మళ్లీ రావడం.. అంత సులభం కాదు

Not Easy For Migrant Labour Come Back to Work in Hyderabad - Sakshi

నగరంలో కార్మికుల కొరత ఇప్పటికే సొంతూళ్లకు 13 లక్షల మంది వలస కార్మికులు తిరిగి రప్పించేందుకు యాజమాన్యాల ప్రయత్నాలు మంచి వేతనం..వసతి హామీలతో రప్పించే యత్నం కొందరి సుముఖం.. బుక్‌కాని రైలు టికెట్లు

సాక్షి,సిటీబ్యూరో:  అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులను తిరిగి రప్పించేందుకు వివిధ రంగాల యాజమాన్యాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే కార్మికులు తిరిగి రావడం అంత సులభం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇబ్బందులు పడి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి రావాలంటే రైళ్లల్లో రావాల్సిందే. అయితే అందుకు తగ్గట్లుఏర్పాట్లు యాజమాన్యాలు చేయడం కష్టమే. సొంతంగా వారు వచ్చే పరిస్థితి లేదు.అయితే కొందరు కార్మికులుమాత్రం రోడ్డుమార్గం ద్వారా వస్తున్నట్లు తెలుస్తోంది.  కర్ణాటక సరిహద్దు మినహా మిగతా రాష్ట్రాల వైపు నుంచి రాకపోకలపై ఆంక్షలు నెలకొంది.   హైదరాబాద్‌ మహానరంతో పాటు శివారు ప్రాంతాల్లోని  వివిధ రంగాల్లో పని చేస్తున్న సుమారు 13 లక్షల మంది వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు.(‘నరకం కంటే దారుణంగా ఉన్నాయి’)

నాడు గాలికి వదిలేసి....
వాస్తవంగా  ఉపాధి నిమిత్తం  లేబర్‌ కాంట్రాక్టర్‌ (టేకేధార్‌) ద్వారా స్వస్థలాల నుంచి పనులు చేసే ప్రాంతాలకు, తిరిగి వేళ్లేటప్పుడు రైల్వే స్టేషన్ల వరకు చేర్చే బాధ్యత కూడా టేకేధార్లు నిర్వర్తిస్తారు.లాక్‌డౌన్‌ కష్ట కాలంలో ఇటూ యాజమాన్యం పట్టించుకోక పోగా, టేకేధార్లు కూడా పత్తా లేకుండా పోయారు. దీంతో వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో వారిని గాలికొదిలేసిన యాజమాన్యాలు తిరిగి మళ్లీ పిలవడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోగా.. ఇప్పుడు మీ అవసరం కోసం రమ్మంటున్నారా అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.  మంచిజీతం, వసతి, వైద్య ఆరోగ్య సేవల సదుపాయాలను సమకూర్చుతామని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని హామీ వచ్చిన తరువాతే కొందరు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రయాణాలు కష్టమే...
సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులకు మంచి వేతనం, సదుపాయాలను ఇస్తామని యాజమాన్యాలు చెబుతుండటంతో స్వస్థలాల్లో  పనులువదులుకొని తిరిగి వచ్చేందుకు కార్మికులు సిద్ధమవుతున్నా ప్రయాణాలు సాధ్యం కాని పరిస్ధితి నెలకొంది. ఆధార్‌ అడ్రస్‌ ఆధారంగా రైలు టికెట్‌ బుక్‌ కావడంలేదు. ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చే పరిస్థితి లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top