జగిత్యాల జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | Congress Jeevan Reddy Serious Comments On MLA Sanjay | Sakshi
Sakshi News home page

జగిత్యాల జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Mar 17 2026 1:22 PM | Updated on Mar 17 2026 3:40 PM

Congress Jeevan Reddy Serious Comments On MLA Sanjay

సాక్షి, జగిత్యాల: మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నానని చెబుతున్న సంజయ్‌.. నన్ను తనతో కలిసి పనిచేయాలని ఎలా అడుగుతారంటూ ప్రశ్నలు సంధించారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఒంటిచేత్తో అధికారపార్టీతో పోరాటం చేసిన నేను మంత్రి కావాలనుకోవడం తప్పా?. పార్టీ ఫిరాయింపునకు నాకు అవకాశం లేకుండేనా? అని ప్రశ్నించారు. 

మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు దశాబ్దాల బంధాన్ని విడిచి పెట్టుకోవడం ఎవరికైనా ఇబ్బందే. ఆ స్థితిలో నేను ఇవాళ బాధ పడుతున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ.. నన్నే తనతో కలిసి పని చేయాలని ఆఫర్ ఇస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడంలో తప్పు లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, హక్కులను కాల రాయడం, అభ్యర్థుల ఎంపిక చేయడం ఇవన్నీ సమంజసమా?.  

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశాను. ఇందుకు ఎమ్మెల్యే సంజయ్ కారణం కాదా. 1995లో చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఎక్కడా పోటీకి కూడా వెనుకంజ వేసిన కాలంలో జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం అన్నీ గెల్చుకున్నాం. వీడిపోవడానికి కారకుడైన వ్యక్తి ఇవాళ కలిసి పని చేస్తానంటున్నాడు.  నేను ఎక్కడ ఉన్నా అంకితభావంతో పనిచేస్తా. ఈ ఎమ్మెల్యే సంజయ్ ఒత్తిడితో ఓ ఆడబిడ్డ మున్సిపాలిటీలో ఇబ్బంది పడింది నిజం కాదా?. నాకు ఆఫర్‌ ఇవ్వడానికి సంజయ్‌ ఎవరు?. నేను పార్టీ వీడుతానని ఆయనకు చెప్పానా?. పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు?. అసలు సంజయ్‌ ఏ పార్టీలో ఉన్నారు?. నన్ను ఎలా కలిసి రమ్మంటారు?. సంజయ్‌ బీఆర్‌ఎస్‌లో ఉన్నారని స్పీకర్‌ అంటున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని సంజయ్‌ అంటున్నారు. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.  

కాంగ్రెస్‌కు గుడ్ బై... నేను పార్టీ మారడం ఖాయం

ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకోడు. చట్టసభల్లో ఎంపికైన వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలి. నేను ఇంతవరకు కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నాను. ఉండాలని ఇంకా కోరుకుంటున్నా. ఇంట్లో ఉడుం లాగా వచ్చి చేరితే ఆయనతో కలిసి ఎలా పనిచేస్తాం. నిన్నటి వరకు రాష్ట్రానికి జగిత్యాల ఆదర్శంగా ఉంటే ఇవాళ వివాదాలకు కేరాఫ్ చేశాడు. రాముడు నాకు ఆదర్శం. అందుకే శ్రీరామనవమి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టుకున్నా. నేను పార్టీ మారితే దానికి కారణం ఎమ్మెల్యే సంజయ్, ఆయన వెనుకున్న వారే కారణం అవుతారు. ఈ ఎపిసోడ్‌లో కాంగ్రెస్ అధిష్టానానిదే బాధ్యత. నాకు పార్టీ మారాలనే యోచనకు కారణం ఈ ఆవేదనే’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement