ట్రంప్‌నకు షాకిచ్చిన అమెరికన్లు?..సర్వేలో ఏముందంటే.. | Washington DC survey shows Americans oppose to Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు షాకిచ్చిన అమెరికన్లు?..సర్వేలో ఏముందంటే..

Feb 22 2026 7:40 PM | Updated on Feb 23 2026 8:53 AM

Washington DC survey shows Americans oppose to Trump

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అమెరికా గ్రేట్ ఎగేన్ అంటూ నానా  హాడావిడీ చేస్తూ..  అధిక పన్నులు పెంచుతూ ఇలా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలని ఇబ్బందులకు గురిచేశారు. అయితే తాజాగా ఆయన నిర్ణయాలపై అమెరికాలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిపిన సర్వేలలో 60 శాతం అమెరికన్లు  ట్రంప్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దెబ్బమీద దెబ్బ తాకుతుంది. ఇటీవల ఆయన పలు దేశాలపై విధించిన అధిక పన్నులు చెల్లవని అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు నిర్ణయంపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మరో షాక్ తగిలింది. అక్కడి ప్రముఖ మీడియా సంస్థలైన ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్, ఐపీవోస్  నిర్వహించిన సర్వేలలో ప్రతి ముగ్గురు అమెరికన్లు ఆయన పాలనపై వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నాయి.  

ద్రవ్యోల్బణం విషయంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆయనకు వ్యతిరేకంగా ఉండగా, ఇతర దేశాలతో సంబంధాల విషయంలో 62 శాతం ప్రజలు ఆయన పాలనను నిరాకరిస్తున్నారు. అదే సమయంలో ఇటు పన్నుల  విషయంలో పది మందిలో ఆరుగురు ఆయన విధానాలను నిరాకరిస్తున్నట్లు సర్వేలో అవగతమైంది. 

మెుత్తంగా ట్రంప్ పాలన పట్ల 60 శాతం ప్రజలు వ్యతిరేకతతో ఉండగా.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికా పరిస్థితులు మరింత దిగజారాయని దాదాపు 50 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవారి అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి.    

అయితే ఈ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ డెమోక్రట్ల నేతలపై సైతం అక్కడి ప్రజలు విశ్వసనీయతతో లేరు. ఓవరాల్ గా ట్రంప్ కు 33 శాతం, డెమోక్రట్స్ కి 31శాతం, ఇతరులకు 31శాతం మంది మెుగ్గుచూపారు.

Advertisement
 
Advertisement
Advertisement