బంగ్లాదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గత 17 ఏళ్లుగా విదేశాల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు తరీఖ్ రహమాన్ బంగ్లాదేశ్ రానున్నట్లు ప్రకటించారు. ఆయన రాకకోసం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆదేశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రహమాన్ రాక పొలిటికల్ హీట్‌ను పెంచింది.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ అస్థిరత తీవ్రంగా ఉంది. ఇటీవలే రాడికల్ నేత ఉస్మాన్ హాదీ ఎన్నికల ప్రచారంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చారు. ఆయన చికిత్సపొందుతూ మృతిచెందాడు. దీంతో అక్కడ హింస చేలరేగింది. అంతేకాకుండా వరుసగా నాలుగు సార్లు అధికారం చేపట్టిన షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై ఈ సారి అక్కడ పోటీ చేయకుండా బ్యాన్ విధించారు. దీంతో అక్కడ అసలు పోటీ ఎవరి మధ్య జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆదేశ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు బంగ్లా రానున్నారు.
తరీఖ్ రహమాన్ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. అక్కడే ఉంటూనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ ఛైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 2008లో అవినీతి కారణాలతో ఆయన జైలు శిక్ష అనుభవించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితుల రీత్యా మెరుగైన చికిత్స కోసం లండన్ కెళ్లారు. అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పడడంతో లండన్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని రాజకీయ పరిస్థితుల రీత్యా ఆయన తిరిగి వస్తున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని జియారౌ రహమాన్ స్థాపించారు. బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకూ ఆపార్టీ మూడుసార్లు అధికారం సాధించింది. చివరిసారిగా 2001-2006లో ఖలేదా జియా ఆపార్టీ తరపున ప్రధానిగా సేవలంధించారు. ప్రస్తుతం అవామీలీగ్ పోటీలో లేకపోవడంతో బీఎన్పీకి సరైన పోటీ ఇచ్చే పార్టీలు అక్కడ లేవు.


