ట్రంప్ నివాసంలోకి చొరబాటుకు యత్నం.. సిబ్బంది కాల్పులు | Shooting outside Trump residence | Sakshi
Sakshi News home page

ట్రంప్ నివాసంలోకి చొరబాటుకు యత్నం.. సిబ్బంది కాల్పులు

Feb 22 2026 8:38 PM | Updated on Feb 22 2026 9:22 PM

Shooting outside Trump residence

ఫ్లోరిడాలోని అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ నివాసం మార్-ఎ-లాగో వెలుపల కాల్పులు జరిగాయి.   ఆయుధంతో లోపలికి చొరబడడానికి ఓ దుండగుడు యత్నించగా అతనిపై  సీక్రెట్ ఏజెంట్ కాల్పులు జరిపారు.  అతనికి గాయాలపై అక్కడే కుప్పకూలారు. కాల్పులకు యత్నించిన సదరు దుండగుడు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు.

ఈ ఘటన అనంతరం అధ్యక్షుడి నివాసం ఎదుట భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రంప్ నివాస ప్రాంతం మార్-ఎ-లాగో పరిసరాలను FBI అదుపులోకి తీసుకుంది.   దాడి నేపథ్యంలో ఫామ్ బీచ్ ప్రాంతంలో రాకపోకలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేసారు. అయితే అధ్యక్షుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అయితే  ట్రంప్‌ నివాసంలోకి ఆ దుండగుడు ఎందుకు చొరబడటానికి యత్నించాడనే కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement