breaking news
BRS Party
-
ఏం చేసిందని కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏం చేసిందని.. హస్తం పార్టీకి ఓటు వేయాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ బీ టీమ్ అంటూ మాపై నిందలు వేసి.. కాంగ్రెస్ నేతలు మాత్రం దోస్తీ చేస్తారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది అని చెప్పుకొచ్చారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్బంగా మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి షేక్‌పేట డివిజన్ పర్యటించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘2014 నుంచి పదేళ్లలో హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశాం. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయి. గంగా-జమున తహసీబ్ సంస్కృతి ఉన్న ఇక్కడ ఎప్పుడు మతకల్లోలాలు జరగలేదు. పదేళ్ల పాలనలో అందరూ ప్రశాంతంగా జీవించారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిస్టమస్ గిఫ్టులు అందించాం. కేసీఆర్ హిందు. ఆయన ఎన్నో యాగాలు చేశారు. అయినా ప్రతి మతాన్ని గౌరవించారు. కొత్త సచివాలయం నిర్మించినప్పుడు అక్కడ ఒక మజీద్, ఒక చర్చి, ఒక దేవాలయం నిర్మించారు. ఆయన సెక్యులర్ లీడర్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలో ఒకసారి ఆలోచించాలి. ఏం చేశారని వారికి ఓటేయాలి?. ప్రజలు ఆదరించే వ్యక్తిని కొన్ని పార్టీలు ఏదో ఒక సాకుతో ఆదరణ లేకుండా చేస్తాయి. బీజేపీతో బీ టీమ్ అని మాపై నిందలు వేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు నడిస్తే వ్యతిరేకించే రాహుల్ గాంధీ హైదరాబాదులో బుల్డోజర్లను ఎందుకు వ్యతిరేకించడం లేదు?. కేంద్రంలో సీబీఐపీ బీజేపీ తొత్తు అని రాహుల్ గాంధీ ఆరోపిస్తారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎంక్వయిరీ చేయమని సీబీఐకి అప్పగిస్తుంది.వక్ఫ్ బిల్లును మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కోసం జీవో తెచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వక్ఫ్ బిల్లును అమలు చేసేందుకు తొందర పడలేదు. ఇక్కడ ఒక మంత్రిపై ఈడీ దాడులు జరిగి సంవత్సరం అయినా ఎలాంటి చర్యలు లేవు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ రూ. 1350 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటికీ ఒక్క ముస్లిం వ్యక్తికి ప్రాతినిధ్యం లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే ఒక ఎమ్మెల్సీ సీటు ముస్లింలకు కేటాయించి మంత్రి పదవి ఇవ్వచ్చు.. కానీ అలా చేయడం లేదు.తెలంగాణలో అన్ని అన్ని మతాల వారికి ప్రాధాన్యం ఉంటుంది. మేము కుల రాజకీయం, మత రాజకీయం చేయం. మేం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఐటీలో ఉద్యోగాలు మూడు రేట్లు పెరిగాయి. మైనారిటీ విద్యార్థుల కోసం 204 విద్యాలయాలు ఏర్పాటు చేశాం. మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల ద్వారా మైనారిటీ విద్యార్థులకు చేయూతనిచ్చాం. లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టించాం. సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌లో మేము బ్రహ్మాండంగా గెలిచాం. మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ప్రస్తుతం అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అలవి గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.బీఆర్ఎస్ పాలనా కాలంలో కరోనా సమయంలో కూడా అభివృద్ధి ఆగలేదు. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో రోడ్లు నిర్మించాం. విద్యావంతులు ఓటు వేయడానికి నిరాసక్త చూపిస్తారు. మీరు కూడా ఓటు వెయ్యాలి. రాజకీయాలపై విద్యావంతులు ఆసక్తిగా ఉండరని అందుకే ఓటు వేయరని నాకు తెలుస్తుంది. కానీ అలా చేయడం సరికాదు. మీరు ఓటు వేయకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు మీ భవిష్యత్తును నిర్ధారిస్తారు. కాబట్టి మంచి నాయకులను మీరు ఎన్నుకోవాలి. ఓటు అడిగే వారిని ఓటు ఎందుకు వేయాలి మీరు ఎదురు ప్రశ్నించాలి అని’ కామెంట్స్ చేశారు. -
జూబ్లీహిల్స్ ఎన్నిక.. ఈసీ నిర్ణయంతో బీఆర్ఎస్కు కొత్త టెన్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. ఈ క్రమంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తుల కేటాయింపులు చేసింది. దీంతో, గుర్తుల విషయమై గత అనుభవాల దృష్ట్యా బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.గతంలో ఈ సింబల్స్ తొలగించాలని బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కారు గుర్తుకు దగ్గరగా ఉన్న గుర్తుల కారణంగా సింబల్స్ గుర్తింపులో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, ఈ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల కలర్ ఫొటోలను సైతం ఎన్నికల సంఘం ఇవ్వనుంది. కాగా, బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి (కమలం), రెండో స్థానం కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్‌యాదవ్ (హస్తం), మూడో స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ (కారు)కు కేటాయించారు.ఇదిలా ఉండగా.. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో సాయిరాం వెల్లడించారు. అయితే, ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈ సారి పోటీలో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు. -
ఎన్నికల విధులకు ఆటంకం.. సల్మాన్‌ఖాన్‌పై కేసు నమోదు
బంజారాహిల్స్: అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు గాను బీఆర్ఎస్ నేత సల్మాన్‌ఖాన్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.బోరబండకు చెందిన సల్మాన్‌ఖాన్ హెచ్వైసీ పార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. బుధవారం స్క్రూట్నీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాం తన నామినేషన్‌ను తిరస్కరించడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమేగాక విధులకు ఆటంకం కలిగించారు. అసభ్య పదజాలంతో దూషించారు. తన నామినేషన్‌ను కావాలనే తిరస్కరించారని, దీనిపై కాంగ్రెస్ ఒత్తిడి ఉందంటూ ఆరోపించారు. అతడి వైఖరి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమైనందున అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇదిలా ఉండగా సల్మాన్‌ఖాన్ గురువారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విషయం విదితమే. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చింది. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చారు. కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారు. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చింది. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోంది. అసమర్థ, పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రిని నాజీవితంలో చూడలేదు. రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప.. తెలంగాణకు పట్టిన శని పోదు. ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో ఐఏఎస్ అధికారి రిజ్వీ బలి. 500కోట్ల టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి జూపల్లి మధ్య పంచాయితీ వచ్చింది. మంచిరేవుల భూముల వ్యవహారంలో రేవంత్ తమ్ముడు, మంత్రి కొండా కుటుంబం మధ్య గొడవ. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు?. రేవంత్.. శంకరాహిల్స్లో ఏం చేస్తున్నారో.. సర్వే నంబర్ 83లో ఏం చేయాబోతున్నారో మాకు అన్నీ తెలుసు.ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంపకాల విషయంలో గొడవలతో తెలంగాణ పరువు పోయింది. తన మాట వినలేదని.. మంచి అధికారి మీద మంత్రి జూపల్లి కక్ష తీర్చుకుంటున్నాడు. ముమ్మాటకీ రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠానే నడుపుతుంది. దండుపాళ్యం ముఠాకి నాయకుడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం కాదు.. మాఫియా రాజ్యాం నడుస్తుంది. ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పారు. తుపాకీ ఇచ్చింది రేవంత్.. పెట్టింది రోహిణ్ రెడ్డి అని మంత్రి కొండా కుమార్తె చెప్తుంది. మంత్రి కుమార్తె ఆరోపణలపై ఎందుకు విచారణ జరపటం లేదో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాలి.మంత్రి ఉత్తమ్‌కు సంబంధం ఉందని మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలి. పింక్ బుక్, రెడ్ బుక్ లేదు.. ఖాకీ బుక్ మాత్రమే ఉందని శివధర్ రెడ్డి అన్నారు. ఖాకీ బుక్ ఎక్కడో డీజీపీ చెప్పాలి. మంచి అధికారిగా శివధర్ రెడ్డికి పేరుంది. రోహిణ్ రెడ్డి, సుమంత్ ను లోపల వేసి తన నిజాయితీని డీజీపీ నిరూపించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ ఇల్లా.. సెటిల్మెంట్కు అడ్డానా?. కేబినెట్ మీటింగ్‌లోనే మంత్రులు తిట్టుకుంటున్నారు. పొంగులేటి అరాచకాలకు ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు అడ్డుకట్ట వేయటం లేదు?. ముఖ్యమంత్రి, మంత్రుల పంచాయితీ మధ్య అధికారులు నలిగిపోతున్నారు.ప్రభుత్వ పెద్దల అన్యాయాలకు అండగా నిలిచే అధికారులకు శిక్ష తప్పదు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తుంది. ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే.. వందల కోట్లు అయినా సంపాదించుకోవాలని మంత్రులు చూస్తున్నారు. తెలంగాణ పరువును సీఎం, మంత్రులు నడిబజారులో నిలబెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సిగ్గుతో తల దించుకునేలా పరిస్థితులు ఉన్నాయి. పారిశ్రామికవేత్తల తలకు తుపాకీలు పెట్టి బెదిరిస్తున్నారు. ఐఏఎస్ రిజ్వీ చాలా సిన్సియర్ అధికారి. ఆయన్ను బలిపశువును చేశారు. పదేళ్లు సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్కు వెళ్ళే పరిస్థితి తెచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారో.. నవంబర్14న మాట్లాడుకుందాం అని వ్యాఖ్యానించారు. -
జూబ్లీహిల్స్ నామినేషన్ల స్క్రూటినీ పూర్తి.. మిగిలింది 81 మందే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills ByPoll) బరిలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతరం, బుధవారం నామినేషన్ల స్క్రూటినీ(Nominations Scrutiny Completed) ప్రక్రియ ముగిసింది. 17 గంటల పాటు జరిగిన వడపోత అనంతరం పోటీలో 81 మంది అభ్యర్థులు మిగిలారు. 135 నామినేషన్లను ఎన్నికల అధికారి ఖరారు చేశారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఇక, రేపు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంది. వీరిలో ఎంత మంది విత్‌డ్రా చేసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. స్క్రూటినీ సందర్బంగా సరైన ఫార్మాట్లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటంతో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.ఇది కూడా చదవండి: స్థానికంపై నేడు నిర్ణయం! -
కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ కీలక భేటీ
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills By poll) ప్రచారం, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నట్టు సమాచారం. తాజా భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) బుధవారం ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే, తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇక, రేపు(గురువారం) కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఇన్‌చార్జ్‌లతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రచార వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పార్టీలకు షాకిస్తూ భారీ సంఖ్యలో నామినేషన్లు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వచ్చారు. దీంతో, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని షేక్‌పేట మండల కార్యాలయంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఆఖరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. బుధవారం తెల్లవారుజాము మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.నామినేషన్ల చివరిరోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. మంగళవారం గంటల నుంచే అభ్యర్థులు క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా అభ్యర్థులు భారీగా ఉండటంతో అధికారులు వారికి టోకెన్లు జారీ చేశారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు 15 నిమిషాలు పట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులతోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్, రిటర్నింగ్ అధికారి సాయిరాం తదితరులు అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈసీని బుధవారం వరకు గడువు కోరారు. దీంతో ఈసీ అనుమతి మేరకు టోకెన్లు ఎంత మందికి జారీ చేస్తే వారందరి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవాలని.. బుధవారం ఈ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆర్వో కేంద్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తంగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నామినేషన్లను అధికారులు ఈరోజు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.ట్రిపుల్ ఆర్ బాధితులు... ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో 11 మంది రైతులు సైతం మంగళవారం నామినేషన్లు వేశారు. ఆర్ఆర్ఆర్ వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోనందున తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. అలాగే 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసిత రైతులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. వారితోపాటు సుమారు 200 మంది భూ నిర్వాసితులు నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి టీజీఐఐసీ పేరిట మార్చిన పట్టా భూములను తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకే నామినేషన్లు వేశామని అభ్యర్థులు తెలిపారు. మరోవైపు.. రిటైరైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదంటూ పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు సైతం నామినేషన్లు వేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. -
సీఎం వద్దే హోంశాఖ.. పోలీసులకే రక్షణ లేదు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దీపావళి సందర్బంగా హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రౌడీషీటర్.. పోలీసును హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బహిర్గతం చేసింది. పోలీసులకే రక్షణ లేకపోవడమేంటి?. ముఖ్యమంత్రి దగ్గర హోమ్ శాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు. కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల లాగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది.పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడేది వాస్తవం కాదా?. మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులే అంత ఓపెన్‌గా మాట్లాడుతుంటే.. ఇంకా తప్పు జరగలేదని ఎవరు భావించాల్సి ఉంటుంది?. ఈ అంశంపై సిట్ విచారణ చేపట్టాలి. పెట్టుబడిదారులను బెదిరించి.. గన్ కల్చర్ చేపట్టి వాటాలు పంచుకుంటున్నారు. మేము అగ్రికల్చర్‌ను తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గన్ కల్చర్‌ను తీసుకొచ్చింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘దండుపాళ్యం’ పాలన ఎవరిదో అందరికీ తెలుసు
హైదరాబాద్: ‘దండుపాళ్యం’ పాలన అంటే ఎవరిదో అందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అందుకే గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారం లేదన్న అసహనం, నిరాశలో ‘కేబినేట్’పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మంత్రుల మధ్య కుమ్ములాటలు, కేబినేట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారంతా సినిమాల్లో ‘రచయితలు’ గా ప్రయత్నించాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినేట్ సమష్ఠిగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమిస్తున్న మా మంత్రులకు ప్రత్యేకంగా వ్యక్తిగత అజెండా అంటూ ఏదీ లేదన్నారు. మాకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలే మా అందరి అజెండా అని తేల్చి చెప్పారు. మేం వేసే ప్రతి అడుగు రాష్ట్రాభివృద్ధి కోసమేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహాలకు తావు లేదని స్పష్టం చేశారు. ‘విలువ ఆధారిత వృద్ధే’ లక్ష్యంగా మా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందన్నారు. మేం పాలనను గాలికొదిలేస్తే గత 20 నెలల్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. మంత్రులంతా వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకుంటే "ఎలీ లిల్లీ" లాంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మాది మాటల ప్రభుత్వం కాదని... చేతల్లో చేసి చూపించే ప్రజా ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. మీ అహంకారపూరిత వ్యవహారశైలి, పాలనా వైఫల్యాల చరిత్రను దాచుకునేందుకు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను నమ్మరని గుర్తు చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.6 నెలల్లోనే రూ.12,864 కోట్ల ఎఫ్‌డీఐలు..‘పారిశ్రామికాభివృద్ధి విషయంలోనూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) ఆకర్షణలో తెలంగాణ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్ డీఐలు వచ్చాయి. 2023–24లో ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనే టాప్ – 3 అర్బన్ ఎఫ్ డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘2023-24లో పరిశ్రమల జీఎస్ వీఏ రూ.2.46 లక్షల కోట్లు. అది 2024-25లో 12.6 శాతం పెరిగి రూ.2.77 లక్షల కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 8.68 శాతం. గతేడాదితో పోలిస్తే 2.1 శాతం అధికంగా నమోదయ్యింది. అదే జాతీయ సగటు వృద్ధి రేటు 6.2 శాతం మాత్రమే’ అని పేర్కొన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
కానీ.. ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పాలకులు యువత ఆకాంక్షలను రాజకీయాల కోసం వాడుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. వారి కుటుంబం కోసమే గత పాలకులు ఆలోచించారు. గత పాలకులు నిజాం నవాబులతో పోటీపడి సంపద పెంచుకున్నారంటూ ఆరోపించారు.‘‘గత పదేళ్లలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేదు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. ఎకరానికి రూ.కోటి సంపాదించే విద్య ఉందని గత పాలకులు చెప్పారు. కానీ ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు. గత పాలకులు వారి కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నారు. కానీ గ్రూప్-2 నియామకాలు చేపట్టాలని ఆలోచించలేదు’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పదిహేనేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా?. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నాం...మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్-1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్..మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలి. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి. గత పాలకుల పాపాల పుట్ట పలుకుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
‘బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా’
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కారణంగా బంద్ కొనసాగుతోంది. బంద్‌లో అన్ని రాజకీయ పార్టీ నేతలు పాల్గొంటున్నారు. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండాపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారు. కామారెడ్డి డిక్లరేషన్ బూటకం. కానీ, బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం. చెల్లని జీవోలను, ఆర్డినెన్స్‌ను విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది. సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి’ అని కామెంట్స్ చేశారు. మాజీమంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ పాల్గొంటున్నాయి. మొక్కుబడిగా బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వామ్యం కావద్దు. బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గవద్దు అంటూ కామెంట్స్ చేశారు. -
జూబ్లీహిల్స్ ఓట్ చోరీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీపై హైకోర్టు విచారణ చేపట్టింది. బోగస్ ఓట్లు తొలగించాలంటూ మాగంటి సునీత, కేటీఆర్ లంచ్ మోషన్ పిటీషన్లు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌తో సంబంధం లేనివారు ఓటర్ జాబితాలో చేరారని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది దామా శేషాద్రినాయుడు తన వాదనలు కోర్టుకు వినిపించారు. ‘‘జూబ్లీహిల్స్‌లో 19వందలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయి. కొంతమందికి రెండు ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు కూడా నమోదయ్యాయి’’ అని ఆయన కోర్టుకు తెలిపారు.పిటీషనర్లు చీఫ్ ఎలక్ర్టోరల్ అధికారికి ఫిర్యాదు చేశారని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అవినాష్.. కోర్టుకు తెలిపారు. ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ.. 21వ తేదీ వరకు పరిశీలన చేస్తారన్న ఈసీ తరఫు న్యాయవాది.. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని సైతం వివరణ అడిగినట్లు తెలిపారు.పిటీషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు.. ఈసీ తరఫు న్యాయవాది వాదనలను సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. పిటీషనర్ విజ్ఞప్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న ఈసీ న్యాయవాది వాదనలను హైకోర్టు రికార్డు చేసింది. ఈ పిటీషన్లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. -
18న బీసీ సంఘాల బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మద్దతు కోరుతూ ఆ సంఘాల నేతలు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మాదిరే సమస్యను ఢిల్లీ దాకా తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే ఓటు వేసేది తమ ఎంపీలేనన్నారు.‘‘ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే చాయ్ తాగినంతసేపట్లో రిజర్వేషన్లు వస్తాయి. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుంది...పార్లమెంటులో బిల్లు పెడితే కచ్చితంగా అనుకూలంగా పాస్ అవుతుంది. బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి తీసుకెళ్తే మేము వచ్చి మద్దతు ప్రకటిస్తాం. ప్రధాని స్వయంగా ఓబీసీ కాబట్టి, ఆయనకి బీసీ రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి ఉంటే మంచిది’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
కేసీఆర్ రీఎంట్రీకి ఇదే మొదటి మెట్టు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమకు మంచి రోజులు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటమి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయడానికి బయల్దేరే ముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ మాకు మంచి రోజులు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అన్ని పనులు ఆగిపోయాయి. హైడ్రా పేరిట శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. కాబట్టి ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం.. .. గులాబీ దండు జైతయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం అవుతుంది. కేసీఆర్ పునరాగమనానికి ఇదే తొలి మెట్టు. ప్రజల దీవెనలు బీఆర్ఎస్కే ఉంటాయని ఆశిస్తున్నాం. మాగంటి సునీత గెలుపునకు బీఆర్ఎస్ సమిష్టిగా కృషి చేస్తుంది అని కేటీఆర్ అన్నారు.నామినేషన్ వేసిన సునీతజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీస్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు ఉన్నారు. పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని, బీఆర్ఎస్ గెలిస్తే బుల్డోజర్ అరాచకాలకు పుల్‌స్టాప్ పడ్డట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: వీడిన సస్పెన్స్.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే..? -
బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత
-
బీఆర్ఎస్కు మా బలమేంటో చూపిస్తాం: నవీన్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Telangana Election) ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తోందని విమర్శించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాంగ్రెస్ బలమేంటో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూపిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్(Naveen Yadav) తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఎన్నికల్లో నన్ను ఎదుర్కోనే ధైర్యం లేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాపై తప్పుడు కేసులు పెడుతున్నాయి. ఓటర్ కార్డుల కేసులో నిర్ధోషిగా తేలుతాను. బీసీ బిడ్డను అయినా అందరివాడిని. టికెట్ కోసం ప్రయత్నించిన అందరిని కలుపుకుని పోతాను. రూ.180 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.. ఇంకా చేస్తాం. బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ఇక్కపై చెల్లవు కాంగ్రెస్ బలమేంటో ఉప ఎన్నికల్లో తెలుస్తుంది. మా బలం చూపిస్తాం అని చెప్పుకొచ్చారు. -
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉద్రిక్తత
బీఆర్ఎస్ నేతల బస్‌భవన్ అప్డేట్స్.. వినతి పత్రం అందజేత..పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని కోరిన బీఆర్ఎస్ నేతలు. ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?: హరీష్ ఫైర్హరీష్ రావు కామెంట్స్..ప్రజా ప్రతినిధులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం.ఇది అప్రజాస్వామికం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం.నాయకులను, కార్యకర్తల్ని ఎందుకు అరెస్టులు చేస్తున్నారు.ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు.భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారు. విద్యార్థులకు డబుల్ చేశారు.ఇప్పటికే జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు.పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డివాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తం పీల్చుతున్నడు రేవంత్ రెడ్డి.మెట్రో రైలును ఆగం చేసిండు.కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా?ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా?ఇది ప్రజా పాలనా లేక ప్రజా పీడననా?రేవంత్ రెడ్డి ఏం చేసినా ఎవ్వరూ అడగొద్దు అన్నట్లు ఉంది.ప్రజాస్వామ్య పాలన అని రాక్షస పాలన సాగిస్తున్నడు.మాటల్లో రాజ్యాంగ రక్షణ, చేతల్లో రాజ్యాంగ భక్షణ?టికెట్ ధరల పెంపు పై బస్సులో ప్రయాణించి ఆర్టీసి ఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేదా?తెలంగాణలో హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి దుష్ట పాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియా పై కఠిన ఆంక్షలు.ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి?ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు.ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నావు.మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు.ప్రజా క్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం.అడ్డగోలుగా పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాంకమీషన్లు దంచుడు కాదు, పేదల కోసం పని చెయ్యినిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు.ఆర్టీసీ ధరలు పెంచితే మెట్రో ఎక్కుతారు అని రేవంత్ ఆలోచన..ఆర్టీసీ అమ్మాలని,ప్రైవేట్ పరం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తుంది.ఎలక్ట్రానిక్ బస్ ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది..ఉప్పల్ మియాపూర్ వర్క్ షాప్స్ అమ్మకానికి పెట్టారు.బస్ స్టాండ్ లు కూడబెట్టి 1500 కోట్లు తెచ్చారు.ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమేనా కాంగ్రెస్ పనికార్గో ను అమ్మి ప్రైవేట్ చేయాలని చూస్తుందిపేదల నడ్డి విరుస్తున్నారు.రాహుల్ గాంధీ రాజ్యాంగం గూర్చి మాట్లాడుతారు..రేవంత్ రెడ్డి రాజ్యాంగ భక్షణ జరుగుతుంది.ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఆర్టీసీ ధరలు తగ్గించేవరకు బీఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేస్తుంది.కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ "చలో బస్ భవన్" కార్యక్రమానికి పిలుపునిచ్చినంమహిళలకు ఉచితం అని పురుషులకు టికెట్ల రేట్లు డబుల్ చేస్తే.. బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబం మీద భారం పడదా?పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని… pic.twitter.com/SPcfWGMspW— BRS Party (@BRSparty) October 9, 2025 ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉద్రిక్తతబస్ భవన్‌కు వెళ్ళే మారాన్ని మూసేసిన పోలీసులుసంధ్య థియేటర్ దగ్గర బారీకేడ్స్ ఏర్పాటుకేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను ఆపేసిన పోలీసులుఆర్టీసీ ఎండీని కలవటానికి ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు అనుమతిపెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి మెమొరాండం ఇవ్వనున్న కేటీఆర్, హరీష్ తోపులాటపోలీసులకు, బీఆర్ఎస్ కేడర్‌కు తోపులాట, వాగ్వివాదంబారికేడ్స్ తోసేసుకుని బస్ భవన్ వైపు వెళ్తోన్న బీఆర్ఎస్ నేతలు, క్యాడర్సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు 👉బస్ భవన్ బయలుదేరిని కేటీఆర్, హరీష్ రావు👉హైదరాబాద్‌లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్(BRS Chalo Bus Bhavan) గురువారం ‘చలో బస్‌భవన్’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గురువారం ఉదయమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.👉ఇక, చలో బస్‌భవన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్ వరకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. ఇదేనా ప్రజాపాలన?ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు మీదనిరసన తెలుపకుండా అణచివేతకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సహా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్న పోలీసులు. pic.twitter.com/uwMIm6FhN7— BRS Party (@BRSparty) October 9, 2025👉ఈ సందర్భంగా కేటీఆర్ స్పందించారు.‘పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లి లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. చార్జీలను వెనక్కి తీసుకోవాలని.. అందుకు కోరాలని అనుకున్నాము. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తా అంటే భారీగా పోలీసులను ప్రభుత్వం ఇంటి ముందు మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారు. మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిది. ఎన్ని రకాల కుట్రలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటాము. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు.. మా పార్టీకి కొత్త కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
సోషల్ వార్.. పొలిటికల్ పోరు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ చానెళ్లను పెయిడ్ చానెళ్లుగా మార్చిన పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో వైరి పార్టీలపై విమర్శలు, ప్రతివిమర్శల్ని మరింత ముమ్మరం చేయనున్నాయి.ఓవైపు తమ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థి పార్టీ లోపాల్ని అంతకంటే వేగంగా ఎండగడుతున్నాయి. వాయువేగంతో అవి వాట్సప్ గ్రూపు ల్లోనూ షేర్ అవుతుండటంతో ఏ కామెంట్ ఎప్పుడు వైరల్‌గా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించింది. కాంగ్రెస్‌లో అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు. నామినేషన్ల దాఖలుకు కూడా ఇంకా సమయముంది. ఇంతెందుకు ఎన్నికల షెడ్యూలు వెలువడకముందే.. ఇప్పటికే కొంతకాలంగా బీఆర్ఎస్, కాంగెస్ర్ ఒకదానిపై మరొకటి సోషల్‌మీడియా వేదికగా తీవ్ర యుద్ధమే చేస్తున్నాయి. తమ పార్టీల పేరిట, పార్టీ సైన్యాల పేరిట ప్రత్యర్థులపై ఇవి విసురుతున్న విమర్శనా్రస్తాలు ప్రజల అరచేతిలోని మొబైల్‌కు తీరిక లేకుండా చేస్తున్నాయి.ఎవరి సత్తా వారిదే.. అధికార పార్టీ కాంగ్రెస్ తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాల అప్డేట్స్ను చేరవేయడంతో పాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన విధ్వంసాలు, నిర్వాకాలు అంటూ రూపొందించిన దృశ్యాల్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటినుంచో బలంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్‌ను తూర్పారబడుతోంది. ‘అప్పుడెట్లుండె పాలన.. ఎప్పుడేమైంది? అంటూ ప్రజల్లో కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. అంతేకాదు.. ప్రజాభిప్రాయాల పేరిట అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండూ వేటికవిగా తమ అనుకూల చానెళ్ల ద్వారా తమ పారీ్టకే ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. సొంతంగా వాట్సప్ చానెళ్లనూ నిర్వహిస్తున్నాయి. ఇన్ఫ్లూయెన్సర్లు, పెయిడ్ క్యాంపెయిన్లు, కంటెంట్ క్రియేషన్, రాజకీయ వ్యూహాల్లో ప్రధాన భాగమయ్యాయి. రీల్స్‌తో రిప్లయ్‌లు.. వీడియోలతో ప్రచారం, రీల్స్‌తో రిప్లయ్‌లు, ట్రెండ్‌గా మారాయి. ఇక ఆ పార్టీల సోషల్‌మీడియా టీమ్స్, వారియర్స్ నిరి్వరామంగా పని చేస్తున్నాయి. ఇదంతా రూ.కోట్ల మేర ప్రచారమని సంబంధిత రంగం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సగటు ఓటర్లు సైతం సోషల్‌మీడియాకు ప్రభావితమవుతున్నారు. ఏ పార్టీ ప్రచారం విస్తృతంగా ఉంటే దాని వలలో పడే పరిస్థితి ఏర్పడింది. పారీ్టలకు సైతం గ్రౌండ్ లెవెల్ ఫీడ్‌బ్యాక్ కంటే సోషల్ మీడియా కామెంట్ సెక్షన్, ఫీడ్‌బ్యాక్, లైక్స్, కీలకంగా మారాయి. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్ రాజకీయాలు హ్యాష్ ట్యాగ్స్‌తో జరుగుతున్నాయి. ఓటర్లు స్క్రోల్స్, థంబ్‌నెయిల్స్‌తో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. -
‘జూబ్లీహిల్స్’ ఉప ఎన్నిక.. విజయశాంతి సంచలన ఆరోపణ!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills by-election) ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బీఆర్ఎస్(BRS Party) పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(Vijaya Shanthi) ఆరోపించారు. ‘జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తున్న కారణంగా మిత్ర ధర్మం కోసం ఈ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగుతున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. బీజేపీ(BJP) డమ్మీ అభ్యర్థిని బరిలోకిదింపి తన రహస్య మిత్రపక్షమైన బీఆర్ఎస్ను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పైకి బీజేపీకి మద్దతిస్తున్నట్టు టీడీపీ ప్రకటించినా, రహస్యంగా బీఆర్ఎస్ గెలుపు కోసం తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయాలని సందేశం పంపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయాలనే కుట్రతో టీడీపీ మద్దతు బీఆర్ఎస్కు లభించే విధంగా బీజేపీ రహస్య అవగాహన కుదిర్చినట్టు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీల అవకాశవాద రాజకీయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరించే బాధ్యతను స్థానికంగా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని కోరుతున్నాను’అని సోమవారం విజయశాంతి ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఊప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బిఆర్ఎస్ పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తున్న కారణంగా కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం కోసం ఈ… pic.twitter.com/lZmuxZIK7X— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 6, 2025 -
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ దే గెలుపు
-
కేటీఆర్ దసరా శుభాకాంక్షలు.. వీడియో విడుదల
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు కలగాలని ఆకాంక్షించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి. దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు.. ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు’ అని వీడియో పోస్టు చేశారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి.దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.… pic.twitter.com/o0k5tk9OW6— KTR (@KTRBRS) October 2, 2025 -
ఫిరాయింపు ఆరోపణలు.. మొదలైన గూడెం విచారణ..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను చింతా ప్రభాకర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాలే యాదయ్య ప్రత్యక్ష విచారణ ముగిసింది. అనంతరం, మరో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ మొదలైంది.ఇదిలా ఉండగా..ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్లు.. పిటిషన్‌దారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ ను సోమవారం (సెప్టెంబర్ 29) విచారించిన విషయం తెలిసిందే. రెండో విడతలో భాగంగా బుధవారం (అక్టోబర్ 01) ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. ఇక, ఈరోజున కూడా అసెంబ్లీలో సోమవారం నాటి ఆంక్షలే అమలు అవుతున్నాయి. -
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. కేటీఆర్‌కు అనిరుధ్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యలకు తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటరిచ్చారు. కేటీఆర్ గారూ.. ప్రతీదీ రాజకీయం చేయవద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు.జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) తాజాగా మాట్లాడుతూ.. ప్రతీ విషయాన్ని రాజకీయ కోణం చూడకండి కేటీఆర్. బీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్యే ఏ రోజైనా తనకు సంబంధించిన విషయంపై మాట్లాడారా?. ప్రజలకు కావాల్సిన అంశంపై ఏ రోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా?. మా పార్టీలో.. మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ. మా ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. మీ పాలన నిరంకుశత్వ పాలన. మీ రౌడీయిజం అరాచకత్వ పాలన చూడలేకనే మీ పార్టీని బొంద పెట్టారు.నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం అని మీరు గమనించాలి. నేను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నా. మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా వాళ్లకు కమీషన్ వస్తే చాలని ఎప్పుడు కూడా ఈ సమస్యపై మాట్లాడలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సర్కార్ కాదు.. సర్కస్: కేటీఆర్ -
రేవంత్ ఫ్యూచర్ సిటీ కామెంట్స్ కు KTR కౌంటర్..
-
TG: స్పీకర్ ముందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ ప్రారంభించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఈ విచారణకు తన అడ్వకేట్లతో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ విచారణకు హాజరయ్యారు. కాసేపట్లో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరకానున్నారు.వచ్చే నెల ఒకటో తేదీన కూడా ఈ నలుగురిని ప్రత్యక్షంగా విచారించాలని స్పీకర్ నిర్ణయించారు. ఆ షెడ్యూల్‌ను ఇప్పటికే అసెంబ్లీ వర్గాలు అధికారికంగా విడుదల చేశాయి. ఒక్కో ఎమ్మెల్యే విచారణ గంటపాటు జరగనుంది. ఎమ్మెల్యే, ఆయన తరఫు న్యాయవాది, అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే, ఆయన తరఫు న్యాయవాది సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ ఈ విచారణ నిర్వహిస్తుంది.కఠిన ఆంక్షలు అనర్హత పిటిషన్లపై ప్రత్యక్ష విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు సోమవారం నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు అమల్లో ఉంటాయని ఆదివారం అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.👉ముందస్తు అనుమతి లేకుండా అసెంబ్లీ ప్రాంగణంలోకి సందర్శకులకు అనుమతి ఉండదు👉మీడియా ప్రతినిధులకు ప్రవేశం లేదు. మీడియా పాయింట్‌తో పాటు అసెంబ్లీ భవనాల్లో ఎక్కడా ప్రెస్ మీట్ నిర్వహించకూడదు.👉మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చినా వారి శాసనసభాపక్ష కార్యాలయాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది👉విచారణ జరిగే హాలులోకి పిటిషనర్లు, వారి న్యాయవాదులు, విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, వారి న్యాయవాదులెవరూ మొబైల్ ఫోన్లను తీసుకెళ్లకూడదు. ఎవరైనా విచారణ ప్రక్రియను రికార్డు చేసేందుకు ప్రయత్నించినా, ఫొటోలు తీసినా ఆ ఉపకరణాలను అసెంబ్లీ వర్గాలు స్వా«దీనం చేసుకుంటాయి. ఇందుకు బాధ్యులైన వారి న్యాయవాదులను విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా అనుమతించరు.ఏ ఎమ్మెల్యే ఎప్పుడంటే..!టి. ప్రకాశ్‌గౌడ్- ఉదయం 11–12 గంటల వరకుకాలె యాదయ్య 12 నుంచి ఒంటిగంట వరకు గూడెం మహిపాల్‌రెడ్డి మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 3 నుంచి నాలుగు గంటల వరకు (అక్టోబర్ ఒకటో తేదీన కూడా ఇదే సమయాల్లో ఆయా ఎమ్మెల్యేలను మరోమారు విచారించనున్నారు) -
ప్లాన్‌తోనే ఎంజీబీఎస్ బస్టాండ్‌ను ముంచేశారు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయరంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గ ప్రజలు రేవంత్‌పై రగిలిపోతున్నారన్నారు. కేటీఆర్ సమక్షంలో కొడంగల్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు.. బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశమన్నారు.‘‘కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ గెలవాలి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు పథకాన్ని రేవంత్ బంద్ చేస్తాడు. రేవంత్ రెడ్డి గురించి అందరి కంటే ఎక్కువ కొడంగల్ ప్రజలకే తెలుసు. రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ భూములను.. తొండలు గుడ్లు పెట్టని భూములంటూ రేవంత్ అవమానించాడు. కొడంగల్ రేవంత్‌రెడ్డి జాగీరా.. కొడంగల్‌కు రేవంత్‌రెడ్డి చక్రవర్తి కాదు. కొడంగల్ ప్రజల ఆగ్రహంలో వచ్చే ఎన్నికల్లో రేవంత్, కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంది...తెలంగాణకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. కొడంగల్‌కు తిరుపతిరెడ్డి ముఖ్యమంత్రి. వార్డు మెంబర్ కూడా కాని తిరుపతి రెడ్డికి.. కలెక్టర్, ఎస్పీ వంగి వంగి దండాలు పెడుతున్నారు. అన్నదమ్ములు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రేవంత్, తిరుపతి రెడ్డిలు రిబ్బన్ కట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారమే ఎంబీబీఎస్ బస్టాండ్‌ను ముంచాడు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను భయపెట్టేందుకే ఒకేసారి 15గేట్లు తెరిచారు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఎంబీబీఎస్ బస్టాండ్ మునిగింది. కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదలైంది. ఎల్లుండి(సోమవారం, సెప్టెంబర్ 29) నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను విచారించనునున్నారు. 12 గంటలకు కాలె యాదయ్య, ఒంటిగంటకు మహిపాల్‌రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ విచారణకు హాజరుకానున్నారు. అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది.కాగా, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌లు నిన్న (శుక్రవారం) రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒక్కో ఎమ్మెల్యే స్పీకర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానమిచ్చేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ను కోరినట్టు సమాచారం. అయితే, ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసులపై ఈ నెల 29వ తేదీ నుంచి స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రత్యక్ష విచారణకు ఇవాళ షెడ్యూల్ విడుదలైంది. -
కాంగ్రెస్‌కు బిగ్ ఝలక్.. బీఆర్ఎస్ ‘బాకీ కార్డు ఉద్యమం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రంలోని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచేందుకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని మొదలుపెట్టింది.తెలంగాణ భవన్లో మాజీ మంత్రులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ‘బాకీ కార్డు’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయన్నారు. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపుతట్టి, కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు విరుగుడే ఈ ‘బాకీ కార్డు’ అన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన దోఖాకు బదులు తీర్చుకునే సరైన మోకా తెలంగాణ ప్రజలకు వచ్చిందన్నారు. ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బకాయి పడిందో నిలదీసి నిగ్గదీసి అడగడానికే ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రస్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్డును ఇంటింటికీ తీసుకెళ్తారని చెప్పారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు."కాంగ్రెస్ బాకీ కార్డు" లను ఇంటింటికి తీసుకొని పోతాం..ప్రజలను జాగృతం చేస్తాం.. కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం!- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥#CongressBaakiCard pic.twitter.com/kgwwsLzMKa— BRS Party (@BRSparty) September 27, 2025..‘మోసపోతే గోస పడతామని ఎన్నికలకు ముందు కేసీఆర్ పదే పదే చెప్పారు. అదే నేడు నిజమైందన్నారు కేటీఆర్. మొదటి కేబినేట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటి వరకు 30కి పైగా కేబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదని విమర్శించారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నేడు మాట దాటవేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధును కూడా బంద్ చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.‘కాంగ్రెస్ బాకీ కార్డు’లోని ప్రతీ అక్షరం రేవంత్ సర్కార్ మోసానికి నిలువుటద్దమని కేటీఆర్ మండిపడ్డారు. ఏ వర్గాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిలువునా ముంచిందో ఆయన అంకెలతో సహా వివరించారు. అన్నదాతల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అడుగడుగునా దగా చేస్తున్నది. ఎకరానికి రూ.15,000 ఇస్తామన్న హామీ ఏమైంది?. రెండు లక్షల రుణమాఫీ ఊసేలేదు. వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారు, అది కూడా బాకీనే. ఇక కౌలు రైతులు, రైతు కూలీల కన్నీళ్లను పట్టించుకునే నాథుడే లేడు. వారికి ఇస్తామన్న 15,000, 12,000 ఏ గంగలో కలిపారు? ఇవన్నీ బాకీ కాదా? అని నిలదీశారు...మా తమ్ముళ్లు, చెల్లెళ్ల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. రెండు లక్షల ఉద్యోగాల హామీ బాకీ. నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ప్రతి నిరుద్యోగికి వేలల్లో బాకీ పడింది. ఈ మోసానికి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది? అని ప్రశ్నించారు...మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను ఇంత దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. నెలకు 2,500 ఇస్తామని చెప్పి, ఈ రోజుకు ఒక్కో మహిళకు దాదాపు 55,000 బాకీ పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక పెళ్లైన 8 లక్షల మంది ఆడబిడ్డలకు 8 లక్షల తులాల బంగారం బాకీ. ఇది నయవంచన కాదా? అని మండిపడ్డారు...వృద్ధులు, వితంతువుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదు. నెలకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ఒక్కొక్కరికి 44,000 బాకీ పడ్డారు. దివ్యాంగుల విషయంలో మరీ దారుణం. నెలకు 6,000 ఇస్తామని హామీ ఇచ్చి, కేసీఆర్ పెంచిన 4,000 మాత్రమే ఇస్తున్నారు. అంటే ప్రతి నెలా 2,000 కోత పెడుతూ, ఒక్కో దివ్యాంగుడికి 44,000 బాకీ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల తరఫున గొంతు విప్పుతున్న తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత వేధించినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఓవైపు న్యాయపరంగా పోరాడుతూనే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నయ వంచనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ఈ బాకీ కార్డులను ముద్రించామని, తెలంగాణ ప్రజలను జాగృతం చేసే ఈ ప్రచారానికి మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
అరెస్ట్ చేస్తే చేసుకోండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తాను ఏ తప్పూ చేయలేదు. ఏ విచారణకైనా సిద్ధం.. అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తేల్చి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లై డిటెక్టర్ టెస్ట్‌కు తాను సిద్ధం.. రేవంత్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రానే కారణమంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.‘‘మెట్రోపై ప్రభుత్వ నిర్ణయం బాధ్యతారాహిత్యం. మా హయాంలో మెట్రోకు మరింత ఊతమిచ్చాం. మెట్రో తొలి దశను మూడేళ్లలో పూర్తి చేశాం. మెట్రోకు రూ.900 కోట్లు రుణం కూడా ఇచ్చాం. మేం ఉన్నప్పుడు మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండేది. ఎయిర్‌పోర్టు వరకు విస్తరించాలని గతంలో నిర్ణయించాం. రేవంత్ రాగానే మా ప్రతిపాదనలు రద్దు చేశారు. నిర్మాణం చేపట్టి ఉంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.‘‘నాకు భూములు ఉన్నాయని.. ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేశారనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచే ఎల్ అండ్ టీతో పంచాయితీ మొదలైంది. పెట్టుబడిదారులను రేవంత్ బెదిరించారు. ఎల్ అండ్ టీ ఎందుకు వెళ్లిపోయిందో రేవంత్ చెప్పాలి. హైదరాబాద్‌కు ఇది మాయని మచ్చ’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
కేటీఆర్ అరెస్ట్ తప్పదు.. కవిత పంచాయతీ వేరే అంశం: టీపీసీసీ చీఫ్
సాక్షి, ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. సర్వేలో ఎవరు ముందుంటే వారికే సీటు అని క్లారిటీ ఇచ్చారు. కల్వకుంట్ల కవితది ఆస్తుల పంచాయతీ.. ఆమెకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉందని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏడాది కాలంలో ఎంతో పని చేశాం. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం బాగా జరుగుతోంది. సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం. జూబ్లీహిల్స్‌లో సామాజికవర్గం కాకుండా గెలుపు లక్ష్యం. నియోజకవర్గంలో సర్వేలు జరుగుతున్నాయి. సర్వేల్లో ఎవరు ముందుంటే వారికే టికెట్ దక్కుతుంది. అక్టోబర్ నాలుగో తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే ఒక్కరోజులో బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపొచ్చు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైన సీబీఐ విచారణ జరిపితే బాగుంటుంది.కవితది ఆస్తుల పంచాయతీ. కాంగ్రెస్‌తో కవితకు ఏంటి సంబంధం. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉంది?. దోపిడీ చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు, అందరి వాయిస్‌లు రికార్డు చేశారు. నాది, రేవంత్ రెడ్డిది రెండున్నర ఏళ్ల నుంచి గత ప్రభుత్వం రికార్డు చేసింది. నేను వాడిన జియో సిమ్ కార్డు నెంబర్ జియో సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చింది. జియో సంస్థకు రాసిన లేఖ కూడా దొరికింది. ఫోన్ ట్యాపింగ్ చేసి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు. క్లియర్ ఆధారాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. -
పీపుల్స్ ప్లాజా వేదికగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు (ఫొటోలు)
-
హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉంది కాంగ్రెస్ తీరు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని ఆరోపించారు. కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్(CM Revanth Reddy) ఒక మాట, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మాట మాట్లాడుతున్నారు. పూట పూటకో మాట.. ఘడియ ఘడియకో లెక్క అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. కృష్ణా జలాల్లో 299 టీఎంసీ వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్(Congress Party) పార్టీనే. చారిత్రక తప్పిదం చేసింది మీరు, తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు మీరు. సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బీఆర్ఎస్, డబ్బా ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్. ఒకవైపు చంద్రబాబుకు(Chandrababu) భయపడి బనకచర్లపై మౌనం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆల్మట్టి ఎత్తుపై సైలెంట్. రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా?. కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండు. ఉత్తర కుమార ప్రగల్భాలే పలికిండు. బేసిన్ల గురించి బేసిక్స్ తెలియదు, నీళ్ల వాటా గురించి నీళ్లు నములుతారు. కనీస అవగాహన లేని, తెలంగాణ సోయి లేని ఇట్లాంటి వ్యక్తులు మనకు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కావడం మన దౌర్భాగ్యం.ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేసినం అని గొప్పగ చెప్పిండు. రైట్ షేర్ కోసం నేనే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు చెప్పుకున్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18.06.2025 నాడు ఏమన్నారు.. కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అన్నాడు. మొన్న సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి ఏమన్నారు?. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటున్నారు. మంత్రి ఉత్తమ్ ఏమో 763 టీఎంసీల రైట్ షేర్ అంటడు, ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంటడు. పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నారు.హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరుకృష్ణా జలాల వాటా పై సీఎం @revanth_anumula ఒక మాట, మంత్రి @UttamINC మరో మాటపూట పూటకో మాట, ఘడియ ఘడియకో లెక్క299 tmc కృష్ణ జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేచారిత్రక తప్పిదం చేసింది మీరు,… pic.twitter.com/e2K8XpOElj— Harish Rao Thanneeru (@BRSHarish) September 24, 2025వీళ్ల అజ్ఞానం వల్ల తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా? లేదా నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? అసలు ఎవరిది కరెక్టు?. కనీస అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు. కనీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎన్నాళ్లు ఉంటారు. కేసీఆర్ కృష్ణా జలాల్లో రైట్ ఫుల్ షేర్ సాధించేందుకు సెక్షన్-3 కోసం పోరాటం చేశారు. ఉమా భారతి, గడ్కరీ, షకావత్, ప్రధానిలను కలిశారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్-3 సాధించారు. 763 టీఎంసీలు అనేది కేసీఆర్ పట్టుబట్టిన విషయం. ఇప్పుడు తామేదో కొత్తగా 763 టీఎంసీలు డిమాండ్ చేసినట్లు.. ఉత్తమ్ డబ్బా కొడుతున్నాడు.అదనపు టీఓఆర్ ప్రకారం, మేము కృష్ణా జలాల్లో మొత్తం 935 టీఎంసీల వాటా సాధించేందుకు గ్రౌండ్ తయారు చేశాం. 811 టీఎంసీలు, 195 సర్ ప్లస్ వాటర్ షేర్, 45 టీఎంసీల పోలవరం వాటర్. ఇప్పుడు వీళ్లు ఏం అంటున్నారు 904 టీఎంసీలే మా న్యాయమైన వాటా అంటున్నారు. ఒక బాధ్యత లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు. నీటి ప్రయోజనాల మీద పట్టి లేదు. ద్రోహం చేసినోల్లే సుద్దులు చెబుతున్నారు. 299:512 ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రాంత హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. మీ చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటా పరిమితం అయ్యింది. తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి నిదర్శనం ఇది. 299ని మేం ఒప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాసనం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇది కూడా చదవండి: హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్ -
100 కోట్ల భూమి అక్రమ రిజిస్ట్రేషన్.. దశరథ రామయ్యపై కేసు నమోదు
సాక్షి, రంగారెడ్డి: శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 100 కోట్ల విలువైన లక్ష గజాల అక్రమ రిజిస్ట్రేషన్ విషయంలో రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ క్రమంలో భారీ స్కాం బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. బాటసింగారం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 376లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం ఉంది. ఈ క్రమంలో ప్రజా ప్రయోజనార్ధం శ్రీమిత్ర డెవలపర్స్ వదిలివేసిన లక్ష గజాల భూమిని స్థానిక లీడర్లు ఆక్రమించారు. నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్స్‌తో అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగింది. స్థానిక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, బ్యాంక్ ఉద్యోగి సహా పలువురి పేర్లపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి.ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి విచారణ జరపగా.. శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్స్‌తో అబ్దుల్లాపూర్‌మెట్‌లో 100 కోట్లు విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో అక్రమ రిజిస్ట్రేషన్‌పై ఫిర్యాదు చేయడంతో దశరథ రామయ్యపైన కేసు నమోదు చేశారు. -
ఎవరి జాగీరు కాదు.. ఆంక్షలు పెడితే మళ్లీ వస్తా: కవిత హెచ్చరిక
సాక్షి, సిద్దిపేట రూరల్: ‘ఇది నా జన్మభూమి. భవిష్యత్తులో ఇదే నా కర్మభూమి కావొచ్చు. ఇక్కడి నుంచే కేసీఆర్ భూకంపం పుట్టించారు. నామీద రాజకీయంగా ఆంక్షలు పెడితే ఏమీ జరగదు. కుట్రలు చేసిన వారిని వదలను’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చింతమడక అంటే చరిత్ర సృష్టించిన గ్రామమని.. ఇక్కడి ముద్దు బిడ్డ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు. తాను చాలా ఏళ్లు ఇక్కడికి రాలేదని, గత ఏడాది పరిస్థితి వేరేలా ఉండిందని చెప్పారు. కానీ ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని అన్నారు. ఇక్కడికి రావాలన్నా.. ఆంక్షలు ఉన్నాయని, అయితే ఏఊరు ఎవరి జాగీరు కాదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఆంక్షలు పెడితే చింతమడకకు మళ్లీ మళ్లీ వస్తా, అలాగే సిద్దిపేటకూ వస్తానని అన్నారు.‘చంద్రునికి మచ్చతెచ్చే పని కొంత మంది చేసిండ్రు, అదే విషయం అడిగితే తల్లికి, పిల్లకు పాపిండ్రు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కుట్రలు చేసే వారిని వదలనని, పురిటి గడ్డ పౌరుషం చూపించి.. వారి భరతం పడతానని స్పష్టం చేశారు. అంతకు ముందు గ్రామంలోని శివాలయంలోను, రామాలయంలోను ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. -
మరో పొలిటికల్ బాంబు పేల్చిన కవిత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొత్త పార్టీపై ఎలాంటి ఆలోచన చేయలేదు. అలాగే, కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. ఇదే సమయంలో తనతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు చాలా పెద్దది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాపై బీఆర్ఎస్ సోషల్ మీడియా దాడి చేస్తోంది. బీఆర్ఎస్లో అందరూ నన్ను ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. నా రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చాను. స్పీకర్‌కు ఫోన్ చేసి కూడా ఆమోదించమని అడిగాను. అవసరమైతే మళ్ళీ రాజీనామా లేఖను పంపిస్తాను. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీలు వస్తే స్వాగతిస్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీలు పెట్టుకునే హక్కు ఉంది. నాకు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే.కాళేశ్వరం విషయంలో తప్ప హరీష్ రావుపై వేరే కోపం లేదు. ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ అర్థమవుతాయి. చాలా విషయాల్లో హరీష్ రావు తనకు సంబంధం లేదన్నారు. అంతా కేసీఆర్ నిర్ణయమే అన్ని హరీష్ చెప్పినట్టు నివేదికలో ఉంది. వివిధ శాఖల ఫైల్స్ నేరుగా కేసీఆర్‌కు వెళ్తున్నాయి.. ఇది చూసుకోవాలని 2016లోనే కేటీఆర్‌కు సూచించాను. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాలి. నేను రాజీనామా చేసిన తర్వాత.. నాతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు పెద్దదిగానే ఉంది. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి.మళ్లీ అధికారంలోకి వచ్చే అర్హత కాంగ్రెస్‌కు లేదు. నాకు కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనే లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు. అందరం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి. బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలి. బీసీల కోసం కోట్లాడుతున్నాం.. ముందు రిజర్వేషన్లను సాధించుకుందాం. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైంది. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
‘రేవంత్‌రెడ్డి అరగంట లైబ్రరీలో కూర్చొని చదవగలరా?’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి కనీసం ఒక అరగంట కదలకుండా కూర్చొని ఏకాగ్రతతో చదవాలని, నిరుద్యోగ యువత సమస్యలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని.. కోర్టు తీర్పును అమలు చేయకుండా గ్రూప్-1 అభ్యర్థులను మోసం చేస్తోందంటూ నిరసనకు దిగారు.ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని వట్టికోట ఆళ్వారు స్వామి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో కలిసి గంటన్నర పాటు పుస్తక పఠనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లైబ్రరీకి వెళ్లి చదువుకోవడానికి, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి లైబ్రరీకి వస్తే కూడా ఆంక్షలు విధించడం ఏంటని ప్రభుత్వాన్ని విమర్శించారు. గంటన్నర చదవడానికే చాలా ఇబ్బందిపడ్డానని నిరుద్యోగులు 4 ఏళ్ల నుండి చదువుతున్నారని,వారెంత బాధ పడుతున్నారో తెలుసుకోవాలన్నారు. చదువు, నిరుద్యోగుల కష్టం గురించి తెలియాలంటే రేవంత్ రెడ్డి లైబ్రరీకి వచ్చి కనీసం అరగంట ఏకాగ్రతతో చదవాలని సవాల్ విసిరారు.చదవకుండా క్రిమినల్ కేసులున్న వ్యక్తి రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువత చాలా కష్టపడి, గత మూడు, నాలుగేండ్లుగా ఉద్యోగ్ల కోసం చదువుతూనే ఉన్నారన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడంలో విఫలమైందని, జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఏం మాట్లాడినా రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనడం సరైంది కాదన్నారు. బి ఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల తరపున నిరంతరం కొట్లాడుతుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేనపుడు పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీశారు.గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర హై కోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. కోర్టు 222 పేజీల తీర్పును ఇచ్చిందని, కోర్టు తీర్పులో చివరి 15 పేజీల రిపోర్టు చదివితే నిరుద్యోగ యువత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై ఖచ్చితంగా నమ్మకాన్ని కోల్పోతారన్నారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ కోర్టును సంప్రదించడం అంటే,నిరుద్యోగులను అవమానపరచడమేనన్నారు. -
కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టిందని.. నలుగురు కలిసి మహిళను అణిచివేస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ జరిపారు. కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ నడుస్తుంది.. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు, సంతోషే.. వారి కుటుంబ పంచాయితీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత కాంగ్రెస్‌లో చేరుతానంటే వ్యతిరేకిస్తానన్న రేవంత్.. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారన్నారు.‘‘ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో ఉంది. లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి ఇచ్చేవాళ్లం. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును కిషన్‌రెడ్డి ఆపుతున్నారు. కేటీఆర్ చెప్పినట్టే కిషన్‌రెడ్డి చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు వేయకపోవడమే నిదర్శనం. కిషన్‌రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవు. కేటీఆర్ నుంచే కిషన్‌రెడ్డి సలహాలు తీసుకుంటారు. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇస్తాం. కమిషన్ నివేదిక సీబీఐకి ఒక పునాదిలా ఉపయోగపడుతుంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. -
స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి రియాక్షన్
సాక్షి, వరంగల్: తాను వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్థించనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ నోటీసులపై స్పందించారు. నోటీసులపై తన సమాధానం స్పీకర్ ముందు ఉంచుతానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సొంత అభిప్రాయాలు పక్కనపెట్టాల్సి వస్తుందని కడియం శ్రీహరి అన్నారు.తన రాజీనామాపై ఎవరి ఆశలు వాళ్లవి అని.. రిప్లై కోసం స్పీకర్ నోటీస్‌లో ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చారని ఆయన తెలిపారు. తప్పనిసరిగా తన సమాధానం స్పీకర్ ముందు ఉంచుతానని.. నేను ఏ పార్టీలో ఉన్నానో అప్పుడే స్పీకర్ తేలుస్తారన్నారు. ఎప్పుడైనా.. పార్టీ మారి నేను సెటిల్మెంట్, కబ్జాలు, అక్రమాలు చేయలేదు. తాను అక్రమాలు చేసి ఉంటే ఈ స్థాయికి వచ్చేవాణ్ణి కాదని నా నిజాయితీ అనుభవం చూసే కేసీఆర్ నన్ను పిలిచి డిప్యూటీ సీఎం చేశారు. నేను ఎన్నడూ ఎవరికీ పాదాభివందనాలు చేయలేదు’’ అని కడియం చెప్పుకొచ్చారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. మరిన్ని ఆధారాలు సమర్పించాలంటూ బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకూ నోటీసులు జారీ కావడం గమనార్హం. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), సంజయ్(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం)లకు తాజాగా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఫిరాయింపుల అభియోగాలకు సంబంధించి బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకూ స్పీకర్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి.. కాంగ్రెస్‌లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో.. స్పీకర్ వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీచేయగా.. 10 మంది ఎమ్మెల్యేల్లో.. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), సంజయ్(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ) ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం) స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. . తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని వివరణ ఇచ్చారు. దీంతో వీళ్ల వివరణపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఈ నెల 11న స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు వేర్వేరుగా లేఖలు పంపించింది. అయితే.. వీరితోపాటు నోటీసులు స్వీకరించిన శాసనసభ్యులు కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్(ఖైరతాబాద్) మాత్రం ఇంకా సమాధానాలివ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు.. నోటీసులపై సమాధానాలిచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై తమ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో అందజేయాలని.. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గురువారం శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు పేరిట లేఖలు వెళ్లాయి. స్పీకర్ వద్ద విచారణలో భాగంగా.. నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలుంటాయి. కాబట్టి.. తదుపరి విచారణ కోసం లీగల్ ఫార్మాట్లో అభ్యంతరాలను ఇవ్వాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. లేఖ అందిన మూడు రోజుల్లోగా అందించాలని గడువు విధించారు. -
బీఆర్ఎస్ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతోందో తెలుసుకో కేటీఆర్: పొంగులేటి
సాక్షి, ఖమ్మం జిల్లా: జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సంగతి తెలుస్తుందంటూ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతుందో కేటీఆర్ తెలుసుకోవాలన్న పొంగులేటి.. రెండుసార్లు బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు‘‘మీ కుటుంబ సమస్యలను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇటీవల ఒక మహిళ ఎమ్మెల్యే ప్రమాదంలో మృతి చెందినప్పుడు జరిగిన ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నో స్థానంలో ఉందొ లెక్క పెట్టుకో....త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ పార్టీ స్థానం ఎక్కడ వుంటుందో ఆలోచించుకో. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఏంటో చూసుకో.. నీ దయా దాక్షిణ్యాలతో బీ ఫామ్ తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కేసీఆర్.. పాలేరు వచ్చి ముక్కు నేలకు రాసినా ఏం చేయలేక పోయాడు నువ్వెంత’’ అంటూ కేటీఆర్‌పై పొంగులేటి మండిపడ్డారు. -
సంక్షేమ రాజ్యం కోసం పోరు తప్పదు!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ అని తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ తన పోరును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.తెలంగాణ భవన్లో జరిగిన సెప్టెంబర్ 17 వేడుకల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ రాజ్యాన్ని సాధించేందుకు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సెప్టెంబరు 17వ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలంగాణ బిడ్డలు రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన రోజని అన్నారు. ఈ రోజును విమోచనమని అన్నా, విలీనమని అన్నా ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన దినం అన్నది వాస్తవమని చెప్పారు. ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ బీఆర్ఎస్ తరపున శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా కేటీఆర్..‘తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం.. అన్నింటినీ తెలంగాణ చూసింది’ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని గ్రూప్-1 విద్యార్థులు తమ ఆకాంక్షను వ్యక్తం చేసుకునేందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో దాడి చేసిందని విమర్శించారు.రాష్ట్రంలో ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ తన పోరును కొనసాగిస్తుందని, సెప్టెంబరు 17వ తేదీని సమైక్య దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదన్నారు. పార్టీ సీనియర్ నేతలు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
పాక్‌తో క్రికెట్ ఆడితే బీజేపీకి నొప్పి లేదా?: కేటీఆర్
భారత రాజ్యాంగమన్నా.. సుప్రీంకోర్టు అన్నా.. బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనం అంటూ మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారాయన. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడాన్ని బీజేపీ విమర్శిస్తోంది. మరి ఆ పార్టీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదు’’ అని ఆయన అన్నారు. బీజేపీది నకిలీ జాతీయవాదమన్న కేటీఆర్.. తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే అసలైన దేశభక్తి. పహల్గాం దారుణ మారణకాండకు కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ ఆడించిన బీజేపీకి బీఆర్ఎస్ దేశభక్తి గురించి ప్రశ్నించే నైతిక అర్హత లేదు అని కేటీఆర్ మండిపడ్డారు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యం అన్నారు. పహల్గాం బాధిత కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లాది భారతీయులను మోదీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.As expected, some BJP bhakts are rattled by BRS Party welcoming the Supreme Court’s interim order on the Waqf Amendment Act 2025. They respect neither the Indian Constitution nor the orders of the apex court!Let me remind them of their shameless hypocrisyBarely five months… pic.twitter.com/qXGWp5YRMz— KTR (@KTRBRS) September 16, 2025 -
జూబ్లీహిల్స్ బైపోల్.. కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్ధి దాదాపు ఖాయం అయ్యాడనుకున్న తరుణంలో.. మహమ్మద్ అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీకి ఎంపిక చేసి కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి అభ్యర్థి ఎంపిక విషయంలో మళ్లీ మల్లాగుల్లాలు పడుతూ మొదటికొచ్చింది. ఈలోపు.. బీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రొజెక్టు చేస్తూ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో నెగ్గి.. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందర హైదరాబాద్‌లో తమ బలం ఏమాత్రం తగ్గలేదని రాజకీయ ప్రత్యర్థులకు చూపించాలని ఆయన భావిస్తున్నారు. ఈలోపు.. సోమవారం ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పీజేఆర్ తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరూ అరగంటకు పైగా చర్చ జరపడంతో జూబ్లీహిల్స్ టికెట్ కోసమేననే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పీ జనార్ధన్ రెడ్డి తనయుడు పీ విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి మరణానంతరం 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై 2009లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో బీఆర్ఎస్లో చేరారు. అయితే జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవచ్చనే సంకేతాల నడుమ.. ఆయన కవితతో భేటీ అయ్యారన్నది తాజా ఊహాగానాల సారాంశం. అయితే.. ఈ పుకార్లకు విష్ణు పుల్‌స్టాప్ పెట్టారు. పెద్దమ్మ తల్లి దసరా నవరాత్రి వేడుకలకు కవితకు ఆహ్వాన పత్రిక అందించడానికే వచ్చినట్లు చెప్పారాయన. ‘‘కేటీఆర్‌తోనే నా ప్రయాణం. ఎప్పుడు నేను ఇదే చెబుతా. కేటీఆర్‌కు ప్రమోషన్ ఉంటుంది.. నాకూ ప్రమోషన్ ఉంటుంది’’ అని ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే విష్ణు తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన ఆమె.. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ ప్రెస్మీట్లో ఆమె సంచలన ఆరోపణలే చేశారు. వేరే పార్టీలో చేరిక.. సొంత పార్టీ గురించి స్పష్టత ఇవ్వని ఆమె.. ఇక నుంచి రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా కేసీఆర్ ఫొటోతోనే ముందుకు సాగుతానని ఆమె ప్రకటించడం గమనార్హం. -
పార్టీ ఫిరాయింపులు.. దానం విషయంలో కీలక ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్.. పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీంతో, వారంతా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పారు. మరోవైపు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం బీఆర్ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు తెలిపారు.హిమాయత్ నగర్ డివిజన్లో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ నుంచి ఇంకా నోటీసులు రాలేదు. స్పీకర్ నుంచి నోటీసులు వచ్చిన ఎమ్మెల్యేలు దానికి తగ్గట్టు సమాధానం ఇస్తున్నారు. నాకు నోటీసులు వచ్చాక లీగల్ ఒపీనియన్ తీసుకొని సమాధానం ఇస్తాను. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో దానం నాగేందర్ పేరు ప్రముఖంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గుర్తు మీద లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడంతో దానంపై వేటు పడటం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికీ ఆయన స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది. దీంతో దానం నాగేందర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఆ స్థానానికి రాజీనామా చేస్తానని పట్టుపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ సెగ్మెంట్‌కు రాజీనామా చేసి.. ఇప్పటికే ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని కోరుతున్నారనే చర్చ నడుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ బరిలో ఎవరిని నిలిపితే బాగుంటుందని.. అభ్యర్థి ఎంపిక కోసం హైకమాండ్ సర్వేల మీద సర్వేలు చేయిస్తురని సమాచారం. ఇక, ఏ సర్వేలో కూడా టికెట్ రేసులో ఉన్న నేతలు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది. -
కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్‌పై మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ విషయంలో కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాళేశ్వరం అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాలి అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాహుల్‌పై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా?. ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి?. ఓట్ చోరీ గురించి రాహుల్ ఆధారాలతో నిరూపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయలేదు.బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు.. లోపాయికారీ ఒప్పందంలో ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఇప్పటికే కవిత చెప్పారు. ముందు కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. కవిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కూడా ఎందుకు స్పందించడం లేదు. ఎందుకంటే రెండు పార్టీలు మానసికంగా ఒక్కటే కానీ.. భౌతికంగా ఒక్కటి కావాల్సి ఉంది. అందుకే రాహుల్‌పై కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా? అంటూ రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయిందని.. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే.. తప్పు మాది కాదు జల మండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది!. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్కార్ నడుపుతున్నరా?సర్కస్ నడుపుతున్నరా?ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోనిమూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు… pic.twitter.com/y4AgJyiXir— KTR (@KTRBRS) September 12, 2025 -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజాగా బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్ సహా సునీత పాల్గొన్నారు.తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి.. మాగంటి సునీత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఇంచార్జ్‌లను నియమించింది. కార్యకర్తలకు కేటీఆర్.. దిశానిర్దేశం చేస్తున్నారు. -
ఆ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: కేటీఆర్
గత పదేళ్లుగా బీజేపీకి బలంగా మద్దతు ఇచ్చిన రెండు పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఇది రాబోయే రాజకీయ దిశకు సంకేతమా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఘాటుగా స్పందించారు. జైరాం జీ, మీ అహంకార భావం.. అధికారం మీద అధిక హక్కు ఉన్నట్టు భావించడం వల్లే కాంగ్రెస్ పార్టీ సమకాలీన రాజకీయాల్లో విఫలమైంది. ‘మీతో లేకపోతే వారితో’ అనే వాదన దేశం రెండు ధృవాలుగా ఉందన్నట్టుగా చూపించే అర్థహీనమైన వాదన. మేము కాంగ్రెస్‌కో, బీజేపీ బీ-టీమ్ కూడా కాదు. మేము తెలంగాణ ప్రజల ఏ-టీమ్.దయచేసి మీ వైఫల్యాలపై దృష్టి పెట్టండి, మమ్మల్ని వదిలేయండి అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన.ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్, ఒడిశా బీజేడీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ వ్యవహారాన్నే ప్రస్తావిస్తూ జైరాం రమేష్.. ఓటింగ్‌కు దూరంగా ఉండే పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లే అని అన్నారు. అందుకే కేటీఆర్ ఇలా స్పందించారు. Two parties who have stood with the BJP staunchly over the past decade in Parliament have decided to abstain in the Vice Presidential election tomorrow. The shape of things to come?— Jairam Ramesh (@Jairam_Ramesh) September 8, 2025Jairam Ji, This sense of entitlement and arrogance is what made Congress fail in contemporary politics ‘Either you are with us or else you’re with them’ claim is a silly argument posturing as if the nation is bipolarWe are neither B-team of Congress or BJPWe are the A-team… https://t.co/xrIvSE7AeZ— KTR (@KTRBRS) September 9, 2025 -
కవిత ఎపిసోడ్‌పై కుండబద్ధలు కొట్టిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సోదరి, పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తొలిసారి పెదవి విప్పారు. పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌రావు, సంతోష్ రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ‘‘రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది..’’ అంటూ కవిత పేర్కొన్నారు.తాజా రాజకీయ పరిణామాలపై సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కవిత ఆరోపణలపై ప్రశ్న ఎదురైంది. కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించిన తర్వాతనే అధినేత నిర్ణయం తీసుకున్నారని, ఇంక ఆమెపై స్పందించడానికి ఏం లేదు అని కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారాయన. తాజాగా కవిత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. తనను అక్రమంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తానెప్పుడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. తనపైపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత కూడా తీసుకోలేదు. 103 రోజులుగా కేటీఆర్ తనతో మాట్లాడలేదని అన్నారామె. అయితే తనకు నోటీసు ఇవ్వడంపై బాధ కలగడం లేదని.. ఈ వ్యవహారంపై ఎన్నడూ లేనిది తెలంగాణ భవన్లో మహిళా నేతలు స్పందించడమే తనకు కొంత ఊరట కలిగించిందని వ్యంగ్యంగా మాట్లాడారామె. -
ఉప రాష్ట్రపతి ఎన్నిక.. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే, ఇండియా కూటమి.. రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్దంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేకపోవడంతో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, బీఆర్ఎస్కు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావ్, పార్థ సారథి రెడ్డి ఎంపీలుగా కొనసాగుతున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ..‘ఉపరాష్ట్రపతి ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుంది. మా అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా కార్యకర్తలపై దాడులకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది . అందులో భాగంగానే ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వం. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టే చర్యలకు పాల్పడుతోంది. యూరియా సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఓట్లు అక్కర్లేదని మాట్లాడిన తీరుకు వాళ్ళ అభ్యర్థికి మద్దతు ఇవ్వం. రెండు కూటముల అభ్యర్థులు సమర్థులైనప్పటికీ.. కూటములు చేసే చర్యల వల్ల ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
కవిత ఆరోపణలపై స్పందించిన హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని, అందులో దాపరికాలు ఏం లేవని అన్నారాయన.విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియా నుంచి ఈ వ్యవహారంపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. గత కొంతకాలంగా మా పార్టీ పైన, నా పైన కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆ వ్యాఖ్యలనే కవిత ప్రస్తావించారు. వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగుతున్నా. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు’’ అని అన్నారాయన.ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు. మరొకవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం. ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంత ఉంటుంది. మేం ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళు కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళు, సో, మా సమయాన్ని అంత కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటాం. ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం అని హరీష్‌రావు అన్నారు.ఇదిలా ఉంటే.. హరీష్ రావు, సంతోష్ రావుల వల్లే తాను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యానని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ క్రమంలో హరీష్‌రావుకు బంగారు తెలంగాణపై చిత్తశుద్ధి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. హరీష్‌రావు మొదటి నుంచి పార్టీలో ఏం లేరని, బీఆర్ఎస్పై ఎప్పటి నుంచో హరీష్‌రావు కుట్రలు చేస్తున్నారని, కాంగ్రెస్..బీజేపీలతో టచ్‌లో ఉంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని, స్వలబ్ధి కోసమే తనను బయటకు పంపించేశారని ఆరోపించారామె. ఆరడుగుల బుల్లెట్టుగా బీఆర్ఎస్ అభివర్ణిస్తున్న హరీష్‌రావు తనకు గాయం చేశారని పేర్కొంటూ.. ఈ క్రమంలో హరీషన్నతో జాగ్రత్త అంటూ కేసీఆర్, కేటీఆర్‌లకు సూచిస్తూ పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారామె. -
కేసీఆరే సుప్రీం.. తుది నిర్ణయం పార్టీదే: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు. ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. తన కూతురి అడ్మిషన్ కోసం ఆయన లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా లండన్‌లో బీఆర్ఎస్ NRI నేతల మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘బీఆర్ఎస్లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం లీడర్. కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ మాకు నేర్పించారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా హరీశ్ రావు విమర్శలు చేశారు.మరోవైపు.. ఈ క్రమంలోనే అక్కడ మీడియా ఆయనను కవిత ఇష్యూపై ప్రశ్నించింది. కానీ, ఆయన సమాధానం చెప్పలేదు. ఇండియా వెళ్లిన తరువాతనే మాట్లాడతానని చెప్పినట్టు తెలిసింది. రేపు ఆయన ఇండియాకు రాబోతున్నట్టు సమాచారం. అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తే ఏం మాట్లాడుతారు అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ప్చ్.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు!
