రేవంత్‌కు ఝలక్‌.. ప్రవీణ్‌ కుమార్‌ సంచలన లేఖ | BRS RS Praveen Kumar Wrote Letter To Harvard Kennedy School | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు ఝలక్‌.. ప్రవీణ్‌ కుమార్‌ సంచలన లేఖ

Feb 6 2026 1:29 PM | Updated on Feb 6 2026 1:41 PM

BRS RS Praveen Kumar Wrote Letter To Harvard Kennedy School

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్‌ యూనివర్సిటీకి లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. దీంతో, ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా.. ‘ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేగట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేను ఒక ఈ మెయిల్ పంపించాను. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనన్ని క్రిమినల్ కేసులు (89) ఎదుర్కొంటూ, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికి, దాదాపుగా 50 రోజులు జైలులో గడిపి, ఇప్పుడు సీఎంగా పలు కుంభకోణాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడని, ప్రతి చోటా అభ్యంతరకరమైన భాషను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాడని, ఇలాంటి రాజకీయ నాయకుడు 21వ శతాబ్దానికి పనికిరాడని, ప్రాచీన రాతి యుగంలో కూడా ఇలాంటి నాయకులు ఉండి ఉండరని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈలాంటి ట్రాక్ రికార్డు ఉన్న నాయకులకు హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వడం దేనికి సంకేతం? అని లేఖలో ప్రశ్నించారు. దీంతో, రాజకీయ ఒక్కసారిగా హీటెక్కింది. 

Advertisement
 
Advertisement
Advertisement