మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు | Special trains for Medaram Jathara | Sakshi
Sakshi News home page

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు

Jan 23 2026 4:03 AM | Updated on Jan 23 2026 4:03 AM

Special trains for Medaram Jathara

కాజీపేట–ఖమ్మం, ఆదిలాబాద్‌ అప్‌ అండ్‌ డౌన్‌ 10 రైళ్లు..

వరంగల్‌–నిజామాబాద్‌ అప్‌ అండ్‌ డౌన్‌ 8..ఇతర ప్రాంతాల నుంచి 10 రైళ్లు

28 జన్‌సాధారణ్‌ ప్రత్యేక రైళ్లు

కాజీపేట రూరల్‌: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలనుంచి వచ్చి వెళ్లే వారి కోసం కాజీపేట, వరంగల్‌ మీదుగా, కాజీపేట, వరంగల్‌ నుంచి జన్‌ సాధా రణ్‌ అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు.  

» ఈ నెల 28, 30, ఫిబ్రవరి 1వ తేదీల్లో సికింద్రాబాద్‌–మంచిర్యాల (07495) వెళ్లే ఎక్స్‌ప్రెస్, జనవరి 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో మంచిర్యాల–సికింద్రాబాద్‌ (07496) వెళ్లే ఎక్స్‌ప్రెస్, జనవరి 29, 31వ తేదీల్లో సికింద్రాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (07496) వెళ్లే ఎక్స్‌ప్రెస్, జనవరి 29, 31 తేదీల్లో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌ (07497) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ కాజీపేటకు చేరుకొని వెళ్తాయి. 

ఈ రైళ్లకు మౌ లాలి, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘన్‌పూర్, పెండ్యాల్, కాజీపేట, వరంగల్, హసన్‌పర్తి, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట్‌లో హాల్టింగ్‌ కల్పించారు. 

» ఈ నెల 28 నుంచి 31 తేదీల్లో నిజామాబాద్‌–వరంగల్‌ (07499) వెళ్లే ఎక్స్‌ప్రెస్, 28 నుంచి 31 తేదీల్లో వరంగల్‌–నిజమాబాద్‌ (07500) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లకు కామారెడ్డి, అక్కన్నపేట, మిర్జాపల్లి, వాడిరామ్, మనోహరాబాబాద్, మేడ్చల్, బొల్లారం, మౌలాలి, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, వంగపల్లి, ఆలేరు, జనగామ, రఘునాథ్‌ పల్లి, ఘన్‌పూర్, పెండ్యాల్, కాజీపేటలో హాల్టింగ్‌ కల్పించారు.  

» ఈ నెల 28 నుంచి 31 తేదీలలో కాజీపేట–ఖమ్మం (07504) వెళ్లే ఎక్స్‌ప్రెస్, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఖమ్మం–కాజీపేట (07503) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లకు వరంగల్, చింతల్‌పల్లి, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, గార్ల, డోర్నకల్, పాపట్‌పల్లి, మల్లెమడుగులో హాల్టింగ్‌ కల్పించారు. 

» ఈ నెల 28వ తేదీన ఆదిలాబాద్‌–కాజీపేట (07501) వెళ్లే ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన కాజీపేట–ఆదిలాబాద్‌ (07502) ఎక్స్‌ప్రెస్‌లకు అంబరి, కిన్‌వాట్, ధనోరా దక్కన్, సహస్రకుండ్, హిమాయత్‌నగర్, హడ్‌గాన్‌రోడ్, బోకర్, ముధ్కెడ్, ఉమ్రి, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, మోర్తాడ్, మెట్‌పల్లి, కోరుట్ల, లింగంపేట్‌ జగిత్యాల, గంగాధర, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, కొలనూర్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తిలో హాల్టింగ్‌ కల్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement