special trains
-
కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన మహాకుంభమేళా ముగియనున్న దృష్ట్యా.. చర్లపల్లి–దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–దానాపూర్ (07791) ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీ నుంచి 28 వరకు (9 సర్వీసులు) ఉదయం 9.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి రెండోరోజు తెల్లవారుజామున 1.30 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో దానాపూర్–చర్లపల్లి (07792) ప్రత్యేక రైలు ఈ నెల 20 నుంచి 28 వరకు (9 సర్వీసులు) ఉదయం 4.45 గంటలకు దానాపూర్ నుంచి బయలుదేరి.. మర్నాడు రాత్రి 9.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బర్హంపూర్ తదితర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. -
మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికిపైగా భక్తులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకైన మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్లనున్నారు. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సంక్రాంతి (Sankranti) వేడుకలు, శబరిమల సందర్శన కూడా ముగియడంతో భక్తజనం కుంభమేళాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు టూర్స్, ట్రావెల్స్ సంస్థలు, పర్యాటక సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికిపైగా వెళ్లనున్నట్లు అంచనా. మరోవైపు కుంభమేళా (Kumbh Mela) కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ 3 వేల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా, తెలుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 177 రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రెగ్యులర్ రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తున్నట్లు అధికారులుమ తెలిపారు. బస్సులు, రైళ్లు, విమానాలతోపాటు సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు. ఒక్కరికి రూ.45 వేల పైనే... భక్తులు మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ మేరకు 10 నుంచి 20 మంది దంపతులు కలిసి ఒక బృందంగా మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) వెళ్తున్నట్లు హిమాయత్‌నగర్‌కు చెందిన ఒక ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇలా వచ్చేవారి కోసం మినీబస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కనీసం వారంపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో మహాకుంభమేళాతోపాటు అయోధ్య, వారణాసి తదితర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. ఇందుకనుగుణంగా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నారు. కొన్ని సంస్థలు భోజనం, వసతి, రవాణా తదితర సదుపాయాలతో కలిపి ప్యాకేజీలను అందజేస్తుండగా కొన్నిసంస్థలు హైదరాబాద్, విజయవాడ, (Vijayawada) విశాఖ తదితర నగరాల నుంచి కేవలం రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి.హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి తిరిగి వచ్చేందుకు టూరిస్ట్ బస్సుల్లో రూ.15 వేలకుపైగా చార్జీ విధిస్తున్నారు. అక్కడి నుంచి పలు పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు నాలుగు రాత్రులు, ఐదు పగళ్లకు కలిపి రూ.25 వేల చొప్పున ప్యాకేజీలు ఉన్నాయి. మహాకుంభమేళాకు వెళ్లేందుకు సగటున ఒక భక్తుడు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. సాధారణ రోజుల్లో అయితే కేవలం రూ.20 వేలల్లోనే అయోధ్య, వారణాసి వంటి ప్రాంతాలను సందర్శించి వచ్చే అవకాశం ఉంటుందని సికింద్రాబాద్‌కు చెందిన ఒక ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి మురళి తెలిపారు.ఫ్లైట్ చార్జీ రూ.20 వేలు.. విమాన చార్జీలు కూడా చుక్కలను తాకుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నుంచి వారణాసికి సాధారణ రోజుల్లో రూ.4 వేల నుంచి రూ.7 వేల వరకు చార్జీ ఉంటుంది. ఇది రూ.18 వేల నుంచి రూ.20 వేలకు పెరిగింది. అయినప్పటికీ టికెట్లు లభించడం లేదని పలువురు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల రద్దీ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు విమాన చార్జీలు కూడా పెరగవచ్చని ట్రావెల్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రైళ్లలో వంద శాతం ఆక్యుపెన్సీ హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వారణాసి, లక్నో, రెక్సల్, పట్నా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఎలాంటి బుకింగ్ సదుపాయం లేదు. అన్ని రైళ్లలో రిగ్రేట్ దశకు చేరుకుంది. ప్రత్యేక రైళ్లన్నీ 90 శాతం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రత్యేక రైళ్లలోనూ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఏ రోజుకు ఆ రోజు అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు 177 రైళ్లను అదనంగా ఏర్పాటు చేయగా, రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.చదవండి: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీసొంత వాహనం సో బెటర్ రైళ్లు, బస్సులు, విమానాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొంతమంది భక్తులు సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆధ్యాత్మికయాత్రతో పాటు వారం, పది రోజులు నచ్చిన ప్రాంతాల్లో పర్యటించేందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకొని బయలుదేరుతున్నారు. ఫ్యామిలీ టూర్‌గా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.పక్కా ప్రణాళికతో వెళ్లండిమహాకుంభమేళాకు ఇప్పటికే లక్షలాదిగా జనం తరలి వస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే దారాలన్నీ జనసంద్రంగా మారాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వెళ్లేవారు ప్యాకేజీలపై స్పష్టమైన అవగాహనతో ప్రణాళికలు వేసుకోవడం మంచిది. – హరికిషన్, వాల్మీకి టూర్స్ అండ్ ట్రావెల్స్ఫ్లైట్లకు డిమాండ్ పెరిగింది కొద్ది రోజులుగా ఫ్లైట్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. బుకింగ్స్ కూడా లభించడం లేదు. ఫ్లైట్ బుకింగ్ కోసం వేచిచూడటం మంచిది. చార్జీల్లో హెచ్చుతగ్గులను గమనించి బుక్ చేసుకోవాలి. – మురళి వడ్ల, టూరిస్ట్ ఆపరేటర్ -
సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులకు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు పూర్తిగా నిలిచిపోయి రిగ్రేట్ దశకు చేరాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తుండగా.. అరకొరగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం ప్రయాణికుల డిమాండ్లను భర్తీ చేయడం లేదు. మరోవైపు అన్ని ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి శబరిమలకు నడిచే రైళ్లు కూడా అయ్యప్ప భక్తులకు నరకం చూపుతున్నాయి. రెండు రోజులు గడిచినా హైదరాబాద్ నుంచి శబరిమలకు, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు కూడా ‘ప్రత్యేకమే’.. ⇒నగరం నుంచి ప్రతి రోజు సుమారు వందకు పైగా రెగ్యులర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రోజుకు మరో 50 వేల మంది అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. ఈ డిమాండ్ మేరకు అదనపు రైళ్లు లేవు. కొన్ని రైళ్లలో బెర్తులు, అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లలో చార్జీలు కూడా ఎక్కువే. సాధారణ చార్జీలపై 25 శాతం వరకు అదనపు చార్జీలు విధిస్తారు. అయినప్పటికీ మరో గత్యంతరం లేక ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే ప్రయాణికులకు రైళ్లలో పడిగాపులు తప్పడం లేదు. ⇒ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టాలపై రైళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో సకాలంలో సిగ్నల్స్ లభించకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ఆలస్యం ప్రయాణికుల పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 12 గంటల వరకు కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా బయలుదేరిన ప్రయాణికులు భోగి పండగ రోజు కూడా సొంత ఊళ్లకు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఆర్టీసీ సైతం అదే బాటలో.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్‌లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 6 వేలకు పైగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంగణాలుప్రయాణికులతో సందడిగా మారాయి.ప్రైవేట్ బస్సుల దోపిడీ.. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దారి దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు లగ్జరీ రూ.1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ చార్జీ రూ.3000 వరకు చేరింది. అలాగే ఏసీ బస్సుల్లో రూ.2500 నుంచి ఏకంగా రూ.5000 వరకు పెరిగినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి వెళితే చార్జీల కోసమే రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని ఏఎస్రావు నగర్‌కు చెందిన మల్లికార్జున్‌రావు చెప్పారు. అలాగే.. హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు సైతం ప్రైవేట్ బస్సుల దోపిడీ విమాన చార్జీలను తలపిస్తోంది.సాక్షి ఎఫెక్ట్.. బస్సులు సీజ్‌అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నప్రైవేట్ వాహనాల దందాపై సాక్షి వరుస కథనాలు ఇచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎల్బీనగర్ లో ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ అధికారుల కొరడా జులిపించారు. సంక్రాంతికి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని టీం అడ్డుకుంది. దాదాపు 20 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇక.. పెద్ద అంబర్ పేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల సీజ్ చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్ ఆరాంఘడ్ చౌరస్తా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల ఈ ఉదయం 4 గంటల నుంచే తనిఖీ చేపట్టారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు . ఈ క్రమంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. 11 బస్సుల పై కేసు నమోదు అయినట్లు సమాచారం. -
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. 'జన సాధారణ్ అన్ రిజర్వ్డ్’ స్పెషల్ ట్రైన్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్ రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.1) రైలు నంబర్ (08534) చర్లపల్లి-విశాఖపట్నం (జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) జనవరి 11, 13, 16, 18 తేదీలలో చర్లపల్లి నుంచి ఉదయం 00.30 గంటలకు (రాత్రి 12.30 గంటలకు) బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు (అదే రోజున ) విశాఖపట్నం చేరుకుంటుంది. 2) రైలు(08533) విశాఖపట్నం-చర్లపల్లి (జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) విశాఖపట్నం నుంచి జనవరి 10, 12, 15, 17 తేదీలలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరి (అదే రోజు) రాత్రి 22.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రత్యేక రైళ్లు నంబర్ (08533/08534) విశాఖపట్నం-చర్లపల్లి - విశాఖపట్నం జనసాధారణ (అన్ రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ లలో ఇరువైపులా ఆగుతాయి.3) రైలు నంబర్: (08538) చర్లపల్లి-విశాఖపట్నం (జన సాధారణ్ అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు) జనవరి 11, 12, 16, 17వ తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 10.00 గంటలకు బయలుదేరి 22.00 గంటలకు (అదే రోజు రాత్రి) విశాఖపట్నం చేరుకుంటుంది. ఇదీ చదవండి: పండుగ బస్సు..‘ప్రత్యేక’ చార్జీ4) రైలు నంబర్ (08537) విశాఖపట్నం - చర్లపల్లి (జనసాధారణ అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు) 2025 జనవరి 10, 11, 15 & 16 తేదీలలో విశాఖపట్నం నుండి (సాయంత్రం 6.20) 18.20 గంటలకు బయలు దేరుతుంది మరియు 08.00 గంటలకు (మరుసటి రోజు ఉదయం) చర్లపల్లి చేరుకుంటుంది. రైలు(08537/08538) విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం జనసాధరణ (అన్ రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. జనసాధరన్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులను సులభతరం చేయడానికి అన్రిజర్వ్డ్ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చింది.సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లుదక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ సాక్షి మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామన్నారు. ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా 16 జన సాధారణ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఛార్జీలే ఈ జన సాధారణ రైళ్లలో వసూలు చేస్తామన్నారు. ఛార్జీల పెంపు భారీగా ఉండదు. ప్లాట్ ఫారమ్ చార్జీలు కూడా పెంచటం లేదు.చర్లపల్లి నుంచి కొన్ని రైళ్లు ఈ సంక్రాంతికి నడపనున్నాం. సిటీ నుంచి చర్లపల్లికి వెళ్లాలంటే సికింద్రాబాద్ స్టేషన్ బయట నుంచి కొన్ని బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. చర్లపల్లి కాకుండా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రైళ్లు నడుస్తాయి’’ అని శ్రీధర్ వెల్లడించారు. -
హైదరాబాద్ : ముస్తాబైన మరో మణిహారం..చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ (ఫొటోలు)
-
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో మరో 52 అదనపు రైళ్లు (special trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. SCR to run Additional Sankranti Special Trains between various Destinations @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/fdoNVWdxSq— South Central Railway (@SCRailwayIndia) January 5, 2025 -
మహా కుంభ్‌కు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ: పన్నెండేళ్లకోసారి జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభ మేళాను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి వరకు 42 రోజుల పాటు గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరగనుంది. ఈ సందర్భంగా యాత్రికులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇందులో జనవరి 13న పుష్య పౌర్ణమిన, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు చేసే స్నానాలకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ రాజ స్నానం రోజుల్లో భక్తుల సంఖ్య కోట్లలో ఉండనుందన్నది అధికారుల అంచనా. కేవలం జనవరి 29న మౌని అమావాస్య రోజున షాహి స్నాన్‌లో గరిష్టంగా 4 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గతంలో 2013లో జరిగిన మహా కుంభమేళాతో పోలిస్తే ఇప్పుడు జరుగనున్న మహాకుంభమేళా మూడు రెట్లు పెద్దదని భావిస్తున్నారు. ఈ పవిత్ర స్నానాల కోసం గతంలో 12 కోట్ల మంది భక్తులు రాగా ఈసారి సుమారు 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లుగా 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మేళా ఏర్పాట్లు విస్తృతంగా సాగుతున్నాయి. నాలుగు రెట్ట బడ్జెట్ మహాకుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. గతం కంటే బడ్జెట్ నాలుగు రెట్లు పెంచారు. ఈసారి మహాకుంభ బడ్జెట్ రూ.5,060 కోట్లు కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,100 కోట్లు ఇచి్చంది. 2013 కుంభ్ సమయంలో రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధికారంలో ఉండగా.. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013లో మహాకుంభ్‌మేళా కోసం రూ.1,214 కోట్ల బడ్జెట్ కేటాయించగా రూ.1,017 కోట్లు ఖర్చు చేశారు. 2025లో మహాకుంభ బడ్జెట్ 2013 కంటే రూ.4,043 కోట్లు ఎక్కువ కావడం విశేషం. 38 వేల మంది జవాన్లతో భద్రత మహాకుంభమేళా జరుగుతున్న కుంభ్ నగర్ భద్రతను దుర్భేద్యమైన కోటలా పటిష్టం చేశారు. కుంభ్ నగర్ మాస్టర్ ప్లాన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రత కోసం 38 వేల మంది సైనికులను మోహరిస్తున్నారు. మొత్తం 56 పోలీస్ స్టేషన్లు, 144 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రెండు సైబర్ స్టేషన్లను విడివిడిగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ డెస్క్ ఉంటుంది. కాగా, 2013 మహా కుంభ్‌లో దాదాపు 12 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 12 మంది ఏఎస్పీ, 30 మంది సీఓలు, 409 మంది ఇన్స్పెక్టర్లు, 4,913 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీఐపీల కోసం మహారాజా టెంట్లు వీఐపీల కోసం 150 మహారాజా టెంట్లతో కూడిన ప్రత్యేక నగరాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనిలో ఒక్కరోజు ఛార్జీ రూ.30 వేలకు పైగా ఉంటుంది. వీటితో పాటు 1,500 సింగిల్ రూమ్‌లు, 400 ఫ్యామిలీ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు డోమ్ సిటీని సిద్ధం చేశారు. వీటి అద్దె లక్షకు పైగా ఉంటుంది. మహాకుంభ్‌లో లక్షన్నర మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వీటిలో 300 మొబైల్ టాయిలెట్లు ఉన్నాయి. 2013లో మొత్తం 33,903 మరుగుదొడ్లు నిర్మించారు. ఘాట్ వద్ద దాదాపు 10 వేల దుస్తులు మార్చుకునే గదులను నిర్మించనున్నారు. 2013 కుంభ్‌లో దుస్తులు మార్చుకునే గదుల సంఖ్య దాదాపు రెండున్నర వేలుగా ఉన్నాయి. 23 నగరాల నుంచి విమానాలు మహాకుంభమేళా కోసం రైల్వే శాఖ 3 వేల ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఇది 13 వేలకు పైగా ట్రిప్పులను నడుపనుంది. ప్రతిరోజూ 5 లక్షల మంది ప్రయాణికులు జనరల్ కోచ్‌లలో ప్రయాణిస్తారని రైల్వేశాఖ అంచనా వేసింది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌తో పాటు నగరంలోని 8 రైల్వే స్టేషన్లను సిద్ధం చేశారు. అంతేగాక ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్ వేలకు పైగా బస్సులను ప్రత్యేకంగా నడుపనుంది. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి దేశంలోని దాదాపు 23 నగరాలకు నేరుగా విమానాలు అందుబాటులో ఉంచనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భువనేశ్వర్, లక్నో, రాయ్‌పూర్, బెంగళూరు, అహ్మదాబాద్, గౌహతి, కోల్‌కతాలకు నేరుగా విమానాలు నడుస్తాయి. వీటితో పాటు మహాకుంభ్‌కు వీవీఐపీలు, విదేశీ అతిథులకు చెందిన 200కు పైగా చార్టర్డ్ విమానాలు ప్రయాగ్‌రాజ్ రానున్నాయి. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో కేవలం 15 విమానాలకు మాత్రమే పార్కింగ్ స్థలం ఉంది. అందువల్ల, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు రాష్ట్రా ల్లోని 11 విమానాశ్రయాల నుంచి పార్కింగ్‌కు సంబంధించిన నివేదికలను అందించాల ని కోరింది. నీటి అడుగునా నిఘాం మహాకుంభ్ అత్యంత ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈసారి విద్యుత్‌కు రూ.391.04 కోట్ల బడ్జెట్ కేటాయించారు. మొత్తం 67 వేల వీధి దీపాలను ఏర్పాటు చేశారు. 85 కొత్త తాత్కాలిక పవర్ ప్లాంట్లు, 170 సబ్ స్టేషన్లు నిర్మించారు. మహాకుంభ్‌లో ఆకాశంతో పాటు డ్రోన్ల ద్వారా నీటి అడుగున కూడా నిఘా ఉండనుంది. నీటి అడుగున భద్రత కోసం తొలిసారిగా నదిలోపల 8 కిలోమీటర్ల మేర డీప్ బారికేడింగ్‌ను ఏర్పాటు చేశారు. మహాకుంభ్‌లో అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 25 మెగా ఈవెంట్లు జరగనున్నాయి. దీనిని విదేశీ కంపెనీలు రూపొందించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక కార్యక్రమానికి, ప్రధాని నరేంద్ర మోదీ రెండు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. పదికి పైగా దేశాల అధినేతలు రానున్నారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–కాకినాడ టౌన్ (07653) రైలు ఈనెల 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07654) ఈనెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కాచిగూడ చేరుతుంది. హైదరాబాద్–కాకినాడ టౌన్ (07023) రైలు ఈనెల 10న సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07024) 11న రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. నేటి నుంచి బుకింగ్స్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లాలనుకొనే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. పండగ రద్దీ దృష్ట్యా ఆరు ప్రత్యేక రైళ్లను నడపనుంది. కాచిగూడ -కాకినాడ టౌన్, హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి అందుబాటులో ఉంటుందని సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు.కాచిగూడ - కాకినాడ టౌన్ రైలు (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకోనుంది. అలాగే, కాకినాడ టౌన్ -కాచిగూడ రైలు (07654) ఈ నెల 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.హైదరాబాద్ -కాకినాడ టౌన్ రైలు (07023) జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయని రైల్వే శాఖ తెలిపింది.ఇదీ చదవండి: బంగారం ఎంత కొనచ్చు? పెళ్లికానివారికైతే అంతే! -
మహాకుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళా సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మౌలాలి–ఆజాంఘర్ (0707/0708) ప్రత్యేక రైలు జనవరి 18వ తేదీ, ఫిబ్రవరి 21 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.15 గంటలకు ఆజాంఘర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 20, ఫిబ్రవరి 23 తేదీల్లో సాయంత్రం 7.45 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 7.30 గంటలకు మౌలాలి చేరుకుంటుంది. మౌలాలి–గయ (07711/7712) ప్రత్యేక రైలు జనవరి 19వ తేదీ సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 9 గంటలకు గయ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 21వ తేదీ సాయంత్రం 7.45 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 7.30 గంటలకు మౌలాలి చేరుకుంటుంది. మౌలాలి–గయ (07729/07730) ప్రత్యేక రైలు జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 9.30 గంటలకు గయ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 24వ తేదీ సాయంత్రం 7.45 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 7.30 గంటలకు మౌలాలి చేరుకుంటుంది. కాచిగూడ–పట్నా (07725/07726) ప్రత్యేక రైలు జనవరి 25వ తేదీ సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 10.30 గంటలకు పట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 27వ తేదీ ఉదయం 11.30 గంటలకు బయల్దేరి.. మర్నాడు ఉదయం 7 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. గుంటూరు–ఆజాంఘర్ (07701/07702) ప్రత్యేక రైలు జనవరి 24వ తేదీ రాత్రి 11 గంటలకు గుంటూరులో బయల్దేరి.. మర్నాడు సాయంత్రం 5.15 గంటలకు ఆజాంఘర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 26వ తేదీ సాయంత్రం 7.45 గంటలకు ఆజాంఘర్లో బయల్దేరి.. మర్నాడు ఉదయం 9 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. గుంటూరు–గయ (07719/07720) ప్రత్యేక రైలు జనవరి 25వ తేదీ మధ్యాహ్నం 2.20 గంటలకు గుంటూరులో బయల్దేరి.. మర్నాడు ఉదయం 9 గంటలకు గయ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 27వ తేదీ మధ్యాహ్నం 2.15 గంటలకు గయలో బయల్దేరి.. మర్నాడు ఉదయం 4 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణమద్య రైల్వే శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ అఫిసర్ మండురూపకర్ శనివారం తెలిపారు. సికింద్రబాద్ నుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌నంబర్07175)రైలు ఈనెల 19, 26తేదిలలో సికింద్రబాద్‌లో గురువారం రాత్రీ 8గంటకు బయలు దేరి శనివారం తెల్లవారుజామున 1.30కు కొల్లం చేరుతుంది.కాకినాడ పొర్టునుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌నంబర్07173)ఈనెల 18,25తేదిలలో బుధవారం రాత్రీ 11.50కి కాకినాడ పొర్టులో బయలు దేరి శుక్రవారం ఉదయం 5.30కు కొల్లం చేరుతుంది. విజయవాడ నుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌నంబర్07177) 21, 28 తేదిలలో విజయవాడలో శనివారం రాత్రీ 10.15 బయలుదేరి సొమవారం ఉదయం 6.20కి కొల్లం చేరుతుంది. -
శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లతో పాటు అదనంగా మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ పోర్టు–కొల్లం (07173) ఈనెల 11, 18, 25 తేదీల్లో బుధవారం రాత్రి 11.50 గంటలకు కాకినాడ పోర్టులో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07174) ఈనెల 13, 20, 27 తేదీల్లో శుక్రవారం ఉదయం 8.40 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్–కొల్లం (07175) ఈనెల 19, 26 తేదీల్లో గురువారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07176) ఈనెల 21, 28 తేదీల్లో శనివారం ఉదయం 5 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది. -
ఆ స్పెషల్ రైళ్లు.. ఇక రెగ్యులర్
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రత్యేక రైళ్లు ఇక రెగ్యులర్ జాబితాలోకి రానున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీతో నడిచే రైళ్లను క్రమబదీ్ధకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆయా మార్గాల్లో రైళ్ల సంఖ్య పెరగడంతోపాటు ‘ప్రత్యేక’చార్జీల భారం కూడా తగ్గనుంది. సాధారణంగా ప్రయాణికుల రద్దీ, పండుగలు, వరుస, వేసవి సెలవులు వంటి రోజుల్లో సాధారణంగా నడిచే రైళ్లతోపాటు అదనపు రైళ్లు ఏర్పాటు చేస్తారు.ఈ రైళ్ల చార్జీలు కూడా తత్కాల్ చార్జీలకు సమానంగా ఉంటాయి. రెగ్యులర్ చార్జీల కంటే 20 శాతం ఎక్కువ. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వారం, పదిరోజుల ముందు ప్రత్యేక రైళ్ల కోసం ప్రణాళికలు వేసి అందుబాటులోకి తెస్తారు. కానీ కొన్ని రూట్లలో రెగ్యులర్‌గా నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లకు కూడా ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి స్పెషల్ ట్రైన్స్ నంబర్లన్నీ సున్నా (0)తో మొదలవుతాయి. రెగ్యులర్ రైళ్లకు మాత్రం సాధారణ నంబర్లలను కేటాయిస్తారు. కోవిడ్ కాలం నుంచి కొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లే నడుస్తుండగా, మరి కొన్నిమార్గాల్లో కోవిడ్ కంటే ముందు నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిర్దిష్ట కాల పరిమితికే ప్రత్యేకం ప్రస్తుతం అయ్యప్ప భక్తులు పెద్దఎత్తున శబరిమలకు వెళుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతోంది. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి సుమారు 30కి పైగా స్పెషల్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి జనవరి నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత రద్దీ మేరకు మరో రూట్లో వీటిని మళ్లిస్తారు. ⇒ హైదరాబాద్ నుంచి శబరికి ప్రతిరోజు ఒక ట్రైన్ మాత్రం రెగ్యులర్‌గా నడుస్తుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రూట్లో మరో రైలును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన ఉంది. ⇒సికింద్రాబాద్ నుంచి షిరిడికి వెళ్లేందుకు అజంతా ఎక్స్ ప్రెస్ ఒక్కటే ఉంది. ఆ రూట్లో కూడా ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లు అందుబా టుకి తెస్తారు. ⇒జంటనగరాల నుంచి తిరుపతికి ఐదారు రెగ్యులర్ రైళ్లు నడిచినా, ప్రయాణికుల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. దీంతో గతంలో ‘ప్రత్యేకం’గా నడిచిన రైలును ఆ తర్వాత ‘సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్’గా రెగ్యులర్ చేశారు. ⇒హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడ, తిరుపతి, విజయవాడ, దానాపూర్, పటా్న, జైపూర్ తదితర నగరాలకు రెగ్యులర్‌గా నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలా ప్రయాణికుల రద్దీ, డిమాండ్ అత్యధికంగా ఉన్న రూట్లను ఎంపిక చేసి ఆ మార్గాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను దశలవారీగా క్రమబదీ్ధకరిస్తారు.వచ్చే నెలలో కొత్త టైమ్ టేబుల్...రైళ్ల వేళల్లో మార్పులు..చేర్పులు, హాల్టింగ్ స్టేషన్లు, కొత్త రూట్లు, కొత్తగా అందుబాటులోకి రానున్న రెగ్యులర్ సరీ్వసుల వేళలతో రూపొందించిన కొత్త టైమ్‌టేబుల్ జనవరి నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా నడుస్తూ రెగ్యులర్‌గా మారనున్న రైళ్ల వేళలను కూడా టైమ్‌టేబుల్‌లో చేర్చుతారు. కోవిడ్ కాలం నుంచి కొన్ని రూట్లలో డెము, మెము రైళ్లను ప్రత్యేక కేటగిరీ కింద నడుపుతున్నారు. సికింద్రాబాద్–వరంగల్, కాచిగూడ–మహబూబ్‌నగర్, కాచిగూడ–కర్నూల్, తదితర మార్గాల్లో నడిచే ఇలాంటి రైళ్లను కూడా తిరిగి రెగ్యులర్ జాబితాలో చేర్చే అవకాశముందని అధికారులు తెలిపారు. -
శబరిమలకు 44 ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్ నుంచి విజయవాడ మీదుగా కొల్లం వరకు 44 వారాంతపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–కొల్లాం (08539) ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు.ఈ రైలు ప్రతి బుధవారం విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08540) డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి గురువారం రాత్రి బయలు దేరుతుంది. శ్రీకాకుళం రోడ్–కొల్లాం (08553) ప్రత్యేక రైలు డిసెంబర్ 1 నుంచి జనవరి 26 వరకు ప్రతి ఆదివారం నడుపుతారు. శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి, మరుసటి రోజు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08554) డిసెంబర్ 2 నుంచి జనవరి 27 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కొల్లాంలో బయలు దేరుతుంది. -
భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 8 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి(హైదరాబాద్)-కొల్లాం, ఈ నెల 24, డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం-మౌలాలి, 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం.. 20, 27 తేదీల్లో కొల్లాం-మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్న దక్షిణమధ్య రైల్వే.. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.సికింద్రాబాద్–లక్నో మధ్య ప్రత్యేక రైలు రైల్వేస్టేషన్ (విజయవాడపశి్చమ): సికింద్రాబాద్–లక్నో మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్–లక్నో రైలు (07084) ఈ నెల 15, 22 తేదీల్లో శుక్రవారం రాత్రి 7.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, ఆదివారం సాయంత్రం లక్నో చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07083) ఈ నెల 18, 25 తేదీల్లో సోమవారం ఉదయం 9.50 గంటలకు లక్నోలో బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
అసలే చాలీచాలని రైళ్లు.. ఆపై అదనపు కష్టాలు
హైదరాబాద్ నుంచి కాజిపేట మీదుగా సాగే గ్రాండ్ ట్రంక్ రూట్, బీబీనగర్–గుంటూరు, మహ బూబ్‌నగర్ మీదుగా ఉన్న బెంగళూరు, నిజామాబాద్ రూట్ కూడా సామర్థ్యానికి మించి రైలు ట్రాఫి క్తో ఇరుగ్గా మారాయి. ప్రస్తుతం వాటి మీదుగా 160 శాతం మేర రైళ్లు నడుస్తున్నాయి. దీంతో పండగ ప్రత్యేక రైళ్లు వాటి మీదుగా నడపటం కష్టంగా మారింది. దీంతో రద్దీ రోజుల్లో గూడ్సు రైళ్లను రీ షెడ్యూల్ చేసి మరీ ప్రత్యేక పండగ రైళ్లను అతికష్టమ్మీద తిప్పుతున్నారు. ఈ రెండు కారణాలతో సరిపోను ప్రత్యేక రైళ్లు నడపలేకపోతున్నారు. వెరసి వచ్చే దసరా, దీపావళి, సంక్రాంతి సమయాల్లో ఎప్పటిలాగానే ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు. సరిగ్గా పండగ వేళ కొత్త కష్టాలు అసలే చాలినన్ని రేక్స్ లేక, సరిపడా ట్రాక్ లేక అదనపు రైళ్లు నడపటం కష్టంగా మారిన తరుణంలో, ఈసారి దసరా వేళ గ్రాండ్ ట్రంక్ రూట్లో కొత్తకష్టం వచ్చి పడింది. వరంగల్, కాజీపేట, హసన్‌పర్తి మధ్య ఇటీవల రెండు బైపాస్ లైన్లు నిర్మించారు. ఉన్న రెండు అప్ అండ్ డౌన్ రూట్లు సరిపోక వాటికి అదనంగా రెండు బైపాస్ లైన్లు నిర్మించారు. ఇప్పుడు వీటిని మెయిన్ లైన్లతో అనుసంధానించే నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి పనులు జరిగే సమయంలో ఆ ట్రాక్ మీద రైళ్లు నడపటం సాధ్యం కాదు. దీంతో రోజువారిగా ప్రత్యేక టైమింగ్స్ కేటాయించారు. ప్రధాన రైళ్లు కాకుండా మిగతా వాటిని రద్దు చేసి పనులు చేయిస్తున్నారు. ఇవి వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు జరిగేలా స్లాట్ కేటాయించారు. ఈ నెలాఖరు నుంచి ప్రత్యేక రైళ్లు తిప్పాల్సి ఉంది. ఇందుకోసం ముందుగానే ప్రత్యేక రైళ్ల టైంటేబుల్ ఖరారు చేశారు. నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్న ట్రాక్ మీదుగా కూడా ఈ ప్రత్యేక రైళ్లు తిరగాల్సి ఉంది. ఆ పనుల కోసం ఇప్పటికే 99 రైళ్లను రద్దు చేసి మరో 38 రైళ్లను దారి మళ్లించారు. రద్దయిన వాటిల్లో పండుగ ప్రత్యేక రైళ్లు 47 ఉన్నాయి. అసలే ప్రత్యేక రైళ్లు సరిపోని తరుణంలో 47 రైళ్లు రద్దు కావడం వల్ల ఈసారి పండుగ ప్రయాణికులకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఒక్క రైలు తయారీకి రూ.80 కోట్లకు పైగా వ్యయం రద్దీ కోసం మరిన్ని రైళ్లు అందుబాటులోకి తేవాల్సి ఉన్నా.. అది రైల్వేపై పెనుభారం మోపుతోంది. ప్రస్తుతం ఒక రైలు రేక్ తయారీకి దాదాపు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుంది. అందే వందేభారత్ లాంటి రైళ్లకు రూ.120 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంత భారీ వ్యయంతో రైళ్లను తయారు చేసి ప్రత్యేక రైళ్లుగా నడిపితే, అన్‌సీజన్‌లో అవన్నీ ఖాళీగా ఉండాల్సి ఉంటుంది. దీంతో స్పేర్ రైళ్ల సంఖ్య పెంచటానికి రైల్వే ఆసక్తి చూపటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో రద్దీ ఎక్కువగా ఉండే, దసరా, సంక్రాంతి లాంటి సందర్భాల్లో ఉత్తరాది నుంచి స్పేర్ రైళ్లు తెప్పిస్తున్నారు. -
Onam Special Trains: ఓనమ్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఓనమ్ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. కాచిగూడ–కొల్లాం (07044/07045) రైలు ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు బయల్దేరి మర్నాడు.. రాత్రి 11.20 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 16వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయల్దేరి మర్నాడు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాగా, వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు నిరాశే ఎదురవుతోంది. సంక్రాంతికి నాలుగు నెలల ముందే ప్రధాన రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ రిజర్వేషన్లు శుక్రవారం ఉదయం 8 గంటలకు అందుబాటులోకి రాగా.. గోదావరి, విశాఖ, కోణార్క్, ఫలక్‌నుమా తదితర రైళ్లకు 8.05 గంటలకల్లా పూర్తిస్థాయిలో బెర్తులు నిండిపోయాయి. కేవలం ఐదు నిమిషాలలోనే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.ఇదీ చదవండి: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం యాత్రికులు -
పండుగల సీజన్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దసరా, దీపావళి పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా తిరుపతి–శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి–శ్రీకాకుళం రోడ్డు (07442) ప్రత్యేక వారాంతపు రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం నడవనుంది. అదే విధంగా శ్రీకాకుళం రోడ్డు–తిరుపతి (07443) రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం నడవనుంది. రెండు మార్గాల్లో ఈ రైలు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతుంది. -
ప్రయాణికులకు గూడ్‌న్యూస్.. మరో 8 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వరుస సెలవులు రావడంతో ప్రజలంతా ప్రయాణాలు కట్టారు. సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులతోపాటు పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేను కోరారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 8 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. -
వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మండ్రూప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ 07234) ఈ నెల 28నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచి వరకు నడుస్తుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో రాత్రి 11.40 బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపూర్, కుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, బద్రాక్, ఖరగ్‌పూర్ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచి చేరుతుందన్నారు. ఈ ట్రైన్ (నంబర్ 07235) తిరిగి ఈనెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచిలో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. విజయవాడకు బుధవారం ఉదయం 8.45కు వస్తుంది. 18 బోగీలతో నడిచే ఈ రైళ్లలో ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం ఉండదన్నారు. స్టేషన్లలో బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు పొందవచ్చునని తెలిపారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. -
వేసవికి ప్రత్యేక రైళ్లు..
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను నడప నున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ ఓ ప్రకటలో తెలిపారు. హైదరాబాద్–టక్ ప్రత్యేక రైలు(07165) ఈ నెల 16, 23, 30 తేదీల్లో అంటే ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి కటక్ వరకు, తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07166) ఈ నెల 17, 24, మే 1 తేదీల్లో అంటే ప్రతి బుధవారం కటక్ నుంచి హైదరాబాద్ మధ్య నడవనున్నాయి. సికింద్రాబాద్–సత్రగచ్చి ప్రత్యేక రైలు(07223) ఈ నెల 19 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ నుంచి సత్రగచ్చి మధ్య, సత్రగచ్చి–సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు(07224) ఈ నెల 20 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం, సికింద్రాబాద్–షాలిమార్ మధ్య నడిచే రైలు(07225) ఈ నెల 15 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, షాలిమార్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు(07226) ఈ నెల 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం నడవనున్నాయి. సికింద్రాబాద్–కొల్లం(07193) ఈ నెల 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో ప్రతి బుధవారం సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 11.25 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07194) ఈ నెల 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో అంటే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వరంగల్‌కు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. నిజామాబాద్– వరంగల్ స్పెషల్ ట్రైన్ నిజామాబాద్– వరంగల్ (07019) ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్‌లో ఉదయం 7:05 గంటలకు బయలుదేరి వరంగల్‌కు మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుతుంది. అదే విధంగా వరంగల్–నిజామాబాద్ (07020) ఎక్స్‌ప్రెస్ వరంగల్‌లో మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి రాత్రి 10:30 గంటలకు నిజామాబాద్‌కు చేరుతుంది. వరంగల్– నిజామాబాద్ మధ్య ఈ రైళ్ల సర్వీస్‌లకు కాజీపేట జంక్షన్, పెండ్యాల్, ఘన్పూర్, రఘునాథపల్లి, జనగామ, ఆలేరు, వంగపల్లి, భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్, చర్లపల్లి, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, బొల్లారం, మేడ్చల్, మనోహరబాద్, వదిరాం, మిర్జాపల్లి, అక్కన్నపేట, కామారెడ్డి రైల్వే స్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ స్పెషల్ ట్రైన్ సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ ప్రత్యేక రైలు (07017) సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 10 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా వరంగల్ టు సిర్పూర్ కాగజ్‌నగర్ (07018) రైలు సాయంత్రం 4 గంటలకు వరంగల్‌నుంచి బయలుదేరి రాత్రి 12 గంటలకు కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది. సిర్పూర్కాగజ్నగర్–వరంగల్ మధ్య కాజీపేట టౌన్, హసన్‌పర్తి, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్, కొత్తపల్లి, ఓదెల, కొలనూరు, కొత్తపల్లి, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట్, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్డు, రేపల్లెవాడ, ఆసిఫాబాద్, రాళ్లపేట్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఇదీ చదవండి: TS: రవాణాశాఖలో భారీ ఎత్తున బదిలీలు.. ఉత్తర్వులు జారీ -
విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 25 వరకు పూర్ణా–తిరుపతి (07609), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి–పూర్ణా (07610), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు హైదరాబాద్–నర్సాపూర్ (07631), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు నర్సాపూర్–హైదరాబాద్ (07632), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి–సికింద్రాబాద్ (07481), ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు సికింద్రాబాద్–తిరుపతి (07482), ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29 వరకు కాకినాడ టౌన్–లింగంపల్లి (07445), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) రైళ్లును పొడిగించి నడపనున్నట్లు తెలిపారు. -
అయోధ్యకు 15 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అయోధ్యకు వెళ్లే భక్తులకు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. శ్రీరాముడిసందర్శనకు వెళ్లే భక్తుల రద్దీకి అనుగుణంగా ఫిబ్రవరి 28 వరకు సికింద్రాబాద్ మీదుగా 15 రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. సాధారణ ప్రయాణికులు ఈ రైళ్లలో నేరుగా బుకింగ్ చేసుకొనే సదుపాయం ఉండదు. విశ్వహిందూపరిషత్, బజరంగ్దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే భక్తులకు రైల్వేసేవలు లభిస్తాయని ఐఆర్సీటీసీ అధికారి ఒకరు తెలిపారు. భక్తులను అయోధ్యకు తరలించేందుకు, తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు వీలుగా వీహెచ్‌పీ తదితర సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు ఈ నెల 22వ తేదీన జరగనున్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి నేరుగా వెళ్లేందుకు ఎలాంటి రైళ్లు అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తారు. ఫిబ్రవరిలో మరో 12 రైళ్లు నడుపుతారు. ‘‘ఈ నెల రోజుల వ్యవధిలో అయోధ్య సందర్శనకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల కోసం మొత్తం 60 రైళ్లు సిద్ధం చేస్తున్నాం. వాటిలో హైదరాబాద్ నుంచే 15 రైళ్లు నడుస్తాయి.’’ అని ఒక అధికారి వివరించారు. ఈ రైళ్లలో స్లీపర్ కోచ్‌లే ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు చార్జీ రూ.1500 వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మార్చి నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఐఆర్సీటీసీ అయోధ్య ప్యాకేజీలు మాత్రం మార్చి నుంచి అందుబాటులోకి రానున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే భక్తులు అయోధ్య రాముడిని సందర్శించుకోవడంతో పాటు, స్థానిక ఆలయాల సందర్శన, భోజనం, వసతి, రోడ్డు రవాణా, తదితర సదుపాయాలతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు రూపొందించేందుకు కసరత్తు చేపట్టినట్టు ఆ సంస్థకు చెందిన అధికారులు చెప్పారు. -
Sankranti 2024 Special Trains: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. మరో ఆరు ప్రత్యేక రైళ్లును ప్రకటించింది. సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 10 నుంచి 15 తేదీల్లో ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడవనున్నాయి. ఆరు స్పెషల్ ట్రైన్స్ ఇవే.. జనవరి 10న రాత్రి 8:25 కి తిరుపతి - సికింద్రాబాద్ జనవరి 11న రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ జనవరి 12న రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ జనవరి 13న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ జనవరి 14న ఉదయం 10 గంటలకు కాకినాడ టౌన్ - తిరుపతి జనవరి 15న తెల్లవారుజామున 5:30 గంటలకు తిరుపతి - కాచిగూడ SCR to run Sankranti Special Trains#Sankranti #Sankranti2024 pic.twitter.com/uOlQ5VukaT — South Central Railway (@SCRailwayIndia) January 9, 2024 ఇదీ చదవండి: ఆ చాక్లెట్లు తిని మత్తులోకి జారి! -
SCR: సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. కాకినాడ, తిరుపతి..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్‌ను అనౌన్స్ చేయగా తాజాగా మరో ఐదు స్పెషల్ రైళ్లను ప్రకటించింది. తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడ-సికింద్రాబాద్, కాకినాడ-తిరుపతి మధ్య నడవనున్నాయి. వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగ నేపథ్యంలో ఈనెల 10, 11, 12, 13 తేదీల్లో స్పెషల్ ట్రైన్ ప్రయాణించనున్నాయి. ఐదు స్పెషల్ ట్రైన్స్ ఇవే.. జనవరి 10: 07065.. తిరుపతి-సికింద్రాబాద్. జనవరి 11: 07066.. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ జనవరి 12: 07067.. కాకినాడ టౌన్-సికింద్రాబాద్ జనవరి 12: 07250.. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ జనవరి 13: 07249.. కాకినాడ టౌన్-తిరుపతి. SCR to run 05 #Sankranti Special Trains pic.twitter.com/T1NfM0ZpTE — South Central Railway (@SCRailwayIndia) January 5, 2024 -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ద.మ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ రైళ్లను నడుపనున్నారు. ► సికింద్రాబాద్–బ్రహ్మపూర్ (07089) ఈ నెల 7, 14 తేదీలలో సాయంత్రం 7.45 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. ► బ్రహ్మపూర్–వికారాబాద్ (07090) ఈ నెల 8, 15 తేదీలలో మధ్య రాత్రి 12.30 గం.లకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.30 గం.లకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07091) 9, 16 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. ► బ్రహ్మపూర్–సికింద్రాబాద్ (07092) రైలు 10, 17 తేదీలలో మధ్య రాత్రి 12.30 గంటలకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 6.30 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► విశాఖపట్నం–కర్నూలు సిటీ (08541) 10, 17, 24 తేదీలలో సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08542) 11, 18, 25 తేదీలలో మధ్యాహ్నం 3.30 గం.లకు కర్నూలులో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ► శ్రీకాకుళం–వికారాబాద్ (08547) 12, 19, 26 తేదీలలో సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గం.లకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08548) 13, 20, 27 తేదీలలో రాత్రి 8.25 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు మ«ద్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (02764) 10, 17 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.45 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02763) 11, 18 తేదీలలో సాయంత్రం 5.15 గం.లకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07271) 12న రాత్రి 9 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07272) 13న రాత్రి 8.10 గం.కు కాకినాడ టౌన్లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–బ్రహ్మపూర్ (07093) 8, 15 తేదీలలో సాయంత్రం 7.45 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 11.15 గం.లకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07094) 9, 16 తేదీలలో మధ్యాహ్నం 12.30 గం.లకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► నర్సాపూర్–సికింద్రాబాద్ (07251) 10న సాయంత్రం 6 గం.లకు నర్సాపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 4.50 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07252) 11న ఉదయం 8.30 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 11.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–కాకినాడ టౌన్–హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ♦ సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07021) రైలు ఈ నెల 11న గురువారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07022) ఈ నెల 12న శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ♦ హైదరాబాద్–కాకినాడ టౌన్ (07023) రైలు ఈ నెల 12న శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07024) ఈ నెల 13న శనివారం రాత్రి 10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు 32 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే.. మరో 4 ప్రత్యేక రైళ్లను నడపనునట్లు వెల్లడించింది. సికింద్రాబాద్- కాకినాడ, కాకినాడ-సికింద్రాబాద్, హైదరాబాద్- కాకినాడ, కాకినాడ-హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆయా రైళ్ల వివరాలిలా.. ► సికింద్రాబాద్–బ్రాహ్మణ్‌పూర్–వికారాబాద్ (07089/07090) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు బ్రాహ్మణ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.30గంటలకు బ్రాహ్మణ్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ► వికారాబాద్–బ్రాహ్మణ్‌పూర్–సికింద్రాబాద్ (07091/07092) స్పెషల్ ట్రైన్ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజుఉదయం 11.15 గంటలకు బ్రాహ్మణ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► విశాఖపట్టణం–కర్నూల్ (08541/08542) ప్రత్యేక రైలు ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ► శ్రీకాకుళం–వికారాబాద్ (08547/08548) స్పె షల్ ట్రైన్ ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్‌కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–కాకినాడ (07271/07272) ప్ర త్యేక రైలు ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చే రుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 8.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రైళ్ల వివరాలిలా.. ► సికింద్రాబాద్–బ్రాహ్మణ్‌పూర్–వికారాబాద్ (07089/07090) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు బ్రాహ్మణ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.30గంటలకు బ్రాహ్మణ్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ► వికారాబాద్–బ్రాహ్మణ్‌పూర్–సికింద్రాబాద్ (07091/07092) స్పెషల్ ట్రైన్ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజుఉదయం 11.15 గంటలకు బ్రాహ్మణ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► విశాఖపట్టణం–కర్నూల్ (08541/08542) ప్రత్యేక రైలు ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ► శ్రీకాకుళం–వికారాబాద్ (08547/08548) స్పె షల్ ట్రైన్ ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్‌కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–కాకినాడ (07271/07272) ప్ర త్యేక రైలు ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చే రుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 8.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
సంక్రాంతి స్పెషల్.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–తిరుపతి(07489/07490) స్పెషల్ ట్రైన్ ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుస టిరోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 8.25కు బయలుదేరి ఉదయం 8.50కి హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–తిరుపతి (07449/07450) మరో స్పెషల్ ట్రైన్ ఈ నెల 27వ తేదీ సా. 6.10కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంత్రం 5.15కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30కు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–కాకినాడ (07451/07452) స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న రాత్రి 8.30కు బయలుదేరి మరుసటిరోజు ఉ. 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉ.9కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఇదీ చదవండి: 2023 సామాన్యునికి ఏమిచ్చింది? -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సీజన్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం పూర్ణ–తిరుపతి (07609), జనవరి 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం తిరుపతి–పూర్ణ (07610), జనవరి 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం హైదరాబాద్–నర్సాపూర్ (07631), జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నర్సాపూర్–హైదరాబాద్ (07632), ఈనెల 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం తిరుపతి–సికింద్రాబాద్ (07481), జనవరి 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం సికింద్రాబాద్–తిరుపతి (07482), జనవరి 1 నుంచి 31 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ పోర్టు–లింగంపల్లి (07445), జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) రైళ్లను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఏజెన్సీలో హైవే -
ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో పది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైళ్ల సర్వీసులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు టైమ్‌టేబుల్ వారీగా రాకపోకలు కొనసాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడటౌన్-లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. వైద్యులు ఏమన్నారంటే 20 సంక్రాంతి స్పెషల్ రైళ్లు సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడటౌన్, హైదరాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి రైళ్ల వివరాలు ఎస్సీఆర్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 26వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరి మలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలి పారు. వివరాలు.. కాచిగూడ–కొల్లాం (07187/07188) స్పెషల్ ట్రైన్ ఈ నెల 11వ తేదీ సోమవారం రాత్రి 11.45 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 5.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ బుధవారం ఉదయం 10.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45కు కాచిగూడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొల్లాం (07193/ 07194)స్పెషల్ ట్రైన్ ఈనెల 13వ తేదీ బుధవారం ఉదయం 10.40 గంటలకు బయ లుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంట లకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయా ణంలో 15వ తేదీ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 9.40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: పలు ప్రాంతాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–కొల్లాం (07129/07130) స్పెషల్ ట్రైన్ ఈనెల 26, డిసెంబర్ 3 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.55కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 28, డిసెంబర్ 5 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.55కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. నర్సాపూర్–కొట్టాయం (07119/07120) స్పెషల్ ట్రైన్ ఈనెల 26, డిసెంబర్ 3 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 27, డిసెంబర్ 4 తేదీల్లో సాయంత్రం 7 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9కి నర్సాపూర్‌కు చేరుకుంటుంది. కాచిగూడ–కొల్లాం (07123/07124) స్పెషల్ ట్రైన్ ఈనెల 22, 29, డిసెంబర్ 6 తేదీల్లో సాయంత్రం 5.30కి బయల్దేరి మర్నాడు రాత్రి 11.55 గంటలకి కొల్లాంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 24, డిసెంబర్ 1, 8 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30కి కాచిగూడ చేరుకుంటుంది. కాకినాడ–కొట్టాయం (07125/07126) ఈనెల 23, 30 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10కి కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25, డిసెంబర్ 2 తేదీల్లో రాత్రి 12.30కి బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొల్లాం (07127/07128) స్పెషల్ ట్రైన్ ఈనెల 24, డిసెంబర్ 1 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకి బయల్దేరి మర్నాడు సాయంత్రం 7.30కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25, డిసెంబర్ 2 తేదీల్లో రాత్రి 11కి బయల్దేరి రెండవ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. -
ఎక్కడి రైళ్లు అక్కడే
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర)/విశాఖపట్నం: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంకటాపల్లి–ఆలమండ మధ్య ఆదివారం రాత్రి విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక పాసింజర్ రైలును విశాఖ–రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదం కారణంగా వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ దుర్ఘటనతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు మాత్రం యథాతథంగా నడుస్తున్నాయి. ప్రమాద వివరాలను తెలియజేసేందుకు ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్ నంబర్ల 0891–2746330/0891–2744619ను ఏర్పాటు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్, అధికారులు, సిబ్బంది ప్రత్యేక రైలులో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 120 టన్నుల, 140 టన్నుల సామర్థ్యం గల క్రేన్లతో జీఆర్పీ, రైల్వే అధికారులు, సిబ్బందితో మరో రెండు ప్రత్యేక రైళ్లు బయల్దేరాయి. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు ఈ ఘటనతో విజయనగరం వైపు వెళ్లాల్సిన, విజయనగరం వైపు నుంచి రావలసిన పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ రైళ్లలో కొన్నింటిని దారి మళ్లించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్లో చెన్నై సెంట్రల్–హౌరా (12842) కోరమాండల్, యశ్వంత్‌పూర్–పూరీ (22842) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించే వరకు నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో నిలిపివేశారు. రద్దయిన రైళ్లు సోమవారం రాయ్‌పూర్–విశాఖపట్నం–రాయ్‌పూర్ (08527/08528) పాసింజర్ స్పెషల్ రద్దు చేశారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–కోర్బా ఎక్స్‌ప్రెస్ కూడా రద్దయింది. దారి మళ్లించిన రైళ్లు ఈ దిగువ రైళ్లను ఆదివారం రెగ్యులర్ మార్గం విశాఖపట్నం–విజయవాడ మీదుగా కాకుండా టిట్లాఘడ్–రాయ్‌పూర్–నాగ్‌పూర్–బల్హార్షా–విజయవాడ మీదుగా దారి మళ్లించారు. 28వ తేదీన బారునిలో బయల్దేరిన బారుని–కోయంబత్తూర్ (03357) స్పెషల్ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన టాటాలో బయల్దేరిన టాటా–ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 29వ తేదీన భువనేశ్వర్‌లో బయల్దేరిన భువనేశ్వర్–ముంబయ్ (11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన హౌరాలో బయల్దేరిన హౌరా–సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన హౌరాలో బయల్దేరిన హౌరా–బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. గమ్యం కుదించిన రైళ్లు ఇవీ ► 29న సంబల్పూర్లో బయల్దేరిన సంబల్పూర్–నాందేడ్(20809)ఎక్స్‌ప్రెస్ విజయనగరం వరకు నడిచింది. అక్కడ నుండి తిరిగి సంబల్పూర్ చేరుకుంది. ► నెల 29న పూరీలో బయల్దేరిన పూరీ–తిరుపతి (17479) ఎక్స్‌ప్రెస్ బలుగాం వరకు నడిచింది. అక్కడ నుండి తిరిగి పూరీ చేరుకుంది. ► 29న విశాఖపట్నంలో బయల్దేరిన విశాఖపట్నం–విజయనగరం (07468) పెందుర్తి నుండి విశాఖకు చేరుకుంది. ► 28వ తేదీన ముంబైలో బయల్దేరిన ముంబై–భువనేశ్వర్ (11019) కోణార్క్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం వరకు మాత్రమే నడుస్తుంది. ఈ రైలు విశాఖపట్నం నుండి భువనేశ్వర్–ముంబై (11020) రైలుగా ముంబై బయల్దేరుతుంది. ఆర్టీసీ అప్రమత్తం రైళ్ల ప్రమాద ఘటనతో ఆర్టీసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి విజయనగరం నుంచి 10, సింహాచలం నుంచి 5, గాజువాక నుంచి 3, ఎస్.కోట నుంచి 2 బస్సులను పంపించారు. క్షతగాత్రులను ఈ బస్సుల్లో వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరో 5 బస్సులను విజయనగరంలో సిద్ధం చేశారు. పార్వతీపురం, పలాస వైపు వెళ్లే ప్రయాణికులకు, ప్రమాదం వల్ల వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో సరిపడినన్ని బస్సులను అందుబాటులో ఉంచామని ఆర్టీసీ జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్లో కూడా బస్సులను సిద్ధంగా ఉంచామన్నారు. విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో ఇద్దరు అధికారులను నియమించామని, ఘటనా స్థలానికి మరికొందరు అధికారులను పంపించామని తెలిపారు. -
28న అమృత్ కలశ్ యాత్ర ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): నా భూమి– నా దేశం ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఈ నెల 28న అమృత్ కలశ్ యాత్ర ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో వీరులు, వీరనారీమణులకు నివాళులర్పిస్తూ, వారి త్యాగాలను స్మరించుకుంటు దేశ రాజధాని ఢిల్లీలో స్మారక శిలాఫలకాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9వ తేదీన నా భూమి– నా దేశం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు దేశంలోని మారుమూల గ్రామాలు, పట్టణాల నుంచి పవిత్ర మట్టి, బియ్యంను రాష్ట్ర రాజధానులకు ఈ నెల 22 నుంచి 27వ తేదీ లోపుగా తరలిస్తారు. అక్కడ నుంచి ఈ నెల 28 నుంచి 30వ తేదీ లోపు వాటిని దేశ రాజధాని ఢిల్లీకి రవాణా చేయనున్నారు.అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి, తెలంగాణాలోని సికింద్రాబాద్ నుంచి ఈ నెల 28న వారి కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ప్రత్యేక రైళ్లు ఇవీ: విజయవాడ–హజరత్ నిజాముద్దిన్ (07209) ప్రత్యేక రైలు ఈ నెల 28న ఉదయం 10 గంటలకు విజయవాడ స్టేషన్లో బయలుదేరి, ఆదివారం మధ్యాహ్నం 2.25 గంటలకు హజరత్ నిజాముద్దిన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07210) నవంబర్ 1న రాత్రి 11 గంటలకు హజరత్ నిజాముద్దిన్‌లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. సికింద్రాబాద్–హజరత్ నిజాముద్దిన్ (07211) రైలు ఈ నెల 28న ఉదయం 10.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, ఆదివారం మధ్యాహ్నం 2.25 గంటలకు హజరత్ నిజాముద్దిన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07212) నవంబర్ 1న రాత్రి 11 గంటలకు హజరత్ నిజాముద్దిన్‌లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దసరా సీజన్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సత్రగచ్చి–బెంగళూరు (06286) రైలు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సత్రగచ్చిలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు బెంగళూరు చేరుతుంది. చైన్నై సెంట్రల్–భువనేశ్వర్ (06073) రైలు ఈ నెల 23, 30, నవంబర్ 6 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06074) ఈ నెల 24, 31, నవంబర్ 7 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. చెన్నై సెంట్రల్–సత్రగచ్చి (06071) రైలు ఈ నెల 28, నవంబర్ 4 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సత్రగచ్చి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06072) ఈ నెల 23, 30, నవంబర్ 6 తేదీల్లో ఉదయం 5 గంటలకు సత్రగచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. భువనేశ్వర్ న్యూ–బెంగళూరు (06288) రైలు ఈ నెల 22న ఉదయం 8.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. నాందేడ్–పానిపట్ (07635) రైలు ఈ నెల 26న ఉదయం 5.40 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు పానిపట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07636) ఈ నెల 27న మధ్యాహ్నం 3.15 గంటలకు పానిపట్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు నాందేడ్ చేరుతుంది. పునరుద్ధరించిన రైళ్లు ఇవే... నిర్వహణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23–26 వరకు విజయవాడ–గుంటూరు (07783), గుంటూరు–మాచర్ల (07779), మాచర్ల–నడికుడి (07580), నడికుడి–మాచర్ల (07579), మాచర్ల–గుంటూరు (07780), గుంటూరు–విజయవాడ(07788) రైళ్లను పున రుద్ధరించినట్లు చెప్పారు. -
దసరాకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు సికింద్రాబాద్–సంత్రాగచ్చి (07645/07646) స్పెషల్ ట్రైన్ ఈ నెల 20న ఉదయం 8.40కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40కి సంత్రాగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 21వ తేదీ మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–నర్సాపూర్ (07062) ఈ నెల 22వ తేదీ రాత్రి 10.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 కి నర్సాపూర్ చేరుకుంటుంది. నాందేడ్–కాకినాడ (07055/07056) స్పెషల్ ట్రైన్ 21వ తేదీ మధ్యాహ్నం గం.3.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నాందేడ్ చేరుకుంటుంది. విశాఖపట్టణం–కర్నూల్ (08585/08586) స్పెషల్ ట్రైన్ ఈ నెల 24, 31, నవంబర్ 7, 14 తేదీల్లో సాయంత్రం 5.35కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.35కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, నవంబర్ 1, 8, 15 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 కి విశాఖ చేరుకుంటుంది. -
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. నాందేడ్–కాకినాడ టౌన్ (07061) రైలు ఈ నెల 20న సాయంత్రం 4.30 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. హైదరాబాద్–కటక్ (07165) రైలు ఈ నెల 24న రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07166) ఈ నెల 25న రాత్రి 10.30 గంటలకు కటక్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
ప్రత్యేక రైళ్లకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో వేసవి రద్దీ పెరిగింది. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు జనం పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో నడిచే రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జూన్ నెలాఖరు వరకు అందుబాటులో ఉండేవిధంగా వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆ రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరడం గమనార్హం. హైదరాబాద్ నుంచి కటక్, బికనేర్, రెక్సాల్, పట్నా తదితర ప్రాంతాలకు ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో జనం పడిగాపులు కాయాల్సి వస్తుంది. సాధారణంగా ప్రతి రోజు సుమారు 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 100 వరకు ప్యాసింజర్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. ఈ స్టేషన్ నుంచి రోజుకు 1.85 లక్షల మంది ప్రయాణంచేస్తారు. మరో 60 వేల మంది వరకు కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణిస్తారు. వేసవి సందర్భంగా గత నెల రోజులుగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్లనుంచి సుమారు 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. సొంత ఊళ్లకు వెళ్లేవారికంటే ఆధ్యాత్మీక, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని సమాచారం. దీంతో తిరుపతి, విశాఖ, ముంబై, షిరిడీ, ఢిల్లీ, వారణాసి, జైపూర్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు తాకిడి పెరిగింది.గతంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 50 నుంచి 70 ప్రత్యేక రైళ్లను నడిపితే ఇప్పుడు వాటి సంఖ్య సగానికిపైగా తగ్గడం గమనార్హం. అన్ని సదుపాయాలతో భారత్ గౌరవ్ రైళ్లు ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గౌరవ్ పర్యాటక రైళ్లలో వందశాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ వేసవి సీజన్లో సికింద్రాబాద్ నుంచి ఇప్పటి వరకు 8 రైళ్లు బయలుదేరాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని ఆధ్యాత్మీక క్షేత్రాలను సందర్శించేందుకు ఈ రైళ్లలో వెళుతున్నారు. ‘పూరీ– కాశి– అయోధ్య‘పేరుతో ఐఆర్సీటీసీ ఇటీవల భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ రైలులో ప్రయాణించే వారికి ఐఆర్‌సీటీసీయే అన్ని రకాల సేవలను అందజేస్తోంది. ఈ పర్యటనలో రైలు ప్రయాణంతో పాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం తదితర అన్ని ఏర్పాట్లు ఉంటాయి. రైలులో సీసీ కెమెరాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయా విష్ణు పాద ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయం, అయోధ్య రామజన్మ భూమి, ప్రయాగ్ రాజ్ తదితర ప్రాంతాలను సందర్శించ వచ్చు.8 రాత్రులు, 9 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ ట్రైన్లో ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇప్పటి వరకు నడిచిన 8 ట్రిప్పుల్లో రైలులోని మొత్తం 700 సీట్లు రిజర్వ్ కావడం విశేషం. -
వేసవి ప్రత్యేక రైళ్ల పొడిగింపు.. ఏయే రూట్లలో అంటే?
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటలో తెలిపారు. హైదరాబాద్–తిరుపతి (07643) జూన్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్ (07644) జూన్ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం, తిరుపతి–సికింద్రాబాద్ (07481) జూన్ 4 నుంచి 25 వరకు ఆదివారం, సికింద్రాబాద్–తిరుపతి (07482) జూన్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, హైదరాబాద్–నర్సాపూర్ (07631) జూన్ 3 నుంచి 24 వరకు ప్రతి శనివారం నడుస్తాయని పేర్కొన్నారు. నర్సాపూర్–హైదరాబాద్ (07632) జూన్ 4 నుంచి 30 వరకు ప్రతి ఆదివారం, విజయవాడ–నాగర్సోల్ (07698) జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, నాగర్సోల్–విజయవాడ (07699) జూన్ 3 నుంచి జూలై 1 వరకు ప్రతి శనివారం, తిరుపతి–అకోలా (07605) జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, అకోలా–తిరుపతి (07606) జూన్ 4 నుంచి జూలై 2 వరకు ప్రతి ఆదివారం, పూర్ణ–తిరుపతి (07607) జూన్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–పూర్ణ (07608) జూన్ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం నడుస్తాయని తెలిపారు. -
గంగానదీ పుష్కరాలు.. కాశీకి పోలేము రామా హరీ..!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి వారణాసి మీదుగా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వెయిటింగ్ లిస్టు 400ను దాటింది. మే మొదటివారం వరకు ఇదే పరిస్థితి. గత రెండు నెలల నుంచి వచ్చేనెల వరకు వెయింటింగ్ చూపుతున్నా ఈ మార్గంలో మరో అదనపు రైలును అధికారులు నడపటం లేదు. వారణాసి పుణ్యక్షేత్రానికి నిత్యం తెలంగాణ నుంచి దాదాపు రెండు వేలమంది భక్తులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావించే గంగానదీ పుష్కరాలు ఈ నెల 22 నుంచి మే మూడో తేదీ వరకు కొనసాగనున్నాయి. పుష్కరాలు జరిగే తేదీలతోపాటు వాటికి అటూ ఇటూగా దాదాపు 2లక్షల మందికిపైగా భక్తులు కాశీ యాత్రకు వెళ్తారన్నది ఓ అంచనా. సాధారణ రోజుల్లోనే ఈ ఒక్క రైలు సరిపోక, రోడ్డు మార్గాన అంత దూరం వెళ్లలేక భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అలాంటిది పుష్కరాల వేళ, రద్దీ అంతకు పదిరెట్లు పెరుగుతున్నా అదనపు రైలు ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించలేకపోవటం గమనార్హం. భారీగా పెరిగిన విమాన చార్జీలు సాధారణ రోజుల్లో కాశీకి విమాన టికెట్ ధర రూ.5 వేల నుంచి రూ.8 వేలుగా ఉండేది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ ధర పెంచుకునే డైనమిక్ ఫేర్ విధానాన్ని ఇప్పుడు విమానయాన సంస్థలు బాగా వినియోగించుకుంటున్నాయి. గంగా పుష్కరాలకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుండటంతో ఒక్కో టికెట్ ధరను రెట్టింపు చేసి విక్రయిస్తున్నాయి. కీలక రోజుల్లో అది మరింత ఎక్కువగా ఉంటోంది. అంత ధరను భరించే పరిస్థితి లేనివారు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ వైపే చేస్తున్నారు. ఆ క్లోన్ రైలును పునరుద్ధరించాలి కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగువారే ఎక్కువ. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే దిక్కు. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో పనిచేస్తున్న బీహార్ వలస కూలీలు కూడా ఈ రైలు మీదే ఆధారపడుతుంటారు. దీంతో గతంలో ఈ రైలుకు అనుబంధంగా ఓ క్లోన్ రైలు నడిపేవారు. అంటే అదే మార్గంలో అరగంట తేడాతో నడిచే మరో రైలు అన్నమాట. ముందు రైలుకుఉన్న ఫ్రీ సిగ్నల్ క్లియ రెన్స్ సమయంలోనే ఈ క్లోన్ రైలు నడుస్తుంది. కోవి డ్ ఆంక్షల సమయంలో రద్దయిన ఈ రైలును తిరిగి పునరుద్ధరించలేదు. అది రద్దీ మార్గం కావటం, దా నికి తగ్గ అదనపు లైన్లు లేకపోవటం, ఉన్న అవకాశాలను ఇతర జోన్లు వినియోగించుకుంటుండటమే దీనికి కారణమని స్థానిక రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రద్దయిన మన క్లోన్ రైలును వేరే రాష్ట్రం ఒత్తిడి తెచ్చి వినియోగించుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులతోపాటు రాష్ట్రప్రభుత్వం కూడా రైల్వే బోర్డుపై ఒత్తిడితెచ్చి ఆ క్లోన్ రైలును పునరుద్ధరిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. -
విజయవాడ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే..
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. - సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు–నర్సాపూర్ (06549) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 5న ఉదయం 11.20 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు స్టేషన్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06550) ఈ నెల 6న మధ్యాహ్నం 3.40 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు చేరుకుంటుంది. - అలాగే, సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు–నర్సాపూర్ (06521)రైలు ఈ నెల 3న ఉదయం 11.20 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు స్టేషన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06522) ఈ నెల 4న మధ్యాహ్నం 3.40 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు చేరుకుంటుంది. - సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు–కాచిగూడ(06523) ఈ నెల 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు స్టేషన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06524) ఈ నెల 4, 6 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరుకు చేరుకుంటుంది. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్ల కేటాయింపు
లక్ష్మీపురం(గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ఆంజనేయులు మంగళవారం వెల్లడించారు. రైలు నంబర్ 07153 నరసాపూర్–యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు ఈ నెల 18వ తేదీ ఉంటుందన్నారు. ఈ రైలు మధ్యాహ్నం 3.10 గంటలకు నరసాపూర్ స్టేషన్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 7.50 గంటలకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. రైలు నంబర్ 07514 ప్రత్యేక రైలును (యశ్వంత్‌పూర్–నరసాపూర్) ఈ నెల 19న కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు యశ్వంత్‌పూర్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి శుక్రవారం తెల్లవారుజాము 3.35 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 8.30 గంటలకు నరసాపూర్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 07156 యశ్వంత్‌పూర్–నరసాపూర్ రైలు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2.20 గంటలకు నరసాపూర్ స్టేషన్ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 6.25 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని, అక్కడ నుంచి శనివారం ఉదయం 10.30 గంటలకు యశ్వంత్‌పూర్ స్టేషన్‌కు చేరుకుంటుందని వివరించారు. 07517 యశ్వంత్‌పూర్–నరసాపూర్ రైలు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు యశ్వంతపూర్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి అదే రోజు ఉదయం 10.30 గంటలకు నరసాపూర్ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. 07046 సికింద్రాబాద్–దిబ్రూగ్రహ్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ఫిబ్రవరి 2, 9, 16, 23వ తేదీల్లో ప్రత్యేక రైలును కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రైలు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3.50 గంటలకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి శనివారం రాత్రి 8.50 గంటలకు దిబ్రూగ్రహ్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 07047 ప్రత్యేక రైలును ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు ఆదివారం రాత్రి 7.25 గంటలకు దిబ్రూగ్రహ్ స్టేషన్ నుంచి బయలుదేరి గుంటూరు రైల్వే స్టేషన్‌కు మంగళవారం రాత్రి 10.10 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. (క్లిక్ చేయండి: సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. ఎప్పటినుంచంటే..) -
శక్తిపీఠాల సందర్శనకు ప్రత్యేక రైలు.. వివరాలు ఇవే..
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి కోసం భారతీయ రైల్వే–ఉలా రైల్ టూరిజం సంయుక్తంగా ‘శక్తి పీఠాల యాత్ర’ చేపట్టినట్లు ట్రావెల్ టైమ్స్ ఎండీ విఘ్నేష్ గణేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న తమిళనాడు నుంచి బయలుదేరే ఈ రైలు గూడూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు మీదుగా సికింద్రాబాద్, ప్రయాగ, వారణాశి, గయ, కామాఖ్య, కోల్‌కతా పూరి, కోణార్క్ తదితర పుణ్యక్షేత్రాలలో ఉన్న కామాఖ్యదేవి శక్తిపీఠం, వారణాసి విశాలాక్షి శక్తిపీఠం, కోల్కత్తా కాళీ శక్తిపీఠం, అలహాబాద్ అలోపిదేవి శక్తిపీఠం, గయ మంగళగౌరి శక్తిపీఠం, పూరి విమలాదేవి శక్తిపీఠం, కోణార్క్ సూర్యనారాయణ ఆలయంతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తుందని పేర్కొన్నారు. 13 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో విజయవాడలో బుకింగ్ చేసుకున్న వారిని బస్సులో గుంటూరు తీసుకెళ్లి రైలు ఎక్కిస్తామని తెలిపారు. ప్రయాణంలో ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా, వసతి ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు. టికెట్ ధర అన్ని పన్నులతో కలసి స్లీపర్ క్లాస్ ఒక్కొక్కరికి రూ.19,950, ఏసీ 3 టైర్ ధర రూ.26,300 ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు విజయవాడలోని తమ కార్యాలయంలో లేదా 74167 18800, 87545 80851 ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు. -
ఉత్తరాంధ్రకు ద.మ.రైల్వే ఉత్తచేయి.. పత్తాలేని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అసలే పండుగ సీజన్.. జనం సొంతూళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ.. ఉత్తరాంధ్రవాసులకు దక్షిణ మధ్య రైల్వే ఉత్తచేయి చూపింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కనీసం ఒక్క ప్రత్యేక రైలూలేదు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లల్లో విశాఖ మీదుగా ఒక్కటి కూడా వెళ్లడంలేదు. ఆరేడు రెగ్యులర్ రైళ్లు తప్ప ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. విశాఖ వైపుగా నడిచే రెగ్యులర్ రైళ్లన్నీ వచ్చే ఫిబ్రవరి వరకు కూడా వెయిటింగ్ జాబితాతో దర్శనమిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 30 రైళ్లను అదనంగా నడిపేందుకు చర్యలు చేపట్టింది. వాటిలో కాకినాడ, తిరుపతి, బెంగళూరు, విజయవాడ వంటి ప్రాంతాలకే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. కానీ, విశాఖ, చుట్టుపక్కలప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు లేవని కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన వినయ్ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. సమన్వయలేమి... దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్ రైల్వేల మధ్య సమన్వయం కొరవడటం వల్లే ప్రత్యేక రైళ్ల ఏర్పాటులో నిర్లక్ష్యం నెలకొందని ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి దువ్వాడ వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి కాగా, దువ్వాడ నుంచి విశాఖ తదితర ప్రాంతాలు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తాయి. దీంతో హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లపై చూపిన శ్రద్ధ విశాఖ వైపు కనిపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈస్ట్‌కోస్ట్ రైల్వే కూడా సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ‘హైదరాబాద్ నుంచి సామర్లకోట వరకు, అక్కడి నుంచి కాకినాడకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, విశాఖకు వెళ్లాలంటే మరో 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సామర్లకోట నుంచి విశాఖకు వెళ్లడం ఎలా సాధ్యం’’అని ఫణీంద్ర అనే ప్రయాణికుడు చెప్పారు. రెగ్యులర్ రైళ్లు ఇప్పటికే భర్తీ కావడం, ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ, గంటల తరబడి కూర్చొని ప్రయాణంచేయడం మహిళలు, పిల్లలు, వయోధికులకు చాలా కష్టం. మరోవైపు బస్సుల కంటే రైళ్లలో చార్జీలు కూడా తక్కువ. పదిలక్షల మంది వరకు ప్రయాణం ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే సంక్రాంతి వేడుకలకు హైదరాబాద్ నుంచి 25 లక్షల మందికిపైగా నగరవాసులు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంది. అందులో కనీసం 10 లక్షల మంది విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవాళ్లే ఉంటారని అంచనా. మరికొద్దిరోజుల్లో విద్యార్థులకు సెలవులు ప్రకటించనుండటంతో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం -
గుడ్‌న్యూస్: ఈ రూట్లలో సంక్రాంతి పండుగకి ప్రత్యేక రైళ్లు
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ–శ్రీకాకుళం రోడ్–వికారాబాద్ మధ్య వయా దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. ►కాచిగూడ–శ్రీకాకుళం రోడ్(07611) రైలు: కాచిగూడలో ఈ నెల 10న సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ►శ్రీకాకుళం రోడ్–వికారాబాద్(07612) రైలు: శ్రీకాకుళం రోడ్లో ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయత్రం 5.10కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.47కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ►వికారాబాద్–శ్రీకాకుళంరోడ్(07613) స్పెషల్: వికారాబాద్‌లో ఈ నెల 12న సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ►శ్రీకాకుళం రోడ్–కాచిగూడ(07614) స్పెషల్: శ్రీకాకుళం రోడ్లో ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 5.20కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.22కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రైళ్ల గమ్యం కుదింపు, దారి మళ్లింపు.. ►వాల్తేర్ డివిజన్ కే–ఆర్ లైన్ కోరాపుట్–మనబర్, కోరాపుట్–దుమురిపుట్ సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాక్ ఆధునికీకరణ, రెండో ట్రాక్ పనుల నిమిత్తం పలు రైళ్ల గమ్యం కుదిస్తున్నట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ►విశాఖపట్నం–కోరాపుట్(08546) పాసింజర్ స్పెషల్ ఈ నెల 5 నుంచి 10 వరకు లక్ష్మీపూర్ రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది. కోరాపుట్–విశాఖపట్నం(08545) పాసింజర్ స్పెషల్ ఈ నెల 6 నుంచి 11 వరకు లక్ష్మీపూర్ రోడ్ నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది. ►విశాఖపట్నం–కోరాపుట్(08512) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 6, 9 తేదీల్లో దమన్‌జోడి వరకు మాత్రమే నడుస్తుంది. కోరాపుట్–విశాఖపట్నం(08511) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 7, 10 తేదీల్లో దమన్‌జోడి నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది. ►ఈ నెల 6న విశాఖలో బయలుదేరే విశాఖపట్నం–కిరండూల్(08551) పాసింజర్ స్పెషల్ అరకు వరకు మాత్రమే నడుస్తుంది. ►ఈ నెల 6న కిరండూల్‌లో బయలుదేరే కిరండూల్–విశాఖపట్నం(08552) పాసింజర్ స్పెషల్ జయపూర్ వరకు మాత్రమే నడుస్తుంది. -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో 30కి పైగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ స్టేషన్ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో జనరల్ బోగీలు, రిజర్వ్డ్ బోగీలు ఉంటాయి. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆయా ప్రాంతాలకు చేరుకొనే విధంగా ఈ రైళ్లను నడపనున్నారు. జనరల్ ప్రయాణికులు యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు 94 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అన్ని ప్రత్యేక రైళ్లకు ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07048) జనవరి 6న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్(07049) జనవరి 7న, హైదరాబాద్–నర్సాపూర్ (070 19) రైలు 7న, నర్సాపూర్–వికారాబాద్ (070 20) రైలు 8న, వికారాబాద్–నర్సాపూర్ (070 21) 9న, నర్సాపూర్–హైదరాబాద్ (07022) 10న, సికింద్రాబాద్–కాకినాడటౌన్ (07039) 9న, కాకినాడటౌన్–వికారాబాద్ (07040) 10న, వికారాబాద్–నర్సాపూర్ (07041) 11న, నర్సాపూర్–సికింద్రాబాద్ (07042) 12వ తేదీన నడపనున్నారు. హైదరా బాద్– మచిలీపట్నం (07011) 11, 13 తేదీల్లో, మచిలీ పట్నం–హైదరాబాద్ (07012) 12, 14 తేదీల్లో, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07035) 11న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07036) జనవరి 12న, వికారాబాద్– కాకినాడటౌన్ (07037) 13న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07038) 14న, సికింద్రాబాద్–నర్సాపూర్ (07023) 13న, నర్సాపూర్–సికింద్రాబాద్ (07024) 14న, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07027) 16న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07028) 17న, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07031) 15న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07032) 16న, వికారాబాద్–కాకినాడ టౌన్ (07033) 17న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07034) 18న, హైదరాబాద్–నర్సాç³Nర్ (07015) 15, 17 తేదీల్లో, నర్సాపూర్–హైదరాబాద్ (07016) 16, 18 తేదీల్లో నడపనున్నారు. -
Special Trains: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ కోసం ప్రయాణాలు చేసే వాళ్ల కోసం గుడ్ న్యూస్ చెప్పింద దక్షిణ మధ్య రైల్వే. ఈసారి పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అధిక డిమాండ్ ఉండడంతో.. అందుకు తగ్గట్లుగా రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి 20వ తారీఖు నడుమ.. వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా.. దేశంలోని ప్రసిద్ధ గమ్యస్థానాల నడుమ ఇవి నడుస్తున్నాయని తెలిపింది. -
సంక్రాంతి రైళ్ల జాడేది?
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊరెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్ననగర ప్రజలను రైళ్లలో బెర్తుల కొరత నిరాశకు గురి చేస్తోంది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు, ఇతర ఇరుగు పొరుగు ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో ఇక ఏ మాత్రం బుకింగ్‌కు అవకాశం లేకుండా ‘నో రూమ్’దర్శనమిస్తోంది. సాధారణంగా సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని నవంబర్ నెలలోనే ప్రత్యేక రైళ్లనుప్రకటించవలసిన దక్షిణమధ్య రైల్వే అధికారులు.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ‘ఈ నెలలో కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించే అవకాశంలేదు. ప్రయాణికు ల డిమాండ్, రద్దీమేరకు ఏ రూట్లో ఎన్ని రైళ్లు అవసరమనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ కూడా లేదు’..అని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు స్పష్టంచేశారు. దీంతో రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లకు అవకాశంలేక ప్రత్యేక రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు చివరి నిమిషం వరకు పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. భారీగా పెరగనున్న రద్దీ.. సాధారణంగా ఏటా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సుమారు 25 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. ఈసారి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. డిసెంబర్ మొదటి వారం వరకే అన్ని రైళ్లలో స్లీపర్, ఏసీ బెర్తులు రిజర్వ్ అయిపోవడం, ఫిబ్రవరి మొదటి వారం వరకు బెర్తులు అందుబాటులో లేకపోవడం వంటి పరిణామాల దృష్ట్యా ఈ ఏడాది డిమాండ్ పెరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఏటా నవంబర్‌లో ఒకసారి, డిసెంబర్ చివర్లో మరోసారి 100కు పైగా రైళ్లను అదనంగా నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తారు. ఈసారి అలాంటివేవీ లేకపోవడంతో చివరి నిమిషంలో అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటించినా పెద్దగా ఉపయోగం ఉండబోదని కూకట్పల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన ప్రయాణికుడు శివరాజ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బయల్దేరే గోదావరి, విశాఖ, కోణార్క్, గౌతమి, నర్సాపూర్, పద్మావతి, నారాయణాద్రి తదితర అన్ని రైళ్లలోనూ 150 నుంచి 300 వరకు వెయిటింగ్ లిస్టు కనిపించడం గమనార్హం. హైదరాబాద్ నుంచి విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి, బెంగళూరు తదితర నగరాలకు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు.. సంక్రాంతి సందర్భంగా 4,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలకు ప్రయాణికులరద్దీ మేరకు ఈ బస్సులను నడుపనుంది. -
అయ్యప్పా.. వచ్చేదెట్లా?
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులకు రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. మరో రెండు నెలల వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్ జాబితానే దర్శనమిస్తోంది. గత రెండేళ్లుగా దర్శనాలు నిలిచిపోయిన దృష్ట్యా ఈసారి నగరం నుంచి లక్షలాది మంది తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. మాలధారులతో పాటు సాధారణ భక్తులు సైతం రైళ్ల కోసం బారులు తీరుతున్నారు. కానీ.. భక్తుల డిమాండ్ మేరకు రైళ్లు లేవు. దక్షిణమధ్య రైల్వే అధికారులు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ అన్నింటిలోనూ ఇప్పటికే బెర్తులు భర్తీ కావడంతో పాటు వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరింది. కొన్నింటిలో బుకింగ్ కూడా అవకాశం లేకుండా ‘రిగ్రేట్’ కనిపిస్తోంది. ఈ ఏడాది కనీసం10 లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లే అవకాశం ఉంది. దక్షిణమధ్యరైల్వే ప్రకటించిన అరకొర రైళ్లు అయ్యప్ప భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆలస్యంతో ఇక్కట్లు.. గతంలో ఇలాగే మకరజ్యోతి దర్శనం ముంచుకొస్తున్న తరుణంలో హడావుడిగా కొద్దిపాటి రైళ్లను ప్రకటించారు. అవి సైతం విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరాయి. నగరం నుంచి వెళ్లిన రైళ్లు పరిమితమే. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పైగా చాలా వరకు ఉదయం వెళ్లాల్సినవి సాయంత్రం, సాయంత్రం వెళ్లాల్సిన రైళ్లు అర్ధరాత్రి బయలుదేరాయి. గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. సకాలంలో దర్శనానికి చేరుకోలేక భక్తులు నిరాశ చెందారు. పైగా ప్రత్యేక రైళ్లలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో భక్తులు స్నానాలు, పూజలు చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు. విమాన చార్జీల మోత... రైళ్లలో భారీ డిమాండ్ ఉండడంతో చాలా మంది భక్తులు విమానాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వెళ్లే విమానాల్లో సైతం చార్జీలు మోత మోగుతున్నాయి. రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నట్లు పలువురు భక్తులు పేర్కొన్నారు. ఈ చార్జీలు కూడా తరచూ మారిపోతున్నాయి. సంక్రాంతికి కష్టాలే... నగరం నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, బెంగళూర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ రైళ్లన్నీ నిండిపోయాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 25 లక్షల మందిప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. వీరిలో కనీసం 15 లక్షల మంది రైళ్లపైనే ఆధారపడి ఉంటారు. రైళ్లలో అవకాశం లభించకపోవడంతో చాలా మంది సొంత వాహనాలు, ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది. ఎందుకిలా? అయ్యప్ప దర్శనం కోసం నగరానికి చెందిన భక్తులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లే ఒకే ఒక్క రైలు శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఫిబ్రవరికి కూడా అప్పుడే బుక్ అయ్యాయి. భక్తుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు వేయాల్సిన అధికారులు ఆ దిశగా పెద్దగా దృష్టి సారించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్ నుంచి వెళ్లేవి తక్కువగానే ఉన్నాయి. చివరి క్షణాల్లో హడావుడిగా ప్రత్యేక రైళ్లను వేసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం కంటే ప్రస్తుత రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్నింటిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. డిసెంబర్ నుంచి జనవరి వరకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరికి వెళ్లనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే భక్తులు తమకు అనుకూలమైన రోజుల్లో శబరికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. -
అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా కొల్లాం, కొట్టాయానికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ రైళ్లు తిరిగి కొల్లాం, కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్–కొల్లాం (07117) ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్(07118) ఈ నెల 22, డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడుస్తాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్–కొల్లాం (07121) ఈ నెల 27, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్ (07122) ఈ నెల 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో, సికింద్రాబాద్–కొల్లాం (07123) ఈ నెల 21, 28 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్ (07124) ఈ నెల 23, 30 తేదీల్లో, సికింద్రాబాద్–కొట్టాయం (07125) ఈ నెల 20, 27 తేదీల్లో, కొట్టాయం–సికింద్రాబాద్ (07126) ఈ నెల 21, 28 తేదీల్లో నడుస్తాయని అధికారులు వివరించారు. -
తిరుపతి–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తిరుపతి–సికింద్రాబాద్ (07481/07482) స్పెషల్ ట్రైన్ నవంబర్ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 7.50 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5.50కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకి తిరుపతికి చేరుకుంటుంది. పలు రూట్లలో 174 అదనపు రైళ్లు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో నవంబర్ నుంచి వచ్చే జనవరి వరకు 174 అదనపు రైళ్లను నడుపనున్నట్లు సీహెచ్ రాకేశ్ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్– నర్సాపూర్, కాజీపేట్–దాదర్, సికింద్రాబాద్–అగర్తల, హైదరా బాద్– జైపూర్, హైదరాబాద్– గోరఖ్‌పూర్, విశాఖపట్టణం–సికింద్రాబాద్, విశాఖపట్టణం–మహ బూబ్‌నగర్, విశాఖపట్టణం–తిరుపతి, భువనేశ్వర్–తిరుపతి, విశాఖపట్టణం–బెంగళూరు, కాచిగూడ–మధురై తదితర మార్గాల్లో ప్రయాణికుల రద్దీకనుగుణంగా అదనపు రైళ్లను నడపనున్నారు. -
విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నవంబర్ రెండు నుంచి జనవరి ఒకటో తేదీ వరకు విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. తిరుపతి–ఔరంగాబాద్ (07637) నవంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి ఆదివారం, ఔరంగాబాద్–తిరుపతి (07638) నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–అకోలా (07605) నవంబర్ 4 నుంచి డిసెంబర్ 30 వరకు ప్రతి శుక్రవారం, అకోలా–తిరుపతి (07606) నవంబర్ 6 నుంచి 2023 జనవరి ఒకటి వరకు ప్రతి ఆదివారం, హైదరాబాద్–తిరుపతి (07643) నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్ (07644) నవంబర్ 8 నుంచి 29 వరకు ప్రతి మంగళవారం, విజయవాడ–నాగర్సోల్ (07698) నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి శుక్రవారం, నాగర్సోల్–విజయవాడ (07699) నవంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు తెలిపారు. కాకినాడ టౌన్–లింగంపల్లి (07141) నవంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, లింగంపల్లి–కాకినాడ టౌన్ (07142) నవంబర్ 3 నుంచి డిసెంబర్ 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వివరించారు. కాజీపేట–తిరుపతి (07091), తిరుపతి–కాజీపేట(07092) రైళ్లు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 27 వరకు ప్రతి మంగళవారం, మచిలీపట్నం–సికింద్రాబాద్ (07185), సికింద్రాబాద్–మచిలీపట్నం (07186) రైళ్లు నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు. -
తప్పని పడిగాపులు
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా సొంత ఊరుకు వెళ్లిన సురేష్ కుటుంబం ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమైంది. అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా ఉండడంతో ఒడిశాలోని బర్హంపూర్ నుంచి సికింద్రాబాద్ మీదుగా నాందేడ్‌కు వెళ్లే ప్రత్యేక రైలు (07432)లో బయలుదేరారు. ఆదివారం సాయంత్రం 6.27కు పలాస నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు మూడు గంటలు ఆలస్యంగా రాత్రి 9.30 గంటలకు బయలుదేరింది. సోమవారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవాల్సిన ఉండగా ఏకంగా మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకోవడం గమనార్హం. “రైలు బయలుదేరడానికి ముందు మూడు గంటలు ఎదురు చూస్తే గమ్యం చేరుకోవడానికి మరో నాలుగున్నర గంటల పాటు రైల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది’ అని సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు రైలులోనే గడపాల్సి రావడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆయన చెప్పారు. ఇలా ఒక్క సురేష్ కుటుంబం మాత్రమే కాదు. ప్రత్యేక రైళ్లలో రాకపోకలు సాగించే వందలాది మంది ప్రయాణికులు సకాలంలో గమ్యం చేరుకోలేక గంటల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది. అదనంగా చెల్లించినా.. రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే ప్రత్యేక రైళ్లలో చార్జీలు సైతం ఎక్కువే, రెగ్యులర్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గా ల్లో వెయిటింగ్ లిస్టుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తారు. వీటిలో సుమారు 30 శాతం వరకు చార్జీలు అదనంగా ఉంటాయి. దసరా, దీపావళి వంటి పండగలు, వరుస సెలవులు, ప్రత్యేక పర్వదినాల్లో ప్రత్యేక రైళ్లు సైతం కిక్కిరిసిపోతాయి. ఈసారి దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో సుమారు 50కి పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. మరికొన్నింటిలో అదనపు బోగీలను, బెర్తులను ఏర్పాటు చేశారు. రైళ్ల నిర్వహణ మాత్రం దారుణంగా ఉంది. ఈ రైళ్లన్నీ 2 నుంచి 4 గంటల వరకు, కొన్ని రైళ్లు ఏకంగా 6 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. -
Secunderabad: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: దసరా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్. రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్–సంత్రాగచ్చి (07645/ 07646) స్పెషల్ ట్రైన్ ఈ నెల 30న ఉదయం 8.40 గంట లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.25కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–షాలిమార్ (07741/07742) స్పెషల్ ట్రైన్‌అక్టోబర్ 2వ తేదీ ఉదయం 4.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2.55కు షాలిమార్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రేపటి నుంచి రైళ్ల వేళల్లో మార్పులు: అక్టోబర్ 1 నుంచి కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు ఆయా రైళ్ల వేళల సమాచారాన్ని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలనీ, 139 నెంబర్ నుంచి కూడా రైళ్ల వేళల్లో మార్పులను తెలుసుకోవచ్చునని సీపీఆర్వో తెలిపారు. -
విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి (02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02763) అదే 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జనగాం, ఖాజీపేట, వరంగల్లు, మహబూబ్‌నగర్, డోర్నకల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. సికింద్రాబాద్–యశ్వంతపూర్ (07233) రైలు ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21 తేదీల్లో సాయంత్రం 3.50 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. నరసాపూర్ –సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు కేటాయింపు నరసాపూర్–సికింద్రాబాద్–నరసాపూర్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు సీనియర్ డీసీఎం ఆంజనేయులు పేర్కొన్నారు. నరసాపూర్ – సికింద్రాబాద్ (07466) రైలు ఈ నెల 30న సాయంత్రం 6 గంటలకు నరసాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ –నరసాపూర్ (07467 ) రైలు అక్టోబరు 1న సికింద్రాబాద్‌లో రాత్రి 9.05 గంటలకు బయల్దేరి నరసాపూర్ స్టేషన్‌కు మరుసటిరోజు ఉదయం 8.35 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. -
దసరా సీజన్.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్–తిరుపతి (07469/07470) స్పెషల్ ట్రైన్ ఈనెల 25న సాయంత్రం 5.50 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 26న రాత్రి 8.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–యశ్వంత్‌పూర్ (07233/07234) స్పెషల్ ట్రైన్ ఈనెల 25, 27 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయల్దేరి మలిరోజు ఉదయం 10.50కి యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 26, 28 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకి యశ్వంత్‌పూర్ నుంచి బయల్దేరి తర్వాత రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
ఓనమ్ పండుగకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఓనమ్ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–త్రివేండ్రమ్ (07119/07120) స్పెషల్ ట్రైన్ ఈనెల 5న సాయంత్రం 6.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు త్రివేండ్రమ్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్ 10న రాత్రి 10 గంటలకు బయల్దేరి రెండో రోజు తెల్లవారు జామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ–యశ్వంత్‌పూర్ (07159/07160) స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రైలు ఈనెల 5న రాత్రి 8.25 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 6వ తేదీ సాయంత్రం 5.20గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. -
పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–తిరుపతి (07691/07692) స్పెషల్ ట్రైన్ ఈనెల 26 రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి బయ ల్దేరి మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. సికింద్రాబాద్–యశ్వంత్‌పూర్ (07193/ 07194) స్పెషల్ ట్రైన్ ఈనెల 29న మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 30న సాయంత్రం 5.20 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–నాగర్సోల్ (07089/07090) ప్రత్యేక రైలు ఈనెల 24న రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25 రాత్రి 10 గంటలకు నాగర్సోల్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
Tirupati: ప్రయాణికులకు పది ప్రత్యేక రైళ్లు
సాక్షి, తిరుపతి అర్బన్: తిరుపతి మీదుగా నడుస్తున్న మరో పది ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొస్తోంది. కరోనా కారణంగా 2020–21లో పలు రైళ్లు రద్దు చేసిన విషయం తెల్సిందే. మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని రైళ్లు పునరుద్ధరించినప్పటికీ ప్రత్యేక రైళ్లు వందశాతం అందుబాటులోకి రాలేదు. తాజాగా అన్ని ప్రత్యేక రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి మీదుగా నడుస్తున్న మరో పది ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రత్యేక రైళ్లు ఇవే ►హైదరాబాద్–తిరుపతి (ప్రతి శనివారం) నం.07510 రైలు ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు. ►తిరుపతి–హైదరాబాద్ (ప్రతి ఆదివారం)నం.07510 రైలు ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 24 వరకు ►హైదరాబాద్–తిరుపతి (ప్రతి సోమవారం) నం.07643 రైలు సెప్టెంబర్ 5 నుంచి 26వ తేదీ వరకు ►తిరుపతి–హైదరాబాద్ (ప్రతి మంగళవారం)నం.07644 రైలు సెప్టెంబర్ 6 నుంచి 27 వరకు ►తిరుపతి–ఔరంగాబాద్ (ప్రతి ఆదివారం)నం.07637 రైలు ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 25 వరకు ►ఔరంగాబాద్–తిరుపతి (ప్రతి సోమవారం)నం.07638 రైలు ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 26 వరకు ►తిరుపతి–హుజూర్ సాహిబ్ నాందేడ్ (ప్రతి మంగళవారం)నం.07642 రైలు ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 27 వరకు ►తిరుపతి–హుజూర్ సాహిబ్ నాందేడ్ (ప్రతి శనివారం)నం.07640 రైలు సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ►హుజూర్ సాహిబ్ నాందేడ్–తిరుపతి(ప్రతి శుక్రవారం)నం.07639 రైలు సెప్టెంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు ►తిరుపతి–కాచిగూడ (ప్రతి బుధవారం)నం.07614 రైలు సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 2 వరకు నడపనున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
లింగంపల్లి–కాకినాడ, నాంపల్లి–జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: రద్దీ నేపథ్యంలో లింగంపల్లి–కాకినాడ, హైదరాబాద్–జైపూర్ మధ్య అదనపు రైళ్లు నడుపుతున్నారు. లింగంపల్లి–కాకినాడ మధ్య (07296) జూలై 2 నుంచి అక్టోబరు 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో.. కాకినాడ–లింగంపల్లి మధ్య జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో (07295).. హైదరాబాద్–జైపూర్ మధ్య జూలై 1 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి శుక్రవారం (07115).. జైపూర్–హైదరాబాద్ మధ్య జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి ఆదివారం (07116) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాకినాడ రైళ్లు లింగంపల్లిలో సాయంత్రం 6.25 గంటలకు బయల్దేరనుండగా, జైపూర్ రైళ్లు నాంపల్లిలో రాత్రి 8.20కి బయల్దేరుతాయి. డబ్లింగ్ పనులతో పలు రైళ్ల రద్దు.. సెంట్రల్ రైల్వే పరిధిలోని మన్మాడ్ సెక్షన్లో డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. జూన్ 23 నుంచి 28 వరకు ఈ రైళ్లకు అంతరాయం ఏర్పడనుంది. విశాఖ–షిర్డీ సాయినగర్ ఎక్స్‌ప్రెస్ 23 తిరుగుప్రయాణం కాగా, 24న రద్దు కానున్నాయి. సీఎస్టీ ముంబై–జాల్నా ఎక్స్‌ప్రెస్ 25 నుంచి 28 వరకు, తిరుగుప్రయాణంలో 29 వరకు, ఆదిలాబాద్–ముంబై ఎక్స్‌ప్రెస్ 26 నుంచి 27 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 27, 28 తేదీల్లో, కాజీపేట–దాదర్ 25, తిరుగుప్రయాణంలో మరుసటిరోజు, పుణే–కాజీపేట 24న, కాజీపేట–పుణే 26న రద్దయ్యాయి. కాకినాడ పోర్టు–సాయినగర్ షిర్డీ 25, 27లలో, తిరుగుప్రయాణంలో 26, 28లలో, సికింద్రాబాద్–షిర్డీ ఎక్స్‌ప్రెస్ 24, 26లలో తిరుగుప్రయాణంలో 25, 27లలో నాగర్సోల్–షిర్డీ మధ్య రద్దయ్యాయి. సికింద్రాబాద్–మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ 24 నుంచి 27 వరకు, తిరుగుప్రయాణంలో 25 నుంచి 25 వరకు నాగర్సోల్–మన్మాడ్ మధ్య రద్దయ్యాయి. (క్లిక్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం.. తూటా రూట్ మారెన్) -
ప్రత్యేక రైళ్ల కేటాయింపు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ మీదుగా హటియా –సికింద్రాబాద్–హటియా ప్రత్యేక రైలును నడపనుందని డివిజన్ సీనియర్ డీసీఎం మంగళవారం వెల్లడించారు. 08615 నంబర్ రైలును హటియా–సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈ నెల 10వ తేదీ శుక్రవారం కేటాయించినట్లు తెలిపారు. ఈ రైలు హటియా స్టేషన్ నుంచి శుక్రవారం రాత్రి 11.55 గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 5.30 గంటలకు గుంటూరుకు చేరుకుని అక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. 08616 నంబర్ రైలును సికింద్రాబాద్–హటియాకు 13న కేటాయించినట్లు తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సోమవారం రాత్రి 7.30కి బయల్దేరి బుధవారం ఉదయం 6 గంటలకు హటియా స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. పలు రైళ్లు తాత్కాలిక రద్దు డబ్లింగ్ పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు డివిజన్ సీనియర్ డీసీఎం వెల్లడించారు. లింగంపల్లి–విశాఖపట్నం 12806 నంబర్ రైలు ఈ నెల 18న విజయవాడ–విశాఖపట్నం మీదుగా తాత్కాలికంగా రద్దయిందన్నారు. అలాగే విశాఖపట్నం–లింగంపల్లి 12805 నంబర్ రైలు విశాఖపట్నం–విజయవాడ మీదుగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలియజేశారు. -
పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖపట్టణం–సికింద్రాబాద్ (08579/ 08580) వీక్లీ స్పెషల్ ట్రైన్ జూన్ 1వ తేదీ నుంచి 30 వరకు విశాఖపట్టణం– మహబూబ్ నగర్ (08585/08586) వీక్లీ స్పెషల్ ప్రతి మంగళ వారం విశాఖ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుం టుంది. కాచిగూడ– తిరుపతి (07297/ 07298) స్పెషల్ ట్రైన్ జూన్ 1వ తేదీ రాత్రి 10.20 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరుపతికి చేరుకుం టుంది. హైదరాబాద్– తిరుపతి (07433/ 07434) స్పెషల్ ట్రైన్ ఈనెల 31, జూన్ 7, 14, 21, 28 తేదీ ల్లో సాయంత్రం 6.40కి నాంపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50కి తిరుపతికి చేరు కుంటుంది. తిరుగు ప్రయాణంలో జూన్ 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 8.25కు బయల్దేరి మర్నాడు ఉదయం 8.30కు నాంపల్లికి చేరుకుంటుంది. -
సికింద్రాబాద్–కటక్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–కటక్ (07581/07582) ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 6.15 గంటలకు కటక్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22వ తేదీ సాయంత్రం 6.55 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
హైదరాబాద్–తిరుపతి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–తిరుపతి (07433/07434) స్పెషల్ ట్రైన్ ఈనెల 17న సాయంత్రం 6.40 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 19వ తేదీ రాత్రి 8.25 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. తిరుపతి–కాకినాడ (07435/07436) స్పెషల్ ట్రైన్ ఈనెల 18వ తేదీ సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 19వ తేదీ ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6.40కి కాకినాడ చేరుకుంటుంది. -
రైళ్లకు సమ్మర్ రష్..!
సాక్షి, అమరావతి బ్యూరో: రైళ్లకు వేసవి తాకిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తుండడంతో ఇప్పట్నుంచే రిజర్వేషన్లు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రానున్న నెలన్నర వరకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లలో బెర్త్‌లు ఫుల్ అయ్యాయి. వేసవి సెలవుల్లో పలువురు కుటుంబ సభ్యులతో స్వస్థలాలకు, బంధువుల ఊళ్లకు, విహార యాత్రలు, తీర్థ యాత్రలకు వెళ్తుంటారు. ఇతర రవాణా వ్యవస్థలకంటే రైలు ప్రయాణం చౌక కావడం, దూర ప్రాంతాలకు వెళ్లడానికి సౌకర్యవంతంగా ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా వీటినే ఎంచుకుంటారు. దీంతో వీటిలో బెర్తులకు ముందుగానే రిజర్వు చేయించుకుంటున్నారు. విజయవాడ జంక్షన్ మీదుగా 296 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో డైలీ, వీక్లీ, బైవీక్లీ, ట్రైవీక్లీ రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ స్టేషన్ నుంచి 35 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ స్టేషన్ వరకు వచ్చి నిలిచిపోయే రైళ్లు మరో 23 ఉన్నాయి. వీటిలో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో చాలావరకు బెర్తులు వెయిట్ లిస్టులే దర్శనమిస్తున్నాయి. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎగువ మధ్య తరగతి ప్రయాణికులు ఏసీ బెర్తులకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో స్లీపర్ క్లాస్‌కంటే ముందుగానే ఏసీ బెర్తులు ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా థర్డ్ ఏసీకి డిమాండ్ అధికంగా ఉంది. విజయవాడ–విశాఖ రూట్‌కు డిమాండ్ విజయవాడ–హైదరాబాద్ రూటుకంటే విజయవాడ–విశాఖపట్నం వైపు ప్రయాణించే రైళ్లలో వెయిట్ లిస్టు సంఖ్య ఎక్కువగా ఉంది. విజయవాడ– సికింద్రాబాద్ మార్గంలో నడిచే కొన్ని రైళ్లలో రానున్న నెల, నెలన్నర వరకు బెర్తులు లభిస్తున్నా యి. విజయవాడ–విశాఖ మార్గంలో బెర్తులన్నీ అయిపోయి వెయిట్ లిస్టులు దర్శనమిస్తున్నాయి. మే 20వ తేదీకి విజయవాడ – విశాఖ మధ్య కోరమాండల్ స్లీపర్ వెయిట్ లిస్ట్ 17 కాగా థర్డ్ ఏసీ వెయిట్ లిస్ట్ 18 ఉంది. గోదావరి స్లీపర్ వెయిట్ లిస్ట్ 83కు చేరింది. మిగతా రైళ్లదీ ఇదే పరిస్థితి. వేసవికి ప్రత్యేక రైళ్లు వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ వేసవిలో విజయవాడ మీదుగా సుమారు 55 సమ్మర్ స్పెషల్ రైళ్లను అందుబాటులో ఉంచింది. ఇవి ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల అనంతరం.. ఈనెల 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు మేలో ఉన్నాయి. ఈ పరీక్షల అనంతరం వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పిల్లలకు సమ్మేటివ్ పరీక్షలు పూర్తి కాగానే వేసవి సెలవులు ఇస్తారు. అంటే మే మొదటి వారంలోనే వీరికి సెలవులు ప్రకటిస్తారు. ఇందుకు అనుగుణంగా తల్లిదండ్రులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే రైళ్లలో రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో బెర్తులు దొరకడంలేదు. ఇంటర్ సిటీ, పాసింజర్ రైళ్లు మినహా దూరప్రాంత రైళ్లలో వెయిట్ లిస్టు కొండవీటి చాంతాడంత కనిపిస్తోంది. -
సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్–తిరుపతి(02764/02763) స్పెషల్ ట్రైన్ ఈ నెల 23, 30, మే 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 6.40కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో ఈ నెల 24, మే 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మచిలీపట్నం–సికింద్రాబాద్ (07185/07186) స్పెషల్ ట్రైన్ ఈ నెల 24, మే 1, 8, 15, 22, 29 జూన్ 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగించనుంది. -
Special Trains: విజయవాడ మీదుగా 3 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ నెల 18న మూడు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాకినాడ టౌన్– సికింద్రాబాద్ రైలు (07187) రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ రైలు (07188) ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 6.45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. నర్సాపూర్–సికింద్రాబాద్ రైలు (07169) రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల స్టేషన్లలో ఆగుతుంది. -
ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశ యాత్రకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టూరిజం) జీపీ కిషోర్‌సత్య తెలిపారు. బుధవారం విజయవాడలోని రైల్వే స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ ‘మహాలయ పిండదాన్’ పేరుతో వారణాసి, ప్రయాగ్ సంగం, గయా ప్రాంతాలు చుట్టివచ్చేలా ఐదు రాత్రులు, ఆరు రోజుల ప్యాకేజీతో రైలును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15వ తేదీన ఈ రైలు బయలుదేరి..20వ తేదీ గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఏఎం మురళీకృష్ణతో కలిసి ప్యాకేజీ కరపత్రాలను ఆవిష్కరించారు. మాత వైష్ణోదేవి యాత్ర.. స్వదేశీ దర్శన్ పేరుతో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్‌సర్‌లో పర్యటించేలా ప్రత్యేక రైలు ప్యాకేజీలను రూపొందించామని కిషోర్‌సత్య తెలిపారు. మే 27వ తేదీన తిరుపతి–రేణిగుంట నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు జూన్ 3వ తేదీనమ గమ్య స్థానానికి చేరుకుంటుందన్నారు. హైదరాబాద్ నుంచి కేరళ, తమిళనాడు, ఉత్తరాఖాండ్, నేపాల్, తిరుపతికి విమాన ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. వివరాలకు ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్, 9701360675, 9701360701 నంబర్లలో సంప్రదించాలని కిషోర్‌సత్య సూచించారు. విజయవాడ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి (07433) ఈ నెల 15న రాత్రి 7.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07434) ఈ నెల 16న రాత్రి 8.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుంది. నాందేడ్–విశాఖపట్నం (07082) రైలు ఈ నెల 15న సాయంత్రం 4.35 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07083) 17న సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. -
వేసవికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ►హైదరాబాద్–నర్సాపూర్ (07477/07478) 13వ తేదీ సాయంత్రం 4.55 గంటలకు నాంపల్లి నుంచి.. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది. ►కాచిగూడ–తిరుపతి (07297/07298) 13రాత్రి 10.20 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 14 మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. ►సికింద్రాబాద్–తిరుపతి (07438/07437) స్పెషల్ ట్రైన్ 13వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ సాయం త్రం 7.50 గంటలకు బయలుదేరుతుంది. ►సికింద్రాబాద్–కాకినాడ (07468/07469)13వ తేదీ రాత్రి 8.45 గంటలకు.. తిరుగు ప్రయాణం లో 17వ తేదీ రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.50గం.లకు సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్‌కు చేరుకుంటుంది. ►సికింద్రాబాద్–బరంపూర్ (07586/07587) 13 సాయంత్రం 4.35 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుంది. ►తిరుపతి–సికింద్రాబాద్ (07583/07584) స్పెషల్ ట్రైన్ 15వ తేదీ రాత్రి 9 గంటలకు.. తిరుగు ప్రయాణంలో 16వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుంది. ►సికింద్రాబాద్–నర్సాపూర్ (07439/07440) 15 రాత్రి 10.35 గంటలకు.. తిరుగుప్రయాణంలో 17రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. ►తిరుపతి–సికింద్రాబాద్ (07585) స్పెషల్ ట్రైన్ ఈ నెల 17 సాయంత్రం 7.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
Special Trains: ఏపీ మీదగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివే
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్–రామేశ్వరం–సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా పలు రైళ్లు కేటాయించడం జరిగిందని రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్రవర్మ గురువారం వెల్లడించారు. చదవండి: పెగసస్ స్పైవేర్‌ను కొన్న చంద్రబాబు సర్కార్ సికింద్రాబాద్–రామేశ్వరం (07685) ప్రత్యేక రైలు మార్చి 22, 29, ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28, జూలై 5, 12, 19, 26 తేదీలలో నడుస్తుంది. రామేశ్వరం–సికింద్రాబాద్ (07686) ప్రత్యేకరైలు మార్చి 24, 31, ఏప్రిల్ 7, 14, 21, 28, మే 5, 12, 29, 26, జూన్ నెలలో 2, 9, 16, 23, 30, జూలై 7, 14, 21, 28 తేదీలలో నడుస్తుందని తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా గుంటూరు–విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు తాత్కాలికంగా అదనపు ఏసీ చైర్ కార్ కోచ్‌ను జత చేసి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. గుంటూరు – విశాఖపట్నం (17239/17240) రైలు ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2 వరకు అదనపు ఏసీ కోచ్‌తో నడవనున్నట్లు తెలిపారు. -
విశాఖ–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల కొనసాగింపు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు డివిజన్ మీదుగా విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య నడిచే వారాంతపు ప్రత్యేక రైళ్లు మార్చి నెలలోనూ కొనసాగనున్నట్లు సీనియర్ డీసీఎం నరేంద్ర వర్మ తెలిపారు. ► విశాఖపట్నం–సికింద్రాబాద్ (08579) ప్రత్యేక రైలు మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 7.00 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ► సికింద్రాబాద్–విశాఖపట్నం (08580) ప్రత్యేక రైలు మార్చి 3 నుంచి 31వ తేదీ వరకు ప్రతి గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ► విశాఖపట్నం–సికింద్రాబాద్ (08585) ప్రత్యేక రైలు మార్చి 1 నుంచి 29వ తేదీ వరకు ప్రతి మంగళవారం రాత్రి 7.00 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ► సికింద్రాబాద్–విశాఖపట్నం (08586) ప్రత్యేక రైలు మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. -
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ‘భారత్ దర్శన్’
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘భారత్ దర్శన్’ పేరుతో పుణ్యక్షేత్రాలు, ఆహ్లాదకర ప్రాంతాలను కలుపుతూ ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు ఐఆర్సీటీసీ టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ జీపీ కిశోర్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని రైల్వే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. మాతా వైష్ణోదేవి దర్శనంతో పాటు ఆగ్రా, మధుర, అమృత్సర్, హరిద్వార్‌లోని ప్రముఖ ప్రాంతాలను చుట్టి వచ్చేలా రైలు ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ రైలు మార్చి 19న రాజమండ్రి నుంచి బయలుదేరి పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి 27వ తేదీన గమ్య స్థానానికి చేరుకుంటుందన్నారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు సామర్లకోట, తుని, విశాఖపట్నంలో రైలు ఎక్కొచ్చన్నారు. 8 రాత్రులు, 9 పగళ్లు మొత్తం 8 రాత్రులు, 9 పగళ్ల ప్రయాణానికి భోజన వసతితో కలిపి స్లీపర్ క్లాస్ ధర రూ.8,510, త్రీటైర్ ఏసీ ధర రూ.10,400గా నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ప్రతి శుక్రవారం విజయ్ గోవిందం పేరుతో విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు ప్యాకేజీ నడుస్తోందన్నారు. 2 రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీలో స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ టికెట్ ధర రూ.3,410, రూ.3,690గా ఉందన్నారు. సికింద్రాబాద్ నుంచి తెనాలి, గుంటూరు మీదుగా ప్రతి మంగళవారం కేరళకు 5 రాత్రులు, 6 పగళ్ల ప్యాకేజీలో అలప్పి–కొచ్చి–మున్నార్‌కు రూ.10,610, అలప్పి–మున్నార్‌కు రూ.10,280, అలప్పి–గురువాయుర్–కొచ్చికు రూ.8,910, కూనూర్–ఊటీకి రూ.9,730 టికెట్ రేటు నిర్ణయించామన్నారు. ఎయిర్ టూర్ ప్యాకేజీలు ఐఆర్సీటీసీ ద్వారా ప్రాంతీయ విమాన పర్యాటక ప్యాకేజీలను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. మార్చి 1, 11, 21 తేదీల్లో, ఏప్రిల్ 15, 21 తేదీల్లో, మే 10, 17 తేదీల్లో కాశ్మీర్‌కు హౌస్‌బోటు అకామిడేషన్‌తో (శ్రీనగర్, సోమ్‌నగర్, గుల్మార్గ్, ఫహల్గామ్) రూ.27,750, ఏప్రిల్ 10న హిమాచల్–పాపులర్ పంజాబ్ (చంఢీగర్, సిమ్లా, ధర్మశాల, అమృత్సర్) పేరుతో రూ.33,100, మార్చి 3,5,10,12,17,19,24, ఏప్రిల్7,9,14,16,21,23,28 తేదీల్లో తిరుపతి బాలాజీ దర్శన్ (తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం) పేరుతో రూ.10,315 టిక్కెట్ ధరతో హైదరాబాద్ నుంచి విమాన సేవలందిస్తున్నామన్నారు. జూలై నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి లేక్, లద్దాక్, లేహ్, కాశ్మీర్, తిరుపతి, రాజస్థాన్, కేరళ వంటి ప్రాంతాలకు ఎయిర్ టూర్ ప్యాకేజీలు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఏరియా మేనేజర్ కృష్ణ పాల్గొన్నారు. వివరాలకు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు 82879 3232, 97013 60675 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చాప్రా–సికింద్రాబాద్, గోరఖ్‌పూర్–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు చాప్రా–సికింద్రాబాద్ (05179) ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీన ఉదయం 5.20 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. గోరఖ్‌పూర్–సికింద్రాబాద్ (05023) ప్రత్యేక రైలు ఈ నెల 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
సంక్రాంతికి మరో 2 ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మరో 2 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. తిరుపతి–కాచిగూడ ప్రత్యేక రైలు (82721) ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. నర్సాపూర్–కాచిగూడ ప్రత్యేక రైలు (82722) ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని పేర్కొన్నారు. -
Sankranti Special Trains: సంక్రాంతికి మరో 4 ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. తిరుపతి–సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07460) ఈ నెల 10న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్–తిరుపతి రైలు (82720) 11వ తేదీ∙సాయంత్రం 7.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుపతి–కాచిగూడ ప్రత్యేక రైలు (07461) 12న మధ్యాహ్నం 3.20 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. కాచిగూడ–తిరుపతి ప్రత్యేక రైలు (07642) ఈ నెల 13న మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది. చదవండి: ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్ -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సంక్రాంతి సందర్భంగా విజయవాడ మీదుగా కాకినాడటౌన్–లింగంపల్లి మధ్య 14ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ► రైలు నంబర్ 07275 జనవరి 3, 5, 7 తేదీలలో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07276) జనవరి 4, 6, 8 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ► రైలు నంబర్ 07491 జనవరి 10, 12, 14, 17 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07492) జనవరి 13, 15, 18 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ► రైలు నంబర్ 82714 జనవరి 11న సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్ నుంచి శబరిమలకు.. శబరిమల వెళ్లే భక్తుల కోసం కాకినాడ టౌన్ నుంచి ఎర్నాకుళంకు ప్రత్యేక రైలు (07147) జనవరి 4, 11 తేదీలలో సాయంత్రం 5 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07148) జనవరి 5, 12 తేదీలలో రాత్రి 7.00 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాచిగూడ–నరసాపూర్.. కాచిగూడ–నరసాపూర్ వయా గుంటూరు డివిజన్ మీదుగా సువిధ ప్రత్యేక రైలు (82716) జనవరి 11న రాత్రి 11.15 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు నరసాపూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07494) జనవరి 12న సాయంత్రం 6.00 గంటలకు నరసాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. -
సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సంక్రాంతి సందర్భంగా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం నరేంద్ర వర్మ శనివారం పేర్కొన్నారు. రైళ్ల వివరాలు... ► మచిలీపట్నం–కర్నూలు టౌన్ (07067) 2022 జనవరి 1,4,6,8,11,13,15,18,20,22,25,27,29 వరకు ► 07068 కర్నూలు టౌన్–మచిలీపట్నం (07068) జనవరి 2,5,7,9,12,14,16,19,21,23,26,28,30వ తేదీ వరకు ► జనవరి 2,9,16,23,30వ తేదీలలో నరసాపూర్–సికింద్రాబాద్ (07455) ► జనవరి 3,10,17,24,31వ తేదీల్లో సికింద్రాబాద్–విజయవాడ (07456) ► జనవరి 2,9,16,23,30వ తేదీల్లో సికింద్రాబాద్–మచిలీపట్నం(07578) ► మచిలీపట్నం–సికింద్రాబాద్ (07577) వయా ఖాజీపేట డివిజన్ మీదుగా జనవరి 2,9,16,23,30వ తేదీ వరకు. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమల వేళ్లే ప్రమాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ► సికింద్రాబాద్–కొల్లం ప్రత్యేక రైలు (07133) ఈ నెల 18న ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07134) ఈ నెల 19న సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయలుదేరి, రెండోరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► కాచిగూడ–కొల్లం ప్రత్యేక రైలు (07135) ఈ నెల 22న ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07136) ఈ నెల 23న సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయలుదేరి, రెండోరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ► నాందేడ్–కొల్లం ప్రత్యేక రైలు (07137) ఈ నెల 23న ఉదయం 9.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ► కొల్లం–తిరుపతి ప్రత్యేక రైలు (07506) ఈ నెల 25న (శనివారం) మధ్యరాత్రి 12.45 గంటలకు కొల్లంలో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 5.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ► తిరుపతి–నాందేడ్ ప్రత్యేక రైలు (07138) ఈ నెల 26న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 3 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. -
ప్రైవేటు చేతికి ‘భారత్ గౌరవ్’
సాక్షి, హైదరాబాద్: రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ‘భారత్ గౌరవ్’ పేరిట ఇతివృత్త ఆధారిత పర్యాటక సర్క్యూట్ రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) నిర్ణయించిం ది. ఈ రైళ్లను నడిపించే అవకాశాన్ని ప్రైవేట్ సంస్థ లకు అప్పగించనుంది. భారత దేశ సాంస్క్రతిక, వారసత్వ సంపదగా చెప్పుకొనే చారిత్రక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఎస్సీఆర్ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో రైలు ప్రయాణికులకు చారిత్రక ప్రదేశాల సందర్శనకు అవకాశం కల్పించడంతో పాటు దేశ పర్యాటక రంగం అభివృద్ధికి కూడా తోడ్పాటును అందించినట్లవుతుందని పేర్కొన్నాయి. కాగా ‘భారత్ గౌరవ్’ రైళ్ల నిర్వహణలో ప్రైవేట్ సంస్థలకు దర్శనీయ స్థలాల ఎంపిక, చార్జీల నిర్ణయం వంటి అంశాలపై పూర్తి స్వేచ్ఛ ఇవ్వనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ సర్క్యూట్ రైళ్లు నడిపేందుకు ఆసక్తిగలవారు ఆన్లైన్లో దరఖాస్తు కోసం నమోదు చేసుకోవలసి ఉంటుంది. వచ్చే 10 పని దినాలలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కనీసం 14, గరిష్టంగా 20 కోచ్‌లు నమోదు చేసుకున్న సర్వీసు ప్రొవైడర్లు వారికి కావాల్సిన విధంగా రేక్ (రైలు బోగీ) కూర్పు (కనీసం 14 కోచ్‌లు, గరిష్టంగా 20 కోచ్‌లు)ను ఎంపిక చేసుకునే అవకాశముంది. రైల్వే వారి మౌలిక సదుపాయాలను, రోలింగ్ స్టాక్ (రైల్వే వాహనాలు)ను వినియోగించుకునేందుకు నిబంధనల ప్రకారం ‘రైట్ టు యూజ్’ చార్జీలు, స్థిర, చర వాణిజ్య సరుకు రవాణా (ఫిక్స్డ్, వేరియబుల్ హాలేజ్) చార్జీలు, స్టాబ్లింగ్ (సరుకు నిల్వ) చార్జీలు వంటివి విధిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ రైళ్లను మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా పరిగణిస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల సర్వీసు ప్రొవైడర్లు దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం రైల్ నిలయం కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ప్రయాణికుల సేవలు) ఆర్.సుదర్శన్‌ను సంప్రదించవచ్చునని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. -
పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్: పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు నర్సాపూర్–సికింద్రాబాద్ (07455) ట్రైన్ ఈనెల 21, 28 తేదీల్లో నర్సాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–విజయవాడ (07456)ట్రైన్ ఈనెల 22, 29 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. హైదరాబాద్–గోరఖ్‌పూర్ (02575/02576) ట్రైన్ ఈనెల 19వ తేదీ రాత్రి 9.05 గంటలకు బయల్దేరి రెండోరోజు ఉదయం 6.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుం టుంది. తిరుగుప్రయాణంలో 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. (చదవండి: ఇకపై అన్నీ రెగ్యులర్ రైళ్లే.. రైల్వేశాఖ కీలక నిర్ణయం) -
ఇకపై అన్నీ రెగ్యులర్ రైళ్లే
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దేశంలో కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ తరువాత విడతల వారీగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వేశాఖ.. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి నుంచి అన్నీ రెగ్యులర్ రైళ్లుగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు వెంటనే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల అనవసర ప్రయాణాన్ని తగ్గించే ఉద్దేశంతో అదనపు చార్జీలు విధించి ‘సున్నా’ నంబర్‌తో మొదలయ్యే ప్రత్యేక రైళ్లను తొలుత దూర ప్రాంతాల మధ్య నడిపి, అనంతరం తక్కువ దూరం మధ్య పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లను నడపడం ప్రారంభించింది. దాదాపు అన్ని ప్యాసింజర్ రైళ్లు ప్రత్యేక రైళ్ల పేరుతో నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీల కంటే అధికంగా ఉండటంతో పాటు రైల్వేశాఖ ప్రత్యేక ప్రయాణికులకు అందిస్తున్న రాయితీలు కూడా ఉండవు. దీంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై దృష్టి పెట్టిన రైల్వేశాఖ ఇప్పటి నుంచి విడతల వారీగా ప్రత్యేక రైళ్ల స్థానంలో కరోనాకు ముందు ఉండే విధంగా సాధారణ రైలు నంబర్లతో, పాత చార్జీలతోనే రెగ్యులర్ రైళ్లు నడిపేలా చర్యలు చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2021 రైల్వే టైంటేబుల్ ప్రకారం దాదాపుగా అన్ని రైళ్లు రెగ్యులర్ రైళ్లుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ ప్రత్యేక రైలు మరో రెండు వారాలు పొడిగింపు నరసాపురం: గత మూడు ఆదివారాలుగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తున్న ప్రత్యేక రైలును ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో రెండు వారాలు పొడిగిస్తూ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలు ఈ నెల 21, 28 తేదీల్లో కూడా నడుస్తుందని నరసాపురం రైల్వేస్టేషన్ మేనేజర్ మధుబాబు మంగళవారం తెలిపారు. 07455 నంబర్‌తో ఈ రైలు సాయంత్రం ఐదు గంటలకు నరసాపురంలో బయలుదేరి పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటిరోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. -
వారం రోజుల పాటు.. ఈ టైంలో రైల్వే రిజర్వేషన్లు బంద్! కారణమిదే
Indian Railway Big Update: ప్రయాణం చేయాలనుకునే వారికి ముఖ్య సూచన చేసింది రైల్వేశాఖ. మెయింటెన్స్‌లో భాగంగా వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్ సిస్టమ్ పని చేయదని పేర్కొంది. టికెట్ బుకింగ్‌తో పాటు పీఎన్ఆర్ ఎంక్వైరీ, టిక్కెట్ రద్దు తదితర సేవలు కూడా నిలిచిపోనున్నాయి. స్పెషల్ 2020 మార్చిల లాక్డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. సుమారు ఆర్నెళ్ల తర్వాత క్రమంగా ప్రత్యేక రైళ్ల పేరుతో కొన్ని రైళ్లను తిరిగి ప్రారంభించారు. ప్యాసింజర్ , లోకల్ రైళ్లను కూడా ప్రత్యేక రైళ్లుగానే నడుపుతూ వస్తున్నారు. దీంతో ఈ ప్రత్యేక రైళ్ల నంబర్లు మారాయి. అదే విధంగా హాల్టింగ్ స్టేషన్లలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు ఏడాది పాటు ఇదే విధానం కొనసాగింది. ఈ ప్రత్యేక నంబరు, స్టేషన్లు, ఛార్జీలకు తగ్గట్టుగానే రిజర్వేషన్ ప్రక్రియ నడిచింది. రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటం కరోనా ముప్పు క్రమంగా సాధారణ స్థితికి వస్తుండటంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లకు పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రత్యేకం పేరుతో తిరుగుతున్న రైళ్లను తిరిగి రెగ్యులర్ రైళ్లుగా మారుస్తామంటూ ఇటీవల రైల్వే మంత్రి ఆశ్వినీ వైభవ్ ప్రకటించారు. అందుగు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల నంబర్లు, స్టేషన్ల హాల్టింగ్ , ఛార్జీల విషయంలో మార్పులు చేయాలి. దీనికి తగ్గట్టుగా టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పనిలో ఉంది రైల్వేశాఖ. సాఫ్ట్వేర్ అప్డేట్ టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ పనులను నవంబరు 14 నుంచి 22వ తేదీల మధ్యన చేపట్టాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన తేదీల్లో ప్రతీ రోజు రాత్రి 11:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు రిజర్వేషన్ సేవలు దేశవ్యాప్తంగా నిలిపేస్తున్నారు. ఈ సమయంలో టిక్కెట్ బుక్ చేసుకోవడం, రద్దు చేయడం, పీఎన్ఆర్ స్టేటస్, కరెంట్ బుకింగ్ స్టేటస్, ట్రైన్ రియల్‌టైం తదితర సేవలు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉంటే 139 నంబరుకు ఫోన్ చేసుకునే వెసులుబాటు మాత్రం ఇచ్చారు. The activity will be performed starting from the intervening night of 14 and 15-November to the night of 20 and 21-November starting at 23:30 hrs and ending at 0530 hrs. During this period, no PRS Services will be available. Read: https://t.co/8MPZw1cGXx — PIB India (@PIB_India) November 14, 2021 చదవండి: రైల్వే ప్యాసింజర్లకు గుడ్ న్యూస్.. ఇక నో ‘ కొవిడ్ స్పెషల్’ రైళ్లు, టికెట్ ధరలు సైతం తగ్గింపు! -
మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు
మచిలీపట్నం: మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే సూపరింటెండెంట్ నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. నవంబర్‌లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రత్యేక రైలు (07573) బందరులో బయలుదేరి రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, కొండపల్లి, ఖమ్మం, డోర్నకల్, వరంగల్, ఖాజీపేట్ స్టేషన్లలో ఆగుతుంది. తిరిగి రైలు (07574) సికింద్రాబాద్‌లో రాత్రి 11.55 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 8 గంటలకు మచిలీపట్నం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైలు పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, కృష్ణా కెనాల్, విజయవాడ, గుడివాడ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నవంబర్‌లో మాత్రమే ఈ రైలును నడుపుతున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. -
స్పెషల్ లేదు ఏం లేదు.. సున్నాతో సున్నం! ఇదేం బాదుడు బాబోయ్..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కాలంలో అన్ని రైళ్లూ రద్దయ్యాయి. ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. అలా సొంత ఊళ్లకు చేరుకోకుండా ఎక్కడో ఒకచోట ఉండిపోయిన వాళ్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు దక్షిణమధ్య రైల్వే గతేడాది ‘ప్రత్యేక’ రైళ్లకు శ్రీకారం చుట్టింది. అప్పటి వరకు నడిచిన రెగ్యులర్ రైళ్ల నంబర్లకు ‘సున్నా’ను జత చేసింది. దీంతో అవి అకస్మాత్తుగా ‘ప్రత్యేక’ రైళ్ల అవతారమెత్తాయి. అలా ‘ఏమార్చి’న రైళ్లలో చార్జీలను పెంచారు. కోవిడ్ కాలం తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నా ఆ ‘సున్నా’ మాత్రం అలాగే ఉండిపోయింది. బాదుడు రైళ్లు యథావిధిగా పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవడానికి బదులు ప్యాసింజర్లను ‘ఎక్స్‌ప్రెస్’లుగా, ఎక్స్‌ప్రెస్‌లను ‘సూపర్‌ఫాస్టు’లుగా నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. కాని ఆయా రైళ్లలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవనీ, చార్జీలు మాత్రం దారుణంగా పెరిగాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవే రైళ్లు.. అదే వేగం... ► రైళ్ల స్థాయిని పెంచినప్పటికీ వేగంలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్టు రైళ్లు గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లలోపే నడుస్తున్నాయి. కొన్ని రూట్లలో ఆ మాత్రం వేగం కూడా కష్టమే. ► మరోవైపు ఒక్కో రూట్లో రెండు, మూడు స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం తొలగించడంతో కలిసొచి్చన సమయాన్ని వేగం పెంచినట్లుగా చూపుతున్నారని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాదుడు రైళ్లివే.. ► కోవిడ్ కంటే ముందు నడిచిన రైళ్లకు ‘ప్రత్యేకం’గా నంబర్లకు సున్నాను జత చేసి నడిపిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్టులుగా, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి బాదేస్తున్నారు. ► భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17234/17233) కోవిడ్ తర్వాత (017234/017233)గా మారింది. అప్పటి వరకు ఉన్న ఎక్స్‌ప్రెస్ చార్జీలను సూపర్‌ఫాస్ట్ చార్జీలుగా మార్చారు. కరోనా కంటే ముందు సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి వరకు రూ.75 ఉన్న చార్జీని కోవిడ్ తర్వాత రూ.90కి పెంచారు. రిజర్వేషన్ సీట్ కావాలంటే అదనంగా మరో రూ.15 చెల్లించాలి. ఐఆర్సీటీసీ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకొంటే మరో రూ.17 సర్‌చార్జీ చెల్లించాలి. మొత్తంగా భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నంబర్‌కు ‘0’ చేర్చడం వల్ల ఒక సీట్‌పై రూ.45 అదనపు భారం పడింది. ► సికింద్రాబాద్ నుంచి మణుగూర్ వరకు నడిచే డైలీ ఎక్స్‌ప్రెస్ (17026/17025) ట్రైన్‌ను కోవిడ్ నేపథ్యంలో కేవలం నంబర్‌కు ముందు సున్నా చేర్చి చార్జీ రూ.15 పెంచారు. ► సికింద్రాబాద్ నుంచి గద్వాల్ జంక్షన్ వరకు నడిచిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ చార్జీ కోవిడ్‌కు ముందు రూ.80 ఉంటే ఇప్పుడు రూ.95 కు పెంచారు. కేవలం నంబర్‌కు ముందు సున్నాను చేర్చడం వల్ల పెరిగిన చార్జీ ఇది. రైళ్ల వేగం ఏ మాత్రం పెరగడం లేదని,పైగా కొన్ని స్టాపుల్లో వాటిని నిలపకుండా నడపడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సివస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► తాండూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచిన మెము పుష్ఫుల్ రైల్లో గతంలో తాండూరు నుంచి సికింద్రాబాద్ వరకు కేవలం రూ.35 చార్జీ ఉండేది. ఇప్పుడు ఆ రైలు నంబర్‌కు ‘సున్నా’ను జత చేయడంతో చార్జీ ఏకంగా రూ.70కి పెరిగింది. ► కాచిగూడ నుంచి నిజామాబాద్ వరకు నడిచిన పుష్ఫుల్ ట్రైన్ చార్జీ రూ.45 నుంచి రూ.70 కి పెరిగింది. నంబర్‌కు ముందు ‘సున్నా’చేర్చి ‘ఎక్స్‌ప్రెస్’గా మార్చి చార్జీలను పెంచేశారు. ► సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు రూ.95 ఉన్న చార్జీ ఇప్పుడు రూ.110 కి పెరిగింది. ► నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వరకు నడిచే ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వరకు గతంలో రూ.60 మాత్రమే ఉండగా, ఇప్పుడు రూ.75 కు పెంచారు. దోచేస్తున్నారు.. ఏ రైలుకు ఎప్పుడు ‘సున్నా’ వచ్చి చేరుతుందో తెలియదు, కోవిడ్ నెపంతో ‘ప్రత్యేక’ రైళ్లను నడిపి చార్జీలు పెంచారు. ప్రస్తుత సాధారణ పరిస్థితుల్లో పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలి. కానీ అందుకు భిన్నంగా రెగ్యులర్ రైళ్లనే ‘ఎక్స్‌ప్రెస్’లుగా, ‘సూపర్‌ఫాస్ట్’లుగా నడుపుతున్నట్లు చెప్పి దోచుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. – ఫణిరాజ్ శర్మన్ స్టేషన్లు వెలవెల.. గతంలో హాల్టింగ్ ఉన్న కొన్ని రైల్వేస్టేషన్లలో ఇప్పుడు హాల్టింగ్ తొలగించి వేగం పెంచినట్లుగా చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఒకప్పుడు ప్రయాణికులతో సందడిగా ఉన్న ఆ స్టేషన్లు ఇప్పుడు వెలవెలపోతున్నాయి. ఇది ఏ విధమైన మార్పో అర్థం కావడం లేదు. – కామని శ్రీనివాస్ -
దీపావళికి ప్రత్యేక వారాంతపు రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దీపావళి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా పూర్ణ–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పూర్ణ–తిరుపతి ప్రత్యేక వారాంతపు రైలు (07607) నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీలలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 1 గంటకు పూర్ణలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07608) నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.25 గంటలకు పూర్ణ చేరుకుంటుంది. -
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సికింద్రాబాద్–నర్సాపూర్ (07456/ 07455 ) స్పెషల్ ట్రైన్ ఈ నెల 14వ తేదీ రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07053) 14న రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07054) 17న రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–అగర్తల ప్రత్యేక రైలు (07030) 11న సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి నాలుగోరోజు (గురువారం) తెల్లవారుజామున 3 గంటలకు అగర్తల చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07029) 15న (శుక్రవారం) ఉదయం 6.10 గంటలకు అగర్తలలో బయలుదేరి, ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
పండుగ ప్రత్యేక రైళ్ల పునరుద్ధరణ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల అవసరాల దృష్ట్యా రైల్వే శాఖ గతంలో నడిపిన పండుగ ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరిగి ప్రకటించే వరకు ఈ రైళ్లు నిర్దేశించిన తేదీల్లో నడవనున్నాయి. ఈనెల 30 నుంచి బరోని–యర్నాకులం ప్రత్యేక రైలు(02521), నవంబర్ 3 నుంచి యర్నాకులం–బరోని ఎక్స్‌ప్రెస్ (02522), ఈ నెల 31 నుంచి దర్భంగ–మైసూర్ (02577), నవంబర్ 3 నుంచి మైసూర్–దర్భంగ (02578), ఈనెల 29 నుంచి గయా–ఎమ్జీఆర్ చైన్నై(02389), ఈనెల 31 నుంచి ఎమ్జీఆర్ చెన్నై–గయా (02390), ఈనెల 27 నుంచి పాటలీపుత్ర–యశ్వంతపూర్ (03251), యశ్వంతపూర్–పాటలీపుత్ర (03252), ముజఫర్‌పూర్–యశ్వంతపూర్ (05228), యశ్వంతపూర్–ముజఫర్‌పూర్ (05227) రైళ్లు నడవనున్నాయి. -
16 నెలల తర్వాత ప్యాసింజర్ రైళ్ల కూత
సాక్షి, హైదరాబాద్: దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కొన్ని ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. గతేడాది కోవిడ్ తొలిదశ లాక్డౌన్ సందర్భంగా మార్చి నెలాఖరు నుంచి రైళ్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సడలింపులతో కొన్ని స్పెషల్ రైళ్లుగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రైల్వే.. ప్యాసింజర్ రైళ్లను మాత్రం ప్రారంభించలేదు. ఇప్పుడు దశలవారీగా వాటిని ప్రాంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేబోర్డు జోనల్ రైల్వే అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో జూలై 19 నుంచి నాలుగు రోజుల్లో తొలివిడతగా 66 ప్యాసింజర్ స్పెషల్ సర్వీసుల (జోన్ అంతా కలిపి)ను ప్రారంభిస్తోంది. వీటిని కొత్త సమయాలు, నంబర్లతో నడపనున్నారు. వీటితోపాటు జోన్ పరిధిలో నడిచే కొన్ని స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులనూ ప్రారంభిస్తున్నారు. మెమూ, డెమూ రైళ్లనే ఈ స్పెషల్ సర్వీసులుగా నడుపుతుండటం విశేషం. 19న ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేట–సిర్పూర్ టౌన్ (ఉదయం 5.20), సిర్పూరు టౌన్–భద్రాచలం రోడ్ (12.30), హైదరాబాద్–పూర్ణ (8.15), పూర్ణ–హైదరాబాద్(7.40), విజయవాడ–గూడూరు (5.25), కాకినాడ పోర్టు– విజయవాడ (4.45), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (5.00), విశాఖపట్నం– కాకినాడ పోర్టు (17.05). 19న ప్రారంభమయ్యే ప్యాసింజర్ రైళ్లు వాడీ–కాచిగూడ (14.25), ఫలక్‌నుమా–వాడి (5.00), డోర్నకల్–కాజీపేట (21.10), విజయవాడ–డోర్నకల్ (18.15), సికింద్రాబాద్– కాలబుర్గీ (18.00), కాచిగూడ–మహబూబ్‌నగర్ (21.50), మహబూబ్‌నగర్–కాచిగూడ (6.45), కాచిగూడ–నడికుడి (9.20), నడికుడి– కాచిగూడ (16.10), కాచిగూడ–కరీంనగర్ (6.00). 20 నుంచి ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్‌లు భద్రాచలం రోడ్–సిర్పూర్ టౌన్ (6.00), సిర్పూర్ టౌన్–కాజీపేట (15.50). 20న ప్రారంభమయ్యే ప్యాసింజర్ రైళ్లు వరంగల్–సికింద్రాబాద్ (5.15), హైదరాబాద్–కాజీపేట (18.50), కరీంనగర్–పెద్దపల్లి (8.00), పెద్దపల్లి–కరీంనగర్ (13.10), కరీంనగర్–కాచిగూడ (14.20), కాలబుర్గీ–సికింద్రాబాద్(3.30). 21 నుంచి ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్ గుంటూరు–కాచిగూడ (5.15). 21 నుంచి ప్రారంభమయ్యే ప్యాసింజర్లు కాజీపేట–డోర్నకల్ (6.40), డోర్నకల్–విజయవాడ (9.00), సికింద్రాబాద్–మనోహరాబాద్ (6.10), మనోహరాబాద్–సికింద్రాబాద్ (8.45), కాచిగూడ–రాయచూరు (6.20), రాయచూరు–కాచిగూడ (17.00), పర్లీ–ఆదిలాబాద్ (15.45), విజయవాడ–మంచిర్యాల (15.30). 22న ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్ కాచిగూడ–గుంటూరు (5.10). 22న ప్రారంభమయ్యే ప్యాసింజర్ రైలు: ఆదిలాబాద్–పర్లి (3.30). -
కొనసాగనున్న ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యశ్వంత్‌పూర్–అహ్మదాబాద్ వారాంతపు రైళ్లు (06501/06502), యశ్వంత్‌పూర్–జయ్‌పూర్ వారాంతపు రైళ్లు (06521/06522), అజ్మీర్–బెంగళూర్ వారాంతపు రైళ్లు (06205/06206), బెంగళూర్–జోద్పూర్ వారాంతపు రైళ్లు (06533/06534), యశ్వంత్‌పూర్–ఢిల్లీ వారాంతపు రైళ్లు (06593/06594) యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు. ‘సికింద్రాబాద్–అగర్తల’ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్–అగర్తలా మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైలు(07029) ఈ నెల 18, 25 తేదీలలో ప్రతి శుక్రవారం ఉదయం 6.10 గంటలకు అగర్తలలో బయలుదేరి, రెండో రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (07030) ఈ నెల 21, 28 తేదీల్లో ప్రతి సోమవారం మధ్యాహ్నం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మూడో రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగర్తలా చేరుకుంటుంది. చదవండి: 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ ఏర్పాటు వేగవంతం -
పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కోవిడ్ కారణంగా ప్రయాణికులు లేక పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు ఇవే.. ► చెన్నై సెంట్రల్–హైదరాబాద్ (02603/02604), నర్సాపూర్–నిడదవోలు (07241/07242), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (07237/07238) రైళ్లను ఈ నెల 16 వతేదీ నుంచి జూలై 15 వరకు.. ► చెన్నై సెంట్రల్–నాందేడ్ మధ్య నడిచే ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి జూలై 17 వరకు .. ► తిరుపతి–చెన్నై సెంట్రల్ (06204/06203) ఈ నెల 16వ తేదీ నుంచి రద్దు చేశారు. -
ఏప్రిల్ 1 నుంచి 12 కొత్త రైళ్లు
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో రద్దయిన రైళ్లను ఒకొక్కటిగా పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ మీదుగా రోజూ 110 రైళ్లు తిరుగుతు న్నాయి. ఏప్రిల్ 1 నుంచి మరో 12 రైళ్లను పునరుద్ధ రించనున్నారు. విజయవాడ–సాయినగర్ షిర్డి– విజయవాడ (07207/07208) మధ్య రెండు రైళ్లు, అలాగే విజయవాడ–సికింద్రాబాద్–విజయవాడ (02799/02800), విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం (02739/02740), గుంటూరు –విశాఖపట్నం–గుంటూరు (07239/0740), గూడూరు –విజయవాడ–గూడూరు (02734/02644), నర్సాపూర్–ధర్మవరం–నర్సాపూర్ (07247/ 07248) మార్గాల్లో రెండేసి రైళ్ల చొప్పున ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తున్నారు. షిర్డి, సికింద్రాబాద్, విశాఖపట్నం, ధర్మవరం, గూడూరులకు విజయవాడ మీదగా రైళ్లు రానున్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగానే నడుపుతున్నారు. రెగ్యులర్ రైళ్ల కోసం ఎదురుచూపులు గతంలో 250 రైళ్లు విజయవాడ జంక్షన్ మీదగా ప్రతి రోజూ నడిచేవి. ప్రస్తుతం నడుస్తున్న 110 రైళ్లకు అడ్వాన్సు బుకింగ్ ఇస్తున్నారు. ఈ బుకింగ్‌లు నెల రోజులు ముందుగానే అయిపోతున్నాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నారే కానీ ప్యాసింజర్ రైళ్లను మాత్రం పునరుద్ధరించలేదు. రెగ్యులర్ రైళ్లు ఎప్పుడు వస్తాయా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. -
పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ రైళ్లు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠీ ఒక ప్రకటనలో తెలిపారు. ►డిబ్రూఘడ్–కన్యాకుమారి(05906) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 27 నుంచి ప్రారంభమై ప్రతి శనివారం రాత్రి 7.25 గంటలకు డిబ్రూఘడ్లో బయలుదేరి మూడో రోజు ►(సోమవారం) మధ్యాహ్నం 3.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 3.55 గంటలకు బయలుదేరి మంగళవారం రాత్రి 10 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. ►ఈ స్పెషల్ ఎక్స్‌ప్రెస్(05905) తిరుగు ప్రయాణంలో కన్యాకుమారిలో మార్చి 4 నుంచి ప్రారంభమై ప్రతి గురువారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, మరసటి రోజు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి అర్ధరాత్రి 12.10 గంటలకు బయలుదేరి ప్రతి ఆదివారం రాత్రి 8.50 గంటలకు డిబ్రూఘడ్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైల్ 1–సెకండ్ ఏసీ, 4–థర్డ్ ఏసీ, 11–స్లీపర్ క్లాస్, 3–సెకండ్ క్లాస్, 1 పాంట్రీకార్, 2–జనరేటర్ మోటార్ కార్స్ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది. చదవండి: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన తహసీల్దార్ పనులన్నీ మానేసి.. గ్రామస్తులంతా కదిలొచ్చి -
ఎక్కడా ఆంక్షల్లేవు.. మరి ప్యాసింజర్‌కు రైళ్లేవి?
ఎన్నికల సభలు జరుగుతున్నాయి.. వేల మంది హాజరవుతున్నారు.. థియేటర్లలో పక్కపక్కనే కూర్చుని సినిమా చూస్తున్నారు.. బస్సుల్లో తిరిగే విషయంలోనూ ఎలాంటి నిబంధనలు లేవు.. మార్కెట్లలో ఎంతమంది జనం ఉంటున్నారో అసలు లెక్కే లేదు.. ఎక్కడా ఆంక్షల్లేవు.. ఎవరిలోనూ కోవిడ్ భయం లేదు.. జనజీవనం దాదాపుగా సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేసింది.. కానీ, రైళ్ల విషయంలో మాత్రం ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్పెషల్ పేరుతో ఎక్స్‌ప్రెస్, ప్రీమియం కేటగిరీ రైళ్లనే తిప్పుతూ ప్యాసింజర్ రైళ్లను మాత్రం పక్కన పెట్టేసింది. సభల నుంచి సినిమాల వరకు అన్నింటా ఆంక్షలు ఎత్తివేస్తూ కోవిడ్ జాగ్రత్తలు పాటించమని చెబుతున్న కేంద్రం.. ఎంతోమందిని గమ్యస్థానం చేర్చే రైళ్ల విషయంలో అందుకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరి స్తోంది? అన్నదే సగటు ప్రయాణికుడి ప్రశ్న. సాక్షి, హైదరాబాద్/సికింద్రాబాద్: సికింద్రాబాద్.. కాచిగూడ..నాంపల్లి.. ఇవీ రాష్ట్రంలో ప్రధాన రైల్వేస్టేషన్లు. కోవిడ్‌కు ముందు ఈ స్టేషన్లలో ఎప్పుడు చూసినా ప్రయాణికుల రద్దీ కనిపిస్తూనే ఉండేది. లాక్డౌన్ సమయం మినహాయిస్తే ఇప్పుడు ప్రయాణాల విషయంలో దాదాపు ‘సాధారణ పరిస్థితి’వచ్చేసింది. ప్రజలు రాకపోకలతో బిజీగా మారిపోయారు. కానీ రైల్వేస్టేషన్లు మాత్రం బోసిపోయే ఉంటున్నాయి. కోవిడ్ నిబంధనలు క్రమంగా సడలిస్తూ సాధారణ పరిస్థితి కలిగేలా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రైళ్లను నడిపే విషయంలో భిన్నంగా వ్యవహరిస్తుండటం ప్రయాణికులకు శాపంగా మారింది. దీంతో బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ కూడా పూర్తిస్థాయిలో సర్వీసులు నడిపిస్తోంది. తొలుత సిటీ బస్సులను పరిమితంగా నడిపిన ఆ సంస్థ.. ఇప్పుడు వాటిని కూడా దాదాపు పూర్తిస్థాయిలో నడుపుతోంది. కానీ రైల్వే మాత్రం ఒక్క ప్యాసింజర్ రైలును కూడా నడపటంలేదు. హైదరాబాద్ నుంచి ఇతర పట్టణాలకు తిరిగే డెమూ మెమూ రైళ్లతోపాటు ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ఆపరేట్ చేయడంలేదు. కేవలం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్రీమియం కేటగిరీ రైళ్లలో కొన్నింటిని కోవిడ్ స్పెషల్ రైళ్లు, పండగల ప్రత్యేక రైళ్ల పేరుతో నడుపుతోంది. ఇవి జనం అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. ఒక్క ప్యాసింజర్ రైలు కూడా లేదు.. రాష్ట్రం నుంచి 250 వరకు ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. వీటిలో 180కి పైగా దక్షిణమధ్య రైల్వేకు సంబంధించినవి కాగా, మిగతావి ఇతర జోన్లలో మొదలై దక్షిణమధ్య రైల్వే మీదుగా నడిచేవి. అల్పాదాయ వర్గాలకు చెందినవారంతా ఎక్కువగా వీటిపైనే ఆధారపడతారు. అయితే, ఈ రైళ్లలో ఒక్కటి కూడా ఇప్పుడు నడవడంలేదు. ఇక సాధారణ రోజుల్లో సగటున నిత్యం 303 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం కేటగిరీ రైళ్లు నడిచేవి. వీటిలో ప్రస్తుతం నిత్యం సగటున 179 మాత్రమే నడుస్తున్నాయి. ఇవన్నీ పండగ ప్రత్యేక రైళ్లు, కోవిడ్ స్పెషల్ రైళ్ల పేరుతో తిరుగుతున్నాయి. రద్దీ మార్గాల్లోనే తక్కువ.. హైదరాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడ, నర్సాపూర్, కాకినాడ, గుంటూరు వైపు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతుంటాయి. వీటిలో విజయవాడకు నిత్యం సగటున 30 వరకు రైళ్లు తిరిగేవి. కానీ ప్రస్తుతం పది మాత్రమే నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్టణానికి దాదాపు 25 రైళ్లు (అన్నీకలిపి) ఉంటాయి. వాటిలో ఇప్పుడు 13 మాత్రమే తిరుగుతున్నాయి. చెన్నైకి ఐదు రైళ్లుండగా.. ఇప్పుడు రెండే వెళుతున్నాయి. బెంగుళూరుకు ఐదుకు గాను ఒక్కటే తిరుగుతోంది. ఇలా రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో కూడా చాలా తక్కువ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. తిరుపతికి నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉండగా ప్రస్తుతం అన్నింటినీ తిప్పుతున్నారు. తిరుపతికి భక్తుల తాకిడి పెరగడంతోనే వాటిని పునరుద్ధరించారు. ముంబైకి నగరం నుంచి ఐదు రైళ్లు నిత్యం ఉండగా నాలుగు నడుస్తున్నాయి. ఢిల్లీకి మూడు రైళ్లు ఉండగా.. మూడింటినీ తిప్పుతున్నారు. రద్దీ ఉండటం లేదంటున్న రైల్వే.. ఇప్పుడు నడుపుతున్న రైళ్లలో రద్దీ అంతగా ఉండటం లేదని, కొన్నింటికి తప్ప వెయిటింగ్ లిస్ట్ ఉండటం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో రైళ్లను పునరుద్ధరించాల్సిన అవసరం లేదన్న భావన వారి మాటల్లో వ్యక్తమవుతోంది. ‘అన్ని రైళ్లను పునరుద్ధరిస్తే తిరిగి అన్ని స్టేషన్లు కిటకిటలాడటం ఖాయం. రైళ్లు లేకపోవడంతోనే ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అన్ని రైళ్లను నడిపితే అవి కిటకిటలాడి మళ్లీ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే వాటిని తిప్పటం లేదు’అని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అయితే, సినిమాహాళ్లు కిటకిటలాడితే కేసులు పెరుగుతాయనే భయం లేనప్పుడు.. రైళ్ల విషయంలోనే ఈ ఆంక్షలెందుకు అనేది సగటు ప్రయాణికుడి ప్రశ్న. రైళ్లు పూర్తిస్థాయిలో తిరగకపోవటంతో ట్రాక్‌కు సంబంధించిన పనులను రైల్వే ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాక్‌కు సంబంధించి పనులు కొలిక్కి తేచ్చేందుకు కొంతకాలం ప్రయాణికుల రైళ్లను తక్కువగా నడపాలని భావించి ఉండొచ్చన్న విమర్శలు ఉన్నాయి. ప్రయాణికుల రైళ్లతో రైల్వేకు నష్టమే వస్తోందని.. అందువల్లే లాభాలొచ్చే సరుకు రవాణా రైళ్లను గతంలోకంటే ఎక్కువగా తిప్పుతున్నారని కూడా అంటున్నారు. అయితే, అధికారులు వీటిని కొట్టిపడేస్తున్నారు. రైల్వే బోర్డు అనుమతిస్తే రైళ్లు నడిపేందుకు సిద్ధం: గజానన్ మాల్యా ‘కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో రైళ్లను నడపటం లేదు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ రైళ్లను నడుపుతున్నాం. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 60 శాతం తిప్పుతున్నాం. మిగతా రైళ్లను నడపటమనేది జోన్ పరిధిలో లేదు. రైల్వే బోర్డు అనుమతిస్తే నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంఎంటీఎస్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది’అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఇటీవల ఓ సమావేశంలో పేర్కొన్నారు. జనరల్ ప్రయాణాలు అనుమతించాలి భువనేశ్వర్ వెళ్లేందుకు రైలు ఏమైనా ఉందేమో అని స్టేషన్‌కు వచ్చాను. కనీసం లోనికి కూడా అనుమతించడం లేదు. బస్సులో వెళదామంటే కళ్లు తిరిగే చార్జీలు చెబుతున్నారు. సాధారణ ప్రయాణాలు అనుమతించి మాలాంటి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి. – విశాల్, సికింద్రాబాద్ ప్లాట్‌ఫామ్ టికెట్ ఇవ్వడంలేదు మా అమ్మను ట్రైన్ ఎక్కించేందుకు స్టేషన్‌కు వచ్చాను. ఆమెకు చదువు రాదు. పైగా వృద్ధురాలు. సహాయంగా లోపలకు వెళ్లడానికి ప్లాట్ ఫామ్ టికెట్లు ఇవ్వడం లేదు. ఇక్కడ మహిళలు, వృద్ధులు ఒంటరిగానే ప్లాట్‌ఫామ్‌ల మీదకు వెళ్లాల్సి వస్తోంది. ఫ్లాట్‌ఫామ్ టికెట్లు ఇస్తే బాగుంటుంది. – దినేశ్, అమీర్‌పేట్ రాయితీలు పునరుద్దరించాలి ప్రత్యేక రైళ్ల పేరుతో అన్ని రకాల రాయితీలను నిలుపుదల చేశారు. వికలాంగులు మొదలు సీనియర్ సిటిజన్లు ఇతరత్రా రాయితీలు ఏమీ లేవు. దీంతో ప్రయాణికులు నష్టపోతున్నారు. ప్రత్యేక రైళ్లలో కూడా రాయితీలు ఇవ్వాలి. – నరేశ్, కూకట్పల్లి అన్ని కౌంటర్లు తెరవాలి రిజర్వేషన్ కన్ఫామ్ కాని పక్షంలో టికెట్ రద్దు చేయించుకునేందుకు నగరంలోని అన్ని రైల్వే కౌంటర్లను అందుబాటులోకి తేవాలి. రైలు బయటుదేరేందుకు అరగంట లోపే టికెట్ రద్దు చేసుకునే అవకాశం ఉండడం, రద్దు చేయించుకోవడం కోసం అందరూ సికింద్రాబాద్ రిజర్వేషన్ కౌంటర్‌కు రావడం ఇబ్బందిగా ఉంది. – ప్రమోద్‌కుమార్, మియాపూర్ బస్సులో నాగ్‌పూర్‌కు రూ.1500 అడుగుతున్నారు ఉపాధి కోసం నాగ్‌పూర్ నుంచి నగరానికి వలస వచ్చాను. ఇప్పుడు సొంతూరు వెళ్లాలంటే రైళ్లు లేవు. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో వెళదామని స్టేషన్‌కు వచ్చాను. కానీ జనరల్ బోగీలు లేవంటున్నారు. బస్సులో టికెట్‌కు రూ.1500 అడుగుతున్నారు. ఎప్పుడూ రైలులో రూ.200కే వెళ్లేవాడిని. –నితీష్, నాగ్‌పూర్ రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం మధ్యప్రదేశ్ వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి నేరుగా బస్సులు లేవు. మారుతూ మారుతూ బస్సుల్లో మా ఊరు వెళ్లాలంటే బోలెడు ఖర్చుపెట్టక తప్పదు. కూలి పనులతో సంపాదించిన సొమ్మంతా బస్సులకే పెట్టాలి. రిజర్వేషన్ టికెట్ ఉంటేగానీ రైలు ఎక్కనీయడంలేదు. ప్రభుత్వం త్వరగా అన్ని రైళ్లూ నడిపితే బాగుంటుంది. – అభి, ఉమరై, మధ్యప్రదేశ్ -
తిరుపతి –బిలాస్పూర్, పూరీల మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి–బిలాస్ పూర్ ప్రత్యేక రైలు(07481) ఈ నెల 7వ తేదీ నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలు దేరుతుంది. సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుని, మరుసటి రోజు సాయంత్రం 5.25 గంటలకు బిలాస్పూర్ చేరు కుంటుంది. తిరుగు ప్రయాణంలో (07482) 9వ తేదీ నుంచి ప్రతి మంగళ, శనివారాలలో మధ్యాహ్నం 3.35గంటలకు బిలాస్పూర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55కి విజయవాడ చేరుకుని, అదే రోజు రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి–పూరి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07479) 8వ తేదీ నుంచి ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి, సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుని, మరుసటి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు పూరి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07480) 10వ తేదీ నుంచి ప్రతి సోమ, బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు పూరిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11.55కి విజయవాడ చేరుకుని, అదే రోజు రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. చదవండి: ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా?.. -
ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పు..
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరి«ధిలో నడుస్తున్న పలు స్పెషల్ రైళ్ల వేళలు మారినట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్పు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయన్నారు. ►రాయగడ–విశాఖపట్నం (08507) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రోజూ ఉదయం 5.45 గంటలకు రాయగడలో బయల్దేరి అదే రోజు ఉదయం 10గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08508) విశాఖపట్నంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.05 గంటలకు రాయగడ చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, పార్వతీపురం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. ►పలాస–విశాఖపట్నం (08531) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు పలాసలో ఉదయం 5గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 9.25గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08532) విశాఖలో ప్రతిరోజు సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి రాత్రి 10గంటలకు పలాస చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళంరోడ్డు, తిలారు, నౌపడ స్టేషన్లలో ఆగుతుంది. -
సంక్రాంతికి సొంతూరు వెళ్లడం కష్టమే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న నగరవాసులకు ప్రత్యేక రైళ్లు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా నమోదవుతోంది. వచ్చే జనవరి నెలాఖరు వరకు అన్నింటిలోనూ రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. కొత్తగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లడం సాధ్యం కాదు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే సుమారు 80 రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను, మరో 120కు పైగా ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దశల వారీగా పరిమితంగా ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. డిమాండ్ పెరిగినా రైళ్లు పరిమితమే.. సికింద్రాబాద్–న్యూఢిల్లీ, బెంగళూర్–న్యూఢిల్లీ మధ్య కేవలం రెండు సర్వీసులతో కోవిడ్ అన్‌లాక్ నిబంధనల మేరకు రైళ్లను పునరుద్ధరించారు. ఆ తరువాత జూన్ నాటికి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూరు, ముంబయి, దానాపూర్, తదితర ప్రాంతాలకు 22 జతల రైళ్లను పునరుద్ధరించారు. రెగ్యులర్ రైళ్లను పునరుద్ధరించకుండా దశలవారీగా ప్రత్యేక రైళ్లనే అన్ని రూట్లలో నడుపుతున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తారు. రోజుకు 200లకు పైగా రైళ్లు ఈ మూడు స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి. అన్‌లాక్ 4.0, అన్‌లాక్ 5.0 తరువాత ప్రయాణికుల రద్దీ పెరిగింది. సుమారు 1.6 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు ప్రయాణం కోసం ఎదురు చూస్తుండగా 76 రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో అన్నింటిలోనూ వెయిటింగ్ లిస్టు భారీగా నమోదవుతోంది. (చదవండి: డీలక్స్ బస్సుకు సెలవు!) అరకొరగా పండుగ రైళ్లు... ప్రతి సంవత్సరం సంక్రాంతి రద్దీ మేరకు దక్షిణమధ్య రైల్వే వందల కొద్దీ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. కానీ ఈ సారి క్రిస్మస్, సంక్రాంతి, శబరి ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని 64 రైళ్లను మాత్రమే పెంచారు. కోవిడ్ ఆంక్షల నెపంతో రైళ్లను తగ్గించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (02728)లో జనవరి 10, 11, 12 తేదీల్లో వరుసగా 300, 340, 399 చొప్పున వెయిటింగ్ లిస్టు ఉంది. సికింద్రాబాద్ మీదుగా ముంబయి నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ (01019,), సికింద్రాబాద్–ఫలక్‌నుమా (02724) రైళ్లలో ఈ మూడు రోజుల పాటు వెయిటింగ్ లిస్టులో బుకింగ్‌కు కూడా అవకాశం లేకుండా ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. సికింద్రాబాద్–విశాఖ (07016)ఎక్స్‌ప్రెస్‌లో జనవరి 10 నుంచి 12 వరకు వరుసగా 189, 208, 235 చొప్పున వెయిటింగ్ లిస్టు నమోదైంది. సికింద్రాబాద్–మచిలీపట్నం (02750) ఎక్స్‌ప్రెస్‌లో 10వ తేదీన 84, 11న 92, 12వ తేదీన 110 చొప్పున ఉంది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (02794)లోనూ వెయిటింగ్‌లిస్టు 97 పైనే ఉంది. నిబంధనల మేరకే ప్రత్యేక రైళ్లు కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని రైళ్ల నిర్వహణ కొనసాగుతోంది. రైల్వేబోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుపుతున్నాం. ఈ ఏడాది సంక్రాంతికి అంతగా డిమాండ్ ఉండకపోవచ్చునని భావిస్తున్నాం. – సీహెచ్ రాకేష్, సీపీఆర్వో, దక్షిణమధ్య రైల్వే -
దయచేసి వినండి.. ప్రత్యేక రైళ్ల వేళల్లో మార్పులు
సాక్షి, విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ నడుపుతున్న కొన్ని ప్రత్యేక రైళ్లలో తేదీలు, బయలుదేరే సమయం, చేరుకునే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయా రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను కొనసాగించుకోవాలని పేర్కొన్నారు. చదవండి: విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు ► భువనేశ్వర్–తిరుపతి ప్రత్యేక వారాంతపు రైలు (08479) ఈ నెల 12 నుంచి 26 వరకూ ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి బయలుదేరుతుంది. తిరుపతికి ఉదయం 8.45కి బదులు 8.10కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08480) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12.15కి బదులు 10.25కి తిరుపతిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 9.30కి బదులుగా 5.55కే చేరుకుంటుంది. ► భువనేశ్వర్–చెన్నై సెంట్రల్ ప్రత్యేక వారాంతపు రైలు (02839) ఈ నెల 17 నుంచి 31 వరకూ ప్రతి గురువారం ఉదయం 12 గంటలకు బదులుగా 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులు 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02840) ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకూ ప్రతి శుక్రవారం రాత్రి 9.10కి బదులు 10 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 5.25కి బదులు ఉదయం 5.55కి చేరుకుంటుంది. ► భువనేశ్వర్–బెంగళూరు ప్రత్యేక వారాంతపు రైలు (02845) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 7.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. బెంగళూరుకు ఉదయం 10.50కి బదులు 9.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02846) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 8.25కి బదులు సాయంత్రం 4.45కి బెంగళూరులో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 11.15కి బదులుగా సాయంత్రం 6.15కి చేరుకుంటుంది. ► భువనేశ్వర్–పుదుచ్చేరి ప్రత్యేక వారాంతపు రైలు (02898) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. పుదుచ్చేరికి మధ్యాహ్నం 12.40కి బదులుగా 12.10కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02897) ఈ నెల 16 నుంచి 30 వరకూ ప్రతి బుధవారం సాయంత్రం 4.45కి పుదుచ్చేరిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కి సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. ► భువనేశ్వర్–రామేశ్వరం ప్రత్యేక వారంతపు రైలు (08496) ఈ నెల 11 నుంచి 25 వరకూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. రామేశ్వరానికి రాత్రి 11 గంటలకు బదులు 10.35కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08495) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 8.40కి బదులుగా 8.50కి రామేశ్వరంలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. ► పూరి–చెన్నై సెంట్రల్ ప్రత్యేక వారాంతపు రైలు (02859) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం సాయంత్రం 5.30కి పూరిలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు మధ్యాహ్నం 2.55కి బదులు 1.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02860) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం సాయంత్రం 4.25కి చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. పూరీకి మధ్యాహ్నం 3.15కి బదులుగా 1.45కే చేరుకుంటుంది. ► విశాఖపట్నం–హజ్రత్ నిజాముద్దీన్ ప్రత్యేక రైలు (02851) ఈ నెల 11 నుంచి 28 వరకూ ప్రతి సోమ, శుక్రవారం ఉదయం 8.20కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. హజ్రత్ నిజాముద్దీన్‌కు సాయంత్రం 5.10కి బదులు 5 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02852) హజ్రత్ నిజాముద్దీన్‌లో ఉదయం 5.50కి బదులు 5.10కి బయలుదేరుతుంది. విశాఖపట్నానికి సాయంత్రం 5.30కి బదులుగా 2.15కే చేరుకుంటుంది. ► విశాఖపట్నం–చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు (02869) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం రాత్రి 7.05కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులుగా 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02870) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం రాత్రి 9.10కి బదులుగా ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 10.30కి బదులుగా రాత్రి 10.30కి చేరుకుంటుంది. ► విశాఖపట్నం–కడప ప్రత్యేక రైలు (07488) ఈ నెల 12 నుంచి 31 వరకూ ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. కడపకు ఉదయం 7.25కి బదులు 7 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07487) ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.05కి బదులు 5.45కి కడపలో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 11.30కి చేరుకుంటుంది. -
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలో మచిలీపట్నం–యశ్వంతపూర్ ప్రత్యేక రైలు(07211) ఈ నెల 9 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్ర వారాలలో మధ్యాహ్నం 3.50 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07212) మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.05 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. కాకినాడ–బావానగర్ టెర్మినస్ ప్రత్యేక రైలు(07204) ఈ నెల 10 నుంచి ప్రతి గురువారం ఉదయం 5.15 గంటలకు కాకినాడలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.55 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07203)ఈ నెల 12 నుంచి ప్రతి శనివారం ఉదయం 4.25 గంటలకు బావానగర్ టెర్మినస్‌లో బయలుదేరుతుంది. కాకినాడ పోర్టు–లోకమాన్యతిలక్ ప్రత్యేక రైలు(07221) ఈ నెల 9 నుంచి ప్రతి బుధ, శనివారాలలో ఉదయం 9 గంటలకు కాకినాడ పోర్టులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11గంటలకు లోకమాన్యతిలక్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07222) ఈ నెల 10 నుంచి ప్రతి గురు, ఆదివారాలలో మధ్యాహ్నం 1.20 గంటలకు లోకమాన్యతిలక్‌లో బయలుదేరుతుంది. చదవండి: ఏపీ పోలీస్‌కి అవార్డుల పంట -
అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు స్టేషన్లలోకి అనుమతించడం లేదని, రిజర్వేషన్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. పండుగ సమీపిస్తున్న తరుణంలో సోమవారం ‘సాక్షి’తో మాట్లాడిన సీపీఆర్వో రాకేష్ పలు విషయాలు వెల్లడించారు. స్టేషన్లో ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, రైల్వే స్టేషన్లో బుకింగ్ సదుపాయం ఉందని, ఆన్లైన్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఏసీ బోగీల్లో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వడం లేదన్న ఆయన, భోజనం కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటే మంచిదని సూచించారు. అయితే క్యాటరింగ్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణీకులంతా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, స్టేషన్లో నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. -
మరిన్ని పండుగ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని మరిన్ని ప్రత్యేక రైళ్ల వేళలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వాటి వివరాలు, వేళలు ఇవీ.. కాచిగూడ–మైసూరు: ఈ నెల 20 నుంచి నవంబర్ 29 వరకు డెయిలీ సర్వీసు. కాచిగూడలో రాత్రి 7.05కు బయలుదేరి మరుసటి ఉదయం 9.30కి మైసూరు చేరుకుంటుంది. (21 నుంచి) మైసూరులో సాయంత్రం 3.15కు బయలుదేరి మరుసటి సాయంత్రం 5.40కి కాచిగూడ చేరుతుంది. ఇది జడ్చర్ల, మహబూబ్‌నగర్, అనంతపురం, బెంగళూరు మీదుగా ప్రయాణిస్తుంది. హైదరాబాద్–జైపూర్: సోమ, బుధవారాల్లో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 25 వరకు. హైదరాబాద్‌లో రాత్రి 8.35కు బయలుదేరుతుంది. జైపూర్–హైదరాబాద్: బుధ, శుక్రవారాల్లో ఈ నెల 23 నుంచి నవంబర్ 27 వరకు. ఈ ప్రత్యేక రైలు జైపూర్‌లో మధ్యాహ్నం 3.20కి బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్ మీదుగా ప్రయాణిస్తుంది. హైదరాబాద్–రాక్సౌల్: ఈ ప్రత్యేక రైలు ఈ నెల 22 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఇది హైదరాబాద్‌లో రాత్రి 11.15కు బయలుదేరుతుంది. రాక్సౌల్–హైదరాబాద్: ఈ నెల 25 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఇది రాక్సౌల్‌లో తెల్లవారుజామున 3.25కు బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కాజీపేట, బల్లార్షా మీదుగా ప్రయాణిస్తుంది. బరౌనీ–ఎర్నాకుళం: ఈ ప్రత్యేక రైలు ఈ నెల 21 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. ఇది బరౌనీలో రాత్రి 10.50కి బయలుదేరుతుంది. బల్లార్షా, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది. ఎర్నాకుళం–బరౌనీ: ఈ నెల 25 నుంచి నవంబర్ 29 వరకు ఆదివారాల్లో నడుస్తుంది. ఎర్నాకులంలో ఉదయం 10.15కు ప్రారంభమవుతుంది. బల్లార్షా, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది. విశాఖపట్నం–హజ్రత్ నిజాముద్దీన్: ఈ నెల 23 నుంచి శుక్ర, సోమవారాల్లో విశాఖలో ఉదయం 8.20కి బయలుదేరుతుంది. వరంగల్, బల్లార్షా మీదుగా ప్రయాణిస్తుంది. నిజాముద్దీన్–విశాఖపట్నం: ఇది ఈ నెల 25 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి బుధ, ఆదివారాల్లో ఢిల్లీలో ఉదయం 5.50కి బయలుదేరుతుంది. బల్లార్షా, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది. చదవండి: దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు -
తెలుగు రాష్ట్రాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైల్వేల నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. లింగంపల్లి - కాకినాడ, సికింద్రాబాద్ -షాలిమర్ ట్రైన్స్‌కు రైల్వే శాఖ అనుమతిచ్చింది. వీటితో పాటు.. సికింద్రాబాద్- విశాఖ, విశాఖ -తిరుపతి రైళ్లు నడిపేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. చదవండి : ఏపీ: ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే.. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకుల రైళ్లు నిలిచిపోయాయి. ఆపై అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లకు అనుమతించిన రైల్వే శాఖ ఈనెల 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా ఊపగా, మరో 39 రైళ్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఎప్పటినుంచి రాకపోకలు సాగిస్తాయనే వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించనుంది. -
ఏపీ: ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రైళ్ల రాకపోకలు వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి అందుబాటులో ఉండే రైళ్ల సర్వీసులు, రైళ్లు నిలిచే స్టేషన్లను ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా రైలు ప్రయాణాలకు భారీ డిమాండ్, ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే.. ►సికింద్రాబాద్-హౌరా, హౌరా-సికింద్రాబాద్ (డైలీ) - పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట ►సికింద్రాబాద్-గుంటూరు, గుంటూరు-సికింద్రాబాద్(డైలీ)- నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి ►(తిరుపతి-నిజామాబాద్, నిజామాబాద్-తిరుపతి)-రేణిగుంట, కోడూరు, రాజాంపేట, ఎర్రగుంట్ల, ముద్దునుర్, తాడిపత్రి, గూటి ►(హైదరాబాద్-విశాఖ, విశాఖ- హైదరాబాద్)- తాడేపల్లిగూడెం, నిడదవోలు,అనపర్తి,సామర్లకోట, పిఠాపురం,అన్నవరం,తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి,దువ్వాడ ఇతర జోన్లలో ప్రత్యేక రైళ్లు.. ►జైపూర్- మైసూర్ (సోమ-బుధ) - కర్నూల్ సిటీ,డోన్,ధర్మవరం ►మైసూర్-జైపూర్(గురు-శని)- ధర్మవరం,డోన్,కర్నూల్ సిటీ.. ►గోరకపూర్ యశ్వంత్ పూర్(సోమ-శని)- ధర్మవరం ►యశ్వంత్ పూర్ గోరకపూర్(సోమ-గురు) ధర్మవరం.. ►ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- చప్రా(సోమ-శని)- గూడూరు ►చప్రా-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (సోమ-బుధ)- గూడూరు.. ►ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూ ఢిల్లీ డైలీ- గూడూరు,చీరాల,తెనాలి, ►న్యూ ఢిల్లీ-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ డైలీ- తెనాలి,చీరాల గూడూరు -
శ్రామిక్ రైళ్లలో 97 మంది వలస కార్మికులు మృతి!
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ సొంత ఊర్లకు తరలించేందుకు కేంద్రం శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రామిక్ స్పెషల్ రైళ్లలో సంభవించిన మొత్తం మరణాల వివరాలపై శుక్రవారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. స్వస్థలాలకు వెళ్లే క్రమంలో మొత్తం 97 మంది వలస కార్మికులు శ్రామిక్ రైళ్లలో ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. (గుడ్ న్యూస్ : మరో 40 స్పెషల్ రైళ్లు ) కాగా ఇటీవల వలస కార్మికుల మరణాల గురించి తమ వద్ద ఎలాంటి లెక్కలు లేవని కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై ప్రతిపక్షలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో కేంద్ర తొలిసారిగా శ్రామిక్ రైళ్లలో సంభవించిన మరణాల లేక్కలను రాజ్యసభలో ప్రకటించింది. అయితే, ఆయా రాష్ట్రాల పోలీసులు వీటిని అసహజ మరణాలుగా పరిగణిస్తూ సెక్షన్ 174 కింద కేసులు నమోదు చేశారని కేంద్రమంత్రి తెలిపారు. మొత్తం కేసుల్లో 87 కేసులకు సంబంధించి మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించినట్లు వెల్లడించారు. అందులో 51 కేసుల్లో బాధితులు గుండె పోటు, లివర్, ఊపరితిత్తుల సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు లాంటి కారణాలతో మరణించినట్టు తేలింది. (నాడు గాలికి వదిలేసి.. ఇప్పుడు రమ్మంటే) -
గుడ్ న్యూస్ : మరో 40 స్పెషల్ రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా రైలు ప్రయాణాలకు భారీ డిమాండ్, ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రైల్వేశాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. అన్‌లాక్-4 మార్గదర్శకాలతో ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం (నిన్న) ప్రకటించింది. 'క్లోన్ రైళ్లు' పథకం కింద 40 ప్రత్యేక రైళ్లను (20 జతల రైళ్ల సర్వీసులను) సెప్టెంబరు 21 నుంచి నడుపుతున్నట్టు వెల్లడించింది. తద్వారా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులకు, సాధారణ రైళ్లలో రిజర్వేషన్లు పొందలేని వారికి ప్రయోజనం కలుగుతుందని ప్రకటించింది. అయితే ఈ స్పెషల్ రైళ్లు భారీ డిమాండ్ ఉన్న నిర్దిష్ట మార్గాల్లోనే నడపబోతున్నట్టు తెలిపింది. క్లోన్ రైళ్లన్నీ రిజర్వ్డ్.. కావున ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని, అలాగే ఇవి కొన్ని స్టేషన్లల్లోనే మాత్రమే ఆగుతాయని రైల్వే తెలిపింది. గమనించాల్సిన ముఖ్యాంశాలు : ఈ రైళ్లు ఇప్పటికే సర్వీసులో ఉన్న310 ప్రత్యేక రైళ్లకు అదనం క్లోన్ రైళ్లు ప్రధానంగా 3 ఏసీ రైళ్లు ,ఇప్పటికే నడుస్తున్న ప్రత్యేక రైళ్ల కంటే ముందు నడుస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రైలు కంటే క్లోన్ రైలు వేగం ఎక్కువ. ఈ రైళ్లకు రిజర్వేషన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 10 రోజులు సికింద్రాబాద్ - దానాపూర్ (రైలు నెంబర్ 02787/02788) బెంగళూరు -దానపూర్ (రైలు నెంబర్ 06509/06510) యశ్వంత్‌పూర్ -నిజాముద్దీన్ (రైలు నం. 06523/06524) తదితర రైళ్లు ఇందులో ఉన్నాయి. Considering the huge demand for travel on specific routes, Ministry of Railways has decided to run 20 pairs of Clone Special trains from 21.09.2020. These Clone trains will run on notified timings. ARP for these trains will be 10 days.https://t.co/wTHauZw2IB pic.twitter.com/TlUrSmtCdW — Ministry of Railways (@RailMinIndia) September 15, 2020 -
నీట్ ప్రత్యేక రైళ్లు, షాక్ తిన్న అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పరీక్ష కోసం వేసిన ప్రత్యేక రైలును చూసి డెహ్రాడూన్ అధికారులు ఖంగుతిన్నారు. ఆదివారం నీట్ పరీక్ష జరగగా కోవిడ్ పరిస్థితుల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది పడకుండా కేంద్రం వారి కోసం ప్రత్యేకరైళ్లను సిద్దం చేసిన విషయం తెలిసిందే. అయితే పరీక్షకు హాజరుకావడానికి విద్యార్థులకు పరీక్షలు చేయడానికి వచ్చిన రైల్వే సిబ్బందికి మొండి చేయ్యె ఎదురయ్యింది. డెహ్రాడూన్‌లో మొత్తం 18 పరీక్ష సెంటర్లు, రూర్కీలో 12 పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే చాలా తక్కువ మంది ఆ రైలులో ప్రయాణించారు. కేవలం 21 మంది మాత్రమే ఈ రైళ్ల ద్వారా ప్రయాణించారు. దీని గురించి డెహ్రాడూన్ రైల్వే అధికారి మాట్లాడుతూ, ప్రత్యేక రైలును ఎక్కువ మంది విద్యార్థులు వినియోగించుకోలేదు. కోవిడ్ కారణంగా జాగ్రత్తగా ఉండటం కోసం వారు తమ సొంత వాహనాలను వినియోగించినట్లు తెలుస్తోంది. పరీక్షల కోసం ప్రత్యేక రైలును నడుపుతున్న రైల్వే శాఖ వీటి కోసం చాలా డబ్బును వెచ్చించింది. అయితే కేవలం రూ. 1040 మాత్రమే ఈ రైళ్ల ద్వారా ప్రభుత్వానికి లభించాయి. చదవండి: నీట్‌పై వ్యాఖ్యలు : చిక్కుల్లో హీరో సూర -
12 నుంచి 24 ప్రత్యేక రైళ్లు
సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఈ నెల 12 నుంచి రైళ్లను పెంచనున్నారు. కోవిడ్–19 కారణంగా ఇప్పటి వరకు 14 ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపిన రైల్వేశాఖ.. ఇక నుంచి 24 రైళ్లకు పెంచాలని నిర్ణయించింది. రైళ్లలో రాకపోకలకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆక్యుపెన్సీ 70 నుంచి 80శాతం ఉంటోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ► డివిజన్ పరిధిలోని ఒక్కో జిల్లాలో ఒకొక్క స్టేషన్లో మాత్రమే రైలు ఆగుతుంది. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం (ఒంగోలు), నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. ► షెడ్యూల్ రైళ్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. గతంలోలా ఈ 24ను ప్రత్యేక రైళ్లగానే నడుపుతారు. ముందుగానే రిజర్వేషన్లు ఇస్తారు. ► రైలులో ఎక్కేందుకు గంట ముందుగానే రావాల్సి ఉంటుంది. కరోనా పరీక్షలు చేసిన తరువాతనే రైలులోకి అనుమతిస్తారు. బోగీలు శానిటైజేషన్ తరువాతనే ప్రయాణీకుల్ని అనుమతిస్తున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు తప్పని సరిగా వాడాలనే నిబంధన పెట్టారు. 12వ తేదీ నుంచి నడిచే 24 రైళ్లు ఇవే..... ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– చాప్రా (02669), ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– న్యూఢిల్లీ(02615), హౌరా–సికింద్రాబాద్ (02703), విశాఖపట్నం–న్యూఢిల్లీ (02805), హౌరా–యశ్వంత్‌పూర్ (02245), భువనేశ్వర్–ముంబై(01020), తిరుచ్చిరాపాలి –హౌరా (02664), దానాపూర్– కెఎస్ఆర్ బెంగళూరు (02296), చాప్రా–ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02670), గుంటూరు– సికింద్రాబాద్ (07201), హౌరా–తిరుచ్చిరాపాలి (02663), ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– న్యూఢిల్లీ (02433), బెంగళూరు కంటోన్మెంట్–గౌహతి (02509), ముంబై–భువనేశ్వర్(01019), న్యూఢిల్లీ–ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02434), సికింద్రాబాద్–గుంటూరు (07202), గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్ (02510), సికింద్రాబాద్–హౌరా (02704), కెఎస్ఆర్ బెంగళూరు–దానాపూర్ (02295), యశ్వంత్‌పూర్–హౌరా (02246), న్యూఢిల్లీ–విశాఖపట్టణం (02806), హైదరాబాద్– విశాఖపట్టణం (02728), న్యూఢిల్లీ –ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02616), విశాఖపట్నం– హైదరాబాద్ (02727). -
12 నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల సౌకర్యార్థం మరికొన్ని స్పెషల్ రైళ్లు ఈ నెల 12వ తేదీ నుంచి దేశ్యవ్యాప్తంగా నడుపనున్నారు. వీటిలో ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, వాల్తేర్ డివిజన్ పరిధి విశాఖ నుంచి, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రైల్వే బోర్డు ఇటీవల ప్రకటించింది. ఈ స్పెషల్ రైళ్లకు రిజర్వేషన్ ఈ నెల 10వ తేదీనుంచి ప్రారంభమవుతుందని వాల్తేర్ డివిజనల్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కే.త్రిపాఠి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: నన్ను కాపాడి నువ్వెళ్లిపోయావా..) ప్రత్యేక రైళ్ల వివరాలు... ►విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం (08518/8517) డైలీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 12వ తేదీ నుంచి విశాఖలో ప్రారంభమై ప్రతిరోజు రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ నుంచి కోర్బాలో ప్రారంభమై ప్రతిరోజు సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్ రైలు రానుపోను విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, కేసింగ, టిట్లాఘడ్, కంటాబంజి, ఖరియార్ రోడ్, మహాసముంద్, రాయ్‌పూర్, టిల్డా నియోరా, భతపరా, బిలాస్పూర్, అకల్తరా, జంజ్‌గిరినైలా, చంపా స్టేషన్లలో ఆగుతుంది. (చదవండి: గాజువాక సీఐకి నూతన్ నాయుడు ఫోన్..) విశాఖ మీదుగా నడిచే రైళ్లు ►తిరుచ్చిరాపల్లి–హౌరా–తిరుచ్చిరాపల్లి( 02664 / 02663) వీక్లీ స్పెషల్ రైలు ఈ నెల 15 నుంచి ప్రారంభమై ప్రతి మంగళ, శుక్రవారాలలో సాయంత్రం 4.20గంటలకు తిరుచ్చిరాపల్లిలో బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో హౌరాలో 17 నుంచి ప్రారంభమై ప్రతి గురు, ఆది వారాలలో సాయంత్రం 4.10గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్ రైలు రానుపోను విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్లలో ఆగుతుంది. ►గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్–గౌహతి(02509 / 02510) ట్రై వీక్లి స్పెషల్ రైలు గౌహతిలో 13 నుంచి ప్రారంభమై ప్రతి ఆది, సోమ, మంగళవారాలలో ఉదయం 6.20గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్లో 16 నుంచి ప్రారంభమై ప్రతి బుధ, గురు, శుక్రవారాలలో రాత్రి 11.40గంటలకు బయల్దేరుతుంది. ఈ స్పెషల్ రైలు రానుపోను రన్‌గియా, న్యూ జల్పయ్గురి, మాల్డా టౌన్, హౌరా, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్ కియోంఝర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఇతర ముఖ్య స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ స్పెషల్ రైళ్లకు టికెట్స్ రిజర్వేషన్ కౌంటర్స్ వద్ద, ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లభ్యమవుతాయని, కేవలం కన్ఫర్మ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులను మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తారని సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు. -
12 నుంచి మరో 80 రైళ్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో నిలిచిపోయిన మరికొన్ని రైళ్లకు రైల్వే శాఖ పచ్చ జెండా ఊపింది. ఈ నెల 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లలో రిజర్వేషన్ సౌకర్యాన్ని 10 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాను న్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 230 రైళ్లు నడుస్తున్నాయి. వాటికి అదనంగా మరో 80 రైలు సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నట్టుగా రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదన్ శనివారం చెప్పారు. రైలు సర్వీసుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, మొదట్లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న రైళ్లలో ఈ మధ్య కాలంలో వెయిటింగ్ లిస్టులు పెరిగిపోతున్నాయని యాదవ్ తెలిపారు. వెయిటింగ్ లిస్ట్‌లు మరింతగా పెరిగిపోతే క్లోన్ రైళ్లను కూడా నడుపుతామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్లివే.. రైల్వేశాఖ ఈ నెల 12 నుంచి నడపనున్న 80 ప్రత్యేక రైళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైళ్లివే.. సికింద్రాబాద్ – దర్భంగా (07007); దర్బంగా– సికింద్రాబాద్ (07008); బెంగళూరు – గువాహటి (02509); గువాహటి – బెంగళూరు (02510); కోర్బా – విశాఖపట్నం (08517); విశాఖ– కోర్బా (08518); హైదరాబాద్ – పర్బణి (07563); పర్బణి – హైదరాబాద్ (07564). -
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్తను అందించింది. అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు రైల్వేబోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి రిజర్వేషన్లు ప్రక్రియ సైతం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో రైళ్లు నడిపేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. రైళ్ల జాబితా కోసం ఇక్కడి క్లిక్ చేయండి.. -
ప్రత్యేక రైళ్లకు అన్‌లాక్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ మేరకు త్వరలో మరిన్ని రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేపట్టింది. అన్‌లాక్ 4.0 అమలు దృష్ట్యా ప్రత్యేక రైళ్లపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని రైల్వేబోర్డు జోన్లకే అప్పగించింది. వివిధ రూట్లలో ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని రైళ్లను నడపాలని సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి ప్రతిరోజు 22 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా రద్దీ ఉన్న మార్గాల్లో మరో 15 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా రెగ్యులర్ రైళ్ల స్థానంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్ బోగీలతోపాటు సాధారణ బోగీల్లోనూ ముందుగా బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది. లాక్డౌన్ నిబంధనలను సడలించి తొలివిడత సికింద్రాబాద్–న్యూఢిల్లీ, బెంగళూర్–న్యూఢిల్లీల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్ నుంచి ముంబై, విశాఖ, హౌరా, దానాపూర్, విజయవాడ, తిరుపతి రూట్లలో కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. మొదట్లో వివిధ ప్రాంతాల మధ్య చిక్కుకుపోయిన ప్రయాణికుల రాకపోకలతో అనూహ్యమైన రద్దీ నెలకొంది. ఆ తరువాత కొద్ది రోజులపాటు కరోనా ఉధృతి బాగా తీవ్రం కావడంతో రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. తిరిగి కొంతకాలంగా వివిధ రూట్లలో ప్రయాణికుల డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 25వేల మంది వరకు రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని రైళ్లలో 100కు పైగా వెయిటింగ్ లిస్టు నమోదుకావడం గమనార్హం. ప్రత్యేక రైళ్లు నడిచే మార్గాలివే... కరోనాతో సహజీవనం తప్పనిసరిగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రయాణికులు భయాందోళనలను పక్కన పెట్టి వివిధ మార్గాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఒక రైలు మాత్రమే ఉంది. కానీ, ప్రయాణికుల డిమాండ్ బాగా ఉండటంతో ఈ రూట్లో మరో సర్వీసును ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పట్నాకు, హౌరాకు ఒక్కో రైలు నడుస్తోంది. ఇపుడున్న రైళ్లలో 100కు పైనే వెయిటింగ్ లిస్టు నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రూట్లలోనూ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. సికింద్రాబాద్–చెన్నై మధ్య రైళ్లు లేవు. ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడపడం కోసం దక్షిణమధ్య రైల్వే, దక్షిణ రైల్వేల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాచిగూడ నుంచి బెంగళూరుకు మరో సర్వీస్ నడపనున్నారు. ప్రస్తుతం కాచిగూడ స్టేషన్ నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు నడిచే రైలు సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న 22 ప్రత్యేక రైళ్లతోపాటు మరో 15 వరకు కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎంఎంటీఎస్‌పై పునరాలోచన... ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లు కూడా నడపాలని అధికారులు ఆలోచిస్తున్నారు. డిమాండ్ ఉన్న ఒకటి, రెండు రూట్లలో ఎంఎంటీఎస్ నడపాలని భావిస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజు 121 సర్వీసులు నడుస్తాయి. రోజుకు 1.5 లక్షల మంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి రూట్లో ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలనే ఆలోచన ఉంది. -
త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లు
న్యూఢిల్లీ: కరోనా ముప్పు నేపథ్యంలో.. అన్ని రెగ్యులర్ రైళ్లను నడపడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాకపోవచ్చని శుక్రవారం రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ పేర్కొన్నారు. అయితే, త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నామన్నారు. సొంతూళ్లకు వెళ్లిన వలస కూలీలు మళ్లీ ఉపాధి కోసం నగరాల బాట పట్టడం సంతోషకరమని, ఆర్థిక రంగం కుదుటపడుతోందనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఆక్యుపెన్సీని పరిశీలిస్తున్నామని, రాష్ట్రాలు కోరితే మరిన్ని సమకూర్చేందుకు సిద్ధమేనని తెలిపారు. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి శ్రామికులు ఎక్కువగా తాము గతంలో పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారన్నారు. జూన్ 25 వరకు మొత్తం 4,594 శ్రామిక్ రైల్ సర్వీసులను నడిపామని, మే 1వ తేదీ నుంచి మొత్తం 62.8 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామని వివరించారు. కోవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కోచ్‌ల నిర్వహణ, ఆహారం, సిబ్బందికి రక్షణ పరికరాలు.. తదితరాల కోసం ఒక్కో కోచ్‌కు సుమారు రూ.2 లక్షలు ఖర్చు అయిందని వీకే యాదవ్ వెల్లడించారు. ఇప్పటికి 5,213 ఐసోలేషన్ కోచ్‌లను ఏర్పాటు చేశామని, నిధులు కేంద్ర కోవిడ్ కేర్ ఫండ్ నుంచి అందాయని తెలిపారు. -
చిన్నారి ఏడుపు.. పాలు అందించిన పోలీస్
రాంచీ : కరోనా ఓ వైపు మానవాళిపై మృత్యు ఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ప్రజల నుంచి మానవత్వం పరిమళిస్తోంది. లాక్డౌన్లో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఎంతో మంది అండగా ఉంటూ తనదైన సాయం అందిస్తున్నారు. ఇలాంటి ఎన్నో అపురూప దృశ్యాలు మన కంటికి తారసపడతునే ఉన్నాయి. తాజాగా అలాటి ఓ సన్నివేశం మరోసారి కంటపడింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుందిది. నాలుగు నెలల పిల్లవాడితో మెహరున్నీసా అనే మహిళ బెంగుళూరు నుంచి గోరఖ్‌పూర్‌కు శ్రామిక్ రైల్లో ప్రయాణం చేస్తోంది. రైలు హటియా రైల్వే స్టేషన్లో ఆగడంతో శిశువు పాల కోసం ఏడవడంతో తల్లి తన పిల్లవాడి కోసం పాలు కావాలని స్థానికంగా ఉన్న అధికారులను కోరింది. (‘సెల్యూట్ పోలీస్.. మీపై గౌరవం పెరిగింది’) మెహరున్నీసా దీన స్థితిని స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సుశీల అనే మహిళా పోలీస్ అధికారి(ఏఎస్సై) తెలుసుకుంది. ఆమె ఇల్లు స్టేషన్‌కు సమీపంలో ఉండటంతో తన ఇంటికి వెళ్లి శిశువు కోసం సీసాలో పాలు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాంచీ పోలీస్ అధికారులు ట్విటర్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్లో పోలీసు అధికారి పాల సీసాను మెహరున్నీసాకు అందించిన ఫోటోను కూడా రాంచీ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా గత నెలలో ఇలాంటి ఘటనే భోపాల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైలులో గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారికి ఆర్పీఎఫ్ జవాన్ పాల ప్యాకెట్ కొని తెచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. (చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే! ) दिनांक 14 जून 2020 को हटिया रेलवे स्टेशन पर ट्रेन संख्या 06563 बेंगलुरु से गोरखपुर जाने वाली श्रमिक स्पेशल ट्रेन का सुबह 06:00 बजे आगमन हुआ. इस ट्रेन से यात्रा कर रही एक महिला यात्री (नाम- मेहरून्निसा )ने स्टेशन पर कार्यरत रेल सुरक्षा बल की महिला कर्मचारी ASI, श्रीमती 1/2 pic.twitter.com/KVj52XEYZp — DRM Ranchi (@drmrnc) June 14, 2020 -
నాడు గాలికి వదిలేసి.. ఇప్పుడు రమ్మంటే
నగరంలో కార్మికుల కొరత ఇప్పటికే సొంతూళ్లకు 13 లక్షల మంది వలస కార్మికులు తిరిగి రప్పించేందుకు యాజమాన్యాల ప్రయత్నాలు మంచి వేతనం..వసతి హామీలతో రప్పించే యత్నం కొందరి సుముఖం.. బుక్కాని రైలు టికెట్లు సాక్షి,సిటీబ్యూరో: అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులను తిరిగి రప్పించేందుకు వివిధ రంగాల యాజమాన్యాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే కార్మికులు తిరిగి రావడం అంత సులభం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇబ్బందులు పడి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి రావాలంటే రైళ్లల్లో రావాల్సిందే. అయితే అందుకు తగ్గట్లుఏర్పాట్లు యాజమాన్యాలు చేయడం కష్టమే. సొంతంగా వారు వచ్చే పరిస్థితి లేదు.అయితే కొందరు కార్మికులుమాత్రం రోడ్డుమార్గం ద్వారా వస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సరిహద్దు మినహా మిగతా రాష్ట్రాల వైపు నుంచి రాకపోకలపై ఆంక్షలు నెలకొంది. హైదరాబాద్ మహానరంతో పాటు శివారు ప్రాంతాల్లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న సుమారు 13 లక్షల మంది వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు.(‘నరకం కంటే దారుణంగా ఉన్నాయి’) నాడు గాలికి వదిలేసి.... వాస్తవంగా ఉపాధి నిమిత్తం లేబర్ కాంట్రాక్టర్ (టేకేధార్) ద్వారా స్వస్థలాల నుంచి పనులు చేసే ప్రాంతాలకు, తిరిగి వేళ్లేటప్పుడు రైల్వే స్టేషన్ల వరకు చేర్చే బాధ్యత కూడా టేకేధార్లు నిర్వర్తిస్తారు.లాక్డౌన్ కష్ట కాలంలో ఇటూ యాజమాన్యం పట్టించుకోక పోగా, టేకేధార్లు కూడా పత్తా లేకుండా పోయారు. దీంతో వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో వారిని గాలికొదిలేసిన యాజమాన్యాలు తిరిగి మళ్లీ పిలవడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోగా.. ఇప్పుడు మీ అవసరం కోసం రమ్మంటున్నారా అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మంచిజీతం, వసతి, వైద్య ఆరోగ్య సేవల సదుపాయాలను సమకూర్చుతామని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని హామీ వచ్చిన తరువాతే కొందరు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణాలు కష్టమే... సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులకు మంచి వేతనం, సదుపాయాలను ఇస్తామని యాజమాన్యాలు చెబుతుండటంతో స్వస్థలాల్లో పనులువదులుకొని తిరిగి వచ్చేందుకు కార్మికులు సిద్ధమవుతున్నా ప్రయాణాలు సాధ్యం కాని పరిస్ధితి నెలకొంది. ఆధార్ అడ్రస్ ఆధారంగా రైలు టికెట్ బుక్ కావడంలేదు. ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చే పరిస్థితి లేదు. -
కరోనా ఎక్స్‌ప్రెస్ వ్యాఖ్యలపై దీదీ స్పందన
కోల్‌కతా : కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తోసిపుచ్చారు. వలస కూలీలను స్వస్ధలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లను కరోనా ఎక్స్‌ప్రెస్‌గా దీదీ వ్యాఖ్యానించడం వలస కూలీలను అవమానించడమేనని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దీదీ మౌనం వీడారు. కరోనా ఎక్స్‌ప్రెస్ వ్యాఖ్యలే మమతా బెనర్జీ రాజకీయ పతనానికి నాందిగా అమిత్ షా పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై దీదీ స్పందిస్తూ తాను కరోనా ఎక్స్‌ప్రెస్ అని ఎన్నడూ అనలేదని..ప్రజలు ఇలా అంటున్నారని మాత్రమే తాను చెప్పానని ఆమె గుర్తు చేశారు. లాక్‌డౌన్‌తో వలస కూలీల కష్టాలపై రాష్ట్రాలు స్పందించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. ఫేస్బుక్ లైవ్‌లో ఆమె మాట్లాడుతూ తొలుత వలస కూలీల రైళ్లపై తమ అభ్యంతరాలను అపార్థం చేసుకున్నారని చెప్పారు. ప్రత్యేక రైళ్లలో కిక్కిరిసిన జనంతో కరోనా వైరస్ మరింత విస్తరిస్తుందనే ఉద్దేశంతోనే రైలు సర్వీసులను వ్యతిరేకించామని, వలస కూలీల తరలింపులో రైల్వేలు భౌతిక దూరం పాటించే నిబంధనలను పక్కనపెట్టాయని అన్నారు. స్వస్ధలాలకు వలస కూలీల చేరికతో పలు రాష్ట్రాల్లో కరోనావైరస్ కసులు పెరిగాయని గుర్తుచేశారు. వలస కూలీల దుస్ధితిపై కేంద్రం తీరును దీదీ తప్పుపట్టారు. లాక్డౌన్ ప్రకటించకముందే వలస కూలీలను ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో తరలిస్తే అప్పుడు ఈ కార్మికులు మూడు నెలల పాటు ఇబ్బందులు ఎదుర్కొనేవారు కాదని అన్నారు. తమ రాష్ట్రంలో వలస కూలీలు ఎక్కడికీ వెళ్లాలని అనుకోవడం లేదని మమతా బెనర్జీ అన్నారు. చదవండి: ఇంత బీభత్సమా.. షాకయ్యాను -
శ్రామిక్ రైళ్లను అడగడం లేదేంటి?
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికుల్ని వారి రాష్ట్రాలకు పంపేందుకు రైల్వేశాఖ కోరిన వెంటనే శ్రామిక్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎం దుకు ఆ అవకాశాల్ని వినియోగించుకోవడం లేదని హై కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 1 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు కావాలని దరఖాస్తు చేయలేదని రైల్వేశాఖ తరఫు న్యాయవాది చెప్పడంతో హైకోర్టు పైవిధంగా ప్రశ్నించింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల తరలింపునకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వాటి సంబంధిత ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రిటైర్డ్ లెక్చరర్ జీవన్‌కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. ఒక్క రోజులోనే శ్రామిక్ రైలు ఏర్పా టు చేస్తామని కేంద్రం చెబుతున్నా రాష్ట్రంలోని ఒక్క జిల్లా కలెక్టర్ కూడా దరఖాస్తు చేయకపోవడంపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తంచేసింది. దీనిపై పూర్తి వివరాలు బుధవారం జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. వివిధ జిల్లాల్లోని ఇటుక బట్టీ కార్మికులు 9 వేల మంది వరకూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో రైల్వేప్లాట్ ఫారాలు, రైళ్లు కిక్కిరిసిపోయాయని పిటిషనర్ న్యాయవాది వసు ధా నాగరాజ్ కోర్టు దృష్టికి తెచ్చారు. జూన్ 1 నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారని, బిహార్‌కు ఒక్క రైలును మాత్రమే నడపడంతో 24 బోగీలూ కిటకిటలాడుతూ వెళ్లాయన్నారు. దీనిపై స్పందించిన ధర్మా సనం, ఆహారం, వసతి, వై ద్యం, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించాలని తా ము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తామిచ్చే ఉత్తర్వులు ప్రజాహితం కో సమేనని, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా కారాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. çకరోనాపై పి ల్స్ దాఖలైతే అవి ప్రభుత్వానికి వ్యతిరేకం కాబోవని, ప్రజాహితంగా చూడాలని సూచించింది. ప్రభు త్వ వాదనలతో కౌంటర్ దాఖలు చేసినట్టు అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. విచారణ నేటికి వాయి దా పడింది. -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో భారీ క్యూలైన్లు
-
రేపటి నుంచి పట్టాలెక్కనున్న రైళ్లు
-
రేపటి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు
సాక్షి, విజయవాడ : రేపటి(సోమవారం) నుంచి స్పెషల్ ట్రైన్లు పట్టాలెక్కనున్నాయి. పరిమిత సంఖ్యలో రైళ్ల రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ మీదుగా పద్నాలుగు రైళ్లు నడవనున్నాయి. విజయవాడ నుంచి ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ విజయవాడ స్టేషన్లో అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. నాలుగు నెలల ముందునుంచే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రయాణికులు గంటన్నర ముందుగానే స్టేషన్ రావాలని రైల్వే శాఖ సూచించింది. ప్రతీ ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించింది. ధర్మో స్కానింగ్ చేసిన తర్వాత టికెట్ ఉన్న వారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతించనున్నారు అధికారులు. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు గమ్యస్థానం చేరాక అక్కడి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది. చదవండి : ఏపీ నుంచి సొంత రాష్ట్రాలకు 86,863 మంది వలస కార్మికులు -
రైల్వే రిజర్వేషన్; తాజా అప్డేట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రైళ్లకు సంబంధించి ఇటీవల విధించిన నిబంధనలను రైల్వే మంత్రిత్వ శాఖ సవరించించింది. టిక్కెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును మళ్లీ 120 రోజులకు పెంచింది. అలాగే తత్కాల్ సేవలను పునరుద్ధరించింది. ఇది ఈనెల 31 తేదీ ఉదయం 8 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కరెంట్ బుకింగ్, తత్కాల్ కోటా సీట్ల కేటాయింపులు సాధారణ టైం టేబుళ్ల రైళ్లకు వర్తించే విధంగానే ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. (ప్రయాణికుల ప్రత్యేక రైళ్లు ఇవే) కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్న లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలు ప్రయాణికుల రైళ్లను నిలిపివేశారు. ఈ నెల 12 నుంచి 30 ప్రత్యేక రాజధాని రైళ్లను నడుపుతున్నారు. జూన్ 1 నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ 230 రైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును అంతకుముందు 30 రోజులకు పరిమితం చేయగా, తాజాగా ఈ నిబంధనను సవరించి 120 రోజులకు పెంచారు. అలాగే పార్సిల్, లగేజీ బుకింగ్‌కు కూడా అనుమతి పునరుద్ధరించారు. (కోవిడ్ టెన్షన్; గంటకో మరణం!) విశాఖలో ఇలా.. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి వచ్చేవారు 8వ నంబరు ప్లాట్‌ఫాంకు రావాల్సి ఉంటుంది. 1వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు. విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు జూన్ 1న వైజాగ్ నుంచి బయలుదేరుతుంది. న్యూఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు జూన్ 3 నుంచి పట్టాలెక్కుతుంది. హైదరాబాద్- విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్ జూన్ 1 నుంచి రాకపోకలు సాగించనుంది. విశాఖ- హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ జూన్ 2 నుంచి పునఃప్రారంభమవుతుంది. రైలు బయలుదేరే సమయానికి 2 గంటలు ముందగానే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఆహార ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలని తెలిపింది. (కార్మికుల రైలు బండికి ‘టైం టేబుల్’ లేదట!) -
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు!
న్యూఢిల్లీ : ‘తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేళ్ల లోపు, 65 ఏళ్ల పైబడని వారెవ్వరు కూడా అత్యవసరం అయితే తప్పించి శ్రామిక రైళ్లలో ప్రయాణించరాదు’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రజలకు శుక్రవారం వెల్లడించారు. ప్రయాణికుల అందరి భద్రతకు రైల్వే సిబ్బంది అండగా నిలుస్తారని ఆయన ట్వీట్ చేశారు. గత సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజుల్లోనే శ్రామిక రైళ్లలో 9 మంది ప్రయాణిలు మరణించిన అసాధారణ పరిస్థితుపై గోయల్ స్పందించారు. (కరోనా: 9వ స్థానానికి ఎగబాకిన భారత్ ) దేశవ్యాప్తంగా వలస కార్మికులను తమ స్వగ్రామాలకు పంపించేందుకు తాము ప్రతి రోజూ ప్రత్యేక శ్రామిక రైళ్లను నిర్వహిస్తున్నామని, అయితే కొంత మంది అనారోగ్యంతో బాధ పడుతున్న వారు కూడా ఈ రైళ్లలో ప్రయాణించడం వల్ల దురదష్టవశాత్తు వారు మత్యువాత పడ్డారని రైల్వే శాఖ అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మధుమేహం, గుండె జబ్బులతో బాధ పడుతున్న రైల్వే ప్రయాణికులకు ట్యాబ్లెట్లు వేసుకునేందుకు కనీసం మంచినీరు కూడా దొరక్కపోవడంతో వారు మరణించారని మతుల బంధువులు వాపోయారు. (భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు! ) ఎండలు తీవ్రమైన నేపథ్యంలో మంచినీళ్ల అవసరం మరింత పెరిగిందని వలస కార్మికులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సాయం ఏది అవసరమైనా తమ 138, 139 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. వలస కార్మికులకు ఉచిత ప్రయాణం కల్పించడంతోపాటు ఉచితంగా అన్న పానీయాలను అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానదేనంటూ సుప్రీం కోర్టు శుక్రవారం ఉత్తర్వులు చేయడం గమనార్హం. (భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు) -
కార్మికుల రైలు బండికి ‘టైం టేబుల్’ లేదట!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం విధించిన నాలుగవ విడత లాక్డౌన్ కూడా మరో మూడు రోజుల్లో ముగియనుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా వలస కార్మికులు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 29వ తేదీన నిర్ణయించి నేటికి దాదాపు నెల రోజులవుతోంది. అయినప్పటికీ వలస కార్మికుల తండాలు తరలి పోవడం ఇంకా పూర్తి కాలేదు. ప్రహసనం కొనసాగుతూనే ఉంది. (శ్రామిక రైళ్లలో అన్న పానీయాలు కరవు) వలస కార్మికుల తరలింపునకు రైళ్లను అనుమతిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, ఆ బాధ్యతను మాత్రం రాష్ట్రాల సమన్వయానికి వదిలేసింది. ఆ విషయంలో సమస్యలు తలెత్తడం, ఆ సమస్యలపై ప్రతిపక్షం ప్రధానంగా విరుచుకు పడడంతో తప్పనిసరిగా కేంద్రం రంగంలోకి దిగాల్సి వచ్చింది. అప్పుడు కూడా వలస కార్మికుల టిక్కెట్ చార్జీలను ఎవరు భరిస్తారన్నది సమస్యగా పరిణమించిది. రాష్ట్రాలే భరించాలని చెప్పిన కేంద్ర రైల్వే శాఖ అందుకు పక్కా ప్రణాళికను రూపొందించలేక పోయింది. టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామంటూ, తొలుత, వారిని మాత్రమే అనుమతించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకొని కార్మికుల టికెట్ ఖర్చులను తాము భరిస్తామంటూ ముందుకు వచ్చింది. ఆ విషయంలో ఆ పార్టీ కూడా ఆలస్యంగానే స్పందించింది. రైళ్ల షెడ్యూల్‌ను సకాలంలో సరిగ్గా ఖరారు చేయక పోవడం, దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్‌కు వలస కార్మికులు వేలాదిగా తరలి రావడం, ప్రకటించిన రైళ్లు రోజుల తరబడి ఆలస్యంగా బయల్దేరడం, రైళ్లలో అన్న పానీయాలు అందుబాటులో లేక పోవడంతో గురువారం నాటికి గడచిన 48 గంటల్లో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించడం తెల్సిందే. బీహార్‌లోని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫారమ్ మీద చనిపోయిన తల్లి శవం మీద కప్పిన దుప్పటిని లాగుతూ ఆమెను లేపేందుకు ప్రయత్నిస్తున్న పసి బాలుడు ఉదంతం వీడియో రూపంలో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆకలి, అన్నార్థుల చావులను కేంద్రం ఖండిస్తోంది. చనిపోయిన వారంతా వృద్ధులు, రోగులంటూ పేర్కొంది. మంచినీళ్లు దొరికే చోట కాకుండా నీళ్లు దొరకని చోట గంటలకొద్దీ రైళ్లను ఆపడం వల్లనే తాము ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నామని రైల్వే ప్రయాణికులు పలు చోట్ల మీడియాతో వాపోయారు. టైమ్ టేబుల్ లేక పోవడం వల్ల రైళ్లను విధిలేక ఆపాల్సి వస్తోందని, అన్న పానీయాలను అందించడం తమ డ్యూటీ కాదని, అది పౌర అధికారులు, ఎన్జీవో సంస్థల బాధ్యతని రైల్వే ఉన్నతాధికారులు తెలియజేశారు. రైలు టిక్కెట్లకు డబ్బుల్లేక, ఉన్నా అవి ఎప్పుడొస్తాయే, ఎప్పుడు వెళ్తాయో తెలియకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డు మార్గాన దొరికిన వాహనాల్లో, కాలినడకన ప్రాణాలకు తెగించి పోతున్న దృశ్యాలను చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్రమాదాల్లో (పట్టాలపై పడుకున్న కూలీల మీది నుంచి గూడ్సు బండి దూసుకుపోవడం సహా) దాదాపు రెండు వందల మంది మరణించినట్లు జాతీయ మీడియా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో మే 31వ తేదీన ముగియనున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా? లేదా పొడిగిస్తారా? అన్న అంశంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. (కరోనా కన్నా అవే ప్రమాదకరం) -
‘అమిత్ షా.. మీరే రంగంలోకి దిగొచ్చుగా?’
కోల్‌కతా: కరోనా విషయంలో బీజేపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య విమర్శలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కార్మికుల తరలింపు, లాక్డౌన్ అమలు విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదన్న అమిత్ షా విమర్శలపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘లాక్డౌన్ అమలును పర్యవేక్షించేందుకు అమిత్ షా కేంద్రం బృందాలను కేవలం బెంగాల్‌కు మాత్రమే పంపించారు. సరే మంచిదే. మా ప్రభుత్వం సరిగా పని చేయడం లేదని మీరు భావిస్తున్నారు కదా.. అలాంటపప్పుడు మీరే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తే బాగుంటుంది కదా. ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు’ అని అమిత్ షాను ప్రశ్నించారు దీదీ. అంతేకాక లాక్డౌన్ సమయంలో రైళ్లు, విమనాలు తిరిగేందుకు అనుమతివ్వడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు బెంగాల్‌కు రావడం పట్ల కూడా మమత ఆందోళన వ్యక్తం చేశారు. (రైల్వేల తీరుపై దీదీ ఫైర్) రాబోయే 24 గంటల్లో, మహారాష్ట్ర మీదుగా బెంగాల్‌కు 36 శ్రామిక్ రైళ్లు వచ్చే అవకాశం ఉంది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘ఇప్పటికే దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాజస్తాన్, మహారాష్ట్రాల నుంచి వలస కార్మికులు బెంగాల్ వస్తున్నారు. ఫలితంగా ఇక్కడ కరోనా కేసులు పెరుగుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో నేనేం చేయాలి? అందుకే ప్రధాని మోదీనే స్వయంగా ఇక్కడ పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాను’ అన్నారు దీదీ. అయితే ఇంత అకస్మాత్తుగా బెంగాల్‌కు వలస కూలీల రైళ్లను పంపడం.. తనను కలవరపరిచేందుకు కేంద్రం చేస్తున్న రాజకీయ కుట్రగా ఆమె పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఇబ్బంది పెట్టెందుకే బీజేపీ ఇలా చేస్తుందని మమత ఆరోపించారు. కేంద్ర తనను ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నం వల్ల.. బెంగాల్ ప్రజలు నష్టపోతారని తెలిపారు. బీజేపీ తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం గురించి కాక వలస రైళ్ల గురించి ప్రణాళికలు చేస్తే బాగుంటుందని మమత సూచించారు.(మమత సర్కారు కీలక నిర్ణయం) -
రైల్వేల తీరుపై దీదీ ఫైర్
కోల్‌కతా : రైల్వే మంత్రిత్వ శాఖ వలస కూలీల కోసం ముందస్తు సమాచారం లేకుండా రైళ్లను పంపుతూ తమ ప్రభుత్వం చేపట్టే కరోనా కట్టడి చర్యలకు విఘాతం కలిగిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దుయ్యబట్టారు. కరోనా వైరస్‌ను మహారాష్ట్ర నుంచి బెంగాల్‌కు వ్యాప్తి చేస్తూ ఇరు రాష్ట్రాలతో రైల్వేలు రాజకీయంగా చెలగాటమాడుతున్నాయని దీదీ ఆరోపించారు. ఈ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని ఆమె అభ్యర్ధించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఇలా ఎందుకు చేస్తోందో తనకు అర్ధం కావడం లేదని మమతా బెనర్జీ మండిపడ్డారు. శ్రామిక్ రైళ్ల చార్జీలు రాష్ట్రాలు భరిస్తున్నా రైల్వేలు భౌతిక దూరం సహా కోవిడ్-19 నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. తాను తుపాన్, కరోనా వైరస్‌లతో పోరాడాలో, రాజకీయాలతో పోరాడాలో చెప్పాలని కోరారు. దేశవ్యాప్తంగా 225 రైళ్లు బెంగాల్‌కు చేరుకోవాల్సి ఉండగా వీటిలో 41 రైళ్లు కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర నుంచి రానున్నాయి. ఇప్పటికి కేవలం 19 రైళ్లే వచ్చినా వలస కూలీలు అధికంగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, నార్త్ దినాజ్‌పూర్ ప్రాంతాల్లో కూలీలు స్వస్ధలాలకు చేరడంతో కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని రైళ్లు బెంగాల్‌కు చేరుకుంటే రాష్ట్రం కరోనా హాట్‌స్పాట్‌గా మారుతుందని బెంగాల్ ప్రభుత్వం భయపడుతోంది. చదవండి : ఇంత బీభత్సమా.. షాకయ్యాను -
కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?
తిరువనంతపురం : ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు కేంద్ర ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్ల నిర్వహణపై కేరళ ప్రభుత్వం అభ్యతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే శ్రామిక రైళ్ల విషయంలో వలస కార్మికులను తరలించేందుకు సరిపడా రైళ్లను సమకూర్చడం లేదని మహారాష్ట్ర కేంద్రంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా కేరళ స్పందిస్తూ.. ముందస్తు సమాచారం లేకుండానే రాష్ట్రంలోకి రైళ్లను పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని ద్వారా కరోనా వైరస్ నియంత్రణకు పాటిస్తున్న ప్రోటోకాల్ దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో కరోనా వైరస్‌కు కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మార్చాలని రైల్వే వ్యవస్థ కోరుకుంటోందని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆరోపించారు. (మటన్ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు) ఈ మేరకు ఆయన.. ‘గత వారం ముంబై నుంచి రైలు వచ్చింది. రైలు ప్రారంభమయ్యాక దాని గురించి మాకు సమాచారం ఇచ్చారు. షెడ్యూల్లోని లేని స్టాప్‌లో ఆపారు. ప్రయాణీకుల్లో ఎక్కువ మందికి పాస్‌లు లేవు. మహమ్మారి కాలంలో రైల్వే ఆరాచకంగా చేస్తోంది. కేరళలో సూపర్ స్ర్పైడర్ అవ్వాలని రైల్వే కోరుకుంటుంది. ఇలా చేయడం మాని బాధ్యతగా వ్యవహరించండి. కనీసం రైళ్లను ట్రాక్ చేయడానికైనా ప్రయత్నంచండి’ అని థామస్ ట్వీట్ చేశారు. ఇప్పటికే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని, ఈ విషయం గురించి జాతీయ మీడియా సైతం ప్రస్తావించారని అన్నారు. ముంబై నుంచి కేరళకు చేరుకున్న రైలు గురించి అసలు సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. (వారి భవిష్యత్‌కు నా పెట్టుబడి : సీఎం జగన్) A train came from Mumbai last week. We were intimated only after train started . Unscheduled stops. Majority of passengers no passes. Anarchy in pandemic times.Railways want to be super spreader in Kerala. Stop ranting and behave responsibly. At least try to track your trains. — Thomas Isaac (@drthomasisaac) May 26, 2020 వలస కార్మికులు తిరిగి సొంత రాష్ట్రానికి రావడంపై తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అయితే దీనిపై ముందస్తు సమాచారం అందించాలని కోరారు. తమకు సమాచారం ఇవ్వకుండానే ముంబై నుంచి రైలు వచ్చిందన్నారు. దీని గురించి రైల్వే మంత్రితో చర్చించామని అయినప్పటికీ చెప్పకుండానే మరో రైలు కేరళకు వచ్చిందన్నారు. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమస్య గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇక రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 895 కి చేరింది. వీరిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన 72 మంది, తమిళనాడు నుంచని వచ్చిన 71 మంది, కర్ణాటక నుంచి వచ్చిన 35 మంది ఉన్నారు. మంగళవారం కేరళలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. (కేరళ ఆఫర్‌కు ఓకే చెప్పిన 'మహా' సర్కార్) -
సొంతూళ్లకు వలస కార్మికులు
-
వచ్చే10 రోజుల్లో 2,600 శ్రామిక్ రైళ్లు
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకురానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటి ద్వారా 36 లక్షల మంది వలస కార్మికులకు లాభం కలుగుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. ‘రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి బయలుదేరే శ్రామిక్ రైళ్లలో ప్రయాణించే వారి కోసం ఇప్పటికే ఉన్న వెయ్యి టికెట్ కౌంటర్లకు అదనంగా మరికొన్నిటిని ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు. 80 శాతం ఆ రెండు రాష్ట్రాలకే.. శ్రామిక్ రైళ్లలో 80 శాతం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకే వెళ్తున్నందున ఆ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని, దీనిని నివారించేందుకే కొన్ని రైళ్లను దూరమైనా సరే రద్దీలేని మార్గాలకు దారి మళ్లిస్తున్నామని యాదవ్ వెల్లడించారు. కోవిడ్ రోగుల కోసం రూపొందించిన 5,213 కోచ్‌లలో సగం వరకు ఈ రైళ్లలో వాడుతున్నామన్నారు. ప్రస్తుతానికి ఈ కోచ్‌లు ఖాళీగా ఉన్నాయనీ, కోవిడ్ బాధితుల కోసం రాష్ట్రాలు కోరితే అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘రైల్వే శాఖకు చెందిన 17 ఆస్పత్రులను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాం. ఏప్రిల్ 1– మే 22వ తేదీల మధ్య 9.7 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను రైళ్ల ద్వారా తరలించాం. మార్చి 22 నుంచి ఇప్పటి వరకు 3,255 పార్శిల్ ప్రత్యేక రైళ్లను నడిపాం’ అని వీకే యాదవ్ పేర్కొన్నారు. ‘జూన్ 1వ తేదీ నుంచి నడిచే 200 స్పెషల్ రైళ్లలో ప్రస్తుతానికి రిజర్వేషన్ ఉన్న వారికే అవకాశం కల్పిస్తున్నాం ఈ రైళ్లలో 30 శాతం టికెట్లే రిజర్వు అయ్యాయి. ప్రయాణించదలచిన వారికి 190 రైళ్లలో సీట్లు ఖాళీగా ఉన్నాయి’అని వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల్లో ఉన్న 4 కోట్ల మంది వలస కార్మికుల్లో ఇప్పటి వరకు 75 లక్షల మందిని సొంతూళ్లకు తరలించినట్లు హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. శ్రామిక్ రైళ్లలో 35 లక్షల మందిని సొంతూళ్లకు తరలించగా, మరో 40 లక్షల మంది బస్సుల్లో తమ గమ్య స్థానాలకు చేరుకున్నారని ఆమె అన్నారు. -
నెల ముందు నుంచే ‘రాజధాని’ బుకింగ్
న్యూఢిల్లీ: ఇకపై ప్రత్యేక రాజధాని రైళ్లలో టిక్కెట్లు నెల రోజుల ముందు నుంచే అందుబాటులో ఉంటాయని, రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లలోనూ కొనుగోలు చేసుకోవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది. గతంలో ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారానే ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు సహా అన్ని కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ కౌంటర్లు, యాత్రి టికెట్ సువిధ కేంద్రాలు, ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్ల ద్వారా, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గతంలో వారం ముందు నుంచి మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్‌కు అవకాశం ఉండేది. అది ఇప్పుడు 30 రోజులకు పెంచారు. అయితే, తత్కాల్ బుకింగ్‌కు అవకాశం లేదు. వెయిటింగ్ లిస్ట్ లోని వారిని ప్రయాణానికి అనుమతించరు. ప్రయాణీకుల తొలి జాబితాను రైలు ప్రారంభానికి 4 గంటల ముందు, రెండో జాబితాను 2 గంటల ముందు సిద్ధం చేస్తారు. తొలి, మలి జాబితాలను సిద్ధం చేసే మధ్య కాలంలో కరంట్ బుకింగ్ ఉంటుంది. -
ప్రయాణికుల ప్రత్యేక రైళ్లు ఇవే
సాక్షి, సికింద్రాబాద్: దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి రోజువారీ రాకపోకలు సాగించే 200 రైళ్లను (100 జతలు) రైల్వేబోర్డు ఖరారు చేసింది. జోన్లు, రూట్ల వారీగా నడిపే రైళ్లు, ప్రయాణ వేళల వివరాల్ని అన్ని జోన్ల జీఎంలకు పంపించింది. ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రూట్లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టాపులూ గతంలోలాగే ఉంటాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా నడుపుతారు. తమ జోన్లో 9 జతల రైళ్లను నడుపుతామని, మరో నాలుగు జతల రైళ్లు తమ జోన్ గుండా ప్రయాణిస్తాయని దక్షిణమధ్య రైల్వే గురువారం తెలిపింది. మొత్తం 13 జతల రైళ్ల వివరాలను వెల్లడించింది. (అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం) ప్రస్తుతం ఉన్న నిబంధనలను అనుసరించి ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌లో టిక్కెట్ జారీ చేస్తామని.. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే రైలులోకి అనుమతించబోమని పేర్కొంది. గమ్యస్థానం చేరిన తర్వాత ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ ఆరోగ్య మార్గదర్శకాలకు లోబడి ప్రయాణికులు సహకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ మాత్రమే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్‌చేసుకోవచ్చు. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు హెచ్ఓఆర్ ద్వారా టిక్కెట్లు బుక్‌చేసుకునే వీలు కల్పించింది. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్ర్య సమరయోధులు, రైల్వే, మిలటరీ, పోలీస్ వారెంట్లు, వోచర్లు, రైల్వే బోర్డు నిర్దేశించిన 4 రకా దివ్యాంగులు, 11 రకాల రోగులు విద్యార్థులు పీఆర్ఎస్(పాసింజర్ రిజర్వేషన్ సిస్టం) కౌంటర్లలో టిక్కెట్లు తీసుకోవచ్చు. -
ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వానిదే
సాక్షి, విజయవాడ/ మంగళగిరి/ తాడేపల్లిరూరల్: వలస కూలీలకు భోజనం, వసతి, వారి తరలింపునకు ప్రత్యేక శ్రామిక రైళ్ల ఏర్పాటు తదితర ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 17 ప్రత్యేక శ్రామిక రైళ్ల ద్వారా దాదాపు 20 వేల మంది వలస కూలీలను స్వరాష్ట్రాలకు చేర్చింది. డివిజన్ పరిధిలో ఈ నెల ఐదో తేదీ నుంచి దాదాపుగా ప్రతి రోజూ ఒక ప్రత్యేక శ్రామిక రైలును నడుపుతున్నారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మానవతా దృక్పథంతో వలస కూలీలకు భోజనం, వసతితో పాటు అన్ని సదుపాయాలూ కల్పించి వారిని స్వస్థలాలకు పంపాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, అసోం, మణిపూర్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను విజయవాడలోని రాయనపాడుతో పాటు నెల్లూరు, నిడదవోలు, కొవ్వూరు, ఒంగోలు రైల్వేస్టేషన్ల నుంచి రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు చేర్చుతోంది. స్వస్థలాలకు భవన నిర్మాణ కార్మికులు మంగళగిరిలోని ఎయిమ్స్‌తో పాటు కాజ, చినకాకాని, తాడేపల్లి జాతీయ రహదారి వెంట పలు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా్లలకు చెందిన 2,400 మంది కార్మికులను సోమవారం శ్రామిక రైలుతో పాటు ఆర్టీసీ బస్సుల్లో అధికారులు వారి స్వస్థలాలకు పంపారు. -
ఆ రైలు ఇకపై ఇక్కడ ఆగదు: సీఎం
పనాజి: రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికుల తరలింపు ప్రక్రియలో భాగంగా గోవా మీదుగా వెళ్తున్న ఢిల్లీ- తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్ ఇకపై రాష్ట్రంలో ఆగదని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం గోవాలో 18 మంది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చే వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. వారు ఇతర ప్రజలతో మమేకం కాకముందే జాగ్రత్త చర్యలు పాటిస్తున్నాం. అయితే ఢిల్లీ రాజధాని రైలులో ప్రయాణించిన వాళ్లలోనే ఎక్కువ మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సోమవారం నుంచి ఆ రైలును మడగావ్ స్టేషనులో ఆపవద్దని నిర్ణయించుకున్నాం’’ అని తెలిపారు.(ఎంజాయ్ చేసేందుకు ఇక్కడకు రావొద్దు: గోవా సీఎం) కాగా తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లే నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ మాత్రం గోవాలో ఆపేందుకు సమ్మతంగా ఉన్నట్లు ప్రమోద్ సావంత్ తెలిపారు. సదరు రైలులో ప్రయాణించిన వారిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని... అలాగే ఆ రైలు నుంచి అతికొద్ది మాత్రమే గోవాలో దిగారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రెడ్ జోన్ల నుంచి రాష్ట్రంలో ప్రవేశించే ట్రక్కు డ్రైవర్లకు తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇక మే 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి, హెచ్ఎస్సీ పరీక్షలను వాయిదా వేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.(స్వతంత్ర దర్యాప్తు: భారత్ సహా 62 దేశాల మద్దతు!) కాగా సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ మహమ్మారిని కట్టడి చేయడంలో గోవా ప్రభుత్వం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు నెల రోజులుగా అక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి రాకపోకలు సాగుతుండటంతో తాజాగా కేసుల సంఖ్య 18కి చేరింది. దీంతో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మరోసారి కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సమాయత్తవుతున్నారు. ఇక గోవాలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసులు నమోదు కాలేదు. (ఇది మోదీ చేసిన మూడో తప్పు : గగోయ్) -
హలో.. హ్యాపీ జర్నీ
సాక్షి, అమరావతి: ‘హలో.. హ్యాపీ జర్నీ.. స్వస్థలాలకు వెళ్తున్న మీకంతా సంతోషమే కదా? శ్రామికులకు సౌకర్యంగానే ఉందా?.. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మళ్లీ ఆనందంగా తిరిగి రావాలి.. మీ అందరి కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు’ శ్రామిక్ రైలు ప్రయాణికులకు డీజీపీ దామోదర్ గౌతమ్ సవాంగ్ ఆత్మీయ పలకరింపు ఇది. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ► లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన శ్రామికులను తరలించడం, ఏపీకి రప్పించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ► ఇప్పటివరకు 31 శ్రామిక రైళ్లను ఏర్పాటు చేశాం. మరో 22 రైళ్లు నడిపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ► లాక్‌డౌన్‌తో ఏపీలో చిక్కుకున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారికోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలును డీజీపీ సవాంగ్, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం రాత్రి ప్రారంభించారు. విజయవాడలోని రాయనపాడు స్టేషన్ నుంచి బయలు దేరిన ఈ రైలులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 1,760 మంది శ్రామికులు, విద్యార్థులు ఉన్నారు. -
నడిచి వెళ్లేవారి సంఖ్య తగ్గింది
సాక్షి, అమరావతి: మూడ్రోజులుగా రాష్ట్రం మీదుగా నడిచి వెళ్లే వలస కూలీల సంఖ్య తగ్గిపోయిందని కోవిడ్ టాస్క్ఫోర్సు చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. మొత్తం నడిచి వెళ్లే 4,661 మంది వలస కూలీలను చెక్‌పోస్టుల వద్ద ఆపి వారికి కౌన్సెలింగ్ చేసి 62 రిలీఫ్ సెంటర్లకు ఆర్టీసీ బస్సుల్లో పంపించామన్నారు. వీరిలో మన రాష్ట్రానికి సంబంధించి వివిధ జిల్లాలకు చెందిన వారు కేవలం 485 మంది మాత్రమే ఉన్నారని.. మిగిలిన 4,176 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారన్నారు. ఒడిశా సీఎస్‌తో మాట్లాడి ఆ రాష్ట్రానికి చెందిన వారిని గంజాం జిల్లాలో వదిలేందుకు ఏర్పాట్లుచేసినట్లు కృష్ణబాబు తెలిపారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ► శ్రామిక్ రైళ్లలో వలస కూలీలకు రెండు లేదా మూడు బోగీలు కేటాయిస్తున్నాం. ► ప్రకాశం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల నుంచి బస్సుల్లో 902 మందిని ఒడిశాలోని గంజాంకు చేర్చాం. మరో వెయ్యి మందికి పైగా శ్రామిక్ రైళ్లలో వివిధ రాష్ట్రాలకు పంపుతున్నాం. ► జార్ఖండ్‌కు ఐదు, పశ్చిమ బెంగాల్, యూపీ వెళ్లేందుకు ఆరు, ఒడిశా, రాజస్థాన్‌లకు రెండు, బీహార్‌కు మూడు శ్రామిక్ రైళ్లను నడపాలని నిర్ణయించాం. ► సోమవారం కూడా ఐదు రైళ్లు పంపించేందుకు నిర్ణయించాం. ► ఇప్పటివరకు 31 రైళ్లలో మొత్తం 36,823 మందిని వారివారి రాష్ట్రాలకు పంపించాం. వారికయ్యే ఖర్చు మన రాష్ట్రమే భరిస్తుంది. ► అలాగే, ఏపీకి చెందిన 1,09,742 మంది వలస కూలీలను వారి వారి జిల్లాలకు పంపించాం. ► ఇక కువైట్‌లో చిక్కుకుపోయిన 2,500 మంది ని రప్పించేందుకు సీఎం విదేశాంగ శాఖకు లేఖ రాయడంతో అక్కడ నుంచి విమానాలు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి ఫ్రీ క్వారంటైన్ సదుపాయం కల్పిస్తాం. -
24 శ్రామిక్ రైళ్లలో 27,458 మంది తరలింపు
సాక్షి, అమరావతి: వలస కూలీలు, కార్మికులు ఆందోళన చెందవద్దని, శ్రామిక్ రైళ్లకు ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు రాగానే వారిని పంపిస్తున్నట్లు కోవిడ్ టాస్క్ఫోర్సు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. వలస కూలీలకు కల్పిస్తున్న వసతులు, ప్రయాణ ఏర్పాట్లపై కృష్ణబాబు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. సరిహద్దుల్లో ఇతర భాషల్లో బ్యానర్లు.. ► గత 15 రోజులుగా రాష్ట్రంలోని జాతీయ రహదారులపై వారి రాష్ట్రాలకు వెళుతున్న 6 వేల మంది వలస కార్మికులను గుర్తించాం. సీఎం జగన్ సూచనల మేరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఒడిశా, బెంగాలీ, హిందీ భాషల్లో ‘మిమ్మల్ని మీ రాష్ట్రాలకు చేరుస్తాం’ అని బ్యానర్లు పెడుతున్నాం. ► ఇప్పటివరకు 24 శ్రామిక్ రైళ్ల ద్వారా 27,458 మంది వలస కూలీలను బిహార్, యూపీ, జార్ఘండ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లకు పంపించాం. 2 రోజుల్లో మరో 30,392 మందిని తరలిస్తాం. దారి ఖర్చుల కింద రూ.500 ► ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే కూలీలకు అన్ని సదుపాయాలు కల్పించి రూ.500 దారి ఖర్చుల కింద అందించాలని సీఎం వైఎస్ జగన్ సూచించిన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు చేశాం. వలస కూలీలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ► రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు 80,669 మంది వలస కూలీలను 2,748 ఆర్టీసీ బస్సుల్లో తరలించాం. గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 42,135 మందిని ఇతర జిల్లాలకు తరలించాం. కర్నూలు నుంచి 13,143 మందిని ఇతర జిల్లాలకు పంపించాం. -
మమత పెద్ద మనసు వారి కోసం ప్రత్యేకంగా...
కోల్కత్తా: కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పనుల కోసం సొంత ఊరిని వదిలి ఉపాధిని వెతుకుంటూ వచ్చిన వారికి ఇక్కడ ఉద్యోగం లేక ఏం చేయాలో తోచక చాలా కష్టాలు పడ్డాయి. ఎప్పుడెప్పుడు లాక్డౌన్ అయిపోతుందా ఇంటికి వెళ్లి అయిన వారిని చూసుకుందాం అని ఆశపడిన వారికి లాక్‌డౌన్‌ను మూడు సార్లు సడలించడంతో నిరాశే మిగిలింది. అందుకే చాలా మంది వలస కార్మికులు కాలినడకనే వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఇంటిని చేరకుండానే ప్రాణాలు కూడా కోల్పొయారు. అయితే వలస కార్మికులను ఇంటికి చేర్చడం కోసం కేంద్రప్రభుత్వం శ్రామిక్‌రైళ్ల పేరిట ప్రత్యేక రైళ్లను మే1 వతేదీ నుంచి అందుబాటులోనికి తెచ్చింది. అయితే వీటితో పాటు వలస కార్మికుల కోసం 105 ప్రత్యేక రైళ్లను కూడా నడిపించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ చేశారు. ఈ ప్రత్యేక ట్రైన్లు వివిధ ప్రాంతాల నుంచి త్వరలో ప్రారంభం కానున్నాయి అని మమత పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్ బెంగాల్ ప్రభుత్వం వలస కార్మికుల రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించబోము అని పేర్కొంది అని ఆరోపించిన ఒక్కరోజు తరువాతే మమత ఈ ప్రకటన చేయడం గమనార్హం. Towards our commitment to helping all our people stuck in different parts of the country and who want to return back to Bengal, I am pleased to announce that we have arranged 105 additional special trains. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) May 14, 2020 ఇదేవిషయం కేంద్రహోం మంత్రి అమిషా కూడా మమతకు చాలా సార్లు లేఖ రాశారు. వలస కార్మికులు కూడా మీ ప్రజలే. వారిని ఇంటికి తిరిగి రానివ్వండి. ఆర్ధిక వ్యవస్థ బాగుపడి వారికి ఉద్యోగాలు దొరుకుతాయి దీనిని రాజకీయం చేయ్యొద్దు అంటూ కూడా అమిత్ షా చాలా సార్లు పేర్కొన్నారు. ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వానికి, కేంద్ర సర్కార్‌కి మధ్య యుద్దమే నడిచింది. అయితే కరోనా కట్టడి విషయంలో కేంద్రం చేపడుతున్న అనేక చర్యలను దీదీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
లాక్డౌన్ : మూడు గంటల్లో రూ.10 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ అనంతరం కొన్ని ప్రత్యేక రైళ్లకు అనుమతినిచ్చిన నేపథ్యంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక రైళ్ల కోసం ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేయడం ప్రారంభించిన తరువాత సోమవారం (మే 11) మొదటి మూడు గంటల్లో 54 వేల మంది ప్రయాణికులు 30 వేల టికెట్లు కొనుగోలు చేశారు. తద్వారా సుమారు రూ .10 కోట్లు ఆదాయం రైల్వే శాఖకు సమకూరింది. (రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే!) ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) రైళ్ల టికెట్ల అమ్మకాల ద్వారా సోమవారం రాత్రి 9 గంటలకు రూ .9.9 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ముంబై- న్యూఢిల్లీ మార్గంలో టికెట్లు మే 12-17 వరకు పూర్తిగా అమ్ముడుబోయాయని తెలిపారు. హౌరా-న్యూ ఢిల్లీ రైలుకు సంబంధించిన అన్ని టికెట్లను మొదటి 10 నిమిషాల్లోనే బుక్ చేశారన్నారు. అయితే టికెట్ల కోసం భారీ రద్దీ కారణంగా ఐఆర్సీటీపీ సైట్ క్రాష్ అయింది. దీంతో బుకింగ్స్ షెడ్యూల్ రెండు గంటలు ఆలస్యమైంది. మరోవైపు స్టాక్ మార్కెట్లో ఐఆర్సీటీసీ షేరు ట్రేడర్ల కొనుగోళ్లతో లాభాల్లో దూసుకుపోతోంది. (400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్) కోవిడ్-19 మహమ్మారి కారణంగా అన్ని సేవలను ప్రభుత్వం పరిమితం చేసిన దాదాపు 50 రోజుల తరువాత భారత రైల్వే ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ రైళ్లను మంగళవారం నుండి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 25వ తేదీ నుంచి మే 17వరకు దేశంలో మూడు దశల్లో లాక్డౌన్ అమలవుతోంది. ఇప్పటివరకూ దాదాపు అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. -
ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా..
న్యూఢిల్లీ: వలస కార్మికులను తరలిస్తున్న శ్రామిక్ ప్రత్యేక రైళ్ల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను సవరించింది. ఎక్కువ మందిని తరలించేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్ల సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 1,200 నుంచి 1,700కు పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. స్లీపర్ బెర్తుల సంఖ్యకు సమానంగా సీట్లు ఉండాలని సూచించింది. గమ్యస్థానం కాకుండా మూడు చోట్ల ఈ రైళ్లు ఆపాలని పేర్కొంది. వలస కార్మికులను వేగంగా తరలించేందుకు రాష్ట్రాలు ఉదారంగా అనుమతి ఇవ్వాలని కోరింది. ఆదివారం రాష్ట్రాలతో హోంశాఖ కార్యదర్శి జరిపిన సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. వలస కార్మికుల తరలించేందుకు అనుమతి ఇవ్వాలని పశ్చిమ బెంగాల్‌కు హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. (గుడ్‌న్యూస్: రేపట్నుంచి రైలు కూత) వలస కార్మికుల కోసం మరిన్ని శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడపడంలో రైల్వే శాఖకు సహకరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో హోం మంత్రిత్వ శాఖ అజయ్ భల్లా కోరారు. ప్రత్యేక రైళ్లు ఎక్కడానికి వలస కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వలస కార్మికులు రోడ్లు, రైలు పట్టాల వెంట నడవకుండా చూడాలని కోరారు. కాగా, రైల్వేశాఖ మే 1 నుంచి 428 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 4.5 లక్షల మందికి పైగా వలసదారులను ఇప్పటివరకు గమ్యానికి చేర్చినట్టు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. (విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు!) -
అమాంతం పెరిగిన కరోనా కేసులు.. వారి వల్లే
పాట్నా : వలస కూలీల ద్వారా కరోనా కేసులు బిహార్‌లో పెరిగినట్టు తెలుస్తోంది. ఆదివారం నాటికి 83 ప్రత్యేక రైళ్లలో దాదాపు లక్షకు పైగా వలసదారులు వివిధ రాష్ట్రాల నుంచి బిహార్‌కు తిరిగి వచ్చారు. దీంతో ఒక్కసారిగా కోవిడ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది. వీరి నుంచి 142 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 673కు చేరింది. వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో మే 4 నుంచి మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు బిహార్‌కు చేరుకున్నారు. (కరోనా కల్లోలం: కార్మికుడు బలి) వలస కూలీల ద్వారా రాష్ట్రంలో ఉన్న 38 జిల్లాల్లో 37 జిల్లాల వాసులకు కరోనా సోకింది. ఇంతకుముందు కేవలం 1.8 శాతంగా మాత్రమే ఉన్న కరోనా కేసులు వలస కూలీల కారణంగా 4.5 శాతానికి చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే రాష్ట్రానికి వచ్చిన వలసకార్మికుల్లో కేవలం 43 మందికే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో మిగిలిన వలస కూలీలను ఆయా స్వస్థలాలకు పంపిచినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో 3,474 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బిహార్ సమాచార, ప్రజా సంబంధాల కార్యదర్శి అనుపమ్ కుమార్ వెల్లడించారు. ఈ కేంద్రాల్లో 98,814 మందికి వసతి కల్పించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో 86 ప్రత్యేక రైళ్లలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న బిహార్ వాసులను తిరిగి రప్పించడానికి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. దాదాపు 2 లక్షలకు పైగానే వలస కూలీలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ప్రస్తుతం నమోదైన 673 కరోనా కేసుల్లో 354 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. -
శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వలస కూలీలు
సాక్షి, ముంబై/సాక్షి, విజయవాడ/కొలిమిగుండ్ల: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి మంగళవారం వలస కూలీల రైళ్లు మొదలయ్యాయి. లాక్డౌన్ కారణంగా ముంబైలోచిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను తీసుకుని కళ్యాణ్ జంక్షన్ నుంచి మంగళవారం రాత్రి శ్రామిక్ ప్రత్యేక రైలు గుంతకల్‌కు బయల్దేరింది. ఈ రైల్లో అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు సమీప ప్రాంతాలకు చెందిన సుమారు 1200 మంది తమ స్వస్థలాలకు బయల్దేరారు. బుధవారం రాత్రికి వీరు గుంతకల్ చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన మత్స్యకారులు ముంబైలో పనిచేస్తుంటారు. ముంబైలోని బందర్, దానా బందర్ తదితర ప్రాంతాల్లోని మురికి వాడల్లో వీరు నివసిస్తుంటారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వీరికి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి లభించడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. తమ ఇబ్బందులు వెలుగులోకి తీసుకువచ్చిన సాక్షికి మత్స్యకారులు ధన్యవాదాలు తెలిపారు. ముంబై సమీపంలోని కళ్యాణ్ జంక్షన్ నుంచి మత్స్యకారులతో బయల్దేరిన రైలు స్వస్థలాలకు మహారాష్ట్ర వలస కూలీలు జీవనోపాధి కోసం కృష్ణా జిల్లాకు వచ్చిన మహారాష్ట్రలోని చంద్రాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 1,212 మంది వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వం వారి స్వస్థలాలకు పంపించింది. కలెక్టర్ ఎ.ఎండీ ఇంతియాజ్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత పర్యవేక్షణలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేక రైల్లో కూలీలు వారి ప్రాంతానికి తరలివెళ్లారు. జిల్లాలోని గంపలగూడెం పరిసర ప్రాంతాలకు ఏటా మార్చి నెలలో మిర్చి కోతల కోసం మహారాష ్టనుంచి కూలీలు వస్తారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా వీరంతా ఇక్కడే ఇరుక్కుపోయారు. కూలీలను 48 బస్సుల్లో గంపలగూడెం నుంచి విజయవాడ తరలించిన అధికారులు భోజనాల అనంతరం రాయనపాడు రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఒక్కో బోగీలో 50 మంది చొప్పున 24 బోగీల్లోకి కూలీలను ఎక్కించారు. కాగా కర్నూలు జిల్లా కల్వటాల–కొలిమిగుండ్ల మధ్య నిర్మిస్తున్న రామ్‌కో సిమెంట్ కంపెనీ పనులు చేసేందుకు వచ్చిన పలు రాష్ట్రాల వలస కూలీలను స్వస్థలాలకు పంపిస్తున్నారు. బిహార్‌కు చెందిన 480 మందిని మంగళవారం బస్సుల్లో కర్నూలు రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో బిహార్‌కు పంపిస్తున్నారు. -
నేటి నుంచి రోజూ 40 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హై దరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌కు రైళ్లు నడుపుతామని తెలిపారు. లాక్డౌన్ వల్ల వలస కార్మికు లు పడుతున్న ఇబ్బందులపై సోమవారం ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్షించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతా ల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందు కు ఆసక్తి చూపుతుండటంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో దక్షి ణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో మాట్లాడి, మంగళవారం నుంచి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు రైళ్ల ద్వారా తరలిం చే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా, సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌రెడ్డిని ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది. తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలా పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ల ద్వా రా తరలిస్తారు. పోలీస్ స్టేషన్లలోనే వివరాలు ఇస్తారు. ప్రభుత్వం కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినందున ఎవరూ ఆందోళన చెందొద్దని సీఎం కోరారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించి, కార్మికులను సమన్వయం చేయాలని పోలీసు అధికారులకు సూచిం చారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రత్యేక శ్రామిక్ రైళ్లకు టికెట్ల జారీ ఉండదు
సాక్షి, అమరావతి: ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శ్రామిక్ రైళ్లకు టికెట్ల జారీ ఉండదని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ఎంతమంది ఇతర రాష్ట్రాలకు వెళతారు? అక్కడ ఎంత మందిని తీసుకురావాలి? అనే సమాచారం తీసుకోవడానికి విజయవాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్లు 1902, 0866–2424680 ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎంతమందిని పంపించాలి, ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమందిని వెనక్కి తీసుకురావాలనే అంశాలపై రెండ్రోజుల్లో ప్రభుత్వానికి స్పష్టత రానుంది. ఎన్ని రైళ్లు అవసరమవుతాయనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్ల రైల్వే మేనేజర్లు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ఇప్పటికి ఐదు రైళ్లను ఏపీకి కేటాయించినట్లు రైల్వే శాఖ తెలిపింది. అవసరమైతే మరిన్ని రైళ్లు అందుబాటులో ఉంచుతామని రైల్వే వర్గాలు తెలిపాయి. వలస కూలీలపై సమగ్ర వివరాలు సేకరించిన తర్వాత తరలింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ► వలస కూలీలను రైల్వే స్టేషన్లకు తరలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చేపట్టనున్నారు. ► వలస కూలీల సమాచారం రాష్ట్ర ప్రభుత్వమే రైల్వేకు అందిస్తుంది. ► ఒక్కో జిల్లాలో ఒక్కో రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసి అక్కడి నుంచే వలస కూలీలను తరలించాలి. ► ఇతర రాష్ట్రాల్లో ఉన్న యాత్రికులు, విద్యార్థులు, వలస కూలీలు, కార్మికులను తీసుకొచ్చే విధానంపై పాలసీ రూపకల్పనకు కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం సంప్రదించనుంది. ► మే 17 వరకు ప్యాసింజర్ రైళ్లను నడపబోమని రైల్వే శాఖ తేల్చి చెప్పింది. రైల్వే స్టేషన్లకు ఎవ్వరూ రావద్దని ప్రయాణికుల్ని కోరింది. -
రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణికులకు మరోసారి నిరాశ ఎదురయింది. మే 3 తర్వాత స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న ప్రయాణికుల ఆశలపై రైల్వే శాఖ నీళ్లు చల్లింది. ప్రయాణికుల రైళ్లు, సబర్బన్ రైళ్ల రద్దును మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పార్శిల్, రవాణా రైళ్లుయథాతథంగా నడుస్తున్నాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ స్పష్టం చేశారు. (స్పెషల్ ట్రైన్ ఎక్కాలంటే.. ఇవి పాటించాలి) టిక్కెట్ల కోసం రైల్వే స్టేషన్లకు రావొద్దు లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, తీర్థయాత్రికులు, ఇతర వ్యక్తులను శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల అభీష్టం మేరకు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు లోబడి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణం చేయదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, నమోదు చేసుకున్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. ‘వ్యక్తులకు టికెట్లు జారీ చేయడం వీలు పడదు. బృందాలకు కూడా టిక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి టిక్కెట్ల కోసం ఎవరూ నేరుగా రైల్వే స్టేషన్లకు రావొద్ద’ని దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. (విమాన ప్రయాణాల్లో భారీ మార్పులు) -
వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీకి రోజుకు ఐదు చొప్పున ప్రత్యేక రైళ్లు కేటాయించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలను తరలించేందుకు కూడా ఆయా రాష్ట్రాలకు రైళ్లను కేటాయించింది. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఏ జిల్లాలో ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని సేకరించే బాధ్యతను జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. వలస కూలీల కోసం మెయిల్‌కు గత రెండ్రోజుల్లో పది వేల మంది సమాచారం వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. గ్రీన్జోన్లలో పరిశ్రమలను తెరిచినందున ఆసక్తి చూపిన వారినే వారి రాష్ట్రాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు, మత్స్యకారులు తమిళనాడు, యూపీ, ఒడిశా, కాశీ తదితర ప్రాంతాల్లో ఉన్నారని, వారిని రప్పించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వలస కూలీల విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ► ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వారు 12,602 మంది ఉన్నారు. రాష్ట్ర పరిధిలోని వారు ఆయా జిల్లాల్లో 66 వేల మందికి పైగా ఉన్నారు. ► రాష్ట్ర పరిధిలోని వారిని తరలించేందుకు ఆర్టీసీ 750 బస్సులను ఏర్పాటు చేసి ఇప్పటికే 22,866 మంది వలస కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చింది. ► స్వస్థలం చేరుకున్నాక క్వారంటైన్లో, తర్వాత హోం క్వారంటైన్లో ఉండాలి. ► రవాణా శాఖ 200 ప్రైవేటు బస్సులను కూడా అందుబాటులో ఉంచింది. ► రాష్ట్రంలోని జాతీయ రహదారులపై గూడ్స్ వాహనాల ట్రాఫిక్ 45% పెరిగింది. -
మేడే రోజు శ్రామిక్ రైళ్లు
రాంచి/న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను స్వస్థలాలకు చేర్చే శ్రామిక్ రైళ్ల ప్రయాణం కార్మిక దినోత్సవమైన మేడే రోజు ప్రారంభమైంది. తొలి రైలు 1200 మంది కార్మికులతో శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు ప్రయాణమైంది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రతీ కోచ్‌లో 54 మందిని మాత్రమే అనుమతించారు. జార్ఖండ్‌లోని హతియాకు చేరుకున్నాక స్థానిక అధికారులు నిబంధనల ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం స్వస్థలాలకు చేరుస్తారు. ఇళ్లల్లో కాని, ప్రత్యేక కేంద్రాల్లో కానీ వారిని క్వారంటైన్ చేస్తారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులను సొంత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ఈ రైలు కాకుండా శుక్రవారం మరో 5 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. అవి నాసిక్(మహారాష్ట్ర)– లక్నో(యూపీ), అలువ(కేరళ)– భువనేశ్వర్(ఒడిశా), నాసిక్–భోపాల్(మధ్యప్రదేశ్), జైపూర్(రాజస్తాన్)– పట్నా(బిహార్), కోట(రాజస్తాన్)–హతియాకు కార్మికులను చేరుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ మధ్యలో ఎక్కడా ఆగవని, ప్రయాణీకులకు రైళ్లలోనే భోజనం అందిస్తామని అధికారులు తెలిపారు. -
ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలంటే..
న్యూఢిల్లీ: మేడే రోజున వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే రైల్వే శాఖ నడిపే ప్రత్యేక ‘శ్రామిక్ రైళ్ల’లో మాత్రమే వీరు ప్రయాణించాల్సి ఉంటుంది. వలస కార్మికులతో పాటు విద్యార్థులు, వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఈ రైళ్లలో తమ సొంతూళ్లకు వెళ్లిపోవచ్చని కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల కోసం నోడల్ అధికారులను నియమిస్తుందని.. వీరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ వలస కార్మికులను తరలించడానికి ఏర్పాట్లు చేస్తారని రైల్వే శాఖ తెలిపింది. వీటికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. ► రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే నిబంధనల మేరకు ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లు నడుపుతారు. వీటి సమన్వయానికి రైల్వే శాఖ, రాష్ట్రాలు సీనియర్ ఆఫీసర్లను నోడల్ అధికారులుగా నియమించాలి. ► ప్రయాణికులు రైలు ఎక్కే ముందు వారిని పంపించే రాష్ట్రాలు స్క్రీనింగ్ నిర్వహించాలి. కోవిడ్-19 లక్షణాలు లేవని తేలిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలి. ► శానిటైజ్ చేసిన బస్సుల్లో ప్రయాణికులను బ్యాచ్‌ల వారీగా రైల్వే స్టేషన్‌కు తీసుకురావాలి. ప్రయాణికులు ముఖానికి మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. (3 తర్వాత లాక్డౌన్ సడలింపు పక్కా..) ► ప్రయాణికులను పంపే రాష్ట్రమే వారికి భోజనం, తాగునీరు రైలు ఎక్కేముందు సమకూర్చాలి. ఒకవేళ ఎక్కువ దూరం ప్రయాణించాల్సివుంటే రైళ్లలోనే భోజన ఏర్పాట్లు చేస్తారు. ► ప్రయాణికులు గమ్యానికి చేరుకున్నాక సదరు రాష్ట్ర ప్రభుత్వం వారికి స్క్రీనింగ్ చేయాలి. అవసరమనుకుంటే క్వారంటైన్‌కు తరలించాలి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా ఏర్పాట్లు చేయాలి. వైరల్ వీడియా ట్వీట్ చేసిన ప్రధాని మోదీ -
మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
సాక్షి, హైదరాబాద్ : సమ్మక్క - సారలమ్మల మహాజాతర సందర్భంగా పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రారంభించారు. టూరిజం ప్యాకేజీ లో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి బేగం పేట ఎయిర్ పోర్టు వరకు హెలికాఫ్టర్ సర్వీసులను నిర్వహిస్తున్నామన్నారు. (మేడారం జాతర: నిలువెత్తు దోపిడి) హైదరాబాద్ నుండి ఆరుగురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలుతో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. విమాన సర్వీసులతో పాటు సమ్మక్క, సారలమ్మ దర్శనం కల్పిస్తామని, అదేవిధంగా రూ.2999 అదనంగా చెల్లిస్తే మేడారం జాతరను హెలికాప్టర్ ద్వారా తిలకించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ అద్బుత అవకాశం కల్పించిందన్నారు. పర్యాటకులు ఈ సదుపాయన్ని ఉపయోగించుకునేందు 9400399999 నంబర్‌ను సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్ భూపతి రెడ్డి, రాష్ట్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్‌తో పాటు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (మేడారం జాతర : మండమెలిగె.. మది వెలిగె) మేడారంకు ప్రత్యేక రైళ్లు మేడారం జాతర సందర్భంగా సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి వరంగల్‌కు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ శనివారం ఓ ప్రకటన చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-వరంగల్ (07014/07015) స్పెషల్ ట్రైన్ ఈ నెల 4వ తేదీ నుంచి 8 వరకూ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 3.40 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు సాయంత్రం 5.45కు వరంగల్ నుంచి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు సికింద్రాబాద్ వస్తుంది. సిర్పూర్ కాగజ్ నగర్-వరంగల్ (07017/07018) స్పెషల్ ట్రైన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు బయల్దేరి ఉదయం 9.30 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు ఉదయం 11 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. -
ఆర్టీసీ బస్సులు కళకళ
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ అన్ని వర్గాల్లో ఆనందాన్ని నింపింది. ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యుల మధ్య పండగ జరుపుకున్నవారంతా స్వస్థలాల నుంచి తిరిగి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కాగా, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేడు (శనివారం), రేపు (ఆదివారం) ఆర్టీసీ 2 వేలకు పైగా ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల పాటు ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. మొత్తం పండగ సీజన్లో ఈ నెల 15 నుంచి 19 వరకు 4,200 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీని ప్రకారం పండగ ముందు 2,200 ప్రత్యేక సర్వీసులను నడపడంతో ప్రయాణికులు ఆదరించారు. ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ కట్టడి చేయడంతో ఈ దఫా రాష్ట్ర ప్రజలకు ప్రయాణంలో ఇబ్బందులు తప్పాయి. ఇటు రైల్వే శాఖ నర్సాపూర్, కాకినాడ, విశాఖ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. 40 శాతం రాయితీతో బస్సులు కళకళ.. ఆర్టీసీ పండగ సీజన్లలో నడిపే ప్రత్యేక సర్వీసులకు అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేస్తుంది. తిరుగు ప్రయాణంలో సరిగా ఆక్యుపెన్సీ ఉండదని, డీజిల్ ఖర్చులకైనా బస్సు నడిపినందుకు రావాలని ఈ విధంగా 50 శాతం చార్జీలు పెంచుతారు. అయితే ఈ దఫా ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేసింది. తిరిగి వచ్చేటప్పుడు ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సులో 40 శాతం రాయితీ ప్రకటించింది. దీంతో ప్రత్యేక బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగి బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ చేస్తే 8309887955కు ఫిర్యాదులు ఈనెల 2వ తేదీ నుంచి 16 వరకు ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ 3,132 కేసులు నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 546 బస్సులను సీజ్ చేశారు. తిరుగు ప్రయాణంలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని రవాణా శాఖ తెలిపింది. -
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సంక్రాంతి సెలవుల ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం జి.సునీల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ–విజయనగరం–విజయవాడ(వయా దువ్వాడ) విజయవాడ–విజయనగరం(07184) జనసాధారణ్ స్పెషల్ విజయవాడలో ఈనెల 11,12,13 రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 5.20 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 5.22 గంటలకు బయల్దేరి అదే రోజు ఉదయం 7.20 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07185) విజయనగరంలో ఈనెల 12, 13, 14 తేదీల్లో ఉదయం 7.45 గంటలకు బయల్దేరి ఉదయం 9.23 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.25 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు 12 జనరల్ క్లాస్ కోచ్‌లతో నడుస్తుంది. రానుపోను నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్లలో ఆగుతుంది. విజయనగరం–విజయవాడ-విజయనగరం జనసాధారణ్ స్పెషల్ విజయనగరం–విజయవాడ(07187) రైలు విజయనగరంలో ఈనెల 17,18,19 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు బయల్దేరి రాత్రి 10.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.32 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(07186) విజయవాడలో ఈనెల 18,19 తేదీల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.32 గంటలకు బయల్దేరి రాత్రి 8.15 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ఈ రైలు 12 జనరల్ క్లాస్ కోచ్‌లతో నడుస్తుంది. రానుపోను నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్లలో ఆగుతుంది. విజయనగరం–రాజమండ్రి–విజయనగరం జనసాధారణ్ స్పెషల్ విజయనగరం–రాజమండ్రి(07197) స్పెషల్ ఈనెల 14వ తేదీన ఉదయం 7.45 గంటలకు విజయనగరంలో బయల్దేరి ఉదయం 9.23గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.25 గంటలకు బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07198) రైలు రాజమండ్రిలో ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.32 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.15 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ఈ రైలు 12 జనరల్ క్లాస్ కోచ్‌లతో నడుస్తుంది. ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్నం–సికింద్రాబాద్– విశాఖపట్నం స్పెషల్ విశాఖపట్నం–సికింద్రాబాద్(08523) స్పెషల్ రైలు విశాఖపట్నంలో ఈనెల 12,19 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 13, 20 తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 4.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు 1–సెకండ్ ఏసీ, 2– థర్డ్ ఏసీ, 6–స్లీపర్ క్లాస్, 4–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజి కోచ్‌లతో నడుస్తుంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్నం–విజయవాడ–విశాఖపట్నం డబుల్ డెక్కర్ స్పెషల్ విశాఖపట్నం–విజయవాడ(08525) డబుల్ డెక్కర్ స్పెషల్ విశాఖలో ఈనెల 12,19 తేదీల్లో ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 11.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08526) విజయవాడలో అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈరైలు 8 డబుల్ డెక్కర్ కోచ్‌లతో నడుస్తుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది.