BNP
-
బంగ్లాదేశ్‌లో అలా.. నేపాల్‌లో ఇలా
కాఠ్మాండు: బంగ్లాదేశ్, నేపాల్‌లో జెన్ జీ ఉద్యమాల వల్ల అప్పట్లో ఆ రెండు దేశాల ప్రభుత్వాలు కుప్పకూలాయి. అయితే, ఆ ఉద్యమాల తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో మాత్రం ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి. అంటే నేపాల్‌లో జెన్ జీ ఉద్యమం ద్వారా పేరు తెచ్చుకున్న బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ఆ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళుతోంది. బంగ్లాదేశ్‌లో మాత్రం 1978లో స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విజయం సాధించి, విద్యార్థులు ఏర్పాటు చేసిన పార్టీ ఓడిపోయింది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో జరిగిన నిరసనల లక్ష్యం ఒక్కటే.. అదే ప్రస్తుత వ్యవస్థను మార్చడం. ఇప్పుడు నేపాల్‌లో జెన్ జీల అభిమాన నేత బాలేంద్ర షా విజయం సాధిస్తే, బంగ్లాదేశ్‌లో జెన్ జీల ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పార్టీ వైఫల్యం చెందింది. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నేతృత్వంలోనే విప్లవం వచ్చింది. ఆ జెన్ జీ ఉద్యమం హసీనా ప్రభుత్వాన్ని కూల్చినా, విద్యార్థుల నేతృత్వంలోని ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.బంగ్లాదేశ్‌లో నిరసనలు ఛత్ర శిబిర్ వంటి శక్తుల ద్వారా ప్రారంభమయ్యాయి. అది బంగ్లాదేశ్‌లోని ఒక ప్రధాన ఇస్లామిక్ విద్యార్థి సంఘం పేరు. దీని పూర్తి పేరు బంగ్లాదేశ్ ఇస్లామీ విద్యార్థి శిబిర్. దీన్ని 1977లో స్థాపించారు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఉద్యమానికి హసీనా ప్రభుత్వాన్ని తొలగించడం అనే స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉంది.నేపాల్‌లో నిరసనలు సహజంగా ఉద్భవించాయి. ప్రధాన దృష్టి మొత్తం పాత వ్యవస్థను కూల్చడం. దీంతో 35 ఏళ్ల బాలేంద్ర షా వంటి నాయకులు పాత రాజకీయ పార్టీలకు నిజమైన ప్రత్యామ్నాయాలుగా ఎదగగలిగారు.బంగ్లాదేశ్ విద్యార్థుల ఉద్యమం దేశ ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకుడిని సృష్టించలేకపోయింది. ఆ ఉద్యమం ప్రధానంగా అప్పటి ప్రధానమంత్రి హసీనాను తొలగించడం మీదే కేంద్రీకృతమైంది. ప్రజలకు ప్రత్యామ్నాయం చూపలేకపోయింది. మరోవైపు, బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు హసీనా ప్రభుత్వం కూలిన తరువాత త్వరగా వివాదాల్లో చిక్కుకున్నారు. కొందరు తాత్కాలిక ప్రభుత్వంలో పదవులు కూడా స్వీకరించారు. దీంతో వారు మార్పును కాకుండా అధికారాన్ని కోరుకుంటున్నారని అనేక మంది భావించారు. ఈ విధంగా బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు తమ ప్రతిష్ఠను దెబ్బతీసుకున్నారు. జమాత్ పార్టీతో చేతులు కలపడం వల్ల వారు ఇతర రాజకీయ శక్తితో కలిసినట్టు కనిపించింది. బంగ్లాలో తారిక్ రహ్మాన్ ప్రభావం ఇలా..హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు తారిక్ రహ్మాన్ నమ్మకమైన నేతగా ఎదిగారు. అప్పటికే బంగ్లాలో ఉన్న రాజకీయ వ్యవస్థ నుంచే వచ్చిన నాయకుడు అయినా, 17 సంవత్సరాలు వేరే దేశంలో నివసించారు. తారిక్ రహ్మాన్ కొత్త ఆలోచనలు, కొత్త విధానం, ముఖ్యంగా బంగ్లాదేశ్ భవిష్యత్తు గురించి స్పష్టమైన విజన్‌ను చూపించారు. ఆయన “ఐ హావ్ ఏ ప్లాన్” ప్రసంగం ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుందో చెప్పింది. ఈ విధానం ఫలించింది. నేపాల్‌లో బాలేంద్ర షా ఇలా..గత సంవత్సరం సెప్టెంబరులో నేపాల్‌లో జెన్ జీ నిరసనలు చెలరేగాయి. కారణం సామాజిక మాధ్యమాల నిషేధం. తర్వాత ప్రభుత్వం ఆ నిషేధాన్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ అవినీతిపై జెన్ జీ పోరాడింది.బాలేంద్ర షా మొదట “బలెన్” అనే పేరుతో రాపర్‌గా ప్రసిద్ధి చెందారు. ఆయన పాటలు సామాజిక సమస్యలు, రాజకీయ అవినీతిని విమర్శించేలా ఉండేవి. యువతను ఆకర్షించాయి. తర్వాత ఆయన కాఠ్మాండు మేయర్‌గా ఎన్నికయ్యారు. నిరసనల సమయంలో ప్రధానమంత్రి పదవిని చేపడతారా అని అడిగినప్పుడు ఆయన తిరస్కరించారు.కాఠ్మాండు మేయర్‌గా బలెన్ షా పనిచేసిన అనుభవం ఆయనకు సాయపడింది. ముఖ్యంగా సాధారణ ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై దృష్టి పెట్టారు. ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడం, ప్రజా భూములపై ఆక్రమణలు తొలగించడం, దీర్ఘకాల చెత్త నిర్వహణ సమస్య పరిష్కారం వంటి అంశాలపై పని చేశారు.ప్రచార సమయంలో ఆయన సభలకు భారీ జనసందోహం వచ్చేది. ఆయన తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా సాయపడ్డారు. ఆ ప్రభుత్వానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. -
మ్యూచువల్ ఫండ్స్.. ‘న్యూ ఆఫర్స్’..
ఎల్ఐసీ ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్: సంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధికి మించి విస్తరిస్తున్న టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అందించే దిశగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా టెక్నాలజీ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 6తో ముగుస్తుంది. సెమీకండక్టర్ ఆధారిత కంపెనీలు, డేటా సెంటర్ ఆపరేటర్లు, డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫాంలు, ఇంటర్నెట్ బిజినెస్‌లు, వర్ధమాన టెక్నాలజీ సంస్థలు సహా సాంకేతికతతో ముడిపడి ఉన్న వివిధ రంగాల సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి బీఎస్ఈ టెక్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ రూపంలోనైతే వ్యవధిని బట్టి రూ.100 నుంచి కట్టొచ్చు. కరణ్ దోషి, జైప్రకాశ్ తోషి్నవాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ‘బరోడా బీఎన్పీ’ ఈఎస్జీ స్ట్రాటజీ ఫండ్ పర్యావరణహితంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ తాజాగా ఈఎస్జీ బెస్ట్–ఇన్–క్లాస్ స్ట్రాటెజీ ఫండ్‌ని ఆవిష్కరించింది. దీనికి నిఫ్టీ100 ఈఎస్జీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. సెబీలో నమోదు చేసుకున్న రేటింగ్ కంపెనీలు ఇచ్చే ఈఎస్జీ రేటింగ్స్, అలాగే, కంపెనీ అంతర్గతంగా నిర్వహించే ఫండమెంటల్ రీసెర్చ్, అనాలిసిస్ ఆధారంగా ఎంపిక చేసిన సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టే విధంగా ఈ ఫండ్ ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడేళ్ల పాటు నిఫ్టీ 100 టీఆర్ఐకి మించి నిఫ్టీ 100 ఈఎస్జీ టీఆర్ఐ మెరుగైన పనితీరు కనపర్చిందని సంస్థ సీఈవో సంజయ్ గ్రోవర్ తెలిపారు. బజాజ్ లైఫ్ బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ జీవిత బీమా సంస్థ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 15 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్లో (ఎన్ఎఫ్వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. స్థిరంగా ఆదాయాలు ఆర్జిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కంపెనీకి చెందిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలైన (యులిప్స్) బజాజ్ లైఫ్ స్మార్ట్ వెల్త్ గోల్, బజాజ్ లైఫ్ సుప్రీం, బజాజ్ లైఫ్ గెయిన్‌లతో దీన్ని తీసుకోవచ్చు. ఇటు జీవిత బీమా కవరేజీని పొందుతూనే అటు దీర్ఘకాలంలో సంపదను కూడా పంచుకునేలా ఇది రెండిందాల ప్రయోజనాలు అందిస్తుందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు.వెల్త్ కంపెనీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఈక్విటీ, డెట్ సాధనాల్లో క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని పెంచుకునే అవకాశం కల్పించేలా ది వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్ ..తాజాగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. మార్కెట్ పరిస్థితులు, వేల్యుయేషన్లు, రిస్క్ ఇండికేటర్లను బట్టి ఈక్విటీ, డెట్ సాధనాల మధ్య పెట్టుబడులను సర్దుబాటు చేస్తూ మెరుగైన రాబడులు అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. కనీసం 65 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సాధనాల్లోనూ, 35 శాతం భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి క్రిసిల్ హైబ్రిడ్ 50+50 మోడరేట్ ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. -
మోదీ స్నేహ హస్తం.. బంగ్లాదేశ్ స్పందన
ఢాకా: బంగ్లాదేశ్ లో తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా గడవక ముందే భారత్- బంగ్లా సంబంధాల్లో కీలక పురోగతి ఏర్పడింది. ఇరు దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది డిసెంబర్ లో నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు గత రెండేళ్లుగా తీవ్రంగా క్షీణించిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిన నాటి నుంచి బంగ్లాదేశ్ భారత్ పై తీవ్ర అక్కసు వెల్లగక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. అంతేకాకుంగా ఆ దేశంలోనే మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. దీంతో గతేడాది డిసెంబర్ లో భారత్ అదే విధంగా బంగ్లా పరస్పరం వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఇటీవలే అక్కడ ఎన్నికలు జరిగి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారం చేపట్టడం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తారిఖ్ రెహ్మాన్ అభినందనలు చెప్పి భారత్ రావాల్సిందిగా కోరడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత చల్లారినట్లయింది.అయితే బంగ్లాదేశ్ సైతం భారత్ తో స్నేహం హస్తం కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారతీయులకు నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. నిన్న శుక్రవారం ఆ దేశ హైమిషనరేట్ కార్యాలయం భారత్ కు వీసాల నిలిపివేతను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటక, మెడికల్, బిజినెస్, వర్క్ లతో పాటు ఇతరాత్ర వీసాలకు సంబంధించి విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. దీంతో భారత్ తో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పడానికి తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలుస్తోంది.అయితే ఇదివరకే ఈ అంశంలో భారత్ సానుకూలంగా స్పందించింది. సిల్హెట్‌లోని భారత సీనియర్ కాన్సులెట్ అధికారి అనిరుద్ధ దాస్ మాట్లాడుతూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని అన్నారు. దీనిపై బంగ్లాదేశ్ సైతం పాజిటివ్ గా స్పందించడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వంగ దేశం హసించునా?
