భారత్‌ రావాల్సిన విమానంపై అమెరికా దాడి | US attacks plane bound for India | Sakshi
Sakshi News home page

భారత్‌ రావాల్సిన విమానంపై అమెరికా దాడి

Mar 31 2026 1:57 AM | Updated on Mar 31 2026 3:57 AM

US attacks plane bound for India

పశ్చిమాసియాలో యుద్ధం మెుదలై దాదాపు నెలరోజులు గడుస్తోన్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా అమెరికా  జరిపిన దాడుల్లో భారత్‌ రావాల్సిన మహాన్ ఎయిర్ విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.. ఔషద సేకరణకు ఈ విమానం భారత్ రావాల్సి ఉంది.

ఇరాన్‌లో జరుగుతన్న యుద్ధం కారణంగా మానవతా సహాయం అందించేందుకు భారత్‌లో విరాళాలు సేకరించారు. ఆ నిధులతో అక్కడి ప్రజలకు కావాల్సిన ఔషదాలు కొనుగోలు చేశారు. ఈ మందులను తీసుకెళ్లడానికి ఇరాన్‌కు చెందిన (Airbus A340-600)విమానం  బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. కాగా ఇరాన్‌లోని ఓ ఎయిర్‌పోర్టు వద్ద అమెరికా జరిపిన దాడుల్లో ఈ విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.

దీంతో మందులు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుంది. కాగా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరిస్తోంది. క్యూఆర్ కోడ్ ద్వారా భారతీయులు పంపిన డబ్బుతో ఈ మందులను కొనుగోలు చేశారు. కాగా ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ  మొత్తం ఎనిమిది మంది భారతీయులు  ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
 
Advertisement
Advertisement