breaking news
Medaram jatara
-
సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)
-
మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)
-
భక్తులను మెచ్చి.. దీవెనలిచ్చి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: వెదురు కర్రలే దైవాలుగా.. గద్దెలే గర్భగుడులుగా.. లక్షలాది మంది భక్తుల పూజలందుకున్న వనదేవతల వనప్రవేశం శనివారం ఆదివాసీ గిరిజన సంప్రదాయాల మధ్యన జరిగింది. వనదేవత.. మన దేవత.. జనదేవత అంటూ అపారవిశ్వాసంతో భక్తుల హృదయాలను ఏకం చేసిన సమ్మక్క–సారలమ్మ మళ్లీ వస్తా మంటూ వనానికేగారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం నుంచి మొక్కులు స్వీకరించిన తల్లులు వారిని మెచ్చి దీవెనలిచ్చి అశేష జనం వీడ్కోలుతో వనప్రవేశం చేశారు. దీంతో పసుపు–కుంకుమలే వజ్రాభరణాలుగా, బెల్లమే నిలువెత్తు బంగారంగా, ఒడిబియ్యమే పరమాన్నంగా, చీర ముక్క–రైక బట్టలే సారెలు గా తల్లులకు సమర్పించే అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవం ముగిసింది. ఫిబ్రవరి 4న బుధవారం తిరుగువారం పండుగతో రెండేళ్లకోసారి జరిగే మహాజాతర ప్రక్రియ పరిసమాప్తం అవుతుంది. ఆదివాసీ సంప్రదాయలతో... పూజారులు ఆదివాసీ సంప్రదాయలతో వన దేవతలను శనివారం సాయంత్రం వనంలోకి తీసుకెళ్లారు. మేడారం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మ వన ప్రవేశం కార్యక్రమం ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది. ఆ దృశ్యం చూసేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవతల వనప్రవేశం కార్యక్రమం శనివారం సాయంత్రం పూజలతో మొదలైంది. ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో గద్దెపైకి చేరుకుని పూజలు చేశారు. సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీరసారె, బంగారం, పసుపు కుంకుమను మేడారం ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు, గిరిజనేతర భక్తులు తీసుకున్నారు. ప్రసాదాన్ని (బెల్లం) తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఒక్కసారిగా గద్దెల ప్రాంగణం అంతా భక్తుల కోలాహలంతో నిండిపోయింది. దర్శనాల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన తర్వాత దేవతల వనప్రవేశ ఘట్టం మొదలైంది. దేవతల వనప్రవేశం ఇలా.. శనివారం సాయంత్రం 5 గంటలకు దేవతల వనప్రవేశం ప్రక్రియ మొదలైంది. మొదట గోవిందరాజులును దబ్బగట్ల గోవర్ధన్, పెనక వెంకటేశ్వర్లు నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల నుంచి సరిగ్గా రాత్రి 7.35 గంటలకు తరలించింది. ఏటూరునాగారం మండలం కొండాయికి అర్ధరాత్రి చేరుకున్నారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును 7.37 గంటలకు పెనక బుచ్చిరాములు నేతృత్యంలో పూజారుల బృందం మేడారం నుంచి మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. మధ్యలో నిద్రచేసి ఆదివారం సాయంత్రం వీరు గమ్యాన్ని చేరుకోనున్నారు. మేడారం గద్దెపై ఉన్న సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిíÙ్ఠంచిన మెంటె (వెదురుబుట్ట)ను 7.48 గంటలకు తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. అనంతరం 7.58 గంటలకు సమ్మక్కను గద్దె నుంచి పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మునీందర్ నేతృత్వంలోని పూజారుల బృందం గద్దె వద్ద పూజలు నిర్వహించి సమ్మక్కను అక్కడి నుంచి కదిలించారు. అక్కడి నుంచి సమ్మక్కను చిలుకలగుట్టకు చేర్చారు. మహా జాతర సందర్భంగా 1.50 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ట్రాఫిక్‌జామ్‌తో ఇబ్బందులు.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మేడారం–తాడ్వాయి, మేడారం–గోవిందరావుపేట వయా నార్లాపూర్ రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు సుమారు 14 గంటలపాటు నిలిచిపోయాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి శుక్రవారం సాయంత్రం వాహనాల్లో బయలుదేరిన భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఆలస్యంగా చేరుకున్న వారు దేవతల వనప్రవేశం తర్వాత సైతం మొక్కులు చెల్లించుకున్నారు. -
వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
మేడారం భక్తులకు నరకం..
సాక్షి, ములుగు: మేడారం జనసంద్రమైంది. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. దీంతో, జాతరకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మేడారం నుండి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 గంటల నుండి భక్తులు వేచి చూస్తున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.మేడారంలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్లో వెళ్లే ప్రైవేటు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు మేడారం బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.మేడారం రూట్ 163 జాతీయ రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్!సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో మేడారం ప్రధాన రహదారి పై భారీ #TrafficJam ఏర్పడింది. గంటలో వెళ్లే జర్నీ నాలుగైదు గంటలు పడుతుండటంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #MedaramJathara pic.twitter.com/4UnSdWH2fr— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) January 31, 2026తల్లుల దర్శనం కోసం కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్‌లు పొందిన భక్తులకు క్యూలైన్లను ఎత్తేయడంతో శుక్రవారం జాతరకు వచ్చిన భక్తులు పాస్‌లు చేత పట్టుకొని క్యూలైన్లు, దర్శనాల కౌంటర్ల కోసం మేడారం వీధుల్లో వెతుకుతూ కనిపించారు. మరికొందరు దర్శనాలు చేసుకోకుండానే మెయిన్ గేటు బయట నుంచే మొక్కులు చెల్లించుకొని తిరుగు పయనమయ్యారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి.భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. శనివారం తల్లుల వన ప్రదేశంతో జాతర పరిసమాప్తం కానున్నది. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే సుమారు 45 లక్షల మందికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రారంభమైంది మొదలు ఇప్పటివరకు మేడారానికి సుమారుగా 1.25 కోట్ల మంది వరకు జనం వచ్చారని అధికారులు తెలిపారు. -
Medaram Jatara: గుండెల నిండుగా మొక్కులు
మేడారం జనసంద్రమైంది.. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క కో..సారక్క కో అంటూ గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తుల పూనకాలతో హోరెత్తింది. పవిత్రమైన మాఘశుద్ధ శుక్రవారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరి ఉండడంతో ఎక్కువ మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం (బెల్లం), ఎదురు కోళ్లు, ఒడిబియ్యం, కొబ్బరికాయలు..తీరొక్క రూపాల్లో భక్తులు పరవశంతో మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మల ప్రసాదం, పసుపు, కుంకుమల కోసం పోటీపడ్డారు. పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో జంపన్నవాగు ప్రాంతం మొత్తం జనంతో కిటకిటలాడింది. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే సుమారు 45 లక్షల మందికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రారంభమైంది మొదలు ఇప్పటివరకు మేడారానికి సుమారుగా 1.25 కోట్ల మంది వరకు జనం వచ్చారని అధికారులు తెలిపారు.జాతర మొదలైన ఈనెల 28నుంచి మేడారానికి భక్తుల రాక బాగా పెరిగింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు, గురువారం రాత్రి సమ్కక్క గద్దెలపైకి చేరారు. నలుగురు వనదేవతలు గద్దెలపైకి చేరే అపురూప ఘడియల కోసం వేచిచూసిన భక్తులు ఆర్దరాత్రి నుంచి దర్శనం కోసం బారులు దీరారు. శుక్రవారం రాత్రి వరకు ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరనాదాలతో వీరంతా వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే శుక్రవారం ఉదయం వరకు భక్తులకు ఇబ్బందులు లేకుండానే దర్శనం జరిగింది. గరిష్టంగా గంటన్నర సమయంలో భక్తులు దర్శనం ముగించుకుని గద్దెల ప్రాంగణం బయటకు వచ్చారు. శుక్రవారం ఉదయం తర్వాత నుంచి వీవీఐపీల రాక మొదలవడంతో భక్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ రాక సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతరలో పదే పదే వీఐపీ ద్వారాల వెంట వెళ్లి దర్శనం చేసుకున్నారు. వీఐపీల కుటుంబాల దర్శనం కోసం పోలీసు కంట్రోల్ రూమ్ వైపు ద్వారాలను తెరిచి పెద్ద సంఖ్యలో పంపించడంతో క్యూలో నిల్చున్న భక్తులకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అధికారులు, సిబ్బంది విధుల్లో భాగంగా భక్తులను క్యూలో పంపడానికి ప్రయత్నించినా... తరచూ వీఐపీల తాకిడి పెరగడంతో వారు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వీఐపీ, వీవీఐపీ పాసులు లేవు లేవంటూనే విచ్చలవిడిగా పలువురు ప్రజాప్రతినిధులు ‘వీవీఐపీ’ స్టిక్కర్లతో రెండు మూడు కార్లలో అనుచరులతో గద్దెల సమీపం వరకు వెళ్లారు. దీంతో భక్తులు గంట నుంచి రెండు గంటలపాటు ఇబ్బంది పడ్డారు. తరచూ సైరన్, కాన్వాయ్‌లతో వీవీఐపీలు పర్యటించిన సందర్భంగా ఇబ్బందిపడిన భక్తులు ఇద్దరు ప్రజాప్రతినిధుల వాహనాలను అడ్డుకుని నిలదీశారు.మేడారం దారిలో ట్రాఫిక్ జామ్.. మేడారం నుంచి తాడ్వాయి, పస్రాలకు వెళ్లే రెండు మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేడారం నుంచి తాడ్వాయి వెళ్లే అటవీ మార్గంలో సుమారు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మేడారం నుంచి నార్లాపూర్ చింతల్‌క్రాస్ నుంచి పస్రాకు, నార్లాపూర్ చెక్‌పోస్టు నుంచి కాల్వపల్లి, కాటారం, మహదేవపూర్, మంథని, నార్లాపూర్ నుంచి బయ్యక్కపేట మీదుగా భూపాలపల్లి మార్గాలలో ప్రైవేట్ వాహనాలు ఇష్టారాజ్యంగా ఎదురెదురు కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు శ్రమించి క్లియర్ చేశారు.నేడు దేవతల వనప్రవేశంవన దేవతల దర్శనం అనంతరం శుక్రవారం రాత్రి నుంచి భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యాహ్నం నుంచే దర్శనం కోసం బారులు దీరిన భక్తులు మొక్కులు సమర్పించుకుంటూ వెనుదిరగడం కనిపించింది. జాతరకు ముందుగా వచ్చి మేడారం చుట్టూ గ్రామాల శివారుల్లో టెంట్లు వేసుకుని, అద్దె గృహాలు, గుడారాల్లో బస చేసిన వీరు.. దర్శనం తర్వాత తరలివెళ్లిపోతుండడంతో ఆ ప్రాంతాలు ఖాళీ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సమ్మక్క–సారలమ్మలు శనివారం సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు. అడవిలో ఉండే వన దేవతలు జనంలోకి వచ్చి నాలుగు రోజులు మొక్కులు అందుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు వనదేవతలను నేటి సాయంత్రం వనంలోకి తీసుకెళ్లనున్నారు. మేడా రం గద్దెలపై ఉండే సమ్మక్క, సారలమ్మలు వనంలోకి.. గోవిందరాజులు, పగిడిద్దరాజును వారి వారి స్థలాలకు తీసుకెళ్లనున్నారు. -
పోలీసులను క్షమాపణ కోరిన కౌశిక్ రెడ్డి
-
రోజులు లెక్కపెట్టుకోండి..!! పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్
-
Medaram : భక్తులకు నో ఎంట్రీ..! పోలీసులు భారీ బందోబస్తు
-
జనారణ్యంగా మేడారం.. 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
సాక్షి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో తాడ్వాయి–మేడారం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు.కోట్లాది భక్తుల ఇలావేల్పు అయినా సమ్మక్క సారాలమ్మ గద్దెల మీదకు రావడంతో మేడారం జనారణ్యం అయ్యింది లక్షలాది భక్తులతో మేడారం పరిసరాల ప్రాంతం కిక్కిరిసిపోయింది. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను అట్టహాసంగా పూజారులు తీసుకురాగా.. గురువారం రాత్రి గద్దెలపైకి సమ్మక్కను తీసుకొచ్చారు అమ్మ వారికి అధికారిక లాంఛనాలతో మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. శుక్రవారం.. లక్షలాది భక్తులు.. సమ్మక్కసారాలమ్మల దర్శనం కోసం బారులు తీరారు. -
సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)
-
పోలీసులతో సీతక్క డాన్స్
-
వరాలిచ్చే వనదేవతలు.. 2 కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ
-
జన సంద్రంగా మారిన మేడారం.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతర నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. శుక్రవారం వేకువ జామున సమక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో వేలాది వాహనాలు తరలి వస్తుండగా.. కిలోమీటర్ల మేరన ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేడారం వీధులన్నీ సమక్క, సారలమ్మ నామఃస్మరణలతో మారుమోగుతోంది. తమను, తమవాళ్లను చల్లంగా చూడాలంటూ వన దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకోంటున్నారు. రేపు సాయంత్రం సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఈ నేపథ్యంలోఈ రెండ్రోజుల్లో లక్షల మంది జాతరకు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. వీఐపీల తాకిడి..మేడారం మహాజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తులాభారం వేసి తల్లులకు నిలువెత్తు బంగారం(బెల్లం) పంచిపెడుతున్నారు. తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.పోలీసుల ఓవర్ యాక్షన్వీఐపీ భద్రత పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఉదయం నుంచి స్పెషల్ గేట్ ద్వారా వందలాది పోలీసులు సమ్మక్క- సారలమ్మ గద్దెల వైపు వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తల్లుల దర్శనం కావడం లేదు. గద్దెల ప్రాంగణమంతా పోలీసులే ఉండడంతో.. అడ్డు తొలగాలని స్థానిక అధికారులు పదే పదే మైకుల్లో చెప్తున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. వీఐపీలు అరకోరగా వస్తున్నప్పటికీ.. వాళ్ల భద్రత పేరిట పోలీసులు అతికి దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సమ్మక్క తల్లి నామస్మరణతో..చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే జాతర ప్రధాన ఘట్టం గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై.. రాత్రి 9:58గంటలకు గద్దెపై సమ్మక్క తల్లిని ప్రతిష్ఠించే వరకు ఉద్విగ్నభరితంగా సాగింది. అడవి తల్లి రాక కోసం భక్తులంతా కన్నార్పకుండా చిలకలగుట్ట వైపు చూశారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కతల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక్క ఉదుటున గుట్ట దిగారు. మిగిలిన పూజారులు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా, అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏకే–47 తుపాకీతో 4 విడతలుగా గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. -
మేడారంలో కేంద్రమంత్రుల పూజలు.. రాష్ట్ర మంత్రుల వినతి ఇదే..
సాక్షి, మేడారం: మేడారం మహాజాతరలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. సమక్క నేడు వనం నుండి జనం మధ్యకు రానుంది. తల్లి రాక సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు.. మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రమంత్రులు కూడా మేడారం జాతరలో పాల్గొన్నారు.మేడారం మహా జాతరలో కేంద్ర మంత్రులు జుయల్ ఓరమ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారలమ్మని దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించారు. మరోవైపు.. రాష్ట్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క, లక్ష్మణ్ కూడా మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రులు జుయల్ ఓరమ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు వినతిపత్రం సమర్పించారు.ఇదిలాఉండగా.. మేడారం జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడినుండి గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. సారలమ్మను కాక వంశీయుల చేతుల మీదుగా తీసుకురాగా.. సమ్మక్కను సిద్దబోయిన వంశీయుల చేతుల మీదుగా గద్దెల పైకి తీసుకొస్తారని తెలిసిందే. ఈ కార్యక్రమంలో చందా వంశీయులు, ఐదు వంశస్తులు, మేడారం గ్రామస్తులతో పాటు ఆదివాసీలు అంతా పాల్గొని డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సంప్రదాయాలతో సమ్మక్కను ఉత్సాహంగా, ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.సమ్మక్క రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ. జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా డిప్యుటీ సీఎం భట్టి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పూజారులకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రి సీతక్క అన్నీ తానై జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
మేడారం జాతరలో నేడు కీలక ఘట్టం
రెండేళ్లకొకసారి.. లక్షలాదిమంది భక్తులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మేడారం మహాజాతరలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. సమక్క నేడు వనం నుండి జనం మధ్యకు రానుంది. తల్లి రాక సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే గడియలు వచ్చేశాయి. నిన్న రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయ్యింది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి కన్నేపల్లి నుంచి సారలమ్మ ను, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజు ప్రతిరూపాలను కాలి నగడకన తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మంత్రి సీతక్క, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ సారలమ్మకు స్వాగతం పలికారు.ఇక ఈ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడినుండి గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. సారలమ్మను కాక వంశీయుల చేతుల మీదుగా తీసుకురాగా.. సమ్మక్కను సిద్దబోయిన వంశీయుల చేతుల మీదుగా గద్దెల పైకి తీసుకొస్తారని తెలిసిందే. ఈ కార్యక్రమంలో చందా వంశీయులు, ఐదు వంశస్తులు, మేడారం గ్రామస్తులతో పాటు ఆదివాసీలు అంతా పాల్గొని డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సంప్రదాయాలతో సమ్మక్కను ఉత్సాహంగా, ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు..సమ్మక్క రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ. జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా డిప్యుటీ సీఎం భట్టి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పూజారులకు స్వాగతం పలుకుతారు..సమ్మక్క ఆగమనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రి సీతక్క అన్నీ తానై జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ సమ్మక్కను గద్దెల పైకి తీసుకు రావడం కోసం మూడంచెల పోలీసు భద్రతతో ప్రత్యేక రోప్ పార్టీని సిద్ధం చేశారు. ఇప్పటికే రెండుసార్లు మాక్ డ్రిల్ నిర్వహించారు.ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే మేడారం పరిసరాలన్ని జనంతో కిక్కిరిసిపోయాయి. చుట్టూ పది కిలోమీటర్ల నిడివితో ఎటు చూసినా మేడారం వనం మొత్తం జనసంద్రంగా మారిపోయింది. వివిధ మార్గాల్లో మేడారం చేరుకున్న భక్తులంతా సమ్మక్క ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు.. సమ్మక్క - సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు దీరిన తర్వాత మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం అవుతారు. -
తెలంగాణ కుంభమేళా.. పోటెత్తిన భక్తులు
-
ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)
-
మేడారం జాతరలో విషాదం
ములుగు: మేడారంలో విషాదం చోటు చేసుకుంది. జంపన్నవాగులో పడి భక్తుడు మృతి చెందాడు. మృతుడు మంచిర్యాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు భూపాలపల్లి జిల్లాలో మేడారం జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడిన భక్తుల్ని ఆస్పత్రికి తరలించారు.భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం బోర్లగూడెం గ్రామం సమీపంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లేందుకు ఒక ట్రాక్టర్లో 25 మందికి పైగా భక్తులు ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్ నియంత్రణ కోల్పోయి బోల్తా పడటంతో తల్లి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.మెదారం జాతరకు ప్రతి రెండేళ్లకోసారి లక్షలాది మంది భక్తులు తరలివెళ్తారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, వ్యక్తిగత వాహనాల్లో బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాక్టర్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణించరాదని అధికారులు సూచించారు. -
మేడారం మహాజాతర పండుగ ప్రారంభం (ఫొటోలు)
-
జనసంద్రంగా మేడారం.. భారీగా ట్రాఫిక్‌జామ్
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు సాగే సంరంభంలో.. ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టించడంతో అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం సమక్క గద్దె మీదకు చేరనుంది. జాతర నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకే లక్షల మంది జాతరకు తరలి వస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్త జనంతో కిక్కిరిసిపోయింది. జాతర మొదలు కావడంతో ఒక్కసారిగా పోటెత్తారు. ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, బస్సులు.. ఇలా వాహనాల్లో తరలి వస్తున్నారు. దీంతో బుధవారం వేకువ జామున సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇటు జంపన్న వాగు వద్ద ఇసుకేస్తే రాలని జనం కనిపిస్తున్నారు. మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి బుధవారం మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మను భక్తకోటి దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జనదేవతల వనప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది.నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో మేడారం వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లే.. మహోత్తర ఘట్టానికి తగ్గట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మహా జాతర నేపథ్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. 13వేల మంది పోలీసులు, 42వేల మంది వివిధ శాఖల అధికారులతో జాతర నిర్వహణ జరగనుంది.రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల పదికిలోమిర్ల పరిధిలో తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, వీధిదీపాల ఏర్పాటు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పండుగైన మేడారం గిరిజన జాతరను మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇటు వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి జాతరకు సుమారు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేటి నుంచే మేడారం మహాజాతర
సాక్షి ప్రతినిధి, వరంగల్ /మహబూబాబాద్: తెలంగాణ కుంభమేళా, ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర అసలు ఘట్టం కొన్ని గంటల్లో మొదలు కానుంది. కోరిన కోర్కెలు తీర్చే వనదేవత సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువుదీరనుంది. మేడారం సమీపంలోని కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేకంగా మొక్కు లు చెల్లించారు. పూజారులు ఆదివాసీ సంప్రదాయ ప్రకారం సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచి మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చే లోపు ఏటూరునాగారం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. మేడారం బయల్దేరిన పగిడిద్దరాజు సమ్మక్కను వివాహం చేసుకునేందుకు పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పెళ్లి కుమారుడిగా ముస్తాబై మంగళవారం మేడారం బాటపట్టారు. అత్తగారిల్లు మేడారం వెళ్లేందుకు సమ్మక్క వంశీయులు పగిడిద్దరాజు వంశమైన పెనక వంశీయులకు పసుపు, కుంకుమ ఇస్తారు. దీన్ని తీసుకొని వారు పూనుగొండ్లకు బయల్దేరుతారు. ఇదే సమయంలో పూనుగొండ్లలోని పెనక వంశీయులైన వెంకటేశ్వర్లు ఇంట్లో ఉన్న పూజా సామగ్రి, పానుపు, పడిగెలను శుద్ధి చేశారు. అనంతరం (నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, మువ్వలు) సిద్ధం చేసి తళపతి ఇంట్లో పెనక వంశీయులు ప్రధాన పూజారి రాజేశ్వర్, బుచ్చిరాములు, పురుషోత్తం, రాహుల్, వెంకటేశ్, సురేందర్, సమ్మయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసీ సంప్రదాయంలో మొక్కులు సమర్పించి దేవునిగుట్ట నుంచి వనం (వెదురు చెట్టు) తీసుకుని గ్రామ పొలిమేరలో పడిగెను కలిపి ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొచ్చారు. వనాన్ని తాకితే మంచి జరుగుతుందనే నమ్మకం. దీంతో భక్తులు వనాన్ని తాకడానికి పోటీ పడ్డారు. పగిడిద్దరాజును తీసుకెళ్లేందుకువచ్చిన మంత్రి, అధికారులు సమ్మక్క తరçఫున గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతోపాటు మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్ సుకన్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణి, సమ్మక్క వంశీయులు పూనుగొండ్లకు వచ్చారు. తంతు ముగిశాక మేడారానికి పగిడిద్దరాజు (ప్రతిమ)ను తీసుకొని కాలి నడకన మేడారం బయల్దేరారు. మంగళవారం రాత్రి వరకు కర్లపల్లి లక్ష్మీపురం గ్రామంలో బస ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం రాళ్లవాగులో స్నానం చేసి సాయంత్రానికి మేడారం చేరుకోనున్నారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం తీసుకొచ్చే వేడుకను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం భక్తులతో నిండిపోనుంది. శనివారం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.జాతరను వైభవంగా జరుపుకొందాంసాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతరను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకలుగా కొలిచే సమ్మక్క–సారలమ్మ జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోటిన్నర మందికిపైగా భక్తులు తరలివచ్చే జాతరకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘనంగా ఏర్పాట్లు చేసి నిధులు వెచ్చించామని తెలిపారు. రూ. 250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతోపాటు సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను విశాలంగా నిర్మించామన్నారు. లక్షలాదిగా నిరంతరం మేడారం తరలివస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. కోటిన్నర మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం ఫోన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, 13 వేల మంది పోలీసులతో జాతర భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మేడారాన్ని సుమారు 45 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచే మేడారం భక్తజనంతో కిక్కిరిసింది. -
Medaram Jatara: ఎడ్లబండి నుంచి హెలికాప్టర్..
ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: కీకారణ్యంలో కొలువై ఉన్న వనదేవతలను దర్శించుకునేందుకు నాడు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకొని రెండు రోజుల ముందే మేడారం జాతరకు బయలుదేరేవారు. గ్రామాల్లో ఎడ్లబండ్ల చక్రాలు, బండికానీలకు రంగులు వేసి, ఎడ్ల కొమ్ములకు రంగురంగుల రిబ్బన్లను చుట్టి ముస్తాబు చేసేవారు. ఎడ్లబండిని గుడారంగా తయారు చేసుకునే బయలుదేరేవారు. ఎడ్లకు సైతం కావాల్సినంత ఎండుగడ్డి మోపును బడిలో వేసుకొని వచ్చేవారు. చెట్లే గుడారాలు..అడవిమార్గంలో జాతరకు వెళ్లే భక్తులు చెట్లనే గుడారాలుగా మల్చుకొని అక్కడే విడిది చేసేవారు. స్థానిక అడవుల్లో లభించే వెదురు కర్రలతో బండ్లకు పందిళ్లను వేసుకొని చీరలను అడ్డుగా కట్టుకునేవారు. జంపన్నవాగు, చిలకలగుట్ట, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్, పడిగాపూర్, ఎలుబాక, మేడారం ప్రాంతాల్లోనే బస చేసేవారు. అడవి మార్గంలో మేడారానికి.. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు అడవిమార్గంలో ఎడ్ల బండిలో పిల్లాపాపలతో కలిసి కుటుంబ సమేతంగా ప్రయాణం సాగించేది. రాత్రి వేళ అడవుల్లో నెగడ్లు పెట్టుకొని అక్కడ బస చేసి తెల్లవారి మేడారానికి బయలుదేరేవారు. మంగళవారం సాయంత్రానికి జంపన్నవాగుకు చేరుకొని అక్కడ స్నానాలు, తలనీలాలను సమర్పించి నిద్రచేసేవారు. తెల్లారి బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్కను దర్శించుకొని మొక్కులు చెల్లించేది. ఆరోజు రాత్రి ఇక్కడ నిద్ర చేసి శుక్రవారం రాత్రి బయలుదేరి వారి గ్రామాలకు బయలుదేరేవారు.ఇంటికాడి నుంచే యాటపోతు, నాటు కోళ్లుఎడ్ల బండిలో బయలుదేరిన భక్తులు ఇంటి నుంచి యాటపోతులు, నాటుకోళ్లు, ఆహారం పదార్థాలు, వంట పాత్రలు, నీటి బుర్రలతో జాతరకు వచ్చేవా రు. అడవిలో విడిది చేసి సారలమ్మ వచ్చిన రోజు యాట పోతులను కోసి అమ్మవారికి మొక్కు చెల్లించేవారు. తిరుగు ప్రయాణం శుక్రవారం కోడి కొసుకొని చల్లంగా చూడు తల్లి అని పయనమయ్యేవారు. తంబి హెలికాప్టర్ సేవలు..ఎడ్లబండి నుంచి మారుతున్న కాలానికి అనుగుణంగా భక్తులు హెలికాప్టర్లో సైతం మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఆ కాలంలో రెండు రోజుల ప్రయాణం చేసిన భక్తులు ఇప్పుడు హెలికాప్టర్లో 45 నిమిషాల నుంచి గంటలోపు అమ్మవార్లను దర్శించుకొని మేడారం ఏరియల్ సర్వే చేసి తిరుగు ప్రయాణం అవుతున్నారు. హెలికాప్టర్లో వచ్చిన భక్తులకు ప్రత్యేక దర్శనం చేయిస్తున్నారు. అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఖర్చు ఎక్కువ అయినప్పటికీ భక్తులు సౌకర్యాలపై మొగ్గు చూపుతున్నారు. దాంతో తంబి హెలికాప్టర్ సర్వీస్‌లను కొనసాగిస్తోంది.కాలినడక నుంచి కార్ల వరకు..మేడారం జాతరకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల భక్తులు ఒక రోజు ముందు సద్దికట్టుకొని జాతరకు చేరుకునేవారు. కోడి కూయగానే ఇంటివద్ద స్నానాలను చేసుకొని కాలినడకన అడవి మార్గం, ఎడ్లబండ్ల దారుల నుంచి నడుచుకుంటూ మేడారం జాతరకు చేరుకునేవారు. వచ్చే దారిలో చీకటి పడితే ఆ ఇంటి వద్ద ఒక కునుకు తీసి మళ్లీ ప్రయాణాన్ని సాగించేవారు. తెచ్చుకున్న సద్దిమూటలే తిని సేద దీరేవారు. అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణాలు జరగడంతో అనేక మంది భక్తులు వాహనాలు, కార్లు, బైక్‌లపై మేడారానికి తరలివస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గోదావరి నదిని పడవల ద్వారా దాటేవారు. ఎడ్లబండ్లను కాలిరేవు ఉన్న గోదావరి నీటిలో నుంచి దాటించేవారు. అలా వారి ప్రయాణం సాగేది. ఇప్పుడు గోదావరి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించడంతో అనేక మంది భక్తులు వాహనాల్లో తరలివస్తున్నారు. దీంతో ప్రయాణ మార్గం సులభతరంగా మారింది.రెండు రోజుల ప్రయాణం..మేడారం జాతరకు ఎడ్లబండిలో రెండు రోజుపాటు ప్రయాణం చేసే వాళ్లం. జాతర ముగిసే వరకు అక్కడే వండుకొని తినే వాళ్లం. అడవి మార్గంలో వెళ్లే వాళ్లం. అందరం కలిసి ఉంటూ వనదేవతలను దర్శించుకొని తిరుగు ప్రయాణం చేసేది. అప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా సంతోషంగా గడిపేవాళ్లం. – బలభద్ర రవీందర్, ఏటూరునాగారం -
Medaram Jatara 2026 : మేడారం జాతరలో భారీ భక్తుల రద్దీ (ఫొటోలు)
-
మేడారం జాతరలో పగులుతున్న తలలు
-
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలనుంచి వచ్చి వెళ్లే వారి కోసం కాజీపేట, వరంగల్ మీదుగా, కాజీపేట, వరంగల్ నుంచి జన్ సాధా రణ్ అన్‌రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. » ఈ నెల 28, 30, ఫిబ్రవరి 1వ తేదీల్లో సికింద్రాబాద్–మంచిర్యాల (07495) వెళ్లే ఎక్స్‌ప్రెస్, జనవరి 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో మంచిర్యాల–సికింద్రాబాద్ (07496) వెళ్లే ఎక్స్‌ప్రెస్, జనవరి 29, 31వ తేదీల్లో సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ (07496) వెళ్లే ఎక్స్‌ప్రెస్, జనవరి 29, 31 తేదీల్లో సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ (07497) వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకొని వెళ్తాయి. ఈ రైళ్లకు మౌ లాలి, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘన్పూర్, పెండ్యాల్, కాజీపేట, వరంగల్, హసన్‌పర్తి, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట్‌లో హాల్టింగ్ కల్పించారు. » ఈ నెల 28 నుంచి 31 తేదీల్లో నిజామాబాద్–వరంగల్ (07499) వెళ్లే ఎక్స్‌ప్రెస్, 28 నుంచి 31 తేదీల్లో వరంగల్–నిజమాబాద్ (07500) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లకు కామారెడ్డి, అక్కన్నపేట, మిర్జాపల్లి, వాడిరామ్, మనోహరాబాబాద్, మేడ్చల్, బొల్లారం, మౌలాలి, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, వంగపల్లి, ఆలేరు, జనగామ, రఘునాథ్ పల్లి, ఘన్పూర్, పెండ్యాల్, కాజీపేటలో హాల్టింగ్ కల్పించారు. » ఈ నెల 28 నుంచి 31 తేదీలలో కాజీపేట–ఖమ్మం (07504) వెళ్లే ఎక్స్‌ప్రెస్, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఖమ్మం–కాజీపేట (07503) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లకు వరంగల్, చింతల్‌పల్లి, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, గార్ల, డోర్నకల్, పాపట్‌పల్లి, మల్లెమడుగులో హాల్టింగ్ కల్పించారు. » ఈ నెల 28వ తేదీన ఆదిలాబాద్–కాజీపేట (07501) వెళ్లే ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన కాజీపేట–ఆదిలాబాద్ (07502) ఎక్స్‌ప్రెస్‌లకు అంబరి, కిన్వాట్, ధనోరా దక్కన్, సహస్రకుండ్, హిమాయత్‌నగర్, హడ్గాన్రోడ్, బోకర్, ముధ్కెడ్, ఉమ్రి, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, మోర్తాడ్, మెట్పల్లి, కోరుట్ల, లింగంపేట్ జగిత్యాల, గంగాధర, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, కొలనూర్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తిలో హాల్టింగ్ కల్పించారు. -
మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)
-
మేడారం మహా జాతరకు హెలికాప్టర్ సేవలు
-
మేడారం భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, ములుగు: తెలంగాణలో మేడారం జాతరకు భక్తులకు శుభవార్త. రేపటి నుండి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో రానున్నాయి. టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను ములుగులో మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.వివరాల మేరకు.. తెలంగాణ టూరిజం శాఖ మేడారంలో భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాడ్వాయి మండలం ఎలుబాక నుండి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు హెలికాప్టర్ నడపనున్న టూరిజం శాఖ తాజాగా తెలిపింది. టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను మంత్రి సీతక్క రేపు ప్రారంభించనున్నారు. కాగా, ఒక్కరికి 5000 వేల రూపాయలు చార్జీతో ఏడు నిమిషాలు హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ వీక్షించే అవకాశం కల్పించారు. -
మేడారం జాతర మొక్కు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు!
'కమిటీ కుర్రోళ్లు', 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమాల్లో హీరోయిన్గా చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి టీనా శ్రావ్యపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మేడారం జాతరకి వెళ్లిన ఈమె.. మొక్కు చెల్లించుకోవడమే దీనికి కారణం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర.. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు అంటే నాలుగు రోజుల పాటు భారీ ఎత్తున జాతర జరగనుంది. దీనికి లక్షలాది మంది భక్తులు రానే వస్తారు. అయితే జాతరకు రెండు వారాల ముందు నుంచే మేడారంలో ఆచార వ్యవహారాలు మొదలవుతాయి. చాలామంది తమ బరువంతా బెల్లం(బంగారాన్ని)ని దేవతలకు మొక్కుగా చెల్లిస్తారు.టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య కూడా ఇలానే తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చోబెట్టి.. సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియోపై సోషల్ మీడియలో డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు ఈమె చేసిన పనికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. భక్తులు, ఆదివాసీ దేవతలను అవమానించడమేనని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీనా తల్లి మాత్రం మొక్కులో భాగంగానే ఇలా చేశామని సమర్థించుకున్నారు.(ఇదీ చదవండి: 14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్) View this post on Instagram A post shared by Teena sravya.kundoju (@teena_sravya_mom) -
పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన మేడారం ప్రాంగణం
సాక్షి, ములుగు: మహా జాతరకు సమయం దగ్గర పడుతున్న వేళ.. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం మండమెలిగే పండుగ కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ పండుగతోనే మహాజాతర పూజా కార్యక్రమాల తంతు మొదలు కానుందని తెలిసిందే.మేడారంలోని సమ్మక్క గుడిలో, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో, ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో కొలువైన గోవిందరాజుల గుడిలో ఇవాళ మండమెలిగె పండుగను ఆదివాసీల ఆచార, సంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామస్థులు దిష్టి తోరణాలను కట్టి గ్రామాన్నంతా అష్టదిగ్బంధనం చేస్తారు. పూర్వం ప్రస్తుతం ఉన్న గుడుల స్థానాల్లో గుడిసెలుండేవి. జాతర నిర్వహించే సమయానికి అవి పాతపడడంతో ఆదివాసీ పూజారులు అడవికి వెళ్లి మండలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుళ్లు నిర్మించేవారు. అలా గుడిమెలిగే.. జాతరకు వారం ముందు మండ మెలిగే పండుగ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే సమక్క-సారలమ్మ మహా జాతర.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతర తొలిరోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈసారి జనవరి 28 నుండి 31 వరకు జరగనున్నాయి. ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో.. 50 శాతం అదనపు ఛార్జీలు..మహా జాతర నేపథ్యంలో.. ఈ నెల 25 నుంచి మేడారానికి స్పెషల్ బస్సులను నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాలు యధావిధిగా కొనసాగనున్నాయి. అయితే.. వన్‌వే బస్సులు నిండుగా వెళ్తాయి కాబట్టి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు అదనంగా వసూలు చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలియజేశారు. రాష్ట్రం నలమూలల నుంచి మేడారం వైపు మొత్తం 4 వేల బస్సులను తిప్పుతామని.. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి 51 స్పెషల్ పాయింట్స్ ఉంటాయని తెలిపారాయన. మేడారం వద్ద ఆర్టీసీ బస్సుల కోసం 50 క్యూ లైన్స్.. ఒకేసారి వెయ్యి బస్సులు పార్కింగ్ చేసేలా వసతులు కల్పించారు. మొత్తం 10 మంది సిబ్బంది మేడారం జాతర నేపథ్యంలో పని చేస్తారని అన్నారాయన. -
మేడారంలో అడుగడుగునా నిఘా కెమెరాలే
ములుగు/ఏటూరునాగారం/తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునే భక్తులకు పటిష్టమైన పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు ఈ జాతరలో ఏఐ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. సక్సెస్ సీసీటీవీ సేల్స్ అండ్ సరీ్వస్ నిర్వాహకుడు వాసాల మహేశ్ ద్వారా పోలీసులు ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను (ఏఎన్పీఆర్) పదిచోట్ల అమర్చారు. భక్తుల రద్దీ, తొక్కిసలాట, ప్రమాదాలను ముందే హెచ్చరించి పోలీసులు, వలంటీర్లను అలర్ట్ చేస్తారు.మేడారం జాతరకు వచ్చే ప్రత్యేక రహదారుల వద్ద వీటిని అమర్చారు. ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో మేడారం గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చి 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. డీజీపీ, ఐజీ, డీఐజీలతోపాటు ఎస్పీలు సైతం ఈ కంట్రోల్ రూమ్ ఆధారంగా ప్రతినిత్యం పర్యవేక్షణ చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. కెమెరాల పనితీరు, పర్యవేక్షణను అధికారులు ఆయనకు వివరించారు. ఎన్పీఆర్ కెమెరాలు ఎక్కడెక్కడ అంటే... సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద రెండు, చిన్నబోయినపల్లి, కామారం ఆర్చి, బయ్యక్కపేట, పస్రా, ములుగు, కాల్వవల్లి, మేడారం జంపన్నవాగు వద్ద, బస్టాండ్ ప్రాంతాల్లో ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలు వాహనాల నంబర్లు, వాహనాలు, ప్రజలు ఎక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో ముఖచిత్రాలు చిత్రీకరిస్తాయి. ప్రతి వ్యక్తి ముఖచిత్రం, వీడియోలు రికార్డు అవుతాయి. రాత్రివేళలో సైతం రికార్డు అవుతుంది. ప్రతీ వాహన నంబర్ ప్లేట్ కూడా రికార్డు చేయడం దీని ప్రత్యేకత. దీని ఆధారంగా వాహనాలు ఎంట్రన్స్, ఎగ్జిట్ ఎన్ని అవుతున్నాయి.. ఎంతమంది భక్తులు వచ్చిపోతున్నారో రోజువారీగా లెక్క తెలుస్తుంది. హీలియం బెలూన్లలో 4 డ్రోన్ కెమెరాలు జాతరకు కొంతమంది దొంగలు, అపరిచిత వ్యక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వారిని గుర్తించడానికి ఈసారి హీలియం బెలూన్లను నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటిలో డ్రోన్ కెమెరాలను అమరుస్తున్నారు. ఈ డ్రోన్ల ద్వారా అప్పటికే సర్వర్‌లో అనుమానిత, అపరిచిత వ్యక్తుల వివరాలను పొందుపర్చారు. భూమి నుంచి 300 మీటర్ల ఎత్తులో ఈ హీలియం బెలూన్ డ్రోన్ కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలు అపరిచిత వ్యక్తులు, దొంగలు రాగానే పసిగట్టి ఫొటో తీసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అతడి ముఖచిత్రాన్ని పంపిస్తుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. రద్దీ ప్రాంతాల్లోనూ... అధిక రద్దీ ఉన్న ప్రాంతాలు, వివరాల సేకరణ, ట్రాఫిక్, పార్కింగ్ మానిటరింగ్లతోపాటు డ్రోన్ల కంటే ఎక్కువ సమయం ఒకే స్థలంలో నిలిచే సామర్థ్యం ఈ హీలియం బెలూన్ కెమెరాలకు ఉంది. మేడారం జాతర భక్తుల విడిదికి అటవీ ప్రాంతాలు ఉండడంతో హీలియం బెలూన్ కెమెరాలు కంట్రోల్ రూమ్‌కు నిరంతరం లైవ్ ఫీడ్ ఇస్తాయి. దీంతో భద్రత, నిర్వహణ మరింత సమర్థవంతంగా గుర్తించే ఆస్కారముంది. ఇవేకాకుండా పీటీజెడ్ కెమెరాలు 30 ప్రాంతాల్లో అమర్చారు. ఈ కెమెరాలు 360 డిగ్రీల చుట్టూ తిరిగి చిత్రీకరిస్తాయి. సాధారణమైన ఫోర్ మెగా పిక్సల్ కెమెరాలు 450 అమర్చారు. ఇలా కెమెరాలు అమర్చడంతో ఒక్కో కెమెరా చేసే పని వందమంది పోలీసులకు సమానంగా ఉంటుంది. జాతరలో ఎటు చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో పర్యవేక్షణ సులభతరంగా మారింది. జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ జాతరకు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న క్రమంలో భక్తులెవరూ తప్పిపోకుండా చర్యలను చేపడుతున్నారు. గత జాతరలో దాదాపు 30 వేల మంది వరకు తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’వ్యవస్థను తీసుకొస్తున్నారు. వొడాఫోన్–ఐడియా సహకారంతో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. పస్రా, ఎస్ఎస్ తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్‌లను కడతారు. దీంతో వారు ఎవరైనా తప్పిపోయినా ఈ ట్యాగ్‌ను స్కాన్ చేయటం ద్వారా వారి పూర్తి వివరాలు తెలుస్తాయి. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేయటానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. -
మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
-
ముస్తాబైన మేడారం.. పోటెత్తిన భక్తులు
-
మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు
హైదరాబాద్ : ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి దాదాపు మూడు కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్షణ్ కుమార్, దనసరి అనసూయలు అన్నారు. మేడారం జాతరపై నేడు డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర గిరిజన, ఎస్సి సంక్షేమ, ... శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్, రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ (సీతక్క) లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ మాట్లాడుతూ, గత 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, ఈసారి 2026 లో జాతరకు దాదాపు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని వివరించారు. సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మహాజాతరను విజయవంతంగా నిర్వహించడం ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకుని, ఏ చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు.దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ జాతరకు రూ.150 కోట్లకుపైగా నిధులు కేటాయించి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ నిధులతో మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి, జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్ మ్యాప్‌లతో పాటు అవసరమైన చోట వన్‌వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. ఈ జాతరపై క్యాబినెట్ మొత్తం ప్రత్యేక దృష్టి సారించిందని, మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇలాంటి స్థాయి సమిష్టి పర్యవేక్షణ గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు.తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖ కార్యదర్సులు, హెచ్.ఓ.డీ లతో ప్రత్యేకంగా వాట్స్-అప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీతక్క సూచించారు. శానిటేషన్, తాగునీరు, రవాణా, భద్రతాలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని, ప్రధానంగా టాయిలెట్ లను మరింత పెంచాలని కోరారు. జాతర సందర్భంగా గురు, శుక్ర వారాల్లోనే ప్రతి రోజు కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మేడారం జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2010 నుండి ప్రతీ సంవత్సరం వస్తున్నారని, వచ్చే వందేళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని సీతక్క గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు మాట్లాడుతూ, జాతర నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నందున అన్ని శాఖల ఉన్నతాధికారులు జాతర పనులకు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సాధించాలని పేర్కొన్నారు. జాతర సందర్బంగా భక్తులకు చేసిన ఏర్పాట్లు, రవాణా, ఇతర సౌకర్యాలు, భక్తులు పాటించాల్సిన సూచనలపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని అందించాలని తెలిపారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకుగాను డ్రోన్ లను ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా, జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూ.ఆర్ కోడ్ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు. ఈ సందర్బంగా, మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతి పై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్ కుమార్, సి.ఎస్ రామకృష్ణ రావు లు ఆవిష్కారించారు. -
‘మేడారం’ ప్రత్యేక బస్సుల్లో చార్జీలు 50 శాతం అదనం
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు ఈసారి ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల్లో చార్జీలు 50 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నందున, గతంతో పోలిస్తే బస్సుల సంఖ్య పెంచాలని భావించినా వాటి లభ్య త సమస్యగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న బస్సులను తిప్పాలని నిర్ణయించింది. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. దాన్ని వినియోగించుకోవటం ద్వారా సాధారణ చార్జీలను అంతమేర పెంచాలని నిర్ణయించింది. ‘ప్రత్యేకం’లోనూ మహిళలకు ఉచితమే.. జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. గత జాతర సమయంలో 3,491 ప్రత్యేక బస్సులను నడిపితే అవి కీలక సమయాల్లో సరిపోలేదు. కొంత నిర్వహణ లోపాల వల్ల ఆర్టీసీ బస్సులను భక్తులు వాడుకోలేకపోయారు. వెరసి ఇబ్బందులు ఎదురయ్యాయని సంస్థ గుర్తించింది. దీంతో ఈసారి అంతకంటే ఎక్కువ బస్సులు నడపాలని నిర్ణయించింది. కానీ, బస్సుల సర్దుబాటు కష్టంగా మారటంతో ప్రస్తుతానికి 3,495 బస్సులను సిద్ధం చేసుకుంది. అవసరమైతే మరికొన్నింటిని సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది.ఈ బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి నడుస్తాయి. వీటిల్లో సాధారణ చార్జీకి 50 శాతం అదనపు మొత్తాన్ని జోడించి వసూలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్) వసతి ఉన్నందున మహిళా ప్రయాణికులకు ఈ నిర్ణయం భారం కాబోదు. కానీ, పురుష ప్రయాణికుల జేబులపై మాత్రం భారం పడనుంది. వీఐపీ పాస్‌లను నియంత్రించాల్సిందే... గత జాతర సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బడి ముబ్బడిగా వీఐపీ పాస్‌లు జారీ చేశారు. ఒకే సమయంలో ఎక్కువ మంది వీఐపీలు రావటం, వారి వాహన శ్రేణి జాతర వరకు అనుమతించడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. ఆయా సమయాల్లో పోలీసులు ఆర్టీసీ బస్సులను లోనికి అనుమతించలేదు. దీంతో బస్సులు శివారు ప్రాంతాల్లోనే నిలిచిపోయి సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈసారి ఆ పరిస్థితి రాకుండా, పాసుల జారీని నియంత్రించాలని ఆర్టీసీ అధికారులు ములుగు జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. వచ్చే వీఐపీలు కూడా ఒకే సమయంలో రాకుండా నియంత్రించాలని కూడా కోరారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేసి భక్తులకు ఇబ్బంది రాకుండా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. -
మేడారం జాతర షురూ.. పోటెత్తిన భక్తులు
-
దటీజ్ కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం వెళ్లింది. ఆ సమయంలో ఆయన పలకరింపు మహిళా మంత్రులనూ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనే చర్చ నడుస్తోంది. ‘‘బాగున్నారా అమ్మా..’’ అంటూ కొండా సురేఖను, సీతక్కలను ఆత్మీయంగా పిలిచి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. అంతటితో ఆగకుండా.. మేడారం జాతర పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రులను అడిగి తెలుసుకున్నారు. పనులు చివరి దశలో ఉన్నాయని.. జాతర దగ్గర పడుతుండడంతో పనులు వేగంగా చేస్తామని ఈ సందర్భంగా మాజీ సీఎంకు మంత్రులిద్దరూ వివరించారు. అయితే.. పనుల విషయం జాగ్రత్త వహించండి.. పనులు తొందర కావాలని ఆగం కావొద్దంటూ ఆయన వాళ్లను సున్నితంగా సూచించారు. అవసరం అయితే కొన్ని పనులు జాతర అయిపోయాక కూడా చేసుకోవచ్చంటూ సలహా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ‘‘ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాం. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు’’ అని మంత్రులిద్దరూ మీడియాకు చెప్పారు. అంతకు ముందు.. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్ దంపతులు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించడం వైరల్‌గా మారింది. మాజీ ముఖ్య మంత్రివర్యులు కేసీఆర్ గారిని మేడారం మహా జాతరకు ఆహ్వానించిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు,శ్రీమతి సీతక్క గారు..@seethakkaMLA @iamkondasurekha #prajapalana#medaramjatara#sammakkasarakka#tribalfestival pic.twitter.com/F8pwvacqlP— Telangana Congress (@INCTelangana) January 8, 2026కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్.. మొన్నటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రేవంత్ రెడ్డి పలకరింపునకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సీఎం రాక సందర్భంగా లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ‘‘దటీజ్ కేసీఆర్ అని.. ఆయనకంటూ ఓ సంస్కారం ఉందని.. ఆయన విమర్శలు ఏనాడూ హద్దుదాటి ఉండవు’’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేశాయి. -
మేడారం జాతరకు కేసీఆర్‌కు ఆహ్వానం.. ఎర్రవల్లికి సురేఖ, సీతక్క
సాక్షి, సిద్దిపేట: మేడారం మహా జాతర నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. అనంతరం, కేసీఆర్ దంపతులు కూడా మంత్రులను సన్మానించారు.ఆహ్వానం సందర్భంగా దాదాపు 20 నిమిషాలపాటు వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మేడారంలో జాతర సందర్బంగా చేస్తున్న ఏర్పాట్లను కేసీఆర్‌కు వివరించినట్టుగా తెలిసింది. అనంతరం, మేడారం జాతరకు ఏదోఒక రోజు తాము హాజరు అవుతామని కేసీఆర్ చెప్పారని మంత్రులువెల్లడించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లిపోయారు.బాగున్నరా.. అమ్మ !కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపుఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారంగురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది… pic.twitter.com/8NPsnWB5jX— Telugu Scribe (@TeluguScribe) January 8, 2026అంతకుముందు మంత్రులిద్దరూ మాట్లాడుతూ..‘మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు కేసీఆర్ వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాము. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. మేడారం జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందరిని మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం’ అని అన్నారు. -
భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)
-
మేడారంకు పోటెత్తిన భక్తులు
-
మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
200 ఏళ్లపాటు నిలిచేలా ‘మేడారం’ పనులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు, మనోభావాలు దెబ్బతినకుండా అనుకున్న సమయానికే మేడారం జాతర పనులు పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సు«దీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాలతో కలిసి మంత్రి పొంగులేటి మంగళవారం మేడారంలో సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణ, రాత్రి నిర్మాణ పనులు, సివిల్ వర్క్స్, గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయటి వైపు సీసీ రోడ్ల పనులను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, ఇతర పనులను జనవరి 5లోగా ముగించాలని ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, వాటర్ ట్యాంకుల నిర్మాణం తదితర పనులను అధికారులు విభజించుకొని గడువులోపు పూర్తి చేయాలన్నారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలతో పునరుద్ధరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ పనులను చేపట్టామని, పాలరాతి శిల్పాలపై గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రూపొందిస్తున్నామని, అమ్మవార్ల దయతో సకాలంలో పనులు సకాలంలో పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. నేడు వనదేవతల దర్శనం నిలిపివేత ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మల దర్శనానికి భక్తుల రాకను బుధవారం నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. మంగళవారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఈఓ వీరస్వామి, పూజారులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల నూతన గద్దెలపై ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న సందర్భంగా అమ్మవార్ల దర్శనాలను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పూజాకార్యక్రమాలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం నుంచి యథావిధిగా అమ్మవార్లను భక్తులు దర్శించుకోవచ్చన్నారు. ఈ విషయంలో భక్తులు తమకు సహకరించి దర్శనాలను బుధవారం వాయిదా వేసుకోవాలని కోరారు. -
తెలంగాణ కుంభమేళా.. మేడారంకు క్యూ కట్టిన భక్తులు
-
మేడారం జాతర సమయానికి రాజన్న దర్శనం అనుమానమే!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయ పునర్నిర్మాణ ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వీలైనంత వేగంగా ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని తెప్పించిన బాహుబలి యంత్రం వెనక్కి వెళ్లడంతో అధికారుల లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. గుడి ఆధునీకరణ, అభివృద్ధి, విస్తరణలో భాగంగా ఇప్పటికే పలు నిర్మాణాలు కూల్చేశారు. నూతన నిర్మాణాల కోసం పనులు కూడా మొదలయ్యాయి. ఇక్కడే అధికారులకు ఆటంకాలు ఎదురయ్యాయి. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా గుడి చుట్టూ నూతనంగా దాదాపు 76 పిల్లర్లతో (ఫైల్ ఫౌండేషన్ ప్లాన్‌తో ప్లింత్ భీమ్ల విధానం) నిర్మాణానికి ప్లాన్ రూపొందించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత వేగంగా గుడిని పునర్నిర్మించాలని ఆర్అండ్బీ అధికారులు భావించారు. ఇందుకోసం భారీ యంత్రాన్ని తీసుకువచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ యంత్రంతో ఇక్కడ పనిచేయలేని పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఆలయ నిర్మాణం పనుల్లో జాప్యం తప్పదని తెలుస్తోంది. ఏం జరిగిందంటే?గుడి కోసం పిల్లర్లను వేగంగా భూమి లోపల నేరుగా నాటుకుంటూ నిర్మించే భారీ బాహుబలి యంత్రాన్ని ప్రత్యేక వాహనంలో తెప్పించారు. తీరా యంత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పిల్లర్ల పని ప్రారంభించాక మట్టి కుంగిపోవడం, జారిపోవడం మొదలైంది. దీంతో ఈ యంత్రం ఇక్కడ పనికిరాదని అధికారులు నిర్ధారణకొచ్చారు. చేసేది లేక చెన్నై నుంచి తెప్పించిన భారీ బాహుబలి యంత్రాన్ని తిప్పి పంపించారు. ఫలితంగా ఇంతకాలం యంత్రంతో పిల్లర్ల నిర్మాణం వేగంగా చేపట్టవచ్చని రూపొందించుకున్న ప్లాన్ మారిపోయింది. అధికారులు ఇప్పుడు పిల్లర్లను నిర్మించేందుకు సాధారణ పద్ధతి ప్రకారమే కందకాలు తవ్వే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి బాహుబలి యంత్రంతో పనులు వేగంగా జరిగితే, మేడారం జాతర సమయానికి స్వామి వారి దర్శనాలు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ, ఇప్పుడు యంత్రం తరలిపోవడంతో పనుల్లో జాప్యం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయమై ఆర్అండ్బీ ఈఈ శాంతయ్యను వివరణ కోరగా.. బాహుబలి యంత్రాన్ని సాంకేతిక కారణాలతో వెనక్కి పంపిన మాట వాస్తవమేనన్నారు. ఇప్పుడు కందకాలు తవ్వుతున్నామని, తాజా పరిస్థితుల్లో నిర్మాణ ప్లానింగ్, అంచనాలు కూడా మారతాయని వివరించారు.మేడారం జాతరలోపు రాజన్న దర్శనం అనుమానమే..మాస్టర్‌ప్లాన్, ఆలయ విస్తరణలో భాగంగా అధికారులు గత నెల 13వ తేదీ నుంచి రాజన్న దర్శనాలు నిలిపివేశారు. ఆలయ ప్రధాన ద్వారం చుట్టూ ఇనుపరేకుల వలయం ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయంగా భీమన్న ఆలయంలో దర్శనాలు, కోడెమొక్కులు చెల్లించడానికి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కి వైస్‌చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరించాలి. ప్రస్తుతం రాజన్నసిరిసిల్లకు పూర్తిస్థాయి కలెక్టర్ లేరు. అదనపు కలెక్టర్‌కే ఇన్చార్జి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అయితే సర్పంచ్ ఎన్నికల హడావుడిలో కలెక్టర్ తలమునకలయ్యారు. దీంతో ఈ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని సమాచారం. త్వరలో మేడారం జాతర రాబోతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తొలుత రాజన్నను దర్శించుకునేందుకు వస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి మేడారం జాతర ప్రారంభమయ్యేలోగా రాజన్న దర్శనాలు దాదాపు అనుమానమేనని స్థానికులు అంటున్నారు. -
ప్రపంచం కీర్తించేలా మేడారం: సీఎం రేవంత్
నాడు పాలకులు సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఆదివాసీ బిడ్డలను అభివృద్ధి చేయడంతో పాటు ఆదివాసీ దేవతల ఆలయాలకు సేవ చేసే భాగ్యం కలిగింది. సమ్మక్క సారలమ్మల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో మంత్రి సీతక్కకు, నాకు జన్మ ధన్యమైనట్లే. ఆదివాసీలను, పూజారులను,సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోయేలా ఉంటాయి. మహా జాతరకు మళ్లీ వస్తా.. ఈసారి జాతరను గొప్పగా చేసుకుందాం.. – ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళా నిర్వహించే మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని ప్రపంచం కీర్తించేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఈ ఆలయం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కాకతీయులు నిర్మించిన రామప్ప తరహాలో చరిత్రకు సాక్ష్యాలుగా, వెయ్యేళ్లు నిలిచేలా ఆలయ పునర్నిర్మాణాన్ని రాతి కట్టడాలతో చేపడతామని చెప్పారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క–సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం పనులను సీఎం ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. అనంతరం సీఎం పోలీసు కమాండ్ కంట్రోల్ రూం ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గిరిజన కొమ్ము కోయ నృత్యంతో, గిరిజన సంప్రదాయం ప్రకారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రూపొందించిన గద్దెల నూతన డిజైన్లను విడుదల చేశారు. ఆలయం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఆలయం పనుల ప్రారంభించారు. సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అమ్మల ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం ‘మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఇద తెలంగాణ ప్రజల ఆతీ్మయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. రాష్ట్ర సాంస్కృతిక గొప్పతనాన్ని, గిరిజనుల పోరాట చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఆదివాసీలు దేశానికి మూలవాసులు.. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మ తల్లులు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను సందర్శిస్తున్నా. 2023 ఫిబ్రవరి 6న ఈ గడ్డ మీదనుంచే పాదయాత్ర మొదలుపెట్టా. అమ్మల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. శాశ్వత ప్రాతిపదికన గద్దెల ప్రాంగణం, పునర్నిర్మాణం పనులు చేపట్టాం. ఈ ఆలయం డబ్బులతో కొలిచేది కాదు.. నమ్మకంతో కొలిచేది. ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలి. ఇందుకోసం ప్రభుత్వం ఎన్ని నిధులైనా కేటాయిస్తుంది. ఆదివాసీ కుంభమేళాకు నిధులెందుకివ్వరు..? ‘కుంభమేళాకు వేలకోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడంలేదు? జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నిధులు మంజూరు చేయాలని కోరుతున్నా. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఈ విషయం ఆలోచించాలి. అయోధ్య, కుంభమేళాకే కాదు.. మేడారానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి నిధులు తీసుకురావాలి..’ అని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ..గతంలో ఈ మహా జాతరను అధికారికంగా నిర్వహించే అవకాశం తనకు ఇవ్వాలని కోరుకున్నానని, అదే మాదిరిగా నా కోరికను తీరుస్తూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటై జాతరను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. మొక్కులు సమర్పించుకున్న సీఎం మేడారం సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకున్న సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లకు 68 కేజీల నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. 2024 ఫిబ్రవరిలో తల్లులను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నప్పుడు ముఖ్యమంత్రి బరువు 68 కిలోలు కాగా.. ఇప్పుడు కూడా 68 కిలోలే ఉన్నారు. పూజారులు, ఆదివాసీ సంఘాలతో భేటీ ఆలయ అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా అలయ విస్తరణకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు అధికారులు వివరించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఆదివాసీ సంఘాలు తీసుకువచ్చాయి. వీటిపై స్పందించిన సీఎం..ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆలయ విస్తరణ, అభివృద్ధికి పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో వీరితో పాటు ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బాలునాయక్, కడియం శ్రీహరి, మురళీనాయక్ , రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. ఇక ఒకే వరుసలో గద్దెలు – ఇదీ మాస్టర్‌ప్లాన్.. సమ్మక్క, సారలమ్మ గద్దెలు ప్రస్తుతం ఒక వరుసలో ఉండగా, వీరి ఎదురుగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. అయితే భక్తులు క్యూ లైన్ ద్వారా సమ్మక్క– సారలమ్మను దర్శించుకుని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్దకు రావటం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా నిర్మాణానికి వీలుగా కొత్తగా డిజైన్ రూపొందించారు. గద్దెల చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్ స్థానంలో గ్రానైట్ నిర్మాణం చేపట్టనున్నారు. గ్రానైట్‌పై సమ్మక్క, సారలమ్మ చరిత్రతో పాటు గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు, వారి లిపి, జాతర వైభవం తెలియజేసే బొమ్మలను చెక్కనున్నారు. అదే విధంగా మహా జాతర వేళ భక్తులకు సమ్మక్క, సారలమ్మ తల్లులు.. పగిడిద్ద రాజు, గోవిందరాజుల దర్శనం కష్టం కాకుండా స్థల సేకరణ ద్వారా గద్దెల ప్రాంగణం విస్తరణను ప్లాన్‌లో చేర్చారు. ఇందుకోసం దేవాదాయ శాఖకు చెందిన 4 ఎకరాలు, ప్రభుత్వ భూమి 19 ఎకరాలు.. మొత్తం 23 ఎకరాలు సేకరిస్తారు. అతిథి గృహాలు నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. -
మేడారంలో సీఎం రేవంత్.. వనదేవతలకు మొక్కుల చెల్లింపు
సాక్షి, ములుగు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మేడారంలో పర్యటించారు. సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వనదేవతలకు నిలువెత్తు బంగారం(68 కేజీల బెల్లం) సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతర నిర్వహణ కోసం చేపట్టిన పనులను మరికాసేపట్లో ఆయన పరిశీలిస్తారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారులు, పూజారులతో మాట్లాడతారని అధికారులు తెలిపారు.పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారంఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు మంది దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్టు భారీఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతోపాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం (బెల్లం) సమర్పణ, జంపన్న వాగులో స్నానాలాచరించేందుకు అవసరమైన ఏ ర్పాట్లు చేయనున్నారు.మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగొద్దనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతి నిర్మాణం.. ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా, మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణాల్లో విలువైన గ్రానైట్, లైమ్‌స్టోన్‌ను వాడుతారు. ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి సేవలను మేడారం అభివృద్ధి పనులకు ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఏర్పాట్లను సీఎం పరిశీలించడం ఇదే తొలిసారి ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపిన సందర్భాలు లేవు. మేడారం జాతర ఏర్పాట్లపై తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ పర్యటించనున్నారు. మేడారం పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్షిస్తారు. ఈ నెల 20న హైదరాబాద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి.. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మరోసారి రివ్యూ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.సీఎం టూర్ షెడ్యూల్ ఇలా...సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించాయి. ఉదయం 10.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు మేడారం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.15 గంటల నుంచి 1.30 గంటల వరకు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకొని పూజారులతో ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత పబ్లిక్ మీటింగ్‌లో ఆలయ పునరుద్ధరణ పనుల ప్లాన్‌ను డిజిటల్ లాంచ్ చేస్తారు. 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు మేడారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. -
మేడారం జాతర.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, వరంగల్: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, గిరిజనులపట్ల సీఎం రేవంత్‌రెడ్డి కట్టుబాటు, మద్దతుకు నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగుతుంది” అని పేర్కొన్నారు. -
మేడారం సమ్మక్క జాతర 2026.. తేదీలు ప్రకటించిన పూజారులు
సాక్షి, ములుగు: తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Jathara) తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది మేడారంలో జరగబోయే సమ్మక్క, సారలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు ఈ మేరకు తేదీలను వెల్లడించారు. 2026 జనవరి 28వ తేదీన జాతర ప్రారంభం కానుంది.జాతర తేదీలు ఇవే..2026 జనవరి 28వ తేదీన(బుధవారం) శ్రీ సారాలమ్మ దేవత..29న సమ్మక్క దేవతలు (గురువారం) వారివారి గద్దెల మీదకు చేరుకుంటారు.30వ తేదీన (శుక్రవారం) మొక్కులు చెల్లించుట.31వ తేదీన (శనివారం) సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజు దేవుళ్లు వన ప్రవేశం. చదవండి: బయ్యారం చెరువు.. చరిత్రకు సాక్ష్యం.. -
వైభవంగా మినీ మేడారం జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఘనంగా మండమెలిగె
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో మినీజాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. నాలుగురోజులపాటు జరిగే జాతర మొదటిరోజు బుధవారం మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో ఘనంగా మండమెలిగె పండుగ నిర్వహించారు. ఉదయం ఆలయాలను శుద్ధి చేసిన పూజారులు.. మండమెలిగె పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. మేడారంలోని సమ్మక్క గుడిలో అమ్మవారి శక్తి పీఠాన్ని, గుమ్మాన్ని ఆడపడుచులు, పూజారులు పసుపు, కుంకుమలతో అలంకరించారు. సమ్మక్క పూజారి సిద్దబోయిన నితిన్ ఇంటినుంచి పవిత్ర జలం, పసుపు, కుంకుమలను తీసుకొని పోచమ్మగుడికి వెళ్లి.. చీర సమరి్పంచి పూజలు చేశారు. నితిన్ ఇంటి వద్ద తయారు చేసిన మామిడి తోరణాలను డోలు వాయిద్యాల నడుమ తీసుకొని వెళ్లి చిలకలగుట్ట వెళ్లే దారి సమీపంలో రోడ్డుకు ఇరువైపులా కట్టి, ధ్వజస్తంభాన్ని నిలిపారు. రాత్రి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి తీసుకొని డోలు వాయిద్యాలతో సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. అనంతరం రహస్య పూజలు నిర్వహించారు. అలాగే కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక సారయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి సారలమ్మ పూజారులతో పాటు గ్రామంలోని ఆదివాసీలంతా కలసి సారలమ్మ గుడి నుంచి పసుపు, కుంకుమ, శాకహానం (ఇప్పపువ్వు సారా) తీసుకొని గద్దెల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. మంత్రిసీతక్క బుధవారం రాత్రి మండమెలిగెపండుగలో పాల్గొన్నారు. ముందుగా సమ్మక్క గుడిలో పూజలు చేశారు. అనంతరం గద్దెలను దర్శించుకున్నారు.భక్త జన సందడి.. అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచేమొదలైన భక్తుల తాకిడి మధ్యాహ్నం వరకుకొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద షవర్ల కింద స్నానాలు అచరించి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బాయిలర్ కోళ్ల అమ్మకాలు డీలా.. జాతరలో కోళ్లు, యాటలను మొక్కుగాసమర్పించడం ఆనవాయితీ. అయితే బర్డ్‌ఫ్లూ వార్తల ప్రభావం మినీ జాతరపై కూడా పడింది. కోళ్ల వ్యాపారులు గిరాకీ సరిగా లేక డీలా పడిపోయారు. మార్కెట్ రేట్ ప్రకారం మినీ జాతరలో బాయిలర్ కోడి కేజీ రూ.180, జుట్టు కోడిరూ.గుత్తకు రూ.200 అమ్మకాలు చేపట్టినా భక్తులు ముందుకు రాలేదు. దీని గురించి పలువురు భక్తులను ప్రశ్నించగా, బర్డ్‌ఫ్లూ వార్తల కారణంగా సొంత గ్రామాల నుంచి నాటుకోళ్లను తీసుకొచి్చనట్లు తెలిపారు. మరికొందరు స్థానికుల వద్ద రేటు ఎక్కువైనా నాటుకోళ్లనే కొనుగోలు చేశారు. -
మినీ మేడారం.. భక్తజన సందోహం
సాక్షి ప్రతినిధి, వరంగల్: మినీ మేడారం (మండమెలిగె పండుగ) జాతరకు వేళయ్యింది. వనదే వతలు సమ్మక్క–సారలమ్మ పునఃదర్శనానికి సమ యం ఆసన్నమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి 15వ తేదీ వరకు జాతర జరగనుంది. ఈ జాతర ప్రారంభానికి వారం రోజుల ముందు గుడిమెలిగె నిర్వహించారు. మండమెలిగె ఇలా..మేడారంలో నేటినుంచి 15వ తేదీ వరకు మినీ జాతర (మండమెలిగె పండుగ) జరుగనుంది. వారం రోజుల నుంచే భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ములుగు కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు.12న (బుధవారం) మేడారం, కన్నెపల్లిలోని ఆలయాల్లో మండమెలిగె పండుగను సమ్మక్క–సారలమ్మ పూజారులు నిర్వహిస్తారు. మేడారంలో సమ్మక్క పూజారులు అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేసి గ్రామ పొలిమేరలోని తూర్పు, పడమరన ధ్వజస్తంభాన్ని పాతి మామిడి తోరణాలు కడతారు. రాత్రి సమ్మక్క గుడి నుంచి పూజా సామగ్రిని తీసుకొని సమ్మక్క గద్దె వద్దకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కూడా కన్నెపల్లిలో అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి రాత్రి మేడారంలోని గద్దెల ప్రాంగణానికి చేరుకొని అలుకుపూత అనంతరం పూజలు చేస్తారు. రాత్రంతా జాగారం నిర్వహిస్తారు.13 (గురువారం)న ఉదయం సమ్మక్క– సారలమ్మ గద్దెల నుంచి పూజారులు అమ్మవారి సామగ్రిని తీసుకొని డోలు వాయిద్యాలతో సమ్మక్క గుడికి చేరుకుంటారు. తలస్నానాలు ఆచరించి గుడిలో మరోసారి పూజలు నిర్వహి స్తారు. కన్నెపల్లిలో సారలమ్మ పూజారులు కూడా సారలమ్మ గుడికి వెళ్లి పూజలు చేస్తారు. 14 (శుక్రవారం)న భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారు. 15 (శనివారం)న జాతర ముగియనుంది. రూ.32 కోట్లతో భక్తులకు ఏర్పాట్లు..రూ.32 కోట్లతో మినీ మేడారం జాతరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పలు శాఖల ఆధ్వర్యంలో పనులు చేపట్టింది. -
మేడారం మినీ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
సహజత్వం కోల్పోతున్న నీరు
సాక్షి, సిద్దిపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోటికి పైగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే భక్తులు ఉపయోగించే షాంపూలు, సబ్బుల ఇతర కెమికల్స్ వల్ల వాగులో నీరు సహజత్వాన్ని కోల్పోతోందని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ పరిశోధనల ద్వారా తేల్చారు. వాగులో పుణ్యస్నానాలు చేశాకే... మేడారం జాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో రోజుల తరబడి పోరాటం చేసిన సమ్మక్క కుమారుడు జంపన్న.. మేడారం పొలిమేరలో ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి ప్రజలు ఆ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భక్తజనులు జంపన్నవాగులో పుణ్యస్నానమాచరించి ఆ తర్వాత తల్లుల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. వాగుకు ఇరువైపులా2 కిలోమీటర్ల మేర స్నానఘట్టాలు మేడారంలోని జంపన్నవాగుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పొడవులో స్నానఘట్టాలు ఉన్నాయి. భక్తులు ఈ వాగులో స్నానం చేసేందుకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి జాతర సమయాల్లో నీటిని వదులుతారు. ఈ నీరు స్నానఘట్టాల దగ్గర నిల్వ ఉండేలా ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తారు. మరోవైపు వాగులో ఉన్న ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్ ద్వారా నీటిని తోడి స్నానఘట్టాల దగ్గర ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కు పంపిస్తారు. భక్తులు జంపన్నవాగులో మునక వేసిన తర్వాత బ్యాటరీ ట్యాప్స్ దగ్గర స్నానాలు చేస్తారు. ఇలా కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలోనే లక్షలాది మంది భక్తులు జాతర జరిగే నాలుగు రోజుల పాటు నిర్విరామంగా స్నానాలు చేస్తారు. ఈ సమయంలో ఉపయోగించే షాంపులు, సబ్బుల కారణంగా జంపన్న వాగులోని నీరు సహజత్వానికి కోల్పోతోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు సహజమైన కుంకుమ స్థానాన్ని చాలా చోట్ల కెమికల్ కుంకుమలు ఆక్రమించడం ఈ సమస్యను మరింత తీవ్రం చేసింది. 18 శాంపిల్స్ సేకరణ గతేడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరిగింది. ఈ సందర్భంగా జాతరకు వారం రోజుల ముందు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జంపన్న వాగులో ఆరు చోట్ల, జాతర సమయంలో ఆరు చోట్ల, జాతర ముగిసిన వారం రోజులకు ఆరుచోట్ల ఇలా 18 శాంపిల్స్ సేకరించారు.వీటిని ప్రత్యేక బాటిళ్లలో తీసుకొచ్చి కళాశాలలో టెస్ట్ చేశారు. వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా అయితే పీహెచ్ 6.5 నుంచి 8.5, డిజాల్వడ్ ఆక్సిజన్(డీవో) 6 ఎంజీ కంటే ఎక్కువ (లీటరు నీటిలో), బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) 2ఎంజీ అంతకంటే తక్కువ (లీటరు నీటిలో), బాక్టీరియా అసలు ఉండొద్దు. 24, 25 తేæదీల్లో నేపాల్‌లో ప్రజెంటేషన్ బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో కాఠ్మాండ్లో ఈ నెల 24,25 తేదీల్లో జరిగే 3వ అంతర్జాతీ య బయోటెక్నాలజీ సదస్సుకు జంపన్న వాగులో సాముహిక పుణ్యస్నానాలతో నీటి కాలుష్యంపై చేసిన పరిశోధన పత్రం ఎంపికైంది. దీనిపై పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు డాక్టర్ మదన్మోహన్కు ఆహ్వానం అందింది.నివారణ మార్గాలుసహజత్వాన్ని కోల్పోయిన నీటిలోబ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇలాంటి నీటిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. » వాగులో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు దిగువకు వెళ్లేలా నీటి ప్రవాహం కొంచెం ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. » క్లోరినేషన్ ఎక్కువగా చేయాలి. » సబ్బు, షాంపుల వినియోగం, బట్టలు ఊతకడం, కుంకుమ వేయడాన్నినియంత్రించాలి. » జాతర నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ స్నానం చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు అని పరిశోధన ద్వారా నిర్థారణ అయ్యింది. జాగ్రత్తలు పాటించాలి పుణ్యస్నానాలు చేయడం మంచిదే. తగు జాగ్రత్తలు పాటించాలి. పుణ్యస్నానాలు చేసే సమయంలో పూజా ద్రవ్యాలు అందులో వేయొద్దు. షాంపూలు, సబ్బులు వినియోగించడం వలన నీరు సహజత్వం కోల్పోయి కాలుష్యం అవుతుంది. దీంతో చర్మ వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి. – డాక్టర్ మదన్ మోహన్, సిద్దిపేట ప్రభుత్వడిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి -
మేడారం మినీ జాతర తేదీలు ఖరారు
సాక్షి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పేరుగావించిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. ఈ మేరకు శనివారం సమావేశమైన మేడారం పూజారులు.. మినీ జాతర తేదీలను ప్రకటించారు. జాతరకు సంబంధించిన ఏర్పాటు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం కోరింది.కాగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలోనే వచ్చే భక్తులు ప్రస్తుతం ఏడాది పొడవునా తమకు అనుకూలమైన సమయంలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనంలో కొలువైన వనదేవతలు జనం మధ్యకు రావడంతో అడవి అంతా జనసంద్రమవుతుంది. మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
మేడారం జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)
-
27నే మరో 2 గ్యారంటీలు
మేడారం గద్దెలపై సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఆసీనులు కావడంతో శుక్రవారం పోటెత్తిన భక్తజనం(ఇన్సెట్లో) సమ్మక్క గద్దె వద్ద మొక్కుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రూ.500కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డున్న పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గ్యారంటీలను 27న ప్రారంభిస్తాం. కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఇచ్చిన ప్రతి హామీ అమలుచేస్తాం. – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను సీఎం శుక్రవారం దర్శించుకున్నారు. తల్లులకు ఆయన నిలువెత్తు బంగారం (66 కిలోల బెల్లం), పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని చెప్పారు. రూ.2లక్షల రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతామన్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మార్చి 2న మరో 6వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదంటూ మామాఅల్లుడు, తండ్రీకొడుకు తమ ప్రభుత్వంపై గోబెల్స్‌లా అబద్ధపు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ దోపిడీపై బీజేపీ స్పందించలేదు కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ, అక్రమాలు, నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు చూపామని, కేసీఆర్ కళ్లు మూసుకొని ఫాంహౌస్‌లో ఉండటంతోనే ఏపీ సీఎం కృష్ణాజలాలు తరలించుకుపోయారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో కేసీఆర్ దివాలా తీయించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేళ్లుగా దోపిడీకి పాల్పడుతుంటే పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా ఏనాడూ ప్రధాని నరేంద్రమోదీ అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డపై తాము జ్యుడీషియల్ విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత దానిని సీబీఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని, పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, ఆ కుటుంబంపై కేసు పెట్టారా, సీబీఐ, ఈడీ, ఐటీ అన్నీ కేంద్రం దగ్గరే ఉన్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీలో వాటా కోసమే తప్ప దానిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన బీజేపీ నేతలకు లేదన్నారు. త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల ఆధ్వర్యంలో సాగే విచారణను బీఆర్ఎస్ నాయకులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ నివేదికలు సిద్ధం చేస్తోందని, ఆ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ ఇచ్చాం గతంలో జర్నలిస్టులను సచివాలయంలోకి రానివ్వలేదని, ఇప్పుడు ప్రతీ చాంబర్‌కు వెళ్లే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తనను, సీతక్కను గతంలో సచివాలయానికి వెళ్లనివ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికీ సచివాలయానికి వెళ్లే స్వేచ్ఛ ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఆ స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి నిరంతరం చేస్తామని, జాతర వచ్చినప్పుడే కాకుండా నిరంతరం మంత్రులు సీతక్క, కొండా సురేఖ సహాయంతో ఈ ప్రాంత అభివృద్ధిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగుల్లో న్యాయం జరిగిందా లేదా అని ప్రభుత్వ ఉద్యోగులను అడగాలని ఆయన ప్రజలకు సూచించారు. గతంలో నెల చివర వరకు జీతాలు వచ్చేవికావని, మొదటి నెల నాలుగో తేదీన, రెండో నెలలో మొదటి తేదీన ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. మీడియా అకాడమీకి త్వరలో చైర్మన్ త్వరలోనే మీడియా అకాడమీకి చైర్మన్‌ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదని, పదేళ్లు ఓపిక పట్టారని, త్వరలోనే జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని తేవడంతోనే జర్నలిస్టుల పని అయిపోలేదని కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి సహకరించాలని కోరారు. వాళ్ల ఇద్దరి (బీజేపీ–బీఆర్ఎస్నుఉద్దేశించి) సమన్వయం మీకు తెలుసని, ఉదయం, సాయంత్రం మాట్లాడుకుంటున్నారన్నారు. పది సీట్లు బీజేపీకి, ఏడు సీట్లు కేసీఆర్‌కు మాట్లాడుకొని ఎన్నికలకు రాబోతున్నారని, ఆ చీకటి ఒప్పందాన్ని మీడియా మిత్రులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.చేవెళ్ల సభతో శ్రీకారం..: చేవెళ్లలో భారీ బహిరంగ సభను నిర్వహించి.. ఆ సభలోనే రూ.500కే గ్యా స్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించను న్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కలె క్టర్ శశాంక, ఇతర అధికారులు పరిశీలించారు. మేడారం సందర్శనకు మోదీ, అమిత్ షా రావాలి దక్షిణ కుంభమేళాలాంటి మేడారం మహాజాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం జాతీయ పండగగా గుర్తించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము ఎన్నిసార్లు కోరినా అలా కుదరదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే వివక్ష చూపడం సరికాదని హితవు పలికారు. దక్షిణ భారతమనే కాదు ప్రపంచంలోనే సమ్మక్క–సారలమ్మ జాతరకు ఒక గుర్తింపు ఉందని, వారి వీరోచిత పోరాటానికి చరిత్ర పుటల్లో స్థానం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని, ప్రధానమంత్రి వచ్చి దర్శించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మేడారం జాతర: వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్
సాక్షి, ములుగు: మేడారంలో సమ్మక్క, సారలమ్మలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.నిన్న మేడారంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి గద్దెపై కొలువు దీరింది. సమ్మక్కను ప్రధాని పూజారి ప్రతిష్టించారు. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మలను గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ, గవర్నర్‌గా మూడోసారి వచ్చానని, తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. సమ్మక్క సారలమ్మల పరాక్రమ పోరాటం గొప్పది. ఆరు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నానని గవర్నర్ తెలిపారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ, మేడారం జాతర గొప్ప జాతర అని, అమ్మ వార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా గిరిజనులందరికి శుభాకాంక్షలు తెలిపారు. చిలకలగుట్టనుంచి సమ్మక్క తల్లి మేడారం గద్దెపైకి చేరడంతో మహాజాతర పరిపూర్ణత సంతరించుకుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరడంతో భక్తుల మొక్కులు జోరందుకున్నాయి. గురువారం రాత్రి చిలకలగుట్టనుంచి పూజారులు, వడ్డెలు సమ్మక్కను భక్తుల జయజయధ్వానాల నడుమ తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. దారిపొడవునా డోలు వాయిద్యాలు, ఆదివాసీల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పూనకాలతో శివసత్తులు ఊగిపోయారు. జై సమ్మక్క.. జైజైసమ్మక్క.. తల్లీ శరణు.. జయహో జగజ్జనని.. సల్లంగాచూడు తల్లి అంటూ భక్తుల నామస్మరణ మార్మోగింది. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు.. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క ఆగమనం. తల్లిరాకతోనే జాతర సంపూర్ణమవుతుంది. కాగా, గురువారం మేడారంలోని సమ్మక్క గుడి శక్తిపీఠం వద్ద పూజారులు, వడ్డెలు సంప్రదాయ దుస్తులు ధరించి కుంకుమ, పసుపు, ఇతర పూజాసామగ్రిని పట్టుకొని గద్దెల వద్దకు చేరి ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుకు పసుపు కుంకుమ అప్పగించిన తర్వాత పూజారులు చిలకలగుట్టకు చేరుకున్నారు. -
మా ప్రభుత్వాని టచ్ కూడా చేయలేరు
-
మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కరణ.. గద్దెపైకి సమ్మక్క
ములుగు, సాక్షి: ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర బుధవారం ప్రారంభమైంది. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు మొదటిరోజు తండోపతండాలుగా తరలి వచ్చారు. రెండో రోజైన ఇవాళ.. మేడారంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి ఇవాళ గద్దెపై కొలువు దీరింది. సమ్మక్కను ప్రధాని పూజారి ప్రతిష్టించారు. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు చిలకల గుట్ట నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలికారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించారు. మేడారం జన జాతరగా మారింది. గత రాత్రి సారలమ్మతో పాటు సారలమ్మ, పడిగిద్ద రాజు, గోవిందా రాజులు గద్దెపై కొలువుదీరారు. వనదేవతలకు మొక్కు చెల్లించుకునే క్రమంలో.. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమక్క-సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. -
'వెన్నెలమ్మ.. వచ్చిందమ్మా..' గుట్ట నుంచి గద్దెపైకి వరాల తల్లిరాక!
వరంగల్: కన్నెపల్లి నుంచి వెన్నెలమ్మ తరలిరాగా.. భక్తజనం పారవశ్యంలో ఓలలాడారు. శివసత్తుల పూనకాలు.. భక్తుల శిగాలతో కన్నెపల్లి ఆలయ ప్రాంగణం మారుమోగింది. జై..సారలమ్మ.. అంటూ భక్తులు గద్దెల వరకు తోడువచ్చారు. మేడారం శ్రీ సమ్మక్క– సారలమ్మ మహాజాతరలో ప్రథమ ఘట్టం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మకు దారిపొడవునా భక్తులు నీరాజనం పలికారు. గుడిలో సాయంత్రం 6 గంటలనుంచి సారలమ్మ తరలివచ్చే తంతు ప్రారంభమైంది. సుమారు గంటన్నరపాటు ఆలయంలో ఒకవైపు కాకవంశీయుల ఆటపాటలతో సందడిగా మారింది. ఇంటినుంచి పూజాసామగ్రితో ఆడపడుచులతో కలిసి ఆలయానికి చేరుకున్న ప్రధాన వడ్డె కాక సారయ్య ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. పూజారి హారతివ్వగా.. కొద్దిసేపటి తరువాత మరో పూజారి బూర ఊదారు. బుధవారం రాత్రి 7.40 గంటలకు ప్రధాన పూజారి కాక సారయ్య.. సారలమ్మను చేతిలో పట్టుకోగా.. హనుమాన్జెండాతో బయటకు తీసుకువచ్చారు. హనుమంతుడి నీడలో రావడం అమ్మవారి అభయంగా ఉంటుందని విశ్వాసం. అమ్మవారి గుడి ముందు పెళ్లికాని కన్నెపిల్లలు, యువకులు, అనారోగ్యం, సమస్యలతో బాధపడుతున్న భక్తులు వరం పట్టారు. నేలపై పడుకున్నవారి పైనుంచి సారలమ్మ వెళ్తే శుభం కలుగుతుందని విశ్వాసం. అక్కడినుంచి మేడారం బయలుదేరారు. కన్నెపల్లిలోని కాక వంశీయులు ఆడబిడ్డల ఇళ్లవద్దకు సారలమ్మ తరలివెళ్లగా వారు మంగళహారతులు ఇచ్చి నీళ్లు ఆరబోశారు. ఎర్రనీళ్లతో దిష్టితీసి కొబ్బరికాయలను కొట్టారు. తల్లివస్తుందని తెలుసుకున్న భక్తులు విడిది ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరి పసుపు, కుంకుమలను ఎదురుచల్లారు. నాలుగంచెల రోప్‌పార్టీని దాటుకొని వడ్డెలు, పూజారులను తాకాలనే అతృతతో ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వడ్డె సారయ్య.. జంపన్నవాగులో అమ్మవారి కాళ్లుకడిగి మేడారం చేరుకున్నారు. తల్లి సమ్మక్క గుడికి చేరి దర్శించుకోవడానికి ముందుగానే..అప్పటికే సమ్మక్క గుడి వద్దకు చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మ గద్దెలపై కొలువుదీరింది. అమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును వారి వారి గద్దెలపై పూజారులు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించారు. సారలమ్మను ప్రతిష్ఠించే సమయంలో గద్దెల దర్శనాలను గంటపాటు నిలిపివేశారు. ఈ క్రమంలో మూడుమార్లు విద్యుత్ లైట్లను నిలిపివేసి మళ్లీ ఆన్‌చేశారు. పోలీసుల భారీ బందోబస్తు.. కన్నెపల్లి నుంచి సారలమ్మను పోలీసులు భారీ బందోబస్తు మధ్య గద్దెలపైకి తీసుకువచ్చారు. సారలమ్మ గద్దైపె కొలువుదీరడానికి ముందే పోలీసులు నాలుగు రోప్‌పార్టీలు ఏర్పాటు చేసి వాటి మధ్యలో కన్నెపల్లి ఆదివాసీ యువకులు పూజారులతో కలిసి తల్లిని గద్దైపెకి తీసుకొచ్చారు. రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ సారలమ్మను జంపన్నవాగు నీటిలో నుంచి తీసుకురావడం ఆనవాయితీ. ఉదయం ఎస్పీలు శబరీష్, గాష్‌ఆలం, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్ ఆధ్వర్యంలో జంగిల్ డ్రెస్‌తో కూడిన బలగాల మధ్య రోప్ పార్టీ సాగింది. దగ్గరుండి తరలించిన మంత్రి సారలమ్మను తీసుకురావడానికి రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కన్నెపల్లి గుడికి చేరుకున్నారు. అక్కడ పూజాక్రతువును స్వయంగా పరిశీలించి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ సారలమ్మను తీసుకువచ్చారు. కిక్కిరిసిన జనం ఎటు చూసినా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మంగళవారం రాత్రి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం రాత్రివరకు మేడారం పరిసర ప్రాంతాలు గుడారాలతో నిండిపోయాయి. జంపన్నవాగు వద్ద ఇసుకేస్తే రాలని పరిస్థితి ఏర్పడింది. వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్దకు చేరడానికి కాలినడకన వస్తుండడంతో ఒక్క వాహనం కూడా ముందుకు కదలలేని పరిస్థిత నెలకొంది. రెడ్డిగూడెం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. వనదేవతలను దర్శించుకునేందు కు గద్దెల ప్రాంగణంలో పెద్ద ఎత్తున బారులుదీరా రు. వీవీఐపీ, వీఐపీల క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ నెలకొంది. మూడు కిలోమీటర్లకు ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తల్లుల దర్శనం, జంపన్నవాగుకు దారి, ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్లపై అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఐసీడీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద సమాచారాన్ని మైకుల్లో తెలుపుతూ తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. తాడ్వాయి: వరాల తల్లి సమ్మక్క నేడు(గురువారం) చిలకలగుట్ట పైనుంచి గద్దెకు చేరే ఘడియలు ఆసన్నమయ్యాయి. వనం నుంచి జనంలోకి సమ్మక్క రానుంది. ఈ సందర్భంగా వరాల తల్లికి స్వాగతం పలికేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. అమ్మవారి రాకకు ముందుగా సమ్మక్క పూజారులు గుడిలో శక్తిపీఠాన్ని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వకుండా కట్టుదిట్టం చేసి రహస్య క్రతువు చేపడతారు. అనంతరం గుడి నుంచి పూజా సామగ్రి తీసుకువచ్చి గద్దె అలికి కంకవనాలను కట్టి కుంకుమ, పసుపులతో అలంకరిస్తారు.. ఏకాంతంలో నిర్వహించే ఈ ప్రక్రియ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వరు. అలాగే మేడారంలోని ఆడపడుచులు, ఆదివాసీ కుటుంబాలు, పూజారులు, వడ్డెలు సైతం సమ్మక్క రాకకు ఆహ్వానంగా వారి ఇళ్లను ముగ్గులతో అలంకరిస్తారు. ఇదిలా ఉండగా.. పోలీసులు, రోప్‌పార్టీ సిబ్బంది చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు రిహార్సల్స్ చేశారు. అమ్మవారు వచ్చే దారికి ఇరువైపులా బారికేడ్లు అమర్చిన పోలీసులు బుధవారం నుంచి బందోబస్తు నిర్వహించారు. అమ్మవారి ఆగమనం కోసం కోటి మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇవి చదవండి: మేడారంలో నేడు అసలు ఘట్టం ఆవిష్కరణ -
జానపద గాథల్లో... సమ్మక్క
ఇంతింతై వటుడింతౖయె... ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జన జాతరగా ప్రసిద్ధిగాంచిన ‘మేడారం సమ్మక్క జాతర’కు కారకులైన గిరిజన వీరవనితలు సమ్మక్క, ఆమె కూతురు సారలమ్మల పుట్టుపూర్వోత్తరాల గురించి అందుబాటులో గల ఆధారాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజు ప్రతాపరుద్రునితో జరిగిన పోరాటంలో కుట్రతో ఒక సైనికుడు దొంగ చాటుగా బల్లెంతో చేసిన దాడిలో సమ్మక్క క్షతగాత్రురాలై చిలకలగుట్ట వద్ద అదృశ్యమైనట్టు జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథల ద్వారా తెలుస్తోంది. కానీ కాకతీయ రాజ్య చరిత్రలో మేడారం పోరాటం, సమ్మక్క– పగిడిద్దరాజుల సామంత రాజ్యం గురించిన ప్రస్తావన లేదు. గిరిజనుల ఆశ్రిత కులం వారు డోలీలు. వీరు ‘పడిగె’ అనే త్రికోణాకార గుడ్డపటం సాయంతో గిరిజన పూర్వీకుల చరిత్ర, వీర గాథలను ‘డోలి’ వాయిస్తూ గానం చేస్తారు. మణుగూరు ప్రాంతంలోని గూడెంకు చెందిన డోలి కళాకారుడు ‘సకిన రామచంద్రయ్య’ చెప్పే పడిగె కథ ప్రకారం: పేరంబోయిన కోయ రాజు వంశానికి చెందిన ఆరవ గట్టు సాంబశివ రాజు– తూలు ముత్తి దంపతులకు ఐదుగురు సంతానం – సమ్మక్క పెద్దకూతురు. ఆమెకు యుక్త వయస్సు రావడంతో బస్తరు ప్రాంతానికి వెళ్లి పగిడిద్ద రాజును చూసి ఆయనతో పెళ్లి చేయ నిశ్చయించాడు తండ్రి. మేడారం దగ్గరి కామారం గ్రామానికి చెందిన గిరిజన నాయకుడు మైపతి అరుణ్ కుమార్ తన క్షేత్ర పర్య టనలు, పూర్వీకుల మౌఖిక కథల ద్వారా సేకరించిన సమా చారం ప్రకారం... కోయత్తూర్ సమాజంలోని ఐదవ గట్టు ‘రాయి బండని రాజు’ వంశానికి చెందిన ఆడబిడ్డ సమ్మక్క ‘చందా‘ ఇంటి పేరు గల రాయి బండాని రాజుకు ఇద్దరు భార్యలు. ఆ రాజుకు వెదురు పొదల వద్ద ముద్దులొలికే పసిపాప కని పిస్తుంది, ఆ పాపను ఇంటికి తెచ్చి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. ఈ రాజుకు నాగు లమ్మ అనే మరో కుమార్తె జన్మించింది. కోయ వారి సంప్రదాయం ప్రకారం తొలిసూరి బిడ్డను ఇంటి వేల్పుగా కొలుస్తారు. అందుకే సమ్మక్క చందా వారి ఇలవేల్పు అయ్యింది. ఈ రెండు కథనాల్లోనూ పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహాన్ని ఆమె తండ్రి కుదుర్చుతాడు. అయితే నాట కీయ పరిణామాల మధ్య సమ్మక్క, నాగులమ్మలను ఇద్దరినీ పగిడిద్దరాజు వివాహం చేసుకుంటాడు. స్వాతంత్య్రానికి పూర్వం నైజాం రాజ్యంలో చందా, సిద్ధబోయిన ఇంటిపేర్లున్న గిరిజన కుటుంబాలు మాత్రమే చేసుకునే చిన్న జాతర ఇది. ప్రతి ఏటా జాతర చేసే స్థోమత లేక రెండే ళ్లకోమారు అది కూడా చందాలు వేసుకునీ, అవీ చాలక వరంగల్‌లోని వర్తకులు దగ్గర వడ్డీలకు డబ్బులు తెచ్చి ఈ జాతర నిర్వహించేవారు. 1961లో నాటి రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. 1996లో ‘రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించింది. పాలకులు, భక్తుల కృషితో నేడు ఉన్న స్థితికి ఈ జాతర చేరింది. – డా‘‘ అమ్మిన శ్రీనివాసరాజు, పరిశోధక రచయిత (నేటి నుంచి ఫిబ్రవరి 23 వరకు మేడారం జాతర) కుంకుమ భరిణ రూపంలో... సమ్మక్క ఓ కోయరాజు కుమార్తెగా జానపద కథలు చెబు తున్నాయి. ప్రతాపరుద్రునితో జరిగిన యుద్ధంలో తమ వారంతా మరణించడంతో సమ్మక్క వీరావేశంతో శత్రు మూకలను సంహరించింది. కానీ ఒక సైనికుడు ఆమెను వెన్నుపోటు పొడవడంతో రక్తపు టేరుల మధ్య అడవి వైపు వెళ్తూ అదృశ్యమయ్యింది. గిరిజనులు ఆమె కోసం వెదుకు తుండగా చిలకల గుట్టపై నెమలినార చెట్టుకింద కుంకుమ భరిణ కనిపించింది. తన శక్తియుక్తులనూ, ధైర్యసాహసాలనూ సమ్మక్క ఆ భరిణలో నిలిపిందని భావించి ఆమె ప్రతి రూపంగా భావించారు గిరిజనులు. అక్కడే గద్దెలను నిర్మించి అప్పటినుండి సమ్మక్క సారలమ్మ జాతర జరి పించ సాగారు.మాఘశుద్ధ పౌర్ణమి నుండి నాలుగు రోజులు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగు తుంది. మొదటిరోజు కన్నెపల్లి నుండి సారలమ్మకు ప్రతి రూప మైన పసుపు భరిణను మేళ తాళాలతో తీసుకువచ్చి వెదురు కర్రకు పట్టుదారంతో కడతారు. రెండవ రోజు సమ్మక్కకు ప్రతిరూపంగా భావించే కుంకు మభరిణను చిలకల గుట్టనుండి తీసుకువచ్చి వెదురుకర్రకు అలంకరిస్తారు. రెండు గద్దెలపై రెండు వెదురు కర్రలను సమ్మక్క, సారలమ్మలుగా ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు. మూడవ రోజు ‘వనదేవతలు’గా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు నివేదిస్తారు. జంపన్న వాగులో స్నానం చేసి, తలనీలాలు సమర్పించుకుంటారు. కోరికలు నెరవేరాలని వేడుకుంటారు. నాలుగవ రోజు సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. – అయిత అనిత, రచయిత్రి -
‘మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడం బాధాకరం’
సాక్షి, ములుగు జిల్లా: సమ్మక్క సారలమ్మ జాతరలో రేపటి నుంచి మహాఘట్టం మొదలవుతుందని మంత్రి మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లపై ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు అందరు దేవుళ్లు గద్దెలపై ఉంటారన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీళ్ల సౌకర్యం పెంచామని, భక్తులకు బంగారం(బెల్లం) చేరడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా కేంద్రం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ‘‘60 లక్షల మంది భక్తులు ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్నారు. కోటి 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతర సందర్భంగా సెలవులు ప్రకటించాము. సీఎం, గవర్నర్, స్పీకర్ అమ్మవార్ల దర్శనానికి వస్తారు. వీఐపీలు సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం పూర్తి చేసుకోవాలి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలి. సమ్మక్క చరిత్రను శిలాశాసనం ద్వారా లిఖిస్తాం’’ అని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇదీ చదవండి: కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు -
వచ్చే 4 రోజులు తెలంగాణ బస్సులు బిజీ బిజీ
తొందరపడి బస్టాండ్లవైపు పరుగులు తీయొద్దని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. వచ్చే నాలుగు రోజులు ఎక్కువ బస్సులు మేడారం వెళ్తాయి కాబట్టి.. సాధారణ రూట్లలో బస్సులు తక్కువ ఉంటాయి. అలాగే కొన్ని రద్దవుతాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. "తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం." రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. – వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ఆర్టీసీ. సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!! తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024 -
ఆర్టీసీ ప్రయాణికుల అసౌకర్యంపై ఎండీ సజ్జనార్ స్పందన
హైదరాబాద్, సాక్షి: మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను దాదాపుగా తరలించిన నేపథ్యంలో.. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో.. సాధారణ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తయ్యే వరకు ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనసుతో సహకరించాలని కోరారాయన. తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. రెగ్యులర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!! తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024 ఇదీ చదవండి: ఓవైపు బస్సుల్లేవ్.. మరోవైపు హౌజ్‌ఫుల్!! అంతకు ముందు.. జాతర వెళ్లే భక్తులకు ఆర్టీసీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు అవకాశం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. మూగజీవాలకు ఆర్టీసీ బస్సుల్లో ఎంట్రీ లేదన్నారాయన. అంతేకాదు.. గతంలో ఎప్పుడూలేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని మేడారంలో 15 కిలో మీటర్ల మేర 48 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. -
ఖర్చులు వెల్లడిస్తాం
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరకు చేసిన ఖర్చుల వివరాలను వెల్లడిస్తామని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను సోమవారం దర్శించుకున్న అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. జాతరకు డబ్బు లేదనకుండా ఖర్చు చేసి ఏర్పాట్లు చేశామన్నారు. గత ప్రభుత్వం జాతరకు మూడు వేల బస్సులను నడిపితే.. ఈ ప్రభుత్వం ఆరువేల బస్సులు నడుపుతోందన్నారు. ఇప్పటివరకు వనదేవతలను 17 లక్షల మంది మహిళలు దర్శించుకున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ రానంతమంది ఈసారి జాతరకు వచ్చిపోతున్నారని, వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. క్రమశిక్షణ, స్వీయ రక్షణతో జాతరకు వచ్చివెళ్లాలని, వాహనాలను ఓవర్టేక్ చేసి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. -
TSRTC: ఓవైపు బస్సుల్లేవ్.. మరోవైపు హౌజ్‌ఫుల్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వినియోగించనుండటంతో సాధారణ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈసారి జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భారీ సంఖ్యలో బస్సులను సమకూర్చింది. 4,479 ఆర్టీసీ బస్సులతో పాటు పాఠశాల, కళాశాల బస్సుల్లాంటి ప్రైవేటు వాహనాలు మరో 1,500 వరకు ఏర్పాటు చేసింది. ఇలా సుమారు 6 వేల బస్సులు ఐదు రోజుల పాటు మేడారం భక్తుల సేవలో ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నిర్దిష్ట ప్రాంతాలకు తరలిపోవడంతో బస్స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోతే సాధారణ ప్రయాణికుల తిప్పలు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం. ‘మహాలక్మి’తో పెరిగిన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులో ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే మహిళల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఆటోలు లాంటి ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారిలో 90 శాతం మంది బస్సుల వైపు మళ్లారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 30 లక్షల మేర ఉంటోంది. ఫలితంగా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒకేసారి ఇన్ని బస్సులు అందుబాటులో లేకుండాపోతే పరిస్థితి గందరగోళంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిరోజే అవస్థలు రాష్ట్రంలోని 51 కేంద్రాల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడవాల్సి ఉంది. దీంతో విడతల వారీగా బస్సులు ఆయా కేంద్రాలకు తరలిపోతున్నాయి. సోమవారం దాదాపు 550 బస్సులు వెళ్లాయి. హైదరాబాద్ నగరం నుంచి కూడా 250 బస్సులు వెళ్లిపోయాయి. సాధారణంగా సోమవారాల్లో బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్పేర్ బస్సులు సహా అన్ని బస్సులను తిప్పినా ఆ రోజు రద్దీని తట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. గత సోమవారం ఏకంగా 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో తిరిగారు. ఈ సోమవారం కొన్ని బస్సులు మేడారం జాతరకు వెళ్లిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. బస్సులు సరిపోక తోపులాటలు చోటు చేసుకున్నాయి. నగరంలో ఫుట్‌బోర్డులపై వేళ్లాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ఇక బుధవారం నుంచి మిగతా బస్సులు వెళ్లిపోతే పరిస్థితి ఏంటని అధికారుల్లో టెన్షన్ మొదలైంది. సాధారణ రోజుల్లోలాగే బుధవారం తర్వాత కూడా రద్దీ ఉంటే మేడారం డ్యూటీ బస్సుల్లో కొన్నింటిని తిరిగి వాపస్ పంపే యోచనలో ఉన్నారు. కానీ మేడారం ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి రైల్వే అధికారులు 30 ప్రత్యేక రైళ్లను మేడారం కోసం తిప్పుతున్నారు. ఒక రైలులో 1,500 మంది ప్రయాణికులు వస్తారు. మేడారం వరకు రైల్వే లైన్ లేనందున ఎక్కువ మంది కాజీపేట, వరంగల్, మహబూబాబాద్ స్టేషన్లలో దిగుతారు. దీంతో రైలు వచ్చే సమయానికి ఒక్కో స్టేషన్ వద్ద 30కి పైగా బస్సులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద వచ్చే ఆదివారం వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. 👉: తెలంగాణ అంతటా ఆర్టీసీ బస్సులు హౌస్‌ఫుల్ (ఫొటోలు) -
టర్నింగులున్నాయి.. డ్రైవింగ్ జాగ్రత్త
సాక్షిప్రతినిధి, వరంగల్: హైదరాబాద్ నుంచి మేడారం 245 కిలోమీటర్లు. కారులో వెళ్లేవారికి 5.20 గంటల సమయం పడుతుంది. ఎన్‌హెచ్–163 రహదారిపై ప్రయాణించే భక్తులు హైదరాబాద్, యాదగిరిగుట్ట, జనగామ, రఘునాథపల్లి, కరుణాపురం, కాజీపేట, ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లపూర్‌ల మీదుగా మేడారం చేరుకోవాలి. ► ఈ రోడ్డుపై పెంబర్తి శివారులో 90–90.5 కి.మీ. లు, వీఓ హోటల్ నుంచి అక్షయ హోటల్ 9.5–94 కి.మీ.లలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ► జనగామ– నెల్లుట్ల మధ్యలో రోడ్డు దాటేందుకు ఇబ్బందులు తప్పవు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై పలువురు చనిపోయారు. పెంబర్తి, నిడిగొండ, యశ్వంతాపూర్, రాఘవాపూర్, చాగళ్లు, పెండ్యాల అండర్‌పాస్‌లు లేకపోవడంతో జాతీయరహదారి దాటేందుకు ఇబ్బందులు తప్పవు. ► నెల్లుట్ల బైపాస్ రోడ్డు ఆర్టీసీ కాలనీ బ్రిడ్జి, నడిగొండ యూటర్న్, రఘునాథపల్లి శివారు, ఛాగల్, స్టేషన్‌ఘన్‌పూర్, కరుణాపురం, ధర్మసాగర్ మండలం రాంపూర్క్రాస్రోడ్డు, మడికొండ కందాల దాబా, కాజీపేట డీజిల్ కాలనీ, కాజీపేట నుంచి ఫాతిమా ఫ్లైఓవర్, సుబేదారి ఫారెస్టు ఆఫీసు, దామెర మండలం పసరగొండ, ఊరుగొండ శివారు, ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్‌రోడ్, కటాక్షపూర్‌లను ‘బ్లాక్‌స్పాట్’లుగా అధికారులు గుర్తించారు. ► మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లపూర్‌ల మూలమలుపుల ముప్పును అధిగమించితే మేడారం చేరుకున్నట్టే. ప్రత్యేక చర్యలు చేపట్టాం మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరకు వెళ్లే వాహనదారులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. నిబంధనలకు మించి ఎక్కువ మందిని వాహనాల్లో తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. - పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, హనుమకొండ హైదరాబాద్ నుంచి మేడారం245 కిలోమీటర్లు హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల బస్‌స్టేజీ నుంచి వంగాలపల్లి–కరుణాపురం బస్‌స్టేజీల వరకు మూడు యూటర్న్లు ఉన్నాయి. ► చిన్నపెండ్యాల నుంచి ఘన్పూర్ వెళ్లాల్సిన వాహనాలు గ్రానైట్ సమీపంలో యూటర్న్ తీసుకోవాలి. వాహన చోదకులు తక్కువ దూరంలో దాబా హోటల్ సమీపంలో రాంగ్ రూట్లో యూటర్న్ తీసుకుంటున్నారు. ► హనుమకొండ నుంచి చిన్నపెండ్యాల గ్రామంలోకి వెళ్లాల్సిన వాహనాలు దాబా ముందు యూటర్న్ తీసుకోవాలి. వాహన చోదకులు గ్రానైట్ వద్ద రాంగ్ రూట్లో యూటర్న్ తీసుకుంటున్నారు. దీంతో ఈఏడాది 10 రోడ్డు ప్రమాదాలు జరగగా ఐదుగురు మృతిచెందారు. జాతర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి. వరంగల్ నుంచి మేడారం95.5 కిలోమీటర్లు వరంగల్ నుంచి మేడారం 95.5 కిలోమీటర్లు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుంటే భక్తులు ఎన్‌హెచ్ 163 రహదారి గుండా 2.20 గంటల నుంచి 2.40 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. వరంగల్ నుంచి మేడారం వెళ్లే భక్తులు హనుమకొండ, ఆరెపల్లి, దామెర, ఆత్మకూరు, జవహర్‌నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, రాఘవపట్నం, ఇప్పలగడ్డ, మొట్లగూడెం, వెంగ్లాపూర్, నార్లపూర్ ద్వారా మేడారం చేరుకుంటారు. ► ములుగు గట్టమ్మ సమీపంలో మూడు మలుపులుంటాయి. ఇదివరకు ఇక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. ► హనుమకొండ–మలుగు మధ్య 163 జాతీయ రహదారి ఆరెపల్లి–గుడెప్పాడ్ మధ్య రోడ్డు విస్తరణ పనులు పూర్తయినా, ఎక్కడా సూచిక బోర్డులు లేనందున జాగ్రత్తగా వెళ్లాలి. హైదరాబాద్ టు మేడారం : 3 టోల్గేట్లు హైదరాబాద్ నుంచి మేడారం జాతర వచ్చే ప్రయాణికులు మూడు టోల్గేట్లు దాటాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల వద్ద మరోటి, ములుగు దాటాక జవహర్‌నగర్ వద్ద ఇంకో టోల్గేట్ ఉంటుంది. అయితే జాతర జరిగే 4 రోజులపాటు జవహర్‌నగర్ వద్ద టోల్ ఎత్తేస్తారు. మహబూబాబాద్ నుంచి మేడారం134 కి.మీ. సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి నర్సంపేట ద్వారా మేడారం వెళ్లే భక్తులు సొంత వాహనంలో అయితే 134 కిలోమీటర్లు ప్రయాణించాలి. గమ్యస్థానానికి 3.20 గంటల్లో మహబూబాబాద్, గూడూరు, ఖానాపూర్, నర్సంపేట, నల్లబెల్లి, మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లపూర్‌ల మీదుగా మేడారం చేరుకోవచ్చు. ► నర్సంపేట నుంచి మేడారం వరకు ఈ దారిలో 30 వరకు మూలమలుపులు ఉన్నట్టు ఎన్హెచ్ఏఐ అధికారులు గుర్తించారు. తాడ్వాయి మీదుగా అనుమతి వీరికే... ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ పాస్‌లు ఉన్న వాహనాలు హనుమకొండ, ములుగు రోడ్డు, గుడెప్పాడ్, పస్రా, తాడ్వాయి నుంచి నేరుగా మేడారం వెళతాయి. ప్రైవేట్ వాహనాలు మాత్రం పస్రా నుంచి నార్లాపూర్, మేడారం వెళ్లాలి. తాడ్వాయి మీదుగా అనుమతి లేదు. పొరపాటున వెళ్లినా తాడ్వాయి వద్ద వెనక్కి పంపుతారు. కరీంనగర్ నుంచి మేడారం153 కి.మీ. కరీంనగర్ టు మేడారం 153 కి.మీ.లు. కరీంనగర్, కేశవపట్నం, హుజూరాబాద్, కమలాపూర్, రేగొండల మీదుగా ములుగు చేరుకుని వెంకటాపూర్, చల్వాయిల మీదుగా మేడారానికి 3.40 గంటల సమయం పడుతుంది. ► భూపాలపల్లి నుంచి మేడారం 53.8 కిలోమీటర్లు.మల్లంపల్లి, రాంపూర్, దూదేకులపల్లి, బయ్యక్కపేట, తక్కళ్లగూడెం, నార్లపూర్‌ల మీదుగా 1.10 గంటల నుంచి 1.30ల వ్యవధిలో మేడారం చేరుకోవచ్చు. ► జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ సమీపంలోని కొత్తపల్లి వద్ద, కాళేశ్వరం– మహదేవపూర్ మధ్య మూలమలుపులు ప్రమాద భరితంగా ఉన్నాయి. ► కాళేశ్వరం నుంచి ఇసుక లారీలు ఎక్కువగా 353 సీ జాతీయ రహదారిపై ప్రయాణిస్తాయి. ఒక్కోసారి వీటిని రోడ్డు పక్కనే నిలుపుతారు. వీటివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ. ► భూపాలపల్లి, పరకాల, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ శివారు ప్రాంతాల్లోనూ రహదారి పక్కనే వాహనాలు నిలుపుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం మీదుగా మేడారం మహాజాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల భక్తులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో భారీగా తరలివస్తారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, గొండియా జిల్లాలు, ఛత్తీస్‌గఢ్ నుంచి భూపాలపట్నం, బీజాపూర్ జిల్లాల భక్తులు, తెలంగాణ నుంచి పూర్వపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, చెన్నూర్ల నుంచి ఈ దారిగుండా మేడారం జాతరకు వస్తారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాటారం వరకు 32 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 353(సీ) పైన 18 అతి ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయి. దీంతో త్వరగా గమ్యం చేరాలని వాహన దారులు ఆదమరిచి వాహనం నడిపితే మృత్యుఒడిలోకి చేరినట్టే. ఈ రహదారిపై అంతర్రాష్ట్ర వంతెన నుంచి ఎస్సీకాలనీ వద్ద, అన్నారం మూలమలుపు, అడవి మధ్యలోని డేంజర్ క్రాసింగ్‌ల వద్ద అనేక ప్రమాదాలు జరిగాయి. కనీసం ఇక్కడ ఎన్‌హెచ్ అధికారులు కూడా ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. చల్వాయి బస్టాండ్ : జర చూసి నడపండి ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామం మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుంది. రెండు మాత్రమే యూటర్న్ పాయింట్లు ఉండడం వల్ల వాహనాల్లో ప్రయాణించే వారు, గ్రామస్తులు ఈ పాయింట్స్ నుంచే రోడ్డు క్రాస్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ► పస్రా, గోవిందరావుపేట గ్రామాల మధ్యలో ఉన్న చర్చి మూలమలుపు ఇప్పటికే చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఎక్కువగా ప్రమాదాలు ఇక్కడే జరుగుతాయి. రోడ్డు పై ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, ఈ ప్రాంతానికి రాగానే రోడ్డు వెడల్పుగా కనిపిస్తుంది. దగ్గరలో గ్రామాలు లేకపోవడంతో వాహనదారులు అధికవేగంతో రావడం వల్ల వాహనాన్ని కంట్రోల్ చేయలేక, మూలమలుపు తప్పించలేక ప్రమాదాలు జరుగుతుంటాయి. భక్తులు ఇక్కడ చాలా జాగ్రత్తగా వాహనం నడపాలి. ఇవి తప్పనిసరిగా పాటించండి ► వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పరిమితికి మించిన వేగం మంచిది కాదు. ► ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్టేక్ చేయకపోవడమే బెటర్. ►మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జాతరకు వెళ్లే వాహన చోదకులు మద్యానికి దూరంగా ఉండాలి. ► మూలమలుపులు, ఇరుకు వంతెనలు, రహదారుల వద్ద వేగం తగ్గించాలి. నిర్ణిత స్థలాల్లోనే పార్కింగ్ చేయాలి జాతరకు వచ్చే భక్తులు వాహనాలను జాతరలో కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేయాలి. భక్తులకు తెలిసేలా అన్నిచోట్ల సైన్ బోర్డులు ఏర్పాటు చేశాం. జాతర పరిసర ప్రాంతాల్లో 10 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి కరెంట్, నీటి సరఫరా అందుబాటులో ఉంచాం. రోడ్లపై అడ్డంగా నిలిపే వాహనాలను ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోకి టోయింగ్ వాహనాలతో తరలిస్తాం. - అంబర్ కిషోర్ ఝా ,మేడారం జాతర, ట్రాఫిక్ ఇన్చార్జ్,వరంగల్ సీపీ -
మేడారం జాతరకు రూట్ మ్యాప్
-
మేడారం జాతరకు హెలికాప్టర్
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. ఈ సేవలు నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. హనుమకొండలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ మైదానం నుంచి మేడారం వరకు సేవలందిస్తుంది. చార్జీలు ఇలా... ఒక్కో ప్యాసింజర్ (అప్ అండ్ డౌన్)కు వీఐపీ దర్శనం రూ. 28,999, జాతరలో ఏరియల్ వ్యూరైడ్ ఒక్కొక్కరికి రూ.4,800. బుకింగ్ ఇలా..: హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 74834 33752, 94003 99999 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఆన్లైన్లో info@helitaxi. com ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సేవలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పర్యాటక శాఖ పర్యవేక్షణలో కొనసాగుతాయి. -
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వరంగల్‌కు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. నిజామాబాద్– వరంగల్ స్పెషల్ ట్రైన్ నిజామాబాద్– వరంగల్ (07019) ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్‌లో ఉదయం 7:05 గంటలకు బయలుదేరి వరంగల్‌కు మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుతుంది. అదే విధంగా వరంగల్–నిజామాబాద్ (07020) ఎక్స్‌ప్రెస్ వరంగల్‌లో మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి రాత్రి 10:30 గంటలకు నిజామాబాద్‌కు చేరుతుంది. వరంగల్– నిజామాబాద్ మధ్య ఈ రైళ్ల సర్వీస్‌లకు కాజీపేట జంక్షన్, పెండ్యాల్, ఘన్పూర్, రఘునాథపల్లి, జనగామ, ఆలేరు, వంగపల్లి, భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్, చర్లపల్లి, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, బొల్లారం, మేడ్చల్, మనోహరబాద్, వదిరాం, మిర్జాపల్లి, అక్కన్నపేట, కామారెడ్డి రైల్వే స్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ స్పెషల్ ట్రైన్ సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ ప్రత్యేక రైలు (07017) సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 10 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా వరంగల్ టు సిర్పూర్ కాగజ్‌నగర్ (07018) రైలు సాయంత్రం 4 గంటలకు వరంగల్‌నుంచి బయలుదేరి రాత్రి 12 గంటలకు కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది. సిర్పూర్కాగజ్నగర్–వరంగల్ మధ్య కాజీపేట టౌన్, హసన్‌పర్తి, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్, కొత్తపల్లి, ఓదెల, కొలనూరు, కొత్తపల్లి, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట్, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్డు, రేపల్లెవాడ, ఆసిఫాబాద్, రాళ్లపేట్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఇదీ చదవండి: TS: రవాణాశాఖలో భారీ ఎత్తున బదిలీలు.. ఉత్తర్వులు జారీ -
సర్వం సిద్ధం..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర కుంభమేళాకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారంలో శ్రీ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, జంపన్నవాగుపై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి మేడారానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఈఓ రాజేంద్రం పాల్గొన్నారు. ఈనెల 14న మండమెలిగె పండుగ మహాజాతర ప్రారంభానికి ఇంకా తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. 14న బుధవారం సమ్మక్క– సారలమ్మ పూజారులు మండమెలిగె పండుగ నిర్వహించనున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా లచ్చుపటేల్ సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ నియమించింది. చైర్మన్‌గా అరెం లచ్చుపటేల్, కమిటీ సభ్యులుగా మిల్కూరి అయిలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణ్‌సింగ్, ముంజల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిషోర్, కొరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణస్వామి, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావును నియమించారు. చైర్మన్‌తో పాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం త్వరలో చేయనున్నట్లు తెలిసింది. -
మేడారం 2024..ఆన్ లైన్ మొక్కులు
-
మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగనుంది. ఇక, ఈసారి మేడారం జాతర కోసం భక్తులు ఇప్పటి నుంచే పోటెత్తుతున్నారు. దీంతో, టీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇదే సమయంలో మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా, తాజాగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ..‘మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నాం. ఇక, మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈనెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించాం. ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి మేడారం వరకు మొత్తం 228 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉ. 6.00, 6.30 గంటలకు జేబీఎస్ నుంచి, 7 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. పెద్దలకు రూ. 750 చిన్నారులకు రూ. 450 టిక్కెట్ ధర నిర్ణయించారు. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.00, 2.30, 3.00 గంటలకు బయలుదేరతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఇందులో రానుపోను టిక్కెట్ ఛార్జీ పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.310లు. సూపర్‌లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులను కూడా నడుపుతారు. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదు. సూపర్ లగ్జరీలో టిక్కెట్ ధర పెద్దలకు రూ.750, చిన్నారులకు రూ.550, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా నిర్ణయించారు. -
ఆన్లైన్ ద్వారా సమ్మక్క–సారలమ్మలకు ‘బంగారం’
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారలమ్మలకు ఆన్లైన్ ద్వారా నిలువెత్తు బంగారం (బెల్లం) సమరి్పంచే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం.. అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం తన మనవడు రియాన్‡్ష పేరిట నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించారు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈ సందర్భంగా తన మనవరాలి నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా అమ్మవార్లకు సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. మేడారంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తూ పోస్టర్ మేడారం మహాజాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ, జాతరను పరిశుభ్రంగా జరుపుకోవాలని భక్తులను కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఓ పోస్టర్‌ను ఆవిష్కరించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు. -
మేడారం జాతరకు రావాలని గవర్నర్ తమిళిసైని ఆహ్వానించిన సీతక్క
-
ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీవరకు మేడారం మహాజాతర
-
మేడారం జాతర ఏర్పాట్లపై..సీతక్క సీరియస్
-
మేడారంలో సమ్మక్క– సారలమ్మల వద్ద భక్తుల కోలాహలం (ఫొటోలు)
-
‘మేడారం’ జాతరకూ మహిళలకు ఫ్రీ బస్సు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరకు వచ్చే ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తింపజేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహాజాతరపై మరో మంత్రి కొండా సురేఖతో కలిసి బుధవారం ఉన్నత స్థాయిలో సమీక్షించారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ అందరి సహకారంతో జాతరను విజయవంతం చేయాలన్నారు. అభివృద్ధి పను ల విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చూడాలని సూచించారు. కాంట్రాక్టర్లకు వంతపాడే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాజాతర అంటే ఎన్ని సౌకర్యాలు కల్పించినా, అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. వాటిని తన దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2014 మేడారం మహాజాతరలో సమ్మక్క–సారలమ్మలు గద్దెనెక్కిన రోజు, తెలంగాణబిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన రోజు ఒక్కటే అన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా తల్లుల దీవెనలతోనే ఏర్పడిందని, సోనియాగాంధీ ఇచి్చన తెలంగాణ రాష్ట్రంలో జరిగే మహాజాతరకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీతక్క వివరించారు. జాతరను విజయవంతం చేస్తాం: మంత్రి కొండా సురేఖ మహాజాతరను విజయవంతం చేసేందుకు సమ్మక్క–సారలమ్మల స్ఫూర్తితో మంత్రి సీతక్కతో కలిసి పనిచేస్తానని మంత్రి సురేఖ అన్నారు. వరంగల్ ఆడబిడ్డలుగా జాతరలో పనిచేయడం తమ అదృష్టమన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృదిŠధ్ పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజాధనం దుర్వింనియోగం కాకుండా చూస్తూ అధికారుల వెంట పడి పరిగెత్తించి పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి రూ.1.50కోట్లతో పూజారుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ప్రతిపక్షాలకు విమర్శించే అర్హత లేదని, సలహాలు, సూచనలు అందించి జాతర విజయవంతానికి సహకరించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో యాదాద్రిలో అభివృద్ధి పేరిట మూల విరాట్‌ను కదిలించి యాదాద్రిని నిర్మించారని, అది శాస్త్రీయంగా తప్పిదమని తెలిపారు. గిరిజన జాతరలో పూజారుల పాత్ర కీలకమని, వారి కోసం ప్రభుత్వం 10 గదులతో అతిథి గృహనిర్మాణం చేపడుతుందని, వచ్చే మినీ జాతర నాటికి అతిథి గృహాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి సురేఖ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్, అడిషనల్ ఎస్పీ సదానందం, అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఐటీడీఏ పీఓఅంకిత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, ఓఎస్డీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొదలైన భక్తుల సందడి మేడారం జాతరకు నెల రోజుముందుగానే భక్తుల తాకిడి మొదలైంది. సంక్రాంతి సెలవుల చివరి రోజు కావడంతో బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద బంగారం, చీర, సారె, పూలు, పండ్లు, పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు సమర్పించారు. -
మేడారం జాతరను దిగ్విజయం చేయాలి
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత వర్గాలు పార్టీలకు అతీతంగా పనిచేసి మేడారం జాతరను దిగ్విజయం చేయాలని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా ములుగు నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేడారం మహాజాతరకు నిధుల మంజూరులో అలస్యమైందని, కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా వెంటనే ఆయన నిధులు మంజూరు చేశారని తెలిపారు. జాతర ప్రాంతంలో అభివృద్ధి పనులను శాశ్వతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అలాగే జాతరకు నిధులు కేటాయించాలని కోరామని, ఈసారి కేటాయిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అంతకుముందు మేడారంలోని ఐటీడీఏ అతిథిగృహంలో మంత్రి సీతక్క.. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఎస్పీ గాష్ ఆలం, ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీచైర్‌పర్శన్ బడే నాగజ్యోతితో కలసి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మేడారం జాతరకు ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల తాకిడి జనవరి చివరి వారం నుంచే మొదలవుతున్నందున పనులన్నీ జనవరి 20 నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా రోడ్లు వేయాలని, అవసరమైన చోట మరమ్మతులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడారంలో పార్కింగ్, వసతుల కల్పనలో ఇబ్బందులు రాకుండా అటవీ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించడానికి కృషి చేయాలని సూచించారు. ములుగు ప్రజలకు మొదటి ప్రాధాన్యం.. ములుగులో జరిగిన ర్యాలీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మంత్రులు, స్థానిక నాయకులు కుట్రలు చేసి తనను అనేక ఇబ్బందుకు గురిచేశారని గుర్తుచేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా వంటి సౌకర్యాలను క ల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ములుగు నియోజకవర్గమే తన ఇల్లని.. మొదటి ప్రాధాన్యం ములుగు ప్రజలకే ఇస్తానని, అవసరం అయితే ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలను కొనసాగిస్తానని సీతక్క చెప్పారు. -
గ్రామీణ ప్రాంతాల నీటిసరఫరాపై పర్యవేక్షణ ఉంచండి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని శాఖ ఇంజనీర్లను కోరారు. మేడారం జాతరపై త్వరలోనే వివిధ విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో శుక్రవారం మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్లు, నదులు తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి ఆ శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ మంత్రికి వివరించారు. -
మేడారం జాతరకు జాతీయ హోదా కోసం కృషి
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారక్క జాతరకు జాతీయ పండుగ హోదా దక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆమె ఆదేశించారు. జాతీయ పండుగ హోదాతో రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నిధులకు కేంద్ర నిధులు తోడైతే జాతరను మరింత ఘనంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమ్మక్క–సారక్క జాతర ఏర్పాట్లపై సోమవారం డీఎస్ఎస్ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈసారి జాతర సమయంలో జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని మంత్రి సూచించారు. జాతర ఏర్పాట్లపై వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పల్లె ప్రజలకు మరింత చేరువ కావాలి పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరిగే కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం ఎంతో ఉపయోగ పడేవనీ, వాటిని మరింత సమర్ధవంతంగా ప్రజలకు చేరువయ్యేలాగా అధికారులు పనిచేయాలని ఆశాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. సోమవారం రాజేంద్రనగర్ టి.ఎస్.ఐ.ఆర్.డి.లో శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి శాఖ పని తీరును సమీక్షించారు. పీఆర్ ఆర్డీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ శెట్టి, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి ఆయా విభాగాల వారీగా చేపడతున్న కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
ఓటేయడానికి ‘దారి’... జంపన్నవాగుపై తాత్కాలిక రోడ్డు
ఏటూరునాగారం: ‘ఓటు వేయాలంటే వాగు దాటాలె’ శీర్షికన ఈ నెల 15వ తేదీన ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆర్అండ్బీ శాఖ జంపన్నవాగుపై తాత్కాలిక బ్రిడ్జికోసం నిర్మాణ పనులు చేపట్టింది. మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంల తరలింపు, పోలింగ్ సిబ్బంది కొండాయి ప్రాంతానికి వెళ్లి అక్కడే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం తదుపరి జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సమయంలో పెద్ద ఎత్తున వాహనాలు ఈ తాత్కాలిక రోడ్డుపై వెళ్లేలా నిర్మాణాలు చేపడుతున్నట్టు ఆర్అండ్బీ డీఈఈ రఘువీర్ ‘సాక్షి’కి తెలిపారు. 60 మీటర్ల పొడవున ఇసుక బస్తాలు వేసి దానిపై సిమెంటు పైపులు, తర్వాత మళ్లీ బస్తాలు వేసిన తర్వాత మట్టితో రోడ్డు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజల సదుపాయం కోసం ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. అధికారుల్లో కదలిక తీసుకొచ్చిన ‘సాక్షి’కి ముంపు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
వరంగల్: 'మేడారం జాతర'కు ఆరు నెలలే గడువు.. అయినా ఇలా..??
వరంగల్: 2024 ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారలమ్మల మహాజాతరకు ఇంకా ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం 18 శాఖల ద్వారా ఏర్పాట్ల కోసం రూ.75కోట్ల నిధులు అవసరమని అప్పటి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే జాతర సమీపిస్తున్నా.. నిధుల కేటాయింపుల్లో జాప్యం చేయడంతో ఈ జాతరలో కూడా హడావుడి పనులతోనే నిర్వహించేలా కనిపిస్తోందని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలోనే నిమగ్నం కావడంతో జాతర పనుల్లో జాప్యం తప్పేలా లేదు. నిధులు సరిపోయేనా..? మేడారం జాతరలో భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వానికి రూ.75కోట్ల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే జూలై చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు మేడారంలో శాశ్వతంగా నిర్మించిన కల్యాణ కట్ట షెడ్లు, రోడ్లు, విద్యుత్, గెస్ట్‌హౌజ్‌లు దెబ్బతిన్నాయి. జాతరకు రోడ్డు మార్గాలే చాలా అవసరం కానీ, వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో పాటు గుండ్లవాగు బ్రిడ్జి దెబ్బతినడంతో నెలరోజుల పాటు తాడ్వాయి నుంచి మేడారం మీదుగా ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు మళ్లించడంతో ఈ మార్గాన రోడ్లు మరింతగా ధ్వంసమయ్యాయి. అధికారులు మాత్రం రూ.75కోట్ల ప్రతిపాదనలు మాత్రమే ప్రభుత్వానికి పంపించారు. కానీ, జాతర ఏర్పాట్లు, ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిన మరమ్మతుల పనులకు ఈ నిధులు ఏ మూలన సరిపోతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటు అసెంబ్లీ ఎన్నికలు, అటు జాతర సమీపిస్తుండంతో అధికా రులు, ప్రజాప్రతినిధులు ముందుగా ఎన్నికల ఏర్పాట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. జాతరకు ఆరు నెలలే గడువు.. మేడారం మహాజాతరకు ఇంకా ఆరునెలల సమయమే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు. నిధులు మంజూరు చేయడం, టెండర్ల ప్రక్రియ, టెక్నికల్ ఆర్డర్లు పొందడం లాంటి వాటికే నెలకు పైగా సమయం పడుతుంది. ముందస్తుగా నిధులు మంజూరైతేనే పనులు నాణ్యతగా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు జాతర నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో జాతర వరకు కూడా పనులు పూర్తయ్యే అవకాశాలు లేవని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే జాతరకు నిధులు అసలు మంజూరవుతాయా.. లేదా.. అనే అనుమానం కలుగకమానదు. జాతర నిధుల మంజూరు విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలో నిమగ్నమయ్యారు. నిధులు మంజూరు చేయాలి.. మేడారం జాతర నిధులను ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలి. జాతరలో భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించి, సరిపడా నిధులు కేటాయించాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు చొరవచూపి జాతరకు ముందే పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. – సిద్దబోయిన జగ్గారావు, పూజారుల సంఘం అధ్యక్షుడు -
తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం హడలెత్తిస్తోంది. అన్ని జిల్లాలలోని మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలపై పై వరుణుడు పగబట్టాడు. వర్షాలు, వరదల ధాటికి మ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయి. తెలంగాణ చరిత్రలోనే అత్యంత రికార్డు వర్షపాతం ములుగు జిల్లాలో నమోదైంది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8 మిల్లీ మీటర్లు..అంటే 64 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదవడం గమనార్హం. లక్ష్మీదేవ్ పేట్ వద్ద 533.5 మిల్లీ మీటర్లు అంటే 53 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. గత 24 గంటల్లో ములుగు జిల్లాలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల పైన వర్షం పడింది. చదవండి: పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్.. తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ మునిగిన మేడారం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాడ్వాయి మండలంలోని మేడారం నీటమునిగింది. జంపన్న వాగు రెండు వంతెనల పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. మేడారం జాతర ప్రాంగణంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను జంపన్న వాగు తాకింది. 2 అడుగుల లోతు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో సాయం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మేడారం దగ్గర్లోని పడిగాపురం గ్రామాన్ని జంపన్న వాగు చుట్టుముట్టింది, దీంతో పడిగాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. #Telangana #Medaram 27-07-2023 pic.twitter.com/yPl9LzySXP — S Ramesh (@RameshTSIND) July 27, 2023 జలదిగ్భంధంలో గ్రామాలు ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా జులై 27వ తేదీ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రమణక్కపేట గ్రామంలో పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. దీంతో వరదలో చిక్కుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అటు జీవంతరావు పల్లి, పాలసావు పల్లి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజన్సీ గ్రామాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి మత్తడి పోతున్నాయి. దీంతో వరంగల్ నుంచి ఏటూరునాగారం 163 ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి గుండ్ల వాగు పొంగి పస్రా తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై గండి పడింది. దీంతో వరంగల్ వైపుకు వెళ్లే పరిస్థితి లేదు. ఏ క్షణమైనా రోడ్డు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. ఏటూరు నాగారం మండలంలోని జీడి వాగు పొంగి పార్లడంతో ఏటూరు నాగారం, బుర్గం పాడు జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట మండలంలో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువలు మత్తడి పోస్తున్నాయి. మంగపేట మండలంలో పంటపొలాలు నీట మునిగాయి. శనిగాకుంట వద్ద వాగు పొంగి పొర్లడం తో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుండటంతో అటవీశాఖ అధికారులు సందర్శన నిలిపివేపారు. #TelanganaRains Heartbreaking video of situation at #Medaram. Medaram hosts the sacred Sammakka &Saralamma Jatara. At least 1.5 crore ppl attend this annual fest -the BIGGEST tribal festival in the country! Today it is stranded in flood water. Video shared by temple priest pic.twitter.com/gju1f7rOkI — Revathi (@revathitweets) July 27, 2023 -
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర తేదీలివే!
సాక్షి, ములుగు: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి ఆదివాసీ, గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే జాతరను ఈసారి 2024 ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించాలని పూజారుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి బుధవారం రోజున మండెమెలగడం, గుడి శుద్ధీకరణతో జాతర ప్రక్రియను ప్రారంభిస్తారు. దాదాపు పది నెలల ముందే జాతర తేదీలు.. మేడారం మహాజాతర తేదీలను పూజారులు ఈ సారి దాదాపు 10 నెలల ముందుగానే ప్రకటించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత అనుభవాల దృష్ట్యాఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సమ్మక్క–సారలమ్మ పూజారులు కోరుతున్నారు. షెడ్యూల్ ప్రకటనకు ముందు పూజలు.. మేడారం మహాజాతర తేదీల ఖరారు కోసం బుధవారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షుడు కాక సారయ్య, ప్రధాన కార్యదర్శి చందా గోపాల్, పూజారులు సిద్దబోయిన మునేందర్, సిద్దబోయిన మహేశ్, లక్ష్మణ్‌రావు, కాక వెంకటేశ్వర్లు, కాక భుజంగరావు, చందా రఘుపతి, కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేశ్, భోజారావు, జనార్దన్, అరుణ్‌కుమార్‌లు సమావేశం అయ్యారు. కాగా, సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలను ప్రకటించే ముందు పూజారులు ఆనవాయితీగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ఏడాది మహాజాతర విజయవంతంగా సాగాలని అమ్మవార్లను వేడుకున్నారు. జాతర తేదీలు ఇవే.. ఫిబ్రవరి 21: మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గద్దెల మీదకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఫిబ్రవరి 22: చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత రాక. ఫిబ్రవరి 23: సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు మొక్కుల సమర్పణ. ఫిబ్రవరి 24: మాఘశుద్ధ పౌర్ణమి శనివారం అమ్మవార్ల వన ప్రవేశం, మహా జాతర ముగింపు. ఫిబ్రవరి 28: మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజున తిరుగువారం పండుగ. చదవండి: ఢిల్లీ సిగలో ‘గులాబీ’.. -
Chinna Medaram Photos: మేడారంలో ఘనంగా సమ్మక్క సారలమ్మ చిన్న జాతర (ఫొటోలు)
-
మేడారం మీదుగా రైల్వే లైన్ కు మొదలైన సర్వే
-
మేడారంలో విషాదం.. తల్లీ ఇక సెలవు..
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం గ్రామానికి చెందిన సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబశివరావు(40) అనారోగ్యంతో మృతి చెందాడు. మేడారానికి చెందిన సాంబశివరావు ఇటీవల ఆనారోగ్యానికి గురయ్యాడు. బుధవారం ఉదయం శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ఆయనను కుటుంబ సభ్యులు ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రతి ఏటా మహాజాతరలో సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైన ప్రతిష్టించేంత వరకు బూర కొమ్ము శబ్దం ఊదుతూ కీలక పాత్ర పోషించేవాడు. జాతర ప్రారంభం నుంచి తల్లులు వన ప్రవేశం చేసేంత వరకు ఆయన పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. జాతరలో సాంబశివరావు అధికారుల నుంచి మంచి పేరు సంపాదించాడు. ఆయన మృతితో మేడారంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పూజారులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మేడారంలో ఆయన దహన సంస్కారాలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు మేడారం వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతిపట్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, జాతర పునరుద్దరణ కమిటీ చైర్మన్ శివయ్య, సమ్మక్క– సారలమ్మ పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలోని పలువురు అధికారులు సంతాపం తెలిపారు. మృతుడికి భార్య సంతోషిని, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. చదవండి: మహిళా ప్రతినిధులతో సంబంధం.. ఇతర మహిళలను ట్రాప్‌లో పడేసి సాంబశివరావు భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సీతక్క ఎమ్మెల్యే సీతక్క సంతాపం సాంబశివరావు మృతిపై ఎమ్మెల్యే సీతక్క వ్యక్తం చేశారు. మేడారంలోని వారి స్వగృహం వద్ద మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సాంబశివరావు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, తదితరులు ఉన్నారు. సంతాపం తెలిపిన మంత్రి ఎర్రబెల్లి .. సమ్మక్క పూజారి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మేడారం జాతర: దేవతలకు తిరుగువారం పండగ..
-
మేడారంలో భక్తుల మొక్కులు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహా జాతర శనివారం సాయంత్రం ముగిసినప్పటికీ ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ముగిసిన క్రమంలో అమ్మవార్ల గద్దెల ఐలాండ్ వరకు భక్తుల వాహనాలకు అనుమతిచ్చారు. ఆర్టీసీ బస్సులు కూడా ఐలాండ్ వరకు వెళ్లాయి. కలెక్టర్ కృష్ణ ఆదిత్య కుటుంబ సభ్యులు అమ్మవార్లను దర్శించుకున్నారు. -
వనం చేరిన తల్లులు
సాక్షిప్రతినిధి, వరంగల్: నాలుగు రోజులపాటు లక్షల మంది భక్తులను ఆశీర్వదించిన వనదేవతలు జనం నుంచి వనంలోకి వెళ్లారు. మేడారంలో గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను పూజారులు వనంలోకి తీసుకెళ్లారు. ఈ ఘట్టంతో మేడారం మహా జాతర ముగిసింది. జనసంద్రమైన అడవులు మళ్లీ మామూలుగా మారాయి. కిక్కిరిసిన భక్తులతో కాలు కదిపేందుకు వీలుగాని గద్దెల ప్రాంతం ఖాళీ అయ్యింది. ఆదివాసీ వాయిద్యాలు, సంప్రదాయాలతో పూజారులు (వడ్డెలు) శనివారం సాయంత్రం ఆరుగంటలకు వనప్రవేశ ప్రక్రియను ప్రారంభించారు. ఉద్విగ్నంగా ఈ ఘట్టం సాగింది. జాతర చివరి రోజు దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆఖరి రోజున భారీగా జనం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవతల వనప్రవేశం తర్వాత సైతం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీర, సారె, బంగారం, పసుపు కుంకుమలను మేడారం వాసులు తీసుకున్నారు. దేవతల ప్రసాదాన్ని(బెల్లం) తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దీంతో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. దర్శనాల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన తర్వాత దేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభించారు. గోవిందరాజును దబ్బగట్ల గోవర్ధన్, పొదెం బాబు నేతృత్వంలోని పూజారుల బృందం మేడారం గద్దెల నుంచి 7:20 తరలించారు. వీరు అర్ధరాత్రి ఏటూరునాగారం మండలం కొండాయికి చేరుకున్నారు. అనంతరం 7:18 గంటలకు సమ్మక్కను గద్దెల నుంచి తరలించారు. కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్ నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించి సమ్మక్కను అక్కడి నుంచి కదిలించింది. గద్దెల సమీపంలోని ఎదుర్కోళ్ల ప్రదేశం వద్ద మేక బలితో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సమ్మక్కను చిలకలగుట్టకు చేర్చారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును7:20 గంటలకు వడ్డెల నేతృత్వంలోని పూజారుల బృందం మేడారం నుంచి కొత్తగూడ మండ లం పూనుగొండ్లకు వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం వీరు గమ్యాన్ని చేరుకోనున్నారు. మేడారం గద్దెపై ఉన్న సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, సోలం వెంకటేశ్వర్లు నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మెంటె (వెదురు బుట్ట) ను 7:21 గంటలకు తీసుకుని జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. దేవతల వనప్రవేశంతో మేడా రం మహా జాతర అధికారికంగా ముగిసింది. కాగా, వచ్చే బుధవారం మేడా రం పూజారులు చేసే తిరుగువారం పండుగతో మహా జాతర అంకం పరిసమాప్తమవుతుంది. మేడారం రావడం సంతోషంగా ఉంది: గవర్నర్ మేడారంలో సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మేడారం చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే సీతక్క పుష్పగుచ్ఛంతో ఆమెకు స్వాగతం పలికారు. తర్వాత గవర్నర్ నిలువెత్తు బంగారాన్ని తల్లుల కు సమర్పించుకున్నారు. అనంతరం పట్టువస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకున్నట్లు తెలిపారు. కాగా, గవర్నర్ రాకకు కొద్దిముందే.. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ కృష్ణాదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి.. మేడారం జాతర విజయవంతమైనట్టు ప్రకటించారు. గవర్నర్ వచ్చే సమయానికి వీరు లేరు. దీంతో జేసీ ఒక్కరే స్వాగతం పలికారు. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: బండి సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విషయంలో ప్రొటోకాల్ పాటించకుండా ఘోరంగా అవమానించినందుకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేడారంలో మంత్రులు, అధికారులెవరూ గవర్నర్ కార్యక్రమానికి హాజరుకాలేదని ఆరోపించారు. -
మేడారం జాతర.. ముగింపు ముంగిట మురిపెం
-
మేడారం: అవ్వాబిడ్డలోయ్.. అడవిలోకి మళ్లెనోయ్
సాక్షి, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసింది. నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగిన మేడారం జాతర.. అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త పడిగిద్దరాజు, కొండాయికి గోవిందరాజులను తరలించారు. కరోనా వైరస్ విజృంభన తర్వాత జరిగిన ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. మరోవైపు లక్షల మంది భక్తులు వన దేవతాలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. -
ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలి: రేవంత్‌రెడ్డి
సాక్షి, ములుగు జిల్లా: కాలాంతకులైన పాలకులు నుంచి విముక్తి కోసం మేడారం సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మేడారం సమ్మక్క సారలమ్మను శనివారం దర్శించుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేడారం జాతర కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, చంద్రబాబు,రోశయ్య మేడారం జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించారని తెలిపారు. వందల కోట్లు కేటాయించిన చరిత్ర కూడా ఉందని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ మేడారాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా, పుణ్యస్థలంగా మార్చుతామని హామి ఇచ్చారని, సమ్మక్క సారలమ్మ జిల్లా ఏర్పాటు చేస్తామని చేయలేదని మండిపడ్డారు. మేడారంపై వివక్ష చూపుతూ.. ఆటవికమైన ఆలోచనతో కేసిఆర్ కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరాట స్ఫూర్తి ఇలానే ఉంటే తిరుగుబాటు వస్తుందని మేడారంకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది కుంభమేళా మేడారాన్ని ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసిఆర్ గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. మచ్చింతల్లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రియల్టర్ నిర్మిస్తే, దానికి ఇచ్చిన విలువ కొట్లాది మంది ఆరాధించే సమ్మక్క సారలమ్మ పై పాలకులు ఇవ్వలేదని మండిపడ్డారు. ధనవంతులు, శ్రీమంతులకు ఇచ్చే విలువ మేడారానికి ఇవ్వడంలేదని అన్నారు.ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.ఆదివాసి గిరిజనుల ఓట్లే కావాలి తప్ప వారి అభివృద్ది పట్టదని ఫైర్ అయ్యారు. జాతీయ పండుగగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో దాని గురించి తాము మాట్లాడుతామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేడారానికి రూ.వెయ్యి కోట్లు కెటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేసిఆర్ చేసిన కొత్త జిల్లాలను సవరించి సమ్మక్క సారలమ్మ జిల్లా ఏర్పాటు చేస్తామని అన్నారు. 12 నెలలు ఓపిక పట్టండి సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ పండుగగా గుర్తింపు ఇస్తామని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో మేడారం జాతరకు తీసుకువస్తామని తెలిపారు. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోడం వల్లే రాలేదని కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు.ఇప్పటికైనా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
మేడారంలో కోట్ల రూపాయల వ్యాపారం..
-
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం
-
మేడారం వెళ్లే దారిలో ఘోర రోడ్డు ప్రమాదం. నలుగురు మృత్యువాత
సాక్షి, ములుగు: ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీటీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ములుగు శివారులోని గట్టమ్మ ఆలయం మూల మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. పలువురికి గాయాలవ్వగా ములుగు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. బస్సు ముందు భాగం కూడా కొంత దెబ్బతింది. ఆర్టీసీ బస్సు హన్మకొండ నుంచి మేడారం వస్తుండగా.. కారు హన్మకొండ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మేడారం వెళ్లే మార్గం కావడంతో ఘట్టమ్మ ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులువెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ములుగు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు శ్రీనివాస్, సుజాత, రమేష్, జ్యోతిగా గుర్తించిన పోలీసులు వారంతా ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామస్తులుగా తెలిపారు. కళ్యాణ్ అనే వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా మేడారం జాతర జరుగుతుండటంతో గత మూడు రోజుల నుంచి వరంగల్- మేడారం దారులు భక్తుల వాహనాలతో మరింత రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో చిన్నచిన్న ప్రమాదాలు చోటుచేసుకోగా ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. చదవండి: నల్లకుంటలో విద్యార్థి అదృశ్యం.. తండ్రి మందలించడంతో పాల ప్యాకెట్ కోసమని వెళ్లి.. -
మేడారం సమ్మక్మ-సారలమ్మ గద్దెల వద్ద బంగారం తొలగింపు సబబేనా..?
పున్నమి వెలుగున గద్దెనెక్కిన వనదేవతలు.. భక్త‘కోటి’ ఆరాధ్య దైవాలు.. ఇంటి ఇలవేల్పులు. వరాలిచ్చే దేవరలు.. చెంతకొచ్చినా.. మదిలో తలచినా నిండు మనసుతో ఆశీర్వచనాలిచ్చే కల్పవల్లులు. రెండేళ్లకోసారి దర్శనభాగ్యం కల్పించేందుకు కళ్లెదుటే సాక్షాత్కరించగా.. జై సమ్మక్క.. జై సారలమ్మ తల్లీ అంటూ మొక్కుల చెల్లింపునకు అశేష భక్తజనం పోటెత్తింది. ఎత్తు బెల్లం(బంగారం), పసుపు, కుంకుమ, చీర సారె సమర్పిస్తూ తల్లుల సేవలో తరించారు. చల్లని చూపులను ప్రసాదిస్తూ.. కోరిన కోర్కెలు తీర్చేందుకు అభయమిచ్చితిరి ఆ అమ్మలు. సాక్షి, మేడారం(ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం): తల్లుల గద్దెలపై ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా చేపట్టిన చర్యలను పూజారులు తప్పుబడుతున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ కొలువుదీరిన గద్దెలపై బెల్లం(బంగారం), ఒడిబియ్యం, కొబ్బరి కుడుకలు, పోక, ఖర్జూర, చీర సారె భక్తులు సమర్పించడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఇవన్నీ చుట్టూరా ఉంటేనే అమ్మవార్లు అక్కడ ఉన్నట్లు భావిస్తారు. అయితే.. జాతర పూర్తి కాకముందే ఎప్పటికప్పుడు కానుకలు తొలగించడం సంప్రదాయానికి విరుద్ధమని పలువురు పూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూజారిని అడగగా.. బంగారం తొలగించడాన్ని తాము తప్పుబడుతున్నామని, అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన నాటి నుంచి వనప్రవేశం చేసే వరకు రాశిగా ఉంటేనే ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. చదవండి: మేడారం జాతర: గట్టి మంత్రి.. ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను.. కాగా.. వనప్రవేశం ముందు ఆచారంగా ఆదివాసీలు, మేడారం ఆడబిడ్డలు, స్థానికులు గద్దెలపై ఉన్న బెల్లం, చీర సారెలను ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడంతా తొలగించడంతో ఈసారి ప్రసాదం స్థానిక ఆదివాసీలకు అందే పరిస్థితి లేకుండా పోయిందని పూజారులు వాపోయారు. జాతరకు ముందు జరిగిన సమీక్షలో సైతం గద్దెలపై కేవలం ప్లాస్టిక్ కవర్లు మాత్రమే తొలగించాలని పూజారులు సూచించారు. దీనిపై డీపీఓ వెంకయ్యను వివరణ కోరగా.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి జాతరలో ఇలానే తొలగిస్తామని, ఈసారి కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. -
మేడారం జాతరలో ఆసక్తికర సన్నివేశం.. ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను..
సాక్షి, వరంగల్: మేడారం మహా జాతరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నీ తానై వ్యవహరించారు. అధికారులను ఎక్కడికక్కడ సమన్వయపరుస్తూ.. సలహాలు ఇస్తూ జాతర సజావుగా సాగేందుకు తనదైన తీరును ప్రదర్శించారు. జాతరకు వచ్చే భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఎదురెళ్లి అమ్మవారి దర్శనం చేయించారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి, మంచెపై నుంచి జాతర తీరును పరిశీలిస్తూ.. మైకులో అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు. భక్తులు క్యూ పద్ధతి పాటించాలని, బంగారం, కొబ్బరి కాయలు విసిరేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కాగా.. సీఎం కేసీఆర్ రాక కోసం ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్‌తో కలిసి మంత్రి రెండు రోజులపాటు హెలిపాడ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించగా.. చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. చదవండి: వనదేవతలకు జన హారతి ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను.. జాతరకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ మీడియా పాయింట్ నుంచి ఎదురుపడిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి ఎరబ్రెల్లి ఎదురుపడగానే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రేణుక సింగ్‌కు ఎరబ్రెల్లిని పరిచయం చేస్తూ.. తెలంగాణలో గట్టి మంత్రి అంటూ.. చేతులతో గట్టి అనే అర్థం స్ఫురించేలా ఊపారు. అలాగే పంచాయతీ మంత్రి అంటూ కిషన్‌రెడ్డి చెప్పగానే.. మంత్రి ఎరబ్రెల్లి స్పందిస్తూ.. పంచాయితీలు పెట్టే మంత్రిని కాను, పరిష్కరించే మంత్రిని అని రేణుక సింగ్‌తో అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. చదవండి: మేడారానికి జాతీయ హోదా.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని కౌంటర్ -
వనదేవతలకు జన హారతి.. ఉప్పొంగిన భక్తి పారవశ్యం
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉప్పొంగిన భక్తి పారవశ్యంతో మేడారం జనసంద్రమైంది. సమ్మక్క–సారలమ్మ నామస్మరణతో మార్మోగింది. ‘మా సమ్మక్క తల్లి కో.. సారక్క తల్లి కో’అంటూ శివసత్తుల పూనకాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు వన దేవతలూ గద్దెలపై కొలువై ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం (బెల్లం), ఎదురుకోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరికాయలు.. తీరొక్క రూపాల్లో భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారి ప్రసాదం, పసుపు, కుంకుమల కోసం పోటీపడ్డారు. పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో జంపన్నవాగు నిండి పోయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు వారి సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరల నాదాలతో వన దేవతలను పూజించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 30లక్షల మందికిపైగా మొక్కులు చెల్లించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. మొత్తంగా దేవతలను దర్శించుకున్న వారి సంఖ్య కోటీ 10లక్షలు దాటిందని.. ఇంకా భక్తుల తాకిడి ఉందని తెలిపారు. రోజురోజుకూ పెరిగిన రద్దీ ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ఈ నెల 16న మొదలుకాగా.. అంతకు నెల రోజుల ముందు నుంచే భక్తులు వచ్చి మేడారం గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడం మొదలైంది. రోజురోజుకూ సంఖ్య పెరుగుతూ వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులతో మేడారం ‘క్యూ’లైన్లు కిక్కిరిసిపోయాయి. సాధారణ భక్తుల క్యూలైన్లతోపాటు వీవీఐపీ, వీఐపీల క్యూలైన్లు కూడా కిలోమీటర్ల పొడవునా సాగాయి. సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఉన్నరోజే దర్శించుకోవాలన్న తలంపుతో శుక్రవారం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మ«ధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి వచ్చారు. శనివారం దేవతల వన ప్రవేశం సందర్భంగా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముంది. పెరిగిన వీఐపీల తాకిడి మేడారం జాతరకు శుక్రవారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వీఐపీల తాకిడి పెరిగింది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రేణుకాసింగ్ తమ కుటుంబాలతో హెలికాప్టర్ ద్వారా మేడారం వచ్చారు. రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి స్వాగతం పలికి.. వన దేవతల దర్శనం చేయించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, విప్ రేగా కాంతారావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండా ప్రకాశ్‌తోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులు దేవతలను దర్శించుకున్నారు. వీఐపీల రాకతో సాధారణ భక్తులు ఇబ్బందిపడ్డారు. (చదవండి: బ్రహ్మ భైరవులు.. శివుడి ద్వారపాలకులు) నేడు దేవతలు వనంలోకి.. మేడారం జాతర శనివారం సాయంత్రం ముగియనుంది. వన దేవతలు సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల నుంచి వన ప్రవేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జాతర చివరిరోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకోనున్నారు. శుక్రవారం రాత్రికే లక్షల మంది మేడారానికి చేరుకున్నారు. మొత్తంగా గత జాతర కంటే ఈసారి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనుందని అధికారులు తెలిపారు. జాతరకు ముందుగా వచ్చిన దూరప్రాంతాల వారు తిరిగి బయలుదేరుతుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు మెల్లగా ఖాళీ అవుతున్నాయి. సీఎం పర్యటన రద్దు.. శుక్రవారం సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు వన దేవతలను దర్శించుకోవడానికి వస్తున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. మొదట ఉదయం 11.30 గంటలకు వస్తారని ప్రకటించినా.. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వస్తారని చెప్పారు. సీఎం సెక్యూరిటీ విభాగం, వ్యక్తిగత కార్యదర్శులు ఉదయమే మేడారం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కానీ చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. మేడారానికి జాతీయ హోదా ఉండదు: కిషన్‌రెడ్డి పండుగలకు ఎక్కడా జాతీయ హోదా ఉండదని, ఆ ప్రకారం మేడారం జాతరకు కూడా ఉండదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనదేవతలను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రెండేళ్లకోసారి వైభవంగా జరిగే ప్రకృతి పండుగ ఇది. పండుగలకు జాతీయ హోదా ఎక్కడా లేదు. ఇదే క్రమంలో మేడారం జాతరకు కూడా జాతీయ హోదా ఉండదు. అయితే దేశవ్యాప్తంగా మేడారం జాతరకు విస్తృత ప్రచారం కల్పిస్తాం. గిరిజన విశ్వవిద్యాలయం కోసం రూ.45 కోట్లు నిధులు కేటాయించాం. త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. నేను పర్యాటక మంత్రి అయిన తర్వాత రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. ప్రజలు కరోనా మహమ్మారి మీద విజయం సాధించి సుఖసంతోషాలతో ఉండాలని అమ్మలను కోరుకున్నా..’’అని తెలిపారు. (చదవండి: కరగని ‘గుండె’) -
Medaram Jatara: వన దేవతలకు ‘కోటి’ మొక్కులు
సాక్షి, వరంగల్: వరాలు ఇచ్చే తల్లులు.. వనదేవతలు.. మేడారం సమ్మక్క సారలమ్మ జనజాతర వైభవోపేతంగా జరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారులను కోటి మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకోసారి ఇద్దరు అమ్మవారులు గద్దెలపై రెండురోజుల పాటు కొలువై ఉండడంతో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తుంది. వనదేవతల జనజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. గద్దెలపై ప్రాంగణంలో జలప్రవాహంలా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్ మేడారం టూర్ రద్దయింది. సీఎం రాకపోయినప్పటికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవారులకు ఎత్తు బంగారం( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించారు. సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని వనదేవత లను వేడుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వీఐపీల తాకిడి, భక్తుల రద్దీతో పోలీసులు హడాహుడి చేశారు. భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. కేంద్ర మంత్రులు వచ్చిన సమయంలో పోలీసులు మీడియా వారిని నెట్టివేయడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
Medaram Jatara 2022 : మేడారం మహాజాతర మూడో రోజు (ఫోటోలు)
-
మేడారానికి జాతీయ హోదా.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని కౌంటర్
సాక్షి, ములుగు జిల్లా: మేడారం జాతరకు జాతీయ హోదా విషయంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’ కు జాతీయ హోదా ఇవ్వకుంటే దేనికి ఇస్తారని తలసాని ప్రశ్నించారు. ఉత్తర భారతదేశంలో జరిగే పండుగలకు జాతీయ హోదా ఇస్తారా అని చురకలంటించారు. ఈ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి తలసాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పండుగలకు జాతీయ హోదా ఉండదని, మేడారానికి ఇవ్వమని స్పష్టం చేయడంపై స్పందించారు. కేంద్ర మంత్రి తలతోక లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీకి స్థలం కేటాయించి మూడేళ్ళు అవుతుందని, ఇప్పటి వరకు దానికి అతి గతి లేదని అన్నారు. బీజేపీ నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని దుయ్యబట్టారు. జాతరకు జాతీయ హోదా ఉండదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఇంతకముందు మేడారం జాతరకు జాతీయ హోదా ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పండుగలకు జాతీయ హోదా ఎక్కడలేదని, కావాలంటే విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి రేణుకాసింగ్, మాజీ రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్, బిజేపి ఓబిసి సేల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనులు రెండేళ్లకోసారి జరుపుకునే ప్రకృతిపండుగ మేడారం జాతర అని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకుని కరోనా మహమ్మారి మీద విజయం సాధించి, సుఖసంతోషాలతో ఉండాలనీ కోరుకున్నానని పేర్కొన్నారు. చదవండి: 60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి? గిరిజన విశ్వవిద్యాలయంకు 45 కోట్లు కేటాయించామని, త్వరలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర రాజధానిలో కేంద్రం మ్యూజియం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం నిధుల కేటాయించిందని వెల్లడించారు.గిరిజనులకు బిజేపి, కేంద్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఏడుగురికి మంత్రులు ఇచ్చి, గిరిజనల అభ్యున్నతికీ ప్రధాని మోదీ దోహదపడుతున్నారని తెలిపారు. చదవండి: మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు.. ఒక్కో ప్రయాణికుడికి ఎంతంటే? పోటెత్తిన భక్తులు మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క ఆగమనంతో రాత్రి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. దీంతో మేడారం జాతర ప్రాంగణమంతా భక్తజన సంద్రంగా మారింది. అటు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వనదేవతలను దర్శించుకొని ఎత్తుబంగారం సమర్పించుకున్నారు. సీఎం వస్తారా? రారా? ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ నాయకులు భావిస్తున్నారు. తోపులాట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్ మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మీడియా ప్రతినిధులను పోలీసులు నేట్టేశారు. దీంతో జర్నలిస్టులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మీడియా ప్రతినిధులను సముదాయించారు. -
మేడారంను సందర్శించి అమ్మవారులను దర్శించుకొనున్న సీఎం కేసీఆర్
-
60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. సకాలంలో అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజులుగా సిటీ ఆర్డినరీ బస్సులను మేడారం జాతరకు తరలిస్తున్నారు. దీంతో నగరంలో ట్రిప్పులు గణనీయంగా తగ్గాయి. ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు ఉండడం లేదు. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్‌లు కేవలం ఆర్డినరీ బస్సులో మాత్రమే చెల్లుబాటవుతాయి. మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్లలో వీరి పాస్‌లకు అనుమతి ఉండదు. ఆర్డినరీ బస్సులు లేకపోవడంతో మెట్రోల్లో చార్జీలు చెల్లించాల్సివస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఆర్డినరీ పాస్‌లపై రాకపోకలు సాగించే సాధారణ ఉద్యోగులు సైతం ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. 60 శాతం బస్సులు అక్కడికే.. ► గ్రేటర్ పరిధిలో సుమారు 2,850 బస్సులు ఉన్నాయి. రోజుకు 20 వేలకు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. 25 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. ప్రస్తుతం 60 శాతం బస్సులను మేడారం జాతరకు తరలించారు. జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలోని డిపోలను ఉమ్మడి వరంగల్ జిల్లా డిపోలతో అనుసంధానం చేశారు. దీంతో సిటీ డిపోల్లో బస్సుల నిర్వహణ ప్రస్తుతం వరంగల్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. ► అధికారులను, సిబ్బందిని సైతం పెద్ద ఎత్తున మేడారంలో మోహరించారు. 3,845 బస్సులను మేడారం జాతర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో సిటీలో బస్సుల కొరత ఏర్పడింది. ఇది తాత్కాలికమే అయినా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బస్‌పాస్‌లు ఉన్న వారు చార్జీలు చెల్లించి మెట్రో బస్సుల్లో ప్రయాణం చేయాల్సివస్తోంది. ప్రత్యామ్నాయమేదీ? ► గ్రేటర్లో సుమారు 5 లక్షల స్టూడెంట్ పాస్‌లు ఉన్నాయి.1.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఉచిత పాస్‌లపై ఆర్డినరీ బస్సుల్లో స్కూళ్లకు వెళ్తున్నారు. పదో తరగతి వరకు అమ్మాయిలకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. ► కాలేజీలకు వెళ్లే విద్యార్థులంతా రూట్ పాస్‌లు, నెలవారీ బస్‌పాస్‌లపై వెళ్తున్నారు. ఆర్డినరీ బస్సులను మేడారానికి తరలించడంతో మెట్రో బస్సుల్లో వీటిని అనుమతించడం లేదు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సుల్లోనూ అనుమతించడం లేదు. ► జాతర పూర్తయ్యే వరకు తమ బస్‌పాస్‌లను పల్లెవెలుగు, మెట్రో బస్సుల్లో తాత్కాలికంగా అనుమతించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
మేడారానికి కేసీఆర్!
సాక్షిప్రతినిధి, వరంగల్: సీఎం కేసీఆర్ శుక్రవారం మేడారం మహాజాతరలో పాల్గొని సమ్మక్క–సారక్కలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి వస్తారని అధికారులు గురువారం సాయం త్రం తెలిపారు. కేసీఆర్ మేడారంలో సుమారు మూడు గంటలకుపైగా గడుపుతారని, నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని వెల్లడించారు. సీఎం వెంట ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు. మొక్కలు తీర్చుకోనున్న ప్రముఖులు కేంద్ర మంత్రులు రేణుకాసింగ్, జి.కిషన్‌రెడ్డి శుక్రవారం వేర్వేరుగా మేడారం చేరుకుని వన దేవతలను దర్శించుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కూడా వస్తారని ఆయా పార్టీల వర్గాలు ప్రకటించాయి. -
జన సమ్మోహనం.. జగజ్జనని ఆగమనం
మేడారం నుంచి సాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా మేడారం అడవి సమ్మక్క నామస్మరణతో మా ర్మోగింది. జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం గురు వారం రాత్రి ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయ దొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంఛనాల మధ్య ఆదివాసీ పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్క ను మేడారం గద్దెలపైకి చేర్చారు. ఈ సందర్భంగా చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల దాకా భక్త జనంతో కిటకిటలాడింది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే క్రతువు గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉద్విగ్నభరితంగా సాగింది. ఉదయం నుంచే మొదలై.. సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ఏర్పాట్లు గురువారం ఉదయమే మొదలయ్యాయి. సమ్మక్క వడ్డెలు, పూజారులు ఉదయం 5.30 గంటలకే మే డారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి కంకవనాలు (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యే క పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు (కొత్త కుండలు) తెచ్చి గద్దెలపైకి చేర్చారు. తర్వాత సాయంత్రం ఐదు గంటల సమయంలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం చిలకలగుట్టపైకి బయలుదేరారు. అప్పటికే చిలకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తులు సమ్మక్క వచ్చే దారి పొడవునా రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నింపేశా రు. సాయంత్రం ఏడు గంటల సమయంలో సమ్మక్క తల్లితో పూజారులు చిలకలగుట్ట దిగడం ప్రారంభించారు. ఇది చూసి భక్తులు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. పూజారులు సిద్దబో యిన మునీందర్, లక్ష్మణ్‌రావు, మహేష్, చందా బాబూరావు, దూప వడ్డె నాగేశ్వర్రావు అమ్మవా రిని వడ్డె కొక్కెర కృష్ణయ్యకు అప్పగించాక మేడారం వైపు కదిలారు. ప్రభుత్వం తరఫున అధికారిక లాం ఛనాల ప్రకారం సమ్మక్కకు ఆహ్వానిస్తూ, ఆమె రాకకు సూచనగా ములు గు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపారు. వెంటనే చిలకలగుట్ట నుంచి మేడా రం దాకా లక్షలాది మంది భక్తజనం సమ్మక్క నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ప్రభుత్వం తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు. రక్షణ వలయం మధ్య ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల మధ్య వడ్డెల బృందం సమ్మక్క ప్రతిరూపంతో మేడారం వైపు బయలుదేరారు. దారిపొడవునా భక్తులు అమ్మకు దండం పెట్టుకున్నారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని చల్లారు. సమ్మక్కను తీసుకువస్తున్న బృందం అక్కడి నుంచి ఎదుర్కోళ్ల పూజా మందిరం చేరుకుంది. అక్కడ వడ్డెలు, పూజారులు ఎదురుకోళ్లు జరిపించారు. సమ్మక్కకు సెలపెయ్యను బలి ఇచ్చారు. మేడారం గద్దెల ముఖ ద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకువస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. తర్వాత 9.19 గంటల సమయంలో గద్దెలపైకి తీసుకువచ్చారు. సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చినప్పటి నుంచి ప్రతిష్టించే వరకు గద్దెల ఆవరణలో విద్యుత్ దీపాలను ఆపివేశారు. రహస్య పూజలు చేసిన అ నంతరం రాత్రి 9.43 గంటల సమయంలో దీపా లను ఆన్ చేశారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్ పేరిట బెల్లం బంగారం సమర్పణ గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజు కావడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కేసీఆర్ పేరిట అమ్మవార్లకు బెల్లం బంగారం మొక్కు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా అమ్మవార్లకు సీఎం పేరుమీద బెల్లం సమర్పించారు. నలుగురు దేవతలు.. నలుదిక్కులా మొక్కులు బుధవారం మేడారం గద్దెలకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాగా.. గురువారం సమ్మక్క తల్లిని ప్రతిష్టించారు. దీనితో మొత్తం నలుగురు దేవతలు గద్దెలపైకి చేరి.. మహా జాతర పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. మొక్కులు సమర్పించేందుకు లక్షల మంది భక్తులు భారీగా తరలివచ్చారు. దేవతలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. బుధ, గురువారాల్లో సుమారు 75 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. -
భక్తజన సంద్రమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (ఫోటోలు)
-
మేడారం మహాజాతరలో అద్భుతం ఆవిష్కృతం
Medaram Aerial View 2022: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర వైభవోపేతంగా జరుగుతుంది. మేడారంలో కీలక ఘట్టంమైన సమ్మక్క ఆగమన ప్రక్రియ కొనసాగుతోంది. సమ్మక్క తల్లి రాకకు వేళ అవ్వడంతో మేడారం జనసంద్రంగా మారింది. చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణె రూపములో ఉన్న అమ్మవారిని గిరిజన సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తీసుకురానున్నారు. మాఘశుద్ద పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్కను ఆదివాసీ గిరిజన ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి మేళ తాళాలతో గద్దెలపైకి తరలిస్తారు. చదవండి: దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది.. ఈ క్రమంలో జాతర పరిసర ప్రాంతాలను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. జంపన్నవాగు, కన్నెపల్లి, చిలుకలగుట్ట ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమ్మక్క తల్లి ఆగమనంతో వనదేవతల దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు జాతరకు 70 లక్షల మంది భక్తులు వచ్చారని, మూడు రోజుల్లో మరో 50 నుంచీ 60 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం కేసిఆర్ బర్త్ డే సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 60 కేజీల తెల్లబంగారం సమర్పించారు . కేసిఆర్ ఆయురారోగ్యాలతో జాతీయ రాజకీయాల్లో రాణించాలని అమ్మవారులను వేడుకున్నానని తెలిపారు. జాతీయ స్థాయిలో కేసిఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అమ్మవారి దీవేనలతో రాష్ట్ర సాధన తోపాటు రెండు సార్లు కేసిఆర్ సీఎం అయ్యారని తెలిపారు. సీఎం కేసిఆర్ రేపు మేడారం వస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఏర్పాట్లను పరిశీలించారు. జాతరపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మేడారం జాతరకు జాతీయ హోదా లభించాలని అమ్మవారులను వేడుకున్నానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంపై కేంద్రం కనిపించదు, వినిపించదు అన్నట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో మేడారంలో శాశ్వత ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతర పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే రెండు రోజులు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. -
మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు.. ఒక్కో ప్రయాణికుడికి ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16న ప్రారంభమైన జాతర 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. అయితే మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ ప్రధాన నగరాల నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హనుమకొండ నుంచి హెలికాప్టర్ సౌకర్యం కల్పించారు. కాజీపేటలోని సేయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. చార్జీలు ఇలా.. హన్మకొండ నుంచి మేడారం షటిల్ సర్వీస్ ఒక్కో ప్రయాణికుడికి (అప్ అండ్ డౌన్) రూ.19,999 జాతరలో 7,8 నిమిషాల ఏరియల్ వ్యూ రైడ్ ఒక్కొక్కరికి రూ.3,700 బుకింగ్ ఇలా.. హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా info@helitaxi.com ద్వారా చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మేడారం జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం బేగంపేట ఎయిర్‌పోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. జాయ్ రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సేవలు బుధవారం నుంచి ఆదివారం వరకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు. హెలికాప్టర్ చార్టర్ సర్వీస్ అయితే కరీంనగర్ నుంచి మేడారానికి రూ. 75,000గా నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి మేడారానికి రూ. 75,000, మహబూబ్‌నగర్ నుంచి మేడారానికి రూ. 1,00,000 టికెట్ ధరను నిర్ణయించారు. ఇందులో 5 సీట్లు ఉంటాయి. వీఐపీ దర్శనం కల్పిస్తారు. విశేష స్పందన డారంలో హెలీకాప్టర్ రైడ్‌కు విశేష స్పందన లభిస్తోంది. హెలికాప్టర్ ఎక్కి సమ్మక్క సారలమ్మ వార్ల గద్దెలు జంపన్న వాగు గుట్టలు పై నుంచి మేడారం అందాలు చూసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.. 2014 నుంచి వరంగల్ మామునూరు బేగంపేట విమానాశ్రయాల నుంచి మేడారానికి భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం మేడారంలో భక్తులను ఎక్కించుకొని తిప్పి చూపించే స్థాయికి హేలీ సర్వీసులు చేరుకున్నాయి. -
సమ్మక్కను తీసుకొచ్చేది తనే.. కోటికొక్కడు
మేడారం జాతరలో ప్రధాన ఘట్టం చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం. ఈ ఘట్టంలో అత్యంత ఉద్విగ్న భరిత క్షణాలు చిలకలగుట్ట కిందికి సమ్మక్క దిగిరావడం ఆ సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎదురేగి వెళ్లి తుపాకులతో గాలిలోకి కాల్పులు జరపడం. ఈ క్షణాల్లో అందరి కళ్లు భరణి రూపంలో ఉన్న సమ్మక్కపైనే ఆ తర్వాతి స్థానం ఆ భరణి తీసుకువచ్చే ప్రధాన వడ్డే కొక్కెర కృష్ణయ్యపైనే ఉంటాయి. వేలది మంది ప్రత్యక్షంగా లక్షలాది మంది ప్రసార మాధ్యమాల్లో కోట్లాది మంది పరోక్షంగా ఉత్కంఠను అనుభవిస్తారు. అంతటి ఉత్కంఠ, ఉద్విగ్నభరిత క్షణాలను తన భూజాలపై మోసే కొక్కర కృష్ణయ్య మనోగతం సాక్షి పాఠకులకు ప్రత్యేకం. ఆరోసారి 2022 ఫిబ్రవరి 17వ తేదిన చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను కొక్కెర కృష్ణయ్య తీసుకురానున్నారు. అంతకు ముందు ఆయన మొదటిసారిగా 2012 జాతరలో ఈ అదృష్టాన్ని దక్కించుకున్నారు. అంతకు ముందు జాతరలో కొక్కెర కృష్ణయ్యకు∙బాబాయ్ అయిన కొక్కెర వెంకన్న ఈ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత ఆయన కొడుకు సాంబశివరావు చేశారు. వారిద్దరి తర్వాత కృష్ణయ్యకు ఈ భాగ్యం దక్కింది. కొక్కెర కృష్ణయ్య మేడారంలోనే నివాసం ఉంటారు. సాధరణ సమయంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. భార్య వినోద, ఎనిమిదో తరగతి చదివే కొడుకు, డిగ్రీ, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ వారం రోజులు నిష్టతో ఉంటాను గుడిమెలిగె పండుగతో సమ్మక్క–సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. అయితే జాతర మొదలయ్యేది మండెమెలిగే పండుగతోనే. మండెమెలిగే పండుగ నాడు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లిని గద్దెలపైకి చేర్చే వరకు నియమనిష్టలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపళ్లు ఆహారంగా తీసుకుంటారు. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటారు. ఆ రోజున దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరిస్తాం మేడారం సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ తర్వాత రహాస్యం అయిన పూజా సామగ్రిని తీసుకుని నాతో పాటు వడ్డెల బృందం చిలకలగుట్టకు బయల్దేరుతుంది. సమ్మక్క వడ్డేలైన దోబేపగడయ్య దూపం వేస్తుండగా మల్యాల ముత్తయ్య జలకంపట్టి వేస్తూ ముందుకు కదులుతాం. జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). భజంత్రీలు మాదిరి పుల్లయ్య, మాదిరి నారయణలు మమ్మల్ని అనుసరిస్తారు. అయితే చిలకలగుట్ట సగం వరకే వీరికి ప్రవేశం. ఆ తర్వాత సమ్మక్క తల్లి కొలువై ఉండే రహాస్య ప్రదేశానికి నేనొక్కడినే వెళ్తాను. అక్కడ పూజాలు నిర్వహించిన తర్వాత సమ్మక్క తల్లి భరిణి రూపంలో కిందకు తీసుకువస్తాను. నేను రావడం కనిపించగానే జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). భజంత్రీలు మాదిరి పుల్లయ్యలు తమ వాయిద్యాలతో శబ్ధం చేస్తారు. అలా గుట్టమధ్య నుంచి సమ్మక్క తల్లి చిలకలగుట్ట పాదల వద్దకు చేరుకోగానే చేరుకోగానే ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి కాల్పులు జరిగి ఆ తల్లికి ఘనస్వాగతం పలుకుతారు. మేము మద్యం సేవించం - కొక్కెర కృష్ణయ్య సమ్మక్క, సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహా అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. జాతర సంబరాల్లో భాగంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్న వడ్డేలు తాగువారు. మద్యం సేవించడం పూజా విధానంలో భాగం కాదు. నా వరకు నేను మండెమెలిగె పండగ నాటి నుంచే నిష్టతో ఒక్క పొద్దు ఉంటాను. గద్దెలకు చేర్చేవరకు మద్యం సేవించను. నాతో పాటు ఉండే వడ్డేలు వారి వ్యక్తిగత అలవాట్లను బట్టి మద్యం తీసుకుంటారు. అలా మద్యం సేవించడం తప్పు కాదు. అదేవిధంగా సేవించడం తప్పనిసరి కాదు. గతంలో సాయంత్రం 4 గంటలకు కల్లా గద్దెల మీదికి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు జాతరకు జనం పెరగడం వల్ల సాయంత్రం 5 అవుతోంది. అయితే ఏడుగంటలల్లోపు ఎప్పుడు వచ్చినా మంచిదే. అందరిలానే నేను ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏ ఏడుకి ఆ ఏడు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే నాకు మరింత మేలు జరుగుతుంది అని అనుకుంటారు. అందరిలానే నేను. తీసుకురావడం అనేది బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికి మేలు చేస్తుంది. -
సమ్మక్క చరిత్ర తెలియాలంటే.. దీన్ని డీకోడ్ చేయాల్సిందే
సమ్మక్క, సారలమ్మ జాతర గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సమ్మక్క కారణజన్మురాలని.. పుట్టుకతోనే మహిమలు చూపేదని కోయపురాణం చెబుతుంది. కాకతీయులతో పోరాడి సమ్మక్క వీరమరణం పొందింది అని చరిత్రకారుల అభిప్రాయం. సమ్మక్క దైవాంశ సంభూతురాలని భక్తుల విశ్వాసం. ఇంతకీ సమ్మక్క చరిత్రకు సంబంధించిన వివరాలు ఎక్కడున్నాయి? జాతర సందర్భంగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను మేడారం తీసుకువచ్చే పూజారులు ప్రత్యేకంగా తయారు చేసిన జెండాలను మోసుకుంటూ వస్తారు. గోవిందరాజులు, పగిడిద్దరాజులకు వేర్వేరుగా ఈ జెండాలు ఉన్నాయి. ఇలాంటి జెండాలే సమ్మక్క, సారలమ్మలకు ఉన్నాయి. ఆ జెండాలు వందల ఏళ్ల నాటి విషయాలను తమలో దాచుకున్నాయి. సమ్మక్క చరిత్ర పూర్తిగా లిఖితంగా ఎక్కడా లభించలేదు . అయితే సమ్మక్కతో పాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్ర మరో రూపంలో నిక్షిప్తమై ఉంది. ఈ చరిత్రను పటం రూపంలో నిక్షిప్తమయ్యిందని ఆదివాసీలు చెబుతుంటారు. అనాదిగా కోయలు, ఆదివాసీలకు వేర్వేరు భాషలు ఉన్నాయి. అయితే చాలా కోయ భాషలకు లిపి లేదు. దీంతో పురాతన పద్దతి అనుసరించి బొమ్మల రూపంలో చరిత్రను నిక్షిప్తం చేశారు. బొమ్మల రూపంలో చరిత్రను.. ఆనాటి పరిస్థితులను నిక్షిప్తం చేయడం ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పద్దతి. ప్రాచీన ఈజిప్టులు ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. ఈజిప్టు చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు ఈ బొమ్మల లిపిలోనే మనకు లభ్యమయ్యాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని భీమ్బెట్కా దగ్గర ఈ తరహా బొమ్మల లిపి రూపంలో చరిత్ర అందుబాటులో ఉంది. ఇంచుమించు ఇదే పద్దతిలో ఆదివాసీ దేవతల చరిత్ర లిఖించబడింది. ఎర్రగా త్రిభుజాకారంలో తయారు చేసిన ఈ జెండాలనే వనదేవతల చరిత్ర ఉంది. సమక్క, సారలమ్మల పూర్వీకులు, ప్రకృతితో వారికి ఉన్న సంబంధం అంతా ఇక్కడ బొమ్మల రూపంలో వివరించి ఉంటుంది. ఒక్కో ఆదివాసీ దేవతకు ఒక్కో రూపంలో ఈ జెండాలు ఉన్నాయి. ఈ జెండాలో ఉన్న బొమ్మల ఆధారంగా డోలీలు సమ్మక్క కథను మౌఖికంగా చెబుతారు. సమక్క, సారలమ్మలతో పాటు ఇతర ఆదివాసీ దేవతలకు సంబంధించి జెండాల గురించి చాలినంత పరిశోధన జరగలేదు. వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ జెండాలోని బొమ్మల లిపిపై చరిత్రకారులు పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ జెండాలోని అంశాలు, వాటి ఆధారంగా చెబుతున్న మౌఖిక కథలను డీకోడ్ చేస్తే ఆదివాసీ దేవతలకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి -
జాతర సందడిలో తంత్రగాళ్ల ప్రత్యేక పూజలు
-
సమక్క చరిత్ర తెలియాలంటే.. దీన్ని డీకోడ్ చేయాల్సిందే
-
చిలకలగుట్ట రహస్యం.. అక్కడికి ఎవ్వరూ పోవద్దు.. పోనివ్వరు
-
వైభవంగా మేడారం జాతర మహోత్సవం
-
మేడారం గద్దెపైకి సారలమ్మ.. చిలకలగుట్ట నుంచి సమ్మక్క
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చే వన దేవత సారలమ్మ బుధవారం రాత్రి మేడారం గద్దెపై కొలువుదీరింది. తొలుత కన్నెపల్లి నుంచి మేడారంలో ఉన్న కన్నతల్లి సమ్మక్క చెంతకు సారలమ్మ చేరుకుంది. రాత్రి 10.45 గంటలకు గద్దెలపైకి వచ్చింది. సారలమ్మతోపాటే గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర వైభవంగా మొదలైంది. కన్నెపల్లి నుంచి మేడారానికి సారలమ్మ బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లిలో సారలమ్మ పూజారులు కాక సారయ్య, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనకమ్మ, కాక భుజంగరావు పూజా క్రతువులు ప్రారంభించారు. 7 గంటల వర కు వాయిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగిపోయింది. అనంతరం ఆలయం నుంచి రాత్రి 7.09 గంటలకు మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి పూజారులు బయలుదేరారు. మార్గమధ్యలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు చేశారు. వంతెన ఉన్నా నీటిలో నుంచే నడుస్తూ వాగును దాటారు. అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత పూజారులు ముగ్గురి రూపాలను గద్దెలపైన ప్రతిష్టించారు.పగిడిద్ద రాజు రాత్రి 10.40కి, గోవిందరాజు 10.42కు, సారలమ్మ 10.45 గంటలకు గద్దెలపై కొలువుదీరారు. సంతాన భాగ్యం కోసం ‘వరం’పట్టిన భక్తులు సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటె (వెదురు బుట్ట)లో తీసుకొని కన్నెపల్లి ఆలయం మెట్లు దిగి ముందుకు కదులుతుండగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే భక్తులు గుడి ముందు కింద పడుకుని పొర్లు దండాలతో వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై దాటి వెళ్లారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. అడిషనల్ ఎస్పీ మురళీధర్, డీఎస్పీలు కొత్త దేవేందర్‌రెడ్డి, విష్ణుమూర్తి, రోప్ పార్టీ ఓఎస్డీ సంజీవ్‌రావు, పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు మూడంచెల రోప్ పార్టీతో భద్రత కల్పించారు. ప్రభుత్వం తరఫున ములుగు జిల్లా కలెక్టర్, ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్య హాజరయ్యారు. ఎదురెళ్లి దండాలు పెడుతూ.. మేడారానికి బుధవారం మధ్యాహ్నం వరకు భక్తుల తాకిడి మామూలుగానే ఉన్నా సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కసారిగా జనం పోటెత్తారు. కన్నెపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకొచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదగా భక్తులు దారి పొడవునా ఇరువైపులా ఎదురెళ్లి దండాలు పెట్టారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం పరవశించింది. ఎమ్మెల్యే సీతక్క తదితరులు కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం వద్ద ఆదివాసీ నృత్యం చేశారు. భారీగా జనం.. కిక్కిరిసిన వనం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకోవ డంతో లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం నలువైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు, గుడారాలతో కిక్కిరిసిపోయింది. కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. భక్తుల పుణ్య స్నానాలతో జంపన్న వాగు నిండిపోయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Medaram Jatara 2022: మేడారం జాతర ప్రారంభం... భక్తులతో కిటకిటలాడుతున్న వనం (ఫోటోలు)
-
పరాయీకరణ దిశలో మేడారం జాతర
ములుగు జిల్లా మేడారంలో ‘సమ్మక్క–సార లమ్మ’ జాతర ప్రారంభమైంది. ఈ గిరిజన జాతర నేడు కుల, మత, ప్రాంత భేదం లేని సకలజనుల జాతరగా మారింది. రెండేళ్లకొకసారి జరిగే జాత రను ప్రభుత్వం ఆదాయవనరుగా భావిస్తున్నదే తప్ప... గిరిజనులకు లాభం చేకూర్చే సంగతి పట్టించుకోవడంలేదు. ఆదివాసీలకు మతాచారాలు లేవు. విగ్రహారాధన అసలే లేదు. పండుగలు, పూజల్లో వేద మంత్రాలు ఉండవు. కానీ హిందూ పండుగలను కూడా చేసుకుంటారు. ఇటువంటి ఆదివాసీల దేవతలను హైందవీకరణ చేసే ప్రక్రియ ఇప్పుడు మంచి ఊపు మీదుంది. ఆదిమ సంస్కృతికి విరుద్ధమైన పరాయీకరణ మొదలైంది. ఆదివాసీ సాంస్కృతిక జీవనంలో రాజకీయ నాయకుల, గిరిజనేతరుల, అధికారుల జోక్యం పెరిగింది. దేవాదాయ, ధర్మాదాయశాఖ గద్దెల ప్రాంగణంలో పసుపు, కుంకుమ, అడవి పూల అలంకరణకు బదులుగా పెయింట్, ప్లాస్టిక్ పూలు, కాకతీయ తోరణాలు, హిందూత్వ చిహ్నాలు వాడుతున్నారు. పారేటాకుకు బదులు అరిటాకు భోజనం, ప్రసాదంగా బెల్లం (బంగారం) కాక లడ్డూలు దర్శనమిస్తున్నాయి. రూపమే లేని సమ్మక్క, సారలమ్మలకు కిరీటం, శంకు, కత్తి, డాలు అంటగట్టి వారు జింక, పులిపై ఊరేగుతున్నట్లు చిత్రించడం బ్రాహ్మణీకరణ కాక ఏమవుతుంది? ఇది ఏమాత్రం ఆదివాసీ సంస్కృతి కాదు. (చదవండి: మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి!) రాజకీయ నాయకులు, వీఐపీలు, అధికారులు చిలుకలగుట్ట, ఆలయంలోకి దర్శనం కోసం గిరిజన వడ్డె (పూజారి)ల అభ్యంతరాలను పట్టించు కోకుండా పాదరక్షలతో ప్రవేశించిన గతానుభవాలు ఎన్నో ఉన్నాయి. దేవతల ఆగమన సమయంలో తూతకొమ్ము శబ్దం కాకుండా తుపాకీ శబ్దం చేయడం ఆదివాసుల జాతరపై ప్రభుత్వ అధికారాన్ని వ్యక్తం చేస్తున్నది. ఆదివాసీల మౌఖిక సాహి త్యానికి విరుద్ధంగా దేవతల భిన్న కథనాలు, పాటలు, పుస్తకాలు, వీడియో ఆల్బమ్స్ వ్యాపారం జరుగుతోంది. ఆదివాసీలు క్రమంగా తమ సంస్కృతి పరమైన హక్కులను కోల్పోతున్న సంఘ టనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. జాతర నిర్వహణలో భాగంగా గిరిజన సంస్కృతి, పరిరక్షణ కోసం ఏర్పాటైన ‘ట్రస్టుబోర్డ్’ కమిటీలో ఛైర్మన్, ఇద్దరు డైరెక్టర్లు మినహా మిగిలిన వారంతా గిరిజనే తరులే ఉండటం ఆక్షేపణీయం. జాతర ఆదాయవనరు కావడంతో గిరిజనేతరుల వలసలు పెరిగి స్థానిక నాయకుల ప్రమేయంతో 1/70 చట్టానికి విరుద్ధంగా భూములు కొనుగోలు చేసి, భవనాలు నిర్మించారు. జాతర జరిగే ఏడాదికి ఆదివాసులు నష్టపోతున్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. జాతర నిర్వహణ, పర్యవేక్షణకు ఆదివాసీ అధికారులకు బాధ్యత అప్పగించాలి. వనదేవతల స్వస్థలాలైన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బయ్యక్కపేట, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్ల గ్రామాల్లో శాశ్వత అభివృద్ధికి పనులు చేపట్టాలి. జాతర ఆదాయంలో 14 మంది పూజారులకు ఇచ్చే 1/3 వంతు వాటాధనాన్ని పెంచాలి. మిగిలిన జాతర ఆదాయాన్ని ఆదివాసీల సంప్రదాయిక వారసత్వాలను గౌరవించి స్థానిక ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కేటాయించాలి. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన జాతరకు ఒకరోజు సెలవు (కాంపెన్సేటరీ హాలిడే)గా కాకుండా కనీసం రెండు రోజులైనా సాధారణ సెలవు ప్రకటించాలి. (చదవండి: ఆయన జీవితంలో ఎన్ని సింగిడీలో!) - గుమ్మడి లక్ష్మీనారాయణ వ్యాసకర్త ఆదివాసీ రచయితల వేదిక సభ్యుడు ---------------------------------------------------------------- ఆదివాసీ అస్తిత్వం అంతమవుతోంది! మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. కానీ నేడది పూర్తిగా బ్రాహ్మణ ఫ్యూడల్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. జాతర బ్రాహ్మణీకరణకూ, హైందవీకరణకూ గురవుతోంది. దీనిమూలంగా జాతరలో ఆదివాసీ అస్తిత్వం అంతం అవుతోంది. ప్రభుత్వ చొరబాటు కూడా ఎక్కువైంది. సమ్మక్క సారక్క గద్దెల వద్ద గిరిజనేతరులను నియమించి ఆదివాసీ సంప్రదాయాలను అవమానిస్తున్నారు. మేడారం జాతర ట్రస్ట్ బోర్డులో గిరిజనేతరులను నియమించి జాతరను కబ్జా చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులు కూడా గిరిజనేతర పార్టీల్లో చేరి జాతరను నిర్లక్ష్యం చేస్తున్నారు. జాతర సంపదను దోచుకోవడానికి బడాబాబులు, మద్యం డాన్లు, బెల్లం డాన్లు మేడారం ట్రస్ట్ బోర్డులో చేరుతున్నారు. జాతరకు జాతీయ హెూదా కల్పించాలని పాలకులు పథకాలు పన్నుతున్నారు. ఈ హెూదా వస్తే జాతర ఆదివాసీల నుండి మరింత చేజారి పోతుంది. టూరిజం పేరుతో పెద్ద భవనాలు, హోటళ్లు కట్టి ఆదివాసీల భూములు బలవంతంగా లాక్కుంటారు. జాతరను కమర్షియల్ చేస్తారు. బ్రాహ్మాణీయ సంప్రదాయాలకు పునాదిగా లడ్డు ప్రసాదం జాతరలో ప్రవేశపెడుతున్నారు. భవిష్యత్తులో నిరాడంబర మూర్తులైన సమ్మక్క–సారలమ్మకు పెద్ద భవనాలను బంగారంతో నిర్మించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి!
ఆదివాసీ అస్తిత్వం మేడారం జాతర. వారి పోరాటానికి చిహ్నం. అది జాతర కాదు, ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక. గిరిజన స్వయంపాలనకు దిక్సూచి అయిన మేడారం జాతర మొదలైంది. అమ్మతల్లుల జాతరలో ఆదివాసులే కాదు, సకల జనులూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు. జాతర నాలుగు రోజులూ... సత్తెంగల సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లిస్తూ... సంప్రదాయ వంటకాలను నైవేద్యంగా పెడుతూ... మరో లోకాన్ని సృష్టిస్తారు. ఇటువంటి జనజాతరకు ఎప్పటి నుంచో జాతీయ హోదా కల్పించాలని భక్తులూ, రాష్ట్రప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి కోరుతున్నది. కానీ ఆ కల ఇంకా నెరవేరనేలేదు. దేశంలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర రానేవచ్చింది. నేటి నుంచి ఫిబ్రవరి 19 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో... వివిధ రకాల పూజా ప్రక్రియలు, ఆదివాసుల ప్రత్యేక వస్త్ర ధారణ వంటి అంశాలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం... మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన ఈ వేడుకకు జాతీయ హోదా ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి ఇప్పటి వరకు చాలాసార్లు ప్రతిపాదనలు వెళ్ళినా ఇంతవరకు అది సాకారం కాలేదు. స్థానిక ఆదివాసీల నమ్మకం ప్రకారం... సమ్మక్కను కోయల్లో చందా వంశస్థుల ఆడపడుచుగా భావిస్తారు. ఆమె బయ్యక్కపేటలో జన్మించింది. ఈడు వచ్చే కొలది ఆమె తాను ఇంటిలో ఉండలేనని, విడిగా ఉంటానని చెబుతూ వచ్చింది. చివరికి అక్కడి దట్టమైన అడవుల్లో ఉన్న ఒక కొండపైకి వెళ్లి దాన్నే తన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుందని స్థానికులు చెబుతారు. సమ్మక్క కొండ దిగి వచ్చి రోజూ స్నానం చేసే ఒక కొలను కూడా కొండ దగ్గరలో ఉందనీ, దాన్ని ‘జలకం బావి’ అని పిలుస్తామని వాళ్లు చెబుతున్నారు. మొదటలో బయ్యక్క పేటలోనే సమ్మక్క జాతర జరిగేది. కొన్ని కారణాల వల్ల అది మేడారానికి మారింది. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో మొదలయ్యే సమ్మక్క జాతర నాలుగు రోజులు జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకువస్తారు. రెండవ రోజున మేడారం సమీపం లోని చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు. మూడో రోజు అమ్మవార్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తమ కోరికలు తీర్చమని భక్తులు బెల్లం (బంగారం)ను నైవేద్యంగా సమర్పించుకుంటారు. నాలుగవ రోజు పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయిస్తారు. అంటే వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి భక్తి శ్రద్ధలతో మళ్లీ ఆదివాసీ కోయలు చేరుస్తారు. ఇలా దీంతో జాతర ముగుస్తుంది. ఎంతో చరిత్ర, నేపథ్యం కలిగిన సమ్మక్క–సారలమ్మ జాతరను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2014లో ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా జాతర జరుపుతున్నది. ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 332.71 కోట్ల నిధులను కేటా యించింది. ఈ ఏడాది రూ.75 కోట్ల నిధులు కేటాయించి రవాణా, త్రాగునీరు, భద్రతా చర్యలు వైద్య సదుపాయాలు తదితర సదుపాయాల కోసం 21 ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయించింది. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర) రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆరు ప్రధాన రహదారుల ద్వారా ఈ జాతరకు 1 కోటి 30 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది భక్తులు హాజరయ్యే పండుగ ఇది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఈ) ద్వారా జాతరకు ఎంత మంది వచ్చారో 99 శాతం కచ్చితత్వంతో తెలుసుకుంటారు. దేశంలో ఏ ఉత్సవంలోనూ వినియోగించని విధంగా కృత్రిమ మేథా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఏర్పాట్లు చేస్తుంది. ఇంతటి చరిత్ర, నేపథ్యం కలిగిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రతిపాదన చేసి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత జాతరలో ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా ఈ మహా జాతర ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి జాతీయ హోదా ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. కానీ అది మాటలకే పరిమితమైంది కానీ చేతలకు నోచుకోలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మహా జాతరకు జాతీయ హోదా కల్పించి నిధులు విడుదల చేస్తే జాతర ప్రాశస్త్యాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. ఆ తర్వాత యునెస్కో గుర్తింపునకూ మర్గం సుగమం అవుతుంది. - అంకం నరేశ్ వ్యాసకర్త ఉపాధ్యాయుడు -
హెలికాప్టర్లో ఒకేసారి ఆరుగురు వెళ్లే అవకాశం: భరత్‌రెడ్డి
-
రారండోయ్.. మేడారం.. (ఫోటోలు)
-
కన్నెపల్లి నుంచి సారలమ్మ.. చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్క
సాక్షిప్రతినిధి, వరంగల్: భక్తజనమంతా వనమంతా నిండి కుంభమేళాను తలపించే ఆదివాసీల వేడుకకు వేళ అయింది. జనం కదిలి వచ్చి కడలిలా మారే అపురూప సన్నివేశం మేడారం జాతరలో సాక్షాత్కరించనుంది. ఉత్సాహం ఉరకలేసి ఉత్సవంగా మారే సందర్భం రానే వచ్చింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల ఉత్సవమైన మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర బుధవారం ప్రారంభం కానుంది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జాతర సాగుతుంది. గత జాతరకు 1.20 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు ప్రకటించిన అధికారులు, ఈసారి కూడా అదేస్థాయిలో వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఈ మహాజాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళాను తలపిస్తుంది. నాలుగు రోజులు కుంభమేళా.. ఇలా ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలోని ఓ గిరిజన గ్రామం మేడారం. మేడారం జాతరను రెండేళ్లకోసారి నాలుగురోజులపాటు సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీంతో తొలిరోజు ఘట్టం పూర్తవుతుంది. గురువారం సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం కాగా, కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం చూసి తరించి అందరూ పులకించిపోతారు. సమ్మక్కను పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షలాది మంది భక్తులు పాల్గొని జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇస్తారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు. 18న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతల వనప్రవేశం ఉంటుంది. జాతర కోసం భారీ ఏర్పాట్లు... ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేస్తోంది. టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 3,850 బస్సులను నడుపుతోంది. మేడారం భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం వరంగల్ కమిషనరేట్ పోలీసులు వన్ వే ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి పర్యవేక్షిస్తున్నారు. గతంలో రెండే ప్రధాన రోడ్డు మార్గాలుండగా, ఈసారి ఆరింటిని ఏర్పాటు చేశారు. మేడారం జాతర ప్రదేశంలో 360 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణ కోసం 11 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ జాతర బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు జంపన్న వాగుకు ఇరువైపులా 3.6 కిలో మీటర్ల పొడవునా స్నానఘట్టాలను, విడిది కోసం భవనాలను నిర్మించారు. వన దేవతల గద్దెల పక్కనే ఉన్న వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని వైద్యశాఖ ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్యసేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధంగా ఉంచింది. 1968 నుంచి.. 1968 నుంచి ప్రభుత్వం ఈ జాతర ఏర్పాట్లు చేస్తోంది. 1996లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మొదట సమ్మక్క, సారలమ్మ జాతరలు వేర్వేరు గ్రామాల్లో జరిగేవి. సారలమ్మను సైతం కన్నెపల్లి నుంచి మేడారంలోని సమ్మక్క గద్దెల వద్దకు చేర్చడం 1960 నుంచి మొదలైంది. అప్పటినుంచి మేడారం జాతర సమ్మక్క–సారలమ్మ జాతరగా మారింది. ప్రభుత్వ పరంగా 1944లోనే మేడారం జాతరపై తహసీల్దారుతో కమిటీ ఏర్పాటైనట్లు రికార్డులు చెబుతుండగా, 1967లో దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. మేడారం బయలెళ్లిన పగిడిద్దరాజు గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో వెలిసిన పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. ఆలయంలో మొక్కులు సమర్పించిన వడ్డెలు (పూజారులు) పగిడిద్దరాజు పడిగెను పట్టుకుని గ్రామం గుండా తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు పోస్తూ ‘వరుడై వెళ్లి మరుబెల్లికి రావయ్యా’అంటూ మొక్కులు చెల్లించారు. రాత్రి కర్లపెల్లి, లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో సేదదీరారు. వారిచ్చిన విందును ఆరగిఆంచి తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి మేడారానికి పయణమవుతారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మేడారం చేరుకుంటామని ప్రధాన పూజారులు పెనక బుచ్చిరాములు, సురేందర్, రాజేష్, పురుష్తోతం తెలిపారు. -
Medaram Jatara 2022: మేడారం జాతర విశిష్టత
-
Medaram Jatara 2022: ఉప్పొంగుతున్న మేడారం జాతర
-
పులిపై సమ్మక్క, జింకపై సారలమ్మ... ఈ రూపాలు ఎలా వచ్చాయో తెలుసా ?
-
చలో మేడారం: రూట్‌మ్యాప్, వాహనాల పార్కింగ్ వివరాలు
తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర ఇప్పటికే భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16నుంచి 19వ తేదీ వరకు జాతర జరగనుంది. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పోయేదారి.. వచ్చేదారి అంటూ వన్‌వే చేశారు. జాతరకు భక్తులు ఎక్కువగా అటవీ ప్రాంతంలోని చిన్నచిన్న పల్లెల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్, తిరుగు ప్రయాణం ఎలా అన్న అనుమానాలు చాలామందిలో ఉంటాయి. భక్తుల అవసరార్థం.. ప్రయాణం సాఫీగా సాగేందుకు పోలీసులు రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు. ఆ మ్యాప్‌ను మరింత సరళతరం చేసి ‘సాక్షి’ మీకు అందిస్తోంది. – సాక్షిప్రతినిధి, వరంగల్ హైదరాబాద్.. హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే భక్తులు నేషనల్ హైవే–163 ద్వారా జనగామ మీదుగా రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో భువనగిరి–ఆరెపల్లి బైపాస్ ఎక్కాలి. ఆరెపల్లి నుంచి నేరుగా ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, పస్రా.. నార్లాపూర్ నుంచి మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, భూపాలపల్లి, రేగొండ, పరకాల, గూడెప్పాడ్, హనుమకొండ మీదుగా వెళ్లాలి. పార్కింగ్ : నార్లాపూర్ ఖమ్మం, నర్సంపేట, ఇల్లెందు, మానుకోట ఖమ్మం, ఇల్లెందు, మహబూబాబాద్,నర్సంపేట, మల్లంపల్లి , పస్రా నుంచి నార్లాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, రేగొండ, పరకాల మీదుగా గుడెప్పాడు, వరంగల్ నుంచి పోవాల్సి ఉంటుంది. పార్కింగ్ : వెంగ్లాపూర్, నార్లాపూర్ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ హుజూరాబాద్, పరకాల, రేగొండ, గణపురం, వెంకటాపురం(ఎం), జగాలపల్లి క్రాస్ నుంచి పస్రా మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, భూపాలపల్లి, గారెపల్లి నుంచి మంథని, గోదావరిఖని, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు. పార్కింగ్ : నార్లాపూర్, కొత్తూరు లింగాల, గుండాల ఇల్లెందు, రొంపేడు, గంగారం, పూనుగొండ్ల, లింగాల, పస్రా, నార్లాపూర్, మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, పరకాల, రేగొండ మీదుగా గూడెప్పాడ్, వరంగల్ నుంచి నర్సంపేట చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ : వెంగ్లాపూర్ రామగుండం, మంథని రామగుండం, గోదావరిఖని, మంథని, కాటారం, గారెపల్లి ఎడమవైపు నుంచి కాల్వపల్లి మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్లోనే వెళ్లాలి. పార్కింగ్ : కాల్వపల్లి, నార్లాపూర్ కాళేశ్వరం, మహారాష్ట్ర.. కరీంనగర్, కాళేశ్వరం ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కాటారం, పెగడపల్లి, కాల్వ పల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి మీదుగా కరీంనగర్ చేరుకోవాలి. పార్కింగ్ : ఊరట్టం వాజేడు, ఛత్తీస్‌గఢ్ వెంకటాపురం(కె) ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు వాజేడు, జగన్నాథపురం నుంచి ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి, మల్యాల, ఊరట్టం నుంచి మేడారం చేరుకోవాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్‌మీదుగా వెళ్లాలి. పార్కింగ్ : ఊరట్టం మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం నుంచి చిన్నబోయినపల్లి, కొండాయి, ఊరట్టం వరకు ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి. అదే మార్గంలో తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ రూట్లో ఏదైనా ట్రాఫిక్ సమస్య వస్తే అత్యవసరంగా ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ పార్కింగ్ ప్రాంతాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ : ఊరట్టం ఆర్టీసీ బస్సులు హనుమకొండ, ములుగు రోడ్డు, గూడెప్పాడ్, పస్రా, తాడ్వాయి నుంచి నేరుగా మేడారం వెళ్తాయి. ప్రైవేట్ వాహనాలు మాత్రం పస్రానుంచి నార్లాపూర్, మేడారం వెళ్లాలి. తాడ్వాయి మీదుగా అనుమతి లేదు. పొరపాటున వెళ్లినా వెనక్కి పంపుతారు. తిరుగు ప్రయాణం మేడారం నుంచి తిరిగి వరంగల్ ఆపై ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నార్లాపూర్ క్రాస్, బయ్యక్కపేట, కమలాపురం క్రాస్, భూపాలపల్లి, పరకాల, అంబాల క్రాస్, కిట్స్ కాలేజీ, వరంగల్ బైపాస్, పెండ్యాల మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. (క్లిక్: మేడారానికి పోటెత్తిన భక్తులు.. ఫొటోలు) అందుబాటులో హెలికాప్టర్ సేవలు మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. ఈ సేవలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. కాజీపేటలోని సేయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. చార్జీలు ఇలా.. ఒక్కో ప్రయాణికుడికి (అప్ అండ్ డౌన్) రూ.19,999 జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ ఒక్కొక్కరికి రూ.3,700 బుకింగ్ ఇలా.. హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా info@helitaxi.com ద్వారా చేసుకోవచ్చు. -
మేడారానికి పోటెత్తిన భక్తులు..
-
మహాఘట్టానికి తొలి అడుగు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర ఘట్టానికి మండమెలిగె పండుగతో తొలి అడుగు పడింది. జాతరకు వారం రోజుల ముందు బుధవారం మండమెలిగె పండుగ ఘనంగా జరిగింది. సమ్మక్క ప్రధాన పూజా రి సిద్ధబోయిన మునీందర్ ఇంటినుంచి అచారం ప్రకారం పసుపు, కుంకుమ పూజాసామగ్రిని సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. మరో పూజారి లక్ష్మణ్‌రావు ఇంటి నుంచి మామిడి తోరణాలు తీసుకువచ్చారు. ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పూజారులు మేడారం గ్రామ శివారులోని మైసమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడినుంచి బొడ్రాయి వద్దకు వెళ్లి పవిత్రజలంతో శుద్ధి చేశారు. సమ్మక్క గుడి ముందు ఆడపడచులు ముగ్గు లు వేసి అలకరించారు. మామిడి తోరణాలకు ఉల్లిగడ్డ, కోడిపిల్లలను కట్టి (దిష్టి తగలకుండా) దొర స్తంభాన్ని నిలిపారు. కల్లు (సాక), నీళ్లు, పాలు, బెల్లం పానకం, నెయ్యి, చలి గంజితో రోడ్డుకు అడ్డంగా ఆరగింపు చేశారు. అనంతరం గ్రామ శివారులో మరో దొర స్తంభాన్ని నిలిపారు. ప్రధాన పూజారి (వడ్డె) కొక్కరి కృష్ణయ్య పసుపు, కుంకుమలతో అమ్మవారిని గద్దెలపైకి తీసుకువెళ్లారు. బు«ధవారం రాత్రి అక్కడే జాగారం చేసి గురువారం గుడి చేరుకోనున్నారు. అదేసమయంలో కన్నెపల్లిలో సారలమ్మ ఆలయంలో కాక వంశస్తుల ఆధ్వర్యంలో మండమెలిగె పండుగ, పోను గొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో గుడిమెలిగె కార్యక్రమాన్ని నిర్వహించారు. మండమెలిగె పండుగ సందర్భంగా మేడారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సుమారు 2 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
మేడారంలో నేడు మండమెలిగె పండుగ.. జాతరలో ఇది కీలక ఘట్టం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సమ్మక్క–సారలమ్మ మహా జాతర కోసం మేడారం సిద్ధమవుతోంది. వన దేవతల వారంగా భావించే బుధవారం... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడుతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా మొదలవుతుంది. మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజా కార్యక్రమాలను మండమెలిగె పేరుతో పిలుస్తారు. మండమెలిగె పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. ఈ రోజు నుంచి ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. నాలుగు రోజులు కార్యక్రమాలు... ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారానికి పేరుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు క్రితంసారి 1.20 కోట్లమందికిపైగా హాజరు కాగా.. ఈసారి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. మేడారం జాతరలో ప్రధానంగా నాలుగు రోజులు 4 ఘట్టాలు ఉంటాయి. ఫిబ్రవరి 16న సారలమ్మ ఆగమనం.. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది. సమ్మక్క కూతురైన సా రలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు సు మారు 3 కి.మీ. దూరంలో ఉండే ఈ గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించిన సారలమ్మను ఫిబ్రవరి 16న బుధవారం సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే కొండాయి నుంచి గోవిందరాజును.. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఫిబ్రవరి 17న సమ్మక్క ఆగమనం.. జాతరలో ముఖ్యమైన దినం రెండోరోజు. ఫిబ్రవరి 17న గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. సాయంత్రం 6గం. సమయంలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్క రూపాన్ని చేతపట్టుకుని ప్రధాన పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోతుంది. ఫిబ్రవరి 18న గద్దెలపై తల్లులు.. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క–సారలమ్మలు శుక్రవారం భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతరలో ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు. ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశం.. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అనంతరం భక్తులు ఇళ్లకు తిరుగు పయనమవుతారు. మండ మెలిగే ప్రక్రియ ఇలా... ప్రధాన పూజారి(వడ్డె) నేతృత్వంలోని బృందం బుధవారం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తా రు. సారలమ్మ పూజారులు పూజలో పాల్గొంటారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అలంకరిస్తారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. గురువారం మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేధ్యం ఇస్తారు. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. -
మేడారం వెళ్లి మొక్కులు చెల్లించలేని వారికి కార్గో పార్శల్ సర్వీసులు.. ఎప్పటినుంచంటే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదు.. కోరుకుంటే మొక్కు బంగారాన్ని మేడారం చేర్చి అమ్మ వారికి సమర్పించనుంది. మేడారంలో సమక్క-సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు సమర్పించాలనుకునే వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్తనందించింది. మేడారం వెళ్లి మొక్కు చెల్లించలేని వారికి ఆర్టీసీ కార్గో ద్వారా పార్శల్ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది. దేవాదాయ శాఖ సహకారంతో టీఎస్ఆర్టీసీ ఈ కార్యక్రమానికి నాంది పలికింది. మేడారం జాతర సందర్భంగా ‘బంగారం పంపించడం మీ వంతు. అమ్మ వారికి సమర్పించడం మా తంతు" అనే నినాదంతో ఆర్టీసీ ఈ సేవల్ని ప్రారంభిస్తోంది. భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్శల్లో బుక్ చేస్తే చాలు, ఆ మొక్కును నేరుగా సమక్క-సారలమ్మ అమ్మవార్లకు సమర్పించనున్నారు. అంతేగాక అమ్మ వారికి భక్తులు బంగారాన్ని సమర్పించిన తరువాత ప్రసాదాన్ని కూడా తిరిగి అందించనున్నారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని బస్ స్టేషన్ల నుంచి ఈ సేవల్ని భక్తులు వినియోగించుకునే విధంగా తగిన కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు. 5 కేజీల వరకు బంగారం (బెల్లం)ను పంపించుకోవచ్చని, దేవాదాయ శాఖ సహకారంతో అమ్మ వారికి సమర్పించడంతో పాటు మళ్లీ సంబంధిత భక్తులకు 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మ వారి పసుపు కుంకుమ, అమ్మ వారి ఫోటోకూడా అందజేయడం జరుగుతుందన్నారు. ఇందుకు 200 కిలోమీటర్ల (బుకింగ్ పాయింట్ నుంచి మేడారం) వరకు రూ.400, ఆపై కిలోమీటర్లకు రూ.450 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సేవలు ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఫోన్ ద్వారా సమాచారం అందిన తరువాత బంగారాన్ని బుక్ చేసిన చోటే ప్రసాదాన్ని తిరిగి పొందవచ్చన్నారు. #TSRTC & TS దేవాదాయ శాఖ సహకారంతో పవిత్ర కార్యానికి నాంది. #Medaram లో సమక్క-సారక్క అమ్మవార్లకు మొక్కులు సమర్పించాలనుకున్నారా? అయితే, అక్కడికి వెళ్లి మొక్కు చెల్లించలేకపోతున్నారా ? దిగులెందుకు, #TSRTC Cargo & Parcel Services ఉండగా. #MedaramPrasadamWithTSRTC @TSRTCHQ @TribalArmy pic.twitter.com/Hq9OPXV4on — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 7, 2022 -
మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
-
మంత్రుల ఆదేశాలు బేఖాతర్.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే
ఎస్‌ఎస్‌తాడ్వాయి (ములుగు జిల్లా): మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నెల రోజుల ముందు నుంచే అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై కుస్తీ పడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జాతరకు వచ్చిన భక్తులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా కోళ్లు, మేకలు, గొర్లను వధించి వ్యర్థాలను పడేయడంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. వ్యర్థాల ద్వారా ఈగలు, దోమలు సైతం వ్యాపి చెందుతున్నాయి. మంత్రులు చెప్పినా.. జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధానమని, కోవిడ్ నేపద్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా పారిశుద్ధ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇటీవల మేడారంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినా వారి ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిలాఉండగా తల్లులను దర్శించుకునేందుకు గత నెల రోజుల నుంచి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. వారంతా చిలకలగుట్ట, శివరాంసాగర్, ఆర్టీసీ బస్టాండ్ వై జంక్షన్ ప్రాంతాల్లో విడిది చేస్తున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు తెచ్చిన మేకలు, కోళ్లను ఎక్కపడితే అక్కడ వధిస్తున్నారు. దీంతో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడ వధించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నిరుపయోగంగా మరుగుదొడ్లు మరుగుదొడ్లు నిరుపయోగం.. మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. భక్తుల సౌకర్యర్థం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాత్కాలిక జీఐ షీట్స్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నీళ్ల కోసం కుండీలను కట్టారు. అంతాబాగానే ఉన్న కుండీల్లో మాత్రం నీరు పోయడం లేదు. దీంతో జాతరకు వస్తున్న భక్తులు మల, మూత్ర విసర్జన సందర్భంగా ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వాటర్ బాటిళ్లలో నీరు తీసుకుని మరుగుదొడ్లను వినియోగించుకోవడంతో కంపు కొడుతున్నాయి. కాగా, జాతర నాలుగు రోజులు మాత్రమే మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలనే అధికారుల ఆలోచనను భక్తులు తప్పుపడుతున్నారు. ముందస్తుగా జాతరకు వచ్చే వారికోసం సైతం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. -
భక్తుల వద్దకే మేడారం బస్సులు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం 51 ప్రాంతాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ బస్సులు అమ్మవారి గద్దెలకు చేరువగా వెళతాయని చెప్పారు. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఐదారు కిలోమీటర్ల దూరంలో వాటిని నిలిపి ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చదవండి: మేడారంలో ‘గుడిమెలిగె’ 30 మంది భక్తులు ఒకేచోట ఉంటే.. వారి చెంతకే బస్సును పంపుతామని, కావాల్సిన వారు 040–30102829 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్, క్యూలైన్లు, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్ల వసతి ఏర్పాటు చేశామని వివరించారు. మేడారం జాతర వివరాలు, బస్సుల సమగ్ర సమాచారం, సమీపంలో ఉండేందుకు హోటల్ వసతి, చార్జీలు, ఇతర విభాగాల వివరాలతో.. కిట్స్ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. -
మేడారం జాతర సందడి.. ఘనంగా ‘గుడిమెలిగె’ (ఫోటోలు)
-
ఘనంగా ‘గుడిమెలిగె’
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సన్నిధిలో గుడిమెలిగె పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజారులు సమ్మక్క గుడిని శుభ్రం చేశారు. పూజారుల ఆడపడుచులు అమ్మవారి శక్తిపీఠం గద్దెను పవిత్ర పుట్టమట్టితో అలికి పసుపు, కుంకుమతో అలంకరించారు. రంగవల్లికలు వేశారు. పూజారులు అడవి నుంచి తీసుకొచ్చిన ఎట్టిగడ్డిని సమ్మక్క గుడి ఈశాన్య దిశలో కొక్కర కృష్ణయ్య చేతుల మీదుగా పెట్టారు. గుడిమెలిగె పండుగతో మహాజాతరకు నాంది పలికారు. కాగా, సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం మేడారానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. -
మేడారం జాతరకు 3,845 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3,845 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. మేడారం జాతరకు ఆర్టీసీ సర్వీసుల నిర్వహణపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి సోమవారం బస్‌భవన్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు సిబ్బందికి స్పెషల్‌డ్రైవ్ ద్వారా బూస్టర్‌డోసులను ఇప్పించాలని, హ్యాండ్ శానిటైజర్స్, మాస్కులను అందించాలన్నారు. డిపో నుంచి బయలుదేరే సమయంలో బస్సును పూర్తిగా శానిటైజేషన్ చేయాలని సూచించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ జాతర బస్సుల రాకపోకల పర్యవేక్షణకు 12 వేల మంది సిబ్బంది, 150 మంది అధికారులను నియమించినట్లు చెప్పారు. 50 సీసీ కెమెరాలతో బస్సుల రాకపోకల వివరాలను తెలిపేందుకు ఆయా బస్టాండులలో ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. -
సిటీజనులకు గుడ్‌న్యూస్.. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు.. ఇలా బుక్ చేసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: సిటీ ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. ప్రయాణికులు నేరుగా తమ ఇంటి వద్ద నుంచే బయలుదేరేందుకు వీలుగా ఇవి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, జాతరల కోసం అద్దె ప్రాతిపదికన బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు కనీసం 30 మంది ఉంటే చాలు. బస్సు అద్దెకు తీసుకొని వెళ్లవచ్చు. ఆర్టీసీ బస్సులు నేరుగా సమ్మక్క గద్దె వరకు వెళ్తాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంధువులను తీసుకెళ్లేందుకు బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని డిపో మేనేజర్‌ను సంప్రదించి బస్సును బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ వెబ్సైట్ www. tsrtconline.in ద్వారా సంప్రదించి బస్సులను అద్దెకు తీసుకోవచ్చు. (చదవండి: బీజేపీ Vs టీఆర్ఎస్.. చిచ్చురేపిన వాట్సాప్ మెసేజ్) -
మేడారానికి కేంద్రం పైసా ఇవ్వలేదు: కవిత
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు కేంద్రం ఒక్కపైసా కూడా విడుదల చేయలేదని, దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడట్లేదని ట్విట్టర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. జాతర కోసం సీఎం కేసీఆర్ రూ.332.71 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు. మేడారం జాతరను జాతీయపండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు బీజేపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. -
భక్తులు భారీగా..
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారం జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దాదాపు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలివచ్చి.. జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఉదయం 11 గంటల వరకే గద్దెలపైకి భక్తులను అనుమతించిన పోలీసులు ఆ తర్వాత గ్రిల్స్‌కు తాళాలు వేశారు. అనంతరం భక్తులు బయటి నుంచే అమ్మవార్లకు మొక్కుకున్నారు. ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలి రావడంతో అక్కడ క్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కా గా.. మేడారం వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి జంపన్న వాగు వద్ద ఫిట్స్‌తో మృతి చెందాడు. -
ఆంక్షల నడుమ మేడారం జాతర? మొదటివారంలో కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. కోటికిపైగా భక్తులు హాజరుకానున్న ఈ జాతర వచ్చేనెల 16వ తేదీ నుంచి 19వ తేదీవరకు నాలుగు రోజులపాటు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా సాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతున్న పరిస్థితుల్లో మేడారం జాతర వైరస్ వ్యాప్తికి కారణం కాకూడదని గిరిజన సంక్షేమ శాఖ అభిప్రాయపడుతోంది.ఇందులో భాగంగా వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మొదటివారంలో ప్రత్యేక సమావేశం... వచ్చేనెలలో కోవిడ్ వ్యాప్తి తారాస్థాయికి చేరుతుందని వైద్య,ఆరోగ్య శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి మాసమంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల మొదటివారంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్చువల్ పద్ధతిలో సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఉండేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ సమీక్ష కీలకం కానుంది. జాతరకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతివ్వాలా.. భౌతిక దూరాన్ని పాటిస్తూ అనుమతి ఇస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.. శానిటైజేషన్ ఏర్పాట్లు, మాస్కుల నిర్వహణ, తక్ష ణ వైద్య సేవల కల్పన తదితర అంశాలపై లోతు గా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వడివడిగా నిర్మాణ పనులు ప్రస్తుతం జాతర పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 21 ప్రభుత్వ విభాగాలకు రూ.75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం వివిధ పనులు నిర్దేశించింది. కోటికి పైగా భక్తులు/పర్యాటకులు హాజరు కానుండటంతో ప్రభుత్వం అక్కడ రవాణా, వసతికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. దీంతోపాటు తాగునీటి సరఫరా, భద్రత చర్యలు కీలకం కానున్నాయి. జాతరకు మంజూరు చేసిన మొత్తంలో దాదాపు 50శాతం నిధులు ఈ మూడు శాఖలకే ఖర్చు చేయనుంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. -
మేడారం జాతరపై కరోనా ఎఫెక్ట్
-
మేడారం వన దేవతల దర్శనం షురూ
-
ఘనంగా చిన్న మేడారం జాతర
-
వచ్చే జాతరకు ఉంటామో, లేదో !?: ఏఎస్పీ
సాక్షి, వరంగల్: కరోనా మహమ్మారి మరో పోలీసు ఉన్నతాధికారిని బలిగొంది. జగిత్యాల ఏఎస్పీ కుంబాల దక్షిణామూర్తి(58) వైరస్ బారిన పడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ వరకు వివిధ స్థాయిల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసిన ఆయన జగిత్యాల ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ మరణించారు. వారం క్రితం ఆయన వైరస్ బారిన పడగా, కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. (చదవండి: కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి) మొదట రెవెన్యూశాఖలో... కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అల్గునూర్‌కు దక్షిణామూర్తి చిన్ననాటి నుంచే పోలీసు ఉద్యోగంలో చేరాలనే లక్ష్యంతో చదువులో ప్రతిభ కనబరిచేవారు. 1986లో మొదట రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన ఆయన కోరుట్ల, మెట్‌పల్లిల్లో విధులు నిర్వర్తించాక 16–01–1989లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లాలో మొదటి పోస్టింగ్ దక్కించుకున్న ఆయన సీఐగా, డీఎస్పీగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో చేశాక తెలంగాణ ఆవిర్భావం అనంతరం పదోన్నతిపై నిర్మల్ ఏఎస్పీగా విధుల్లో చేరాడు. అక్కడి నుంచి గత ఏడాది నవంబర్ 1న జగిత్యాల ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భేష్ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనే దక్షిణామూర్తి సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఏటూరునాగారం, కేయూసీ, మట్టెవాడ, మిల్స్‌కాలనీ, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో సీఐగా పనిచేశారు. 2011లో డీఎస్పీగా పదోన్నతి పొందాక కొద్దిరోజులు కాజీపేట రైల్వే డీఎస్పీగానే కాకుండా ములుగు డీఎస్పీగా, హన్మకొండ ఏసీపీగా కూడా విధులు నిర్వర్తించారు. భూపాలపల్లి డీఎస్పీగా విధులు నిర్వరిస్తున్న సమయంలో నిర్మల్ ఏఎస్పీగా వెళ్లారు. వరంగల్ జిల్లాలో పనిచేసిన సమయంలో యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్, 2007లో చిన్నారి మనీషా కిడ్నాప్, హత్య కేసుతో పాటు పలు కిడ్నాప్ కేసుల పరిశోధనల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. మేడారం జాతరలో అన్నీ తానై... ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర భద్రత ఏర్పాట్లలో దక్షిణామూర్తే అన్నీతానై పర్యవేక్షించి ఉన్నతాధికారులతో మెప్పు పొందేవారు. ఈ ఏడాది ఫిభ్రవరిలో జరిగిన జాతర సందర్భంగా ‘18 జాతరలు చూశాను.. అమ్మవార్ల సేవలో తరించే అవకాశం వచ్చింది... వచ్చే జాతరకు ఉంటామో, లేదో.. నా రిటైర్మెంట్ కూడా ఉంది.. ఈసారి ఇంకా బాగా చేశాం.. నా జన్మ ధన్యమైంది’ అంటూ మీడియా ప్రతినిధులతో ఆయన తన మనోభావాలు పంచుకున్నారు. కాగా, కరోనా బారిన పడిన పోలీసు సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపిన ఆయనే కరోనా కాటుకు బలి కావడం గమనార్హం. ఇక ఈనెల 31న ఏఎస్పీ దక్షిణామూర్తి ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఇంతలోనే కరోనా ఆయనను బలిగొంది. ఆయన ఉద్యోగ విరమణ రోజు ఘనంగా సన్మానించేందుకు పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేస్తుండగానే మృతి చెందడంతో వారు దిగ్బ్రాంతికి లోనయ్యారు. -
అమ్మలు అడవిలోకి
-
కురిసిన మేఘం.. ఆగమాగం
ఏటూరునాగారం /మంగపేట: శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతర చివరి రోజైన శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు కురిసిన వర్షం వల్ల మేడారంలోని రోడ్లు, పరిసర ప్రాంతాలు బురదమయంగా మారాయి. భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తడుచుకుంటూనే అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రతి జాతర సమయంలో చిరుజల్లు పడటం ఆనవాయితీ. ఈ సారి వనదేవతలు గద్దెలపై ఉన్న క్రమంలో వర్షం కురవడం శుభసూచికంగా భక్తులు భావిస్తున్నారు. అకాల వర్షం పడటం వల్ల భక్తులు తడిబట్టలతో దర్శనం చేసుకుని తన్మయత్వం పొందారు. సమ్మక్క గద్దె వద్ద చీర సమర్పిస్తున్న మండలి చైర్మన్ ‘గుత్తా’ తిరుగు పయనం కష్టాలు అకాల వర్షంతో మేడారం తిరుగు ప్రయాణంలో భక్తులకు వర్షం కష్టాలు ఎదురయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, పలు చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో నిలిపి వేసిన వాహనాలు దిగబడటంతో వాటిని బయటకు తీసేందుకు భక్తులు పడ రాని పాట్లు పడ్డారు. మేడారం సమ్మక్క గుడి ప్రాంతంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉన్న వాహనాలు దిగబడగా.. వీవీఐపీ, వీఐపీ వాహనాలు రెండు గంటల పాటు ఇరుక్కుపోయాయి. అలాగే మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాల్లో వెళ్తున్న భక్తులు సైతం ఇబ్బందులకు గురయ్యారు. ఊరట్టం స్తూపం నుంచి పస్రా వెళ్లే దారిలో వాహనాలు నిలిచిపోయాయి. మేడారం లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే రోడ్ల నుంచి కూడా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెడ్డిగూడెం వెళ్లే గ్రామ పంచాయతీ కార్యాలయం మూల మలుపు వద్ద రెడ్డిగూడెం వైపు నుంచి వచ్చే వాహనాలు ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. శనివారం సాయంత్రం అకాల వర్షంతో వ్యాపార సముదాయాల్లోకి చేరిన నీరు దుర్వాసన శనివారం కురిసిన వర్షంతో మేడారం పరిసరాల్లో దుర్వాసన మొదలైంది. జాతరలో భక్తులు వదిలేసిన తిను బండారాలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, కోళ్లు, మేకల వ్యర్థాలతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల వలన దుర్వాసన వస్తోంది. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన క్లోరినేషన్ పనులు చేపట్టకపోతే స్థానికులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా.. మేడారం అభివృద్ధి: ఎమ్మెల్యే సీతక్క ములుగు: మేడారం జాతర ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మరింత అభివృద్ధి చేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీ బిడ్డగా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా జాతర నిర్వహణలో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. వచ్చే 2022 మహా జాతరలో ఈ సారి ఎదురైన సమస్యలను గుర్తించి మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరారు. మొదటి రెండు రోజులు జంపన్న వాగు వద్ద నీరు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నిధుల వినియోగ విషయంలో అన్ని వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను సేకరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే బడ్జెట్ ప్రణాళికలో మార్పు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు. -
జాతీయ హోదాకు కృషి
సాక్షి, భూపాలపల్లి : మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించాలనే అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ముండా తెలిపారు. ములుగు జిల్లాలోని మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మలను శనివారం ఆయన దర్శించుకున్నారు. తులాభారంతో నిలువెత్తు (75 కిలోలు) బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా మేడారానికి జాతీయ హోదా కల్పించడంతో పాటు అభివృద్ధికి నిధులు, గురుకులాలు కేటాయించాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు కేంద్ర మంత్రికి విన్నవించారు. దీంతో స్పందించిన ఆయన.. జాతర విశిష్టతను తెలియజేసి జాతీయ హోదా కల్పించే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గిరిజనులు ఎంతో కాలంగా కోరుకుంటున్న జాతీయ హోదా దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారంలో వనదేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, వచ్చే జాతరకు తప్పకుండా వస్తానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గిరిజనులకు ఆస్తులు లేకపోయినా సంతోషంగా బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పించే అంశం గిరిజన పురాతన సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి మరువలేనిదని కితాబిచ్చారు. ఆయన వెంట మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సేవలందించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. జాతర సమయంలో 36 వేల ట్రిప్పుల ద్వారా 12 లక్షల మందిని గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించారు. జాతర ముగియడంతో తిరుగు పయనమవుతున్న భక్తులు