బంగ్లాదేశ్ రాజకీయాలు సుస్థిరంగా, ప్రజాస్వామికంగా మారి, ఆ దేశం అభివృద్ధి మార్గంలో ప్రయాణించే పరిస్థితులు ఏర్పడితే, అది బంగ్లాదేశ్ ప్రజలకే గాక దక్షిణాసియా అంతటికీ సంతోషించదగ్గ విషయమవుతుంది. అక్కడ రెండేళ్ల కిందటి జెన్–జీ ఉద్యమంతో ఆరంభించి, గత వారం వెలువడిన ఎన్నికల ఫలితాల వరకు గల పరిణామాలన్నింటిని సమీక్షించినప్పుడు, ఆ వర్ధమాన దేశం ఒక కొత్త మలుపు తీసుకోగల అవకాశాలైతే స్థూలమైన దృష్టికి కనిపిస్తున్నాయి. ‘దిగంబర’ ఉద్యమం55 ఏళ్ల చరిత్ర గల బంగ్లాదేశ్‌లో ఒక సరికొత్త స్థితి రెండేళ్ల నాటి జెన్–జీ ఉద్యమంతో మొదలైంది. అంతకుముందు అంతా కుట్రలు, సైనిక నియంతృత్వాలు, అప్రజాస్వామికతలే. ప్రజలు మాత్రం వెనుకబాటుతనంలో, అవినీతి, అణచివేతలో మగ్గిపోతూ వచ్చారు. భౌగోళిక రాజకీయ వ్యూహాలలో ఒక కీలక స్థానంలో ఉన్న ఆ ప్రాంతం పెద్దవారి క్రీడలకు రంగస్థలమైంది. ఇదంతా ఇపుడు రాత్రికి రాత్రి మారిపోయి నవోదయమవుతుందని కాదు. కానీ, జెన్–జీ ఉద్యమ పరిణామాలు బంగ్లాదేశ్ సమాజానికీ, రాజకీయాలకూ ఒక గట్టి కుదుపును ఇచ్చాయన్నది గుర్తించాలి. ఆ ఉద్యమం స్వయంగా ఒక ప్రత్యామ్నాయ వేదికను సృష్టించకపోవచ్చు, కకా వికలమై మరెవరితోనో కలిసి కేవలం ఆరు సీట్లే గెలిచి ఉండవచ్చు. కానీ చరిత్ర పరిణామాలను సవ్యంగా అర్థం చేసుకునేందుకు గీటు రాళ్లు అవి కావు. ఒక పోలిక చెప్పాలంటే – బంగ్లాదేశ్ జెన్–జీ ఉద్యమ ప్రభావం రాజకీయాలలో, సమాజంలో ‘దిగంబర కవిత్వం’ కవిత్వం వంటిది. కుళ్లిన గతంపై తిరుగుబాటు చేసి కుదిపి వేసి, సరి కొత్త పరిణామాలకు దారులు తెరవటం వంటిది. ఆ చారిత్రక పాత్రను నిర్వర్తించిన వెనుక దిగంబర కవిత మిగలలేదు. ఇపుడు జెన్–జీ మిగలలేదు.ఆరు రంగాల్లో సంస్కరణలుకానీ, 55 సంవత్సరాల బంగ్లాదేశ్‌లో ఒక పరిస్థితి ఏర్పడినట్ల యితే కనిపిస్తున్నది. క్రమంగా ఏదైనా జరగవచ్చు గాక! ప్రస్తుతాని కైతే ఒక ఆశాభావం ఏర్పడుతున్నది. అందుకు నిర్దిష్టమైన కార ణాలూ ఉన్నాయి. ఉద్యమం దరిమిలా సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవటం గాక, ఉద్యమకారుల అభీష్టం మేరకు ఒక తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. భవిష్యత్తులో ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడినా అనుసరించటం కోసం 6 రంగాలలో సంస్క రణల కోసం కమిషన్లు ఏర్పడ్డాయి. అవి ఎన్నికల సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సంస్కరణలు, పాలనా సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు, అవినీతి నిరోధక సంస్కరణలు, రాజ్యాంగ సంస్కరణలు. వీటిపై సిఫారసులన్నింటినీ ‘జాతీయ ఏకీభావ కమిషన్’ పరిధిలోకి తెచ్చి దేశంలోని మొత్తం 33 చిన్నా పెద్దా పార్టీలు, కూటములతో చర్చించి 84 సిఫారసులతో సుదీర్ఘమైన నివేదికను ప్రకటించారు. ఏ సిఫారసును ఎవరు ఆమోదించారు, ఎవరు కాదన్నారు అనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. అంతిమంగా ఆమోదం పొందినందున వాటన్నింటినీ రాజ్యాంగ సవరణ ఆ మేరకు జరిగిన వెనుక కొత్త ప్రభుత్వం అమలుపరచవలసి ఉంటుందన్నారు. ‘జూలై ఛార్టర్’ పేరిట ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఆరు విధాలైన సంస్కరణలపై చర్చల క్రమంలో ప్రధాన పార్టీలైన బంగ్లా దేశ్ నేషనల్ పార్టీ, జమాతే ఇస్లామీ కూడా పాల్గొని అన్నింటినీ ఆమోదించటం గమనించదగ్గది. గత వారం పార్లమెంటుకు జరిగిన ఎన్నికలతో పాటు ఈ ‘ఛార్టర్’పై కూడా జరిగిన రెఫరెండంలో 60 శాతానికి పైగా అనుకూలత లభించింది.అందుకు కట్టుబడి ఉన్నట్లు కొత్త ప్రధాని తారిఖ్ రహమాన్‌తో పాటు, జమాత్ నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు షఫీఖుర్ రహమాన్ పునరుద్ఘాటించటం గమనించదగ్గది. మునుముందు ఆచరణ ఎట్లుండగలదన్నది వేచి చూడవలసిన విషయమే అయినా, అసలు ఒక ఉద్యమాన్ని పురస్కరించుకుని ఇన్ని విధాలైన సంస్కరణ కమి షన్లు, వాటిపై అన్ని పార్టీలతో చర్చల ద్వారా ఎన్నికలకు ముందే ఏకీభావ సాధన అన్నదే దానికదిగా ఒక అద్భుతమైన విషయం. దీనంతటికీ తగినట్లు, బంగ్లాదేశ్‌లో ఎన్నికలు 17 సంవత్సరాల తర్వాత పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగినట్లు అక్కడి యువత, ప్రజలతో పాటు అంతర్జాతీయ పరిశీలకులంతా ప్రకటించటం విశేషం. తాము గెలిచినా, ఓడినా ఫలితాలను అంగీకరించగలమని బీఎన్పీ, జమాతే పార్టీలు రెండూ ఎన్నికలకు ముందే ప్రకటించాయి. విజయోత్సవాలు వద్దని బీఎన్పీ నాయకత్వం, ఓటమిపై నిరసన ప్రదర్శనలు వద్దని జమాతే నాయకత్వం నిర్ణయించటం వంటివి మనం ఇటీవలి సంవత్సరాలలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, పశ్చిమ దేశాలలో ఎక్కడా చూడనిది.సమాన సత్సంబంధాలుకొత్త నాయకత్వం ఎన్నికలకు ముందు, ఆ తర్వాత 14వ తేదీ నాటి మొదటి మీడియా సమావేశంలో అంతర్గత విధానాల గురించి, విదేశాలతో సంబంధాల విషయమై కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. అంతర్గతంగా ఆర్థికాభివృద్ధి, మెరుగైన పాలన, ఉద్యోగ కల్పన, అవినీతి నియంత్రణ, ప్రజాస్వామిక విధానాలు, అన్ని మతాల పట్ల సమాన దృష్టితో సహా జూలై ఛార్టర్‌లోని అంశాలకు కట్టుబడి ఉండటం తమ ప్రాధాన్యాలని ప్రకటించింది. అభివృద్ధి, ఉద్యోగ కల్పన జరిగితే మతతత్త్వ ధోరణులు అవే బలహీన పడ తాయని పరోక్షంగా జమాతేను ఉద్దేశించి ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది. పై స్థాయిలో అవినీతిని అరికడితే కింది వరకు ఆ సూచనలు పోగలవన్నది మరొక ముఖ్యమైన సూచన. ఇండియా, చైనా, పాకిస్తాన్, అమెరికా సహా అన్ని దేశాలతో సమానమైన సత్సంబంధాలు తమ విధానమని తారిఖ్ రహమాన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ కొత్తమలుపు తిరిగేందుకు తప్పనిసరి అయిన, సరైన విధానం అదే కూడా! ఈ అవసరాన్ని ఇతరులు కూడా గుర్తెరిగి సహకరిస్తే బంగ్లాదేశ్‌తో పాటు మొత్తం దక్షిణాసియాకు మేలు కలుగుతుంది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
"కోటికి పైగా ప్రజలకు ఒకే ఒక్కడు"
నిన్న (మంగళవారం) తారిఖ్ రెహ్మాన్ ప్రధానమంత్రి ప్రమాణస్వీకారం ఢాకాలో జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. పలువురు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే భారత్ చూపు మాత్రం నితై రాయి చౌదరిపైనే ఉంది. ఎందుకంటే ఆ దేశంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక హిందువు చౌదరినే. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ కెరీర్ పై ఓ లుక్ వేద్దాం పదండి.బంగ్లాదేశ్ లో గత రెండేళ్లుగా చెలరేగిన రాజకీయ అస్థిరత, హింసకు తెరపడింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇంతకాలం అక్కడ చెలరేగిన హింసలో మైనార్టీలే తీవ్రంగా నష్టపోయారు. అక్కడి మత ఛాందస వాదులు చెలరేగి అక్కడి హిందువులపై దాడులు చేసి చంపడంతో పాటు వారి ఆస్తులను, ఆలయాలను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన BNP ప్రభుత్వం ఇప్పుడు హిందువుల సంరక్షణకు ఏ చర్యలు తీసుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలోనే తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం తన మంత్రివర్గంలో హిందూ నేత నితై రాయి చౌదరికి చోటు కల్పించింది.వ్యక్తిగత జీవితంనితైరాయి చౌదరి 1949 జనవరి 7న జన్మించారు. తన వివాహం జూమా అనే మహిళతో జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. నితై రాయి వృత్తి రీత్యా న్యాయవాది. వారి కుమారుడు దేబాసిష్ రాయ్ చౌదరి ప్రస్తుతం బంగ్లాదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె నిపున్ రాయ్ చౌదరి రాజకీయ నాయకురాలు బీఎన్ పీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఆమె భర్తసైతం ప్రస్తుతం బీఎన్ పీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరో కుమారుడు మిథున్.పొలిటికల్ కెరీర్ నితై రాయి రాజకీయ జీవితం క్షేత్రస్థాయి నుంచే మెుదలైంది. అక్కడి నుంచే ఆయన జాతీయ నాయకునిగా ఎదిగారు. 1988లో తొలిసారిగా మాగురా-2 నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం 1990 లలో మూడు నెలల పాటు యువజన, క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. హుస్సేన్ మహ్మద్ ఎర్షాద్ పాలన అనంతరం BNPలో చేరారు. అక్కడి నుండి అంచెలంచలుగా ఎదుగుతూ ఆ పార్టీ ఉపాధ్యాక్షుని స్థాయి వరకూ ఎదిగారు.BNPలో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన నిర్ణయాల రూపకల్పణలో తన సలహాను అందిస్తారు. అయితే గతంలో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనాని బహిరంగంగా విమర్శించేవారు. ఆమెది ఫాసిస్ట్ పాలనని నియంతృత విధానాలని విమర్శించేవారు. 2001లో బీఎన్పీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు హిందువులపై దాడి చేయించిందని ఆరోపించారు.భారత్ సంబంధాలుఅయితే భారత్ - బంగ్లా సంబంధాలపై నితైరాయి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. భారత్ కు వ్యూహాత్మక పరంగా బంగ్లాదేశ్ ఎంతో ప్రముఖమైన స్థానంలో ఉందన్నారు. అందుకే భారత్ బంగ్లాతో మెత్రి కోరుకుంటుందని తెలిపారు. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఆ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోందని తెలిపారు. అయితే ఇంతకాలం అక్కడ మైనార్టీలపై దాడులు జరిగిన నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన రెహ్మాన్ ప్రభుత్వం వాటిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి. అయితే మంత్రి పదవి చేపట్టిన నితైరాయి చౌదరికి సైతం ఆ దేశంలోని హిందువులను కాపాడాల్సిన బాధ్యత ఉంది.భారత్- బంగ్లా సంబంధాలుబంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్‌ను భారత ప్రధాని మోదీ ఆయనను భారత్‌కు ఆహ్వానించారు. నిన్న మంగళవారం ఢాకాలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయనకు స్వయంగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో బంగ్లాదేశ్ తో భారత్ మైత్రిని కోరుకుంటుందని ప్రధాని మోదీ చాటిచెప్పారు. అయితే ఈ నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ సర్కార్ ఇండియాపై ఏ వైఖరి అవలంభిస్తోందో వేచి చూడాలి. -
నేడే బంగ్లా ప్రధాని ప్రమాణస్వీకారం.. ప్రముఖుల హాజరు
బంగ్లాదేశ్ ప్రధానిగా నేడు తారిఖ్ రహ్మన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల ఆదేశంలో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన నేపథ్యంలో ఆయన ప్రధాన మంత్రిగా నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. తారిఖ్ రహ్మన్ ప్రమాణస్వీకార వేడుకకు భారత్‌తో సహా దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.గత రెండేళ్లుగా బంగ్లాదేశ్ అశాంతితో రగిలిపోయింది. అక్కడి ప్రభుత్వాలకు నిరసనగా అక్కడి ప్రజలు పెద్దఎత్తున ఉద్యమబాట పట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉద్యమాలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా ఆ దేశాన్ని వీడి భారత్‌లో తలదాచుకున్నారు. అనంతరం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్‌గా మహ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మృతితో ఆదేశంలో మరోసారి నిరనలు పెల్లుబెక్కాయి. మైనార్టీలపై దాడులు జరిగాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంత అస్థితరతల మధ్య ఎన్నికలు జరుగగా ఎన్నికలలో ఎట్టకేలకు బీఎన్పీ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టబోతుంది.బంగ్లాదేశ్ ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఛైర్మన్ తారిఖ్ రహ్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ప్రమాణస్వీకార వేడుకకు అక్కడి పార్లమెంటు భవన్‌లోని సౌత్ ప్లాజా వేదిక కానుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ వేడుకకు భారత్‌తో సహా 13దేశాలను ఆహ్వానం పంపగా ఇండియా నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఈ వేడుకకు హాజరుకానున్నారు.వారితో పాటు విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన దాదాపు 1200 మందికి బంగ్లాదేశ్ ఆహ్వానం పంపింది.ఇటీవల 297 స్థానాలకు ఎన్నికలు జరుగగా బీఎన్పీ 209 స్థానాల్లో గెలుపొందింది. కాగా ఇంతకాలం 17 ఏళ్లుగా లండన్‌లో ఉన్న ఆయన ఇటీవల బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. బీఎన్పీ పార్టీ దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత అధికారం చేపట్టబోతుంది. -
‘డార్క్ ప్రిన్స్’ నుంచి... ప్రధాని పీఠం దాకా!
తారిఖ్ రహ్మాన్. 19 ఏళ్ల ప్రవాసం వీడి తిరిగొచ్చిన నెలన్నర వ్యవధిలోనే బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్ ప్రిన్స్’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్ది నిజంగా ఆసక్తికర ప్రస్థానమే. ఆయన తండ్రి దివంగత ముజిబుర్ రహ్మాన్ దేశాధ్యక్షునిగా పని చేశారు. ఇక తల్లి బేగం ఖలీదా జియా ప్రధానిగా కొనసాగారు. 2001 నుంచి 2006 మధ్య ఆమె హయాంలో రహ్మాన్ రెండో అధికార కేంద్రంగా మారారన్న చెడ్డపేరు మూటగట్టుకున్నారు. పాలనతో సహా అన్ని వ్యవహారాలనూ తన కనుసన్నల్లో శాసించారంటారు. దాంతో విపక్షాలు, సొంత పార్టీలోని అసమ్మతివాదులే గాక అమెరికా కూడా రహ్మాన్‌ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించాయి. అంతేగాక ఆ సమయంలో ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన అవామీ లీగ్ సారథి షేక్ హసీనా వాటిపై విచారణకు ఆదేశించారు. ఒక కేసులో రహ్మాన్ అరెస్టయ్యారు కూడా. బెయిల్‌పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్ వెళ్లారు. నాటినుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వచ్చారు. అస్థిరతే అదనుగా... 2024 ఆగస్టులో విద్యార్థి ఆందోళనల ముసుగులో చెలరేగిన దేశవ్యాప్త అల్లర్లతో నాటి ప్రధాని హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. అంతేగాక రాత్రికి రాత్రే ఆమె దేశం వీడి భారత్ చేరుకున్నారు. అనంతరం బంగ్లాలో అల్లకల్లోలం, అస్థిరత నెలకొన్నాయి. ఎటుచూసినా హింసాకాండ పెచ్చరిల్లింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో ఏర్పడ్డ మధ్యంతర సర్కారు వాటికి అడ్డుకట్ట వేయడంలో పూర్తి విఫలమైంది. పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలోకి జారి రాజకీయ శూన్యం నెలకొన్న తరుణంలో గత డిసెంబర్ 25న రహ్మాన్ ప్రవాసం వీడి సొంతగడ్డపై అడుగుపెట్టారు. బీఎన్పీ కార్యకర్తలతో పాటు అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తల్లి వయోభారం, అనారోగ్యం నేపథ్యంలో పార్టీని అన్నీ తానై నడిపించారు. జియా మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నికల రంగంలోకి దూకారు. బంగ్లా ఫస్ట్ నినాదంతో యువతతో పాటు వృద్ధులనూ ఆకట్టుకున్నారు. బీఎన్పీకి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి పెట్టి దేశంలోకి అడుగు పెట్టిన నెలన్నర లోపే ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టనున్నారు! అయితే కోరలు చాస్తున్న మత వైషమ్యాలకు అడ్డుకట్ట వేయడం, ముఖ్యంగా అరాచక శక్తులకు ముకుతాడు వేయడం, దేశాన్ని ప్రగతి వైపు నడపడం ఆయనకు కఠిన పరీక్షే కానుంది. రహ్మాన్ భార్య డాక్టర్ జుబైదా బంగ్లా నేవీ మాజీ చీఫ్ కూతురు. వారికి కూతురు జైమా జర్నాజ్ ఉన్నారు. భారత్ పట్ల సానుకూలతే! షేక్ హసీనా పూర్తిగా భారత అనుకూల నేతగా పేరుపడగా ఖలీదా జియాది మాత్రం పూర్తిగా భిన్న వైఖరి. భారత్‌తో ఆమె ఎప్పుడూ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జియా కుమారునిగా రహ్మాన్ తీరు ఎలా ఉంటుందోనని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హసీనా పదవీచ్యుతి అనంతరం గత ఏడాదిన్నరగా బంగ్లాలో భారత వ్యతిరేకత భావజాలం పరాకాష్టకు చేరింది. దానికి యూనుస్ సర్కారుకూడా పరక్షంగా దన్నుగా నిలిచింది. వీలు దొరికినప్పుడల్లా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే గాక క్రమంగా మన దాయాది పాకిస్తాన్‌కు దగ్గరవుతూ వచ్చింది. ఇదే అదనుగా బంగ్లాలో మతోన్మాద మూకలు కొన్నాళ్లుగా రెచ్చిపోతున్నాయి. మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దమనకాండకు దిగుతున్నాయి. ఆ క్రమంలో హిందువుల హత్యలతో బంగ్లా అట్టుడుకుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాలో అడుగుపెట్టిన రహ్మాన్, తనది మాత్రం భారత వైఖరి అనుకూల వైఖరేనని ఆదినుంచీ స్పష్టమైన సంకేతాలిస్తూ వచ్చారు. ఉగ్రవాదంపై భారత్ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్‌కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
ఛాందసవాదులకు చావుదెబ్బ
తరాలు మారినంత మాత్రాన గాయాలు తొలగిపోవు. నెత్తుటి చరిత్రను అంత సులభంగా చెరిపేయడం సాధ్యపడదు. బంగ్లాదేశ్ తాజా ఎన్నికల ఫలితాలు దీన్నే బలంగా చాటుతున్నాయి. బంగ్లాదేశ్‌లో అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ, అణచివేతకూ వ్యతిరేకంగా ఉద్యమించిన జెన్–జీ తరాన్ని అడ్డుపెట్టుకుని దేశాన్ని ఛాందసవాదం ఊబిలోకి నెట్టాలని, యాభై అయిదేళ్ల క్రితం బంగ్లా ప్రజానీకాన్ని ఊచకోత కోసిన పాక్‌తో అంట కాగాలని తహతహలాడిన మతతత్వ శక్తులు గురువారం నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలయ్యాయి. ఫలితాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సే ఉన్నా 300 స్థానా లున్న పార్లమెంటులో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) ఆధ్వర్యంలోని కూటమి 216 స్థానాలు గెల్చుకుందని వార్తలు వస్తున్నాయి. జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమికి 76 స్థానాలు లభించాయి. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న చాలా స్థానాల్లో బీఎన్పీ కూటమి ఆధిక్యతలో ఉన్నదని సమాచారం. పెద్ద మనిషిలా కనబడే ఆర్థిక నిపుణుడు మహ్మద్ యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వా నికి ప్రధాన సలహాదారుగా నియమిస్తే, ఆయన కాస్తా మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే ధ్యేయమన్నట్టు ప్రవర్తించారు. మైనారిటీ హిందూ పౌరులపైనా, అవామీ లీగ్ నేతల పైనా, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలపైనా ఉన్మాద గుంపులు దాడులు చేస్తుంటే, హతమారుస్తుంటే పట్టనట్టు ప్రవర్తించారు. మతాచారాలు పాటించటం లేదంటూ నడి రోడ్లపై మహిళలను హింసిస్తుంటే కళ్లు మూసుకున్నారు. వాటిని అతిగా చిత్రిస్తున్నారని మీడియాపై విరుచుకుపడ్డారు. హసీనా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిని చేరదీసి, నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ)ని ఏర్పాటు చేయించిందీ, జమాతేతో సర్దుబాటు చేయించిందీ ఆయనే. దేశంలో కొత్త పొద్దు పొడవబోతోందని గురువారం నాటి యూనస్ హుషారు మాటల అర్థం వేరు. జమాతే, ఎన్సీపీ మెజారిటీ స్థానాలు సాధిస్తాయని ఆయన విశ్వసించారు. అవామీ లీగ్‌పై ఎటూ నిషేధం ఉంది. బీఎన్పీ గత చరిత్ర సైతం అవినీతిమయమే. కనుక రెండు పార్టీల కథ ముగిసినట్టేనని అంచనా కొచ్చారు. కానీ బంగ్లా ప్రజలు వివేకవంతమైన తీర్పునిచ్చి ఆయనకూ, ఆ బాపతు శక్తు లకూ చెంప ఛెళ్లుమనిపించారు. దేశంలో సుస్థిరమైన, స్వతంత్రమైన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలని జనం కోరుకుంటున్నట్టు రాజకీయ నిపుణులు ముందే చెప్పారు. అయితే ఎన్నికలతోపాటు రాజ్యాంగ సంస్కరణలపై నిర్వహించిన రిఫరెండమ్ విషయంలో ప్రజాస్వామిక శక్తులు అప్రమత్తంగా ఉండకతప్పదు. వాటిల్లో అవాంఛనీయమైన అంశాలు చొరబడే ప్రమాదం లేకపోలేదు. చూడటానికి వాటి సారాంశం మెరుగ్గానే ఉంది. ప్రధాని పదవికి రెండు దఫాల పరిమితి, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మహిళలకూ, యువతకూ పటిష్టమైన ప్రాధాన్యత, పార్లమెంటుకు రెండు సభల ఏర్పాటు అందులో ఉన్నాయి. ఈ సంస్కరణల అమలు బాధ్యత జనం బీఎన్పీకి కట్టబెట్టారు. భావోద్వేగాలతో ముడిపడే ఎన్నికలతో, ఎంతో ఆలోచించి ఓటేయాల్సిన రిఫరెండమ్‌ను జత చేయటం సరికాదు. పైగా బీఎన్పీ గత చరిత్ర ఘనమైనదేమీ కాదు. కాబోయే ప్రధాని తారిఖ్ రెహ్మాన్ తల్లి ఖలీదా జియా రెండు దఫాల ఏలుబడిలో మతతత్వ, భారత వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహాన్నందించారు. ఇప్పటికైతే రెహ్మాన్ ఆలోచనా ధోరణి భిన్నంగా ఉన్నట్టు ఆయన ప్రసంగాలు చెబుతున్నాయి. బంగ్లా విముక్తి యుద్ధానికి కొత్త భాష్యాలు చెప్పినవారికీ, పాక్ పాలకులను నెత్తి నెక్కించుకున్నవారికీ ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. నిషేధంలోవున్న అవామీలీగ్ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో పోటీచేయలేదన్న మాటేగానీ, ఆనాటి పాక్ దుష్కృత్యాలను ప్రజానీకానికి గుర్తుచేయటంలో విజయం సాధించారు. హసీనా అవినీతి పాలన పుణ్యమా అని జెన్–జీ తరానికి దేశ చరిత్ర గురించి తెలియకుండా పోయింది.భారత్ అనుకూలతకు దూరంగా ఉండాలని, హసీనాను వెనక్కి రప్పించే యత్నం చేయాలని, నీటి వాటాలపై రాజీ పడొద్దని రెహ్మాన్‌పై జమాతే పార్టీ ఒత్తిళ్లు తెస్తుంది. వ్యర్థ వివాదా లతో కాలక్షేపం చేయకుండా, నిజాయితీగా పాలిస్తే రెహ్మాన్ రాజకీయంగా నిలదొక్కుకుంటారు. లేనట్టయితే ఇప్పుడు ఓటమిపాలైన శక్తులు మున్ముందు బలపడే ప్రమాదంఉంటుంది. -
బంగ్లా బీఎన్‌పీదే
ఢాకా: బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) దుమ్మురేపింది. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఏకంగా మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించింది. మొత్తం 300 స్థానాలకు గాను 297 చోట్ల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. వాటిలో బీఎన్పీ 209 సీట్లు గెలుచుకుంది! కరడుగట్టిన భారత వ్యతిరేకిగా, పాక్ తాబేదారుగా ముద్రపడ్డ జమాతే ఇస్లామీ పార్టీ 68 సీట్లకు పరిమితమైంది. దానితో జట్టుకట్టిన 10 ఇతర పారీ్టలు దాదాపుగా మట్టికరిచాయి. 2024 ఆందోళనల అనంతరం విద్యార్థుల ఆధ్వర్యంలో పుట్టుకొచ్చిన జమాతే సంకీర్ణ భాగస్వామి నేషనల్ సిటిజన్ పార్టీ కేవలం 6 స్థానాల్లో నెగ్గగా 7 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం తెలిసిందే. రెండు పార్లమెంటు స్థానాల్లో ఫలితాల వెల్లడిపై హైకోర్టు నిషేధం విధించగా అభ్యర్థి మృతి కారణంగా ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. ఓట్ల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగినట్టు జమాతే ఆరోపించింది. ఫలితాలను బీఎన్పీకి అనుకూలంగా మార్చేందుకు వాటి వెల్లడిని ఈసీ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసిందని మండిపడింది. 20 ఏళ్ల తర్వాత అధికారం ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో బీఎన్పీ చైర్మన్ తారిఖ్ రహ్మాన్ (60) తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆదివారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. బీఎన్పీ ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికార పగ్గాలు చేపట్టనుండటం విశేషం. ఎన్నికల విజయంపై రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఫలితాలపై స్పందించిన తొలి దేశాధినేత ఆయనే కావడం విశేషం. ఇందుకు మోదీకి బీఎన్పీ కృతజ్ఞతలు తెలిపింది. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన రహ్మాన్ 19 ఏళ్ల ప్రవాసం నుంచి ఇటీవలే బంగ్లాకు తిరిగి రావడం విశేషం. షేక్ హసీనా సర్కారును కుప్పకూల్చిన దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఏడాదిన్నరకు పైగా కొనసాగుతున్న కల్లోలం బీఎన్పీ విజయంతో సద్దుమణిగి రాజకీయ స్థిరత్వం నెలకొంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా గురువారం జరిగిన ఎన్నికల్లో 59.44 శాతం పోలింగ్ నమోదైంది. బంగ్లాలో ఇవి 13వ సాధారణ ఎన్నికలు. విద్యార్థుల ముసుగులో 2024 ఆగస్టులో పెచ్చరిల్లిన ఆందోళనలు హసీనా 15 ఏళ్ల పాలనకు తెరదించడం, ఆమె ఉన్నపళంగా దేశం వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. నాటినుంచీ ఒకరకంగా బంగ్లాలో రాజకీయ శూన్యమే నెలకొంది. దేశ పాలన వ్యవహారాలను ఏడాదిన్నరకు పైగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వమే చూస్తూ వస్తోంది. అయితే దేశంలో అస్థిరతకు చెక్ పెట్టడంలో, ముఖ్యంగా హిందువులు తదితర మైనారిటీలపై దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందన్న చెడ్డపేరు మూటగట్టుకుంది. సంస్కరణలకు ‘జై’బంగ్లాదేశ్‌లో భారీ ప్రజాస్వామిక సంస్కరణలకు ప్రజలు జైకొట్టారు. ఇందుకోసం సాధారణ ఎన్నికలతో పాటుగా నిర్వహించిన రెఫరెండానికి అనుకూలంగా తీరి్పచ్చారు. రెఫరెండంలో భాగంగా ప్రతిపాదించిన సంస్కరణల ప్యాకేజీకి మద్దతు పలికారు. రెఫరెండానికి అనుకూలంగా ఏకంగా 60.26 శాతం ఓట్లు పడ్డట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 4.81 కోట్ల మంది ‘అవును’అని ఓటేయగా 2.26 కోట్ల మంది ‘కాదు’బటన్ నొక్కినట్టు తెలిపింది. హసీనా పదవీచ్యుతి అనంతరం తాత్కాలికంగా పాలన పగ్గాలు చేపట్టిన యూనుస్ గతేడాది ఈ సంస్కరణలను ప్రతిపాదించారు.ఏడుగురుమహిళల విజయం బంగ్లా పార్లమెంటు ఎన్నికల్లో ఏడుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఆరుగురు అధికార పగ్గాలు చేపట్టబోతున్న బీఎన్పీ నుంచే నెగ్గారు. మరొకరు స్వతంత్ర అభ్యరి్థగా గెలిచారు. బీఎన్పీ ఈసారి మొత్తం 10 మంది మహిళలకు టికెట్లిచ్చింది. ముగ్గురు హిందువుల విజయం! బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు హిందూ అభ్యర్థులు గెలుపొందడం విశేషం! పైగా వారంతా బీఎన్పీ టికెట్‌పై పోటీ చేసినవారే! సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ చంద్ర రాయ్ ఢాకా–3 నియోజకవర్గం నుంచి ఏకంగా 99,163 ఓట్లు సాధించి జమాతే ఇస్లామీ అభ్యర్థి మహ్మద్ షహీనుర్ ఇస్లాంపై విజయఢంకా మోగించారు. బీఎన్పీ ఉపాధ్యక్షుడు నితాయ్ రాయ్ చౌధురి మగురా–2 నుంచి, దీపేన్ దివాన్ రంగమతి నుంచి గెలుపొందారు. జమాతే తరఫున ఏకైక హిందూ అభ్యర్థి కృష్ణ నంది ఓటమి చవిచూశారు.దశాబ్దాల అనంతరంమహిళా సారథులు లేకుండా బంగ్లాలో దశాబ్దాల విరామం తర్వాత ప్రధాన పారీ్టలకు మహిళా సారథులు లేకుండా జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. గత 30 ఏళ్లకు పైగా షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్, బేగం ఖలీదా జియా సారథ్యంలోని బీఎన్పీ ప్రధాన పారీ్టలుగా తలపడుతూ వస్తున్నాయి. జియా అనారోగ్యంతో గత డిసెంబర్లో కన్నుమూయడం తెలిసిందే. -
బంగ్లాకు పరీక్షా సమయం
ఏణ్ణర్థంక్రితం విద్యార్థి ఉద్యమం ధాటికి మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారాన్నీ, దేశాన్నీ వదిలిపెట్టిన నాటినుంచీ రాజకీయ, సామాజిక అస్థిరతలో కూరుకుపోయిన బంగ్లాదేశ్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు అయిన మహ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఉన్న వైషమ్యాలను మరింత పెంచి పోషించింది. జవాబుదారీతనం లేని అధికారంతో ఆయన తీసుకుంటున్న వరస నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, తక్షణం ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిళ్లు పెరగటంతో ఇవి తప్పనిసరి అయ్యాయి. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) గెలుపుగుర్రంగా కనబడటమే గత ఎన్నికలకూ, ప్రస్తుత ఎన్నికలకూ కొట్టొచ్చి నట్టు కనబడుతున్న తేడా. పదిహేనేళ్లపాటు దేశాన్నేలిన షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌పై నిషేధం విధించటంతో ఆ పార్టీ జాడలేదు. పాకిస్తాన్ నుంచి విడివడి 1971లో స్వతంత్ర ప్రయాణం ప్రారంభించిననాటి నుంచీ బంగ్లాదేశ్‌కు ఆటుపోట్లు తప్పడం లేదు. సైనిక కుట్రలు, మత ఛాందసవాదం షరా మామూలైన పాకిస్తాన్ చీడ దానికి కూడా అంటి, ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. 17 కోట్ల 30 లక్షల జనాభాతో ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న బంగ్లా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలు ప్రశంసిస్తూ ఉండేవి. అదే జరిగుంటే హసీనా పదవికి ముప్పు వచ్చి ఉండేది కాదు. కానీ ఆర్థిక అసమానతలకు తోడు పేదరికం, అవినీతి, కక్షసాధింపు ఆమెను దెబ్బతీశాయి. 2022 నుంచి బంగ్లా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి వందలకోట్ల డాలర్ల రుణాలు తీసు కొస్తున్నా మారిందేమీ లేదు. ఆ డబ్బంతా పాలకపార్టీని ఆశ్రయించుకున్నవారి జేబుల్లోకి పోయింది. అధిక ధరలు, ఉపాధిలేమి సగటు మధ్యతరగతి, దిగువతరగతి కుటుంబా లను తీవ్రంగా దెబ్బతీశాయి. బీఎన్పీయే విజేతగా నిలుస్తుందని సర్వేలు చెబుతున్నా ఆ పార్టీకి అంత మంచి పేరేమీ లేదు. తూర్పు పాకిస్తాన్‌గా ఉన్నకాలంలో అప్పటి పాక్ పాలకులు తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడినా, అనంతరకాలంలో అధికారంలోకొచ్చిన బీఎన్పీ ఆ దేశంతో అంట కాగిందనీ, అవినీతిలో కూరుకుపోయిందనీ జనం గుర్తు చేసుకుంటున్నారు. అందుకే రెహ్మాన్ కొత్త బాణీ అందుకుని అన్ని సభల్లోనూ గత తప్పులకు క్షమాపణ కోరుతున్నారు. 1971 విముక్తి పోరాటంలోనూ, 2024 ప్రజాస్వామ్య ఉద్యమంలోనూ మరణించిన వారికి నివాళులర్పిస్తున్నారు. బీఎన్పీ మాదిరే పాకిస్తాన్ అనుకూల పార్టీగా పేరున్న జమాతే ఇస్లామీ(జేఈఐ)కు ఉన్న అనుకూలాంశమల్లా ఆ పార్టీ ఎప్పుడూ అధికారంలో లేకపోవ టమే! మహిళల హక్కుల విషయంలో ఆ పార్టీది ఛాందసవాద ధోరణి. దీన్ని బీఎన్పీ తనకు అనుకూలంగా మలుచుకుని, తమ పాలనలో లింగవివక్ష ఉండబోదంటోంది. అయితే యూనస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హిందువులపై పెరిగిన దాడుల్ని తామే దృఢంగా ఎదిరించి, రక్షణగా నిలిచామని జేఈఐ చెప్పుకుంటోంది. కానీ ఆ దాడులు ఆగింది లేదు. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక అవి మరింత ఎక్కువయ్యాయి. మంగళవారం హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్‌ను ఆయన దుకాణంలోనే దుండగులు కాల్చిచంపారు. బంగ్లాలో ఎవరు పాలకులైనా చైనా, పాకిస్తాన్ల ప్రభావం దండిగానే ఉంటుంది. బీఎన్పీ ఈ విషయంలో బహిరంగంగా ఏమీ చెప్పకపోయినా, జేఈఐ తన పాక్ అనుకూలతను చాటుకోవటంతో పాటు ఇటీవల చైనా దౌత్యవేత్తలతో భేటీ అయింది. విషాదమేమంటే, హసీనాను పదవీచ్యుతురాలిని చేయటంలో కీలకపాత్ర పోషించిన జెన్ జీ తరానికి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యం లేదు. విద్యార్థుల నాయకత్వంలోని నేషనల్ సిటిజెన్ పార్టీకి ఆశించినంత మద్దతు లభిస్తున్న దాఖలా లేదు. నిరుడు తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధులతో పాటు 30 రాజకీయ పార్టీలు పాల్గొన సదస్సు ఆమోదించిన ‘జూలై ఛార్టర్’పై కూడా గురువారం రిఫరెండమ్ జరగబోతోంది. ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చేందుకే, చరిత్ర వక్రీకరించేందుకే దీన్ని తీసుకొచ్చారని వామపక్షాల విమర్శ. మొత్తానికి బంగ్లాదేశ్ భవితవ్యం ఎలా ఉండబోతున్నదో ఈ ఎన్నికలూ, రిఫరెండమ్ తేల్చబోతున్నాయి. -
బంగ్లా డార్క్ ప్రిన్స్... పునరాగమనం
నానాటికీ పతనావస్థకు చేరుతున్న కల్లో ల బంగ్లాదేశ్ లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ప్రధాని అభ్యరి్థగా అంతా భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎనీ్ప) తాత్కాలిక చైర్మన్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ 17 ఏళ్ల స్వీయ దేశ బహిష్కరణకు ముగింపు పలికారు. లండన్ నుంచి గురువారం స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బీఎన్పీ శ్రేణులు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికాయి. విమానాశ్రయానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా పోటెత్తారు. తారిఖ్, తారిఖ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. తల్లి హయాంలో రాజ్యాంగేతర శక్తిగా అపరిమిత అధికారాలు చెలాయించిన తారిఖ్ డార్క్ ప్రిన్స్ గా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. తల్లి మాది రిగానే ఆయనకు కూడా భారత వ్యతిరేకిగా పేరుంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం బంగ్లాలో చోటుచేసుకున్న ఈ కీలక రాజకీయ పరి ణామాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. বাংলাদেশের উদ্দেশ্যে রওনা দিতে লন্ডনের হিথ্রো বিমানবন্দরে তারেক রহমান, জুবাইদা রহমান এবং জাইমা রহমান।#BNP #TariqueRahman #Bangladesh pic.twitter.com/E4hBYlBdJV— Masud Rana (@MasudRana137969) December 24, 2025కాబోయే ప్రధాని! తారిఖ్ రెహా్మన్ (60). బంగ్లా అంతటా గత 17 ఏళ్లుగా ఆయన ఫోటోలు, పోస్టర్లు మాత్రమే కనిపిస్తూ వచ్చాయి. బీఎన్పీ ర్యాలీల్లో ఆయన వీడియో సందేశాలే మాట్లాడుతూ వచ్చాయి. అవినీతి కేసులు తదితర కారణాలతో 2008 నుంచీ భార్య జుబైదా, కూతురు జైమాతో పాటు తారిఖ్ లండన్ లో తలదాచుకోవడమే ఇందుకు కారణం. గురువారం భార్య, కూతురితో కలిసి ఢాకా చేరుకున్నాక, ‘6,314 సుదీర్ఘ రోజుల అనంతరం సొంత గడ్డపై అడుగుపెట్టా. నా బంగ్లా వాసులారా! ఇకనుంచీ మీ అందరితో నేరుగానే మాట్లాడతా‘ అంటూ సోషల్ మీడియాలో తారిఖ్ పెట్టిన పోస్టు దేశమంతటా వైరల్ అయింది. ఆయన తల్లి 80 ఏళ్ల ఖలీదా సుదీర్ఘ కాలంగా ఆస్పత్రిలో ఉండటంతో బీఎన్పీ పగ్గాలను తారిఖ్ పూర్తిస్థాయిలో చేపట్టడం లాంఛనమే కానుంది. బంగ్లాలో శక్తిమంతమైన నేతగా వెలుగొందిన షేక్ హసీనా గతేడాది చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ప్రధాని పదవితో పాటు దేశాన్ని కూడా వీడి భారత్ లో తలదాచుకుంటున్నారు. ఆమె అవామీ లీగ్ పార్టీపైనా ఇప్పటికే అనర్హత వేటు పడింది. ప్రభుత్వ తాత్కాలిక సారథి, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కు కూడా మంచినోరే ఉన్నా ఏడాదికి పైగా అసమర్థ పాలనతో చెడ్డపేరు తెచ్చుకున్నారు. దాంతో ప్రకటించిన మేరకే వచ్చే ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరిగితే తారిఖ్ ప్రధాని పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖాయమేనంటున్నారు. జమాతేకు ముకుతాడు! భారత వ్యతిరేకే అయినా, తారిఖ్ రాక మనకు ఊరటనిచ్చే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాలో ప్రస్తుతం.నెలకొని ఉన్న తీవ్ర రాజకీయ అస్థిరతే ఇందుకు కారణం. ఏ పార్టీలోనూ పెద్దగా జనాదరణ ఉన్న నాయకుడు లేకపోవడంతో ప్రజల్లోని ఆగ్రహావేశాలను మతోన్మాద శక్తులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ జేబు సంస్థ అయిన జమాతే ఇస్లామీ నానాటికీ కోరలు చాస్తోంది. హసీనా హయాంలో పడ్డ నిషేధాన్ని వదిలించుకుని యువత, ముఖ్యంగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. రాజకీయ శక్తిగా బలపడుతోంది. ఇటీవలి ఢాకా వర్సిటీ ఎన్నికల్లో జమాతే విద్యార్థి విభాగమే ఘనవిజయం సాధించింది. ఇతర చోటామోటా పక్షాలతో కలిసి ఏకంగా అధికార పీఠంపైనే జమాతే ఇప్పుడు కన్నేసింది. ఈ పరిస్థితుల్లో దానితో పోలిస్తే ఉదారవాది అయిన తారిఖ్ రాక భారత్ కు ఊరటనిచ్చే పరిణామమే. పైగా భారత్ తో సత్సంబంధాలు కోరు కుంటున్నామన్న బీఎన్పీ ప్రకటనను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. జమాతే వంటి మతోన్మాద శక్తికి ముకుతాడు పడటం మన జాతీయ ప్రయోజనాల రీత్యా చాలా ముఖ్యమని చెబు తున్నారు. తారిఖ్ పై ఉన్న అవినీతి, హసీనా హత్యాయత్నం తదితర కేసులన్నింటినీ కోర్టులు ఇటీవలే కొట్టేశాయి. దాంతో ఆయన ఎన్నికల పోటీకి మార్గం సుగమమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
17 ఏళ్ల తర్వాత రానున్న ప్రధాని కుమారుడు
బంగ్లాదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గత 17 ఏళ్లుగా విదేశాల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు తరీఖ్ రహమాన్ బంగ్లాదేశ్ రానున్నట్లు ప్రకటించారు. ఆయన రాకకోసం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆదేశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రహమాన్ రాక పొలిటికల్ హీట్‌ను పెంచింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ అస్థిరత తీవ్రంగా ఉంది. ఇటీవలే రాడికల్ నేత ఉస్మాన్ హాదీ ఎన్నికల ప్రచారంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చారు. ఆయన చికిత్సపొందుతూ మృతిచెందాడు. దీంతో అక్కడ హింస చేలరేగింది. అంతేకాకుండా వరుసగా నాలుగు సార్లు అధికారం చేపట్టిన షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై ఈ సారి అక్కడ పోటీ చేయకుండా బ్యాన్ విధించారు. దీంతో అక్కడ అసలు పోటీ ఎవరి మధ్య జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆదేశ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు బంగ్లా రానున్నారు.తరీఖ్ రహమాన్ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. అక్కడే ఉంటూనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ ఛైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 2008లో అవినీతి కారణాలతో ఆయన జైలు శిక్ష అనుభవించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితుల రీత్యా మెరుగైన చికిత్స కోసం లండన్ కెళ్లారు. అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పడడంతో లండన్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని రాజకీయ పరిస్థితుల రీత్యా ఆయన తిరిగి వస్తున్నట్లు సమాచారం.బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని జియారౌ రహమాన్ స్థాపించారు. బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకూ ఆపార్టీ మూడుసార్లు అధికారం సాధించింది. చివరిసారిగా 2001-2006లో ఖలేదా జియా ఆపార్టీ తరపున ప్రధానిగా సేవలంధించారు. ప్రస్తుతం అవామీలీగ్ పోటీలో లేకపోవడంతో బీఎన్పీకి సరైన పోటీ ఇచ్చే పార్టీలు అక్కడ లేవు. -
బీఎన్పీ పారిబా చేతికి షేర్‌ఖాన్
డీల్ విలువ రూ. 2,000 కోట్లు ముంబై : దేశీ బ్రోకరేజి సంస్థ షేర్‌ఖాన్‌ను ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్పీ పారిబా కొనుగోలు చేయనుంది. 100 శాతం ఈక్విటీ వాటాల కొనుగోలుకు సంబంధించి షేర్‌ఖాన్ వాటాదారులతో గురువారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఎన్పీ పారిబా వెల్లడించింది. ఇరు కంపెనీలు డీల్ విలువ గురించి వెల్లడించకపోయినా.. దీని విలువ సుమారు రూ. 2,000 కోట్లు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీఎన్పీ పారిబా పర్సనల్ ఇన్వెస్టర్స్ విభాగంలో షేర్‌ఖాన్ భాగం కానుంది. భారత్‌లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు, బ్రోకరేజి నుంచి పెట్టుబడి సర్వీసులు దాకా అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని బీఎన్పీ పారిబా ఇండియా కంట్రీ హెడ్ జొరిస్ డియర్క్ పేర్కొన్నారు. గతంలో ఎస్‌ఎస్‌కేఐ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేరిట 1995లో షేర్‌ఖాన్ ఏర్పాటైంది. 2000లో సంస్థాగతేతర క్లయింట్లకు బ్రోకరేజి సర్వీసులు ప్రారంభించింది. శ్రీపాల్ మొరాఖియా, శ్రేయాస్ మొరాఖియా ఈ సంస్థను ప్రమోట్ చేశారు. షేర్ఖాన్కి ఖాతాల సంఖ్యాపరంగా 7 శాతం మార్కెట్ వాటా ఉంది. గడిచిన 12 సంవత్సరాలుగా నిలకడగా లాభాలు నమోదు చేస్తోంది. మరోవైపు, రిటైల్, కార్పొరేట్, సంస్థాగత బ్యాంకింగ్ సర్వీసులు అందించే బీఎన్పీ పారిబాకి 75 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 1,85,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2007లో జియోజిత్ సెక్యూరిటీస్‌లో బీఎన్పీ పారిబా 34 శాతం వాటాలు కొనుగోలు చేసింది. అనంతరం సంస్థ పేరును బీఎన్పీ జియోజిత్ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ కింద మార్చింది.