శత్రువులు ఎక్కడో ఉండరు.. ఇంట్లో మనచుట్టూనే తిరుగుతూంటారని ఈ మధ్య వచ్చిన ఒక సినిమా డైలాగుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఈ మాట ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుందని అనిపిస్తోంది. కేసీఆర్ కుమార్తె కవిత అంత పని చేశారు మరి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి, సీబీఐ విచారణ ప్రయత్నాలతోనే కేసీఆర్ సతమతమవుతున్న తరుణంలో ఉరుము లేని పిడుగు మాదిరి కవిత విరుచుకుపడ్డారు. నేరుగా ఏమీ అనకపోయినా, ఆమె వ్యాఖ్యలన్నిటికి కేసీఆర్ బాధ్యుడవుతారన్నది బహిరంగ రహస్యం. కవిత వైఖరి కొన్ని నెలలుగా పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. సోదరుడు పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించడమే కాకుండా.. అధినేత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ దనుమాడిన సంగతి ప్రజలందరికీ తెలుసు. వీటన్నింటినీ ఓపికగా సహించిన కేసీఆర్ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ఆయుధాన్నిచ్చేలా వ్యవహరించడంతో సహించలేకపోయారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత కూడా పార్టీకి రాజీనామా చేసి ఒక రకంగా తండ్రితో బంధాలు తెంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్రావులతోపాటు ప్రముఖ కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డిలపై కూడా కవిత ఆరోపణలు చేశారు. హరీశ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని, వీరిద్దరూ ఢిల్లీ నుంచి విమానంలో కలిసి వచ్చారని, ఆ సందర్భంలో రాజకీయాలు మాట్లాడుకున్నారని ఆమె అంటున్నారు. బీఆర్ఎస్లో కాని,ఆయా రాజకీయ వర్గాలలో కాని, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ సలహా, సంప్రదింపులతోనే కవిత తన సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. దానిని పూర్వపక్షం చేయడానికి ఆమె ప్రయత్నించినట్లు కనిపించినా, ఎవరూ పెద్దగా నమ్మకపోవచ్చు. తన తండ్రిపై సీబీఐ విచారణ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత?, పోతే ఎంత అని ప్రశ్నించడం ద్వారా ఆమె తన మనసులో మాట చెప్పారన్న భావన కలుగుతుంది. కేసీఆర్‌పై అవినీతి మరక పడిందని కవిత కూడా చెప్పడం సహజంగానే బీఆర్ఎస్లో కలకలం రేపుతుంది.పైకి హరీశ్, సంతోష్‌ల గురించి ప్రస్తావించినా, వారు కేసీఆర్‌ను దెబ్బతీస్తారని అంటున్నా, ఆమె చేసే ప్రతి వ్యాఖ్య కేసీఆర్‌కు తగులుతుంది. కాకపోతే ఆమె నేరుగా ఈ మాట చెప్పకపోవచ్చు. ఈ మధ్య కాలంలో పార్టీకి దూరమైన కవిత ఇప్పుడు ఆ పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత అని ప్రశ్నించారు. దానికి తగిన విధంగా సస్పెన్షన్ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. పార్టీపై, తండ్రిపై గౌరవం ఉంటే అలా మాట్లాడగలిగేవారా?. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం వివాదంపై మాజీ మంత్రి, కేసీఆర్ అల్లుడు హరీశ్‌రావు సమర్థంగా వాదించారన్న ఆనందం ఎంతో సేపు లేకుండా చేశారు కవిత తన వ్యాఖ్యలతో!. పోనీ ఆమె అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడారని అనుకున్నా, ఆమె పై కొంతకాలం క్రితం వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అభియోగాలు, కొద్ది నెలలపాటు జైలులో ఉన్న పరిస్థితి కూడా సహజంగానే చర్చకు వస్తాయి. కాళేశ్వరం దెబ్బతినడంతోపాటు, కవిత లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం కూడా బీఆర్ఎస్ను ఎన్నికలలో దెబ్బతీసిందన్నది చాలామంది భావన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని ఏ బీఆర్ఎస్ నేత అయినా బహిరంగంగా అంటే ఒప్పుకుంటారా? కవిత చేసిన వ్యాఖ్యల గందరగోళాన్ని తగ్గించుకోవడానికి గాను ఆమెపై చర్య తీసుకోక తప్పని స్థితి ఏర్పడిందన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. అలా చేయలేకపోతే హరీశ్ సంతోష్ వంటివారికి అసంతృప్తి కలగవచ్చు. ఇప్పటికే కవిత దూరమైన నేపథ్యంలో వీరిని వదలుకునే పరిస్థితి ఉండదు. ఆమె తిరుగుబాటుకు పార్టీలో పెద్దగా అనుకూలత వచ్చినట్లు అనిపించదు. హరీశ్‌రావుకు పార్టీ అంతా అండగా ఉన్నట్లు తేలింది. వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఒక వ్యాఖ్య చేస్తూ హరీశ్‌ను ఆరడగుల బుల్లెట్ అని, మాస్టర్ క్లాస్ అని అసెంబ్లీలో మాట్లాడిన తీరును ప్రశంసించారు. ఇవన్ని కవితకు బీఆర్ఎస్ ఇచ్చిన సమాధానాలే అవుతాయి. కవిత తొలుత తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా, ఆ తర్వాత కాలంలో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కాని ఆ గెలుపును ఆమె నిలబెట్టుకోలేకపోయారు. నిజామాబాద్ లో మరోసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు.అయినా కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వ్యవహార శైలిపై కొంతమందిలో అసంతృప్తి ఉన్నప్పటికి, ఎవరూ పైకి మాట్లాడేవారు కారు. ఇప్పుడు వారు కూడా హరీశ్‌రావు పార్టీకి మూల స్తంభాలలో ఒకరని బదులు ఇస్తున్నారు. కొద్దికాలం క్రితం కవిత పై విమర్శలు చేయడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాందీ కూడా పలికారు. కవిత సొంతంగా పార్టీ పెట్టుకుంటారా? లేక కాంగ్రెస్‌లో చేరతారా? అన్న చర్చకు ఆమె అవకాశం ఇస్తున్నారు. తనను అరెస్టు చేయించింది బీజేపీనే అన్న భావనలో ఉన్నందున ఆ పార్టీ వైపు వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సంక్షోభం వెనుక తమకు ఎలాంటి పాత్ర లేదని, అది అవినీతి సొమ్ము పంచాయతీ అని సమాధానం ఇచ్చారు. కవిత తనకు తెలిసిన అవినీతి సమాచారం అంతటిని సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ఎంపీలు అరవింద్, రఘునందన్ వంటివారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో గొడవలు ఆ రెండు పార్టీలకు సహజంగానే సంతోషం కలిగిస్తాయి. కవిత ఒకరకంగా తండ్రినే బ్లాక్ మెయిల్ చేసినట్లు కనిపిస్తోంది. పైకి ఆయనను గొప్పవాడుగా ప్రొజెక్టు చేసినట్లు అనిపించినా.. మొత్తం ఆయనను దృష్టిలో ఉంచుకుని చేశారన్న భావన కలుగుతుంది. రేవంత్ ను ఉద్దేశించి కొంత అనుచిత వ్యాఖ్య చేసినట్లు కనిపించినా, కవిత తీరు వల్ల కాంగ్రెస్ కు రాజకీయంగా లబ్ది చేకూరే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేస్తూ కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైందని వ్యాఖ్యానించారు.అందులో మామ వాటా ఎంతో అల్లుడి వాటా ఎంతో తేలాలి అని కూడా ఆయన అన్నారు. తనను కాంగ్రెస్, బీజేపీ, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఖబడ్దార్ అని కవిత హెచ్చరించారు. తాను ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదని, తనది కేసీఆర్ రక్తమని కవిత పేర్కొనడం బాగానే ఉన్నా, ఏ లక్ష్యంతో ఆమె ఈ వివాదాన్ని సృష్టించారన్న దానిపై ఎవరికి వారు ఊహించుకుంటారు. చర్చించుకుంటారు. గతంలో ఆమె కేసీఆర్‌కు ఒక లేఖ రాసి పార్టీలో అసమ్మతికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు పార్టీకి దూరం అయ్యారు. కవిత భవిష్యత్తు రాజకీయం అంత తేలికగా ఉండదు. ఒక పెద్ద పార్టీ నీడలో, అది కూడా సొంత పార్టీలో, తండ్రి చెంత ఉండడం వేరు. సొంతంగా పార్టీని పెట్టుకున్నా, మరో పార్టీలో చేరినా, అది ముళ్లబాటే అవుతుంది. వాటన్నిటిని దాటుకుని కవిత తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకుంటే అది గొప్ప విషయమే అవుతుంది. కాని చరిత్రలో అలా సఫలం అయిన ఘట్టాలు చాలా తక్కువే అని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాళేశ్వరం తలనొప్పి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే కాదు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందా? శాసనసభలో ఒకలా.. హైకోర్టులో ఇంకోలా వాదనలు వినిపించడం ఈ అనుమానానికి తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఆదివారం హడావుడిగా శాసనసభ పెట్టి సీబీఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ఇప్పటికీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయం తరువాత విచారిస్తామని ప్రభుత్వం సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో హైకోర్టు కేసీఆర్, హరీశ్‌రావులపై తదుపరి చర్యలను నెల పాటు నిలిపివేసింది. ఈ కేసులో ఆడ్వకేట్ జనరల్ వాదన ఆసక్తికరంగా ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు, సీబీఐ విచారణకు సంబంధం లేదని, జాతీయ డామ్ సేఫ్టీ అధారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరామని ఆయన వెల్లడించారు. అదే నిజమైతే కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. పైగా ఈ చర్చ జరిగిన తీరు చూస్తే బీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ రొంపిలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది.శాసనభలో తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను గట్టిగా వినిపించి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసినట్లు అనిపించింది. కాని ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తన వాదనను సమర్థంగా వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందా అనిపించింది. సీఎంతోపాటు పలువురు మంత్రుల ఆరోపణలకు హరీశ్ ధీటుగా ఆధారసహితంగా జవాబిచ్చారు. ఒక దశలో హరీశ్ ప్రసంగం కొనసాగకుండా చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వారు ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని, అది పీసీసీ నివేదిక అంటూ విమర్శలు చేసి వాకౌట్ చేశారు. పిమ్మట మరికొందరు మాట్లాడిన అనంతరం ఈ నివేదికపై తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోవడానికిగాను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెబుతున్నా అది సమర్థనీయంగా అనిపించదు. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా? చిత్తశుద్దితో చేసిందా? అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్టులోకి బాల్ నెట్టి లాభం పొందుదామన్నది కాంగ్రెస్ ప్రయత్నమా? కేంద్రం అనుమతించకపోతే బీజేపీ, బీఆర్ఎస్ల కుమ్మక్కు అని ప్రచారం చేయవచ్చు. అనుమతిస్తే దాని ప్రభావం బీఆర్ఎస్పై ఉండనే ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ల పొత్తు అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో సీబీఐ తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరడం ఏమిటన్నది కొందరి ప్రశ్న. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇదే అంశంపై ఒక ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో అస్త్రాలుగా మారాయని గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. అదే సంస్థను రేవంత్ ఎలా విశ్వసిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. సీబీఐ, ఈడీల కారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కూడా కొన్ని రోజుల క్రితం సీబీఐని విమర్శిస్తూ స్పీచ్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్పై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనిద్వారా రేవంత్ తన చేతిలోని ఆయుధాన్ని బీజేపీకి అప్పగించారా అన్న ప్రశ్న కూడా వస్తోంది.కేంద్రం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది పడవచ్చు. సీబీఐ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు తదితరులను అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ.. ఈలోగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధినేత అసమ్మతి నేతగా మారి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలకు దారి తీసింది. హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌లకే కాళేశ్వరం స్కామ్ సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నుంచి కవితకు పెద్ద మద్దతు అయితే రాలేదు. అందరూ హరీశ్‌రావు వెంబడే నిలబడ్డారు. అయినా సరే.. కవిత వ్యాఖ్యలతో పార్టీకి కొంత నష్టమైతే జరిగింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని భావిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. కేసీఆర్‌కు సానుభూతి వస్తుందనుకుంటే ముందుకు వెళ్లకపోవచ్చు.లేదా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి కూడా యత్నించవచ్చు. ఈ పరిణామాలేవీ తెలంగాణ బీజేపీకి అంతగా రుచించినట్లు అనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేసేది. కాని ఇప్పుడు ఆ పక్షం ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ నేత మహేశ్ రెడ్డి సీబీఐ విచారణను స్వాగతించినట్లు కనిపించలేదు. ఎందుకింత హడావుడిగా ఒకరోజు సమావేశం పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేశారని, ముందుగానే ఈ కేసును సీబీఐకి అప్పగించి ఉండాల్సిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సీబీఐ దర్యాప్తును చేపడితే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈయన పాత్రను కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కమిషన్ విచారణ సందర్భంగా ఈటెల ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్పారు. కమిషన్ మాత్రం దానిని పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. పలువురు ఐఎఎస్ అధికారులు కూడా సీబీఐ విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ ఐదేళ్లు ఈ వ్యవహారం ఒక రాజకీయ రచ్చగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఘోష్ కమిషన్ ఎక్కువ భాగం సాంకేతిక అంశాలకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. అవినీతి జరిగి ఉంటే ఏ రకంగా జరిగిందన్నదానిపై నివేదికలో పెద్దగా పరిశీలన లేదు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన తుమ్మిడి హెట్టి వద్ద నీరు తగినంత ఉన్నా, దానిని మార్చి మేడిపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్చించారన్నది ఘోష్ కమిషన్ వ్యాఖ్య. దానిని హరీశ్ రావు తోసిపుచ్చుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేయలేదని కాదు. ఆ రోజుల్లో కేసీఆర్ తన మాటే శాసనంగా ప్రభుత్వాన్ని నడిపారు. సాంకేతికపరమైన అంశాలను కూడా ఆయనే డీల్ చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. అదే రీతిలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది. ఈ కమిషన్ కొంతమంది అధికారుల జోలికి అసలు వెళ్లకపోవడంపై కూడా విమర్శలు ఉన్నాయి. రేవంత్ కాని, మంత్రులు కాని ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే యత్నం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డను వ్యతిరేకించలేదని రిపోర్టులోని అంశాలను హరీశ్ ఎత్తిచూపారు. ఘోష్ కమిషన్ వద్ద ఉన్న ఈ కమిటీ రిపోర్టును హరీశ్ ఉటంకించడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఆ మీదట.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రిపోర్టు మీరే రాయించి ఉంటారని అనడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్లయింది. అలాగే మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడి హెట్టికి, మేడిగడ్డకు మధ్య గోదావరిలో కలిసే వాగులు, ఏరులు లేవని చేసిన వ్యాఖ్యకు సంబంధించి సమాధానం ఇస్తూ ఎన్ని వాగులు గోదావరిలో కలిసేది ఒక పెద్ద జాబితానే చదివారు. దాంతో జూపల్లి వాదన వీగిపోయింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించడంతో ఆ రోజుల్లో టీఆర్ఎస్లో ఉండి ఆయనేమి మాట్లాడారో, ట్వీట్ చేశారో చూపించారు. జాతీయ డ్యామ్ భద్రత అధారిటీ విచారణ గురించి ఉత్తం చెప్పారు. అసలు ఆ అధారిటీ ని కేంద్రం ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకువచ్చినప్పుడు ఎంపీగా ఉన్న ఉత్తం దానిని వ్యతిరేకించారని, రాష్ట్రాల హక్కులను హరించడమే అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడితే లక్ష కోట్ల దోపిడీ అంటూ రేవంత్, మంత్రులు మాట్లాడినా, అది ఏరకంగా జరిగిందన్నది వివరంగా చెప్పలేదు. ఏదో సాధారణ రాజకీయ విమర్శగానే చేశారు. దానికి హరీశ్ బదులు ఇస్తూ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే ప్రాజెక్టు కాదని, 15 రిజర్వాయిర్లు, కిలోమీటర్ల కొద్ది టన్నెళ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, మొదలైన వాటి జాబితాను వివరించారు. అసలు మొత్తం ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు అయితే, లక్ష కోట్ల దోపిడీ అని ఆరోపించడంలో హేతుబద్దత కనిపించదు. అయితే మేడిగడ్డ వద్ద బారేజీ దెబ్బతింటే అసలు నీరు అందుబాటులో ఉండదని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిరర్థకం అవుతుందని ఉత్తం అనడంలో కొంత అర్థం ఉంది.కాని ఆ బ్యారేజీలు పూర్తిగా దెబ్బతిని ఉంటే ఆ సమస్య వస్తుంది కాని, లేకుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటుంంది.దానిని రిపేరు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించకపోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురి అవుతుంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ఒకవైపు 18 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతూ,మరోవైపు అందుకు విరుద్దంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఈ నిర్మాణం చేసిన కాంట్రాక్టు సంస్థలను ఏ రాజకీయ పార్టీ పెద్దగా తప్పు పట్టకపోవడం గమనించవలసిన అంశమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కవిత వ్యాఖ్యలు
-
ఫోన్ ట్యాపింగ్.. మరో బాంబ్ పేల్చిన కవిత
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత మరో బాంబ్ పేల్చారు. కేటీఆర్ సంబంధికుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని అన్నారామె. బుధవారం జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన అనంతరం చిట్‌చాట్‌లోనూ సంచలన ఆరోపణలకు దిగారు.ఫామ్‌హజ్ విషయాలన్నీ కాంగ్రెస్‌కు తెలుస్తాయి. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్‌కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావు, శ్రవణ్‌రావులే(ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు) ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్‌కు రాసిన నా లేఖ విడుదల చేసింది సంతోషే అని అన్నారామె. ఈ గ్యాంగ్ గురించి కేసీఆర్‌కు గతంలో తాను స్వయంగా ఎంతో చెప్పానని.. బీఆర్ఎస్లో ఉండి ఇంతకాలం అంతర్గతంగా పోరాడానని, ఇప్పుడు బయటకు వచ్చి పోరాడతానని అన్నారామె. అలాగే.. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతిపైనా పల్లా రాజేశ్వర్‌రెడ్డి తనకు సమాచారం ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ‘‘జనగామ టికెట్ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. అందుకే నాకు పల్లా సమాచారం ఇచ్చారు. నా దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే బీఆర్ఎస్ నేతలందరూ ఇబ్బంది పడతారు. నా దగ్గర బోలెడంత సమాచారం ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా అని కవిత అన్నారు. భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళికలు లేవని.. అలాంటిది ఏమైనా జరిగినా కేసీఆర్ ఫోటోతోనే కార్యక్రమాలు చేపడతానని కవిత స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్లో ఆ ఇద్దరూ మేకవన్నె పులులు! -
గులాబీ బాస్.. రిలాక్స్!
సాక్షి, హైదరాబాద్: తన తండ్రిపై ఎంతో ఒత్తిడి నెలకొని ఉండొచ్చని, అందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటారని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఒకవైపు కవిత ప్రెస్‌మీట్ పెట్టి సంచలన ఆరోపణలు, కీలక చేసిన వేళ.. ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రం రిలాక్స్‌గా గడిపారు. సెప్టెంబర్ 1వ తేదీన కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి హరీష్‌రావు, సంతోష్‌రావులే కారణమని ఆరోపించడం కలకలం రేపింది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సీనియర్లకు, పార్టీ కేడర్‌కు కోపం తెప్పించింది. దీంతో ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో ఎడతెరిపి లేకుండా బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. బుధవారం ఉదయం నుంచి కూడా భేటీ జరుగుతుండగా.. కవిత ప్రెస్‌మీట్ సమయంలో మధ్యలోనే ఆయన బయటకు వెళ్లారు. కారులోనే వ్యవసాయ క్షేత్రం చుట్టూ తిరిగి పొలాలను చూసొచ్చారు. తిరిగి ఫామ్‌హౌజ్‌కు వచ్చి నేతలతో భేటీ కొనసాగించారు. -
ఆ ఒక్కటే బాధిస్తోంది: కవిత భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారాలు చేశారని, ఎంతో బాధ ఉంటేనే తాను ఇలా మాట్లాడుతున్నానని బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించి బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించారు. ఈ క్రమంలో కల్వకుంట్ల కుటుంబ వ్యవహారంపైనా కీలక వ్యాఖ్యలు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.భవిష్యత్తు గురించి కాదు.. నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నా. విచారణ లేకుండా, వివరణ తీసుకోకుండానే నన్ను సస్పెండ్ చేశారు. కోట్ల మందిలో ఒక్కరు కేసీఆర్. అలాంటి వ్యక్తి నాకు తండ్రి కావడం నా అదృష్టం. ఆయన చిటికెన వేలు పట్టుకునే ఉద్యమంలో నడిచా. అలాంటి వ్యక్తిపై నాకెందుకు కోపం?. పార్టీ జాగ్రత్త అనే రామన్నకు ఇప్పుడు కూడా చెబుతున్నా. నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏమైంది, ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా. నాకైతే అనుమానమే? అని కవిత అన్నారు.ఎంత పెద్ద నేతలైనా కొంత ఒత్తిడి ఉంటుంది. కేసీఆర్‌పైనా ఇప్పుడు అలాంటి ఒత్తిడే ఉండి ఉంటుంది. ఆడబిడ్డలు చెడు కోరుకోరు. కానీ, ఎంత బాధ కలిగి ఉంటే నేను ఇలా మాట్లాడుతా. కుటుంబంలో ఎన్నో అవమానాలు జరిగాయి. కానీ, అవన్నీ చెప్పుకోలేను. అందుకే పార్టీ పరంగా ఉన్న సమస్యల గురించే మాట్లాడా. నిజాయితీని నిరూపించేందుకు రాజీనామా చేశా. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నందుకు బాధగా లేదు. రాజకీయంగా పొరపచ్చాలు ఇవాళ ఉంటాయి.. రేపు తొలగిపోతాయి. కానీ, మా అమ్మకు దూరంగా ఉండాల్సి రావడమే నన్ను బాధిస్తోంది అని అన్నారామె. ఈ క్రమంలో.. కుటుంబ కలహాలను ప్రస్తావన తెస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, పోస్టుల గురించి ఆమె స్పందించారు. ఎవరెవరితోనో నన్ను పోలుస్తూ కొందరు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. పనీపాటా లేని వాళ్లే అలాంటి పనులు చేస్తారు. అలాంటి వాళ్లు చేసేవాటికి స్పందించాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారామె. -
కవిత వ్యాఖ్యలు, ఆరోపణలపై స్పందిస్తున్న నేతలు
తెలంగాణలో కవిత వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత రాజీనామా రేవంత్ రెడ్డి, హరీష్‌రావు, సంతోష్ రావుపై ఆరోపణలు పలువురు నేతలపై వ్యాఖ్యలు చేయడంతో అధికార కాంగ్రెస్, పలువురు నేతలు స్పందిస్తున్నారు.బండి సంజయ్ కామెంట్స్..కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగింది.కేసీఆర్ కుమార్తెనే చెప్పింది.భూమ్మీద జరిగిన అతి పెద్ద అవినీతి కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్.సీబీఐకి రెండేళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి.కోర్టులో వాదించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫేయిల్ అయిపోయింది.కేంద్రానికి ఈరోజు సీబీఐ ఎంక్వైరీ కోరుతూ లేఖ రాసి చేతులు దులుపుకునే యత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది.ఫోన్ ట్యాపింగ్‌లో జడ్జీ నుంచి కేంద్ర మంత్రుల వరకూ ట్యాపింగ్ చేస్తే దాన్ని ఎందుకు మరి సీబీఐకి ఇవ్వలేదో చెప్పాలి.ఒక డెయిలీ సీరియల్లా నడిపిస్తున్నారు.విద్యుత్ కొనుగోళ్ల స్కాం విషయంలో రిపోర్ట్ ఏమైందో తెలియదు.కేసీఆర్ బిడ్డ అయితే ఏంది?బీఆర్ఎస్ అవినీతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కవిత ఇష్యూను తెరపైకి తెస్తున్నారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్..తెలంగాణ రాష్ట్రాన్ని జలగల్లా ఐదుగురు కలసి దోచుకున్నారు.అందులో కవిత కూడా ఉంది.కవిత బయటకు వచ్చి అవినీతిపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నా.సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు, సంతోష రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది.హరీష్ రావు, ఈటెల రాజేందర్, సంతోష్ రావు అవినీతి చేస్తుంటే చూస్తూ కూర్చున్న కేసీఆర్ కూడా అవినీతి పరుడే.దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో పంచాయతీతోనే కవిత బయటకు వచ్చిందికాళేశ్వరం విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.కవిత వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కవిత రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు..ఒక ప్రతిపక్ష పార్టీ నేతతో సీఎం ఒప్పందం చేసుకుంటారా?.మీ నిస్సహాయతను మాపై చూపెట్టడం ఏంటి?ఇంటి పంచాయితీని కాంగ్రెస్ రుద్దుతున్నారు.హరీష్ రావుపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది..కాళేశ్వరంలో హరీష్ రావు పేరు కూడా ఉంది..బీఆర్ఎస్ పార్టీ మాకు ఎప్పుడు ప్రత్యర్థే.కవితను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడమా?.అది కలలో కూడా జరగదు. -
రామన్నా.. కేసీఆర్, పార్టీని కాపాడండి: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ కుమార్తె కవిత రాజీనామా చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్‌రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో వారి నుంచి పార్టీని కాపాడాలని కేసీఆర్, కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం కాపాడాలని ఆవేదనతో చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా కుటుంబాన్ని విచ్చిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలని కొందరు ఎదరుచూస్తున్నారు. నాపై కుట్రలు జరిగాయి. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు.బంగారు తెలంగాణ అవుతుందా?కేసీఆర్‌పై నాకెందుకు కోపం. నా తల్లితో నేను మాట్లాడలేకపోతున్నాను. అదే నా బాధ. తల్లితో మాట్లాడకుంటే ఎలా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుసు. నా తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని ఓనమాలు నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడా. స్వతంత్ర భారతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. చెప్పింది చెప్పినట్లు ఆయన చేశారు. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అది సామాజిక తెలంగాణ కాదా? నేనేమైనా తప్పు మాట్లాడానా? సామాజిక తెలంగాణ భారత రాష్ట్ర సమితి అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ అంటే హరీశ్‌రావు, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే అవుతుందా?.నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. నాకైతే అనుమానమే. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారు. హరీష్, రేవంత్ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. నాన్న.. ఇప్పటికైనా మేలుకోండి. నాన్న, రామన్నా.. జాగ్రత్తగా ఉండండి. పార్టీని కాపాడండి’ అని వ్యాఖ్యలు చేశారు. చివరగా.. జై కేసీఆర్, జై తెలంగాణ అని నినాదం ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని వర్గాలతో మాట్లాడి, భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. -
ఆ ఆరడుగుల బుల్లెట్టే నాకు గాయం చేసింది: కవిత
వ్యక్తిగత లబ్ది కోరుకునే కొందరు పార్టీ నుంచి తనను బయటపడేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బుధవారం జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘హరీష్‌రావు, సంతోష్‌రావు ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ కాదు. ప్రతీ సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్‌కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. ఆయన బీజేపీతోనూ టచ్‌లో ఉన్నారు. హరీషన్నపై మొదటిరోజు మీడియాలో ఆరోపణలు వస్తాయి. రెండో రోజు నుంచి హరీష్‌రావు పేరు కనిపించదు. రేవంత్ రెడ్డి గురించి కూడా ఏనాడూ హరీష్‌రావు గురించి మాట్లాడలేదు. మ్యాచ్‌ఫిక్సింగ్ జరగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?. రేవంత్రెెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.హరీష్‌రావు మొదటి నుంచి బీఆర్ఎస్ లేరు. పార్టీ మనకెందుకు మామా అని కేసీఆర్‌కు చెప్పి.. వ్యాపారం చేసే ఆలోచన కూడా చేశారు. పార్టీ పెట్టిన తర్వాత 8, 9 నెలలకే చేరారు. పార్టీకి వెన్నుపోటు పొడుదాం అని గతంలోనూ ఆయన అనుకున్నారు. కేటీఆర్‌ను బతిమాలి పార్టీలో కొనసాగారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ మేకర్. ఆయనే సమస్య సృష్టించి.. ఆయనే మాఫీ చేసినట్లు నటిస్తారు. ఎలాగైనా కల్వకుంట్ల ఫ్యామిలీలో చిచ్చుపెట్టి పార్టీని సొంతం చేసుకోవాలనే కుట్రలు చేస్తున్నారు. హరీష్‌రావును నమ్ముకుని మైనంపల్లి, ఈటల, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు.. ఇలా ఎందరో పార్టీని వీడారు. 2018 ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతి డబ్బులనే 25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండ్‌గా పంచారు. ఆయన ఫండింగ్ వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను(కేటీఆర్‌ను ఉద్దేశించి.) ఓడించడానికి హరీష్ కుట్ర చేశారు. సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై అర్ధరాత్రి దాకా చర్చ జరిగింది. ‘‘ఓ హరీష్‌రావు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ పొగడ్తలు గుప్పిస్తున్నారు. కానీ, ఆ ఆరడుగుల బుల్లెట్టు నాకు గాయం చేసింది. తర్వాత మీ వంతే. రామన్న.. మళ్లీ రేపు మీపై కూడా కుట్ర జరగొచ్చు’’ అని అన్నారామె. సంతోష్‌రావు అనే వ్యక్తి చెప్పులో రాయి.. చెవిలో జోరీగా టైప్ అని అభివర్ణించారు. సంతోష్‌కు ధనదాహం చాలా ఎక్కువ. హరిత హరం పేరిట సినిమా హీరోలతో ఫోజులిప్పించి.. అడవులను కొట్టేయాలని చూశారు. రామన్న నియోజకవర్గం నేరెళ్లలో ఇసుక మాఫియా దళితులను చిత్రహింసలు పెట్టింది. చేయించింది అంతా సంతోష్‌రావు.. పేరు మాత్రం కేటీఆర్‌కు. పోచంపల్లి శ్రీనివాస్ వేల కోట్ల వ్యాపారం ఎలా చేస్తున్నారు?. సంతోష్‌రావు క్లాస్మేట్ కావడమే అందుకు కారణం. సంతోష్‌రావు వల్లే మాకు సంబంధించిన టీవీ, పేపర్లలోనూ నన్ను చూపించడం లేదు. సంతోష్, హరీష్ గ్యాంగులు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయి. హరీషన్న, సంతోషన్నలు మేకవన్నె పులులు. వాళ్లను పక్కనపెడితే పార్టీ బతుకుతుంది’’ అని కవిత అన్నారు. -
సస్పెన్షన్ పై కవిత రియాక్షన్
-
కేటీఆర్ సహా పార్టీ నేతలతో కేసీఆర్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం వేళ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌తో కేటీఆర్ సహా పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజా రాజకీయా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కవిత మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నార అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. -
బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా
ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం హైలైట్స్.. 👉పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి కవిత రాజీనామా చేశారు. ఇదే సమయంలో తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. 👉అక్రమ కేసుల్లో నేను జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను తప్ప.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నా సస్పెన్షన్ వార్తలను మీడియాలో చూశాను. సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీ వ్యతిరేకమా?. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. కోట్లలో ఒక్కరు కేసీఆర్.. 👉కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నాను. పని గట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేశారు. నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. కేసీఆర్ లాంటి తండ్రి కోట్లలో ఒక్కరు ఉంటారు. అలాంటి వ్యక్తి నాకు తండ్రిగా ఉన్నారు. అది నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా నా తల్లితో కూడా నేను మాట్లాడటం లేదు. ఆమెను కలవలేకపోతున్నారు. ఇలాంటి కష్టం ఏ బిడ్డకు రాకూడదు. ఇద్దరు వ్యక్తులు నా కుటుంబాన్ని విచ్చినం చేశారు. నాశనం చేయాలని చూశారు. విధి అనేది ఒక్కటి ఉంది. కచ్చితంగా వారికి కాలమే సమాధానం చెబుతుంది. తప్పకుండా అనుభవిస్తారు. రేవంత్‌తో కలిసి హరీష్ కుట్రలు.. 👉నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. హరీష్ రావు, సంతోష్‌రావు ఇంట్లో ఉన్న బంగారంతో సామాజిక తెలంగాణ అయితదా?. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్‌కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి నన్ను బయటపడేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్న కుట్ర ఇది. రేపటి రోజు రామన్నకు ప్రమాదమే.. 👉రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారు. హరీష్, రేవంత్ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. రేవంత్, హరీష్ కుమ్మకై నాపై కుట్రలు చేశారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చినప్పుడు మంత్రి హరీష్‌రావే కదా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లకు హరీష్ డెయిరీ నుంచి పాల పంపిణీ జరిగింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా?. 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడగరా?. నన్ను సస్పెండ్ చేసినా.. పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది. హరీష్ వల్లే ఓటములు.. 👉హరీష్ ట్రబుట్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. ట్రబుట్ క్రియెట్ చేసి దీన్ని సాల్వ్ చేసినట్టు చెప్పుకుంటారు. మీడియా మేనేజ్మెంట్లో హరీష్ సూపర్. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు. ఆయన ఫండింగ్ చేసిన వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను ఓడించడానికి సిరిసిల్లకు 60 లక్షలు పంపారు. తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి డే-1 నుంచి హరీష్ రావు లేరు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్‌రావు వద్దన్నారు. తొమ్మిది, పది నెలల తర్వాత వచ్చారు. హరీష్ రావు నక్క జిత్తులను గమనించండి. నిజామాబాద్‌లో నా ఓటమిలో కూడా కుట్రలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను కూడా ఓడించే ప్రయత్నం చేశారు. ఇందులో సంతోష్ రావు హస్తం కూడా ఉంది. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపునకు కూడా హరీషే కారణం. హరీష్ వల్లే రఘునందన్ రావు, ఇతర కీలక నేతలు బయటకు వచ్చారు. దుబ్బాకలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇలాంటివి చాలానే జరిగాయి. జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు కూడా పార్టీ వీడింది హరీష్ రావు వల్లే. ఆరడుగుల బుల్లెట్ ఇప్పుడు నాకు గాయం చేసింది. తర్వాత మీకు గాయం చేస్తుంది. గ్రీన్ ఇండియా పేరుతో సంతోష్ రావు ఓవరాక్షన్.. 👉హరితహారం కేసీఆర్ పెడితే.. గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో నకిలీ కార్యక్రమం చేపట్టాడు. సంతోష్ రావు కూరలో ఉప్పు లాంటి వాడు. చిరంజీవి, ప్రభాస్ లాంటి సినీ నటులను మోసం చేసిన గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేలా చేసి ఫార్టెస్ట్ను కొట్టేద్దామనుకున్నారు. సిరిసిల్లలో ఏడుగురు దళిత బిడ్డలను పోలీసులు ఇసుక వ్యవహారంలో కొట్టడానికి సంతోష్ రావు బాధ్యుడు. ఆయన కారణంగా కేటీఆర్, పార్టీకి నష్టం కలిగింది. సంతోష్ రావుతోనూ రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. తెలంగాణ ఆత్మగా జాగృతి పని చేసింది. బీఆర్ఎస్ పార్టీకి నేనేమీ చేయలేదా?. పార్టీలో నా కాంట్రిబ్యూషన్ లేదా?. హరీష్, సంతోష్లదే ఉందా?. వాళ్లు మేకవన్నె పులులు నాన్న. కలికాలం కాబట్టి వాళ్ల టైమ్ నడుస్తోంది. బీఆర్ఎస్ హార్డ్ వేర్ అయితే.. జాగృతి సాఫ్ట్వేర్ అని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరను.. 👉చివరగా.. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలో గానీ చేరడం లేదన్నారు. తన భవిష్యత్ గురించి జాగృతి నేతలు, బీసీ నాయకులు, అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. -
సస్పెండైన కవిత నిజంగానే కొత్త పార్టీ పెడతారా?
-
రజతోత్సవాల నుంచే రగడ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై చేసిన వ్యాఖ్యలతో.. తొలిసారి ఎమ్మెల్సీ కవిత తన అసంతృప్త స్వరాన్ని విన్పించారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు మే 5న కవిత రాసిన లేఖ బయటకు రావడం, ఆ లేఖలో ఎల్కతుర్తి సభపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ ప్రసంగం ‘పంచ్ లేకుండా‘ ఉందని, బీజేపీపై స్పష్టంగా విమర్శలు చేయలేదని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడానికి బీజేపీతో సంబంధమే కారణమై ఉండవచ్చని కార్యకర్తలు భావించారని పేర్కొన్నారు. కాగా ఈ లేఖ ఎవరు బహిర్గతం చేశారనే చర్చ జరగ్గా, బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలను లేఖ బయటపెట్టిందనే అభిప్రాయం వ్యక్తమైంది.మీడియాకు లేఖ లీక్‌పై సంచలన వ్యాఖ్యలుఅమెరికా పర్యటన నుంచి మే 29న తిరిగి వచ్చిన కవిత శంషాబాద్ విమానాశ్రయంలో లేఖ లీక్ వెనుక పార్టీ లోపలి వ్యక్తులే ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న కోవర్ట్‌లు పార్టీని బలహీనం చేస్తున్నారని ఆరోపించారు. తాను జైలులో ఉన్న సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదనలు వస్తే వ్యతిరేకించినట్లు వెల్లడించారు. మరోవైపు తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వ శైలిని కూడా పరోక్షంగా విమర్శిస్తూ పార్టీ ట్విట్టర్‌కు పరిమితం కావద్దని అన్నారు. తాను కొత్తగా పార్టీ పెట్టే అవకాశాన్ని ఆమె ఖండించకపోవడం అప్పట్లోనే ఊహాగానాలకు తెర లేపింది.పార్టీ నేతలపైనా ధ్వజంకేటీఆర్పై పరోక్ష విమర్శలు గుప్పించిన కవిత పార్టీతోనూ అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. రక్షాబంధన్ సందర్భంగా గత నెల 9న కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం విభేదాలను మరింత స్పష్టం చేసిందనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. కాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నేత కార్తీక్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ బలహీనంగా ఉండటానికి జగదీశ్‌రెడ్డే బాధ్యుడని ఆమె పేర్కొన్నారు.ఇదిలా ఉంటే గత నెల 16న కవిత అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో.. సింగరేణి కాలరీస్‌లో బీఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. దీనిపై కవిత తీవ్రంగా స్పందిస్తూ, తన లేఖ లీక్‌లో పాల్గొన్న ‘కుట్రదారులు‘ తనను హింసిస్తున్నారని ఆరోపించారు. ఇక సోమవారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ కారణమని ఆరోపించడంతో పార్టీలో కలకలానికి కారణమయ్యారు.కవిత కేంద్రంగా వివాదాలు2023లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కవిత కేంద్రంగా వివాదాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 2023 మార్చి 11, 21 తేదీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను ప్రశ్నించింది. ఆమె సౌత్ గ్రూప్‌లో భాగమైనట్లు ఈడీ ఆరోపించింది. అయితే కవిత.. తనపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో తనిఖీలు చేసిన ఈడీ మార్చి 15న ఆమెను అరెస్టు చేసింది. సుమారు ఐదున్నర నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన కవిత తనను రాజకీయ కారణాలతో అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న కవిత.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ఈ ఏడాది జూన్‌లో ఆందోళనలు నిర్వహించారు. -
BRS Party Office: కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీలు దహనం
-
అక్కకు అడ్డొస్తే.. కవిత అనుచరుల వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ‘‘వాడెవ్వడు వీడెవ్వడు కవిత అక్కకు అడ్డు ఎవడు’’ అంటూ జాగృతి కార్యాలయంలో కవిత అనుచరులు నినాదాలు చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జాగృతి అంటూ నినాదాలు చేశారు. ఖబర్దార్ హరీష్‌రావు అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత అక్కకు అడ్డొస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చిన ఆమె అనుచరులు.. సస్పెండ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.‘‘కవిత సస్పెన్షన్‌తో జరిగేది ఏమీలేదు. కేసీఆర్‌పై సీబీఐ విచారణను కవిత తట్టుకోలేకపోయారు. చాలా రోజులుగా కవితను దూరంపెట్టే యోచన జరుగుతోంది’’ అంటూ బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడంపై తెలంగాణ జాగృతి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చే చర్యలను సహించబోమన్న జాగృతి కార్యకర్తలు.. కవిత వ్యాఖ్యలపై కనీసం వివరణ కోరలేదని మండిపడ్డారు. కొందరి కళ్లల్లో ఆనందం కోసమే సస్పెన్షన్ నిర్ణయం’’ అంటూ జాగృతి కార్యకర్తలు మండిపడ్డారు. -
షాకులిచ్చిన కవితకే బిగ్ షాక్!
గీత దాటితే బహిష్కరణలే తప్ప మరొకటి ఉండని పార్టీ.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న సంచలన అభియోగం మీద గులాబీ అధినేత కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే.. గతంలో పార్టీ తీసుకున్న చర్యల దృష్ట్యా కవిత బహిష్కరణ తప్పదంటూ ఈ ఉదయం నుంచి జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అలాంటప్పుడు సస్పెన్షన్ వేటుతోనే ఎందుకు సరిపెట్టాల్సి వచ్చింది?.. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా సరే క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. విచారణలు, నోటీసులు, షోకాజ్ల్లాంటివేం లేకుండా నేరుగా కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సాగనంపుతూ వచ్చింది. గతంలో.. గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలె నరేంద్ర, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపైనా బహిష్కరణ వేటే వేసింది. 2021లో ఈటల రాజేందర్పైనా నేరుగా బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. అలాంటిది గత 12 ఏళ్లుగా పార్టీలో మూలనపడిన క్రమశిక్షణ కమిటీని తెర మీదకు తెచ్చి మరీ.. కవితను సస్పెండ్ చేయడం ఆశ్యర్యానికి కలిగిస్తోంది. కిందటి ఏడాది ఆగస్టులో.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలుకు వెళ్లొచ్చాక కవిత కొంతకాలం పాటు వ్యక్తిగత జీవితం మీదే ఫోకస్ చేశారు. అయితే.. ఈ ఏడాదిలో క్రియాశీలకంగా మారిన ఆమె 2.0 రాజకీయంతో సొంత పార్టీకే వరుస షాకులు ఇస్తూ వచ్చారు.షాక్ నెంబర్ 1..పార్టీ ఆవిర్భావ వేడుకలపై విమర్శలతో బహిరంగ లేఖ రాయడం మే నెలలో కలకలం రేపింది. రజతోత్సవ సభ(బీఆర్ఎస్ సస్లివర జూబ్లీ వేడుకలో)లో సాగిన అధినేత ప్రసంగంపై కేడర్ అసంతృప్తిగా ఉందంటూ.. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేసీఆర్ దేవుడేకానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తన తండ్రికి రాసిన లేఖను కొందరు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టారంటూ మండిపడ్డారామె.షాక్ నెంబర్ 2.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చించడం మంచిదికాదన్న సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి... కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని మే 29వ తేదీన జరిగిన మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. ఆపై రెండు రోజులుగా కొత్తగా తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బంజారాహిల్స్‌లో ప్రారంభించారు. అంతేకాదు.. ఈ ఏడాది కేటీఆర్ చేతికి కవిత రాఖీ కూడా కట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.షాక్ నెంబర్ 3..కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు విచారణ నోటీసులు ఇవ్వడంపై నిరసనగా.. జూన్ 10వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారామె. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తిగా దూరంగా ఉంది. షాక్ నెంబర్ 4..జూన్ 16వ తేదీన.. ఫార్ములా ఈకార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరైతే.. అదేరోజు అదేంపట్టనట్లు జగిత్యాలలో ఆమె పర్యటించారు. షాక్ నెంబర్ 5..జులైలో.. జహీరాబాద్‌లో జరిగిన బీసీ రిజర్వేషన్ల సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఆమె వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మండలి చైర్మన్‌కు ఆమె మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. అయితే ఇంత జరిగినా.. బీఆర్ఎస్ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది. షాక్ నెంబర్ 6..బీఆర్ఎస్ కేడర్‌ను అయోమయానికి గురిచేసిన పరిణామం ఇది. జులై 26వ తేదీన ఉప్పల్‌లో కేటీఆర్ బీఆర్ఎస్వీ సభ, కొంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కవిత నిర్వహించారు. షాక్ నెంబర్ 7..పార్టీతో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల సాధనాదీక్ష చేపట్టారు. జై బీసీ.. జై జాగృతి నినాదాలు చేశారుషాక్ నెంబర్ 7..ఆగష్టు 5వ తేదీన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ను నాశనం చేసిన లిల్లీపుట్ నేత వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. షాక్ నెంబర్ 8.. కాళేశ్వరంపై బాంబ్ పేల్చారామె. హరీష్‌రావు, సంతోష్ రావుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిపై సీబీఐ ఎంక్వైరీనా?అంటూ రగిలిపోయిన ఆమె.. ఇంతదాకా వచ్చినా పట్టనట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. ఈ వరుస షాకులిస్తున్నా.. తనపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆమె విమర్శలకు మరింత పదును పెట్టారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను అధినేత కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కవితపై కఠిన చర్యలే ఉండాలని సీనియర్లు పలువురు కేసీఆర్ వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే జాగృతి సుదీర్ఘంగా బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతుండడం.. కవిత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. కవితపై తీసుకోబోయే చర్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై తీవ్రంగా చర్చించారు. చివరాఖరికి సస్పెండ్ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు.. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా.. బీఆర్ఎస్లో 2025 ఏడాది కల్వకుంట్ల కవిత కల్లోలనామ సంవత్సరంగా మిగిలిపోనుంది. -
కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర: పల్లా
సాక్షి, హైదరాబాద్: పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పల్లా చెప్పుకొచ్చారు. కవిత వ్యాఖ్యలు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందన్న పల్లా.. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కేసీఆర్ ఆదేశాలే మాకు శిరోధార్యం’’ అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తేల్చి చెప్పారు.కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కేపీ వివేకానందకేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ‘‘గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను కవిత అయోమయానికి గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించమని గతంలోనే కేసీఆర్ చెప్పారు...కన్నకూతురు కంటే కూడా కష్టంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్త్ ముఖ్యమని తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. ఈ రోజు పార్టీ కోసం కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని వివేకానంద పేర్కొన్నారు.కాగా, హరీష్‌రావు, సంతోష్‌రావులు అవినీతి అనకొండలన్న కవితపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల కవిత దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్ల్లొ కవిత ఫ్లెక్సీలను తొలగించారు. -
కేసీఆర్ ఆదేశాలతో కవిత సస్పెన్షన్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా పార్టీ లైన్ దాటి ఆమె వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతోందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.కవిత ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలోఉన్నందున బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని, తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రధాన కార్యదర్శి టీ రవీందర్రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ మెంబర్ సోమ భరత్‌కుమార్ పేరిట లేఖ విడుదలైంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నుంచి కవితకు పార్టీకి మధ్య గ్యాప్ మొదలైంది. కేసీఆర్ ప్రసంగంపై ఆమె బహిరంగ లేఖ విడుదల చేయడం కలకలం రేపింది. అటుపై సోదరుడు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా ఆమె అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. ఇక.. లిల్లీపుట్ అంటూ మాజీమంత్రి జగదీష్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా.. హరీష్‌రావు, సంతోష్‌రావులను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలే చేశారామె. పార్టీ MLC శ్రీమతి కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది.పార్టీ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె.… pic.twitter.com/iTSWON3irq— BRS Party (@BRSparty) September 2, 2025 -
షోకాజ్ నోటీసు ఇస్తారా? వేటు వేస్తారా?
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కీలక భేటీ నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న చర్చల దృష్ట్యా కవితపై చర్చలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.కాళేశ్వరంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి హరీష్‌రావు, సంతోష్‌రావులే కారణమంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల తర్వాత నిన్న సాయంత్రం నుంచి కీలక నేతలతో సమావేశం జరుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు యూకే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.నిన్న అర్ధరాత్రి ఫామ్‌హౌజ్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్ ఈ ఉదయం మళ్లీ అక్కడకు చేరుకున్నారు. కేటీఆర్‌తో పాటు జగదీష్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. కవిత వ్యాఖ్యలపై పలువురు సీనియర్లతో పాటు కేడర్ కూడా గుర్రుగా ఉంది. మొన్నీమధ్యే బహిరంగ లేఖ పేరిట కేటీఆర్ పైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో కవితపై కేసీఆర్ చర్యలకు సిద్ధమవుతున్నారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే వ్యాఖ్యలకుగానూ షోకాజ్ నోటీసులు ఇస్తారా? లేదంటే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా?.. చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ.. వేటు వేస్తే తలెత్తే పరిణామాలపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఒకవేళ కవితపై వేటు పడితే.. జాగృతిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎటు వైపు ఉంటారు? అనే కోణంలోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాళేశ్వరం నివేదిక.. సీబీఐ విచారణకు ఆదేశం దరిమిలా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో హరీష్‌రావుపై వ్యాఖ్యలకు నిరసనగా కవిత దిష్టిబొమ్మను దగ్దం చేయడం గమనార్హం. -
చర్చ లేకుండానే బీసీ బిల్లుకు మండలి ఆమోదం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ శాసనమండలిలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు చేరి ‘‘రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు’’ అంటూ నినాదాలు చేశారు. ఆ ఆందోళనల నడుమే బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు వీలుగా రూపొందించిన తెలంగాణ పంచాయతీరాజ్ 2025 బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. అయితే.. ఈ పరిణామంతో బీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. కాళేశ్వరం ప్రతులను చించేసి మండలి చైర్మన్ మీదకు విసిరేశారు. దీంతో.. మంత్రి పొన్నం బీఆర్ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఫ్యూడలిస్ట్ పార్టీ. బీసీల అంశం చర్చకు వస్తె.. ఇలా అడ్డుపడటం సరికాదు. బీసీల పట్ల వాళ్లకున్న గౌరవం, వైఖరి స్పష్టమవుతోంది. సమాజం వాళ్లను గమనిస్తోంది. 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోకండి. సర్వేలో కూడా పాల్గొనలేదు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇలా అడ్డుకోవడం ఏం పద్ధతి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీ పార్టీకి బీసీ రిజర్వేషన్లు ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఇలా అడ్డుకునే కుట్ర మాత్రం దౌర్భాగ్యం అని మంత్రి పొన్నం అన్నారు. సభలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్ఎస్కు లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో వాళ్ల బంధం తెగిపోయింది. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టిఆర్ఎస్కు తెలంగాణ మాట పలికే అర్హతను కోల్పోయింది అని అన్నారామె.అయినా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగడంతో.. చర్చ లేకుండానే పంచాయతీ చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది. -
ఎర్రవల్లికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. కేసీఆర్‌తో కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్నారు. కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక, పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం. -
అసెంబ్లీలో BRS నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
-
ఎజెండాను రాత్రికి రాత్రే డిసైడ్ చేస్తామంటే ఎలా?: హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. రెండు రోజులే అసెంబ్లీ నిర్వహించి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. శనివారం బీఏసీ సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చిన ఆయన.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. శాసన సభలో వరదల పై చర్చించాలని కోరాం. ఫీజ్ రీయింబర్స్‌మెంటుపై మాట్లాడాలని కోరాం. యూరియా కొరత పై మాట్లాడాలి కోరాం. ప్రభుత్వ ఉద్యోగుల టీఏ, డీఏపై మాట్లాడాలనీ కోరాం. ప్రజా సమస్యలు మాట్లాడకుండా రెండు రోజులే సభ నిర్వహిస్తామని చెబుతున్నారు. మేం 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని కోరాం. వరదపై మాట్లాడకుండా బురద రాజకీయం చేయాలని చూస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఎరువులపై చర్చించాలని ఇవాళ సభ నుంచి వాకౌట్ చేశాం. ప్రజా పాలన అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడమా..?. బీఏసీ సమావేశం అర్థం పర్థం లేకుండా పోయింది. రేపటి ఎజెండా ఏందో ఇప్పటి వరకు చెప్పలేదు. రాత్రికి చెబితే ప్రతిపక్ష ఎమ్మెల్యే లు ఎప్పుడూ ప్రిపేర్ అవ్వాలి. అందుకే బీఏసీ నుంచి వాకౌట్ చేశాం అని హరీష్‌రావు అన్నారు. ఇదిలా ఉంటే.. సభ ఎన్నిరోజులపాటు నిర్వహించాలన్నది రేపు(ఆదివారం) నిర్ణయిస్తామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అంటున్నారు. ‘‘కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై రేపు సభలో చర్చ ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ను రేపు సభలో పెడతాం. బీఆర్ఎస్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే.. నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చి సభ నడుపుతాం. గణేష్ నిమజ్జనం ,వరదల నేపథ్యంలో.. మధ్య లో బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అని శ్రీధర్‌బాబు మీడియాకు తెలిపారు. -
తెలంగాణ పాలిటిక్స్‌లో ‘యూరియా’ వార్
సాక్షి, హైదరాబాద్: యూరియా కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. రైతుల కష్టాలపై చర్చించడానికి ప్రభుత్వానికి భయమెందుకు? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.‘‘వరద నష్టంపై చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎప్పటిలోగా ఎరువులు అందిస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతుల కష్టాలు వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదా?. రైతుల ఇబ్బందులపై సీఎం సమీక్ష కూడా చేయరా?. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అప్పటివరకు అసెంబ్లీని స్తంభింపజేస్తాం’’ అని హరీష్‌రావు హెచ్చరించారు.మరో వైపు, బీఆర్ఎస్ యూరియా కార్యక్రమం పట నాటకమంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. యూరియా కొరతకు కారణం.. రాష్ట్ర ప్రభుత్వమా? లేక కేంద్ర ప్రభుత్వమా మీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలో విషయమని పదేళ్ల మీ పాలనలో మీకు తెలియదా?. రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా?. అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసం?’ అంటూ తుమ్మల దుయ్బయట్టారు.‘‘జియో పాలిటిక్స్ వల్ల, దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గట్టు లేక యూరియా కొరత ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు?. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు?. రేవంత్‌రెడ్డి పాలనలో మూడు పంట కాలాల్లో యూరియా కొరత లేనీ విషయం మీకు తెలియదా?. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఉంటే సీఎం రేవంత్‌పై మీ శాపనార్థాలు ఏమిటి?. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తేనే తెలంగాణకు యూరియా పంపిణీ చేస్తున్నారు. రైతాంగం ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరు’’ అంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సెక్రటేరియట్ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా
-
బీఆర్ఎస్ వాకౌట్.. ముగిసిన బీఏసీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అప్డేట్స్.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్చకు కాంగ్రెస్ వ్యూహం.. కమిషన్ విచారణపై పీపీటీకి చాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్ఎస్.. -
కాళేశ్వరం నివేదికపై మళ్లీ హైకోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీ.. మరోమారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తోంది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన ఆ పారీ్ట.. మరోమారు మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)ను దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం హైకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది.శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పీసీ ఘోష్ కమిషన్‌పై కోర్టుకు వెళ్లే అంశంపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది.హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ విచారణకు రాకమునుపే అసెంబ్లీలో ఘోష్ కమిషన్ నివేదికను పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ఆదివారం కూడా అసెంబ్లీని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఈ భేటీలో అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ అసెంబ్లీలో నివేదికను ప్రవేశ పెడితే వినిపించాల్సిన వాదనపై ఇప్పటికే హరీశ్‌రావు పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్లు సమాచారం.అయితే, అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ హాజరు కాకపోవటమే మంచిదని పార్టీ నేతలు చెప్పినట్లు తెలిసింది. అసెంబ్లీలో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా కేసీఆర్ హాజరయ్యేదీ లేనిదీ తెలుస్తుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్! పీసీ ఘోష్ కమిషన్‌ను కొట్టేయడం లేదా స్టే కోసం బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉందన్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేవియట్ దాఖలు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆ కేవియట్‌లో కోరినట్లు సమాచారం. బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేస్తే... ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో వాదనలు వినిపిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. వారి సభ్యత్వంపై సందిగ్ధం గవర్నర్ కోటాలో గతేడాది ఆగస్టు 16న ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ప్రొ. కోదండరాం, ఆమేర్ అలీఖాన్‌లు శనివారం నుంచి మండలి సమావేశాలకు హాజరు అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి సభ్యత్వాలను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 13న మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులను పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం న్యాయశాఖకు, అడ్వొకేట్ జనరల్‌కు అప్పగించింది. ఇప్పటివరకు ఈ 2 స్థానాలు ఖాళీ అయినట్లు మండలి చైర్మన్ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అమలు చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
ఇది కదా అసలు నిజం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు.అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడుతుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవానికి, గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని (4 నెలల్లో రూ.9,355 కోట్లు) పేర్కొన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తుందంటూ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం స్తంభించిపోయిందని కేటీఆర్ అన్నారు. ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని, ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు...గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమే - కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ 👇… pic.twitter.com/6vKlTipJbF— KTR News (@KTR_News) August 29, 2025రూ.3,50,000 కోట్ల 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ.1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ.225 కోట్ల హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల గోడును గాలికొదిలేసి, డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. -
ఎట్ల చేద్దాం? అటు ఎర్రవల్లి ఫాంహౌస్‌కి బీఆర్ఎస్ లీడర్లు.. ఇటు బీజేఎల్పీ కీలక భేటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలు కీలక సమావేశం నిర్వహిస్తున్నాయి. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సెషన్‌ను నిర్వహిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే కాళేశ్వరం అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఈ చర్చకు దూరంగా ఉంటారనే సంకేతాలు అందుతున్నాయి. ఈ తరుణంలోనే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆయన కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సహా బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు. నివేదికపై చర్చించేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తోంది.ఇక.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం నడుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నారు. అయితే మీటింగ్ మధ్యలో ఎమ్మెల్యేల ప్రయారిటీ అంశాన్ని కొందరు చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉందని.. రాష్ట్ర కమిటీలో తాము ఇచ్చిన పేర్లను పరిశీలించాలని ఎమ్మెల్యేలు రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.కాళేశ్వరం కమిటీ నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ రేపటి నుంచి ప్రత్యేకంగా భేటీ కానుంది. శనివారం ఉదయం 10.30గం.లకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు నివాళులర్పించిన అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆపై బీఏసీ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నా సమయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. వీలును బట్టి.. నాలుగు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. -
కడియం శ్రీహరిపై మరోసారి తాటికొండ రాజయ్య వివాదస్పద వ్యాఖ్యలు
సాక్షి, జనగామ జిల్లా: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నకిలీ ఎన్కౌంటర్లకు స్పెషలిస్ట్ కడియం శ్రీహరి అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఏఒక్కటి తన మార్క్ అని చెప్పడానికి లేని టాల్మాన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఓర్వలేని తనంతో లెక్కచేయనితనంతో ఫ్రస్టేషన్‌కు లోనై ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.బీజేపీలోకి రమ్మని పిలిచిన వెళ్లే జంపు జలానీలు తండ్రీ కూతుర్లని మండిపడ్డారు. అభివృద్ధి నినాదం అయితే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 1560 కోట్లు, హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 6000 కోట్లు తీసుకొస్తే, అభివృద్ధి కోసం పార్టీ మారినని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి 800 కోట్లు తెచ్చానని చెప్పుకోవడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.ఓడిపోతాడనే భయంతో తక్కువ మెజారిటీతో మూడుసార్లు ఎమ్మెల్యే గెలవడం ప్రజా నాయకుడు అనిపించుకోడన్నారు. నియోజకవర్గంలో ఇక నుండి కడియం శ్రీహరి ఎత్తులు జిత్తులు, కుళ్ళు కుతంత్రాలు సాగవన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవడం లేదని, నువ్వే అనుకుని ఆగమాగం అవుతూ.. ఈరోజు లింగాల ఘన్‌పూర్‌లో మా పార్టీ కార్యక్రమాలను పోలీసుల ద్వారా రద్దు చేయించడం కడియం శ్రీహరి దుర్బుద్ధికి నిదర్శనం అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం నివేదిక సహా ఇతర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమాచారం కానుంది. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో స్పెషల్ సెషన్‌కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే యోచనలో ప్రభుత్వం ఉంది.ఇదిలా ఉంటే.. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రూపొందించిన నివేదికను అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నివేదికపై చర్చ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. బీఆర్ఎస్కు ప్లస్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో నిన్న ఐదుగురికి నోటీసులు పంపించారు. నేడు మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాగా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, తెలంగాణ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.ఇక, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం. అయితే, స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానమిస్తానని అన్నారు. తాను అసలు పార్టీ మారలేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.మరోవైపు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు ఇంకా స్పీకర్ నోటీసులు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్. ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేకి నోటీసులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్కు రాజీనామా చేయని సంజయ్. దీంతో, సంజయ్‌కు నోటీసులు ఇస్తారా? లేదా? అని స్థానికంగా చర్చ నడుస్తోంది. -
నాపై కక్ష గట్టారు.. ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఆఫీస్‌లో టీబీజీకేఎస్ ఎన్నిక కార్మిక చట్టాలకు విరుద్ధం. రాజకీయ కారణాలతోనే టీబీజీకేఎస్ ఎన్నిక. కొందరు నాపై కుట్రలు చేస్తున్నారు’’ అంటూ కవిత మండిపడ్డారు.‘‘గతంలో కేసీఆర్‌కు రాసిన లేఖలు లీక్ చేసి కుట్రలు చేశారు. పార్టీ వ్యవహారాలను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధిస్తున్నారు’’ అంటూ కవిత చెప్పుకొచ్చారు. ‘‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను...ఈ పదేళ్ల కాలంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్‌లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా, ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోంది’’ అంటూ లేఖలో కవిత పేర్కొన్నారు.కాగా, కవితకు బీఆర్ఎస్ హైకమాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడి పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. గురువారం ఉదయం సింగరేణి కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. -
ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి ఇవ్వాలని తాము అడగలేదున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్లో కేంద్రం తెచ్చిన మూడు బిల్లుల విషయంలో ఇండియా కూటమి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లులకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు నాయకులు బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ సవరణ తీసుకువస్తోంది. ఇందు కోసం లోక్‌సభలో బిల్లు పెట్టాం. దీన్ని ఏకపక్షంగా తీసుకురావాలని అనుకోవడంలేదు. ఈ బిల్లుపై చర్చ జరపాలని జేపీసీకి పంపాం. లోక్‌సభలో పెట్టిన బిల్లు వల్ల దోచుకున్న వారికి కొంత బాధ కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావడం లేదు. భవిష్యత్తులో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చెందుతుంది.లోక్‌సభలో నిన్ను కాంగ్రెస్ కూటమి తీరు దుర్మార్గం. తీవ్రమైన నేరాలపై అరెస్ట్ అయితే ప్రధాని, సీఎం, మంత్రులు పదవీచ్యుతులయ్యే విధంగా బిల్లు తెచ్చాం. రాజకీయాలతో సంబంధం లేని బిల్లు ఇది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు ఎందుకు భయపడుతోంది. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. కోర్టు తీర్పు తర్వాతే అమిత్ షా ఎన్నికల్లో పోటీ చేశారు. నైతిక విలువలు కట్టుబడి నాడు అమిత్ షా రాజీనామా చేశారు. ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగి పోవాలి. జేపీసీ ముందు అగ్ని పరీక్ష జరగాలి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ ఆరు నెలలుగా పైగా జైలులో ఉన్నప్పుడు అక్కడే అధికారులతో రివ్యూ మీటింగ్‌లు పెట్టారని విమర్శించారు. జైలు నుంచే పాలన చేసి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించారన్నారు. తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ జైలు కెళ్లినా రాజీనామా చేయలేదని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ మద్దతుపై మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మాకు బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదు. వాళ్ళ మద్దతు ఎవరు అడిగారు. మేం అడగలేదు. 50వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు పంపుతున్నాం. తమిళనాడు పోర్టు నుంచి రవాణా జరుగుతుంది. ఇఫ్కో నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో యూరియా లేదు అని మంత్రుల ప్రకటన వల్లే చాలా మంది స్టాక్ పెట్టుకున్నారు. ఈ సమస్యకు మంత్రుల ప్రకటనలే కారణం. దిగుమతుల సమస్యల వల్ల యూరియా కొంత ఆలస్యం జరిగింది’ అని చెప్పుకొచ్చారు. -
‘‘రాహుల్ గాంధీ మా బాస్ కాదు..’’ ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మద్దతు.. ఎన్డీయే అభ్యర్థికా? ఇండియా కూటమి అభ్యర్థికా? అనే ఉత్కంఠ కొనసాగుతున్నవేళ.. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉపరాషష్ట్రపతి ఎన్నికపై జరిగేదంతా డ్రామా. బీసీలపై ప్రేమ నోటిపైనేనా.. చేతల్లో ఉండవా. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. మేం ఏ కూటమిలో లేం. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తిని కచ్చితంగా వ్యతిరేకిస్తాం..రాహుల్ గాంధీ మా బాస్ కాదు.. మోదీ మా బాస్ కాదు. ఢిల్లీలో మాకు ఏ బాస్ లేరు. మమ్మల్ని నడిపించేవారెవరూ లేరు. తెలంగాణ ప్రజలే మా బాస్. అందుకే మేం కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణం మా నిర్ణయం ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్.. రెండూ దౌర్భాగ్యమైన పార్టీలే. కానీ, తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు తెస్తారో.. వారికే మా మద్దతు ఉంటుంది. సెప్టెంబర్ 9 లోపు ఎవరు ఎరువులు ఇస్తామంటే వారికి మద్దతిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేదు. అయితే.. రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. -
అప్పుడు లేని యూరియా కొరత.. ఇప్పుడే ఎందుకొచ్చింది?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం ఆయన నందినగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరు వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులను పెట్టి ఎరువులను అమ్మే పరిస్థితి వచ్చిందంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.‘‘తెలంగాణలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. మా పాలనలో యూరియా కష్టాలు రాకుండా సరఫరా చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎరువుల కొరత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?. రేవంత్ ప్రభుత్వానికి పరిపాలనపై అవగాహన లేదు’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.‘‘వర్షంలో తడుచుకుంటూ ఎరువుల కోసం రైతులు లైన్లలో నిల్చుంటున్నారు. రైతులకు మాత్రం ఎరువుల కొరత లేదని సీఎం చెప్తున్నారు. కాంగ్రెస్ చేతకానితనంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. రేవంత్‌కు చిల్లర రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. -
అంతా రేవంత్ వల్లే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదన్నారు.ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసిన కేటీఆర్.. ఫార్మా సిటీ భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడలేరని అసెంబ్లీలోనే రెండేళ్ల క్రితం హెచ్చరించానన్నారు. విజన్ లేని రేవంత్ వలన ప్రజాధనం వృధా అయ్యిందన్నారు. వేల కోట్ల రూపాయల ఫార్మా సిటీ పెట్టుబడులు వెనక్కి పోయాయి. లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతన్నలు మోసపోయారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 20 వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారుచేసిందన్నారు. -
బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్.. రప్పా.. రప్పా అంటూ..
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రప్పా.. రప్పా అంటూ ఫ్లెక్సీల వార్ మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫొటోలతో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. సూర్యాపేటలో మరోసారి రప్పా రప్పా ఫీవర్ మొదలైంది. నెల రోజుల క్రితం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కౌంటర్‌గా తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవాళ కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల ఇచ్చే కార్యక్రమానికి జగదీష్ రెడ్డి హాజరు కానున్నారు.ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ ఫొటోతో ఎదురొస్తే రప్పా.. రప్పా అంటూ రాసుకొచ్చారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌పై తెలంగాణ బెబ్బులి పులి - ఉత్తమ్ అన్న యువశక్తి అంటూ రాశారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట రాజకీయం ఆసక్తికరంగా మారింది. -
బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. ఇదిగో క్లారిటీ
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కొందరు పార్టీని వీడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక, తాండారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఈ వార్తలపై స్పందించారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు.తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వీడియోలో మాట్లాడుతూ..‘పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. గువ్వల బాలరాజును నేనే బీజేపీలోకి పంపినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇంకా కొంత మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు హాస్యాస్పదంగా ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దు. వేల కోట్ల కాంట్రాక్ట్‌లు ఇస్తామని, ఉన్నత పదవులు ఆశచూపింది బీజేపీ. తెలంగాణకు అన్యాయం చేయవద్దని బీఆర్ఎస్ కంకణబద్దుడిగా, కేసీఆర్ మాసనపుత్రుడిగా నేను సాహసం చేశాను.సొంతలాభం ముఖ్యం కాదని, తాండూరు అభివృద్ధి ముఖ్యమని భావించాను. కొంతమంది బీజేపీ నుంచి వచ్చిన వాళ్లను బహిరంగంగా ఆ రోజు ప్రపంచానికి పట్టించాను. ధైర్యసాహసాలు చేసిన తాండూరు బిడ్డ.. వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. తెలంగాణను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లడానికి బీఆర్ఎస్తోనే వెళ్తాను. ఇతర పార్టీలతో తొత్తులుగా మారిన మీడియాను హెచ్చరిస్తున్నా.. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా.బీఆర్ఎస్ కార్యకర్తలకు పూర్తి క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ లోకల్ బాడీ ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వహించుకున్నాం. సొంత పనుల మీద అమెరికా వచ్చాను...త్వరలోనే తిరిగి వస్తాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను గెలిపించుకుంటాను. పార్టీ మార్పుపై ఎటువంటి ఆలోచన లేదు. త్వరలోనే తాండూరుకు వస్తాను’ అని క్లారిటీ ఇచ్చారు. -
కాంగ్రెస్, బీజేపీ కుట్రలను బీఆర్ఎస్ ఎదుర్కోగలదా?
తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితిని బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీలు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ల వైఖరి ఈ అనుమానానికి కారణమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యమిచ్చేందుకు సిట్ అధికారుల వద్దకు వెళ్లిన సందర్బంలో బండి సంజయ్ మీడియా వద్ద చేసిన వ్యాఖ్యలు వీటిని మరింత బలపరుస్తున్నాయి.ప్రత్యర్థులను బలహీనపరిచి తద్వారా తాము బలపడాలని కోరుకోవడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఇందుకు రకరకాల వ్యూహాలూ అమలు చేస్తూంటారు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ వ్యూహాలకు, కుట్రల బారిన పడుతున్నది భారత రాష్ట్ర సమితే. ఒక ప్రాంతీయ పార్టీగా రెండు జాతీయ స్థాయి పార్టీలను ఎదుర్కుంటూ ఉండటం దీనికి కారణం. 2014 నుంచి తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 శాసనసభ ఎన్నికలలో ఓడింది.తొలి టర్మ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య సత్సంబంధాలే ఉండేవి కానీ ఆ తరువాత ఇరువురు దూరమయ్యారు. సొంత జాతీయ పార్టీ యోచనతో కేసీఆర్ మహారాష్ట్రలో శాఖను ప్రారంభించారు. అయితే స్వరాష్ట్రం తెలంగాణలోనే ఓటమి పాలు కావడంతో ఆయన ప్లాన్లు తలకిందులయ్యాయి. దీంతో ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో ఏర్పరచుకున్న సంబంధాలను కూడా పక్కన బెట్టవలసి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా 39 అసెంబ్లీ స్థానాలతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలిగింది. కాని వీరిలో పది మంది కాంగ్రెస్‌లో చేరిపోయారు.ముఖ్యమంత్రి పదవి పొందిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను దెబ్బగొట్టే ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు లావాదేవీలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ వంటి వాటిపై దృష్టి పెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నిటిలో కెసిఆర్ ను ఇరుకున పెట్టే వ్యూహం కనిపిస్తుంది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జ్యుడిషయల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్కు పెద్ద పరీక్ష అయ్యాయి. ఆ పార్టీ పూర్తిగా పరాజయం చెందడంతో లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 సీట్ల చొప్పున విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది. అప్పటి నుంచి బీజేపీకి కూడా తెలంగాణపై ఆశలు పెరిగాయి. ఏ అవకాశం వచ్చినా బిజెపి నేతలు బీఆర్ఎస్పై విరుచుకుపడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు.తాజాగా బండి సంజయ్ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యం ఇవ్వడానికి దర్యాప్తు అధికారుల బృందం ముందుకు వెళ్లి తన అభిప్రాయాలు తెలియచేశారు. ఏమి ఆధారాలు ఇచ్చారో తెలియదు కాని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్, కేటీఆర్‌లు వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేస్తూ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, హరీష్‌రావు, కవితలతోసహా పలువురి పోన్లను టాప్ చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలలో, కేసీఆర్ కుటుంబంలో కలతలు సృష్టించడానికి సంజయ్ ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది.ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, కేటీఆర్‌లను ఈపాటికి జైలులో పెట్టేవాళ్లమని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇది మరీ సీరియస్ కామెంట్. ఎవరినైనా జైలులో పెట్టడానికి నిర్దిష్ట ఆధారాలు ఉండాలి. అవేమి చూపకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం?. సిట్ అధికారులు కూడా కేంద్రమే ఈ కేసు విచారించాలని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఫోన్లను కూడా టాప్ చేశారని అధికారులు సంజయ్ కు చెప్పారని ఒక పత్రిక రాసింది. ఇందులో వాస్తవం ఉంటే కేంద్రానికి, అందులోను హోం శాఖకు తెలియకుండా ఉండదు.కేంద్రంలోని వారి ఫోన్లు టాప్ అయి ఉంటే, దానిని కనిపెట్టడం కాని, సీబీఐకి అప్పగించడం కాని కేంద్రం చేతిలో పనే కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. కానీ బండి సంజయ్ తెలంగాణలో బీఆర్ఎస్ను వీక్ చేయడం కోసం, ఆ పార్టీ నేతలను భయపెట్టడానికి ఈ ఆరోపణలు చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుపొందినా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బాగా పుంజుకుందన్న అభిప్రాయం కూడా ఉంది. దాంతో బీఆర్ఎస్ నేతలు నైతికంగా ఇబ్బంది పడేలా సంజయ్ మాట్లాడి ఉండవచ్చు.దానికి తోడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొందరు సిటింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. మరో విషయం చెప్పాలి. ఏపీకి బీజేపీ ఎంపీ సీ.ఎం.రమేష్‌కు చెందిన కాంట్రాక్ట్ కంపెనీకి రేవంత్ రెడ్డి భారీ కాంట్రాక్టు ఇప్పించారని కేటీఆర్ ఆరోపించారు. ఆ సందర్భంలో రమేష్ రియాక్ట్ అవుతూ తనవద్ద బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదనను కేటీఆర్ చేశారని అన్నారు. కేటీఆర్ దాన్ని ఖండించినా అలాంటి ఆరోపణలు రావడం ఏ పార్టీకి అయినా కాస్త ఇబ్బందికరమైన వ్యవహారమే. సంజయ్ ప్రకటనను కూడా కేటీఆర్ తోసిపుచ్చి క్షమాపణ డిమాండ్ చేశారు.అలా చేయకపోతే లీగల్ నోటీసు ఇస్తానని అన్నారు. సంజయ్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక రూపంలో కేసీఆర్, హరీష్ రావులను చికాకు పెట్టాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. కేసీఆర్‌ను అరెస్టు చేయాలని అనుకోవడం లేదని రేవంత్ అన్నప్పటికీ, పరిణామాలు ఏ వైపు మళ్లుతాయో అప్పుడే చెప్పలేం. వీటన్నిటిని గమనిస్తే, బీఆర్ఎస్ను దెబ్బతీసి, ఆ స్థానాన్ని తాను ఆక్రమించాలని బీజేపీ వ్యూహాలు పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఆ అవకాశం బీజేపీకి రాకుండా చేసి, తనే లాభపడాలని కాంగ్రెస్ సహజంగానే యత్నిస్తుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం ముందున్న సవాలు. ఈ రెండు పార్టీలలో ఏదో ఒకదానితో బీఆర్ఎస్కు సంబంధాలు ఉండి ఉంటే ఈ సమస్యలు అంతగా ఉండేవికావు. దేశవ్యాప్తంగా స్వతంత్రంగా ఉండే ప్రాంతీయ పార్టీలను అణచి వేయడానికి జాతీయ పార్టీలు యత్నిస్తున్నాయి. అందులో బీజేపీ మరీ ముందు ఉంటోందనిపిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు బీజేపీ అమలు చేసిన వ్యూహాలు అన్నీ, ఇన్నీ కావు. ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సైతం జైలులో పెట్టింది. బీహారులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్‌తో జతకట్టి ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు.అదే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమితో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం ఎవరితో కలవడం లేదు.అక్కడ కాంగ్రెస్, సీపీఎంల స్థానాన్ని బీజేపీ ఆక్రమించేసింది. తమిళనాడులో కాంగ్రెస్‌తో డీఎంకే కూటమి కడితే, ఏఐఏడీఎంకే ఈ మధ్యనే బీజేపీతో కలిసింది. కర్ణాటకలో జేడీఎస్ కూడా కొంతకాలం కాంగ్రెస్‌తో, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామి అయింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగానే ఉండడానికి సిద్దపడడంతో, బీజేపీ నాయకత్వం తనను తీవ్రంగా దూషించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడలేదు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి తమను బతిమలాడేలా చేసుకున్నారు.దరిమిలా చంద్రబాబుపై ఎలాంటి కేసులు ముందుకు సాగలేదు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉండగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ దాదాపు జీరో స్థాయిలో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అయినప్పటికీ వైసీపీకి జనంలో పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికి కూటమి పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. తెలంగాణలో మూడు పార్టీలు ఆధిపత్య పోరులో ఉండడం వల్ల బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలతో పోటీ పడవలసి వస్తోంది. ఈ రకంగా సాగుతున్న రాజకీయంలో వచ్చే మూడేళ్లు బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుని నిలదొక్కుకోవలసి ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నా వయసు 73.. ఇంక ఏ వైపు చూసేట్లు ఉంది: మల్లారెడ్డి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికైతే బీఆర్ఎస్లోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలిగే ఆలోచనతో ఉన్నానని మనసులో మాట బయటపెట్టారు.రాఖీ పండుగ సందర్భంగా.. తన అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్న అనంతరం శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాఖీ పండగంటే తనకు ఎంతో ఇష్టమన్న మల్లారెడ్డి.. ఈ పండుగ నాడే తన ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభించానని చెప్పారు. రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని.. తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానని మల్లారెడ్డి చెప్పారు. తనకు 73సంవత్సరాలు వచ్చాయని.. ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ‘‘ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యా. ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటా’’ అని చెప్పుకొచ్చారు. అస్సలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని అన్నారాయన. -
Bandi Sanjay: నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం సిట్ కు ఇస్తున్నాను
-
అఫీషియల్: ఆ పార్టీలోకే గువ్వల బాలరాజు
బీఆర్ఎస్ మాజీ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజుల కిందటే ఆయన గులాబీ పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై ఇవాళే స్పష్టత వచ్చింది. బీజేపీలో చేరబోతున్నారని అధికారిక సమాచారం. సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తమ పార్టీలో చేరబోతున్నారని రామచందర్‌రావు ప్రకటించారు. నియోజకవర్గ, జిల్లా ప్రజలు, కార్యకర్తలతో చర్చించాకే బాలరాజు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.2007 అక్టోబరు 6న బీఆర్ఎస్లో చేరారు గువ్వల బాలరాజు. 2009లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో, 2018లో రెండు పర్యాయాలు అచ్చంపేట(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2022 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశమైంది.రాజీనామా సమయంలోనే ఆయన బీజేపీ అధిష్టానం నుంచి భరోసా ఇవ్వడంతోనే ఆయన బీఆర్ఎస్ను వీడినట్లు చర్చ జరిగింది కూడా. అటుపై ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ తీవ్రంగా విఫలమైందంటూ బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. -
రాజకీయ దురుద్దేశంతో రిపోర్టులా?.. చర్చకు సిద్దంగా ఉన్నాం: హరీష్‌రావు
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కమీషన్ల పేరుతో పాలన నడుస్తోందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవు, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్‌లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఇంట్లోనే ఉంటున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. కమీషన్ల పేరుతో పాలన నడుస్తుంది. రాష్ట్రం మొత్తం కమీషన్ల మయం చేశారు. రెండు పార్టీలు రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నాయి. NDSA రిపోర్ట్ గురించి అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు రెండు సార్లు కూలిపోతే NDSA లేదు. మేడిగడ్డ బ్యారజ్లో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద NDSA రిపోర్ట్ వచ్చింది.కాళేశ్వరం కమిషన్ గడువు రాత్రికి రాత్రే పెంచారు. కేసీఆర్‌కు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని మీడియాకే ముందు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ పూర్తి రిపోర్ట్ వస్తే బీఆర్ఎస్ ఎలా స్పందించాలో మాకు తెలుసు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుంది. ప్రభుత్వం బయటపెట్టిన రిపోర్టు చూస్తుంటే పూర్తిగా ఆధారాల్లేవు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవు, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది.టీవీల్లో వచ్చే సీరియల్లా రోజుకో అంశంపైన రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి. కన్నేపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా.. నీళ్లను ఇవ్వడం లేదు. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు పని కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ గో బెల్స్ ప్రచారం చేస్తుంది. బేగంపేట ఎయిర్ పోర్టులో కేసీఆర్ సవాల్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించలేక పారిపోయాడు. తుమ్మడిహట్టి 152 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్టు కట్టేందుకు అనుమతి ఉన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కాళేశ్వరం నివేదికపై స్పందించిన కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించారు. సోమవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ అయిన ఆయన.. కమిషన్ నివేదికను, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ‘‘అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్. ఆ కమిషన్ నివేదిక ఊహించిందే. ఎందరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ వ్యవహారంలో కొంతమంది BRS నేతలను అరెస్ట్ చేయవచ్చు.. అంతమాత్రాన భయపడవద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని.. .. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలి. కాళేశ్వరంపై క్యాబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం’’ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో హరీష్ రావు, కేటిఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే.. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టడం కంటే ముందే మీడియాకు లీకు కావడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ‘కాళేశ్వరం అవకతవకలు.. ఆయనదే పూర్తి బాధ్యత’ -
బీసీ, ముస్లిం రిజర్వేషన్లు వేర్వేరుగా ఉండాలి: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్, ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందన్నారు. సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలని ఆశించారు.‘సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారు. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది.కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నాం. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్‌డేగా ప్రకటించారు. జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై పెట్టింది. ఈ రోజు జరిగేది బీసీల ఆత్మగౌరవ పోరాటం ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు పెడతామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి. ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.బీజేపీ కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాం. ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశాం. తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు. తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం?. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలి’ అని తెలిపారు -
కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ.. కవిత, కాళేశ్వరంపై చర్చ!
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌తో పాటుగా కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్లో కాళేశ్వరంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. గత బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టుపై కేబినెట్లో చర్చించనున్నారు. మరోవైపు.. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డిజైన్‌లో లోపాలు లేవని అంటున్నారు. వ్యాప్కో సంస్థ సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు. -
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. అడ్డుకున్న పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా కవర్ చేయకుండా పోలీసులు.. మీడియాను అడ్డుకుంటున్నారు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని శాసనసభ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం వద్ద ధర్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాగా, శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా కవర్ చేయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. -
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం.. వాటిపైనే చర్చ
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం నివేదిక, స్థానిక ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.గత గురువారం కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కేసీఆర్.. ఎర్రవల్లి నివాసంలో ఆ పార్టీ నేతలతో సుదీర్ఘంగా భేటీ అవుతున్నారు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.మరో వైపు, ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది.టీఆర్ఎస్గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. -
ఎమ్మెల్సీ కవితకు జగదీష్ రెడ్డి కౌంటర్.. బీఆర్ఎస్లో దుమారం!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గులాబీ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత వ్యాఖ్యలపై తాజాగా జగదీష్ రెడ్డి స్పందిస్తూ..‘నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కొంత మంది ఏదో చేసేదామని అనుకుంటున్నారు. వ్యక్తులుగా ఏదో చేస్తామనుకుంటే అది వాళ్ల భ్రమ. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేరు. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను చావు తప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచాను. కొంత మంది అది కూడా గెలవలేదు కదా. పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీ గొప్పది. నల్లగొండలో అంతకుముందు ఎక్కువ సీట్లు వచ్చాయి.. అప్పుడు నేనే కారణం అన్నారు.. ఇప్పుడు ఒక్కడినే గెలిచాను.. అందుకే దీనికి కూడా నేనే కారణం. బనకచర్ల, కాళేశ్వరంపై కేసీఆర్‌తో చర్చించాం. కేసీఆర్‌తో చర్చల్లో కవిత విషయమే ప్రస్తావనకు రాలేదు. కవిత వైఖరి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు...కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణ లు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్న....— Jagadish Reddy G (@jagadishBRS) August 3, 2025అంతకుముందు.. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసి కవిత సంచలన ఆరోపణలు చేశారు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు.. ఎన్నడు ప్రజా పోరాటాల్లో పాల్గొన లేదు. అసలు బీఆర్ఎస్తో మీకేం సంబంధం?. లిల్లీపుట్ నాయకుడు, నిన్న మొన్న వచ్చిన చోటా మోటా నాయకులు కూడా నాపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. వారి వెనక బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు ఉన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతాను. పార్టీ కూడా సమయం వచ్చినప్పుడు స్పందిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ విమర్శలు చేశారు. దీంతో, కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా పెను దుమారం రేపాయి. -
నువ్వో లిల్లీపుట్.. నా గురించి మాట్లాడతావా?: బీఆర్ఎస్ నేతపై కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ, నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్తో సంబంధం లేని వ్యక్తితో తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లిల్లీపుట్ నాయకుడు తనను విమర్శించమేంటని కవిత ప్రశ్నించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వానికి, పోలీసులను అనుమతి కోరాం. ప్రభుత్వం అనుమతి విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిరాహార దీక్ష అనుమతి కోసం కోర్టుకు వెళ్ళాము.. కోర్ట్ మాకు అనుమతి ఇస్తుంది అనే నమ్మకం ఉంది. గాంధేయ మార్గంలో దీక్ష చేస్తాం. సానుకూల దృక్పథంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. 42 శాతంలో ముస్లింలు ఉన్నారో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.. ఉన్నారా లేదా స్పష్టత ఇవ్వాలి. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. దొంగనే దొంగ అన్నట్టుగా ఉంది బీజేపీ వాళ్ళ ధర్నా..ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు.. ఎన్నడు ప్రజా పోరాటాల్లో పాల్గొన లేదు. అసలు బీఆర్ఎస్తో మీకేం సంబంధం?. లిల్లీపుట్ నాయకుడు, నిన్న మొన్న వచ్చిన చోటా మోటా నాయకులు కూడా నాపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. వారి వెనక బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు ఉన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతాను. పార్టీ కూడా సమయం వచ్చినప్పుడు స్పందిస్తుంది. దీక్షకు అనుమతి రాకపోతే ఇంట్లోనే దీక్ష చేస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. హత్నూరలో రచ్చ రచ్చ..
సాక్షి, సంగారెడ్డి: హత్నూర మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య పెద్ద రచ్చే జరిగింది. సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం కోసం కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. పాలాభిషేకం వద్దని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వారించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా.. బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది. మరోవైపు, పాలాభిషేకం చేయకుండా బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల పార్టీ శ్రేణులు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా నాయకులను చెదరగొట్టారు. -
BRS ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీం తుది తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్ర్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే పరిస్థితిని అంగీకరించమని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బి ఆర్. గవాయి ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.పదో షెడ్యూల్ కింద స్పీకర్కురాజ్యాంగ రక్షణ లేదు. ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియను సాగదీసే ప్రయత్నం చేయొద్దు. పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంట్ ఆలోచించాలి. మేము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదు. పదో షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా ? లేదా అని ఆలోచించాలి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కాదు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా గడువు విధించాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికే పూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్‌లు పార్టీ ఫిరాయించారు. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నేడు సుప్రీం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈకేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీం కోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.అదేరోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాం«దీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లంటినీ కలిపి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో సీజేపాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ఉన్నారు. -
TG: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ‘సుప్రీం’ తుది తీర్పు రేపే
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు(గురువారం) సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై రేపు(జులై 31) తుది తీర్పును వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. ‘సుప్రీం’ తీర్పుపై ఆ ఎమ్మెల్యేలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయమే తీర్పు వచ్చే అవకాశముంది. -
‘డార్క్ వెబ్‌సైట్స్ ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. సీఎంపై సిట్‌కు ఫిర్యాదు చేశా’
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే అది విచ్చలవిడిగా జరుగుతోందని అన్నారాయన. సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా ఈరోజు సాక్షిగా వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ చేస్తుందని ఫిర్యాదు చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశాను. డార్క్ వెబ్సైట్ ద్వారా మంత్రుల ఫోన్లో సైతం ముఖ్యమంత్రి టాపింగ్ చేయిస్తున్నారు.గతంలో నా ఫోన్ హ్యాక్ అయినట్టు యాపిల్ సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. అదే విషయంలో కమిషనర్ కు ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఫోన్ టాపింగ్ పాల్పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ పాల్పడుతోంది అని ఆరోపించారాయన. -
వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికే కాంగ్రెస్, బీజేపీ దాడి చేస్తున్నాయంటూ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటాన్ని చూసి దేశం నివ్వెర పోయిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు స్వర్ణయుగం అని.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక కుట్రలు చేసి అధికారంలోకి వచ్చారు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.కాళేశ్వరం నిర్మించి ప్రపంచంలో తెలంగాణను హిమాలయాలంత ఎత్తులో నిలిపారు కేసీఆర్. మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందనే అనుమానం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ కలిసి రాజకీయ కుట్ర చేశాయి. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఉరి తీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రైతులకు మేలు చేసినందుకు మమ్మల్ని ఉరి తీయాలా?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.తెలంగాణకు పెద్ద కోవర్ట్ రేవంత్ రెడ్డి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీజేపీ ఆటలు సాగవని.. గులాబీ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది.. నా చెంచాగాడు రేవంత్ ఉన్నాడని చంద్రబాబు అనుకుంటున్నాడు. తెలంగాణకు అన్యాయం జరగకుండా కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫోన్ ట్యాపింగ్‌లో పసలేదని పోలీసులే చెబుతున్నారు. మా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద అటెమ్ట్ మర్డర్ కేసు పెడతారా?. మెడకాయ మీద తలకాయ ఉండి పనిచేస్తున్నారా? అంటూ డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసు అధికారి ఎవరెవరు ఎగిరి పడుతున్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. అన్ని లెక్కలు మిత్తితో సహా తేలుస్తాం’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్వీ కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి. కేసులకు భయపడకండి. మిమ్మల్ని కాపాడుకోవటానికి పార్టీ లీగల్ సెల్ ఉంది. గట్టిగా పోరాడే వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. తెలంగాణ జల హక్కులకు పిండం పెడుతుంటే మనం ఊరుకుందామా?. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. -
ఒకేరోజు రెండు.. అయోమయంలో బీఆర్ఎస్ కేడర్
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. అటు కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి, ఇటు కేటీఆర్ ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నాయి. దీంతో ఎటు వెళ్లాలో పాలుపోక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ‘‘అన్నా.. ఎటు పోదామే’’ అంటూ నగరంలోని బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నేతలు ఒకరితో ఒకరు ఫోన్లలో చర్చించుకుంటున్నారు. ఇవాళ.. ఒకే రోజు జాగృతి, బీఆర్ఎస్వీ కార్యక్రమాలు నిర్వహించడమే అందుకు కారణం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్లో జాగృతి తరఫన లీడర్ కార్యక్రమం జరగనుంది. ఈ మీటింగ్‌ను ఆసరాగా చేసుకుని జాగృతిని బలోపేతం చేయాలని.. గ్రామ స్థాయి దాకా కమిటీలు వేయాలని ఆమె నిర్ణయించారు కూడా. వాస్తవానికి ఈ మీటింగ్‌ను గత నెల 15వ తేదీనే కవిత ఫిక్స్ చేశారు. అయితే.. ఈలోపు బీఆర్ఎస్వీ తరఫున రాష్ట్ర సదస్సు నిర్వహణ ప్రకటన చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విద్యార్థుల స్థాయి నుంచే ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించిది. ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తోంది కూడా. ఉదయం సెషన్‌ను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సాయంత్రం కేటీఆర్ పాల్గొని ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు మీటింగ్‌లు పార్టీ కేడర్‌లో మాత్రం గందరగోళానికి తెరదీశాయి. తెలంగాణ జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు, ప్రాంతాలు వేర్వేరు అయినప్పటికీ.. ఒకే తేదీన నిర్వహిస్తుండడం గులాబీ దండులో చర్చనీయాంశమైంది. ఇద్దరిలో ఎవరికి జై కొట్టాలా? అని చర్చించుకుంటున్నారు. -
ఎవర్ని వదిలిపెట్టం.. కేటీఆర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన కొట్లాటలో గాయపడిన 141వ డివిజన్ (గౌతమ్ నగర్) కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్‌ను కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 90 సీట్లు సాధించామని.. రెండో సారి కూడా తిరుగులేని విజయం సాధించామన్నారు.హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా రాలేదనే కారణంతో కాంగ్రెస్ గుండాగిరి రాజ్యం తెస్తోంది. మా ఎమ్మెల్యే, మా కార్పొరేటర్లు దేవుడి కార్యక్రమానికి చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో గొడవ చేస్తారా? మీ అడ్డా అని వీర్రవీగుతున్నారా?. అధికారంలోకి వచ్చాక ఎవర్ని వదిలి పెట్టం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. గుండాల్లాగా రాజకీయం చేస్తూ బస్తీ మే సవాల్ అంటూ సవాల్ చేస్తున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సిద్ధిపేటలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పోలీసులు కొంత మందికి తొత్తులుగా మారారు. మేము మిమ్మల్ని వదలం. మా కార్యకర్తలు తరలి వచ్చి మీ అంతు చూస్తాం. మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రాలేదని ఇష్టానుసారంగా చేస్తున్నారు. మేము ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్లు చేయటం లేదు’’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ సెలైన్స్పై కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదే అని కవిత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కూడా కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతూ..‘బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే. బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందే. నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే. నేను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌కు సపోర్ట్ చేశాను. అలాగే, తీన్మార్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను నేను జనాభా లెక్కల నుంచి తీసివేశాను అన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసమే బనకచర్ల..అనంతరం, బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి. బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏం లాభం లేదు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారు. ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడు. బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తాం.సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కొని సన్మానం చేశారు. సిగ్గులేకుండా బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారు. రేవంత్ రెడ్డి బనకచర్లపై బుకాయిస్తున్నారు. ఆయనకు పాలించే హక్కు లేదు. తక్షణమే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. నాలుగు విజయాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. కృష్ణానది బోర్డును అమరావతిలో పెట్టడం అనేది ఏపీ విభజన చట్టంలో ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు.బాబుకు బహుమతిగా గోదావరి నీళ్లు..పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలి. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్‌లో అని సీఎం చెప్తుంటారు. ముఖ్యమంత్రి ఇంకా కాలేజీలోనే ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్టుగా ఇచ్చారు. తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ, ఆంధ్రాకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చ జరగలేదు. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు.. వారికి బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. -
రేవంత్ గుట్టు రట్టయ్యింది: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందన్న కేటీఆర్.. ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమయ్యిందన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి.. నీళ్లు చంద్రబాబుకి.. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయిస్తున్నారు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడానికేనా?. నువ్వు గద్దెనెక్కింది’’ అంటూ ఎక్స్ వేదికగా రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కోవర్టులెవరో, తెలంగాణ కోసం కొట్లాడిందెవరో తేలిపోయింది. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా పోరాటం తప్పదు. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడతాం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా?. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు?. నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో!’’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది! 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందినిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి….గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం…— KTR (@KTRBRS) July 16, 2025 -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని గుత్తా నివాసంలొ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందన్నారు. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందన్న కవిత.. రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.‘‘తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు బీసీ బిడ్డా కాబట్టి ఏదీ పడితే అదీ మాట్లాడితే సరికాదు. తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్ళకు కోపం వచ్చి నిరసన చేశారు. ఇంత మాత్రనికే గన్‌ఫైర్ చేసి చంపేస్తారా!??. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా !?. నేను ఊరుకునే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది. వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్ చేశారు.‘‘ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి.. మీరు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని ఛైర్మన్ సూచించారు. వెంటనే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలి. 24 గంటలు గడిచిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే.. మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ? సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరు అసలు.. నన్నెందుకు అడ్డుకుంటాననీ అరుస్తూ గోలా గోలా చేస్తున్నాడు’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.కాగా, ఇవాళ ఉదయం(ఆదివారం) తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా, 3.30 గంటలకు డీజీపీని కలిసి కవిత ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్ ఏ పార్టీలోకి? ఆయనేమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: ఏ పార్టీలో చేరాలనే విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలోకి తాను చేరుతున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లలో ప్రచారం జరుగుతోందని.. అలాంటి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయొద్దంటూ విజ్ఞప్తి చేసిన రాజాసింగ్.. కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.కాగా, రాజీనామాపై మరోసారి స్పందించిన రాజాసింగ్.. పదవి, అధికారం కోసం రాజీనామా చేయలేదన్నారు. హిందుత్వ భావజాలంతో ప్రజలకు సేవ చేయాలనే బీజేపీలోకి చేరానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తీరును నిరసిస్తూ రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆమోదించారు. -
‘అయ్యా రేవంత్.. 400 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్‌లు నీవేనా?’
సాక్షి, బీఆర్కే భవన్: దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది. 50ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీవి.. అవే మోసాలు, అవే అబద్ధాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పినవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా భవన్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు.. కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్‌కు అవగాహన లేదని బాధతో చెప్తున్నా. 299 టీఎంసీల పేరుతో శాశ్వత ఒప్పందం అని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేతకాక కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడే 299 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం చేశారు.చంద్రబాబుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా..శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్-3పై ఎందుకు పోరాటం చేస్తారు?. సెక్షన్-3 విషయంలో ఉమా భారతి, గడ్కరీని కలిశారు. కేంద్రంపై పోరాటం చేసి సెక్షన్-3ని కేసీఆర్ సాధించారు. బోర్డు తాత్కాలిక నీటి వినియోగం కోసం మాత్రమే వినియోగిస్తారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడారు.. చాలా బాధతో చెప్తున్నాను. కృష్ణా నదిని దోచుకో అని రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని నేను బయటపెట్టిన తర్వాత సీఎం మాట మార్చారు.నిజాం కట్టినవీ నీవేనా..సీఎం రేవంత్‌కి ఎలాగూ తెలియదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదు అంటే బాధేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా?. 573 టీఎంసీలు చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అజ్ఞానం. 400 ఏళ్ల కింద కాకతీయ, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. బీఆర్ఎస్ పాలనలో 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.తుమ్మడిహట్టి నుంచి బ్యారేజీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చింది.. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించు. ఎనిమిదేళ్లలో 160 టీఎంసీలకు కేంద్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి తేలేదు?. దీనిపై అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం. మా మైక్ కట్ చేయకుండా, అసెంబ్లీ నుంచి పారిపోవద్దు. 20 నెలల పాలనలో ఇప్పుడు ఒక్క చెరువు, చెక్ డ్యామ్ కట్టించారా?. మీరు ఏమీ చేయకుండానే నీళ్లు ఎలా వచ్చాయి.. పంటలు ఎలా పండాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను వాడటం లేదు.. ఆరు శాతం నీళ్లను తక్కువగా వాడారు’ అని చెప్పుకొచ్చారు. -
కేటీఆర్.. ఎందుకు నీకింత అహంకారం?
సాక్షి, ములుగు: ప్రభుత్వం తప్పులు చేసిందని అనిపిస్తే అసెంబ్లీలో నిలదీయాలని.. అంతేగానీ రోడ్ల మీదకు రావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఉద్దేశించి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె.. కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలంటే నీకు గిట్టదు. సొంత చెల్లె నీ అహంకారాన్ని చూసి నీపై మట్టి పోస్తోంది. నువ్వు ఓర్తలేవని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇప్పుడు ఆదివాసి మహిళా అని చూడకుండా నన్ను టార్గెట్ చేస్తున్నావ్.. ఎందుకు?. ఇలా చేసి నువ్వు సాధించిందేది ఏమిటి?. కేటీఆర్.. నీకు ఎందుకు ఇంత అహంకారం. నీవు నిజంగా వాస్తవాల మీద బతికిన వాడివైతే చెప్పు.. మేము ఎంతమందిని ఇబ్బంది పెట్టాం ఎవరిని జైలుకు పంపించాం.70 ఏళ్ల చరిత్రలో కోయ వర్గానికి మంత్రి పదవి రాలేదు. ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. నేను తప్పులు చేశానని చెప్పడం కాదు.. అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలి. అంతేగానీ పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి రోడ్లమీద పోర్లాడితే సానుభూతి వస్తుందనుకోవడం నీ మూర్ఖత్వం. .. పదేళ్లు అధికారంలో ఉండి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైన మీరు.. ములుగులో సీతక్క రాజ్యం . పోలీస్ రాజ్యం అంటూ ధర్నాలు చేస్తారా?. ములుగు లో నడుస్తుంది ప్రజారాజ్యం .ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన. ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టామో మీ దగ్గర లెక్క ఉంటే తీయండి. నిలదీయండి. దుబాయ్ లాంటి ప్రాంతాల్లో స్టూడియోలు ఏర్పాటు చేసి మాపై రోత వార్తలు రాపియడం ప్రజలు గమనిస్తున్నారు. ఆదివాసీ బిడ్డనైన నన్ను టార్గెట్ చేయడానికి మిడుతాల దండును పంపిస్తున్నావా కేటీఆర్. మేం సమ్మక్క సారక్క వారసులం. మా జోలికి వస్తే నాశనమై పోతావు అని మంత్రి సీతక్క అన్నారు.తాజాగా మంత్రి పొంగులేటితో జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలు కాపాడాలంటూ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల అరెస్టుతో ములుగు కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
నీళ్ల విలువ తెలియని వ్యక్తులా మన నాయకులు.. హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణభవన్: నీళ్ల విలువ తెలియని నాయకులు తెలంగాణలో పాలన చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మోటర్లు ఆన్ చేయని పక్షంలో రైతులతో కన్నెపల్లి వైపు కదులుతామని హరీష్ రావు హెచ్చరించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీరోజు ఏ నదిలో ఎంత నీరు ఉందో తెలుసుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని విస్మరిస్తోంది. నీళ్ల విలువ తెలియని నాయకులు మనకు పాలకులుగా ఉన్నారు. ఇప్పుడు నీరు వస్తున్నా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?. కాళేశ్వరం మోట్లరు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. వెంటనే కాళ్లేశ్వరం మోటర్లు ఆన్ చేయండి. కాళేశ్వరం నీటితో రిజర్వాయర్లు నింపండి. లేదంటే లక్షలాది మంది రైతులతో కన్నెపల్లి వైపు కదులుతాం’ అని హెచ్చరికలు జారీ చేశారు. కాళేశ్వరానికి మాత్రమే NDSA వర్తిసుందా? SLBC కి NDSA వర్తించదా?. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అన్నదాతకు అక్షయ పాత్ర కాళేశ్వరం. మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి నీళ్ళను ఎత్తి పోయేచ్చు. పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజల నోరు కొడుతుండు. శ్రీశైలానికి వరద నీళ్లు వచ్చి 36 రోజుల అవుతుంది.కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చెయ్యడం లేదు. కల్వకుర్తి మోటార్లు ఇప్పటికైనా ఆన్ చేస్తరా, లేదంటే రైతులను ఆన్ చెయ్యమంటరా?. భీమా, కోయిల్ సాగర్ మోటార్లు ఆన్ చేయడంలో పూర్తిగా నిర్లక్యం చేశారు. గేట్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్. కృష్ణా జలాల వాడుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్యం చేస్తోంది. ఏపీకి నీళ్ళు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికైనా కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ హెచ్చరించారు. -
సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు రెడీ. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో 8వ తేదీన 11 గంటలకు చర్చ వస్తామని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక పథకం. రైతు బంధుపై ఆక్స్‌ఫర్డ్‌లో ప్రశంసలు వచ్చాయి. ఎరువులు కూడా ఇవ్వలేని సీఎం మమ్మల్ని విమర్శిస్తారా?. ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండితే మేము కళకళలాడేలా చేశాం. చంద్రబాబు రైతులు గొంతు కోశారు. జల దోపిడీని సీఎం రేవంత్ అడ్డుకోవడం లేదు. దత్తత పేరుతో పాలమూరును దగ చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. ఫ్లోరైడ్ మహమ్మరిని తరిమికొట్టింది కేసీఆర్ కాదా?. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే రూ.30వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చాం’ అని చెప్పుకొచ్చారు. 18 నెలలుగా తెలంగాణ టైమ్ పాస్ పాలన నడుస్తుంది. మీ స్తాయికి కేసీఆర్ అవసరం లేదు మేము చాలు.. ఎక్కడికి పిలిచిన రెడీ. 72 గంటల సమయం రేవంత్‌కు ఇస్తున్నాం. ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇస్తున్నా. ప్లేస్ ఎక్కడ అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే కాలిపోతున్న మోటార్లు, అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు. ప్రతీ మండలం లో ఎరువుల కోసం క్యూ లైన్ లో రైతులు ఎదురు చూసే పరిస్థితి. కేసీఆర్ ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చారు. రైతులకు రైతు భీమా ఎగ్గొట్టి రైతుల ఉసురు తీస్తుంది కాంగ్రెస్..చంద్రబాబు బనకచర్ల ద్వారా తెలంగాణ రైతుల గొంతు కోస్తున్న మాట వాస్తవం. ఆంధ్రా ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఒక్క హామీ అయినా నెరవేర్చారా రేవంత్?. బురద చల్లడం పక్కకు వెళ్ళడం రేవంత్‌కు అలవాటు. రుణ మాఫీ 12 వేల కోట్లు మాత్రమే చేసి రైతులను మోసం చేశారు. రేవంత్ ప్రభుత్వం రైతులను, మహిళలను, కౌలు రైతులను మోసం చేసింది. 400 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. ఒక్క కొత్త పథకం ప్రారంభించ లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఢిల్లీకి మూటలు పంపించడం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం తప్ప రేవంత్‌కు మరో పని లేదు. రేవంత్‌కు ఓట్లు వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. చంద్రబాబు కోవర్టు రేవంత్. తెలంగాణలో జరుగుతుంది కోవర్టు పాలన’అని విమర్శించారు. -
నిలకడగానే కేసీఆర్ ఆరోగ్యం
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అస్వస్థతతో గురువారం సాయంత్రం నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జ్వరం, మధుమేహ సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(71) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉన్న ఆయన.. వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచనతో నిన్న నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనతోపాటు కుటుంబ సభ్యులు ఉండగా.. తాజాగా కూతురు-ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.కేసీఆర్ నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వైద్య బృందం ఇదివరకే ఉందని ప్రకటించింది. కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరగగా, సోడియం లెవెల్స్ కాస్త తగ్గాయని తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నామని హెల్త్ బులిటెన్ ద్వారా వెల్లడించింది. అయితే.. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందన్న వైద్యులు.. కోలుకునేందుకు మరో రెండు రోజులు పట్టొచ్చని, అప్పుడే ఆయన్ని డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. KCR ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులు, అధికారులతో స్వయంగా మాట్లాడిన సీఎం.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా కేసీఆర్ ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. మరోవైపు.. కేసీఆర్ అనారోగ్య వార్తలతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు తరలి వస్తున్నారు. -
గోదావరి-బనకచర్ల.. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జలాల విషయంలో రాజీ పడమంటూ సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజాభవన్‌లో మంగళవారం.. గోదావరి-బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నీటి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. కృష్ణాలో 68 శాతం పరీవాహకం తెలంగాణలో ఉంది. 68 శాతం తెలంగాణకు ఇచ్చి.. మిగిలిన నీళ్లే ఏపీకి ఇవ్వాలి. కానీ 299 టీఎంసీలే చాలని రెండుసార్లు కేసీఆర్ సంతకం పెట్టారు. 299 టీఎంసీలున్నా 220కి మించి ఎప్పుడూ వినియోగించలేదు’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.‘‘ధన దాహం తీర్చుకోవడం కోసమే కాళేశ్వరం రీ డిజైన్. 38 వేల కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటికే లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. లక్ష కోట్లు ఖర్చు చేసి 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారు. మిగిలిన పనుల పూర్తికి మరో లక్ష కోట్లు కావాలి. వరద జలాలను తరలిస్తే ఇబ్బందేంటని ఏపీ వాదిస్తోంది. నికర జలాల్లో మా వాటాపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెప్తోంది. మూడో పంట కోసం ఏపీ ప్రయత్నిస్తోంది. మాకు మొదటి పంటకే నీళ్లు లేవు. మా నీటివాటాలపై ఏపీ కూడా సహకరించాలి కదా?. ఇరు రాష్ట్రాల చర్చలకు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి’ అంటూ రేవంత్‌రెడ్డి కోరారు. -
ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలి : హరీష్ రావు
-
మహాటీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
-
GHMC కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతల ధర్నా
-
జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తికర వాతావరణల నెలకొంది. హైదరాబాద్‌లో అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్పు పై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు.జీహెచ్ఎంసీ కార్యాలయానికి రెండు వైపులా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆఫీసులోకి బీఆర్ఎస్ కార్యకర్తలకు అనుమతి నిరాకరించడంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం, ఆఫీసు గేట్లకు తాళం వేసి కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు బైఠాయించి అన్నపూర్ణ క్యాంటీన్ ముద్దు.. ఇందిరమ్మ క్యాంటీన్ వద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శించి నినాదాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..‘హైదరాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారు. అలాంటి వారికి కడుపునిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పేరు మార్చాలని ఉదేశ్యం ఉంటే GHMC కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. ఆరు గ్యారెంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి.. మాకు అభ్యంతరం లేదు. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్దతి కాదు. అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తు వస్తారు..అన్నపూర్ణ పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉద్దేశ్యం ఉంటే కౌన్సిల్ సమావేశంలో చర్చ పెట్టీ, ఓటింగ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పీజేఆర్ ఫ్లై ఓవర్ ఓపెన్ చేస్తున్నారు.. మరి అది కట్టింది ఎవరు?. తిమ్మిని బమ్మిని చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం’ అని హెచ్చరించారు. -
రేవంత్.. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది?: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: 18 నెలల కాంగ్రెస్ పాలనలో రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన కానీ.. పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేక పోతున్నారంటూ ఆమె నిలదీశారు.‘‘అప్పు కావాలని ఆర్ఏసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాడు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించాడు. రాష్ట్ర ఆదాయం ఎక్కడకి పోతుందో ప్రజలకు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి’’ అంటూ కవిత డిమాండ్ చేశారు.‘‘అవినీతి చక్రవర్తి బిరుదు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. వాస్తవాలు లేకుండా నేను ఏది మాట్లాడను. రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలి. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు లేదు. ప్రజా భవన్లో చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యాని తినిపించి బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకోండి అని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కలలో కూడ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేయరు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరు ప్రజా భవన్లో కలిసినప్పుడే గోదావరి జలాలను ఏపీకి రేవంత్ రెడ్డి కట్టబెట్టిండు’’ అంటూ కవిత చెప్పుకొచ్చారు. -
పోలీసులపై కొప్పుల ఈశ్వర్ వివాదాస్పద వాఖ్యలు
సాక్షి, జగిత్యాల జిల్లా: తెలంగాణ పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫోజులు కొట్టే కొంతమంది పోలీసులు బల్లకింద చేయి చాచకుండా కథ నడవదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పోలీస్ వ్యవస్థపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.సమాజంలో పోలీసులు చేస్తున్న అవినీతి దందాపై నాయకులు దృష్టి పెడితే ఒక్క పోలీస్ కూడా విధుల్లో ఉండరంటూ షాకింగ్ కామెంట్ చేశారాయన. ‘‘అలాంటి నాయకులకు పోలీసులే భయపడాలి.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. బల్ల కింద చేయి చాచనిదే ఏ ఒక్క పోలీసుకూ రోజు గడవదు’’ అంటూ కొప్పుల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
ఊహించని సాక్ష్యాలతో రేపు ప్రెస్‌మీట్ పెడతా: పాడి కౌశిక్‌రెడ్డి
సాక్షి, వరంగల్: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. కాజీపేట రైల్వే కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆపై శనివారం రాత్రి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ మా లీగల్ టీమ్ కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపడం కోసం నిన్నరాత్రి నుండి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను. నేను Ak 47ను అవుతా. తెలంగాణలో మంత్రులు ఇసుక దందా, పేదల భూములు కబ్జా చేస్తున్నారు. రేపు అందరి అక్రమాలు ఆధారాలతో సహా బయట పెడతా. ఊహించిన సాక్ష్యాలతో రేపు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం పెడతా అని కౌశిక్‌రెడ్డి అన్నారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నడుమ శనివారం ఉదయం కౌశిక్‌రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కు తరలించి.. తొలుత ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపర్చారు. తొలుత కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఖమ్మం జైలుకు తరలించేందకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈలోపు 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో.. రిమాండ్ రద్దు చేస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.కేసు ఏంటంటే.. మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
సంగారెడ్డి BRS రైతు ధర్నాలో రప్పా రప్పా ప్లకార్డులు
-
2028లో రప్పా రప్పా.. 3.0 లోడింగ్.. ట్రెండింగ్‌లో హరీష్ రావు ఫొటో
సాక్షి, సంగారెడ్డి: పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా.. డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తలపెట్టిన రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఫుల్ జోష్‌లో కనిపించారు.పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హరీష్ రావు రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులను కార్యకర్తలు చూపించారు. 2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు నిలిచాయి. మరోవైపు.. హరీష్ రావు మాట్లాడుతూ..‘కేటీఆర్‌పై కేసు పెట్టడం.. కేసీఆర్‌ను కమిషన్ ముందుకు పిలవడం తప్ప రేవంత్ ఏం చేశాడు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నాయి. రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది.. మీ అందరికి రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తలవకుండా రేవంత్ స్పీచ్ ఉండదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రెండు లక్షల మంది రైతులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ధర్నా చేస్తే రేవంత్ మైండ్ బ్లాక్ అవుతుంది. రైతుబంధు ఇవ్వకపోతే రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి రైతులందరూ కదులుతారు జాగ్రత్త. వెంటనే రెండు లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దేవాదుల ఏ బేసిన్ లో ఉందని రేవంత్ అడగడం హాస్యాస్పదం. నల్లమల్లల పుట్టిన అని చెప్పుకొనే రేవంత్.. నల్లమల్ల ఎక్కడ ఉంది? అని అడుగుతున్నాడు. కౌశిక్‌ను అరెస్ట్ చేయడం దారుణం.. రేవంత్‌ని ప్రశ్నిస్తే అర్దరాత్రి ఓ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కౌశిక్ రెడ్డి అరెస్ట్.. సుబేదారి స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రికత్త..
కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్డేట్స్.. సుబేదారి స్టేషన్ వద్ద ఉద్రికత్త.. వరంగల్‌లోని సుబేదారి స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులుబీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులుపోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదంఓటు నోటుకు దొంగ.. రేవంత్ రెడ్డి దొంగ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలుదొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలుఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు, మడికొండ పీఎస్‌కు తరలింపుసుబేదారి స్టేషన్‌కు కౌశిక్ రెడ్డి సతీమణి శాలినిరెడ్డి..సుబేదారి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకౌశిక్ రెడ్డిని కలిసి పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన ఆయన సతీమణి శాలినిరెడ్డిపోలీసులతో కేసు వివరాలపై ఆరాతీసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి, కౌశిక్ సతీమణి.పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న హైడ్రామావరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్ళిన బీఆర్ఎస్ నేతలు, లీగల్ సెల్ బృందంకోర్టుకు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు ఎర్రబెల్లి కామెంట్స్.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డిపైన కేసులు ఇదే ప్రథమం కాదుఅసెంబ్లీ ప్రశ్నిస్తూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కౌశిక్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారుఏప్రిల్లో కేసు పెట్టారు..సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఇన్ని రోజులు కాలయాపన చేశారు..కేసు పెట్టిన వ్యక్తిపై అనేక ఆరోపణలు ఉన్నాయిరేవంత్ రెడ్డి స్థాయిలో ఒత్తిడి తెచ్చి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు.కేసీఆర్, కేటీఆర్‌పై కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారురేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాళా తీసింది..దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి..రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ప్లాప్..పరిపాలన కంట్రోల్లో లేదు.. ఎవరికి వారు దోచుకు తింటున్నారు.. 👉బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకింది. అక్రమ కేసులో అరెస్టయిన కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పీఎస్ వద్దకు చేరుకున్నారు. దాస్యం వినయ్ భాస్కర్, రాకేశ్ రెడ్డి తదతరులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.👉ఈ క్రమంలో పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా స్టేషన్ బయటే అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకున్నది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. 👉హరీష్ రావు సీరియస్.. కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది.రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది.ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నడు.కేసులు, అరెస్టులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.నీ వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన నీ మోస పూరిత వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం.అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.బిఆర్ఎస్ ఎమ్మెల్యే @KaushikReddyBRS అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది. రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది.ఇందిరమ్మ…— Harish Rao Thanneeru (@BRSHarish) June 21, 2025👉అయితే, మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఎమ్మెల్యే తరచూ బెరదింపులకు దిగుతున్నాడని, రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మనోజ్‌రెడ్డి భార్య కట్టా ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసులకు ఏప్రిల్‌లో ఫిర్యాదు చేశారు.👉దీనిపై 308(2), 308(4), 352 బీఎన్ఎస్ సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మరికాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి కౌశిక్ రెడ్డిని తరలించనున్నారు. అక్కడి నుంచి జడ్జి ముందు హాజరుపరుచనున్నారు.🛑 కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదు!కౌశిక్ అన్నను శంషాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం!రేవంత్ రెడ్డి గారు,మీ కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్ అన్న ను ఆపగలం అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంని చాటుతోంది. pic.twitter.com/PB1Dgcxtft— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 20, 2025 -
బనకచర్ల ప్రాజెక్టుకు ఆద్యం పోసిందే కేసీఆర్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా తప్పుడు ప్రచారం ఆపడం లేదని.. తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వంతో ఆ పార్టీ కలిసి రావడం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీల అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి ఎంపీలకు వివరించామని తెలిపారు.‘‘రాజకీయ ప్రయోజనాలు, సంకుచిత స్వభావంతో బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీల సూచనలు తీసుకున్నాం. అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించి, సుదీర్ఘంగా వివరించామని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో బతికించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. దురుద్దేశంతో బీఆర్ఎస్ నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుకు ఆద్యం పోసిందే కేసీఆర్’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.‘‘2016 అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ 3 వేల టీఎంసీ నీళ్లు అనే పదం నుంచి బనకచర్ల పుట్టింది. 3 వందల టీఎంసీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రెండు వందల టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారు. అనాడు కేసీఆర్ నాలుగు వందల టీఎంసీలు అన్నారు. అందుకే చంద్రబాబు ప్లాన్ మొదలు పెట్టారు. చంద్రబాబు బనకచర్ల అనగానే కేంద్ర జలశక్తి, ఆర్థిక మంత్రికి ఫిర్యాదులు చేశాం...బనకచర్ల పై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా లేదు. మేము ఇచ్చిన ఫిర్యాదులకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఉరి తీయ్యాల్సింది కేసీఆర్, హరీష్ రావునే. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ప్రయత్నం చేయలేదు. చేసిందంతా కేసీఆర్, హరీష్ రావు చేసి.. నింద మాపై మోపుతారా?. కమీషన్లకు కకుర్తిపడి తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్‌రావు. లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టు పై 2లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు.ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కోసం 500 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మనుషులు చనిపోతే హరీష్‌రావు కళ్లలో పైశాచిక ఆనందం వెళ్లబుచ్చుతారు. పేదలు ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి పేదలకు ఇవ్వలేదు. హరీష్ రావు చిల్లర ప్రయత్నాలు మానాలి. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం హరీష్ రావు. ఢిల్లీ వెళ్తే తప్పేంటి.. మీరు చేసిన తప్పులు మేము సెట్రేట్ చేస్తున్నాం. పది పైసల మిత్తికి 50వేల మిత్తికి హరీష్ రావు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా టార్గెట్.తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం. బనకచర్ల పై అవసరం అయితే ప్రధాన మంత్రిని కలుస్తాం. అందరినీ కలిసిన తర్వాత కోర్టుకు సైతం వెళ్తాం. చంద్రబాబుకు నేను సూచన చేస్తునా!. కేంద్రంలో పలుకుబడి ఉండొచ్చు.. ప్రధాని ఏదైనా వినొచ్చు అనుకుంటే మీ భ్రమ. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడివరకైనా వెళ్తాం. మేము తెలంగాణ ప్రజల కోసం కోర్టుకు అయినా వెళ్తాం. 968 టీఎంసీల నీళ్లను తెలంగాణ వాడుకోవడానికి బ్లాంకెట్‌గా అనుమతి ఇవ్వాలి’’ అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
తెలంగాణకు మాట.. మూట సాయం కూడా లేదు: కేంద్రంపై హరీష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మాట సాయం, మూట సాయం కూడా కేంద్రం చేయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్‌కు ఎలా నోటీసులు ఇవ్వాలనే ఆలోచనతోనే రేవంత్ సర్కార్ పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టమన్న హరీష్‌రావు.. బనకచర్లకు సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, అపెక్స్ కమిటీ అనుమతులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంతో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా?. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని చూశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే ఈ ప్రభుత్వం మాట్లాడటం లేదు’’ అంటూ హరీష్‌రావు మండిపడ్డారు. -
ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్.. రెండోరోజు ఆరోగ్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అనారోగ్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా కేసీఆర్.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు కూడా ఆసుప్రతికి వచ్చారు.వివరాల ప్రకారం.. కేసీఆర్ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం అక్కడికి చేరుకున్నారు. అయితే, నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఈ రోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన ఆయన.. గంట పాటు అక్కడే ఉన్నారు. ఏఐజీ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌కు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలపై వైద్యులు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక, కేసీఆర్.. గత కొన్ని రోజుల నుంచి జలుబుతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన వెంటనే నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు. మరో ఐదు రోజుల పాటు బంజారా హిల్స్‌లోని నందీనగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్‌లోని బాత్ రూంలో కాలు జారీ పడటంతో గాయమైన విషయం తెలిసిందే. అనంతరం, యశోద ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత ఫాం హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. -
బీఆర్కే భవన్‌కు హరీష్‌రావు.. లీగల్ టీమ్‌తో పోలీసుల వాగ్వాదం!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ విచారణకు బయలుదేరారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్‌కు భారీ కాన్వాయ్‌తో హరీష్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తామన్నారు. ఇక, బీఆర్కే భవన్‌కు హరీష్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లీగల్ టీమ్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ లీగల్ టీమ్.. ఓపెన్ కోర్టులో కూర్చున్న సమయంలో పోలీసులు వారి వద్దకు వెళ్లి.. ఇక్కడ అనుమతి లేదని, బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా లీగల్ టీమ్ స్పందిస్తూ.. ఓపెన్ కోర్టులో ఎవరైనా ఉండవచ్చు.. రాకూడదని గెజిట్ ఇవ్వాలని పోలీసులకు తెలిపారు. దీంతో, వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకుముందు హారీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది. రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తోంది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఏర్పాటుచేసినా, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను.గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం ఆలోచించవలసింది ఉద్దేశంతో కాదు, విజ్ఞతతో ఆలోచించాలి. రాజకీయ దుర్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, రైతులకు అన్యాయం చేస్తుంది. విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాలరాయద్దు. రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ధర్మం గెలుస్తుంది. ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తిస్థాయిలో సమాధానం చెప్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో లేము కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్లను వారికి అందిస్తాం’ అని తెలిపారు. -
మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు
-
మాగంటి మృతి పట్ల రేవంత్, కేసీఆర్ సంతాపం..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ సంతాపం..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేసీఆర్ సంతాపం.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తనను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.కేటీఆర్ దిగ్బ్రాంతి..మాగంటి గోపీనాథ్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్న కేటీఆర్. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మాగంటి మృతి పార్టీకి తీరని లోటు అని చెప్పుకొచ్చారు. హరీశ్ రావు సంతాపం..మాగంటి గోపినాథ్ అకాల మరణం అత్యంత బాధాకరం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి మృతి బీఆర్ఎస్కు తీరని లోటు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శం. గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.బండి సంజయ్ సంతాపం..మాగంటి గోపీనాథ్ మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడి మరణం ప్రజలకు తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిసున్నా. మాగంటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(62) మృతిచెందారు. అనారోగ్యం కారణంగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు. గోపినాథ్‌కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యవత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై 9 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారే విజయాన్ని రుచిచూశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్ నుంచే పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ తెలంగాణే శ్వాసగా పనిచేసే బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగారు. -
‘మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే.. కాళేశ్వరమే కూలిపోయిందా?’
సాక్షి, తెలంగాణభవన్: రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బనకచర్లపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌లపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ‘నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పిల్లర్ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్టుగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కాళేశ్వరం కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామన్ డైలాగ్ చెబుతున్నారు. మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉంటే రెండు పిల్లర్సే కూలాయి. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు. కానీ, బనకచర్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం లేదు. తెలంగాణలో కమీషన్ల పాలన సాగుతోంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా హరీష్ రావు అద్భుతంగా పనిచేశారు. తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావు గారిది. తెలంగాణ తెచ్చుకున్న నీళ్ళు నిధులు నియామకాలు టాగ్ లైన్ ఎప్పుడో పోయింది. నిందలు, దందాలు, చందాలు ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పాలన. సుంకిశాల, slbc టన్నెల్ కూలినా.. కేంద్ర బృందం ఇప్పటివరకు రాలేదు. టన్నెల్ కూలిపోయి కూలీలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.చిన్న పిల్లర్ మెడిగడ్డలో కూలితే దాన్ని రాద్దాంతం చేస్తోంది. గుజరాత్లో బ్రిడ్జ్ కూలి 140 మంది చనిపోతే.. ఏ రిపోర్ట్ ఉండదు.. బాధ్యులపై చర్యలు ఉండవు. బీహార్‌లో రోజుకో బ్రిడ్జి కూలిపోతే ఏ రిపోర్ట్ ఉండదు. కూలిన రెండు రోజుల్లోనే ndsa వచ్చింది.. పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చింది. Ndsa రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారైంది. కాంగ్రెస్, బీజేపీ కుమక్కు రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ కమీషన్‌తో కాంగ్రెస్ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మించారు. L and T సంస్థ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది. అదే సంస్థ మేడిగడ్డ బ్యారేజినీ నిర్మించింది. బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం లేదు అని అన్నారు. -
ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘మాది ప్రజా ప్రభుత్వం..ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా అంతిమ లక్ష్యం. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుకుంటున్నాం’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మూసాపేట, నవాబ్‌పేటలలో శుక్రవారం మంత్రి జూపల్లితో కలిసి సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో భట్టి మాట్లాడుతూ తలాపున ఉన్న కృష్ణమ్మను ఈ ప్రాంతానికి మళ్లించడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని గుర్తు చేశారు.గత పదేళ్లలో బీఆర్ఎస్ కాలం వెళ్లదీసిందే తప్ప గుక్కెడు నీళ్లు ఇవ్వలేదన్నారు. ఎన్నికలకు ముందుగా నార్లపూర్ పంప్‌ను ఆన్ చేసి అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తామే పాలమూరు పనులను పూర్తి చేస్తామన్నారు.బీఆర్ఎస్ పాలనలో నీళ్లు రాలేదని.. నిధులు ఆవిరయ్యాయని.. దొంగల్లా అందిన కాడికి దోచుకున్నారని భట్టి మండిపడ్డారు. నాటి పాలకులకు ప్రజలపై ప్రేమ లేదని వారి కుటుంబసభ్యులే వాస్తవాలను బయటపెడుతున్నారని తెలిపారు.అధికారం పోయిందనే కేసీఆర్‌కు దుఃఖం: జూపల్లిరాష్ట్రంలో 17 నెలల పాలన చూస్తుంటే తనకు దుఃఖం వస్తోందని వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడ డాన్ని మంత్రి జూపల్లి ప్రస్తావిస్తూ.. అధికారం పోయిందని, కుటుంబసభ్యులకు పదవులు పోయాయనే ఆయనకు దుఃఖం వస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 22 మంది ముఖ్యమంత్రులు పాలన చేస్తే రూ.65 వేల కోట్ల అప్పు ఉండగా.. కేవలం పదేళ్ల పాలనలో కేసీఆర్ రూ.7.30 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.60 ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ వద్ద పార్టీ ఫండ్ రూ.15 కోట్లు ఉండగా, కేవలం పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్కు రూ.1,500 కోట్ల పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తన విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నాను. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పని చేశా. రీ డిజైన్ కోసం కేసీఆర్ వేసిన సబ్ కమిటీలో మేం ఉన్నాం. 2016లో తుమ్మడిహట్టి అంచనా రూ.16,500 కోట్లు. ఆ తర్వాత 2015లో ఆ అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగింది....తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. తుమ్మడిహట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయి. మూడు బ్యారేజి CWC రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయ్యింది. అయితే..రైతుల డిమాండ్ మేరకు రూ. 82వేల కోట్లకు పోయింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను... మా బతుకు నిబద్ధతో ఉంది. నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుంది. ఫైనాన్స్ శాఖకు అన్ని వివరాలు తెలియవు. ప్రాజెక్ట్ రీ డిజైన్ కోసం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. అందులో మేం(హరీష్, తుమ్మల పేర్లు) ఉన్నాం. నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్టకాల్చి మీదేసినంత మాత్రాన నాకేమీ కాదు.మూడు బ్యారేజీల వ్యయం రూ. 10వేల కోట్ల లూపే ఉండొచ్చు. ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్టులను బయటపెట్టాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలి. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం బయటపెట్టాలి. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానిది. ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్...ఆయనే బాస్. కొన్ని వందలసార్లు తన మానస పుత్రిక అని చెప్పారు ’’ అని ఈటల మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.ఇదీ చదవండి: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు -
ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీశ్‌రావు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచి డాక్టర్లు బులెటిన్ విడుదల చేస్తారని హరీశ్‌రావు చెప్పారు. అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని గోపీనాథ్ క్షేమంగా బయటకు వస్తారన్నారు. బోరబండకు చెందిన తన అనుచరుడు సర్దార్ ఆత్మహత్యతో గోపీనాథ్ ఒత్తిడికి లోనయ్యారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వెల్లడించారు.కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం, కారణమైన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అస్వస్థతకు లోనైనట్లు కుంటుంబ సభ్యులు తెలిపారన్నారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తిరిగి క్షేమంగా వస్తారని చెప్పారు. ఏఐజీ ఆస్పత్రి కి ఎమ్మెల్యే కృష్ణారావు, వివేకానంద, ముఠాగోపాల్, గూడెం మహిపాల్‌రెడ్డి, నామా నాగేశ్వర్రావు, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తదితరులు వెళ్లారు. -
కాళేశ్వరం నోటీసులు.. కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యే విషయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావుతో పలు దఫాలుగా ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే ఆయన విచారణకు హాజరవుతారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో.. ఇప్పుడు విచారణకు మరింత గడువు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. జూన్ 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీన విచారణకు రాలేనని.. బదులుగా మరో తేదీని కేటాయించాలని ఆయన ఇప్పుడు కమిషన్‌కు బదులు ఇవ్వబోతున్నారట!. ఇతర కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని, కావాలంటే ఈ నెల 11వ తేదీన హాజరవుతానని ఆయన లేఖలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే ప్రాజెక్టు కోసం పని చేసిన ముఖ్య అధికారులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది కూడా.ఇదీ చదవండి: అదే స్పూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి -
‘తెలంగాణలో ఏపీ తరహా వ్యూహం.. బీజేపీ వదిలిన బాణమే కవిత’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేయని వ్యాపారం లేదు.. దోచుకోని సంస్థ లేదంటూ కాంగ్రెస్ నాయకులు మధు యాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. బంగారు బతుకమ్మ పేరుతో కోట్ల రూపాయలు సంపాదించారు. తెలంగాణ జాగృతిలో 800 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు కవిత పనిచేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీ తాజాగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘బీజేపీ వదిలిన బాణమే కవిత. ఒక మహిళగా రాష్ట్రంలోనే కాదు.. ఢిల్లీలో కూడా ఆమె కుంభకోణం చేశారు. తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే కొత్త డ్రామాకు తెర లేపారు. తెలంగాణ జాగృతిలో భారీ స్కాం జరిగింది. జాగృతిపై విచారణ జరపాలి. రాజీవ్ ప్రతాప్ రుడి పదవి పోవడానికి జాగృతి సంస్థ కారణం. జాగృతి సంస్థ అవినీతిలో కూరుకుపోయింది.తెలంగాణలో చనిపోయిన రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని కార్పొరేట్ సంస్థల దగ్గర జాగృతి డబ్బులు వసూలు చేసింది. జాగృతి దోపిడీకి అన్ని కార్పోరేట్ సంస్థలు బలయ్యాయి. కవిత మాఫియా డాన్. ఆమె చేయని వ్యాపారం లేదు.. దోచుకోని సంస్థ లేదు. కవిత ఏ వ్యాపారం చేసిందని జూబ్లీహిల్స్‌లో రెండు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు కవిత పనిచేస్తుంది. బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ పొందాలనుకుంటుంది.. అందుకే కవితను రంగంలోకి దింపింది. లిక్కర్ కేసు నుండి బయటపడటం కోసం కవిత బీజేపీకి పనిచేస్తోంది.అవినీతి సొమ్ము దాచుకోవడానికే జాగృతి బలోపేతం అంటుంది. బీసీలకు న్యాయం చేస్తా అన్న కవిత.. జాగృతికి ఎందుకు అధ్యక్షురాలిగా ఉంది. జాగృతి అధ్యక్షురాలిగా బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు. నిస్వార్థంగా తెలంగాణ కోసం పనిచేసింది జయశంకర్.. కేసీఆర్ కాదు. ముఖ్యమంత్రి పదవి కోసమే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో చేరాడు. పదేళ్లు కేసీఆర్ కుటుంబం దోపిడిలో ఏంతో మంది బలయ్యారు. ఎంపీ సంతోష్ ఇప్పుడు ఎందుకు చెట్లు నాటడం లేదు.. పదేళ్లు చెట్ల పేరుతో సంతోష్ కోట్ల రూపాయలు దోచుకున్నాడు. కేటీఆర్‌కు అమెరికాలో పెట్టుబడులు ఉన్నాయి. వాటి లెక్కలు చూసుకోవడానికే కేటీఆర్ అమెరికాకు వెళ్లారు. ఏపీ తరహా వ్యూహాన్ని బీజేపీ తెలంగాణలో అమలు చేస్తుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ తిట్టుకున్నాయి.. ఎన్నికల నాటికి రెండు కలసి పోటీ చేశాయి. తెలంగాణలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్‌లోని డల్లాస్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్‌లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్ -
అమరుల త్యాగాలను మనం గుర్తుచేసుకోవాలి: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాటం, రాజకీయ పటిమతో తెలంగాణ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ అమరవీరులకు కనీసం నివాళులు కూడా అర్పించడం లేదని మండిపడ్డారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..‘జాగృతి కొత్త కార్యాలయంలో మొదటి సారి జెండా ఎగురవేసినం. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు బిడ్డలను కోల్పోయారు. అది మనం గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ పోరాటం రాజకీయ పటిమ తో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఉన్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదు. అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం నివాళులు కూడా అర్పించడం లేదు. అమరవీరులకు నివాళులు అర్పించే వరకు మా జాగృతి పోరాటం చేస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
త్వరలోనే ఆ బండారాన్ని ఆధారాలతో బయటపెడతా: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది’’ అంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు.అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరు నమ్మడం లేదని ప్రతీ వేదిక మీద తన చేతకాని తనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్‌రెడ్డి.. 6,200 కోట్ల రూపాయలతో హిమాచల్ ప్రదేశ్‌లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్కోను రంగంలోకి దింపడం ఇంకో తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదు. హిమాచల్‌లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయినా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీ 3 ఏండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసిన 510 మెగావాట్ల ప్లాంట్‌ని కట్టేందుకు టీజీ జెన్ కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అంటూ హరీష్‌రావు డిమాండ్ చేశారు.‘‘రెండు దశాబ్దాల కాలంలో ఒక్కరు కూడా కట్టేందుకు ముందు రాని ప్రాజెక్ట్‌ను ఎందుకు నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసి వస్తోంది?. డీపీఆర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వంతో ఎంవోయు చేసుకొని అప్ ఫ్రంట్ ప్రీమియం కింద 26 కోట్ల రూపాయలు చెల్లించి మరో 26 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడడాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికేనని తేలిపోయాయి’’ అంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు...2009లోనే మోసర్ బేర్ కంపెనీ 64 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం చెల్లించి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతిపాదిత సేలి, మియార్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టాలని భావించింది. కానీ సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం తాము చెల్లించిన 64 కోట్ల ప్రీమియంని హిమాచల్ ప్రభుత్వం తిరిగి ఇవ్వనందుకు గాను ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించింది. హిమాచల్ హైకోర్టు మోసర్ బేర్ కంపెనీకి వడ్డీతో సహా తీసుకున్న డబ్బును 2023 జనవరిలోనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్ధ రేవంత్ సర్కారు హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది.…— Harish Rao Thanneeru (@BRSHarish) May 30, 2025..10 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఢిల్లీలోని హిమాచల్ భవన్ ను వేలం వేసి ఆ డబ్బుని కంపెనీకి చెల్లించాలని 2024 నవంబర్ లో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 7 నెలలకు పైగా అత్యధికంగా మంచు కురిసే ప్రాంతంలో హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ సాధ్యం కాదని 2019లో ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా చేతులు ఎత్తేసి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాంటి అనువు కాని ప్రాంతం లో 6,200 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో 510 మెగా వాట్ల హైడ్రల్ ప్రవర్ ప్రాజెక్టులకు ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఉబలాటపడుతుందో శ్వేతా పత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నాం.ఫీజిబిలిటీ రిపోర్ట్లు, డీపీఆర్ లు లేకున్నా, జెన్ కో బోర్డు ఆమోదం లేకున్నా కూడా ఎంవోయూ చేసుకొని 26 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గూడు పుఠాణి ఏందో గల్లీ కాంగ్రెస్ చెప్తుందా? ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా? హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చెప్తుందా?. సాధ్యం కాదు అని 20 ఏండ్లుగా కట్టని ప్రాజెక్టును ఎవరి లాభం కొరకు, ఎవరి మెప్పు కోసం కడుతున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి.రైతు రుణమాఫీకి డబ్బు లేదంటారు.. రైతు బంధుకు డబ్బు లేదంటారు. రైతు బీమాకి డబ్బు లేదంటారు. ఆసరా పెన్షన్ కి డబ్బు లేదంటారు. మహాలక్ష్మి కింద నెలకు 2500 రూపాయలు ఇచ్చే పథకానికి డబ్బు లేదంటారు. తులం బంగారానికి డబ్బు లేదంటారు. విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్కి డబ్బు లేదంటారు. విద్యా భరోసాకి డబ్బు లేదంటారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు డబ్బు లేదంటారు. ఉద్యోగుల డీఏలకు, పీఆర్సీకి దిక్కు లేదంటారు. చివరికి అప్పు కూడా పుడుతలేదు అని అన్న రేవంత్ రెడ్డికి హిమాచల్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్‌కు 6,200 కోట్లు ఎక్కడ నుండి వస్తాయో చెప్పాలి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిర్థిష్టమైన సమాచారం మా వద్ద ఉంది. త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడతాం’’ అంటూ హరీష్‌రావు హెచ్చరించారు. -
బీజేపీలో పార్టీ విలీనాన్ని నేను ఒప్పు కోను: ఎమ్మెల్సీ కవిత


