బైక్‌ కోసం తండ్రిని చంపిన కొడుకు | incident in Regode Medak district | Sakshi
Sakshi News home page

బైక్‌ కోసం తండ్రిని చంపిన కొడుకు

Feb 7 2026 1:06 AM | Updated on Feb 7 2026 1:06 AM

incident in Regode Medak district

మెదక్‌ జిల్లా రేగోడ్‌లో ఘటన 

రేగోడ్‌ (మెదక్‌): బైక్‌ కొనివ్వాలని గొడవ పడి.. ఓ కొడుకు తండ్రిని హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా రేగోడ్‌ పోలీస్‌స్టే షన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై పోచయ్య కథనం మేరకు.. రేగోడ్‌ గ్రామానికి చెందిన షకీర్‌ (51)  కూరగాయలు అమ్ముతూ జీవనం సాగి స్తున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమా రుడు ఉన్నారు. కుమారుడు మహమ్మద్‌ హుస్సేన్‌ కొంతకాలం ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేశాడు.

అయితే ఏడాది నుంచి పని చేయకుండా ఇంట్లో నే ఉంటున్నాడు. ఈ క్రమంలో బైక్‌ కొనివ్వా ల ని, భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించసాగాడు. నెల క్రితం డబ్బుల కోసం తండ్రిపై దాడి చేయగా అతని తలకు గా యమైంది. గ్రామ పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కు దిర్చారు. కాగా, గురువారం రాత్రి ఇంట్లో నిద్ర పోతున్న షకీర్‌ను, కుమారుడు బయటకు లాక్కొ చ్చి కొట్టడంతో తలకు బలంగా గాయాలై షకీర్‌ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఘటనా స్థలా న్ని అల్గాదుర్గం సీఐ రేణుకారెడ్డి సందర్శించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement