Mundra port
-
వెంటబడి.. చొరబడి
టెహ్రాన్: దుబాయ్ నుంచి బయల్దేరి హార్మూజ్ జలసంధి మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు క్షేమంగా రావాల్సిన కంటైనర్ నౌక ‘ఎపామినోండాస్’ను ఇరాన్ బలగాలు స్వా«దీనం చేసుకున్న వీడియో తాజాగా బహిర్గతమైంది. లైబీరియా జెండాతో వస్తున్న ‘ఎపామినోండాస్’పైకి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ బలగాలు మెరుపువేగంతో దాడిచేసి తమ వశం చేసుకున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఒమన్‌కు ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్లదూరంలో హార్మూజ్ జలాల్లో ఉన్న నౌకపైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు హఠాత్తుగా కాల్పులు జరిపి నౌక ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. వెంటనే గన్బోట్లలో నేవీ కమెండోలు మెరుపువేగంతో నౌక సమీపానికి చేరుకున్నారు. నౌక పక్కల వైపు ఉండే చిన్నపాటి ప్రవేశ ద్వారం గుండా లోపలికి చొరబడ్డారు. ఈ దురాక్రమణపర్వం మొత్తం నేవీ వాళ్ల డ్రోన్ కెమెరాల్లో రికార్డయ్యాయి. మాస్క్ లు ధరించిన కమెండోలు రైఫిళ్లు ఇతర మారణాయుధాలతో నౌకలోకి చొరబడి తమను ప్రతిఘటించే సాయుధులకోసం వెతికారు. నౌకలో సాయుధుల ఎవరూ లేకపోవడంతో నేరుగా నౌక ఇంజిన్ రూమ్‌లోకి వెళ్లి దాని ఆపరేటింగ్ సిస్టమ్‌ను తమ వశంచేసుకున్నారు. తర్వాత నౌక తమ అ«దీనంలోకి వచి్చందని అధికారికంగా ప్రకటించారు. తర్వాత నౌకను ఇరాన్ తీరం వైపు మళ్లించారు. తీరానికి తీసుకెళ్లాక నౌకను తనిఖీచేసి సరకులో ఏమైనా అక్రమ, చట్టబద్ధ వస్తువులున్నాయా లేదా అనేది తనిఖీచేస్తారు. వాస్తవానికి ఈ నౌక రాకపోకలకు సంబంధించి ఎలాంటి ముందస్తు అనుమతులులేవని ఇరాన్ నేవీ ప్రకటించింది. నౌకను స్వా«దీనంచేసుకునే క్రమంలో ఎపామినోండాస్ పైకి ఇరాన్ కమెండోలు కాల్పులు జరిపి గ్రనేడ్లు విసిరేశారు. దీంతో నౌకలోని ప్రధానభాగమైన బ్రిడ్జ్(సెంట్రల్ కమాండ్ సెంటర్) పాక్షికంగా దెబ్బతింది. కానీ నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. దెబ్బకు దెబ్బ... హార్మూజ్‌లో, హిందూ మహాసముద్రంలో రెండు ఇరాన్ నౌకలను అమెరికా బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. ఇరాన్ కార్గో నౌక ‘టౌస్కా’స్వాధీనపరంపర తాలూకు వీడియోలను మీడియాకు అందజేశాయి. ఇరాన్ నౌకలను సులభంగా తమ వశంచేసుకున్నామని ఆ వీడియోల్లో అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఐఆర్జీసీ నేవీ బలగాలు తాము సైతం విదేశీ నౌకలను స్వా«దీనంచేసుకోగలమని నిరూపించాలనుకున్నాయి. ఇందులోభాగంగా ‘ఎపామినోండాస్’, ‘యుఫోరియా’, ‘ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా’నౌకలను స్వా«దీనం చేసుకుని తమ సత్తా చాటాయని తెలుస్తోంది. -
భారత్‌కు చేరిన జగ్ లడ్కీ
అహ్మదాబాద్/హాంకాంగ్: యుద్ధమయ హార్మూజ్ గుండా మరో ముడిచమురు రవాణా నౌక క్షేమంగా భారత నౌకాశ్రయానికి చేరుకుంది. భారతీయ జెండాతో ‘జగ్ లడ్కీ’నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా పోర్ట్‌లో 80,886 మెట్రిక్ టన్నుల ముడిచమురు నింపుకుని హార్మూజ్ గుండా ప్రయాణించి బుధవారం గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు చేరుకుందని ఆ పోర్ట్ నిర్వహణ సంస్థ ‘అదానీ పోర్ట్స్’ప్రకటించింది. ఇదే ఫుజైరా పోర్ట్‌పై ఇరాన్ ఇటీవల క్షిపణి దాడులు చేసింది. అయినాసరే పోర్ట్‌నుంచి సరకు ఎగుమతి నిరాటంకంగా కొనసాగుతోంది. సోమవారం హార్మూజ్ గుండా బయల్దేరి 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరకుతో ‘నందా దేవి’నౌక వచి్చన మరుసటి రోజే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా భారత్‌కు రావడం విశేషం. 274.19 మీటర్ల పొడవుండే జగ్ లడ్కీ నౌక గరిష్టంగా 1,64,716 టన్నుల సామర్థ్యతో ప్రయాణించగలదు. భారత చమురు దిగుమతులకు సంబంధించి హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. దీని గుండానే భారత్‌కు దాదాపు 40–50 శాతం చమురు వస్తోంది. హార్మూజ్‌ను దాటిన 89 నౌకలు హార్మూజ్ గుండా సరకు రవాణా నౌకల రాకపోకలపై ఇరాన్ నిషేధం విధించినా సరే సిగ్నళ్లను నిలిపేసి, లైట్లను ఆర్పేసి ‘డార్క్ మోడ్’లో ఎవరి కంటా పడకుండా కొన్ని నౌకలు ఇదే మార్గం గుండా ప్రమాదకరరీతిలో ప్రయాణం కొనసాగిస్తున్నాయి. అయితే మిత్రదేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడట్లేదని తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకలు సైతం సురక్షితంగానే ప్రయాణం పూర్తిచేస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి నెల 15వ తేదీదాకా 89 సరకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా విజయవంతంగా ప్రయాణించాయని సముద్రమార్గ ప్రయాణాల డేటా సంస్థ ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’బుధవారం ప్రకటించింది. ఈ 89 నౌకల్లో ఐదింట ఒకవంతు నౌకలకు ఇరాన్‌తో సంబంధం ఉందని, చైనా, గ్రీస్ జెండాలున్న నౌకలూ సులభంగానే హార్మూజ్‌ను దాటేశాయని ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’పేర్కొంది. చైనాకు బదులు భారత్‌కు బయల్దేరిన 7 నౌకలు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షల సడలింపు ప్రకటించిన నేపథ్యంలో మోదీ సర్కార్ మళ్లీ రష్యాచమురు కొనుగోళ్ల పర్వానికి తెరలేపింది. దీంతో రష్యా నుంచి చైనాకు బయల్దేరిన ఏడు ముడిచమురు రవాణా నౌకలు సముద్రమార్గం మధ్యలోనే దిశ మార్చుకుని భారత్‌కు ప్రయాణం మొదలెట్టడం విశేషం. జనవరి చివరివారంలో రష్యా నుంచి బయల్దేరి బాలి్టక్ సముద్రజలాల్లో ప్రయాణించిన మధ్యశ్రేణి ముడిచమురునౌక ‘ఆక్వా టైటాన్’వాస్తవానికి చైనాలోని రిజావో పోర్ట్‌కు వెళ్లాలి. కానీ అది ఇటీవల దిశ మార్చుకుని భారత్ దిశగా వెళ్తోందని, మార్చి 21వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్‌లో లంగరు వేస్తుందని నౌకల ట్రాకింగ్ సంస్థ ‘ఓర్టెక్సా లిమిటెడ్’పేర్కొంది. ‘సూయిజ్‌మ్యాక్స్ జోయూజోయూ ఎన్’నౌక సైతం దిశ మార్చుకుని భారత్‌కు వస్తోందని మార్చి 25వ తేదీకల్లా గుజరాత్‌లోని జామ్‌నగర్ సిక్కా పోర్ట్‌కు చేరుకుంటుందని తెలిపింది. -
ఇరాన్ యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్
గాంధీనగర్: ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్‌కు మరో శుభవార్త అందింది. కాసేపటి క్రితమే హార్మూజ్ జలసంధి నుంచి మూడో నౌక జగ్‌లడ్కి షిప్ గుజరాత్ తీరానికి చేరుకుంది. దీంతో, భారత్‌కు చమురు కష్టాలు తీరనున్నాయి.వివరాల మేరకు.. జగ్‌లడ్కి నౌక బుధవారం ఉదయం వచ్చి ముంద్రా పోర్టుకు చేరుకుంది. సదరు నౌక యూఏఈలోని ఫుజైరా పోర్టు నుంచి 80,800 మెట్రిక్ టన్నుల కూడ్రాయిల్ను మోసుకొచ్చిది. హార్మూజ్ జలసంధి నుంచి మూడో నౌక సేఫ్‌గా భారత్‌కు చేరుకుంది. ఇక, ఇప్పటికే ఎల్పీజీతో శివాలిక్, నందాదేవి నౌకలు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. #WATCH | The Indian-flagged crude oil tanker 'Jag Laadki' arrived at Adani Ports Mundra in Gujarat.It carried approximately 80,886 metric tonnes (MT) of crude oil—sourced from the UAE—loaded at Fujairah Port. (Video Source: Adani Port) pic.twitter.com/5zeosrpVbp— ANI (@ANI) March 18, 2026ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎల్పీజీని మోసుకొచ్చిన శివాలిక్ ట్యాంకర్ సోమవారం భారత్‌లోని గుజరాత్ ముంద్రా పోర్ట్‌కు వచ్చింది. ఈ శివాలిక్ నౌకలో 45,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్‌కు వచ్చింది. అలాగే పర్షియన్ గల్ఫ్‌కు పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిల్లో 616 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. హర్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు రెండురోజుల క్రితం సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. అందులో ఒకటి శివాలిక్ కాగా.. మరొకటి నందాదేవి. ఈ ‘నందాదేవి’ కూడా 45వేల మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను తీసుకొని కాండ్లా పోర్టుకు చేరుకుంది. -
గుడ్ న్యూస్.. భారత్‌కు LPG గ్యాస్ నౌక.. గ్యాస్ కొరత ఉండదు..
-
తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం: డీజీపీ
సాక్షి, అమరావతి: కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7వ జాతీయ స్థాయి ఈవెంట్లో ఏపీ అక్టోపస్ బలగాలు మొదటి స్థానం సాధించాయి. ఏపీ పోలీసులకు, ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మన గ్రేహౌండ్స్ బలగాలు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనిబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా అక్టోపస్ బలగాలను రీ లొకేట్ చేయాలని సూచించారు. ఇకపై జిల్లా కేంద్రాల్లో సైతం అక్టోపస్ బలగాలు సేవలు అందిచనున్నాయి. గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలను ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుంది. నైట్ ఫైరింగ్ విషయంలో ఏపీ అక్టోపస్ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ ర్యాంకుల్లో మొత్తం 500 మంది అక్టోపస్ ఆఫీసర్లు ఉన్నారు. నైట్ ఫైరింగ్ విషయంలో ఏపీ అక్టోపస్ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది' అని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. చదవండి: (దుష్ప్రచారమే టీడీపీ అజెండా) తప్పుడు ఆరోపణలు చేయొద్దు: డీజీపీ ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదు. ఈ విషయం చాలాసార్లు స్పష్టంగా చెప్పినా నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. మేం కూడా ఆ సంస్థలతో టచ్‌లో ఉన్నాం. కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ తరహా విమర్శల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నారు. రాష్ట్రం పరువు పోయేలా కొన్ని పార్టీలు హెరాయిన్ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదు. ప్రజల్లో, యువతలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కొందరు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే నోటీసులు జారీ చేస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం. ఎన్ఐఏ వాళ్లే కాకుండా ఇంకొన్ని దర్యాప్తు సంస్థలు వచ్చి ఉంటాయి. ఏపీకి వచ్చి విచారణ చేసుకుంటే తప్పేంటీ..? అని ప్రశ్నించారు. చదవండి: (AP: బడితోనే అమ్మఒడి) -
గుజరాత్ డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ సవాంగ్
సాక్షి, అమరావతి: విజయవాడ కేంద్రంగా ఎటువంటి డ్రగ్స్ సరఫరా జరగలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్‌పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని, డ్రగ్స్‌తో ఏపీ రాష్ట్రానికి సంబంధం లేదని వెల్లడించారు. విజయవాడలో జీఎస్టీ అడ్రస్ మాత్రమే ఉందని, హెరాయిన్‌ను విజయవాడకు గానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రదేశాలకు కానీ దిగుమతి చేసుకున్నట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు వేరే కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకొనే క్రమంలో పట్టుబడిందిగా మాత్రమే డీఆర్ఐ, కేంద్ర సంస్థల అధికారులు పేర్కొన్నట్లు తెలిపారు. చదవండి: అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం: సీఎం జగన్ అయితే కొంతమంది రాజకీయ నాయకులు డ్రగ్స్ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. అన్ని అంశాలపై డీఆర్ఐ, కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయని డ్రగ్స్ వ్యవహారంలో డీఆర్ఐకి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం దీనిపై తగిన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పు దోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. చదవండి: ‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’ ‘సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ప్రజాప్రతినిధుల మీద ఉందన్న విషయాన్ని మరిచిపోవడం బాధాకరం. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముంద్రా పోర్ట్ లో డీఆర్ఐ అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ విదితమే. ఈ అంశంపై విజయవాడ కమిషనర్ ఇప్పటికే ప్రెస్ నోట్ విడుదల చేసి ఆ అంశానికీ, విజయవాడకు లింక్ చేయడం సమంజసం కాదని చెప్పారు. అయినా రాజకీయ నాయకులు ఈ అంశాన్ని మరీమరీ ప్రస్తావించడం సరికాదు. నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో లేవన్న విషయం అటు డీఆర్ఐ, కేంద్ర సంస్థలు, ఇటు పత్రికలు ధృవీకరిస్తున్నా, సీనియర్ నాయకులు అపోహలు సృష్టించడం భావ్యం కాదు. ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది. వారి కార్యకలాపాలు ఇసుమంతైనా ఏపీలో లేవు’ అని డీజీపీ సవాంగ్ తెలిపారు. చదవండి: ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్ -
భారత్‌లోకి ఉగ్ర మూకలు?
భుజ్(గుజరాత్)/కోయంబత్తూరు: కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆ దేశం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో గుజరాత్ తీరం కచ్ జిల్లాలోని కాండ్లా, ముంద్రా పోర్టులతోపాటు కీలక సంస్థల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోయంబత్తూర్‌లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. పాక్ కమాండోలు సముద్రం మీదుగా భారత్‌లోకి ప్రవేశించి మత విద్వేషాలు సృష్టించడంతోపాటు నీటిలో ఉండి దాడులకు తెగబడే అవకాశాలున్నాయంటూ భారత నేవీ హెచ్చరికలు పంపిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. కచ్ తీరంలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ముంద్రా పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఇది ఒకటి కాగా, ప్రభుత్వరంగ కాండ్లా నౌకాశ్రయం ద్వారా పెద్ద మొత్తంలో సరుకు రవాణా జరుగుతుంది. అరేబియా సముద్ర తీరంలోని ఈ రెండు పోర్టులు పాకిస్తాన్‌కు చేరువలో ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో జామ్‌నగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద రిలయన్స్ చమురుశుద్ధి కర్మాగారం, వడినార్ వద్ద రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ ఆయిల్ రిఫైనరీలున్నాయి. ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కచ్ జిల్లాలోని కాండ్లా పోర్టుతోపాటు కీలక సంస్థల వద్ద భద్రతను భారీగా పెంచాం’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బోర్డర్ రేంజ్) డీబీ వఘేలా తెలిపారు. పోలీసులు, మెరైన్ బలగాలు, ఇతర భద్రతా సంస్థలు ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశాయి. తీరప్రాంత భద్రతా చర్యలను పటిష్టం చేశామని, ఉగ్రవాదులు పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నయినా తిప్పికొట్టేందుకు బలగాలను అప్రమత్తం చేశామని డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ మురళీధర్ పవార్ తెలిపారు. ఐఎస్ లింకులపై ఎన్ఐఏ తనిఖీలు ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై కూపీ లాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం కోయంబత్తూరులో విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఎర్నాకులంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జారీ చేసిన వారంట్ల మేరకు నిందితుల సంబంధీకులకు చెందిన ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశాం. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, 5 సెల్ఫోన్లు, 4 సిమ్ కార్డులు, 1 మెమరీ కార్డు, 8 సీడీలు/డీవీడీలు, అభ్యంతరకర పత్రాలు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎస్ కార్యాకలాపాలకు సంబంధించిన సమాచారంపై కొందరిని ప్రశ్నించామని తెలిపింది. కాగా, గత వారం రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన లష్కర్–ఇ– తైబా ఉగ్ర సంస్థ సభ్యులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెడదారి పట్టిన యువతను సోషల్ మీడియా ద్వారా కొందరు వ్యక్తులు ఐఎస్ ఉగ్ర సంస్థలోకి ఆకర్షించి కేరళ, తమిళనాడుల్లో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ మేలో కేసులు నమోదు చేసింది. -
భారత్‌కు చేరిన చినూక్ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు మొదటి దఫా అందాల్సిన నాలుగు చినూక్ సైనిక హెలికాప్టర్లు భారత్‌కు చేరాయి. గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయానికి ఆదివారం చేరిన నాలుగు సీహెచ్47ఎఫ్(ఐ) రకం హెలికాప్టర్లను త్వరలోనే చండీగఢ్ ఐఏఎఫ్ స్థావరానికి తరలిస్తామని బోయింగ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బలగాలను, సైనిక సామగ్రిని, ఇంధనాన్ని తరలించడంతోపాటు విపత్తు సమయాల్లో వినియోగించుకునేందుకు ఇవి ఎంతో అనుకూలమైనవి. 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్ హెలికాప్టర్లను భారత్‌కు బోయింగ్ సమకూర్చాల్సి ఉంది. -
52 కేజీల బంగారం స్వాధీనం
గాంధీధామ్(గుజరాత్): దుబాయి నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న రూ.15 కోట్లు విలువైన 52కేజీల బంగారాన్ని ముంద్రా పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు. ఈ బంగారం పరమ్ ఎక్విప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినది, గుడ్ల ఇంక్యుబేటర్స్‌లో బంగారం తరలిస్తుండగా పట్టుకున్నామని డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ హెచ్.కె.సింగ్ తెలిపారు.


