ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు దగ్ధం | 50 cars damaged after truck exploded on Chilean highway | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు దగ్ధం

Feb 21 2026 5:11 PM | Updated on Feb 21 2026 5:29 PM

50 cars damaged after truck exploded on Chilean highway

రెంకా:  చిలీ రాజధాని సాంటియాగోలోని రెంకా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లిక్విఫైడ్ గ్యాస్ తీసుకెళ్తున్న ట్యాంకర్ ట్రక్ నియంత్రణ కోల్పోయి రహదారిపై బోల్తా పడింది. దీని ధాటికి  భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో 50 వాహనాలు దగ్ధమయ్యాయి.  ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 15 మందికి పైగా గాయాలయ్యాయి. 

సాంటియాగోలోని రెంకా హైవేపై రూట్‌ నంబర్‌-5 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌ సహా నలుగురు సజీవ దహనమయ్యారు. ట్రక్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి సేఫ్టీ బ్యారియర్లను ఢీకొట్టడం వల్ల వాహనం తిరగబడింది, దాంతో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా పొగతోకమ్ముకుంది. మరొకవైపు హైవేపై ట్రాఫిక్‌ భారీగానిలిచిపోయింది. చిలీలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement