‘కరీంనగర్‌లో కాంగ్రెస్‌ చేతులెత్తేసింది’ | BJP MP Bandi Sanjay Takes On Congress | Sakshi
Sakshi News home page

‘కరీంనగర్‌లో కాంగ్రెస్‌ చేతులెత్తేసింది’

Feb 6 2026 9:03 PM | Updated on Feb 6 2026 9:03 PM

BJP MP Bandi Sanjay Takes On Congress

బండి సంజయ్‌(ఫైల్‌ఫోటో)

కరీంనగర్‌: కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతులెత్తేసింవదని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి , బీజేపీ ఎంపీ బండి సంజయ్‌.  కరీంనగర్‌లో కాంగ్రెస్‌ ఓడిపోతుందనే తెలిసే సీఎం రేవంత్‌ ఇక్కడకు రాకుండా పారిపోయారన్నారు. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 6వ తేదీ) కరీంనగర్‌ 10, 11 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్‌ ప్రసంగించారు.  

ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్‌ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. ఎంఐఎంకు మేయర్‌ పదవి ఆఫర్‌ చేశారు.  కేంద్రం నిధులిస్తే.. మేమే తెచ్చామనడానికి కాంగ్రెస్‌ నేతలకు సిగ్గు లేదా?, కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి? , ఢిల్లీ నుండి గల్లీకి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకే ఉంది’ అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement