మేడారం బుధవారం భక్తజనసంద్రమైంది.. తిరుగువారం పండుగను మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో పూజారులు ఘనంగా నిర్వహించారు. తల్లులకు పూజారులు ధూపదీపాలు వెలిగించి యాటలను నైవేద్యంగా సమర్పించారు. తిరుగువారం పండుగకావడంతో భక్తులు సైతం అధిక సంఖ్యలో∙తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.


