కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ.. మేడ్చల్‌లో ఉద్రిక్తత | Congress And BRS Clash Leads to Medchal Tension | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ.. మేడ్చల్‌లో ఉద్రిక్తత

Feb 6 2026 3:55 PM | Updated on Feb 6 2026 5:06 PM

Congress And BRS Clash Leads to Medchal Tension

మేడ్చల్‌: కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య మేడ్చల్‌లోని ఆలియాబాద్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మల్లారెడ్డి వాహనం ధ్వంసమైంది. మల్లారెడ్డి అనుచరుడు పరమేష్‌పై డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ అనుచరులు దాడికి దిగారు. 

దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది.  మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు ఒకరికి ఒకరికి ఎదురుపడిన నేపథ్యంలోనే వారి మధ్య ఘర్షణ వాతావారణం చోటు చేసుకున్నట్లు సమాచారం.


 

Advertisement
 
Advertisement
Advertisement