breaking news
Harish Rao
-
‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ పరిపాలనా వైఫల్యం’
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చేందుకు పవర్ లేదని, ప్రతి పక్షాల పీక నొక్కేందుకు మాత్రం కాంగ్రెస్‌కు పవర్ ఉందా? అని నిలదీశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు. రాష్ట్ర రైతులకు కనీసం ఇప్పుడు 7 నుంచి 8 గంటల కరెంట్ కూడా రావడం లేదని హరీష్‌రావు విమర్శించారు. ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 10వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మాట్లాడిన హరీష్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో తెలంగాణ రైతాంగ కష్టాలు చూడాల్సి వస్తుందన్నారు. ‘ఒకవైపు నీళ్లు ఇవ్వలేవు.. కరెంట్ ఇవ్వలేవు.. ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా?’ అని ప్రశ్నించారు. అసలు రైతులకు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని సూటిగా నిలదీశారు. భద్రాద్రి, కొత్తగూడెం పవర్ ప్లాంట్ ఎందుకు బంద్ చేశావ్ రేవంత్ అని ప్రశ్నించారు. ఇక యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నడపలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ పరిపాలనా వైఫల్యమని హరీష్ మండిపడ్డారు. ఇదీ చదవండి: ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి -
తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు
సాక్షి, హైదరాబాద్: రెండోరోజూ శాసనసభ అట్టుడికింది. మంగళవారం జరిగిన సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య, స్పీకర్–హరీశ్‌రావు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే సోమవారం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ.. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. అదే సమయంలో సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం సభను కుదిపేసింది.సభలో సభ్యులను ఉద్దేశించి అంతగా మాట్లాడని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. హరీశ్‌రావు లేచి సోమవారం జరిగిన ఘటనను ప్రస్తావించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. ‘మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. వారిపై కేసులు పెట్టారు. మరి వారిపై దాడి చేసిన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.ఆగ్రహించిన స్పీకర్– హరీశ్‌పై ఆగ్రహంహరీశ్ మాటలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వెంటనే స్పందించారు. మహిళా సభ్యుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. జరిగిన ఘటనపై ఇప్పటికే పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. స్పీకర్ సమాధానంతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ బెదిరింపులకు నేను భయపడను. మీరు చేస్తున్నది తప్పు’అంటూ ప్రతిపక్ష సభ్యులను హెచ్చరించారు. అంతలోనే అసెంబ్లీ బయట తనపై, తన తల్లిపై చేసిన వ్యాఖ్యల అంశాన్ని స్పీకర్ ప్రస్తావించారు. ‘మీరెందుకు ఆవేశపడుతున్నారు హరీశ్ ? నా సంగతేంటో చెప్పు? మీ తల్లిని ఎవరూ తిట్టలేదు. నా తల్లిని తిట్టారు. మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆవేశపడాల్సింది నేను. బీఆర్ఎస్ నాయకులు మీ తల్లి గురించి మాట్లాడలేదు.. నా తల్లి గురించి మాట్లాడారు. దీనిపై ఏం చేద్దామో ముందు చెప్పండి’అని స్పీకర్ తీవ్ర భావోద్వేగానికి గురవడంతో సభలో కొద్దిసేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకుంటారా : మంత్రి శ్రీధర్బాబుఈ సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకున్నారు. మహిళా ఎమ్మెల్యేల ఘటనపై ప్రభుత్వం కూడా నివేదిక కోరిందని, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. అదే సమయంలో సభాపతిని అవమానించేలా వ్యవహరించడం, బెదిరించడం సరికాదన్నారు. సభ్యుడు రాంచంద్ర నాయక్ కూడా బీఆర్ఎస్పై తీవ్రంగా మండిపడ్డారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ స్పీకర్ స్థానంలో దళితుడిని కూర్చోబెట్టడం ఇష్టం లేకనే కేసీఆర్ సభకు రావడం లేదని ధ్వజమెత్తారు. గతంలో దళితులను అవమానించిన చరిత్ర కేసీఆర్‌దని, స్పీకర్‌పై కాగితాలు విసిరారని దళితుడైన సంపత్‌కుమార్‌ను, కోమటిరెడ్డిని సభ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు.మహిళలను ముందు పెట్టి.. మీరు వెనుకా: సీతక్కఅసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. సబితా ఇంద్రారెడ్డిని ఎవరు తోశారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి మీరు వెనుక ఉండటం ఏమిటని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిపై బీఆర్ఎస్ నేతలు చేయిచేసుకున్నారని, దీనికి సంబంధించిన దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.వెల్‌లోకి బీఆర్ఎస్ సభ్యులుఇరువర్గాల వాదనలు కొనసాగుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా వెల్‌లోకి వెళ్లారు. కొందరు సభ్యుల చేతుల్లో ఉన్న ప్లకా ర్డులను చీఫ్ మార్షల్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడి యం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం మరింత పెరిగింది. బీఆర్ఎస్ మహిళా సభ్యులపై జరిగిన దౌర్జన్యం. అవమానంపై ప్లకార్డులు పెట్టుకొని పోడియంలోకి సభ్యులు మళ్లీ దూసుకెళ్లారు.22ఏపై బీజేపీ ఆందోళనబీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 22ఏ నిషేధిత జాబితా అంశంపై చర్చకు పట్టుబట్టా రు. బీజేపీ సభ్యులు కూడా ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో సభలో ఒకవైపు బీఆర్ఎస్–కాంగ్రె స్ మధ్య వాగ్వాదం, మరోవైపు 22ఏ అంశంపై బీజే పీ నిరసనతో పరిస్థితి మరింత గందరగోళంగా మా రింది. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో సభను కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో స్పీకర్ సభను ఉదయం 10.45 గంటలకు వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పీకర్ చాంబర్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత సభ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరిగి ప్రారంభమై కొనసాగింది. క్షమాపణ చెప్పాడు.. మళ్లీ ఎందుకు: హరీశ్రావుహరీశ్రావు మరోసారి జోక్యం చేసుకొని.. స్పీకర్ పట్ల తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఇప్పటికే క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలపై కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. ‘స్పీకర్ గారంటే మాకు గౌరవం ఉంది. వ్యక్తిగతంగా కూడా మీ పట్ల గౌరవం ఉంది. అయితే మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారు’అని ప్రశ్నించారు.ఇవి కూడా చదవండి: అసలు హరీశ్‌రావుకు మైక్ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా -
కేటీఆర్,హరీష్ రావు విడుదల.. సీఎం రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ గుండాలను కేసీఆర్ ఇంటి మీదకు పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బోయిన్పల్లి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేల మీద హేయంగా దాడి చేశారని అందరి కంటే ముందు చావు వచ్చేది కాంగ్రెస్ పార్టీకేనని 600కు పైగా హామీలిచ్చి వెయ్యిరోజులైనా ఇంకా వాటిని నేరవేర్చలేదని..స్కూటీలు ఇస్తానని లూటీలు చేశారని రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు. దశాబ్దాల తెలంగాణ కలను కేసీఆర్ నెరవేర్చారని ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టారని కొనియాడారు. అనంతరం జవహర్ నగర్ పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హరీష్ రావు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ చేసే దమనకాండను రాష్ట్ర ప్రజలంగా గమనిస్తున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో హెడ్ లైన్స్ మారుతాయి కానీ ప్రజల జీవితాలు మారవని చెప్పారు. హరీష్ రావు మాట్లాడుతూ.."తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించారు. యూరియా యాప్‌లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఉద్యోగుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నయాపైసా ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. సబితక్క గొంతు మీద మగ పోలీసు చేయి వేసి నొక్కారు అసెంబ్లీ గౌరవ సభను రేవంత్ కౌరవసభగా మార్చారు." అన్నారు. కాగా ఈ రోజు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి.ఏం జరిగింది?కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుతో యాదాద్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బొల్లారం చౌరస్తా నుండి ఎరవెల్లి వైపు రోడ్డుపై కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లారు. హకీంపేట్ దాటిన తర్వాత కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్‌ని బోయన్ పల్లి, హరీష్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించారు. కాసేపటి క్రితమే వారిద్దరిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరు మీడియా ఎదుట మాట్లాడారు. ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్, హరీష్ -
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!
-
ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..
-
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్‌రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజు.. నిన్నటి పరిణామాల నేపథ్యంగా హాట్ హాట్‌గా మొదలైంది. నల్ల బ్యాడ్జీలతో సెషన్‌కు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం దారుణం. నిన్న మా పట్ల పోలీసులు దురుసుగా పవ్రర్తించారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు. సునీతా లక్ష్మారెడ్డి చీరలాగి అవమానించారు. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ వ్యవహరించారు. అసెంబ్లీ కౌరవసభగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నా తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులు నా తల్లిని అసభ్యంగా దూషించారు. సునీత, సబితా, కోవా లక్ష్మి అంటే నాకు గౌరవం. వాళ్లు నాకు తోబుట్టువులతో సమానం. సబితమ్మకు జరిగిన దానిపై నేనే విచారణ చేయమని చెప్పా. మీ తల్లిని అనలేదు హరీశ్.. నా సంగతి ఏంటి?. ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడూ.. అంటూ స్పీకర్ మాట్లాడారు. ఆ సమయంలో.. చర్చ జరగకుండా డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. దళిత స్పీకర్ పట్ల అమానుషంగా వ్యవహరించారని.. జరిగిన దానిపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని చూడకుండా.. చొక్కాలు విప్పి ముందుకు రావడం ఏంటని? సీతక్క మండిపడ్డారు. నిన్నటి పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని స్పీకర్‌ను కోరారామె. ఆ సమయంలో హరీశ్ రావు మరోసారి జోక్యం చేసుకుని.. స్పీకర్‌గా మీపై మాకు గౌరవం ఉంది. మీ పట్ల వ్యాఖ్యలపై మా ఎమ్మెల్సీ నిన్ననే విచారం వ్యక్తం చేశారు. మేం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విచారం వ్యక్తం చేశాక.. దీనిపై రాద్ధాంతం అవసరమే లేదు. కాంగ్రెస్‌కు నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే..ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ఎందుకు చేయలేదు?.. అని హరీశ్ రావు అన్నారు. అయితే హరీశ్‌రావు వైఖరి స్పీకర్నే బెదిరించినట్లు ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై జరిగిన దానిని పక్కన పెట్టాలట. స్పీకర్‌ను డిక్టేట్ చేయడం ఏంటి?. స్పీకర్ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెప్పడానికి వాళ్లెవరూ? అంటూ బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి పరిణామాలపై దర్యాప్తు జరుగుతోందని.. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారాయన. -
అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టులపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులు చేసి, ఇప్పుడు వారినే అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆరోపించారు. హైకోర్టు చెప్పినా పట్టించుకోకుండా కేసులు పెట్టి అరెస్టు చేయడం చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.ప్రతిపక్షం అంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయడమే ప్రభుత్వ కుట్రా అని నిలదీశారు. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22ఏ భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థులు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే అరెస్టులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.“ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అంటే.. తప్పు చేసినవాడే ఎదుటివారిని నిందించడం అని హరీష్‌రావు పేర్కొన్నారు. పోలీసులు తమపై దాడి చేసి, ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్సీలనే అరెస్ట్ చేస్తున్నారని విమర్శిస్తూ.. “దొంగే పోలీసును మందలించినట్టుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తమ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, గొంతు పిసికిన వారిపై చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు, అరెస్టులు చేయడం ఏమిటని హరీష్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించడాన్ని కూడా తప్పుబట్టారు. ఖాకీలను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యమని వ్యాఖ్యానించారు. ‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం’ అంటూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ గొంతుకను అణచలేరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా , కర్కశంగా గౌరవ శాసన సభ్యుల ను, మండలి సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించిన పోలీసులే నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు గౌరవ మండలి సభ్యులు తాత మధు, నవీన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం…— Harish Rao Thanneeru (@BRSHarish) September 8, 2026 -
రణరంగం.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డు కోవడం తోపులాటకు దారితీసింది. నేతలు కింద పడిపోవడం, అస్వస్థతకు గురికావడం, నిరసనలు, నినాదాలు, అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలకు దారి తీసింది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ మండిపడింది. సభలో అడుగు పెట్టక ముందే తమను అడ్డుకుని, తమ పార్టీ సభ్యులపై పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించింది. పోలీసులు తమపై అనుచితంగా ప్రవర్తించారని, మహిళా ఎమ్మెల్యేల గొంతు పిసికారని, చీరలు లాగారనే ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది. ఇది శాసనసభా? కౌరవసభా? అని బీఆర్ఎస్ నిలదీసింది. మరోవైపు పోలీసులతో జరిగిన వాగ్వాదం సందర్భంగా శాసనసభ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార పక్షం మండిపడింది. సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. సదరు సభ్యుడితో రాజీనామా చేయించి, ప్రతిపక్ష నేత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తమపై జరిగిన దాడికి సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని, హోంమంత్రిగానూ వ్యవహరిస్తున్న ఆయనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశాన్ని ఆ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో చోటుచేసుకున్న ఘటనలు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నడుమ సభ లోపలా, బయటా ఆరోపణలు, విమర్శలు, పరస్పర సవాళ్లకు తెరతీశాయి. విలపిస్తున్న సునీతారెడ్డిని ఓదారుస్తున్న సబితారెడ్డి టీషర్టు విప్పి లోనికి అనుమతించాలన్న హరీశ్‌రావు సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్కు వద్ద ఉన్న అమరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలకు హాజరయ్యేందుకు నల్లని టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ అసెంబ్లీ మెయిన్ గేటు వద్దకు చేరుకున్నారు. ‘హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం’ అంటూ టీషర్టులపై నినాదాలు ఉండటంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మెయిన్ గేటు వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్‌రావు వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి కిందపడిపోయారు. దీంతో ఆగ్రహించిన హరీశ్‌రావు తాను ధరించిన నల్ల టీ షర్టును విప్పి విసిరేశారు. ఎలాంటి నినాదాలు లేనందున తనను అసెంబ్లీలోకి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి కూడా టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పోలీసు వాహనంలో తెలంగాణ భవన్‌కు తరలించారు. మహిళా నేతల ఆవేదన అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కిందపడిపోయారు. జగదీశ్‌రెడ్డి అస్వస్థతకు గురికాగా.. ఎమ్మెల్యేలు సుదీర్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు సపర్యలు చేశారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కేటీఆర్‌ను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జుట్టు పట్టుకుని, గొంతు నొక్కారని సబిత ఆరోపించగా, తన చీర లాగారంటూ సునీత కన్నీటి పర్యంతమయ్యారు. సబిత, సునీత, కోవా లక్ష్మితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాధవరం కృష్ణారావు తదితరులు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించగా వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్‌లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్ఎస్ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్ స్టేట్మెంట్గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..రాహుల్ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్ అయ్యే ఇమేజ్, సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్‌కు భిన్నంగా.. మరింత క్యాజువల్ లుక్‌ను ఆయన తన బ్రాండ్‌గా మార్చుకున్నారు. అదే రాహుల్ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.ఉదయనిధికి టీషర్టే బ్రాండ్!తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్‌లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది. 2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆయనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారుటీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్ చుడాసమా టీషర్టు, జీన్స్‌తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.టీషర్టు.. ఇంత పవర్‌ఫుల్లా?దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్ బ్రాండింగ్. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్మెంట్. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్’కు మరో ఉదాహరణగా నిలిచింది.ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్ సాలిడ్ వార్నింగ్ -
‘ మా అసెంబ్లీ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నాం’
సిద్ధిపేట: రేపట్నుంచి(సోమవారం, సెప్టెంబర్ 07వ తేదీ) ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం హరీష్ మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ నష్టం చేసిందని, ఆ పార్టీ ప్రజలకు చేసిన ద్రోహాల మీద అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. ‘ఈ అసెంబ్లీ కనీసం నెల పెట్టాలని మేము బీఏసీలో డిమాండ్ చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ద్రోహాల మీద నిలదీస్తాం. 22a అంశం పై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాబోయే కొద్ది రోజుల్లో లక్షలాది మందితో కాళేశ్వరం ఎత్తిపోతల, రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. రాజీనామా చేయాల్సి వస్తే మీరే చేయాలి. అన్ని విషయాల్లో ఫెయిల్ అయిన మీరే రాజీనామా చేయాలి.ప్రధాన ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వడం లేదు. సీఎం బూతులు తిడుతున్న ఈ సభ కు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు అని అందరం ఎమ్మెల్యేం చెప్పాం. మీ తమ్ముడు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. ఆయనకు ఎందుకు గన్మెన్లను ఇచ్చి ఖర్చు పెడుతున్నారు. అసెంబ్లీ కనీసం నెలరోజులు జరగాలని మేము స్పీకర్ ను కోరుతాం.సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను అడుగుతాం. మాకు తగిన సమయం ఇవ్వకపోతే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా వెనకాడం’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి:త్వరలో పాదయాత్ర చేస్తా: కేసీఆర్ కీలక ప్రకటన -
కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకొనే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్‌కు రాజీనామాలు కొత్త కాదని.. ఆయన రాజీనామాతోనే ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు గుర్తుచేశారు. కేసీఆర్ లేకపోతే రేవంత్‌కు సీఎం పదవి ఉండేది కాదన్నారు. కేసీఆర్‌ను రాజీనామా చేయాలనే నైతిక అర్హత రేవంత్‌కు లేదన్నారు. కేసీఆర్ రాజీనామా చేస్తే రేవంత్‌రెడ్డి లాంటి అర్భకుడికి తట్టుకొనే శక్తి ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మురికి మాటలు వినేందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావాలా అని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ కచ్చితంగా తిరిగి ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తారన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, ఇతర నేతలతో కలిసి తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ 23 పేజీల చార్జిషీట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం.. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో ప్రజలకు నరకం చూపించిందని కేటీఆర్ ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదని.. వెయ్యి రోజుల శని పాలన, ప్రజాపీడన అని విమర్శించారు. ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్ప ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్ లేదా పచ్చ కాంగ్రెస్ పాలన కనిపించడం లేదని.. లుచ్చా కాంగ్రెస్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. సంపాదన కోసం సీఎం, మంత్రుల కొట్లాట ఎంగిలి విస్తరాకుల వద్ద కుక్కలు కొట్టుకున్నట్టుగా రాష్ట్ర సంపద కోసం సీఎం, మంత్రులు కొట్లాడుకుంటున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్ స్థాయిలో కాంగ్రెస్ పాలన సాగుతోంది. చంద్రబాబుకు చెంచాగిరీ చేస్తూ తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాలను గురుదక్షిణగా అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రానికి నష్టం చేసేలా ఉంది. ఎస్ఎల్బీసీ కూలిపోయినా, చెక్ డ్యామ్‌లు దెబ్బతిన్నా కేంద్ర సంస్థలు, బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది. రూ. 50 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. యూరియా అడిగిన రైతులపై లాఠీచార్జి చేయడం, నీళ్లు అడిగితే తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. రైతు సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. ఎంపీల కొడుకులపై యాక్సిడెంట్ల కేసుల నమోదులో వివక్ష ‘హైదరాబాద్‌లో పట్టపగలే హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మంత్రుల కుమారులు దౌర్జన్యాలకు పాల్పడినా, ఇతర పారీ్టల ఎంపీల కుమారులు ప్రమాదాలకు కారణమైనా కేసులు నమోదు చేయడంలో పోలీసులు వివక్ష చూపుతున్నారు. బొల్లారం మిలిటరీ స్థావరంపైనే దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. స్కిల్స్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ విద్యను అనుసంధానం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ అప్పగించిన రాష్ట్రాన్ని కుప్పకూల్చారు: హరీశ్‌రావు కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించిన తెలంగాణను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుప్పకూల్చుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ‘కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగిస్తే.. రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చింది. తాగునీరు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం, శాంతిభద్రతల వంటి రంగాల్లో గతంలో తెలంగాణ దేశా>నికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందితే ఇప్పుడు కరెంట్ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైద్య రంగం నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మందులు కూడా దొరకని స్థితికి చేరింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని బాండు పేపర్లపై హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేదు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే చార్జిషీట్ విడుదల చేశాం. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ప్రకటించిన పోరాటాన్ని ప్రజల పోరాటాన్ని కొనసాగిస్తాం’అని హరీశ్‌రావు ప్రకటించారు. -
కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని.. అప్పుల భారం ఉన్నా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మేమే చెల్లిస్తున్నాం. సర్పంచ్ల బకాయిలను కూడా మేమే చెల్లించాం. వెయ్యి రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు.‘‘ఎన్నికల్లో చెప్పిన మాటను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్కు జ్ఞానోదయం కాలేదు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్ మేల్కొవడం లేదు. కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు.. అభూత కల్పనలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము. త్వరలో మూడు లక్షల పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. 2014-2018లో ఎన్నికల మ్యానిఫెస్టో లో పోడు భూముల సమస్య తీరుస్తామన్నారు.. తీర్చారా? బీఆర్ఎస్ పాలనలో ఆరాచకాలు మర్చిపోయి వంద రోజుల పాలన అంటూ విమర్శలు చేస్తారా?.’’ అంటూ పొంగులేటి మండిపడ్డారు.హరీష్‌రావుకు పొంగలేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. పొడుగు మనిషి 22ఏపై అసెంబ్లీలో ఇరగదీస్తా అంటుండు.. ఎం చేస్తాడో నేను చూస్తా. పక్కా పేపర్ ఆధారాలతో నేను అసెంబ్లీ లోనే సమాధానం చెప్తా.. 22ఏ అడ్డం పెట్టుకుని దందా చేస్తానంటే ఇక నడువదు. ధరణి పేరుతో పక్కరాష్ట్ర రాజులకు భూములను హరీష్ రావు కట్టబెట్టారు. కవిత ప్రశ్నలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలి’ అంటూ పొంగులేటి నిలదీశారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అసెంబ్లీని స్తంభింపజేస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నెలల తరబడి చెల్లించకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. గత రెండున్నరేళ్లుగా నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అధ్యాపకులు, నాన్‌టీచింగ్ సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందడం లేదని, అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించలేక యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. కొన్ని కళాశాలల్లో 5 నుంచి 10 నెలల వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గతంలో సుమారు 960గా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఖ్య ఇప్పుడు దాదాపు 650కు తగ్గిందని, ఇప్పటికే 310 కళాశాలలు తగ్గిపోయాయని హరీశ్ అన్నారు. ప్రస్తుతం మూడు బడ్జెట్లు పూర్తయినా దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్ బకాయిలను తక్షణమే పూర్తిగా విడుదల చేయడంతోపాటు, ప్రతి విద్యా సంవత్సరానికి నిర్ణీత గడువులో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించే శాశ్వత విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే ఈ అంశంపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. -
ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.. హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు.. ప్రజల ప్రాణాలకు కూడా భద్రత లేకుండా పోయిందని వాపోయారు.పేదరికాన్ని జయించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.హరీష్ రావు ఎక్స్‌లో.. పట్టపగలు హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు రాష్ట్రంలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి అరాచకాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది.హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది?ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే మీ ప్రభుత్వం మేల్కొంటుంది? మహిళలకు భద్రత కల్పించలేని మీకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా? ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలి. రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. -
సెప్టెంబర్ 2 నుంచి కాంగ్రెస్ మోసాలపై నిరసనలు
సిద్దిపేట జోన్: సిద్దిపేట గడ్డ నుంచి కాంగ్రెస్ వెయ్యి రోజుల మోసపాలనపై ప్రజాచైతన్యం పేరుతో మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. సెపె్టంబర్ 2 నుంచి పార్టీ ఆధ్వర్యంలో వారంపాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల గురించి చర్చించారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల్లో చేసిన మోసాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, ఇదే విషయాన్ని ప్రజల్లో ఎండగట్టేలా ప్రతీ కార్యకర్త ఒక సైనికుడి తరహాలో ముందుకు రావాలని సూచించారు. మళ్లీ కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆచరణ కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి ప్రజలను మోసం చేసిందని హరీశ్ మండిపడ్డారు. హామీల అమలు విఫలంతోపాటు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అవినీతి అక్రమాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హామీల బకాయిలను మరోసారి బాకీ కార్డుల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 3న వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ వైఫల్యాలను, 4న పెన్షన్ మహిళలకు రూ.2,500 హామీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర అంశాలపై వంటావార్పు, 5న జాబ్ కేలండర్, నిరుద్యోగం అంశంపై నిరసన, విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు బకాయిలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని పిలుపునిచ్చారు. 6న సిద్దిపేట పట్టణంలో భారీ ఆటో ర్యాలీ, 7న ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు చేయాలని సూచించారు. నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని హరీశ్ స్పష్టం చేశారు. -
రూ.500 కోట్ల భూమిపై రేవంత్ సర్కార్ నజర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఉన్న విలువైన ప్రభుత్వ భూమి ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ఆయిల్‌ఫెడ్ ఆ«దీనంలో ఉన్న భూమిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రూ.500 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సొంత ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ రూ.87 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దానిని కాదని ప్రైవేట్ వ్యక్తికి భూమి అప్పగించడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ అ«దీనంలో ఉన్న ఆస్తులను కమీషన్ల కోసం ప్రైవేటుపరం చేయడం సరికాదన్నారు. అజామాబాద్ ఇండ్రస్టియల్ ఏరియాలోని 3 ఎకరాల 23 గుంటల భూమి విషయంలో 1987లో సుప్రీంకోర్టు ప్రభుత్వ హక్కును స్పష్టం చేసిందని లేఖలో హరీశ్ పేర్కొన్నారు. కోకాపేట, రాయదుర్గం, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూముల విషయంలో ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారు. ఒకవైపు సామాన్యుల ఇళ్లను నిషేధిత 22ఏ జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను కారుచౌకగా ప్రైవేట్‌కు అప్పగించడం ఏం న్యాయమని ప్రశ్నించారు. ప్రజల సొత్తును ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. -
రక్షకులుగా ఉండాల్సిన వారే భక్షకులుగా.. హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఈరోజు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిషేధిత జాబితాలో భూములు పెట్టిన తర్వాత సీఎం, మంత్రి పొంగులేటి ఏజెంట్లు కమిషన్ కోసం తిరుగుతున్నారన్నారు. రక్షకుడిగా ఉండాల్సిన ప్రభుత్వం.. భక్షకుడిగా మారిందని ఆరోపించారు.కన్న తల్లి పాములా మారి కాటేస్తుందా..? చేసిన తప్పుకు సీఎం రేవంత్ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు... భూముల చుట్టూ సీఎం రేవంత్ తిరుగుతున్నారన్నారు.పేదల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్, ఆయన తమ్ముళ్లు కడుపు నింపుకుంటున్నారని కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత వస్తున్నాయి. 58, 59 జీవోల పేరుతో కొందరు అధికారులు పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్యార్థులేమైనా టెర్రరిస్టులా?: హరీశ్‌రావు
సాక్షిప్రతినిధి, వరంగల్: విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టులా? తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ పిల్లల గొంతు నొక్కుతారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా ప్రభుత్వ అ«దీనంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హనుమకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వారిపై కేసులు, భౌతిక దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం తప్పెలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యార్థులు మూడేళ్లకు రూ.15 వేలలోపే ఫీజుతో చదువుతున్నారని, భవిష్యత్తులో ఫీజులు పెరిగితే పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఏపీ, ఢిల్లీని ప్రస్తావిస్తూ విమర్శలు... ఏపీలో పాలిటెక్నిక్‌లను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని, ఢిల్లీలోనూ ఇలాంటి విధానం విఫలమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అక్కడ తప్పని తేలిన విధానాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ‘ఏపీ, ఢిల్లీ తరహాలో జీవో 97ను వెనక్కి తీసుకోవాలి’అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్టులు, కేసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.జీవో 97 రద్దు చేయకపోతే విద్యార్థులు, యువత మరింత పెద్ద ఎత్తున ఉద్యమించే పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘ఢిల్లీకో నీతి.. తెలంగాణకో నీతా?’అంటూ విమర్శించారు. టీఎన్జీఓలకు మద్దతు.. హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓలు చే పట్టిన ధర్నా, ఆందోళన కార్యక్రమంలో కూడా హరీశ్‌రావు పాల్గొన్నారు. ధర్నా శిబి రానికి చేరుకుని ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఆయన వారి న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అధికారంలోకి వచ్చి మూ డేళ్లు దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు సీపీఎస్ రద్దు లేదు, పీఆర్సీకి మోక్షం లేదని అ న్నారు. ‘దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఘనత మీ సర్కారుదే. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పట్టవు. రైతుల సమస్యలు పట్టవు. రేవంత్‌రెడ్డి.. మీరు సర్కారు నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?’అని ప్రశ్నించారు.‘ప్రతిపక్షం ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నారు.ఈ దౌర్జన్యాలకు ఏదో ఒక రోజు తగిన మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది’అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. హరీశ్‌రావు పర్యటన ముందే లీక్ కావడంతో మార్గమధ్యలోనే అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. టీఎన్జీఓల ధర్నాలో పొల్గొన్న హరీశ్‌రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులను కలెక్టరేట్ వద్ద అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టడంతో సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్రమంగా అరెస్ట్ చేసిన హరీశ్‌రావును, నాయకులను వెంటనే విడుదల చేయా లని డిమాండ్ చేశారు. తర్వాత వారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. -
‘రాహుల్.. ఢిల్లీకి ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా?’
వరంగల్: పాలిటెక్నిక్ విద్యార్థులపై రేవంత్ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులేమన్నా టెర్రరిస్టులా? అని ప్రశ్నించారాయన. తెలంగాణ విద్యార్థుల సమస్యలు రేవంత్‌కు పట్టవా?అని నిలదీశారు హరీష్‌రావు.‘విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యం అంటున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నావ్. తెలంగాణ విద్యార్థులు నీ కంటికి కనిపించడం లేదా...?, జెన్ జీ అంటూ డిల్లీలో ధర్నాలు చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు కనిపించడం లేదా?, జెన్ జీ రోడ్డెక్కి పోరాడుతుంటే ఎందుకు స్పందించడం లేదు. డిల్లీకి ఒకనీతి.. తెలంగాణకు మరో నీతా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి విద్యారుల కోసం పోరాడాలి. డిల్లీ తరహాలో విద్యార్థులు తిరగడబడక ముందే.... డిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే... రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి: వేటేస్తారా?.. వదిలేస్తారా? -
హరీష్‌రావు హౌస్ అరెస్ట్.. వరంగల్ పర్యటనకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఆయన వరంగల్ వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వరంగల్ వెళ్లాలని హరీష్‌రావు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఈ క్రమంలో హరీష్‌ను బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించి హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో హరీష్ రావు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చదవండి: ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్!మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హౌస్ అరెస్ట్వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/KsHQVCetUB— Telugu Scribe (@TeluguScribe) August 27, 2026 -
ప్రభుత్వమే కబ్జాదారుగా మారింది: హరీశ్‌రావు ఆగ్రహం
హైదరాబాద్: ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా (22ఏ)లోకి చేర్చి, ప్రభుత్వమే పెద్ద కబ్జాదారులా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. కూకట్‌పల్లిలో 22ఏ బాధితుల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పాలన సాగిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం భూముల కేంద్రంగానే వ్యవహారాలు నడుపుతోందని మండిపడ్డారు.కేసీఆర్ సీఎం కాగానే తాగునీరు, నగర ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారని, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వరి సాగులో పంజాబ్‌ను దాటి తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. ఆయన ప్రతి నిర్ణయం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ విలువైన భూమి కనిపించినా అమ్మకానికి పెడుతోందని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పటికే రెండున్నరేళ్లలో రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని, భవిష్యత్ అవసరాలకు కూడా భూములు మిగల్చడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు సామాన్యుల భూములను 22ఏ జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రజల నుంచి భూములను గుంజుకుని తమ అనుచరులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌లో అకారణంగా 22-ఏ నిషేధిత జాబితాలోచేర్చిన భూములను వెంటనే తొలగించాలని మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. షాద్‌నగర్‌లో నిర్వహించిన 22-ఎ బాధితుల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు, రుణాలు అందక వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యుడైన మంత్రిని బర్తరఫ్ చేయాలని కోరారు. సెప్టెంబర్ 7 లోగా సమస్య పరిష్కారం కాకపోతే లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. 22-ఎ బాధితులకు మద్దతుగగా ఈనెల 29న అమీన్పూర్లో బీఆర్ఎస్ పోరుబాట చేపడుతుందని హరీష్ రావు ప్రకటించారు. -
నాణ్యమైన యూనిఫారాలు కూడా ఇవ్వలేరా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు కూడా అందించలేని దుస్థితిలో ఉందని మాజీమంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ‘ఊడిన కుట్లు.. కొలతల పాట్లు’అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో వచ్చిన కథనాన్ని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో యూనిఫారాలు అందలేదని, అందిన చోట్ల కూడా కొలతలు సరిగ్గా లేకపోవడంతోపాటు కుట్లు ఊడిపోతున్నాయని ఆరోపించారు. ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయన్నారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు ఇవ్వాల్సి ఉండగా.. చాలాచోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించారని హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ తెలంగాణ చేనేత కార్మికులపై లేదని విమర్శించారు. ‘మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు’ అన్నదే ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి గండి పడుతుండగా.. మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందుతున్నాయన్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు, చేనేత కార్మికులకు ఉపాధి నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. నాసిరకం యూనిఫారాల వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్‌రెడ్డీ? ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్‌రెడ్డీ? ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటే గుండె కలిచి వేస్తోంది. నెలల తరబడి జీతాల్లేకుండా సిబ్బంది ఎలా బతకాలి? పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలి? ప్రతి నెలా 1వ తేదీకే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదు’అని ఆదివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని గొప్పగా ప్రకటించారని, అది ప్రకటనలకే పరిమితమైందని హరీశ్ ఆరోపించారు. -
రాహుల్జీ.. మౌనమేల?
సిద్దిపేటజోన్: ఢిల్లీలో విద్యార్థులకు అన్యాయం జరిగితే వెళ్లి పరామర్శించిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులపై అమానుషంగా వ్యవహరిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని, రాహుల్‌గాంధీకి ఢిల్లీలో ఒక న్యాయం.. తెలంగాణలో ఇంకో న్యాయం ఉంటుందా? అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97పై హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు నొక్కుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని, సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పి జీవో 97 ఎందుకు రద్దు చేయించడం లేదని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో ఒక సీఐ పాలిటెక్నిక్ విద్యార్థిపై దారుణంగా వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. తాను ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ బలోపేతానికి ఒకేసారి 400 మంది కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ వ్యవస్థను కూలదోసేందుకు చూస్తున్నట్టు ఆరోపించారు. సమస్యలపై మంత్రిని విద్యార్థులు కలిసి విజ్ఞప్తి చేస్తే.. మంత్రి స్థానంలో ఉండి తప్పును సరిదిద్దుతామని చెప్పాల్సింది పోయి.. హామీ ఇవ్వలేనంటూ మాట్లాడడం ఆయన బాధ్యతారాహిత్య వైఖరికి నిదర్శనమని అన్నారు. విద్యార్థులు అధైర్య పడొద్దని పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, జీవో 97 రద్దయ్యేంత వరకు మీ వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామన్నారు.లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దాదాపు 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో తనను కలిసిన సర్వేయర్ల ప్రతినిధి బృందంతో ఆయన మాట్లాడారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన సర్వేయర్ల పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించిన తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరం: మహేష్ గౌడ్
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో పార్టీ క్రమశిక్షణ, నేతల మధ్య సమన్వయం, నామినేటెడ్ పదవుల అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు, చిన్నారెడ్డి వ్యవహారం, పోచారం అసంతృప్తితో పాటు ప్రతిపక్ష నేత హరీశ్ రావు రాసిన లేఖపైనా తాజాగా ఆయన స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి పదవిలో ఉన్నందునే ఆమె నుంచి వివరణ కోరినట్లు చెప్పారు. వివరణ వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. సీనియర్ నేత చిన్నారెడ్డిపై ప్రస్తావన వచ్చిన సందర్భంలోనూ ఇదే విధానం వర్తిస్తుందని చెప్పారు. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎవరైనా ముందుగానే ప్రకటించినా అవి చెల్లుబాటు కావని తెలిపారు.పార్టీలో అభ్యర్థుల ఎంపికకు ఒక నిర్దిష్టమైన విధానం ఉందని చెప్పారు. ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) నిర్ణయాల మేరకే అభ్యర్థులను ఖరారు చేస్తామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.హరీశ్‌రావు లేఖపై..బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు రాసిన లేఖపై కూడా పీసీసీ చీఫ్ స్పందించారు. 22ఏ అంశంపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. కింది స్థాయిలో ఏదైనా తప్పిదం తమ దృష్టికి వస్తే లోపాలను సరిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. తప్పిదం జరిగిందని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించి, దాన్ని సరిదిద్దే చర్యలు తీసుకున్నారని చెప్పారు. 22ఏ నిబంధన వల్ల భూదందాలకు, భూముల అన్యాక్రాంతానికి అవకాశం ఉండదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా సామాన్యులకు అన్యాయం జరిగితే నేరుగా గాంధీభవన్ తలుపులు తట్టవచ్చని అన్నారు.పోచారంతో మాట్లాడాంసీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా మహేష్ గౌడ్ స్పందించారు. ఆయనతో ఇప్పటికే మాట్లాడామని, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలకు 70 శాతం పదవులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాన్సువాడలో పాత, కొత్త నేతలను కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పారు.పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాలకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీలో ‘పచ్చ నేతలు’ ఎవరూ లేరని, పాత–కొత్త నేతల కలయికతో పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే..కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మహేష్ గౌడ్ అన్నారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. నేతల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉన్నా వాటిని పార్టీ అంతర్గతంగా పరిష్కరించుకుంటామని, పార్టీని బలహీనపరిచేలా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.కొండా రిప్లైపై ఆసక్తిగతంలో సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి అదే పని చేయడంతో.. ఆమె వ్యాఖ్యలపై దుమారం రేగింది. పరకాలలో తానే పోటీ చేయబోతున్ననానని.. కాబోయే ఎమ్మెల్యేనని ప్రకటించుకున్నారామె. దీంతో.. రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీ వివాదం తెర మీదకు వచ్చింది. ఈ పరిణామంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. కూతురి వ్యాఖ్యలపై మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని కొండా సురేఖను షోకాజ్ నోటీసుల్లో ఆదేశించింది. దీంతో కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను సమర్థిస్తారా? ఆమె ఏం వివరణ ఇవ్వబోతున్నారో అనే ఆసక్తి నెలకొంది. సాయంత్రం ఆమె ఓ లేఖ ద్వారా వివరణ ఇవ్వొచ్చని సమాచారం అందుతోంది. -
తెలంగాణలో 22A దందా.. రాహుల్‌కు హరీష్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖలో ‘22A’ చుట్టూ భారీ అవినీతి జరుగుతోందా? నిషేధిత భూముల జాబితా నుంచి ఆస్తులను తొలగించేందుకు ఏకంగా 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.22A నిబంధన ఉద్దేశం నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడమేనని హరీష్‌రావు పేర్కొన్నారు. అయితే ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడేందుకు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న వేలాది ప్రైవేటు ఆస్తులను కూడా ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చి యజమానులను వేధిస్తున్నారని విమర్శించారు.రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ రాకెట్ నడుస్తోందన్నది హరీష్‌రావు చేసిన మరో సంచలన ఆరోపణ. నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించుకునేందుకు దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30 శాతం వరకు కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇవి ఆరోపణలేనని, వీటిపై స్వతంత్ర దర్యాప్తుతో నిజానిజాలు తేలాల్సి ఉందని పేర్కొనడం సముచితం.యాదాద్రి జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాలను 22A జాబితాలో చేర్చినట్లు నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని హరీష్‌రావు తన లేఖలో ప్రస్తావించారు. ఇంత పెద్ద స్థాయిలో భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయి? వాటి వెనుక కారణాలేంటి? అన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపైనా హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. భూములపై వివాదాలు సృష్టించి, రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు చేసుకునేలా భూ యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని విమర్శించారు.ఈ మొత్తం వ్యవహారంపై 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 22A జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ ఆరోపణలతో కాకుండా.. ఎవరి ఆదేశాలతో ఏ ఆస్తిని జాబితాలో చేర్చారు? ఎందుకు తొలగించారు? అనే అంశాలను తేల్చాలని కోరారు. అంతేకాదు.. 30 శాతం కమీషన్లు, 50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? దళారులు, బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఏవి? అనే విషయాలను దర్యాప్తులో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి ఆస్తుల జాబితాలో మార్పులు చేసిన అధికారులు, మధ్యవర్తుల ప్రమేయం, జరిగిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని హరీష్‌రావు కోరారు. మొత్తంగా 22A వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు సిద్ధమవుతుందా? లేక ఆరోపణలు-ప్రత్యారోపణలకే పరిమితం అవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
22ఏ భూ బాధితులకు అండగా బీఆర్ఎస్
సాక్షి,తెలంగాణ భవన్: 22ఏ భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్లో 22ఏ నిషేధిత భూ బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కుట్రతో భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతుంది.కష్టాల్లో ఉన్న వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది22ఏ భూ బాదితులకు బిఆర్ఎస్ లీగల్ సెల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. మంచి మాటతో ప్రభుత్వం వినక పోతే ఎలాంటి పోరాటానికి అయినా సిద్ధం.30 ఏళ్ల క్రింద రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది. నిషేధిత జాబితా నుండి తీసివేయాలంటే 30 శాతం నుంచి 50 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారు అని చెబుతున్నారు.మంత్రి నిషేధిత జాబితా నుండి తీసేశారట..ముఖ్యమంత్రి నిషేధిత జాబితాలో పెట్టించారట. ముఖ్యమంత్రి,పొంగులేటికి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే..బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు తెలుసు.ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదు. భువనగిరిలో 40వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీఎంకు నాలుగు సార్లు చెప్పారని అన్నారు.ముఖ్యమంత్రి , పొంగులేటిని భర్తరఫ్ చెయ్యి...అన్ని సజావుగా జరుగుతాయి.ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎందుకు లంచాలు ఇవ్వాలి. నిషేధిత జాబితాలో పెట్టిన వాటిని వెంటనే తొలగించాలి.ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగితే పొంగులేటిని వెంటనే భర్తరఫ్ చేయాలి. 22ఏ నిషేధిత భూముల విషయంలో ఏ1 రేవంత్ రెడ్డి,ఏ2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎకరాల్లో కొని గజాల్లో అమ్ముతున్నారని ముఖ్యమంత్రి అంటున్నారు. హిల్ట్ పాలసీతో ఉద్యోగాలు పోగొట్టారు.ప్రజలకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ప్రభుత్వం చేసిన కుట్ర.. వెంటనే సుమోటోగా స్వీకరించి తొలగించాలి.భూ భారతీ సైట్ పని చేయడం లేదు. అవసరం అయితే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిద్దాం’అని పిలుపునిచ్చారు. -
హైదరాబాద్‌లో హైటెన్షన్.. హరీష్‌రావు, తలసాని హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్(TIMS) ఆసుపత్రి పరిశీలనకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కోకాపేటలోని హరీష్‌రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.ఈ క్రమంలో హౌస్ అరెస్ట్‌పై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రుల్లోని వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. TIMS ఆసుపత్రుల పనితీరు, అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల యుద్ధం ముదిరే అవకాశం కనిపిస్తోంది. -
ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారు?: హరీశ్‌రావు
హైదరాబాద్: ప్రజల ఆస్తులను ప్రభుత్వ భూములుగా నిర్ణయించి, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. మల్కాజ్‌గిరిలో పర్యటించిన ఆయన.. భూముల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. సంబంధిత భూ యజమానుల నుంచి ఎలాంటి దరఖాస్తులు లేకుండానే ప్రైవేట్ భూములను 22ఏలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. ఇప్పటికే అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC)లో పరిష్కారమైన భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక కారణమేంటని ఆయన నిలదీశారు.ప్రభుత్వ నిర్ణయాల కారణంగా భూముల యజమానులు తమ ఆస్తులను విక్రయించుకోలేక, రిజిస్ట్రేషన్లు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే, ప్రజల ఆస్తులపై ప్రభుత్వ తప్పిదాల ప్రభావం పడితే అందుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.దీంతో ప్రభుత్వ తప్పిదానికి ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారని వారు నిలదీశారు. అయితే, భూముల రికార్డులను పరిశీలించి, అర్హత ఉన్న ప్రైవేట్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
‘22-Aతో రేవంత్ ప్రభుత్వం గందరగోళానికి తెరలేపింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 శాతం ప్రభుత్వం నడుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా రేవంత్ ప్రభుత్వంపై హరీష్ మండిపడ్డారు. ‘లక్షలాది ప్రాపర్టీలు 22-Aలో పెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకొన్న తర్వాత మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు.. ప్రాహిబిటేషన్ లో ఉంది అని చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వం గందరగోళానికి తెరలేపింది. ఎవరి భూమి ప్రాహిబిటేషన్ లో ఉందో తెలియని పరిస్థితి. సీఎం రేవంత్ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉంది. అందుకే తొలగించడానికి హడావుడి చేస్తున్నారు. రాష్ట్రం లో 30 పర్సంటేజ్ ప్రభుత్వం నడుస్తుంది. ప్రాహిబిటేషన్లో నుండి సర్వే నంబర్ తీసివేయాలంటే 30 పర్సంటేజ్ ఆడుతున్నారు. రెవెన్యూలో మీ పని జరగాలంటే. 30 పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అంటున్నారు’ అని హరీష్ విమర్శించారు.సొంతింటి యజమానులకు ‘22–ఏ’ పిడుగు..! Cm రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ప్రోహిబిటెషన్ లో ఉంది..Cm రేవంత్ రెడ్డి ఇల్లు వుండటంతో ఇప్పుడు ప్రోహుబిటేషన్ తీసివేస్తం అంటున్నారు..22ఏ పై విచారణ జరపాలి..ప్రాహిబిటేషన్ పెట్టమని ఆదేశించింది ఎవరు. కారకులు ఎవరు..రాష్ట్రం లో 30 పర్సంటేజ్ ప్రభుత్వం నడుస్తుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి అలా ఉంటే ..సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది -
సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్
సిద్ధిపేట: సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేది ప్రతీది అబద్దమేనని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ఆయన అబద్ధాలే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. అబద్ధాలు మాట్లాడే రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రేవంత్‌రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పరని, ఆయనొక ఘరానా మోసగాడని ధ్వజమెత్తారు. రేవంత్‌కు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే రుణమాఫీ చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 15వ తేదీ) సిద్ధిపేట నుంచి మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్‌రావు.. రేవంత్‌పై ధ్వజమెత్తారు. ‘దేవుళ్లపై ఒట్టుపెట్టి మోసం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. అసెంబ్లీలో అన్ని రికార్డులు భద్రంగా ఉన్నాయి. రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే రుణమాఫీ చెయ్యాలి. రేవంత్‌రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పలేదు. రేవంత్‌రెడ్డి ఘరానా మోసగాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పాలి. ఆనాడు రూ. 1400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెడితే మేం కట్టాం. పిల్లలకు క్షమాపణలు చెబుతావా.. ముక్కు నేలకు రాస్తావా?, నిరుద్యోగుల గురించి రేవంత్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. గన్మెన్లు లేకుండా అశోక్‌నగర్‌కు రాగలవా? అని నిలదీశారు.‘కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు కంటే రేవంత్ తక్కువ ఇచ్చారు. రూ. 15 వేల కోట్లు రైతు బంధు రేవంత్ ఎగ్గొట్టాడు. 2025-26లో మీరు ఇచ్చింది కేవలం రూ. 11 వేల కోట్లు మాత్రమే. ఇది తప్పు అయితే ముక్కు నేలకు రాస్తా. రేవంత్‌కు ఇదే నా సవాల్. అబద్ధాలు మాట్లాడే రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు. 2 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి యువతను మోసం చేశావు. మూడేళ్లలో 16వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్‌ను కోర్టుకు ఈడుస్తా. నాపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలి. పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగుతా. రైతుబంధు, రుణమాఫీపై దమ్ముంటే అసెంబ్లీ చర్చింద్దాం. కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై మీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. మీ అవినీతిపై పోచారం, రాజగోపాల్ెడ్డి మాట్లాడారు. రుణమాఫీ విషయంలో రేవంత్‌కు ఊరికే వెళ్దాం. అందరికీ రుణమాఫీ అయితే అక్కడే రాజీనామా చేస్తా. రుణమాఫీ కాలేదంటే రేవంత్ రాజీనామా చేస్తారా?అని సవాల్ విసిరారు. -
కేసీఆర్ వస్తారు.. మెడికల్ కాలేజీకి ‘పెద్ది’ పేరు పెడతారు
సాక్షి, వరంగల్/నర్సంపేట: తెలంగాణ ఉద్యమ బిడ్డ పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఉద్యమ గడ్డ ఘనమైన గౌరవం ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, పెద్ది ఆశయాల మేరకు నర్సంపేటను అభివృద్ధి చేస్తామన్నారు. నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది దశదిన కర్మ సందర్భంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం నిర్వహించిన సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన నివాళులర్పించారు.పెద్ది అంతిమయాత్రకు కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓరుగల్లు మొత్తం కదిలివచ్చిందని, 12 గంటలపాటు లక్షలాది మంది తరలిరావడం ప్రజల గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. పెద్ద పెద్ద పదవులు చేపట్టకపోయినా తెలంగాణ ఉద్యమంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజానాయకుడని కొనియాడారు.చివరి రోజుల్లోనూ దేవాదుల నీటి కోసం, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసేందుకు పెద్ది తపించారని గుర్తుచేసుకున్నారు. కరోనా, ఆర్థిక సంక్షోభ సమయంలోనూ నర్సంపేటలో ఇంటింటికీ పైపులైన్ గ్యాస్ అందించారని, రైతుల కోసం రూ.100 కోట్ల ప్రత్యేక ప్రాజెక్టును సాధించారని తెలిపారు. పెద్ది భార్య స్వప్న, వారి పిల్లలు, కుటుంబసభ్యులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.పెద్ది లేని నర్సంపేటను ఊహించలేకున్నా: హరీశ్పెద్ది లేని నర్సంపేటను ఊహించలేకపోతున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ఉద్యమ సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో డీసీఎం పైనుంచి కిందపడిపోయిన నన్ను.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు. అదే ఆస్పత్రిలో ఆయనను నేను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అంటూ హరీశ్ కన్నీటిపర్యంతమయ్యారు. తెలంగాణ కోసం ప్రాణాలు, ఆస్తులు, పదవులు లెక్కచేయకుండా పెద్ది పోరాడారన్నారు. మానుకోట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఉపఎన్నికల్లో ఆయన పోరాట స్ఫూర్తి మరువలేనిదన్నారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ, రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల నీళ్లు సాధించడంలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ సభలో పార్టీ ముఖ్యనేతలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.ఉద్రిక్తత మధ్య విగ్రహావిష్కరణపెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ట తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగింది. స్థానిక మెడికల్ కాలేజీ సమీపంలో విగ్రహం పెట్టాలని నిర్ణయించగా సంబంధిత నిర్మాణాన్ని ఆదివారం రాత్రి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో సోమవారం ఉదయం పలువురు నాయకులు ఆందోళనకు దిగారు. కూల్చిన ప్రదేశంలోనే మళ్లీ గద్దె నిర్మించగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. -
నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: హైడ్రా పరిధిలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందించి వచ్చిన వేలాది మంది నిరుద్యోగులను ప్రభుత్వం అవమానించిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారిని దుర్భాషలాడుతూ వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామంటూ యువత, నిరుద్యోగులకు హామీలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’అని దూషించిన సీఎం బాటలోనే అధికారులు కూడా నిరుద్యోగులను దూషిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీ.. 32 నెలలు దాటినా అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులకు బోగస్ హామీలు ఇచ్చిన ప్రభుత్వ తీరుపై యువతలో నిరాశ పెరుగుతోందని తెలిపారు. ఉన్నత విద్య చదివిన వారు కూడా చిరుద్యోగాల కోసం పోటీ పడాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న పార్టీ నేతలను హరీశ్‌రావు శనివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్‌ను పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి మహమూద్ అలీ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ చేతులెత్తేసింది.. GRMB మీటింగ్ బహిష్కరించాలి: హరీష్
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు, నీటి హక్కులపై శ్రద్ధ లేకుండా పోయిందని మండిపడ్డారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించామని ఆయన చెప్పుకొచ్చారు.ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ పాత్ర చిరస్మరణీయమని హరీశ్ రావు అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రభుత్వం, గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రావడానికి కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటమే కారణ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు.గోదావరి జలాల విషయంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించామని అన్నారు. గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేసిందని, మిగిలిన నీటి వాటా కోసం అవసరమైన డీపీఆర్‌లను కూడా కేంద్రానికి సమర్పించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా కొత్తగా ఒక్క అనుమతిని కూడా సాధించలేదని ఆరోపించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రాజెక్టులను సమీక్షించి, అనుమతులను రద్దు చేయాలనే అంశం ఎజెండాలోకి రావడం ఆందోళనకరమని అన్నారు.గతంలో జరిగిన GRMB సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన ఎప్పుడూ రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు, నీటి హక్కులపై శ్రద్ధ లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి GRMB ఎజెండాను మార్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే GRMB సమావేశాన్ని బహిష్కరించాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని ప్రశ్నించిన ఆయన, సమ్మక్క–సారక్క ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చినప్పటికీ దానిని ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని నిలదీశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్-2తో పాటు వరంగల్, నల్గొండ ప్రాంతాలకు నీరు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
ముడుపుల లెక్కచెప్పే.. నీతిమాటలు: ఉత్తమ్
సాక్షి,ఢిల్లీ: ఎమ్మెల్యే హరీశ్ రావు ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పి తర్వాతే నీతి మాటలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీష్ రావు ప్రకటన పై ఘాటుగా మండిపడ్డారు. కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయడమే తనకు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. ఈ రోజు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం, పట్టిసీమ, రాయలసీమ ఎత్తిపోతలపై బీఆర్ఎస్ ఎందుకు మౌనం పాటించిందని 12 ఏళ్లుగా ప్రతి GRMB సమావేశంలో ఏపీ ఇదే అభ్యంతరాలు చెబుతోందని ఇందులో కొత్తేం లేదన్నారుఏపీ అభ్యంతరాలను తిప్పికొట్టి సీతమ్మసాగర్–సీతారామకు TAC అనుమతి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని 67 టీఎంసీల నీటి కేటాయింపులు సాధించిందన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటును సమయస్ఫూర్తితో అడ్డుకున్నామని సమ్మక్క సాగర్ NOC కోసం ఛత్తీస్‌గఢ్ సీఎంను మూడుసార్లు కలిశాం… నెలాఖరులో NOC వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హాయాంలో ఒక్కసారైనా ఛత్తీస్‌గఢ్ సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ISM, IP క్లియరెన్స్‌ల కోసం గత ప్రభుత్వం ప్రయత్నించలేదని కాంగ్రెసే ముందుకు తీసుకవచ్చిందన్నారు.PBLPపై వెంటనే స్పందించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం, సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్, IAలు దాఖలు చేశాం న్యాయపోరాటం కొనసాగుతోందని KWDT ముందు స్వయంగా హాజరై తెలంగాణ తరఫున వాదనలు వినిపించామన్నారు. RDS ఆధునీకరణకు ఏపీ, కర్ణాటక సీఎంలను ఒప్పించామని… బీఆర్ఎస్ ఏం చేసింది? తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణ నీటి హక్కులు కాపాడలేని వాళ్లు… ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. -
పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆప్త మిత్రుడు, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు.పార్టీ పట్ల ఆయన అంకితభావం, ప్రజల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్న కేసీఆర్, ఆయన మరణం బీఆర్ఎస్కు తీరని లోటని అన్నారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్లు జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్జాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ గారు కొనియాడారు.హరీష్ సంతాపం..అలాగే, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృత్యువును జయించి తిరిగి వస్తారని ఆశించామని, కానీ ఆయన లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. వ్యక్తిగతంగా ఆత్మీయ సోదరుడిని కోల్పోయానని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ "పెద్దన్నకు జోహార్లు" అని నివాళులర్పించారు.సీఎం సంతాపం.. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.కేటీఆర్ సంతాపం.. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారని ఆశించామని, కానీ ఆయన ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్న కేటీఆర్.. ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి, ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. -
నమ్మి నారు పోస్తే.. నీరు లేదంటారా?: హరీశ్
సాక్షి, హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల పథ కం ద్వారా 22 రిజర్వాయర్లలో 38 టీఎంసీల నీరు నింపుతామని ప్రభుత్వ ప్రకటనను నమ్మి న నారు పోసిన రైతులకు నాట్ల సమయంలో నీరు లేదని చెప్పడం దుర్మార్గమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సమ్మక్క బ్యారేజీలో 3 టీఎంసీలు, గోదావరిలో 22వేల క్యూసెక్కుల వరద ఉన్నా దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.‘నీటిని ఒడిసి పట్టకుండా చంద్రబాబు కోసం ఏపీకి నీళ్లు వదిలి పెట్టడమే ప్రభుత్వ విధానమా? ఇది ఎల్‌నినో తెచి్చన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వరంగల్ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టారు. 3.17లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా దేవాదుల పథకాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎన్డీఎస్ఏ పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల పథకంలో ఎందుకు నీటిని లిఫ్ట్ చేయడం లేదు. రామప్ప చెరువు తూములను మూసి వేయించిన మంత్రులు రైతులకు క్షమాపణ చెప్పాలి. సమ్మక్క బరాజ్ నుంచి దిగువకు 105 టీఎంసీలు నీళ్లు వెళ్తే అందులో దేవాదుల ద్వారా ఎత్తిపోసింది కేవలం 1.9 టీఎంసీలు మాత్రమే. రోజుకు పావు టీఎంసీ చొప్పున లిఫ్ట్ చేసే అవకాశమున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, తప్పడు నిర్ణయాలతో రైతులకు నష్టం జరుగుతోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. డైలీ సీరియల్ తరహాలో ఉత్తమ్ ప్రకటనలు: ‘జనగామ, హను మకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయ ని వాతావరణ శాఖ చెప్తున్నా దేవాదుల పూర్తి చేస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలీ సీరియల్ తరహాలో డైలాగులు చెబుతున్నారు. 30 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విమర్శలు మినహా సీఎం రేవంత్, ఉత్తమ్ చేసిందేమీ లేదు. సీఎం రేవంత్‌కు దేవాదుల ఎక్కడుందో తెలియదు, నదీ పరీవాహక ప్రాంతాల గురించి కూడా అవగాహన లేదు. రేవంత్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి దేవాదుల ప్రాజెక్టులో పది మోటార్లను ఆన్ చేయాలి. దేవాదుల ప్రాజెక్టు నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు రూ.800 కోట్ల మేర పంటను నష్టపోయే అవకాశముంది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతాంగాన్ని ఆదుకోకుంటే రైతులతో కలిసి ప్రజా పోరాటాలు చేస్తాం’అని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రాజయ్య, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారంతో ఇలా చేస్తున్నారు: హరీశ్ రావు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారంతో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయట్లేరని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో హరీశ్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ తిట్టడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని చెప్పారు.‘‘ఈ కరవు కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. కేసీఆర్‌ను తిడితే నీళ్లు వస్తాయా? నీళ్లు ఎత్తి పోస్తే నీళ్లు వస్తాయా? మోటార్లు ఆన్ చేస్తే నీళ్ఉల వస్తాయి అని రిటైర్డ్ ఇంజినీర్లు చెబితే బెల్టుతో కొడతా అని అంటారు రేవంత్. నువ్వు ముఖ్యమంత్రివా.. హిట్లార్వా?కాళేశ్వరం కూలింది అని అంటున్నారు..పోయిన సారీ నీళ్లు వచ్చాయా లేదా? 70 టీఎంసీల నీళ్లు ఎత్తకుండా కిందికి వదిలేశారు. రేవంత్ రెడ్డి వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలి. రేవంత్ వచ్చాక రాష్ట్రం అంత కరవే. మనకు కరవు.. కాంగ్రెస్ వాళ్లు మాత్రం బాగా దొడ్డు అవుతున్నారు. రేవంత్ నువ్వు నీళ్లు ఎత్తి రంగనాయక, మల్లన్న, కొండపోచ్చమ్మకు కోపం వస్తే మాడి మసి అయితవు. బీఆర్ఏస్ హయాంలో బోర్ బండ్లు లేవు.. కాంగ్రెస్ హయంలో మళ్లీ బోర్ బండ్లు ఊర్లలోకి వస్తున్నాయి. అనాడు కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడుగా ఉంటే...ఇప్పుడు రేవంత్ రాక్షసుడిలా ఉన్నారు.ఈ స్కాంల ప్రభుత్వం పోవాలి..స్కీమ్ ల ప్రభుత్వం బీఆర్ఏస్ రావాలి అని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలో పెద్దావగు కొట్టుకుపోయింది.. వట్టేం మునిగిపోయింది..సుంకిశాల కూలిపోయింది’’ అని చెప్పారు. -
తిరుమలలో హరీష్ రావు ఫ్యామిలీ
-
వాటర్ వారియర్ హరీశ్ రావు పాదయాత్ర.. నెక్స్ట్ కారే..!
-
కాళేశ్వరం రాజకీయ యుద్ధంగా మారిందా?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నిత్యం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. అది క్రమేపి రాజకీయ రూపు దాల్చుతోంది. ఆ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దానికి తెరదీసింది. ఒక వైపు వానలు అంతంత మాత్రంగా ఉండడం, మరో వైపు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వస్తాయో, రావో అన్న సందిగ్దత గందరగోళంగా మారింది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసినప్పటికీ మెడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు కుంగడంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా డామేజి జరిగింది.2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిలో ఆ సమస్య కూడా ఒక కారణం అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎలాంటి విధానం అనుసరించాలన్నదానిమీద సరైన క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నదన్న విమర్శ వస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఏర్పడిన పగుళ్లనండి. లేదా పిల్లర్లు కుంగడం అనండి.. ఏదైనా కానివ్వండి.. గ్రౌండ్ సిచ్చుయేషన్కు అనుగుణంగా నిర్ణయాలు చేసి రేవంత్ తనకు అడ్వాంటేజ్ తెచ్చుకునే అవకాశం ఒక దశలో ఉంది.ఆ ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని నేషనల్ డామ్ సేఫ్టి అథారిటి చెబుతోందన్నది ఆయన వాదనగా ఉంది. ఇందులో స్కామ్ అని, మరొకటి అని చెప్పి గత రెండేళ్లుగా అలాగే ఉంచేశారు. ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులను అరెస్టు చేస్తారేమో అన్నంతగా ప్రచారం జరిగింది. కాని వారు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ పొందగలిగారు. కమిషన్ రిపోర్టుకు కూడా పెద్ద విలువ లేకుండా పోయిందనిపిస్తుంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నీరు నిల్వచేసి పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తోడి ఆయా ప్రాంతాలలో ఉన్న రిజర్వాయిర్లను నింపాలా? వద్దా? అన్న చర్చకు పరిస్థితి చేరింది. ఇక్కడే రేవంత్ ప్రభుత్వం పొరపాటు చేస్తున్నదా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి, అక్కడ నీటిని తోడకపోతే తామే మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. తనకు ఇరిగేషన్ మంత్రి పదవి అప్పగిస్తే, మూడునెలల్లో బారేజీలను బాగు చేయించి చూపుతానని హరీష్‌రావు సవాల్ చేశారు. వీటికి ప్రతిగా రేవంత్ కూడా ధీటుగానే బదులు ఇచ్చారు. అది వేరే విషయం.నిజానికి ఇంతదాకా రేవంత్ ప్రభుత్వం వెళ్లనిచ్చి ఉండాల్సింది కాదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు ఆయా జిల్లాలను ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు నీరు ఎలా ఇవ్వవచ్చా అన్నదానిపై ఆలోచన చేసి ఉండాల్సింది. కేసీఆర్ కట్టించినంత మాత్రాన ఆ ప్రాజెక్టు ఆయనది అయిపోదు. అలాగే ఆరోపణలు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టుతో రేవంత్‌కు సంబంధం ఉండకపోదు. అది ప్రజల ఆస్తి.ఈ క్రమంలోనే వాదోపవాదాలు, విమర్శ, ప్రతి విమర్శలకు అవకాశం ఇచ్చారు. కాళేశ్వరం నీరు ఎత్తిపోయకుండా పగ పట్టారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి బదులుగా నీళ్లు ఉన్నంత మాత్రాన ఎత్తిపోయలేం అని, నీటి నిల్వకు ఆ బారేజీలు అనువుగాదని జాతీయ డామ్ భద్రత అథారిటీ చెబుతోందని, బరాజ్‌లు సురక్షితం కాదని కూడా ఆ సంస్థ చెప్పిందని రేవంత్ అన్నారు. అది నిజమే కావచ్చు. కాని అందుకు ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే, రైతుల పొలాలకు నీరందించలేకపోతే, వర్షాలు సరిగా కురవకపోతే ఆ ప్రభావం అంతా తన ప్రభుత్వంపైనే పడుతుందన్న సంగతి ఆయన గుర్తించాలి.అంతేకాక విపక్షాన్ని ఉద్దేశించి పొలాలలో రక్తం చల్లితే పంటలు పండుతాయని అనడం సరికాదు. ఎదుటి పక్షం వారు ఎదైనా చిన్న వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తేనే కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ కాస్త బెటర్ అయినా, ఈ మధ్య జరిగిన కొన్ని అరెస్టులు చూస్తే, ఇక్కడ కూడా టీడీపీ పెత్తనం సాగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత కొన్నాళ్లుగా తీవ్ర అసహనంతో మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఆయనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను బయటపెట్టుకుంటున్నారు. తెలంగాణలో ఆయన శిష్యుడుగా పేరొందిన రేవంత్ కూడా అదే బాటలో వెళ్లకుండా ఉంటే మంచిది.రేవంత్ వ్యాఖ్యను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలచుకుని, గోదావరి నీళ్లు రైతులకు అందిస్తామంటే తమ రక్తం ఇస్తామంటూ పెద్ద హడావుడినే సృష్టించింది. తెలంగాణ భవన్లో భారీగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. కేసీఆర్‌ను ఎలాగైనా ఇరిటేట్ చేసి ముగ్గులోకి దించాలని రేవంత్ చూస్తున్నప్పటికి, ఆయన తొణకడం లేదు. కేటీఆర్, హరీష్‌రావులే గట్టిగా బదులు ఇస్తున్నారు. దీనివల్ల కూడా రేవంత్ అసహనానికి గురి అవుతున్నారేమో తెలియదు. రేవంత్ కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే దాని పునరుద్దరణపై పూర్తి శ్రద్ద పెట్టి ఉంటే ఆయనకు పేరు వచ్చేది.కేసీఆర్‌ను విమర్శించవచ్చు. అందులో అవినీతి ఉంటే దానిపై దర్యాప్తు చేయించవచ్చు. కాని అల్టిమేట్‌గా ప్రజలకు కావల్సింది నీరు. అందులోను వర్షాభావ స్థితిలో తమ పొలాలకు నీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అందువల్ల బీఆర్ఎస్ కోరడానికి ముందే, గోదావరిలోకి వచ్చిన వరద నీటిని అంచనా వేసుకుని, పంప్ హౌస్‌ల ద్వారా నీరు లిఫ్ట్ చేయించడం మొదలు పెడితే బాగుండేదేమో! కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా దానినే సూచిస్తున్నారట. ఒక వేళ నిజంగానే గోదావరి నీటిని లిఫ్ట్ చేయడంలో ఇబ్బంది ఉంటే, విపక్షాన్ని కూడా ఆహ్వానించి, వారిని కూడా ఆయా బారేజీల వద్దకు, పంప్ హౌస్‌ల వద్దకు తీసుకువెళ్లి ఇరిగేషన్ అధికారుల ద్వారా పరిస్థితిని వివరించి ఉండవచ్చు. అలాగే మేధావులైన ఇంజనీర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కోసం ఒక సమావేశం పెట్టి ఉండవచ్చు. ఇవేవి చేసినట్లు లేరు. పైగా అనుచిత వ్యాఖ్య చేసి తనకు రావల్సిన మైలేజీని రేవంత్ వదులుకున్నారేమో అనిపిస్తుంది.కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఊపిరి పోస్తుందనిపిస్తుంది. కారణం ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం కూడా మెడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల పునరుద్దరణకు వేగంగా చర్యలు చేపట్టలేదన్న భావన ఉంది. ఒకప్పుడు గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఉన్న బారేజీ గేట్లు దెబ్బతిన్నాయి. దాంతో ఉభయ గోదావరి జిల్లాలకు తీవ్ర సంక్షోభం వచ్చే స్థితి ఏర్పడింది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు స్వయంగా ధవళేశ్వరం వెళ్లి, అక్కడే మకాం చేసి ఆ గేట్లను బాగుచేయడమో. కొత్త గేట్లను బిగించడమో చేశారట. దానివల్ల ఆయనకు ఖ్యాతి వచ్చింది.1986లో వచ్చిన భారీ వరదలకు గోదావరి రెండువైపులా గట్లు పలుచోట్ల తెగిపోయాయి. ఆ నది వెంబడి ఉన్న జిల్లాలన్నీ మునిగిపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వం వెంటనే గోదావరి గట్లను పటిష్టపరిచే పని చేపట్టింది. అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమని చెబుతూ కాలం గడపలేదు. ఇలాంటి అనుభవాలు మరి కొన్ని కూడా ఉన్నాయి. కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిని ఎదుర్కుని ముందుకు పోవడంలోనే ప్రభుత్వ విజన్ కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా రేవంత్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా దానిని వినియోగించుకుంటే మంచిది. పాజిటివ్ దృక్పథంతోనే రేవంత్ ముందుకు వెళితే ఆయనకు మైలేజీ రావచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చీకట్లలో తెలంగాణ.. కమీషన్లలో కాంగ్రెస్: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: బొగ్గు, నీటి నిర్వహణలో దూరదృష్టి లేని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు పెరిగాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రైతులు సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రైతులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం 23 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం, థర్మల్ సామర్థ్యం 7,180 మెగావాట్లు ఉన్నప్పటికీ కేవలం 3,190 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరిగిందన్నారు. థర్మల్ విద్యుత్ సామర్థ్యంలో కేవలం 44 శాతం సామర్థ్యాన్నే వినియోగిస్తున్నారని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల్లో 6–7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని, యాదాద్రి ప్లాంట్‌లో రెండు యూనిట్లు, భద్రాద్రి ప్లాంట్‌లో నిర్వహణ లోపాలతో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం 1,059 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 351 టీఎంసీలే నీరు ఉందని, హైడల్ విద్యుత్‌కు నీళ్లు, థర్మల్ విద్యుత్‌కు బొగ్గు లేదన్నారు. సింగరేణి వెబ్‌సైట్‌ను మూసివేసి బొగ్గు ఉత్పత్తి, సరఫరా వివరాలను దాచిపెడుతోందన్నారు. బొగ్గు, ఇసుక, విద్యుత్, భూముల్లో కుంభకోణాలకు పాల్పడుతూ కాంగ్రెస్ పాలన స్కామ్‌ల మయంగా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టామన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మళ్లీ చీకట్లలోకి నెడుతోందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఎరువుల సరఫరా, పంట బోనస్, విద్యుత్ సరఫరా అన్నింటిలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇది ‘కోతలు.. వాతల సర్కారు’గా ఆయన అభివర్ణించారు. గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద 3 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం వెనుక కమీషన్ల కక్కుర్తే కారణమన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచి, ప్లాంట్లకు తగిన బొగ్గు సరఫరా చేసి, రైతులకు 24 గంటల విద్యుత్ అందించకుంటే రైతాంగం తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ పాల్గొన్నారు. -
18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదన్నారు కేటీఆర్. దీనిలో భాగంగా ఈనెల 18వ తేదీన సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ కోతలుఅప్రకటిత కరెంట్ కోతతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. 11 జిల్లాల్లో రైతులు సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేశారని, బొగ్గు కొరతతో విద్యుత్‌కి అంతరాయ ఏర్పడిందన్నారు. ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని నిద్ర లేపినా.. ఉలుకు లేదు.. పలుకు లేదని మండిపడ్డారు. థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు లేదని, విద్యుత్ ఉత్పత్తి లేక కోత విధిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో సరిపడా విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందని, 7180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు హరీష్. ఇది చేతకాని ప్రభుత్వమని, ప్రభుత్వం 3190 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యుత్ కోతలని మండిపడ్డారు. ప్రభుత్వం నడిపే వారికి కనీస అవగాహన, సోయి లేదన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు కనీసం సోయి లేదన్నారు. ఎనిమిది గంటల విద్యుత్ అనేది రైతులకు అందించడం లేదని హరీష్‌రావు ఆరోపించారు. -
జీతాల్లో కోతలేనా.. హెల్త్ కార్డులు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు జూలై 15 నుంచే హెల్త్ కార్డులు జారీ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మాట తప్పిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్‌రావు విమర్శించారు. పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేయకపోవడం, నెట్వర్క్ ఆస్పత్రులతో పూర్తిస్థాయి ఒప్పందాలు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. పథకం అమలు చేయకుండానే ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల నుంచి రెండు నెలలుగా 1.5 శాతం ప్రీమియం కోత విధించడం మోసమేనని మండిపడ్డారు. డేట్లు, డెడ్లైన్లు మారుతున్నాయే తప్ప హెల్త్ కార్డులు మాత్రం అందడం లేదని ఒక ప్రకటనలో హరీశ్‌రావు విమర్శించారు. ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. 30 నెలలు గడిచినా పీఆర్సీ, ఆరు డీఏలు, సీపీఎస్ రద్దు, హెల్త్ స్కీం అమలుపై ప్రభుత్వం ముందడుగు వేయలేదన్నారు. హెల్త్ కార్డులు జారీ చేసి, పథకం అమలు కాకముందే వసూలు చేసిన ప్రీమి యం మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని, లేదంటే బీఆర్ఎస్ ఉద్యమం చేపడుతుందని హరీశ్ హెచ్చరించారు. -
షాబాద్ హత్యలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
షాబాద్ నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ కేసు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. "సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకొని ఆరుహత్యల నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్టు కాకుండా కాపాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అండదండలతో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైమ్ ఇచ్చి కాపాడారు. ఈలోపు నిందితుడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని ఆరుగురిని హత్య చేశాడు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ స్పోక్స్‌పర్సన్ నాగార్జున యాదవ్ అనే నాయకుడు రేవంత్ రెడ్డిని పెయింట్ వేస్తారు అన్నందుకే ఆయనను అరెస్ట్ చేశారని, నల్లబాలు ట్విట్టర్లో ట్వీట్ చేస్తే పోలీసులు అతనిని జైలుకు తరలించారు. కానీ రేప్ చేసిన నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేయకుండా, అతడితో కూర్చొని పోలీసులు మందు తాగారు అని హరీశ్ రావు ఆరోపించారు.కాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఆ హంతకుడి కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. ఈ విషయంలో ఎటువంటి పుకార్లు నమ్మవద్దని ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని పోలీసులు ప్రకటించారు. -
టార్గెట్ హరీశ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయాలన్న డిమాండ్‌తో నాలుగైదు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య సాగుతున్న మాటల యుద్ధంలో భాగంగా మాజీమంత్రి హరీశ్‌రావు టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలు ఆదివారం విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం లోపలేపిస్తా: విప్ అద్దంకి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బరాజ్‌లు నేలమట్టమవుతాయని చెబుతుంటే హౌలేగాడిలా నీళ్లు ఎత్తిపోయాలని హరీశ్ మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి మ్యాప్ వేసి చూయించినా మ్యాడ్ ఫెలోకి అర్థం కావడం లేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనవాళ్లు కేసీఆర్ చెడగొట్టాడని, ప్రాణహిత చేవెళ్లకు కాళేశ్వరం పేరు పెట్టి కమీషన్లు దండుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకుతిన్న కల్వకుంట్ల కుటుంబానికి సిగ్గు, లజ్జ ఉంటే సప్త సముద్రాలు దాటిపోవాలని, లేదంటే తనకు ఒక గంట అధికారమిస్తే ఆ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తానని అద్దంకి వ్యాఖ్యానించారు. సైకోలా మారి రైతులను తప్పదోవ పట్టించే ప్రయత్నం: విప్ ఆది శ్రీనివాస్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీశ్‌రావు అబద్ధాల వరద పారిస్తున్నాడని, ఆయన చదివింది పాలిటెక్నిక్ అయినా పెద్ద ఇంజనీర్లా పోజులు కొడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ తెలంగాణకు గుండెకాయ అన్నారని, అది జారిపోయిందని, అసలు ఈ ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తే ప్రమాదమని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ సూచించిందని చెప్పారు. ఊర్లు కొట్టుకుపోయినా సరే రాజకీయాలే ముఖ్యమన్నట్టు బీఆర్ఎస్ నేతల తీరు ఉందని, హరీశ్‌రావు సైకోలా మారిపోయి రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రక్తం చిందించే ధైర్యం హరీశ్‌రావుకు లేదు: జగ్గారెడ్డి ‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు పెట్రోల్ తెచ్చుకొని అగ్గిపెట్టె మర్చిపోయిన హరీశ్‌రావు ఎంతో మంది యువకుల బలిదానాలకు కారణమయ్యాడు. హరీశ్‌రావుకు అంత ధైర్యం లేదు. ఆయన రక్తం చిందించమని అడిగినా చిందించడు. అసలు రక్తం చిందించే ధైర్యం హరీశ్‌రావుకు లేదు.’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టే మనస్తత్వం కేసీఆర్ కుటుంబానికి ఉందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఏదో ఒకటి అనాలి అనే లైన్లోనే హరీశ్‌రావు వెళుతున్నారు తప్ప ఆయనకు ప్రజలు, రైతులు అవసరం లేదని, కేవలం రాజకీయమే ముఖ్యమని చెప్పారు. ఆయనది కసబ్ క్యారెక్టర్ : మెట్టు సాయికుమార్ హరీశ్‌రావుది కసబ్ లాంటి మనస్తత్వమని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని దివాళా తీయించడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో హరీశ్‌రావు పాత్ర కూడా అంతే ఉందన్నారు. రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత చిల్లర మాటలు మాట్లాడే హరీశ్‌రావుకు లేదని చెప్పారు. -
నీళ్లు అడిగితే రక్తం కావాలా?
సాక్షి, హైదరాబాద్: రైతులు సాగునీరు అడిగితే రక్తం కావాలంటూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన నరహంతకుడికి పెద్దగా తేడా కనిపించడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలని, బెల్టుతో కొట్టాలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత జుగుప్సాకరమని మండిపడ్డారు. హిట్లర్‌ను ఆదర్శంగా చెప్పుకునే రేవంత్ అదే తరహా హంతక భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈగోతో కన్నెపల్లి, దేవాదుల మోటార్లను నిలిపివేసి రాష్ట్రాన్ని కరువు వైపు నెడుతోందన్నారు. తనను జైల్లో వేసినా, తన ప్రాణం పోయినా అభ్యంతరం లేదని, కానీ వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులను ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తడం లేదు గోదావరిలో ప్రస్తుతం లక్ష క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తున్నా ప్రభుత్వం కావాలనే నీటిని ఎత్తడం లేదని హరీశ్ ఆరోపించారు. మేడిగడ్డ గేట్లు మూయకుండానే కన్నెపల్లి మోటార్లు నడపొచ్చని, ఇదే విషయాన్ని నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులు కూడా ప్రభుత్వానికి స్పష్టం చేశారని తెలిపారు. కేవలం రూ.8.5 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎల్లంపల్లికి తరలించొచ్చని అధికారులు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం బయటపడుతుందనే భయంతోనే మోటార్లు ఆన్ చేయడం లేదని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు నీటిని ఎత్తకపోతే ఎన్టీపీసీ, సింగరేణి, హైదరాబాద్ తాగునీటి అవసరాలు దెబ్బతినడంతోపాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మేడిగడ్డపై నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ అధికారులే పోలవరం ప్రాజెక్టులో రూ.వేల కోట్ల నష్టానికి బాధ్యులని హరీశ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే వ్యవసాయ విప్లవం కాంగ్రెస్ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా, బీఆర్ఎస్ హయాంలో 48.74 లక్షల ఎకరాలకు నీరందించామని హరీశ్ పేర్కొన్నారు. దేవాదులలో పూర్తిస్థాయిలో మోటార్లు నడపకుండా, గోదావరి జలాలను కిందకు వదిలి పట్టిసీమకు మేలు చేస్తూ సీఎం తన రాజకీయ గురువు చంద్రబాబుకు గురుదక్షిణ ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ కక్షలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని, వెంటనే కన్నెపల్లి, దేవాదుల మోటార్లను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
రేవంత్.. ఏది మాట్లాడితే అది చెల్లుతుందా?: హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణభవన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట బూతులు, అబద్ధాల ప్రవాహం పారుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు సైకోలా ఉన్నాయి ముఖ్యమంత్రి లా లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పంట పొలాల్లో మా రక్తం పారిస్తా అని రేవంత్ మాట్లాడుతున్నాడు. హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని మండిపడ్డారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శాపనార్థాలు రైతులకు అవసరం లేదు. ముఖ్యమంత్రి భాష చూస్తే అబద్ధాలు, శాడిజం, బూతులు కనిపిస్తున్నాయి. కన్నెపల్లి పంపులను ఆన్ చేయమంటే మా రక్తం కావాలనుంటున్నాడు. మా గొంతు నొక్కుతున్నాడు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి రక్తం కావాలంటే ఇస్తాం. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. జైలు పంపుతామంటే ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త భయపడడు. మాకు కేసులు, అరెస్ట్‌లు కొత్త కాదు. రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. ప్రతి పక్షాలపై ఉన్న దృష్టి పంట పొలాలకి నీళ్లు ఇవ్వడంపై లేదు.కన్నెపల్లిపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రిని చూస్తే జాలేస్తుంది. విషయం లేకపోవడం వల్లే ఇలా బూతులు మాట్లాడుతున్నారు. అబద్దాలు, బూతుల విషయంలో మేము రేవంత్‌లో పోటీ పడలేం. ముఖ్యమంత్రికి ప్రాజెక్ట్‌లపై కనీస విషయ పరిజ్ఞానం లేదు. సీఎం రేవంత్ మాటలు చూస్తే ఓ శాడిస్ట్ మాట్లాడుతున్నాడా? అనిపిస్తోంది. మాట్లాడితే రిటైర్డ్ ఇంజనీర్లను జైలులో పెడతా అని బెదిరిస్తావ్. రిటైర్లు ఇంజనీర్లు కూడా నీళ్లు ఎత్తిపోయవచ్చనే చెబుతున్నారు. రైతులను, ప్రజలను కాపాడాలన్న తపన ముఖ్యమంత్రికి ఉండాలి. సీఎం రేవంత్ ఒక్కటైనా నిజం మాట్లాడుతున్నాడా?.రేవంత్ రెడ్డిలో సైకో కనిపిస్తున్నాడు. నిన్న ముఖ్యమంత్రిలా ఆయన మాట్లాడలేదు. రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడతున్నారు. ఆయనలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఏది మాట్లాడితే అది చెల్లుతుందా?. ఓటమి తప్పదు అనే భయంతో ఇలా బూతు భాష మాట్లాడుతున్నావ్. షాబాద్ ఘటనపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. షాబాద్‌లో ఘటన జరిగితే రాష్ట్ర పోలీస్ బాస్ గోల్ఫ్ ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి అలానే ఉన్నాడు.. ఆయన నియమించుకున్న పోలీస్ అధికారులు అలానే ఉన్నారు. షాబాద్ ఘటన నిందితులకు, సీఎం రేవంత్‌కు మధ్య తేడాఈ లేదు. హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
షాబాద్ హంతకుడికి... సీఎం రేవంత్‌కు తేడా లేదు
సాక్షి, సిద్దిపేట/సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు ముగ్గురు పసిపిల్లలతో సహా ఆరుగురిని కిరాతకంగా చంపేయడం ప్రభుత్వ, పోలీసుల వైఫల్యమేనని బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్’లోనూ కొన్ని వ్యాఖ్యలు పోస్ట్‌చేశారు. ‘రేవంత్‌కు షాబాద్ హంతకుడికి తేడా లేదు. రైతులు సాగునీరు అడిగితే ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలని మాట్లాడిన ముఖ్యమంత్రి వెంటనే ప్రజలకు, రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’అని తీవ్రస్థాయిలో విమర్శించారు.ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మరోసారి దారుణ హత్యాకాండకు పాల్పడ్డాడన్నారు. మే 16న మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే.. నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు.. నెల రోజులపాటు అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో.. అతను కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఈరోజు ఆ కుటుంబాన్నే అంతం చేశాడని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలు బయటపడినప్పుడల్లా ప్రజల దృష్టి మళ్లించేందుకు కాళేశ్వరం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని ఆరోపించారు. చిన్నారి పేరుపై కోటి డిపాజిట్ చేయాలి ‘రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది. పోలీస్ స్టేషన్లను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మార్చేశారు. షాబాద్ ఘటనలో ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండని బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఈ కిరాతక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో మిగిలిన దివ్యాంగ చిన్నారి పేరు మీద ప్రభుత్వం రూ.కోటి ఫిక్స్ డిపాజిట్ చేసి ఆ అమ్మాయిని పెంచే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి’అని హరీశ్‌రావు చెప్పారు. ఓదార్పు కోసం వెళ్లిన మాజీ హోంమంత్రి సబిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పద్మలను నేరస్తులుగా అరెస్ట్ చేశారని, అదే హత్య చేసిన నేరస్తున్ని పోలీసులు పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చేమోగానీ, ఎల్లకాలం మోసం చేయడం సాధ్యం కాదన్న అబ్రహం లింకన్ వ్యాఖ్యలు రేవంత్‌కు సరిగ్గా సరిపోతాయని హరీశ్ అన్నారు. రేవంత్ తెచ్చిన కృత్రిమ కరువు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాలం తెచ్చిన కరువు కాదని, సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధితో తెచ్చిన కృత్రిమ కరువు అని హరీశ్‌రావు ఆరోపించారు. గోదావరి నదిలో కావలసినన్ని నీళ్లున్నప్పటికీ, కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రభుత్వం కావాలనే ఆన్ చేయడం లేదని విమర్శించారు. పంట పొలాల్లో గోదావరి నీళ్లు పారేలా రేవంత్‌రెడ్డికి కలలో వచ్చి చెప్పాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించానని చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్లు, బీఆర్ఎస్ నాయకులు సాగునీటి కోసం సూచనలు చేస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ కక్షలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. తగిన సమయంలో రైతులు, ప్రజలే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హరీశ్‌రావు హెచ్చరించారు. -
సంగారెడ్డి వదిలేస్తా.. హరీష్‌పై పోటీ చేస్తా: జగ్గారెడ్డి ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు "సంగారెడ్డి నుంచి పోటీ చేయను.. అవసరమైతే రాజకీయాలకే దూరంగా ఉంటా" అని ప్రకటించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం మహిళా రిజర్వేషన్‌కు వెళ్తే తన భార్య నిర్మల జగ్గారెడ్డే కాంగ్రెస్ అభ్యర్థి అవుతారని ఉద్ఘాటించిన ఆయన.. తాను మాత్రం మరో చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ ట్విస్ట్ ఇచ్చారు. శనివారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన జగ్గారెడ్డి.. తాను సంగారెడ్డి నియోజకవర్గానికే పరిమితం కాదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయిస్తే అక్కడి నుంచే బరిలో దిగుతానని చెప్పారు. రాజకీయాల్లో ఎంత పెద్ద నాయకుడైనా పరిస్థితులకు, పార్టీ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. "ఎంత పెద్దపులి అయినా వేటగాడి వ్యూహంలో పడాల్సిందే.. ఓట్ల రాజకీయం కూడా అంతే. అందుకే నేను కూడా రెండు సార్లు ఓడిపోయా" అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో పార్టీ ఆదేశిస్తే సిద్దిపేటలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావుపై పోటీ చేయడానికీ వెనుకాడనని స్పష్టం చేశారు.ఇటు సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించారు. ప్రతి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని, అధికార పార్టీని బలహీనపరచడం రాజకీయాల్లో సహజమేనని అన్నారు. రాజకీయాల్లో కౌంటర్, ఎన్కౌంటర్ కామనేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ సొంత ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తుందని, అందుకే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారని చెప్పారు."ఎమ్మెల్యే పనితీరు బాగాలేకపోతే ఎంత తోపు నాయకుడైనా కాంగ్రెస్‌లో టికెట్ దక్కడం కష్టం. గతంలో ఎంతో బలమైన నాయకులుగా భావించిన వారు కూడా ఎన్నికల్లో మట్టికరిచారు" అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం హెచ్చరికలను ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని తమ లోపాలను సరిదిద్దుకోవాలని, లేకపోతే టిక్కెట్ల సమయంలో వారికే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు.అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సర్వేల ఆధారంగానే జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై అంచనా వేసే హక్కు సీఎంకే ఉంటుందని, తుది నిర్ణయాన్ని ఏఐసీసీ, రాష్ట్ర ఇన్చార్జి, సీఎం, పీసీసీ చీఫ్ కలిసి తీసుకుంటారని వెల్లడించారు.రాబోయే ఎన్నికలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, ఆ అంచనాతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి నుంచే 117కుపైగా స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం ముందుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని అభిప్రాయపడ్డారు.ప్రతిపక్షాల సర్వేలపై కూడా జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. "బీఆర్ఎస్కు అనుకూల వ్యక్తులతో సర్వే చేస్తే బీఆర్ఎస్కే అనుకూల ఫలితాలు వస్తాయి. తెలంగాణలో పెద్దగా బలం లేని బీజేపీ సర్వే చేయించినా బీజేపీకే అనుకూలంగానే ఉంటుంది" అని అన్నారు.మొత్తంగా.. ఒకప్పుడు సంగారెడ్డి నుంచి తప్పుకుంటానన్న జగ్గారెడ్డి.. ఇప్పుడు అదే నియోజకవర్గంలో తన భార్యను బరిలో దించేందుకు సిద్ధమని చెప్పడం, తాను అవసరమైతే హరీష్‌రావుపై కూడా పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. -
మాట తప్పుడు.. పార్టీలు మారడం నీ సంస్కృతి
సాక్షి, హైదరాబాద్: మాట తప్పడం..పార్టీలు మారడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ సంస్కృతి కావొచ్చని, తనది కాదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు అన్నారు. రేవంత్ 20 ఏళ్ల రాజకీయ చరిత్ర, తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానమే అందుకు నిదర్శనమన్నారు. రేవంత్‌లా ఒట్టు వేసి ఒకమాట, ఒట్టు వేయకుండా మరోమాట చెప్పే అలవాటు తనకు లేదని చెప్పారు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు.రాష్ట్రం సంగతి పక్కన పెడితే, ముఖ్యమంత్రి సభ నిర్వహించిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందా అని నిలదీశారు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దామంటూ, మరోవైపు ప్రతి సభలో అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా హరీశ్‌రావు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కన్నెపల్లి పంపులు ఎందుకు ఆన్ చేయడం లేదు? కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తు తం లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులను ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగంపై నమ్మక ద్రోహమేనని హరీశ్‌రావు ఆరోపించారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం కావాలనే వినియోగించడం లేదన్నా రు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని రిటైర్డ్ ఇంజనీర్లు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు.ఎల్లంపల్లి నుంచి సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, మిషన్ భగీరథ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పెద్దఎత్తున నీరు అవసరమవుతుందని, ఆ పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు హెచ్చరికలు వస్తున్న సమయంలో లభ్యమవుతున్న ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీశ్‌రావు తెలిపారు. ఏపీకి నీరు.. తెలంగాణకు నిర్లక్ష్యం తెలంగాణలో గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా, వాటిని వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలేయడం జలద్రోహమేనని హరీశ్‌రావు ఆరోపించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 24 మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తూ ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంటుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను ఆన్ చేయకపోవడం వెనుక చీకటి ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు.దేవాదుల ప్రాజెక్టులో పది మోటార్లు ఉండగా ఒకటి, రెండు మాత్రమే నడపడం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ తెలంగాణ రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కన్నెపల్లి పంపులను ప్రారంభించి ఎల్లంపల్లి, అన్నారం, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్తోపాటు ఇతర రిజర్వాయర్లను నింపాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. తెలంగాణలో భవిష్యత్‌లో తాగు, సాగునీటి సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హరీశ్‌రావు హెచ్చరించారు. -
నాకు 3 నెలలు ఇరిగేషన్ శాఖను అప్పగించు!
సాక్షి, హైదరాబాద్: ‘నీ సవాలుకు స్పందించడానికి కేసీఆర్ అవసరం లేదు.. నేను చాలు.. నాకు ఫ్యాను వద్దు, ఫ్యూను వద్దు, కారు, జీతం కూడా వద్దు. నాకు మూడు నెలలు ఇరిగేషన్ శాఖను అప్పగించి చూడు. మూడు నెలల్లో కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు తెచ్చి పారించి చూపిస్తా. ఒకవేళ చేయలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. నా సవాలుకు సిద్దమేనా..?’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. తెలంగాణ భవన్లో బుధవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రేవంత్, నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. అబద్ధాలకు నోబెల్ బహుమతి ఉంటే అది రేవంత్ రెడ్డికే వస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం గోదావరి జలాలను వృథాగా కిందికి వదిలేస్తోందని ఆరోపించారు. సమ్మక్క బ్యారేజి వద్ద లక్ష క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంటే దేవాదుల ద్వారా కేవలం 2,542 క్యూసెక్కుల నీటినే ఎత్తిపోస్తున్నారన్నారు. 71 మీటర్ల నీటిమట్టం వద్దే మోటార్లు నడిచే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే వాటిని ఆన్ చేయడం లేదని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 నుంచి 80 శాతం చెరువులు ఎండిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం రైతుల పట్ల ‘నేర పూరిత నిర్లక్ష్యం’కిందకు వస్తుందన్నారు. సమ్మక్క బరాజ్‌పై అసెంబ్లీలో చర్చ పెడితే తాను సిద్ధంగా ఉన్నట్లు హరీశ్ ప్రకటించారు. ఆధారాలు చూపకపోతే క్షమాపణ చెప్పాలి ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెబితే ఒక్క అధికారిక లేఖ చూపించినా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. సీడబ్ల్యూసీ స్వయంగా అక్కడ 160 టీఎంసీల నీటి లభ్యత లేదని, కేవలం 102 టీఎంసీలే ఉన్నాయని స్పష్టం చేసింది. తుమ్మిడిహెట్టికి కాంగ్రెస్ పాలనలో రూ.6 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్తూ సర్వేలు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో రూ.2,328 కోట్లు మెక్కారు. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహారాష్ట్రతో అనేకసార్లు చర్చించినా 152 మీటర్ల ఎత్తున బరాజ్ నిర్మాణానికి అనుమతి రాలేదు. మూడేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నిసార్లు మహారాష్ట్రతో చర్చించిందో చెప్పాలి. ఆధారాలు చూపించలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మేడిగడ్డ బ్యారేజికి పరిమితం చేసి చూపించడం రాజకీయ దురుద్దేశం మాత్రమే. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగాన్ని 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు, ఆయకట్టును 16 లక్షల ఎకరాల నుంచి 37 లక్షల ఎకరాలకు పెంచాం. నష్టపరిహారం పెరగడం, రిజర్వాయర్ల సామర్థ్యం పెరగడం వల్లే వ్యయం పెరిగిందని, దానిని అవినీతి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. కాళేశ్వరం లేకపోతే మూసీ పునరుజ్జీవానికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు’అని రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. పోలవరం నుంచి మేడిగడ్డ వరకు రాజకీయ కుట్ర ‘పోలవరం అథారిటీ సీఈఓగా ఉన్న సమయంలో పదిసార్లు డ్యామ్ కొట్టుకుపోయి రూ.7 వేల కోట్ల భారీ నష్టానికి కారణమైన వ్యక్తే ఎన్డీఎస్ఏ చైర్మన్‌గా మేడిగడ్డపై నివేదిక ఇచ్చాడు. పోలవరం పదేపదే దెబ్బతిన్నా అక్కడికి వెళ్లని ఎన్డీఎస్ఏ, ఎన్నికలకు ముందు మేడిగడ్డపై నివేదిక ఇవ్వడానికి రావడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కునకు నిదర్శనం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయి. కానీ కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలోనే సుంకిశాల గోడలు కూలడం, వట్టెం పంప్‌హౌస్ మునిగిపోవడం, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడం, చెక్‌డ్యాంలను పేలి్చవేయడం వంటి ఘటనలు జరిగాయి. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 7.5 టీఎంసీల నీరు వృథాగా పోతున్నా కన్నెపల్లి మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలి’అని హరీశ్‌రావు మండిపడ్డారు. -
సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌కు నీళ్లు ఇవ్వాలన్న నిజాయతీ లేదని.. అబద్ధాల ప్రవాహంలో ఆయన మునిగి తేలుతున్నాడంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాణహిత చేవేళ్ల పేరు మీదు రూ.2,300 కోట్లు దోచేశారని.. తుమ్మిడిహెట్టికి అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పారంటూ దుయ్యబట్టారు.‘‘నీళ్లుండి కూడా రైతులకు సాగునీరు ఇవ్వలేకపోతున్నారు. బేసిక నాలెడ్జ్ లేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సీఎంగా రేవంత్, మంత్రిగా ఉత్తమ్ ఫెయిల్ అయ్యారు. చెరువులు నింపే అవకాశం ఉన్న నింపడం లేదు. గోదావరి నీళ్లు వృథాగా పోతుంటే ఈ ప్రభుత్వానికి సోయి లేదు. అసత్యాలు చెప్పడంలో రేవంత్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలి. దేవాదులు నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమని అంటే ఎన్డీఎస్ఏ సాకు చెబుతున్నారు. నీళ్లుండి కూడా మోటార్లు ఆన్చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్’’ అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు.‘‘నీళ్లు లేని చోట ప్రాజెక్టులకు కాంగ్రెస్ రూపకల్పన చేసింది. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. తుమ్మిడిహెట్టి దగ్గర అనుమతి తెచ్చామని రేవంత్ అంటున్నారు. అనుమతి కాపీని సీఎం రేవంత్ బయటపెట్టాలి. అనుమతి డ్యాకుమెంట్‌ను చూపిస్తే నేను రాజీనామా చేస్తా. అనుమతి కాపీ లేకుంటే తప్పయిందని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. రాజకీయాల కోసమే అలా మాట్లాడానని రేవంత్ ఒప్పుకోవాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు. -
కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు)
-
రంకెలు వేస్తే అంకెలు మారవు
సాక్షి, హైదరాబాద్: అప్పుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రూ.8.21 లక్షల కోట్ల అప్పు అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక, రోజూ బయటపడుతున్న అవినీతి ఆరోపణలు, స్కామ్‌ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రోజుకో కొత్త అప్పుల లెక్క చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. మా మాట అసెంబ్లీలో ఒకటే.. బయట ఒకటే. మీరు మాత్రం శ్వేతపత్రంలో ఒకలా, అసెంబ్లీలో మరోలా, ప్రెస్మీట్లలో ఇంకోలా చెబుతున్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ శిష్యుడిగా చెప్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లే. దీనిపై అసెంబ్లీలోనైనా, బహిరంగ వేదికపైనైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం..’అని మరోసారి సవాల్ విసిరారు. రాష్ట్రానికి అప్పులు ఇప్పించేందుకు సచివాలయం చుట్టూ బాంబే, గుజరాత్ బ్రోకర్లు తిరుగుతున్నారని లంచాలు ఇచ్చి అప్పులు తెచ్చే దుస్థితి దేశంలో ఎక్కడా లేదని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన అప్పుల లెక్కలకు కౌంటర్ ఇచ్చారు. రేవంత్, భట్టి..ఎవరు చెప్పింది నిజం? ‘భట్టి విక్రమార్క వెల్లడించిన పత్రాల్లో.. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న రూ.84,268 కోట్ల రుణాలను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రూ.15,118 కోట్ల అప్పును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో కలిపేశారు. ఈ రెండూ కలిపి రూ.99,386 కోట్లను 2023 డిసెంబర్ నాటికి ఉన్న మొత్తం బకాయి రూ.5,16,881 కోట్ల నుంచి తీసేస్తే అసలు అప్పు రూ.4,17,495 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం, కాగ్ నివేదిక, ఆర్బీఐ గణాంకాలు, ఎకనామిక్ సర్వే అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లేనని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్లు మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాత్రం రూ.1.77 లక్షల కోట్లే అని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది నిజమా? లేక ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పింది నిజమా? నాలుగు నెలల్లో అప్పు ఎలా తగ్గింది?..’అని హరీశ్‌రావు నిలదీశారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. అప్పుల కోసం రూ.వందల కోట్ల కమీషన్లు ‘ప్రస్తుత ప్రభుత్వం అప్పులు కూడా పారదర్శకంగా తీసుకురాలేక బ్రోకర్లకు వందల కోట్ల రూపాయల కమీషన్లు చెల్లిస్తోంది. టీజీఐఐసీ భూముల తాకట్టు ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు కోసం రూ.170 కోట్ల బ్రోకరేజ్ చెల్లించారు. హెచ్ఎండీఏ భూములపై మరో రూ.20 వేల కోట్ల అప్పు తెస్తే మొత్తం రూ.510 కోట్ల వరకు బ్రోకర్లకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. డిస్కంలు, హైదరాబాద్ కార్పొరేషన్లు, వాటర్ బోర్డు ద్వారా మరో రూ.70 వేల కోట్ల అప్పు సమీకరించే లక్ష్యంతో మొత్తం లక్ష కోట్ల అప్పులకు రూ.1,710 కోట్ల వరకు కమీషన్లు వెళ్తున్నాయి..’అని హరీశ్‌రావు ఆరోపించారు. -
ఆగని అప్పుల రగడ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేసిన అప్పులపై చెలరేగిన వివాదం మూడో రోజు కూడా కొనసాగింది. తొలిరోజు.. కేటీఆర్ చేసిన బహిరంగ చర్చ సవాల్‌తో రభస ప్రారంభం కాగా, రెండో రోజు గురువారం గన్‌పార్క్, తెలంగాణ భవన్ వేదిక గా రచ్చరచ్చ అయ్యింది. మంత్రివర్గ భేటీలోనూ చర్చనీయాంశమైంది. ఇక శుక్రవారం అప్పులపై అధికార పక్షం, విపక్షం లేఖాస్ర్తాలు సంధించుకున్నాయి. తాను చెప్పిన అప్పు లెక్కలకు కట్టుబడి ఉన్నానంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు లేఖలు రాశారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావుకు లేఖలు రాసిన ఆయన.. తాను చెప్పిన అప్పు లెక్కలు తప్పని కేసీఆర్‌తో చెప్పించినా, నిరూ పించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.దీనిపై చర్చించేందుకు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తున్నానని, బీఆర్ఎస్ నేతలు కూడా రావాలని సవాల్ చేశారు. చెప్పినట్లే సాయంత్రం ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. బీఆర్ఎస్ నేతలు రాకపోవడంతో వారిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా మంత్రి జూపల్లి లేఖలపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు.. తాను కూడా ఆయనకు ఒక లేఖ రాశారు.కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పుల గణాంకాలతో పాటు, బీఆర్ఎస్ చేసిన అప్పుల లెక్కలను అందులో వివరించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి, తాను అప్పుల గురించి మాట్లాడిన వీడియోలను వాట్సాప్ ద్వారా మంత్రి జూపల్లికి పంపారు. ఇవి చూసిన తర్వాతైనా రాజీనామా చేయాలన్నారు. మరోవైపు సంగారెడ్డిలోనూ మాట్లాడుతూ..జూపల్లిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం భట్టి కూడా శుక్రవారం.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ హ యాంలో చేసిన అప్పులు, చెల్లింపులపై గణాంకాలు వెల్లడించారు. -
‘నా మాటకు నేను కట్టుబడి ఉన్నా..నిరూపిస్తా’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌ల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని, అది నిరూపిస్తానన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 3వ తేదీ) సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్‌ల కోసం మూడు కుర్చీలు వేశామని, కానీ వారు రాలేదన్నారు. దీనిలో భాగంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ‘ పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా.. నిరూపిస్తా. దమ్ముంటే కాదని నిరూపించండి. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు మీరు చేసిందా కాదా?, మిషన్ భగీరథ కార్పొరేషన్ అప్పు మీరు చేసింది కాదా?, మా ప్రభుత్వం చేసిన అప్పు గురించి నేను చాలెంజ్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత అప్పులకు వడ్డీ కింది రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా కట్టాం’ అని పేర్కొన్నారు.ఇక హరీష్ రావు రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ.. అందులో ఏమీ లేదని విమర్శించారు. ‘ నేను లేఖలో ప్రస్తావించిన వాటికి హరీష్ నుంచి సమాధానం రాలేదు. అసలు మీరు ఎందుకు ప్రెస్‌క్లబ్‌కు రాలేదో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ముఖం చాటేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సవాల్ విసిరిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు పోలీసులను అడ్డు పెట్టుకుని ముఖం చాటేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరి, చర్చకు రాకుండా తోక ముడిచి పారిపోయారన్నారు. అప్పులపై పూటకో లెక్క చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గురువారం గన్‌పార్క్ వద్దకు బయలుదేరిన హరీశ్‌ను అడ్డుకుని పోలీసులు కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, విడుదల అనంతరం తెలంగాణ భవ¯న్కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణకు భవన్‌కు మంత్రులు రాకుండా ముఖం చాటేయడంతో గన్‌పార్కుకు వెళ్లే క్రమంలో పోలీసులు నన్ను అడ్డుకున్నారు. సవాలు విసిరి మాట నిలుపుకోలేక పోయిన మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే రాజీనామా చేయాలి. అప్పులపై అసెంబ్లీ వేదికగా వాస్తవ లెక్కలు చెప్పినా ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో తప్పుదోవ పట్టిస్తోంది’అని హరీశ్‌రావు విమర్శించారు. భారీగా కమీషన్లు దండుకున్నారు.. ‘గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన కిరాణా, యూనిఫాంలు, నోట్‌బుక్స్, ఇతర కొనుగోళ్ల టెండర్లలో దాదాపు రూ.2 వేల కోట్ల మేర అవకతవకలు జరిగాయి. కిరాణా సరుకులు, వంటనూనెలను అధిక ధరలకు కొనుగోలు చేసి కమీషన్లు దండుకున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కలి్పంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచి్చన జీవోలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించింది. స్థాని కంగా ఇవ్వాల్సిన ఆర్డర్లను గుజరాత్‌కు చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. చేనేతల ప్రయోజనాలను కాపాడాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. లిడ్‌క్యాప్ ద్వారా జరగాల్సిన కొనుగోళ్లను నిలిపివేసి దళిత సంస్థలకు అన్యాయం చేశారు. నోట్‌బుక్స్ టెండర్లలో కమీషన్ల కోసమే నిబంధనలు మార్చారు. వివాదం బయటపడిన తర్వాత టెండర్లను రద్దు చేయడంతో ఇప్పటికీ విద్యార్థులకు నోట్‌బుక్స్ అందలేదు..’అని హరీశ్‌రా>వు ధ్వజమెత్తారు. ప్రవీణ్‌కుమార్‌పై కక్షసాధింపు ‘గురుకుల టెండర్ల అక్రమాలను ఆధారాలతో ప్రశ్నిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. ఆయన భద్రతను తగ్గించడంతో పాటు, ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్న ఆయన భార్యను ఆకస్మికంగా అప్రధాన ప్రాంతానికి బదిలీ చేశారు..’అని హరీశ్‌రావు మండిపడ్డారు. కమీషన్ల కుట్ర: ప్రవీణ్‌కుమార్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీలను రద్దు చేసి జీవో–17 ద్వారా సింగిల్ విండో విధానం తీసుకురావడం వెనుక కమీషన్ల కుట్ర జరిగింది. హైకోర్టును తప్పుదోవ పట్టించి కొద్ది కంపెనీలకే టెండర్లు కట్టబెట్టారు. స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంస్థలకు అవకాశాలు లేకుండా చేశారు. జీవో–17ను వెంటనే రద్దు చేసి, గురుకుల టెండర్లపై సమగ్ర విచారణ జరపాలి..’అని డిమాండ్ చేశారు. -
చర్చ.. రచ్చ!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల సవాళ్లు, ప్రతిసవాళ్లతో గురువారం రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు, బీఆర్ఎస్ హయాంలో అప్పుల విమర్శలు ఇందుకు కారణమయ్యాయి. ఆయా అంశాలపై చర్చకు సిద్ధమన్న ఇరుపక్షాలు ఎలాంటి చర్చలూ జరగకుండానే గన్‌పార్క్, తెలంగాణ భవన్ వేదికగా పరిస్థితిని రచ్చరచ్చగా మార్చాయి. ముగ్గురు మంత్రులు గన్‌పార్క్ వద్దకు చేరుకుని మరోసారి విపక్షానికి సవాల్ విసరగా, గన్‌పార్క్ వద్ద చర్చకు సై అన్న విపక్ష నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద మాట్లాడిన మంత్రులు, తెలంగాణ భవన్లో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. రెండు రోజులుగా మాటల యుద్ధం అవినీతి, అప్పులపై ఉభయ పార్టీల మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి సై అంటూనే అప్పులకు సంబంధించిన తప్పుడు లెక్కలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ స్పందించారు. మరోవైపు గురుకులాల్లో విద్యార్థులకు సరఫరా చేసే యూనిఫాం, విద్యా కిట్లలో రూ.2 వేల కోట్ల భారీ అవినీతి జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీశ్‌రావు, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ చేయగా, తాము సిద్ధమేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలోనే గురువారం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్కు వద్దకు వచ్చారు. బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ లేదా హరీశ్‌రావు తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనిపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. గన్‌పార్క్ వద్ద జూపల్లి, అడ్లూరి, అజహర్, పొన్నం కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు హరీశ్ తరలింపు మంత్రులతో గన్‌పార్కు వద్ద చర్చకు తాను సిద్ధమంటూ హరీశ్‌రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. అయితే ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఆయన్ను అక్కడే అడ్డుకున్నారు. కానీ తాను వెళ్లి తీరతానంటూ హరీశ్ పట్టుపట్టడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ భవన్‌లోనే కేటీఆర్ బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అప్పులపై తనతో చర్చించేందుకు రావాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సవాల్ చేసిన కేటీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు వచ్చారు. అయితే తెలంగాణ భవన్‌కు వస్తానన్న జూపల్లి రాకపోగా.. గన్‌పార్క్‌కు రావాలంటూ సవాల్ చేయడంతో.. కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్ వెళ్లడానికి బయలుదేరారు. కానీ ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో..మీ మంత్రులు పారిపోయామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, తాను గన్‌పార్క్‌కు వెళ్తానని అన్నా సరే ఆయన తెలంగాణ భవన్ దాటి రాకుండా పోలీసులు నిలువరించారు. అప్పుల గణాంకాలు వెల్లడించిన జూపల్లి గాందీభవన్‌లో జరిగిన ప్రజలతో ముఖాముఖి అనంతరం నేరుగా గన్‌పార్క్‌కు చేరుకున్న మంత్రి జూపల్లి 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు, 2023లో బీఆర్ఎస్ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను గణాంకాలతో సహా వివరించారు. తాను చెప్పిన గణాంకాలు తప్పని కేసీఆర్‌తో చెప్పిస్తే తాను చెప్పిన కట్టుబడి రాజీనామా చేస్తానని మరోమారు కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మళ్లీ తెలంగాణ భవన్‌కు హరీశ్ ఉదయం పోలీసులు అదుపులో తీసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ నుంచి నేరుగా మళ్లీ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అయితే చివరకు రెండు పార్టీల నేతలు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అవినీతి, అప్పులపై చర్చించాలని పట్టుపట్టడం గమనార్హం. ఇలావుండగా మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని, డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. -
కాంగ్రెస్ హయాంలో కుంభకోణాల ఖని
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్: రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో సింగరేణిని కుంభకోణాల ఖనిగా మార్చారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పరిధి ఎంఎన్ఆర్ గార్డెన్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై రెండు గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చాక ఓబీ టెండర్లలో సైట్ విజిట్ విధానంతో గతంలో మైనస్‌లో వెళ్లే కాంట్రాక్టులు 13 శాతం అధికంతో సీఎం బామ్మర్ది సృజన్‌రెడ్డి శోధ కన్సస్ట్రక్షన్‌కు కాంట్రాక్టు దక్కిందన్నారు. నైనీ బ్లాక్ టెండర్‌ను రద్దు చేసిన డిప్యూటీ సీఎం, వీటిని ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. ‘నిజం కాకపోతే రాజీనామా’ ఆరు నెలలుగా ఇవన్నీ అడుగుతున్నా డిప్యూటీ సీఎం, సీఎం నోరు విప్పడం లేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. తాను చెప్పేవి నిజం కాకపోతే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. సౌర విద్యుత్‌కు ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ ఒక మెగావాట్‌కు రూ.3 కోట్లు వెచ్చిస్తుంటే, సింగరేణి మాత్రం 67 మెగావాట్లలో ఒక మెగావాట్‌కు రూ.7 కోట్ల చొప్పున, మరో 107 మెగావాట్లలో రూ.5 కోట్ల చొప్పున అదనంగా రూ.500 కోట్లు కమీషన్ల కోసం చెల్లించారని విమర్శించారు. జైపూర్ పవర్ ప్లాంట్‌కు కేబినెట్ ఆమోదం, డీపీఆర్ లేకున్నా టెండర్లు పిలిచి అడ్వాన్సులకు కమీషన్ల కోసం పవర్ మేక్ సంస్థకు సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేశారన్నారు. లేని బొగ్గు ఉన్నట్టు చూపిస్తూ.. కంపెనీ 40 లక్షల టన్నుల బొగ్గుపై ఆదాయ పన్ను, డివిడెంట్లు, సీఎస్సార్, డీఎంఎఫ్టీ, కోల్ సెస్సుల కింద రూ.1600 కోట్లు కట్టారని హరీశ్‌రావు మండిపడ్డారు. అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి లేకున్నా, 1.81లక్షల టన్నులు, మందమర్రిలో 5.68లక్షల మెట్రిక్ బొగ్గు ఉన్నట్లు, శ్రీరాంపూర్‌లో 4.64లక్షల టన్నులు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. సదస్సు కంటే ముందు హరీశ్‌రావు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కోల్‌మైన్ ఆఫీసర్స్ పీఆచ్చి, పీఆర్సీ అమలుపై చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సదస్సుకు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, పుట్ట మధు తదితరులు హాజరయ్యారు. -
మిస్టర్ రేవంత్.. రోజులు లెక్కపెట్టుకో
సిద్దిపేటజోన్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ అంటే భయం పట్టుకుంది. నిద్రలో కూడా వణుకు మొదలైంది. ఆయన చెప్పకనే చెబుతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. ఆయన తప్పులు చేశారు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని అర్థమైంది. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మిస్టర్ రేవంత్‌రెడ్డి.. రోజులు లెక్కపెట్టుకో..ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’అని మాజీమంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. నల్లగొండ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆదివారం సిద్దిపేటజిల్లా కేంద్రంలో బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో హరీశ్‌రావు స్పందించారు. కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశ మతలబు గురించి అడిగితే దానికి బదులు ఇవ్వకుండా, సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ సభలో నా పొడవు, ఎత్తు గురించి మాట్లాడి తప్పించుకోవాలని చూస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులు ముంచి ముంపుమేస్త్రీగా మారొద్దని ప్రశ్నిస్తే బదులు లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మనస్సు, ఆలోచన, బుద్ధి అంతా పొట్టిదేనని ఎద్దేవా చేశారు. 2034 వరకు అధికారంలోనే ఉంటామని మాట్లాడిన రేవంత్‌రెడ్డికి నిజంగా నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేయాలని, ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ విసిరారు. లేకుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల్లోకి పోదామని, దమ్మూధైర్యం ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. రైతుభరోసా ద్వారా రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నా అని అంటున్న సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రైతు భరోసా, రైతుబీమాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రైతుల కళ్లల్లో కన్నీళ్లు వచ్చేలా చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ముందు తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో 12 మీటర్లు కూడా తవ్వలేదని, అన్యాయంగా ఎనిమిది మంది అమాయక కార్మికులు చనిపోతే వారి శవాలను కూడా తీయలేని అసమర్థ ప్రభుత్వం అని విమర్శించారు. సింగరేణి అవినీతి బహిర్గతం చేస్తే అసలు టెండర్లు కాలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సృజన్‌రెడ్డికి టెండర్లు దక్కింది రుజువు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం కూలింది అని ఆరోపణలు చేసిన సీఎం ఇప్పుడు హైదరాబాద్ తాగునీరు, మూసీకి ఎక్కడి నీళ్లు తరలిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రపై సీఎం వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమ సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు వెళ్తూ తుపాకీ గురి పెట్టిన రేవంత్‌రెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందేనన్నారు. తెలంగాణ ఉద్యమం, త్యాగం గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారని చెప్పారు. -
రేవంత్ ఫెయిల్యూర్ సీఎం
సాక్షి,సిద్ధిపేట: సీఎం రేవంత్‌రెడ్డి గుప్పు మేస్త్రీ కాదు.. ముంపు మేస్త్రీ అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్ధపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దద్దమ్మ ముఖ్యమంత్రి, ఫెయిల్యూర్ సీఎం రేవంత్.రైతు బంధ మీద శాసన సభలో చర్చకు రేవంత్‌రెడ్డి సిద్ధమా?. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మా ప్రభుత్వంలో 92 లక్షల మెట్రిక్ టన్నున ధాన్యం కొన్నాం. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని రేవంత్ చెప్పుకోవడం విచిత్రం.ఈ రోజు ప్రతి రైతు కేసీఆర్‌ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలచుకుంటున్నారు.బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ టన్నెల్స్‌ను 12 కిలోమీటర్లు తవ్వింది. ఎస్ల్బీసీలో కార్మికులు చనిపోతే శవాలను కూడా బయటకు తీయలేకపోయారని విమర్శించారు. -
చంద్రబాబుకు గురుదక్షిణగా మన నీటి హక్కులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి హక్కు లను తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడికి గురుదక్షిణగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకుండా తెలంగాణ ప్రయోజనాలను బలి పెడుతూ ‘ముంపు మేస్త్రీ’లా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి, రాష్ట్ర భవిష్యత్‌ను కేంద్రం చేతుల్లో పెట్టే చీకటి ఒప్పందం జరిగిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం 35 టీఎంసీల నవేలి రిజర్వాయర్‌తోపాటు 9.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు బరాజ్‌లు, ఏపీ ప్రభుత్వం 20 టీఎంసీల గుండ్రేవుల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా సీఎం రేవంత్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల మొత్తం 55 టీఎంసీల నీరు నిల్వ అవుతుందని, శ్రీశైలానికి ప్రవాహం తగ్గి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతోపాటు ఆర్డీఎస్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. రహస్య ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి ముఖ్యమంత్రుల సమావేశంలో మంత్రి ఉత్తమ్, రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులను బయటే ఉంచి కేవలం ముగ్గురు సీఎంలు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి మాత్రమే పాల్గొనడం అనుమానాలకు తావిస్తోందని హరీశ్‌రావు అన్నారు. ఆ సమావేశంలో జరిగిన చర్చలు, కుదిరిన ఒప్పందాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్కు ట్రిబ్యునల్ ప్రకారం రావాల్సిన 15.9 టీఎంసీల వాటా, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి అవసరమైన నీటి భద్రత, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భవిష్యత్‌పై సమావేశంలో ఎలాంటి హామీ సాధించారో సీఎం వెల్లడించాలన్నారు. నదీ జలాలపై సరైన అవగాహన లేకపోవడంతోనే ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమవుతోందని విమర్శించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న చర్యల వల్ల చివరకు నష్టపోయేది తెలంగాణేనని, అయినా ప్రభుత్వం నిరసన వ్యక్తం చేయకపోవడం విచారకరమని చెప్పారు. సమ్మక్క సాగర్‌ను బలి చేయొద్దు గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నికర జలహక్కులను పూర్తిగా సాధించకుండా నదుల అనుసంధానం పేరుతో ఏపీకి అనుకూలంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 830 టీఎంసీలకు అనుమతులు సాధించగా, మిగిలిన 138 టీఎంసీల కోసం సమ్మక్క సాగర్, వాద్ర, ఎల్లంపల్లి ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సమ్మక్క సాగర్ ప్రతిపాదనలు వెనక్కి వచ్చాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల పేరుతో సమ్మక్క సాగర్‌ను బలిపెడుతున్నారన్న వార్తలపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పు ముందు తెలంగాణ హక్కులను బలంగా వినిపించాల్సిన సమయంలో ప్రభుత్వం మౌనం పాటిస్తోందన్నారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని, మూడు రాష్ట్రాల సమావేశంలో చర్చించిన అంశాలను శాసనసభలో పెట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్కనీరు తగ్గినా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
తెలంగాణకు రేవంత్ అన్యాయం: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సీక్రెట్ సమావేశమేంటో బయటపెట్టాలంటూ మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చారిత్రక ఒప్పందం అంటున్న రేవంత్.. ఆ ఒప్పందం ఏమిటో స్పష్టత ఇవ్వాలన్నారు.‘‘కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్లిన గుండ్రేవుల ప్రాజెక్ట్ నేడు తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రుల సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అధికారులను బయట కూర్చోబెట్టారు. నీటి వాటాల పంపకంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఇకపై ఊరుకునేదిలేదు..కర్ణాటక ప్రతిపాదించిన నవేలితో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని గుండ్రేవుల ప్రాజెక్ట్ (20 టీఎంసీలు)ల వల్ల దిగువన ఉన్న తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డి తన అవగాహన రాహిత్యంతో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడంతో పాటు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు’’ అంటూ హరీష్‌రావు మండిపడ్డారు. -
రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ప్రశ్నల వర్షం
హైదరాబాద్: కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ల భర్తీని సంబరంగా జరుపుకోవడాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పక్కనపెట్టాలని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాకు సంబంధించిన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.‘‘ఆర్డీఎస్ నీటి కేటాయింపులపై స్పష్టమైన హామీలు సాధించారా? ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న ఆర్డీఎస్ స్లూయిస్‌లను శాశ్వతంగా మూసివేయడానికి, అలాగే ఆర్డీఎస్ ఆనకట్ట మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నారా? కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ కాల్వ తక్షణ మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ లభించిందా?ఆర్డీఎస్ కింద తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణకు 15.90 టీఎంసీల నీరు ఎలా వస్తుంది? ప్రస్తుతం ఉన్న గేట్లు దాదాపు 75 ఏళ్లుగా పనిచేస్తున్నాయి..ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు ఎప్పుడూ 5 టీఎంసీలకు మించి నీరు అందలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన సిస్టమ్ లాసెస్ అనే భావనను రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించారు?బచావత్ ట్రైబ్యునల్ KWDT-I అవార్డులో సిస్టమ్ లాసెస్అనే భావనకు ఎలాంటి గుర్తింపు, అనుమతి గానీ లేదు.. ఆంధ్రప్రదేశ్ అదనపు నీటి వినియోగాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారా? కేసీ కెనాల్, సుంకేసుల వద్ద ఆంధ్రప్రదేశ్ నిరంతరం దాదాపు 39 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. కేసీ కెనాల్‌కు చెందాల్సిన దాదాపు 10 టీఎంసీల నదీ జలాలను కర్ణాటకతో కుదుర్చుకున్న అవగాహన ద్వారా ఆర్‌బీహెచ్‌ఎల్‌సీ RBHLCలకు మళ్లిస్తున్నారు.ఇది తెలంగాణకు జరుగుతున్న ఘోర అన్యాయం కాదా? ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి లేవనెత్తారా? తెలంగాణ నీటి హక్కులకు ముప్పుగా మారిన ప్రతిపాదిత ప్రాజెక్టులను వ్యతిరేకించారా? తుంగభద్ర డ్యామ్, ఆర్డీఎస్ మధ్య దాదాపు 35 టీఎంసీల సామర్థ్యంతో కర్ణాటక నిర్మించ తలపెట్టిన నవేలి రిజర్వాయర్.. ఆర్డీఎస్, సుంకేసుల మధ్య దాదాపు 20 టీఎంసీల సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనుకుంటున్న గుండ్రేవుల ప్రాజెక్టు.. రెండూ తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల వాటాను తీవ్రంగా దెబ్బతీసేవే.తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల న్యాయమైన వాటాను ఆయన సాధించారా? పెండింగ్‌లో ఉన్న ఆర్డీఎస్ సమస్యలను పరిష్కరించారా? ప్రధాన సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కానప్పుడు, ఈ సంబరాలన్నీ కేవలం రాజకీయ ప్రచారం కోసమే తప్ప మరొకటి కాదు’’ అని ఎక్స్‌లో హరీశ్ రావు పోస్ట్ చేశారు.Instead of celebrating the replacement of Tungabhadra gates at Karnataka, Chief Minister @revanth_anumula must answer the following fundamental questions concerning Telangana's rightful share of Krishna waters:Did Revanth Reddy secure concrete assurances on the real issues…— Harish Rao Thanneeru (@BRSHarish) June 25, 2026 -
తెలంగాణ హక్కులు తాకట్టు పెట్టే కుట్ర
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా నీటిపారుదల ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బుధవారం లేఖ రాశారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోంది.నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందిస్తోంది. మరోవైపు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహ బుద్దితో సీఎం వ్యవహరిస్తూ పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తెస్తున్నామనే సాకుతో తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారు.తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (2 టీఎంసీలు), చిక్కాలపర్వి (2.5 టీఎంసీలు), చిక్కాలమంచి (5 టీఎంసీలు) బ్రిడ్జ్–కమ్–బరాజ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? 2025 జూలై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్వోసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏంటి? ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా? తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆర్డీఎస్ నిర్వీర్వంపై ఆందోళన‘కేటాయించిన నీటి కంటే ఇప్పటికే ఎక్కువగా వినియోగిస్తున్న కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు కూడా పూర్తయితే రాజోళిబండ డైవర్షన్ స్కీమ్ పూర్తిగా నిర్వీర్యమవుతుంది. చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా నారాయణ పేట, కొడంగల్‌కు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా దాన్ని పక్కనబెట్టారు. కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీశారు. 16.94 టీఎంసీల కేటాయింపులో 7 టీఎంసీలను కొడంగల్ లిఫ్టుకు మళ్లించి రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించే భీమా ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు.కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ప్రభావం కేవలం ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులకే పరిమితం కాదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయి’ అని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్నారు. -
ట్రాన్స్ఫర్ నుంచి టెండర్ దాకా స్కామ్‌లే
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫర్లు మొదలు టెండర్ల వరకు అన్నింటా స్కాములే జరుగు తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా దాదాపు 30 ఏళ్ల తర్వా త సింగరేణి నష్టాలబాటలో నడుస్తోందని చెప్పారు. సింగరేణిలో కాంగ్రెస్ హయాంలో అన్ని విషయాల్లో స్కామ్‌లు జరుగుతున్నా యని, కమీషన్ల కోసం ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని దుయ్య బట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీశ్‌రావు పలు అంశాలపై మాట్లాడారు.తప్పు చేస్తే చట్టపరమైన చర్యలుసింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల లేని బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపుతూ ఆ మేరకు సెస్, ట్యాక్సులు, సీఎస్సార్, డీఎంఎఫ్టీ తదితర పన్నులు కట్టారని.. కానీ క్షేత్రస్థాయిలో అసలు బొగ్గును తవ్వి తీయలేదన్నారు. బొగ్గు నిల్వలు చూపించాలని తాము గనుల దగ్గరికి వెళ్తే అనుమతి ఇవ్వట్లేదని.. అదే సమయంలో పనికిరాని షెల్ బొగ్గును మట్టికుప్పలపై పోస్తూ అదే అసలైన బొగ్గుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.తాము అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై విచారణ చేపట్టి తప్పుడు వివరాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు హెచ్చరించారు. రెండేళ్ల క్రితమే ఉత్పత్తి నిలిచిపోయిన అడ్రియాల గనిలో 1.69 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని పేర్కొనడం కాంగ్రెస్ సర్కార్ అవినీతి పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.సీఎం బావమరిదికే లాభంఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు పనుల్లో కమీషన్లు దండుకోవడం కోసమే సైట్ విజిట్ విధానం అమల్లోకి తెచ్చారని హరీశ్‌రావు ఆరోపించారు. సైట్ విజిట్ తెచ్చిన తర్వాత ప్రతిసారీ ఎక్సెస్‌కే టెండర్లు వెళ్తున్నాయని.. ఇలా ఎక్స్స్ టెండర్ దక్కించుకున్న తొలి కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ ఓనర్ సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సైట్ విజిట్ నిబంధన అమల్లోకి వచ్చాక ఎక్సెస్ టెండర్ల వల్ల సింగరేణిపై రూ. 1,000 కోట్లకుపైగా అదనపు భారం పడిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి వివిధ బ్యాంకుల్లో సింగరేణికి రూ.3,200 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవని.. ప్రస్తుతం రూ. 4,300 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ)కి సింగరేణి వెళ్లిందని వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ, వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు, రవిచంద్ర, ఎమ్మెల్సీలు టి.రవీందర్రావు, తాతా మధు తదితరులు పాల్గొన్నారు. -
దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది
సాక్షి, హైదరాబాద్: పంట బోనస్‌కు కోతలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుంచి కూడా తప్పుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. డిజిటల్ కేబినెట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇకపై కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడం అంటే రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల నుంచి చేతులెత్తేసినట్టేనని పేర్కొన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే వారు ఏం చేయాలన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్‌రావు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పంట బోనస్ విషయంలో కూడా ప్రభుత్వం రైతులపై కొత్త షరతులు విధిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. కేవలం ఏడు రకాల సన్న ధాన్యాలకు మాత్రమే బోనస్ వర్తింపజేయడం ద్వారా సాగుపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడమేనన్నారు.కేసీఆర్ రైతన్నను రాజుగా నిలబెట్టారని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతును ఆర్థికంగా దెబ్బతీసే విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. ప్రాజెక్టుల్లో నీటి కొరత ఉందని చెబుతూనే ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీల నీటిని ఎందుకు వదిలారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా చెల్లింపుల విషయంలో బహిరంగ సభలు నిర్వహించడం హాస్యాస్పదమని, గతంలో పెండింగ్‌లో ఉన్న మూడు విడతలతోపాటు ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులు కలిపి మొత్తం రూ.16,545 కోట్లను ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. -
ఆధారాలు చూపిస్తే.. రాజీనామా చేస్తా
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్లపై మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చెప్పారు. ఆధారాలతో నిరూపిస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలోనే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ముగ్గురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారి సమీక్ష నిర్వహించిన అనంతరమే కొనుగోలు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. అడ్లూరి మంగళవారం సీఎల్పి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఒకే అంశంపై బీఆర్ఎస్ నాయకు లు మూడు రకాల అంకెలు చెబుతున్నారన్నారు. హరీశ్‌రావు రూ.2,000 కోట్ల కుంభకోణమంటే, ప్రవీణ్ కుమార్ రూ. 3,000 కోట్లు అంటున్నారని, వారి అనుబంధ మీడియా సంస్థలు రూ.200 కోట్ల వ్యవహారమని ప్రచారం చేస్తున్నాయన్నా రు. ఇందులో ఏది నిజమో బీఆర్ఎస్ స్పష్టత ఇవ్వాలన్నారు. హైకోర్టు కూడా టెండర్ విధానాన్ని సమరి్థంచింది టెండర్లన్నీ ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా, సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించామని అడ్లూరి చెప్పారు. హైకోర్టు కూడా ఈ విధానాన్ని సమర్థించిందన్నారు. యూనిఫాం వస్త్రం, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, ట్రంక్ బాక్సులు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెడ్డింగ్ మెటీరియల్, నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్లు, ట్రాక్ సూట్లు, టైలు, బెల్టులు, ఐడీ కార్డ్ హోల్డర్లు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా బెడ్ïÙట్ ధర రూ.425 నుంచి రూ.405కు, కార్పెట్ ధర రూ.412, టవల్ ధర కూడా తగ్గిందన్నారు. బెడ్షీట్లు 3 లక్షలు, కార్పెట్లు 2.29 లక్షలు, బ్లాంకెట్లు 6.49 లక్షలు, టవల్స్ 1,500 కొనుగోలు విలువ రూ.70.86 కోట్లు అని చెప్పారు. ట్రంక్ బాక్సులకు ఐదు కంపెనీలు దరఖాస్తు చేశాయని, పోటీ ప్రక్రియలో ధరలను చర్చల ద్వారా తగ్గించామన్నారు. రూ.1,299 నుంచి రూ.1,275గా నిర్ణయించామని చెప్పారు. దీని మొత్తం విలువ రూ.41.40 కోట్లు అని వెల్లడించారు. యూనిఫాం వస్త్రం టెండర్లలో మూడు సంస్థలు పాల్గొన్నాయని, వర్క్ ఆర్డర్ విలువ రూ.298.10 కోట్లు అని అన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థ టీజీఎస్‌సీవోలకు 60 లక్షల మీటర్ల వస్త్ర సరఫరా బాధ్యత అప్పగించామని తెలిపారు. దీని విలువ: రూ.57.17 కోట్లు అని వెల్లడించారు. -
‘హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నాం’
హనుమకొండ: రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలపై పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు స్పష్టం చేశారు. హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నామన్నారు హరీష్‌రావు. బాలకార్మిక వ్యవస్థ తగ్గడానికి కేసీఆర్ పెట్టిన గురుకులాలే కారణమన్నారు. కాంగ్రెస్ పోవాలని, కేసీఆర్ రావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. హనుమకొండలో హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ యువనేత రంజిత్‌రెడ్డి జన్మదిన వేడుకలలో హరీష్‌రావు పాల్గొన్నారు. దీనిలో భాగంగా పేద విద్యార్థులకు చేయూత, స్కూల్ బాగ్స్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది,. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. -
అప్పుల కోసం వందల కోట్ల కమీషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్పుల కోసం ముంబైలోని బ్రోకర్‌కు వందల కోట్ల కమీషన్లు ముట్టచెప్పిందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కమీషన్లతోనే ఆ బ్రోకర్ ఏకంగా విమానం కొన్నా రని ఆయన స్పష్టం చేశారు. తాము కేంద్ర కార్పొరేషన్ల నుంచి రుణాలు తెస్తే రేవంత్ సర్కార్ మాత్రం రుణాలు తెచ్చుకోవడానికి కొత్తగా కమీషన్లు ఇచ్చే సంస్కృతి మొదలెట్టిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ నిర్మించి అక్కడ ప్రజలను కలిసేవారని, దానిని కూడా రాజకీయం చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరిట రూ. 7 కోట్లకు జీవో ఇస్తే ఇప్పటికే దానికి రూ.70 కోట్ల వ్యయం అయిందన్నారు.దాని చుట్టూ రక్షణ కోసం 17 కోట్లతో ఇనుప కంచె వేశారని, మరో 10 కోట్లతో ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించుకుని బోధి పెవిలియన్ అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయం, ఫ్యూచర్‌సిటీ, సచివాలయం, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో క్యాంపు కార్యాల యాలు ఉన్నా మరొకటి ఎందుకని విమ ర్శించారు. సీఎం ప్రతీనెలా హెలికాప్టర్‌కు రూ. 2 కోట్లు వ్యయం చేస్తున్నారని, అదీ చాలదని ఇప్పుడు రూ.5 కోట్లకు మరింత అధునాతన హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారన్నారు. రూ. 2,000 కోట్ల కుంభకోణం.. పాఠశాల, గురుకుల విద్యార్థులకు అవసర మైన దుస్తులు, బూట్లు, బెల్ట్ వంటివి చేనేత సహకార సంస్థ, లిడ్‌క్యాప్ నుంచి తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చేవారని, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కమీషన్లకు కక్కుర్తిపడి దాదాపు రూ. 2,000 కోట్ల కాంట్రాక్టును గుజరాత్‌కు చెందిన మార్వాడీకి కట్టబెట్టారని ఆరోపించారు. విద్యార్థుల కు పాఠశాల తెరిచే నాటికి దుస్తులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు కనీసం వస్త్రం రానేలేదని, అందుకే సాధారణంగా జూన్ 12న ప్రారంభం కావాల్సిన పాఠశాలలు వాయి దా వేశారని ఆరోపించారు. కాంట్రాక్టు పొందిన సంస్థతో కమీషన్లకు సంబంధించి తుది నిర్ణయం కాకపోవడంతో ఆలస్యమవుతోందని ఆరోపించారు. గురుకులాల విద్యార్థుల కు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, దుస్తులు కూడా రాలేదని దుయ్యబట్టారు. మీనాక్షి కేసు లీక్‌పై విచారణ జరపండి. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరించడానికి సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడే బీజేపీ నేతలకు కేసు వివరాలను అందించారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రతీ దానికి సిట్, న్యాయ విచారణ, సీబీఐ, సీఐడీ విచారణ అనే సీఎం రేవంత్‌రెడ్డి మీనాక్షి కేసు సమాచారం లీక్ చేసిన ఘటనపై విచారణ జరిపించి నిగ్గుదేల్చాలన్నారు.ఫార్మాసిటీ రద్దుతో రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ ని రద్దు చేస్తామని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలా లు ఇస్తే తాము వ్యతిరేకించమని, అయితే వివాదాలు లేని స్థలాలు ఇవ్వాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల జీవో 111ను ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ గురించి పదేపదే సీఎం మాట్లాడుతున్నారంటేనే.. తమ పార్టీ బలంగా ఉన్నట్లు లెక్క అని అన్నారు. ప్రతీరోజు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పేరెత్తకుండా సీఎం ఉండలేరని వ్యాఖ్యానించారు. -
గోదావరి–కావేరి లింక్‌పై రేవంత్ సర్కార్ జలద్రోహం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–నల్లమల సాగర్ ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో ముడిపెట్టడం తెలంగాణ జలహక్కులను కాలరాయడమేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు అన్నారు. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణ హక్కుల కోసం ముందుండి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘968 టీఎంసీల హక్కులే ముందుగా’... గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. జీడబ్ల్యూడీటీ (గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తే తెలంగాణకు 45 టీఎంసీల అదనపు హక్కు ఉంటుందని తాము ముందుగానే హెచ్చరించామన్నారు. నదుల అనుసంధానంపై జరిగిన ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టులకు పూర్తి అనుమతులు వచి్చన తర్వాతే తదుపరి చర్చలు జరగాలని పట్టుబట్టామని వెల్లడించారు. అనుసంధానంలో తరలించే నీటిలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని, ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి నాగార్జునసాగర్‌కు లింక్ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం పోలవరం నుంచి నల్లమలసాగర్, అక్కడి నుంచి కావేరికి నీటిని తరలించే ప్రతిపాదనలో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే...పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలను ఎన్ఓసీతో ముడిపెట్టడం ప్రమాదకరమని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణకు ట్రిబ్యునల్ ద్వారా రావాల్సిన 1,005 టీఎంసీలతోపాటు మరో 45 టీఎంసీల అంశం పెండింగ్‌లో ఉండగా రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం వదులుకుంటోందని ఆరోపించారు. సమ్మక్కసాగర్, వార్ధా, ఎల్లంపల్లి, లోయర్ పెన్‌గంగా వంటి ప్రాజెక్టులకు సంబంధించిన 139 టీఎంసీల అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. గోదావరి–కావేరి లింక్ అమలైతే తెలంగాణకు కనీసం 211 టీఎంసీల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిలా కాకుండా చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ‘ఢిల్లీ వరకు పోరాటం చేస్తాంపోలవరం–బనకచర్ల మార్గం ద్వారా నీటిని తరలించాలంటే సుమారు రూ.82 వేల కోట్ల వ్యయం అవుతుందని, తెలంగాణ మీదుగా నదుల అనుసంధానం జరిగితే రూ.48 వేల కోట్లకే సాధ్యమని వివరించారు, దీనిపై కేంద్ర మంత్రులు.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగితే ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీమంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్,మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు సంజయ్, చింత ప్రభాకర్‌తో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో తెలంగాణ నీటి హక్కులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మోటార్ల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతో కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ మేరకు హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ‘లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ మోటార్లను పదేపదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని మేము ముందుగానే హెచ్చరించినా, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.ప్రాజెక్టులను బలహీనపరచి ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం కలుగుతోంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు రావాల్సిన నీటిని కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు ఇతర ప్రాజెక్టు ద్వారా పూర్తిగా వినియోగించుకోవడం లేదు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల వినియోగం కనిష్ట స్థాయికి పడిపోయింది.కృష్ణా జలాల్లో తెలంగాణ తాత్కాలిక వాటా 34 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు వాటా 66 శాతం. 2025–26లో ఏపీ వినియోగం 74.90 శాతానికి పెరగ్గా తెలంగాణ వినియోగం ఎన్నడూ లేనంత అత్యంత కనిష్ట స్థాయిలో 25.10 శాతానికి పడిపోయింది. తెలంగాణ జల హక్కులు, రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది మరో నిదర్శనం’అని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. సోలార్ విద్యుత్‌తో సాగునీటి రంగానికి ముప్పు ‘సోలార్ విద్యుత్ అందుబాటులో ఉండే పగటి వేళల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నడపాలని ట్రాన్స్‌కో సూచించడంతో భారీ పంపులను తరచూ ఆన్ ఆఫ్ చేయాల్సి వస్తోంది. ఈ విధానంతో పంపులు, మోటార్లకు జరిగే నష్టానికి కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.8 ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపింగ్ పరిమిత సమయంలోనే జరిగే ప్రమాదం పొంచి ఉంది.తద్వారా నీటి ఎత్తిపోతలు తగ్గి, కృష్ణా–గోదావరి జలాల వినియోగ సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్లో 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి. రైతు డిస్కమ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
‘బడేభాయ్ చెప్పినట్టు రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది’
సాక్షి,సిద్ధిపేట: ఉచిత విద్యుత్ కరెంట్ విషయంలో బడేభాయ్ చెప్పినట్టు సీఎం రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. డిస్కంల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నది వేరు.. వాస్తవం వేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం (మే29) సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. 24గంటల విద్యుత్ ఇవ్వడం కోసమే రైతు డిస్కం ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే? రైతు డిస్కంతో 24 గంటల ఉచిత విద్యుత్ రానే రాదు. రైతు డిస్కం రైతులకు ఉరి తాడుగా మారబోతుంది.లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పాలిట రైతు డిస్కం శాపంగా మారుతుంది. మేం పద్దతిగా ఆధారాలతో మాట్లాడుతాం. రేవంత్ రెడ్డిలా బట్ట కాల్చి మీద వేయం.ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో కనీసం ఏడు గంటల కరెంట్ కూడా రాదు. 13గంటలకు మించి రైతులకు కరెంట్ రావడం లేదు. రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అని కోదండరెడ్డి మాట్లాడుతున్నారు.గుజరాత్లో రైతులకు ఏడుగంటలే కరెంట్ ఇస్తున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఓట్లు అడుగుతానని రేవంత్ చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌కు మంగళం పాడింది. టీజీఆర్పీడీసీఎల్ థర్మల్ పవర్ ఇవ్వరట.. సోలార్ పవర్ మాత్రమే ఇస్తారట. బడేభాయ్ చెప్పినట్టు రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వరద వచ్చినప్పుడే ప్రాజెక్టులు నింపుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. -
రూ.వేయి కోట్ల భూ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ భూములను అందినకాడికి కొల్లగొడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో సర్వే నంబరు 173 నుంచి 183 వరకు ఉన్న సర్వే నంబర్లలోని 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరిగిందన్నారు. సుమారు రూ.వేయి కోట్లు విలువ చేసే ఈ కుంభకోణంపై సిట్ లేదా సీఐడీ విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంగళవారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాకుండా నిషేధిత జాబితా 22ఏలో పెట్టాలని తహసీల్దార్‌కు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని 2026 జనవరిలో హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లోనూ పొందుపరచడంతో పాటు దీనిని ప్రభుత్వ భూమిగా ఫిబ్రవరి 24న తహశీల్దార్ తేల్చారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఫిబ్రవరి 28న ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా తహశీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల్లో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా పేర్కొంటూ భూ భారతిలోనూ అప్లోడ్ చేశారు. కలెక్టర్ ఆమోదం లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది? రూ.వేయి కోట్ల విలువైన భూములపై జరిగిన కుంభకోణంపై చర్యలు తీసుకోవాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బదిలీతో సరిపెడుతారా? ‘భూ కుంభకోణంపై మీడియా కథనాల నేపథ్యంలో కేవలం తహశీల్దార్ బదిలీతో సరిపెట్టారు. దాడుల కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఎవరి ఒత్తిళ్ల వల్ల తిరిగి వచ్చారో చెప్పాలి. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఈ కుంభకోణంలో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భూ భారతిలో 170ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా నమోదైంది. తహశీల్దార్ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు సదరు అధికారిని సర్వీసు నుంచి తొలగించాలి. భూ కుంభకోణంపై సిట్ లేదా సీఐడీ విచారణ జరపడంతో పాటు ఇందులో భాగస్వాములైన అధికారులు, ప్రభుత్వ పెద్దలపై విచారణ జరపాలి’ అని హరీశ్‌రావు డిమాండు చేశారు. జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేయడాన్ని హరీశ్ ఖండించారు. ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించిన డ్రైవర్‌పై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌కు బీఆర్ఎస్ అండగా నిలవడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. -
‘రాజకీయాలు తాత్కాలికం.. రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం’
హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ అభివృద్దిని అడ్డుకునే వినాశకరమైన ఆలోచనలు చేయకూడదన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. రాజకీయాలు అనేవి తాత్కాలికమని, రాష్ట్ర ప్రయోజనాలు అనేవి శాశ్వతమన్నారు. ఈరోజు(శనివారం, మే 23వ తేదీ) సీఎల్పీ కార్యాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రెస్మీట్లో మాట్లాడారు. దురదృష్టవశాత్తూ బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్నికల ఓటమి తాలూకు నిరాశ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అందుకే... హరీష్ రావు అమెరికా వెళ్లి కూడా పగటి కలలు కంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. పగటి కలలు కంటూ... ‘చీప్ పాలిట్రిక్స్’... ‘డైవర్షన్ పాలిట్రిక్స్’... ‘బ్లాక్ మెయిలింగ్ పాలిట్రిక్స్’ ప్లే చేస్తున్నారు.మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనను అడ్డుకునే కుట్ర చేశారు. ఇప్పుడు... ఫ్యూచర్ సిటీపై కుట్రలు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నే మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక ప్రభుత్వానికో పరిమితమైనది కాదు... ఇది తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు మేం వేసే ఒక ముందడుగు.రాబోయే రోజుల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లా మారబోతోంది. దీన్ని రద్దు చేస్తామని పగటి కలలు కంటున్న హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.‘ప్రభుత్వం మారితే ఫూచర్ సిటీని రద్దు చేస్తాం’ అనే బాధ్యతారహిత ప్రకటన చేయడం ద్వారా హరీష్ రావు... అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, ఇన్వెస్ట్ మెంట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారు. ఇది ‘తెలంగాణ’కు చేస్తున్న ద్రోహం కాదా...?’ అని ప్రశ్నించారు. -
ఫ్యూచర్ సిటీ కాదు.. నీ ఫ్యూచరేంటి హరీష్: పొంగులేటి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫ్యూచర్ సిటీ విషయమై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటరిచ్చారు. హరీష్ రావుకు తన ఫ్యూచరే తెలియదు.. ఫ్యూచర్ సిటీని ఆపుతారా? అంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..‘ఫ్యూచర్ సిటీ భూములపై అమెరికాలో ఒప్పందాలున్నాయా?. పదేళ్లలో ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కొత్త నగరాన్ని నిర్మిస్తోందంటే అసూయ కలగక మానదు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. కాంగ్రెస్.. రాష్ట్రం కోసం, దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఆపుతాం అంటున్నారు. మూసీ ప్రాజెక్ట్‌కు బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోంది. మూసీని బాగుచేస్తామంటే అడ్డుపడుతున్నారు. లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్ర చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారు. అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్న హరీష్ రావు.. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. హరీష్.. మీ పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా కుట్రలు జరుగుతున్నాయి. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరతాం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన ప్రకటన చేశారు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారాయన. అలాగే.. ఫార్మాసిటీని మళ్లీ తీసుకొస్తామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉంది. రేవంత్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోంది. హై కోర్టు లో ఈ మధ్య ఒక కేసు వచ్చింది. మేము ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అసలు విషయం ఇదే. రేవంత్ సర్కార్ కేవలం జిమ్మిక్కు చేస్తోందిఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధం గా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. 75 శాతం ఫార్మా సిటీ ఉండి.. మిగతా 25 పర్సెంట్ మిగతావి ఉండాలని చేస్తున్నారు. కానీ 75 శాతం మిగతా వ్యాపారం కేవలం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం చెల్లదు. కానీ కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందిమేము ప్రభుత్వం లోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ రద్దు వంద శాతం చేస్తాం. ఫార్మా సిటీ నీ రీస్టోర్ చేస్తాం. ఇది నా మాట కాదు. పార్లమెంట్ చట్టం ఇది. ఫార్మా సిటీ వస్తె లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించాం. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని చేశాం. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచిపోయింది. లాస్ట్ వన్ ఇయర్ ఎలక్షన్ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదు. భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ది పొందాలని ప్లాన్ చేశారు. ఫార్మా సిటీ అభివృద్ది చెందితే బీఆర్ఎస్కు పేరు వస్తుంది అని ఇలా చేశారు. వాళ్ళు ఏమి చేసినా నడవదు... నిలబడదు.. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది అని హరీష్‌రావు అన్నారు. “ఫ్యూచర్ సిటీ”, “ఫార్మాసిటీ” రెండూ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన భారీ ప్రాజెక్టులే. కానీ ప్రభుత్వాలు మారడంతో వాటి దిశ కూడా మారిపోయింది. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో “ఫార్మాసిటీ” పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది. దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద ఔషధ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల ఉద్యోగాలు పెరుగుతాయని.. తెలంగాణ ఔషధ రంగంలో అగ్రస్థానానికి చేరుతుందని అప్పటి ప్రభుత్వం చెప్పింది.అయితే ఆ ప్రాజెక్ట్‌కు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భూములు కోల్పోతామన్న భయం ఒకవైపు.. కాలుష్యం పెరిగి నీరు, గాలి దెబ్బతింటాయన్న ఆందోళన మరోవైపు పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. ముఖ్యంగా యాచారం, కందుకూరు ప్రాంతాల్లో రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం “ఫార్మాసిటీ” ఆలోచనను పక్కనబెట్టింది. అయితే.. అదే ప్రాంతంలో “ఫ్యూచర్ సిటీ” అనే కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం పరిశ్రమల నగరం కాదు.. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు సాంకేతికత, కృత్రిమ మేధస్సు, పరిశోధనలు, హరిత వాతావరణం, నివాసాలు, ఉద్యోగ కేంద్రాలు అన్నీ కలిసిన ఆధునిక నగరంగా అభివర్ణిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. -
తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి పనిచేసిన తెలంగాణవాదులను గుర్తించి గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నాయకుడు, ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న ఆయన న్యూయార్క్ లో తెలంగాణవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లాంగ్ ఐలాండ్ లో ప్రముఖ ఎన్ఆర్ఐ లక్ష్మణ్ ఏనుగు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డిని హరీష్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. అమెరికాలో స్థిరపడి తెలుగు వారికి ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఆయన అందిస్తున్న సహకారం గొప్పగా ఉందని అన్నారు.ఉద్యమకాలం నుంచి, ఆ తర్వాత కూడా తెలంగాణే లక్ష్యంగా చాలా మంది ఎన్ఆర్ఐలు పనిచేశారని హరీష్ రావు గుర్తుచేసుకున్నారు. తమకు అనేక పరిమితులు ఉన్నా లక్మణ్ ఏనుగు లాంటి సోదరులు అనేకమంది తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని, తమ సమయంతో పాటు ఆర్థిక వనరులను కూడా వెచ్చించారని అన్నారు.పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ ముందు నుంచీ తాము పార్టీకి అండగా ఉన్నామని, తెలంగాణ భావజాలవ్యాప్తికి అన్నిరకాలుగా కృషి చేశామని తెలిపారు. ఉద్యమవాదుల్లో కొందరికి అన్యాయం జరిగిందని, మరికొందరిలో అసంతృప్తి గూడు కట్టుకొన్న విషయాన్ని హరీష్ రావుకు దృష్టికి తీసుకువచ్చారు. మరోసారి తెలంగాణవాదుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలవాలని అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.తెలంగాణ సాధనలో భూమి పుత్రుడైన లక్ష్మణ్ ఏనుగు రాజీలేని పోరాటం చేశారని, పదహారు ఏళ్ల కిందటే ధూమ్ ధామ్ లు నిర్వహించటంతో పాటు, అనేక మంది ప్రముఖ నాయకులు, తెలంగాణ కవులు కళాకారులను అమెరికాకు పరిచయం చేసిన ఘనత లక్ష్మణ్ కు దక్కిందని హరీష్ రావు ప్రశంసించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎన్ఆర్ఐలు డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, శ్రీనివాస్ గూడూరు, సతీష్ కల్వ, సహోధర్ రెడ్డి, రవీందర్ కోడెల, హరిచరణ్ బొబ్బిలి, మల్లిక్ రెడ్డి, రమా వనమా, వాణి ఏనుగు, ఉషా మన్నెం, రంజీత్ క్యాతం, అమర్ లింగాల, సునీల్ మన్నెం, తన్నీరు మహేష్, నరసింహారావు, చందు తళ్ల, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ జక్కిడి, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా TAL ప్రీమియర్ లీగ్ ఆరంభం) -
కంప్లెంట్ ఇచ్చి 4 రోజులు అయింది ఎందుకు అరెస్ట్ చేయలేదు
-
బండి సంజయ్ కుమారుడి కేసు.. నీరుగారే ప్రయత్నం జరుగుతోందా?
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు నీరుగారే ప్రయత్నం జరుగుతోందా? విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం కేసును నీరుగార్చడమేనా? అంటే అవునని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.బండి భగీరథ్ కేసుపై హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యానిస్తూ..‘సిట్ అంటేనే కేసును నీరుగార్చడం’ అని అన్నారు. బండి భగీరథ్ వ్యవహారంలో కేసు పెట్టి నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 10 సిట్లు ఏర్పాటు చేశారని, కానీ ఏ సిట్ కూడా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. సిట్ వేసి లీకులు ఇవ్వడం రేవంత్‌కు అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు. -
‘బండి సంజయ్ కుమారుడి ఎపిసోడ్.. 36 గంటలైనా కేసు లేదా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు విషయంలో రాజకీయం హీటెక్కింది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా..‘బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?. కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా? పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి @revanth_anumula దీనికి సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో కాంగ్రెస్,…— Harish Rao Thanneeru (@BRSHarish) May 10, 2026 డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతబండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఆదివారం మెరుపు ధర్నా చేశారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను పలువురు మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన మహిళలుబండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన మహిళలు.#pocso #bandisanjaypic.twitter.com/8akltWzosD— ఉప్పిడి పిండి (@bharathbunny27) May 10, 2026 -
నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం
-
‘జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగమైన భర్తీ చేశారా?’
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు. నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటే.. సీఎం రేవంత్ మాత్రం ఆ నోటిఫికేషన్ వద్దంటున్నారని మండిపడ్డారు. ఈరోజు(శనివారం, మే 5వ తేదీ) సిద్ధిపేట జిల్లా జిల్లా గ్రంధాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు హరీష్‌రావు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దంటున్నారని సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకువచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని నమ్మించారు. ఆనాడు నమ్మించి..నేడు వంచించడం కాంగ్రెస్ నైజం. సెంట్రల్ లైబ్రరీలో పోలీసులతో నిరుద్యోగులపై రేవంత్ దాడి చేయిస్తున్నారు. BRS హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. కాంగ్రెస్ వచ్చాక భర్తీ చేసింది కేవలం 16 వేల ఉద్యోగాలని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. మిగిలిన 1.84 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో సీఎం సమాధానం చెప్పాలి. పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని డీజీపీ చెప్పారు. మరి 5 వేల ఉద్యోగాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చి..మిగతా 14 వేల పోస్టులను ఎందుకు ఆపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 40 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశాం. విద్యా కమిషన్ రిపోర్ట్‌ని సీఎం రేవంత్ ఎందుకు బయటపెట్టడం లేదు. రాష్ట్రంలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మెగా డీఎస్సీసీ కాస్త దగా డీఎస్సీ అయిపోయింది. రేవంత్ నీ డ్రామాలు బంద్ చేయి. చిల్లర మాటలు కాదు కావాల్సింది...జాబ్ నోటిఫికేషన్ కావాలి. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయి చిత్తు కాగితం అయింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగమైన భర్తీ చేశారా?, నీ కోసం పని చేసిన నిరుద్యోగులే రేపు రేవంత్‌ని బొందపెడతారు. తక్షణమే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేదంటే నిరుద్యోగులతో సెక్రటేరియట్ ని ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు. -
ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం: హరీష్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకే తమ ఫోన్లు ట్యాపింగ్, తమ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు హ్యాకింగ్ చేస్తున్నారని అన్నారు. హ్యాకింగ్‌కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టమని హరీష్ హెచ్చరించారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లీగల్‌గా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాకా విచారణ జరిపిస్తాం. హ్యాకింగ్‌కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం. చట్టానికి లోబడి ఫోన్ ట్యాపింగ్ చేయండి. కొంతమంది పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి దగ్గర అవ్వాలని, పదోన్నతులు పొందాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధాని మోదీ ఇక్కడ సభలు పెట్టడం కాదు.. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.ఇక, అంతకుముందు.. తెలంగాణలో పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ బహిరంగ లేఖ రాశారు. అందులో..‘ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదు?. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఎండలో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా?. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలి అని పేర్కొన్నారు. -
మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు..! ప్రభుత్వంపై హరీష్ ఫైర్
-
రేవంత్.. వారితో ఫోన్లు హ్యాక్ చేయిస్తున్నావా?: హరీష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వం హిట్లర్‌ను మించిపోయిందని ఎద్దేవా చేశారు. కొంత మంది ఐపీఎస్‌లు తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రైతులు, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఎవరు మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారు. మన్నే క్రిశాంక్‌తో పాటు ఏడుగురిపై అక్రమ కేసు పెట్టారు. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతుంది. ఓ కేసులో అనుముల హనుమంత రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగితే కేసు పెడతారా?. రేవంత్ రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. కేసులతో గొంతు నొక్కలేవు. కొంత మంది ఐపీఎస్‌లు మా ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తెచ్చి మాపై నిఘా పెడుతున్నారు. అలాంటి అధికారులు జాగ్రత్త. మీరు రిటైర్డ్ అయిన మిమ్మల్ని వదలం. రేవంత్ సగం కాలం పూర్తయ్యింది. ఇంకా మిగిలి ఉన్న సగ కాలం అయిన మంచిగా పని చేయాలి. రైతుల సమస్యలను రాష్ట్రంలో పట్టించుకునే నాధుడే లేడు. ఆనాడు తాలు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎటు పోయాడు?. యాసంగి పంటకు బోనస్ ఇస్తారా లేదా రేవంత్ సమాధానం చెప్పాలి. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవా?. జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఏసీలో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయి?. రేవంత్ మళ్ళీ గెలిచేది లేదు. ఉన్నన్ని రోజులు అయిన మంచిగా పని చేయాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
అన్ని కమిటీలు రద్దు త్వరలో BRS మెంబర్ మెంబర్షిప్ డ్రైవ్
-
కేసీఆర్, హరీశ్‌పై చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది. కమిషన్ పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని ఆక్షేపించింది. నిరర్ధకమైన ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దని స్పష్టం చేసింది. కమిషన్ విచారణలో నిర్ధారిత విధానాలు, నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విచారణ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట లభించినట్టయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ పూర్తి చేసిన కమిషన్ గతేడాది జూన్ 31న నివేదిక సమర్పించింది. అయితే జస్టిస్ ఘోష్ నివేదిక మేరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు నెలల పాటు అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీ¯న్ ధర్మాసనం మార్చి 12న తీర్పు రిజర్వు చేసింది. బుధవారం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు ప్రస్తావిస్తూ తీర్పు వెలువరించింది. 1952 చట్ట ప్రకారమే..: ప్రభుత్వం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యం వహిస్తున్నారు కానీ 1952 చట్ట ప్రకారమే దానిని ఏర్పాటు చేశాం. ఇందులో ‘న్యాయ విచారణ’ అనే పదాన్ని వాడటంలో ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదు. కమిషన్ విధులను కూడా ఆ చట్టం పరిధిలోనే నిర్వర్తించింది. కమిషన్ సమర్పించే నివేదికకు చట్టబద్ధత ఉండదు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టవద్దని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దీనికి అత్యంత ప్రజా ప్రాముఖ్యత ఉంది. విచారణ అత్యవసరం. విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి ఉంది.. 1952 నాటి చట్టం కింద ఒక స్వతంత్ర విచారణ కమిషన్ ద్వారా ఈ ప్రాజెక్టు అమలు, నిర్వహణ, పర్యవేక్షణలో జరిగిన లోపాలు, విధి నిర్వహణలో పొరపాట్లు, నిర్లక్ష్యం, అవకతవకలపై విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. కమిషన్ ఏర్పాటు చట్ట ఉల్లంఘన కాదు.. చట్టంలోని సెక్షన్ 3 (4) ప్రకారం.. కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఆరు నెలల్లోపు, ఆ నివేదికను, దానిపై తీసుకున్న చర్యల వివరణాత్మక పత్రాన్ని శాసనసభ ముందు ఉంచాలి. టీటీ ఆంటోనీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలు ఏవీ ఈ కమిషన్ నివేదికకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. చట్టానికి అనుగుణంగా తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను తీసుకోవాలి. కమిషన్ ఏర్పాటు 1952 నాటి చట్ట పరిధిని అతిక్రమించడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడం కాదు. నిర్లక్ష్యమే కారణమన్న ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటు పరిశీలనకు జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటయ్యింది. బరాజ్ ప్రణాళిక, రూపకల్పన, నాణ్యతా నియంత్రణ, నిర్వహణా లోపాలు, నిర్లక్ష్యం వంటి అనేక సమస్యలతో పిల్లర్లు కుంగిపోయాయని అథారిటీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాన్ని నిండుగా ఉంచవద్దని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కింద మేడిగడ్డకు ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఒకే రకమైన రూపకల్పన, పద్ధతుల్లో నిర్మించారని, అవి కూడా వైఫల్యాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. డ్యామ్ నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది. కార్య నిర్వాహకుల పక్షాన కొన్ని లోపాలు, తప్పులు జరిగినట్లు ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసింది..’ అని వివరించారు. కమిషన్ తీరు సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం: పిటిషనర్లు కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలు తమ పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ‘1952 నాటి చట్టంలోని సెక్షన్లు 8బీ, 8సీ కింద కల్పించిన చట్టబద్ధమైన రక్షణలను పాటించకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ అంశాలున్నాయి. ఏకపక్షంగా, ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతో ప్రేరేపించినట్లు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 8బీ ప్రకారం పిటిషనర్లు తమ వాదనలు సమర్థించుకునేందుకుు, కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వీలుగా ఎటువంటి సమన్లు లేదా నోటీసులు జారీ చేయలేదు. అలాగే పిటిషనర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న అంశాలకు ఆధారమైన ఎటువంటి పత్రాలు వారికి అందించలేదు..’ అని వారు కోర్టుకు తెలిపారు. వాదనలకు అవకాశం ఇవ్వడం తప్పనిసరి: హైకోర్టు ‘ఒక వ్యక్తిపై ప్రతికూల వ్యాఖ్యలు చేసే ముందు వారి వాదనలకు అవకాశం ఇవ్వడం కమిషన్‌కు తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహజ న్యాయ సూత్రాలను పాటించడంలో విఫలమైతే, ఆ చర్యతో పాటు దాని పర్యవసానాలు కూడా చెల్లవు. సాక్ష్యాల సమర్పణకు అవకాశం ఇవ్వాలి.. సెక్షన్ 8బీ కమిషన్‌పై ఒక బాధ్యతను విధిస్తుంది. ఏదైనా వ్యక్తి ప్రవర్తనపై విచారణ జరపడం అవసరమని కమిషన్ భావించినా, లేదా ఆ విచారణతో వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడినా. సదరు వ్యక్తికి విచారణ సందర్భంగా తన వాదన వినిపించుకోవడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి ఒక సహేతుకమైన అవకాశాన్ని కల్పించాలి. వ్యక్తికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల నివేదిక అయినా ఇచ్చే ముందే, విచారణ ప్రక్రియలో న్యాయబద్ధత పాటించబడేలా చూసేందుకు ఉద్దేశించిన ’ఆడి ఆల్టెరమ్ పార్టెమ్’ సూత్రంలో ఇదొక ముఖ్యమైన భాగం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక పౌరుని జీవించే హక్కులో ఒక అంశమైన పరువు హక్కు.. ఒక అధికారి నిర్ణయంతో ప్రభావితమయ్యే అవకాశం ఉండి, దానికి సివిల్ పర్యవసానాలు కూడా ఉండవచ్చు అనుకుంటే, అటువంటి వ్యక్తికి 1952 చట్టంలోని సెక్షన్ 8బి కింద తప్పనిసరిగా నోటీసు పొందే హక్కు ఉంటుంది. సాక్ష్యాలను సమన్లలో ప్రస్తావించలేదు.. కమిషన్ నివేదికలోని కొన్ని అంశాలు పిటిషనర్ల ప్రవర్తనపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇవి నిస్సందేహంగా వారి ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పిటిషనర్లకు వ్యతిరేకంగా నివేదికలో ప్రస్తావించడానికి కమిషన్ ముందున్న సాక్ష్యాలలో ఏ ఒక్కదానినీ వారికి ఇచ్చిన సమన్లలో ప్రస్తావించలేదు. ఇది నిబంధనలకు విరుద్ధం. కమిషన్ అనుసరించిన విధానం సహజ న్యాయ సూత్రాలకు, సెక్షన్లు 8బీ, 8సీలో పొందుపరిచిన చట్టపరమైన రక్షణలకు విరుద్ధంగా ఉంది. నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవు.. ప్రజా ఖజానా నుంచి గణనీయమైన వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల అమలులో లోపాలు, నిర్లక్ష్యం, పొరపాట్లు, తప్పులను గుర్తించడమే కాకుండా, అలాంటి లోపాలను సరిదిద్దడానికి, అవి పునరావృతం కాకుండా నిరోధించడానికి వీలు కల్పించే వాస్తవ నిర్ధారణలను అందించడం కమిషన్ ఏర్పాటు ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇటువంటి వాస్తవ నిర్ధారణ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులకు శిక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. సివిల్, క్రిమినల్ సాక్ష్యంగా నివేదికలు అంగీకరించబడవు. ఇదే సమయంలో కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారు..’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
-
kaleshwaram: లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న ప్రభుత్వం
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేయడంతో తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది. ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని లీగల్ టీమ్ చెబుతోంది. మొదటిది సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా రెండోది కొత్త కమిషన్‌ను నియమించడం. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. కోర్టు తీర్పుపై రేపు కేబినెట్లో చర్చించనుంది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్‌కు అడ్వకెట్ జనరల్‌ను పిలవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. రేపటి సమావేశానికి అడ్వకేట్ జనరల్ హాజరుకానున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. కాగా, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ నిబంధనలు పాటించలేదని పేర్కొంది. -
కాళేశ్వరంపై తీర్పు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం విషయంలో జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ కక్ష సాధింపులు ఆపాలి అంటూ మండిపడ్డారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ధర్మం జయించింది. కాంగ్రెస్ కుట్రలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలాడారు. హైకోర్టు తీర్పుతో రేవంత్ నిజ స్వరూపం బయటపడింది. ఇప్పటికైనా కాంగ్రెస్ కక్ష సాధింపులు ఆపాలి. పిల్లర్ల మరమ్మత్తులు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ముమ్మాటికీ కాళేశ్వరం.. తెలంగాణకు ప్రాణేశ్వరమే’ అంటూ కామెంట్స్ చేశారు. సత్యమేవ జయతే..ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది.ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్…— Harish Rao Thanneeru (@BRSHarish) April 22, 2026 -
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట
-
చర్యలు వద్దు.. కేసీఆర్, హరీష్‌కు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొంది. ఇదే సమయంలో కమిషన్ నియామకం చట్టబద్దమే అని స్పష్టం చేసింది. కాగా, ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వాయిదా పడిన విషయం తెలిసిందే. మెగా ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు.మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. -
కేసీఆర్ స్టేట్స్‌మన్.. రేవంత్ స్ట్రీట్‌మన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు రాజనీతిజు్ఞడి (స్టేట్స్‌మన్)లా ప్రసంగిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాటారం బహిరంగ సభలో చిల్లర మనిషి (స్ట్రీట్‌మన్)లా మాట్లాడారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం హరీశ్‌రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసీఆర్ ప్రసంగించే సమయానికే మైకు పట్టుకొని రేవంత్ తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా 36 లక్షల మంది వీక్షిస్తే రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని 4 లక్షల మందే చూడటం బీఆర్ఎస్ అధినేతకు ఉన్న ప్రజాభిమానానికి అద్దం పడుతోందన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించకుండా హుందాగా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే రేవంత్ మాత్రం రంకెలు వేస్తూ బీఆర్ఎస్పై ఏడవడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ సూచనలు స్వీకరించి తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కుతాయన్నారు. రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఢిల్లీకి ‘కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే నేను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు, మే 6న హైకోర్టులో జరిగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు కోసం సీనియర్ లాయర్లను సంప్రదించాం. అందులో దాపరికం లేకున్నా రేవంత్ మీడియాలో లీకులిస్తూ డ్రామాలు ఆడాడు. రేవంత్‌రెడ్డి ముద్దాయిగా ఉన్న ఓటుకు నోటు కేసు బుధవారం మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. హోంమంత్రిగానూ ఉన్న రేవంత్ ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నాడు. ఈ కేసులో బీఆర్ఎస్ తరఫున జగదీశ్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారు. నాలుగున్నర ఏళ్లుగా రేవంత్ స్టేను అడ్డుపెట్టుకొని కాలం గడుపుతున్నారు. స్టే వెకేట్ అయితే సీఎం సీటు ఊడటంతోపాటు జైలుకు వెళ్లడం ఖాయం’అని హరీశ్‌రావు చెప్పారు. కేసీఆర్ గర్జిస్తారనే భయంతో రైతు భరోసా ‘రెండు వ్యవసాయ సీజన్లలో రైతు భరోసా ఎగవేసిన రేవంత్.. జగిత్యాల సభలో కేసీఆర్ గర్జిస్తారనే భయంతో ఒక ఎకరం కిస్తీ రైతుల ఖాతాల్లో వేశాడు. రైతులకు ఇంకా రూ. 4 వేల కోట్లు రావాలి. వచ్చే ఏడాది కరువు వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసిన రేవంత్.. ఇప్పుడు మేడిగడ్డ మరమ్మతు గురించి మాట్లాడుతున్నాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన శిలాఫలకంపై నా పేరు ఉందనే విషయం తెలియక వారే కట్టినట్లు రేవంత్ చెబుతున్నాడు. మళ్లీ గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్‌రెడ్డి.. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో జవాబు చెప్పాలి. ఎన్ని డ్రామాలాడినా రేవంత్‌కు రాజకీయంగా నూకలు చెల్లాయి’అని హరీశ్‌రావు అన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీ ప్రసాద్‌రావు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రాజెక్టులపై రేవంత్ నీళ్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం /గుర్రంపోడు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కొమ్ముకాస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి బీఆర్ఎస్ అత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని నిప్పులు చెరిగారు. గోదావరి నీటిని నల్లమల సాగర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ తరలించేందుకు భారీ కుట్ర జరుగుతోందని, ఇందులో రేవంత్‌రెడ్డి భాగస్వామిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో టిఫిన్ రాజకీయం..ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక కేంద్ర మంత్రి ఇంట్లో టిఫిన్ చేసి వచ్చారని హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణ ప్రజల కోసమా, లేక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసమా అని నిలదీశారు. రైతు రుణమాఫీ వంద శాతం పూర్తయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘సిద్దిపేటకు వస్తావా.. రఘునాథపాలెం నన్ను రమ్మంటావా.. రుణ మాఫీ అయిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’అని హరీశ్‌రావు తుమ్మలకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.మొనగాడనుకుంటే మోసగాడయ్యాడు‘రేవంత్‌రెడ్డి మాయమాటలు నమ్మిన ప్రజలు పెద్ద మొనగాడు అనుకున్నారు.. కానీ రెండున్నరేళ్ల పాలనలో పెద్ద మోసగాడని స్పష్టంగా అర్థమైందని’హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తానేదార్పల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలతో రైతులు సతమతమవుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కే విమానం.. దిగే విమానం అన్నట్లు 70 సార్లు ఢిల్లీకి వెళ్లడం, కప్పం కట్టుకుని కుర్చీ కాపాడుకోవడం తప్ప ఒక్కసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించే సమయం ఉండటం లేదా? అని ప్రశ్నించారు. -
బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి
జగిత్యాల: పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చి నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఎంపీ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ నెల 20న కేసీఆర్ నాయకత్వంలో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్న సందర్భంగా జగిత్యాలలో నిర్వహిస్తున్న సభాస్థలి ఏర్పాట్లను కేటీఆర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాల్సిందిపోయి వెనుకేసుకొస్తున్నారని, కేసీఆర్ నాయకత్వంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక్కటై తెలంగాణను సాధించుకున్నారన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఘాటైన జవాబు ఇచ్చేవారని, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉంటే కేంద్రమంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాట్లాడితే దీటైన జవాబు ఇచ్చారని పేర్కొన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ 8, బీజేపీ 8 మంది ఎంపీలు ఉంటే కనీసం పల్లెత్తు మాట మాట్లాడలేదని, దిష్టి»ొమ్మల్లా ఉన్నారని చెప్పారు. తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే సీఎం రేవంత్‌రెడ్డి కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉంటేనే బిల్ పాస్ అవుతుందని, మెజారిటీ లేకున్నా ప్రవేశపెట్టి దేశంలోని మహిళలకు అన్యాయం చేశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని, ఒకవైపు మహిళాబిల్లుపై కాంగ్రెస్ మద్దతివ్వలేదని, కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించాలని బీజేపీ నాయకులు పిలుపునిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేంద్రమంత్రి శ్రీనివాస్‌వర్మ ఇంటికి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్లో మహిళాబిల్లు, లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చారు...కానీ మహిళాబిల్లు విషయంలో సైతం మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారని, ఆయన చేరిక ఉత్తర తెలంగాణలో బలం ఇస్తుందని, విలువలతో రాజకీయం చేసే నాయకుడు జీవన్‌రెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల నుంచి వస్తున్న మాట రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అన్నదే వినిపిస్తోందన్నారు. దానికి సంకేతమే బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరిక అన్నారు. సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతు న్నాయని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ నిర్వహిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డలో నిర్వహిస్తారట...రెండేళ్ల తర్వాత మేడిగడ్డ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో హైబ్రిడ్ ఎమ్మెల్యే అని, ఏ పార్టీలో ఉన్నాడో ఆ ఎమ్మెల్యేకే తెలియదని సంజయ్‌కుమార్‌నుద్దేశించి అన్నారు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, కాంగ్రెస్ నాయకుల్లో భయం పట్టుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి సైతం అమలు చేయలేదని, కేసీఆర్ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పార్టీ సమష్టిగా పనిచేసి ముందుకెళ్తామన్నారు. చాలాకాలం క్రితం జగిత్యాలలో సభ నిర్వహించామని, జీవన్‌రెడ్డి చేరికను అందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచే మళ్లీ పునర్వైభవం సాధించేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో కదం తొక్కుతూ ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సంజయ్, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. -
ఎన్ని కుట్రలు చేసిన సభ విజయవంతం చేస్తాం.. కేటీఆర్
జగిత్యాల : మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరికతో జగిత్యాలలో పండగ వాతావరణం నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో పార్టీనేతలతో కలిసి ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. జగిత్యాల సభను ఎలాగైనా అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎన్ని కుట్రలు చేసిన ఎట్టిపరిస్థితుల్లో సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. రెండేళ్ల నుంచి మేడిగడ్డకు వెళ్లేందుకు సీఎంకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఈ నెల 20న జరిగే సభకు సాయంత్రం 5.30 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల చేరుకుంటారని ఆయన రాకకోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన బిల్లు రాజకీయ కుట్రలో భాగమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ నెల 20 న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు కేసీఆర్ హాజరవుతారు. -
హరీశ్‌రావు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నా రని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్లో వీరు మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై హరీశ్‌రావు నిరాధార ఆరోప ణలు చేస్తున్నారని విమర్శించారు. పొంగులేటి లేదా ఆయన కుటుంబానికి సంబంధం లేని కంపెనీలను ఆయనకు అంటగడుతున్నారని తెలి పారు. శిల్పా ఇన్ఫోటెక్, ఏక్యూ అండ్ ఏఎం బిల్డర్స్, క్రిస్టల్ మాన్షన్ వంటి సంస్థలతో ఆయ నకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.దీనికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు ఉంచుతున్నా మని చెప్పారు. నాదర్గుల్ భూముల వ్యవహా రం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, 2021లో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు. భూముల కేటాయింపులు, బది లీలపై విచార ణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హరీశ్ రావుకు గతంలో పారిశ్రామిక వేత్తలను బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర ఉందని, తన రాజకీయ అస్తిత్వం కోసం ఇప్పుడు ప్రభుత్వంపై విమ ర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్య లను పక్కనపెట్టి భూముల చుట్టూ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. -
నిజాలను దాచి.. అబద్ధాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సచివాలయం వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిజాలను దాచి అబద్ధాలు మాత్రమే మాట్లాడారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ‘గొంతు చించుకునో, పిట్ట కథలు చెప్పో సంస్థను, కొడుకును కాపాడుకోవాలి.. దాని నుంచి బయటపడాలని ఆయన తాపత్రయపడినట్లు స్పష్టంగా కనపడింది. నిన్నటి ప్రెస్‌మీట్‌తో ఆయన తాను పొంగులేటి కాదు పొంగు‘లూటీ’ అని చెప్పకనే చెప్పాడు..’అని అన్నారు. గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ వద్దంటూ వనపర్తి జిల్లా రేవల్లి మండలం గొల్లపల్లిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ధర్నా, బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నాగపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. ఎవరు చెప్పింది తప్పో తేల్చాలి.. ‘క్రషర్ గురించి మా మంత్రి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్లో జరిగిన అవినీతి, అవకతవకలను ప్రతిపక్షం వాళ్లు ఎవరూ బయటకు తీయలేదు. మా అధికారులే గుర్తు పట్టారు.. మేమే పెనాల్టీ వేసినం.. మేమే పైసలు కట్టించామని రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా శాసనసభలో చెప్పారు. కరెంట్ మీటర్ల కొరత ఉండడంతో రాఘవ కంపెనీ డీజిల్ జనరేటర్ల మీద నడుపుకున్నదని అసెంబ్లీలోనే మైనింగ్ మంత్రి చెప్పారు. అనుమతుల గురించి అడిగితే అనుమతులు లేట్ అయితవి కదా.. ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అప్లయ్ చేసుకున్నాడంటూ సమాధానమిచ్చారు. మరి వీరు చెప్పింది తప్పా.. పొంగులేటి చెప్పింది తప్పా అనేది తేల్చాలి. దీనిపై ఆయనే సమాధానం ఇవ్వాలి..’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇవి నిజాలు కావా? అప్పుడెందుకు చెప్పలేదు? ‘రాఘవ మీద కేసులు పెట్టాం.. డబ్బులు వసూలు చేశామని మీ ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి, మీ సహచరులే చెప్పారు.. నాలుగు శాఖల అధికారులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు.. చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖలు రాశారు.. కంటైనర్‌పై కాంగ్రెస్ జెండా లేదా?.. రాఘవ పేరు లేదా?.. అధికారుల నోటీసులకు నీ ఉద్యోగి రిసీవ్డ్ అని సంతకం పెట్టలేదా?.. ఆ డాక్యుమెంట్లనే కదా నేను అసెంబ్లీలో చూపించింది.. ఇవి నిజాలు కావా? ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి చెబుతున్నప్పుడు నువ్వు అసెంబ్లీలోనే ఉన్నావు కదా.. అప్పుడు ఇది నాది కాదు, అసలు రాఘవకు మైన్ లేదని ఎందుకు చెప్పలేదు? అప్పుడు అసెంబ్లీలో చెప్పకుండా 12 రోజుల తర్వాత నాకేం సంబంధం లేదంటూ బుకాయిస్తున్నాడు..’అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నాదర్గుల్ భూములను కాపాడింది బీఆర్ఎస్సే.. ‘నాదర్గుల్ భూములు బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్ అయ్యాయని చిల్లర కథ చెబుతున్నారు. 2016లో ఈ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే, 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టి కాపాడింది మా ప్రభుత్వమే. కంపెనీలు హైకోర్టుకు పోతే చివరకు డివిజన్ బెంచ్ అవి సీలింగ్ భూములే.. అమ్మినవారి మీద, కొన్నవారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే జడ్జిమెంట్ ఇచ్చింది నిజం కాదా? వీటిని ఎందుకు దాస్తున్నావ్? ఏక్యూ స్క్వేర్‌లో నీ కొడుకు భాగస్వామి కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ప్రభుత్వ భూములే అని మా ఆర్డీఓ సుప్రీంకోర్టులో ఫైల్ చేశాడని పొంగులేటి చెబుతున్నాడు. æమరి బోర్డుల మీద రోజుకొక పేరు (కోహినూర్, శిల్ప, ఏక్యూ స్క్వేర్, కోహినూర్ సింప్లెక్స్ వంటివి) ఎందుకు మారుతున్నాయి? ఏక్యూ స్క్వేర్‌లో నీ కొడుకు భాగస్వామి కాదా? శిల్పతో రాఘవ కంపెనీకి హైదరాబాద్‌లో వ్యాపార సంబంధాలు లేవా? ఇవి నిజాలు కావా?..’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉన్న ఆ ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకోవాలని.. బౌన్సర్లు, ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలనను మాఫియాకు అప్పగించినట్టయ్యింది: ప్రవీణ్‌కుమార్ వనపర్తి: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లను బాంబులు పెట్టి పేల్చారని ఏఈ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎందుకు పూర్తి చేయడం లేదని సభలో మాట్లాడిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు పాలనను మాఫియాకు అప్పగించినట్లు అయ్యిందని విమర్శించారు. మానేరు చెక్‌డ్యాంను సైతం కాంగ్రెస్ నాయకులు ఇసుక దందా కోసం ఒక్కపూటలో పేల్చి వేశారని ఆరోపించారు. దేశాల మధ్య యుద్ధాలు జరిగినా సాగునీటి ప్రాజెక్టులపై బాంబులు వేసే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్‌రావు, కేటీఆర్.. తాటాకు చప్పుళ్లకు బెదరం
సాక్షి, హైదరాబాద్: ‘హరీశ్‌రావు, కేటీఆర్...మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. మీ స్వలాభం, స్వార్థం కోసం, పదేళ్ల కాలంలో సంపాదించిన అక్రమాస్తులను కాపాడుకోవడం కోసం కారు కూతలు కూస్తే మా ప్రభుత్వం భయపడదు. అడవి పంది బురదను తెచ్చి సింహానికి పూయాలని చూస్తే ఆ సింహం తిరగబడి బురదలోంచి లేవకుండా అడవి పందిని తొక్కి చూపిస్తుంది. పదేళ్లలో మీరు చేసిన అక్రమాల చిట్టా, భూ దందా వ్యవహారాలు, అన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసే సందర్భం త్వరలోనే వస్తుంది...’ అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. తన తప్పు ఉంటే ముక్కు నేలకు రాస్తానని, ప్రధాన ప్రతిపక్షం దగ్గర ఏమేం ఉన్నాయో అన్నీ చెప్పాలని, వాటన్నింటిపై విచారణ జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇటీవల తనను ఉద్దేశించి చేస్తున్న ఆరోపణలపై బుధవారం ఆయన స్పందించారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, నవీన్‌యాదవ్, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, శ్రీగణేశ్‌లతో కలిసి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలతో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తమ ఆస్తులు ఎక్కడ బయటకు వస్తాయన్న ఆందోళనతో.. ‘మేం కేరళ ఎన్నికల హడావుడిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే కొందరు నాయకులు పచ్చి అబద్ధాలతో పలు ఆరోపణలు చేశారు. అబద్ధాల రావు, డ్రామాల రావు, శకుని మామ టీం కలిసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. పదేళ్ల క్రితం తమ ఆస్తులు, ఇప్పటి ఆస్తులు ఎక్కడ బయటకు వస్తాయోననే ఆందోళనతో అబద్ధాలే ఎజెండాగా పెట్టుకుని ప్రేలాపనలు చేస్తున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జూపల్లితో పాటు నాపై అసెంబ్లీ సాక్షిగా నిందలు వేస్తున్నారు. పదేళ్లలో వారికి అంటిన బురదను మాకు అంటించాలని చూస్తున్నారు. ఆ భూమి బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్టర్ అయ్యింది.. నాదర్గుల్లోని 613 సర్వే నంబర్లో ఉన్న 373.22 ఎకరాల భూమిని బీఆర్ఎస్ దొరలు అధికారంలో ఉన్నప్పుడే 1–9–2014న యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా ఎస్టేట్స్, ఒమెగా డెవలపర్స్ అనే కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే భూమిని 24–09–2016న మ్యుటేషన్ కూడా చేశారు. ఈ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? (10–02–2021, 05–12–2021, 05–01–2022, 17–11–2022 తేదీల్లో గూగుల్ మ్యాప్‌లు చూపించి ఆ భూమిలో ఏం జరిగిందో వివరించారు.) షీట్లు పెట్టి రోడ్లు వేసింది మీరు కాదా? ఈ భూమిని నాలా కన్వర్షన్ చేయడం లేదని 2022లో ఆ కంపెనీలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై కౌంటర్ వేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక 17–03–2025న కౌంటర్ వేశాం. అసలీ భూమిని కాపాడేందుకు కొట్లాడుతోందే మేము. మేం అధికారంలోకి వచ్చాక ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించలేదు. ఈ భూమికి సంబంధించిన ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేదు. అలాంటప్పుడు మాకేం సంబంధం ఉంటుంది? ఈ మూడు కంపెనీల్లో నా భార్య, కొడుకు, కుటుంబ సభ్యుల్లో ఎవరు భాగస్వాములుగా ఉన్నా చాలెంజ్. ఖబడ్దార్... అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. ఓ పత్రికలో దీని గురించి వార్త రాసిన రెండు రోజులకు అబద్ధాలరావు, శకుని కొడుకు, ఆ మేఘా సంస్థ అధినేతతో రహస్యంగా కలిసి సెటిల్ చేసుకున్నారు. ఆ తర్వాతే ఆరోపణలను నావైపు మళ్లించారు. శకుని మామ, కొడుకు ఇద్దరే సెటిల్ చేసుకుంటారేమోనని అబద్ధాలరావు తన వానర సైన్యాన్ని వేసుకుని భూమి మీదకు వెళ్లాడు..’ అని పొంగులేటి చెప్పారు. వట్టినాగులపల్లి భూమిని నాలా కన్వర్షన్ చేసిందెవరు? ‘వట్టి నాగులపల్లి బాగోతం పచ్చి అబద్ధం.111 జీవో పరిధిలో ఉన్న ఆ భూమిని అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 15 రోజుల ముందు 14–08–2023న నాలా కన్వర్షన్ చేసిందెవరు? షా కుటుంబంలో చిచ్చు ఎందుకు పెట్టారు? ఓఆర్ఆర్ కింద కోల్పోయిన భూమి మేరకు శకుని మామకు కావాల్సిన వారి కంపెనీ తీసుకున్న భూమిలో వాటా తగ్గుతుందనే పైభాగంలో ఉన్న షా కుటుంబ సభ్యులను రెచ్చగొట్టారు. ఆ భూమి కోసమే ఇదంతా చేస్తున్నారు. ఆ భూమిలోని మరో భాగాన్ని షా కుటుంబం నుంచి డెవలప్మెంట్కు తీసుకున్న కంపెనీలో నా కొడుకు భాగస్వామి. నా కొడుకు ఉన్న కంపెనీ ఆ భూమిని కొనలేదు. షా కుటుంబ సభ్యుల దగ్గర డెవలప్మెంట్ కోసం తీసుకుంది..’ అని మంత్రి చెప్పారు. ‘రాఘవ’ రోడ్డు మెటీరియల్ కొనుక్కుంది ‘కొత్వాల్‌గూడ క్రషర్ విషయంలో కూడా ఎన్నో అబద్ధాలు చెప్పారు. తిరుమల పేరుతో 2007 నుంచే క్రషర్ ఉంది. పవర్ బిల్లులు, జీఎస్టీ బిల్లులు అన్నీ ఉన్నాయి. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో క్రషర్లను సీజ్ చేశారు. ఆ తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్స్ వేసే రేడియల్ రోడ్లకు అవసరమైన మెటీరియల్‌ను తిరుమల మెటీరియల్ ఇండస్ట్రీస్ నుంచి కొనుక్కుంది. బుద్వేల్‌లో గత ప్రభుత్వం అమ్మిన భూమిలోని బండరాళ్లను మాత్రమే క్రష్ చేశారు. వాళ్లు కొత్తగా క్రషర్ పెట్టలేదు. ఒక్క బ్లాస్టింగ్ కూడా చేయలేదు. దీనిపై ఆర్టీఐ కింద అబద్ధాలరావు, టీం సమాచారం అడిగి ఇదిగో మైనింగ్ చేస్తున్నారంటూ అసెంబ్లీలో పేపర్లు చూపెట్టారు. అయితే ఆ పేపర్ మెటల్ సీనరేజి కట్టాలని ఇచ్చింది. దాన్ని చూపించి అదిగో క్రషర్కు, రాఘవకు సంబంధం అంటారు. క్రషర్కు, రాఘవకు ఏం సంబంధం? అబద్ధాల రావు అయితే ఉరి వేసుకుంటా అంటాడు. పెట్రోల్ కొంటానికి డబ్బు ఉంటుంది కానీ అగ్గిపెట్టె లేదన్న దాంట్లో నిజం ఎంత ఉందో ఈ ఉరి కూడా అంతే నిజం. మీరెలా దోచుకున్నారో ప్రతిదీ బయటకు వస్తుంది.. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో మీకు తెలియదా? దాని మోచేతి నీళ్లు తాగినోళ్లు మీరు. కోటి రూపాయల విరాళం మీ పార్టీకి ఇచ్చింది. శకుని మామ కూతురు అబద్ధాల రావు గురించి కాళేశ్వరం నుంచి డెయిరీ వరకు 10 అభియోగాలు మోపింది. ఒక్కదానికయినా సమాధానం చెప్పాడా? రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..ఆయన పేరు అబద్ధాల రావు అని పెట్టాలా? బ్లాక్మెయిల్రావు అని పిలవాలా? అగ్గిపెట్టెరావు బాగుంటుందా? సూచనలివ్వండి. అబద్ధాల రావు, డ్రామాల రావు, శకుని మామ కుటుంబ సభ్యులకు 2014లో ఉన్న ఆస్తులేంటి? ఇప్పుడున్న ఆస్తులేంటి? ఏ ప్రాంతీయ పార్టీకి లేని ఆస్తులు వాళ్ల పార్టీకి ఎలా వచ్చాయి? ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ సీబీసీఐడీ ద్వారా ఎంక్వైరీలో బయటకు వస్తుంది..’ అని పొంగులేటి అన్నారు. -
రేవంత్ ఆలోచనలన్నీ పేదల భూములపైనే
సాక్షి, హైదరాబాద్: సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలన్నీ పేదల భూములపైనే ఉన్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. దళిత, గిరిజన, బలహీనవర్గాల భూములపై గద్దల్లా వాలుతూ ఇందిరమ్మ పాలనలో ఇచ్చిన పట్టాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కాళ్లాపూర్, రాపోల్లో పారిశ్రామిక పార్కు మూలంగా భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు మంగళవారం కోకాపేటలోని తన నివాసం నుంచి హరీశ్ బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ పచ్చటి పొలాల్లో పరిశ్రమల పేరిట రైతుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. రేవంత్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని, ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, దుర్మార్గపు పాలన అని, రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తాము అరెస్టులు చేయమని,, తమది ప్రజాపాలన అని ఆదిలాబాద్ జిల్లా సభలో సీఎం చెప్పి 24 గంటలు కాకముందే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడం దౌర్జన్యమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్యాయంగా పేద రైతుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, పరిశ్రమల పేరిట 40 వేల ఎకరాలు లాక్కునేలా ప్రణాళికలు చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.ప్రభుత్వానికి ఎందుకంత భయం?భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని హరీశ్ ప్రశ్నించారు. రేవంత్ పాలనలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పి నేడు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని, రాష్ట్రంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రెండు మూడు పంటలు పండే పచ్చని భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని, కాళ్లాపూర్, రాపోలులో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. రేవంత్ పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు. రేవంత్‌ను మించిన రావణాసురుడు రాష్ట్రంలో మరొకరు లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ గెలిచే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. రేవంత్ మళ్లీ గెలవడం పగటి కల అని, వచ్చేది రామరాజ్యం, కేసీఆర్ రాజ్యమేనని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.హరీశ్‌రావు తదితరులు అరెస్టు..విడుదలపరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్ రావును నార్సింగి అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెంట బయలుదేరిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తదితరులను లారీలు అడ్డుపెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు చేసిన నేతలను ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం నుంచే హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. శంషాబాద్ పోలీసు స్టేషన్ ఎదుట కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మంగళవారం మధ్యాహ్నం హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులను పోలీసులు విడుదల చేశారు. -
‘రేవంత్.. మళ్లీ గెలవడం కాదు.. సింగిల్ డిజిటే మీకు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ సీఎం రేవంత్ చేసే వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు హరీష్‌రావు. కాంగ్రెస్ మళ్లీ గెలవడం కాదు.. సింగిల్ డిజిట్‌కే పరిమితం అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(మంగళవారం, ఏప్రిల్ 7వ తేదీ) పరిగి పర్యటనకు వెళ్తున్న హరీష్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి శంషాబాద్ పీఎస్‌కు తరలించారు. దీనిలో భాగంగా ఆయన్ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు హరీష్. ‘మీరు మళ్లీ గెలవడం కాదు కదా.. ఈసారి సింగిల్ డిజిటే మీకు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వడం ఖాయం. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?, పరిగిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే మమ్మల్ని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి పాలన.. గడీల పాలన... బేడీల పాలన గుడ్డి పాలన. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టండి. ఎస్సీ ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్నా భూములను ఎందుకు లాక్కుంటున్నారు. మీ పాలన అంతా బోగస్ మాటలు బోగస్ పాలన. రేవంత్ రెడ్డికి మించిన రావణాసురుడు ఎవరైనా ఉన్నారా?, పరిగిలో భూముల లాక్కొని తన అన్య కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు 900 రోజులైనా ఎందుకు పూర్తి చేయలేదు?, వచ్చే ఎన్నికల్లో రాబోయే కేసీఆర్ రాజ్యమే’ అని హరీష్ స్పష్టం చేశారు. -
అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత.. హరీష్ రావు అరెస్ట్
హరీష్ రావు పరిగి పర్యటన అప్డేట్స్.. హరీష్ రావు అరెస్ట్.. పరిగి పర్యటనకు బయల్దేరిన హరీష్ రావును అప్ప జంక్షన్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు..హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు..అరెస్ట్ చేసిన నేతలను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ నేతల తరలింపు.పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ నేతల ఆందోళన.. రోడ్డుపై ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అదుపులో తీసుకుంటున్న పోలీసులుపోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదంహరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు👉అంతకుముందు.. మంగళవారం ఉదయం మాజీ మంత్రి హరీష్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయనను పోలీసులు గృహనిర్భంధం చేశారు. హరీష్‌ను పరిగి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు.👉కాగా, ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు హరీష్ పరిగి వెళ్లనున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అలాగే, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుభప్రద్ పటేల్‌ను ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు.👉అయితే, పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,197 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమ భూములను ఇచ్చేది లేదని రైతులు రిలే దీక్షలు చేపట్టారు. రైతు ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల్లో పర్యటించి హరీష్‌రావు సంఘీభావం తెలపనున్నారు.మాజీ మంత్రి @BRSHarish గారు హౌస్ అరెస్ట్.. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డగింత.ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు.హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీస్ బలగాలు.మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, పలువురు ఉమ్మడి… pic.twitter.com/sMXVrP1nvU— Office of Harish Rao (@HarishRaoOffice) April 7, 2026 -
రూ.3 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే కుట్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి.. సెటిల్మెంట్లకు దిగుతోంది. ఇప్పటికే నాదర్గుల్లోని రూ.7 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు యత్నించిన ప్రభుత్వ పెద్దలు.. తాజాగా కోహెడలోని మరో రూ.3 వేల కోట్ల విలువ చేసే 200 ఎకరాల పండ్ల మార్కెట్ భూములను కూడా తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఎమ్మెల్యేలు పి.సబితారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్‌తో కలిసి సోమవారం ఆయన కోహెడలో పర్యటించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. భూములను కొల్లగొట్టేందుకే‘కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్‌ను కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ మేరకు 2020లో జీఓ నంబర్ 11 తీసుకొచ్చి మార్కెట్‌ను నోటిఫై చేశాం. భూములు కోల్పోయిన రైతులకు రూ.10 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాం. జీఓ నంబర్ 216 ద్వారా మార్కెట్ ఖాతాలో రూ.350 కోట్లు జమ చేశాం.రూ.1,000 కోట్ల అంచనాలతో అత్యాధునిక మార్కెట్ యార్డ్‌కు డీపీఆర్ కూడా సిద్ధం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు. టీజీఐఐసీ పేరుతో విలువైన ఈ భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తిగా రైతుల సమస్య. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పని చేయాలి. కానీ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కమీషన్ల కోసం పనిచేస్తోంది. ‘దిల్’భూములను మార్కెట్కెలా కేటాయిస్తారు?ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దిల్ భూముల్లో మార్కెట్ కట్టిస్తాం అంటున్నారు. ఏపీ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(దిల్) భూములపై అనేక వివాదాలు ఉన్నాయి. వీటిలో ఏపీ వాటా అడుగుతోంది. ఈ భూములపై కోర్టు కేసులు కూడా ఉన్నాయి. పలువురు పేద రైతులు ఈ భూములపై ఆధారపడి ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేని భూములను అనుయా యులకు అప్పగించి.. వివాదాస్పద దిల్ భూములను మార్కెట్‌కు ఎలా కేటాయిస్తారు? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్ను కోహెడ భూములపై పడింది. ఇప్పటికే లీలా హోటల్ కేంద్రంగా కేరళకు చెందిన నలుగురు దళారులు వీటిని కొల్లగొట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. 30 వేల మంది రైతులు కావాలో? లేక ముగ్గురు దళారులు కావాలో? ప్రభుత్వమే తేల్చుకో వాల్సి ఉంది. ఇక్కడ మార్కెట్ నిర్మించకపోతే ఎంత దూరమైనా పోరాడుతాం. రైతుల పక్షాన కొట్లాడుతాం’అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ పెద్దల చెరలో 373 ఎకరాలు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో రూ.7 వేల కోట్ల విలువైన భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ భూమిపై కన్నేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం 373 ఎకరాల భూమిని ఆక్రమించిందన్నారు. తెలంగాణభవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. నాదర్గుల్లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119)లో ఉన్న 373 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదేనని గతంలోనే స్పష్టమైందన్నారు. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఏపీఐఐసీకి అప్పగించారని తెలిపారు.2022 అక్టోబర్ 13న హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కూడా ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని స్పష్టం చేశాయని వివరించారు. విక్రయాల్లో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం ముందు ఈనెల 7న విచారణకు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎలాంటి స్టే లేదని, కాబట్టి హైకోర్టు తీర్పే అమల్లో ఉందని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ చట్టానికి విరుద్ధంగా విక్రయాలు ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని, అయినా శివరాజ్ బహదూర్ 2016లో ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ కంపెనీలకు విక్రయించాడని ఆరోపించారు. సెక్షన్ 8, 17 ప్రకారం డిక్లరేషన్ లేకుండా విక్రయం చెల్లదని, సెక్షన్ 22ఏ కింద ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని కందుకూరు ఆర్డీఓ స్పష్టం చేశారని చెప్పారు. ఈ భూముల్లో సుమారు 600 మంది పేద రైతులు తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం వారిని భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లు, రౌడీలను పెట్టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మహిళా రైతులు కౌసల్య, మమతలను బెదిరిస్తూ, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆఫర్ చేసి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, బోర్లు, కంచెలను ధ్వంసం చేశారని చెప్పారు. మంత్రి పొంగులేటి కుటుంబ హస్తం ఈ కబ్జాల వెనుక సాక్షాత్తూ మంత్రి పొంగులేటి కుటుంబం ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. శిల్పా ఇన్ఫ్రా, శిల్పా రాఘవ ఎల్ఎల్పీ, ఎక్యూ స్కై్వర్ రియల్టర్స్ వంటి సంస్థల్లో మంత్రి కుమారుడు హర్షారెడ్డి తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. కోహినూర్ గ్రూప్, శిల్పా ఇన్ఫ్రా, మెగా కంపెనీ పేర్లతో బోర్డులు మారుస్తూ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ‘చెరువులను కాపాడుతున్నానని చెప్పే సీఎం రేవంత్‌రెడ్డికి ఈ ఆక్రమణలు కనిపించవా? ప్రతిపక్షాలపై సిట్లు వేస్తారు కానీ ఇక్కడ ఎందుకు స్పందించరు’అని ప్రశ్నించారు. తక్షణమే హైడ్రా ద్వారా అక్రమ కాంపౌండ్ వాల్‌ను కూల్చాలని, ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలని, రైతులను తిరిగి భూముల్లోకి అనుమతించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రేపు ఉదయం వరకు హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నాదర్గుల్కు వెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
లచ్చమ్మ కుంట చెరువు.. హైడ్రాకు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: భూముల విషయంలో పెద్దలే గద్దలుగా మారితే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నాదర్‌గూల్ భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి సభ్యులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ నడిబొడ్డున 7000 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళితుల భూములను కాంగ్రెస్ భక్షించే ప్రయత్నం జరుగుతోంది. నాదర్‌గూల్ భూముల కుంభకోణం జరిగింది. పేదల భూముల్లోకి వారిని పోకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాదర్‌గూల్ భూముల కోసం చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ భూమి తనదేనని రాజ్ బహుదూర్ కోర్టులో పోరాటం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌లో ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమిగా పేర్కొంది. ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ఆర్డీవోది. దీనిపై అక్కడి రైతులు రెవెన్యూ అధికారులకి, హైడ్రా కమిషనర్‌కి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి లాకుంటున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రే ఈ భూముల ఆక్రమణ వెనుక ఉంటే అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భూములను ఆక్రమిస్తే ఎవర్ని వదలను అన్న సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూములపై హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు.లచ్చమ్మ కుంట చెరువును అక్కడ పెద్దలు ఆక్రమిస్తుంటే హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారు?. చెరువులను కాపాడుతా అనే హైడ్రాకు కళ్లు కనబడటం లేదా?. హైడ్రా కమిషనర్‌కి సవాల్ చేస్తున్నా. రేపు హైడ్రా కమిషనర్ రావాలి లేదా మా ఎమ్మెల్యేలతో నేనే వెళ్తాను. మరోవైపు 80 ఎకరాల గుట్టలు మాయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నెల 7న ఈ భూములపై సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఈ భూమి కోహినూర్‌కి చెందింది అని బోర్డు పెట్టారు. శిల్పా ఇన్ఫ్రా పొంగులేటి కుమారుడిది. ఈ భూముల వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారు అంటూ’ వ్యాఖ్యలు చేశారు. -
వాళ్లు పెట్టారు.. వీళ్లు తీశారు
గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మాజీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టడంపై వివా దం రేగింది. ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో శనివారం పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారి గుండా కేసీఆర్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా కార్యాలయం ప్రధాన ద్వారం అద్దాలు పగిలిపోయాయి. కాంగ్రెస్ శ్రేణులు వారి వెంట తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని అక్కడ పెట్టి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ సమస్యలను పట్టించుకోని కేసీఆర్‌కు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆంక్షారెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అక్కడికి చేరుకొని కాంగ్రెస్ వైఖరిపై విరుచుకుపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు క్యాంపు కార్యాలయంలో రేవంత్‌రెడ్డి ఫొటోను తొలగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అధికార మదంతోనే దాడి: హరీశ్‌రావు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో విర్రవీగుతూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ కాంగ్రెస్ నాయకులు బిహార్ గ్యాంగ్‌ను తలపిస్తున్నారన్నారు. ఓ వైపు విద్వేష ప్రసంగాల బిల్లు పేరిట ప్రజలు, ప్రతిపక్షాల నోర్లు మూయిస్తూ మరోవైపు గూండా రాజ్యం నడుపుతున్నారని మండిపడ్డారు. ‘సీఎం, మంత్రులు పొలిటికల్ టూర్లు చేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేస్తూ ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నారు. దాడులు ఆపకపోతే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఖండించారు. -
గజ్వేల్‌లో టెన్షన్ టెన్షన్ KCR క్యాంప్ కార్యాలయంపై దాడి
-
ఆరు గ్యారంటీలేవీ?
నారాయణపేట: ‘ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ జరుగుతున్నాయి. పిల్లలు పుడితే గానీ కల్యాణలక్ష్మి రావడం లేదు. ‘పాలమూరు బిడ్డలను మోసం చేసి గద్దెనెక్కావు. నీ సొంత నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేపట్టావా.. కొడంగల్‌కు రా చర్చించుకుందాం’అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో గురులోకా మసంద్ బావాజీని శుక్రవారం ఆయన దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని ఎక్కామెడ్ శివారులో మీడియాతో మాట్లాడారు.రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నిలదీస్తే ఇచ్చింది 16 వేల ఉద్యోగాలేనని చెప్పారన్నారు. ఇప్పటికే రైతుబంధు మూడుసార్లు ఎగ్గొట్టావని, వడ్లకు బోనస్ రెండుసార్లు ఇవ్వలేదని.. కూట్లో రాయి తీయనోడు.. ఏట్లే రాళ్లు తీశాడంటా అన్నట్టుంది నీ పరిస్థితి అంటూ రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు. ‘మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు.. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. మళ్లీ కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. రేవంత్.. నీది ఐరన్ లెగ్ అక్కడ సైతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం’అంటూ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 1.83 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు చేపడితే, మిగిలిన 30 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు కావొస్తున్నా పూర్తి చేయడం లేదన్నారు. మూడవ ఫేజ్‌లో ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకంలోని కాల్వలను తవి్వతే కొడంగల్‌కు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.90 శాతం పనులు పూర్తి చేసిన పాలమూరును పక్కనపెట్టి కమీషన్ల కోసం రూ.4,500 కోట్లతో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అందాల పోటీలు, ఫుట్‌బాల్ షో అంటూ వేల కోట్లు ఖర్చు చేశావు గానీ.. లంబాడ సోదరులకు చేసింది ఏమీ లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పాల్గొన్నారు. -
చర్చించకుండా పారిపోయారు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ టి.హరీశ్‌రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్‌రెడ్డి తొండలు, కండల భాష వాడారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత సహాఅనేక అంశాలపై ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయన్నారు. బడ్జెట్, బిల్లులను ఆమోదించుకోవాలనే రాజ్యాంగ అనివార్యత వల్లే సభను తూతూ మంత్రంగా నడిపారన్నారు. 19 అంశాలపై బీఆర్ఎస్ స్వల్పకాలిక చర్చల కోసం నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ముందుకు రాలేదని, ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు రాకుండా సాగదీత ధోరణిలో సభ జరిగిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలు, డిప్యూటీ సీఎం సన్నద్ధత పేరిట, విరామం పేరిట గంటల కొద్దీ సభ వాయిదా వేశారని, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ సమావేశాలను 30వ తేదీన హడావుడిగా ముగించారని హరీశ్‌రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు డైవర్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే డైవర్షన్ రాజకీయాలు చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేసి బిల్లులు, పద్దులు ఆమోదించుకున్నారన్నారు. కత్తుల కోలాటం ఆడుతాం.. తలలు తీస్తాం.. సామాజిక బహిష్కరణ చేస్తాం.. అంటూ కాంగ్రెస్ సభ్యుల మాటలను సీఎం పక్కన కూర్చుని ప్రోత్సహించారన్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెండేండ్లుగా సభలో వాడుతున్న భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినా రూ.లక్ష కోట్లు కొట్టుకు పోయాయని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులో కామెంట్లు చేస్తున్నారని, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అచ్చం రేవంత్ మాటల తరహాలోనే ఉండడం కాంగ్రెస్, బీజేపీ నడుమ ఉన్న ఫెవికాల్ బంధానికి నిదర్శనమన్నారు. -
మంత్రి కుమారుడే భూ కబ్జాకు పాల్పడ్డాడు: కేటీఆర్
-
సిట్టింగ్ జడ్జితో ఓకే: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు, బావమరిదితోపాటు తన సోదరుడు, బావమరిది, కుటుంబ సభ్యులపై సీబీసీఐడీ, హౌస్ కమిటీతో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ప్రకటించారు. సీఎం సోదరుల టీడీఆర్ కుంభకోణం, బావమరిది అమృత్ కుంభకోణంతోపాటు ఇతర అక్రమాలపై రేవంత్‌రెడ్డి కూడా విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. తాను చేసిన సవాల్‌పై తోక ముడిచి పారిపోకుండా, చెంచాలతో తిట్టించకుండా సీఎం రేవంత్‌రెడ్డి దమ్ముంటే స్పందించాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నడుమ రాష్ట్రంలో భూముల సెటిల్‌మెంట్‌తోపాటు అనేక కుంభకోణాల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేసే దమ్ము సీఎంకు లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి అక్రమాలు బయటపడటంతో అసెంబ్లీ వేదికగా తనపై బురదచల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి సెటిల్మెంట్కు వచ్చిన వారికి క్లియర్ చేస్తున్నారు. సెటిల్మెంట్లకు ముందుకు రాని వారిని బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూ కుంభకోణాలను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతాం. సీఎం, మంత్రి కుంభకోణాలపై విచారణ చేసేంత వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదు’అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. సొంత ప్రయోజనాల కోసం మంత్రి పొంగులేటి తాను ఎన్నడూ ఫోన్ చేయలేదని.. గృహలక్ష్మి పథకం బిల్లుల విడుదల కోసం ఒకట్రెండు సార్లు మంత్రితో ఫోన్లో మాట్లాడినట్లు హరీశ్‌రావు వెల్లడించారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి.. ‘సీబీసీఐడీ సీఎం రేవంత్‌రెడ్డి జేబు సంస్థ. మైనింగ్ అక్రమాలపై నిష్పాక్షిక విచారణ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి లేదా మంత్రివర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలి. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి నడుమ ఫెవికాల్ బంధం ఉండటం వల్లే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ అప్పగించడంతోపాటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడటంతో ఆత్మరక్షణలో పడిపోయిన రేవంత్‌రెడ్డి.. దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసెంబ్లీలో మాకు మైకు ఇవ్వకుండా హౌస్ కమిటీ వేయాలనే మా డిమాండ్‌పై దళితులంటూ రాజకీయం చేస్తున్నాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నాం. గతంలో సీఎం రేవంత్ వాడిన భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. దళితులపై కాంగ్రెస్ మాటలో ప్రేమ చూపిస్తే బడ్జెట్లో కేటాయింపులు, సంక్షేమ పథకాల ఆచరణలో మేము చూపించాం. దళితులపై రేవంత్‌రెడ్డి కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని స్వయంగా రేవంత్‌రెడ్డే చెప్పాడు. మంత్రి తప్పు చేస్తే సీబీసీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా? పొంగులేటిని కాపాడే క్రమంలో ప్రభుత్వం మరో 100 అబద్ధాలు చెప్పింది. అక్రమ మైనింగ్‌లో రూ. వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తాము సీఎంకు అందజేసిన 20 అంశాలపై సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పొంగులేటి అంశంపై భవిష్యత్తులో ఏం చేయాలో తమకు తెలుసని.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హరీశ్‌రావు తెలిపారు. ముఠా నాయకుడిలా రేవంత్: వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రి పొంగులేటి అక్రమాలను బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆధారాలతో సహా బయటపెడితే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ‘రేవంత్ ఎదురుదాడికి దిగి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ మా నేతలను బెదరిస్తున్నాడు. రేవంత్ సభా నాయకుడిలా కాకుండా ముఠా నాయకుడిలా కనిపిస్తున్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అవినీతి ఆరోపణలపై హౌస్ కమిటీ డిమాండ్ నిరాకరించడం సరికాదు. రేవంత్ వ్యాఖ్యలను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. ‘మిమ్మల్ని తొక్కుతా’అని మాట్లాడినందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేధావి అయితే ఆయన్ను సీఎం చేయాలి. ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బీఆర్ఎస్ భయపడదు. అవినీతిపై ప్రశి్నస్తూనే ఉంటాం’అని వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. -
‘మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు’
హైదరాబాద్: మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతిక పాల్పడిందనే విషయం ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు పేర్కొన్నారు. కాకపోతే డైవర్షన్ కోసం రేవంత్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. మంత్రిని కాపాడటానికే సీబీసీఐడీ విచారణ వేశారని, హౌస్ కమిటీ గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ చేయించాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈరోజు(ఆదివారం, మార్చి 29వ తేదీ) ప్రెస్మీట్లో హరీష్‌రావు మాట్లాడుతూ.. ‘ పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైంది. తప్పు జరిగిందని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారు. మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి పది తప్పులు చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది’ అని విమర్శించారు.సీఎం రేవంత్‌కు హరీష్ సవాల్సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్ విసిరారు. ‘మీ తమ్ముడు చేసిన అవినీతిపై విచారణకు సిద్ధమైతే.. హౌస్ కమిటీ విచారణకు నేను సిద్ధం. హౌస్ కమిటీ విచారణ.. సీఐడీ విచారణ కాకుండా, ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దాం.. సీఎం రేవంత్ సిద్ధంటే.. నేను సిద్ధం’ అని చాలెంజ్ చేశారు. నిన్న(శనివారం, మార్చి 28వ తేదీ) అసెంబ్లీలో హరీష్ మాట్లాడుతూ.. నగరం నడిబొడ్డను అక్రమ మైనింగ్ జరుగుతుందని ధ్వజమెత్తారు. కంచె చేనుమేసినట్లు.. రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్స్ కు ఎలాంటి అనుమతులు లేవని,. జీవో త్రిబుల్ వన్ వైలెట్ చేస్తూ ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు, క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలని, నిబంధనలను పాటించకుండా క్రషర్ నడుపుతున్నారని మండిపడ్డారు. -
అనుమతుల్లేకుండా ‘రాఘవ’ మైనింగ్: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనుమతుల్లేకుండానే హైదరాబాద్‌లో మైనింగ్ చేస్తోందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యుడి ఆధ్వర్యంలో సభా సంఘం ఏర్పాటు చేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని పట్టుబట్టారు. హరీశ్‌కు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ వెల్‌లోకి దూసుకెళ్లి అక్కడే బైఠాయించి నినాదాలతో సభను హోరెత్తించారు. తప్పు చేయ కపోతే పొంగులేటికి భయం ఎందుకన్నారు. దాడుల్లో దొరికినా ప్రభుత్వ చర్యలేవీ? బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా శనివారం శాసనసభలో గనుల శాఖపై చర్చలో సాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి మాట్లాడిన తర్వాత హరీశ్‌రావు మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎంతో ఖనిజ సంపద ఉంది, దాన్ని రక్షించే రక్షకులే భక్షకులయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతుల్లేకుండా దర్జాగా దందా చేస్తున్నారు. జీవో 111కు విరుద్ధంగా కొత్వాల్‌గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ బరితెగించి మైనింగ్ చేస్తోంది. అక్కడ ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టొద్దు. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్‌ను డీజిల్ జనరేటర్లపై నడుపుతోంది. జీవో 26 ప్రకారం స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి. పరిశ్రమల శాఖ అనుమతి తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీఎఫ్ఈ, సీఎఫ్ఓ సరి్టఫికెట్లు తీసుకోవాలి. కానీ ఆ సంస్థ విద్యుత్ కనెక్షన్ తీసుకోకుండా దొంగచాటుగా డీజిల్ జనరేటర్లతో క్రషింగ్ చేస్తోంది. 2025 మే 21న మైనింగ్ డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ క్రషర్ తనిఖీకి ఆదేశించారు. రెవెన్యూ, పీసీబీ, ఎస్పీడీసీఎల్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలను పట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న డిమాండ్ నోటీసు జారీ చేసి రూ. 24 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. మార్చి 4న మళ్లీ తనిఖీ చేస్తే 11,200 మెట్రిక్ టన్నుల ముడి సరుకు దొరికింది. మార్చి 13న మరో షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీజిల్ జనరేటర్లతో కాలుష్యంపై స్వయంగా మైనింగ్ అధికారులే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. మైనింగ్ చట్టం ప్రకారం ఎండీఎల్, లైసెన్స్ లేకుండా క్వారీ నిర్వహిస్తే మొదటిసారి రూ. 10 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 25 వేల జరిమానా, ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాలి. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండుసార్లు పట్టుబడ్డా ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంది? ఆ కంపెనీపై ఎందుకింత ప్రేమ?’అని హరీశ్‌రావు నిలదీశారు. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయమా? ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన సంస్థ కావడంతోనే ప్రభుత్వం చర్యలకు వెనకడుగు వేసింది. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయం చేస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తమ్ముడి స్టోన్ క్రషర్లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెట్టారు. మరి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పొంగులేటి పేరు ప్రస్తావనపై మంత్రుల అభ్యంతరం.. హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సంబంధం లేని విషయంలో మంత్రి పొంగులేటి పేరు ప్రస్తావించారంటూ మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్‌తోపాటు విప్ ఆది శ్రీనివాస్, ఇతర కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. హరీశ్‌రావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని సభలో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని, హరీశ్‌రావు అభూత కల్పనలతో సభను తప్పుదోవ పట్టించడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. వెంటనే హరీశ్‌రావు క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల గ్రామంలో దళితులపై అరాచకాలు జరిగినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. లారీలను నిలిపివేయాలని అడిగిన ప్రజలను కొట్టి హింసించిన ఘటనలు మర్చిపోయారా?.. అప్పుడు సభాసంఘం ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాల్‌గూడ మైనింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఉంటే తప్పకుండా విచారణ చేపడతామని... తప్పు ఎవరు చేసినా ఉపేక్షించబోమని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మంత్రి వాకిటి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్‌లో ఇసుక మాఫియా లారీల కింద పడి పిల్లలు చనిపోతే కనీసం అటువైపు చూడని నేతలు ఇప్పుడు సభాసంఘం ఏర్పాటు చేయాలని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల వాదప్రతివాదనలతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ జోక్యం చేసుకొని హరీశ్‌రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చను కొనసాగించారు. -
ఇల్లీగల్ దందా.. హైదరాబాద్ నడిబొడ్డున ఉల్లంఘన..
-
‘అక్రమ మైనింగ్ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?’
హైదరాబాద్: నగరం నడిబొడ్డను అక్రమ మైనింగ్ జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. కంచె చేనుమేసినట్లు.. రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(శనివారం, మార్చి 28వ తేదీ) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మైనింగ్ అంశంపై హరీష్‌రావు మాట్లాడారు. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్స్ కు ఎలాంటి అనుమతులు లేవు. జీవో త్రిబుల్ వన్ వైలెట్ చేస్తూ ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?, క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలి. నిబంధనలను పాటించకుండా క్రషర్ నడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండిపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?, మైనింగ్ శాఖ షోకాజ్ నోటీసులతోపాటు డిమాండ్ నోటీసులు ఇచ్చింది. రెండవసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేని క్రషర్ ను మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ శాఖ లేఖ పంపినా చర్యలు లేవు. నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఊరి తీయండి. మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు క్లస్టర్ లో చిన్న తప్పు జరిగితే రాత్రికి రాత్రే జైల్లో పెట్టారు. మంత్రి పొంగులేటి రాజీనామ చేయాలి‘తప్పులు చేశారు కాబట్టే ముఖ్య నెత సంస్థకు నోటీసులు ఇచ్చారు. ముఖ్య నేత క్లస్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ మైనింగ్ కు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రిగా పొంగులేటి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారుహరీష్ వ్యాఖ్యలు ఖండించిన మంత్రి శ్రీధర్బాబుఅక్రమ మైనింగ్‌పై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. హరీష్‌రావు డిమాండ్ చేసినట్లు విచారణ చేయిస్తామని, అంతే కానీ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తాం అంటే ఊరుకోమన్నారు. పొంగులేటిపై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. సభ రికార్డుల నుంచి హరీష్ రావు వ్యాఖ్యలను తొలగించాలని, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. -
బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం గన్‌పార్కులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో.. పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని, బీసీలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మించాలని, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గన్‌పార్కు నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రధాన ద్వారం వద్ద ప్లకార్డులు చూపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతీ వార్షిక బడ్జెట్లో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను మోసగించారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీసీలు సమాధి చేయడం ఖాయమని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. -
ఆరోగ్యశ్రీలో కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం సభను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. గురువారం శాసనసభ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 జూన్ 2వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి ఆరోగ్యశ్రీ పథకానికి నెలకు రూ.32 కోట్లు ఖర్చు అవుతుండగా, 2023 నాటికి రూ.68 కోట్లకు చేరిందని చెప్పారు.ప్రస్తుతం నెలకు రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోందని, దీన్నిబట్టి చూస్తే ఆరోగ్యశ్రీపై చేస్తున్న ఖర్చులో సహజ పెరుగుదల మాత్రమే ఉందని, కొత్తగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆసుపత్రులకు బకాయిలు పెరిగాయన్నారు. ఆస్పత్రుల నిర్మాణం, సీఎంఆర్ఎఫ్ విషయంలో వాస్తవాలు వివరించేందుకు తమకు సభలో అనుమతి ఇవ్వడం లేదని హరీశ్‌రావు అన్నారు. వాయిదా తీర్మానాలు తిరస్కరణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తిరస్కరించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్లోలో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. రాష్ట్రంలో యువత డ్రగ్స్ బారిన పడటంపై చర్చించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ స్కీమ్, జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ తదితర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వా యిదా తీర్మానం ఇచ్చారు. వీటన్నిటినీ స్పీకర్ తిరస్కరించారు. ఈ మేరకు సభలో ప్రకటన చేశారు. -
ఎవరో ఎందుకు? నువ్వే పోటీ చెయ్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేసి గెలిచే వారికి మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పందించారు. ‘ఎవరో ఎందుకు.. నువ్వే పోటీచెయ్.. సిద్దిపేటలో నా మీద పోటీ చేయాల్సిందిగా రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి సీఎం కాలేడన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రేవంత్ పనితనం చూసి ఓటు వేసేందుకు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో హరీశ్‌రావు బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జీవన్‌రెడ్డి చేరికపై వేచిచూడండి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్లో చేరికకు సంబంధించి స్పందిస్తూ ‘వేచి చూడండి.. కొన్ని చెప్తే బాగుండవు.. చూస్తేనే బాగుంటాయి’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తాం. మహిళా రిజర్వేషన్లపై గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాదికి ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి, ప్రగతి దిశగా పనిచేస్తూ నష్టపోతున్నాయి’అని హరీశ్‌రావు చెప్పారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేటు మెంబర్ బిల్లుపై స్పీకర్‌ను మరోమారు కలుస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు తాము 15 అంశాలు ప్రతిపాదించినా ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నోటిఫికేషన్ల ద్వారా 50,785 ఉద్యోగాలు నోటిఫై చేసి 16,978 మాత్రమే భర్తీ చేసినట్లు ఒప్పుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 36 సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి తొమ్మిదింటికి మాత్రమే అధ్యక్షులను నియమించింది. 17 బోర్డులకు కనీసం కార్యాలయాలు కూడా లేవు’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు మరో వారం రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు. -
స్వచ్ఛత శూన్యం.. స్పష్టత కరువు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ మాత్రం స్వచ్ఛత లేదని, స్పష్టత, విశ్వసనీయత అసలు కన్పించడం లేదని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆకాశమంత హామీలిచ్చి బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించిందని అన్నారు. గత బడ్జెట్లు ’గాలి మాటలు’అయితే.. ఈ బడ్జెట్ అవాస్తవాల కోట లాగా కనిపిస్తోందని అన్నారు. ‘రైతన్నను ప్రభుత్వం దగా చేసింది. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు అయ్యింది. కాంగ్రెస్ ’అభయహస్తం’రైతుల పాలిట ‘భస్మాసుర హస్తం’గా మారింది. రైతు రుణమాఫీ ఎక్కడా పూర్తిగా అమలు కాలేదు. రుణమాఫీ అమలు విషయంలో కొడంగల్ కానీ, మధిర కానీ ఎక్కడికి వెళ్ళి పరిశీలించడానికైనా నేను సిద్ధం..’అని సవాల్ చేశారు. బడ్జెట్‌పై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కరోనాలోనూ రైతుబంధు ఇచ్చాం.. ‘కరోనా కష్టకాలంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసింది. ఎకరాకు రూ.15 వేలు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఇస్తామన్న మీ హామీ ఏమైంది? రైతులకు బోనస్ ఓ ప్రహసనంగా మారింది. గత యాసంగి బోనస్ రూ. 1,161కోట్లు ఎగ్గొట్టారు. బడ్జెట్లో పంటల బీమా ఊసే ఎత్తలేదు. బోనస్ బోగస్ అయ్యింది. బీమా బూటకమయ్యింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి రూ.12 వేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది. నిరుద్యోగులకూ దగా.. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న సర్కార్ బడ్జెట్లో దాని గురించి కూడా ప్రస్తావించలేదు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది? ఓట్ల కోసం అశోక్‌నగర్ లైబ్రరీ చుట్టూ తిరిగిన ఈ కాంగ్రెస్ పెద్దలే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలంటే, నిరుద్యోగుల వీపులు విమానం మోత మోగిస్తున్నారు. తలలు పగుల గొడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు దక్కింది డిప్రెషన్, సప్రెషన్ మాత్రమే (ఈ సందర్భంగా అధికార పార్టీని విమర్శిస్తూ హరీశ్ కవిత చదివారు)..’అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకూ మొండి చెయ్యే ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించినా, ఏ యువకుల ఖాతాల్లోనూ డబ్బులు పడలేదు. పథకాలకు రాజీవ్‌గాందీ, ఇందిరమ్మ పేర్లు ఎందుకు పెడుతున్నారు? వారి పేర్లు ఎందుకు బద్నాం చేస్తున్నారు? రేవంత్‌రెడ్డికి వారి మీద ఎలాగూ నమ్మకం లేదు. భట్టి అయినా దీన్ని ఆలోచించాలి. ఈ పథకానికి ‘రేవంత్ ఆత్మీయ మోసం’అనో, ‘భట్టి గారి యువ భ్రమలు’అనో పేరు పెట్టుకుంటే బాగుంటుంది. కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. బడ్జెట్లో ఆ మాటే మాయం చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఇచ్చిన జీవోను బయటపెట్టాలి. లేదంటే మహిళలకు క్షమాపణ చెప్పాలి. సాగునీటిపై నిర్లక్ష్యం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఆ హామీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 18 ప్రాజెక్టుల పూర్తి బడ్జెట్లో కన్పించడం లేదు. హామీ ఇచ్చిన 11,60,895 ఎకరాల ఆయకట్టు సాగు ఓ భ్రమగా మారింది. విలువలు అడుగంటాయి.. ఆశలు ఆవిరయ్యాయి..ప్రభుత్వం ఆడి తప్పింది.. పాలన పూర్తిగా గాడి తప్పింది. ఆరు గ్యారెంటీలు అమలు చేసింది లేదు. 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు..’అని హరీశ్‌రావు విమర్శించారు. -
అది భస్మాసుర హస్తంగా మారింది: హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాయమాటలతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు.ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను రూ.15 వేలకు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని నిలదీశారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని బడ్జెట్లో చెబుతున్నారు. ఈ ప్రభుత్వం రూ.19 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టింది. రాష్ట్రమంతా రైతు రుణమాఫీ అమలు కాలేదు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారింది. రైతు రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఏ నియోజక వర్గంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ అమలు పూర్తయిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఏ గ్రామం వెళ్లినా తమకు రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారు. ఆత్మహత్యలు ఆగాలని కేసీఆర్ రైతు బంధును ప్రవేశపెట్టారు. ఎన్ని విపత్తులు వచ్చినా రైతు బంధును కేసీఆర్ ఆపలేదు. మేము ఒక్క సీజన్ కూడా రైతు బంధును ఎగ్గొట్టలేదు.నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసాను కోతల సమయంలో ఇస్తున్నారు. మీరు ఎగ్గొట్టిన రైతు భరోసాను ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రతులను కాపీ పేస్ట్ చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం అంటూ గత బడ్జెట్ లో రూ.6వేల కోట్లు పెట్టారు.. ఒక్కరికీ ఇవ్వలేదు. గతసారి యువ వికాసం నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?‘ అని హరీష్ రావు అన్నారు. -
అవగాహనలేమితో తెలంగాణ పరువు తీస్తున్నాడు
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరులో 1972 నుంచి ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ను అమెరికా సంస్థ లేదా అమెరికా రీసెర్చ్ సెంటర్ అని పిలవడం సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నల్లమల సరిహద్దులు, కృష్ణా–గోదావరి జలాలు, సుంకేశుల ప్రాజెక్టుల మీదే కాదు..కళ్ల ముందున్న సంస్థలపై కూడా సీఎంకు కనీస అవగాహన లేదు. ప్రాథమిక అవగాహన లేకుండా సీఎం తెలంగాణ పరువు తీస్తున్నాడు.ఇక్రిశాట్ ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు..ఇది సీజీఐఏఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ’అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీని ఏర్పాటులో ఎఫ్ఏఓ, యూఎన్డీపీ, వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయని, ప్రారంభంలో ఫోర్డ్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్లతోపాటు భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక అని వివరించారు. ‘దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణం.ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి’అని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి వచ్చినట్టు మాట్లాడటం మానుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని హితవు పలికారు. -
శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?
సాక్షి, సిద్దిపేట: ‘సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించే పనుల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్ తెచ్చింది, చేసింది కాదు. అవన్నీ బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవే. శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?’అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ కృషి ఫలితమే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అని, దానిని ఆదివారం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నారని అన్నారు.కానీ, ప్రజల మనోఫలకాల మీద తమ పేరు ఎప్పటికీ ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముందే జిల్లాకు మంజూరై, రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1,070 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖను శనివారం సిద్దిపేటలో విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణాధారమన్నారు. కాళేశ్వరాన్ని, కూలేశ్వరం అని అంటున్న రేవంత్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక సిద్దిపేటలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి రూ.1,170 కోట్లు అర్ధంతరంగా రద్దు చేశారని హరీశ్ తెలిపారు. వీటిలో పశువైద్య కళాశాలను రేవంత్ కొడంగల్‌కు తీసుకెళ్లారన్నారు. ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా?, ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. కాగా, సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతులకు దాదాపు రూ.300 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులకు మూడుసార్లు ఎగ్గొట్టిన దాదాపు రూ.170 కోట్ల రైతుభరోసా డబ్బులు చెల్లించాలని కోరారు. -
గ్యారంటీలకు ఘోరీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘోరీ కట్టారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్‌రావు విమర్శించారు. ఇది దగాకోరు, ప్రజలను తీవ్రంగా నిరాశపరిచే బడ్జెట్ అని అన్నారు. వృద్ధాప్య, దివ్యాంగుల పింఛను పెంపు ఊసే లేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ప్రస్తావన కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4 వేల గురించిన కనీస ఊసు కానీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు చేస్తూ అందులోనూ గత బడ్జెట్‌తో పోలిస్తే కోతలు పెట్టారన్నారు.ఆరు గ్యారంటీల విషయంలో గతేడాది రూ.56 వేల కోట్లు పెడితే, ఈ బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు కుదించారని పేర్కొన్నారు. కొత్త పింఛన్లు కాదు ఉన్న పింఛన్లు ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. 3 లక్షల పింఛన్లు తొలగించి, 2 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామంటున్నారని విమర్శించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శుక్రవారం ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్లతో కలిసి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. 20 పేజీలు, రూ.20 వేల కోట్లు పెంచారు తప్ప.. ‘బడ్జెట్ ప్రసంగాన్ని 20 పేజీలు, బడ్జెట్‌ను రూ.20 వేల కోట్లు పెంచారే తప్ప.. ఆరు గ్యారెంటీల ఊసెత్తలేదు. నిధుల కేటాయింపు చేయలేదు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప.. ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత బడ్జెట్లో చెప్పిన పథకాలు అమలు చేయలేదు. మళ్లీ అవే పథకాలు వల్లవేశారు. గత బడ్జెట్లోనే రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు కానీ పైసా విడుదల చేయలేదు. మళ్లీ ఈసారి బడ్జెట్లో అంతే మొత్తాన్ని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనూ అదే జరిగింది. ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీల పేర్లు చెప్పివారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు..’అని హరీశ్‌రావు విమర్శించారు. మూడు ముక్కలు చేయడం తప్ప.. ‘తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ పేరిట, హైదరాబాద్ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా మూడు ముక్కలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. క్యూర్, ప్యూర్, రేర్ కాదు.. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. బడ్జెట్ అంతా బోగస్. అభయహస్తం కాదు రిక్త హస్తమని ప్రజలకు అర్థమైంది. పింఛన్ల పెంపు ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు ప్రయోజనాలు లేవు. అన్ని కులాలకు, వర్గాలకు మొండిచేయి చూపారు. మూడేళ్లు కాకుండానే రూ.3.5 లక్షల కోట్ల అప్పలు మూడేళ్లు నిండకముందే రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పలు చేశారు. అంత అప్పు చేసి ఒక్క రూపాయితో ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా? కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. మిషన్ భగీరథ అమలు చేశారు. మెడికల్ కాలేజీలు కట్టించారు. కేసీఆర్ తాను తెచ్చిన అప్పులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించారు. మీరు వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు పెరిగింది. 27 శాతం నుంచి 29 శాతానికి పెంచారు..’అని బీఆర్ఎస్ నేత విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని.. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని అంబేడ్కర్ సూక్తులు మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరింప చేసింది. ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం మీది. స్కాంలు తప్ప స్కీంలు ఉన్నాయా? మేడారం టెండర్లలో ఏం జరిగిందో మీ కేబినెట్ మంత్రి కుమార్తెనే చెప్పారు. నాసిరకం పనులతో నాలుగు రోజులకే భాగోతం బయటపడింది. ఇండస్ట్రియల్ హబ్ కాదు.. కరప్షన్ హబ్‌గా మార్చారు. సింగరేణిని స్కాంల ఖనిగా, కుంభకోణాల కేంద్రంగా మార్చారు. గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లు అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు. మీ పాలనలో 167 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడులు అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. డిప్యూటీ సీఎం భట్టి దేశ సగటు కన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉందని అంటుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం దివాళా తీసింది అంటున్నారు. ఇందులో ఏది నిజం? దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9 శాతం ఎక్కువ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో 14 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10 శాతం మాత్రమే. మా పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.7 శాతానికి తగ్గింది. పాలనలో ఫెయిల్ మీరు పాలనలో ఫెయిల్ అయ్యారు. హైడ్రా కూల్చివేతలు, మీ మూర్ఖత్వం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. గతేడాది యాసంగిలో సన్నరకం వడ్లకు రూ.వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. భూముల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణం మీద లేదు. మేము నోటిఫికేషన్లు ఇస్తే.. నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మీరే ఇచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబితే..భట్టి ఇవ్వలేదంటున్నారు..’అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మహాలక్ష్మీలో రూ.2,800 కోట్లు బకాయి ‘మహాలక్ష్మీ కింద ప్రభుత్వం రూ.2,800 కోట్లు బకాయి పడింది. ఆరీ్టసీకి రూ.9,222 కోట్లు ఇస్తే సంస్థ రూ.3 వేల కోట్ల అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లో ఉంటే పింఛన్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు కారి్మకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు?..’అని మాజీమంత్రి నిలదీశారు. -
కాంగ్రెస్ సర్కార్ రోజుకో స్కాం అసెంబ్లీలో మొత్తం బయటపెడతా
-
భట్టి బడ్జెట్.. అంతా బోగస్: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతోందని.. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ‘‘మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప.. స్కీములు ఉన్నాయా?. మూడేళ్లు కూడా నిండకముందే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకుని రాజ్యాంగ విలువలపై మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు.‘‘టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదు. పాలన గాడి తప్పడంతో తలసరి ఆదాయం తగ్గింది. బడ్జెట్ ప్రజల్ని తీవ్ర నిరాశపరిచింది. ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు జరగలేదు. గత బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసినా ఖర్చు చేయలేదు. తిరిగి ఈ బడ్జెట్లో అదే పాట పాడారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా.. పట్టించుకోలేదు. క్యూర్,ప్యూర్,రేర్ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. తెలంగాణను మూడు ముక్కలు చేశారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారు. బడ్జెట్ అంతా బోగస్ అని తేలిపోయింది, ముచ్చటంతా మూడు ముక్కలాట కోసమే ఆరు గ్యారెంటీలపై లేదు’’ అని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?’
హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు. అసెంబ్లీ మీడియా హాల్లో హరీష్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ల హక్కులను కాపాడటం కోసం కేసీఆర్ పోరాటం చేశారు. కృష్ణా నదీ జలాల పున:పంపిణీని కేసీఆర్ సాధించారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు,ఏపీకి 531 టీఎంసీలు వచ్చాయి. కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరిపై ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు.కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత రెండు రోజుల క్రితం లెటర్ రాశామని లెటర్ రిలీజ్ చేస్తున్నారు. గోదావరి జలాలపై ఏపీ కన్ను పడింది. జనవరి 30 న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మీటింగ్ జరిగింది. తెలంగాణ నుంచి వెళ్లిన అధికారులు డూడూ బసవన్నల్లా తల ఊపారు. గోదావరిలో ఏ రాష్ట్రానికి కేటాయింపులు లేవని సీడబ్ల్యూసీ చెప్పింది. ఫిబ్రవరి 12 వ తేదీన తెలంగాణకు మినిట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి దాసోహం అయ్యారా...?, రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏపీకి తాకట్టు పెట్టారా...?’ అని ప్రశ్నించారు. -
రేవంత్ చేతకాని తనం వల్ల తెలంగాణకు అన్యాయం
-
‘కాంగ్రెస్ పాలనపై తిరగబడే కాలం వచ్చింది’
హైదరాబాద్: ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్‌కు అతిగతి లేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారుస్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు.అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతా అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హరీశ్ రావు గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నక్క మల్లేష్ గౌడ్, కాసా ధనుంజయ్ గౌడ్, నక్క పవన్ గౌడ్, నక్క చరణ్ గౌడ్, నక్క వికాస్ గౌడ్, కాసా వినయ్ గౌడ్, పట్లోళ్ల తిరుపతి రెడ్డి, నక్క వీర స్వామి గౌడ్, నక్క సాయి గౌడ్, బచ్చుగూడెం ఎల్లయ్య యాదవ్, కాసా రాజు గౌడ్, అత్తెల్లి శ్రీకాంత్ రెడ్డి, పెద్దోళ్ల రాజు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. -
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు
-
రేవంత్ రెడ్డి కాదు.. గోబెల్స్ రెడ్డి : హరీష్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్‌రెడ్డికాదు.. గోబెల్స్ రెడ్డి’ అని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మూసి సుందరీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డీపీఆర్ లేకుండానే 10 వేల 17 ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. హైడ్రా పేరుతో ఇప్పటికే లక్షకు పైగా ఇళ్లు కూల్చారు. లక్ష జీవితాలను మూసీలో ముంచేస్తారా? మూసీని శుద్ధి చేస్తావా?. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా?.రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీ మీద పడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూ సేకరణ అవసరమా..!.మూసీ బ్యూటీఫికేషన్ పేరుతో లూటీఫికేషన్ చేస్తున్నారు’అని ఆరోపించారు. -
రేవంత్.. రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం లేదా?: హరీష్ రావు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు పంటలకు రైతుభరోసా ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. మూడు పంటలకూ డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు?. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా?.కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయి. హైదరాబాద్‌కు తాగు నీరు కాళేశ్వరం నీల్లే వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి.. ముందు చిల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. కాళేశ్వరం కూలిపోయింది అంటూ ఎన్నికల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తారా?. ప్రాజెక్ట్‌ను ఎండబెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు. -
పూటకో బదిలీతో దెబ్బతింటున్న పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పూటకోమారు బదిలీ చేయడంతో పాలన దెబ్బతింటోందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతకాని పాలనకు ఉన్నతాధికారుల బదిలీలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఐదుసార్లు జరిగిన బదిలీలతో విభాగాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా తమకు అప్పగించిన స్థానాల్లో పనిచేయడం లేదన్నారు. విద్యుత్ శాఖలో రెండేళ్లలో ఐదుగురు ప్రత్యేక కార్యదర్శులు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ బదిలీలతో విద్యుత్ శాఖ అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌తోపాటు సింగరేణి, పౌర సంబంధాలు, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్ తదితర విభాగాల్లో నలుగురు చొప్పున ఉన్నతాధికారులు మారిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఐదు విడతల్లో 140 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ కాగా, 20 జిల్లాల కలెక్టర్లు మారారన్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు మారారని చెప్పారు. తరచూ బదిలీలపై రాష్ట్రానికి నష్టం విభాగాధిపతులుగా ఉండే సీనియర్ ఐఏఎస్‌లతోపాటు జిల్లా కలెక్టర్లను తరచూ మార్చడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నచ్చని అధికారులను బదిలీలు చేస్తూ, తమకు వ్యక్తిగతంగా అనుకూలంగా పనిచేసే వారికే సీఎం, మంత్రులు పోస్టింగులు ఇస్తున్నారని చెప్పారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐదు శాతం ఎక్సెస్‌కు టెండర్లు కట్టబెట్టడంలో జరుగుతున్న అక్రమాలను త్వరలో బయటపెడతానని ప్రకటించారు. ఇంజనీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల ఎక్కువ అవినీతి జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. సీఎం అక్రమాలకు సహకరించని అధికారులను బదిలీ చేస్తున్నారని, సీఎం తప్పుల్లో భాగస్వాములు అయ్యేందుకు అనేక మంది అధికారులు ముందుకు రావడం లేదని తెలిపారు. లగచర్ల ఆందోళనల సందర్భంగా అనేక హామీల ఎగవేతకు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను బదిలీ చేశారని తెలిపారు. పార్టీ విప్ ఉల్లంఘించి ఓటేసిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయడంలో చూపిన దూకుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు లోపించిందన్నారు. అక్రమ మైనింగ్ పరిశీలనకు బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ శివారులోని నియోపోలిస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మేనల్లుడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడని, కోట్లాది రూపాయల లీజు, రాయల్టీ ఎగవేతకు పాల్పడ్డారని హరీశ్‌రావు ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘనలపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గురువారం అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన క్రషర్లను పరిశీలిస్తుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై ప్రస్తుతానికి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హరీశ్‌రావు వెల్లడించారు. -
‘రాజ్యసభ’కు బీఆర్ఎస్ దూరం ?
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు పార్టీ అభ్యర్థిని బరిలోకి దించే అంశంలో గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో 120 మంది శాసనసభ్యులు ఉండగా ఇద్దరు మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతోపాటు మరో అభ్యర్థిని అధికార కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుపుతోంది. అయితే బీఆర్ఎస్ మూడో అభ్యర్థిని బరిలోకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 37 స్థానాలకు పడిపోయింది. మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా, వారిపై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 27 మందికే పరిమితమైంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలిపితే పర్యవసానాలు ఎలా ఉంటాయనే కోణంలో పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలిపితే తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతున్న పది మంది ఎమ్మెల్యేలు ఎటు వైపు ఓటు వేస్తారనే ఆసక్తి నెలకొంది. మూడో అభ్యర్థిని పోటీలో పెడితే ఉన్న 27 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా ఇష్టాగోష్టిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పందించారు. రాజ్యసభ ఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపడంపై పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చివరి నిమిషం వరకు తమ పార్టీ వ్యూహం గోప్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. -
శారదా పీఠాన్ని కూల్చడానికి రేవంత్ సర్కార్ కుట్ర: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయింది.. దేవాలయాలు కూల్చడానికి కాంగ్రెస్ నేతలు బయలుదేరారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం రేవంత్‌కు ఇష్టం లేదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. దేవాలయ భూమి జోలికి రావొద్దు అని హితవు పలికారు. మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఆలయ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయింపు జరిగింది. ఇప్పుడు దేవాలయ స్తలాన్ని లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ పోలీసులను ప్రయోగించింది. పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురిచేయడం సరికాదు. శారద పీఠం ఆధ్వర్యంలో 16 దేవాలయాలు ఉన్నాయి. వేదం, గోశాల, నిత్య అన్నదాన కార్యక్రమాలు జరిగితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. దేవాలయాలు కూల్చడమే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమా?. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం రేవంత్‌కు ఇష్టం లేదా?.గుళ్లు, ఇల్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. సర్వే నెంబర్ 239, 240లలో పది ఎకరాలు భాగ్యలక్ష్మి మైన్స్ మినరల్స్ కంపెనీలు ఉన్నాయి. పక్కన 17 ఎకరాల స్థలం కబ్జా చేశారు. రేవంత్ అల్లుడికి ఇవ్వడానికి భూములు ఉన్నాయి. రాత్రి 11 గంటలకు పోలీసులు, ఎమ్మార్వో వచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చాలని చూస్తున్నారు. మేము రాగానే పోలీసులు, అధికారులు పారిపోయారు. చట్టపరంగా పద్ధతులు పాటించరా?. దేవాలయాల భూమి కూల్చడానికి శ్రీధర్ బాబు ఎలా ఒప్పుకున్నారు?. స్థలం లేక కాదు.. కక్షతో చేస్తున్నారు. గుడిని, మఠాన్ని కూడా వదలరా?. బ్రహ్మణులు పూజలు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయాల్లో పూజలు ఆపే మూర్ఖత్వమా?. ఇదేం సంస్కృతి?. క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని కూల్చేస్తారా?. దేవాలయ భూమి కాపాడడానికి మేం పోరాటం చేస్తాం. దేవాలయ భూమి జోలికి రావొద్దు అని హితవు పలికారు. -
మైక్ కట్ చేయొద్దు.. కెమెరా తిప్పొద్దు
సాక్షి, వరంగల్: ‘గోదావరి జలాలపై అసెంబ్లీలో మాట్లాడదామని సీఎం అంటున్నారు. ఈ సవాల్‌ను మేం స్వీకరిస్తున్నాం. మైక్ కట్ చేయకుండా, కెమెరా తిప్పకుండా చర్చకు పెట్టు. ఎన్ని రోజులైనా, ఏ ప్రాజెక్టు మీదనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందాం’అని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇటీవల ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో దేవాదుల ఎత్తిపోతల పంప్‌హౌస్ పరిశీలన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. వరంగల్‌లో 24 అంతస్తులతో నిర్మితమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ...దేవాదుల పనులు చేయడం చేతగాక మంత్రులకో డెడ్ లైన్, ముఖ్యమంత్రికో డెడ్‌లైన్ పెడుతూ దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ ఆగమాగం చేస్తోందన్నారు. రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదన్నారు. రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అని మండిపడ్డారు. మొన్న ఉత్తమ్ రివ్యూలో మాట్లాడుతుంటే, ఆయన్ను ఆపి కడియం శ్రీహరికి దేవాదులపై మంచి నాలెడ్జ్ ఉంది, తర్వాతి సమీక్షలో ఆయన్ను పిలవండి అని సీఎం అనడం ఇరిగేషన్ మంత్రిని అవమానించడమేనన్నారు. కక్షలు కట్టడం కాదు...ముందు ఆస్పత్రి కట్టు రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను కావాలనే నత్తనడకన సాగిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సిందని, వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించకపోతే బీఆర్ఎస్ పక్షాన వరంగల్ గడ్డపైనే నిరాహారదీక్షకు దిగుతామని ప్రకటించారు. జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడిటేషన్లు ఇవ్వాలన్నారు. -
చంద్రబాబుతో రేవంత్ చీకటి ఒప్పందం.. హరీష్ రావు
వరంగల్: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆసుపత్రికి కేవలం రంగులు వేసి క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగించడంలో విఫలమైందని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, మంత్రులు ఎవరికి నచ్చినట్లు వారు డేట్లైన్లు ప్రకటిస్తున్నారని ఆరోపించారు.గోదావరి జలాల అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని, సీఎం సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఆలోచించారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇప్పటికే ప్రారంభించేవాళ్లమని తెలిపారు.అలాగే వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, బీఆర్ఎస్ నిర్మించిన ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిలిపివేశారని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష్యపూరిత చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకుని నీటిని విడుదల చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇకపై సీఎంను ప్రతి అడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. -
సీఎం ప్రతి అడుగులో భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసే ప్రతి పనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుందని, ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలు ఉంటాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమ ర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, ఎల్టీపీఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యా పారం చేయాలని కూడా ఆలోచన చేశారన్నారు.ఫార్మా సిటీ కోసం కేసీఆర్ 14 వేల ఎకరాలు సేకరిస్తే.. దాన్ని ఫోర్త్ సిటీ అని పేరుమార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా రన్నా రు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట ఇళ్లు కూల్చి, భూ ములు లాక్కొని.. వాటిని అంబానీకో, అదానీకో కట్టబెట్టా లని చూస్తున్నారని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రా జెక్టుతో ఇళ్లు కోల్పోతున్న మధుపార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు ఆదివారం పరామర్శించారు. ఈ ప్రభుత్వానికి ఓ విధానం లేదు..ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు మూడుసార్లు వచ్చారని, పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్‌ను ఇక్కడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదని, పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. మూసీ శుద్ధికి తాము వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరిట పేదల ఇళ్లు కూల్చడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నామన్నారు. బాపు ఘాట్ వద్ద అహింసా మూర్తి గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలని, ఆ విగ్రహం, నిర్మాణం పేరిట ప్రజల ఇళ్లు కూల్చుతూ, హింసా మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గం అని అన్నారు.ఇళ్లు ఖాళీ చేస్తారా, లేక జేసీబీ పంపి కూల్చమంటారా అని అధికారులు బెదిరిస్తున్నారని, రేవంత్‌రెడ్డికి ఈ అపార్ట్మెంట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కావచ్చు.. కానీ ఒక మధ్యతరగతి వాడికి రెక్కలు ముక్కలు చేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న జీవితకాలపు సొంతింటి కల అని హరీశ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేదని, ఎఫ్టీఎల్ ఫిక్స్ కాలేదని, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని, కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా జరగలేదని, అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని నిలదీశారు. -
ప్రజల ఆస్తులపై రేవంత్ కన్నుపడింది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారం ఆయన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్న బాపు ఘాట్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులపై రేవంత్ కన్నుపడిందని మండిపడ్డారు. మూసీ పేరిట కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందంటూ దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణను బీఆర్ఎస్ వ్యతిరేకించడం లేదని హరీష్‌రావు అన్నారు.‘‘కేసీఆర్‌కు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అపార్ట్మెంట్ వార్ రూమ్ నుండే బీఆర్ఎస్ విజనరీ డాక్యుమెంట్‌ను తయారు చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌కు కేసీఆర్ మూడుసార్లు వచ్చారు. మంచి నీరు లేవని.. అపార్ట్మెంట్ వాసులు కేసీఆర్‌ను కలిస్తే.. కేసీఆర్ వెంటనే మంచి నీటి సదుపాయాన్ని ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీరు అందించారు. అపార్ట్మెంట్ వాసులను కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నాడు. మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చొదు.. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దు...రేవంత్ ఏది చేసిన రియల్ వ్యాపారం కోసమే.. మూసీ పేరుతో భూములు లాక్కొని బడా వ్యాపారులకు ఈ భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టలేదు కానీ పేదల ఇండ్లు కూల్చేస్తున్నారు. డబ్బులు లేవంటూనే ప్రపంచ సుందరి పోటీలు పెట్టారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి మూసి సుందరీకరణ చేస్తున్నారు. వీరి బతుకులను కూల్చకండి.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోండి’’ అంటూ హరీష్‌రావు డిమాండ్ చేశారు. -
ఎన్నికల్లో గెలవలేకే అక్రమంగా కేసులు: హరీష్ రావు
సాక్షి సంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి సంగారెడ్డి జైల్లో పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇటీవల జరిగిన మెదక్ మున్సిపల్ ఎన్నికల ఘర్షణలో అరెస్ట్ అయి కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 13మంది BRS కార్యకర్తలతో హరీష్ రావు ములాఖత్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక అక్రమంగా కార్యకర్తలను కారాగారానికి తరలించారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఒక సీటు ఎక్కువే గెలిచిందని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ 15వ వార్డుకు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మెదక్ డీఎస్పీ దగ్గరుండి కాంగ్రెస్ కార్యకర్తలతో డబ్బులు పంచే ప్రయత్నం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. కనుక కేసులు పెట్టాల్సింది ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులపై కానీ అన్యాయాన్ని ప్రశ్నించిన BRS నాయకులపై కాదన్నారు.ఆరుగురు ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఇది అత్యంత దారుణమన్నారు. పోలీసులు గుడ్డిగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా పోలీసులు వ్యవహరిస్తే రేపు మిమ్మల్ని సైతం శిక్షించక తప్పదని హరీశ్ రావు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ లో కాంగ్రెస్ గుండాలు BRS కార్యకర్తలని బెదిరిస్తున్నారని మెదక్ లో గుండాల రాజ్యం నడుస్తోందా? లేక ప్రభుత్వ పాలన నడుస్తోందా అని అడిగారు.పోలీసులు కేసులు పెట్టేటప్పడు ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని కేసులు పెట్టాలని తెలిపారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్ ని తిడితే కేసు ఎందుకు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతారు. ఆయనకు ఇది కనబడడం లేదా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో 800 స్థానాలను BRS గెలిచిందని ఆనాడు BRS అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కనీసం నాలుగు స్థానాలను సైతం గెలవలేదని అన్నారు. రైతు బంధు ఇంకా ఎప్పుడు వేస్తావో రేవంత్ రెడ్డి తెలపాలని అది ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేయడం తప్పదని హరీశ్ రావు అన్నారు. -
బాల్క సుమన్ అరెస్టును ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘బీఆర్ఎస్కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నది. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మురుగు రాజకీయాల వాసన కమ్ముకున్నది. హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత భేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో. జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని సమాజం కళ్లారా చూసింది. తమ కళ్ళెదుట ఒక దళిత మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడితే అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదు. రక్షణ కల్పించక పోగా నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం కాంగ్రెస్ పాలనలో ప్రజస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్న తీరుకు నిదర్శనం. ఒక్క క్యాతనపల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారు. బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని తెలంగాణ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నాం.’అని పేర్కొన్నారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.క్యాతన్ పల్లిలో @BRSparty కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని… pic.twitter.com/h9VQ7Nmh4I— Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2026 -
చైర్మన్ పదవుల కోసం బీజేపీ-కాంగ్రెస్ అక్రమపొత్తులు: హరీష్
-
ఓటమి భయంతోనే దౌర్జన్యకాండ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల లోనే ఘోరమైన పాలనా వైఫల్యాలు మూటగట్టుకు న్న సీఎం రేవంత్ రెడ్డి ఓటమి భయంతో మున్సిపల్ ఎన్ని కల్లో దౌర్జన్యకాండకు దిగార ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణ ఎన్నికల్లోనూ తప్పదనే ఆందోళన తోనే రేవంత్ అడుగడుగునా అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అక్రమంగా లూటీ చేసిన వేల కోట్ల రూపాయలతో ప్రజాతీర్పు నే మార్చాలని చూస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బుధవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణు లపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్‌రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుంది’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఎన్నిక ల్లో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొక్కవోని దీక్షతో బీఆర్ఎస్ కార్యకర్తలు వీరో చితంగా పోరాడారు. వారు కనబరిచిన పోరాట స్ఫూర్తి పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది’అని కేటీఆర్ కొనియాడారు. దాడులు చేయడం హీనమైన సంస్కృతిముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో అడుగడుగునా అధికార దుర్వినియో గాని కి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడ్డా రని మాజీ మంత్రి హరీశ్‌రా వు విమర్శించారు. ‘నామినే షన్ల దాఖలు మొదలు పోలింగ్ ముగిసేంత వరకు కాంగ్రెస్ అనేక అరాచకాలకు పా ల్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థు లను బెదిరించడమే గాక, వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిద ర్శనం. చట్టాన్ని కూడా లెక్క చేయ కుండా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడు గులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయం. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబ డటం ప్రజాస్వామ్య వ్యవస్థ ను అవమానించడమే. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు’అని హరీశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
‘అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు ఎందుకు డిమాండ్ చేయరు?’
హైదరాబాద్: కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తీసుకొని పోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లిహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని కళ్లప్పగించి చూస్తున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఈరోజ(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు.. కృష్ణా జలాల 664 టీఎంసీలను , 80 శాతం ఆంధ్రప్రదేశ్ వాడుకుందని తెలంగాణ ఈఎన్సీ.. కేఆర్ఎంబీకి లేఖ రాశారని, మరి ఏపీ ప్రభుత్వం 80 శాతం నీళ్ళు వాడుకుంటే , రేవంత్ రెడ్డి , ఉత్తమ్‌లు గాడిద పళ్లు తోముతున్నారా?, 80 శాతం నీళ్ళు వాడుకుంటే, తెలంగాణ ప్రభుత్వం నిద్ర పోతుందా? అని నిలదీశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని , ఆ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని హరీష్ స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులను సీఎం రేవంత్‌రెడ్డి కాపాడాలని, ఈఎన్సీ పోస్టుల భర్తీపై సైతం సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని హరీష్ మండిపడ్డారు. -
రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ తెచ్చారు: హరీశ్
-
‘ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక రేవంత్ హస్తం’
మెదక్: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక రేవంత్ హస్తం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన హరీష్.. రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు పోవడం ఖాయం. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేసిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేసిండు. ఆ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్ డైరెక్షన్లో జరిగిన ప్రమాదం అది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను దగ్దం చేసిండు. పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నిండు. హైదరాబాద్‌లో పేదల బతుకులు కూల్చిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేసిండు. రేవంతు డైరెక్షన్ లో పోలీసులు చేసిన దహనకాండ. ఓటుకు నోటు కేసులో రేవంతుకు శిక్ష పడక తప్పడు, జైలుకు పోక తప్పదు. రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ పోయిండు ముఖ్యమంత్రి..కానీ మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి ఆయనకు భయంరుణమాఫీ మాట తప్పి మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. ఎరువుల కరువు తెచ్చిండు రేవంత్. రేవంత్ బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదు. రంజాన్ తోఫా కూడా ఇవ్వడం లేదు. షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదు. తులం బంగారం దిక్కు లేదు. కేసీఆర్ గారు మైనార్టీ గురుకులాలు కట్టారు. షాదీ ఖానా ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని సెక్యూలర్ పార్టీగా నిలబెట్టారు. హిందూ ముస్లింలను అన్నదమ్ములుగా చూసింది బీఆర్ఎస్. తెల్లారితే మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్‌ను తిడితే, హరీశ్ రావును తిడితే పేదల కడుపు నిండుతుందా?, ఇక్కడి ఎమ్మెల్యే చాలా గొప్పోడు. ఎన్నికల సమయంలో 25 గంటల కరెంటు ఇస్తా అన్నడు. కనీసం 12 గంటలు కూడా రావడం లేదు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేలు అని గుండు కొట్టిండు. ఉద్యోగస్థులకు డీఏ లేదు, పీఆర్సీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్ బెన్ఫిట్స్ లేవు. అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి’ అని ధ్వజమెత్తారు హరీష్‌రావు. -
కాంగ్రెస్ పాలనలో అన్నీ స్కామ్‌లే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పట్టణాల్లో వీధిదీపాలను కూడా వెలిగించలేని మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. తన భాషతో వీధి రౌడీలా తయారయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పట్టణాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే, రేవంత్‌రెడ్డి మాత్రం కండ్లకు గంతలు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో దోమల నివారణకు ఫాగింగ్ జరగడం లేదని.. కేవలం ఫ్రాడింగ్ మాత్రమే చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్కీములు బంద్ అయ్యాయని, స్కామ్‌లు మాత్రం జోరందుకున్నాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, గడ్డపోతారం తదితర ప్రాంతాల్లో 15 కార్నర్‌మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. తన తండ్రి వయసు ఉన్న కేసీఆర్‌ను పట్టుకుని కనీస గౌరవం లేకుండా, అతినీచమైన భాషను మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ను దూషిస్తే నిరుపేదల కడుపులు నిండవని, సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే పేదల కడుపులు నిండుతాయని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తున్న కేసీఆర్‌ను జైలులో పెడతామని కాంగ్రెస్ అంటోందని హరీశ్‌రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల హామీలను అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి రాసిచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఈ రెండున్నరేళ్ల పాలనలో కొత్త పథకాలు ఇవ్వకపోగా, బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను బంద్ చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు అన్నం పెట్టిన కేసీఆర్‌కు ఓటేస్తారా?, హామీల పేరుతో జనాలకు సున్నం పెట్టిన రేవంత్‌రెడ్డికి ఓటేస్తారో?.. ప్రజలు ఆలోచన చేయాలని హరీశ్‌రావు అన్నారు. అసలు ఎవరో.. నకిలీ ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూపాలపల్లిలో చేసిన వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల హామీలను ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డినే నకిలీ అని అన్నారు. -
‘మంత్రి పదవి ఇచ్చారు.. ఎమ్మెల్సీ పదవి మాత్రం లేదు’
హైదరాబాద్ : సుమారు మూడు నెలల క్రితం, అంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మహ్మద్ అజారుద్దీన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మంత్రి పదవిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు విమర్శల వర్షం కురిపించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం బాగానే ఉన్నా, ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ‘అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చి 3 నెలలైంది. ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఇంకో మూడు నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి పోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేం ప్రశ్నినందుకే.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కింది’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్‌రావు. అజారుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ పదవిని ఆయన 31 అక్టోబర్ 2025న స్వీకరించారు. అదేవిధంగా, ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొనసాగుతున్నారు . అయితే ఎమ్మెల్సీగా లేరు. అంటే, ప్రస్తుతం ఆయనకు ఉన్న పదవి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కానీ ఎమ్మెల్సీగా లేరు. రాష్ట్ర మంత్రిగా ఉండాలంటే అటు ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీ కానీ ఉండాలి. ఇదే విషయాన్ని ప్రశ్నించారు హరీష్‌రావు. -
అంతా తుస్సే.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్: హరీష్ సెటైర్లు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అన్నం పెట్టిన కేసీఆర్ కావాలా.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్ కావాలా? అని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ పాలన అంతా 'తుస్సు'.. భర్తలకు డబల్ టికెట్ బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. కార్నర్ మీటింగ్స్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అవినీతి చిట్టాను, స్కామ్ క్యాలెండర్‌ని బయటపెట్టారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ.. తల్లి చేతిలో బిడ్డ ఎంత పదిలంగా ఉంటుందో.. కేసీఆర్ చేతిలో తెలంగాణ అంత పదిలం. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. నాడు కేసీఆర్ పాలనలో జాబ్ క్యాలెండర్.. నేడు రేవంత్ పాలనలో స్కామ్ క్యాలెండర్.జనవరి: సివిల్ సప్లైస్ స్కామ్ఫిబ్రవరి: ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్మార్చి: సాండ్ స్కామ్ఏప్రిల్: ఆర్టీసీ స్కామ్మే: బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కామ్జూన్: ఫోర్త్ సిటీ స్కామ్జూలై: లగచర్ల, సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్ఆగస్టు: పీజీ మెడికల్ సీట్ల స్కామ్సెప్టెంబర్: HILTP ఇండస్ట్రియల్ స్కామ్అక్టోబర్: పవర్ స్కామ్నవంబర్: సింగరేణి స్కామ్డిసెంబర్: ముఖ్యమంత్రి & KLSR స్కామ్. ఇలా రాష్ట్ర సంపదను, దళితుల భూములను రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు.కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలు.. మళ్ళీ పవర్ హాలిడేలతో కార్మికుల పొట్ట కొడుతున్నారు. గడ్డపోతారంలో బస్తీ దవాఖాన, ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత నాది. గుమ్మడిదలను మున్సిపాలిటీ చేసి ఉపాధి హామీ పని లేకుండా చేశారు.. డంప్ యార్డ్ తెచ్చి డంపింగ్ చేస్తున్నారు. మొదటిసారి మున్సిపాలిటీ అయిన గడ్డపోతారంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. ఇక్కడ బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి మంచి వైద్యాన్ని అందిస్తాం. ప్రతి ఇంటికి నల్లా నీళ్లను అందించే బాధ్యత మాది. పేదలకు ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది.రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం...గాడిదల ఓట్లు మాకు వద్దు అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. ప్రజలను గాడిదలు అంటావా? నువ్వే ఒక అడ్డ గాడిదవు.. నువ్వే పెద్ద గాడిదవు. రేపు ఎన్నికల్లో ఎవరైనా నీకు ఓటేస్తారా? కేసీఆర్ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగాయి, నువ్వు వచ్చాక పడిపోయాయి. బచ్చుగూడెంలో రూ. 7.50 కోట్లతో రోడ్డు వేసి భూముల విలువ పెంచింది కేసీఆర్ కాదా? ప్రతినెలా ఒక స్కామ్.. ఇదీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఇచ్చిన స్కామ్ క్యాలెండర్. అసెంబ్లీలో రేవంత్ గల్లా పట్టి రైతుల గోస వినిపించాలంటే కారు గుర్తు గెలవాలి. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం. నోరు తెరిస్తే మోసం. రైతుల రుణమాఫీ అని ఒట్టేసి మోసం చేశాడు. విషయం ఉన్నోడు విషం చిమ్మడు. రేవంత్ రెడ్డి దగ్గర విషయం లేదు కాబట్టే.. తెలంగాణ తెచ్చి, బాగు చేసిన కేసీఆర్ గారి మీద విషం చిమ్ముతున్నాడు. కరోనా కష్టకాలంలో కూడా నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌కు చెప్పి రైతు బంధు వేయించాను’ అని చెప్పుకొచ్చారు. -
కేసీఆర్‌ది ఉద్యమ చరిత్ర.. రేవంత్‌ది ద్రోహ చరిత్ర
జిన్నారం (పటాన్చెరు)/గజ్వేల్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ది ఉద్యమ చరిత్ర అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌ది ద్రోహ చరిత్రని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎంగా ఉంటూ.. ఆంధ్రప్రదేశ్‌కు మన నీళ్లు తాకట్టు పెడుతున్న ద్రోహి అని విమర్శించారు.చంద్రబాబుతో దోస్తీ కట్టి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఘర్షణసిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఆర్అండ్ఆర్ కాలనీలో శనివారం కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కాలనీలోని ఏటిగడ్డకిష్టాపూర్‌లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు మాజీ మంత్రి హరీశ్‌రావు వస్తున్నారనే సమాచారంతో ఆ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు పోటీగా నినాదాలు చేశారు.ఈ ఘటన నేపథ్యంలో హరీశ్‌రావు ఆర్అండ్ఆర్ కాలనీకి రాకుండానే తూప్రాన్‌కు వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు ఇక్కడికి చేరుకొని సభను కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా... కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం చెప్పులు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. ఏసీపీ నర్సింహులు, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.


