మోదీ స్నేహ హస్తం.. బంగ్లాదేశ్ స్పందన | Bangladesh lifts visa services for India | Sakshi
Sakshi News home page

మోదీ స్నేహ హస్తం.. బంగ్లాదేశ్ స్పందన

Feb 21 2026 4:17 PM | Updated on Feb 21 2026 4:37 PM

Bangladesh lifts visa services for India

ఢాకా: బంగ్లాదేశ్ లో తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా గడవక ముందే భారత్- బంగ్లా సంబంధాల్లో కీలక పురోగతి ఏర్పడింది. ఇరు దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది డిసెంబర్ లో నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.

భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు గత రెండేళ్లుగా తీవ్రంగా క్షీణించిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిన నాటి నుంచి  బంగ్లాదేశ్ భారత్ పై తీవ్ర అక్కసు వెల్లగక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. అంతేకాకుంగా ఆ దేశంలోనే మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. దీంతో గతేడాది డిసెంబర్ లో భారత్ అదే విధంగా బంగ్లా పరస్పరం వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఇటీవలే అక్కడ ఎన్నికలు జరిగి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారం చేపట్టడం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తారిఖ్ రెహ్మాన్ అభినందనలు చెప్పి భారత్ రావాల్సిందిగా కోరడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత చల్లారినట్లయింది.

అయితే బంగ్లాదేశ్ సైతం భారత్ తో స్నేహం హస్తం కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే ఇటీవల భారతీయులకు నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. నిన్న శుక్రవారం  ఆ దేశ హైమిషనరేట్ కార్యాలయం భారత్ కు వీసాల నిలిపివేతను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటక, మెడికల్, బిజినెస్, వర్క్ లతో పాటు ఇతరాత్ర వీసాలకు సంబంధించి విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. దీంతో భారత్ తో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పడానికి తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలుస్తోంది.

అయితే ఇదివరకే ఈ అంశంలో భారత్ సానుకూలంగా స్పందించింది.  సిల్హెట్‌లోని భారత సీనియర్ కాన్సులెట్ అధికారి అనిరుద్ధ దాస్ మాట్లాడుతూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని అన్నారు. దీనిపై బంగ్లాదేశ్ సైతం పాజిటివ్ గా స్పందించడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement