ఇరాన్‌ యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్‌ | Indian-flagged crude oil tanker Jag Laadki arrived at Mundra Port | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్‌

Mar 18 2026 1:38 PM | Updated on Mar 18 2026 2:01 PM

Indian-flagged crude oil tanker Jag Laadki arrived at Mundra Port

గాంధీనగర్‌: ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్‌కు మరో శుభవార్త అందింది. కాసేపటి క్రితమే హార్మూజ్‌ జలసంధి నుంచి మూడో నౌక జగ్‌లడ్కి షిప్‌ గుజరాత్‌ తీరానికి చేరుకుంది. దీంతో, భారత్‌కు చమురు కష్టాలు తీరనున్నాయి.

వివరాల మేరకు.. జగ్‌లడ్కి నౌక బుధవారం ఉదయం వచ్చి ముంద్రా పోర్టుకు చేరుకుంది. సదరు నౌక యూఏఈలోని ఫుజైరా పోర్టు నుంచి 80,800 మెట్రిక్ టన్నుల కూడ్రాయిల్‌ను మోసుకొచ్చిది. హార్మూజ్‌ జలసంధి నుంచి మూడో నౌక సేఫ్‌గా భారత్‌కు చేరుకుంది. ఇక, ఇప్పటికే ఎల్పీజీతో శివాలిక్‌, నందాదేవి నౌకలు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. 


ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎల్పీజీని మోసుకొచ్చిన శివాలిక్‌ ట్యాంకర్‌ సోమవారం భారత్‌లోని గుజరాత్‌ ముంద్రా పోర్ట్‌కు వచ్చింది. ఈ శివాలిక్‌ నౌకలో 45,000 మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ భారత్‌కు వచ్చింది. అలాగే పర్షియన్‌ గల్ఫ్‌కు పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిల్లో 616 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. హర్మూజ్‌ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు రెండురోజుల క్రితం సురక్షితంగా హర్మూజ్‌ జలసంధిని దాటాయి. అందులో ఒకటి శివాలిక్‌ కాగా.. మరొకటి నందాదేవి. ఈ ‘నందాదేవి’ కూడా 45వేల మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ను తీసుకొని కాండ్లా పోర్టుకు చేరుకుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement