బంజారాహిల్స్ : సెంటర్‌లో గురువారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన షీల్డ్–2026 కార్యక్రమానికి నగర సీపీ సజ్జనర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన రోబోతో ఆయన సరదాగా ఇలా కరచాలనం చేశారు. తానూ పోలీసింగ్ చేస్తానని ఆ రోబో అన్నట్లు ఉంది కదూ ఈ చిత్రాన్ని చూస్తే!
ఎలాంటి సమస్య, సందేహం, ఫిర్యాదు ఉన్నా ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా నేరుగా తనను కలవవచ్చని నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ గురువారం ప్రకటించారు.
ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల తర్వాత బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో తాను అందుబాటులో ఉంటానన్నారు.


