ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేశారు. ప్రతిగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 183 మంది పాలస్తీనియన్లను వదిలేసింది. వందలాదిమంది సాయుధ హమాస్ శ్రేణులు ఎలి షరాబీ(52), బెన్ అమి(56), ఒర్ లెవీ(34) అనే బందీలను వేదికపైకి తీసుకువచ్చాయి. అనంతరం వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించాయి. ఎంతో బలహీన స్థితిలో ఉన్న వారిని మాట్లాడాలంటూ బలవంత పెడుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు మీడియాలో రావడంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం షరతులను హమాస్ ఉల్లంఘిస్తోందని, మధ్యవర్తులకు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తామని తెలిపింది. 2023 అక్టోబర్ 7న హమాస్ శ్రేణులు అపహరించుకుపోయిన సుమారు 250 మంది పై ముగ్గురు కూడా ఉన్నారు. జనవరి 19న కుదిరిన ఒప్పందం అనంతరం హమాస్ 18 మంది బందీలకు విముక్తి కల్పించింది. -
నెతన్యాహు.. ఇదేం కిరికిరి : హమాస్
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనా బందీల విడుదలను ఆలస్యం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. మా బందీలు సురక్షితంగా విడిచి పెట్టే వరకు.. పాలస్తీనా బందీలను విడుదల చేయడంలో ఆలస్యం చేయాలని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌తో పాటు ప్రధాని మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు’ అని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.ఫలితంగా,హమాస్ చరనుంచి ముగ్గురు ఇజ్రాయెల్ బందీలు సురక్షితంగా విడుదలవ్వగా.. 110 మంది పాలస్తీనా బందీలను ఇజ్రాయెల్ తమ అదుపులోనే ఉంచుకుంది. దీంతో చేసేది లేక 110 మంది బందీల విడుదలలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేలా హమాస్ మధ్యవర్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
‘‘ఏం తినేది..? ఎట్లా బతికేది??’’ హృదయ విదారక గాజా చిత్రాలు
-
వీడియో: బతుకు జీవుడా.. గాజాకు నడుచుకుంటూ లక్షల మంది..
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. వేల సంఖ్యలో మరణాలు, కోట్ల సంఖ్యలో ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది గాజా ప్రజలు తాము పుట్టిన భూమిని వదిలి శరణార్థి శిబిరాలకు వెళ్లారు.ఇప్పుడు యుద్ధం ముగిసిన నేపథ్యంలో మళ్లీ బతుకు జీవుడా అంటూ తమ నివాసాలకు చేరుకుంటున్నారు. పొట్టచేతపట్టుకొని ఎలా వెళ్లారో అలాగే, మళ్లీ తిరిగి వెళ్తుంటే అక్కడ తమకంటూ ఏమైనా మిగిలుందో లేదో తెలియని దుస్థితి వారిని వేధిస్తోంది. ఎలాబతకాలో తెలియని ఆందోళన వారి హృదయాలను బరువెక్కిస్తోంది. ఇవన్నీ ఆలోచించుకుంటూ లక్షలాది మంది గాజా ప్రజలు తమ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎన్నో ఆలోచనలు వారిని వెంటాడుతున్నాయి. కొన్ని లక్షల మంది గుంపు గాజా వైపు వెళ్తున్న దృశ్యాలను నెటిజన్లను కన్నీరుపెట్టిస్తున్నాయి.The Flag of Palestine is Raised above the people returning home to Northern Gaza after 15+ months! pic.twitter.com/inLghaC33G— Ryan Rozbiani (@RyanRozbiani) January 27, 2025కాగా, అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి గాజా ప్రజల పాలిట శాపమైంది. హమాస్ దాడితో ఇజ్రాయెల్ ప్రతి దాడి మొదలుపెట్టడంతో ఉత్తర గాజా నుంచి సుమారు 10 లక్షల మంది దక్షణాదికి తరలివెళ్లిపోయారు. శరణార్థి శిబిరాల్లో కాలం వెళ్లదీశారు. ఉత్తర ప్రాంతంలో బెంజమిన్ నెతన్యాహు సేనల దాడులతో ఆ ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి సౌకర్యాలు శిథిలమయ్యాయి. ఈ ఘర్షణలో హమాస్ అగ్రనాయకత్వం మొత్తం మృత్యువాతపడింది. ఈ నేపథ్యంలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో, వీరంతా స్వస్థలం బాటపడ్డారు.A million Palestinians returning to their destroyed homes and towns in the north of #Gaza this morning is the crystal clear response to those who still plot to uproot us from our homeland. There is only one direction of travel ahead of the Palestinian people after a 100 years of… pic.twitter.com/PsU7ip89jq— Husam Zomlot (@hzomlot) January 27, 2025 THE RETURN TO THE NORTH OF GAZA pic.twitter.com/qg5ddiqAre— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) January 27, 2025ఇదిలా ఉండగా..ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లు పునరావాసం కల్పించాలన్నారు. ఈ ప్రతిపాదన వారిని తమ సొంత ప్రాంతానికి శాశ్వతంగా దూరంగా చేస్తుందా? అనే ఆందోళనా వ్యక్తమైంది. ఇక పాలస్తీనా వాసులు తిరిగి రావడాన్ని హమాస్ విక్టరీగా అభివర్ణించుకుంది. “Don’t leave, don’t leave me” .. A little girl embraces her father after returning to the north of Gaza. pic.twitter.com/0T3AhoafyF— Eye on Palestine (@EyeonPalestine) January 27, 2025We are returning to the north of Gaza pic.twitter.com/IwRFKZ2hzV— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) January 27, 2025 -
హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీల విడుదల
గాజా: గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నలుగురు మహిళా బందీలను శనివారం హమాస్ విడుదల చేసింది. కరీనా అరీవ్, డానియెల్ గిల్బోవా, నామా లెవి, లిరి అల్బాజ్ అనే బందీలకు హమాస్ తమ చెర నుంచి విముక్తి కలిగించింది. ఇందుకు ప్రతిగా వందకు పైగా పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ తన జైళ్ల నుంచి విడిచిపెట్టనుంది.ప్రస్తుతం విడుదలైన ఇజ్రాయెల్ బందీలు మహిళా సైనికులు. గాజా సరిహద్దుకు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి వారిని 2023, అక్టోబర్ 7 దాడుల సందర్భంగా హమాస్ బంధించి తీసుకెళ్లింది. ఏడాదికిపైగా వారు హమాస్ చెరలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. తాజాగా ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకొచ్చిన హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. దీంతో రెడ్‌క్రాస్ తన వాహనాల్లో వారిని ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లింది. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్, వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది ఇజ్రాయెల్ బందీల్లో 33 మందికి హమాస్ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనియులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది.కాగా, 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాడులు చేశారు. ఈ దాడుల్లో 1200 మంది దాకా ఇజ్రాయెల్ సైనికులు, పౌరులు మృతి చెందారు. ఇంతేకాక వెళుతూ వెళుతూ 100 మందికిపైగా ఇజ్రాయెల్ వాసులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులు మొదలు పెట్టింది. ఈ దాడుల్లో 46వేల మంది దాకా పాలస్తీనా వాసులు మృతి చెందినట్లు సమాచారం. -
గాజా.. చెదిరిన స్వప్నం!
పదిహేను నెలల భీకర యుద్ధం ధాటికి అంధకారమయమైన గాజా స్ట్రిప్ వీధుల్లో ఎట్టకేలకు శాంతిరేఖలు ప్రసరించినా యుద్ధంలో జరిగిన విధ్వంసఛాయలు తొలగిపోలేదు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఎట్టకేలకు తుపాకుల మోత, క్షిపణుల దాడులు ఆగిపోయాయి. అయినాసరే అశాంతి నిశ్శబ్దం రాజ్యమేలుతూనే ఉంది. మిస్సైల్స్ దాడుల్లో ధ్వంసమైన తమ ఇళ్లను వెతుక్కుంటూ వస్తున్న పాలస్తీనియన్లకు ఏ వీధిలో చూసినా మృతదేహాలే స్వాగతం పలుకుతూ నాటి మారణహోమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. గాజా స్ట్రిప్‌పై వేల టన్నుల పేలుడుపదార్ధాలను కుమ్మరించిన ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల జనవాసాలను దాదాపు శ్మశానాలుగా మార్చేసింది. స్వస్థలాలకు కాలినడకన, గుర్రపు బళ్లలో చేరుకుంటున్న స్థానికులకు ఎటుచూసినా వర్ణణాతీత వేదనా దృశ్యాలే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటికింద స్థానికుల జ్ఞాపకాలతో పాటు కలలు కూలిపోయాయి. కొందరు ఆత్మియులను పోగొట్టుకుంటే.. మరికొందరు సర్వస్వాన్ని కోల్పోయారు. ప్రతి ముఖం మీదా విషాద చారికలే. కుప్పకూలిన వ్యవస్థలు గాజా స్ట్రిప్ అంతటా ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సగం ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. మిగిలినవి సైతం పాక్షింకంగానే పని చేస్తున్నాయి. వాటిల్లోనూ సాధారణ సూదిమందు, బ్యాండేజీ, కాటన్ వంటి వాటినీ అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యారోగ్య సంస్థలను మళ్లీ పునర్నిర్మించాల్సి ఉంది. రోడ్లు, మౌలిక సదుపాయాల పరిస్థితి మరీ అధ్వాన్నం. శిథిలాల తొలగించాక ఏర్పడిన కాలిబాటే ఇప్పడు అక్కడ రోడ్డుగా ఉపయోగపడుతోంది. సొంతిళ్లు బాంబుదాడిలో ధ్వంసమయ్యాక శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నాసరే పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వైమానిక బలగాలు వదిలేయలేదు. క్యాంప్‌లపై బాంబుల వర్షం కురిపించడంతో కళ్లముందే కుటుంబసభ్యులను కోల్పోయిన వారు ఇప్పుడు ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు.యుద్ధభయం వారిని ఇంకా వెన్నాడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారిని పట్టించుకున్న నాథుడే లేడు. యుద్ధం ఆగాక సహాయక, అన్వేషణా బృందాలు అవిశ్రాంతంగా కష్టపడుతూ మరో శ్రామికయుద్ధం చేస్తున్నాయి. శిథిలాల కింద మృతదేహాల నుంచి వెలువడుతున్న దుర్వాసన మధ్యే వాళ్లు శిథిలా తొలగింపు పనులు చేస్తున్నారు. ‘‘వీధిని చక్కదిద్దేందుకు ఏ వీధిలోకి వెళ్లినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. కూలిపోయిన భవనాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చు’’అని గాజా సిటీలోని 24 ఏళ్ల సివిల్ డిఫెన్స్ కార్మికుడు అబ్దుల్లా అల్ మజ్దలావి చెప్పారు. ‘నా కుటుంబం శిథిలాల కింద కూరుకుపోయింది, దయచేసి త్వరగా రండి’’అంటూ కాల్పుల విరమణ తర్వాత కూడా స్థానికుల నుంచి తమకు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయ ని సహాయక ఏజెన్సీ తెలిపింది. పునర్నిర్మాణానికి చాలా సమయం ధ్వంసమైన పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని గాజాలోని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థి సంస్థ ఉన్వ్రా తాత్కాలిక డైరెక్టర్ సామ్ రోజ్ తెలిపారు. ‘‘గాజాలో ఆవాస వ్యవస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ కుటుంబాలు, కమ్యూనిటీలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. సహాయక చర్యలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’’అని ఆయన పేర్కొన్నారు.ప్రజల అత్యవసర అవసరాలను తీర్చడానికి, గాజా ప్రజారోగ్య వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు తొలి 60 రోజుల ప్రణాళిక ఉందని, వేలాది మంది జీవితాన్ని మార్చేసిన గాయాలను మాన్పేందుకు సిద్ధమవుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ హనన్ బాల్కీ ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా గాజా స్ప్రిప్లో ఆస్పత్రులకు మరమ్మత్తు చేయడం, దాడుల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో తాత్కాలిక క్లినిక్‌లను ఏర్పాటు చేయడం, ప్రజల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని బాల్కీ వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్అణువణువునా విధ్వంసంయుద్ధం దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లను నిరాశ్రయులను చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 46,900 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,10,700 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. తమ సిబ్బందిలో 48 శాతం మంది ఇక ఈ ఘర్షణల బాధితులున్నారని, కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారని, ఇంకొందరు నిర్బంధంలో ఉన్నారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. గాజాలోని 85 శాతం వాహనాలు ధ్వంసమయ్యాయి. తమ 17 కార్యాలయాలు దెబ్బతిన్నాయని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది.ఆదివారం కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో స్థానికుల ముఖాల్లో ఆనందం వచ్చిచేరినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తే ఉన్న ఆ కాస్త ఆనందం కూరా ఆవిరయ్యే దుస్థితి దాపురించింది. గాజా అంతటా 60శాతం నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఐక్యరాజ్యసమితి గతంలో అంచనా వేసింది. చాలా ఆలస్యంగా కుదిరిన శాంతి ఒప్పందం అమలయ్యే నాటికి మరింతగా దాడులు జరగడంతో నేలమట్టమైన నిర్మాణాల సంఖ్య మరింత పెరిగింది. కూలిన ఇళ్ల కింద 10,000కు పైగా మృతదేహాలు ఉండొచ్చని ఏజెన్సీ అంచనావేస్తోంది.నెమ్మదిగా మొదలైన సాయం కాల్పులు ఇరువైపులా ఆగిపోవడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎలాగోలా తప్పించుకుని, గాయాలపాలుకాని స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద మృతులను అన్నింటినీ తొలగించడానికి కనీసం వంద రోజులు సమయం పడుతుందని అన్వేషణా బృందాలు అంచనావేస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అవసరమైన బుల్డోజర్లు ఇతర పరికరాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో వెలికితీత మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. దాడుల ధాటికి అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడటంతో పని దొరకడం కూడా కష్టంగా ఉంది.స్థానికులకు ఆదాయం కాదు కదా ఆశ్రయం కూడా లేకపోవడంతో గాజాలో బతకడం కూడా పెద్ద అస్తిత్వ పోరాటంగా తయారైంది. కాల్పుల విరమణ జరిగిన వెంటనే ఆహారం, నిత్యావసర వస్తువులు, ఔషధాలను మానవతా సంఘాలు అందించడం మొదలెట్టాయి. ఒక్క ఆదివారం రోజే 630 లారీల నిండా సరకులు గాజాలోకి ప్రవేశించాయి. సోమవారం మరో 915 లారీలు గాజాలోకి వెళ్లాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇంతటి భారీ స్థాయిలో మానవతా సాయం అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
గాజా ఒప్పందం ఆలస్యం!.. హమాస్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్!
జెరుసలేం : గాజాలో శాంతి ఒప్పందం వేళ ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడడం లేదని, అందుకే తాము గాజాపై దాడుల్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ..హమాస్ చెరలో బంధీలుగా ఉన్న 33 మంది బంధీల జాబితా విడుదల కాలేదు. బంధీల జాబితా మాకు చేరే వరకు కాల్పులు కొనసాగుతాయని చెప్పారు.ఆదివారం ఉదయం నాటికి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న బంధీల జాబితాను విడుదల చేయాలి. కానీ అలా చేయలేదు. ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. హమాస్ ఇచ్చిన మాటకు కట్టుబడే వరకు కాల్పుల విరమణ అమలులోకి రాదు అని’ హగరీ చెప్పారంటూ ఓ ఇజ్రాయెల్ సైన్య అధికారి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంధీల జాబితా విడుదల చేయనంత వరకు సైనిక దాడులు కొనసాగుతాయని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని సూచించారు. గాజాలో శాంతిపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో శాంతి నెలకొంది. గత బుధవారం అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్య వర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఒప్పందంలో భాగంగా.. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు కాల్పుల విమరణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కానీ సాంకేతిక అంశాల్ని కారణంగా చూపిస్తూ బంధీల జాబితాను విడుదల చేయడంలో జాప్యం చేసింది. కాగా, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో ఉన్న 33 మంది బంధీలను విడుదల చేయాలి. ప్రతిఫలంగా ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న దాదాపు 2,000 మంది పాలస్తీనియన్లను కూడా ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. -
ఇవాల్టి నుంచి కాల్పుల మిరమణ ఒప్పందం అమలు
-
గాజా ఒప్పందం వేళ ట్విస్ట్!.. నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు
గాజా శాంతి ఒప్పందం వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన ఫ్రేమ్‌వర్క్ లేకుండా ఒప్పందం ముందుకు సాగదని.. అవసరమైతే మళ్లీ యుద్ధానికి దిగుతామని సంచలన వ్యాఖ్యలు అన్నారాయన. కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అంతకంటే కొన్ని గంటల ముందు.. నెతన్యాహూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘‘సరైన ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒప్పందంలో ముందుకు వెళ్లలేం. తమ దగ్గర ఉన్న బంధీల జాబితాను హమాస్ విడుదల చేయాలి. వాళ్లలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వాలి. అప్పుడే మేం ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తాం. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. మేం సహించబోం. తదుపరి పరిణామాలకు హమాసే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) తెలియజేశారు. హమాస్‌పై పూర్తిస్థాయి విజయం సాధిస్తేనే గాజా యుద్ధాన్ని(Gaza War) విరమిస్తామని.. అప్పటి వరకు పోరు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు.. తాజాగా బంధీల జాబితా ఇవ్వాలంటూ ఆయన మెలిక పెట్టారు. దీంతో ఇవాళ్టి నుంచి ఒప్పందం అమలు అవుతుందా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి.స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు. మరోవైపు 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచి పెట్టాల్సి ఉంది. హమాస్ చెరలోని 460 రోజులకు పైగా బందీలుగా ఉన్నారన్నమాట!.హమాస్ చెరలో ఉన్న 98 బంధీల్లో.. 33 మందిని విడిచి పెట్టడంప్రతిగా.. తమ జైళ్లలో మగ్గుతున్న 2000 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టడంపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో బాంబుల మోత.. క్షిపణుల విధ్వంసం.. తుపాకుల అలజడి ఈ శాంతి ఒప్పందంతో ఆగనుంది. దోహా వేదికగా.. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్హమాస్ మధ్య గత బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో గాజా ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నడూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంతగా ఆసక్తి చూపలేదు. యుద్ధం కొనసాగించడానికి మొగ్గు చూపుతూ.. ఏదో కారణంతో చర్చల ప్రక్రియను పక్కదోవ పట్టించే ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. అయితే.. గతేడాది మే నెలలో బైడెన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటికి హమాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో అప్పుడే గాజాలో శాంతి నెలకొంటుందని అంతా భావించారు. కానీ, నెతన్యాహు మాత్రం ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడానికి అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోనూ రెండో దశలో గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ నిబంధన ఉంది. అందుకే ఒప్పందంలో తొలి దశ అమలైనా, రెండో దశకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతుందా? లేదా? అన్నది కీలకం కానుంది.ఇదీ చదవండి: కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య -
Israel-Hamas: గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్(Hamas) మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, గాజా(Gaza)లో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ఇక, ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని కేబినెట్‌కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో కాల్పుల విరమణకు సంబంధించి ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయని హమాస్ పేర్కొంది.ఇజ్రాయెల్-హమాస్(Israel) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం కుదిరిన మూడు దశల కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, ఆదివారం నుంచి ఒప్పందం అమలులోకి రానుంది. ఈ మేరకు బందీలను విడుదల చేసే ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రివర్గం ఓటింగ్ నిర్వహించిన తర్వాత నెతన్యాహు కార్యాలయం శనివారం తెల్లవారుజామున తెలిపింది.ఇదే సమయంలో అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి, యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమని అర్థం చేసుకున్నామని పేర్కొంది. బందీల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆదివారం నుండి విడుదల చేయబోయే 95 మంది పాలస్తీనియన్ల జాబితాను న్యాయ మంత్రిత్వ శాఖ ప్రచురించింది. వారిలో 69 మంది మహిళలు, 16 మంది పురుషులు మరియు 10 మంది మైనర్లు ఉన్నారు. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ ప్రారంభం కాకముందే గాజా ప్రజలు స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు.Israel’s security cabinet has accepted the ceasefire deal with Hamas which is due to come into force on Sunday. The approval comes after an unexpected delay because pf far-right members of the Israeli government. pic.twitter.com/ZgWNmQRAKU— Channel 4 News (@Channel4News) January 17, 2025 -
కాల్పుల విరమణకు సై
జెరూసలేం: గాజాలో కాల్పుల విరమణపై సందిగ్ధత తొలగిపోయింది. కాల్పుల విరమణకు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందం అమలు దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ శుక్రవారం సిఫార్సు చేసింది. దీంతో ఈ ఒప్పందం ఫుల్ కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ కోర్టులోకి చేరింది. మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది. 15 నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడనుంది. హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు విడుదల కానున్నారు. వారంతా స్వదేశానికి చేరుకుంటారు. కాల్పుల విరమణ కోసం ఖతార్, అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించాయి. హమాస్‌తోపాటు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఒప్పించాయి. గాజాలో దాడులకు స్వస్తిపలకడానికి ఇజ్రాయెల్, బందీలను విడుదల చేయడానికి హమాస్ అంగీకరించాయి. అయితే, ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ సైన్యం గాజాపై బాంబుల వర్షం కురిపించింది. కనీసం 72 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఒప్పందం అటకెక్కినట్లేనన్న ప్రచారం ఊపందుకుంది. గాజా ప్రజలు, బందీల కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒప్పందాన్ని అమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ సిఫార్సు చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకాలు.. దోహా వేదికగా ఘట్టం
టెల్ అవీవ్: కాల్పుల విమరణ ఒప్పందంపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సయోధ్య కుదరడంతో ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. దోహ ఈ ఘట్టానికి వేదికైంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డంకిగా మారిన చిక్కులను మధ్యవర్తులు తొలగించినట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు గాజా(Gaza)లో ఉన్న బంధీల విడుదలకు ఒప్పందం కుదిరినట్లు ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం ఇజ్రాయెల్హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఒకవైపు హమాస్ చివరి నిమిషంలో కొర్రీలు వేస్తోందంటూ ఇజ్రాయెల్ మండిపింది. ఆపై కాసేపటికే తమకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఒప్పందంపై ఉత్కంఠ నెలకొంది. అయితే మధ్యవర్తుల తాజా దౌత్యంతో ఈ ఉత్కంఠకు తెర పడింది. ఒప్పందం చివరి దశకు చేరిన విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ధ్రువీకరించింది. ఈ ఒప్పందంపై తొలుత ఇజ్రాయెల్ వార్ కేబినెట్ చర్చించి ఆమోద ముద్ర వేస్తుంది. అయితే శనివారం వరకు కేబినెట్ ఆమోద ముద్ర పడకపోవచ్చని సమాచారం. ఆదివారం నుంచి ఇరు వర్గాల మధ్య డీల్ అమల్లోకి వస్తుందంటూ ఖతార్ ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యుద్ధ విషాద గీతం.. గాజా కన్నీటి గాథ
-
గాజాలో శాంతి సాధ్యమేనా!
బాంబుల మోత ఆగుతుందంటే... తుపాకులు మౌనం పాటిస్తాయంటే... క్షిపణుల జాడ కనబడదంటే... ఇనుప డేగల గర్జనలు వినబడవంటే... నిత్యం మృత్యువు వికటాట్టహాసం చేస్తున్నచోట హర్షాతిరేకాలు వ్యక్తం కావటం సహజమే. అందుకే 15 నెలలుపైగా... అంటే 467 రోజులుగా రాత్రింబగళ్లు ప్రాణభయంతో కంటి మీద కునుకు లేకుండా గడిపిన గాజా ప్రజానీకం వీధుల్లోకొచ్చి పండుగ చేసుకున్నారు. అటు హమాస్ చెరలో మగ్గుతున్నవారి కుటుంబసభ్యులు సైతం ఆనందో త్సాహాలతో ఉన్నారు. ఇజ్రాయెల్–మిలిటెంట్ సంస్థ హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ ప్రతినిధులు బుధవారం రాత్రి ప్రకటించగానే ప్రపంచం, ప్రత్యేకించి పశ్చిమాసియా ఊపిరి పీల్చుకున్నాయి. ‘నేను దేశాధ్యక్షపదవి స్వీకరించబోయే జనవరి 20 నాటికి బందీలకు స్వేచ్ఛ లభించకపోతే సర్వనాశనం ఖాయమ’ని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పక్షం రోజుల నాడు ప్రకటించారు. ‘నా హెచ్చరిక ఫలించబట్టే కాల్పుల విరమణ ఒప్పందం సాకారమైంద’ని ఇప్పుడు ఆయన అంటుంటే... ‘నా అనుభవంలోనే అత్యంత కఠినమైన ఈ చర్చల ప్రక్రియను మొత్తానికి సుఖాంతం చేయగలిగాన’ని ప్రస్తుత అధ్య క్షుడు జో బైడెన్ చెబుతున్నారు. ఈ ఘనత ఎవరి ఖాతాలో పడాలన్నది తేలకముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మొండికేస్తున్నారు. తొలుత ఒప్పందాన్ని స్వాగతించిన ఆయనే ఇంకా తేలాల్సినవి ఉన్నాయంటున్నారు. ఒప్పందంపై ఆమోదముద్ర వేసేందుకు నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని నిలిపివేశారు. ఈలోగా నిన్న, ఇవాళ గాజాపై ఇజ్రాయెల్ సాగించిన బాంబు దాడుల్లో 19మంది పిల్లలు సహా 80 మంది చనిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందా లేదా, ఈ ప్రాంతంలో తాత్కాలికంగానైనా శాంతి నెలకొంటుందా అన్న అంశంలో సందిగ్ధత ఏర్పడింది. సుదీర్ఘకాలం ఘర్షణలతో అట్టుడికినచోట సాధారణ పరిస్థితులు ఏర్పడటం అంత సులభమేమీ కాదు. అందునా ఇజ్రాయెల్‌తో వైరమంటే మామూలుగా ఉండదు.ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 2023 అక్టోబర్ 7న విచ్చలవిడిగా కాల్పులు జరిపి 1,200 మంది పౌరులను హతమార్చటంతో పాటు, 251 మందిని బందీలుగా తీసు కెళ్లటంతో ఇదంతా మొదలైంది. హమాస్ మతిమాలిన చర్య తర్వాత ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో గాజా, వెస్ట్‌బ్యాంక్‌లపై సాగించిన దాడుల పర్యవసానంగా ఇంతవరకూ కొందరు హమాస్ కీలకనేతలతో పాటు 46,700 మంది పౌరులు చనిపోయారు. ఇందులో అత్యధికులు పిల్లలు, మహి ళలే. ఇతరులు నిత్యం చావుబతుకుల మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం జారవిడిచే కరపత్రాలు సూచించిన విధంగా ఎటు పొమ్మంటే అటు వలసపోతూ అష్టకష్టాలు పడుతున్నారు.తిండీ, నీళ్లూ కరువై, అంతంతమాత్రం వైద్య సదుపాయాలతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఒక్కోటి 42 రోజులు (ఆరు వారాలు)ఉండే మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలవుతుందా, మధ్యలో తలెత్తగల సమస్యలేమిటి అన్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాల్లేవు. హమాస్ చెరలో ఇంకా 94 మంది బందీలు మిగిలారని, వారిలో 34మంది మరణించివుండొచ్చని ఇజ్రాయెల్ అంచనా. తొలి దశ అమల్లోవుండగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగాలి. ఆ తర్వాత పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా 33 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది. ఒకసారంటూ ఒప్పందం అమలు మొదలైతే ఇరువైపులా ఉన్న బందీలను దశలవారీగా విడుదల చేస్తారు. గాజాకు భారీయెత్తున సాయం అందటం ప్రారంభమవుతుంది. ఒప్పందం ప్రకారం తొలి దశ కొనసాగుతున్న దశలోనే ఇజ్రాయెల్ రెండోదశ కోసం హమాస్‌తో చర్చించటం మొదలెట్టాలి. రెండో దశకల్లా బందీలతోపాటు దాడుల సందర్భంగా హమాస్‌కు చిక్కిన ఇజ్రాయెల్ ఆడ, మగ సైనికులు పూర్తిగా విడుదలవుతారన్నది అంచనా. అప్పుడు మొదలుకొని తొలి దశలో వున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వత కాల్పుల విరమణగా మారుతుంది. మూడో దశ అంతా పునర్నిర్మాణంపై కేంద్రీకరిస్తారు. హమాస్ బందీలుగా ఉంటూ మరణించినవారి మృత దేహాలను అప్పగించాలి. కేవలం మొదటి దశకు మాత్రమే ప్రస్తుత ఒప్పందం పరిమితమనీ... కొత్తగా చర్చలు జరిగాకే రెండు, మూడు దశలకు సంబంధించి తుది నిర్ణయం ఉంటుందనీ ఇప్పటికే నెతన్యాహూ ప్రకటించారు. తొలి దశ పూర్తయ్యాక మళ్లీ యుద్ధం తప్పదన్న హామీ ఇవ్వకపోతే తమ ఆరుగురు మంత్రులూ తప్పుకుంటారని తీవ్ర మితవాదపక్ష నాయకుడు, జాతీయ భద్రతా మంత్రి బెన్గివర్ హెచ్చరించటం తీసిపారేయదగ్గది కాదు. లెబనాన్‌లోని హిజ్బొల్లాతో ఉన్న రెండు నెలల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ ఇరువైపులా కాల్పులు జరగని రోజంటూ లేదు. ఆ ఒప్పందం కూడా ఈనెల 26తో ముగుస్తుంది. ఇప్పుడు హమాస్‌తో కుదిరిన ఒప్పందం గతి కూడా అలాగే ఉంటుందా అన్నది ప్రశ్నార్థకం.సిరియాలో అసద్ నిష్క్రమణ, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమైవుండటం, ఇరాన్ బల హీనపడటం, ట్రంప్ ఆగమనం వంటి పరిణామాలతో హమాస్‌లో పునరాలోచన మొదలయ్యాకే ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఎనిమిదినెలల నాడు దాదాపు ఇవే షరతులు ప్రతిపాదిస్తే ఆ సంస్థ తిరస్కరించటం గమనార్హం. మొత్తానికి పశ్చిమాసియా తెరిపిన పడటానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధి ప్రదర్శించటం అవసరం. దాడులతో ఎవరినీ అణిచేయలేమని ఇన్నాళ్ల చేదు అనుభవాల తర్వాతైనా ఇజ్రాయెల్ గుర్తిస్తే మంచిది. ఎన్ని లోటుపాట్లున్నా ఘర్షణలు అంతరించాలి. శాంతి చిగురించాలి. -
గాజా ఒప్పందం.. ఆఖరి నిమిషంలో కొర్రీలు!
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ఘనంగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఆఖరి నిమిషయంలో ఇటు ఇజ్రాయెల్.. అటు హమాస్‌లు ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ(Ceasefire Deal) ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు తమ కేబినెట్ సమావేశం ప్రస్తుతానికి జరగట్లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అందుకు హమాస్ చివరి నిమిషంలో పెట్టిన కొర్రీలే కారణమని ఆరోపించింది. ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.చివరి నిమిషంలో హమాస్(Hamas) ఉగ్రసంస్థ ఒప్పందంలో మార్పులు సూచించడమే అందుకు కారణమని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయితే ఆ కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. హమాస్ మాత్రం మధ్యవర్తులు తెచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం. పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఖతార్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తొలి ఫేజ్‌లో భాగంగా.. గాజాలో తాము బంధీలుగా ఉంచిన 33 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తారు. దానికి ప్రతిగా తమ దేశ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా బంధీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ఇదీ చదవండి: గాజా శాంతి ఒప్పందం ఘనత ఎవరిదంటే..అయితే.. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ (Israel) గాజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రకటన వెలువడినప్పటి నుంచి జరిగిన దాడుల్లో 71 మంది మరణించినట్లు గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. పైగా ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని, పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా.. మరికొందరికి గాయాలైనట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ ఆదివారం(జనవరి 19) నుంచి మొదలుకావాల్సిన ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకునే అవకాశం లేకపోలేదు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 15 నెలల యుద్ధంలో 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తూ వచ్చాయి. అటు అమెరికా.. ఇటు ఈజిప్ట్,ఖతారులు కొన్ని నెలలుగా కాల్పుల విరమణ చర్చలు జరుపుతూ వచ్చాయి.ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ టెలివిజన్ ముఖంగా చేసిన ప్రకటనతో.. పాలస్తీనాలో సంబురాలు జరిగాయి. ఇటు గాజా సరిహద్దులో శరణార్థ శిబిరాల్లో ఉన్నవాళ్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా మానవతా ధృక్పథంతో ముందకు సాగాలని, గాజా కోలుకునేందుకు అవసరమైన సాయం కోసం ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. గాజా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందన్న పరిణామంపై భారత్ సహా పలుదేశాలు స్వాగతించాయి. -
హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం, ఆ ఘనత ఎవరికంటే..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావడంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంధీలను విడిచిపెట్టడంతో(Gaza hostage release) పాటు కాల్పుల విమరణ ఒప్పందానికి సిద్ధపడడంతో ఇరువర్గాలను ట్రంప్ మెచ్చుకున్నారు. అయితే.. మరో ఐదు రోజుల్లో ఆయన వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. ఈలోపే గాజా యుద్ధం ముగింపు దిశగా అడుగు పడడాన్ని ఆయన తన విజయంగా అభివర్ణించుకుంటున్నారు.‘‘కిందటి ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మేం చారిత్రక విజయం సాధించాం. ఆ ఫలితమే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అని తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ ఉంచారు. నిబద్ధతతో కూడిన తన పరిపాలన.. శాంతి, సామరస్యంతో ప్రపంచానికి శక్తివంతమైన సంకేతాలను పంపిందని విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారాయన. ఇజ్రాయెల్ సహా మా మిత్రపక్షాలతో మేం(అమెరికా) సత్సంబంధాలు కొనసాగిస్తాం. అలాగే.. గాజాను మళ్లీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చబోం అని ఆయన రాసుకొచ్చారు.తాజాగా హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు.కాగా, హమాస్‌కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లార్చేందుకు అమెరికా సహా పలు దేశాలు నిర్విర్వామంగా కృషి చేస్తూ వస్తున్నాయి. గాజా శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్, ఖతార్‌ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ టైంలో(కిందటి ఏడాది మే చివర్లో) ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఖతార్ ద్వారా హమాస్‌కు సైతం ఆ ఒప్పందం చేరవేశారు. ఇక గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు, దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న వందలమంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ తలూపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే..మొదటి దశఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి.రెండో దశసైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి.మూడో దశగాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.అయితే.. బైడెన్ ప్రతిపాదించిన ఒప్పంద సూత్రాలకే ఇరు వర్గాలు అంగీకరించాయా? లేదంటే అందులో ఏమైనా మార్పులు జరిగాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మధ్యవర్తులు చెబుతున్న సమాచారం ప్రకారం.. తొలి దశలో యుద్ధం నిలిపివేతపై చర్చలను ప్రారంభించడంతో పాటు, ఆరు వారాల పాటు కాల్పుల విరమణ పాటించాలి. హమాస్ చెరలో బందీలుగా ఉన్న సుమారు 100 మందిలో 33 మందిని ఈ సమయంలో విడిచిపెట్టాలి’’ అని ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ప్రతినిధులు ధృవీకరించారు. ఈ ఒప్పందంపై గురువారం ప్రకటన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సన్నద్ధమవుతున్నారు.ఖతార్ పాత్ర ప్రత్యేకం.. కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్టులు మధ్యవర్తిత్వం వహించాయి. ఈక్రమంలో రెండుసార్లు కాల్పుల విరమణపై చర్చలు జరగ్గా అవి ఫలించలేదు. అయితే గాజాలో శాంతి స్థాపన కోసం ఖతార్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మొదటి నుంచి ఆసక్తికరంగా సాగాయి. 2012 నుంచి దోహాలో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నాల్లో ఖతార్ కీలకంగా వ్యవహరిస్తుందని తొలి నుంచి చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే ఖతార్ ఈ చర్చల్లో ముందుకు వెళ్లింది కూడా. అయితే ఒకానొక దశలో అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గింది. దీంతో మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలను ఖతార్ నిలిపివేసిందన్న కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఖతార్ వాటిని ఖండించింది. అదే సమయంలో దోహాలో హమాస్ కార్యకలాపాలను బహిష్కరించాలని అమెరికా ఇచ్చిన పిలుపును కూడా ఖతార్ పక్కన పెట్టి మరీ చర్చలకు ముందుకు తీసుకెళ్లి పురోగతి సాధించింది ఖతార్. గాజా బాధ్యత ఎవరిది?తాజా ఒప్పందంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఒప్పందం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వెనక్కుమళ్లుతాయా?.. లేకుంటే పాక్షికంగానే జరుగుతుందా?. భవిష్యత్తులో కాల్పుల విరమణ ఉల్లంఘన జరగకుండా ఉంటుందా? అన్నింటికి మించి.. యుద్ధంతో నాశనమైన గాజా ప్రాంతాన్ని ఎవరు పాలిస్తారు? దాని పునర్నిర్మాణానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది.ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ లాంఛనం పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరించనుంది. -
గాజాలో శాంతి.. ఇజ్రాయెల్, హమాస్ కీలక అంగీకారం
దోహా: యుద్ధం, మానవీయ సంక్షోభంతో 15 నెలలుగా అట్టుడుకుతున్న గాజా(Gaza)కు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. మరోసారి తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్(Israel), హమాస్(Hamas) అంగీకరించాయి. ఖతార్ రాజధాని దోహాలో వారాల తరబడి జరిగిన చర్చల అనంతరం బుధవారం ఎట్టకేలకు ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కనీసం ఆరు వారాల పాటు యుద్ధానికి విరామం ప్రకటిస్తారు.ఇక, యుద్ధానికి పూర్తిగా తెర దించే దిశగా చర్చలను ముమ్మరం చేస్తారు. అంతేగాక హమాస్ తన వద్ద వంద మంది ఇజ్రాయెల్ బందీల్లో కనీసం 30 మందికి పైగా విడతలవారీగా వదిలేయనుంది. బదులుగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది. దాంతోపాటు గాజాలో నిర్వాసితులైన వేలాది మంది స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తుంది. అంతేగాక గాజాకు కొద్ది నెలలుగా పూర్తిగా నిలిపేసిన అంతర్జాతీయ మానవతా సాయాన్ని పూర్తిస్థాయిలో అనుమతిస్తుంది. ఈ మేరకు ఇరు వర్గాలూ అంగీకరించినట్టు చర్చల్లో పాల్గొన్న ముగ్గురు అమెరికా ఉన్నతాధికారులు, హమాస్ ప్రతినిధి తెలిపారు. దీనిపై దోహా త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తుందని చెప్పారు.ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం మాత్రం ఒప్పందం విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దానికి కేబినెట్ ఆమోదముద్ర పడాల్సి ఉంటుందని పేర్కొంది. తాను ప్రమాణస్వీకారం చేసే లోపే గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు ఇటీవలే అల్టిమేటమివ్వడం తెలిసిందే. లేదంటే తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరోవైపు గాజాపై మంగళవారం ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలతో సహా 18 మంది మరణించారు. Israel and Hamas have reached a landmark agreement to cease hostilities in Gaza and exchange Israeli hostages for Palestinian prisoners.This breakthrough comes after months of intense negotiations facilitated by Egyptian and Qatari mediators,with the support of the United States. pic.twitter.com/EtPZK69F48— Unfunny Media (@Unfunny_Media) January 16, 2025 -
నేనొచ్చేలోపే బందీలను వదిలేయండి
వాషింగ్టన్: హమాస్– ఇజ్రాయెల్ యుద్ధంలో బందీలుగా మారిన ఇజ్రాయెల్, అమెరికన్ పౌరుల విడుదలపై కాబోయే అమెరికా అధ్యక్షుడు (Donald Trump)డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ శివారు ప్రాంతాలపై దాడిచేసి అపహరించుకుపోయిన అమాయకులను జనవరి 20వ తేదీలోపు విడుదలచేయకుంటే దారుణ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హమాస్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. ఫ్లోరిడాలోని మార్–ఏ–లాగో రిసార్ట్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఇప్పటికే ఖతార్ వేదికగా (Hamas)హమాస్ ప్రతినిధులు, ఇజ్రాయెల్ ఉన్నతాధికారులకు మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల పై చర్చలు జరుగుతు న్న విషయం తెల్సిందే. ఈ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు.అంత అమానుషంగా ప్రవర్తిస్తారా?‘‘ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియకు నేను భంగం కల్గించదల్చు కోలేదు. నేను అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఈలోపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరాల్సిందే. బందీలను క్షేమంగా తిరిగి పంపకపోతే హమాస్ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు. నేను అధ్యక్షుడిని అయ్యాక పశ్చిమాసియా దారుణ పరిస్థితులను చవిచూస్తుంది. ఇంతకు మించి హమాస్‌కు నేనేం చెప్పను. అసలు వాళ్లు అలా దాడి చేయకుండా ఉండాల్సింది. వాళ్లను కిడ్నాప్ చేయకుండా ఉండాల్సింది. వాళ్లు ఇంకా బందీలుగా ఉండకూడదు. బందీలను విడిచి తీసుకురావాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రజలు నన్ను వేడుకున్నారు. కనీసం మా అబ్బాయి మృతదేహమైనా మాకు అప్పగిస్తారా? అని కొందరు తల్లులు, తండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ అమ్మాయిలను జడలు పట్టి వాహనాల్లో పడేశారు. ఆ రోజు కిడ్నాప్‌కు గురైన అమ్మాయి చనిపోయింది. అసలు అమ్మా యిలతో అంత అమానుషంగా ప్రవర్తిస్తారా?’’ అని ట్రంప్ ఆగ్రహంగా మాట్లాడారు.చివరి దశలో చర్చలుపశ్చిమాసియా పర్యటన ముగించుకుని వచ్చిన ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవెన్ చార్లెస్ విట్కోఫ్ సైతం మాట్లాడారు.‘‘ చర్చలు చివరి దశలో ఉన్నాయి. దోహాలో చర్చలు ఇంకా ఎందుకు ముగింపునకు రాలేదనేది నేను ఇప్పుడే వెల్లడించలేను. కాబోయే అధ్యక్షుడి హెచ్చరికలను హమాస్ దృష్టిలో పెట్టుకో వాలి’’ అని విట్కోప్ అన్నా రు. కాల్పుల విరమణ ఒప్పందం అమలైతే ఇద్దరు అమెరికన్లుసహా 34 మంది బందీలను విడుదలచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఖతార్ చర్చల్లో హమాస్ ప్రతినిధులు చెప్పారు. జో బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం 2023 అక్టోబర్ ఏడున దాడి జరిగిన కొద్దివారాలకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాదాపు ఓ కొలిక్కి తెచ్చింది. ఆ సమయంలో డజన్ల మంది బందీలను హమాస్ విడుదల చేసింది. తర్వాత హమాస్, ఇజ్రాయెల్ పర స్పర దాడులు అధికమవడంతో బందీల విడు దల ప్రక్రియ హఠాత్తుగా ఆగిపోయింది. ఆ తర్వాత కాల్పుల విరమణ, బందీల విడు దలపై చర్చల్లో పీఠముడి పడి ఇంతవరకు ఓ కొలిక్కిరాలేదు. బందీలను విడిచించాలని ట్రంప్ హెచ్చరించిన వేళ గాజాలో ఒక బందీ మృతదేహాన్ని ఇజ్రాయెల్ బలగాలు గుర్తించాయి. మరో మృతదేహం లభించినా అది ఎవరిది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మృతిచెందిన బందీని యూసెఫ్ అల్ జైదానీగా గుర్తించారు. -
ఇజ్రాయెల్ టీనేజర్ బందీ వీడియో...విడుదల చేసిన హమాస్
జెరూసలేం: ఏడాదికి పైగా బందీగా ఉన్న 19 ఏళ్ల ఇజ్రాయెల్ సైనికురాలి వీడియోను హమాస్ విడుదల చేసింది. మూడున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో అల్బాగ్ హిబ్రూ భాషలో మాట్లాడారు. తనను 450 రోజులకు పైగా నిర్బంధించారని, ఇజ్రాయెల్తనను, ఇతర బందీలను మరిచిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన వయసు 19 ఏళ్లని, కానీ ఇప్పుడు జీవితం మొత్తం తన కళ్లముందుందని చెప్పారు. వీడియో తమ గుండెను ముక్కలు చేసిందని అల్బాగ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. కూతురు వీడియో చూసిన అనంతరం వారు ఓ వీడియో ప్రకటన చేశారు. తమ కూతురు తీవ్ర మానసిక క్షోభను అనుభవించినట్లు కనిపిస్తోందన్నారు. ఆమె క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు విజ్ఞప్తి చేశారు. బందీల కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అల్బాగ్ కుటుంబ ప్రకటనపై ప్రధాని స్పందించారు. బం«దీలను స్వదేశానికి రప్పించేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. బందీలకు హాని తలపెట్టే సాహసం చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కుటుంబం అనుమతితో... సాధారణంగా కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా హమాస్ విడుదల చేసే బందీల ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ మీడియా ప్రచురించదు. వీడియోను విడుదల చేయడానికి అల్ బాగ్ కుటుంబం తొలుత నిరాకరించినా.. తరువాత అంగీకరించింది. బందీల ఫొటోలు, వీడియోలను హమాస్ ప్రచురించడాన్ని ఇజ్రాయెల్ గతంలో ఖండించింది. "Liri, if you're hearing us, tell the others that all the families are moving heaven and earth. We will fight until all hostages are returned"Eli and Shira Albag , Liri Albag's Parents, called the Prime Minister and Defense Minister, after watching her video from captivity,… pic.twitter.com/Y9xAh47W7O— Bring Them Home Now (@bringhomenow) January 4, 2025హమాస్ చెరలో 96 మంది.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి సమయంలో 250 మందిని బందీలుగా గాజాకు తరలించారు. వారిలో కొందరిని రక్షించారు. 34 మంది మరణించారు. ప్రస్తుతం హమాస్ చెరలో 96 మంది మిగిలారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్)లో నిఘా సైనికురాలిగా ఉన్న లిరీ అల్బాగ్ను గాజా సరిహద్దులోని నహల్ ఓజ్ సైనిక స్థావరంలో ఉండగా హమాస్ ఉగ్రవాదులు పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సైతం బంధించారు. వీరిలో ఒకరిని రక్షించగా, మరొకరు హత్యకు గురయ్యారు. అల్బాగ్తోపాటు నలుగురు బందీలుగా మిగిలారు. చర్చల నేపథ్యంలో వీడియో.. ఖతార్‌లో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు కాల్పుల విరమణ చర్చలు పునఃప్రారంభమయ్యాయి. చర్చల్లో మధ్యవర్తులుగా ఖతార్, ఈజిప్‌్ట, అమెరికాలు ఉన్నాయి. ఒప్పందం కోసం నెలల తరబడిగా చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. తాజాగా శుక్రవారం నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో హమాస్ లిరీ వీడియోను విడుదల చేసింది. ఇదీ చదవండి: గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు -
ఇజ్రాయెల్ ప్లాన్ సక్సెస్.. హమాస్‌కు కోలుకులేని ఎదురుదెబ్బ
జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ నేతల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా పోలీస్ చీఫ్ టార్గెట్‌గా జరిగిన దాడుల్లో కీలక నేత సహ 68 మంది మృతి చెందారు. ఈ మేరకు వైమానిక దాడులను ఇజ్రాయెల్ సైతం ధృవీకరించింది.గాజా సిటీపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 68 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో హమాస్ పోలీస్ చీఫ్ హసామ్ షాహ్వాన్‌తో పాటు.. మరో కీలక హమాస్ నేత మహమ్మద్ సలాహ్ కూడా ఉన్నారు. షాహ్వాన్ లక్ష్యంగా తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. పోలీస్ చీఫ్ హసామ్ మృతి కారణంగా హమాస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కీలక నేతగా ఉన్నారు. తాజా దాడిలో మరణించిన వారిలో పౌరులే ఎక్కువ మంది ఉన్నారు.అయితే, ఇజ్రాయెల్ పౌరులు ఆశ్రయం ఉంటున్న అల్-మవాసి జిల్లాను మానవతా జోన్‌గా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఈ కారణంగానే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక, కొత్త ఏడాదిలో రెండు రోజులు ముగిసిన వెంటనే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.ఇదిలా ఉండగా.. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధంలో 45,500 మందికి పైగా పాలస్తీనియన్లను మరణించారు. గాజాలోని 2.3 మిలియన్ల మంది ప్రజలు సిటీని విడిచివెళ్లిపోయారు. ఇదే సమయంలో హమాస్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. మరో 251 మంది ఇజ్రాయెల్ పౌరులను గాజా వద్ద బంధీలుగా ఉన్నారు. -
ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. హమాస్ టాప్ కమాండర్ హతం
టెల్అవీవ్:తమ దేశంపై 2023 అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడుల వెనుక కీలకంగా వ్యవహరించిన హమాస్ కమాండర్ అల్హదీసబాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజాలోని ఖాన్ యూనిస్‌లో శరణార్థులు సహాయం పొందుతున్న ప్రాంతంలో సబాను గుర్తించామని,డ్రోన్ దాడితో అతడిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వెల్లడించింది.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని ఇ కిబ్జట్ నిర్ ఓజ్‌లో హమాస్ జరిపిన దాడిలో అబ్ద్ అల్ హదీ సబా కీలక సూత్రధారని తెలిపింది. యూదులు టార్గెట్‌గా అల్హదీసబా దాడులు చేశాడని పేర్కొంది. సబా నేతృత్వంలో డజన్ల కొద్ది మందిని కిడ్నాప్ చేయడంతో పాటు హత్య చేశారని ఆరోపించింది. ఇప్పటికే హమాస్ అగ్ర నేతలు పలువురిని ఇజ్రాయెల్ హతమార్చిన విషయం తెలిసిందే.కాగా, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో వందల కొద్ది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలువురిని హమాస్ తన వెంట బందీలుగా తీసుకువెళ్లింది. దీనికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ ఇప్పటివరకు చేసిన దాడుల్లో 45 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు:జిన్‌పింగ్ హెచ్చరిక -
హమాస్ చీఫ్ హత్య..ఇజ్రాయెల్ కీలక ప్రకటన
టెల్అవీవ్:హమాస్ ముఖ్య నేత ఇస్మాయిల్ హనియే ఈ ఏడాది జులైలో హత్యకు గురైన విషయం తెలిసింది. హనియేను తామే అంతం చేశామని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాద గ్రూపు ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగిస్తుంది.ఈ క్రమంలో వారికి ఓ స్పష్టమైన సందేశం అందించాలనుకుంటున్నా. హమాస్, హెజ్బొల్లాలను ఓడించాం. వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంతో పాటు హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. ఇరాన్ రక్షణ,ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం.సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టాం. హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదు’ అని కాట్జ్ హెచ్చరించారు.ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జులైలో జరిగిన ఆ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హనియా హత్యకు గురైన విషయం తెలిసిందే. పథకం ప్రకారమే ఇజ్రాయెలే ఈ పని చేసిందని ఇరాన్ అప్పుడే ఆరోపించింది.అయితే అప్పట్లో ఇజ్రాయెల్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.తాజాగా ఈవిషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు గాజాలో యుద్ధం మొదలైనప్పటినుంచి హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. తాము పాలస్తీనియన్లకు సంఘీభావంగా వ్యవహరిస్తున్నామని హౌతీ రెబెల్స్ పేర్కొంటున్నారు. -
హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా అధ్యకక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసే జనవరి 20కి ముందే హమాస్ తన వద్ద బందీలుగా ఉంచుకున్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయాలని కోరారు. లేదంటే హమాస్‌కు నరకం చూపిస్తానని సంచలన హెచ్చరిక చేశారు.ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో ఒక పోస్టు చేశారు.‘బందీల విడుదలవకపోతే అందుకు బాధ్యులపై చరిత్రలో ఇంతకుముందెన్నడు చూడని రీతిలో ఉక్కుపాదం మోపుతాం. వారిని వెంటనే విడుదల చేయండి’అని ట్రంప్ తన పోస్టులో హమాస్‌ను కోరారు. గతేడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు వందల మందిని అత్యంత క్రూరంగా చంపారు. కొంత మందిని బందీలుగా తీసుకెళ్లారు.వారిలో ఇప్పటికి 100 మందిదాకా హమాస్ వద్దే ఉన్నారు. అక్కడ బందీగా ఉన్న అలెగ్జాండర్ అనే యువకుడు ఏడుస్తున్న వీడియోను హమాస్ తాజాగా రిలీజ్ చేసింది.ఈ వీడియో వైరల్‌గా మారింది. -
‘ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం.. మమ్మల్ని కాపాడండి’
టెల్అవీవ్: ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొలిక్కిరావడం ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ యువకుడు ఎడాన్ అలెగ్జాండర్ వీడియోను హమాస్ తాజాగా విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ విడుదలకు ప్రయత్నించాలని బందీగా ఉన్న యువకుడు వీడియోలో ఏడుస్తూ మొర పెట్టుకున్నారు. తామంతా ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా,ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే హమాస్ మిలిటరీ విభాగం అల్ కస్సామ్ బ్రిగేడ్ ఈ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. Well, atleast he looks healthy an clean. Idan Alexander, held hostage because of Netanyahu #Israel pic.twitter.com/J42O2yGsRg— Steven Markussen (@DALAX) November 30, 2024ఈ వీడియోపై ఎడాన్ తల్లి యేల్ స్పందించారు. తన కుమారుడి వీడియో తనను కలవరపరిచిందని, హమాస్ వద్ద ఉన్న బందీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది తెలియజేస్తోందన్నారు. ఈ వీడియోపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు కార్యాలయం స్పందించింది. ఇలాంటి హమాస్ వ్యూహాలు ఇజ్రాయెల్ లక్ష్యాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. హమాస్ వద్ద ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకొస్తామని తెలిపింది. గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని తమతోపాటు పాలస్తీనాలోని గాజాకు తీసుకెళ్లింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 43వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
కైరోలో ఇజ్రాయెల్,హమాస్ చర్చలు..వారి విడుదలే కీలకం
గాజా:ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఈజిప్టు రాజధాని కైరోలో శనివారం(నవంబర్30) నిర్వహించే చర్చలకు తమ ప్రతినిధులు హాజరవుతారని హమాస్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలపై ఈజిప్టు అధికారులతో వారు చర్చలు జరుపుతారని తెలిపారు.హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ దేశ పౌరులు విడుదల తర్వాతే కాల్పుల విరమణపై ఆలోచిస్తామని ఇజ్రాయెల్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హెజ్బొల్లా,ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. హమాస్ సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం కనుగొంటామని,ఇందుకు ఖతార్,టర్కీ,ఈజిప్టు దేశాల సాయంతో ప్రయత్నిస్తామని అమెరికా ఇప్పటికే పేర్కొనడం గమనార్హం.గతేడాది అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజజ్రాయెల్‌పై దాడి చేసి వందల మంది ఆ దేశ పౌరులను చంపడమే కాకుండా కొందరిని తమతో పాటు బందీలుగా తీసుకెళ్లారు.అక్టోబర్ 7 తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు పాలస్తానాలో 40వేల మందికిపైగా మరణించారు. -
ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!
బీరూట్: ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల వెంట కాల్పుల మోత ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌కు అండగా ఇజ్రాయెల్‌తో పోరు జరుపుతున్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ వెనక్కి తగ్గే వీలుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో హెజ్బొల్లాకు కుదరబోతున్న కాల్పుల విరమణ ఒప్పందమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణకు నెతన్యాహూ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇంకొన్ని కీలక అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వచ్చాక అంగీకారం కుదురుతుందని తెలుస్తోందని సీఎన్ఎన్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. సూత్రప్రాయ అంగీకారం త్వరలో కుదరబోతోందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సర్ సోమవారం చెప్పారు. -
యుద్ధం ఆపేస్తేనే ఒప్పందం
జెరూసలేం: గాజా స్ట్రిప్‌లో యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్‌తో బందీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ స్పష్టం చేసింది. యుద్ధం ముగియకుండా, ఖైదీల మార్పిడి జరగదని హమాస్ తాత్కాలిక చీఫ్ ఖలీల్ అల్ హయా బుధవారం పేర్కొన్నారు. దురాక్రమణకు ముగింపు పలకకుండా బందీలను ఎందుకు వదిలేస్తామని ఆయన ప్రశ్నించారు. యుద్ధం మధ్యలో ఉండగా తమ వద్ద ఉన్న బలాన్ని మతి స్థిమితం లేని వ్యక్తి కూడా వదులుకోడని వ్యాఖ్యానించారు. సంప్రతింపులను పునరుద్ధరించడానికి కొన్ని దేశాలు, మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నాయని, తాము ఆ ప్రయత్నాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యుద్ధం ఆపడానికి ఆక్రమించినవారు నిబద్ధతతో ఉన్నారా? లేదా అనేది ముఖ్యమని హయా చెప్పారు. చర్చలను బలహీనపరిచే వ్యక్తి నెతన్యాహు అని రుజువవుతోందన్నారు. మరోవైపు బేషరతుగా శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా బుధవారం వీటో చేసింది. కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టంగా కోరే తీర్మానానికి మాత్రమే అమెరికా మద్దతు ఇస్తుందని ఐరాసలో అమెరికా రాయబారి స్పష్టంచేశారు. ఒప్పందానికి ఇరుపక్షాలు సుముఖత చూపకపోతే మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేస్తామని హమాస్, ఇజ్రాయెల్‌కు తెలియజేశామని కాల్పుల విరమణ మధ్యవర్తి అయిన ఖతార్ ప్రకటించింది. దోహాలోని హమాస్ రాజకీయ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయలేదని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ నవంబర్ 19న ప్రకటించారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వ ప్రయత్నాలను సులభతరం చేయడానికి హమాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అల్ అన్సారీ చెప్పారు. అయితే హమాస్‌ను బహిష్కరించాలని ఖతార్‌ను అమెరికా కోరిందని, దోహా ఈ సందేశాన్ని హమాస్‌కు చేరవేసిందని వార్తలు వచ్చాయి. ఈజిప్టు ప్రతిపాదనను స్వాగతించిన హమాస్ గాజా స్ట్రిప్‌ను నడపడానికి అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రత్యర్థి ఫతా ఉద్యమంతో కలిసి ఒక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్టు చేసిన ప్రతిపాదనను హమాస్ స్వాగతించింది. యుద్ధం ముగిశాక గాజాను ఈ కమిటీ నడిపించి, సమస్యలను పరిష్కరిస్తుందని హయా చెప్పారు. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదన్నారు. యుద్ధం తరువాత గాజాను పాలించడంలో హమాస్ పాత్రను ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్
ద హేగ్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది. నెతన్యాహు, గల్లాంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. గాజాలో 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20వ తేదీ దాకా నెలకొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహు, గల్లాంట్‌పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే గాజాలో భీకర యుద్ధానికి, సంక్షోభానికి కారణమయ్యారంటూ హమాస్ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. హమాస్ అగ్రనేతలు మొహమ్మద్ డెయిఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియేను అరెస్టు చేయాలని ఐసీసీ స్పష్టంచేసింది. అయితే, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియే ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడేం జరగొచ్చు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ట్రంప్‌నకు పాలస్తీనా అధ్యక్షుడి ఫోన్.. ‘గాజాలో శాంతి కోసం రెడీ’
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ శుక్రవారం యూఎస్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా గాజాలో న్యాయమైన, సమగ్రమైన శాంతి కోసం పని చేయడానికి సంసిద్ధతను ట్రంప్‌నకు తెలియజేసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయానకి అబ్బాస్ అభినందనలు తెలియజేశారు.‘‘అంతర్జాతీయ చట్టాల ఆధారంగా న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించేందుకు ట్రంప్‌తో కలిసి పని చేసేందుకు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ప్రపంచంలోని సంబంధిత పార్టీలతో కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అబ్బాస్ ట్రంప్‌నకు తెలిపారు. దీంతో గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కృషి చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని ట్రంప్ తెలిపారు’’ అని పాలస్తీనా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే ట్రంప్ తన ప్రచారం సమయంలో గాజాలో యుద్ధం ముగించడానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.గత ఏడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో హమాస్, ఇజ్రాయెల్ బలగాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో 43,500 మంది గాజా ప్రజలు మృతిచెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.వేల మంది ప్రజలు గాజా నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. -
హమాస్‌పై ఖతార్ కీలక నిర్ణయం.. నోటీసులు జారీ
హమాస్ గ్రూప్‌ను బహిష్కరించడానికి అంగీకరించినట్లు ఖతార్ వెల్లడించింది. దోహాలోనే నివసిస్తూ ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు హమాస్ నేతలు ఆమోదం తెలపని విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో హమాస్ నేతలను బహిష్కరించాలని ఖతారకు అగ్రరాజ్యం అమెరికా ఆమోదం సూచించింది. ఈ క్రమంలో అమెరికా విజ్ఞప్తికి ఖతార్ అందుకు అంగీకారం తెలిపి.. హమాస్‌కు నోటీసులు పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రచురిస్తోంది.ఇటీవలి కాల్పుల విరమణ, బందీల మార్పిడి ప్రతిపాదనలను హమాస్ గ్రూపు తిరస్కరించిన నేపథ్యంలో దోహాలో హమాస్ కొనసాగడం ఆమోదయోగ్యం కాదని అమెరికా ఖతార్‌కు తెలియజేసింది. “ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలనే ప్రతిపాదనలను పదేపదే తిరస్కరిస్తోంది. హమాస్ నేలను ఇకపై ఏ అమెరికన్ భాగస్వామి దేశం తమ రాజధాని నగరాల్లోకి స్వాగతం పలకకూడదు. కాల్పల విరమణను తిరస్కరించిన హమాస్‌ను బహిష్కరించాని మేం ఖతార్‌కు స్పష్టం చేశాం’ అని ఓ అమెరికా అధికారి తెలిపారు.మరోవైపు.. అమెరికా విజ్ఞప్తి మేరకు ఖతార్ హమాస్‌ను బహిష్కరించటాన్ని హమాస్ నేతలు ఖండించారు.అమెరికా, ఈజిప్ట్‌తో పాటుగా ఖతార్ దేశాలు.. గాజాలో హింసను అంతం చేయడానికి పలుసార్లు హమాస్-ఇజ్రాయెల్ చర్చలకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో జరిగిన చర్చల్లో హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇజ్రాయెల్ కొత్త షరతులను ప్రవేశపెట్టడంతో వాటిని తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని హమాస్ తేల్చిచెప్పింది. -
హమాస్ చివరి కీలక నేత కసబ్ హతం
టెల్అవీవ్: హమాస్ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేతను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(ఐడీఎఫ్) ప్రకటించింది. హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కసబ్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ వెల్లడించింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర మిలిటెంట్ గ్రూపులను అతడు సమన్వయం చేస్తున్నాడని ఐడీఎఫ్ తెలిపింది. కారుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కసబ్ చనిపోయాడని హమాస్ వర్గాలు ధృవీకరించాయి. కాగా, ఇటీవలే ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల సూత్రధారి సిన్వర్‌ను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. అంతకుముందు హమాస్ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హానియేను కూడా ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. హమాస్‌ను లేకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఉగ్రవాద సంస్థలోని కీలక నేతల ఎలిమినేషన్‌పై ఐడీఎఫ్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ హై అలర్ట్ -
గాజాలో పంటలు నాశనం... పశువుల మృత్యువాత!
గాజా–ఇజ్రాయెల్ మధ్య ఎడతెగని యుధ్ధం గాజాలోని అనేక పదుల సంఖ్యలో మనుషులను బలిగొంది. అంతేకాదు, అక్కడి రైతులు, పశుపోషకుల జీవితాలను యుద్ధం ఛిద్రం చేసింది. కొనసాగుతున్న యుద్ధం స్థానిక ఆహారోత్పత్తి అడుగంటడంతో గాజాలో ఆహార భద్రత వేగంగా క్షీణించింది. గాజాలో దాదాపు 86 శాతం జనాభా (18.4 లక్షల) మంది ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. యావత్ గాజా స్ట్రిప్‌లో తిండి దొరకని తీవ్ర క్షామ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది.ఎఫ్.ఎ.ఓ. ఉపగ్రహ కేంద్రం ఇటీవల సేకరించిన ఒక అధ్యయనంలో ఉపగ్రహ డేటా ప్రకారం.. గాజాలోని పంట భూమిలో మూడింట రెండొంతుల భూమి నాశనమైంది. గాజా వాసులకు చెందిన దాదాపు 15 వేల (95 శాతం) పశువులు చనిపోయాయి. దాదాపు దూడలన్నీ వధించబడ్డాయి. సుమారు 25 వేల గొర్రెలు (సుమారు 43 శాతం), కేవలం 3 వేల మేకలు (సుమారు 37 శాతం) మాత్రమే సజీవంగా మిగిలాయి. పౌల్ట్రీ రంగానికి కూడా అపార నష్టం జరిగింది. 99% కోళ్లు చనిపోయాయి. కేవలం 34 (1 శాతం) వేలు మాత్రమే మిగిలాయి.సగానికి సగం జీవాలు మృతిభయానక యుద్ధం వల్ల గాజాకు చెందిన పశుపోషకురాలు హక్మా ఎల్–హమీది తన కుటుంబ జీవనాధారమైన గొర్రెలు, మేకలు సహా దక్షిణ భాగాంలోకి వలస పోయింది. ఈ కుటుంబం కనీసం సగం జీవాలను కోల్పోయింది. పశువుల పనులు ఆమెకు చిన్నప్పటి నుండి అలవాటే. రోజుకు మూడు పూటలా వాటి బాగోగులు చూసుకుంటుంది. ‘యుద్ధ కాలంలో ఆహారం లేదు, బార్లీ లేదు, మేత లేదు, నీరు కూడా లేదు. మాకు నలభైకి పైగా పశువులు ఉండేవి. ఇప్పుడు ఇరవై కంటే తక్కువే మిగిలాయి’అని సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని అల్–జువైదా నివాసి హక్మా చెప్పారు.ఈ నష్టాలు ఆమె కుటుంబ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించాయి. ‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) మాకు పశువుల మేతను అందించి చాలా సహాయం చేసింది. దేవునికి ధన్యవాదాలు. ఈ జీవాలైనా చనిపోకుండా మిగిలాయి. ఆరోగ్యంగా ఉన్నాయి..’ అన్నారామె. ఎఫ్.ఎ.ఓ. అందించిన వెటర్నరీ కిట్ కూడా ‘నాకు చాలా సహాయపడింది. విటమిన్లతో కూడిన దాణాతో పాటు దోమలు/ ఈగల బాధ లేకుండా చేసే స్ప్రే ఆ కిట్‌లో ఉన్నాయి. జీవాలను ఈగలు కుట్టకుండా దీన్ని పిచికారీ చేస్తున్నాను. ఇది నిజంగా బాగుంది’ అన్నారామె.పశుగ్రాసం, వెటర్నరీ కిట్ల పంపిణీభద్రత, ప్రయాణ సంబంధ సవాళ్లను అధిగమించి గాజా ప్రజలకు అనేక సంస్థలు మానవతా సహాయాన్ని అందించాయి. గాజాలోని డెయిర్ అల్–బలా, ఖాన్ యూనిస్, రఫా గవర్నరేట్లలోని 4,400కు పైగా పశు పోషణే జీవనాధారంగా గల కుటుంబాలకు ఎఫ్.ఎ.ఓ. పశుగ్రాసాన్ని పంపిణీ చేసింది. జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, గాజా అంతటా జీవనోపాధులను కాపాడేందుకు దాదాపు 2,400 కుటుంబాలకు వెటర్నరీ కిట్లు అదనంగా అందించారు. మల్టీవిటమిన్లు, క్రిమిసంహారకాలు, సాల్ట్ బ్లాక్‌లు, అయోడిన్ గాయం స్ప్రేలు వంటి జంతువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా అవసరమైన వస్తువులను అందించటం విశేషం. వాస్తవానికి, హక్మా వంటి పశుపోషకులకు ఈ మహా సంక్షోభ కాలంలో ఈ సహాయం సరిపోదు. తన జంతువులను రక్షించుకోవడానికి ఇంకా ఎక్కువ మేత, మరిన్ని మందులు, మరిన్ని గుడారాలు అవసరమని ఆమె చెప్పారు.ఈ సాయం చాలదుబాధాకరమైన గత సంవత్సర కాలంలో అపారమైన నష్టాన్ని చవిచూసిన మరొక పశు పోషకుడు వార్డ్ సయీద్. వాస్తవానికి గాజాలోని పాత నగరంలో ఎల్–జెటూన్స్ కు చెందిన మహిళా పశుపోషకురాలు. యుద్ధం నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి డెయిర్ అల్–బలాహ్‌కు వలస వెళ్లి ఆశ్రయం పొందారు. ‘యుద్ధం కారణంగా మేం దక్షిణాదికి తరలివచ్చాం. మా పశువులను కూడా తోలుకొచ్చాం. సగానికి సగాన్ని కోల్పోయాం. వాటిలో చాలా వరకు దారిలోనే చనిపోయాయి. ఈ మిగిలిన జీవాలే మాకు ఏకైక జీవనాధారం’ అన్నారామె. క్షిపణులు తరచూ పడే యుద్ధ ప్రాంతంలో ఆమె తన కుటుంబానికి ఆహారం, పశువులకు మేత కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ శ్రమిస్తున్నారు. ‘ఎఫ్.ఎ.ఓ. పశువుల మేత, వెటర్నరీ కిట్ ఇచ్చింది. ఈ సాయం సరిపోదు. పశువుల మేత, భద్రత కలిగిన గూడు, ఆహారం ఇంకా కావాలి’ అన్నారామె. యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం కాక ముందు దాదాపు 650 ట్రక్కుల మేత ప్రతి నెలా గాజా స్ట్రిప్‌లోకి తెప్పించుకునేవారు. ఎఫ్.ఎ.ఓ., బెల్జియం, ఇటలీ, మాల్టా, నార్వే ప్రభుత్వాల మద్దతుతో పాలస్తీనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి గాజా పశువుల సంరక్షకులకు మేత, వెటర్నరీ కిట్లను పంపిణీ చేస్తుంది. అయినా, అది అరకొరగానే మిగిలింది. యుద్ధం వల్ల ఆహారం, దాణా తదితరాలను రవాణా చేయటంలో సహాయక సంస్థలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితులు మెరుగుపడితే ఫీడ్ కాన్స్ సెంట్రేట్, గ్రీన్స్ హౌస్ ప్లాస్టిక్ షీట్లు, ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు, వ్యాక్సిన్స్ లు, ఎనర్జీ బ్లాక్‌లు, ప్లాస్టిక్ షెడ్లు, జంతు షెల్టర్లు, మరిన్ని వెటర్నరీ కిట్లను అందించడానికి సిద్ధమని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. గాజా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని వలస పోయిన హక్మా, వార్డ్ వంటి పశు పోషక కుటుంబాలకు మరింత మెరుగైన సహాయం అందే రోజు కోసం వారు ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.గ్రీన్‌హౌస్‌లు ద్వంసంగాజా స్ట్రిప్ ప్రాంతంలో గల పంట పొలాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 68 శాతం, అంటే 10,183 హెక్టార్లలో పంట పొలాలు యుద్ధం వల్ల నాశనమయ్యాయని ఎఫ్.ఎ.ఓ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 43% పొలాలు నాశనం కాగా, మే నాటికి అది 57%కి పెరిగింది. 71% తోటలు, చెట్లు, 67% స్వల్పకాలిక పంటలు, 59% వరకు కూరగాయ పంటలు నాశనమయ్యాయి. యుద్ధం వల్ల గాజాలోని వ్యవసాయ మౌలిక సదుపాయాలు సర్వనాశనం అయ్యాయి. 1,188 (52%) వ్యవసాయ బావులు దెబ్బతిన్నాయి. 578 హెక్టార్ల (44%)లోని గ్రీన్ హౌస్‌లు నేలమట్టం అయినట్లు అంచనా.∙గాజా స్ట్రిప్ నుంచి దక్షిణాదికి వలస వచ్చి జీవనోపాధి కోల్పోయిన హక్మా, వార్డ్ వంటి పశుపోషకులకు పశుగ్రాసం, వెటర్నరీ కిట్లు ఎఫ్.ఎ.ఓ. పంపిణీ చేసింది. మరిన్ని జంతువులు చనిపోకుండా కాపాడుకోవడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి సహాయపడ్డాయి. -
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 77 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని బీట్ లాహియాలో ఉన్న ఓ ఐదు అంతస్తుల నివాస భవనంపై దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 77 మంది పాలస్తీనియన్లు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది గాయపడ్డారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని ఉన్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ దాడిపై ఇంతవరకు ఇజ్రాయెల్ స్పందించకపోవటం గమనార్హం.BREAKING: The death toll has risen to 77, including 25 children, following the horrific Israeli massacre in Beit Lahiya, northern Gaza, according to local sources. The majority of the victims are from the Abu Nassr clan. pic.twitter.com/j660WyvzYK— 🇵🇸 Palestine Watermelons 🍉 (@PalestineMelons) October 29, 2024 శిథిలాల నుంచి మరింత మందిని బయటకు తీస్తున్నారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)పై ఇజ్రాయెల్ నిషేధం విధించటంపై ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇజ్రాయెల్ చర్య.. సహించరానిది, చట్టవిరుద్ధమైదిగా పేర్కొంటున్నారు. ఈ దాడిలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది -
ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించిన అల్ జజీరా
గాజాలో ఆరుగురు అల్ జజీరా మీడియా సంస్థకు జర్నలిస్టులు పాలస్తీనా తీవ్రవాదులని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలు చేసింది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపులతో ఆరుగురు జర్నలిస్టులు అనుబంధంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణలై స్పందించిన ఖతార్‌కు చెందిన అల్ జజీరా మీడియా నెట్వర్క్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలు నిరాధారమని తోసిపుచ్చింది.‘‘ఇజ్రాయెల్ సైన్యం మా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తున్నాం. ఇజ్రాయెల్ మా జర్నలిస్టులపై కల్పిత సాక్ష్యాలను సృష్టించడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం. ఈ కల్పిత ఆరోపణలతో ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న జర్నలిస్టుల గొతునొక్కేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోంది. తద్వారా యుద్ధంలో జరుగుతున్న కఠినమైన వాస్తవాలను ప్రపంచానికి తెలియకూడదలనే కుట్రకు ఇజ్రాయెల్ తెరలేపింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు, గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని ఎప్పటికప్పుడూ ప్రసారం చేస్తున్న ఏకైక అంతర్జాతీయ మీడియా నెట్వర్క్ అల్ జజీరానే’’ అని ఓ ప్రకటనలో తెలిపింది..‘‘గాజాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాద సంస్థలలోని సైనికులతో ఆరుగురు అల్ జజీరా జర్నలిస్టులు కలిసిపోయారని నిర్ధారించే గూఢచార సమాచారం, టెర్రరిస్ట్ శిక్షణా కోర్సుల జాబితా, ఫోన్లతో సహా గుర్తించబడ్డాయి. ఖతార్ అల్ జజీరా మీడియా నెట్‌వర్క్‌లో పనిచేసే సిబ్బంది హమాస్ ఉగ్రవాదులతో కలిసిపోయారడానికి ఈ పత్రాలే రుజువు. అల్ జజీరా హమాస్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నట్లు చాలా మంది జర్నలిస్టులు బహిర్గతం చేశారు. అల్ జజీరా జర్నలిస్టులు.. అనస్ అల్-షరీఫ్, హోసామ్ షబాత్, ఇస్మాయిల్ అబు ఒమర్ , తలాల్ అర్రూకీలకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయి.అదేవిధంగా అష్రఫ్ సరాజ్, అలా సలామెహ్ ఇస్లామిక్ జిహాద్‌తో అనుబంధం కలిగి ఉన్నారు’’ అని బుధవారం ఇజ్రాయెల్ ‘ఎక్స్’లో పేర్కొంది. -
అగ్ర నేతలపై ఇజ్రాయెల్ టార్గెట్.. హమాస్ కీలక నిర్ణయం!
దెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ దళాల చేతిలో ఇటీవల హత్యకు గురైన యాహ్యా సిన్వర్ స్థానంలో చీఫ్‌గా ప్రస్తుతానికి ఎవరినీ నియమించరాదని హమాస్ నిర్ణయించింది. ఇకపై ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు ఐదుగురు సభ్యుల కమిటీ నాయకత్వం వహించనుంది. ఈ కమిటీ దోహా కేంద్రంగా పని చేస్తుంది. అగ్ర నేతలందరినీ ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో 2025 మార్చిలో జరిగే గ్రూప్ తదుపరి ఎన్నికల దాకా చీఫ్‌గా ఎవరినీ నియమించరాదని హమాస్ నాయకత్వం భావించినట్టు తెలుస్తోంది.యాహ్యా సిన్వర్ మరణానికి ఏడాది ముందునుంచే అజ్ఞాతంలోకి గడుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా కీలక నిర్ణయాలను ఈ కమిటీయే తీసుకుంటూ వస్తోంది. ఇందులో గాజాకు ఖలీల్ అల్ హయా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబారిన్, విదేశాల్లోని పాలస్తీనియన్లకు ఖలీద్ మషాల్ ప్రతినిధులుగా ఉన్నారు. నాలుగో సభ్యుడు హమాస్ షూరా అడ్వైజరీ కౌన్సిల్ అధిపతి మహ్మద్ దర్వీష్.ఐదో సభ్యుడైన హమాస్ పొలిటికల్ బ్యూరో కార్యదర్శి పేరును భద్రతా కారణాల రీత్యా బయట పెట్టడం లేదని సంస్థ పేర్కొంది. వీరంతా ప్రస్తుతం ఖతర్‌లో ఉన్నారు. యుద్ధ సమయంలో ఉద్యమాన్ని, అసాధారణ పరిస్థితులను, భవిష్యత్ ప్రణాళికలను నియంత్రించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా దీనికి ఉంది.ఇరాక్‌లో ఐఎస్ గ్రూప్ కమాండర్ హతం బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూప్ లీడర్, మరో ఎనిమిది మంది సీనియర్ నేతలను తమ బలగాలు చంపేశాయని ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్–సుడానీ మంగళవారం ప్రకటించారు. సలాహుద్దీన్ ప్రావిన్స్‌లోని హమ్రిన్ కొండప్రాంతంలో బలగాలు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో జస్సిమ్ అల్–మజ్రౌయి అబూ అబ్దుల్ ఖాదర్ అనే ఐఎస్ గ్రూప్ కమాండర్ హతమయ్యాడన్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మిగతా వారి వివరాలను ప్రకటిస్తామన్నారు. అంతర్జాతీయ సంకీర్ణ బలగాలిచ్చిన సమాచారం, మద్దతు తో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ తెలిపింది. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, సామగ్రిని స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించింది.చదవండి: హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి -
నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ హతం: ఇజ్రాయెల్
జెరూసలేం: జజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత హషేమ్ సఫీద్దీన్ మృతి చెందాడు. మూడు వారాల క్రితం దక్షిణ బీరుట్ సబర్బ్‌లో ఇటీవల మృతిచెందిన హసన్ నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ తమ దాడుల్లో హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ధృవీకరించింది.‘‘సుమారు మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధిపతి హషీమ్ సఫీద్దీన్ , హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీ హుస్సేన్ హజిమా, ఇతర హిజ్బొల్లా కమాండర్లు మరణించినట్లు ధృవీకరించాం’’ ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే.. ఈ మరణాలకు సంబంధించి హెజ్బొల్లా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవటం గమనార్హం.#hashemsafieddine, Hezbollah's newly appointed leader, was killed in Israeli airstrikes on October 4 by #IDFThe body of Hashem #safieddine, #Hezbollah's new leader and successor to #Nasrallah, has been discovered#Israel #Beirut #Lebanon #Israel #IsraeliAirstrike #TelAviv pic.twitter.com/GjLlcQAvX2— know the Unknown (@imurpartha) October 22, 2024మూడు వారాల క్రితం దక్షిణ బీరుట్ శివారు దహియేహ్‌లో ఉన్న హెజ్బొల్లా ప్రధాన ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు చేశామని ఆలస్యంగా మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దళం పేర్కొంది. దాడి చేసిన సమయంలో 25 మందికి పైగా హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రధాన కార్యాలయంలో ఉన్నారని, అందులో ఏరియల్ ఇంటెలిజెన్స్ సేకరణకు బాధ్యత వహించే బిలాల్ సైబ్ ఐష్ కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.అక్టోబరు 8న, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. పేరు తెలపకుండా సఫీద్దీన్ మృతి చెందినట్లు ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దళాలు (హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లా ), నస్రల్లా స్థానంలో నియమించిన మరోనేతతో సహా వేలాది మంది ఉగ్రవాదులను అంతం చేశాం’ అని అన్నారు.చదవండి: హెజ్బొల్లా రహస్య బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు -
రెండు దేశాలుగా బతకడమే దారి
హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసియాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. యుద్ధం వల్ల దయనీయంగా మారిన పాలస్తీనా ప్రజానీకం పట్ల సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? అది రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు.పాలస్తీనాలోని గాజా విముక్తి దళం అని పిలవబడే హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఒక వేడుకలో పాల్గొన్న 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ దళాలు దారుణంగా వధించడంతో ఇది ప్రారంభమైంది. 2023 అక్టోబర్ 7న జరిగిన ఆ అనాగరిక దాడిలో ఇజ్రాయెల్ పిల్లలు, మహిళలు, పురుషులు దారుణంగా చంపబడ్డారు. ఏ నిర్వచనం ప్రకార మైనా, ఇది ఉగ్ర వాద దాడి. ప్రతీకారంగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌పై భారీ యుద్ధాన్ని ప్రారంభించింది. పాలస్తీనాలో పిల్లలు, మహిళలు సహా వేలాదిమంది చనిపోయారు. వెస్ట్‌బ్యాంక్ దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.2023 అక్టోబర్ 7 నాటి మారణకాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతుగా ఈ యుద్ధంలోకి ప్రవే శించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. కానీ అవి ఇజ్రాయెల్ బలంతో సరిపోలగలవా? ఇజ్రా యెల్ తన అత్యంత అధునాతన సాంకేతికత, యుద్ధ వ్యూహంతో హమాస్ ఆయుధ శక్తిని, ప్రధాన నాయకత్వాన్ని నాశనం చేసింది.దక్షిణ గాజాలోని రఫా లక్ష్యంగా సాగించిన గ్రౌండ్ ఆపరేషన్ లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అక్టోబర్ 17న ప్రకటించింది. సిన్వార్ హత్య హమాస్‌కు చావుదెబ్బ. ఇరాన్, లెబనాన్ ఈ యుద్ధంలో తమ పౌర, సైనిక సిబ్బందిని పణంగా పెట్టడానికి సాహసించక పోవచ్చు.రెండు దేశాల పరిష్కారంసమస్యకు పరిష్కారం రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు. ఇజ్రా యెల్ ఆ సూత్రాన్ని అంగీకరించింది. కానీ హమాస్, ఇరాన్ వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ, తన ప్రజల సుదీర్ఘ ప్రవాస జీవితం తర్వాత, ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కులు అమలులోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు. ఇతర ముస్లిం మత నిరంకుశ దేశాల కంటే అధ్వానంగా, పాలస్తీనా, ఇరాన్, ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలు ఉగ్రవాద కేంద్రాలుగా మారాయి.ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తిగత హక్కుల క్రమబద్ధమైన ప్రక్రియను అంగీకరించే ఏ దేశమూ ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో స్వీయ విధ్వంస స్థితిని సృష్టించదు. హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్హుడ్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచం మొత్తానికి సమస్యలను సృష్టించాయి.ఇవి ప్రజల ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టవు. ప్రజలు శాంతియుతంగా వ్యవసాయ లేదా పారిశ్రామిక పనిలో పాల్గొనడానికి అనుమతించవు. స్త్రీ వ్యతిరేక ఆధ్యాత్మిక సైద్ధాంతిక చర్చలకు పూనుకుంటాయి. తాలిబన్ రూపంలో ఇలాంటి బలగం కారణంగా అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోందో మనకు తెలుసు.75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసి యాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1948కి ముందు దాని ప్రజలు పదేపదే దేశభ్రష్టులైనప్పటికీ, ఇజ్రాయెల్ ఉనికిని తిరస్కరించడాన్ని చరిత్ర అంగీకరించదు.సామాజిక–ఆర్థిక పరిస్థితులు2019లో నేను ఇజ్రాయెల్, పాలస్తీనాలో విస్తృతంగా పర్యటించి రెండు దేశాల సామాజిక–ఆర్థిక పరిస్థితులను గమనించాను. ఇజ్రా యెల్ వైభవాన్ని, గొప్ప పచ్చని ఉత్పత్తి క్షేత్రాలలో సర్వత్రా చూడ వచ్చు. వారు ఎడారులను ఉత్పాదక భూములుగా మార్చారు. పేదరి కంతో కొట్టుమిట్టాడుతున్న పాలస్తీనా ప్రజలు, అక్కడి ఏ శ్రామిక ప్రజానీకం... పురుషులు, మహిళలు కూడా ఎడారిలోని పాక్షిక సాగు పొలాల్లో కనిపించరు. వారి వ్యవసాయ భూములలో ఒక్క స్త్రీని కూడా మనం చూడలేము. ఇజ్రాయెల్ స్త్రీలు భారతీయ శూద్ర, దళిత స్త్రీల లాగే నిత్యం పని చేస్తూనే ఉంటారు.యూదుల కష్టపడి పనిచేసే సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం వారికి సహాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సహాయం ఉన్నప్ప టికీ, అర్థవంతమైన విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా పాలస్తీనా పేద దేశంగా మిగిలిపోయింది. వారి ఏకైక ఆశ మతం. ఉత్పత్తి లేకుండా మతం వారికి సహాయం చేస్తుందా?ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ సెక్యులరిజం సూత్రాలపై ఆధార పడి నడుస్తుంది. కానీ, పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, ఈజిప్టులలో ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయా? అవి మత నియంతృత్వాలని మనకు తెలుసు.కొత్త ఒప్పందాలు అవసరమా?1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. రెండవది 1994 నాటి అబ్రహాం ఒప్పందం. ఇది అబ్రహామిక్ సంస్కృతికి చెందిన పిల్లలుగా యూదులు, ముస్లింల ఉమ్మడి చారిత్రక వారసత్వంతో రెండు దేశాల సహజీవనం గురించి మాట్లాడుతుంది. పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాలను తిరస్క రించాయి.పాలస్తీనా సాధారణ ప్రజానీకం పట్ల, ప్రత్యేకించి పిల్లలు, మహిళలు, శరణార్థుల దుఃస్థితి పట్ల మనమందరం సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? పాలస్తీనా, ఇజ్రాయెల్ ఆ రెండు ఒప్పందాలను గౌరవించాలా లేక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలా? పాలస్తీనా దైవపాలనా సూత్రాల ఆధారంగా పనిచేస్తోంది. ఇజ్రాయెల్‌కు ప్రజాస్వామ్యం పట్ల ఉన్నంత గౌరవం పాలస్తీనా నాయకులకు లేదు. నా ఉద్దేశంలో వారు ఆ చిన్న భూమిలో రెండు చిన్న దేశాలుగా జీవించాలి. వేరే అవకాశమే లేదు.ఉభయ దేశాలలోని, ముఖ్యంగా పాలస్తీనాలోని కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల సానుభూతి చూపుతున్న ప్రపంచ మేధావులు ముస్లిం ప్రపంచంలో సంస్కరణల గురించి మాట్లాడుతూనే ఉండాలి. ముస్లిం దేశాలు సరైన ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్యాల వైపు వెళ్లాలి. మత నిరంకుశ రాజ్యాలలో ఉండకూడదు. యూదులు ఆ భూమిని విడిచి పెట్టి, 1948కి ముందున్న చోటికి తిరిగి వెళ్లాలంటున్న పాలస్తీనా, ముఖ్యంగా హమాస్, ఇరాన్ డిమాండ్‌ను వారు అంగీకరిస్తున్నట్ల యితే, అలాంటి మేధో అజ్ఞానం మానవ విలువలకు మరింత వినాశ నాన్ని తెస్తుంది.పాలస్తీనియన్లను ఆ భూభాగం నుండి బయటకు వెళ్ళమని ఇజ్రాయెలీలు కోరినట్లయితే వారికి కూడా అదే విషయం వర్తిస్తుంది. ఇలాంటి ఘోరమైన సమస్యలన్నింటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే రెండు దేశాల పౌరుల్లోనే పరిష్కారాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి వారి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలను వింటున్నాము. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రా యెల్ పౌరులు ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి దించేయవచ్చు. యాహ్యా సిన్వార్ బతికి ఉంటే పాలస్తీ నియన్లు అలా చేసి ఉండేవారా?ఉక్రెయిన్, రష్యా సమస్యలా కాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య. కాబట్టి మనమందరం ముస్లిం దేశాలు మొత్తంగా ప్రజాస్వామ్యం వైపు మారడం గురించి ఆలోచించాలి. పాలస్తీనా తన సొంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హమాస్ పట్టు నుండి బయటపడాలి. రెండు దేశాల పరిష్కారాన్ని అంగీకరిస్తూ, ప్రపంచానికీ, దాని సొంత ప్రజలకూ మేలు చేయాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
హెజ్బొల్లా రహస్య బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అటు హమాస్, హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రయెల్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. ఇటీవల హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను చంపిన ఇజ్రాయెల్.. ఈసారి హెజ్బొల్లా ఆర్థిక ఆస్తులను టార్గెట్ చేసింది. ఈ క్రమంలో హెజ్బొల్లా రహస్య బంకర్‌ను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడిలో.. భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు గుర్తించింది. . ఓ ఆస్పత్రి కింద ఉన్న రహస్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్‌నకు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వీడియో విడుదల చేసింది.“Tonight, I am going to declassify intelligence on a site that we did not strike—where Hezbollah has millions of dollars in gold and cash—in Hassan Nasrallah’s bunker. Where is the bunker located? Directly under Al-Sahel Hospital in the heart of Beirut.”Listen to IDF Spox.… pic.twitter.com/SjMZQpKqoJ— Israel Defense Forces (@IDF) October 21, 2024ఈ మేరకు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. హెజ్బొల్లా ఆర్థిక వనరులపై వరుసగా దాడులకు పాల్పడుతున్నాం. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్‌ను ధ్వంసం చేశాం. ఆ రహస్య బంకర్లో భారీగా బంగారం, వేల డాలర్ల నగదును గుర్తించాం. ఇజ్రాయెల్‌పై దాడులకు ఈ నగదునే వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు బీరుట్ నడిబొడ్డున మరో రహస్య బంకర్ ఉంది. అల్ – సాహెల్ ఆస్పత్రి కింద ఉన్న ఆ రహస్య బంకర్లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసింది. ఆ బంకర్‌పై ఇంకా తాము దాడులకు పాల్పడలేదని, ఆ బంకర్లో 500 బిలియన్ డాలర్ల నగదు(రూ. 4,200 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా వేస్తున్నామని హగారీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంకర్ ఉన్న ప్రాంతం మ్యాప్‌ను కూడా చూపించారు. అయితే బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆస్పత్రిపై దాడులకు పాల్పడమని, తమ యుద్ధం కేవలం హెజ్బొల్లాతో మాత్రమే అని హగారీ స్పష్టం చేశారు. లెబనీస్ పౌరులకు ఎలాంటి హానీ కలిగించమని పేర్కొన్నారు. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. -
యాహ్యా సిన్వార్ మృతి.. హమాస్‌కు చీఫ్ లేనట్లే!
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇటీవల హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతిచెందారు. దీంతో హామాస్‌ను ఎవరు నడిపిస్తారనే అంశంపై చర్చ జరగుతోంది. అయితే చీఫ్ లేకుండా.. దోహ కేంద్రంగా పాలక కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు హమాస్ వర్గాలు తెలిపాయి. మార్చిలో జరగనున్న ఎన్నికల వరకు దివంగత చీఫ్ యాహ్యా సిన్వార్‌కు వారసుడిని నియమించకూడదని హమాస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. టెహ్రాన్‌లో రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య అనంతరం ఆగస్టులో ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ హమాస్ గ్రూప్ నాయకత్వాన్ని తీసుకుంది. ఇక.. సిన్వార్ మృతికి ముందు.. గాజాలో ఉన్న ఆయనతో కమ్యూనికేట్ కావటంలో తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హమాస్ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.2017లో హమాస్ గ్రూప్ గాజా చీఫ్‌గా నియమించబడిన సిన్వార్.. జూలైలో హనియే హత్య అనంతరం హమాస్ గ్రూప్ మొత్తానికి చీఫ్‌గా నియమితులయ్యారు. గాజాకు ఖలీల్ అల్-హయ్యా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబరిన్, విదేశాలలో ఉన్న పాలస్తీనియన్ల కోసం ఖలీద్ మెషాల్ చెందిన ప్రతినిధులతో పాలక కమిటీని రూపొందించినట్లు తెలుస్తోంది.ఇక.. ఈ పాలక కమిటీలో హమాస్ షూరా సలహా మండలి అధిపతి మహమ్మద్ దర్విష్, పొలిటికల్ బ్యూరో కార్యదర్శి కూడా ఉన్నారు. అయితే.. వీరిని భద్రతా కారణాల దృష్ట్యా గుర్తించకపోవటం గమనార్హం. కమిటీలోని ప్రస్తుత సభ్యులందరూ ఖతార్‌లో ఉన్నారు. యుద్ధం, అసాధారణమైన పరిస్థితులలో దాడులు, భవిష్యత్తు ప్రణాళికలను నిర్వహించటంపై ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పాలక కమిటీకి అధికారం ఉంటుంది.చదవండి: ఇజ్రాయెల్ దాడులు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ -
హమాస్ చీఫ్ బంకర్ చూస్తే షాక్ అవాల్సిందే.. భారీగా డబ్బు..
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో మృతి చెందారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఉన్న ఈ బంకర్లో వంటగది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సమాగ్రి, మిలియన్ డాలర్ల భారీ నగదు, పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్ ఉన్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.ఇక.. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి సిన్వార్ సూత్రధారి. ఆయన రఫాకు పారిపోయే ముందు ఈ బంకర్లోనే కొన్నిరోజులు గడిపినట్లు తెలుసోంది. ఇస్మైల్ హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్‌ను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపని దాడుల్లో సిన్వార్ మృతి చెందారు.Hamas' eliminated leader Yahya Sinwar was hiding in this underground tunnel months ago:Surrounded by UNRWA bags of humanitarian aid, weapons and millions of dollars in cash.He hid like a coward underground, using the civilians of Gaza as human shields. pic.twitter.com/0ylVjTCv7H— Israel ישראל (@Israel) October 20, 2024 ‘‘హమాస్ నుంచి తొలగించబడిన నేత యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. మానవతా సహాయం, ఆయుధాలు, మిలియన్ల డాలర్ల నగదుతో ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) బ్యాగులు ఉన్నాయి. ఆయన గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని, పిరికివాడిలా భూగర్భంలో దాక్కున్నారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎక్స్‌లో వీడియోను విడుదల చేసింది.Hamas leader Yahya Sinwar’s wife reportedly spotted with $32,000 Birkin bag as she went into hiding https://t.co/Dwqf0h7nTQ pic.twitter.com/JHZ5eMrYiZ— New York Post (@nypost) October 20, 2024 ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7 దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32వేల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ని తీసుకువెళ్లిన దృష్యం కనిపించింది.చదవండి: అక్టోబర్‌లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. -
అక్టోబర్‌లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. ఇజ్రాయెల్ వీడియో
జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతిచెందాడు. అయితే, గతేదాడి అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు ముందు సిన్వర్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ ఆరో తేదీన సిన్వర్ సొరంగంలోకి వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇజ్రాయెల్ వీడియో ప్రకారం.. సిన్వర్, అతడి కుటుంబ సభ్యులు కొన్ని వస్తువులతో సొరంగంలోకి వెళ్లడం కనిపిస్తుంది. ఇదే సమయంలో వారికి కావాల్సిన సామాగ్రిని సొరంగంలోకి తీసుకెళ్లినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సిన్వర్ సొరంగంలో దాక్కున్నట్టు స్పష్టం చేసింది. అక్కడి నుంచే ఇజ్రాయెల్‌పై దాడులకు ప్లాన్ చేసినట్టు ఆరోపించింది.మరోవైపు.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ మేరకు హమాస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర గాజాలో బీట్ లాహియా పట్టణంలోని భవనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దళాలు పౌర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడంతో పాటు ఆసుపత్రులను ముట్టడించి బాధితులకు అందాల్సిన వైద్యం, ఆహార సామగ్రిని అడ్డుకుంటున్నాయని అక్కడి నివాసితులు, వైద్యాధికారులు ఆరోపించారు.🎥DECLASSIFIED FOOTAGE:Sinwar hours before the October 7 massacre: taking down his TV into his tunnel, hiding underneath his civilians, and preparing to watch his terrorists murder, kindap and rape. pic.twitter.com/wTAF9xAPLU— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 19, 2024 -
ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రమాదం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ దళాలు తమ వరుస దాడులతో హమాస్,హెజ్బొల్లా అగ్ర నేతలను ఒక్కొక్కరిగా హతమార్చుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రదారి యాహ్యా సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. గాజాలోని ఓ ఇంటిపై చేసిన దాడిలో సిన్వర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన రెండు రోజులకే ఓ ఆందోళనకర ఘటన చోటుచేసకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.లెబనాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ శనివారం దక్షిణ హైఫాలోని సిజేరియాలోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. ఈ డ్రోన్ దాడిలో భవనం కొంత భాగం దెబ్బతింది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి జరిగిన సమయంలో నెతన్యాహు, అతని భార్య అక్కడ లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.కాగా లెబనాన్ నుంచి ప్రయోగించిన మరో రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ వాయు దళాలు టెల్ అవీవ్ ప్రాంతంలో కూల్చివేశాయి. అయితే మూడోది మాత్రం సిజేరియాలోని ఓ భవనాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. సిజేరియాలోని భవనాన్ని ఢీకొనడానికి ముందు డ్రోన్ లెబనాన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఎగిరిందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. -
హమాస్ ఉనికి ఎప్పటికీ సజీవమే: ఇరాన్ సుప్రీం నేత
టెహ్రాన్: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ నేత యాహ్యా సిన్వర్ మృతి చెందినప్పటికీ హమాస్ ఉనికి విషయంలో ఎటువంటి సమస్య లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఆయన యాహ్యా సిన్వర్ మృతి చెందిన అనంతరం తొలిసారి స్పందించారు. సిన్వర్ మృతి బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ ఆయన మృతితో హమాస్ ఉనికి కోల్పోపోయినట్లు కాదని అన్నారు.The loss of Yahya #alSinwar is painful for the Resistance Front. But this front didn’t halt its progress in wake of the martyrdoms of eminent figures like Sheikh Ahmed Yassin, Fathi Shaqaqi, Rantisi, & Ismail Haniyeh. Similarly, it won’t falter with Sinwar’s martyrdom either.— Khamenei.ir (@khamenei_ir) October 19, 2024 ‘‘సిన్వర్ మృతి హమాస్‌కు నష్టం. ఆయన మృతి చాలా బాధాకరం. కానీ హమాస్ ప్రముఖ నేతల బలిదానంతో ముందుకు సాగడం మానలేదు. హమాస్ సజీవంగా ఉంది.. సజీవంగానే ఉంటుంది. హమాస్ నేత మరణానికి సంతాపం తెలియజేస్తున్నాం. ఆయన ఒక ‘వీరోచిత ముజాహిద్’. దోపిడీ చేసే క్రూరమైన శత్రువుతో పోరాడటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. నిజాయితీగల పాలస్తీనా ముజాహిదీన్, యోధుల పక్షాన నిలబడటం కొనసాగిస్తాం’’ అని అన్నారు.Hamas is alive and will stay alive. Yahya #Sinwar— Khamenei.ir (@khamenei_ir) October 19, 2024 ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న దాడికి ఆదేశించిన హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ శుక్రవారం మృతి చెందారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) అక్టోబర్ 17 చేసిన దాడిలో ఆయన మృతి చెందారని ప్రకటించింది. ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన హమాస్ నేతల్లో ముఖ్యమైన నేత సిన్వర్ ఒకరు. ఇజ్రాయెల్ యాహ్యా సిన్వార్ చివరి క్షణాలను చూపించే డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. మరోవైపు.. తమ నాయకుడు యాహ్యా సిన్వార్ మృతిని హమాస్ ధృవీకరించింది. గాజాలో దురాక్రమణ ముగిసే వరకు అక్టోబర్ 7న తాము బంధీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ పౌరులను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయబోమని ప్రతిజ్ఞ చేసింది.చదవండి: హమాస్ సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్, చేతి వేలు కత్తిరించి.. -
ఇజ్రాయెల్ వ్యూహం బ్యాక్‌ఫైర్!
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ అధినేత యాహ్యా సిన్వర్(61) హత్య విషయంలో ఇజ్రాయెల్ వ్యూహం వికటిస్తోంది. హమాస్ సభ్యులను భయకంపితులను చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన డ్రోన్ వీడియో దృశ్యం నిజానికి వారిలో మరింత స్ఫూర్తిని రగిలిస్తోంది. ఇజ్రాయెల్‌పై భీకర పోరాటానికి పురికొల్పుతోంది. ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. గాజాలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జవాన్లు చేసిన దాడిలో సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడిన సిన్వర్ చివరి క్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి. సిన్వర్ కుడి చెయ్యి చాలావరకు నుజ్జునుజ్జుగా మారింది. బాంబుల దాడితో తీవ్రంగా దెబ్బతిన్న ఓ భవనంలో ఒక సోఫాలో ఆయన కూర్చొని ఉన్నారు. చుట్టూ దుమ్మూ ధూళి దట్టంగా పేరుకుపోయి ఉంది. తనపై దాడి చేస్తున్న డ్రోన్‌పై ఆయన ఎడమ చెయ్యితో కర్ర లాంటిది విసురుతూ కనిపించారు. ఒకవైపు ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తున్నా, మరోవైపు శత్రువుపై పోరాటం ఆపలేదంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిసింది. రక్షణ వలయం లేదు.. కవచం లేదు గాజా భూభాగంలోని భారీ సొరంగంలో సిన్వర్ తలదాచుకుంటున్నాడని, చుట్టూ బాడీగార్డులతో దుర్భేద్యమైన రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నాడని, అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి బందీలుగా పట్టుకొచ్చిన వారిని రక్షణ కవచంగా వాడుకుంటున్నాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో చెప్పారు. ఇజ్రాయెల్ అధికారులు సైతం ఇదే విషయం పదేపదే వెల్లడించారు. కానీ, వీడియో దృశ్యం చూస్తే సిన్వర్ సొరంగంలో లేడు. బహుళ అంతస్తుల భవనంలో ఉన్నాడు. ఆయన చుట్టూ రక్షణ వలయం గానీ, రక్షణ కవచం గానీ లేదు. ఇజ్రాయెల్ చెప్పిందంతా అబద్ధమేనని ఈ దృశ్యాలు రుజువు చేశాయి. మద్దతుదారుల కంటతడిమృత్యువుకు చేరువవుతూ కూడా సిన్వర్ సాగించిన పోరాటాన్ని చూసి పాలస్తీనావాసులు, హమాస్ మద్దతుదారులు కంటతడి పెడుతున్నారు. వారిలో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఇజ్రాయెల్‌పై కసిగా మారుతోంది. సిన్వర్ హత్యకు ప్రతీకారం తప్పదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డ్రోన్ వీడియో దృశ్యం పాలస్తీనా పౌరులకు స్ఫూర్తిదాయకంగా మారడం గమనార్హం. వారంతా ఇజ్రాయెల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. సిన్వర్ త్యాగాన్ని కొనియాడుతున్నారు. ఈ వీడియో ద్వారా ఇజ్రాయెల్ ఆశించింది ఒకటి కాగా, జరుగుతున్నది మరొకటి కావడం గమనార్హం – సాక్షి, నేషనల్ డెస్క్ఇదీ జరిగిందిసిన్వర్ హత్య ఆపరేషన్ గురించి ఇజ్రాయెల్ సైనికాధికారులు కొన్ని వివరాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన 828వ బిస్లామాచ్ బ్రిగేడ్ తాల్ అల్–సుల్తాన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. సైనికుల కంట పడకుండా సందులు గొందులు తిరుగుతూ తప్పించుకొనేందుకు ప్రయతి్నంచారు. వారిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఓ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఇజ్రాయెల్ డ్రోన్లు గుర్తించాయి. దాంతో జవాన్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. యుద్ధట్యాంకుతో పేల్చివేశారు. ఈ ఘటనలో సిన్వర్ మరణించాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను కూడా సైన్యం అంతం చేసింది. అయితే, తొలుత చనిపోయిన వ్యక్తి సిన్వర్ అని ఇజ్రాయెల్ సైన్యానికి తెలియదు. అనుమానంతో మృతదేహం వేలిని కత్తిరించి, ఇజ్రాయెల్‌కు పంపించి డీఎన్ఏ టెస్టు చేశారు. సిన్వర్ డీఎన్ఏతో అది సరిగ్గా సరిపోయింది. దాంతో చనిపోయింది సిన్వర్ అని తేల్చారు. -
యుద్ధం రేపే ముగియవచ్చు.. ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఉగ్రవాద సంస్ధ హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యహ్యా సిన్వార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హమాస్ అగ్రనేతను ఎట్టకేలకు హతమార్చడంతో.. ఏడాది కాలంగా సదరు మిలిటెంట్ సంస్థతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ విజయం లభించినట్లైంది..యహ్య సిన్వార్ మృతి అనంతరం గాజా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలను వదిలి, బంధీలను విడిచిపెట్టినట్లైతే రేపటిలోగా యుద్ధం ముగుస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియో విడుదల చేశారు.చదవండి: ఇజ్రాయెల్ డ్రోన్ వీడియో.. హమాస్ సిన్వర్ ఆఖరి క్షణాలు ఇలాయహ్యా సిన్వార్ మరణించాడు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ధైర్య సైనికులు అన్ని రఫాలో మట్టుబెట్టారు. ఇది గాజాలో యుద్ధం ముగింపు కాదు. ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైంది. గాజా ప్రజలకు నాదొక చిన్న సందేశం.. హమాస్ తన ఆయుధాలను వదిలి ఇజ్రాయెల్ బందీలను తిరిగి అప్పగిస్తే ఈ యుద్ధం ముగియవచ్చు. మా పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తాం’ అని హెచ్చరించారు. కాగా హమాస్ మిలిటెంట్ సంస్థ అధినేత యహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందాని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని డీఎన్ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. Yahya Sinwar is dead.He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024 గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మారణకాండకు యహ్యా సిన్వర్నే మాస్టర్‌మైండ్. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. సుమారు 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ హతమార్చింది. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ ద్వారా ధ్రువీకరించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే దీనిపై హమాస్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
ఇజ్రాయెల్ డ్రోన్ వీడియో.. హమాస్ సిన్వర్ ఆఖరి క్షణాలు ఇలా..
జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ క్రమంలో చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలికలకు సంబంధించిన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన డ్రోన్.. సిన్వర్ కదలికలను వీడియో తీసింది.ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్న సమయంలో సిన్వర్ ఓ భవనంలో కూర్చుని ఉన్నాడు. బాంబు దాడుల తర్వాత భవనం పూర్తిగా శిథిలమైపోయింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో సిన్వర్ తుదిశ్వాస విడిచే ముందు ఓ కూర్చిలో అచేతనంగా కూర్చుండిపోయాడు. సిన్వర్ కూర్చుని ఉండగా.. ఇజ్రాయెల్ డ్రోన్ అతడి వద్దకు వెళ్లింది. దాన్ని గమనించిన అతడు ఓ కర్రలాంటి వస్తువును దానిపైకి విసిరినట్లుగా వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదిలా ఉండగా.. సిన్వర్ మృతిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా నెతన్యాహు మాట్లాడుతూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. ఇది అతిపెద్ద విజయంగా నేను భావిస్తున్నా. ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు. హమాస్ ఆయుధాలను వదిలి.. బందీలను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం రేపే ముగిస్తుంది. ఇజ్రాయెల్ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తామని హెచ్చరించారు.🇵🇸The final moments of the resistance leader Yahya Sinwar who fought bravely on the front lines, refusing to surrender even after sustaining severe injuries from heavy attacks. He continued to fight with honor until he was ultimately martyred defending his land and people. pic.twitter.com/4Bn4Jnprbo— Syria Truths (@TruthsSyria) October 18, 2024 ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ సిన్వర్ మృతి.. బైడెన్ స్పందన ఇదే.. -
హమాస్ చీఫ్ సిన్వర్ మృతి.. బైడెన్ స్పందన ఇదే..
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ క్రమంలో సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ఇది ఎంతో శుభసూచకం. సిన్వర్ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైంది అంటూ కామెంట్స్ చేశారు.ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్టోబరు 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో విదేశాంగమంత్రి కాంట్జ్ మాట్లాడుతూ.. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం ఇది. సిన్వర్ మృతిలో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది అని చెప్పుకొచ్చారు.Yahya Sinwar is dead.He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces. While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024మరోవైపు, సిన్వర్ మృతిపై జో బైడెన్ స్పందిస్తూ.. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభదినం. ఈ ఘటన హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధం ముగింపునకు దోహదపడుతుంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్, డీఎన్ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి హమాస్ నేత మరణాన్ని ధ్రువీకరించింది. గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 దాడుల సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. గతేడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్ దగ్గర 100 మంది బందీలు ఉన్నారు.ఇది కూడా చదవండి: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనాపై అరెస్ట్ వారెంట్ -
హమాస్ కు చావు దెబ్బ.. హమాస్ చీఫ్ సిన్వర్ హతం
-
హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): వరుసబెట్టి అగ్రనేతలకు కోల్పోతున్న హమాస్‌కు గురువారం మరో శరాఘాతం తగిలింది. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ తమ దాడుల్లో మృతి చెందాడని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందారని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని డీఎన్ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. సిన్వర్‌ను అంతమొందించామని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడికి సూత్రధారి సిన్వర్. ఈ దాడిలో 1,200 ఇజ్రాయెల్ దేశస్తులు చనిపోగా, 250 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. అప్పటినుంచి సిన్వర్.. ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా మారారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో అగ్రభాగాన ఉన్నారు. మిలటరీ వ్యూహకర్త సిన్వర్ మరణం హమాస్‌కు కోలుకోలేదని దెబ్బని చెప్పొచ్చు. అయితే సిన్వర్ మరణాన్ని హమాస్ ఇంకా ధ్రువీకరించలేదు. ఈ ఏడాది జూలైలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్ రాజధాని టెహరాన్‌లో ఇజ్రాయెల్ మట్టుబెట్టిన విషయం తెలిసిందే. హనియా మరణం తర్వాత సిన్వర్ హమాస్ పగ్గాలు చేపట్టారు. ‘సిన్వర్‌ను మట్టుబెట్టడం ఇజ్రాయెల్ సైనిక, నైతిక విజయమని విదేశాంగ మంత్రి కట్జ్ అభివరి్ణంచారు. కాగా గాజాలో జబాలియాలోని స్కూలులో నిర్వహిస్తునున్న శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 28 మంది మరణించారు. శరణార్థి శిబిరం నుంచి... యాహ్యా సిన్వర్ 1962లో గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో పుట్టారు. 1987లో హమాస్ ఏర్పడ్డప్పటి తొలినాటి సభ్యుల్లో ఒకరు. సంస్థ సాయుధ విభాగాన్ని చూసుకునేవారు. 1980ల్లోనే ఆయనను ఇజ్రాయెల్ అరెస్టు చేసింది. ఇద్దరు ఇజ్రాయెలీ సైనికులను హత్య చేసిన నేరంలో నాలుగు జీవిత ఖైదులు విధించింది. జైల్లో పరిస్థితుల మెరుగుదల కోసం ఉద్యమం లేవదీసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. 2011లో ఒక్క ఇజ్రాయెలీ సైనికునికి ప్రతిగా విడుదల చేసిన వేలాది మంది పాలస్తీనా ఖైదీల్లో భాగంగా విముక్తి పొందారు. గాజాకు తిరిగొచ్చి హమాస్ అగ్రనేతగా ఎదిగారు. ఏమాత్రం దయాదాక్షిణ్యాల్లేని తీరుతో ‘ఖాన్ యూసిస్ బుచర్’గా పేరుపొందారు. 2023 అక్టోబర్ 7న 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలను పొట్టన పెట్టుకున్న హమాస్ మెరుపుదాడి వెనక సంస్థ సాయుధ విభాగం చీఫ్ మొహమ్మద్ దెయిఫ్తో పాటు సిన్వర్ కీలకంగా వ్యవహరించారంటారు. -
గాజాలో మృతదేహాలను పిక్కుతింటున్న వీధికుక్కలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతుంది. హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ యుద్ధంతో ఏడాదికాలంగా నలుగుతున్న గాజాలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో పాలస్తీనియన్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అయితే తాజాగా గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన మృతదేహాలను వీధికుక్కలు పిక్కుతుంటున్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ఆకలితో ఉన్న వీధికుక్కలు ఈ మృతదేహాలను తింటున్నాయని, దీని ద్వారా మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారుతోందని గాజాలోని ఉత్తర భాగంలో అత్యవసర సేవల అధిపతి ఫేర్స్ అఫానా వెల్లడించారు. ఉత్తర గాజా, జబాలియా ప్రాంతంలో హమాస్ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరుగుపతున్న వైమానిక, భూతల దాడులను ప్రస్తావిస్తూ. ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనియన్ల జీవితాలను సూచించే ప్రతిదాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారుతోందని, తమ పనులు సవ్యంగా చేయలేకపోతున్నామని తెలిపారు. ఉత్తర గాజాలో జరుగుతున్నది నిజమైన మారణహోమమని ఆయన అన్నారు.కాగా గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ మెరుపు దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. Oఇజ్రాయెల్‌లోకి చొచ్చుకుపోయిన హమాస్ ఉగ్రవాదులు అక్కడ 1200 మందిని బలితీసుకున్నారు. ఈ ఘటన తర్వాత గాజాలో ఇజ్రాయెల్ సైనిక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా స్ట్రిప్‌లో ఇప్పటి వరకు 42,409 మంది మరణించారు. వీరిలో అత్యధికంగా పౌరులే ఉన్నారు. మరో 99,153 మంది గాయపడ్డారు.గత 24 గంటల్లో ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో 65 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్ ఏజెన్సీ నిర్వహిస్తున్న గిడ్డంగి సహాయ కేంద్రంలో ఆహారం కోసం వెతుకుతున్న ఆకలితో ఉన్న నివాసితులపై సోమవారం ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయని తెలిపింది. -
సానుభూతి నుంచి ఛీత్కారం దాకా...
ఒకప్పుడు ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతటికీ ఎంతో ఇష్టం. అత్యద్భుతమైన నిఘా వ్యవస్థ, మాజీ ప్రధానులను సైతం జైలులో పెట్టగల న్యాయవ్యవస్థ, సరదాగా మాటలకు ఉపక్రమించే ప్రజల తీరు వంటి లక్షణాలన్నింటినీ మెచ్చుకునేవారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి గురైనప్పుడు కూడా ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ సానుభూతి ఉండింది. ఎంతైనా ఉగ్రవాద బాధితురాలు అనుకున్నారు. అయితే ఆ జ్ఞాపకాలేవీ ఇప్పుడు లేవు. బదులుగా ఇజ్రాయెల్ చేపట్టిన మానవ హననమే అందరి కళ్లల్లో మెదులుతోంది. తమను హింసలకు గురిచేసిన హిట్లర్ మాదిరిగానే తామూ పాలస్తీనీయులను హింసలు పెడుతున్నామని అంగీకరించేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కాకపోతే ఇదే అద్దంతో మరేదో చూపేందుకు ఇజ్రాయెల్ తాపత్రయ పడుతోంది. బ్రిటన్ మాజీ ప్రధాని హరాల్డ్ మెక్‌మిలన్‌కు రాజకీయాల్లో వారం రోజులంటే చాలా ఎక్కువ సమయం! ఇదే విధంగా హమాస్‌తో నడుస్తున్న యుద్ధం విషయంలో ఇజ్రాయెలీలు కూడా ఒక యుగమైందని అనుకుంటున్నారు. ఈ ఏడాది సమయంలో ఇజ్రాయెలీల ప్రపంచం మొత్తం తల్లకిందులైంది. తమ సంబంధాలన్నీ వాళ్లు కోల్పోయారు.గత ఏడాది అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ చేసింది అత్యంత భయంకరమైంది, ఆటవికమైంది. అది క్షమించరాని నేరం. సుమారు 1,200 మంది ఇజ్రాయెలీల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న హమాస్ ఆ రోజు ఇంకో 250 మందిని బందీలుగా చేసుకుంది. ఇజ్రాయెల్ మొత్తం ఈ ఘటనతో వణికిపోయింది. ఇజ్రాయెల్ పట్ల ఆ రోజు కొంతైనా సానుభూతి వ్యక్తమైంది. ఎంతైనా ఉగ్రవాద బాధితురాలు కదా అని అనుకున్నారు. కానీ, ప్రతీకారం పేరుతో ఏడాది కాలంలో ఇజ్రాయెల్ దమనకాండను పరిశీలిస్తే, హమాస్ అకృత్యాలు కూడా పేలవమై నవిగా అనిపించక మానవు. ఆడవాళ్లు, పిల్లలతోపాటు 42 వేల మంది పాలస్తీనియులు ఇప్పటిదాకా చనిపోయారు. ఇంకో లక్ష మంది గాయ పడ్డారు. గాజాలో 23 లక్షల మంది జనాభాకు నిలువ నీడ లేకుండా పోయింది. ఎటు చూసిన విధ్వంసపు ఆనవాళ్లే. అందుకేనేమో... ఏడాది క్రితం వరకూ ఇజ్రాయెల్‌పై ఉన్న సానుభూతి కాస్తా ధిక్కారంగానూ, ఛీత్కారంగానూ మారిపోయింది. అందరి దృష్టిలో ఇజ్రాయెల్ ఇప్పుడు దురాక్రమణదారుగా మారిపోయింది!హమాస్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కంకణం కట్టుకున్నారు. దశాబ్దాల పాలస్తీనా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడం ద్వారా తమకు మేలు జరుగుతుందని ఆశించారు. అయితే హమాస్ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటు కోవడమే కాకుండా, సైద్ధాంతికంగా మరింత బలం పుంజుకుందని చెప్పాలి.ఇంకో ముఖ్యమైన విషయం... నెతన్యాహూ గాజాపై చేస్తున్న యుద్ధం కాస్తా పాలస్తీనా అంశాన్ని అంతర్జాతీయ వేదిక పైకి చాలా బలంగా చేర్చింది. ఐక్యరాజ్య సమితిలోనూ పాలస్తీనాకు న్యాయం జరగాలన్న నినాదాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... అగ్రరాజ్యం అమెరికా విశ్వవిద్యాలయాల్లోనూ ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమాలు, ప్రదర్శనలు జరగడం గమనార్హం. నెతన్యాహూ ఈ పరిణామాలను బహుశా ఊహించి ఉండరు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నడిచిన గత 365 రోజుల్లో ఇర్లాండ్, స్పెయిన్ , నార్వేలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి. సౌదీ అరేబియా ఇంకో అడుగు ముందుకేసి ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల కోసం పాలస్తీనా సమస్య పరిష్కారాన్ని ఒక నిబంధనగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నోట పాలస్తీనా ఏర్పాటు మాట వస్తూనే ఉంది.పాలస్తీనా, ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి ఇప్పుడు అందరూ సూచిస్తున్న మార్గం ఆ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా విడగొట్టడం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని అందరూ మరచిపోతున్నారు. ఎందుకంటే వెస్ట్‌బ్యాంక్‌లో సుమారు ఏడు లక్షల మంది ఇజ్రాయెలీ వలసదారులు ఉంటున్నారు. గాజాలో తను చెప్పినట్టు నడుచుకునే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు నెతన్యాహూ శతథా ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు పాల స్తీనా దేశం ఎక్కడ ఏర్పాటు అవుతుంది? ఏడాది క్రితం... కనీసం ఆరు నెలల క్రితం కూడా పాలస్తీనీ యులు దేశం మొత్తం తమదే అన్నట్టుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. యూదులకు ఇది అస్సలు అంగీకారం కాదు. కారణం ఒక్కటే. తాము యుగాలుగా ఆశిస్తున్న తమదైన మాతృదేశం తమకు లేకుండా పోతుందని!ఎంత విచిత్ర పరిస్థితి? పాలస్తీనాకు న్యాయం జరగాలని మొట్టమొదటిసారి ప్రపంచం మేల్కొన్న సమయంలో అసలు ఆ న్యాయం ఏమిటన్నది కూడా తెలియని పరిస్థితి. రాజకీయ ఆలోచన లకు అతీతంగా అంతా మారిపోయింది. మరో దృక్కోణం ఒకటి ఉంది. ఇది ఇజ్రాయెలీలకు అంతగా రుచించకపోవచ్చు. ఆశ్చర్యంగానూ అనిపించవచ్చు. ఏడాది క్రితం వరకూ తమ దేశం పట్ల ఇతరులకు ఉన్న దృక్పథం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే... ఆక్రమణదారుడైనప్పటికీ బాధితు డిగా తనను తాను చిత్రీకరించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది మరి!2023లో ప్రజాభిప్రాయం ఒకదాన్ని సేకరించే ముందు కాలంలో ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతటికీ ఎంతో ఇష్టం. అత్యద్భుతమైన నిఘా వ్యవస్థ, మాజీ ప్రధానులను సైతం జైలులో పెట్టగల న్యాయ వ్యవస్థ, సరదాగా మాటలకు ఉపక్రమించే ప్రజల తీరు వంటి లక్షణా లన్నింటినీ మెచ్చుకునేవారు. అయితే ఆ జ్ఞాపకాలేవీ ఇప్పుడు లేవు. బదులుగా ఇజ్రాయెల్ చేపట్టిన మానవ హననం మాత్రమే అందరి కళ్లల్లో మెదలుతోంది. ఒకప్పుడు అభినందించిన ప్రజలే ఇప్పుడు ఛీత్కరించే పరిస్థితి. ఇజ్రాయెలీలకు ఈ విషయాలు తెలియవా? రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల చేతిలో ఊచకోతకు గురైన వాళ్లే కదా! హిట్లర్ మాదిరిగానే తామూ పాలస్తీనీయులను నానా హింసలూ పెడు తున్నామన్న విషయాన్ని అంగీకరించేందుకు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కానీ వాస్తవమైతే అదే! కాకపోతే ఇదే అద్దంతో మరేదో చూపేందుకు ఇజ్రాయెల్ తాపత్రాయపడుతోంది. హమాస్ నేత ఇస్మాయెల్ హనియే, హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లాల నాటకీయ హత్యలు ఇజ్రాయెలీల నిఘా వ్యవస్థ చురుకు దనానికి నిదర్శనంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. కానీ గత ఏడాది అక్టోబరులో నిఘా విభాగం వాళ్లు సిగ్గుతో తలదించుకున్నారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ చేసిన రక్తపు మరక అంత తొందరగా చెరిగిపోయేది కాదు. మరచిపోయేది, క్షమించదగ్గది కూడా కాదు. ఇజ్రాయెల్‌ను ఓ భిన్న దేశంగా చూపింది ఈ యుద్ధం. ఈ విషయాన్ని ఇజ్రాయెలీలు ఎంతవరకూ అంగీకరిస్తారన్నది చూడా ల్సిన విషయం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆ రిపోర్ట్‌లో నిజం లేదు: ఇరాన్
టెహ్రాన్: గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసి.. సుమారు 250పైగా ఇజ్రాయెల్ పౌరులను గాజాకు బంధీలుగా తీసుకువెళ్లారు. అయితే.. ఇజ్రాయెల్‌పై దాడులకు ముందు హమాస్ బలగాలు ఇరాన్‌ను సంప్రదించారని ‘న్యూయార్క్ టైమ్స్’ మీడియా ఓ నివేదికను ప్రచురిచింది. దీనిపై తాజాగా ఇరాన్ స్పందించింది. ఆ నివేదికను ఇరాన్ తిరస్కరించింది. గతేడాది ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్లో టెహ్రాన్ పాత్ర లేదని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ఇరాన్ శాశ్వత మిషన్ స్పష్టం చేసింది.‘‘ఖతార్ రాజధాని దోహాలో ఉన్న హమాస్ అధికారులు ఇజ్రాయెల్‌పై దాడి ఆపరేషన్ గురించి తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. గాజాలో ఉన్న హమాస్ సైనిక విభాగం మాత్రమే ఆ దాడి ప్రణాళికను రచించుకున్నాయి. హమాస్ మమ్మల్ని ఇజ్రాయెల్‌పై వారు చేసే దాడికి కలిసి రావాలని సంప్రదించలేదు. అసలు దాడి చేసే సమాచారం కూడా మాకు ఇవ్వలేదు. ఆ దాడికి సంబంధించి ఇరాన్, హెజ్బొల్లాను లింక్ చేయడం సరికాదు. న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రచురించిన నివేదిక పూర్తిగా కల్పితం. అందులో ఎటువంటి నిజం లేదు’’ అని ఇరాన్ పేర్కొంది.అక్టోబర్ 7 తేదీ ఘటన తర్వాత తమ హమాస్ చెరలో బంధీలుగా ఉన్న పౌరులను విడిపించుకోవటంతో పాటు, ఆ గ్రూప్‌ను అంతం చేయాలనే లక్ష్యంతో గాజాగాపై ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. హమాస్ బలగాలే లక్ష్యంగా ఇజ్రయెల్ సైన్యం చేసిన భీకర దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 42,175 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.చదవండి: గురుడి చందమామ యూరోపా.. -
ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇద్దరు హెజ్బొల్లా కమాండర్లు హతం
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తాము చేసిన దాడుల్లో మరో ఇద్దరు హెజ్బొల్లా కమాండర్లు హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ప్రకటించింది. హూలా ఫ్రంట్ కమాండర్, వందలాది క్షిపణి దాడులకు కారణమైన అహ్మద్ ముస్తఫా అల్ హజ్ అలీ, ఉత్తర ఇజ్రాయెల్‌లోని మీస్ ఎల్ జబాల్ ప్రాంతంలో హెజ్బొల్లా యాంటీ-ట్యాంక్ యూనిట్‌కు కమాండర్‌గా వ్యవహరించిన మహ్మద్ అలీ హమ్దాన్లు తమ దాడుల్లో హతమైనట్లు ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. తమ దేశా పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించే హెజ్బొల్లా ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేవరకు తమ దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.🔴2 Hezbollah terrorists were eliminated in precise strikes:1. Ahmad Moustafa al-Haj Ali, commander of the Houla Front. Responsible for hundreds of missile and anti-tank missile attacks toward the Kiryat Shmona area. 2. Mohammad Ali Hamdan, commander of Hezbollah’s anti-tank… pic.twitter.com/0RX2mxgmbV— Israel Defense Forces (@IDF) October 10, 2024 గతేడాది అక్టోబర్ 7 తేదీన హామాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతరం.. ఇజ్రాయెల్ హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయితే.. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతున్న విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. -
హమాస్ చీఫ్ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్ మీడియా
టెల్అవీవ్: హమాస్ అధినేత యహ్యా సిన్వార్ బతికే ఉన్నట్లు ఖతర్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రచురించింది.సిన్వార్ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణ కవచంగా ఏర్పరుచుకున్నారని ఖతర్ అధికారులు చెప్పినట్లు కథనాల సారాంశం.సెప్టెంబర్ 21న గాజాలోని ఓ స్కూల్లో ఉన్న హమాస్ కమాండ్ సెంటర్ టార్గెట్‌గా పెద్దఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి.ఈ దాడుల్లో సిన్వార్ మృతిచెంది ఉంటారని ఇజ్రాయెల్ దళాలు భావించాయి.ఈ విషయంలో సిన్వార్ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.దీంతో అతడు మృతి చెంది ఉంటాడన్న వాదనకు బలం చేకూరింది. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపు దాడులకు సూత్రధారి సిన్వార్. హమాస్ చీఫ్‌గా ఉన్న హనియే మృతి తర్వాత ఈ ఏడాది ఆగస్టులో సిన్వార్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇరాన్ భూగర్భ అణు పరీక్షలు -
హమాస్‌పై యుద్ధం ముగిస్తాం: నెతన్యాహు
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసినటువంటి మెరుపు దాడి మళ్లీ జరగకుండా చూసేందుకు దేశంలో భద్రతను మారుస్తున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ బలగాలు మెరుపుదాడి చేసిన ఘటనకు నేటితో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆనాటి దాడి జరగకుండా చూస్తామని ప్రధాని నెతన్యాహు సోమవారం కేబినెట్ ప్రసంగంలో పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.‘‘మేము మా ప్రాంతంలో భద్రతా మారుస్తున్నాం. మా పిల్లల, భవిష్యత్తు కోసం. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జరిగినవి దాడి మళ్లీ ఇంకెప్పడూ జరగకుండా చూస్తాం. అందు కోసం దేశ భద్రతలో సైతం వాస్తవ మార్పులు తీసుకువస్తాం’’ అని అన్నారు.ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1200 మందికిపైగా అమాయకుల మృతికి ప్రత్యేక సంతాప సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్), భద్రతా సిబ్బంది , రెగ్యులర్, రిజర్వ్, ఆర్మీ , పోలీసు, మొస్సాద్లోని సైనిక యోధుల వీరత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మీరు నిర్వహిస్తున్న పనిని పూర్తి చేయాలని తెలిపారు. హమాస్ చేతిలో మిగిలిన బందీలను గాజా నుంచి విడిపించాలని కోరారు.‘‘మేము నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తి చేసినప్పుడే హమాస్‌పై యుద్ధాన్ని ముగిస్తాం. గాజా హమాస్ పాలనను పడగొడుతాం. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బంధీలను సురక్షితంగా తీసుకువస్తాం. గాజా నుంచి ఇజ్రాయెల్‌కు భవిష్యత్తులో వచ్చే ముప్పును అడ్డుకుంటాం’’ అని అన్నారు.చదవండి: ఏడు వైపులా శత్రువులతో పోరాడుతున్నాం -
హమాస్ దాడికి ఏడాది.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం
ఇజ్రాయెల్, గాజాలోని హమాస్ బలగాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. అయితే.. అక్టోబర్ 7వ తేదీకి హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో హమాస్ దాడి మొదటి వార్షికోత్సవానికి ఒకరోజు ముందు ఇవాళ (ఆదివారం) మరోసారి.. ఉత్తర గాజా నుంచి పలు రాకెట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.‘‘అనేక రాకెట్లు ఉత్తర గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించినట్లు గుర్తించాం. అందులో ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్ సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. మిగిలినవి రాకెట్లు జనావాసాలు లేని బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి’’ అని సైన్యం తెలిపింది. ఇక.. హమాస్ బలగాలు.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో తమ సైన్యం మరింత అప్రమత్తంగా ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది.🚨Sirens sounding along Israel’s coast🚨 pic.twitter.com/ebdBsj0vNT— Israel Defense Forces (@IDF) October 6, 2024 గతేడాది అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి తమ పౌరులను విడిచిపెట్టే వరకు హమాస్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ టార్గెట్ ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో 41, 900 మంది పాలస్తీనా పౌరులు మృత్యువాతపడ్డారు. -
మిస్టరీగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ కీలక నేతలను అంతం చేయాటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులను జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ మిస్టరీగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఆయన బతికే ఉన్నారా? లేరా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే యాహ్యా సిన్వార్‌కు సంబంధించి.. ఖతార్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం మొదటి నుంచి ఖతార్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గత వారం రోజులుగా సిన్వార్ తమకు టచ్‌లో లేరని ఖతార్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం.. తమతో ఆయన కమ్యూనికేషన్‌కు సంబంధించి కీలక విషయాలను వింటారనే భయంతో సిన్వార్ ప్రస్తుతం పెన్, పేపర్లతో మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనతో మధ్యవర్తిత్వ చర్చలకు జరపడానికి తమకు సవాల్‌గా మారిందని తెలిపారు. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు హమాస్ స్పందించలేదు.ఇక.. సిన్వార్ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణగా పెట్టుకొని ఉన్నారని ఇజ్రాయెల్ స్థానిక మీడియా ఓ నివేదిక ప్రచురించింది దీంతో హమాస్ చీఫ్ వైమానిక దాడిలో మరణించి ఉండవచ్చనే ఊహాగానాలకు తెరపడినట్లైంది. మరోవైపు.. కాల్పుల ఒప్పందానికి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడులతో హత్యల విధానాన్ని కొనసాగిస్తోందని ఖతార్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మాజీ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ అంతం చేసింది. ప్రస్తుతం హమాస్‌కు కీలకమైకన నేతగా ఖలీద్ మషాల్ ఉన్నారు. ఆయన హనియే కంటే చాలా బలవంతుడని ఖతార్ అధికారులు తెలిపారు.చదవండి: మీరెన్ని చెప్పినా.. ఇరాన్‌పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ ముఖ్యనేత హతం
బీరుట్:లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మిలిటెంట్ గ్రూపు హమాస్‌కు చెందిన కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. ఉత్తర లెబనాన్ ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల క్యాంపుపై ఇజ్రాయెల్ తాజాగా వైమానిక దాడులు జరిపింది.ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన అల్ ఖసమ్ బ్రిగేడ్ లో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందాడు. దాడుల్లో అతల్లాతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మీడియా ఈ విషయాలను వెల్లడించింది.ఇక,లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 2 వేల మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.ఇందులో 250 మంది హెజ్బొల్లాకు చెందినవారున్నారని కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. అంతకముందు ఇజ్రాయెల్ జరిపిన స్పెషల్ ఆపరేషన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మృతి చెందాడు. ఇదీ చదవండి: ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ట్రంప్ -
అటు డోమ్..ఇటు ఫతాహ్!
ప్రాచీన మత సంబంధ కట్టడాల్లోకి పాలస్తీనియన్లను అనుమతించకపోవడంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన యుద్ధం లెబనాన్ మీదుగా ఇప్పుడు ఇరాన్‌ను తాకింది. హమాస్, లెబనాన్ కంటే ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు ప్రధాన యుద్ధక్షేత్ర పోటీదారుగా నిలిచింది. ఫతాహ్–2 హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించి ఇరాన్.. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థల సమర్థతను ప్రశ్నార్థకం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌ల సైనికసత్తాపై మరోమారు చర్చ మొదలైంది. అనూహ్యంగా దూసుకొచ్చే శత్రు క్షిపణులను గాల్లోనే తుత్తునియలు చేసే గగనతల రక్షణ వ్యవస్థలకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. అలాంటి వ్యవస్థలనూ ఇరాన్‌కు చెందిన ఫతాహ్ క్షిపణులు చేధించుకుని రావడం రక్షణ రంగ నిపుణులనూ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ మొహరించిన భిన్న శ్రేణుల గగనతల రక్షణ వ్యవస్థలుసహా ఇరుదేశాల సైనికపాటవంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సైనిక బలగాల్లో ఇరాన్ పైచేయి ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ సైనికబలం పెద్దది. ఇరాన్లో 3,50,000 మంది ఆర్మీ, 1,90,000 ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, 18వేల మంది నేవీ, 37 వేల మంది వాయుసేన, 15వేల మంది ఎయిర్‌డిఫెన్స్ సైనికులున్నారు. మరో 3,50,000 మంది రిజర్వ్ బలగాలున్నారు. ఇజ్రాయెల్‌లో కేవలం 1,26,000 మంది ఆర్మీ, 9,500 మంది నేవీ, 34,000 మంది ఎయిర్‌ఫోర్స్, 4,65,000 మంది రిజర్వ్బలగాలున్నాయి. రక్షణ బడ్జెట్లో ఇజ్రాయెల్ ముందంజ ఇరాన్ 2023 ఏడాదిలో రక్షణ కోసం 10.3 బిలియన్ డాలర్లు ఖర్చుచేస్తే ఇజ్రాయెల్ గత ఏడాది ఏకంగా 27.5 బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. 2022తో పోలిస్తే ఈ బడ్జెట్ 24% అధికం కావడం విశేషం.పదాతిదళంలో ఇరాన్ మేటి 10,513 యుద్ధట్యాంకులు, 6798 శతఘ్నులు, 640 ఆయుధాల రవాణా వాహనాలు, 55 సైనిక హెలికాప్టర్లు ఇరాన్ సొంతం. ఇజ్రాయెల్ వద్ద 400 యుద్ధట్యాంకులు, 530 శతఘ్నులు, 1,190 ఆయుధాల రవాణా వాహనాలున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌లో ఇజ్రాయెల్ హవా ఇజ్రాయెల్ వద్ద అమెరికా తయారీ అత్యాధునిక ఎఫ్రకం జెట్ యుద్ధవిమానాలున్నాయి. మొత్తంగా 345 యుద్ధవిమానాలున్నాయి. 43 ఆర్మీ హెలికాప్టర్లున్నాయి. ఇరాన్ వద్ద 312 యుద్ధవిమానాలు, 23 ఆర్మీ విమానాలు, 57 హెలికాప్టర్లున్నాయి. ఇరాన్ వద్ద అధిక జలాంతర్గాములు ఇరాన్ వద్ద 17 జలాంతర్గాములు, 69 గస్తీ, నిఘా నౌకలు, 7 యుద్ధనౌకలు, 23 విమానవాహక నౌకలున్నాయి. ఇజ్రాయెల్ వద్ద కేవలం ఐదు జలాంతర్గాములు, 49 గస్తీ/యుద్ధ నౌకలున్నాయి. విభిన్న గగనతల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్‌లో మొత్తంగా 10 ఐరన్‌డోమ్ వ్యవస్థలున్నాయి. ఇవిగాక డేవిడ్స్ స్లింగ్, ఆరో సిస్టమ్స్ మొహరించాయి. ఇరాన్ వద్ద ‘పరారుణ’గుర్తింపు వ్యవస్థ ఉంది. వీటి సాయంతో ఎస్–200, ఎస్–300, దేశీయ 373 క్షిపణి వ్యవస్థలను ప్రయోగించి శత్రు క్షిపణులను నేలకూలుస్తుంది. ఇదిగాక ఎంఐఎం–23 హాక్, హెచ్‌క్యూ–2జే, కోర్డాడ్–15, చైనా తయారీ సీహెచ్–ఎస్ఏ–4, 9కే331 టోర్ ఎం1 క్షిపణులున్నాయి. అణ్వాయుధాలుఇజ్రాయెల్ వద్ద దాదాపు 90 దాకా అణ్వా్రస్తాలున్నాయి. అయితే ఇరాన్ వద్ద అణ్వయుధాలు ఉన్నాయో లేదో ఎవరికీ తెలీదు. కానీ అణ్వాయుధాల్లోని వార్‌హెడ్‌లో వాడే యురేనియంను మిలటరీ గ్రేడ్‌కు తెచ్చేందుకు ఆ మూలకం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వేగవంతంచేసింది. బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ వద్ద తాండార్ 69, ఖొరమ్షహర్, సెఝిల్ బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇజ్రాయెల్ వద్ద లోరా, జెరికో పేర్లతో 150 కి.మీ.ల నుంచి 6,500 కి.మీ.లు దూసుకుపోయే విభిన్న బాలిస్టిక్ క్షిపణులున్నాయి.ఐరన్ డోమ్ (స్వల్పశ్రేణి)పరిధి4 నుంచి 70 కి.మీ.ల ఎత్తుదాకా దూసుకొచ్చిన క్షిపణులను ఈ వ్యవస్థ కూల్చేస్తుంది. స్వల్పదూర రాకెట్లు, బాంబులను తమిర్ క్షిపణులుఅడ్డుకుంటాయి. ఏమేం ఉంటాయి? ఐరన్‌డోమ్ వ్యవస్థలో తమిర్ క్షిపణులు, లాంఛర్, రాడార్, కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి డేవిడ్స్ స్లింగ్ (మధ్య శ్రేణి)పరిధి40 నుంచి 300 కి.మీ.ల ఎత్తుదాకా దూసుకొచ్చిన స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, పెద్ద రాకెట్లు, క్రూయిజ్ మిస్సైళ్లను ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. ఏమేం ఉంటాయి? స్టన్నర్ ఇంటర్సెప్టార్ క్షిపణులు, నిట్టనిలువుగా ప్రయోగించే వేదిక, రాడార్, నియంత్రణ వ్యవస్థ ఇందులో ఉంటాయి ఆరో సిస్టమ్ (దీర్ఘ శ్రేణి)పరిధిఇజ్రాయెల్ నుంచి 2,400 కి.మీ.ల దూరంలో ఉండగానే శత్రువులకు చెందిన మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. ఏమేం ఉంటాయి? తక్కువ ఎత్తులో సమాంతరంగా వస్తే ఆరో–2 మిస్సైళ్లు, ఎక్కువ ఎత్తులో వస్తే ఆరో–3 మిస్సైళ్లు అడ్డుకుంటాయి. లాంఛర్, కంట్రోల్ సెంటర్ ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ సర్జికల్ స్ట్రైక్.. హమాస్ గాజా చీఫ్ ఖతం
తమ శత్రువులను మట్టుబెట్టడమే లక్ష్యంగా హమాస్, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్లను అంతమొందించడమే టార్గెట్‌గా వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న నిరంతర దాడులతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానికి దాడుల్లో గాజాలోని హమాస్ ప్రభుత్వాధినేత రావి ముష్తాహా మరణించాడు. ఆయనతోపాటు మరో ఇద్దరు హమాస్ కమాండర్లు సయేహ్ సిరాజ్ సమేహ్ ఔదేహ్ మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. కానీ, కొన్ని నెలల క్రితమే తాము జరిపిన దాడుల్లో వారు చనిపోయినట్లు వెల్లడించింది. ‘సుమారు 3 నెలల క్రితం ఉత్తర గాజాలోని ఒక భూగర్భ సొరంగంపై ఐడీఎఫ్, ఐఎస్ఏ సంయుక్తంగా జరిపిన దాడిలో ముగ్గురు హమాస్ టాప్ కమాండర్లు మరణించారు. గాజాలోని హమాస్ ప్రభుత్వ అధిపతి రౌహి ముష్తాహా, హమాస్ పొలిటికల్ బ్యూరో, హమాస్ లేబర్ కమిటీ నాయకుడు ససయేహ్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ మెకానిజం కమాండర్‌సమేహ్ ఔదేహ్ చనిపోయారు’ అని ఐడీఎఫ్ తమ ఎక్స్ పేర్కొంది. అయితే హమాస్ మాత్రం ఇజ్రాయెల్ ప్రకటనను ధృవీకరించలేదు. -
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్.. ఏ దేశం ఎటువైపు!
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లటంతో గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌కు మద్దతుగా ఉండే లెబనాన్ దేశంలోని హెజ్బొల్లా గ్రూప్, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో ఈ యుద్ధం కాస్త.. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ దేశాలకు విస్తరించింది. ఇక.. మంగళవారం ఇరాన్.. ఇజ్రాయెల్‌పై చేసిన భీకర మిసైల్స్ దాడితో ఒక్కసారిగా పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.ఇజ్రాయెల్, ఇరాన్ మిత్రదేశాల మధ్య ఇటీవల కాలంలో దాడుల తీవ్రత విస్తరిస్తూ వస్తోంది. ఇలాగే కొనసాగితే.. ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యుద్ధ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌తో మెరుపు దాడిని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరాన్‌కు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్, సిరియన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణకు దాని మిత్రదేశాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్), అరబ్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ మద్దతుగా నిలిచి సహాయం అందించాయి.అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నాయనే చర్చ జరుగుతోంది.ఇజ్రాయెల్మిత్ర దేశం అమెరికా సాయం, ఐరన్ డోమ్ రక్షణతో ఇజ్రాయెల్ అక్టోబరు 2023 నుంచి గాజా స్ట్రిప్‌లోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. ఇరాన్, ఇరాన్ మద్దతు మిలిటెంట్ గ్రూప్‌లను దాడులకు ప్రతిదాడులతో హెచ్చరిస్తూ.. గాజాలో హమాస్‌ను తుడిచిపెట్టేవరకు తమ దాడులను ఆపబోమని తేల్చిచెబుతోంది.ఇజ్రాయెల్ మిత్రదేశాలు: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్, సౌదీ అరేబియాప్రత్యర్థులు: హౌతీలు, హమాస్, ఇరాన్, హెజ్బొల్లాఇరాన్గతంలో ప్రాక్సీ మిటిటెంట్ల గ్రూప్‌ల ద్వారా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ఎక్కువగా దాడి చేసింది. అనూహ్యంగా ఇటీవల ఏప్రిల్‌లో, మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్పకై ప్రత్యక్ష దాడులను ప్రారంభించింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య , టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1(మంగళవారం) ఇజ్రాయెల్‌పై 200లకుపైగా మిసైల్స్‌తో భీకర దాడులు చేసింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలు భాగంగా ఇజ్రాయెల్‌పై 17 డ్రోన్లు, 120 బాలిస్టిక్ క్షిపణులను మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ కూడా క్రమంగా ఇజ్రాయెల్‌ను ఇరుకున పెట్టేందుకు పశ్చిమాసియా ప్రాంతంతో తన మిత్రదేశాలను సాయాన్ని మరింతగా సమీకరించుకుంటోంది.ఇరాన్ మిత్రపక్షాలు: యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, హమాస్ప్రత్యర్థులు: ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియాసౌదీ అరేబియాఇజ్రాయెల్తో దృఢమైన భద్రతా సంబంధాలను కలిగి ఉంది. కానీ దౌత్యపరంగా మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక వైపు ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు పంపిన దేశాలలో సౌదీ అరెబీయా ఒకటి.ఖతార్ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ, ఖతార్ హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్కు ఆశ్రయం ఇచ్చింది. అదేవిధంగా ఇరాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉంది. ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు చాలా ఇష్టం లేకపోవటం గమనార్హం.జోర్డాన్ఈ ఏడాది జనవరిలో దేశంలోని అమెరికా ఆర్మీ స్థావరంపై ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు దాడి చేసి ముగ్గురు సైనికులను అంతం చేశారు. అనంతరం జోర్డాన్ కూడా తీవ్ర సంఘర్షణలో చిక్కుకుంది. జోర్డాన్ గాజాకు సహాయాన్ని పంపినప్పటికీ.. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను కూడా కొనసాగించింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. చిన్నపిల్లల కొట్లాటలా ఉంది: ట్రంప్
ఇజ్రాయెల్- ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. హమాస్, హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకుంటోంది. శత్రుదేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా నిఘా విభాగం హెచ్చరికలను నిజం చేస్తూ మంగళవారం రాత్రి పెద్దపెట్టున వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది.ఇరాన్- ఇజ్రాయెల్‌ల యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరుదేశాల మధ్య సాగుతోన్న భీకర దాడులు ఇద్దరు చిన్నపిల్లల మధ్య కొట్లాటలా ఉందని అభివర్ణించారు. ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరన్ జరిపిన రాకెట్ దాడి వంటి ఘటనలు భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో జరిగే సంఘటనలపై అమెరికా మరింత లోతుగా జోక్యం చేసుకుంటుందని వెల్లడించారు.‘ఇది నిజంగా చెడు విషయం. కానీ, వారు ఆ యుద్ధ ప్రక్రియను పూర్తిచేయాలి. పాఠశాల ప్రాంగణంలోఇద్దరు చిన్నారులు కొట్లాడుకుంటున్నట్లు ఉంది. కొన్నిసార్లు ఏం జరుగుతుందో వదిలేయాలి. ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. ఇది భయంకరమైన యుద్ధం. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇది ఎక్కడ ఆగుతుందో మీకు తెలుసా? ఇజ్రాయెల్ దళాలు 200 రాకెట్లను కూల్చేశారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. ప్రతిఒక్కరూ జీవించాలి. కాబట్టి ఈ అంశంపై అమెరికా మరింత దృష్టిపెట్టాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్అయితే ఇరాన్ దాడుల అనంతరం ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లపై విమర్శలు గుప్పించారు. వారు ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థికసాయం అందిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉందని పేర్కొన్నరు. తాను చాలాకాలంగా మూడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావిస్తున్నానని, తన అంచనాలు ఎప్పుడూ నిజమవుతాయని ఈసందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మధ్యప్రాచ్యంలో ఎటువంటి యుద్ధాలు జరగలేదన్నారు.కాగా హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యతో పాటు ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 200 క్షిపణుల్ని ప్రయోగించింది. అయితే వీటిలో చాలావాటిని అమెరికా మిలటరీ సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి. -
పేజర్ దాడులు నిజంగా ఇజ్రాయెల్ పనేనా?
లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడులతో సాధారణ పౌరులు కూడా మరణిస్తున్నారని లెబనాన్ ఆరోపిస్తోంది. అయితే.. ప్రస్తుతకాలంలో ప్రపంచంలోని మరేయితర దేశం ఎదుర్కొనంత యుద్ధ సంక్షోభం తాము ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది. ఒకవైపు హమాస్.. మరోవైపు హెజ్బొల్లా దాడులతో క్లిష్టమైన పరిస్థితుల్లో తాము ఉన్నట్లు చెబుతోంది. అదే సమయంలో.. ప్రత్యర్థులపై చేస్తున్న జరుగుతున్న ‘మిస్టరీ దాడుల్ని’ తోసిపుచ్చకపోవడం గమనార్హం!!. అయితే.. భారత్‌లో ఆ దేశ రాయబారి రూవెన్ అజార్ ఓ జాతీయ మీడియా ఛానెల్ డిబేట్లో పాల్గొన్నారు. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లకు సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఇది ఇజ్రాయెల్, దాని నిఘా సంస్థల పనేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా అని యాంకర్ అడిగింది. దానికి ఆయన స్పందిస్తూ..‘‘గతంలో సైన్యాల మీదనో, ఉగ్రవాదం మీదనో దాడులు జరిగేవి. ప్రస్తుతం యుద్ధం అనేది సంప్రదాయ పద్ధతుల నుంచి హైబ్రీడ్ పద్ధతికి మారిపోయింది. ఈ కాలంలో ఇజ్రాయెల్ ఎదుర్కొన్నంత దాడులు మరేయితర దేశం ఎదుర్కొలేదు. రాకెట్లు, మిస్సైల్స్ మాత్రమే కాదు.. మా దేశంపై సైబర్ దాడులు కూడా జరిగాయి. నింగి, నేల, జల మార్గం ఆఖరికి టన్నెల్స్ ద్వారా కూడా మాపై దాడులు జరిగాయి... ఇలాంటి పరిస్థితుల్లో.. ఇజ్రాయెల్ కేవలం తనను తాను రక్షించుకోవడం మీద మాత్రమే ఫోకస్ చేయడం లేదు. అదే టైంలో తన దాడులతో శత్రు దేశాలకు ‘సర్ప్రైజ్’ చేయాలనుకుంటోంది కూడా. ఇజ్రాయెల్ ఇప్పుడు ఏ తరహా దాడులు చేస్తుందో.. అనే అంశం లోతుల్లోకి నేను వెళ్లాలనుకోవడం లేదు. కానీ, ప్రత్యర్థులు దొడ్డిదారిన దాడులకు తెగబడినప్పుడు వాళ్లకు అదే రీతిలో బదులివ్వడం తప్పేం కాదు కదా’’ అని రూవెన్ వ్యాఖ్యానించారు.ఇదే ఇంటర్వ్యూలో ఆయన.. తాజా యుద్ధ పరిణామాలతో పాటు అమెరికా, భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు దక్కిన మద్ధతు, తాజా అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, పాలస్తీనా అధ్యక్షుడు ముహమ్మద్ అబ్బాస్‌తో భేటీ కావడం లాంటి అంశాలపైనా స్పందించారు. లెబనాన్‌లో సెప్టెంబర్ 17-18 తేదీల మధ్య పేజర్లు, ఆ మరుసటి రోజే వాకీటాకీలు.. ఇతర శాటిలైట్ డివైజ్‌లు పేలిపోయి 37 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. ఇవి హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్.. దాని నిఘా సంస్థ మోస్సాద్ జరిపిన దాడులేనని లెబనాన్ ఆరోపిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: మెరుపు దాడి.. హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ -
ఇజ్రాయెల్ విధ్వంసం.. హమాస్ చీఫ్ మృతి!
హమాస్‌ను ఇజ్రాయెల్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే హమాస్‌కు చెందిన పలువురు కీలక నేతలను ఇజ్రాయెల్ హత మార్చింది. ఇక, తాజాగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ కూడా మరణించినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి.గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహకర్త అయిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో హమాస్ సొరంగాల వ్యవస్థపై భీకర దాడులు చేసింది. సొరంగాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి హమాన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. అయితే, ఈ సొరంగాల్లో సిన్వార్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. Israel claims to have killed Yahya Sinwar in the Gaza StripBut nothing has been confirmed yet, as soon as it is confirmed, we will inform you pic.twitter.com/5xWYZpWJ69— Mustafa Gujjar (@MGujjar94) September 22, 2024అయితే, ఈ మధ్య కాలంలో అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా బలగాలు సిన్వార్ చనిపోయినట్టు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఐడీఎఫ్ కూడా అతడు గాయపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కొని ఉంటున్నాడా అని నిర్ధారించుకోలేకపోతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా ఒకవేళ సిన్వార్ చనిపోయినా.. ఇప్పటివరకు బలపర్చే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు. ఏదేమైనా.. ఇజ్రాయెల్ చెబుతున్నట్టు ఒకవేళ సిన్వార్ కనుక మరణించి ఉంటే మాత్రం హమాస్‌కు కోలుకులేని దెబ్బ తగలినట్టే అవుతుంది.Spotted: Yahya Sinwar running away and hiding in his underground terrorist tunnel network as Gazan civilians suffer above ground under the rule of Hamas terrorism. There is no tunnel deep enough for him to hide in. pic.twitter.com/KLjisBFq1f— Israel Defense Forces (@IDF) February 13, 2024 #Breaking Reports that Israel is investigating whether Hamas chief Yahya Sinwar was killed in IDF strikes in Gaza. There is no clear intelligence to support the claim. Discussions are taking place as to whether Sinwar's communications have been cut off or he has been ki||ed. pic.twitter.com/Jkif0b9HmH— GLOBAL BREAKING NEWS (@tararnews) September 23, 2024ఇది కూడా చదవండి: ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఆధారాలుండవ్.. అంతా సినీ ఫక్కీలోనే!
హీరో/విలన్.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. శాటిలైట్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా రిమోట్ బటన్ నొక్కి.. తాను అనుకున్న వ్యక్తిని మట్టుపెడతాడు. హాలీవుడ్లో జేమ్స్ బాండ్ చిత్రాల్లోనే కాదు.. మన దగ్గరా ‘జై చిరంజీవ’లో ఈ తరహా సీన్ ఒకటి ఉంటుంది. అతిశయోక్తిగా అనిపించినప్పటికీ.. వాస్తవ ప్రపంచంలోనూ సినిమాలను తలదన్నే అలాంటి ఘటనలే ఇప్పుడు మనం చూడాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ గూఢచర్య సామర్థ్యం తెలుసు కాబట్టే.. కమ్యూనికేషన్ వ్యవస్థలో చాలావరకు పరిమితులను పెట్టుకుంటున్నాయి చుట్టుపక్కల ప్రత్యర్థి దేశాలు. అయినా కూడా దాడులు ఆగడం లేదా?. నిన్న పేజర్లు.. నేడు వాకీటాకీలు, ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ గాడ్జెట్లు. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది. అటు డివైజ్ కంపెనీలేమో.. ఆ పేలుళ్లకు తమకు సంబంధం లేదంటున్నాయి. ఈ ఆరోపణలు ఇలా ఉండగానే.. గతంలో ఇజ్రాయెల్ తమ చేతులకు మట్టి అంటకుండా జరిపిన కొన్ని దాడుల గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది.నెక్ పాయిజన్1997 హమాస్ వరుస ఆత్మాహుతి దాడులు ఇజ్రాయెల్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పుడే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బెంజమిన్ నెతన్యాహూ.. వీటికి చెక్ పెట్టాలనుకున్నారు. ఇందులో భాగంగా.. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఖలేద్ మెషాల్‌ను హత్య చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. మారు వేషంలో ఇద్దరు మోసాద్ ఏజెంట్లు.. మెషాల్ మెడ భాగం నుంచి పాయిజన్ పంపించేందుకు యత్నించారు. అయితే సకాలంలో ఆయన భద్రతా సిబ్బంది ఆ యత్నాన్ని గుర్తించారు. జోర్డాన్ పోలీసులు ఆ ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకోగా, మెషాల్‌కు విరుగుడు ఇచ్చాకే అక్కడి నుంచి తరలించారు.ఫోన్‌కాల్‌తో.. ఇజ్రాయెల్ మరో దర్యాప్తు సంస్థ.. షిన్‌బెట్ 1996 గాజాలో హమాస్ మాస్టర్ బాంబ్ మేకర్ యాహ్యా అయ్యాష్‌ను సెల్‌ఫోన్ బాంబ్‌తో చంపింది. తన తండ్రిలో ఫోన్లో మాట్లాడుతున్న ఒక్కసారిగా ఫోన్ పేలిపోయి తలకు గాయమై అయ్యాష్ చనిపోయాడు. రిమోట్ ద్వారా సెల్ఫోన్లో అప్పటికే అమర్చిన పేలుడు పదార్థాల ద్వారా మట్టు పెట్టగలిగారు.ఫేక్ టూరిస్ట్లుహమాస్కు ఆయుధాలు సరఫరా చేసే అంతర్జాతీయ వెపన్ డీలర్ మహమౌద్ అల్ మబౌ 2010లో దుబాయ్‌లోని ఓ హోటల్లో అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. ఎమిరేట్స్ అధికారులు తొలుత అది సహజ మరణంగానే ప్రకటించి కేసు మూసేశారు. అయితే.. హమాస్ అనుమానాలు లేవనెత్తడంతో కేసును రీ ఓపెన్ చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. టూరిస్టుల పేరిట ఫేక్ పాస్ట్‌పోర్టులు తయారు చేయించుకుని మోస్సాద్ ఏజెంట్స్ ఆ హోటల్లో దిగినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిర్ధారణకు వచ్చారు. ఇక.. మబౌహ్ శవపరీక్షలో విషప్రయోగం జరిగినట్లు తేలింది.ట్రాఫిక్ బ్లాస్ట్2010-20 మధ్య ఇరాన్ అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. చాలావరకు సిగ్నల్స్లోనే జరగడం గమనార్హం. వాహనాలు ఆగి ఉన్న టైంలో పక్కనే మరో వాహనంతో వచ్చి కాల్పులు జరపడం లేదంటే పేలుడు జరపడం లాంటివి చేశారు. ఇవి.. ఇజ్రాయెల్ దాడులేనని ఇరాన్ బహిరంగంగానే ఆరోపణలు చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం అది తమ పని కాదు.. బహుశా తమ ఏజెంట్లకు ఇరాన్ మధ్య జరిగే షాడో వార్ అయి ఉండొచ్చని వ్యాఖ్యానించింది.AI సాయంతో జరిగిన తొలి హత్య!ఇరాన్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ సైన్స్ మోహ్సెన్ ఫక్రిజదెహ్ మమబది హత్య. టెక్నాలజీకి కాసుల వర్షం కురిపిస్తున్న ఏఐ లాంటి టెక్నాలజీ సాయంతో ఈ హత్య చేయించారనే కథనాలు.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. 2020 నవంబర్ 27న భార్యతో కలిసి విహారయాత్రను ముగించుకుని.. ఎస్కార్ట్ నడుమ ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఆటానమస్ శాటిలైట్ ఆపరేటెడ్ గన్ సాయంతో ఆయన్ని హత్య చేశారు. మెహ్‌సెన్ భార్యకిగానీ, భద్రతా సిబ్బంది ఎవరికీగానీ చిన్నగాయం కూడా కాలేదు. పూర్తిగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఉపయోగించి.. చుట్టుపక్కల ఎవరికీ ఏం కాకుండా ఈ హత్యకుట్రను అమలు చేయడం విశేషం. ప్రపంచంలో ఈ తరహాలో హత్యకు గురైన మొదటి వ్యక్తి మోహ్సెన్. టన్ను బరువుండే బెల్జియం ఆధారిత ఎఫ్ఎన్ ఏంఏజీ మెషిన్ గన్ను దాడికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఎక్కడో బయటి దేశం నుంచి కంప్యూటర్ ఆపరేటింగ్ ద్వారా శాటిలైట్ లింక్ సాయంతో మోహ్సెన్ మీద కాల్పులు జరిపారు. కారు వేగం.. కదలికలను సైతం నిశితంగా పరిశీలించిన ఆ ఏఐ బేస్డ్ గన్.. అరవై సెకన్లలో 15 బుల్లెట్లు పేల్చింది. చివరికి టార్గెట్‌ను పూర్తి చేశారు. అంతా అనుకున్నట్లు ఇది ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కాదు. అమెరికా-ఇజ్రాయెల్ కుమ్మక్కై ఆయన్ని మట్టుపెట్టాయని ఈ కథనాల సారాంశం. గూఢాచర్యంలో కొత్త ఒరవడిని సృష్టించింది ఈ దాడి అని ఆ కథనాలు పేర్కొన్నాయి. -
యుద్ధానికి ముగింపు పలకాలి
ఫిలడెల్ఫియా: గాజా స్ట్రిప్‌లో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ ఇకనైనా మారణహోమం ఆపాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ సాయుధుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందమే గాజా్రస్టిప్ సమస్యకు అసలైన పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. గాజాలోని ప్రతి ఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కాల్పుల విరమణకు ఇరు పక్షాలు ముందుకు రావాలని ఆమె అభిలషించారు. ఫిలడెలి్ఫయాలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ (ఎన్ఏబీజే)సమావేశంలో కమల పాల్గొని ప్రసంగించారు. దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో బదులిచ్చారు. హైతీలు ఇంటి పెంపుడు జంతువులను తింటున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను, వలసదారులను సామూహిక బహిష్కరణ చేస్తామని ట్రంప్ ఇచి్చన హామీని హారిస్ తప్పుబట్టారు. ‘ట్రంప్ ద్వేషపూరిత వ్యాఖ్యలు హానికరం. ఇలాంటి వాటిని సహించకూడదు’అని అన్నారు. ఆర్థిక అంశాలపైనా ఆమె విస్తృతంగా మాట్లాడారు. ‘‘అమెరికన్లను ప్రభావితం చేసే పెద్ద సమస్యలలో సరిపడా గృహాలు లేకపోవడం కూడా ఒకటి. నేనుఅధ్యక్షురాలిగా ఎన్నికైతే గృహాల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తా. చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 6,000 డాలర్లకు విస్తరిస్తాం. దీంతో అమెరికన్లు తమ ఆదాయంలో ఏడు శాతం కంటే ఎక్కువ మొత్తాలను పిల్లల సంరక్షణకు చెల్లించాల్సిన అవసరం లేదు’’అని కమల వ్యాఖ్యానించారు. కమలకు నల్లజాతీయుల బాసట 2020 అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయుల్లో ఏకంగా 92 శాతం మంది అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు పలికారు. రిపబ్లికన్ పార్టీ తరఫున నాటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు కేవలం 8 శాతం మంది నల్లజాతీయులే మద్దతు పలికారు. ఈ సారిసైతం అదే సరళి కనిపిస్తోంది ఎన్ఏఏసీపీ సర్వే తేలి్చంది. ఇటీవల విడుదలైన ఎన్ఏఏసీపీ సర్వే ప్రకారం 63 శాతం మంది నల్లజాతి ఓటర్లు కమలా హారిస్‌కు మద్దతు పలికారు. గతంతో పోలిస్తే డెమొక్రటిక్ పార్టీ నుంచి నల్లజాతీయులు కాస్తంత దూరం జరిగారని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ నల్లజాతీయుల మెజారిటీ మద్దతు కమలకే దక్కడం విశేషం. ఈసారీ పోటీలో నిలిచిన ట్రంప్‌కు కేవలం 13 శాతం మంది నల్లజాతీయులు మద్దతుగా నిలబడినట్లు సర్వే వెల్లడించింది. పెన్సిల్వేనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో నల్లజాతీయుల మద్దతు నిర్ణయాత్మకంగా ఉంటుంది. పెన్సిల్వేనియా అత్యంత కీలకమైన రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం ఎన్ఏబీజేకు ఉందని చెబుతారు. దీంతో వీరిని ఎలాగైనా తమ వైపునకు తిప్పుకోవాలని కమలా హారిస్, ట్రంప్ ఇద్దరూ చెమటోడుస్తున్నారు. అయితే గతంలో ట్రంప్ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యల కారణంగా ఇప్పటికీ నల్లజాతీయుల మద్దతు కూడగట్టడం ఆయనకు సంక్లిష్టంగా తయారైంది. జార్జియాలో మూడు వంతుల మంది నల్లజాతీయులే కావడంతో ఇక్కడా వారి ఓటు నిర్ణయాత్మకంగా మారింది. -
గాజా యుద్ధం కొనసాగిస్తాం
గాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టపోయినా తమ పోరాటం కొనసాగిస్తామని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమకు తగినంత వనరులు ఉన్నాయని హమాస్ సీనియర్ నేత ఇస్తాంబుల్‌లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘‘ గాజాలో 11 నెలలకు పైగా యుద్ధం జరగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నష్టపోయినప్పటికీ మా పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటానికి మా వద్ద తగినంత వనరులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఘటన దాడులు కొనసాగించడానికి మేము అధిక సామర్థ్యాన్ని కలిగిఉన్నాం. అమరవీరులు ఉన్నారు, వారి త్యాగాలు ఉన్నాయి. ప్రతిఘటనలో కొత్త తరాలను చేర్చుకోవడం జరుగుతోంది. ఈ యుద్ధంలో మేము ఊహించిన దానికంటే.. ప్రాణనష్టం, యుద్ధ విస్తరణ తక్కువగానే జరిగింది’ అని అన్నారు.ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ‘11 నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ హమాస్ నేత స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.చదవండి: హమాస్ మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగదు: ఇజ్రాయెల్ -
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
టెల్అవీవ్: ఇజ్రాయెల్‌కు పీడకలగా మిగిలిన గతేడాది హమాస్ దాడులకు బాధ్యత వహిస్తూ ఆ దేశ ఇంటెలిజెన్స్ గ్రూప్ యూనిట్ 8200 చీఫ్ యాస్సి సారిల్ రాజీనామా చేశారు. హమాస్ చేసిన దాడులను అడ్డుకోవడంలో విఫలమైనందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సారిల్ వెల్లడించారు. హమాస్ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటికే ఇజ్రాయెల్ మిలిటరీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహరోన్ హలీవా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగారు. ఈ దాడుల్లో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతిగా హమాస్‌కు కేంద్రంగా ఉన్న పాలస్తానాలోని గాజాపై గతేడాది నుంచి ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో ఇప్పటివరకు 41వేల118 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాడుల్లో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలేనని వెల్లడించింది. ఇదీ చదవండి.. మోదీ గొప్ప స్నేహితుడు: పుతిన్ -
పాత షరతులైతే.. కాల్పుల విరమణకు సిద్ధమే: హమాస్
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాతున్న వేళ.. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ కాల్పుల విరమణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త షరతులేవీ లేకుంటే.. గతంలో అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమేనని పేర్కొంది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పులు విరమణ కోసం ముందు నుంచి అమెరికా, ఖతార్, ఈజిప్టు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ తాని, ఈజిప్టు ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కమెల్ హమాస్ నేతలతో దోహాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇతర కొత్త షరతులు లేకుంటే గతంలో అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ సీనియర్ అధికారి ఖలీల్ అల్ హయ్యా వెల్లడించారు.ఇదీ చదవండి: బైడెన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న హమాస్ -
ప్రాణం... పణం అక్షర సమరం
ప్రమాదపు అంచున పనిచేసిన, ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధవార్తలను రిపోర్ట్ చేసిన సాహసికులైన ఎంతోమంది జర్నలిస్ట్‌ల గురించి తెలుసుకుందిపాలస్తీనా అమ్మాయి ప్లెస్తియ. వారి గురించి విన్నప్పుడల్లా....‘ఎంత కష్టం. ఎంత సాహసం!’ అనుకునేది.ఆ కష్టం, సాహసం తన స్వీయానుభవంలోకి రావడానికి ఎంతోకాలం పట్టలేదు.జర్నలిజంలో పట్టా పుచ్చుకున్న తరువాత హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ఆమెని ఆహ్వానించింది.హమాస్–ఇజ్రాయెల్ వార్‌ను రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్‌గా ప్రపంచానికి పరిచితం అయిన ప్లెస్తియ యుద్ధభూమిలో కత్తి అంచున నడక అంటే ఏమిటో తెలుసుకుంది. యుద్ధ బీభత్సాన్ని దగ్గరి నుంచి చూసింది. తాజాగా...‘అలాకాద్ అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరుట్’లో మీడియా స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి లెబనాన్‌కు వెళ్లింది. దాంతో ప్రముఖ జర్నలిస్ట్ కాస్తా మళ్లీ విద్యార్థిగా మారింది.‘యుద్ధకాలంలో భావోద్వేగాలకు అవకాశం లేదు. ఏడ్వడానికి కూడా టైమ్ దొరకనంతగా ఉరుకులు పరుగులు. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధం ఆగి΄ోతుందని మనసులో చిన్న ఆశ. అంతలోనే మరో పెద్ద విషాదాన్ని రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. పూర్తిగా నష్ట΄ోయాం. ఇంతకంటే ఎక్కువగా నష్ట΄ోయేది ఏమిటి అనిపించేది కొన్నిసార్లు’ గతాన్ని గుర్తు చేసుకుంది ప్లెస్తియ.గాజాలో యుద్ధవార్తలు కవర్ చేస్తున్న రోజుల్లో ప్లెస్తియకు నిద్రపోవడానికి కూడా టైమ్ దొరికేది కాదు. తిండి సరిగా ఉండేది కాదు. పెట్రోల్ కొరత వల్ల మీడియా వాహనం ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడం కష్టంగా ఉండేది. కొన్నిసార్లు టీమ్‌తో సంబంధాలు తెగిపోయేవి. కరెంట్ కష్టాలు, ఫోన్ కష్టాలు సరే సరి.‘ఈ రోజు సరే, రేపు బతికి ఉంటానా అని ఎప్పటికప్పుడు అనుకునేదాన్ని’ అంటూ గత రోజులను గుర్తు చేసుకుంది ప్లెస్తియ. వార్తలను కవర్ చేసేందుకు మొదట్లో మెడలో ఐడీ ట్యాగ్ వేసుకునేది. ప్రెస్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించేది. అయితే వీటివల్లే ఎక్కువ ప్రమాదం ఉందని గ్రహించి వాటికి దూరంగా ఉంది.‘ఈ రోజు ఏం కవర్ చేయాలి...అని ఎప్పుడూ ΄్లాన్ చేసుకోలేదు. కొన్నిసార్లు స్టోరీ కోసం వెదికేదాన్ని. మరికొన్ని సార్లు స్టోరీ నన్ను వెదుక్కుంటూ వచ్చేది’ అంటున్న ప్లెస్తియ రిపోర్టింగ్‌కు వెళుతున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చేవి. ఆ గండాల నుంచి అదృష్టశాత్తు బయటపడింది.గాజాలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు తనకు ప్రజల నుంచి రకరకాల స్పందనలు ఎదురయ్యేవి. కొందరు ఆ΄్యాయంగా పలకరించి బ్రెడ్, టీ ఇచ్చేవారు. ‘ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు వెరవకుండా మీ జర్నలిస్ట్‌లు పనిచేస్తున్నారు. మీ వల్లే మా బాధలు ప్రపంచానికి తెలుస్తున్నాయి’ అని ప్రశంసించేవాళ్లు.కొందరు మాత్రం...‘నేను జర్నలిస్ట్’ అని పరిచయం చేసుకోగానే భయపడేవారు. ‘ఇప్పటికే ఎంతోమంది జర్నలిస్ట్‌లు చని΄ోయారు. మా గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందు మీరు జాగ్రత్తగా ఉండండి’ అనేవాళ్లు. ‘నిజానికి నేను వారి దగ్గరికి జర్నలిస్ట్‌గా కంటే సాటి మనిషిగా వెళ్లాను. వారి బాధలను పంచుకున్నాను. ధైర్యం చె΄్పాను’ అంటున్న ప్లెస్తియ ఆశావాది. యుద్ధం లేని రోజులు, గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్ర΄ోయే రోజులు వస్తాయని, మాయమైపోయిన నవ్వుల పువ్వులు మళ్లీ వికసిస్తాయని, ‘యుద్ధం గతం మాత్రమే. వర్తమానం కాదు’ అని బలంగా నమ్మే రోజులు వస్తాయనే ఆశిస్తోంది ప్లెస్తియ. ఇజ్రాయెల్ సైనిక దాడి గురించి రిపోర్టింగ్ చేస్తూ మరణించిన జర్నలిస్ట్ షిరీన్ అబూ స్మారక స్కాలర్షిప్ ΄÷ందిన ప్లెస్తియ లెబనాన్‌లో స్టూడెంట్‌గా మరో ప్రయాణం మొదలుపెట్టింది. ఈ యువ జర్నలిస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. -
హమాస్ క్షీణత ఖాయం: ఇజ్రాయెల్
పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగున్నాయి. మరోవైపు.. ప్రపంచంలోని పలు దేశాలు హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బంధీ విడుదలకు సంధి ఒప్పందానికి ప్రయత్నిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఓ మిలటరీ వ్యవస్థలా ఎక్కువ కాలం కొనసాగలేదని పేర్కొన్నారు. తొలి దశలో ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్‌తో ఒప్పందానికి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో హమాస్‌తో ఒప్పందం ఓ వ్యూహాత్మక అవకాశంగా నిలుస్తుంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ బందీలను స్వదేశానికి తీసుకురావడమే సరైన నిర్ణయం. ఇజ్రాయెల్ ఆరు వారాల పాటు కాల్పుల విరామం తీసుకుని, బందీలను తిరిగి తీసుకురావడానికి ఒప్పందాన్ని ఆమోదించాలి. 11 నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా. హమాస్ గెరిల్లా యుద్ధంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్ కూడా హమాస్ మిలిటెంట్లతో తీవ్రంగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ పటిష్టమైన మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగుతుందనే నమ్మకం లేదు’’ అని అన్నారు.ఇక.. గాజాలో ఇజ్రాయెల్, హమాస్ జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తులు ప్రయత్నాలు సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక.. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటిరకదాదాపు 41 వేల మంది పాలస్తీనియలు మృతి చెందారు. -
గాజాపై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
గాజా: దక్షిణ గాజాగాపై ఇజ్రాయెల్ ట్యాంకులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడుతుంది. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ప్రధాన ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు చేస్తోంది. తాజాగా జరిపిన దాడిలో 40 మంది పౌరులు మరణించినట్లు గాజా అధికారులు తెలిపారు. దక్షిణ గాజా స్ట్రిప్మీద ఇజ్రాయెల్ సైన్యం ఉపరితల, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్,అల్ మవాసీ ప్రాంతాల మీద చేసిన దాడుల్లో గత 24 గంటల్లో 40మంది మరణించారని, మరో 60 మంది తీవ్రంగా గాయపడినట్లు గాజా సివిల్ డిఫెన్స్ అధికారి మహ్మద్ అల్ ముఘైర్ మీడియా సంస్థ ఏఎఫ్పీకి చెప్పారు. సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ మాట్లాడుతూ..స్థానిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు దాడులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, ఫలితంగా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు సహాయక చర్యలకు మరింత ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. గాజాపై దాడిని ఇజ్రాయెల్ సైన్యం అధికారంగా స్పందించింది. తాము ఖాన్ యునిస్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పనిచేస్తున్న హమాస్ ఉగ్రవాదులపై యుద్ధవిమానాలతో దాడి చేసినట్లు వెల్లడించింది. గాజా స్ట్రిప్‌లోని ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ప్రాంతాలు,సైన్యానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని,ఫలితంగా ఈ డాడులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేనా? -
సిన్వర్‌పై అమెరికాలో కేసు
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7న జరిగిన నరమేధానికి సంబంధించి హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌తో పాటు ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఐదుగురు అగ్ర నేతలపై అమెరికాలో కేసు నమోదైంది. దాడికి ప్రణాళిక, మద్దతు, నిర్వహణ వెనక ఉన్నది వీరేరంటూ మంగళవారం క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనయా, మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ దెయిఫ్, డిప్యూటీ మిలిటరీ కమాండర్ మార్వాన్ ఇస్సా, ఖలీద్ మెషాల్, అలీ బరాకా ఉన్నారు. వీరిలో హనయా, దెయిఫ్, ఇస్సా ఇప్పటికే ఇజ్రాయెల్ హతమార్చింది. ఖలీద్ మెషాల్ దోహాలో ఉంటూ గ్రూప్ డయాస్పోరాకు నాయకత్వం వహిస్తుండగా అలీ బరాకా లెబనాన్‌కు చెందిన సీనియర్ హమాస్ అధికారి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడిలో హనయా, గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో మహ్మద్ దెయిఫ్, మరో దాడిలో ఇస్సా మరణించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన పాశవిక మెరుపుదాడిలో 1,200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసిందే. వారిలో 40 మందికి పైగా అమెరికన్లున్నారు. ‘‘ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, ఆ లక్ష్యసాధన కోసం ఆ దేశ పౌరులను చంపడానికి హమాస్ చేస్తున్న ప్రయత్నాలకు నిందితులంతా నాయకత్వం వహించారు. ఇరాన్ నుంచి అందుతున్న ఆర్థిక, సాయుధ, రాజకీయ దన్నుతో, హిజ్బొల్లా మద్దతుతో ఇందుకు తెగించారు’’అని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ ఒక ప్రకటనలో తెలిపారు.చర్చలకు విఘాతం! అమెరికా తాజా చర్య గాజాలో కాల్పుల విరమణ యత్నాలకు విఘాతంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి ముగింపు పలికేందుకు, ఖైదీల విడుదలకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు అమెరికా కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తుండటం తెలిసిందే. ఇలాంటి సమయంలో హమాస్ అగ్ర నేతలపై అమెరికా కేసులు పెట్టడం కాల్పుల విరమణ చర్చలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. ‘‘గాజాలో ఇజ్రాయెల్ దాడులకు అమెరికా పూర్తి మద్దతిస్తోంది. తాజా అభియోగాల ద్వారా హమాస్‌నే వేలెత్తి చూపుతోంది. కానీ వేలమందిని పొట్టన పెట్టుకుంటున్న ఇజ్రాయెల్‌ను మాత్రం కనీసం తప్పుపబట్టడం లేదు. అమెరికావి ద్వంద్వ ప్రమాణాలని మరోసారి రుజువైంది’’ అని బీరుట్‌లోని అమెరికన్ యూనివర్సిటీ ఫెలో రామి ఖౌరీ అన్నారు.


