రూ.15 కోట్లు విలువైన 52కేజీల బంగారాన్ని ముంద్రా పోర్టులో డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు.
గాంధీధామ్(గుజరాత్): దుబాయి నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న రూ.15 కోట్లు విలువైన 52కేజీల బంగారాన్ని ముంద్రా పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు.
ఈ బంగారం పరమ్ ఎక్విప్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినది, గుడ్ల ఇంక్యుబేటర్స్‌లో బంగారం తరలిస్తుండగా పట్టుకున్నామని డీఆర్‌ఐ డిప్యూటీ డైరెక్టర్ హెచ్.కె.సింగ్ తెలిపారు.