breaking news
United States
-
USAలో 25 వేల మంది వలస నేరస్థులు?
ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదంటూ వారిపై కఠిన ఆంక్షలు జారీ చేశారు. అయితే USAలోకి అక్రమంగా ప్రవేశించి తీవ్రనేరాలు చేసిన వారి జాబితాను వరస్ట్ క్రిమినల్స్ పేరుతో డిపార్ట్ మెంట్ ఆప్ హోమ్ లాండ్ విడుదల చేసింది.దాదాపుగా 25,000కు పైగా క్రిమినల్స్ ఈ జాబితాలో ఉన్నారు. వారు హత్యలు, అత్యాచారాలు, మాదకద్రవ్యాల రవాణా లాంటి తీవ్రమైన నేరాలలో అరెస్టైనట్లు DHS పేర్కొంది. ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలకు అనుగుణంగా వీరిని శిక్షించనున్నట్లు తెలిపింది. ఈ క్రిమినల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరస్ట్ ఆఫ్‌ది వరస్ట్ క్రిమినల్స్ పేరుతో విడుదల చేసింది."ఈ రాక్షసులు మన సమూహాన్ని హింసకు గురిచేస్తున్నారు. వీరందరిని దేశం నుంచి తరిమే వరకూ వదలం. అమెరికన్లు వీరివల్ల ఇబ్బందులకు గురికావద్దు. వీరు మన దేశంలో అనుమతి లేకుండా నివసిస్తున్నారు." అని డీహెచ్ఎస్ పోస్ట్ చేసింది. వీరు చేసిన నేరాలు, అరెస్టైన వారి వివరాలు వారి అదే విధంగా దేశబహిష్కరణ చేసిన సమాచారం అమెరికన్లకు తెలియాలని ఈ వివరాలు పోస్ట్ చేసినట్లు డీహెచ్ఎస్ తెలిపింది. అక్రమంగా అమెరికాలో నివసిస్తూ నేరాలు చేస్తున్న వారి స్నాప్‌షాట్ ఇదని పేర్కొంది. కాగా ఈ నేరస్థుల జాబితాలో 89 మంది భారతీయులు ఉన్నారు. కాగా ట్రంప్ అక్రమ వలసదారులను ఎట్టిపరిస్థితుల్లో దేశంలో ఉండనిచ్చేది లేదని స్పష్టం చేశారు. వారంతట వారు స్పచ్ఛందంగా అమెరికాను వదిలితే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇరాన్‌కు దగ్గరగా అబ్రహం లింకన్... ఏక్షణానైనా దాడి?
అరేబియా మహా సముద్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా యుద్ద నౌక అబ్రహం లింకన్ ఇరాన్‌కు అత్యంత దగ్గరగా వచ్చింది. అమెరికా బలగాలు అబ్రహాంలింకన్ యుద్ధ నౌకపై యుద్ధవిమానాలు, డ్రోన్లు, ఇతర ఆయుధ సామాగ్రి మోహరించాయి. ఒకవేళ ఇరాన్‌తో చర్చలు గనుక విఫలమైతే అమెరికా ఏ క్షణాన్నైన ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉంది.అయితే ఇరాన్‌పై అణు ఒప్పందంపై ఒత్తిడి చేసేందుకే ఈ విధంగా యుద్ధనౌకను దగ్గరగా మోహరించినట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులుభావిస్తున్నారు. కాగా ఇటీవలే ఇరాన్‌కు చెందిన డ్రోన్‌ను అమెరికా కూల్చివేసింది. యుద్ధనౌకకు దగ్గరగా వచ్చినందుకే భద్రతా కారణాలతో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.అణుఒప్పందంపై చర్చలకు ఇరు దేశాలు సముఖంగా ఉన్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే యుద్ధం తలెత్తడం అనివార్యంగా కనిపిస్తుంది.ట్రంప్ ఈ సారి వెనిజువెలాను మించి దాడి ఉంటుందని ప్రకటించగా, ఖమేనీ సైతం తగ్గేదేలే అన్నారు. -
ఎయిర్ ఫోర్స్ వన్‌లో నిద్రపోను.. నవ్వులు పూయించిన ట్రంప్
ఎయిర్ ఫోర్స్ వన్ ప్రయాణాలపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో నేను నిద్రపోను. కిటికీలోంచి క్షిపణుల కోసం చూడటమే నా పని. క్షిపణులొస్తున్నాయేమో గమనిస్తానని ట్రంప్ అన్నారు. ‘నేషనల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రేయర్' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.20 గంటల సుదీర్ఘ ప్రయాణంలో కూడా తాను అసలు నిద్రపోనంటూ చెప్పుకొచ్చారు. "నేను కిటికీలోంచి బయటకు చూస్తూ క్షిపణులు(missiles), శత్రువుల కోసం వెతుకుతుంటానంటూ ఆయన వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి. నిద్ర తక్కువ.. కబుర్లు ఎక్కువడొనాల్డ్ ట్రంప్ తనకు నిద్ర చాలా తక్కువని గతంలో కూడా చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. 2016 ఎన్నికల ప్రచారంలో తాను రోజుకు కేవలం 3 నుండి 4 గంటలు మాత్రమే నిద్రపోతానని, ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉంటానని చెప్పారు.అలాగే.. 2019లో ఒక వైట్ హౌస్ అధికారి సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. అధ్యక్షుడితో ప్రయాణించడం అంటే ‘బందీగా ఉండటం’ లాంటిదని వ్యాఖ్యానించారు. ట్రంప్ నిద్రపోవడానికి బదులుగా.. గంటల తరబడి సిబ్బందితో కబుర్లు చెబుతుంటారని, ప్రభుత్వ విషయాలే కాకుండా క్రీడల గురించి కూడా చర్చిస్తారని ఆయన తెలిపారు.ఎయిర్‌ఫోర్స్ వన్.. ప్రత్యేకత ఏంటంటే..అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమాన్నయినా ఎయిర్‌ఫోర్స్ 1 అనే పిలుస్తారు. ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది. దాడి జరిగే అవకాశం ఉందని ఉప్పందితే చాలు మొబైల్ కమాండ్ సెంటర్‌గా మారుతుంది. నాలుగు జెట్ ఇంజిన్స్‌తో ఈ విమానం నడుస్తుంది. గంటకి వెయ్యి కి.మీ కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 70 మంది వరకు ప్రయాణించవచ్చు. గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత. దీంతో ఎంతసేపైనా ప్రపంచం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చుట్టేయగలదు.విమానం లోపల విస్తీర్ణం 4 వేల చదరపు అడుగులు ఉంటుంది. మూడు అంతస్తుల్లో ఈ –విమానాన్ని తయారు చేశారు. వైట్ హౌస్‌లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్ గది, డైనింగ్ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లాంజ్ సహా సకల సౌకర్యాలు ఉంటాయి. ఒకేసారి 100 మందికి వంట చేసే సదుపాయం కూడా ఉంది. ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆస్పత్రి, అందుబాటులో వైద్యుడు ఉంటారు. -
అరేబియా సముద్రంలో టెన్షన్.. ఇరాన్ డ్రోన్‌ను కూల్చిసిన అమెరికా
అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా అని స్థితికి ప్రస్తుతం పరిస్థితులు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలో ఇరాన్ డ్రోన్‌ను అమెరికా జెట్ కూల్చివేసింది.ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది అణు ఒప్పందంపై చర్చలకోసం ఇరాన్‌కు ఆహ్వానం పంపామన్నారు. త్వరలో టర్కీ ఇస్తాంబుల్‌లో ఆ చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇరాన్ సైతం ఇదివరకే చర్చలకు సముఖమే అని ప్రకటించడంతో ఇక పరిస్థితులు సద్ధుమణుగుతాయి అనుకున్నారు. అయితే ఇంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. అరేబియా సముద్రంలో ఇరాన్ డ్రోన్‌ను అమెరికా కూల్చివేసింది..ఇరాన్‌కు చెందిన షహెద్-139 అనే డ్రోన్ అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్‌కు దగ్గరగా ఎగరింది. దీంతో అమెరికా బలగాలు ఎఫ్-35 జెట్‌తో దానిని కూల్చివేశాయి. అయితే డ్రోన్ వాహన నౌకకు సమీపంగా రావడంతో ఆత్మరక్షణ కోసం దానిని కూల్చివేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.అయితే అమెరికా యుద్ధనౌక అబ్రహం లింకన్ బయిలు దేరిందని, అణు ఒప్పందంపై ఇరాన్ తగ్గకపోతే వెనిజువెలా దాడిని మించి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తమపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఖమేనీ హెచ్చరించారు. ఈ దాడి నేపథ్యంలో ఏం జరగనుందా అనే ఆందోళన మెుదలైంది. -
బంగ్లా దాడులు.. USAలో నిరసనలు
బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు నిరసనగా యుఎస్‌లో భారీఎత్తున ఆందోళనలు చేపట్టారు. అమెరికాలోని ప్రధాన నగరాలలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. హిందువులపై హింస ఆపాలని ప్లకార్డులు చేతపట్టుకొని ర్యాలీలు నిర్వహించారు.బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందువులపై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. అక్కడి మతఛాందస వాదులు రెచ్చిపోయి అక్కడి మైనార్టీలపై ప్రధానంగా హిందువులపై దాడులు చేసి చంపుతున్నారు. అయితే ఈ దాడులు పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లాండ్ పార్లమెంటులో సైతం హిందువులపై దాడులని తీవ్రంగా ఖండించారు. తాజాగా అమెరికాలో బంగ్లాదేశ్‌లో మైనారీటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.బంగ్లాలో హిందువులపై జరుగుతున్న హింసను తెలియజేయడానికి ఈ ప్రదర్శన జరుపుతున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. యుఎస్ఏ వ్యాప్తంగా దాదాపు 22 నగరాల్లో ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇతర దేశాలలో మైనార్టీ వర్గాల మతస్వేచ్ఛను కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల తరచుగా మతహింస జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఎవరికి ఏటువంచి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టామని అన్ని సమాజాలను తగిన విధంగా గౌరవించాలని అందరికి తగిన ప్రాధాన్యాత ఇవ్వాలని తాము కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. -
యుఎస్‌లో షట్‌డౌన్.. నిలిచిన ప్రభుత్వ సేవలు
అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్ అయ్యింది. దీంతో అక్కడి ప్రభుత్వ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. 2026 బడ్జెట్‌కు సంబంధించిన గడువు అర్థరాత్రితో ముగిసింది. దానికి మద్ధతు లభించకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. ఇటీవల అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు పౌరులపై కాల్పులు జరపడంతో ఆదేశంలో ప్రభుత్వం పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి.ట్రంప్ ప్రభుత్వంపై యుఎస్‌లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ దేశంలోని పౌరులు అక్కడి పాలనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఇటీవల ఆ దేశంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తీరుపై అక్కడి డెమెక్రాట్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బిల్లులకు మద్దతివ్వమని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడి ప్రభుత్వం షట్‌డౌన్ అయ్యింది.మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, పిల్లలను నిర్బందించే వారు, మానవ అక్రమ రవాణాదారులను అరెస్టు చేయాడానికి బదులుగా యుఎస్ ప్రభుత్వం శాంతియుత నిరసన కారులపై దాడులు చేస్తోందని తెలిపారు. శాంతియుత నిరసనకారులను లక్షంగా చేసుకొని యూఎస్ దాడులకు తెగబడుతుందని సెనెట్ డెమెక్రాటిక్ మైనారిటీ విప్ డర్బిన్ పేర్కొన్నారు. అంతేకాకుండా చట్టాన్ని అమలు చేసే అధికారులకు సరిహద్దు భద్రతా దళాలకు యుఎస్ ప్రజలు మద్ధతు ఇస్తారు కానీ వీధుల్లో భయభ్రాంతులకు గురిచేసే అధికారులకు వారు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోరని తెలిపారు. అయితే ఇదివరకే ట్రంప్ విధానాలను సంస్కరించాలని లేకపోతే నిధుల విడుదలకు అవసరమైన బిల్లులకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతివ్వమని వారు హెచ్చరించారు. అయితే ఇది తాత్కాలికమేనని వచ్చేవారం ఈ నిధుల బిల్లుపై మరోసారి చర్చలు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే గతంలోనూ అమెరికాలో ఒకసారి షట్‌డౌన్ అయ్యింది. -
వందల ఏళ్ల క్రితం చోరీ.. తిరిగి భారత్‌కు విగ్రహాలు
అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఆ దేశ మ్యూజియంలో ఉన్న భారత్‌కు చెందిన పురాతన కాంస్య విగ్రహాలను తిరిగి స్వదేశానికి ఇవ్వడానికి అంగీకరించింది. ఆ విగ్రహాలు అక్రమంగా ఆ దేశానికి చేరుకున్నాయని ఒప్పుకుంది.వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ మ్యుజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్స్‌లో కీ.శ 990 నాటి శివనటరాజ విగ్రహాం,12వ శతాబ్ధపు నాటి సోమస్కంద, 16వ శతాబ్ధానికి చెందిన సుందరర్ అనే సాధువుకు చెంది విగ్రహాలు ఉన్నాయి. ఇవి తమిళనాడుకు చెందినవి అయితే ఈ విగ్రహాలు దొంగతనంగా ఆ మ్యూజియానికి చేరాయని భారత్ వాదించింది. తిరిగి వాటిని తమ దేశానికి అప్పగించాలని కోరింది.అయితే ఇంతకాలం తర్వాత అవి అక్రమంగా ఆ మ్యూజియానికి చేరినట్లు మ్యూజియం అధికారులు అంగీకరించారు. వాటిని తిరిగి భారత్‌కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో భారతీయ శిల్పసంపద తిరిగి దేశానికి వస్తుంది. -
USA: ఎప్స్టీన్ స్కాండిల్... ప్రముఖుల పేర్లు
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ స్కాండిల్‌కు సంబంధించి మూడు మిలియన్ల పత్రాలను అమెరికా లా డిపార్ట్మెంట్ విడుదల చేసింది. వీటిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌కు సంబంధించి సంచలన విషయాలు ప్రచురించింది.అమెరికాని ఊపు ఊపేసిన ఎప్స్టీన్ సంబంధించి దాదాపు 3ం లక్షల పత్రాలు, 2వేల వీడియోలు అమెరికా న్యాయ విభాగం అధికారులు విడుదల చేశారు. అయితే అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్, పాప్ స్టార్ మైకెల్ జాక్సన్‌ల ఫోటోలు బయిటకు వచ్చాయి. వాటితో పాటు ఈ ఫైల్స్‌లో మైక్రోసాప్ట్ ఫౌండర్ బిల్గ్రేట్స్ పేరు కూడా ఉంది. అంతేకాకుండా ఈ మెయిల్ లో బిల్గ్రేట్స్, రష్యాన్ అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన మెయిల్లో ఉన్నట్లు డైలీ మెయిల్ నివేదిక తెలిపింది.2013 జులై 18న ఎఫ్‌స్టీన్ తనకు తానుగా ఒక సుదీర్గమైన మెయిల్ రాసుకున్నారని అందులో గేట్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరు సంవత్సరాల స్నేహానికి ముగింపు పలికారని తెలిపారు. బిల్‌గేట్స్ ఈ అంశంపై గతంలోనే చింతించారు. ఎఫ్‌స్టీన్‌తో తనకు పరిచయం ఉండడంతో చాలా విచారకరమన్నారు. అయితే ఎఫ్‌స్టీన్‌తో పరిచయమే తమ విడాకులకు ప్రధాన కారణమని బిల్‌గేట్స్ మాజీ ప్రేయసి మెలిండా అన్నారు. అయితే ప్రస్తుతం విడుదలైన ఫైల్స్‌లో బాధితుల పేర్లు, ఫోటోలు, ఎట్టిపరిస్థితుల్లో బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అక్కడి న్యాయశాఖ అధికారులు తెలిపారు. -
ఆ విషయంలో USA, చైనా పెత్తనం మంచిది కాదు: UNO సెక్రటరీ
ఐక్యరాజ్య సమితి సెక్రటెరీ ఆంటోనియో గుటెరెస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని కేవలం ఒకటి లేదా రెండు శక్తులు నడపలేవన్నారు. ప్రపంచ అభివృద్ధికి అనేక దేశాల భాగస్వామ్యం చాలా కీలకమన్నారు.UNO సెక్రటెరీ ఆంటోనియో గుటెర్రెస్ అమెరికా, చైనాలకు కౌంటరిచ్చారు. ప్రపంచాన్ని ఒకటి, లేదా రెండు దేశాలు నడపడం సాధ్యం కాదన్నారు. ఆయన మాట్లాడుతూ " ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన దేశంగా ఉందనేది కాదనలేని సత్యం. అయితే భవిష్యత్తు గురించి మా అభిప్రాయంతో పాటు ఇతర దేశాల అభిప్రాయం ఏమిటంటే ఒకటి యుఎస్ కేంద్రంగా రెండు చైనా కేంద్రంగా ఉంటాయని అంచనా అయితే స్థిరమైన, శాంతి, అభివృద్ధితో కూడిన ప్రపంచం కావాలంటే అలా జరగకూడదు" అని ఆయన అన్నారు.ప్రపంచాన్ని పరిపాలించే ఒకటి లేదా రెండు శక్తుల ద్వారా సమస్యలు పరిష్కరించబడవు అని గుటెరెస్ తెలిపారు. ఇటీవల భారత్ - ఈయూ మధ్య జరిగిన ఒప్పందం బహుళ ధృవవ్యవస్థకు ఎంతో ప్రధానమన్నారు. ప్రపంచ అభివృద్ధి అనేక దేశాల చేతిలో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అయితే ఇటీవల యూరప్ భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" అనే కీలక ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే -
మా భూమిపై కాలు పెడితే అంతే.. ఇరాన్ హెచ్చరిక
ఇరాన్, అమెరికా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రియమైన భూమిపై జరిగే దాడిని ఎదుర్కొవడానికి ఇరాన్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. అందుకోసం భద్రతబలగాలు ట్రిగ్గర్‌పై వేలు ఉంచాయన్నారు.ప్రస్తుతం ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ వైపు తమ భద్రతా బలగాలు కదిలాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ సమయంలోనైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ" మా శక్తివంతమైన సైనికులు సిద్ధంగా ఉన్నారు. వారి వేలు ట్రిగ్గర్స్ పై ఉన్నాయి. మా గాలిపై, భూమిపై, సముద్రంపై, ఎటువంటి దాడి జరిగినా ఎదుర్కొవడానికి వారు రెడీ అని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే సమయంలో ఇరు దేశాలకు ప్రయోజనకరమైన న్యాయమైన అణు ఒప్పందాన్ని ఇరాన్ స్వాగతిస్తుందని తెలిపారు.అయితే ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. అణ్వయుధ ఒప్పందంపై ఇరాన్ పాలకులు చర్చలకు అంగీకరించకపోతే తమ తదుపరి దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. దీనికోసం అమెరికా విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికా నేవీ గల్ఫ్ ప్రాంతంలోకి ప్రవేశించిందని తెలిపారు. -
USAలో కుప్పకూలిన జెట్.. ఏడుగురు మృతి
అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ జెట్ ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదినట్లు అక్కడి ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.USA, మైనే రాష్ట్రంలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఎనిమిది మంది ప్రయాణికులతో బయిలుదేరిన ఓప్రైవేట్ జెట్‌లో టేకాప్ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఫైలట్ జెట్‌ను అదుపుచేసే యత్నం చేసినప్పటికీ ఫలితం లేక జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ వివరాలను ఏవియేషన్ అధికారులు ప్రకటించారు.వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాటు విపరీతమైన మంచు కురవడమే విమాన ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం అమెరికాలో మంచుతుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అక్కడికి వెళ్లే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. భారత్ నుంచి అమెరికా వెళ్లే పలు విమానాలు అక్కడి మంచు తుఫాన్ కారణంగా రద్దయ్యాయి. -
భారత సంతతి మహిళకు తప్పని ఇమ్మిగ్రేషన్ సెగ!
