
బీఆర్ఎస్ నేతల బస్‌భవన్ అప్‌డేట్స్..
👉బస్ భవన్ బయలుదేరిని కేటీఆర్, హరీష్ రావు
👉హైదరాబాద్‌లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్(BRS Chalo Bus Bhavan) గురువారం ‘చలో బస్‌భవన్’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గురువారం ఉదయమే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
👉ఇక, చలో బస్‌భవన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్ వరకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.
ఇదేనా ప్రజాపాలన?
ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు మీద
నిరసన తెలుపకుండా అణచివేతకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సహా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్న పోలీసులు. pic.twitter.com/uwMIm6FhN7— BRS Party (@BRSparty) October 9, 2025
👉ఈ సందర్భంగా కేటీఆర్ స్పందించారు.‘పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లి లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. చార్జీలను వెనక్కి తీసుకోవాలని.. అందుకు కోరాలని అనుకున్నాము. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తా అంటే భారీగా పోలీసులను ప్రభుత్వం ఇంటి ముందు మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారు. మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిది. ఎన్ని రకాల కుట్రలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటాము. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు.. మా పార్టీకి కొత్త కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.