breaking news
Attack
-
అయోధ్య విరాళాల వివాదం.. పప్పుయాదవ్‌పై దాడి
సాక్షి, ఢిల్లీ: ఎంపీ పప్పూ యాదవ్‌పై దాడి జరిగింది. ఈరోజు ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహిస్తూఉండగా ఓ వ్యక్తి అతనిపై చెప్పు విసిరారు. అనంతరం ఎంపీపై దాడికి యత్నించగా మద్ధతుదారులు అతనిని పట్టుకొని చితకబాదారు.అనంతరం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల అయోధ్య రామమందిర హుండీ చోరి విషయంలో ఇటీవల ప్రతిపక్షాలు పార్లమెంటు ఎదుట నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా పప్పుయాదవ్ సన్యాసి వేశం వేసి హూండీ పట్టుకొని నాటకం వేశారు. కాగా ఈ నాటకం హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉందంటూ వారణాసిలోని కొందరు సన్యాసులు, లాయర్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఆ నేపథ్యంలోనే లక్నోలోని ఓ హిందూ నాయకుడు పప్పూయాదవ్ తల తెచ్చిన వారికి రూ. 51 లక్షల రివార్డును ఇస్తానని ప్రకటించారు.ఇంతలోనే ఈ రోజు ఆయనపై దాడి జరిగింది. దాడి అనంతరం పప్పు యాదవ్ మాట్లాడుతూ "కొంతమంది బాబాలు ప్రతిరోజూ, "నన్ను చంపండి, కాల్చండి, నేను మీకు రూ. 51 లక్షలు ఇస్తాను. అంటున్నారు. అసలు నాతప్పేమిటి ఈ దాడి మీ కళ్ల ముందే జరిగింది. అసలు నేరం బ్రిజ్‌భూషణ్ తివారీ, చంపత్ రాయ్‌లది" అని అన్నారు.అయితే దాడి తర్వాత అక్కడ ఉద్రిక్తకర పరిస్తితులు ఏర్పడ్డాయి. ఎంపీ మద్దతుదారులు అతనిపై తీవ్రస్థాయిలో దాడికి యత్నించారు. దీంతో పోలీసులు అతి కష్టంమీద దాడి చేసిన వ్యక్తిని అక్కడి నుండి తరలించారు. కాగా నిందితుడు తనపై దాడికి కత్తి తీసుకవచ్చాడని పప్పూ యాదవ్ తెలిపారు.#Breaking - Delhi: Pappu Yadav attacked and brutally beaten A man with a knife tried to kill Pappu YadavPeople beat the man severely pic.twitter.com/uy5MQfRInS— NEWS WALA (@NEWSWALApy) August 2, 2026 -
టీడీపీ మూకల దాష్టీకం
తిరుపతి రూరల్: తిరుపతిలో అంబేడ్కరిస్టులు, దళితులపై టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వారి చేతుల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటంతో కూడిన బ్యానర్ చూడగానే చెలరేగిపోయారు. ‘‘మీరు ఏమైనా అంబేద్కర్‌కు పుట్టినోళ్లా..? బొమ్మ పట్టుకుని వస్తే వదిలేస్తామా..? అంటూ తిట్లదండకం అందుకున్నారు. బ్యానర్‌ను చించివేసి ఇక్కడి నుంచి వెళ్లకుంటే మీ అందరి అంతు చూస్తాం’’ అంటూ హూంకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటాడి దొరికిన వారిని దొరికినట్టు పిడిగుద్దులు కురిపిస్తూ చితకబాదారు. కొందరిని గొంతు నులిమి చంపేందుకు యత్నించారు. మహిళలపైనా దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన దళితులను స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అసలు ఏం జరిగిందంటే.. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 145లో ఉన్న మఠం భూములను కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పంచాయతీవాసుల దాహార్తిని తీర్చేందుకు గతంలో ఏర్పాటుచేసుకున్న బోరునూ ఆక్రమించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో అవిలాల మాజీ సర్పంచ్ వెంకటరమణతోపాటు దళితవాడ వాసులు, అంబేడ్కరిస్టులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా ఆక్రమణదారులు పనులు ఆపకపోవడంతో శనివారం అంబేడ్కర్ ఫొటోతో కూడిన బ్యానర్‌ను ముద్రించుకుని బోరు వద్దకు దళితవాడ వాసులు చేరుకుని భూ ఆక్రమణదారుల నుంచి పంచాయతీ బోరును కాపాడాలని నినదించారు. అదే సమయానికి భూ ఆక్రమణకు పాల్పడిన వారంతా అక్కడకు చేరుకుని దళితులపై రెచ్చిపోయారు. బూతుపంచాంగం లంకించుకున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంబేడ్కర్ చిత్రపటంతో కూడిన బ్యానర్‌ను చింపేసి పరుష పదజాలంతో దళిత జాతిని అవమానించేలా తిడుతూ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ప్రాణభయంతో కేకలు పెడుతూ మహిళలు పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగినా వారు కిమ్మనలేదు. చోద్యం చూస్తుండిపోయారు. గాయపడిన వారికి రుయాలో చికిత్స టీడీపీ గూండాల దాడిలో గాయపడిన అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటరమణ, కౌసల్య, విజయనిర్మల, ప్రసాద్, యాదగిరిలను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శించారు. దళితులపై దాడి హేయమైన చర్యలని మండిపడ్డారు. టీడీపీ గూండాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌చేశారు. దాడికి పాల్పడిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులుగా చెప్పుకునే నవీన్ నాయుడు, సునీల్, శంకర్ యాదవ్, బాలసుబ్రమణ్యం నాయుడు, పృధ్వీ ఉన్నారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. -
కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై పచ్చమూక దాడి
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారం మదంతో పచ్చమూకలు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపైకి దాడికి తెగబడ్డారు. టీడీపీ నేత నాగరాజు ఈ దాడికి పాల్పడ్డారు. ఏ కారణం లేకుండానే వైఎస్సార్సీపీ నేత ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నేతను పరామర్శించడానికి ఎమ్మెల్యే విరుపాక్షి అక్కడి చేరుకున్నారు. ఎమ్మెల్యే వీరుపాక్షిపై కూడా టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాముడుకి గాయాలయ్యాయి. ఈ ఘటనపై టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు చోద్య చూస్తున్నారు. గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. ఇంకా గొడవ సర్దుమనుగక కాక ముందే టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి సంగాల గ్రామానికి బయలుదేరారు. -
ఆగ్రహంతో పోలీసుస్టేషన్‌పై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం
సంగారెడ్డి, సాక్షి: సంగారెడ్డి వట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ రోజు (శనివారం) తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులు రాకుండానే మృతదేహాన్ని తరలించారనే కోపంతో మృతుడు బంధువులు ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడి చేశారు. స్టేషన్‌లోని ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివరాల్లోకి వెళితే.. నిన్న శుక్రవారం బీరప్ప అనే యువకుడు ఇతరాత్రా కారణాలతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.అయితే ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుటుంబసభ్యులకు రాకముందే అతని మృతదేహాన్ని కిందకి దించి ఆసుపత్రికి తరలించారు.దీంతో ఆగ్రహం చెందిన బంధువులు పోలీస్ స్టేషన్‌పైనే దాడి చేశారు. -
కీవ్‌పై మిసైళ్ల దాడి.. భారీగా మృతులు
కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకపడింది. గగనతలం మిసైళ్ల మోతతో దద్దరిల్లింది. ఈ రోజు శనివారం ఉదయం రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడిలో కనీసం తొమ్మిదిమంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఈ వారంలో కీవ్‌పై రష్యా దాడి చేయడం ఇది రెండోసారి.ఇటీవల రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. రష్యా వరుసగా కీవ్‌పై మిసైళ్లతో విరుచుకపడడంతో పెద్దఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రతిగా ఉక్రెయిన్ సైతం విరుచుకపడుతుంది.రష్యాలోని చమురు రిఫైనరీలు, ఇంధన డిపోలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తోంది. నల్లసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలు, సరుకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని కూడా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి కీవ్‌పై రష్యా బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకపడింది. ఈ దాడుల్లో కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు పిల్లలతో సహా 28 మంది గాయపడ్డారు. ఈ వివరాలను కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో స్వయంగా వెల్లడించారు.ఈ దాడులతో కీవ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు.కాగా కీవ్‌పై ఈ వారంలో ఇలాంటి పెద్ద దాడి జరగడం ఇది రెండోసారి. గత గురువారం జరిగిన దాడిలో క్రివాయ్ రిగ్ సమీపంలోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సహా తొమ్మిది మంది మరణించారు.ఈ ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా మరోసారి దాడి చేసింది. రష్యా దాడులు ఉదృతమవుతున్న నేపథ్యంలో తమ దేశానికి మరిన్ని రక్షణ వ్యవస్థలు కావాలని జెలెన్స్కీ పశ్చిమ దేశాలను కోరుతున్నారు. మిత్రులను కోరుతున్నారు. స్వయంగా పాట్రియాట్ క్షిపణులను తయారు చేసుకునేందుకు అమెరికా నుంచి లైసెన్స్ పొందడానికి ఆయన చర్చలు జరుపుతున్నారు.కాగా ఈ విషయమై ట్రంప్ మాట్లాడినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. "ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ ఇంకా దీనికి అంగీకరించలేదుఎవరికైనా అలాంటి సాంకేతికతను ఇవ్వడం చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే మనం ఎవరికైతే ఆ టెక్నాలజీ ఇస్తామో, వారు భవిష్యత్తులో మనపైనే తిరగబడవచ్చు" అని ట్రంప్ పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. -
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఈ సారి దాడి ఎప్పుడు చూడనిది
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై రెచ్చిపోయారు. ఈ వారాంతంలో ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ని లొంగిపోయేలా చేసేలా అత్యంత కఠినమైన దాడులు చేయాలని సైన్యాన్ని హెచ్చరించినట్లు సమాచారం.పశ్చిమాసియా యుద్ధంలో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. యుద్ధం ముగుస్తుందనుకునేలోపే మళ్లీ తీవ్రస్థాయికి చేరింది.ఇది చాలదన్నట్లు ఇటీవలే అమెరికాకు మద్ధతుగా సౌదీ అరేబియా సైతం రంగప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌కు ఝలకిచ్చారు.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.." టెహ్రాన్‌ను లొంగిపోయేలా ఇరాన్‌పై కఠినమైన దాడులు చేయండి. వారు అబద్ధాలు చెబుతారు. తప్పుగా అన్వయిస్తారు. ఇరాన్‌పై విశ్వాసం కోల్పోతున్నాము మనము వారిని చాలా తీవ్రంగా దెబ్బతీద్దాం. దీంతో ఏదో ఒక సమయంలో, ఇకపై దీనిని భరించలేమని వారు చెబుతారు," అని ట్రంప్ అన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాయి.అత్యంత కఠినమైన బాంబు దాడిగా?కాగా అక్కడి కథనాల ప్రకారం, ఇరాన్ యొక్క ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యాలు, రిఫైనరీలే టార్గెట్‌గా ఈ దాడులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన బాంబుదాడులలో అత్యంత తీవ్రమైనదిగా నిలిచేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ దాడులను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపేలా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
‘ధురంధర్’ ల్యారీ మళ్లీ వార్తల్లో! ఈసారి..
సినిమాల్లో చూపించిన చీకటి ప్రపంచం.. నిజ జీవితంలోనూ అంతే భయానకంగా ఉంటుందా? పాకిస్థాన్‌లోని కరాచీ గ్యాంగ్‌వార్ ప్లేస్ ‘ల్యారీ’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ‘ధురంధర్’లో చూపించిన ఈ ప్రాంతంలో గ్యాంగ్ కల్చర్, అండర్‌వల్డ్ ఆధిపత్య పోరు వాస్తవమనే విషయం మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకప్పుడు ల్యారీని తన గుప్పిట్లో ఉంచుకున్న గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్ సోదరుడు జుబైర్ బలోచ్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కరాచీలోని ల్యారీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చుని ఉన్న జుబైర్ బలోచ్‌పై బైక్‌పై వచ్చిన సాయుధులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ దాడిలో అతడికి ఛాతీ, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. పోలీసుల ప్రకారం.. చాకీవారా రోడ్డులోని సింగూ లేన్ ప్రాంతంలో జుబైర్‌పై దాడి జరిగింది. అతడిని వెంటనే కరాచీ సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ దాడి వెనుక ఉంది ఎవరు? అనేదానిపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. గ్యాంగ్ వార్, వ్యక్తిగత కక్షలు, పాత నేర సంబంధాలు.. ఇలా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. ల్యారీ అంటేనే గ్యాంగ్‌ల గడ్డకరాచీ నగరంలోని ల్యారీ ప్రాంతానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు రాజకీయ ప్రభావం, గ్యాంగ్‌ల ఆధిపత్యం, ఆయుధ సంస్కృతికి ఈ ప్రాంతం కేంద్రంగా ఉండేది. చిన్న వీధుల్లో పెరిగిన గ్యాంగ్‌లు క్రమంగా భారీ నెట్‌వర్క్‌లుగా మారి.. ప్రాంతీయ రాజకీయాలు, స్థానిక వ్యాపారాలపై ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంతో.. నిజజీవిత ఘటనల స్ఫూర్తితో మాంచి మసాలా స్పై డ్రామాగా ‘ధురంధర్’ సినిమాను మలిచాడు దర్శకుడు ఆదిత్య ధార్.ఎవరీ ఉజైర్ బలోచ్?ఇప్పుడు కాల్పులకు గురైన జుబైర్ బలోచ్.. ఉజైర్ బలోచ్ సొంత తమ్ముడు. ఉజైర్ బెలూచ్ కరాచీలోని ల్యారీ ప్రాంతంలో రెహమాన్ డకాయిట్ వారసుడిగా ఎదిగాడు. రెహమాన్ మరణం తర్వాత అతడి కజిన్ అయిన ఉజైర్ చేతికి ల్యారీ గ్యాంగ్ పగ్గాలు వెళ్లాయి. అయితే సినిమాలో సొంత సోదర బంధంగా చూపించారు. ఆ తర్వాత.. కరాచీ అండర్వల్డ్లో ఉజైర్ పేరు మరింత ప్రభావవంతంగా మారింది. అతడిపై హత్యలు, పోలీసులపై దాడులు, ఆయుధ కేసులు సహా అనేక ఆరోపణలు ఉన్నాయి. 2012లో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసుల్లోనూ అతడి పేరు వచ్చింది. ఆఖరికి 2020లో పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం గూఢచర్యం కేసులో అతడిని దోషిగా తేల్చి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది(సినిమాలో రణ్వీర్ హమ్జా పాత్ర ఉజైర్ను పక్కా స్కెచ్‌తో ఇరికించినట్లు చూపించాడు). వాస్తవంగా.. ఇప్పటికీ అతడిపై పలు కేసులు కొనసాగుతున్నాయి.ఒకప్పుడు తుపాకుల మోత, గ్యాంగ్‌ల ఆధిపత్యానికి పేరున్న ల్యారీ.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి రావడంతో కరాచీ భద్రతపై చర్చ మొదలైంది. ఉజైర్ బలోచ్ కుటుంబంపై జరిగిన ఈ దాడి వెనుక అసలు కథ ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.పాక్‌లో వాళ్ల అంతం.. ఎప్పుడూ మిస్టరీనే?పాకిస్థాన్‌లో గ్యాంగ్స్టర్లు, అండర్‌వల్డ్ డాన్లు, ఉగ్ర సంబంధం ఉన్న నేతల జీవితాలు తరచూ అనూహ్య మలుపులు తిరుగుతుంటాయి. ఆధిపత్య పోరులు, రాజకీయ విభేదాలు, ప్రత్యర్థి వర్గాల దాడులు.. ఇలా పలువురు కీలక వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఆ సమయాల్లో భారత్‌పైనా పాక్ ఆరోపణలు గుప్పించిన సందర్భాలు లేకపోలేదు. అయితే కొన్ని ఘటనల్లో దాడి వెనుక అసలు కారణాలు, కుట్రదారులు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. -
రూ. 40 లక్షల ఎదురు కట్నం కావాలంటూ, కూతురిపైనే తండ్రి దాడి
కర్ణాటకలోని బెంగళూరులో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి, వివాహం, డబ్బు విషయంలో విభేదాలతో ఓ తండ్రి తన కూతురిని అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కర్కశంగా వ్యవహరించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది లక్ష్మీ దుర్గ. ఆమె తండ్రి నాగేంద్ర క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. ఇటీవల నాగేంద్ర తన కుమార్తె పెళ్లి కోసం ఒక సంబంధం ఖాయం చేశాడు. అయితే, కూతురి చదువు, కెరీర్ కోసం తాను భారీగా ఖర్చు చేశాననే నెపంతో వరుడి కుటుంబం నుండి రూ. 40 లక్షలు డిమాండ్ చేశాడు.అంతేకాదు లక్ష్మీ దుర్గ ప్రతి నెలా వచ్చే తన జీతం మొత్తాన్ని తనకే ఇవ్వాలని నాగేంద్ర ఒత్తిడి తెచ్చేవాడు. దీన్ని నాగేంద్ర భార్య, కుమార్తె లక్ష్మీ దుర్గ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు పెళ్లివారిని రూ. 40 లక్షలు ఎదురు కట్నం డిమాండ్ చేశాడు. దీన్ని లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమె మీద పగబట్టాడు. జూలై25 న కన్నకూతురిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇదీ చదవండి: చిన్నప్పటి ఆసక్తే .. రూ. 96 లక్షల ప్రైజ్ తెచ్చిపెట్టింది!కుమార్తెను కలిసే నెపంతో కాలేజిలోని హెచ్ఓడి (HOD) ఛాంబర్లో ఉన్న లక్ష్మీ దుర్గ వద్దకు వెళ్లిన నాగేంద్ర, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపు, ఛాతీ, మెడలో తీవ్రంగా పొడిచి అక్కడ నుండి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీ దుర్గ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దాడికి కుటుంబంలో దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు నాగేంద్రను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలుఇదీ చదవండి: 144 ఏళ్ల క్రితం దుబాయ్ జనాభా 12 వేలు : ఇపుడు ఎంతో తెలుసా? -
గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్
పారిస్‌లోని పోర్ట్ డి క్లిచీ సమీపంలో ఒక దుండగుడు వీరంగం సృష్టించాడు. రెండు పొడవైన కత్తులతో ముగ్గురు మహిళలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే డ్యూటీ పోలీస్ అధికారి చాకచక్యంగా అతడిని బంధించి, అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. ఈ ఘటన 'పోర్ట్ డి క్లిచీ' ప్రాంతం సమీపంలో జరిగింది. ఫ్రాన్స్ రక్షణ మంత్రి లారెంట్ నునెజ్ తెలిపిన వివరాల ప్రకారం,నిందితుడు రెండు వంటగది కత్తులతో 19, 24, 36 ఏళ్ల వయస్సున్న మహిళలపై దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఒకరు గర్భిణి. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. డ్యూటీలో ఉన్న పోలీసు బాటసారులతో కలిసి అడ్డుకుని నిందితుడిని ఆ టకట్టించడం ప్రశంసలందుకుంటోంది. గుర్తుతెలియని ఆ నిందితుడు, తానీ నేరం చేయడానికి "అల్లాహ్" ఆజ్ఞాపించాడని పేర్కొన్నాడు. పారిస్ వీధిలో ఆ వ్యక్తి కత్తితో దాడికి దిగిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి స్నాప్‌చాట్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో నిజమైనదేనని రాయిటర్స్ వార్తా సంస్థ ధృవీకరించింది.Pregnant woman among two people rushed to hospital after mass stabbing in Paris.Suspect shouted: "It's Allah who made me do it"! pic.twitter.com/APe5MSPBzD— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) July 27, 2026 > ఆ వీడియోలో పొడవాటి నల్లని జుట్టు, క్రీమ్ రంగు ట్రాక్‌సూట్ ధరించిన ఒక వ్యక్తి రెండు చేతుల్లో పెద్ద కత్తులు పట్టుకుని, ఒక యువతిపై దాడి చేసి పొడవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే అదే వ్యక్తి నేలపై పడిపోగా, బాటసారులు అతడిని కదలకుండా పట్టుకున్నారు. నేలపై పడి ఉన్న ఆ వ్యక్తి "నన్ను ఇలా చేయమని అల్లాహ్ ఆజ్ఞాపించాడు" అని అనడం వీడియోలో వినిపిస్తోంది. ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!ఎలా పట్టుకున్నారంటే..నిందితుడు ఒక మహిళ వెనుక భాగంలో పొడవడం చూసి, 'రండి, అతడిని ఆపుదాం!' అని గట్టిగా అరిచాడు పోలీసు అధికారి. వెంటనే పలువురు ముందుకు వచ్చారు. ఇంతలో మరో వ్యక్తి అతనిపైకి సూట్‌కేస్‌ను విసిరాడు. దాంతో అతని చేతిలో కింత పడిపోయాయి.. ఆ సమయంలో పోలీసు అతడిని స్వాధీనంలోకి తీసుకున్నారు. సమయస్ఫూర్తితో నిందితుడిని బంధించిన ఆఫ్ డ్యూటీ పోలీస్ అధికారిని మంత్రి నునెజ్ ప్రశంసించారు.ఈ దాడికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని నునెజ్ తెలిపారు. నిందితుడి వివరాలను నిర్ధారించలేదు. ఈ ఘటనపై తీవ్రవాద నిరోధక విచారణ చేపట్టాలా వద్దా అనే కోణంలో ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూటర్ కార్యాలయం పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది -
జనాలపైకి దూసుకెళ్లిన వ్యాన్.. ఒకరు మృతి, 16 మందికి గాయాలు
బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్జీబీటీక్యూ+ (LGBTQ+) వర్గాల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్టోఫర్ స్ట్రీట్ డే (ప్రైడ్) వేడుకల్లో విషాదం అలముకుంది. వేడుకలు ముగిసే సమయాన ఓ తెల్లటి వ్యాన్ జనసమూహంపైకి దూసుకెళ్లడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.శనివారం రాత్రి బ్రాండెన్‌బర్గ్ గేట్ సమీపంలోని టియర్‌గార్టెన్ పార్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంతకుముందు లక్షలాది మందితో ప్రైడ్ పరేడ్ ఎంతో శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అయితే రాత్రి 10 గంటల ప్రాంతంలో వేడుకలు ముగిసే సమయంలో విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ పార్కులోని గుమిగూడిన జనాల్ని ఢీకొని , చివరకు ఓ చెట్టును బలంగా తాకి ఆగిపోయింది. 🚨BREAKING🚨CSD abgebrochen! Täter auf der Flucht! Auto rast in Menschenmenge. Aktuell Großeinsatz in Berlin Mitte - Tiergarten und Regierungsviertel komplett dicht. Menschen flüchten in Berliner HBF. Egal, wer der Schuldige ist - am Ende war's wieder ein "Rechter". pic.twitter.com/NqtodU3gYg— DavidGegenGoliath (@_david_brg) July 25, 2026సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సంఘటనా స్థలంలోనే వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ దుర్ఘటనపై జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బెర్లిన్ మేయర్ కై వెగ్నర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. -
ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకపడ్డ అమెరికా
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఇరాన్‌పై అమెరికా దాడులు చేసింది. ఆ దేశ మిలటరీ స్థావరాలే లక్ష్యంగా (బుధవారం) అమెరికా వైమానిక దళాలు విరుచుకపడ్డాయి. ఆ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం ఇది వరుసగా 12వ రాత్రి కావడం ఆందోళన కలిగించే విషయంఅమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో "ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు అమెరికా దళాలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై మరిన్ని దాడులను ప్రారంభించాయి. ఆ ప్రాంతీయ జలాల్లో పయనించే పౌర నావికులకు ,వాణిజ్య నౌకలకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును పూర్తిగా మట్టుబెట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది." అని ప్రకటన విడుదల చేసింది.మధ్యప్రాచ్య సముద్ర మార్గాల్లో నౌకాయాన భద్రతను కాపాడటమే లక్ష్యంగా ఇరాన్ సైనిక శక్తులను దెబ్బతీసేందుకు ఈ దాడులు తీవ్రతరం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాగా ఇరాన్ సైతం అమెరికాకు ఘాటుగా బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు కొద్ది సేపటి క్రితమే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా తమపై దాడులు చేస్తే కన్నుకు కన్ను అన్న రీతిలోనే సమాధానం ఉంటుందని తెలిపారు. -
మహిళలకు భద్రత ఇవ్వలేని చెత్త ప్రభుత్వం.. కూటమి పై బొత్స కూతురు ఫైర్
-
అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ మెరుపు దాడులు
-
కొడుకు ముందు మూత్రం పోసేలా కొట్టడం ఏంటండీ..
-
Hyd: జూబ్లీహిల్స్ కార్పిడియం పబ్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ కార్పిడియం పబ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం(జూలై 20వ తేదీ) రాత్రి సమయంలో కార్పిడియం పబ్‌లో మహిళలపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తనపై దాడి చేయవద్దని సదరు మహిళ వేడుకున్నా వినకుండా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఇరాన్ భీకర దాడి.. అమెరికా సైనికులు మృతి
-
చెన్నూర్‌లో ఉద్రిక్తత.. అధికారులపై పెట్రోల్, కారంతో దాడి
సాక్షి, మంచిర్యాల: చెన్నూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవాదాయ శాఖ అధికారులకు, భూకబ్జాదారులకు మధ్య ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. జాతీయ రహదారి సమీపంలోని భూములను కబ్జాదారులు అక్రమంగా ఆధీనంలోకి తీసుకన్నారు. దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారుల జేసీబీలతో ఆ ప్రాంతంలోకి వెళ్లారు. దీంతో అక్రమదారులు ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు. దేవాదాయ శాఖ అధికారులపై పెట్రోల్ పోసి కారంపోడి జల్లి మరణాయుధాలతో వెంటాడారు. దీంతో తీవ్ర భయందోళనలకు గురైన అధికారులు వెంటనే అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ఐటీడీపీ కార్యకర్త కాళ్ళు, చేతులు విరగొట్టిన టీడీపీ గూండాలు
-
నడి రోడ్డుపై మహిళను వివస్త్రరణ చేసి టీడీపీ నేతల బరితెగింపు..
-
చిన్నారుల ఆసుపత్రులను సైతం వదలరా..?
టెహ్రాన్: అమెరికా,ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నపిల్లలకు వైద్యచికిత్స చేస్తున్న కేంద్రాలపై అమెరికా దాడులు జరిపిందని అది అత్యంత అనాగరికత చర్యని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.అమెరికా చేసిన దాడులతో ఆసుపత్రి ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందన్నారు. ఆసుపత్రిలోని చిన్నపిల్లల క్యాన్సర్ చికిత్స విభాగంపై ఈదాడుల ప్రభావం పడిందని క్యాన్సర్ రోగులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు కీమోథెరపీ చికిత్స అందించే ఈ ఆసుపత్రిని ఖాళీ చేయించాల్సి వచ్చింది.ఈ అంశమై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి మాట్లాడుతూ ఈ దాడి "ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపిన క్రూరమైన దాడులను గుర్తుకు తెస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నపిల్లలకు ఈ దాడి తీవ్ర వేదనను, ఆందోళనను కలిగించింది.వెంటనే కీమోథెరపీ చేయించుకుంటున్న211 మంది రోగులను ఆసుపత్రి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇది తమ ప్రాణాల కోసం వీరోచితంగా పోరాడుతున్న చిన్నారులపై జరిగిన ఈ దాడి అత్యంత అమాయకులైన మానవులపై జరిగిన ఒక పిరికిపంద యుద్ధ నేరం " అని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు."మానవ హక్కుల గురించి నిరంతరం నీతులు చెప్పే దేశాలు, ఆసుపత్రులు. ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని చూసీచూడనట్లు నటిస్తున్నాయి. అలాంటి వారు తమ నైతిక విశ్వసనీయతను ఎప్పుడో పూర్తిగా కోల్పోయారు," అని మండిపడ్డారు.ఇరాన్ అంతటా పేలుళ్లు - ప్రాణనష్టంఅల్ జజీరా నివేదిక ప్రకారం.. ఇరాన్‌లోని కెస్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్ సిరిక్ , చబహార్ , కొనారక్, రాస్క్ సిటీ,సహా పలు ప్రాంతాలపై అమెరికా దాడులతో తెగబడింది. అదే విధంగా ఇరాన్ ఆర్మీ స్థావరాలపై ఏకకాలంలో అమెరికా విరుచుకపడుతుంది. ఈ దాడిలో కనీసం ఏడుగురు సైనికులు మరణించారని, దేశవ్యాప్తంగా వందలాది మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. అమెరికా దాడుల వల్ల ఇప్పటివరకు ఇరాన్లో కనీసం 35 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారని టెహ్రాన్ వెల్లడించింది. -
కోనేరు కృష్ణకు ఆర్నెల్ల జైలు
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అటవీశాఖ అధికారులపై దాడి కేసులో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ కోనేరు కృష్ణతోపాటు మరో ఏడుగురికి ఆర్నెల్ల జైలు, జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ స్పెషల్ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి డేనిరుత్ గురువారం తీర్పునిచ్చారు. పీపీ రమణారెడ్డి, లైజన్ అధికారి ఈశ్వర్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019 జూన్ 30న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ శివారులోని కడంబా అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లారు. మూడు ట్రాక్టర్లతో భూమి చదును చేస్తుండగా కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని కొందరిని జీపులో పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా కోనేరు కృష్ణ, బారు పోచం, పొట్టె మల్లేష్, బిచ్చర శంకర్, మరికొంతమంది అడ్డగించారు. ట్రాక్టర్లను ధ్వంసం చేస్తుండగా ఎఫ్ఆర్వో చీలే అనిత ట్రాక్టర్‌పైకి ఎక్కి ఎవరినీ కొట్టొ ద్దని సూచించారు. కోనేరు కృష్ణ వెదురు కర్రలతో ఆమెను కొట్టడంతో చేతులకు గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు రమాదేవి, పడాల ఝాన్సీ, లక్ష్మి, బోంపల్లి అనిత, ఆత్రం లక్ష్మిలను కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు 39 మందిపై చార్జిషీట్ దాఖలు చేయగా, కేసు విచారణలో ఉండగా ఇద్దరు మృతిచెందారు. నేరం రుజువు కావడంతో 8 మందికి వివిధ కేసుల్లో ఆరు నెలల శిక్ష, ఒక్కొక్కరికి రూ.8,500 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. శిక్ష పడిన వారిలో కోనేరు కృష్ణ, బూరం పోశం, పుల్ల శ్రీకాంత్, కొట్ట మల్లేష్, బిబ్బర శంకర్, రాజశేఖర్, బూరం మల్లేష్, బూరం శ్యామల ఉన్నారు. -
ఇరాన్ ఆస్పత్రిపై అమెరికా క్షిపణి దాడి
అహ్వాజ్: ఇరాన్‌లోని అహ్వాజ్లో ఉన్న షాహిద్ బాఘేయీ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణులు దాడి చేశాయని, ఫలితంగా ఆస్పత్రిలోని రోగులను అత్యవసరంగా తరలించాల్సి వచ్చిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా కీమోథెరపీ తీసుకుంటున్న చిన్నారులను భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది ఆస్పత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 24 గంటల వ్యవధిలో ఇరాన్‌పై అమెరికా రెండు భారీ దాడులను చేసింది.హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు నిర్వహిస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ సైనిక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. అహ్వాజ్తో పాటు బందర్ అబ్బాస్, చబహార్, బుషెహర్ నగరాల్లోనూ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.అలాగే ఇరాన్ ఓడరేవుల వద్ద నిబంధనలను ఉల్లంఘించి వస్తున్న ‘ఎం/టి బెల్మా’ అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా యుద్ధ విమానాలు క్షిపణులతో దెబ్బతీశాయి. ఈ దాడుల వల్ల ఆస్పత్రికి జరిగిన నష్టం లేదా ప్రాణనష్టంపై ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఇరాన్ రక్షణ స్థావరాలపై అమెరికా దాడులు
టెహ్రాన్:ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు ప్రారంభించింది. ఇరాన్ తీర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై మిసైళ్లతో విరుచుకపడుతోంది. ఇరాన్‌పై దాడులను యూఎస్ కమాండ్ కంట్రోల్ అధికారికంగా ధృవీకరించింది. కాగా పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్, అమెరికా పరస్పరం దాడులకు తెగబడుతుండడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.అమెరికా మిలిటరీకిసెంట్రల్ కమాండ్ 90 నిమిషాల పాటు ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థలు, క్రూయిజ్ క్షిపణి నిల్వ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా గ్రేటర్ తుంబ్ ఐలాండ్, చాబహార్ వంటి తీర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్‌గా బాంబు దాడులు చేసింది.అమెరికా దాడులకు ప్రతి స్పందనగా ఇరాన్ సైతం దాడులకు తెగబడుతుంది. ఈ రోజు తెల్లవారుజామున బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడులు చేసింది. ఈ దాడులతో బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయం తీవ్రంగా దెబ్బతిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. -
తూర్పుగోదావరి: రామవరంలో ఉద్రిక్తత
సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి మండలం రామవరంలో కూటమినేతల అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై కూటమి నేతలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత కృష్ణారెడ్డి ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. కూటమి నేతల ఆగడాలను అదుపు చేయాలంటూ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి రామవరంలో రోడ్డుపై బైఠాయించారు.సూర్యనారాయణ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను కూడా పీకేశారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఈ దారుణానికి టీడీపీ నేతలు ఒడిగట్టారంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. -
ఇరాన్ భీకర దాడులు.. పరుగులు తీస్తున్న జనం..
-
దాడితో మొదలైన విధ్వంసం.. ఇంతలో దౌత్య చర్చలు!
వాషింగ్టన్: హార్ముజ్ జలసంధిలో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న ‘ఎమ్/వి జిఎఫ్ఎస్ గెలాక్సీ’ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) దాడికి పాల్పడింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అమెరికా, ఇరాన్‌పై శనివారం మూడో విడత సైనిక దాడులకు దిగింది. ఐఆర్జీసీ దాడి వల్ల నౌక ఇంజన్ గది తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, అందులో మంటలు చెలరేగడంతో ప్రయాణానికి వీలులేకుండా పోయిందని, ఒక సిబ్బంది గల్లంతయ్యారని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) తెలిపింది. వాణిజ్య నౌకలపై దాడులను అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు సెంట్కామ్ పేర్కొంది.‘ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు దానికి మూల్యం చెల్లిస్తోంది’ అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. మరోవైపు, పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా ఈ దాడులకు దిగింది. తమపై మరిన్ని దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఖతార్, ఒమన్ దేశాలు ఇరాన్‌తో ముమ్మర దౌత్య చర్చలు జరుపుతున్నాయి. -
సచివాలయంలోనే వైఎస్సార్సీపీ బీఎల్ఏపై దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఓటర్ల అక్రమ నమోదును అడ్డుకున్న వైఎస్సార్సీపీ బీఎల్ఏపై టీడీపీ వర్గీయులు సచివాలయంలోనే కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం మంచాలకట్ట గ్రామంలో జరిగింది.‘సర్’లో భాగంగా శుక్రవారం ఓటరు లిస్టును స్థానిక సచివాలయంలో పరిశీలిస్తుండగా అక్రమంగా ఓటర్లను నమోదు చేసుకునేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ బీఎల్ఏ వెంకటకృష్ణ అడ్డుకున్నాడు. మా ఓట్లనే అడ్డుకుంటావా, నీ అంతు తేలుస్తామని ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు సచివాలయం తలుపులు మూసి బీఎల్ఏ (బూత్ నెంబర్ 276) ఆవుల వెంకటక్రిష్ణపై కర్రలతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గాయపడిన వెంకటకృష్ణపైనే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఇరువర్గాలు సచివాలయంలోనే గొడవపడినట్లు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏ1గా వెంకటకృష్ణపై కేసు నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. ఇదే సమయంలో బాధితుడి ఫిర్యాదును కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడమేంటని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మధుసూదన్ ప్రశ్నించారు. కాగా, టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వెంకటక్రిష్ణను వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని నంద్యాల ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
అమెరికా బాంబుల వర్షం.. దద్దరిల్లిన పశ్చిమాసియా..
-
అంత్యక్రియల వేళ.. ఇరాన్‌కు గుండెకోత
టెహ్రాన్: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం ముగింపు వేళ ఇరాన్ కీలక వీడియో విడుదల చేసింది. ఆయన నివాసంపై అమెరికా జరిపిన దాడికి సంబంధించిన చిత్రాలను తొలిసారిగా అధికారికంగా పంచుకుంది. ఇంతవరకూ కేవలం శాటిలైట్ చిత్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా తొలిసారిగా అధికారికంగా వీడియోను విడుదల చేసింది.ఫిబ్రవరి 28 అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడికి సంబంధించిన వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో దాడులలో భవనం పూర్తిగా శిథిలమైన చిత్రాలు క్షిపణుల దాడులు భవనం కుప్పకూలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేని అంత్యక్రియలు ముగింపువేళ ఈ చిత్రాలు ఇరానీయలను తీవ్రమైన బాధకు గురి చేస్తున్నాయి.కాగా ఈ దాడిలో ఖమేనీ ఆయన కుటుంబసభ్యులతో సహా 14 నెలల మనవరాలు 40 మంది అధికారులు సైతం మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ భవనంపై ఏకకాలంలో 35 క్షిపణులను ప్రయోగించాయి. అయితే అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆయనను మషద్‌లో ఖననం చేయనున్నారు.కాగా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న అమెరికా దాడులకు తెగబడింది. చైనా, రష్యా, ఇరాన్‌లకు భూమర్గం ద్వారా జరిగే వస్తురవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వేబ్రిడ్జిపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఆందోళన నెలకొంది.Iran released footage of leader Khamanei's residence after the US attack that martyred him and his family, including 14-month old Zahra pic.twitter.com/dpSEJWKeGP— COMBATE |🇵🇷 (@upholdreality) July 8, 2026 -
పహల్గామ్ నరమేధం.. సూత్రధారి ఇతడే!
సాక్షి, ఢిల్లీ: పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా లష్కర్- ఇ- తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పేరును అధికారికంగా చేర్చింది. ఈ దాడిపై లోతైన విచారణ జరిపిన ఎన్ఐఏ ఎట్టకేలకు హఫీజ్ సయీద్‌ను నిందితుడిగా చేరుస్తూ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.పహల్గామ్ దాడికి బాధ్యత వహిస్తూ 'TRF' అనే ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ పోస్టులను దర్యాప్తు సంస్థ నిశితంగా పరిశీలించింది. ఈ సంస్థకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరిపింది. దీంతో TRF అనేది స్వతంత్ర సంస్థ కాదని కేవలం లష్కరే తోయిబా (LeT) కి చెందిన ముసుగు సంస్థ అని తేలింది. అంతర్జాతీయ ఒత్తిడి, FATF ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి హఫీజ్ సయీద్ వ్యూహాత్మకంగా TRF పేరుతో దాడులు చేయిస్తున్నాడని ఎన్ఐఏ పక్కా ఆధారాలు సేకరించింది. దానితో పాటు పలు కోణాల్లో లోతైన విచారణ జరిపిన ఎన్ఐఏ అతని పేరును ఛార్జ్ షీట్ నమోదు చేసింది. పహల్గామ్ అటాక్2025, ఏప్రిల్ 22న మధ్యాహ్నం సమయంలో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఈ ఉగ్రదాడి జరిగింది. పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రమూకలు తుపాకులతో విరుచుకపడ్డాయి. దీంతో ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానుష దాడిపై భారతావని భగ్గుమంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది.ఆపరేషన్ సిందూర్ దీనికి కౌంటర్‌గా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. పాక్‌లోని ప్రధాన ఉగ్రవాద సంస్థల స్థావరాలు ్ (LeT),జైషే మహమ్మద్ (JeM),హిజ్బుల్ ముజాహిదీన్ (HuM) పై ఎయిర్ స్ట్రైక్ చేసి వాటిని ధ్వంసం చేసింది. ఇక ఈ దాడిపై లోతైన విచారణ జరిపిన ఎన్ఐఏ లష్కరే-ఏ- తోయిబా చీఫ్‌ను ప్రధాన సూత్రధారిగా చేరూస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. -
బారు గేట్లు తోసుకుంటూ రావణపై జనసేన నేతల దాడులు
-
ప్రశ్న రావణ్ పై దాడికి ప్లాన్.. జనసేన నేత సంచలన ఆడియో
-
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్ల దాడి
-
అవసరమైతే మళ్లీ దాడులు
జెరూసలేం: అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలపై దృష్టి కేంద్రీకరించకుండా ఆపడానికి ఇజ్రాయెల్ స్వతంత్రంగా ప్రయతి్నస్తుందని, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ మరో సైనిక చర్య జరిగే అవకాశం ఉందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ భద్రతపై స్పష్టతరాని పక్షంలో, ఇరాన్ అణు బాంబు నుంచి తమను తాము కాపాడుకోవడానికి అవసరమైతే మూడోసారీ దాడి చేస్తామన్నారు. భద్రతపై ఇజ్రాయెల్ ఆందోళన దశలవారీగా ఉద్రిక్తతలను తగ్గించే ప్రక్రియను అనుసరించడానికి అమెరికా, ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించాయి. సైనిక చర్యను నిలిపివేయడం, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల ఉపశమనంపై చర్చలు జరపడం, ఇరాన్ అణు కార్యకలాపాలను పరిష్కరించేందుకు యంత్రాంగాలను ఏర్పాటు చేయడం వంటి హామీలు ఈ ముసాయిదా ఒప్పంద పత్రంలో ఉన్నాయి. తాము అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ కూడా పునరుద్ఘాటించింది. అయితే, తమ దృష్టిలో ఇరాన్ సైనిక లేదా అణు సామర్థ్యాలను యథాతథంగా ఉంచే ఏ ఒప్పందానికైనా తాము కట్టుబడి ఉండబోమని ఇజ్రాయెల్ పదేపదే సంకేతాలు ఇస్తోంది.సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. దాడులు ఇజ్రాయెల్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేస్తాయని, కొనసాగుతున్న చర్చలను దెబ్బతీస్తాయని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, నెతన్యాహు మంగళవారం దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను సందర్శించారు. భద్రతా ఒప్పందాలు కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ బలగాలు అక్కడే ఉంటాయని చెప్పారు. హెజ్బొల్లా బెదిరిస్తున్నంత కాలం, ముప్పు తొలగిపోయే వరకు తాము దక్షిణ లెబనాన్‌ను విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. -
కోల్‌కతాలో ఉద్రిక్తత.. టీఎంసీ ఎంపీపై కోడిగుడ్ల దాడి
కోల్‌కతా: టీఎంసీ ఎంపీ మహూవా మెయిత్రాపై కోడిగుడ్ల దాడి జరిగింది. ఈ రోజు ( బుధవారం) కోల్‌కతాలోని తన ఆఫీసువద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై కోడిగుడ్లతో దాడి చేశారు. అయితే బీజేపీ మద్ధతుదారులే తనపై దాడి చేశారని మహూవా ఆరోపిస్తుంది. ఈ దాడికి సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.ఈరోజు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణం వద్ద టీఎంసీ కార్యకర్తలతో మాట్లాడుతున్న ఆమెపై కొందరు కోడిగుడ్లతో చేశారు. తనపై దాడి జరిగిన విషయాన్ని ఆమె అధికారింకంగా ధ్రువీకరించారు. బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని . ఇది బెంగాల్ పోలీసుల ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. మహువా మొయిత్రా ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు.కాగా పశ్చిమబెంగాల్లో ఎన్నికల తర్వాత తృణముల్ నేతలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఇటీవల ఓ పర్యటనలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి ఎంపీ మహూవాపై గుడ్లదాడి జరగడం తీవ్ర కలకలం రేపుతుంది.Mahua aunty ke yahan bhi pahunch gaye eggs, Her source of energy 😭😭🤣 pic.twitter.com/ySt2rsMnMs— Lala (@lala_the_don) July 1, 2026 -
'నిజమేంటో తెలుసుకోండి.. డెలివరీ బాయ్ వివాదంపై అఖిల్ రాజ్'
డెలివరీ బాయ్ వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ స్పందించారు. అతన్ని కావాలని తాను కొట్టలేదన్నారు. అమ్మతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతోనే నేను అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. తప్పుడు అడ్రస్‌లో ఇచ్చిన అతను.. మా అమ్మతో అసభ్యంగా మాట్లాడారని అఖిల్ రాజ్ తెలిపారు. మా అమ్మను నీచంగా మాట్లాడడంతోనే నాకు కోపం వచ్చిందని అఖిల్ రాజ్ వెల్లడించారు. అంతే కానీ ఆ అబ్బాయిని కొట్టాల్సిన అవసరం నాకు ఏముందని అన్నారు. అతన్ని కొడితే నా కెరీర్‌కు ఏమైనా ఉపయోగపడుతుందా? అని ప్రశ్నించారు. ఇలా అడ్రస్ పొరపాటుగా ఇప్పటికీ దాదాపు పదిసార్లు జరిగిందని అఖిల్ రాజ్ తెలిపారు. నేను కూడా ఒకప్పుడు డెలివరీగా బాయ్‌గా పనిచేసి ఈ స్థాయికి వచ్చానని వెల్లడించారు. అడ్రస్ పొరపాటు వల్ల ఒకసారి కండోమ్స్, సిగరెట్స్ కూడా మా ఇంటికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొడవతో మా అమ్మ, నాన్న కూడా పానిక్ అయ్యారని పేర్కొన్నారు. నెేనైతే అతనిపై కావాలని కొప్పడలేదని అమ్మతో అసభ్యంగా మాట్లాడడం వల్లే తనకు కోపం వచ్చిందన్నారు. మాకు సంబంధం లేని ఆర్డర్ తీసుకొచ్చి నానా హంగామా చేసిన డెలివరీ బాయ్‌ను మీరు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఈ వివాదంపై అఖిల్ రాజ్ స్పందిస్తూ..' మా ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. అయినా ఫుడ్ పార్శిల్ వచ్చింది. మా అమ్మ ఆ పార్శిల్ తీసుకుని ఎవరు ఆర్డర్ పెట్టారని అడిగింది. ఎవరూ ఆర్డర్ చేయలేదు అని తెలుసుకుని పక్కనే పెట్టేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఫ్రీగా వస్తే తీసుకుంటారా అంటూ మా అమ్మను దుర్భాషలాడాడు. తాగిన మత్తులో ఉన్న ఆ డెలివరీ బాయ్ మా అమ్మను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒక కొడుకుగా నా బాధ్యతగా డెలివరీ బాయ్‌ను మర్యాదగా మాట్లాడమని మందలించా. ఆ డెలివరీ బాయ్ ఆ వీడియో తీసి ఇదంతా సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అసలు జరిగింది తెలుసుకోకుండా కొందరు నాపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఊరుకుంటారా. నేను ఒక హీరోగా ఇంకాస్త సంయమనం పాటించాల్సి ఉండాల్సింది. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సింది. అయితే మా అమ్మను తిట్టినందుకు కోపం ఆపుకోలేకపోయా. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినే. ఇలా డెలివరీ బాయ్ పనులు చేసిన వాడినే. నా సినిమాలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చెప్పాం. అలాంటి నేను అకారణంగా డెలివరీ బాయ్‌తో ఎందుకు గొడవపెట్టుకుంటా. అతనితో గొడవ పెట్టుకుంటే నాకు వచ్చేదేంటి. నన్ను సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్న మిత్రుల కోసమే ఈ వివరణ ఇస్తున్నా' అని అన్నారు. -
రాజు వెడ్స్ రాంబాయి హీరో ఓవరాక్షన్.. డెలివరీ బాయ్‌పై దాడి
రాజు వెడ్స్ రాంబాయి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరో అఖిల్ రాజ్ దురుసుగా ప్రవర్తించారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో అఖిల్ రాజ్ తీరుపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హీరో అఖిల్ రాజ్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు. అతని పేరేంట్స్ వద్దంటున్నా వినకుండా అఖిల్ రాజ్ భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కాగా.. అఖిల్ రాజ్ హీరోగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీతోనే అఖిల్ రాజ్ టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కేవలం ఒక్క సినిమాకే ఇంత ఓవరాక్షన్ ఏంటని పలువురు నెటిజన్స్ అఖిల్ రాజ్‌ను విమర్శిస్తున్నారు. పొరపాటు జరిగిందని డెలివరీ బాయ్ చెప్పినా కూడా వినకుండా అతనిపై దాడి చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. #RajuWedsRambai Hero Akhil Raj Attacks A Delivery Boy#AkhilRaj pic.twitter.com/KJg5S0j38d— Indian Clicks (@IndianClicks) June 29, 2026 -
ఘట్కేసర్లో రెచ్చిపోయిన యువకులు.. వైరల్ వీడియో!
-
ఉర్దూ టీచర్‌పై దాడి.. ఆర్మూర్‌లో హైటెన్షన్
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉర్దూ టీచర్‌పై దాడికి పాల్పడ్డ బీజేపీ నేత బాలును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలపై నిషేదం విధించారు. -
లిఫ్ట్ ఎక్కినందుకు డెలివరీ బాయ్ పై అపార్ట్ మెంట్ ఓనర్ దాడి..
-
కరాచీ దాడిపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్
న్యూఢిల్లీ: పాక్‌లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులవైపు వేలు చూపించడం మానేసి, తమ సొంత భూభాగంలో పెరుగుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అణచివేయడంపై దృష్టి పెట్టాలని ఢిల్లీ గట్టిగా హితవు పలికింది. మరోవైపు, ఈ దాడికి నిరసనగా పాకిస్తాన్ సైన్యం తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి వేళ ఆకస్మిక వైమానిక దాడులకు తెగబడటంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పీక్కు చేరాయి.కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో ‘ఇండియన్ ప్రాక్సీ’ ప్రమేయం ఉందంటూ పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. కరాచీలోని పారామిలిటరీ బలగాల కేంద్రమే లక్ష్యంగా పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని ఒక ఉగ్రవాది వేగంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. అనంతరం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: హిజ్బుల్లా భారీ ఆయుధ సొరంగాన్ని పేల్చివేసిన ఇజ్రాయెల్ -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడి అప్రజాస్వామికం
తాడేపల్లి రూరల్: పొలాలకు దారులు మూసేయడం, రిజర్వాయర్ల పేరిట 30 నుంచి 40 అడుగుల లోతున గోతులు తవ్వి పంటలను ముంచేయడం వంటి ప్రభుత్వ అరాచకాలను చూపించడానికి తామే వైఎస్సార్సీపీ ప్రతినిధులను పెనుమాక గ్రామానికి ఆహ్వానించామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. తమ సమస్యలు దేశానికే కాదు, ప్రపంచానికి తెలియాలంటే ఇలాంటి వారి సహకారం అవసరమని చెప్పారు.అమరావతిలో ప్రభుత్వ అరాచకానికి గురవుతున్న రైతుల పొలాలను పరిశీలించడానికి బాధిత రైతుల ఆహ్వానం మేరకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులను శనివారం ఉండవల్లి సెంటర్లో టీడీపీ గూండాలు అడ్డుకుని దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబు ప్రభుత్వం తమను ఏ విధంగా వేధిస్తోందో వివరించారు. రైతులకు రాజకీయాలతో సంబంధం లేదని, తమకు న్యాయం చేసే ఏ పార్టీ వారినైనా కలుస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కమిటీని అధికార పార్టీ అడ్డుకుని దాడులకు తెగబడటం అమానుషం, అప్రజాస్వామికమని మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న దారుణాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందన్నారు. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ల్యాండ్ పూలింగ్ చట్టం గడువు 2015 ఫిబ్రవరి 28 నాటికే ముగిసిందని, ఆ తర్వాత భూ సేకరణ మాత్రమే చేయాలని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా ఇప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ కిందే భూములు లాక్కుంటామని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిహారం రూ.5 లక్షలు, రూ.10 లక్షలే వస్తుందని భయపెడుతున్నారని, భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తెలిపారు.రిజిస్ట్రేషన్లు ఆపేశారని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు ఏవీ అందకుండా చేసి రైతులను ఆర్థికంగా, సామాజికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం లేకపోయినా 60 ఏళ్లుగా మూడు పంటలు పండించే అద్భుతమైన భూమిని ధ్వంసం చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా, అలైన్మెంట్లు మార్చినా తగ్గేదే లేదని, ప్రభుత్వ చట్టవిరుద్ధ విధానాలపై పోరాడతామని గట్టిగా చెప్పారు. వైఎస్సార్సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీని మళ్లీ ఇక్కడికి రప్పించి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అమరావతి రైతులు హెచ్చరించారు. రైతులు ఇంకా ఏం మాట్లాడారంటే.. రోడ్ల అలైన్మెంట్లు మారుస్తూ కుట్రలు రోడ్ల అలైన్మెంట్లు మా పొలాల మీదుగా మార్చేస్తూ కుట్రలు చేస్తున్నారు. ఒక వ్యక్తి పొలం ఇవ్వగానే దాన్లో రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డును పక్క భూమిలోకి జరిపేస్తున్నారు. ఆ రైతును బెదిరించి పొలం తీసుకోగానే, దాని పక్కన ఎవరైతే భూమి ఇవ్వలేదో వారి పొలంలోకి వెళ్తున్నారు. ఇలా రైతుల భూమి ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. వందల ఏళ్ల నాటి పాత రోడ్లను మూసేశారు. కరెంట్ స్తంభాలు పడగొట్టారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగేది రెండే రెండు... ఒకటి కంప చెట్లు కొట్టడం, రెండోది నీళ్లు ఎత్తి పోయడం. వేరే ఏమీ లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటూ ఇటూ తప్ప లోపల ఎక్కడా ఎటువంటి అభివృద్ధీ లేదు.అంతా మోసపూరితం ప్రభుత్వం తీరు అంతా మోసపూరితమే. పొలాలు ఇవ్వమని అడుగుతున్నారు కానీ ప్లాట్లు ఎక్కడిస్తారో క్షేత్రస్థాయిలో చూపించరు. అంతా కాగితాల మీదే. పైగా ల్యాండ్ పూలింగ్ నిబంధనల్లో ‘అవసరమైతే ఈ ఇచ్చిన భూమిని కూడా మళ్లీ గవర్నమెంటే తీసుకుంటుంది‘ అని ఉంది. అంటే 70 శాతం ఉచితంగా తీసుకుని, మిగిలిన 30 శాతం కూడా ఇవ్వకుండా లాగేసుకుంటారా? ఈ విషయాన్ని నిబంధనల్లో ఎందుకు స్పష్టంగా పెట్టలేదు? గ్రామసభలు పెడితే అవి భూములు ఇవ్వని రైతుల కోసమా, ఇచ్చిన వారి కోసమా అనే క్లారిటీ అధికారులకే లేదు.సాయంత్రం 6 గంటలకు నోటీసు ఇచ్చి, మరుసటి రోజే మీటింగ్ అంటే అభ్యంతరాలు ఎలా చెప్పగలుగుతారు? ఏదైనా సమస్య వస్తే డిప్యూటీ కలెక్టర్‌ను అడిగితే ఆయనకేం తెలియదని, పొలం ఇస్తే తీసుకుంటామని అంటారు. కమిషనర్‌ను అడిగితే ఆయనకేమీ తెలియదని అంటారు. ఏమీ తెలియని కమిషనర్ ఇక్కడికి వచ్చి రైతులకు ఏం చెబుతారు? పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇష్టం వచ్చినట్లు భూములు లాక్కోవడానికి వీల్లేదు. ఆ చట్టాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించి, మమ్మల్ని వేధింపులకు గురిచేస్తోంది. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన భూములే తీసుకుంటానని, ఇవ్వని వారి జోలికి పోనని చంద్రబాబు ప్రమాణం చేశారు. మరి ఇప్పుడు అధికారులు ఆయనకు తెలియకుండానే నోటీసులు ఇస్తున్నారా? వీటిపై పాలకులు, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. – కొండమడుగుల రాఘవరెడ్డి, పెనుమాకక్షేత్రస్థాయిలో మా సమస్యలు చూపించాలని రమ్మన్నాం ఉండవల్లి, పెనుమాక, ఎర్రపాలెం, నిడమర్రు గ్రామాల రైతులమంతా కలిసి 25 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మా సమస్యలన్నీ వివరించాం. అండగా నిలవాలని అభ్యర్థించాం. మాకు అండగా ఉండటానికి లీడర్లు, లాయర్లతో ఒక టీమ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ 2024లోనే రోడ్లకి క్లియర్ చేసి మా పొలం మాకు విడిచిపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్లనీయడంలేదు. పొలాల చుట్టూ చెరువు తీస్తోంది. ఈ దారుణాలన్నీ చూపించాలనే మేము వైఎస్సార్సీపీ బృందాన్ని రమ్మన్నాం. కానీ వైఎస్సార్సీపీ నాయకులను అమరావతి రాకుండా అధికార పార్టీ అడ్డుకున్నదంటే ఇక్కడ జరుగుతున్న తప్పులు బయటపడకుండా, వాటిని కప్పిపుచ్చుకోవడానికే రానివ్వట్లేదని అర్థం. – మేకా వెంకటరెడ్డి, పెనుమాక కోర్టు ఆదేశానుసారం పరిహారం ఇవ్వకపోగా, నోటీసులిచ్చారు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2015 ఫిబ్రవరి 28తో ముగిసిపోయినా, ఇప్పటికీ పూలింగ్‌లోనే తీసుకుంటాం అంటున్నారు. భూములు ఇవ్వని వాళ్లను వేధిస్తున్నారు. ప్రభుత్వం కోర్టులో కేసు ఉపసంహరించుకొనే సమయంలో 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లుగా రిజి్రస్టేషన్లు ఆపేసి, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా నష్ట పరిచినందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్‌కి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఆ పరిహారం ఇవ్వకపోగా మళ్లీ భూ సేకరణ నోటీసులు ఇచ్చారు. అసలు మొదటి డీపీఆర్ ప్రకారం ఉండవల్లి, పెనుమాక అమరావతి పరిధిలోనే లేవు. చివర్లో యాడ్ చేసి మా భూములను లాక్కుంటున్నారు. సీఆర్డీఏ అధికారులు అక్విజిషన్ గురించి చెప్పకుండా, మళ్లీ పూలింగ్ గురించే మాట్లాడుతున్నారు. –నవీన్, పెనుమాక మా గొంతు నొక్కాలని చూస్తే భయపడంమా పొలాల పక్కన రిజర్వాయర్ల పేరుతో 40 అడుగుల లోతున గుంతలు తవ్వేస్తున్నారు, రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు అందకపోయినా, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వ్యవసాయం చేస్తున్నాం. కేవలం 10 అడుగుల్లోనే భూగర్భ జలాలు ఉన్న అత్యంత సారవంతమైన భూమి ఇది. 60 ఏళ్లుగా ఇక్కడ మూడు పంటలు పండిస్తూ అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పటికే రాజధాని కోసం 50 వేల ఎకరాలు తీసుకున్నారు. అక్కడ రాజధాని కట్టుకోండి. అంతేకానీ, సారవంతమైన భూములను ధ్వంసం చేయొద్దు. మా గొంతు నొక్కాలని చూసినా భయపడం. పోరాడుతూనే ఉంటాం. –శ్రీకాంత్, పెనుమాక -
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
-
మేడిపల్లి PS పరిధిలో దారుణం.. గృహప్రవేశం జరిగిన ఇంటిపై దాడి
-
పాక్ పారా మిలటరీ హెడ్డాఫీసుపై ఉగ్ర దాడి
కరాచీలోని పారా మిలటరీ విభాగం పాకిస్తాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గులిస్తాన్–ఇ– జౌహార్ ప్రాంతంలోని ఈ కార్యాలయం గేట్‌ను వాహనంతో ఢీకొట్టిన సాయుధులు లోపలికి వస్తూనే కాల్పులకు దిగారని అధికారులు తెలిపారు. బలగాలు వెంటనే ధీటుగా స్పందించాయన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయినట్లు తెలిసిందన్నారు. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) నుండి విడిపోయిన ఉగ్రవాద ముఠా 'జమాత్-ఉల్-అహ్రార్' ప్రకటించుకుంది. 'ఖులాఫా-ఎ-రషీదీన్ ఇష్తిషాదీ బ్రిగేడ్' అనే ఆత్మాహుతి దళం ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది. పాకిస్తాన్లో ఇటీవల పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి. పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఉగ్రదాడిపై దర్యాప్తును ప్రారంభించాయి. కంట్రోల్ రూమ్, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్రవాదులు లోపలికి ఎలా ప్రవేశించారనే కోణంలో విచారణ చేపట్టారు. కరాచీలో హై అలర్ట్స్ ప్రకటించారు. -
రైతులు కాదు.. టీడీపీ రౌడీలు.. దాడి పై పేర్ని నాని రియాక్షన్
-
నడిరోడ్డుపై YSRCP నాయకులపై 300 మంది టీడీపీ గుండాల దాడి!
-
మళ్లీ యుద్ధం.. ఇరాన్ పై భారీ స్థాయిలో దాడులు చేసిన అమెరికా
-
పోరంకిలో టెన్షన్.. టెన్షన్.. దేవభక్తుని చక్రవర్తిపై దాడి
-
కేశవరెడ్డిని ఆస్పత్రిలోనే అంతమొందించే.. జేసీ వర్గం యత్నమా..?
-
తలనొప్పి అని వెళితే.. స్కానింగ్ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్లు
-
వైఎస్సార్సీపీ BLAపై టీడీపీ నేతల దాడి
సాక్షి, నంద్యాల: డోన్ మండలం కన్నప్పకుంట గ్రామంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ బీఎల్ఏపై టీడీపీ నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఎస్ఐఆర్ సర్వేలో TDP ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారని వైఎస్సార్సీపీ బీఎల్ఏ భరత్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన మధుసూదన్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త భరత్‌పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకున్న సోదరుడిపైనా దాడికి తెగబడ్డాడు. దీంతో వారిరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
గొంతుపై కత్తి పెట్టి.. రెచ్చిపోయిన ప్రేమోన్మాది!
గచ్చిబౌలి: ఇంట్లోకి చొరబడ్డ ఓ ప్రేమోన్మాది యువతి కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. రాయదుర్గంలోని పోచమ్మబస్తీలో నివాసం ఉండే డిగ్రీ విద్యార్థిని (20)ను పక్కింట్లో ఉండే కంచమీది గోవర్ధన్ (22) ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.శుక్రవారం తెల్లవారుజామున నిందితుడు పక్కనున్న భవనం పైనుంచి యువతి ఉంటున్న రెండో అంతస్తులోకి ప్రవేశించాడు. యువతి అక్క గొంతుపై కత్తి పెట్టి, అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆపై తల్లిదండ్రులు సత్యనారాయణ, సుజాత, యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. బాధితుల కేకలు విని సత్యనారాయణ సోదరుడు అర్జున్ అక్కడికి రాగా అతనిపై కూడా దాడి చేశాడు. బాధితుల కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని గోవర్ధన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.ఐదుగురిని గాయపరచిన నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. -
అమెరికా దాడిపై నావికుడి భార్య కన్నీటి ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా దాడులు జరిపింది. ఆ అటాక్‌లో ముగ్గురు భారతీయులు మరణించడం భారత్‌లో తీవ్ర ఆగ్రహజ్వాలలు రేపింది. తాజాగా ఆ దాడిలో మరణించిన చీఫ్ మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేశ్ సతీమణి తీవ్ర ఆవేదనతో స్పందించారు. ఇప్పటి వరకూ ఈ అంశంలో కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఇటీవల హర్ముజ్ ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ సెట్టెబెల్లో' చమురు ట్యాంకర్‌పై అమెరికా సైనిక దళాలు దాడులు జరిపాయి. ఈదాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పట్నాల సురేశ్ తెలుగువారున్నారు. ఇరాన్ రేవులపై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని (Blockade) ఉల్లంఘించిందనే ఆరోపణలతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ అటాక్ చేసింది. అయితే ప్రమాదంలో చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్, డెక్ కాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా అనే ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.కాగా ఈ ఘటనపై మెరైన్ చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ భార్య భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. "...ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ సిబ్బంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇప్పటివరకు ఎవరూ కనీసం దీనిపై సరైన స్పందన ఇవ్వలేదు. నేను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని అడుగుతున్నాను. బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందిస్తారు? అమెరికా ప్రభుత్వాన్ని కూడా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను... మా కుటుంబంలో నా భర్త ఒక్కరే సంపాదించేవారు. ఇక నా పిల్లలను నేను ఎలా పెంచాలి?..." అనే ఆవేదన వ్యక్తం చేశారు.కాగా ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా అత్యున్నత దౌత్యవేత్త (ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్‌కు రెండు సార్లు సమన్లు జారీ చేసింది. మరోవైపు ట్రంప్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ దాడులు చేసింది ఇరాన్ అని దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని తెలిపారు. -
ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేసిన అధికారిణి ఎందుకంటే..?
-
లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది మృతి
-
ప్రయాణికుడిపై రైల్వే మహిళా అధికారి దాడి
చిత్తూరు కార్పొరేషన్: టికెట్ రిజర్వేషన్ కోసం వచ్చిన ప్రయాణికుడికి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, ప్రశ్నించిన ప్రయాణికుడిపై మహిళా రైల్వే అధికారి దాడి చేసిన ఘటన చిత్తూరు రైల్వే స్టేషన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. ఆదివారం ఉదయం 8.45 గంటలకు చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లె పంచాయతీకి చెందిన ఓ ప్రయాణికుడు చిత్తూరు రైల్వేస్టేషన్‌కు శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో గుడివాడకు వెళ్లడానికి టికెటు రిజర్వ్ చేసుకోవడానికి వచ్చాడు. ఆ సమయంలో టికెటు కౌంటర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రిజర్వేషన్ సూపర్వైజర్ జ్యోతిని సమాచారం అడగ్గా కాసేపు వేచి ఉండాలని చెప్పారు. 45 నిమిషాలు వేచి చూసిన ప్రయాణికుడు రైల్వే అధికారి రీల్స్ చూస్తూ కాలయాపన చేస్తుండటంతో ఇదేమిటని ప్రశ్నించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె కౌంటర్ నుంచి బయటకు వచ్చి నానా దుర్భాషలాడుతూ తనపై దాడి చేశారని ప్రయాణికుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీడియో ఆధారాలను, ఫిర్యాదును పరిశీలించిన చీఫ్ కమర్షియల్ కంట్రోలర్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
గొల్ల నాకొ.. మిమ్మల్ని చంపితే ఎవరొస్తారు?
ఒంగోలు వన్‌టౌన్: ‘‘గొల్ల నాకొ..ల్లారా మిమ్మల్ని చంపితే ఎవరొస్తారురా’’ అని దూషిస్తూ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన వారు యాదవులను టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి గడ్డపారతో హత్యాయత్నం చేయడంపై సోమవారం బీసీలు మండిపడ్డారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీలు, యాదవులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ మధుబాబు అనే వ్యక్తి గొర్రెలు కాసుకోవడానికి ఈదుమూడి గ్రామం మీదుగా వెళుతుంటే అధికార పార్టీ సామాజికవర్గం వారు దాడి చేశారని పేర్కొన్నారు.అనిల్ అనే యువకుడిపైనా అదే రోజు దాడి చేశారన్నారు. అనంతరం వీరిని గ్రామంలోని టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారన్నారు. బాధితులు సీఐ శేషగిరిరావుకు ఫిర్యాదు చేస్తే.. చిన్న కేసు పెట్టిన పోలీసులు, నిందితులు ఫిర్యాదు చేస్తే బాధితులపై ఎదురు కేసు నమోదు చేశారని, సీఐ నిందితులకు అండగా ఉంటున్నారని మండిపడ్డారు.ఈదుమూడి గ్రామాన్ని సీఎం చంద్రబాబు పీ–4 గ్రామంగా స్వయంగా దత్తత తీసుకున్నారని, ఇదే గ్రామంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు యాదవులు, బీసీలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈదుమూడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. అసలేం జరిగిందంటే.. బాపట్ల జిల్లా కొత్త గొల్లపాలేనికి చెందిన గొర్రెల కాపరులు ఎల్లావుల అనిల్, వడ్లమూడి మధు వేసవిలో గొర్రెల మేత కోసం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి తమ మందతోపాటు వెళ్లి ఇక్కడే ఉంటూ గొర్రెలు మేపుకుంటున్నారు. ఈ నెల 7న ఆదివారం గొర్రెలు బీడు భూముల్లో తిరుగుతుండగా ఆ గ్రామానికి చెందిన కొందరు టీడీపీ సామాజికవర్గానికి చెందిన నాయకులు ‘‘ఎవడ్రా నా కొ... మా ఊరిలో.. మా పొలాల్లో గొర్రెలు మేపడానికి’’ అంటూ కులం పేరుతో దూషిస్తూ వారిపై దాడి చేశారు.అదేరోజు సాయంత్రం గొర్రెలను తోలుకుని వెళ్తున్న బాధితులను అధికార పార్టీకి చెందిన ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు, అంకినీడు, సుబ్రమణ్యం, కావూరి నాగార్జున, రంగారావు, వెంకట్రావు, ప్రసాద్ టీడీపీ కార్యాలయంలోకి ఈడ్చుకెళ్లి వెళ్లి కర్రలు, గడ్డపార, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ‘‘మేం అధికారంలో ఉన్నాం.. ఈ విషయం ఎక్కడైనా బయటకు చెప్తే చంపేస్తాం గొల్ల నా కొ...’’ అంటూ బెదిరించారు. గాయాలపాలైన బాధితులు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చేరి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి
జైపూర్ : కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్‌ను చెంపదెబ్బకొట్టారు. అపై తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అభిజిత్‌పై దాడి చేసిన వారిని పట్టుకుని.. కాక్రోచ్ కార్యకర్తలు చితక బాదారు. సీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు (సోమవారం) జైపూర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పరీక్ష పత్రికా లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు జైపూర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే హాజరయ్యారు. దీంతో పార్టీ మద్దతుదారులు ఆయనను భూజాలపై ఎత్తుకొని ర్యాలీగా సభాస్థలి వద్దకు తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామం జరిగింది. కాగా నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో జైపూర్‌లో నిర్వహించిన నిరసనల్లో ఆయనపై దాడి జరిగింది.కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది. ये तो नहीं होना चाहिए था...कॉकरोच पार्टी के संस्थापक के जयपुर में पड़ा थप्पड़! @abhijeet_dipke@CJP_2029 @CJP_for_India pic.twitter.com/WEYa73Wijd— Deepak kumawat (@Danny_deepz) June 15, 2026 -
YSRCP ZPTC భర్త పై కత్తితో దాడి
-
మిత్రం దేశం ఇలా చేస్తుందా.? అమెరికాపై థరూర్ ఆగ్రహం
సాక్షి, ఢిల్లీ: ఇటీవల ఒమన్ తీరంలో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మృతిచెందిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఒమన్ దాడిలో భారతీయ నావికుల మృతిపై 'మిత్రదేశం' అమెరికా సంతాపం తెలపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో భారతీయ సిబ్బంది మరణించిన ఘటనపై అమెరికా స్పందించిన తీరు సరైంది కాదని విమర్శించారు.శశిథరూర్ మాట్లాడుతూ.."ఈ అధికారిక అమెరికా ప్రకటనను చదవడం చాలా షాకింగ్‌గా ఉంది. అమాయక భారతీయ ప్రాణాలు కోల్పోవడంపై ఇందులో ఎలాంటి విచారం లేదా సంతాపం లేదు. ఒక 'మిత్రదేశం', వ్యూహాత్మక భాగస్వామి ఇంత ఘోరమైన ఉదాసీనతను ఎలా ప్రదర్శిస్తుంది?" అని ఎక్స్ వేదికగా వాషింగ్టన్‌ని ప్రశ్నించారు.ఒకవేళ ఆ నౌక నిబంధనలను పాటించకుండా ఉన్నా.. ఆ వాణిజ్య నౌకపై దాడులు కాకుండా ఇతర మార్గాల ద్వారా ఎందుకు ఆపలేకపోయారని అడిగారు. సాధారణ సిబ్బంది ప్రాణాలను బలిగొనేలా క్షిపణులను ప్రయోగించకుండా, ఒక నౌక యొక్క ప్రొపల్షన్ (నడిచే వ్యవస్థ) లేదా స్టీరింగ్‌ను మాత్రమే నిలిపివేయడం సాధ్యం కాదా?" అని ఆయన ప్రశ్నించారు.ట్రంప్ వివరణ కాగా ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే వివరణ ఇచ్చారు. ఈ దాడులు జరిపింది. ఇరాన్ అని వాటిని ఎట్టిపరిస్థితుల్లో ఊపేక్షించేది లేదన్నారు.మార్కో రూబియోతో జైశంకర్ ఫోన్ఒమన్ గల్ఫ్‌లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన అంశాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా కేవలం మూడు రోజుల వ్యవధిలో అమెరికా మూడు సార్లు భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న నౌకలపై దాడి చేసింది. ఇందులో రెండు సార్లు భారతీయ నావికులను రక్షించగా ఒకసారి దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై న్యూఢిల్లీ ఇప్పటికే వాషింగ్టన్కు తన తీవ్ర అభ్యంతరాలను, ఆందోళనను తెలియజేసింది. -
మహిళా ఉద్యోగిపై పాశవికం.. కొడవలితో దాడి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. పాల్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై ఒక వ్యక్తి అత్యంత పాశవికంగా దాడి జరిపాడు. ఆమెపై ఎనిమిది సార్లు కొడవలితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన మహిళా ఉద్యోగిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిన్న( శుక్రవారం) సాయంత్రం పాల్ఘర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో విధులు నిర్వహిస్తున్నస్నేహల్ సావంత్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సందర్భంలో నిందితుడు హఠాత్తుగా వెనుక నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కొడవలితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఆ మహిళ మెడ, వీపు, భుజాలు , నడుము భాగాలపై దాదాపు ఎనిమిది సార్లు కొడవలితో విచక్షణారహితంగా నరికాడు. దీనితో ఆమెకు తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయింది.అయితే ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత సైతం ఏ మాత్రం కనికరం లేకుండా పలుమార్లు దాడి చేశాడు. ఈ ఘటన వివరాలు అక్కడ సమీపంలో ఉన్న సీసీటీటీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడి చేసిన అనంతరం, నిందితుడు తన బ్యాగ్‌ను, దాడికి ఉపయోగించిన కొడవలిని అక్కడే వదిలేసి పరారయ్యాడు.అయితే తీవ్ర రక్తస్రావంతో అక్కడే పడి ఉన్న మహిళను స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్నేహల్ను మొదట పాల్ఘర్లోని ఒక రూరల్ హాస్పిటల్‌కు తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి గల అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అమోల్ ములేగా గుర్తించారు. అతను ఒక కోర్టు ప్యూన్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో, పోలీసులు అతడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. -
ముగ్గురు భారతీయులు మృతి.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదన్నారు. నౌకలపై దాడి చేస్తుంది ఇరాన్ అని వాటిని అమెరికా అడ్డుకుంటుందన్నారు. హర్ముజ్‌లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల హర్ముజ్‌లో భారతీయ నౌకలపై జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే.ఇటీవల తరచుగా హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా దాడులు జరిపింది. బుధవారం ఒమన్ సమీప ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. ఒకరోజు తర్వాత మరోసారి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేసింది. ఒమన్‌లోని షినాస్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్వీర్ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్ఫైర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించింది. గత నాలుగురోజుల్లో భారతీయన నౌకలపై దాడి చేయడం ఇది మూడోసారి.ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన భారత విదేశాంగశాఖ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్‌డిఅఫైర్స్ జేసన్‌ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయనకు మూడురోజుల వ్యవధిలో రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందించారు. -
అమెరికా దాడిలో విశాఖ వాసి మృతి
-
భారత షిఫ్‌పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్ మృతి
విశాఖ: ఒమన్ తీరంలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తెలుగు ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన సురేష్ అనే మెరైన్ ఇంజనీర్ మృతిచెందాడు. భారత్‌కు చెందిన షిప్‌పై ఒమన్ తీరంలో అమెరికా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో మెరైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విశాఖ వాసి సురేష్ మృత్యువాత పడ్డారు. 15 ఏళ్ల క్రితం సురేష వివాహం కాగా, ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్లుగా మర్చంట్ నేవీలో సురేష్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. దాంతో విశాఖలోని శ్రీహరిపురం శ్రీనివాస నగర్‌లోని సురేష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి
మస్కట్: ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ చమురు ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. మొత్తం 24 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ వాణిజ్య నౌకపై జరిగిన దాడితో ఒక్కసారిగా సముద్ర తీరం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది.అమెరికా దాడి.. భారతీయుల బలిఈ వారంలో ఒమన్ తీరానికి సమీపంలో ఉన్న హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా దళాలు ఈ చమురు ట్యాంకర్‌పై దాడి చేశాయి. ఈ నౌకలో ప్రయాణిస్తున్న 24 మంది భారతీయులలో 21 మందిని రక్షించగా, ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. అయితే, గురువారం నాటి తాజా సమాచారం ప్రకారం ఆ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురు నావికులు మరణించారని ప్రకటించారు.స్వదేశానికి మృతదేహాల తరలింపుఈ విషాద సమయంలో నౌకాదళ కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బాధితుల కుటుంబాలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మిగిలిన 21 మంది భారతీయ సిబ్బందిని వెంటనే స్వదేశానికి రప్పించడానికి, అలాగే మరణించిన నావికుల భౌతిక కాయాలను వేగంగా భారతదేశానికి తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను కేంద్రం ఆదేశించింది.అమెరికా రాయబారికి భారత్ సమన్లుఈ దాడిని భారతదేశం అత్యంత తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు జరపడం, భారతీయ నావికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని సీనియర్ అమెరికా రాయబారికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసి, తన నిరసనను బలంగా నమోదు చేసింది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణించే భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి
చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చి పోతున్నారు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులపైనే దాడికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. చింతపల్లి మండలంలో గంజాయి స్మగ్లర్లు దాడికి పాల్పడడంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చింతపల్లి మండలం ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు వచ్చి న ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీసులు లోతుగెడ్డ వంతెన సమీపంలో రామారావుపాలెం–మేడూరు జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ నిర్వçహించారు. అదే సమయంలో ఏఓబీ సరిహద్దు ప్రాంతం బలపం కోరుకొండ నుంచి రామారావుపాలెం మీదుగా అటుగా వచ్చి న వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు ఒక్కసారిగా పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలతో పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో స్మగ్లర్లను నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడడంతో అన్నవరం ఎస్ఐ రెండు రౌండ్లు తుపాకీని గాల్లోకి పేల్చారు.తప్పించుకుని పారిపోతున్న నలుగురిని పట్టుకోగా, మరో నలుగురు పారిపోయారు. వారి నుంచి రూ.కోటి విలువైన 290 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రాజస్థాన్‌కు చెందిన అర్జున్‌కుమార్, విశాఖపట్నంకు చెందిన ఇమ్రాన్‌ఖాన్, మల్కన్జిల్లా(ఒడిశా)కు చెందిన కిసాన్కార్, అల్లూరి జిల్లా బలపం గ్రామానికి చెందిన పాంగి శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. అన్నవరం పోలీసులు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. -
తాలిబన్ కమాండర్‌కు అమెరికాలో 42 ఏళ్ల శిక్ష!
వాషింగ్టన్: అమెరికా సైనికుల మరణాలకు కారకుడు, అంతర్జాతీయ జర్నలిస్ట్‌ను బందీ చేసిన తాలిబన్ మాజీ కమాండర్ హాజీ నజీబుల్లాకు అమెరికా ఫెడరల్ కోర్టు 42 ఏళ్ల సుదీర్ఘ జైలు శిక్షను ఖరారు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ కాలంలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన ఈ 50 ఏళ్ల నిందితుడు, అమెరికా కోర్టులో తన నేరాలను అంగీకరించాడు. ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వడం, విదేశీయులను బందీలుగా మార్చడం వంటి అభియోగాలపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ సంచలన తీర్పును వెల్లడించింది.అమెరికా సైనికులపై ఘాతుకం2007 నుండి 2009 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్లోని వర్దక్ ప్రావిన్స్‌లో తాలిబన్ కమాండర్‌గా నజీబుల్లా నెత్తుటి ఏరులు పారించాడు. నాటో దళాలు, అమెరికా సైనికులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, ఐఈడీ పేలుళ్లను ఇతని నాయకత్వంలోనే ఉగ్రవాదులు అమలు చేశారు. ముఖ్యంగా 2008 జూన్ 26న అమెరికా మిలిటరీ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులతో పాటు ఒక ఆఫ్ఘన్ అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఉగ్రదాడికి తానే బాధ్యుడినంటూ నజీబుల్లా అప్పట్లో బాహాటంగానే చెప్పుకున్నాడు.జర్నలిస్ట్ కిడ్నాప్.. తుపాకీ నీడలో 7 నెలలుసైనికులపై దాడుల అనంతరం 2008 నవంబర్‌లో ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్ట్ డేవిడ్ రోడ్, అతని డ్రైవర్, అనువాదకుడిని నజీబుల్లా బృందం కిడ్నాప్ చేసింది. వారిని పాకిస్తాన్‌లోని తాలిబన్ నియంత్రణ ప్రాంతాలకు తరలించి, దాదాపు ఏడు నెలల పాటు బందీలుగా ఉంచారు. అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, తుపాకీ గురిపెట్టి జర్నలిస్ట్‌తో ప్రాధేయపడేలా వీడియోలు రికార్డు చేయించారు. అయితే ఆ జర్నలిస్ట్ 2009 జూన్‌లో ఉగ్రవాదుల నుండి తప్పించుకున్నారు.చాకచక్యంగా అరెస్ట్.. న్యాయం గెలిచిందిదాదాపు దశాబ్ద కాలం పాటు తప్పించుకు తిరిగిన నజీబుల్లాను 2020లో ఉక్రెయిన్‌లో అంతర్జాతీయ దళాలు పట్టుకుని అమెరికాకు అప్పగించాయి. అమెరికా పౌరులను, సైనికులను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు ఎంతకాలం తప్పించుకున్నా వదిలిపెట్టేది లేదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అన్నారు.ఇది కూడా చదవండి: ఐర్లాండ్‌లో చెలరేగిన అల్లర్లు: కత్తిపోట్ల ఘటనతో.. -
భారతీయ నౌకపై దాడి.. 24 మంది నావికులు..!
టెహ్రాన్: హర్ముజ్‌లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు (సోమవారం) ఒమన్ తీర సమీపంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరిగింది. దీంతో భారత వాయుసేన తక్షణమే స్పందించి అందులోని నావికులను రక్షించింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.ఒమన్ తీర సమీపంలో 'ఎంటి మారివెక్స్'అనే ఆయిల్ సరఫరా చేస్తున్న నౌకలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో 24మంది నావికులు ఉన్నారు. దీంతో హుటాహుటీన స్పందించిన నావిక దళం వారందరినీ హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ దాడి ఎవరూ చేశారని సమాచారం ఇంకా తెలియలేదు. కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తకరంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్ఫరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో సహా పలు ప్రాంతాలలో భారీగా పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ మాటలు లెక్కచేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకపడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.Helicopter rescue operation underway for 24 Indian seafarers after vessel Marivex was struck off the coast of OmanFootage from the scene show the crew being lifted from the damaged vessel after fighting for survival at sea pic.twitter.com/crlSDYaU6y— RT (@RT_com) June 8, 2026 -
నామినేషన్ వేస్తే చంపేస్తా..! బరితెగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి..
-
అమెరికాలో కలకలం.. రద్దీ రైల్వే స్టేషన్లో రక్తపాతం
న్యూయార్క్: అమెరికాలోనే అత్యంత రద్దీగా ఉండే రవాణా కేంద్రాలలో ఒకటైన న్యూయార్క్ లోని పెన్ స్టేషన్ రక్తపాతానికి వేదికైంది. స్టేషన లోపల ఒక దుండగుడు విచక్షణారహితంగా కత్తులతో దాడికి తెగబడటంతో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. ఆ సమయంలో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఆమ్ట్రాక్ పోలీస్ డిపార్ట్మెంట్ నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు జరగనున్న తరుణంలో ఈ దాడి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.రక్తసిక్తంగా మారిన రైల్వే స్టేషన్పెన్ స్టేషన్‌లోని ట్రాక్ 5, 6 సమీపంలో ఈ ఘోర దాడి జరిగింది. ఘటన జరిగిన ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. న్యూయార్క్ ఫైర్ డిపార్ట్మెంట్, నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తే..ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడి వివరాలను, దాడికి గల కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే నిందితుడు మానసిక వికలాంగుడైన ఒక నిరాశ్రయుడని భావిస్తున్నట్లు న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ మార్క్ లెవిన్ తెలిపారు. ఈ దాడిని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ తీవ్రంగా ఖండించారు. ఇదొక ‘భయంకరమైన హింసాత్మక చర్య’ అని అభివర్ణించిన ఆమె, ప్రజల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పోలీసులు ఈ దాడి వెనుక గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.ప్రతిష్టాత్మక టోర్నీల వేళ భద్రత కట్టుదిట్టంమరో కొన్ని రోజుల్లో న్యూయార్క్ నగరం రెండు ప్రధాన క్రీడా ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వబోతున్న తరుణంలో ఈ ఘటన జరగడం భద్రతా సంస్థలను ఆందోళనలో పడేసింది. మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఎన్బీఏ ఫైనల్స్ (గేమ్స్ 3, 4), అలాగే పొరుగున ఉన్న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం నగరం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యవసర చర్యల దృష్ట్యా పెన్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఇదికూడా చదవండి: ‘దీదీ’కి మరో షాక్: ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా -
ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు
-
క్యాబ్ డ్రైవర్‌పై సినీ నటుడు దాడి
హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్‌పై ఓ సినీ నటుడు చితకబాదిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడు తెలిపిన మేరకు.. శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం తన ట్రిప్ పూర్తి చేసుకొని మరో బుకింగ్ కోసం నాగారం చౌరస్తాలో రోడ్డు పక్కన కారు నిలిపాడు. అదే సమయంలో కారులో వచ్చిన సినీ నటుడు సుప్రీత్‌రెడ్డి (కాట్రాజ్) వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్నావని ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్ శ్రీహరిని దుర్భాషలాడుతూ చితకబాదాడు. వెంటనే బాధితుడు 100కు డయల్ సమాచారం అందించి, కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
100 మందా..? 200 మందితో రెడీ! టీడీపీ గుండాలకు శిల్పా స్ట్రాంగ్ వార్నింగ్!
-
కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్‌కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్‌లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా దాడులు చేసింది. -
ఇరాన్ కీలక నిర్ణయం.. కథ మళ్లీ మెుదటికే?
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని వాటిని ఆపే వరకూ ఎట్టి పరిస్థితుల్లో చర్చలు లేవని తేల్చి చెప్పింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ఈ కథనాలను ప్రచురితం చేసింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న నానుడి ఇప్పుడు ఇరాన్- అమెరికా యుద్దంలో సరిగ్గా సరిపోతుంది. శాంతి చర్చలు ప్రారంభమై దాదాపుగా రెండు నెలలు గడుస్తోన్నా చర్చలలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఓసారేమో అమెరికా మెుండి చేయడం.. మరోసారేమో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం ఇదే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి శాంతి చర్చలను వాయిదా వేస్తోన్నట్లు ఇరాన్ ప్రకటించింది.గాజా,లెబనాన్లలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, అలాగే లెబనీస్ భూభాగం నుండి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై తమ డిమాండ్లు, తమ మిత్రదేశాల డిమాండ్లు నెరవేరే వరకు చర్చలు పునఃప్రారంభం కావని తెలిపింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయే వరకు మధ్యవర్తుల ద్వారా అమెరికాతో చర్చలు జరగవని టెహ్రాన్ స్పష్టం చేసింది.కాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్‌లోని 900 ఏళ్ల పురాతన బ్యూఫోర్ట్ కోటను, దాని చుట్టుపక్కల కొండలను ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 26 ఏళ్లలో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబడటం ఇదే అతిపెద్దది. కాగా లెబనాన్‌పై ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు. -
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దరిమిలా భారత సైన్యం చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల వద్ద దొరికిన రెండు స్మార్ట్ఫోన్లను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయ. ఎన్ఐఏ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జరిపిన దర్యాప్తులో, ఆ ఫోన్లు పాకిస్తాన్‌కు చెందిన ఒక ప్రముఖ బ్యాంకు ద్వారా అందినట్లు తేలింది. ఈ బ్యాంకు గతంలో కూడా లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొందిబ్యాంకు చిరునామాలో ఉగ్రవాద ఫోన్లుషావోమీ గ్లోబల్ అందించిన సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు వాడిన ఫోన్లలో ఒకటి 2021లో పాకిస్తాన్‌కు చెందిన ‘టెక్ సిరాత్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా అందుకున్నారు. దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పాకిస్తాన్‌కు చెందిన ‘ఫైసల్ బ్యాంక్’ నిర్వహించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ల డెలివరీ చిరునామా కరాచీలోని ఫైసల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయానిది. భారీ కన్సైన్మెంట్లకు బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్ అందించడం సాధారణమే అయినప్పటికీ, ఆ కన్సైన్మెంట్ నుండి ఈ ఫోన్ అక్రమంగా బయటకు వచ్చి, ఉగ్రవాదుల చేతికి చిక్కడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఆన్ చేయని ఫోన్లు.. భారీ కుట్రఈ ఫోన్ల దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. ఇవి 2021, 2023లో పాకిస్తాన్‌కు చేరినప్పటికీ, పహల్గామ్ దాడికి కొద్ది రోజుల ముందు వరకు ఎప్పుడూ వీటిని ఆన్ చేయలేదు. ఉగ్రవాదులను ప్రత్యేకంగా లక్ష్యిత దాడుల కోసం వీటిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఉగ్రవాదులు సాధారణ నెట్‌వర్క్‌లను కాకుండా, సుదూర ప్రాంతాల్లో సురక్షితంగా సమాచారం పంచుకోవడానికి రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు గుర్తించారు. దాడికి వారం రోజుల ముందే ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న టెంట్ ఫోటోలు, మ్యాప్‌లు ఈ ఫోన్లలో లభ్యమయ్యాయి. ఇది వారి ముందస్తు ప్రణాళికను తెలియజేస్తోంది. -
సర్వే చేయడానికి మీరు ఎవర్రా..?
శెట్టూరు: మేము అధికార పార్టీ నాయకులం... పోలీసులు, అధికారులు ఎవరైనా లెక్కలేదు అన్నట్లు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరికి అద్దం పడుతున్న వ్యవహారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం బచ్చేహళ్లిలో తాజాగా చోటుచేసుకుంది. బచ్చేహళ్లిలో సర్వే నంబర్ 97–1లో వైఎస్సార్సీపీ నాయకురాలి కుటుంబానికి 97 సెంట్ల పొలం ఉంది. ఈ 97 సెంట్లలో కొంత భూమిని.. పక్కనే సర్వే నంబర్ 97–2లో కొంత భూమి ఉన్న టీడీపీ నేత మల్లన్న ఆక్రమించుకున్నాడు.ఆక్రమణ నుంచి వైదొలగవలసిందిగా ఎన్నిసార్లు చెప్పినా మల్లన్న వినకపోవడంతో తమ పొలానికి సర్వే చేయాలని వైఎస్సార్సీపీకి చెందిన మహిళా రైతు, బాధితురాలు భార్గవి తహసీల్దార్ కార్యాలయంతో పాటు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో శనివారం స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల రక్షణతో పొలం సర్వే చేసేందుకు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ నేత మల్లన్న, అతని కుటుంబ సభ్యులు అశ్వర్థమ్మ, తిప్పేస్వామి, కవిత, శివ.. పచ్చ కండువాలు కప్పుకుని మరీ అక్కడకు వచ్చారు. పోలీసులను, రెవెన్యూ అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు.సర్వే చేయడానికి మీరు ఎవర్రా..? అంటూ దాడికి దిగారు. దాడిలో సర్వేయర్ శ్రీ లక్ష్మి కింద పడిపోగా, మహిళా కానిస్టేబుల్ రాజ్యలక్ష్మి చేతికి బలమైన గాయమైంది. అటు శెట్టూరు ఎస్ఐ సుమన్, కంబదూరు ఎస్ఐ లోకేశ్‌పైనా దురుసుగా ప్రవర్తిస్తూ చొక్కాలు చిరిగిపోయేలా దాడి చేశారు. అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్ రెడ్డిపైనా దాడికి యత్నించగా.. వీఆర్ఏలు, సిబ్బంది అడ్డుకున్నారు. అయితే స్థానికులు, పాత్రికేయులు జరిగిన సంఘటనను తమ సెల్ఫోన్లలో రికార్డు చేస్తుండగా పోలీసులు అడ్డుకుని వీడియోలు, ఆడియోలను తొలగించడం గమనార్హం. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు శెట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారులపై దాడి హేయం ఇలా దాడి చేయడం హేయం. మాకు పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీ మేరకు శనివారం పొలం సర్వే చేయడానికి వెళ్లగా..మమ్మల్ని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారు. ఎన్నడూ లేని విధంగా గ్రామంలో ఇలా ప్రభుత్వ అధికారులపై దాడికి దిగడంతో భయాందోళనకు గురయ్యాం. – అనిల్ కుమార్ రెడ్డి, శెట్టూరు డిప్యూటీ తహసీల్దార్ -
అభిషేక్ బెనర్జీపై దాడి.. మమతా ఘాటు రియాక్షన్
కోల్‌కతా: ఈ రోజు పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణముల్ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ అభిషేక్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. సోనార్‌పూర్‌లో ఈరోజు (శనివారం) మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ పర్యటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస చెలరేగింది. అందులో బాధితులైన తృణముల్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై కొంతమంది గుర్తుతెలియన వ్యక్తులు దాడి చేశారు. కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మమతా ""పాలకులే హంతకులుగా మారారు.. సిగ్గుపడాలి బీజేపీ" అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య స్పష్టం చేశారు. అదే విధంగా దాడిని ఖండిస్తున్నామన్నారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ సాగించిన పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని అందుకే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైందన్నారు.అయితే ఆ దాడి సమయంలో అభిషేక్ బెనర్జీ తనకు రాళ్లు, గుడ్లు తగలకుండా హెల్మెట్ పెట్టుకున్నారు. ఈ ఘటన సమయంలో నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. Staying true to his word, Shri @abhishekaitc REFUSED TO ABANDON the grieving family of Sanju Karmakar.Even after a vicious attack by @BJP4Bengal-backed miscreants, our National General Secretary chose not to turn back. Instead, he stood beside a family devastated by an… pic.twitter.com/L11oo92AzQ— All India Trinamool Congress (@AITCofficial) May 30, 2026 -
బొబ్బిలిలో దారుణం.. పూజారి ఇంటి పై టీడీపీ ఎమ్మెల్యే దాడి
-
అమెరికాకు ఎదురుదెబ్బ..? మరోసారి డ్రోన్లు కూల్చిన ఇరాన్
-
పక్కా ప్లాన్ తో న్యాయవాది హత్య
-
మహిళలపై పులి దాడి.. అక్కడికక్కడే నలుగురు మృతి
-
మహిళలపై పులి పంజా.. నలుగురు మృతి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బెబ్బులి బీభత్సం సృష్టించింది. బీడీ ఆకులు ఏరుకునడానికి అడవికి వెళ్లిన మహిళలపై తన పంజా విసిరింది. మెుత్తం 13 మంది మహిళలపై బెబ్బులి దాడి చేయగా అందులో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.చంద్రపూర్ జిల్లా గంజేవాహి అడవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మహిళలు బీడీ ఆకులు ఏరుకోవడానికి అడవికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే మాటు వేసిన పులి విచక్షణ రహితంగా వారిపై దాడి చేసింది. వారికి పారిపోయే అవకాశం ఇవ్వకుండా విరుచుకపడింది. మెుత్తంగా 13 మందిపై బెబ్బులి దాడి చేయగా అందులో నలుగురు మృతిచెందారు.మృతిచెందిన వారు దాదాజి మెహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, కౌశిక్ మెుహర్లే, అనుబాయి దాదాజీ మెుహర్లేగా గుర్తించారు. దీంతో వివరాలు తెలుసుకున్న అడవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో మనుషులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చంద్రపుర్ జిల్లాలో పులుల సంఖ్య అధికంగా ఉండటంతో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం, మానవ నివాసాలు అటవీ ప్రాంతాలకు దగ్గర కావడం వంటి కారణాలతో పులులు గ్రామాల వైపు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పులుల భయం తగ్గేలా అటవీశాఖ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
రైనోకు కోపం వస్తే ఇలా ఉంటది.. లక్కీగా!
-
జడ్చర్లలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, మహబూబ్‌నగర్: జడ్చర్లలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని ఓ యవకుడు.. యువతి ప్రాణం తీశాడు. యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని స్థానికులు చితకబాదారు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది. -
భారత నౌకపై దాడి: ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ఒమన్ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో నౌక పూర్తిగా మునిగిపోయినప్పటికీ, అందులోని 14 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది.సోమాలియా నుండి బయలుదేరిన ఈ నౌక బుధవారం ఒమన్ తీరానికి సమీపంలో ఉండగా దాడికి గురైంది. దాడి కారణంగా నౌకలో భారీగా మంటలు చెలరేగి, చివరకు అది సముద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న ఒమన్ కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించి, సిబ్బందిని రక్షించి 'దిబా' నౌకాశ్రయానికి తరలించారు.భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంఈ దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు, పౌర నావికులను లక్ష్యంగా చేసుకోవడం "ఆమోదయోగ్యం కాదు" అని స్పష్టం చేసింది. "భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించినందుకు ఒమన్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాణిజ్య నౌకల స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం, అమాయక పౌరుల ప్రాణాలను పణంగా పెట్టడం వంటి చర్యలను భారత్ సహించదు" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.యూఏఈ సంఘీభావంఈ ఉగ్రవాద దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అంతర్జాతీయ సముద్ర నావిగేషన్‌కు, ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పు అని హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ఈ దాడి స్పష్టంగా ఉల్లంఘించిందని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత నౌకల భద్రత కోసం తీసుకునే అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని యూఏఈ ప్రకటించింది.ఆందోళన కలిగిస్తున్న ప్రాంతీయ పరిస్థితులుఫిబ్రవరి 28న అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి భారత నౌకలపై దాడి జరగడం ఇది మూడవసారి. హర్మూజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న తరుణంలో ఈ తాజా దాడి చోటుచేసుకోవడం గమనార్హం. వాణిజ్య మార్గాలను ఆర్థిక బ్లాక్మెయిల్ కోసం వాడుకోవడం పైరసీ చర్యలతో సమానమని, ఇది ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.UAE Strongly Condemns Terrorist Attack on Indian-Flagged Ship off the Coast of Oman pic.twitter.com/gRArK2tniB— MoFA وزارة الخارجية (@mofauae) May 14, 2026 -
బాత్ రూమ్ కోసం ఇంట్లోకి వచ్చి.. CCTVలో నమ్మలేని వీడియో
-
ట్రంప్ దాడికి.. ఇరాన్ మాస్టర్ ప్లాన్.. రష్యా సాయంతో..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం సీజ్ఫైర్ ఒప్పందంతో నడుస్తోంది.అయితే ఈ యుద్ధంలో అమెరికా మెుదటి నుంచి రష్యా ఇరాన్‌కు సహకారం అందించిందనే అమెరికా వాదిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఆరోపణల్ని బలపరుస్తూ 'ది ఎకనామిస్ట్' నివేదిక ప్రచురించింది. అమెరికా ఇరాన్ యుద్దంలో డొనాల్డ్ ట్రంప్ తొలుత నుంచి రష్యాపై గుర్రుగా ఉన్నారు. మాస్కో రహస్య సమాచారం ఆధారంగానే ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేస్తోందన్నారు. ఇరాన్ సాంకేతికతను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినా పక్కా ప్రణాళికతో అమెరికా స్థావరాలను ఎలా టార్గెట్ చేయగలుగుతుందని దీనిలో కచ్చితంగా మాస్కో హస్తం ఉందని ఆరోపించారు. ది ఎకనామిస్ట్ నివేదిక ఈ నివేదిక ప్రకారం, "వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఇరాన్‌కు దాదాపు 5,000 షార్ట్-రేంజ్ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లను సరఫరా చేయడానికి రహస్య ప్రణాళిక రూపొందించింది. వీటితో పాటు శాటిలైట్ ద్వారా నడిచే లాంగ్-రేంజ్ డ్రోన్లను కూడా అందించాలని రష్యా భావించింది.ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లురేడియో సిగ్నల్స్‌కు బదులుగా సన్నని వైర్ల ద్వారా నియంత్రించబడతాయి. దీనివల్ల శత్రువులు వీటిని 'జామ్' చేయడం (సిగ్నల్స్ కట్ చేయడం) సాధ్యం కాదు. ఇవి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలవు". అని నివేదిక ప్రచురించింది.రష్యా తన లాంగ్-రేంజ్ డ్రోన్లలో ఎలాన్ మాస్క్‌కు చెందిన 'స్టార్‌లింక్' టెర్మినల్స్‌ను ఉపయోగించే.. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలను దాటవేసింది. ఇప్పుడు అదే సాంకేతికతను మధ్యప్రాచ్యంలో ఇరాన్ దళాలకు మళ్లించాలని రష్యా చూస్తోంది.కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, వాటిని ఎలా వాడాలో శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా రష్యా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కథనం ప్రచురితమైంది. దీని కోసం రష్యాలోని విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న సుమారు 10,000 మంది ఇరాన్ విద్యార్థుల నుండి ఆపరేటర్లను ఎంపిక చేయాలని రష్యా నిఘా సంస్థ భావించిందని తెలిపింది. అలాగే రష్యన్ భాష మాట్లాడగలిగే తజిక్ ప్రజలను మరియు సిరియాలోని అలవైట్ మైనారిటీలను కూడా ఈ పనుల కోసం వినియోగించుకోవాలని ప్రణాళికలో ఉంది.ట్రంప్ వ్యూహానికి కౌంటర్గాఇటీవల ట్రంప్ ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరిగింది. అంతే కాకుండా అమెరికా సైన్యం నేరుగా ఇరాన్‌పై దాడి చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికాను ఎదుర్కొనేలా ఈ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లు ప్రధానంగా ఇరాన్ తీర ప్రాంతంలోని ద్వీపాల వద్దే మోహరించేలా ప్రణాళికలు రచించారు. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా పదాతి దళాలతో దాడికి ఆదేశిస్తే అమెరికాను ఎదుర్కొవడానికి ఈ డ్రోన్లు కీలకంగా మారతాయని నివేదిక పేర్కొంది. -
నడిరోడ్డుపై భార్యపై భర్త దాడి, కాపాడిన జనం, కానీ కోదాడలో
దేశంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాదాపు ఒకే సారి మహిళలపై జరిగిన హత్యా, హత్యాయత్నానికి సంబంధించిన ఘటనలు నెట్టింట చర్చకు దారి తీసాయి. తెలంగాణ లో కోదాడలో జరిగిన ఘటనలో, మహిళ ప్రాణాలు కోల్పోగా, బెంగళూరులోని మదనాయకనహళ్లిలో పట్టపగలే నడిరోడ్డుపై మాజీ భార్యపై కత్తితో దాడిచేసిన ఘటనలో భార్య తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీంతో ప్రజలు ముఖ్యంగా స్పందించాల్సిన తీరుపై చర్చ జరుగుతోంది.ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బీహార్‌కు చెందిన 35 ఏళ్ల నిందితుడు సంజయ్, తన భార్య సోనాలి ఇంటి నుంచి బయటకు వస్తుండగా అడ్డగించాడు. అతను హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చి, గుర్తు తెలియని దుండగుడిలా నటిస్తూ సోనాలి మెడపై కత్తి పెట్టి దాడి చేయడానికి ప్రయత్నించాడు.ఈ ఘటనను చూసిన ఒక యువకుడు వెంటనే జోక్యం చేసుకుని, సంజయ్‌ను అదుపులోకి తీసుకుని ఆ మహిళను రక్షించాడు. సోనాలి కేకలు విన్న స్థానికులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిపై దాడి చేసి, అనంతరం అతడిని మదనాయకనహళ్లి పోలీసులకు అప్పగించారు.#Shocking incident in #Bengaluru.A man identified as Sanjay allegedly tried to #attack his ex-wife with a knife in the middle of the road. Alert youngsters overpowered him & rescued the woman. Madanayakanahalli Police are probing.@timesofindia pic.twitter.com/5rR4eo6sqa— TOI Bengaluru (@TOIBengaluru) May 7, 2026 గత కొన్ని నెలలుగా వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం అని సమాచారం. సంజయ్‌కు మద్యపాన వ్యసనం అలవాటు కావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, తిరిగి కలవడానికి సోనాలి నిరాకరించడమే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు. కోదాడ కేసుతెలంగాణాలోని కోదాడ బస్టాండ్ దగ్గర జరిగిన అందరూ చూస్తుండగా భార్య శిరీషని కత్తితో పొడిచి చంపాడు భర్త మణిదీప్. ఈ రెండు ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయినాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై నెటిజన్లు భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిదని కొంతమంది అంటే, కానీ అప్రమత్తంగా ఉండాలి, మన ప్రాణాల మీదకు వస్తే ఎలా? అందుకే ముందుగా ఆయుధం చేతిలో ఉన్నవారి దృష్టిని మరలించి, కలిసికట్టుగా, చాక చక్యంగా ఎదుర్కోవాలని కొందరు సూచించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలాంటి దుర్ఘటనలు కొన్నైనా ధైర్యంగా నిలువరించే గలిగితే, ఇలాంటి ఘోరాలకు తెగబడరని అభప్రాయపడుతున్నారు. విభేదాలు ఎంత తీవ్రమైనవైనా, పరిష్కరించుకోవాలిగానీ, ఇలా హత్యలకు తెగబడకూదని హితవు పలుకుతున్నారు. ఇదీ చదవండి: క్రికెటర్ సూర్యకుమార్ లగ్జరీ ఇల్లు, కార్లు, విలువ ఎంతో తెలుసా? -
గల్ఫ్ లో మళ్లీ యుద్ధం.. అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి
-
తీవ్ర ఉద్రిక్తత.. కౌశిక్ రెడ్డి కార్యాలయంపై దాడి
సాక్షి, హుజురాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా హుజురాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంపు ఆఫీసుపై దాడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు.అయితే ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఆదాడిలో ఆయన సురక్షితంగా బయటపడగా వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్‌రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.అసలు గొడవ ఎందుకు..?కరీంనగర్లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించాయి. -
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణుల దాడి
-
భగ్గుమన్న బీజేపీ.. పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నం!
సాక్షి, కరీంనగర్: నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి ప్రయత్నం జరిగింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే క్యాంప్ కార్యాలయం, వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. బీజేపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి.బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎమ్మెల్యే కౌశిక్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే ఆయనపై దాడికి ప్రయత్నించింది. దాడిలో కౌశిక్ క్యాంప్ కార్యాలయం కూడా ధ్వంసం చేశారు. ఈ దాడితో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కౌశిక్ ఏమన్నారంటే.. కరీంనగర్లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. గంగుల ఆఫీస్‌పైనా..మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్‌రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. -
ఇదొక పిరికిపంద చర్య.. నువ్వు నిజంగా మగాడివి అయితే.. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వార్నింగ్
-
ఏంటి ఈ దారుణం చంద్రబాబు.. చంపేస్తారా.. దశరథరామిరెడ్డి దాడిపై భూమన రియాక్షన్
-
YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి
-
పచ్చమూకల పాశవికం
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటిలో పచ్చమూకలు విధ్వంసం సృష్టించాయి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అనుచర మూకలు కత్తులు, రాడ్లతో రెచి్చపోయాయి. వైఎస్సార్సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి పై హత్యాయత్నానికి తెగబడ్డాయి. కోర్టు స్టేటస్ కో విధించిన స్థలం వివాదం విషయంలో మంత్రి అనుచరులు జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో దశరథ రామిరెడ్డి తమ మాట వినడంలేదన్న అక్కసుతో సుమారు 100 మందికిపైగా యువకుల సాయంతో స్థలంలో నిర్మాణాలను చేపట్టారు. స్టేటస్ కో ఉన్నా దౌర్జన్యంగా మంత్రి అనుచరులు ఆదినారాయణరెడ్డి, అతని భార్య సుమన భూమిలో నిర్మాణాలను చేపట్టడానికి యత్నిస్తున్నారని అన్నమయ్య జిల్లా ఎస్పీ, స్థానిక డీఎస్పీ, సీఐలకు శనివారం దశరథరామిరెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదుపై పోలీసుల వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని దశరథరామిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డి ఆదివారం ఉదయం తన కళ్యాణమండపం ఎదురుగా ఉన్న నిర్మాణ ప్రాంతానికి వెళ్లి ప్రశ్నించడంతో అక్కడే ఉన్న పచ్చ మూకలు ఒక్కసారిగా కత్తులు, రాడ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో దశరథరామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతోపాటు కల్యాణ మండపం మేనేజర్ జాకీర్, అనుచరుడు దేరంగుల ఆంజనేయులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మంది దశరథరామిరెడ్డి అనుచరులు, పార్టీ కార్యకర్తలు పచ్చమూకల దాడిలో గాయపడ్డారు. ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో పడి ఉన్న దశరథరామిరెడ్డి, ఆంజనేయులు, జాకీర్‌ను రక్షించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అనుచరులు తీవ్రంగా యత్నించారు. పచ్చమూకల బరితెగింపుతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కళ్యాణ మండపంలో విధ్వంసం.. వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడడంతోపాటు ఆయన కల్యాణ మండపంలోనూ పచ్చమూకలు విధ్వంసం సృష్టించాయి. మండపం తలుపులను ధ్వంసం చేసి అద్దాలను బద్దలు కొట్టారు. లోపల ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులను పగలగొట్టారు. సమీపంలోనే ఉన్న దశరథరామిరెడ్డి వాహనాన్ని కూడా పగలగొట్టారు. 108 వాహనాన్నీ అడ్డుకున్నారు తీవ్రంగా గాయపడిన దశరథరామిరెడ్డితోపాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు వచి్చన 108 వాహనాన్నీ పచ్చమూకలు అడ్డుకున్నాయి. దీంతో దశరథరామిరెడ్డి భార్య విజయమ్మ కొంతమంది అనుచరులతో ఘటన స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న భర్తను, మరో ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై దశరథరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నుంచి ఎస్ఐ జహీర్‌బాషా వివరాలు సేకరించారు. కోర్టు స్టేటస్ కో ఇచ్చినా ఆదినారాయణ రెడ్డి, అతని భార్య దౌర్జన్యంగా కల్యాణమండపం ఎదురుగా ఉన్న స్థలంలో నిర్మాణాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నించడానికి వెళ్లిన తనపై ఆదినారాయణ రెడ్డి మంత్రి అనుచరులతో దాడి చేయించారని పోలీసులకు రాయించిన వాంగ్మూలంలో తెలిపారు. భూమన పరామర్శ తిరుపతి తుడా: టీడీపీ గూండాల హత్యాయత్నంతో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి పరామర్శించారు. దాడి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని, హత్యాయత్నాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టలేరని భూమని పేర్కొన్నారు. -
అనంతపురంలో జర్నలిస్టుపై దాడి.. తప్పయింది అని కాళ్ళ మీద పడ్డ..
-
ఆలయంలో ఏనుగు బీభత్సం, ఒకరి మృతి
కేరళలోనిఒక దేవాలయంలో ఏనుగు ఉన్నట్టుండి హింసాత్మకంగా మారిపోయింది.అంగమాలిలో ఉన్న కిడంగూర్ మహావిష్ణు ఆలయంలోకి తీసుకొచ్చిన ఏనుగు అకస్మాత్తుగా దాడిచేయడంతో విషాద సంఘటన చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ఏనుగు ఆగ్రహం కొనసాగడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు లోనయ్యారు. శుక్రవారం (మే 1) ఉదయం సుమారు 9:45 గంటల సమయంలో, 'మయ్యానాడ్ పార్థసారథి' అనే ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తిపై దాడిచేసి, వాహనాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించగా, మావటి ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కొల్లాంకు చెందిన లారీ డ్రైవర్ విష్ణు (40)గా గుర్తించారు. కొల్లంనుంచి లారీలో ఈ గజరాజును ఈయనే తరలించినట్టు సమాచారం.https://t.co/U4Fc8bGCAp https://t.co/PSIgJrW4fP— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) May 2, 2026పోలీసుల కథనం ప్రకారం, భక్తులు,స్థానికులలో భయాందోళనలు వ్యాపించడంతో, ఆ ఏనుగు ప్రజలపై దాడి చేసి, ఆలయ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలను ధ్వంసం చేసింది. కార్లను పల్టీ కొట్టించింది. ద్విచక్ర వాహనాలను నుజ్జునుజ్జు చేసింది, అలాగే ఆలయ ప్రాకార కుడ్యాన్ని ధ్వంసం చేసింది. దాదాపు రెండు గంటల తర్వాత, అటవీ అధికారులు పోలీసులు మత్తు మందు (tranquilizers) ఉపయోగించి దానిని అదుపులోకి తీసుకువచ్చారు.ఆలయ కార్యక్రమానికి ముందు స్నానం చేయిస్తున్నప్పుడు కర్రతో కొట్టడం వల్లే ఏనుగు దూకుడుగా ప్రవర్తించిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇదీ చదవండి : Yoga సైనస్‌తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్ -
పిఠాపురం వర్మపై దాడి.. సీఎం చంద్రబాబు రియాక్షన్
-
అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్పై కత్తితో దాడి, షాకింగ్ రీజన్?
సాక్షి, ముంబై: అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన వ్యక్తి అనూహ్యంగా సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పోలీసులు నిందితుడిని మూడు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి చేసిన కారణం ఏంటి అనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 19 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి జైబ్ అన్సారీ (31) అనే వ్యక్తి 2019లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. కారణాలపై స్పష్టత లేనప్పటికీ, ముంబై సమీపంలోని మీరా రోడ్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఒక మతపరమైన శ్లోకాన్ని పఠించడానికి నిరాకరించినందుకు ఇద్దరు గార్డులను కత్తితో పొడిచినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు గార్డులు రాజ్‌కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీరా రోడ్ ఈస్ట్‌లోని నయా నగర్లో గల 'అస్మిత గ్రాండ్ మ్యాన్షన్' కన్స్ట్రక్షన్ సైట్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఒక మతపరమైన శ్లోకాన్ని పఠించమని గార్డులను కోరాడని, వారు నిరాకరించడంతోనే దాడి చేశాడని కొన్ని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. భజరంగ్ దళ్ వంటి సంస్థలు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) థానే విభాగానికి బదిలీ చేశారు. అసలు దాడికి గల కారణంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనతో మీరా రోడ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పుకార్లు వ్యాపించకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని నిందితుడి నేపథ్యాన్ని ATS అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: వినాశకాలే విపరీత బుద్ధి : వీసీ సజ్జనార్ చీవాట్లు -
టోల్ సిబ్బందిపై టీడీపీ గూండాగిరీ.. మహిళ జుట్టు పట్టుకుని..!
-
చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!
గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్‌లో నాలుగేళ్ల కుమార్తె కోసం ప్రాణాలకు తెగించి మరీ ఒక తండ్రి చేసిన పోరాటం ప్రశంసలు దక్కించుకుంటోంది. అసాధారణ ధైర్యం ప్రదర్శించి, ఒట్టి చేతులతో చిరుతతో పెనుగులాడి కుమార్తెను మృత్యు ముఖం నుంచి కాపాడుకున్నాడు. ఈ సంఘటన ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాలోని ఒక చిన్న బుధవారం సాయంత్రం పావి జెట్పూర్ తాలూకాలోని రస్లీ గ్రామంలో జరిగింది. తల్లి దగ్గర్లో పని చేస్తుండగా, ఆ బాలిక ఇంటి పెరట్లో ఆడుకుంటోంది. సాయంత్రం వేళ, మసకబారుతున్న వెలుతురులో, ఒక చిరుత మెల్లగా వచ్చి అకస్మాత్తుగా చిన్నారిపై ఎటాక్ చేసింది. ఇది చూసిన తల్లి భయంతో కేకలు వేసింది. దీంతో ఒక్క ఉదుటన బయటకు పరుగెత్తుకొచ్చిన తండ్రి సురేష్ రత్వా చిరుత నోట కరుచుని తన బిడ్డను లాక్కెళ్లుతుండడాన్ని చూశాడు. భయంతో క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు. కానీ వెంటనే ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. చిరుతపులి వైపు పరుగెత్తి, కేవలం ఒట్టి చేతులతోనే పోరాడాడు. ఎలాంటి ఆయుధం లేదు. భయం అంతకన్నా లేదు. చిరుతపై ఎగబడ్డాడు. బాలికను పట్టుకుని, మరో చేతితో దాని శరీరంపై పదేపదే పిడిగుద్దులు కురిపించాడు. దాని దవడలు విరిచాడు. చివరికి, చిరుత తన పట్టును సడలించి, బాలికను వదిలిపెట్టి, రత్వా ఇంటి వెనుక ఉన్న పొలాల్లోకి పారిపోయింది. అలా అత్యంత సాహసంగా తన నాలుగేళ్ల కుమార్తెను మృత్యుముఖం నుండి రక్షించాడు. బాలిక ముఖం, మెడపై తీవ్ర గాయాలయ్యాయని, అయితే స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్సకు బాగా స్పందిస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై పావి జెట్పూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ జయదీప్ సోలంకి స్పందిస్తూ రత్వా పోరాటాన్ని వివరించారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ తీవ్రమైన పోరాటంలో, చిరుత వెనక్కి తగ్గలేదు. రత్వాను పదేపదే గోళ్లతో రక్కింది. అయినా రత్వా పట్టు వీడలేదు.. మరో చేత్తో తన కుమార్తెను గట్టిగా పట్టుకుని, చిరుత పారపోయిందాకా పోరాడాడు అని తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో గ్రామస్తులు చిరుతలను చూశారు, కానీ మనిషిపై దాడి జరగడం ఇదే మొదటిసారని సోలంకి చెప్పారు.ఆహారం కోసం సమీపంలోని నదీ లోయ నుండి గ్రామంలోకి దారితప్పి వచ్చి ఉండవచ్చన్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత చిరుత మళ్లీ కనిపించిందని స్థానికులు తెలిపారు. దాని జాడ పట్టుకుని, బంధించడానికి గ్రామం చుట్టూ ట్రాప్ కెమెరాలతో పాటు మూడు బోనులను ఏర్పాటు చేశారు.నాన్న అంటే అంతే... నెటిజన్లు ప్రశంసలుతండ్రి అంటే అంతే..ఇలాగే ఉంటాడు. తన కుటుంబం, పిల్లలు కాపాడుకునే విషయంలో క్రూరంగా మారిపోతాడు, ఎదురుగా ఎవరున్నా లెక్కచేయడు అంటూ అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
జనసేన మహిళపై.. పచ్చి బూతులతో TDP నేతల దాడి
-
ఇరాన్ మాజీ యువరాజుపై దాడి..
ఇరాన్ బహిష్కృత యువరాజుపై బెర్లిన్‌లో దాడి జరిగింది. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపురంగు ద్రవాన్ని మీద చల్లారు. అయితే వెంటనే ఆయన రక్షణ సిబ్బంది స్పందించి ఆందోళనకారుడిని ప్రక్కకు తోశారు.రెజా పహ్లావి గురువారం బెర్లిన్‌లో ఒక భవనం నుండి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో పహ్లావి తన భద్రతా సిబ్బందితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుక నుండి వచ్చిన ఒక వ్యక్తి తన బ్యాగ్ నుంచి ఎరుపు రంగు ద్రవాన్ని (ఇది టమోటా జ్యూస్ అని భావిస్తున్నారు) ఆయనపై విసిరాడు. దీంతో ఆ ఎరుపు ద్రవం పహ్లావి తల వెనుక భాగం, మెడ మరియు ఆయన ధరించిన బ్లేజర్‌పై పడింది. అయితే ఈ హఠాత్ పరిణామంతో ఏ మాత్రం సంబంధం లేకుండా చాలా ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే రెజాపహ్లవిపై దాడి చేసిన వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే పహ్లవి విలేకరుల సమావేశం నిర్వహించారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు: ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తుల్ని గూండాలు, ఉగ్రవాదులుగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశాలన్ని ఇరాన్ పాలనపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, కేవలం యధాతథ స్థితిని కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ఖైదీల విడుదల, ఉరిశిక్షల నిలిపివేత విషయంలో ఐరోపా దేశాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.రెజా పహ్లవీ నేపథ్యంకాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ పాలన అంతం కోసం ఆయన పోరాడుతున్నారు. ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక జోక్యాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అయితే ఇరాన్ లోపల ఆయనకు ఎంతవరకు మద్దతు ఉందనేది తెలియాల్సి ఉంది. -
కామారెడ్డిలో ఎలుగుబంటి కలకలం.. రైతుపై దాడి
సాక్షి, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. రెడ్డిపేట స్కూల్ తండాకు చెందిన రైతు సలావత్ మత్తు(45)పై ఎలుగుబంటి దాడి చేసింది. అడవికి కట్టెల కోసం వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. భార్య, స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి ఎలుగుబంటి పారిపోయింది. మత్తు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. మొదట పులి దాడి చేసిందని ప్రచారం జరగ్గా.. ఎలుగుబంటి దాడి చేసినట్లు స్థానిక సర్పంచ్ వెల్లడించారు.రైతును కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అటవీ ప్రాంతానికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.మరో వైపు, జిల్లాలో పులుల దాడులు కూడా కలవరానికి గురి చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం 2 లేగ దూడలు, రెండు మేకలు మృత్యువాత పడ్డాయి. రామారెడ్డి మండలం స్కూల్ తండాలో పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందింది. ఇసన్నపల్లి శివారులో మేకల మందపై చిరుతపులి దాడి చేసి రెండు మేకలను ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. -
విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నం
రాజానగరం: ప్రేమ పేరుతో వెంటబడి విద్యార్థినిని తీవ్ర వేధింపులకు గురి చేసిన యువకుడు.. చివరకు ఆ యువతిని హత్య చేసేందుకు యత్నించిన తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో చోటు చేసుకుంది. రాజానగరం గైట్ కళాశాలలో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై ఓ యువకుడు పెట్రోలక్ష పోశాడు. ఆపై నిప్పంటించేందుకు యత్నించే క్రమంలో తోటి విద్యార్థినులు అడ్డుకుని కేకలు వేయడంతో అక్కడ నుంచి యువకుడు పరార్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ప్రేమను నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు సదరు యువకుడు. ఆ యువకుడ్ని పట్టుకున్న పోలీసులు.. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
ఇళ్ల మధ్యలో బెల్ట్ షాపు.. తీసేయమన్నందుకు ఇనుప రాడ్డుతో TDP నేత దాడి
-
సామ్ ఆల్ట్మాన్ ఇంటిపై దాడి
కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ నివాసంపై జరిగిన దాడి అంతర్జాతీయ టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడి కేవలం ఒక వ్యక్తి చేసిన ఉన్మాద చర్య మాత్రమే కాదని, ఏఐ పరిశ్రమలో ప్రత్యర్థి సంస్థలు ప్రచారం చేస్తున్న భయానక కథనాల ఫలితమేనని ఆల్ట్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన పోటీ కంపెనీ ఆంత్రోపిక్ తీరును ఆయన తప్పుబట్టారు.ఏం జరిగింది?శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆల్ట్మాన్ నివాసమే లక్ష్యంగా ఈ నెల ప్రారంభంలో ఒక దుశ్చర్య జరిగింది. టెక్సాస్‌కు చెందిన డేనియల్ మోరెనో-గామా అనే వ్యక్తి మోలోటోవ్ కాక్టెయిల్ (పెట్రోల్ బాంబు)తో ఆల్ట్మాన్ ఇంటిపై దాడికి దిగాడు. అనంతరం ఓపెన్ఏఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో తేలిన కీలక అంశాలునిందితుడు ఆల్ట్‌మాన్‌కు హాని కలిగించే ఉద్దేశంతోనే టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.నిందితుడి వద్ద ఏఐ విధానానికి వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు ఏఐ పరిశ్రమ దిగ్గజాల పేర్లు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం నిందితుడు హత్యాయత్నంతో పాటు పలు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.పరిశ్రమ విమర్శలే కారణంఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై స్పందించిన సామ్ ఆల్ట్మాన్ ఇది తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని పేర్కొన్నారు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందంటూ కొన్ని సంస్థలు చేస్తున్న అతివాద ప్రచారం సామాన్యులలో అనవసర భయాందోళనలు కలిగిస్తోందని ఆయన వాదించారు. ‘ఏఐ ప్రమాదాల గురించి ప్రత్యర్థి సంస్థలు, ముఖ్యంగా ఆంత్రోపిక్ వంటి ల్యాబ్స్ అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సహేతుకం కాదు. ఇది ప్రజల్లో విద్వేషాన్ని పెంచుతోంది’ అని ఆల్ట్మాన్ విమర్శించారు.ఓపెన్ఏఐ vs ఆంత్రోపిక్ఓపెన్ఏఐ నుంచి విడిపోయి డారియో అమోడి నేతృత్వంలో స్థాపించబడిన ఆంత్రోపిక్ సంస్థకు, ఆల్ట్మాన్ సంస్థకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఓపెన్ఏఐ అనుసరిస్తున్న విధానాలను అమోడి గతంలో ‘సేఫ్టీ థియేటర్’ (ప్రదర్శన కోసం చేసే భద్రత) అని విమర్శించారు. దీనికి ప్రతిగా ఆంత్రోపిక్ తన వ్యాపార ప్రయోజనాల కోసం భయాన్ని పెట్టుబడిగా పెడుతోందని ఆల్ట్మాన్ ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం
-
‘ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ
పహల్గామ్: సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఒకపక్క ఆత్మీయులను కోల్పోయిన ఆవేదన, మరోపక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరక పోవడం వారిని మరింత కుంగదీస్తున్నాయి.ఆఖరి శ్వాస వరకు వెంటాడే పీడకలపహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కౌస్తుభ్ గన్బోటే భార్య సంగీత మాట్లాడుతూ.. ఆ భయానక ఘటనను తన ఆఖరి శ్వాస వరకు మర్చిపోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులను చంపడం ద్వారా ఉగ్రవాదులు సాధించేదేమీ లేదని, ప్రభుత్వంతో పోరాటం ఉంటే నేరుగా వారితోనే తేల్చుకోవాలని ఆమె హితవు పలికారు. మరో బాధితురాలు ప్రియదర్శిని ఆచార్య (ప్రశాంత కుమార్ శత్పథి భార్య) తన భర్త లేని లోటును ప్రతీ రోజు తలచుకుంటున్నానని, ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి, ప్రస్తుతం తాత్కాలిక ఉద్యోగంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక సాయం అందినప్పటికీ, ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ఇంకా రాలేదని, ఆ మాట నిలబెట్టుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.‘ఆపరేషన్ సిందూర్’ పేరిట..ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు బాధితుల మతం అడిగి మరీ దారుణ మారణకాండకు ఒడిగట్టారు. ఈ మారణహోమానికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు మే 7, 2025న ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ గడ్డపైకి చొచ్చుకెళ్లాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది భారీ ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్ర నష్టం వాటిల్లడంతో దిగివచ్చిన పాక్ ఆర్మీ.. భారత డీజీఎంఓను ఆశ్రయించి మే 10న కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుంది.భయాలు వీడి.. మళ్లీ పర్యాటకుల రాకకశ్మీర్ లోయలో ఇప్పుడు అనూహ్య మార్పు కనిపిస్తోంది. పహల్గామ్తో పాటు ఇతర ప్రాంతాలకు పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. ఇది సందర్శకుల్లో తిరిగి చిగురించిన భద్రతా భావానికి అద్దం పడుతోంది. శ్రీనగర్‌ను సందర్శించిన విశాల్ అనే పర్యాటకుడు మాట్లాడుతూ.. గతంలో జరిగిన దురదృష్టకర ఘటనల ఆధారంగా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయలేమని, కశ్మీర్ ఇప్పుడు అత్యంత సురక్షితమైన ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: 51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ముస్తాబు -
పహల్గామ్ దాడికి ఏడాది: కశ్మీర్లో హై టెన్షన్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రేపటితో (ఏప్రిల్ 22) సరిగ్గా ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో భారత సైన్యం అత్యంత ఆసక్తికర సందేశాన్ని పంచుకుంది. ‘మానవత్వపు హద్దులు దాటినప్పుడు, మా స్పందన నిర్ణయాత్మకంగా ఉంటుంది. న్యాయం జరిగింది. భారతదేశం ఐక్యంగా నిలబడుతుంది’ అని ‘ఎక్స్’ వేదికగా ఆర్మీ చేసిన తాజా పోస్ట్ వైరల్‌గా మారింది. ఉగ్ర మూకలకు స్పష్టమైన హెచ్చరికలు పంపుతూనే, దేశ భద్రత పట్ల ఆర్మీ తన ఉక్కు సంకల్పాన్ని మరోసారి చాటిచెప్పింది.ఆ నెత్తుటి జ్ఞాపకం..2025 ఏప్రిల్ 22న అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని ‘మినీ స్విట్జర్లాండ్’గా ప్రసిద్ధి చెందిన బైసరన్ వద్ద ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దారుణ మారణకాండలో 25 మంది పర్యాటకులతో పాటు ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ముందస్తు జాగ్రత్తగా జమ్మూకశ్మీర్‌లోని 44 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఆ తర్వాత చాలా ప్రాంతాలు తెరుచుకున్నప్పటికీ, బైసరన్‌తో పాటు మరో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన చందన్వాడి ఇప్పటికీ మూసివేసే ఉన్నాయి. వీటిని ఎప్పుడు తెరుస్తారనే దానిపై స్పష్టత లేదు. When boundaries of humanity are crossed, the response is decisive. Justice is Served.India Stands United.#SindoorAnniversary #JusticeEndures #NationFirst pic.twitter.com/rtgYu9Hg11— ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2026కశ్మీర్ లోయలో కట్టుదిట్టమైన భద్రతఉగ్రదాడి ప్రథమ వార్షికోత్సవం సమీపించడంతో కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి. సాధారణ ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు కలగకుండానే, వ్యూహాత్మకంగా ముందస్తు జాగ్రత్త చర్యలను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్ వ్యాప్తంగా ప్రస్తుతం డేగకన్నుతో నిఘా కొనసాగుతోంది.రంగంలోకి ఉన్నతాధికారులువివిధ జిల్లాల్లో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పుల్వామాలో డీఐజీ జావేద్ ఇక్బాల్ మట్టూ నేతృత్వంలో నేరాలు, భద్రతపై కీలక సమీక్ష జరిగింది. ఉగ్రవాద కట్టడి చర్యలు, ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా అవంతిపొరా, శ్రీనగర్‌లలో ఎస్ఎస్పీ జి.వి సందీప్ చక్రవర్తి శాంతిభద్రతలను సమీక్షించారు. ముఖ్యంగా దర్యాప్తులను వేగవంతం చేసి, నేరస్తులకు శిక్ష పడే శాతాన్ని పెంచడంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు.ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంతో అదిరిపోయే డీల్.. భారత్‌కు బహుళ ప్రయోజనం! -
సందిగ్ధంలో చర్చలు!
టెహ్రాన్/వాషింగ్టన్/ఇస్లామాబాద్/దుబాయ్: తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటనతో పశ్చిమాసియాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇరాన్–అమెరికా యుద్ధంలో రెండో దశ శాంతి చర్చలు ముందుకుసాగడం ప్రశ్నార్థకంగా మారింది. తమ అ«దీనంలో ఉన్న హార్మూజ్ జలసంధిని అమెరికా హఠాత్తుగా దిగ్బంధించడంతో ఇప్పటికే గుర్రుమీదున్న ఇరాన్ ఆదివారం తమ వాణిజ్య నౌకపై అగ్రరాజ్య నావికాదళం దాడిచేసి స్వాధీనం చేసుకోవడంతో పట్టరాని ఆవేశంతో ఊగిపోతోంది. దీంతో అమెరికాతో రెండో దఫా చర్చలకు కూర్చునేదేలేదని తెగేసి చెప్పింది. ‘‘రెండువారాల కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘించింది. హార్మూజ్‌ను దిగ్బంధించింది. మా ‘తౌస్కా’ కార్గో నౌకపై దాడి చేసి స్వా«దీనంచేసుకుంది. అందుకే మా బృందాన్ని ఇస్లామాబాద్‌కు పంపట్లేదు. శుద్ధిచేసిన యురేనియంను అప్పగించడంపై ఏనాడూ అమెరికాతో చర్చించలేదు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ సోమవారం స్పష్టంచేశారు. దీంతో ఇప్పటికే రెండో దశ చర్చలకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన పాకిస్తాన్ వెనువెంటనే రంగంలోకి దిగింది. అటు ఇరాన్‌ను బ్రతిమాలుతూనే హార్మూజ్ దిగ్బంధం, నౌకపై దాడి అంశాల్లో పట్టువిడుపులు ఉండాలని అమెరికాకు హితబోధ చేస్తోంది. చర్చల కోసం ఈజిప్ట్ సైతం ఇరాన్‌ను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నంచేస్తోంది. దీంతో చర్చలకు యత్నాలు ఏమేరకు ఫలిస్తాయో, అవి నేటి చర్చల్లో ఏ స్థాయిలో ప్రతిఫలిస్తాయో చూడాల్సిందే. హెచ్చరిక, దాడి, స్వా«దీనం.. హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడంతోపాటు తమ నౌకాశ్రయాల మీదుగా ఏ ఒక్క నౌక బయల్దేరకుండా అడ్డుకుంటూ అమెరికా చేస్తున్న చేష్టలతో ఇరాన్‌కు చిర్రెత్తుకొస్తోంది. దీనికి తోడు ఆదివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో హార్మూజ్ దిశగా వస్తున్న 900 అడుగుల పొడవైన భారీ ఇరాన్ వాణిజ్య నౌక ‘తౌస్కా’ను అమెరికా ఆదివారం స్వా«దీనంచేసుకుంది. ఇరాన్‌లోని బందాస్ అబ్బాస్పోర్ట్కు వెళ్లేందుకు దుస్సాహసం చేయకుండా తక్షణం ఉన్నచోటే ఆగిపోవాలని తొలుత అమెరికా నావికాదళాలు హెచ్చరించాయి. దాదాపు ఆరుగంటలపాటు ఈ హెచ్చరికలు చేశారు. అయినా సరే తౌస్కా అలాగే ప్రయాణాన్ని కొనసాగించడంతో అమెరికా గైడెడ్ మిస్సైల్ విధ్వంసక నౌక ‘యూఎస్ఎస్ స్పుయెన్స్’ దాడిచేసింది. తౌస్కాలోని ఇంజిన్ రూమ్‌పైకి కాల్పులు జరిపింది. తర్వాత యూఎస్ఎస్ ట్రిపోలీ నౌక, హెలికాప్టర్లలో అమెరికా నావికాదళాలు ‘తౌస్కా’ను సమీపించి స్వాదీనం చేసుకున్నాయి. తమ నౌకను అమెరికా స్వాదీనం చేసుకుందన్న వార్త తెల్సి ఇరాన్ ప్రతిదాడికి దిగింది. ఒమన్ సముద్రంలో ఉన్న అమెరికా నౌకలపైకి డ్రోన్ల దండును పంపి దాడిచేసింది. గడువు పొడిగించబోను: ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ గడువును పొడిగించబోనని సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్ ప్రతినిధి బృందం ఇంకా పాకిస్తాన్‌కు రాని నేపథ్యంలో రెండో దఫా చర్చలపై సందిగ్ధం నెలకొన్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. ‘‘ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రంతో తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగుస్తుంది. ఆలోపు ఇరాన్ మాతో శాంతిచర్చలు పూర్తిచేసి ఒప్పందం కుదుర్చుకోవాలి. గడువును పొడిగించడం అనేది దాదాపు అసాధ్యం. ఒప్పందం కుదరకపోతే దాడులు తథ్యం’’ అని ట్రంప్ అన్నారు. దీనిపై ఇరాన్ స్పందించింది. ‘‘అసంబద్ధ, అతి డిమాండ్లతో అమెరికా చర్చల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేసింది. అలాంటి అమెరికాతో మరోసారి చర్చలకు సిద్ధపడబోం. అమెరికా దౌత్యమోసానికి మేం బలికాబోం’’ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. గడువు పొడిగించబోనని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే పెజెష్కియాన్ మాట్లాడటం గమనార్హం. చర్చల కోసం అమెరికా బృందం మంగళవారం పాకిస్తాన్‌కు బయల్దేరే ఆస్కారముంది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించలేదు. ఇరాన్, పాక్ మంతనాలు చర్చలకు ప్రతినిధి బృందాలను పంపాలని ఇరాన్‌ను పాక్ కోరింది. ఈ మేరకు సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడారు. చర్చల పర్వం మరింత మందుకు సాగాల్సిన ఆవశ్యకతను అరాఘ్చీకి ఇషాక్ వివరించారు. -
భారత నౌకలపై ఇరాన్ దాడి.. ఆడియో టేప్ వైరల్
నిన్న (శనివారం) హర్ముజ్ జలసంధి దాటుతున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నావికా దళం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి సమయంలో ఆ నౌకకు సంబంధించిన ఆడియో టేప్ బయిటకు వచ్చింది. అందులో నౌక కెప్టెన్ ఇచ్చిన ఎమర్జెన్సీ సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్ హర్ముజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు రవాణా సరఫరా స్తంభించిపోయింది. అయితే భారత్‌తో పాటు ఇతర మిత్ర దేశాలకు చెందిన కొన్ని నౌకలకు మాత్రం జలసంధి గుండా ప్రయాణానికి ఇరాన్ అనుమతించింది. అయితే నిన్న భారత్‌కు చెందిన వాణిజ్య నౌకపైన ఇరాన్ నావిక దళ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మేస్జ్ ఆడియో టేప్ ఇప్పుడు వైరల్‌గా మారింది.ఆ ఆడియోలో " సెపా నేవీ. సెపా నేవీ. ఇది సన్మార్ హెరాల్డ్ మోటార్ ట్యాంకర్. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి" అని ఆ నౌకలోని వ్యక్తి అంటున్నట్లు సందేశం ఉంది. మరోవైపు భారత్ సైతం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్ రాయబారిని పిలిపింది ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ ఇది వరకూ భారత్‌కు చెందిన నౌకలకు హర్ముజ్ గుండా వెళ్లడానికి అనుమతులిచ్చిందని ప్రస్తుతం సైతం ఆ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం యుద్ధంపై మరోసారి ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్ చర్చలు పురోగమిస్తున్నాయనే తరుణంలో ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఒకరోజు తిరగకుండానే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే రెండోదఫా చర్చలలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది.ఏం జరిగింది?శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. ఈ కాల్పుల ఘటన ఒమాన్‌కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్ నుంచి స్పష్టత కోరుతున్నాయి.కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.#BREAKING Audio clip emerges from attacked Indian oil tanker!"You gave me clearance to go. My name is second on your list. You are firing now. Let me turn back!" — Audio from the Indian oil tanker fired on by the Iranian NavyClearance given. Ship fired on anyway https://t.co/FDAxliPc7Q pic.twitter.com/KH0Y4eYGCh— Nabila Jamal (@nabilajamal_) April 18, 2026 -
వేటకొడవలితో వీరంగం.. బావపైకి కత్తి ఎత్తిన మరదలు..
-
లష్కరే టాప్ కమాండర్‌పై దాడి.. పరిస్థితి విషమం
లాహార్: పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో కలకలం చెలచేరింది. కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన అమీర్ హంజాపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కార్యాలయం వెలుపల ఈ అనూహ్య దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన హంజా ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.తాజా సమాచారం ప్రకారం లాహోర్‌లోని ఒక న్యూస్ ఛానెల్ ఆఫీస్ ముందు అమీర్ హంజా ఉన్న సమయంలో ముసుగు ధరించిన దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఆకస్మిక కాల్పుల దాడిలో బుల్లెట్లు తగలడంతో హంజా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అతడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. కరుడుగట్టిన ఉగ్రవాది హాఫిజ్ సయీద్‌తో కలిసి లష్కరే తోయిబాను స్థాపించిన హంజా.. భారతదేశంలో జరిగిన పలు ఉగ్ర దాడుల్లో కీలక సూత్రధారి.అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిఅమీర్ హంజా.. తన విద్వేషపూరిత ప్రసంగాలు, రచనలతో ఎంతోమంది యువతను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. లష్కరే అధికారిక పత్రిక ‘మజల్లా అల్-దావా’కు ఫౌండింగ్ ఎడిటర్‌గా పనిచేయడమే కాకుండా 2002లో ‘కాఫిలా దావత్ ఔర్ షహాదత్’ వంటి తీవ్రవాద పుస్తకాలను రచించాడు. అతడి ప్రమాదకర కార్యకలాపాలను గుర్తించిన అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్.. లష్కరేను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు, హంజాను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా పేర్కొంది. లష్కరే సెంట్రల్ కమిటీలో ఉంటూ ఉగ్రవాదుల నిధుల సమీకరణ, రిక్రూట్మెంట్లో ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఇది కూడా చదవండి: New York: కుబేరులకు మేయర్ మమ్దానీ షాక్ -
గ్రామం వదిలివెళ్లండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో సుమారు 8 దశాబ్దాల క్రితం వెలిసిన చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు మరోసారి జరిగాయి. చివరి సారిగా 2024 ఏప్రిల్‌లో కోర్టు, పోలీస్ సిబ్బందితో గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీనిపై ‘సాక్షి’లో అదే నెల ఐదో తేదీన ‘ఈ ఊరు మాది.. ఖాళీ చేయండి!’ శీర్షికన ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆ ప్రయత్నాలు నిలిచిపోగా.. తాజాగా బుధవారం పునరావృతమైంది. కోర్టులో అనుకూల తీర్పు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన బంధువులు కోర్టు ఉత్తర్వులు, కోర్టు సిబ్బందితో కలిసి జేసీబీతో గ్రామానికి వచ్చారు. ఇళ్లను కూలగొట్టేందుకు యత్నించడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోగా.. పలువురు దాడికి దిగారు. దీంతో వారి బంధువులు ఐదుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి ఆలస్యంగా వచ్చిన పోలీసులు గ్రామస్తులను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్లు చేసేదేమీ లేక వెనుదిరిగారు. గాయపడిన మైబూ, ఖాజా, షేక్ ఘనీ, మహ్మద్ రఫీ, షేక్ బషీర్ గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ తాతముత్తాతల నుంచీ ఇక్కడే జీవిస్తున్నామని, ఇప్పుడు ఇళ్లను విడిచి వెళ్లాలంటే ఎక్కడికి పోవాలి.. ఎట్లా బతకాలని స్థానికుడు ఆంజనేయులు, ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజా ప్రతినిధులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామంలో 200 కుటుంబాల వరకు ఉంటున్నాయి. ఇదీ నేపథ్యం.. చమన్దొడ్డిలో సర్వే నంబర్ 129లో 11.02 ఎకరాల భూమి తమదేనని ఖాసిం సాబ్, మదర్సాబ్, నబి సాబ్ అనే ముగ్గురు వ్యక్తులు 2009లో గద్వాల సీనియర్ సివిల్ కోర్టులో దావా వేశారు. 2010 ఫిబ్రవరి 5న వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై 2012లో గ్రామస్తులు 52 మంది హైకోర్టులో సవాల్ చేశారు. 2020లో గ్రామస్తుల పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత 2021 డిసెంబర్లో సదరు భూమిని ఖాళీ చేయించి.. వారికి అప్పగించాలని గట్టు మండల పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ 2024 మార్చిలోనూ ఆదేశాలిచ్చింది. ఈ రెండు పర్యాయాలు ఖాళీ చేయించేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇప్పుడు తాజాగా కోర్టు సిబ్బందితో కలిసి పిటిషనర్ల బంధువులు జేసీబీతో గ్రామానికి చేరుకోగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
ఇరాన్ ప్రతినిధుల బృందంపై క్షిపణి దాడి ప్లాన్?
ఇటీవల ఇస్లామాబాద్‌లో ఇరాన్-పాక్ మధ్య శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెలెవల్ డెలిగేషన్ మీటింగ్ అత్యంత పటిష్టమైన భద్రత మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మరాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరిగి వెళ్లే సమయంలో తమ విమానంపై అటాక్ జరుగుతోందని తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.అమెరికా- ఇరాన్ మధ్య రేపు( గురువారం) రెండో సారి శాంతి చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్‌లో మెుదటగా జరిగిన చర్చలలో ఎటువంటి సానూకూల ఫలితాలు రాకపోవడంతో మరో దఫా చర్చలకు రెండే దేశాలు సమాయాత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ మారాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ముగించి తిరుగు ప్రయాణంలో వారి విమానానికి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.ప్రొఫెసర్ మారాండీ మాట్లాడుతూ " పాక్‌లో చర్చలు ముగించుకొని వెళుతున్న సమయంలో ఫ్లైట్‌లో అబ్బాస్ అరాఘ్చీ, స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్‌తో ఇతర కీలక నేతలు ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా మా విమానం క్షిపణి దాడికి గురువుతుందని బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ప్రత్యామ్నయ మార్గం ద్వారా తరలించాం. వాస్తవానికి టెహ్రాన్‌లో దిగాల్సి ఉండగా అత్యవసరంగా ఇరాన్ నగరం మషద్ నగరంలో ఫ్లైట్ ల్యాండ్ చేసి కార్లు, ట్రైన్ల ద్వారా టెహ్రాన్ నగరం చేరుకున్నాం".అని అన్నారు.అమెరికా జిత్తులమారని తమకు తెలుసని అందుకే ఆ దేశాన్ని ఎప్పుడు నమ్మదలుచుకోలేదని ప్రొఫెసర్ అన్నారు. మాతో చర్చలు జరుపుతూనే మరోవైపు తమ మిలటరీ బేస్‌లను మరింత బలపరుచుకుంటుందన్నారు. అయితే చర్చల సమయంలో పాకిస్థాన్ ఇరాన్‌కు అత్యంత పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఆదేశానికి చెందిన అత్యాధునికి విమానాలు ఇరాన్ ప్రతినిధుల బృందం ఉన్న విమానానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. -
మహిళను 6 సార్లు కత్తితో పొడిచిన రాక్షసుడు..
-
నెల్లూరు జిల్లాలో టీడీపీ గూండాల బీభత్సం
సాక్షి, నెల్లూరు జిల్లా: పాతకక్షలను మనస్సులో పెట్టుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ కార్యకర్తపై దాడి చేసిన ఘటన జలదంకి మండలం తిమ్మసముద్రంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు వెంకటేశ్వర్లు కథనం మేరకు.. గ్రామానికి చెందిన వ్యవసాయ భూమి విషయమై కోర్టులో వివాదం జరగడంతో బాధితుడికి స్టేటస్ కో ఇచ్చారు. ఈ విషయమై టీడీపీకి చెందిన పలువురు గతంలో దాడి చేశారు.అప్పట్లో ఇరువర్గాలు కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తన నిమ్మ తోటలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన కంచర్ల వినోద్, కంచర్ల వేణుగోపాల్, మేకల శ్రీనాథ్, కాసు మహేష్, మరికొందరు మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పక్క పొలాల వారు వారి బంధువులు, 108కు సమాచారమివ్వడంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. జలదంకి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పార్టీ రైతు సంఘ జిల్లా నేత రావి ప్రసాద్‌నాయుడు, జలదంకి మండల కన్వీనర్ ఇస్కా మదన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. -
అన్నంత పని చేసిన ట్రంప్.. మళ్లీ యుద్ధ మేఘాలు
టెహ్రాన్: పశ్చిమాసియాలో క్షిపణుల వర్షం కురుస్తోంది. హర్మూజ్ జలసంధి తెరిచే అంశంలో ట్రంప్ డెడ్‌లైన్ విధించడంతో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే ఆ గడువుకు ముందే ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తన ఆదేశాల్ని బేకాతరు చేయడంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం దాడులు జరిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, అమెరికా సైన్యం ఖర్గ్ ఐల్యాండ్‌తో పాటు కీలక రైల్వే బ్రిడ్జీని ధ్వంసం చేసింది. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ట్రంప్ ముందే హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్లో భారీ ఎత్తున ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఏర్పాటు చేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు యువతను విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. క్రీడాశాఖ కూడా క్రీడాకారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా ఐక్యంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. అమెరికా దాడులు ప్రారంభించడంతో ఇరాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇకపై ఏమి జరగనుందో అన్న ఆందోళన, టెన్షన్ దేశవ్యాప్తంగా నెలకొంది. -
Iran: 30కి పైగా యూనివర్సిటీలు ధ్వంసం
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న వైమానిక దాడుల్లో ఏకంగా 30కి పైగా విశ్వవిద్యాలయాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ సైన్స్ మంత్రి హొస్సేన్ సిమై సర్రాఫ్ స్వయంగా వెల్లడించారు. విద్యా, వైద్య కేంద్రాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.తాజాగా ఉత్తర టెహ్రాన్‌లోని ‘షాహిద్ బెహెష్తీ యూనివర్సిటీ’తో పాటు పశ్చిమాన ఉన్న ‘మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం’పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో క్యాంపస్ భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. 1960లో స్థాపించిన ఈ వర్సిటీ వేలాది మంది విద్యార్థులకు, పరిశోధకులకు ఓ కీలక కేంద్రం. దాడితో దెబ్బతిన్న ప్రాంతాన్ని శనివారం మంత్రి సర్రాఫ్ పరిశీలించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30కి పైగా వర్సిటీలపై దాడులు జరిగాయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు, ఆస్పత్రులు, పౌర ఆరోగ్య కేంద్రాలపై జరుగుతున్న దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘన చరిత్ర కలిగిన బయోమెడికల్ కేంద్రం ‘పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇరాన్’పై కూడా దాడులు జరిగాయని, భవనాలు భారీగా దెబ్బతినడంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని హూ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. దాడి జరిగినప్పటికీ పాశ్చర్ ఇన్స్టిట్యూట్లో అత్యవసర సేవలు, వ్యాక్సిన్ల ఉత్పత్తి నిరంతరాయంగానే కొనసాగుతున్నాయని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఇరాన్ ఆరోగ్య శాఖ, ఐఎస్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపాయి.ఈ యుద్ధ ప్రభావం కేవలం ఇరాన్‌కే పరిమితం కాలేదు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా దేశాల్లోనూ ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలాయని, వాటికి తక్షణ సాయం అందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఈ భీకర పోరు కారణంగా ఆయా దేశాల్లో ఇప్పటికే 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 30 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వలసబాట పట్టారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న ఈ దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: మ్యాగీ ప్రియులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు! -
ఇక అమెరికా పనైపోయింది.. పైలట్ దొరికితే పరువు పోయినట్లే.. ఈ యుద్ధం ఆగదు..