అమెరికాలోని వలసదారులపై ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఏజెంట్ల చర్యల వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయినప్పటికి వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురైంది.ఆమె పట్ల ఐస్ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె డాక్టర్ నిషా పటేల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నిషా పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తల్లి టెక్సాస్‌లోని ఒక అవుట్లెట్ మాల్లో షాపింగ్ చేస్తుండగా, మాస్క్‌లు ధరించిన ఐస్ ఏజెంట్లు తన దగ్గరకు వచ్చి విచారించారు. ఆమెను చూసి మాట్లాడుతుందని భావించిన ఏజెంట్లు.. తొలుత ఆ భాషలోనే మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే సదరు మహిళ తనకు స్పానిష్ రాదని చెబడంతో, అయితే ఎక్కడ నుంచి వచ్చావు అంటూ పలు దేశాల పేర్లను చెప్పారు. అయితే ఐష్ ఏజెంట్లకు ఆమె గట్టిగానే సమాధానమిచ్చింది."మీలో చాలామంది పుట్టకముందు నుంచే నేను ఈ దేశంలో ఉంటున్నాను" ఆమె బదులు ఇచ్చింది. అయినప్పటికీ ఆమె తన ఫోన్లో ఉన్న యూఎస్ పాస్‌పోర్ట్ ఫోటోను చూపించే వరకు అధికారులు విడిచిపెట్టలేదు. కాగా నిషా పటేల్ తల్లి గత 47 ఏళ్లుగా అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆమెకు అక్కడి పౌరసత్వం కూడా ఉంది. అమెరికాలో ప్రస్తుతం అక్రమ వలసదారులను పట్టుకోవడానికి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని నిషా పటేల్ ఆవేదన వ్యక్తం చేసింది. -
గతేడాది USAలో 23,830 మంది భారతీయుల అరెస్ట్
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినాటి నుంచి అక్రమ వలసదారులపై కఠినవైఖరి అవలంభించారు. వారు దేశంలోకి రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. అయినప్పటికీ అమెరికాలోకి అక్రమ వలసలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఆ దేశం విడుదల చేసిన సర్వేలో కనీసం 20 నిమిషాలకు ఒక భారతీయుడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే యత్నం చేస్తున్నట్లు తేలింది. ఈ నివేదిక భారత్‌లో కొంత ఆందోళన కలిగిస్తుంది.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై రెచ్చిపోయారు. ఎట్టిపరిస్థితుల్లో వారు దేశంలో ఉండేది లేదంటూ హుకుం జారీ చేశారు. తమకు తాము స్వచ్ఛందంగా దేశాన్ని వదిలితే ప్రోత్సహాకాలు అందిస్తామని ప్రకటించారు. అయితే ట్రంప్ ఇంతగా కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆదేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య ఇప్పటికీ లక్షల్లోనే ఉంది. 2025లో USAలోకి అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య 3లక్షల 90వేలుగా ఉన్నట్లు యుఎస్ కస్టమ్స్.. బోర్డర్ ప్రోటెక్షన్ విడుదల చేసిన సర్వే తెలిపింది.అయితే వీరిలో భారతీయులు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. బోర్డర్ ప్రొటెక్షన్ నివేదిక ప్రకారం... 2025లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 23,830 భారతీయులు అరెస్టయ్యారు. అదే 2024 అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ అరెస్టైన వారి సంఖ్య 85,119గా ఉంది. మెుత్తంగా 2025లో USAలోకి అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య 3లక్షల 90వేలుగా ఉంది. అయితే బాధాకర విషయం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు ఒంటరిగా సరిహద్దు దాటుతున్నారు. వారి వెంట ఎవరూ లేకుండా పోలీసులకు పట్టుబడుతున్నారు.భారతీయులు అధికంగా కెనడా సరిహాద్దునుండే అమెరికాలోకి ప్రవేశిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. 6,968 మంది కెనడా, యుఎస్ బోర్డర్ గుండా ప్రవేశిస్తూ అరెస్టైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. 2022లో ఇటువంటి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ ఓ భారతీయ కుటుంబం మృతిచెందిన ఘటన ఒకటి జరిగింది.గుజరాత్ గాంధీనగర్‌కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిద్దామని ప్రయత్నించారు. కానీ ఆ తీవ్రమైన చలిగాలులకు తట్టుకోలేక మార్గమధ్యలోనే నలుగురు మరణించారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
‘రష్యా సుంకం’ రద్దు?
వాషింగ్టన్: అమెరికా విధించిన భారీ టారిఫ్‌ల విషయంలో భారత్‌కు సగానికి సగం ఊరట లభించే అవకాశం కని్పస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు విధించిన 25 శాతం టారిఫ్‌లను రద్దు చేసే అవకాశమున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ కొద్ది నెలలుగా భారీగా తగ్గించుకుంది. కనుక 25 శాతం సుంకాలను రద్దు చేసే అంశాన్ని మా ప్రభుత్వం పరిశీలించే అవకాశముంది’’అని ఆయన చెప్పారు. శుక్రవారం అమెరికా వార్తా సంస్థ పొలిటికో ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. ‘‘భారత్‌పై మేం విధించిన 25 శాతం చమురు టారిఫ్ బ్రహా్మండంగా పని చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు దాదాపుగా ఆగిపోయాయి. కనుక వాటిని వెనక్కు తీసుకునే ప్రక్రియ మొదలవుతుందనే భావిస్తున్నా’’అని వివరించారు. టారిఫ్‌ల వల్లే రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు భారీగా తగ్గాయని ఇటీవల దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా కూడా బెసెంట్ చెప్పుకొచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్, అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. అయితే, భారత్ నుంచి శుద్ధి చేసిన చమురు తదితరాలను యూరప్ కొనుగోలు చేయడంపై బెసెంట్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘యూరప్‌ది నిజంగా మూర్ఖపు చర్యే. భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని యూరప్ అంగలారుస్తోంది. అందుకే రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఆ దేశంపై అధిక సుంకాలు విధించలేదు’’అంటూ నిందించారు. ఆగస్టు నుంచీ రగడ భారీ వాణిజ్య అసమతుల్యతను సరిచేసే పేరిట భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఆగస్టులో తొలుత 25 శాతం టారిఫ్ విధించడం తెలిసిందే. రష్యా చమురు దిగుమతులను సాకుగా చూపుతూ కొంతకాలానికే మరో 25 శాతం మేరకు బాదారు. అంతేగాక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే, దాన్ని తిరిగి విక్రయించే దేశాలపై ఏకంగా 500 శాతం టారిఫ్ విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టారు కూడా! రష్యా తన చమురు కొనుగోళ్ల నిధులను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెచ్చిస్తోందని అమెరికా ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్, రష్యా నుంచి అధిక మెుత్తంలో చమురు దిగుమతి చేసుకుంటుంది. కాగా మెుత్తంగా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది. -
మంచుతుఫాన్ ఎఫెక్ట్.. USAకు ఫ్లైట్స్ క్యాన్సిల్
అమెరికా న్యూయార్క్‌లో భారీ మంచు తుఫాను పొంచి ఉన్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 25, 26 తేదీలలో అక్కడికి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అమెరికాకు మంచు తుపానులు భయం పట్టుకుంది. ఈ వారాతంలో ఆ దేశం తీవ్ర మంచుతుపాను ఎదుర్కొనే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో USA అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు. తుపానును ఎదుర్కొవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమైందని ప్రకటించారు. అయితే దీని ప్రభావం భారత్‌లోని విమానయాన సంస్థలపై సైతం పడింది. మంచు తుఫాన్ నేపథ్యంలో న్యూయార్క్ వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.ఈ విమానాల రద్దుపై వివరణ ఇస్తూ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. "అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలలో రేపు, ఎల్లుండి తీవ్ర మంచుతుఫాను ప్రభావం ఉండనుంది. యుఎస్ తూర్పు తీరంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా జనవరి 25,26 తేదీలలో అక్కడికి ప్రయాణించే విమానాలను రద్దు చేస్తున్నాం. ఈ క్యాన్సిలేషన్‌పై పూర్తి సమాచారం మా సిబ్బంది ప్రయాణికులకు వ్యక్తిగతంగా అందిస్తుంది". అని ఎక్స్‌లో ఎయిర్ఇండియా పోస్ట్ చేసింది.అయితే ప్రస్తుతం రాబోయే మంచు తుఫాన్ అమెరికాలో 2/3 మందిని ఎఫెక్ట్ చేస్తుందని సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ప్రస్తుతం వచ్చే మంచుతుఫాన్ టెక్సాన్ నుంచి ఇంగ్లాండ్ వరకూ దాదాపు 2వేల కిలోమీటర్ల మైళ్లు ప్రయాణించనున్నట్లు పేర్కొంది. దీనివల్ల దేశంలోనే విద్యుత్‌వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. -
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సిబ్బందిని యూఎస్ వెనక్కి పిలిపించింది. డబ్ల్యూహెచ్‌వోకు అగ్రరాజ్యం రూ.2 వేల కోట్లు బకాయిపడింది. బకాయిలు చెల్లించేవరకు యూఎస్ ఉపసంహరణ పూర్తికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పిందికొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలుచేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందంటూ యూఎస్ ఆరోగ్య, మానవ సేవల విభాగం (HHS) ఆరోపించింది. సభ్య దేశాల రాజకీయ ప్రభావం కూడా కారణమేనని తెలిపింది. ఇకపై డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వోకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు యూఎస్ పేర్కొంది. అయితే, డబ్ల్యూహెచ్‌వో.. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ ఉపసంహరణ అమెరికాకే కాకుండా ప్రపంచ మొత్తానికి ఒక నష్టమని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ పేర్కొన్నారు.సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా చెప్పగానే సరిపోదని.. సంస్థకు బకాయిపడిన 260 మిలియన్ డాలర్లను చెల్లించేవరకు డబ్ల్యూహెచ్‌వో నుంచి యూఎస్ ఉపసంహరణ సాధ్యం కాదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై అమెరికా అధికారిక వర్గాలు స్పందిస్తూ.. సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నియమమేమీ లేదంటూ కొట్టిపారేశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఏడాది క్రితమే ట్రంప్ ఈ ఉపసంహరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. -
పసికందును కారులో వదిలేసిన తల్లి.. ఊహించని షాకిచ్చిన పోలీసులు
అమెరికాలోని పెన్సిల్వేనియాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. కేవలం నాలుగు నెలల వయసున్న పసికందును ఓ తల్లి ఒంటరిగా కారులోనే వదిలేసి షాపింగ్‌కు వెళ్లింది. వారింగ్టన్ చెందిన టీనా డికార్లా (42) అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.ఏం జరిగిందంటే?టీనా జనవరి 10న ఈస్టన్ రోడ్డులోని వాల్‌మార్ట్ స్టోర్‌కు వెళ్లింది. అయితే పసిబిడ్డను తనతో పాటు తీసుకెళ్లకుండా కారు ముందు సీట్లోనే వదిలేసింది. దాదాపు 20 నిమిషాలకు పైగా ఆ బిడ్డ కారులో ఒంటరిగా ఉంది. కారులో చిన్నారి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఒక వ్యక్తి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు.అయితే షాపింగ్ ముగించుకుని వచ్చిన టీనాను పోలీసులు వచ్చే వరకు ఉండాలని సదురు వ్యక్తి కోరాడు. కానీ ఆమె అతడి మాట వినకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు.ఆరు రోజుల తర్వాత ఆమెను ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఆమెకు రూ.83 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఆమెపై పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. -
లక్షకు పైగా ఫోర్డ్ వాహనాల రీకాల్.. ఎందుకంటే?
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ (Ford Motor) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజిన్ బ్లాక్ హీటర్లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల యూఎస్ వ్యాప్తంగా దాదాపు 1,19,000 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ఫోర్డ్ ప్రకటించింది. ఈ రికాల్లో 2013 నుంచి 2024 మధ్యలో తాయారైన ఫోర్డ్ ఫోకస్, ఫోర్డ్ ఎస్కేప్,లింకన్ ఎంకేసీ, ఫోర్డ్ ఎక్స్‌ఫ్లోరర్ మోడల్స్ ఉన్నాయి.సమస్య ఏంటంటే?చలికాలంలో ఇంజిన్ త్వరగా వేడెక్కడానికి బ్లాక్ హీటర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ హీటర్ల వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అమెరికా రహదారి భద్రతా సంస్థ((NHTSA) ఫోర్డ్ మెటార్‌ను హెచ్చరించింది. ఇంజిన్ బ్లాక్ హీటర్‌లో పగుళ్లు రావడం వల్ల కూలెంట్ ఆయిల్ లీక్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే.. హీటర్‌ను పవర్ సాకెట్‌కు కనెక్ట్ చేసినప్పుడు లీక్ అయిన అయిల్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగేందుకు ఎక్కవగా అస్కారం ఉంది.ఇప్పటివరకు ఈ లోపం వల్ల 12 కార్లలో మంటలు వచ్చినట్లు ఫిర్యాదులు అందాయని, అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఫోర్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. రిపేర్ పూర్తయ్యే వరకు కస్టమర్లు తమ వాహనాలను పవర్ సాకెట్లకు ప్లగ్ ఇన్ చేయవద్దని ఫోర్డ్ కోరింది. -
అమెరికాలో తీవ్ర రూపం దాల్చిన 'మీజిల్స్'.. ఆందోళనలో ప్రజలు
అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో మీజిల్స్(తట్టు) వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. గత నాలుగు రోజుల్లోనే 88 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 646కు చేరింది. కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా క్లెమ్సన్,ఆండర్సన్ విశ్వవిద్యాలయాలకు కూడా ఈ వైరస్ పాకింది.ఈ యూనివర్సిటీల్లో చాలా మంది విద్యార్థులు ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా ఈ వ్యాధి తీవ్రత వాయువ్య ప్రాంతంలోని ఎక్కువగా స్పార్టన్బర్గ్ (Spartanburg) పట్టణంలో ఎక్కువగా ఉంది. వ్యాధి సోకిన వారిలో ఎక్కువమంది టీకా తీసుకోని వారే కావడం గమనార్హం. ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలి ద్వారా అత్యంత వేగంగా వ్యాపించే ఈ వైరస్ వల్ల నిమోనియా, మెదడు వాపు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రమాదంలో అమెరికా హోదా..కాగా 2000 సంవత్సరంలో అమెరికా మీజిల్స్ రహిత దేశంగా ప్రకటించబడింది. అయితే ఇప్పుడు కేసులు అధికంగా పెరుగుతుండడంతో అమెరికా తన "మీజిల్స్ రహిత" హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే యూటా, అరిజోనా, ఉత్తర కరోలినా వంటి రాష్ట్రాల్లో కూడా మీజిల్స్ కేసులు నమోదవుతున్నాయి. -
ట్రంప్ ప్రమాదకర పోకడ
వారానికో, పదిరోజులకో తన విధ్వంసక ప్రకటనలతో ప్రపంచాన్ని హడలెత్తించటం అలవాటు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు దాన్ని నిత్యకృత్యంగా మార్చుకున్నట్టు కనబడుతోంది. డెన్మార్క్‌లో భాగమైన కీలకదీవి గ్రీన్‌ల్యాండ్ దురాక్రమణకు సమాయత్తమవుతూ, అందుకు అభ్యంతరం చెప్పిన యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలపై వచ్చే నెల 1 నుంచి పదిశాతం సుంకాలు విధిస్తానని బెదిరించి కయ్యానికి కాలుదువ్వారు. మరోపక్క గాజా పునర్నిర్మాణం కోసమంటూ తన ఆధ్వర్యంలో ‘శాంతిమండలి’ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఆ మండలిలో ‘ఖరీదైన’ సభ్యత్వాన్ని ఇస్తానని భారత్‌తో సహా 60 ప్రపంచ దేశాలకు వర్తమానం పంపారు. ఎనిమిది దశాబ్దాల క్రితం హిట్లర్ రూపంలో తలెత్తి ప్రపంచాన్ని చాప చుట్టేయాలని చూసిన నియంతను వదుల్చుకోవటానికి ఎంత మారణహోమం చవి చూడాల్సి వచ్చిందో, ఎన్ని కోట్లమంది బలిదానాలు చేయాల్సి వచ్చిందో తెలిసి కూడా ఏడాదిగా బుజ్జగింపు ధోరణితో పొద్దుపుచ్చిన దేశాలకూ, ఐక్యరాజ్యసమితికీ తాజా పరిణామాలు ఒక పెద్ద షాక్. తాను ఆశించినట్టు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు గనుక ఇక శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ట్రంప్‌కు లేదట. అమెరికాకు ఏది ప్రయోజనకరమో అదే చేస్తారట!గాజాపై ఏర్పాటు చేయదల్చుకున్న శాంతి బోర్డుకు తలాతోకా లేదు. అది గాజాకే పరిమితమై ఉండదట. భవిష్యత్తులో వేరే దేశాల వివాదాల్లో తలదూరుస్తుందట! బోర్డుకు ట్రంప్ జీవితకాల అధ్యక్షుడు. అందులో ‘రా రమ్మ’ని పిలిచిన దేశానికి మూడేళ్లపాటు సభ్యత్వం ఇస్తారు. శాశ్వత సభ్యత్వానికైతే వందకోట్ల డాలర్లు చెల్లించాలి. గాజాలో అంతంతమాత్రంగా అందుతున్న సాయాన్ని కూడా ఆపటానికీ, అక్కడ ఉంటున్నవారి కడుపుమాడ్చి వెళ్లగొట్టడానికీ, నరమేధం ఆనవాళ్లు చెరిపేయటానికీ తోడ్పడటమే ఈ బోర్డు ఏర్పాటు ఆంతర్యం. నిజానికి ఈ బోర్డు ఆలోచన భద్రతామండలిది. 2027 చివరి వరకూ ఈ బోర్డు గాజా ఘర్షణలపై దృష్టి సారిస్తుందని ద్రతామండలి మొన్న నవంబర్‌లో ప్రకటించింది. గాజాలో రెండేళ్లపాటు మారణహోమం సాగించిన ఇజ్రాయెల్‌నూ, దానికి ప్రత్యక్షంగా సహకరించిన అమెరికానూ పల్లెత్తు మాట అనని మండలి... దొంగ చేతికి తాళం చెవులు అప్పగించినట్టు గాజాను ఉద్ధరించటానికి పూనుకోవాలని అగ్ర రాజ్యాలను కోరుతూ తీర్మానించింది. ఇంతకూ ట్రంప్ బోర్డూ, ఐక్యరాజ్యసమితి బోర్డూ వేర్వేరా... ఒకటేనా అనేది ఎవరికీ తెలియదు. దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోవటం వల్ల కావొచ్చు... సమితి కూడా అస్పష్టంగా మాట్లాడుతోంది. ‘సభ్యదేశాలు ఎవరికి నచ్చిన గ్రూప్‌లో వారు చేరొచ్చ’ని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేతులు దులుపుకొన్నారు. అమెరికా అధ్యక్ష పదవే ఇంకో మూడేళ్ల ముచ్చట కాగా,శాంతి బోర్డుకు యావజ్జీవ అధ్యక్షుడెలా కాగలరో అనూహ్యం. ఒక దేశంగా ఇందులో అమెరికా ప్రమేయం కూడా ఉండదా? ఇది ట్రంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఏమైనా కావొచ్చు. అమెరికా సుంకాలతో బెదిరించినా... ఏ సార్వభౌమాధికార దేశమైనా ఇందులో భాగస్వామ్యానికి అంగీకరించగలదా? బలహీనంగా కనబడే దేశాలను కించపరచటం, పాదాక్రాంతం చేసుకునేందుకు ప్రయత్నించడం ట్రంప్ నైజం. అమెరికా స్వప్రయోజనాల కోసం నాటో తీసుకొస్తే, భద్రతకు పూచీపడుతుందని నమ్మి అందులో చేరిన ఈ దేశాలు ఇప్పుడు అమెరికాయే దండ యాత్రకు పూనుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి గల గ్రీన్‌ల్యాండ్ పేరుకు ప్రపంచంలోనే పెద్ద దీవి. జనాభా 60,000 మించదు. వివాదం ఎందుకని అప్పగిస్తే అమెరికా హిరణ్యాక్షుడు శాంతిస్తాడన్న నమ్మకం లేదు. అలాంటి హిరణ్యాక్షులు ఇంకా ఇద్దరున్నారు. చైనా తైవాన్‌నూ, రష్యా ఉక్రెయిన్‌నూ కబళించే యత్నం చేస్తాయి. ఇలా కండబలంతో ఎవరికి వారు చెలరేగితే ఈ ప్రపంచం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కనుక ఇన్నాళ్ల బుజ్జగింపులకూ స్వస్తిచెప్పి యూరప్ దేశాలు ఇకనైనా దృఢంగా నిలబడాలి. 75 ఏళ్ల చరిత్రలో ఎందుకూ కొరగాని ‘నాటో’ ఉన్నా ఊడినా ఒకటేనన్న తెలివి తెచ్చుకుని, ప్రతీకార సుంకాలతో జవాబీయాలి. గాజా శాంతిబోర్డు పైనా ఛీత్కారాలు వెల్లువెత్తాలి. అప్పుడు మాత్రమే ట్రంప్ దారికొస్తారు. -
నార్వే ప్రధాని లేఖలో తేల్చిచెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ టంప్‌కు నోబెల్ బహుమతిపై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎలాగైనా ప్రపంచశాంతి బహుమతి సాధించాలని ట్రంప్ ఎక్కని గడపా లేదు.. చేయని రచ్చా లేదు. ఎలాగైనా ఈ అవార్డు తనకు ప్రకటించాలంటూ పలుసార్లు బహిరంగ ప్రకటన సైతం చేశారు. కానీ నోబెల్ మాత్రం ట్రంప్‌కు దక్కలేదు. తాజాగా ట్రంప్ మరోసారి నోబెల్‌పై తనకు ప్రకటించకపోవడంపై తనకున్న అక్కసును వెల్లగక్కారు. తాజాగా నార్వే ప్రధాని జోనస్ గహర్కు ట్రంప్ లేఖ రాశారు. అందులో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విధ్వంసానికి కారణం ఆదేశం తనకు నోబెల్ ప్రకటించకపోవడమేనన్నారు. అందువల్లే తన రూట్ మార్చానని తెలిపారు. శాంతిని వదిలి యుద్ధ బాట పట్టినట్లు పేర్కొన్నారు.ఆలేఖలో ట్రంప్ ... "నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. అయినా మీ దేశం నన్ను శాంతిదూతగా గుర్తించలేదు. అందుకే ఇక నేను శాంతి గురించి ఆలోచించాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను కేవలం అమెరికాకు ఏది లాభం చేకురుస్తోంది అదే చేస్తాను" అని ట్రంప్ లేఖలో అన్నారు. గ్రీన్లాండ్కు ఎప్పటికైనా చైనా, రష్యాల నుంచి ముప్పు పొంచి ఉంది ఈ నేపథ్యంలో ఆ భూమిపై వారికి యాజమాన్య హక్కులు ఎలా ఉంటాయి అని ట్రంప్ ప్రశ్నించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ పడవలు దిగాయి. మా భూభాగంలో కూడా పడవలు దిగాయి. అంతే .. ఆ భూమిపై యాజమాన్య పత్రాలు ఆదేశానికి లేవు అని అన్నారు.అయితే గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆక్రమించుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయాన్ని డెన్మార్క్‌తో సహా ఇతర నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆ నాటో దేశాలపై 10 శాతం సుంకం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. నోబెల్ బహుమతి ప్రకటన అనేది పూర్తిగా నోబెల్ కమిటీ ఎంపిక మాత్రమే అక్కడి ప్రభుత్వానికి అందులో ఎటువంటి జోక్యం ఉండదు. -
"భారత్ నుంచే అమెరికాకు సంపద"
ప్రస్తుతం పాకిస్తాన్- అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా బలపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో భేటీ అవ్వడం పలుమార్లు ఆ దేశానికి మద్దతుగా మాట్లాడడం జరిగింది. దీంతో భారత్ యూఎస్‌తో కొంత డిస్టెన్స్ పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా రిపబ్లికన్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఇండియాతోనే స్నేహం బాగుంటుందని అక్కడి నుండే భారత్‌కు సంపద,శాంతి లభించాయన్నారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ రిపబ్లికన్ పార్టీ ఎంపీ మెక్ కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆప్ అమెరికాకు పాకిస్థాన్‌తో కంటే భారత్‌తోనే రిలేషన్ బాగుంటుందన్నారు. అమెరికాకు పెట్టుబడులు వచ్చేవి భారత్ నుంచి తప్ప.. పాక్ నుంచి కాదని 'సెంటర్ ఫర్ స్ట్రాటజీస్అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.భారతదేశంలో అత్యధిక ప్రజలు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారని ప్రపంచంలోని మిడిల్ క్లాస్ మార్కెట్‌ని భారత్ డామినేట్ చేస్తుందని తెలిపారు. ఇండియాలోని ప్రతిభావంతులైన యువత అమెరికాకు వచ్చి దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారని మెక్ కార్మిక్ అన్నారు. అయితే ఇటీవల భారత్‌లోని యుఎస్ రాయబారి సైతం భారత్‌కు అనుకూలంగా మాట్లాడారు.అమెరికాకు భారత్ తర్వాతే మరే దేశమైనా అని అన్నారు.కాగా ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య సంబంధాలు అంత మెరుగ్గా లేవు. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై 50 శాతం పన్ను విధిస్తోంది.దీంతో ఎగుమతులు మందగించి దేశంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. -
ఇరాన్ బలం ఎఫ్-14 యుద్ధ విమానాలు... ఇచ్చిన దేశం పైనే దాడి?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏ క్షణాన రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందో అనే భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అందుకే చాలా దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి వెనక్కి రప్పించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ ఎయిర్‌ఫోర్స్‌లో కీలకంగా భావిస్తున్న ఎఫ్-14 ఫైటర్ జెట్స్ ఆ దేశానికి అమెరికా ఇచ్చినవే.. అవునండీ ఇది అక్షరాల నిజం.ఇరాన్- అమెరికా దేశాల మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంది. రెండు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే 1970లలో ఈ రెండు దేశాలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ సమయంలో ఆ దేశ అధ్యక్షుడిగా షా మహమ్మద్ రెజా పహ్లావీ ఉండేవారు. పశ్చిమాసియాలో రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా ఇరాన్‌తో చాలా స్నేహంగా ఉండేది. అందుకే అప్పుడు 79 వరకూ, F14 టామ్ క్యాట్ యుద్ధ విమానాలు ఇరాన్‌కు విక్రయించేలా కీలక ఒప్పందం చేసుకుంది. అప్పుడు ఆయుధాల ఒప్పందంలో ఈ డీల్ చాలా పెద్దది. అయితే కొంతకాలం తర్వాత అమెరికా- ఇరాన్‌ల మధ్య శతృత్వం రావడంతో అమెరికా ఆంక్షలు విధించడం ప్రారంభించింది. F-14 విడిభాగాల సరఫరా చేయడం పూర్తిగా నిలిపివేసింది. దీంతో అత్యాధునికి ఫైటర్ జెట్స్ ఉన్నా అవి ఎగరడానికి విడిభాగాలు, సాంకేతికమైన మద్ధతు లేకపోవడంతో ఆదేశం కఠిన నిర్ణయం తీసుకుంది. వాటివద్ద ఉన్న యుద్ధవిమానాలలో కొన్నింటినైనా వాడుకునేలా ప్లాన్ వేసింది. వాటి వద్ద ఉన్న F-14 విమానాలను విడగొట్టింది. వాటిని మిగతా వాటికి అమర్చి వాటితో యుద్ధంచేసేలా ప్రణాళిక వేసింది. అయితే ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎన్ని F-14 ఫైటర్ జెట్స్ అందుబాటులో ఉన్నాయా అనేది స్పష్టంగా చెప్పలేము. క్రితంతో పోలిస్తే ఎంతో కొంత తగ్గే ఉంటాయనేది కాదనలేని నిజం.ఎఫ్-14 ప్రత్యేకతలు ఎఫ్-14 యుద్ధవిమానాలు చాలా శక్తివంతమైనవి. అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ దాని సొంతం. ఇవి వందల కిలోమీటర్ల దూరం నుండి శత్రు విమానాలను టార్గెట్ చేసుకొని దాడులు చేయగలవు. అయితే వరల్డ్ సూపర్ మిలటరీ పవర్‌గా ఉన్న అమెరికాను వీటితో నియంత్రించడం అ సాధ్యం. అయితే ఆ దేశస్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
ట్రంప్ భయం?.. ఉరిశిక్ష రద్దు చేసిన ఇరాన్
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. . ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో అరెస్టైన నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానికి విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా తమ దేశంపై దాడి చేస్తుందనే భయంతోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.గత కొద్దిరోజులుగా ఇరాన్లో తీవ్రనిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. నిరసన కారులపై కాల్పులు జరిపితే తాము రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినప్పటీకీ ఇరాన్ తన తీరును మార్చుకోలేదు. నిరసనకారులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడులలో దాదాపు రెండువేల మందికి పైగా మృతిచెందారు. ఈనేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై దాడి చేయడం ఇక తప్పదని అంతా భావించారు. అయితే సడెన్‌గా పరిస్థితి యూటర్న్ తీసుకుంది.అరెస్టు చేసిన నిరసనకారులకు ఉరితీసే ఆలోచనను ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానీ మరణ శిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపినందుకు గానూ జనవరి 10న ఇర్పాన్ సోల్తానీని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది.అనంతరం నిన్న( జనవరి14న)న మరణశిక్ష అమలు జరపడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఆయన ఉరిశిక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా ఆయన మరణశిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. కాగా ఇరాన్లో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ మద్ధతుగా నిలిచారు. వారిపై దాడి చేస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందంటూ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ చల్లబడడంతో ట్రంప్ సైతం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై ట్రంప్ స్పందిస్తూ "ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపేశారని అలాగే మరణశిక్షలు వాయిదా వేసినట్లు తెలిసింది. అని వాషింగ్టన్లో ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతానికి వేచిచూసే ధోరణి అవలంభించుకుంటున్నాం" అని ట్రంప్ అన్నారు. -
ఇరాన్లో నిరసనలు.. రెండు వేల మంది మృతి!
ఇరాన్లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఊచకోతలకు పాల్పడుతోంది. తాజాగా అక్కడి ఓ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కనబడిన దృశ్యాలు హృదయ విధారకంగా కనిపిస్తున్నాయి. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌లోని ఓ ఆసుపత్రి ముందు వందల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండగా వారిలో.. తమ వారు ఉన్నారా అని భయంభయంగా అక్కడి ప్రజలు వెతుకుతున్నారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కలతచెందేలా చేస్తున్నాయి.ఇరాన్లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్‌లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.రెండు వేల మంది మృతిఇప్పటివరకూ నిరసనలో పాల్గొన్న వారిలో 2 వేల మంది మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. తమ దేశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం ఎక్కువైతే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన ఓమంత్రి ఈ నిరసనలను ఖండిస్తున్నారు. అయితే ఇరాన్ రెడ్‌లైన్ దాటిందని అక్కడి పరిస్థితులను అమెరికా నిశితంగా గమనిస్తుందని తమ నిర్ణయం త్వరలోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.Dozens of black body bags seen in Iran. pic.twitter.com/6PB0y6sNxP— Open Source Intel (@Osint613) January 13, 2026 -
"భారత్ తర్వాతే మాకు ఎవరైనా": అమెరికా
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవు. ట్రంప్ పన్నుల మోతతో ఇరు దేశాల మధ్య డిస్టెన్స్ కొద్దిగా పెరిగింది. ఈ నేపథ్యంలో యూఎస్ రాయబారి సెర్గియా గోర్ కీలక ప్రకటన చేశారు. అమెరికాకు భారత్ తర్వాతే ఏదేశమైనా అని అన్నారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్ పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టాక భారత్‌కు అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతాయని అంతా ఆశించారు. దానికి కారణం కూడా లేకపోలేదు. భారత ప్రధాని మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు కావడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగపడతాయనుకున్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ట్రంప్ పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యానించడం, తనవల్లే రెండుదేశాల మధ్య యుద్ధం ఆగిందని తరుచుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత్ ఖండించినా ట్రంప్ తన తీరు మార్చుకోలేదు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొంటే అధిక పన్నులు వేస్తానని బెదిరించారు. ఇలా అమెరికాతో డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియా గోర్ ఈ రోజు( సోమవారం) బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్రైపాక్షిక సంబంధాలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. " డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహం నిజమైనది. కనుక వారిమధ్య ఏవైనా విభేదాలు ఉంటే వారి పరిష్కరించుకుంటారు. అమెరికాకు భారత్ అంత కీలకమైన దేశం మరేదిలేదు. ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటించే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.తాను ట్రంప్‌తో చివరిసారి డిన్నర్ చేసినప్పుడు ట్రంప్ తన చివరి భారత పర్యటన వివరాలను గుర్తు చేసుకున్నారని ప్రధాని మోదీతో మైత్రి అపూర్వమని ఆయన అన్నారని తెలిపారు. భారత్, అమెరికా మధ్య రెండవ దశ ట్రేడ్ డీల్స్ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాయబారిగా భారత్-అమెరికా మధ్య సరైన ఎజెండా రూపొందించడం రాయబారిగా తన బాధ్యతని సెర్గియా గోర్ పేర్కొన్నారు. -
పాక్-అమెరికా సైనిక విన్యాసం.. ఎందుకో తెలిస్తే షాక్..!
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా- పాక్ సంయుక్తంగా “Inspired Gambit 2026” జాయింట్ కౌంటర్ టెర్రరిజం సైనిక విన్యాసం పంజాబ్ ప్రావిన్సులో చేపడుతుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై ఇరు దేశాలు ఉమ్మడి డ్రిల్ నిర్వహిస్తున్నాయి.హంతకులే సంతాప సభలు చేస్తారు అనే ఒక నానుడి మన వాడుక భాషలో చాలా ప్రాచుర్యంలో ఉంది. పాకిస్థాన్ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ముష్కరులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్న ఆ దేశం ఇప్పుడు అమెరికాతో సంయుక్తంగా కలిసి జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపడుతుంది. ఇటీవల భారత భద్రతా ఏజెన్సీలు 131 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో ఉన్నారని నివేదికలు అందించగా అందులో 122 మంది పాకిస్థాన్‌కు చెందిన వారేనని పేర్కొంది. అయినప్పటీకీ ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లుగా అమెరికాతో డ్రిల్ నిర్వహిస్తుంది. కాగా ప్రస్తుతం సరిహద్దు రేఖ వెంబడి భారత బలగాలు నిఘాను ముమ్మరం చేశాయి. ఉగ్రవాదుల చొరబడే అవకాశం ఉందని భద్రతా బలగాలు హెచ్చరించడంతో కట్టుదిట్టమైన పహారా నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే ఈ ఆపరేషన్ నిర్వహిస్తుండడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. డ్రోన్లు, ఇతర పేలుడు పదార్థాలు భారత సరిహద్దులోకి పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.అయితే ఈ ఆపరేషన్‌పై భారత ఆర్మీ అధికారులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తున్న దేశం. భారత్‌పైకి దాడి చేసే ముష్కరులు ఆశ్రయం కల్పిస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్-అమెరికా దౌత్య సంబంధాలు చాలా మెరుగైన సంగతి తెలిసిందే. -
ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగేది ఇదే?
డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా చర్చనీయాంశమయ్యింది. వెనిజువెలా అధ్యక్షున్ని వారి దేశంలోనే బంధించి అమెరికాకు లాక్కెళ్లి ట్రంప్ తన రౌడీయిజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అని బలంగా చర్చ నడుస్తోంది. అక్కడ జరుగుతున్న నిరసనలు ఈ వాదనకు కొంత మేర బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగే పరిణామాలు తెలుసుకోవానుందా? అయితే ఈ కథనం చదవండి.ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అక్కడ ద్రవ్యోల్బణం, పేదరికం, అవినీతి కారణంగా విసిగిపోయిన ప్రజలు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఖమేని పాలన అంతం అవ్వాలని నినాదాలు ఇస్తున్నారు. అక్కడి మహిళలు సైతం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ధరించే హిజాబ్‌లను తొలగించి వాటిని తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనకారులపై దాడులు చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌పై దాడికి దిగి ఆదేశ సుప్రీం ఖమేనీని బంధిస్తారా? అనే ఊహాగానాలు మెుదలయ్యాయి.ఇరాన్ సైనిక శక్తివెనిజువెలాతో పోలిస్తే ఇరాన్ సైనిక పరంగా ఎంతో బలమైంది. దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఆర్మీ ఆ దేశ సొంతం. అంతేకాకుండా 15 బిలియన్ల డాలర్లకు పైగా ఆర్మీ బడ్జెట్ కలిగి ఉంది. 10 వేలకు పైగా యుద్ధ ట్యాంకులు, మూడు వందలకు పైగా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు పటిష్ఠమైన నేవీ విభాగం ఇరాన్ సొంతం. అన్నిటి కంటే ప్రధానంగా ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ దాదాపు 2000 కిలోమీటర్ల రేంజ్ కవర్ చేసేవి ఉన్నాయి. వీటితో ఇరాన్ బలమైన ప్రాంతీయ శక్తిగా అవతరించింది. అంతేకాకుండా అణుబాంబు తయారికి ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుందని వాదనలు ఉన్నాయి.ఆర్మీ పరంగా ఇంత బలంగా ఉన్నప్పటికీ వరల్డ్ సూపర్ పవర్‌గా ఉన్న అమెరికాను ఎదిరించడం ఇరాన్‌కు కష్టమే.. అయితే వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా ఖమేనీని అదుపులోకి తీసుకోలేరనేది కాదనలేని వాస్తవం. ఒకవేళ ఖమేనీని ట్రంప్ కిడ్నాప్ చేస్తే ఇరాన్ పూర్తి స్థాయి యుద్దానికి దిగే అవకాశం ఉంది. దీంతో ఇరు వైపులా భారీ నష్టంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.ఇస్లాం దేశాల మద్ధతుఇరాన్కు ఇస్లాం దేశాల పూర్తి మద్దతు లభించడం కష్టం ఎందుకంటే ఇరాన్ ప్రజలు షియా మతాన్ని అవలంభిస్తారు. ప్రపంచంలో షియామతం పాటించే దేశాలు ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, బహ్రెయిన్ యెమెన్ దేశాల సహాకారం లభించే అవకాశం ఉంది. అదే సున్నీ మతం పాటించే సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, యెమన్ తదితర దేశాలు చాలా వరకూ ఇరాన్‌కు సపోర్టుగా నిలువవు. అయితే మిలటరీ పవర్స్ అయినా రష్యా, చైనా దేశాలతో ఇరాన్‌కు మంచి సంబంధాలున్నాయి. అయితే ఆ సపోర్ట్ అమెరికాకు ఎదురు నిలిచి నేరుగా యుద్ధంలో పాల్గొనేంతగా ఉంటుందా అంటే కాదనే సమాధానమే వస్తోంది.మూడో ప్రపంచ యుద్ధంఅయితే ప్రస్తుతం ట్రంప్ మామ మంచి జోరుమీదున్నారు. వెనిజువెలా అధ్యక్షున్ని బంధించిన తనను ఎవరూ ప్రశ్నించలేదు అని ఫీలవుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్లో పరిస్తితులు ఏమాత్రం బాగాలేవు. దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖమేనీని బంధిస్తే పెద్ద వ్యతిరేకత ఎదురుకాకపోవచ్చు. అంతే కాకుండా మూడోప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అయితే ఈ కిడ్నాప్ వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా మాత్రం ఉండదు అనేది కాదనలేని సత్యం. -
ట్రంప్ ముందు మోకరిల్లిన పాక్
ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్థాన్ ఎంతగా దిగజారిపోయిందనే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ఈ ఉద్రిక్తతల్లో తలదూర్చాలని అమెరికాను బతిమాలిందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చర్చల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసింది. అమెరికాకే చెందిన 'ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్' (FARA) ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు బయటపెట్టింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే భావన నెలకొంది. ఇరు దేశాలు సంయమనం పాటించి కాల్పుల విరమణ పాటించాయి. అయితే ఈ అంశంలో తరుచుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నోటివాటం చూపించారు. వీరిద్దరి మధ్య యుద్ధం తానే ఆపానన్నారు. అధిక పన్నులు వేస్తానని హెచ్చరించడంతో రెండు దేశాలు వెనక్కి తగ్గాయన్నారు. అనంతరం పాక్‌ను అక్కున చేర్చుకొని ఆ దేశానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ భారత్‌తో డిస్టెన్స్ మెయింటేన్ చేశారు.అయితే తాజాగా ఈ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం అమెరికా మద్ధతు కోసం పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించిందని FARA నివేదిక తెలిపింది. అమెరికా తనకు మద్దతిచ్చేలా వ్యవహరించడానికి అనేక లాబీయింగ్ సంస్థలను రంగంలోకి దింపినట్లు ప్రచురించింది. ఈ లాబీయింగ్ సంస్థల ద్వారా పాక్ దౌత్యవేత్తలు, లాబీయిస్టులు.. అమెరికా చట్టసభల ప్రతినిధులతో పాటు పలు విభాగాల అధిపతులను, రక్షణశాఖ అధికారులను భేటీ అయ్యారని పేర్కొంది.పాకిస్థాన్ లాబీయింగ్ కుదుర్చుకున్న ఏజెన్సీలో డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితులైన జార్జ్ సోరియల్, కీత్ షిల్లర్ వంటి వారు ఉన్నారంది. అంతేకాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వాషింగ్టన్ పర్యటనను సైతం ఈ లాబీయింగ్ సంస్థలే ఏర్పాటు చేశాయని FARA తెలిపింది. ప్రధాన పత్రికలైన 'వాల్ స్ట్రీట్ జర్నల్', 'న్యూయార్క్ టైమ్స్' వంటి అంతర్జాతీయ పత్రికల్లో పాకిస్థాన్‌కు అనుకూలంగా కథనాలు వచ్చేలా మీడియా మేనేజ్మెంట్ చేసిందని పేర్కొంది. దీనికోసం స్వల్పకాలంలో పాక్ ఐదు మిలియన్ డాలర్లు.. భారత్ కరెన్సీలో దాదాపు రూ. 45కోట్లు ఖర్చుచేసినట్లు ప్రచురించింది. దీంతో ట్రంప్, భారత్‌తో గ్యాప్‌కు పాక్ సంప్రదింపులు సైతం ఓ కారణమేనా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో భారత్ సైతం అమెరికాతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించిందని 'ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్' ప్రచురించింది. -
నెక్ట్స్ టార్గెట్ ఇరాన్? అదే జరిగితే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మారు మోగిపోతుంది. వెనెజువెలా అధ్యక్షున్ని ఆయన దేశంలోనే నిర్భంధించి అమెరికా జైల్లో పడేయడంతో.. ట్రంప్ మాటలే కాదు చేతలూ చేయగలడని అంతా అనుకుంటున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడి నెక్స్ట్ టార్గెట్ ఏ దేశమా? అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక వేత్త జెప్రీ సాచస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితులు చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉందన్నారు.ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టినాటి నుంచి అమెరికాతో సత్సంబంధాలు లేకున్నా ఆ దేశానికి వ్యతిరేకంగా ఉన్నా అస్సలు సహించడం లేదు. 'మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్' అనే భావనతో చాలా దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అధిక పన్నులు వేయడంతో పాటు ప్రత్యక్ష యుద్దాలకు వెనుకాడడం లేదు. తనకు అనుకూలంగా లేని దేశాలను ఇన్ని రోజులు మాటలతో హెచ్చరించిన ట్రంప్ తాజాగా తన సత్తా ఎంటో చూపాడు. అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే నెపంతో వెనిజువెలా అధ్యక్షుడిని బంధించి అమెరికా తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ దేశం అయి ఉండవచ్చని ప్రముఖ ఆర్థిక వేత్త జేప్రీసాచ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆయన ఏమన్నారంటే.. "ప్రస్తుతం ట్రంప్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నారు. ఆయన మెుదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ‘‘నేను వెనెజువెలాపై ఎందుకు దాడి చేయకూడదు’’ అని అనుకున్నారు. అంటే ఆ భావన ఎప్పటి నుంచో ఆయనలో ఉందన్నమాట. అయితే ఇటీవల జరిగిన కొత్త సంవత్సర వేడుకలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుతో కలిసి ‘‘ఇరాన్.. నెక్స్ట్ నువ్వే’’ అన్నారు. బహుశా ట్రంప్ తదుపరి టార్గెట్ ఇరానే అయి ఉండవచ్చు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇరాన్ వద్ద అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైల్స్ ఉండడంతో పాటు ఆ దేశానికి ప్రధాన శక్తుల అండ ఉంది. ఇది ప్రపంచ వినాశనానికి దారి తీయవచ్చు" అని ఆయన అన్నారు.అమెరికా విదేశాంగ విధానాన్ని అక్కడే పెంటగాన్ నడిపిస్తోంది అన్నారు. అదేవిధంగా యూఎస్ కంటే ఇజ్రాయెల్ మరింత ప్రమాదకరమైన దేశమన్నారు. ఇండియా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెప్రీ సాచస్ పైన పేర్కొన్న వివరాలు పంచుకున్నారు. కాగా గతేదాడి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరగగా అమెరికా మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. ఆదేశానికి చెందిన బి-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులు నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. తర్వాత ట్రంప్ ఎంట్రీతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే అణు ఒప్పంద విషయంలో మాత్రం ట్రంప్ ఇరాన్‌పై ఇంకా అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. -
వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగొచ్చింది: మచాడో
నికొలస్ మదురోను అమెరికా నిర్బంధించిన తర్వాత వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో తొలిసారిగా స్పందించారు. అమెరికా హామీని నిలబెట్టుకుందన్న మచాడో.. ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం బందీగా తీసుకెళ్లడంతో వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగి వచ్చిందంటూ ప్రకటించారు.వెనెజువెలా ప్రజలను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన మచాడో.. వెనెజువెలా ప్రజలు, ఇతర దేశాల పౌరులపై జరిగిన దారుణమైన నేరాలకు నికొలస్ మదురో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ‘‘మదురోపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో-టెర్రరిజం ఆరోపణలు ఉన్నాయి. చర్చలతో సమస్య పరిష్కారానికి ఆయన నిరాకరించాడు. దీంతో అమెరికా తన హామీని నిలబెట్టుకుంది’ అని మచాడో ట్వీట్ చేశారు.ప్రజాస్వామ్యం కోసం కొన్నేళ్లుగా తాను చేసిన పోరాటం ఫలించిందన్న మచాడో.. శాంతియుతంగా, ప్రజస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా, వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. నెజువెలా అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకెళ్లాక ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు పాలనా బాధ్యతలు అప్పగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆమె సారథ్యంలో పాలన కష్టమేమో. ఆమెకు వెనెజువెలా ఇంటా, బయటా పూర్తిస్థాయి మద్దతు లేదు. అయినా ఆమె చాలా మంచి మనిషి’’ అని పేర్కొన్నారు. ‘వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్తో మాట్లాడా.. అమెరికా ఏమి అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు’’అని ట్రంప్ వెల్లడించారు. -
International news: వెనెజువెలాపై అమెరికా ఎయిర్ స్ట్రైక్?
-
అమెరికా వదిలేస్తే.. ట్రంప్ ఆపర్
అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని అక్రమ వలసదారుల కోసం క్రేజీ డీల్ ప్రకటించింది. ఆ దేశంలో ఉన్న అక్రమ వలసదారులు దేశాన్ని వదిలి వెళితే వారికి మూడు వేల డాలర్లు అంటే అక్షరాల రూ. 2.68 లక్షలు ఇస్తానని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ ఏడాది చివరి వరకే ఉంటుందని కండీషన్ విధించింది.ట్రంప్ ఈ పేరు వింటే చాలు యుఎస్‌లో ఉంటున్న అక్రమ వలసదారులకు కంటిమీద కులుకు ఉండదు. వారిపై ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అని బెంబేలిత్తిపోతారు. ఎందుకంటే అధికారం చేపట్టి నాటి నుంచి ట్రంప్ ఫస్ట్ టార్గెట్ ఆ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని తరిమికొట్టడమే. వారిని దేశం నుంచి పంపించడానికి ట్రంప్ ఎన్నో కఠిన చట్టాలు తెచ్చారు. అయినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో వారు వెళ్లకపోవడంతో ప్రస్తుతం వారి కోసం యూఎస్ గవర్నమెంట్ ఒక డీల్ తెచ్చింది.డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు క్రిస్మస్ ఆపర్ ప్రకటించింది. యూఎస్‌లో ఉంటున్న అక్రమ వలసదారులు ఎవరైతే తమ దేశాన్ని విడిచి వెళ్లాలనుకుంటారో వారికి డిపార్ట్మెంట్ ఆప్ హోమ్‌లాండ్ సెక్యురిటీ మూడు వేల డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వారిపైన ఏవైనా జరిమానాలు, ఇతరత్రా ఏమైనా ఉన్నా రద్దు చేస్తామని పేర్కొంది.దాని కోసం ఇది వరకే రూపొందించిన సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్‌ను ఉపయోగించాలని DHS తెలిపింది. అమెరికాను వదిలి వెళ్లాలనుకునేవారు CBP యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వారి వివరాలను అందులో నమోదు చేయాలని పేర్కొంది. ఆ తర్వాత వారి ప్రయాణ ఖర్చులు తదితర విషయాలను డిపార్ట్మెంట్ ఆప్ హోమ్‌లాండ్ సెక్యురిటీ సంస్థ చూసుకుంటుందని తెలిపింది. అక్రమ వలసదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DHS సెక్రటరీ క్రిస్టి నోయోమ్ తెలిపారు.ఒకవేళ అక్రమంగా నివాసముంటూ తమకు పట్టుబడితే వారిని అరెస్టు చేసి బలవంతంగా వారి దేశాలకు పంపిస్తామని హెచ్చరించారు. గతంలో అమెరికా వదిలి అక్రమ వలసదారులకు ట్రంప్ వెయ్యి డాలర్లు చెల్లిస్తామని తెలిపారు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 1.9 మిలియన్ల మంది స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. -
భారత్‌పై ట్రంప్ పగ?.. ఎందుకిలా..?
అమెరికా.. సగటు ఇండియన్ డాలర్ డ్రీమ్‌కు కేరాఫ్ అడ్రస్. గత కొన్ని దశాబ్దాలుగా ఆ కలను నిజం చేసుకునేందుకు లక్షలాది మంది భారతీయులు శ్వేతసౌధం ముందు వాలిపోయారు.. తమ కలను సాకారం చేసుకున్నారు కూడా. కాని.. ఇప్పుడా భారతీయుల ఆ కలలసౌధం ట్రంప్ రూపంలో కుప్పకూలుతోంది. నిమిషానికో నిబంధన, రోజుకో చట్టం తీసుకొస్తూ సగటు భారతీయుని ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దీంతో అమెరికా అంటేనే అమెరికానా..? అనేలా చేస్తున్నారు. దీనికి నిదర్శనం ఈ ఏడాది జరిగిన డిపోర్టేషన్ల సంఖ్యే.అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికాలో సగటు భారతీయుడి జీవితం బిక్కుబిక్కుమంటూ గడుస్తోంది. ఇండియన్ల పరిస్థితే కాదు.. అక్కడుంటున్న అన్ని దేశాల వారి పరిస్థితీ ఇదే. అయితే మనది కొంచెం ఎక్కువ. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్ణులా.. ఎప్పుడు ఏ చట్టంతో కొడతాడో.. ఏ రూలును ఝులిపిస్తాడో.. ఏ వైపు నుంచి వేటు వేస్తాడోనన్న చందంలా మారింది అమెరికాలో నివశిస్తున్న విదేశీయుల పరిస్థితి. ఓ రోజు H1b అంటాడు.. మరో రోజు విద్యార్థులపై పడతాడు.. ఇంకో రోజు పన్నులంటాడు. ఇలా బతుకుదెరువు కోసం వెళ్లిన విదేశీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంపన్న. ఇలా ఏదో ఒక కారణ చెప్పి అక్కడ్నుంచి బలవంతంగా పంపించేస్తున్నాడు.ఈ సందర్భంగా డిపోర్టేషన్‌కు సంబంధించి ఓ భయంకరమైన న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల సంఖ్య. ఈ ఒక్క సంవత్సరమే అక్రమంగా ఉన్నారంటూ 3,258 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించిందన్న వార్త కలకలం రేపుతోంది. 2025 జనవరి 1 నుండి నవంబర్ 28 వరకూ జరిగిన డిపోర్టేషన్ల సంఖ్య ఇది.2024తో పోలిస్తే ఈ ఏడాది బహిష్కరణల సంఖ్య రెండు రెట్లు అధికంగా ఉండడం మరింత ఆందోళన కలిగించే అంశం. 2009 తర్వాత నమోదైన అత్యధిక వార్షిక సంఖ్య కూడా ఇదే. దీనిపై అమెరికన్లే తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో అగ్రరాజ్యం అతి చేస్తోందని సగానికి పైగా అమెరికన్లు అభిప్రాయపడినట్లు Pew Research Centre సర్వేలో వెల్లడైంది.రాజ్యసభలో మంత్రి రామ్‌జీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ గణాంకాలను వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం ప్రకారం బహిష్కరణకు గురైన వాళ్లంతా అక్రమంగా దేశంలోకి ప్రవేశించినవాళ్లు, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయినవాళ్లు. అలాగే ఏ డాక్యుమెంట్లూ లేకుండా అమెరికాలో నివాశముంటున్న వారు, లేదా నేర నిర్ధారణ జరిగిన వాళ్లు.దీనిపై ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో సగానికి పైగా అమెరికన్ పెద్దలు ట్రంప్ ప్రభుత్వం బహిష్కరణల విషయంలో పరిధి దాటి ప్రవర్తిస్తోందని నమ్ముతున్నారట. అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలా అని అడిగినప్పుడు, కేవలం 31% మంది మాత్రమే అవును అని చెప్పారు. సగానికి పైగా ప్రజలు కేవలం కొందరిని మాత్రమే బహిష్కరించాలని నిర్భంయగా చెప్పారు. ఈ డిపోర్టేషన్లపై వ్యతిరేకత మార్చి నుండి అక్టోబర్ మధ్య 9 శాతం పెరిగడం గమనార్హం. మరింత ఆశ్చర్యకరంగా ఈ మార్పు అటు రిపబ్లికన్లలో, ఇటు డెమొక్రాట్లలో కూడా కనిపించడం. అంటే ప్రతపక్షంలోనే కాదు.. అధికార పక్షంలోనూ ఈ అభిప్రాయం ఉందన్నమాట.ఈ సర్వేను మరింత డీటెయిల్డ్‌గా చూస్తే.. మార్చిలో కేవలం 13% మంది రిపబ్లికన్లు ప్రభుత్వం అతి చేస్తోందని భావించగా, అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 20 శాతానికి చేరింది. డెమొక్రాట్లలో ఈ అభిప్రాయం 86 శాతానికి పెరిగింది. రిపబ్లికన్లలో ఎక్కువ శాతం మంది ఇప్పటికీ అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరుకుంటున్నారు.వీరిలో వైట్ రిపబ్లికన్లు అత్యధికంగా ఉండగా, సుమారు 40 శాతం మంది ఆసియా రిపబ్లికన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. డెమొక్రాట్లలో కేవలం 8 శాతం మంది మాత్రమే అందరినీ పంపించేయాలని కోరుకోగా, 16 శాతం మంది బ్లాక్ డెమొక్రాట్లు అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరారు. హిస్పానిక్ వర్గానికి చెందిన వారు అంటే రెండు పార్టీలలోనూ ఎవరినీ బహిష్కరించకూడదని కోరుకుంటున్న వారిలో అధికంగా ఉన్నారు.మార్చి నుంచి అక్టోబర్ వరకు బహిష్కరణల విషయంలో ట్రంప్ అతి చేస్తున్నాడనే సాధారణ ఆందోళన రెండు పార్టీల్లోనూ పెరిగినప్పటికీ, వ్యక్తిగత ప్రభావం పట్ల ఆందోళన అంతగా పెరగలేదు. మార్చిలో 27 శాతం డెమొక్రాట్లు తమ ఇమ్మిగ్రేషన్ లేదా సిటిజన్‌షిప్ స్టేటస్‌తో సంబంధం లేకుండా తమకు, తమ కుటుంబ సభ్యుడికి లేదా స్నేహితుడికి బహిష్కరణ ముప్పు ఉందని ఆందోళన చెందారు.అక్టోబర్‌కు వచ్చేసరికి ఇది 40 శాతం కంటే ఎక్కువ పెరగడం గమనార్హం. రిపబ్లికన్ రెస్పాండెంట్లు మాత్రం ఏడాది పాటు తమ నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నారు. మార్చి, అక్టోబర్ రెండింటిలోనూ కేవలం 10శాతం మంది మాత్రమే ఈ విషయాన్ని చెప్పారు. హిస్పానిక్ వ్యక్తుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది తమ ఫ్రెండ్స్ డిపోర్టేషన్‌కు గురవుతారేమోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే.. తమ ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు లేదా అరెస్టులు చేస్తున్నారని 60 శాతం మంది హిస్పానిక్ ప్రజలు తెలిపారు. ఆసియన్లలో ఈ సంఖ్య 47%, బ్లాక్ పీపుల్‌లో 39%, వైట్ పీపుల్‌లో 38% గా ఉంది.మా దేశంలోకి అడుగు పెట్టొద్దు..: ప్రపంచంలోని 20% దేశాలపై అమెరికా ఆంక్షలుఅమెరికాకు ఏమైంది.. ఆంక్షల పేరుతో నిత్యం ఏదోఒక దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న ఈ అగ్రరాజ్యం ప్రపంచ దేశాలపై మరో బాంబు వేసింది. గత కొన్ని రోజులుగా ట్రావెల్ బ్యాన్ పేరుతో కొత్త పేచీని తెరపైకి తీసుకొచ్చిన అమెరికా దాన్నిప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే దాదాపు 20 దేశాల ప్రజలు అమెరికాలోకి అడుగుపెట్టకుండా నిషేధించిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరిన్ని దేశాలను ఈ జాబితాలో చేర్చింది.ప్రధానంగా ఆఫ్రికా నుంచి వచ్చే దేశాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేస్తూ యూఎస్‌లో ప్రవేశానికి పూర్తి లేదా పాక్షిక నిషేధం విధించింది. ఇది వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటికే ఉన్న ట్రావెల్ నిషేధాలు, పరిమితుల లిస్ట్‌లో మరిన్ని ఆఫ్రికన్, వెస్ట్ ఏషియన్తోపాటు మరికొన్ని ఇతర దేశాలను చేర్చినట్లైంది. మొత్తం నిషేధం, పరిమితులు ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య 39కి చేరింది. టోటల్‌గా ఈ సంఖ్య ప్రపంచ దేశాల్లో దాదాపు సుమారు 20%. అంటే.. ప్రపంచంలోని దాదాపు 20శాతం దేశాల ప్రజలు అమెరికావైపు కన్నెత్తి కూడా చూడకూడదన్నమాట.తాజా ట్రావెల్ బ్యాన్ విస్తరణలో అమెరికా ఐదు దేశాలపై పూర్తి ట్రావెల్ బ్యాన్ విధించింది. బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియా దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించారు. దీంతోపాటు పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారిపై కూడా కఠిన ఆంక్షలు ఉంటాయి. ఇవి కాకుండా మరో 15 దేశాలు పాక్షిక ట్రావెల్ పరిమితులు ఎదుర్కోనున్నాయి. అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోట్ డి ఐవోర్, డొమినికా, గాబన్, గాంబియా, మలావీ, మౌరిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక ఆంక్షల ఈ జాబితాలో ఉన్నాయి.ఇది ఇమ్మిగ్రెంట్, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై ప్రభావం చూపుతుంది. ఇక్కడి భారతీయులపైనా ప్రభావం పడనుంది. టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో సంపన్నులైన భారతీయ సంతతి ప్రజలు అధికంగా ఉన్నారు.. ఈ నిర్ణయం వీరిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటితోపాటు యాంటిగ్వా, బార్బుడా వంటి కొన్ని కరీబియన్ దేశాలపై నిషేధం విధించడం జరిగింది. వీరు విదేశీయులకు ఇచ్చే సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ద్వారా పౌరసత్వం ఇచ్చే పథకం అని తెలుస్తోంది.తొలుత ఈ ట్రావెల్ బ్యాన్‌ను ఈ ఏడాది జూన్‌లో ప్రకటించారు. అమెరికా జాతీయ, ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని 19 దేశాల పౌరుల ప్రవేశాన్ని నిషేధించింది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్, ఇరాన్, సోమాలియా, యెమెన్ వంటి దేశాలపై పూర్తి ప్రవేశ నిషేధం విధించగా.. లావోస్, వెనిజులా వంటి దేశాలపై పాక్షిక నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. అవినీతి పరులు, క్రిమినల్స్, మోసగాళ్ల విషయంలో అమెరికా అధికారులకు ఇమ్మిగ్రేషన్ తనిఖీలప్పుడు కష్టమవుతోందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది.వీసా పరిమితి ముగిసినా ఉంటున్న వారు, తాము బహిష్కరించినా తమ పౌరుల్ని వెనక్కి తీసుకోడానికి కొన్ని ప్రభుత్వాలు నిరాకరించడం, బలహీనమైన భద్రతా సహకారం వంటి కారణాలను అమెరికా చూపుతోంది. వాషింగ్టన్ డీసీలో ఓ ఆఫ్ఘన్ జాతీయుడు ఇద్దరు అమెరికన్ నేషనల్ గార్డ్ సైనికులపై జరిపిన కాల్పుల ఘటనను ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా వైట్ హౌస్ పేర్కొంది.సదరు వ్యక్తికి అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు జరిగినప్పటికీ, భద్రతా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. అమెరికా శరణార్థుల దరఖాస్తుల్ని ప్రాసెస్ చేసే కేంద్రంలో అక్రమంగా పనిచేస్తున్న ఏడుగురు కెన్యా జాతీయుల్ని దక్షిణాఫ్రికా అధికారులు అరెస్టు చేసి బహిష్కరించారు. వారంతా టూరిస్ట్ వీసాలపై వచ్చి అక్కడ పనిచేస్తున్నట్లు గుర్తించారు.ఈ ట్రావెల్ బ్యాన్ ఎక్స్‌పాన్షన్‌ను కొందరు రిపబ్లికన్ శాసనసభ్యులు, ఇమ్మిగ్రేషన్ హార్డ్‌లైనర్లు గట్టిగా సమర్థించారు. ఇది దేశ భద్రతకు, అక్రమ వలసల్ని అరికట్టడానికి అవసరమైన సరైన చర్య అని వాదిస్తున్నారు. భద్రతా సహకారం, డాక్యుమెంటేషన్ స్టాండర్డ్‌లకు విదేశీ ప్రభుత్వాలను జవాబుదారీగా చేయడం సరిహద్దు సమగ్రతను బలోపేతం చేస్తుందని వారు వెనకేసుకొచ్చారు.అయితే కేవలం జాతీయతను బట్టి ఒక దేశం మొత్తాన్ని ప్రమాదకరంగా చూడటం సరికాదని, నేర చరిత్ర లేని సాధారణ పౌరుల్ని ఇది ఇబ్బంది పెడుతుందని మానవ హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ట్రంప్ గతంలో నార్వే, స్వీడన్ వంటి దేశాల నుండి వలసలను ఇష్టపడతానని, అభివృద్ధి చెందని దేశాలను కించపరిచేలా మాట్లాడారని గుర్తు చేస్తున్నారు. -
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అమెరికా బర్మింగ్‌హామ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. కాగా అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. -
మారిన విలువలు
కాస్త ఆలస్యం కావొచ్చు గానీ... పుష్కలంగా డబ్బూ, కండబలం ఉన్నవాడు ఎన్ని నేరాలు చేసినా మర్యాదస్తుడిగా మారడం కష్టమేం కాదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు బుధవారం అమెరికాలో లభించిన స్వాగత సత్కారాలు చూస్తే తెలుస్తుంది. ఏడేళ్ల క్రితం ఆయన అంతర్జాతీయంగా అంటరానివాడు. సల్మాన్‌ను ఆహ్వానించటానికి అమెరికా జంకింది. సౌదీలో జరిగే పెట్టుబడుల సదస్సును పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించాయి. కానీ ఇప్పుడంతా మారింది.సల్మాన్‌కు 21 శతఘ్నుల వందనం, అశ్వారూఢులైన నావికాదళ పటాలం మేళతాళాలు, యుద్ధ విమానాల పరేడ్... ఒకటేమిటి ఆయన రాకే పెద్ద వేడుకన్నట్టు అధికార వ్యవస్థ సమస్తం పులకించిపోయింది. అమెరికాలో సల్మాన్ షాపింగ్ తక్కువేం లేదు మరి. దొంగచాటుగా వెళ్లి శత్రు స్థావరంపై దాడిచేయగలిగిన ఎఫ్–35 యుద్ధ విమానాలు, అణుశక్తి సాంకేతికత, చిప్‌లు, అరుదైన ఖనిజాల వేటలో సహకారం వగైరాలన్నీ అందులో ఉన్నాయి. వీటి విలువ అక్షరాలా లక్ష కోట్ల డాలర్లు. అదిగాక ట్రంప్ కుటుంబానికి గల్ఫ్ దేశాల్లో వందల కోట్ల డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అండదండలందించేందుకు సౌదీ ఇప్పటికే అంగీకరించింది.వీటన్నిటి పర్యవసానంగానే ఈ మర్యాదలు! నిజానికి ఆయనతో మళ్లీ సాన్నిహిత్యం కావాలని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రయత్నించకపోలేదు. జెడ్డాలో 2022లో పర్యటించినప్పుడు ఆయన్ను ‘భవిష్యత్తు రాజు’గా కీర్తించారు. కానీ ప్రజాభిప్రాయానికి జడిసి అమెరికా ఆహ్వానించటానికి సందేహించారు. బిన్ సల్మాన్ దుష్కృత్యం సాధారణమైనది కాదు. రాజ కుటుంబానికి సన్నిహితు డిగా, ‘వాషింగ్టన్ పోస్ట్’ కాలమిస్టుగా ఉన్న జమాల్ ఖషోగ్గీ తనపై తరచు చేసే విమర్శలు ఆయన తట్టుకోలేకపోయాడు. సల్మాన్ బతకనీయడని తెలిసి ఖషోగ్గీ అమెరికా వెళ్లి పోయారు. తన ప్రియురాల్ని పెళ్లాడటానికి అమెరికాలో దాఖలు చేయాల్సిన పత్రాల కోసం సౌదీ వెళ్లాల్సివున్నా, ముప్పు తప్పదన్న ఉద్దేశంతో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌కు వెళ్లారు. తీరా సౌదీ నుంచి వచ్చిన 15 మంది హంతక ముఠా అంతకుముందే అక్కడ మాటువేసి ఆయన్ను మట్టుబెట్టింది.మామూలుగా కాదు... మనిషిని హతమార్చి, ముక్కలుగా కోసి ఎముకలన్నీ యాసిడ్‌లో కరిగిపోయేలా చేశారు. సల్మాన్ ఆదేశాలతోనే ఆ దారుణానికి ఒడిగట్టారని అప్పట్లోనే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తేల్చింది. కాన్సులేట్ వద్దగల సీసీ కెమెరాల్లో ఖషోగ్గీకి ముందే 15 మంది సభ్యులు లోపలికెళ్లటం, కొన్ని గంటల తర్వాత వారంతా నిష్క్రమించటం రికార్డయింది. అంత ర్జాతీయ పాత్రికేయుల్లో ప్రతిష్ఠగల ఖషోగ్గీ హత్య అమెరికా, పాశ్చాత్య దేశాల ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిల్చింది. అందుకే తన తొలి ఏలుబడిలో సల్మాన్‌ను ట్రంప్ దూరం పెట్టారు. హత్యలో ఆయన ప్రమేయం రుజువైందని వ్యాఖ్యానించారు.కానీ ఇన్నేళ్లు గడిచాక ట్రంప్ తీరు మారింది. ‘మీపై సీఐఏ నివేదిక గురించి ఏమంటార’ని ఏబీసీ చానెల్ మహిళా ప్రతినిధి ఒకరు సల్మాన్‌ను అడిగేసరికి ట్రంప్ మండి పడ్డారు. ‘అదంతా ఏం లేదు... ఖషోగ్గీ వివాదాస్పదుడు. ఈ ప్రశ్న వేసి అతిథిని అవమానిస్తావా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏబీసీ ‘ఫేక్ న్యూస్’ అంటూ దూషించారు. ఆయనతో పోలిస్తే సల్మాన్ నాగరికంగా మాట్లాడారు. తన ప్రమేయం లేదని వివరించారు. నిజానికి సౌదీ పెట్టుబడుల రాక అంత సులభం కాదు. ఇప్పటికే ఎఫ్–35లను వినియోగిస్తున్న ఇజ్రాయెల్ అభ్యంతరాలను కాదని సౌదీకి ఇవ్వటం అసాధ్యం. పైగా ఆ విమానాల కోసం 20 దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నా అమెరికన్ కాంగ్రెస్ వాటిని ఖరారు చేయలేదు. అణుశక్తి సాంకేతికత కూడా అంతే. సౌదీకి ఎఫ్–35లిస్తే వాటి సాంకేతికత చైనాకు చేరే ప్రమాదం ఉన్నదని ఇటీవలే అమెరికా రక్షణ గూఢచార సంస్థ హెచ్చరించింది.ఇన్ని అవరోధాలున్న ఒప్పందాల ద్వారా వేలాది ఉద్యోగాలు వచ్చిపడతాయని ట్రంప్ జనాన్ని మభ్యపెడుతున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదవుతున్నా ట్రంప్ తాను ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాననుకుంటున్నారు. దేశాల మధ్య సంబంధాలకు లాభాలు, లోపాయికారీ ప్రయోజనాలే తప్ప విలువలు ఎవరికీ అక్కర్లేదని వర్తమాన ప్రపంచంలో కనబడుతూనే ఉంది. సల్మాన్ అమెరికా పర్యటన దాన్నే మరోసారి రుజువు చేసింది. -
ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?
-
అమెరికాలో ట్రక్కు బీభత్సం.. భారతీయుడి అరెస్ట్
కాలిఫోర్నియా: అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతికి కారణమయ్యాడంటూ జశన్‌ప్రీత్ సింగ్ (21) అనే యవకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వార్తా కథనాల ప్రకారం.. అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని.. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు వెల్లడైంది.2022 మార్చిలో సింగ్.. అమెరికా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్(Border Patrol) ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ విధానం కారణంగా కొన్ని రోజుల్లోనే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.కాలిఫోర్నియాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో జశన్‌ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డాడు. ట్రక్ నడుపుతోన్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు.. ట్రాఫిక్‌లో కూడా బ్రేక్స్ వేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులైన ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల్లో ఇది తాజాది. గత ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడు. 🚨 SHOCKING: ICE sources confirm Jashanpreet Singh, the semi-truck driver behind the deadly DUI crash on CA’s I-10 freeway, is an Indian illegal alien caught & released by the Biden admin at the border in March 2022. Police say Singh was speeding, under the influence, and never… pic.twitter.com/bc1n5vEC9p— Svilen Georgiev (@siscostwo) October 23, 2025 -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్ల మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు శనివారం ఉదయం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం మంచిర్యాలకు రెడ్డి కాలనీకి చెందిన విఘ్నేష్-రమాదేవి దంపతుల కూమార్తెలు స్రవంతి, తేజస్విలు.. వీరికి వివాహాలు జరగ్గా.. భర్త, పిల్లలతో అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల విఘ్నేష్ తన భార్య రమాదేవితో కలిసి అమెరికాలో ఉంటున్న ఇద్దరూ కూతుళ్ల వద్దకు వెళ్లారు.విఘ్నేష్ చిన్న కూతురు తేజస్వి రెండు రోజుల క్రితం నూతన గృహ ప్రవేశం చేశారు. స్రవంతి కూతురు పుట్టిన రోజు ఉండటంతో శనివారం విఘ్నేష్, రమాదేవి, తేజస్వి, ఆమె భర్త కిరణ్ కుమార్, ఇద్దరూ పిల్లలు కారులో స్రవంతి ఇంటికి బయలుదేరారు. చికాగో సమీపంలో వీరి కారును ట్రక్కు ఢీ కొనడంతో రమాదేవి(52), తేజస్వి (32) మరణించారు. కారులో ఉన్న విఘ్నేష్, అల్లుడు కిరణ్ కుమార్, పిల్లలు గాయపడ్డారు. -
ట్రంప్ నాణెంపై వివాదం
వాషింగ్టన్: ప్రపంచంలో నేడు అగ్రరాజ్యంగా గౌరవం అందుకున్న అమెరికాకు 1776 జూలై 4న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. స్వతంత్ర అమెరికాకు వచ్చే ఏడాది నాటికి 250 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వేడుకలకు అమెరికా ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మారక నాణేన్ని ముద్రించి విడుదల చేయాలని యునైటెడ్ స్టేట్స్ మింట్(టంకశాల) నిర్ణయించింది. ఒక డాలర్ విలువ కలిగిన ఈ నాణెంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రిస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే, చాలామంది ఈ విషయం నమ్మలేదు. ట్రంప్‌తో కూడిన నమూనా నాణెం చిత్రాన్ని యూఎస్ ట్రెజరీ విడుదల చేయడంతో అనుమానాలకు తెరపడింది. ట్రంప్ ముఖం కలిగిన ఒక డాలర్ కాయిన్ రావడం అనేది ఫేక్ న్యూస్ కాదని, ముమ్మాటికీ నిజమని ట్రెజరర్ బ్రాండన్ బీచ్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నమూనా నాణెం సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్‌గా మారింది. అమెరికా స్వతంత్ర దేశంగా మారి 250 ఏళ్లు పూర్తికానుండడం ప్రాధాన్యత కలిగిన సందర్భమని, అందుకే తమ అధ్యక్షుడి చిత్రంతో కూడిన స్మారక నాణేన్ని విడుదల చేయబోతున్నామని స్పష్టంచేశారు. దీనిపై త్వరలో మరిన్ని వివరాలు పంచుకుంటానని పేర్కొన్నారు. నాణెంపై ట్రంప్ పోరాట పటిమ కొత్త నాణెంపై అమెరికాలో చర్చ మొదలైంది. నమూనా నాణెంపై ఒక వైపు ట్రంప్ ముఖం కనిపిస్తోంది. పైభాగంలో లిబర్టీ (స్వేచ్ఛ) అనే పదం ముద్రించారు. కిందిభా గంలో ఇన్ గాడ్ వుయ్ ట్రస్ట్(మనం నమ్మే దేవుడి సాక్షిగా) అనే పదాలు కనిపిస్తున్నా యి. మధ్యలో 1776, 2026 సంవత్సరాలను ముద్రించారు. ఇక రెండోవైపు ట్రంప్ పిడికిలి బిగించిన చిత్రం ఉంది. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. తాను పోరాటం ఆపబోనని పిడికిలి బిగించి నినదించారు. ఈ సందర్భాన్ని గుర్తుచేస్తూ నాణెంపై ఫైట్, ఫైట్, ఫైట్ అనే పదాలకు స్థానం కల్పించారు. అంతేకాకుండా ట్రంప్ వెనుకభాగంలో రెపరెపలాడుతున్న అమెరికా జాతీయ జెండా కనిపిస్తోంది. కాయిన్ రీడిజైన్ చట్టానికి ఆమోదం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ నాణెన్ని ముద్రిస్తారా? లేక మార్పులేమైనా చేస్తారా? అనేది ఇంకా తెలియరాలేదు. సోషల్ మీడియా చిత్రాన్ని ట్రంప్ అభిమానులు రూపొందించి ఉంటారని తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం చూస్తే ప్రస్తుతం పదవిలో ఉన్న అధ్యక్షుడు లేదా జీవించి ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని నాణెంపై ముద్రించడానికి వీల్లేదు. మరణించాక రెండేళ్ల తర్వాత మాత్రమే ముద్రించవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ చిత్రంతో ప్రత్యేక కాయిన్ తీసుకురావాలని మింట్ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా కాంగ్రెస్ ఇటీవల కాయిన్ రీడిజైన్ యాక్ట్‌ను ఆమోదించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఒక డాలర్ నాణెన్ని ముద్రించడానికి ట్రెజరీకి అనుమతి మంజూరు చేసింది. 2026 జనవరి 1 నుంచి ఏడాది కాలంపాటు ఒక డాలర్ నాణెలను ముద్రించవచ్చని పేర్కొంది. అయితే, వీటిపై జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తుల తల గానీ, భుజం గానీ, భుజం పైభాగం నుంచి జట్టు వరకు గానీ ఉండడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అయితే, చట్టాన్ని ఉల్లంఘించని విధంగా ట్రంప్ చిత్రంతో కొత్త కాయిన్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తుది డిజైన్‌ను ట్రెజరీ ఇంకా ఆమోదించలేదని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పదవిలో ఉండగానే అమెరికా నాణెంపై చోటు దక్కించుకున్న ఏకైక అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్. 1926లో ఆయన చిత్రంతో కాయిన్ ముద్రించారు. -
ట్రంప్ అధికప్రసంగం!
అమెరికా అధ్యక్షుడై ఎనిమిది నెలలు దాటుతున్నా అధ్యక్ష ఎన్నికల మనఃస్థితి నుంచి డోనాల్డ్ ట్రంప్ ఇంకా బయటపడినట్టు లేరు. అడ్డగోలు హామీలూ, ఆర్భాటపు ప్రకటనలూ, స్వోత్కర్షలూ, శాపనార్థాలూ ఏ దేశ ఎన్నికల ప్రచార సభల్లోనైనా రివాజు. కానీ న్యూయార్క్‌లో మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ సందర్భంలో అవన్నీ ట్రంప్ నోట వినబడ్డాయి. 150 దేశాల అధినేతలూ, వారి ప్రతినిధులూ ఇందులో పాల్గొంటున్నారు. తనకిచ్చిన 15 నిమిషాల వ్యవధిని అతిక్రమించి ట్రంప్ దాదాపు గంటసేపు వారినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆద్యంతం గమనిస్తే ఆయన అమెరికా అధ్యక్షుడిగా కాక వ్యక్తిగత హోదాలో మాట్లాడారని, సభాసదులు ఓటర్లనే భావనలోనే ఆయనున్నారనిపిస్తుంది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వైఫల్యాలను ప్రస్తావించటం మొదలుకొని, తాను సాధించాననుకుంటున్న విజయాలను ఏకరువు పెట్టడం వరకూ ఆయన దేన్నీ వదల్లేదు. పర్యావరణం, పునర్వినియోగ ఇంధన వన రులు వగైరాలన్నీ మోసగాళ్ల పన్నాగమని ట్రంప్ నిశ్చితాభిప్రాయం. వాటిని అమలుచేసే వాళ్లంతా బుద్ధిహీనులని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలను తగ్గించటంలో, యుద్ధా లను నివారించటంలో సమితిసహా అన్ని సంస్థలూ విఫలమైతే, తాను ఒంటిచేత్తో ఏడు యుద్ధాలను ఆపానని ప్రకటించుకున్నారు. యధావిధిగా భారత్–పాక్ యుద్ధం కూడా ఈ జాబితాలో వుంది. దీంతో సహా ఆయన ప్రస్తావించిన ఏ అంశానికీ ఆధారాల్లేవు.ఏటా సెప్టెంబర్‌లో సమితి సర్వసభ్య సమావేశాలు జరగటం, ధరిత్రి ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించటం ఆనవాయితీ. ఈసారి సంస్థ 80వ సంస్థాపక దినోత్సవం సమీపిస్తున్నందున ‘కలిసుంటేనే మెరుగ్గావుంటాం’ అనే అంశం ప్రాతిపదికగా ‘శాంతి, అభివృద్ధి, మానవహక్కులు’ తదితర విషయాలపై అధినేతలంతా ప్రసంగించాలి. ప్రాతి పదిక అంశం మొదలుకొని దేనిపైనా ట్రంప్‌కు ఏకీభావం లేదు. అసలు ఆయన వ్యవహరిస్తున్న తీరుకూ, అక్కడ చర్చిస్తున్న అంశాలకూ చుక్కెదురు. మానవ నాగరికతా ప్రస్థానానికి మూలకారణమైన వలసలంటేనే ఆయనకు ఏహ్యభావం. సరిహద్దుల్ని మూసివేసి, బయటివారు రాకుండా కట్టడి చేయాలని యూరప్ దేశాలకు ఆయన హితబోధ చేశారు. స్వాభిమానంగల దేశాలన్నీ తమ సంస్కృతి, సంప్రదాయాలతో, మతంతో సంబంధంలేనివారి నుంచి ప్రజలనూ, సమాజాలనూ రక్షించుకునే హక్కుండాలని ఆయన చెప్పిన మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన పూర్వీకులు జర్మన్ సంతతివారు. అసలు అమెరికాయే వలసదారుల దేశం. ఆ వలసదారులు పొట్టపోసుకోవడానికి వచ్చిన వారు కాదు. మూలవాసులైన అనేక జాతుల వారిని సమూలంగా తుడిచిపెట్టినవారు. మొన్నీమధ్యే బ్రిటన్ వెళ్లి ఘనమైన రాజవంశ ఆతిథ్యం స్వీకరించి, ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ సమితి ప్రసంగంలో మాత్రం దాన్ని దుయ్యబట్టారు. వలసలను అడ్డుకోలేక పోతున్నదని ఆ దేశంపై ట్రంప్ అభియోగం. చట్టబద్ధ వలసలను సైతం నేరంగా పరిగణించటం, వేరే దేశాల వారెవరూ వుండటానికి వీల్లేదన్న రీతిలో మాట్లాడటం ఆశ్చర్యకరం. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ తాను హెచ్1బి వీసాతోనే వచ్చానని స్వయంగా ప్రకటించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ చీఫ్ సుందర్ పిచాయ్‌లు సైతం ఆ వీసాతో ప్రవేశించినవారే. ఈ ముగ్గురూ లక్ష కోట్ల డాలర్ల టర్నోవర్‌గల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. అయినా ట్రంప్‌కు వలసలు ససేమిరా ఇష్టం ఉండవు. గతకాలపు అమెరికా అధ్యక్షుల ఆచరణ ఎలావున్నా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో వారి ప్రసంగాలు గంభీరంగా ఉండేవి. ఈ ప్రపంచానికి చోదకశక్తి తామేనన్న అభి ప్రాయం కలిగించటానికీ, తమతోనే భవిష్యత్తుందని చెప్పటానికీ ప్రయత్నించేవారు. ట్రంప్ అందుకు భిన్నం. ప్రపంచదేశాలపై నిందలేయటం, అమెరికా కష్టాలకు వారంతా కారణమన్నట్టు మాట్లాడటం ఆయనకు రివాజు. ఆయన తాజా ప్రసంగం కూడా ఆ కోవ లోనే సాగింది. తమ మాట చెల్లుబాటు కావటంలేదన్న ఉక్రోషంతో ఆయన సమితిని డొల్లసంస్థగా అభివర్ణించారుగానీ...నిజానికి దాని ఉన్నత లక్ష్యాలకు గండికొట్టి, ఆ సంస్థను నామమాత్రావశిష్టం చేసింది అమెరికాయే. -
అమెరికా చదువులపై తగ్గిన ఆసక్తి
న్యూఢిల్లీ: అమెరికా చదువులపై ఏడాది కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి గణనీయంగా తగ్గిపోయింది. ఏడాది కాలంగా అమెరికాలో గురించి వాకబు చేసే వారి సంఖ్య ఏకంగా 46 శాతం తగ్గిపోయిందని, అదే కెనడా విషయానికొస్తే రెండేళ్ల కాలంలో 75 శాతంపైగా ఆసక్తి క్షీణించిందని ప్రముఖ ఐడీపీ ఎడ్యుకేషన్ సంస్థ తెలిపింది. భౌగోళిక రాజకీయాల ప్రభావం కారణంగానే అమెరికా, కెనడా వెళ్లాలని భావించే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని సంస్థ దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కెనడా ప్రాంతీయ డైరెక్టర్ పియూష్ కుమార్ తెలిపారు. ‘మారుతున్న భౌగోళిక రాజకీయాల గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా అమెరికా విషయం ప్రస్తావించాలి. ఇక్కడ గడిచిన 12 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాస్తవానికి ట్రంప్ అధ్యక్షుడు కాకముందు గతేడాది జూన్ నుంచే అక్కడ అననుకూల వాతావరణం నెలకొంది. అప్పటి నుంచే మంజూరయ్యే వీసాల సంఖ్య తగ్గుతూ వస్తోంది’అని ఆయన విశ్లేషించారు. ‘అమెరికాలో ఎన్నికలు జరిగే సంవత్సరంలో సాధారణంగా వీసాల జారీ సంఖ్య తగ్గుతుండటం మనం గమనించొచ్చు. ఇందుకు రకరకాల కారణాలుంటాయి. కానీ, ట్రంప్ అధ్యక్షుడయ్యాక, ఆయన ఎలాంటి చర్యలను ప్రకటిస్తారనే ఉత్కంఠ కూడా విద్యార్థుల ఆసక్తిపై ప్రభావం చూపింది’అని పియూష్ తెలిపారు. కెనడాలో ఏం జరిగింది? 2024 మేతో పోలిస్తే 2025 మే నెలకు వచ్చే సరికి అమెరికాలో విద్యావకాశాల గురించి వాకబు చేసే వారి సంఖ్య 46.4 శాతం మేర పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అదేవిధంగా, కెనడాలో చదువుల గురించి తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య రెండేళ్ల కాలంలో ఏకంగా 70 నుంచి 75 శాతానికి తగ్గినట్లు వెల్లడైందన్నారు. ‘గడిచిన రెండేళ్ల కాలంలో కెనడాలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత ప్రభుత్వం మధ్య విబేధం తలెత్తడం నుంచి ఈ తగ్గుదల ఒరవడి మొదలైంది. అనంతర కాలంలో కెనడాపై అమెరికా 80 శాతం టారిఫ్‌లను రుద్దడంతో ఎగుమతులు దారుణంగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. ఆ సమయంలో కెనడాకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని అంతా భావించారు. ఎందుకంటే, చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయన్నది వారి అంచనాగా ఉంది. చదువయ్యాక స్వదేశానికి తిరిగిరాక తప్పదని అనుకోవడం వల్లే కెనడాలో చదువులకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు’అని ఆయన వివరించారు. అయితే, కెనడాలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలు 2027 దాకా కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత ఆ దేశం తన విధానాలను విద్యార్థులకు అనుకూలంగా మార్చుకుంటే పరిస్థితి మెరుగవుతుందని ఆయన తెలిపారు. ఆ్రస్టేలియాలో మరిన్ని అవకాశాలు మరో వైపు, అంతర్జాతీయ విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించే ఆస్ట్రేలియా, యూకేలకు డిమాండ్ యథా ప్రకారం కొనసాగుతోందన్నారు. ఈ రెండుదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో కూడా మార్పు లేదని పియూష్ చెప్పారు. పైపెచ్చు, గత ఏడాది కంటే 9 శాతం ఎక్కువగా విద్యార్థులను చేర్చుకుంటామని ఆ్రస్టేలియా ప్రకటించిందని గుర్తు చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూనే ఒక పద్ధతి ప్రకారం ఆ్రస్టేలియా ముందుకు వెళుతోందన్నారు. ఆ్రస్టేలియా ప్రభుత్వం 1969 ఏర్పాటు చేసిన ఈ సంస్థ అంతర్జాతీయ విద్యార్థులకు సేవలందించడంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ్రస్టేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో చదవాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీలు, కోర్సుల ఎంపికతోపాటు దరఖాస్తు చేసుకోవడం, వీసా ప్రక్రియ వంటి వాటిలో నిపుణులతో ఉచితంగా సలహాలిప్పిస్తూ సాయపడుతూంటుంది. ఇంగ్లిష్ భాషా ప్రావీణ్య పరీక్ష ఐఈఎల్‌టీఎస్‌ను సైతం ఐడీపీ ఎడ్యుకేషన్ చేపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 మంది యూనివర్సిటీల్లో లక్ష మంది ఐడీపీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ సంస్థకు భారత్‌లోని 63 నగరాల్లో 73 కార్యాలయాలున్నాయి. -
ట్రంప్ సన్నిహితుడి హత్య.. వెలుగులోకి సంచలన వీడియో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు చార్లీ కిర్క్‌పై జరిగిన కాల్పుల ఘటనలో మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితుడు కాలేజీ భవనం పైకప్పు నుంచి దూకి పరారైన దృశ్యాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తాజాగా విడుదల చేసింది. కిర్క్‌ను చంపడానికి దుండగుడు ఉపయోగించిన బోల్డ్–యాక్షన్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది.దానిపై వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం ల్యాబ్‌లో పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దుండగుడి ఆచూకీ ఇంకా లభించలేదని, గాలింపు కొనసాగుతోందని వెల్లడించింది. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు. ఒకే ఒక్క తూటాకు చార్లీ కిర్క్ అక్కడికక్కడే నేలకొరిగాడు. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల తరహాలోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం.యూనివర్సిటీ ప్రాంగణంలో తెల్లరంగు టెంట్ మధ్యలో కూర్చొని విద్యార్థుల ప్రశ్నలకు మైక్రోఫోన్లో సమాధానం చెబుతుండగా హఠాత్తుగా బుల్లెట్ దూసుకొచ్చింది. రాజకీయ యువజన సంఘం ‘టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో గత పదేళ్లలో అమెరికాలో తుపాకీ హింసాకాండలో ట్రాన్స్జెండర్ల పాత్ర ఎంతవరకు ఉందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వెంటనే బుల్లెట్ ఆయన మెడను చీలుస్తూ దూసుకెళ్లింది. మెడ ఎడమభాగం నుంచి రక్తం బయటకు చిమ్మింది. తీవ్రంగా గాయపడిన కిర్క్ అక్కడే ప్రాణాలు వదిలాడు.చార్లీ కిర్క్ అలియాస్ చార్లెస్ జేమ్స్ కిర్క్ 1993 అక్టోబర్ 14న ఇల్లినాయిస్లో జన్మించాడు. రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 2012లో 18 ఏళ్ల వయసులో షికాగోలో టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థను మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. ఆయనకు భార్య ఎరికా లేన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్ట్ ట్రంప్ జూనియర్‌కు కిర్క్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అంతేకాదు రచయితగా, రేడియో వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందాడు. మీడియా రంగంలోనూ అడుగుపెట్టాడు. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలుస్తున్నారు. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడాన్ని కిర్క్ పలు సందర్భాల్లో వ్యతిరేకించాడు. అమెరికన్ కార్మికుల స్థానాన్ని భారతీయులు ఆక్రమించుకున్నారని, వారికి ఇక వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు. -
పడవలో తెగిపడిన తలలు యుద్ధం ఆరంభం
-
అమెరికాలో ఆసిమ్ మునీర్ పర్యటన.. రెండు నెలల్లో రెండోసారి
వాషింగ్టన్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మునీర్ అమెరికా రాజకీయ, సైనిక నాయకులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆసిమ్ తొలిసారి పర్యటించగా.. ఇప్పుడు మరోసారి అమెరికాలో అడుగు పెట్టారు. మునీర్ తన పర్యటనలో భాగంగా అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కైన్‌తో సమావేశమయ్యారు. ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించారు. టాంపాలో అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మాజీ చీఫ్ జనరల్ మైకేల్ కురిల్లా రిటైర్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం అడ్మిరల్ బ్రాడ్ కూపర్ బాధ్యతలు స్వీకరించిన వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని మునీర్ కోరారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.జూన్ పర్యటనలో, మునీర్.. ట్రంప్‌తో ప్రైవేట్ లంచ్‌లో పాల్గొన్నారు. ఇది సాధారణంగా దేశాధినేతలకు మాత్రమే లభించే గౌరవం.ఈ వరుస పర్యటనలు అమెరికా–పాకిస్తాన్ సంబంధాలు మరింత బలపడుతున్నాయని’ విశ్లేషకులు భావిస్తున్నారు. మునీర్ పాకిస్తాన్ తరఫున సహకారాన్ని, భద్రతా అంశాలను చర్చించేందుకు ఈ పర్యటన చేస్తున్నట్లు సమాచారం. -
United States: నిర్బంధ కేంద్రాల్లో మహిళలకు ఘోర అవమానం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని నిర్బంధ కేంద్రాల్లో(డిటెన్షన్ సెంటర్లు)మహిళకు ఘోర అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మయామి పశ్చిమ ప్రాంతంలోని క్రోమ్ నార్త్ సర్వీస్ ప్రాసెసింగ్ సెంటర్లో మహిళా ఖైదీలు.. పురుష ఖైదీల ఎదుట టాయిలెట్లను ఉపయోగించవలసిన దుస్థితి ఏర్పడింది.‘యూ ఫీల్ లైక్ యువర్ లైఫ్ ఈజ్ ఓవర్’ పేరుతో వెలువడిన ఒక నివేదికలో అమెరికాలోని ఫ్లోరిడాలో గల మూడు ఇమ్మిగ్రేషన్ సెంటర్లలో తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేని వలసదారులు ఘోర అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 2025 మొదటి నుంచి ఈ విధమైన దుస్థితి మరింతగా పెరిగిందని నివేదికలో వెల్లడించారు. సంకెళ్ళు వేయడం, అరకొర ఆహారం అందించడం, పరిశుభ్రంగా లేని ప్రాంతంలో ఉంచడం, వైద్య సంరక్షణలో ఆలస్యం చేయడం మొదలైనవి వీటిలో ఉన్నాయని తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఖైదీ మరిణించారని కూడా దానిలో పేర్కొన్నారు.అక్రమ వలసదారులను సంకెళ్లతో బంధించి, వారి చేతులు వెనుకకు కట్టి, కుక్కల మాదిరిగా స్టైరోఫోమ్ ప్లేట్లలోని ఆహారాన్ని మోకరిల్లి తినాలంటూ అధికారులు బలవంతం చేశారని ఆ నివేదిక పేర్కొంది. పదుల సంఖ్యలో పురుషులను గంటల తరబడి సెల్‌లలో బంధించారని, సాయంత్రం 7 గంటల వరకు ఆహారం పెట్టలేదని నివేదిక తెలిపింది. తాము జంతువుల మాదిరిగా ఆహారం తినవలసి వచ్చిందని పెడ్రో అనే ఖైదీ తెలిపాడు. ఈ ఘటన మయామి ఇమ్మిగ్రేషన్ జైలులో చోటుచేసుకుంది. పశ్చిమ మయామిలోని క్రోమ్ నార్త్ సర్వీస్ ప్రాసెసింగ్ సెంటర్లో పురుష ఖైదీల ముందు మహిళా ఖైదీలు టాయిలెట్లను ఉపయోగించవలసిన దుర్భర పరిస్థితిని అధికారులు కల్పించారని నివేదిక పేర్కొంది. పోంపానో బీచ్‌లోని బ్రోవార్డ్ పరివర్తన కేంద్రంలో 44 ఏళ్ల హైతీ మహిళ మేరీ ఏంజ్ బ్లేజ్ ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోనే మృతిచెందింది. ఎవర్‌గ్లేడ్స్‌లోని అలిగేటర్ అల్కాట్రాజ్ జైలులో సౌకర్యాలు లేనప్పటికీ సరైన పత్రాలు లేని ఐదువేల మంది వలసదారులను ఉంచి, ఇబ్బందుకు గురిచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. -
‘మీ ఎకానమీని కూల్చేస్తాం’.. భారత్, చైనాలకు అమెరికా వార్నింగ్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు లిండ్సే గ్రాహం భారత్, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ధర తక్కువగా ఉందని రష్యా వద్ద క్రూడాయిల్‌ను కొనుగోలు చేయాలని చూస్తే మీ ఆర్ధిక వ్యవస్థను నిట్ట నిలువునా కూల్చేస్తామని ఆయా దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.ఇంతకు ముందు గ్రాహం రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్ విధించాలనే ప్రతిపాదనలు తెచ్చారు. ఈ క్రమంలో మరోసారి టారిఫ్ ధరల్ని ప్రస్తావిస్తూ ఆయా దేశాలపై విమర్శలు గుప్పించారు. ఫాక్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రష్యా వద్ద తక్కువ ధరకే ఆయిల్ దొరుకుతుందని కొనుగోలు చేస్తున్న బ్రెజిల్,చైనాతో పాటు భారత్‌కు నేను చెప్తున్నది ఒకటే. కీవ్ వద్ద ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలతో ఈ యుద్ధం(టారిఫ్) కొనసాగుతుంది. ఈ యుద్ధంలో సంబంధిత దేశాల్ని చీల్చి చెండాడుతాం. ఆర్ధిక వ్యవస్థను కూల్చేస్తామని పునరుద్ఘాటించారు. మీరు (భారత్,చైనా, బ్రెజిల్) చేస్తున్నది రక్తపాతం. ఎవరైనా అతన్ని ఆపే వరకు అతను (పుతిన్) ఆగడు అంటూనే.. రష్యాపై ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగారు. ట్రంప్‌తో ఆటలాడుకోవాలని చూస్తే ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే. మీ చేష్టల ఫలితంగా మీ దేశ ఆర్ధిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు. కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేలా చర్చలకు రావాలని ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆదేశించారు. ఈ బెదిరింపుల్ని రష్యా ఖండించింది. అమెరికా మాపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. Lindsey Graham: Here’s what I would tell China, India and Brazil. If you keep buying cheap Russian oil… we will tariff the hell out of you and we’re going to crush your economy pic.twitter.com/x05J3G8oOk— Acyn (@Acyn) July 21, 2025 -
United States: టార్గెట్ స్టోర్‌లో చోరీ.. పట్టుబడిన భారత మహిళ
వాషింగ్టన్: అమెరికాలోని టార్గెట్ స్టోర్‌లో రూ. లక్షకుపైగా విలువైన వస్తువులను దొంగిలిస్తూ భారతీయ మహిళ పట్టుబడింది. బాడీక్యామ్ వీడియోలో ఆమె చోరీకి పాల్పడిన ఘటన రికార్డయ్యింది. యునైటెడ్ స్టేట్స్ను సందర్శించేదుకు వచ్చిన ఆమెను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.ఇల్లినాయిస్ ప్రాంతంలోని ఈ స్టోర్‌లో ఏడు గంటలపాటు గడిపిన ఈమె అనుమానాస్పద ప్రవర్తనను అక్కడి సిబ్బంది గమనించి, పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. ఈ రిటైల్ చైన్ నుండి ఆమె లక్షరూపాయలకు పైగా విలువైన వస్తువులను చోరీ చేసిందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు స్టోర్‌లోని బాడీక్యామ్ ఫుటేజ్‌ను సేకరించారు. సదరు మహిళ ఏడు గంటలుగా స్టోర్‌లో తిరగడాన్ని గమనించామని, ఆమె అక్కడి వస్తువులను తీసుకుంటూ, ఫోన్‌ను చూసుకుంటూ చివరికి డబ్బు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించిందని స్టోర్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. వారి ఫిర్యాదు అనంతరం పోలీసులు ఆమెకు సంకెళ్లు వేసి, స్టేషన్‌కు తరలించారు. ఆమెపై నేరారోపణలు మోపినప్పటికీ, ఇంకా అరెస్టు చేయలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై టార్గెట్ స్టోర్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. బుధవారం (జూలై 2) రాత్రి చికాగోలో డ్రైవ్ బై కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికాగో స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చికాగో నగరంలోని రివర్ నార్త్ (River North) ప్రాంతం ఆర్టిస్ లాంజ్ (Artis Lounge) అనే నైట్‌క్లబ్‌లో రాపర్ మెలో బక్స్ (Mello Buckzz) ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతోంది.ఆ సమయంలో ఓ వాహనం లోపల ఉన్న అగంతకులు నైట్‌క్లబ్ వెలుపల గుమికూడిన జనంపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దుర్ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అగంతకులు జరిపిన కాల్పుల్లో 13 మంది మహిళలు, 5 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ట్రోజర్ హాస్పిటల్, నార్త్‌వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో మరోసారి కాల్పులు జరగడం గమనార్హం.Yet another mass shooting in Chicago media won't tell you about.Initial reports of 3 dead, 20+ injured following gunfire after a record release party.But it's only Black people with illegal handguns again so, HO, HUM, doesn't fit the narrative. pic.twitter.com/DNm5sXLd1i— BarleyPop (@MikePilbean) July 3, 2025 -
పెళ్లి కోసం అమెరికా వెళ్లి.. భారతీయ యువతి మిస్సింగ్
పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యమైంది. అమెరికా పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రాన్ అనే యువతి జూన్ 20న అమెరికాకు చేరుకోగా, పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికాకు వచ్చినట్లు అధికారులకు చెప్పింది. అమెరికా వచ్చిన కొన్ని రోజులకే సిమ్రాన్ అదృశ్యమైనట్లు న్యూజెర్సీ అధికారులు వెల్లడించారు.జూన్ 25న ఆమె చివరిసారి కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫోన్ చూస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని తెలిపారు. మరోవైపు, ఆమె అమెరికాకు వచ్చింది.. పెళ్లి కోసమా, లేక వేరే ఉద్దేశ్యమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చివరిసారిగా గ్రే స్వెట్‌ప్యాంట్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ ఫ్లిప్‌ఫ్లాప్స్ ధరించి, చిన్న డైమండ్ ఇయరింగ్స్ పెట్టుకుని కనిపించింది. ఆ యువతి వాడుతున్న ఫోన్ కేవలం వైఫై ద్వారా మాత్రమే పని చేయడంతో పోలీసులు ఆమెను ట్రేస్ చేయలేకపోతున్నారు.సిమ్రాన్ ఇంగ్లీష్ మాట్లాడలేదని, అమెరికాలో ఆమెకు బంధువులు కూడా ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. భారత్‌లోని ఆమె బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. సిమ్రాన్ రూపు రేఖలు, మిస్సింగ్‌కు ముందు ఆమె ధరించిన దుస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు.. 2025లో భారత్ ఎక్కడంటే.. (ఫొటోలు)
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని లాంకాస్టర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఒహియోలోని క్లీవ్‌లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మృతి చెందినట్లు భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మానవ్ పటేల్(20), సౌరవ్ ప్రభాకర్(23) మృతిచెందినట్లు ప్రకటిస్తూ కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేసింది.మే 10న లాంకాస్టర్ కౌంటీలోని పెన్సిల్వేనియా టర్న్‌పైక్ వద్ద వారి వాహనం చెట్టును ఢీకొట్టి.. ఆపై వంతెనను ఢీకొట్టిందని పెన్సిల్వేనియా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి గాయపడగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాకర్ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. Deeply saddened to learn about the unfortunate road accident in which two Indian students from Cleaveland State University, Manav Patel and Saurav Prabhakar lost their lives;Our thoughts and prayers are with their families during this difficult time. The Consulate is in touch…— India in New York (@IndiainNewYork) May 12, 2025 -
లాహోర్‌ను వీడండి.. తమ పౌరులకు అమెరికా హెచ్చరిక
పాక్ ఉన్న తమ పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. ఈ మేరకు పాక్‌లోని తమ పౌరులు, దౌత్యవేత్తలను అప్రమత్తం చేసింది. వెంటనే లాహోర్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఈ మేరకు లాహోర్‌లోని యూఎస్ ఎంబసీ సూచనలు జారీ చేసింది. లాహోర్‌లో విమానాశ్రయం మూసివేయడంతో దౌత్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచించింది.కాగా, మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. పీవోకేలో ఉగ్ర వాదులను వేటాడుతున్నామని ఆయన తెలిపారు. పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా భారత్ ప్రతీకార దాడులు చేస్తోంది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసమైనట్లు తెలుస్తోందని భారత్ ఇప్పటికే వెల్లడించింది. పాకిస్థాన్ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి.యాంటి మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే భారత్ పేల్చేసింది. ఎస్-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు తెలిసిందని భారత రక్షణశాఖ వెల్లడిచింది. -
కొంటే... కొరివి దయ్యమే!
‘‘భారత్ ఒక సరికొత్త ప్రపంచానికి అలవాటు పడాల్సిన అవసరం ఉంది’’ – ట్రంప్‌ను ఉద్దేశించి విదేశీ వ్యవహా రాల మాజీ కార్యదర్శి ఒకరు అన్న మాట. ఈ కొత్త ప్రపంచం కేవలం ఒప్పందాలు, వ్యాపారాలకు మాత్రమే పరిమితమనీ; మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరనీ కూడా ఆయన అన్నారు. ఒక దౌత్యవేత్త ఈ అంచనాకు వచ్చారంటే కచ్చితంగా అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యమైన వ్యక్తిత్వమే కారణమై ఉంటుంది.తేలిగ్గా చెప్పాలంటే... ఈ రోజుల్లో పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. కొత్త సంవత్సరంలో యూఎస్ఏ తన లావా దేవీలను వేగంగా మొదలు పెట్టేసింది. ఈ ఏకపక్ష ధోరణితో అమెరికా మిత్రులు, శత్రువులు కూడా తమని తాము కాపాడు కునేందుకు దాక్కుండిపోతున్నారు. లేదంటే వ్యక్తిగతంగా ట్రంప్ ముందు ప్రత్యక్షమై ఆయన శీతకన్ను పడకుండా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల కూడా ఏదో అర్థవంతమైన పని జరుగుతుందని ఎవరూ ఆశించడం లేదు.ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ట్రంప్ ఇప్పుడు అమెరికన్ కంపెనీ ‘లాక్‌హీడ్ మార్టిన్ ’ తయారు చేసిన ఎఫ్–35 యుద్ధ విమానాలు కొనమని భారత్‌కు చెబుతున్నారు. భారత్‌తో ఉన్న సుమారు 3,500 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అన్నమాట. అయితే ఏ అంత ర్జాతీయ ఒప్పందం, వ్యాపారమైనా కేవలం అమ్ముతామంటే సరిపోదు. కొంటున్నామని అవతలి వారు చెప్పాలి. భారత్దృష్టి కోణం నుంచి చూస్తే – అమెరికా అమ్ముతానూ అంది, మరి కొనదలుచుకుంటే ఆ ఎఫ్–35 యుద్ధ విమానాలు ఎలాంటివో పరిశీలించాలి కదా?తడిసి మోపెడు ఖర్చురవాణా, గాల్లోంచి సామగ్రి పడవేసే ‘డగ్లస్ డీసీ–3 డకోటా’, ‘ఫెయిర్ ఛైల్డ్ ప్యాకెట్ సీ119 జీ’ మినహా మరే ఇతర అమెరికా విమానాన్నీ భారతీయ వైమానిక దళం ఇంతవరకు వాడలేదు. 1947 నుంచి చూసినా అమెరికా యుద్ధ విమానం మన వద్ద ఎప్పుడూ లేదు. కాబట్టి అకస్మాత్తుగా ఎఫ్–35లను కొనుగోలు చేయడం అంటే, అది కూడా ట్రంప్ మాటపై ఆధారపడి అంటే... కొంచెం అనుమానంగా చూడాల్సిన వ్యవహారమే! అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు, చరిత్ర లను పరిగణనలోకి తీసుకుంటే ఇలా చూడటం మరీ ముఖ్య మవుతుంది. ఒక విషయమైతే స్పష్టం. భారత్ వంటి అతిపెద్ద దేశంలో వైమానిక దళం ఒక్క రోజులో సిద్ధం కాదు. వైమానిక దళాన్ని నిర్మించడం అంత తేలికైన వ్యవహారమూ కాదు. భారీ పెట్టు బడులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, రిస్క్ తీసుకో గలిగిన తెగువ, సుశిక్షితులైన సిబ్బంది అవసరం. ‘జేన్ ్స ఆల్ ద వరల్డ్స్ ఎయిర్ క్రాఫ్ట్’ మ్యాగజైన్∙ప్రకారం... ఎఫ్–35 యుద్ధ విమానాలకు (ఐదో తరం, బహుళార్థక, స్టెల్త్ రకం) ఆర్డర్ పెట్టిన తరువాత మొదటి విమానం అందేందుకు 15 ఏళ్లు పడుతుంది! ఇంకో విషయం – భారత్ ఏ రోజు కూడా లాక్ హీడ్ తయారు చేసే యుద్ధ విమానపు కొనుగోలుదారుగా కానీ, అమెరికా పారిశ్రామిక భాగస్వామిగా కానీ లేదు. నిజానికి ఎఫ్–35 యుద్ధ విమానాలు హైటెక్ పాశ్చాత్య దేశాల కోసం, అమెరికా రక్షణకు, సెక్యూరిటీ భాగస్వాములైన ఇతర దేశాల కోసం ఉద్దేశించినవి. 1996లో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇజ్రాయెల్, సింగపూర్, స్పెయిన్ , స్వీడన్ లకు ఈ కార్యక్రమం గురించి వివరించారు. ఎఫ్–35లు ఖరీదైనవని అప్పుడే అర్థమైపోయింది (ట్రంప్ సుంకాల తీరుతో తాజాగా నాటో దేశాలు కూడా వీటి కొనుగోలు గురించి పునరాలోచనలో పడ్డాయి).ముందుగా యూకేతో కలిసి పనిచేయాలని, పది శాతం ఖర్చులు ఆ దేశం భరించాలని యూఎస్‌తో ఒప్పందం జరిగింది. ఇటలీ, నెదర్లాండ్స్ చెరి ఐదు శాతం ఖర్చులు భరించేలా ఒప్పందాలు కుదిరాయి. మూడో దశలో డెన్మార్క్, నార్వే... 1–2 శాతం ఖర్చులు భరించేలా భాగస్వాములైనాయి. అనంతరం, ఆస్ట్రేలియా, కెనడా, టర్కీ తమ ఖర్చు తామే భరించేలా చేరాయి. 2012–13 నాటి ‘జేన్ ్స ఆల్ ద వరల్డ్స్ ఎయిర్‌క్రాఫ్ట్’ పత్రికను చూస్తే ఒక్కో ఎఫ్–35ఎ యుద్ధ విమానం ఖరీదు సుమారు 3.73 కోట్ల డాలర్లు. 2017 నాటికి ఇది 9.43 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు సుమారు పది కోట్ల డాలర్ల పైమాటే (రూ.860 కోట్లు). మారకం విలువలు, రూపాయి బలహీనపడటం వంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎఫ్–35ల కొనుగోలు భారత్ ఖజానాకు భారీగా కన్నమేసేదే! ఇంత భారీ ఖర్చు కచ్చితంగా రాజకీయంగానూ సంచలనంసృష్టిస్తుంది.దీంతోపాటే ఎఫ్–35 యుద్ధ విమానాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞాన సంబంధిత సమస్యలు చాలానే ఉన్నాయి. అమెరికాలోనూ దీని గురించి వివాదాలు ఉన్నాయి. సమస్యలు ఒకవైపు, ఎప్పటికప్పుడు పెరిగిపోయే ఖర్చులు ఇంకోవైపు ఈ యుద్ధ విమానపు కొనుగోలుపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఆర్థికాంశాలు, సాంకేతిక పరిజ్ఞాన అంశాలూ కాసేపు పక్కన పెడదాం. యుద్ధ విమానం భద్రత కూడా ఇక్కడ ప్రశ్నా ర్థకమే. 2010 అక్టోబరులో ఇలాంటి ఒక సమస్యను గుర్తించారు. విమానం ఎగురుతూండగానే ఎలాంటి ఆదేశాలూ లేకుండానే ఇంజిన్ ఆఫ్ అయ్యేందుకు వీలు కల్పించే ఓ సాఫ్ట్ వేర్ సమస్య తలెత్తింది. అప్పట్లో ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఈ విమానాలను కొంత సమయం పాటు నిలిపివేశారు కూడా! పదిహేనేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ ఈ యుద్ధ విమానం ప్రయాణిస్తూండగా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. 2014 జూన్ , జూలైల్లో ఎగ్లిన్ ఎయిర్‌ఫోర్స్ స్థావరం వద్ద కొన్నింటిలో ఇంజిన్ వైఫల్యం చోటు చేసుకుంది. ఈ ఘటన తరువాత వాటి వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కనుక అలాంటి విమానాలను కొని, కొరివితో తలగోక్కునే పరిస్థితిని భారత్ తెచ్చు కోదనే ఆశిద్దాం! అభిజిత్ భట్టాచార్యవ్యాసకర్త ‘ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ శాశ్వత సభ్యులు -
ట్రంప్ సర్కార్ మరో షాక్.. 9,700 మంది ఉద్యోగులు ఔట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్.. పాలనలో తనదైనా మార్క్ చూపిస్తున్నారు. తాను చేసిందే శాసనం, తన నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. ట్రంప్ ఇప్పటికే టారిఫ్‌లు, ఆంక్షల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, తాజాగా అమెరికాలోని పలు సంస్థలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని కొన్ని సంస్థల్లో ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద సహాయ సంస్థ అయిన ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (USAID)లో ఏకంగా 9,700లకు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా పదివేల మందికి పైగా ఉద్యోగులున్నారు. దీంతో, ఈ సంఖ్యను తగ్గించాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ క్రమంలో కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండేలా సవరణలు కూడా చేసినట్టు తెలుస్తోంది. 🇺🇸 Trump Administration to Cut USAID Staff to Fewer Than 300: The agency employs 10,000 globally. 📉⚠️ - Financial Times #USAID The US spends about $40bn annually on foreign assistance, which makes up less than 1% of the federal budget. Such aid is what make US different from… pic.twitter.com/gITKpTo59Y— TheNewsBreaks (@TheNewsBreaks) February 7, 2025ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు ప్లాన్ ఫలిస్తోంది. ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (ఓపీఎం) ఇచ్చిన బైఅవుట్ ఆఫర్ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్టు సమాచారం. బైఅవుట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ఈమేరకు ఒక ఈ-మెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. దీంతో, సుమారు 10-15శాతం మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ కార్యవర్గం భావించింది. ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. -
అమెరికాతో వారికి సంబంధమే లేదు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో జన్మతః పౌరసత్వం గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో జన్మతః పౌరసత్వాన్ని తీసుకొచ్చారని ట్రంప్ కామెంట్స్ చేశారు. అంతేగానీ.. ప్రపంచ జనభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చి చేరేందుకు కాదంటూ విరుచుకుపడ్డారు. అర్హత లేని వ్యక్తులందరూ అమెరికాలోనే ఉన్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో జన్మతః పౌరసత్వంపై స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘ఇప్పుడు మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారు. అంతేగానీ.. ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చేందుకు, ఇక్కడ స్థిరపడేందుకు ఆ చట్టాన్ని తీసుకురాలేదు. చాలా మంది మన అమెరికాకు వస్తున్నారు. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీంతో అర్హత లేని పిల్లలకు పౌరసత్వం లభిస్తోంది. ఈ చట్టం అందుకోసం కాదు. చాలా గొప్ప ఉద్దేశంతో బానిసల పిల్లల కోసం తీసుకు వచ్చింది అంటూ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వంద శాతం విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం.. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.President TRUMP: "Birthright citizenship...was meant for the children of slaves. This was not meant for the whole world to come in and pile into the United States." pic.twitter.com/zSqXPtfETZ— Sir Cabonena Alfred (@Lebona_cabonena) January 31, 2025మరోవైపు.. అమెరికాలో జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంట్ ఎగువసభ(సెనేట్)లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు గురువారం ప్రవేశపెట్టారు. పుట్టే పిల్లలకు ఎలాగూ పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోందని ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యులు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రజ్, కేటీ బ్రిట్‌లు సెనేట్‌లో వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలోని 33 దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరకు ‘పుట్టుకల పర్యాటకం’లా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతః పౌరసత్వం కూడా ఒక ప్రధాన కారణం’ అని రిపబ్లికన్ నేతలు చెప్పారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును విపక్ష డెమోక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి ఉత్తర్వు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. -
అమెరికాలో అక్రమ వలసదారులు అరెస్ట్.. భారత్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అక్రమ వలసదారులు అగ్ర రాజ్యం అమెరికాను వీడుతున్నారు. అలాగే, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే నేరస్థులైన అక్రమ వలసదారులను టార్గెట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. Just as he promised, President Trump is sending a strong message to the world: those who enter the United States illegally will face serious consequences. pic.twitter.com/yqgtF1RX6K— The White House (@WhiteHouse) January 24, 2025ఇక, ఈ వివరాలను శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో.. ట్రంప్ యంత్రాంగం ఇప్పటివరకూ 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ఇక, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశాం. ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు అని వెల్లడించారు.ఈ నేపథ్యంలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఎందుకంటే అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని స్పష్టం చేసింది. అయితే, వీసా గడువు ముగిసినా లేదా సరైన డాక్యుమెంట్స్ లేకుండా భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. సంబంధిత డాక్యుమెంట్లను తమతో పంచుకుంటే వాటిని పరిశీలించి స్వదేశానికి తీసుకువస్తామని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. -
ట్రంప్‌కు ఝలక్.. పౌరసత్వం ఉత్తర్వుకు కోర్టులో చుక్కెదురు
సియాటెల్: అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత ఆర్భాటంగా ట్రంప్ ఇచ్చిన ‘జన్మతః పౌరసత్వం రద్దు’ కార్యనిర్వాహక ఉత్తర్వు అమల్లోకి రాకమునుపే అమెరికా కోర్టులో అవరోధాన్ని ఎదుర్కొంది. ఉత్తర్వు అమల్లోకి రాకుండా ఆపాలంటూ 4 రాష్ట్రాలు చేసిన అభ్యర్థనను అమెరికా డిస్ట్రిక్ జడ్జి జాన్ సి. కఫెనర్ నిలిపివేశారు.ఈ సందర్బంగా.. ‘ట్రంప్ ఉత్తర్వులు అమల్లోకిరాకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలిస్తున్నా. ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం’ అని కేసు విచారణ సందర్భంగా జడ్జి కఫెన్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయీస్, ఒరేగాన్ రాష్ట్రాలు సంయుక్తంగా వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన జడ్జి ఆ తర్వాత ఈ ఉత్తర్వులిచ్చారు. ఉత్తర్వును వ్యతిరేకిస్తూ విపక్షపార్టీ పాలిత 22 రాష్ట్రాలు విడిగా వేసిన ఐదు పిటిషన్లలో ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి వేసిన సియాటెల్ కోర్టులో వేసిన ఈ పిటిషన్ కూడా ఉంది. మరోవైపు.. ఈ కేసులో ప్రాథమిక విజయం సాధించాం అని వాషింగ్టన్ అటార్నీ జనరల్ నికొలస్ బ్రౌన్ వ్యాఖ్యానించారు. అనంతరం, దీనిపై ట్రంప్ స్పందించారు. తాము అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం చేశారు. గురువారం ఓవల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయమూర్తి ఉత్తర్వులపై మా కార్యవర్గం అప్పీల్ చేస్తుందని తెలిపారు. ఇక, అంతకుముందు.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ట్రంప్ ఉత్తర్వును తప్పుబట్టిన భారతీయ అమెరికన్ చట్టసభ్యులు ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయమూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలసవచ్చిన వారి పిల్లలను మాత్రమేకాదు చట్టబద్ధంగా హెచ్–1బీ, హెచ్2బీ, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైనా పెను ప్రభావం చూపుతుంది. చట్టబద్ధ వలసవిధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది. ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధం. దీని కోసం ఎంతకైనా తెగించి పోరాడతాం’’అని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకుడు రో ఖన్నా ప్రకటించారు. ‘‘ఒక్క కలంపోటుతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లే’’అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ట్రంప్ ప్రమాణం.. ఫుల్ జోష్‌లో ఎలాన్ మస్క్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనంలో ఈ వేడుక జరిగింది. ట్రంప్ ప్రమాణం వేళ బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా కనిపించారు.అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాన్ మస్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై హాడావుడి చేశారు. అక్కడి వచ్చిన ప్రముఖులు, పార్టీ నేతల్లో జోష్ నింపారు. అలాగే, ట్రంప్ ప్రసంగంలో భాగంగా దేశ సంపదను పెంచుతానని, భూభాగాన్ని విస్తరిస్తానంటూ పేర్కొన్నారు. అంగారక గ్రహంపైకి అమెరికా వ్యోమగాములను పంపిస్తానని ట్రంప్ చెప్పారు. తమ జెండాను అక్కడ పాతుతామన్నారు. ఈ వ్యాఖ్యలకు మస్క్ సంబురపడిపోయారు.Elon Musk’s reaction to Trump saying today: “We will pursue our manifest destiny into the stars by launching American astronauts to plant the Stars and Stripes on the planet Mars.” pic.twitter.com/XMLQC2OTuu— Sawyer Merritt (@SawyerMerritt) January 20, 2025 ఈ సందర్బంగా ఎలాన్ మస్క్ థంబ్ చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక, ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో రానున్న కాలంలో మస్క్ మరిన్ని రాకెట్ ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో మార్స్ గ్రహం అంశం ఇప్పుడు మరింత హాట్ టాపిగ్గా మారింది. ఇక, మస్క్ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.pic.twitter.com/hH6i7xYy60— Elon Musk (@elonmusk) January 20, 2025కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్‌తో కలిసి మస్క్ ముందుకు సాగారు. ఎన్నికల్లో ట్రంప్ గెలిచే వరకు మస్క్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ విజయం సాధించడంతో తన కేబినెట్లో మస్క్‌కు కీలక పదవి అప్పగించారు.DO NOT BELIEVE THE MEDIA The media is misleading you. Elon Musk never did a Nazi salute. Watch the full video: He simply gestured and said, “Thank you, my heart goes out to you.” pic.twitter.com/e3vBaLoVqx— DogeDesigner (@cb_doge) January 20, 2025 -
ట్రంప్ ఇచ్చిన బాధ్యతల నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి.. కారణం?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) తప్పుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విషయాన్ని వెల్లడించారు. ఇందుకు కారణం మాత్రం వెల్లడించలేదు.భారత సంతతి వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఎలాన్ మస్క్‌తోపాటు వివేక్ రామస్వామిని ఈ బాధ్యతల్లో నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఒహైయో గవర్నర్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్బంగా వివేక్ రామస్వామి.. డోజ్ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరించడంలో ఎలాన్ మస్క్ బృందం విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒహియోలో నా భవిష్యత్ ప్రణాళికల గురించి త్వరలో నేను మరిన్ని చెప్పాలి. ముఖ్యంగా, అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన నిర్ణయం ఆసక్తికరంగా మారింది.It was my honor to help support the creation of DOGE. I’m confident that Elon & team will succeed in streamlining government. I’ll have more to say very soon about my future plans in Ohio. Most importantly, we’re all-in to help President Trump make America great again! 🇺🇸 https://t.co/f1YFZm8X13— Vivek Ramaswamy (@VivekGRamaswamy) January 20, 2025ఇదిలా ఉండగా.. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిరోజే దాదాపు 100కుపైగా కార్యనిర్వాహక ఆదేశాల (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల)పై సంతకాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి చేతిలో అత్యంత శక్తిమంతమైన సాధనంగా పేర్కొనే ఈ ఆదేశాల ప్రాధాన్యం, వాటి అమలు గురించిన అంశాలను పరిశీలిస్తే.. అమెరికా చట్టసభ ఆమోదం లేకుండా సమాఖ్య ప్రభుత్వానికి అధ్యక్షుడు జారీ చేసే లిఖితపూర్వక ఆదేశాలనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలు ఇందులో ఉంటాయి.కేంద్ర సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం లేదా నివేదికలను కోరడం వంటివి ఉండవచ్చు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ ఆదేశాలు జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఆ దేశాలకు చట్టబద్ధత ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ.. దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడిదే. అందుకే కాంగ్రెస్ ఆమోదించలేని అంశాలను తమ అజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు. చట్టసభ ఆమోదం లేకుండా జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉన్నా.. వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదేశాలను వ్యతిరేకించ లేనప్పటికీ.. ఆ నిర్ణయాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం లేదా ఇతర అడ్డంకులు సృష్టించడం ద్వారా వీటి అమలుకు ‘కాంగ్రెస్’ ఆటంకం కలిగించే వీలుంది. మునుపటి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి ఈ ఎగ్జిక్యూటివ్‌ను కొత్త అధ్యక్షుడు ఉపయోగించే అవకాశం ఉంది. -
ట్రంప్ దూకుడు.. తొలి రోజే సంచలన నిర్ణయాలు
President Donald Trump Key Decisions Updates..అమెరికా అధ్యక్షుడిగా(47వ) బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.నలుగురు అధికారులపై ట్రంప్ వేటు..అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ దూసుకెళ్తున్నారు.నలుగురు అధికారులపై ట్రంప్ వేటు వేశారు.అలాగే, ‘వెయ్యి మందికి’ హెచ్చరికలు మంజూరుతన అధ్యక్ష కార్యాలయం ప్రస్తుతం వడపోత పనులు చూస్తోందని ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ట్రంప్మునుపటి అధ్యక్షుడి కాలంలో నియమితులైన వెయ్యి మందిపై వేటు పడనుందని వెల్లడి‘అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలి’ అనే మా విధానానికి అనుగుణంగా లేని వారంతా విధుల్లో కొనసాగలేరని వ్యాఖ్యలుఖడ్గం పట్టుకుని ట్రంప్ డ్యాన్స్అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం వేళ ట్రంప్ డ్యాన్స్అమెరికా మిలటరీకి చెందిన ఖడ్గంతో ట్రంప్ డ్యాన్స్ చేశారు.ట్రంప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. THE MOST DANGEROUS MAN IN THE WORLD RIGHT NOW...😎🇺🇸🤣🤣🤣 pic.twitter.com/b0MwA5xf2l— il Donaldo Trumpo (@PapiTrumpo) January 21, 2025 భారతీయులకు ట్రంప్ ఝలక్?విదేశీ మహిళలు అమెరికాలో ప్రసవిస్తే వారి శిశువులు పొందే పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్పేరెంట్స్లో ఒకరికైనా యూఎస్ సిటిజన్‌షిప్, శాశ్వత నివాసి, యూఎస్ మిలిటరీ సభ్యత్వం ఉండాలి.ఇలా ఏదో ఒక గుర్తింపు ఉండాలని నిబంధన విధించిన ట్రంప్2024 గణాంకాల ప్రకారం అమెరికాలో 5.4 మిలియన్ల భారతీయ అమెరికన్లుయూఎస్ జనాభాలో 1.47 శాతం మంది భారతీయులే. ఇక, చైనీయులు కూడా అమెరికాలో భారీ సంఖ్యలోనే ఉన్నారు. దీంతో, వారు కూడా అమెరికాను వీడే అవకాశం ఉంది. పుతిన్‌కు హెచ్చరికలు..ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై స్పందించిన ట్రంప్..రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నారన్న మండిపడిన ట్రంప్.యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్ ప్రతిపాదిస్తున్న ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు అంగీకరించడం లేదని కామెంట్స్పుతిన్ వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని సూచనలేకపోతే రష్యా గొప్ప ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని హెచ్చరిక కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నులు: ట్రంప్కెనడా, మెక్సికో షాకిచ్చిన ట్రంప్.ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం పన్నులు విధింపు.ఆ రెండు దేశాలు సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయకపోతే పన్నుల విధింపు తప్పదని ఇది వరకే హెచ్చరించిన ట్రంప్ఈ మేరకు తాజాగా ప్రకటనఅయితే, చైనా ఉత్పత్తులపై సుంకాల విధింపు గురించి వెల్లడించని అమెరికా నూతన అధ్యక్షుడుPresident Trump: 25% tariffs on each of Canada and Mexico beginning February 1st. pic.twitter.com/ncfBmMI242— Stephen Taylor (@stephen_taylor) January 21, 2025క్యాపిటల్ దాడి కేసులు రద్దు.. ట్రంప్ క్షమాభిక్ష2021 జనవరి 6న దాడుల్లో పాల్గొన్న 1500 మందికి ఉపశమనం కల్పించిన ట్రంప్కార్యాలయంలోకి వచ్చిన మొదటి రోజునే తనకున్న ప్రత్యేక అధికారాల వినియోగంఈ చర్యతో యూఎస్ న్యాయశాఖ చరిత్రలోనే అతిపెద్ద విచారణ, సుదీర్ఘ దర్యాప్తునకు ముగింపుతన మద్దతుదారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని ఎన్నికల సమయంలోనే హామీట్రంప్ కీలక సంతకాలు ఇవే..బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన 80 విధ్వంసకర, రాడికల్ పరిపాలనా ఉత్తర్వులు రద్దు చేసిన ట్రంప్ట్రంప్ యంత్రాంగంపై పట్టు సాధించేవరకు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఉత్తర్వులుమిలిటరీ, ఇతర ముఖ్యమైన ప్రాంతాలు మినహా అన్ని సమాఖ్య నియామకాలు నిలిపివేతపారిస్ వాతావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన ట్రంప్వాక్ స్వాతంత్ర్యంపై సెన్సార్ తొలగింపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఔట్..అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం. అమెరికాను ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి తొలగిస్తూ సంతకం. కోవిడ్ వ్యాప్తి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈమేరకు నిర్ణయం తీసుకొన్నారు. President Trump withdraws the United States from the World Health Organization.pic.twitter.com/4vnEJTQQl9— நெல்லை செல்வின் (@selvinnellai87) January 21, 2025 AMERICA IS BACK. 🇺🇸Every single day I will be fighting for you with every breath in my body. I will not rest until we have delivered the strong, safe and prosperous America that our children deserve and that you deserve. This will truly be the golden age of America. pic.twitter.com/cCuSV8Q44Z— President Donald J. Trump (@POTUS) January 20, 2025 మోదీ అభినందనలు..అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు. ట్విట్టర్ వేదికగా మోదీ..‘నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు. ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించేందుకు, ప్రపంచ భవితను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఆయనతో మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆయన పదవీకాలం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని కామెంట్స్ చేశారు. ఉత్తర్వులే ఉత్తర్వులు! బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్‌ల పెంపు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు.ట్రంప్ రాకతో వైట్‌హౌస్ వెబ్సైట్ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అనే హెడ్డింగ్‌తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్ సందేశాన్ని హోం పేజీలో హైలైట్ చేసింది. ట్రంప్ తాజా నిర్ణయాలను పోస్ట్ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. BREAKING: President Trump signs an Executive Order designating the cartels as foreign terrorist organizations pic.twitter.com/Pc6pbMsbBo— Libs of TikTok (@libsoftiktok) January 21, 2025 -
అమెరికాకు ఇక స్వర్ణయుగమే... డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ... 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
-
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం
Donald Trump Inauguration Live Updates..10:33PMThe 60th Presidential Inauguration Ceremony https://t.co/kTB4w2VCdI— Donald J. Trump (@realDonaldTrump) January 20, 2025అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారంఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేశారు వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. అమెరికాకు అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనిలో భాగంగా 25వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ముందుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు.వాషింగ్టన్ డీసీలో ట్రాఫిక్ ఆంక్షలుట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రహదారులు మూసివేయడంతో పాటు మెట్రో సర్వీసులను మళ్లించారు. 9:25PMవైట్‌హౌస్‌కు ట్రంప్.. స్వాగతం పలికిన బైడెన్ 👉కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సాదర స్వాగతం పలికారు.Joe y Jill Biden reciben a Donald y Melania Trump antes de su salida de la Casa Blanca.Al mediodía de hoy y siguiendo lo establecido en la Constitución, Donald Trump prestará juramento y asumirá su cargo como presidente de EUA. pic.twitter.com/699c25xd7A— InformaES 🇸🇻 (@InformaESV) January 20, 2025 👉రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. 78 ఏళ్ల వయసులో అగ్రరాజ్యాధినేతగా మరోసారి బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ సందడి నెలకొంది. Donald Trump et Melania Trump arrivent à la messe à l'église St. Johns avant la 60e investiture présidentielle.#Trump2025 pic.twitter.com/Sax4VpgfO6— ICÔNE (@IconeMediaFR) January 20, 2025వైట్‌హౌస్‌లో బైడెన్ సెల్ఫీ..👉కొద్ది గంటల్లో ముగియనున్న జో బైడెన్ అధ్యక్ష పదవీ కాలం. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సెల్ఫీ. అంతకుముందు వైట్‌హౌస్‌కు చేరుకున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులకు స్వాగతం పలికిన జో బైడెన్, జిల్.For me, the People’s House has always been about welcoming everyone. America, thank you for trusting me with this sacred place. I’ve loved opening the doors to the Oval Office wider than ever these past four years. pic.twitter.com/G3BmVqEEiY— President Biden (@POTUS) January 20, 2025 One more selfie for the road. We love you, America. pic.twitter.com/71k46uGADV— President Biden (@POTUS) January 20, 2025 ట్రంప్‌కు పుతిన్ అభినందనలు..👉అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం వేళ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు. ఇదే సమయంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్. డొనాల్డ్ ట్రంప్ రాబోయే అమెరికా ప్రభుత్వంతో ఉక్రెయిన్ వివాదంపై చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏదైనా పరిష్కారం శాశ్వత శాంతిని నిర్ధారిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రజల చట్టబద్ధమైన ప్రయోజనాలను గౌరవించడం ఆధారంగా శాశ్వత శాంతి నెలకొల్పాలన్నారు.Russian President Vladimir Putin said Monday he was open to talks on the Ukraine conflict with Donald Trump's incoming US administration and hoped any settlement would ensure "lasting peace"."We are also open to dialogue with the new US administration on the Ukrainian… pic.twitter.com/AvkRFAjhhv— Hespress English (@HespressEnglish) January 20, 2025 👉చర్చీలో డొనాల్డ్ ట్రంప్ దంపతులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన నివాసం వద్ద ఉన్న సెయింట్ జాన్స్ చర్చికి చేరుకున్న డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్👉ప్రపంచదేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది.🇺🇸TRUMP, MELANIA SPOTTED AT ST. JOHN’S CHURCH AHEAD OF INAUGURATION#Trump2025 #TrumpInauguration2025 #Inauguration2025 #Inauguration pic.twitter.com/ydj19nb4FD— MOHAMMAD AL_ARSHASHAN (@MOHAMMAD_ALARSH) January 20, 2025 తొలిరోజే భారీగా సంతకాలు! 👉మొదటి రోజే తనదైన ముద్ర కనిపించేలా ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు 1,500 మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటివాటిని తొలిరోజే మొదలుపెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు.Live from Washington D.C. ‼️Dion Powell MPA is right outside Capital One Arena, mingling with the excited crowds as they await the historic inauguration of Donald Trump as the 47th President of the United States. @DION_POWELL00 #Inauguration2025 #TrumpInauguration pic.twitter.com/waunBxNaMP— LiveONE.TV (@LiveONE_TV) January 20, 2025 ఫలితాల అనంతరం..👉ఫలితాల అనంతరం కూడా ట్రంప్ పలు కీలక ప్రకటనలు చేశారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేయడం, గ్రీన్‌ల్యాండ్, పనామాలను స్వాధీనం చేసుకోవడం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటి ప్రకటనలు చేసిన ట్రంప్.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే కీలక ఆదేశాలపై సంతకాలు చేస్తానని ప్రకటించారు. ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపార్టేషన్ ఆపరేషన్ చేపడతామని చెప్పారు.Les gens entrent maintenant dans l’arène Capital OnePour L'investiture de Donald J. Trump en tant que 47e président des États-Unis#Trump2025 #TrumpInauguration #DonaldTrump #DonaldTrump2025 #JDVance2025 #ElonMusk2025 #magaQuebec #maga2025 #ElonMusk pic.twitter.com/rlKRS8ZoWX— LE PRÉSIDENT DONALD TRUMP 2025/2029 (@INFOQUBEC) January 20, 2025 కుటుంబ నేపథ్యం..👉న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో మేరీ, ఫ్రెడ్ దంపతులకు జూన్ 14, 1946న డొనాల్డ్ ట్రంప్ జన్మించారు. తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగోవాడు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కామర్స్‌లో 1968లో డిగ్రీ పట్టా పొందారు.👉తండ్రి కంపెనీలో 1971లో బాధ్యత స్వీకరించిన ట్రంప్.. అనంతరం ట్రంప్ ఆర్గనైజేషన్‌గా పేరు మార్చారు. హోటల్స్, రిసార్టులు, నిర్మాణ రంగం, క్యాసినోలు, గోల్ఫ్ కోర్స్‌ల్లో అడుగుపెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. 2004లో ‘ది అప్రెంటిస్’ రియాల్టీ టీవీ షోతో దేశమంతా పాపులర్ అయ్యారు.👉క్రీడాకారిణి, మోడల్ ఇవానా జెలింకోవాను తొలుత వివాహం చేసుకున్న ట్రంప్.. 1990లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరికి డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్‌లు సంతానం. ఆ తర్వాత నటి మార్లా మార్పెల్స్ను 1993లో పెళ్లి చేసుకున్న ట్రంప్.. 1999లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వీరి కుమార్తె టిఫానీ ట్రంప్. స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్ మెలానియాను 2005లో ట్రంప్ వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు బారన్ విలియమ్ ట్రంప్.👉రిపబ్లికన్ పార్టీ తరఫున 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్.. డెమోక్రటిక్ నేత హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓటమి చెందిన ట్రంప్.. 2024లోనూ బరిలోకి దిగారు. డెమోక్రట్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై విజయం సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. -
కుమారుడు హంటర్‌కు దేశాధ్యక్షుడి హోదాలో క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్. విమర్శించిన డొనాల్డ్ ట్రంప్
-
అటు అమెరికా..ఇటు కెనడా భారతీయులంటే ఎందుకంత..?
-
తమ్ముడి పెళ్లిలో సమంత.. ఫ్యామిలీతో కలిసిపోయినట్టేనా? (ఫొటోలు)


