breaking news
devotional
-
అశ్వనీకుమారుల శాపవిమోచనం!
పూర్వం భరద్వాజ వంశంలో సుతపుడు అనే విప్రుడు ఉండేవాడు. శ్రీహరి భక్తుడైన అతడు హిమాలయాలపై నివసించేవాడు. శ్రీకృష్ణుడి ప్రీతి కోసం హిమాలయాలలో అతడు సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. తపస్సు కొనసాగిస్తున్న సుతపుడు బ్రహ్మతేజంతో వెలుగొందసాగాడు. గగనమార్గంలో సంచరించే దేవ గంధర్వ కిన్నర కింపురాషుదులు సుతపుడి తపోనిష్ఠకు, అతడి తేజస్సుకు విస్మయం చెందేవారు. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సుతపుడికి సాక్షాత్కారమిచ్చాడు.‘వత్సా! నీ తపస్సుకు సంతసించాను. వరమేదైనా కోరుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడి దర్శనం కలగడంతో సుతపుడు పరమానంద పరవశుడయ్యాడు. శ్రీకృష్ణుడికి సాష్టాంగ ప్రణామం చేసి, వేనోళ్ల స్తుతించాడు.‘ప్రభూ! నేను ఆత్మనిష్ఠుడను. నాకు మోక్షం అక్కర్లేదు. అనునిత్యం నీ సన్నిధిలో ఉండేలా అనుగ్రహించు. నీ పట్ల అనన్య దాస్యభక్తిని ప్రసాదించు. అంతే చాలు!’ అని కోరుకున్నాడు.‘మునివర్యా! ముందుగా నువ్వు వివాహమాడు. సంసార జీవితంలో నీ ప్రారబ్ద కర్మలు క్షీణించిన తర్వాత నీకు నా దాస్యభక్తి తప్పక లభించగలదు’ అని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు.సుతపుడు తనకు తగిన వధువు కోసం అన్వేషిస్తూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.బ్రహ్మదేవుడు అతడికి పితృలోకానికి చెందిన మానసి అనే కన్యను ఇచ్చి వివాహం జరిపించాడు. కొన్నాళ్లకు మానసి గర్భం దాల్చింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. సుతపుడు ఆ బాలుడికి కల్యాణమిత్రుడు అని నామకరణం చేశాడు. కల్యాణమిత్రుడు అశ్వనీదేవతల అనుగ్రహంతో జన్మించాడు. సుతపుడు ఈ సంగతిని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే తన భార్యను విడిచిపెట్టాడు. అశ్వనీదేవతలపై ఆగ్రహం చల్లారక ‘నాకు ద్రోహం తలపెట్టిన మీరు రోగగ్రస్తులవుతారు.మీకు యజ్ఞయాగాదులలో హవిర్భాగాలకు అర్హత లేకుండా పోతారు’ అని శపించాడు. తర్వాత కొడుకును వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సుతపుడి శాప ఫలితంగా అశ్వనీదేవతలు రోగగ్రస్తులయ్యారు. యజ్ఞయాగాదులలోని హవిర్భాగాలు దక్కక వారు బలహీనులైపోయి నానాటికీ క్షీణించసాగారు. దేవవైద్యులైన అశ్వనీకుమారులే రోగులుగా మారడంతో దేవలోకంలో కల్లోలం రేగింది. శాపవశాన సోకిన వ్యాధిని నయం చేసుకునే మార్గం తోచక అశ్వనీదేవతలు తమ తండ్రి సూర్యభగవానుడి వద్దకు వెళ్లి, తమ గోడు చెప్పుకున్నారు. సూర్యుడు వారిద్దరినీ సుతపుడి వద్దకు తీసుకుపోయాడు.‘మునిపుంగవా! నా తనయుల అపరాధాలను మన్నించు. నీవంటి సద్బ్రాహ్మణుడు సంతుష్టుడైతే సాక్షాత్తు శ్రీహరి సంతుష్టుడవుతాడు. శ్రీహరి సంతుష్టుడైతే, సకల దేవతలూ సంతుష్టులవుతారు. కాస్త దయ చూపు. నా తనయులకు శాపవిమోచనం కల్పించు’ అని అభ్యర్థించాడు.సూర్యభగవానుడి ప్రార్థనకు సుతపుడి మనసు కరిగింది. కాసేపు ఆలోచనలో పడ్డాడు. తన తపోబలంతో అశ్వనీదేవతలకు తక్షణమే రోగ విముక్తులను చేశాడు.‘దివాకరా! త్వరలోనే నీ తనయులకు యజ్ఞ యాగాదులలో హవిర్భాగాలు పొందే యోగ్యత కూడా లభిస్తుంది’ అని పలికాడు.సుతపుడి సహృదయానికి సూర్యుడు వేనోళ్ల కీర్తించాడు. ‘శ్రీహరి భక్తులైన నీవంటి సద్బ్రాహ్మణులే లోకాలకు వెలుగు చూపగలరు. నా తనయులకు శాపవిమోచనం కలిగించావు. ధన్యోస్మి!’ అని పలికాడు.రోగ విముక్తులైన అశ్వనీదేవతలు ఆనంద బాష్పాలతో సుతపుడికి సాష్టాంగపడ్డారు. అశ్వనీదేవతలకు శాపవిమోచనం కలిగించాక సుతపుడు తపస్సు చేసుకోవడానికి గంగా తీరానికి బయలుదేరాడు. సూర్యుడు తనయులతో కలసి తన స్వలోకానికి బయలుదేరాడు.- సాంఖ్యాయన -
మాధవుడి మందిరంలో మన్మథుడికి చోటుందా?
దేవతలు తాగే అమృతం కావాలంటే, మందర పర్వతాన్ని మోసుకొచ్చి, దాన్ని కవ్వంగా చేసి, క్షీర సాగరాన్ని చేతులు పడిపోయేలా చిలకాలి. అది మహామహులకే తప్ప, మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అలాగని దిగులు అక్కర్లేదు. భక్త కవీంద్రుడు లీలాశుకుడు తన కవితాశక్తి అనే కవ్వంతో, నుడి కడలిని మథించి వెలికి తీసిన ‘కృష్ణ కర్ణామృతం’ ఉంది.వీనుల విందు చేసే ఈ అమృతాన్ని, అభిరుచి ఉన్నవారెవరయినా, ఉచితంగా, తనివి తీరా ఆస్వాదించవచ్చు. లీలాశుకుడు ఈ కావ్యంలో తన ఇష్టదైవమైన బాలగోపాల కృష్ణుడిని ఎన్నెన్నో శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో, చమత్కారాలతో అలంకరించి తరించాడు. ఆ కర్ణామృత కలశంలో ఒక్క చుక్క పట్టి చూసినా, అమృతం నాణ్యత అర్థమైపోతుంది.మన్మథుడు తుంట వింటివాడే కాదు. తుంటరివాడు కూడా. ఎంతో ప్రయత్నంతో, ఎన్నో సాధనలతో కష్టపడి, శుద్ధి చేసుకొన్న మహాభక్తుడి మనసులోకి ఎలాగో చొచ్చుకుపోతాడు. మదన వికారాల మాలిన్యంతో దాన్ని మళ్లీ మైల పడేస్తాడు. అలాంటి ఆగడాలు తన దగ్గర సాగవని లీలాశుకుడు మృదుమధురంగా, సొగసుగా, గడుసుగా మంద లిస్తూ..‘మార! మా రమ మదీయ మానసే,మాధవైక నిలయే యాదృచ్ఛయా!’అంటాడు. ‘‘మదనుడా! నా మనసులో దూరి అల్లరి చేయకు. ఇది మాధవుడు ఒక్కడి కోసం అచ్చంగా ఏర్పరచిన మందిరం. ఇక్కడ స్వేచ్ఛా విహారం చేస్తూ, ‘రమించ’కు. మా రమ!’ అని. అలా రమిస్తూ, ఆగం చేస్తే ఏమౌతుంది? కొంప మునుగుతుంది.ఎందుకంటే, 'శ్రీ రమాపతిః – ఇహ – ఆగమేత్ – అసౌ’ ఇల్లుగలాయన అయిన ‘రమాధవుడు ఇప్పుడో, ఇంకాసే పట్లోనో ఇక్కడికి వస్తాడు.’ ఆయన నీ గోల చూస్తే నీ వీపు విమానం మోత మోగిస్తాడో, తాట ఒలిచేస్తాడో!కః సహేత నిజ వేశ్మ లంఘనమ్? ‘తన ఇంట్లో పరులు స్వేచ్ఛగా జొరబడితే, ఎవరు సహిస్తారు?’ అందులో ఆయన సామాన్యుడా? సకల శక్తిశాలి. ఏమయినా చేయగలడు. ‘కనుక బతుకు మీద తీపి ఉంటే, నా నుంచి దూరంగా పారిపో!’’ అని పంచశరుడిని భక్తాగ్రణి హెచ్చరిస్తున్నాడు.– ఎం. మారుతి శాస్త్రి -
తొలి తిరుపతి 9000 వేలు సంవత్సరాల అతి పురాతన దేవాలయం (ఫొటోలు)
-
సింహాచలం: 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ...పరవశించిన భక్త జనవాహిని (ఫొటోలు)
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేడుకగా శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)
-
కోట్లాది రూపాయల ఆస్తి ఒక్క వేలిముద్రతో దేవుడి పేరిట..
జైపూర్: దేవాలయాల్లో భక్తులు ఏమేమి సమర్పిస్తారు? కొందరు కొబ్బరికాయ, కొందరు మిఠాయిలు, ఇంకొందరు బంగారం, వెండి సమర్పిస్తారు. కానీ రాజస్థాన్‌లోని చిత్తోడ్గఢ్లో మాత్రం ఓ భక్తుడు ఆస్తిని సమర్పించాడు. ‘‘శ్రీ సావలియా సేఠ్’’ దేవుడి పేరిట 10.25 బీఘాల వ్యవసాయ భూమితో పాటు తన రెండంతస్తుల ఇంటిని కూడా విరాళంగా ఇచ్చాడు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆస్తిని ఆలయం పేరిట అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించాడు.ఈ ఘటన డూంగర్పూర్ జిల్లా ఆస్పూర్ తహసీల్దార్ పరిధిలోని ఖేడా సామోర్ గ్రామంలో జరిగింది. అక్కడ నివసించే అమర్జీ అనే వృద్ధుడు.. గౌతమ్ పటేల్ కుమారుడు. అమర్జీ గోభక్తుడు. కుటుంబంలో ఆయన ఒక్కరే ఉన్నారు. నివసించడానికి ఆయనకు మరో ఇల్లు ఉంది. అందువల్ల తన రెండో ఆస్తిని భగవంతుడు సావలియా సేఠ్ పాదాల వద్ద సమర్పించాలని నిర్ణయించారు.అమర్జీ స్వయంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి 10.25 బీఘాల వ్యవసాయ భూమితో పాటు రెండంతస్తుల ఇంటిని శ్రీ సావలియాజీ ఆలయ మండలి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే ఆ ఆస్తి అధికారికంగా ఆలయానికి చెందింది.రిజిస్ట్రేషన్ సమయంలో ఆలయ మండలి పరిపాలనాధికారి రాజేంద్ర సింగ్, ఆస్తుల ఇన్చార్జ్ భేరుగిరి హాజరయ్యారు. అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తైన తర్వాత ఆలయ మండలి అమర్జీని సత్కరించి కృతజ్ఞతలు తెలిపింది.సావలియా సేఠ్ ఆలయ ప్రత్యేకత ఏంటి?రాజస్థాన్‌లోని శ్రీ సావలియాజీ ధామ్ దేశంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి నెల హుండీలు తెరిచినప్పుడు కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారం, వెండి, ఇతర విలువైన కానుకలు బయటపడుతుంటాయి. అయితే అమర్జీ సమర్పించిన విరాళం ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన నగదు లేదా నగలు కాదు, తన స్థిరాస్తినే భగవంతుడి పేరిట రాసిచ్చాడు.ఇటీవల మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా సోన్కచ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం 11 కిలోల 400 గ్రాముల వెండి కడ్డీలను సమర్పించింది. వాటి విలువ రూ.26 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. అంతకుముందు మరో భక్తుడు సుమారు 137 గ్రాముల బంగారు వేణువును సమర్పించాడు. దాని అంచనా విలువ సుమారు రూ.20 లక్షలు.ఆలయ కమిటీ అధ్యక్షుడు హజారిదాస్ వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘‘సావలియా సేఠ్‌పై భక్తుల విశ్వాసం నిరంతరం పెరుగుతోందని చెప్పారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తమ భక్తికి అనుగుణంగా కానుకలు తీసుకొస్తున్నారని తెలిపారు. అయితే ఒక భక్తుడు తన భూమి, ఇంటిని భగవంతుడి పేరిట రాసివ్వడం అరుదైన ఘటన అని అన్నారు. కొందరికి ఇది విరాళం కావచ్చు. మరికొందరికి ఇది భక్తి కావచ్చు. ఇంకొందరికి ఇది వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. కానీ ప్రతి కోణం వెనుక ఒక ప్రశ్న మాత్రం ఉంది. నిజంగా మనిషి ఏదైనా వస్తువుకు యజమానినా? లేక కొంతకాలం పాటు దానికి కాపలాదారుడా?’’ అని వ్యాఖ్యానించాడు. -
శ్వేతమాధవుడు: పూర్వం కృతయుగంలో శ్వేతుడు..
పూర్వం కృతయుగంలో శ్వేతుడు అనే రాజు సమస్త భూమండలాన్నీ పరిపాలించేవాడు. అతడి పరిపాలనలో ప్రజలు సర్వసుభిక్షంగా జీవించేవారు. అతడి రాజ్యంలో మనుషులకు పదివేల ఏళ్ల పరమాయువు ఉండేది. అకాల మరణాలు ఉండేవి కాదు. రోజులిలా సాగుతుండగా, ఒకసారి అనుకోని విపత్తు సంభవించింది.శ్వేతుడి రాజ్యంలో కపాలగౌతముడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. అతడికి కొడుకు పుట్టాడు. ఆ బాలుడు ఇంకా నోట్లో దంతాలు రాకముందే అకాల మృత్యువు చెందాడు. దుఃఖితుడైన కపాలగౌతముడు తన పుత్రుని మృతదేహంతో రాజాస్థానానికి వచ్చాడు.పసిబాలుడి మృతదేహాన్ని చూసిన శ్వేతుడు చలించిపోయాడు. ‘ఈ బాలుడిని పునర్జీవితుడిని చేయలేకపోతే నేనే అగ్నిప్రవేశం చేస్తాను’ అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు.అప్పటికప్పుడు పరమశివుడి కోసం శ్వేతుడు తపస్సు ప్రారంభించాడు. నీలపద్మాలతో పరమశివుడిని అర్చిస్తూ, ప్రార్థించాడు. శ్వేతుడి భక్తికి సంతసించిన పరమశివుడు పార్వతీ సమేతంగా అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! నీ భక్తికి సంతుష్టి చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అన్నాడు.శ్వేతుడు పార్వతీ పరమేశ్వరులకు భక్తిగా నమస్కరించి, ‘పరమేశ్వరా! అభం శుభం తెలియని ఈ పసిబాలుడు అకాలమరణం చెందాడు. ఇతడిని పునర్జీవితుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞ మేరకు ఈ బాలుడిని తిరిగి బతికించు. నా రాజ్యంలో అకాల మరణాలు లేకుండా అనుగ్రహించు’ అని కోరాడు. పరమశివుడు ‘తథాస్తు’ అని పలికాడు. మరుక్షణమే యమకింకరులు ఆ బాలుడి ప్రాణాలను తీసుకువచ్చారు. నిద్రలోంచి మేల్కొన్నవాడిలా ఆ బాలుడు పునర్జీవితుడయ్యాడు. పుత్రుడు పునర్జీవితుడు కావడంతో కపాలగౌతముడు పరమానందం పొందాడు.శ్వేతుడు ఎలాంటి చీకుచింతలు లేకుండా పదివేల ఏళ్లు రాజ్యపాలన చేశాడు. లౌకిక ధర్మాలన్నీ నెరవేర్చాక ఐహిక సుఖాలపై విరక్తి చెందాడు. పురుషోత్తమ క్షేత్రంలో శేషజీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు. పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుని, జగన్నాథుడి సన్నిధానానికి సమీపంలో శ్వేతపర్వతంపై సువిశాలమైన ప్రాసాదాన్ని నిర్మింపజేశాడు. ఆ ప్రాసాద మధ్యభాగంలో మాధవమూర్తిని ప్రతిష్ఠించాడు. మాధవ ప్రతిష్ఠాపన సందర్భంగా వేలాది విప్రులకు, సాధువులకు, తపస్వులకు భూరి దానాలు చేశాడు.శ్వేతుడు అక్కడే నివాసం ఏర్పరచుకుని, ఒక తటాకం ఒడ్డున తపోనిష్ఠతో ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ, మాధవుడిని ఆరాధించసాగాడు. కొన్నాళ్లకు పూర్తిగా నిరాహారుడై శ్రీమహావిష్ణువును ధ్యానించసాగాడు. ధ్యాన స్థితిలో శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు. శ్వేతుడి భక్తికి శ్రీమహావిష్ణువు పరవశుడయ్యాడు. సకల దేవతా పరివారం వెంట రాగా, శ్రీమహాలక్ష్మీ సమేతంగా శ్వేతుడి ఎదుట సాక్షాత్కరించాడు. ‘వత్సా! నీ భక్తికి పరమానందం చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అని పలికాడు.‘భక్తవత్సలా! పుండరీకాక్షా! జగన్నాథా! పాహిమాం... పాహిమాం... నన్ను నీ భక్తులలో ఒకరిగా పరిగణించి, వైకుంఠవాస యోగ్యత కల్పించు. అంతకు మించి నాకంటూ నేను కోరేదేమీ లేదు’ అన్నాడు శ్వేతుడు.‘రాజా! నువ్వు మరికొన్నాళ్లు రాజ్యభోగాలను అనుభవించిన తర్వాత నా లోకానికి చేరుకోగలవు. నీ తపోమహిమతో ఈ ప్రదేశం పునీతమైంది. నీకు సన్నిహితంగా నేను ఇక్కడే సమస్త దేవతా పరివారంతో కలసి శ్వేతమాధవుడిగా కొలువుంటాను. ఈ తటాకం శ్వేతమాధవ తీర్థంగా ప్రసిద్ధి పొందుతుంది. శ్వేతమాధవ తీర్థంలోని జలబిందువులు కుశాగ్ర పరిమాణంలో తాకినా భక్తులను పునీతులను చేస్తాయి.’ అని శ్రీమహావిష్ణువు వరమిచ్చాడు. శ్వేతుడికి ఇచ్చిన వరం ప్రకారం అక్కడే శ్వేతమాధవుడిగా వెలిశాడు.కొంతకాలం రాజ్యపాలన సాగించిన తర్వాత శ్వేతుడు ఒకనాడు అనాయాసంగా కాలధర్మం చెందాడు. వైకుంఠం నుంచి విష్ణుభక్తులు వచ్చి, అతడిని తమతో పాటు దివ్యవిమానంలో వైకుంఠంలోని విష్ణు సన్నిధానానికి తీసుకుపోయారు.పురావిశేషం..ఇది వేదవ్యాసుడి గుహ. కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు వినాయకుడి సాయంతో ఇదేచోట మహాభారత రచన చేశాడని భక్తుల నమ్మకం. ఇది బదరీనాథ్ క్షేత్రానికి చేరువలోని మాణా గ్రామంలో ఉంది. ఈ గ్రామాన్ని భారతదేశంలోని చిట్టచివరి గ్రామంగా చెబుతారు. సముద్ర మట్టానికి 10,600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహను సందర్శించడం అంత తేలికకాదు. ఇక్కడ గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
తొలి ఏకాదశి పూజలు ఫోటోలు
-
తొలి ఏకాదశి 2026...ఆలయాలకు పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
ఏపీ : అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
హైదరాబాద్ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
విజయవాడ : ఆషాఢ వైభవం..‘ఇంద్ర’ వైభోగం (ఫొటోలు)
-
వశీకరణం.. మారణం.. చేతబడులు.. నిజానిజాలు ఇవే?
సాక్షి శుభమస్తు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రొ.ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. అథర్వణ వేదం ప్రత్యేకత, బీజ మంత్రాల శక్తి, సామాన్య ప్రజల అవసరాలకు వేదం, వేదవ్యాసుడు అథర్వవేదాన్ని వేరుగా చూపిన కారణం, తంత్రం, అభిచార క్రియలపై అభిప్రాయం, చేతబడులు, వశీకరణంపై, యక్షిణి గురించి వివరణ ఇచ్చారు. ఆయుర్వేదం, గణితం, ప్రకృతి విజ్ఞానం వంటి అనేక శాస్త్రాలకు సంబంధించిన అంశాలు అథర్వణ వేదంలో ఉన్నాయని పేర్కొన్నారు. సంతానం, ఆరోగ్యం, శత్రు బాధ నివారణ, ఓజస్సు, తేజస్సు వంటి జీవిత అవసరాలకు సంబంధించిన మంత్రాలు అథర్వణవేదంలో ఉన్నాయని చెప్పారు. కలియుగంలో గతంలో ఉన్నట్లు శక్తిమంతమైన మారణ, మోహన, వశీకరణ విద్యలు మనుషుల చేత సాధ్యం కావని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. మూఢనమ్మకాల వెంట వెళ్లకుండా వేదాలను శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేయాలని, నిజమైన గురువుల బోధనలు చదవాలని, "సింపుల్ లివింగ్ – హై థింకింగ్"తో జీవించాలని యువతకు సూచించారు. అథర్వణ వేదం అందరూ చదవచ్చా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ప్రొ.ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి అందించారు. ఈ వివరాలు కింది వీడియోలో చూడండి.. -
సిరి సంపదలు ఉన్ననాడే...
సిరి సంపదలు, భోగ భాగ్యాలు ఎల్లకాలం ఉండవు. కలకాలం ఒకే స్థాయిలోనూ ఉండవు, హెచ్చు తగ్గులు సహజం... సుమతీ శతకంలో సిరి సంపదలు ఎలా వస్తాయో, ఎలా పోతాయో చక్కగా చెప్పారు.‘సిరి దా వచ్చిన వచ్చునుసరసంబుగ నారికేళ సలిలం భంగిన్సిరిదా బోయిన బోవునుకరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతి’కొబ్బరికాయలో నీరు ఎంత సహజంగా ఉంటుందో, వస్తుందో అంత సహజంగా సిరి వస్తుంది.. పోయేటప్పుడు మాయం అయిపోతుంది.. ఏనుగు తిన్న వెలగ పండులో గుజ్జు కూడా కంటికి కనపడదు.... అలాగే ఎంత ప్రయత్నం చేసినా సిరి రాదు. సిరి రాకపోకలు మన చేతిలో లేవు.సంపదలు రాగానే చుట్టాలు వస్తారు..‘ఎప్పుడు సంపద గలిగిననప్పుడు బంధువులు వత్తురది’ అంటూ మంచి ఉపమానం చెప్తాడు, సుమతి...‘దెప్పలుగ జెరువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరా’.. చెరువులో నీరు ఉన్నప్పుడు కప్పలు చేరుతాయ్.. మానవ నైజాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పాడు.‘పరసతి కూటమి గోరకుపరధనముల కాశపడకు, పరునెంచకుమీసరిగాని గోష్టి సేయకుసిరి చెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ’మనం చేయకూడని ఐదు పనులు చెప్పాడు.. పర స్త్రీ ని, పరధనాన్నీ వద్దని.. ఇతరుల దోషాలని ఎంచవద్దని.. సిరి చెడితే చుట్టాలు దగ్గరికి వెళ్ళ వద్దని సలహా..సిరి వచ్చినప్పుడు సిరి యైన గర్వింపకు సిరి లేనప్పుడు చింతింపకుము సిరియు విరియు నీరు సిరి కుప్ప వంటిది విశ్వదాభిరామ వినురవేమ! అంటాడు వేమనఅర్థం: డబ్బు వచ్చినా గర్వపడకు, లేకపోయినా బాధపడకు. సంపద నీటి బుడగ లాంటిది. మరో పద్యంలో సంపద వలన వచ్చే అనర్ధాలు చెప్తాడుసిరికి మదము మదమునకు కీడు కీడునకు మృత్యువు కీడునకు చేటు చేటునకు నరకము చేరుట తథ్యము విశ్వదాభిరామ వినురవేమ!సంపదతో మదం, మదంతో కీడు, కీడుతో నాశనం వస్తుందనిసిరి గలంత కాలము చుట్టములెల్లరు సిరి లేకున్న చుట్టములు చీకాకు సిరి లేని వాని జేరరు బంధులు భాస్కరా! వినుము కుజనుల వర్తనఅర్థం: డబ్బు ఉన్నంత కాలమే అందరూ చుట్టాలు. లేకపోతే దరిదాపుల్లోకి కూడా రారు.. ఇది వేమన చెప్పిన దానికి దగ్గరగా ఉంది.సిరి సంపదలు నిల్చునా శాశ్వతముగా క్షణములోపల నశించు క్షీరతరంగ కావున దానధర్మముల కడకు వినియోగ భాస్కరా! వినుము సుజనుల మర్యాదసంపద శాశ్వతం కాదు, క్షణంలో పోతుంది. అందుకే దానధర్మాలకు వాడాలని సలహా, సుమతీ శతకం నుండి.లక్ష్మీ స్తనోపరి లుఠతి క్వచిదపి క్వచిత్ నేత్రాంతరాళముపయాతి క్వచిత్ క్వచిత్ చ ఏవం క్రమేణ సకలా జగదీశ్వరీ సా చంచలా పునరుపైతి చ నైవ యాతి... ఇది భర్తృహరి చెప్పిందిలక్ష్మి ఎప్పుడూ ఒకచోట ఉండదు. ఎవరి రొమ్ముపై, ఎవరి కంటి ముందు ఆడుతుందో తెలియదు. అందుకే చంచలమైనది.. మరో చోట సంపద శాశ్వతం కాదు అంటాడుయేషా దానపరో న భోగరతః యో నైవ విద్యార్జనే తస్యార్థస్య ఫలం త్రిధైవ భవతి దానం భోగో నాశఃడబ్బును దానం చేయని వాడు, అనుభవించని వాడు, చదువుకు వాడని వాడు ఉంటే ఆ డబ్బు మూడు విధాలుగా పోతుంది – దానం, భోగం, లేదా నాశనం. సిరి సంపదలు సక్రమ మార్గంలో సం΄ాదించాలి.. నీతిగా నిర్వహించాలి..అలాగే సక్రమమైన పద్ధతిలో ఖర్చు పెట్టాలి.. సిరి సంపదలు శాశ్వతం కాదు.. మన మధ్య ప్రేమలు, అనురాగాలు, ఆ΄్యాయత, బంధం, బంధుత్వం శాశ్వతం.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
సహనం ఒక వెలుగుబాట
ఉపకోసల కామలాయనుడు సత్యకామ జాబాలుని ఆశ్రమంలో శిష్యునిగా 12 సంవత్సరాల΄ాటు గురు శుశ్రూష చేస్తూ, యజ్ఞాగ్నులకు శ్రద్ధతో సేవచేసాడు. అతని వినయం, క్రమశిక్షణ, సేవాభావం అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకరోజు గురువుగారు ఇతర శిష్యులకు విద్యను బోధించి వారిని యింటికి పంపించేశారు.ఉపకోసలునికి మాత్రం బ్రహ్మవిద్య బోధించకుండా ప్రయాణమై వెళ్ళిపోయారు. గురుపత్నికి ఇది బాధ కలిగించి గురువుగారితో అంది ‘‘ఉపకోసలుడు ఎన్నో సంవత్సరాలు నిష్ఠగా సేవచేశాడు. అతనికి కూడా జ్ఞానం బోధించండి’’ అంది. కానీ గురువుగారు పట్టించుకోలేదు. ఉపకోసలునికి నిరాశ కలిగినా గురువుగారిపై కోపంగాని, ఆశ్రమాన్ని విడిచి వెళ్ళడంగాని, తన సేవను ఆపడం గాని చేయలేదు. తన మనసును పవిత్రంగా ఉంచుకుంటూ ఉపవాసం చేశాడు. అతని భక్తికి, సహనానికి ముగ్ధులై ఆశ్రమంలోని 3 యజ్ఞాగ్నులు (గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని) అతనితో మాట్లాడి అతనికి బ్రహ్మ తత్వంలోని అనేక రహస్యాలు బోధించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించాయి. (యజ్ఞాగ్నులు ఉపకోసలునితో మాట్లాడినట్టు చెప్పడం ఒక ప్రతీకాత్మక బోధన.)గురువు గారు తిరిగివచ్చిన తరువాత ఉపకోసలుని ముఖంలో అపూర్వమైన తేజస్సు చూసి ‘‘నీకు ఈ జ్ఞానాన్ని ఎవరు బోధించారు’’ అని అడిగారు. ఉపకోసలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. అప్పుడు గురువుగారు అగ్నులు బోధించిన జ్ఞానాన్ని సంపూర్ణం చేస్తూ బ్రహ్మస్వరూ΄ాన్ని పూర్తిగా ఉపదేశించాడు. ఉపకోసలుని సహనం ఫలించింది. గురుభక్తి వృథాకాలేదు. నిష్కామ సేవ మనసుని శుద్ధిచేసి జ్ఞాన΄ాత్రుని చేసింది. ఓర్పుతో, విశ్వాసంతో, నిష్ఠతో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృథాకాదు. సమయమొచ్చినపుడు అది విజయాన్ని, జ్ఞానాన్ని, అంతరంగ వికాసాన్ని ప్రసాదిస్తుంది. బాహ్య దృష్టితో చూస్తే యజ్ఞాగ్నులు యజ్ఞకుండంలో వెలిగే అగ్నులు. అంతర్గతంగా అవి మనలోని జ్ఞానానికి, శ్రద్ధకు, భక్తికి, ఆత్మ జిజ్ఞాసకు ప్రతీకలు.– డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
ఏటా పెరుగుతున్న శివలింగం
ప్రతిదానికీ సైన్స్ ఒక లెక్క వేస్తుంది.. కానీ ఆ లెక్కలు తప్పే చోట, లాజిక్కు అందని ఒక మ్యాజిక్ మొదలవుతుంది. దాన్నే మనం దైవికశక్తి అంటాం. ఒడిశాలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న గుప్తేశ్వర్ గుహలు కూడా ఆ కోవలోకే వస్తాయి..! ఏటా పరిమాణం పెరుగుతూ, సైన్స్‌కే సవాల్ విసురుతున్న ఒక జీవమున్న శివలింగం కథ ఇది..! ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పేరు చెబితేనే.. దట్టమైన అడవులు, కొండలు గుర్తుకువస్తాయి. వాటి మధ్య ప్రకృతి మలచిన సున్నపురాయి గుహలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే మనకు కనిపించేది ఒక అద్భుతం ఏంటంటే.. ఏటా పెరిగే శివలింగం..! ఇక ఈ గుహల లోపల ఉండే వాతావరణం కూడా ఓ పెద్ద వింత. బయట ఎంత ఎండగా ఉన్నా, గుహ లోపలికి అడుగుపెట్టగానే ఏసీ ఆన్ చేసినట్లు చల్లగా మారిపోతుంది. అంతేకాదు, అక్కడ ఉండే ఎకో సిస్టమ్ అంటే.. ప్రతిధ్వని చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు అక్కడ నిలబడి ఒక్కసారి 'ఓం నమఃశివాయ' అని పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్ఛరిస్తే.. ఆ ధ్వని తరంగాలు గుహ గోడలకు తగిలి వచ్చే ప్రతిధ్వని, మన శరీరంలో ఒక తెలియని దైవిక ప్రకంపనలను, ప్రశాంతతను తీసుకువస్తుంది. ఏటా పెరుగుతున్న శివలింగానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మిస్ కాకుండా చూడండి.. -
పిడుగుతో పగిలిపోయే శివలింగం..!
లోకాన్ని రక్షించడం కోసం పరమశివుడు హాలాహలాన్ని మింగి గరళకంఠుడయ్యాడని మనకు తెలుసు. కానీ.. తన భక్తులను కాపాడుకోవడం కోసం, ఆకాశం నుంచి విరచుకుపడే భీకరమైన పిడుగులను సైతం ఆ భోలాశంకరుడు తన గుండెపైకి తీసుకునే ఒక వింత ఆలయం మన దేశంలో ఉందనే విషయం మీకు తెలుసా? అవును.. ఇది నిజం..! సైన్స్ సైతం చేతులెత్తేసిన ఒక అద్భుతం..! ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆకాశం నుంచి వచ్చే మహా పిడుగు నేరుగా ఆ శివలింగంపైనే పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం ముక్కలు ముక్కలైపోతుంది. కానీ.. ఆ తర్వాత జరిగే వింత చూస్తే మీ ఒళ్లు గగుర్పొడుస్తుంది..! హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచు కొండల మధ్య దాగున్న ఆ అంతుచిక్కని సైన్స్ ఏంటి..? ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటి..? ఆ భోళా శంకరుడి లీల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.. -
20 టన్నుల వెండిలో 5% మాత్రమే ఒరిజినల్.. షాక్‌లో భక్తులు
వైష్ణోదేవి ష్రైన్ బోర్డులో రూ.550 కోట్లకు పైగా విలువైన వెండి కానుకల అవకతవకల కేసులో జమ్మూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మునీశ్ కుమార్ మన్హాస్ కోర్టు.. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు అధికారిని అన్ని అవసరమైన రికార్డులతో జులై 29న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం జరిగిన విచారణలో జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు న్యాయవాది దీపక్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఆలయంలో భక్తులు సమర్పించిన వెండి కానుకల్లో కల్తీ, మార్పిడి, దుర్వినియోగం జరిగిందంటూ దీపక్ శర్మ ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో ఏముంది?దీపక్ శర్మ మే 9న ఇచ్చిన ఫిర్యాదులో నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, నిధుల దుర్వినియోగం, రికార్డుల్లో తారుమారు, క్యాడ్మియం కలిపిన నకిలీ వస్తువుల కొనుగోలు-అమ్మకం వంటి తీవ్రమైన నేరాల ప్రస్తావన ఉంది.దీపక్ శర్మ ఐజీపీ క్రైమ్ బ్రాంచ్, ఎస్ఎస్పీ క్రైమ్ బ్రాంచ్ (ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్) ముందు విస్తృత ఫిర్యాదు సమర్పించారు. పూర్తి దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. క్రైమ్ బ్రాంచ్ స్పష్టమైన చర్య తీసుకోకపోవడంతో శర్మ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల తర్వాత క్రైమ్ బ్రాంచ్ స్టేటస్ రిపోర్టు సమర్పించింది. ఫిర్యాదును పరిపాలనా స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నామని అందులో తెలిపింది.సోమవారం స్టేటస్ రిపోర్టుపై విచారణ సమయంలో అడ్వొకేట్ దీపక్ శర్మ విస్తృత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫిర్యాదును కేవలం ఫైళ్ల మధ్య తిప్పడం వల్ల నేరాలపై చట్టపరమైన చర్య తీసుకున్నట్టుకాదని వాదించారు. క్రైమ్ బ్రాంచ్ స్వయంగా నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ అని, భారతీయ నాగరిక భద్రత సంహిత 2023 ప్రకారం ఫిర్యాదుపై నేరుగా చర్య తీసుకునే బాధ్యత దానిదేనని చెప్పారు. స్టేటస్ రిపోర్టులో ఆధారాలను భద్రపరిచే చర్యల ప్రస్తావన లేదని కూడా పేర్కొన్నారు. ఇన్వెంటరీ రిజిస్టర్, స్టాక్ రికార్డులు, సీసీటీవీ దృశ్యాలు, రవాణా పత్రాలు, అస్సే రిపోర్టులు (లోహం స్వచ్ఛతను పరీక్షించి ఇచ్చే నివేదిక), మింట్ ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రసాదం స్వీకరణ, నిల్వ, రవాణా, పరీక్షలు, కరిగింపు ప్రక్రియలకు సంబంధించిన అన్ని రికార్డులను ప్రస్తావించారు.వివాదానికి కారణం ఏమిటి?ఆలయంలో సేకరించిన దాదాపు 20 టన్నుల వెండి (విలువ సుమారు రూ.550 కోట్లు) పరీక్షలు, కరిగింపు, ప్రాసెసింగ్ కోసం పంపినట్టు వెలుగులోకి రావడంతో ఈ విషయం సంచలనమైంది. దర్యాప్తులో కేవలం 5-6 శాతం మాత్రమే అసలు వెండి అని తేలింది. మిగిలిన భాగం నకిలీగా గుర్తించారు. అందులో క్యాడ్మియం, ఇనుము, ఇతర నాసిరకం లోహాలు ఉన్నట్టు బయటపడింది. భక్తులకు నగల వ్యాపారులు నకిలీ వెండి విక్రయించారా, లేక అసలు కానుకలను తర్వాత మార్చారా, పలుచగా చేశారా, దొంగిలించారా, తప్పుగా వినియోగించారా అన్న కోణంలో దర్యాప్తు చేయాలని దీపక్ శర్మ కోరారు. -
వారాహి దేవి పూజలో ఈ రహస్య నియమాలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహం ఖాయం
-
ఏపీ : కొండ కోనల్లో అద్భుతమైన ఆలయం శనివారం మాత్రమే తెరుస్తారు! ఎక్కడో తెలుసా (ఫొటోలు)
-
గరుడతీర్థం..
ఆదిశేషుడి కొడుకు మణినాగుడు గరుత్మంతుడి భయం వల్ల కైలాసానికి వెళ్లి, పరమశివుని సన్నిధిలో ఉంటూ ఆయనను సేవించుకోసాగాడు. కొన్నాళ్లకు పరమశివుడు అతడి భక్తిప్రపత్తులకు ప్రసన్నుడయ్యాడు. ‘మణినాగా! నీ భక్తికి మెచ్చాను. వరమేమి కావాలో కోరుకో!’ అడిగాడు.‘పరమేశ్వరా! గరుడుని వల్ల భయం కలగకుండా వరమివ్వు చాలు’ అన్నాడు మణినాగుడు.‘తథాస్తు’ అంటూ వరం అనుగ్రహించాడు పరమశివుడు.పరమశివుడి వరం కారణంగా భయం తొలగిన మణినాగుడు ఒకనాడు వ్యాహ్యాళిగా క్షీరసాగర తీరంలో స్వేచ్ఛగా సంచరించసాగాడు. ఇది చూసిన గరుడుడు అకస్మాత్తుగా వచ్చి, మణినాగుడిని ఎగరేసుకుపోయాడు. తన నివాసంలో అతడిని బంధించి ఉంచాడు.కైలాసంలో పరమశివుడి సన్నిధిలో అందరూ కొలువుతీరి ఉన్నారు. ‘పరమేశ్వరా! మన మణినాగుడు ఈరోజు ఎందుకో సభకు రాలేదు. అతడిని వైనతేయుడు భక్షించడమో, బంధించడమో చేసి ఉండవచ్చని సందేహంగా ఉంది’ అన్నాడు నందీశ్వరుడు.నందీశ్వరుడి మాటలతో శివుడికి తాను మణినాగుడికి ఇచ్చిన వరం జ్ఞప్తికి వచ్చింది.‘నందీశ్వరా! తక్షణమే నువ్వు క్షీరసాగరానికి వెళ్లు. శ్రీమహావిష్ణువును స్తుతించి, మణినాగుడిని విడిపించుకుని, నా వద్దకు తీసుకురా!’ అని ఆజ్ఞాపించాడు.పరమశివుడి ఆనతితో నందీశ్వరుడు హుటాహుటిన క్షీరసాగరానికి చేరుకున్నాడు. శ్రీమహాలక్ష్మి పాదాలు ఒత్తుతుండగా, శేషశయ్యపై అర్ధనిమీలిత నయనాలతో పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును దర్శించుకుని, ఆయనను వేనోళ్ల స్తుతించాడు. మణినాగుడికి పరమశివుడు వరమిచ్చిన సంగతిని, అతడిని తనతో పాటు కైలాసానికి కొనితెమ్మని ఆనతినిచ్చిన సంగతిని విన్నవించుకున్నాడు. మణినాగుడిని గరుడుడు బంధించి ఉండవచ్చని, అందువల్ల అతడిని గరుడుని చెర నుంచి విడిపించాలని అభ్యర్థించాడు.నందీశ్వరుడి మాటలను ఆలకించిన విష్ణువు వెంటనే గరుత్మంతుడిని పిలిపించాడు. గరుడుడు వెంటనే విష్ణుపాదాల ముందు వాలాడు.‘వినతానందనా! మణినాగుడిని విడిచిపెట్టి, ఈ నందీశ్వరుడికి అప్పగించు’ అని ఆజ్ఞాపించాడు.‘ప్రభూ! ఇది అన్యాయం. భృత్యులకు సంతోషకరమైన వస్తువులు ప్రభువు ఇవ్వడం లోకంలో ఉంది. నువ్వు ఏనాడూ నాకు ప్రీతిపాత్రమైన వస్తువులను ఇచ్చి ఉండలేదు సరికదా, నేను సంపాదించుకున్న వస్తువును ఇప్పడు ఇచ్చేయమంటున్నావు. నీకు వాహనాన్నై నిన్ను మోస్తూ ఉన్నాను. అందుకు నువ్వే నాకు ఏదైనా ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోగా, నేను సంపాదించుకున్న నాకిష్టమైన ఆహారాన్ని ఇచ్చేయమంటున్నావు. ఇదేమి న్యాయం? నేను మణినాగుడిని ఇవ్వలేను’ అని నిష్ఠురంగా పలికాడు గరుత్మంతుడు.గరుడిని మాటలు విన్న శ్రీమహావిష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ, ‘వైనతేయా! నువ్వు నన్ను మోస్తూ ఉన్నందునే కృశించిపోయినట్లున్నావు. అయినా, నువ్వు బలశాలివి సుమీ! ఏదీ కాస్త నా చేతి వేలిని నీ తలమీద కాసేపు మోయి’ అంటూ గరుడుని శిరస్సు మీద వేలు ఉంచాడు.గరుడుని తల అతడి ఉదరభాగం వరకు కుంగిపోయింది. గరుడు విలవిలలాడాడు. ‘దేవాదిదేవా! జగన్నాథా! పాహిమాం! పాహిమాం! నా అపరాధాన్ని మన్నించి, కాపాడు’ అని గగ్గోలు పెట్టాడు. ‘జగన్మాతా! నీవైనా దయతలచి నన్ను కాపాడు’ అని లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ‘నాథా! వైనతేయుడిని రక్షించండి’ అని అభ్యర్థించింది లక్ష్మీదేవి.అప్పుడు శ్రీమహావిష్ణువు నందీశ్వరుడి వైపు చూసి, ‘నందీశ్వరా, మణినాగుడితో పాటు ఈ గరుత్మంతుడిని కూడా పరమేశ్వరుని సన్నిధికి తీసుకుపో! దయామయుడైన పరమేశ్వరుని కటాక్షంతో ఇతడి శరీరం యథాస్థితికి రాగలదు’ అని పలికాడు. నందీశ్వరుడు తనతో పాటు మణినాగుడిని, గరుత్మంతుడిని తీసుకుని కైలాసంలో పరమశివుని సన్నిధానానికి చేరుకున్నాడు. శ్రీమహావిష్ణువు సన్నిధానంలో జరిగినదంతా పరమశివుడికి విన్నవించాడు.పరమశివుడు ప్రసన్నంగా గరుత్మంతుడిని చూసి, ‘వైనతేయా! దిగులు పడకు. పవిత్ర గౌతమీ తీరానికి వెళ్లి, గౌతమీ జలాల్లో స్నానమాచరించు. నీ పూర్వశరీరాన్ని, దారుఢ్యాన్ని పొందగలవు’ అని పలికాడు.పరమశివుడి ఆనతిపై గౌతమీ జలాల్లో స్నానమాచరించాక గరుత్మంతుడికి పూర్వరూపం వచ్చింది. గరుత్మంతుడు స్నానమాచరించిన ఆ ప్రదేశమే గరుడ తీర్థంగా ప్రసిద్ధి పొందింది.- సాంఖ్యాయన -
వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న శాపగ్రస్త నగరం..!
ఊహించుకోండి.. చుట్టూ అంతులేని సముద్రం. ఒకవైపు బంగాళాఖాతం, ఇంకోవైపు హిందూ మహాసముద్రం. ఆ రెండు సముద్రాలు కలిసే చోట ఒక సన్నటి ఇసుక తిన్నె. పగటిపూట చూస్తే అద్భుతమైన పర్యాటక ప్రాంతం. కానీ.. సూర్యుడు అస్తమించాక, చీకటి పడ్డాక... అక్కడికి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి ఉండదు. అక్కడి గాలిలో ఒక రకమైన భయం, నిశ్శబ్దం అలుముకుంటాయి. పాడుబడిన రైల్వే స్టేషన్, కూలిపోయిన చర్చి గోడలు, ఇసుకలో పూడుకుపోయిన ఇళ్లు..అవును, మనం చెప్పుకుంటోంది భారతదేశం చివరి సరిహద్దు, తమిళనాడులోని జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన రామేశ్వరం సమీపంలోని 'ధనుష్కోటి' గురించి. ఇవాళ ప్రపంచం దీన్నే ఒక Ghost Town అని పిలుస్తోంది. కానీ, ఈ నిర్జన ప్రదేశం వెనుక కేవలం ఒక తుఫాను కథ మాత్రమే లేదు.. యుగాల నాటి రామాయణ రహస్యం దాగి ఉంది. అసలు ఈ నగరంలో రాత్రి వేళల్లో ఏం జరుగుతోంది? సైన్స్ కూడా తలవంచిన ఆ అయస్కాంత క్షేత్రాల మిస్టరీ ఏంటి? తుఫాను వల్ల నగరం నాశనమైంది.. మరి దీన్ని 'మిస్టరీ' అని ఎందుకు అంటున్నాం? పగటిపూట ఈ రామసేతు అందాలను చూడటానికి పర్యాటకులు వస్తారు. కానీ సాయంత్రం 6 గంటలు దాటితే చాలు.. ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. టూరిస్టులను, స్థానిక జాలర్లను కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించేస్తారు. ఎందుకు? ఈ మిస్టరీని అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి... -
దశాశ్వమేధ ఘట్టం
దేవశిల్పి విశ్వకర్మ మనవడైన ప్రథముడికి భౌవనుడు అనే కొడుకు కలిగాడు. అతడు దినదినాభివృద్ధి చెంది సకల శాస్త్రాలను అభ్యసించి, సార్వభౌముడిగా ఎదిగాడు. భౌవనుడికి ఒకేసారి దశాశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పం కలిగింది. అతడు తన ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని దర్శించుకుని, ‘ఏకకాలంలో దశాశ్వమేధ యాగాలు చేయాలని కోరికగా ఉంది. ఈ యాగాల నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో సెలవివ్వండి’ అని అభ్యర్థించాడు.‘రాజా! పూర్వకాలం నుంచి రాజులందరూ ఏ ప్రదేశంలో అశ్వమేధ యాగాలు చేసేవారో, అదే ప్రదేశంలోనే నువ్వు కూడా యాగాలు నిర్వహించు’ అని చెప్పాడు కశ్యపుడు.కశ్యపుడి సూచనతో భౌవనుడు ఋత్విక్కులను ఏర్పాటు చేసుకుని, పూర్వీకులు యాగాలు నిర్వహించిన ప్రదేశంలోనే పది అశ్వమేధ యాగాలూ ఒకేసారి ప్రారంభించాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆ యాగాలు సంపూర్ణం కాలేదు.యాగాలు సఫలం కాకపోవడంతో భౌవనుడు విచారించాడు. పురోహితులతో చర్చించి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలంలో యాగాలను తిరిగి ప్రారంభించాడు. అక్కడ కూడా యాగాలకు అంతరాయాలు కలిగాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి.భౌవనుడు చింతాక్రాంతుడయ్యాడు. ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నా దోషమో, మీ దోషమో, దేశ కాల దోషమో నాకు అర్థం కాకున్నది. నేను తలపెట్టిన యాగాలు ఎంతగా ప్రయత్నించినా సంపూర్ణం కాకున్నవి. దీనికి మార్గాంతరమేమిటో అంతుచిక్కకున్నది’ అని విచారంగా పలికాడు.కశ్యపుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత, ‘రాజా! పద’ అంటూ భౌవనుడిని తనతో పాటు బృహస్పతి అన్న అయిన సంవర్తకుడి దగ్గరకు తీసుకుపోయాడు. ‘మహాత్మా! మేము దశాశ్వమేధ యాగాలు తలపెట్టాము. యాగ నిర్వహణకు ఇదివరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి. మేము తలపెట్టిన యాగ నిర్వహణకు తగిన ఉత్తమ ప్రదేశమేదో నువ్వే చెప్పాలి’ అని అడిగాడు కశ్యపుడు. సంవర్తకుడు కొద్దిసేపు ఆలోచించి, ‘మునివర్యా! మీరిద్దరూ నేరుగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి అడగండి. మీరు సంకల్పించిన యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలాన్ని ఆయనే చెప్పగలడు’ అని చెప్పి, వారిని సాదరంగా సాగనంపాడు. భౌవనుడిని వెంటపెట్టుకుని కశ్యపుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.