
హైదరాబాద్ : నోరూరించే వివిధ రకాల వంటకాలకు నగరం వేదికైంది.. పాకశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన పలువురు చెఫ్‌లు వివిధ ప్రాంతాల వంటకాలతో ఆకట్టుకున్నారు.

అంతర్జాతీయ చెఫ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని సనత్‌నగర్‌లో అగ్రోమెచ్ స్టూడియో తెలంగాణ, ఆంధ్ర చెఫ్‌ల వంటకాలకు గురువారం వేదికైంది.

అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమం చెఫ్‌ల ఐక్యత, వారసత్వ కళ, పాకశా్రస్తానికి వేదికగా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన చెఫ్‌లు కేవలం వేడుక జరుపుకోవడానికి మాత్రమే కాకుండా, ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి, మెరుగైన భవిష్యత్తుకు తమ అనుభవాలను పంచుకున్నారు.















