ఇరాన్, అమెరికా వార్ టెన్షన్ రోజురోజుకూ పెరుగుతుంది. ఏక్షణానైనా యుద్ధం మెుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న విదేశీ పౌరుల కోసం ఆ దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సెర్బియా, స్వీడన్ దేశాలు ఆ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి.
ప్రస్తుతం ఇరాన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వచ్చే రెండువారాల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని లేని పక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇది వరకే ట్రంప్ అమెరికా నావికాదళాన్ని ఇరాన్ కు సమీపంలో మోహరించిన సంగతి తెలిసిందే. ఏదైనా తేడాలొస్తే ఏ క్షణానైనా దాడి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. దీంతో ఇరాన్ లోని తమ దేశ పౌరుల కోసం ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. వారిని వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నాయి.
సెర్బియా దేశం ఈ విషయంలో తమ దేశ పౌరులకు స్పష్టమైన ఆ దేశాలు ఇచ్చింది. ఇరాన్ లో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నందున తమ దేశ పౌరులెవరూ అక్కడి వెళ్లకూడదని ఆదేశించింది. అంతేకాకుండా అక్కడ ఉన్న వారు వీలైనంత త్వరగా ఇరాన్ ని వదలాలని అక్కడి విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా స్వీడన్ సైతం తమ దేశస్థులు వీలైనంత త్వరగా ఇరాన్ ని వీడాలని తెలిపింది. బల్కాన్ కంట్రీ గత నెలలోనే ఆ దేశ పౌరులు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పేర్కొంది.
ఇదిలా ఉండగా తాజాగా ఆక్సియోస్ (Axios) నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని టార్గెట్ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు ఆక్సియోస్ నివేదిక ప్రచురించింది. దీంతో ఈఅంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో ఇప్పుడు ఏ జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.