బ్రహ్మదేవుడిని దర్శించుకుని, వారిద్దరూ నమస్కరించారు. ‘బ్రహ్మదేవా! మా రాజైన ఈ భౌవనుడు దశాశ్వమేధ యాగాలను ఏకకాలంలో తలపెట్టాడు. ఇదివరకటి యత్నాలు విఫలం కావడంతో వ్యాకులం చెందుతున్నాడు. యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో నువ్వే సెలవివ్వాలి’ అడిగాడు కశ్యపుడు. ‘పవిత్ర గౌతమీతటాన యాగ నిర్వహణ కావించండి. అక్కడ నిర్వహించే ఏ యాగమైనా సంపూర్ణంగా ఫలిస్తుంది’ అని చెప్పి, భౌవనుడిని ఉద్దేశించి, ‘రాజా! నువ్వు ఇందుకు వేరే గురువును ఆశ్రయించవలసిన పనిలేదు. వేదపారంగతుడైన ఈ కశ్యపుడే గురుశ్రేష్ఠుడై యాగాన్ని పరిపూర్ణం చేయించగలడు’ అని చెప్పాడు.కశ్యపుడి ఆధ్వర్యంలో భౌవనుడు గౌతమీ తీరంలో దశాశ్వమేధం ప్రారంభించాడు. యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. యాగ పరిసమాప్తి సందర్భంగా భౌవనుడు భూదానానికి ఉద్యుక్తుడయ్యాడు.అదే సమయంలో అశరీరవాణి ‘ఓ రాజా! సమస్త భూమండలాన్నీ నువ్వు ఈ కశ్యప మహర్షికి దానం చేయాలని సంకల్పించుకున్నావు. నీ సత్సంకల్ప మాత్రానే భూమండలం సర్వసుభిక్షమైంది. నీ మనసులోనున్న భూదాన సంకల్పాన్ని విరమించుకుని, మహాఫలప్రదమైన అన్నదానం కావించు. నీకు శుభం కలుగుతుంది’ అని పలికింది. అశరీరవాణి పలుకులు విన్నప్పటికీ భౌవనుడు తన భూదాన సంకల్పం నుంచి వెనక్కు తగ్గలేదు. అప్పుడు భూదేవి స్వయంగా ప్రత్యక్షమై, ‘మహారాజా! మాటిమాటికి నన్ను దానం చేయడం తగదు. నీ సంకల్పం విడిచిపెట్టు’ అని చెప్పింది.భూదేవి స్వయంగా ప్రత్యక్షం కావడంతో భౌవనుడు చలించిపోయాడు. ‘తల్లీ! యాగ పరిసమాప్తి సందర్భంగా నేనిప్పుడు ఏ దానం చేయాలో నువ్వే చెప్పు’ అన్నాడు.‘పవిత్రమైన ఈ గౌతమీ తీరాన నవధాన్యాలు, గోవులు, ధన కనక వస్తు వాహనాలు వేటిని దానం చేసినా అక్షయఫలం లభిస్తుంది. ఇక్కడ అన్నదానం చేసినవారికి సమస్తదానాలూ చేసినంత ఫలం దక్కుతుంది.’ అని పలికింది. భౌవనుడు యాగస్థలంలో వేలాదిమందికి అన్నదానం చేశాడు. అతడి యాగస్థలి దశాశ్వమేధ తీర్థంగా ప్రసిద్ధి పొందింది. - సాంఖ్యాయనపురావిశేషం..ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరువలోని హీరాపూర్ గ్రామంలో అత్యంత అరుదైన పురాతన శాక్తేయ ఆలయం ఉంది. ఇది చతుష్షష్టి యోగినుల మందిరం. ఇందులో అధిష్ఠాన దేవత మహామాయ విగ్రహంతో పాటు అరవైనాలుగు మంది యోగినుల విగ్రహాలు ఉంటాయి. పైకప్పు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. దీనిని భౌమవంశానికి చెందిన రాణి హీరాదేవి క్రీస్తుశకం 864లో నిర్మించింది. పదహారో శతాబ్దిలో కాలాపహాడ్ అనే సేనాని జరిపిన దాడిలో ధ్వంసమైన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో మిగిలింది. -
ఈ 4 అలవాట్లుంటే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే..!
హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న గ్రంథాల్లో ఒకటైన గరుడ పురాణం అనగానే.. మనకు సాధారణంగా గుర్తొచ్చేది మరణం, ఆ తర్వాత ఆత్మ ప్రయాణం, యమలోకంలో శిక్షలు మాత్రమే. కానీ, ఇది కేవలం జీవన్మరణ రహస్యాలకే పరిమితమైన గ్రంథం కాదు! మనిషి బతికుండగా భూమిపై ఎలా జీవించాలి? ఎలాంటి ప్రవర్తనను అలవర్చుకోవాలి? ఏ విధమైన క్రమశిక్షణతో మెలగాలి? అనే ఎన్నో జీవన సూత్రాలను గరుడ పురాణంలోని 'ఆచార కాండం' అద్భుతంగా వివరిస్తుంది. ఆ వివరాలను తెలుసుకుందాం..నాలుగు తప్పుడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన, పరిశుభ్రమైన, సానుకూల జీవనశైలిని ఎవరైతే అనుసరిస్తారో.. వారి జీవితంలో సుఖశాంతులు, శ్రేయస్సు వైపు మార్గం సుగమం అవుతుంది. అయితే ఇది పూర్తిగా విశ్వాసాలు, మన పురాతన సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడిన సమాచారం అని ప్రేక్షకులు గమనించాలి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.. -
సోమశర్మ వృత్తాంతం..
‘మహర్షీ! కౌశిక పుత్రుడైన సోమశర్మ విష్ణు సాక్షాత్కారం పొందిన మహాభక్తుడని విని ఉన్నాను. అతడి వృత్తాంతం చెప్పు’ అని సూతుడిని అడిగాడు శౌనకుడు. అప్పుడు సూతుడు అతడికి సోమశర్మ వృత్తాంతం ఇలా చెప్పాడు: కౌశికుడి కుమారుడైన సోమశర్మ చ్యవనుడి కుమార్తె సుమనను పెళ్లాడాడు. అతడు ధనసంపదలు లేనందున దారిద్య్రంతో బాధపడసాగాడు. వివాహమై ఎన్నాళ్లు గడచినా సంతానం లేకపోవడంతో మరింత దుఃఖితుడై లోలోన మనోవేదన చెందసాగాడు.సోమశర్మ వేదనను గమనించిన అతడి భార్య సుమన, ‘నాథా! మనోవేదన శరీరాన్ని కూడా దహించేస్తుంది. మీరెందుకు బాధపడుతున్నారు?’ అని అడిగింది.‘దేవీ! ఈ జన్మలో నాకు ధనపుత్ర సంపదలు లేకపోవడం వల్ల దిగులు చెందుతున్నాను. పూర్వజన్మ పాపాల వల్లనే నాకీ గతి ఏర్పడినట్లుందని తలచి దుఃఖిస్తున్నాను’ అని చెప్పాడు.‘ప్రాణనాథా! సృష్టిలోని సకలజీవులు విషయాశ వల్ల సంసారబాధలు పడుతుండటం సహజమే! మోహం వల్ల లోభం; లోభం వల్ల అసత్యం; అసత్యం వల్ల పాపం; పాపం వల్ల దుఃఖం సంభవిస్తాయి. ఋణానుబంధాల కారణంగా సంతానం కలుగుతుంది. పూర్వజన్మలో మనం ఎవరి వద్ద ధనం తీసుకోలేదు. ఎవరితోనూ మనకు రాగద్వేషాదులు లేవు.’ అని చెప్పింది.‘నువ్వు చెప్పినది నిజమే! ఇది నివృత్తి మార్గం. కాని, ఎందరో సాధువులైన మహాపురుషులు సకృత కర్మలు ఆచరించి, దారాపుత్రాదులతో చతుర్విధ పురుషార్థాలను పొందారు. మనం ధన పుత్రలాభం పొందే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు’ భార్యను అడిగాడు సోమశర్మ.‘నాథా! ప్రవృత్తి, నివృత్తి మార్గాలు రెండూ శ్రుతి సమ్మతాలు. ‘పుత్రేణ లోకాన్ జయతి’ అని వేదవాక్యం. పుత్రుడు లోకజయానికి సాధనం. గుణవంతుడు, విద్వాంసుడు అయిన ఒక పుత్రుడి వల్ల వంశం తరిస్తుంది. ఎందరో మహర్షులు ప్రవృత్తిమార్గంలో చతుర్విధ పురుషార్థాలను సాధించారు.’ అంటూ అనేక ఉదాహరణలను చెప్పింది.‘దేవీ! ఇవన్నీ నువ్వెలా తెలుసుకున్నావు?’ అడిగాడు సోమశర్మ.‘నాథా! నా తండ్రి చ్యవనుడి ద్వారా కొంత జ్ఞానం పొందాను. ఆయన ద్వారానే కొన్ని పూర్వగాథలను తెలుసుకున్నాను. నాకు తెలిసినంత చెప్పాను. వసిష్ఠ మహర్షి వద్దకు వెళితే ఆయన మరిన్ని విశేషాలు చెప్పగలరు’ అని చెప్పింది సుమన.