విజయవాడ : భవానీ దీక్షలలో అత్యంత కీలకమైన కలశజ్యోతుల ఉత్సవం గురువారం అత్యంత వైభవంగా,కనుల పండువగా సాగింది.
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు కలశ జ్యోతులను సమర్పించారు.ఉభయ కృష్ణా,గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి కలశజ్యోతులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


