కంచరపాలెం: కంచరపాలెం పరిధిలోని రామ్మూర్తి పంతులుపేటలో వెలసిన పైడిమాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.
ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘తొలేళ్ల సంబరం’ సోమవారం కన్నుల పండువగా సాగింది. గౌరీ సేవా సంఘం గ్రామాధ్యక్ష, కార్యదర్శులు మద్దాల అప్పారావు, శరకం మూర్తిల సారథ్యంలో జరిగిన ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
అమ్మవారి ప్రతిమల ఊరేగింపు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమై, జ్ఞానాపురం, డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, కాన్వెంట్ కూడలి మీదుగా సాగి తిరిగి అమ్మవారి మూలవిరాట్ సన్నిధికి చేరుకుంది.
ఈ శోభాయాత్రలో సుమారు 315 ప్రత్యేక అమ్మవారి ప్రతిమలు కనువిందు చేశాయి.


