అతడికి వైకల్యం ఉండవచ్చు, కానీ మానవత్వానికి కాదు. అతడికి ఒక చేయి మాత్రమే ఉన్నా, ముందుకు వచి్చన ఆపన్నహస్తాలెన్నో! వరదలో పడిపోతుండగా ఒడిసి పట్టి ఒడ్డుకు చేర్చిన చేతులెన్నో! అవిటితనాన్ని లెక్క చేయకుండా ఓ వ్యక్తి వరదలోనే ఒంటి చేత్తో బైక్ నడుపుతూ వెళ్తుండగా ఉధృతికి తట్టుకోలేక కిందపడిపోయాడు. ఇతర వాహనదారులు పరుగున వచ్చి అతడిని పైకి లేపి క్షేమంగా బయటకు తీసుకు వచ్చిన ఘటన హయత్‌నగర్‌లో చోటు చేసుకుంది. బుధవారం కురిసిన జోరువానకు హయత్‌నగర్ జాతీయ రహదారి గోదారిలా మారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
ఫోటోలు – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్


