
టెల్ అవీవ్: గాజాలోకి మానవతా సాయం సరఫరాను నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ భద్రతాధికారి ఒకరు ఆదివారం తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు అనుమ తించబోమన్నారు. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడి నట్లు ఆరోపించిన ఇజ్రాయెల్, అనంతరం ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం.
అమెరికా సారథ్యంలో రెండేళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం కనీసం వారంపాటు కూడా మానవతా సాయం సరఫరా కొనసాగకమునుపే ఈ పరిణా మం చోటుచేసుకుంది. ఆదివారం తమ బలగాలపైకి హమాస్ శ్రేణులు కాల్పులకు పాల్పడ్డాయంటూ ఇజ్రాయెల్ గాజాలోని పలుప్రాంతాలపై దాడులకు దిగింది. పాలస్తీనియన్ల కోసం ఆహారం, మందులు, దుప్పట్లు, టెంట్లు తదితర అత్యవసరాలను తీసుకువస్తున్న ట్రక్కులు ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ ద్వారా గాజాలోకి ప్రవేశిస్తుండటం తెలిసిందే.