-
కువైట్‌లో ఉద్రిక్తత: ఆయిల్ కాంప్లెక్స్‌పై భీకర డ్రోన్ దాడి
కువైట్ సిటీ: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. కువైట్‌లోని అత్యంత కీలకమైన చమురు కేంద్రంపై ఆదివారం తెల్లవారుజామున అనూహ్య డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడితో షువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.వివరాల్లోకి వెళితే..కువైట్ చమురు మంత్రిత్వ శాఖతో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కేపీఎస్) ప్రధాన కార్యాలయాలున్న షువైక్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు కువైట్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇంధన మౌలిక సదుపాయాలకు మరింత నష్టం వాటిల్లకుండా అడ్డుకున్నారు. శత్రువుల నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గాలిలోనే దీటుగా అడ్డుకుంటున్నాయని కువైట్ మిలిటరీ ప్రకటించింది. ఈ దాడులను విజయవంతంగా ఛేదిస్తున్న క్రమంలోనే నగరమంతటా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని సైన్యం ‘ఎక్స్’వేదికగా వెల్లడించింది.ప్రభుత్వ భవనంపై ఇరాన్ దాడిశనివారం సాయంత్రం కూడా కువైట్ సిటీలోని ఒక ప్రభుత్వ భవనంపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఫలితంగా భవనానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలోనూ ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. ఈ వరుస దాడుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దాడికి గురైన కాంప్లెక్స్ పరిధిలోని పలు మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఆదివారం ఇంటి నుంచే (రిమోట్ వర్క్) పనిచేయాలని ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా భవనాల్లోకి సందర్శకులకు అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది. గత నెల ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడులకు ప్రతీకారంగానే.. ఇరాన్ ఇప్పుడు కువైట్ సహా పలు గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. BREAKING: Kuwait’s Ministry of Oil building has been hit in an Iranian attack.Large fire reported at the ministry complex in Shuwaikh. The ministry runs Kuwait’s entire oil sector. Iran is now hitting the buildings that set Gulf oil policy, not just the facilities that produce… pic.twitter.com/OYtFUHb88Y— The Hormuz Letter (@HormuzLetter) April 4, 2026 -
కుప్పంలో దళిత కుటుంబంపై దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతుండడంతో దళితులనే టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డప్పు కొడుతున్న ఓ దళితున్ని కొట్టిన ఘటన మరువక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దళిత కుటుంబంపై టీడీపీ మూకలు దాడి చేసిన దారుణ ఘటన బయటపడింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయ ఉత్సవాల్లో గత శుక్రవారం ఐదుగురు చిన్న పిల్లలు గొడవపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార టీడీపీ వర్గీయులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన దళితుడు మంజునాథ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. భార్య అమృత, పిల్లలపై విచక్షణ లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కులం పేరుతో దూషించి, ఊరు వదలి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంజునాథ్ భార్య అమృత టీడీపీ నేతల దాడిపై రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ ఇంటిపై దాడి చేసి కొట్టి, కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, దళిత సంఘాలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ నాయకురాలిపై హత్యాయత్నం
పుత్తూరు: తిరుపతి జిల్లా గేట్ పుత్తూరులో కొందరు దుండగులు వైఎస్సార్సీపీ మహిళ నాయకురాలి కుటుంబంపై శుక్రవారం రాత్రి రెండు దఫాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి లో పుత్తూరుకు చెందిన వైఎస్సార్సీపీ అంగన్వాడీ మహిళా అధ్యక్షురాలు ఎం.వాణి(40), ఆమె తమ్ముడు శ్రీకాంత్(26), మేనమామ చొక్కలింగం(56), చెల్లెళ్లు సుమతి(36) లోకేశ్వరి(28) పవిత్ర(28) తీవ్రంగా గాయపడ్డారు. వాణి తలకు రక్తగాయం కావడంతో 6 కుట్లు, చొక్కలింగానికి 11 కుట్లు పడ్డాయి. మిగిలిన వారికి రక్తగాయాలయ్యాయి. పథకం ప్రకారం జరిగిన ఈ హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఓ దశలో రాజీ చేసుకోవాలంటూ హుకుం జారీచేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా శనివారం పుత్తూరు పోలీస్ స్టేషన్‌కు నేరుగా వచ్చి మహిళలపై జరిగిన హత్యాయత్నం కేసుపై సీఐ శేఖర్‌రెడ్డితో మాట్లాడారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని.. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తొరూరు రోడ్డులో మోటర్ సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న శ్రీకాంత్ అనే యువకుడిని ఆనంబట్టు రోడ్డుకు చెందిన శీన, మదన్, నోమేష్, మురళి అడ్డుకుని తీవ్రంగా గాయపరిచారు. తనపై జరిగిన దాడి విషయాన్ని శ్రీకాంత్.. తన మేనమామ చొక్క లింగం, అక్కలకు చెప్పి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారు తమపై మళ్లీ కూడా దాడి చేస్తారని వారు పోలీసులను ప్రాధేయపడ్డారు. అయినా కూడా భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో మరోమారు వారిపై దాడికి తెగబడ్డారు. వాణి ఇంటి ముందు ఉన్న వీధి లైట్లు ఆఫ్ చేసి ఇంట్లో ఉన్న శ్రీకాంత్, చొక్కలింగం, వాణి, సుమతి, లోకేశ్వరి, పవిత్రపై ఇనుప రాడ్లతో మరోమారు దాడి చేశారు. తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? ఎవరు అండగా వస్తారో చూస్తామంటూ బెదిరించారు. గాయపడిన వాణి కుటుంబ సభ్యులను చుట్టుపక్కల వారు 108 ద్వారా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి రోజా మండిపాటు ‘‘మహిళలనే కనీస మానవత్వం లేకుండా ఇనుప రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడితే కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. మీ నిర్లక్ష్యం కారణంగానే రెండో దఫా దాడి జరిగింది. తమ సోదరుడు శ్రీకాంత్‌పై నలుగురు దాడి చేశారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ నలుగురు మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసం ? ఇంత జరిగినా కేసు నమోదు చేయకపోతే ఏమనుకోవాలి? జరిగిన దారుణం కంటి ముందు కనిపిస్తోంది’’ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా సీఐ శేఖర్‌రెడ్డిని నిలదీశారు. -
ట్రంప్ అల్టిమేటం.. ఆయుధాలు సిద్దం చేస్తున్న ఇజ్రాయెల్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు భారీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్మూజ్‌ను తెరవకపోతే కనీవినీ ఎరుగని విధ్వంసం చూస్తారని ఇరాన్‌ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ట్రంప్ 48 గంటల అల్టిమేటం తర్వాత ఇరాన్‌కు చెందిన ఇంధన మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద భారీ దాడులు చేయడానికి ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ దాడుల కోసం అమెరికా నుండి 'గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌కు ఇదివరకే అల్టిమేటం జారీ చేశారు. "ఇరాన్‌కు ఒక ఒప్పందానికి రావడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి నేను 10 రోజుల సమయం ఇచ్చాను. ఆ సమయం ముగిసిపోతోంది. మరో 48 గంటల్లో ఇరాన్ మీద 'నరకం' కురుస్తుంది " అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆయుధాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లను ఇరాన్ కూల్చివేసింది. అలాగే రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఇటు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ఇటు ఇరాన్ సైతం అమెరికా షరతులు అంగీకారంగా లేవు అని చర్చలను దాటవేసింది. -
చావుదెబ్బ కొట్టిన ఇరాన్.. రగిలిపోతున్న ట్రంప్!
-
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్
-
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. క్యాంప్ ఆఫీస్‌లో కిటికీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనకి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా బయలుదేరిన డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఫోటో పెట్టారు.కాంగ్రెస్ నాయకులే క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము క్యాంప్ ఆఫీస్‌లో సీఎం ఫోటో పెట్టాము.. కానీ దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు.ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందంటూ హరీష్‌రావు మండిపడ్డారు.‘‘ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా?. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియాపై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు?’’ అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పిఠాపురంలో రెచ్చిపోయిన జనసేన నేతలు.. దళిత మహిళపై దాడి
-
పిఠాపురంలో రెచ్చిపోయిన జనసేన నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు రెచ్చిపోయారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపై దాష్టీకం ప్రదర్శించారు. సెటిల్మెంట్ వివాదంలో మహిళపై జనసేన నేతలు దాడి చేశారు. రాజమండ్రికి చెందిన ఆ మహిళను జనసేన నేత బారతాల గోవింద్ నేల మీదకు నెట్టేశారు.తన భర్త ఆర్థి లావాదేవిల సెటిల్మెంట్ కోసం సోదరుడితో కలిసి తాటిపర్తిలో సుబ్రమణ్యం అనే వ్యక్తి ఇంటికి ఆ మహిళ వచ్చింది. తన తరపున సెటిల్మెంట్ కోసం జనసేన నేతలు కుంపట్ల సత్యనారాయణ, గోవింద్, వీరబాబులను సుబ్రహ్మణ్యం పిలిపించుకున్నారు. తన సోదరుడు సతీష్‌పై సుబ్రహ్మణ్యం దాడికి పాల్పడటంతో సెల్లో ఆమె వీడియో తీసే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జనసేన నాయకులు.. సెల్ ఫోన్ లాక్కుని దాడి చేశారు. గొల్లప్రోలు పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. -
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
-
దళితుడిపై అయ్యన్న దాడి
సాక్షి, అనకాపల్లి/మునగపాక: డప్పు కొడుతున్న దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నాలుగు రోజుల క్రితం జరిగిన మరిడిమాంబ అమ్మవారి జాతరలో 60 ఏళ్లు పైబడి ఉన్న దళిత డప్పు కళాకారుడుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నర్సీపట్నానికి చెందిన దళిత డప్పు కళాకారుడు నాగులపల్లి రామదాసు తోటి కళాకారులతో కలిసి పండగలో డప్పు కొడుతుండగా..ఒక్కసారిగా అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోయారు. వృద్ధుడు అని కూడా చూడకుండా రామదాసుపై చేయి చేసుకున్నారు. చెంప చెళ్లుమనిపించడమే కాకుండా పరుష పదజాలంతో తీవ్రంగా దూషించారు. ఆ సమయంలో సీఐ గఫూర్‌తో పాటు ఎస్ఐలు అక్కడే ఉన్నా ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ఇదిలా ఉండగా తన కాలు తొక్కినందుకే అయ్యన్న కొట్టాడని బాధితుడితో బలవంతంగా చెప్పించడం కొసమెరుపు.స్పీకర్ అయ్యన్నను అరెస్టు చేయాలి: కేవీపీఎస్ డిమాండ్సాక్షి, అమరావతి: దళిత డప్పు కళాకారుడిపై దాడి చేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) అధ్యక్షుడు ఓ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడితల్లి పండగలో డప్పు కొడుతుండగా దళితుడైన నాగులాపల్లి రామదాసును పోలీసుల సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు చెంపదెబ్బ కొట్టడం దారుణమన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ స్థాయి వ్యక్తి విచక్షణ కోల్పోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ చర్యకు పాల్పడిన స్పీకర్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. విధి నిర్వహణలో ఉండి కూడా నివారించని పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నల్లప్ప, మాల్యాద్రి డిమాండ్ చేశారు. అయ్యన్న క్షమాపణ చెప్పాలి నర్సీపట్నంలో జరిగిన మరిడిమాంబ జాతరలో దళిత వృద్ధ డప్పు కళాకారుడిని అయ్యన్న చెంప దెబ్బ కొట్టారు. తక్షణమే ఆ దళిత డప్పు కళాకారుడికి అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి. కూటమి పార్టీల నాయకులకు దళితులంటే చిన్నచూపు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. – డాక్టర్ బూసి వెంకటరావు, విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ దాడి అమానుషండప్పు కళాకారుడిపై అయ్యన్నపాత్రుడు దాడి చేయడం అమానుషం. సమాజంలో దళితులను గౌరవించాల్సింది పోయి అగౌరవపరచడం అయ్యన్నకు తగదు. కళాకారులను ప్రోత్సహించాల్సింది పోయి దాడి చేయడం సరైన సంప్రదాయం కాదు. తక్షణమే అయ్యన్నపాత్రుడు దళితులకు క్షమాపణ చెప్పాలి.– యల్లబిల్లి కొండబాబు, డప్పు కళాకారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఅయ్యన్న దిష్టిబొమ్మ దహనంకోవెలకుంట్ల: దళితుడిపై అయ్యన్నపాత్రుడు దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం రాత్రి నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో దళిత సంఘాల నేతలు నిరసన తెలిపారు. అయ్యన్నపాత్రుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధుబాబు, గ్రేటర్ రాయలసీమ మాలమహానాడు అధ్యక్షుడు కోగిల ప్రసాద్ మాట్లాడుతూ..దళితులపై అహంకారపూరిత వైఖరి ప్రదర్శిస్తూ దాడి చేయడం హేయమన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట దళితులపై దాడులు, దౌర్యన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితుడిపై దాడి చేసిన అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
ట్రంప్ కు షాక్.. అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసిన ఇరాన్..
-
ఆ లాఠీతో కొట్టడం ఏంటండీ.. హర్ష వీణ దాడిపై కారుమూరి వెంకట్ రెడ్డి రియాక్షన్
-
నన్ను రక్తం వచ్చేలా కొట్టారు.. అసలు ఏం జరిగిందంటే..
-
అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణపై దాడి.. CCTV వీడియో
-
నడిరోడ్డుపై MLA శ్రీధర్ బాధితురాలు హర్షవీణను చంపేందుకు జనసేన నేతల కుట్ర
-
న్యాయం అడిగిన అబలపై నడిరోడ్డుపై దాడి
సాక్షి,అమరావతి/రైల్వే కోడూరు/ఓబులవారిపల్లె /విశాఖపట్నం: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై స్థానిక జనసేన పార్టీ వర్గీయులు గురువారం పట్టణంలో నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. రైల్వే కోడూరుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనుచరులతో కలిసి ఈ దాష్టీకానికి తెగబడ్డారు. అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు. అయినా తాను భయపడేది లేదని న్యాయం కోసం పోరాడతానని బాధితురాలు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అసలేం జరిగిందంటే.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమెపైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణారహితంగా రక్తమొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు. బాబు ఏం చేస్తున్నారు? : వరుదు కళ్యాణి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన నేతల దాడిని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఖండించారు. ఓ మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గురువారం విశాఖ పెదవాల్తేరులోని తన క్యాంప్ కార్యాలయంలో కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మహిళా హోంమంత్రి అనితకు ఈ దాడులు కనపడవా.. అని ప్రశ్నించారు. నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవపై చర్యలు తీసుకోండిఅంతకు ముందు అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని అతని బాధితురాలు గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించినా అరవ పాల్గొంటున్నారని, ఇది పవన్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు మాట్లాడుతూ బాబుకు ఆకలేస్తుందంటే వాడికేమైనా తీసుకెళ్దామని టోల్గేట్ వద్దకు అనుచరుడితో కలిసి వెళ్లానని, తాతంశెట్టి, ఆయన అనుచరులు దాడి చేశారని వివరించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. -
ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన అతి పెద్ద దాడి ఇదే..
-
అమెజాన్ పై ఇరాన్ భీకర దాడి..
-
యుద్ధం ఉద్రిక్తం.. అమెజాన్ సెంటర్‌పై ఇరాన్ దాడి?
ఇరాన్ అన్నంత పని చేసింది. మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా లాంటి ఐటీ కంపెనీలపై దాడి చేస్తామని టెహ్రాన్ ఇదివరకే హెచ్చరించింది. తాజాగా బహ్రెయిన్‌లోని అమెజాన్ కంపెనీపై క్షిపణులతో విరుచుకపడ్డట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం బహ్రెయిన్‌లో అమెరికా కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు చెందిన డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం ఆ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. కాగా అంతకుముందు ఒక కంపెనీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పివేస్తున్నాయని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించింది. కానీ మంటలు సంభవించిన ప్రాంతం వివరాలు మాత్రం పేర్కొనలేదు.మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా సహా 18 అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మంగళవారం ప్రకటించింది. ఇరాన్లో జరిగే ప్రతి ఉగ్రదాడికి బదులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.కాగా మరోవైపు, ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి ఒప్పందం అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ యుద్ధాన్ని రెండు మూడు వారాల్లో ముగించగలదని పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది -
తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?
స్వల్ప వివాదానికే ముక్కపచ్చలారని చిన్నారిపై దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబైకి ఆనుకుని ఉన్నవసాయి ప్రాంతంలో, తండ్రితో వాగ్వాదం తర్వాత ఒక వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని దారుణండి కొట్టాడు. చిన్నపిల్లాడు అన్న కనికరం కూడా లేకుండా తీవ్రంగా దాడి చేసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని ఒక హౌసింగ్ సొసైటీలో జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ ప్రకారం నిందితుడు సందీప్ పవార్, ఒక చిన్న విషయంపై బాలుడి తండ్రితో గొడవడ్డాడు. తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో.. క్షణికావేశంతో చేశాడో గానీ అక్కడే ఆడుకుంటున్న బాలుడు విఘ్నేష్ తన ప్రతాపాన్ని చూపించాడు. పసుపు రంగు టీ-షర్టులో విఘ్నేష్ అక్కడే ఆగి ఉన్న ఆటో-రిక్షాలో కూర్చుని ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ నిందితుడు బాలుడు కాళ్లు పట్టుకుని ఆటోలోంచి బయటకు లాగాడు. బాలుడిని నేలపై ఒకసారిగా విసిరి కొట్టాడు. తరువాత భవనం లోపలికెళ్లి, చిన్నారి తలను ఇనుప రాడ్‌కు కొట్టి, మళ్లీ నేలపై పడేశాడు.ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు!తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే మీరా రోడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్య అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య ఇదీ చదవండి : భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు -
భారత్ రావాల్సిన విమానంపై అమెరికా దాడి
పశ్చిమాసియాలో యుద్ధం మెుదలై దాదాపు నెలరోజులు గడుస్తోన్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా అమెరికా జరిపిన దాడుల్లో భారత్ రావాల్సిన మహాన్ ఎయిర్ విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.. ఔషద సేకరణకు ఈ విమానం భారత్ రావాల్సి ఉంది.ఇరాన్లో జరుగుతన్న యుద్ధం కారణంగా మానవతా సహాయం అందించేందుకు భారత్‌లో విరాళాలు సేకరించారు. ఆ నిధులతో అక్కడి ప్రజలకు కావాల్సిన ఔషదాలు కొనుగోలు చేశారు. ఈ మందులను తీసుకెళ్లడానికి ఇరాన్‌కు చెందిన (Airbus A340-600)విమానం బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. కాగా ఇరాన్‌లోని ఓ ఎయిర్‌పోర్టు వద్ద అమెరికా జరిపిన దాడుల్లో ఈ విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.దీంతో మందులు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుంది. కాగా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరిస్తోంది. క్యూఆర్ కోడ్ ద్వారా భారతీయులు పంపిన డబ్బుతో ఈ మందులను కొనుగోలు చేశారు. కాగా ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ మొత్తం ఎనిమిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. -
కువైట్ విద్యుత్ కేంద్రంపై ఇరాన్ దాడి.. విదేశీ కార్మికుడు మృతి
-
యుద్ధంలో అమెరికాకు కోలుకోలేని ఎదురుదెబ్బ..
-
బాలుడి దారుణ హత్య
నందివాడ: ఇంట్లో నిద్రిస్తున్న నానమ్మ, మనవడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి బాలుడు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో శనివారం అర్ధరాత్రి వెలుగు చూసింది. వివరాలు.. నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో గండికోట లక్ష్మి(70) ఒంటరిగా నివాసం ఉంటూ బెల్టుషాప్ నిర్వహిస్తోంది. ఆమె కొడుకు గండికోట రామసుబ్బారావు, కోడలు రమాదేవి స్థానికంగా రొయ్యల ఫ్యాక్టరీకి రోజూ రాత్రివేళ పనికి వెళ్తారు. ఈ నేపథ్యంలో రామసుబ్బారావు తన కొడుకు బాలాజీ(10)ని నానమ్మ లక్ష్మి దగ్గర రాత్రి వదిలేసి వెళ్తాడు. ఉదయం ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఇంటికి తీసుకెళ్తారు. బాలుడు చిన్నలింగాలలో ప్రభుత్వ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. రోజువారీ లాగే శనివారం రాత్రి వృద్ధురాలు లక్ష్మి, మనవడు బాలాజీతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బాలుడు బాలాజీ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని తొలుత గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. నందివాడ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలు స్థానికంగా బెల్టుషాప్ నిర్వహిస్తుండడంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ రొయ్యల చెరువు వరకు వెళ్లి పోలీస్ జాగిలం ఆగిపోయింది. పోలీసులు పలువురి అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. వారి పనేనా ! ఇటీవల మండలవ్యాప్తంగా రొయ్యల చెరువుల వద్ద పని కోసం అస్సాం, బిహార్ రాష్ట్రాలకు చెందిన చాలామంది వ్యక్తులు వచ్చారు. వీరు వృద్ధురాలు లక్ష్మి దగ్గర తరచూ మద్యం కొనుగోలు చేస్తారు. దీనికితోడు వారు నిత్యం గంజాయి సేవిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో వారిపైనే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పెదలింగాల గ్రామంలో బాలుడి హత్య, వృద్ధురాలిపై దాడి ఘటన గ్రామస్తులను ఉలికిపాటుకు గురిచేసింది. -
యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్


