
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మంత్రులు వారి పంచాయితీలు చెప్పుకోవడానికే క్యాబినేట్ మీటింగ్‌లు పెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం (అక్టోబర్ 17) తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.
హరీష్ మాట్లాడుతూ.. ‘మంత్రులు గ్రూపులుగా విడిపోయారు. దంళుపాళ్యం ముఠాకంటే అధ్వాన్నంగా మారింది. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే క్యాబినెట్ మీటింగ్. కేసీఆర్ ఢిల్లీలో తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాటా, నీళ్ల వాటాను సాధించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి కమీషన్లు.కాంట్రాక్టుల వాటాల కోసం కొట్లాడుతున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పాలనతో అతితక్కువ ఇండస్ట్రీలు వచ్చాయి. టీఎస్ ఐపాస్ ఏర్పడిన తర్వాత పరిశ్రమల రాక సంఖ్య పెరిగింది.
మా హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యాత ఇచ్చాం. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు గురి పెడుతున్నారు. గన్ కల్చర్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.