అమెరికా బర్మింగ్‌హామ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ఉడుముల సహజ రెడ్డి, కూకట్ పల్లి కి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. కాగా ఆ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు.
హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు.