సోమశర్మ గంగాతీరంలో ఉన్న వసిష్ఠాశ్రమానికి వెళ్లాడు. వసిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. వసిష్ఠుడు అతడిని వచ్చిన కారణమేమిటని అడిగాడు.‘మహర్షీ! నా దారిద్య్ర బాధలకు, నాకింత వరకు సంతానం కలగకపోవడానికి కారణమేమిటి?’ ప్రశ్నించాడు సోమశర్మ.‘నాయనా! నువ్వు పూర్వజన్మలో కర్షకుడివి. భార్యాపుత్రులు, సిరిసంపదలతో కలిగిన వాడివి. అయినా జ్ఞానశూన్యుడివై, లోభివై, చివరకు భార్యాపుత్రులకు కూడా తగిన అన్నవస్త్రాదులు సమకూర్చక పీడించావు. నువ్వు సంపాదించిన నిక్షేపాలను రహస్య ప్రదేశాల్లో పాతిపెట్టి, వాటి సంగతి భార్యా పిల్లలకు చెప్పకుండానే కాలధర్మం చెంది, యమలోకానికి చేరుకున్నావు. దాన ధర్మాలు చేయనందునే ఈ జన్మలో దారిద్య్రాన్ని అనుభవిస్తున్నావు’ చెప్పాడు వసిష్ఠ మహర్షి.‘మరి నాకు ఈ జన్మలో విప్రత్వం లభించడానికి కారణమేమిటి?’ ప్రశ్నించాడు సోమశర్మ.‘పూర్వజన్మలో సంపన్న కర్షకుడివైన నీ వద్దకు ఒక విప్రుడు వచ్చాడు. నువ్వు అతడికి నీ గోశాలలో ఆశ్రయం ఇచ్చావు. అతడికి షడ్రసోపేతమైన భోజనంపెట్టి ఆతిథ్యమిచ్చావు. ఆ పుణ్యఫలం వల్లనే నీకు విప్రజన్మ లభించింది. నీ దారిద్య్రం తీరాలంటే లక్ష్మీనారాయణుల ధ్యానమే మార్గం’ అని చెప్పాడు వసిష్ఠుడు.వసిష్ఠుడి సలహాపై సోమశర్మ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ లక్ష్మీనారాయణుల కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సును భంగపరచడానికి దేవేంద్రుడు నానా ఆటంకాలు కల్పించాడు. అయినా సోమశర్మ నిశ్చల మనస్కుడై తపస్సు కొనసాగించాడు. సోమశర్మ తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు లక్ష్మీసమేతంగా గరుడారూఢుడై వచ్చి, అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడికి కోరిన వరాలను అనుగ్రహించాడు.శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల సోమశర్మకు దారిద్య్ర బాధ తీరి, ధన సంపదలు సమకూరాయి. కొన్నాళ్లకు పండంటి మగబిడ్డ జన్మించాడు. అతడు బాల్యం నుంచి కృష్ణభక్తుడై దినదినాభివృద్ధి చెందాడు. అతడు యుక్తవయస్కుడు కాగానే సోమశర్మ, సుమన దంపతులు అతడికి వివాహం చేసి, పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లారు.పురావిశేషం..పూరీలోని శ్రీక్షేత్రంలో జరిగే విశేషమైన వేడుక స్నానపూర్ణిమ. జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఆలయ అర్చకులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను గర్భాలయం నుంచి బయటకు తీసుకువచ్చి, ఆలయ ప్రాంగణంలోని ‘స్నానబేడి’ అనే స్నానాగారంలో పవిత్రస్నానం చేయిస్తారు. ఇందులో భాగంగా 108 కలశాల జలాలతో అభిషేకిస్తారు. ఈరోజు జగన్నాథుడు గజముఖుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు స్నానం తర్వాత జగన్నాథుడు జ్వరం బారినపడి, ‘అనసర ఘర’ అనే జ్వరమందిరంలో పద్నాలుగు రోజులు గడుపుతాడు. - సాంఖ్యాయన -
నూనె.. వత్తి లేకున్నా నిరంతరాయంగా వెలిగే దీపం
ప్రకృతి నియమాలకు లొంగని ఒక అద్భుతం..! సైన్స్ సైతం చేతులెత్తేసిన ఒక అంతుచిక్కని రహస్యం..! శతాబ్దాలుగా ఎలాంటి చమురు.. అంటే నూనె లేదు..! వత్తి లేదు..! కానీ, నిరంతరాయంగా అగ్ని జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యం కూడా.. ఆ జ్వాలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించి.. నిరంతరాయంగా నీళ్లు పోసినా.. ఆరని ఆ జ్వాల వెనక ఉన్న మర్మమేంటి? హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా లోయలో కొలువైన జ్వాలాజీ ఆలయంలో వింతలు, విశేషాలు తెలుసుకుందాం..భూగర్భంలో ఉండే మీథేన్ గ్యాస్ వల్ల ఈ మంటలు వస్తున్నాయని భావించి, ఓఎన్జీసీ (ONGC) శాస్త్రవేత్తలు ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. కానీ ఆశ్చర్యకరంగా... ఇక్కడ ఎలాంటి గ్యాస్ నిల్వలు లేవని తేలింది! ఆ గ్యాస్ ఎక్కడి నుండి వస్తోంది? అసలు ఇంధనం లేకుండా మంటలు ఎలా వెలుగుతున్నాయి? అన్నది నేటికీ సైన్స్‌కు అందని ఒక ఛేదించలేని రహస్యం. సైన్స్ సరిహద్దులు ముగిసేచోట ఆధ్యాత్మికత మొదలవుతుందనడానికి జ్వాలాజీ ఆలయమే ఒక సజీవ సాక్ష్యం. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.. -
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
-
తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)
-
పితృకార్యాలు.. ఎక్కడ చేస్తే మంచిది?
పితృదోషాలు.. వాటి పరిష్కారమార్గాల గురించి మనం ఇదివరకు చేసిన వీడియోల్లో చెప్పుకొన్నాం కదా..! జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక అడ్డంకులు.. వైవాహిక సమస్యలు, తీరని ఆర్థిక ఇబ్బందులకు కేవలం గ్రహగతులు మాత్రమే కాకుండా.. పితృదోషాలు కూడా కారణం కావొచ్చని చెప్పుకొన్నాం. అసంతృప్తిగా ఉండే పూర్వీకుల ఆత్మల శాపం.. ఆ వంశంపై పడుతుంది. అయితే.. ఆత్మలకు శాంతిని చేకూర్చి, పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు కొన్ని పవిత్ర స్థలాలను మన పురాణాలు సూచించాయి. ఆ ప్రాంతాల్లో పిండప్రదానాలు చేస్తే.. పితృదేవతలు సంతృప్తి చెందుతారని వివరిస్తున్నాయి. ఆ వివరాలను తెలుసుకుందాం..పితృదోషాలు, పితృశాపాల నుంచి విముక్తి ఎలా లభిస్తుందని చెబుతుంటారు? పూర్వీకులకు తర్పణాలు అర్పించడానికి ఏ క్షేత్రాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు? ఏ క్షేత్రంలో పిండప్రదానాలు చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు నేరుగా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు? ఏయే ఆలయాలను పితృ దోష నివారణకు అద్భుతమైనవిగా చెబుతారు? ఎక్కడ ‘మోక్ష దీపాన్ని’ వెలిగించడం ద్వారా పూర్వీకుల కోపం తొలగి.. కుటుంబంలో శ్రేయస్సు నెలకొంటుంది? వంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూడండి.. -
నైవేద్యం ఆలస్యమైతే కరిగిపోయే విగ్రహం!.. ఈ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
ఆకలి.. జీవులకు ఓ గొప్ప వరం.. ఒక్కోసారి అదే పెద్ద శాపం! ‘క్షుధాతురాణాం న రుచి న పక్వమ్’ అన్నారు పెద్దలు. అంటే ఆకలి వేసినప్పుడు రుచులు, పక్వాలు చూడరని అర్థం. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని శంకరుల వారే చెప్పారు. కానీ.. ఈ ఆకలికి ఆ దేవుడు అతీతుడా? అసలు దేవుడికి కూడా తీవ్రమైన ఆకలి వేస్తుందా? గ్రహణం పడితే ప్రపంచంలో ఏ గుడైనా మూసేస్తారు.. కానీ, గ్రహణ సమయంలో కూడా ఆకలి తట్టుకోలేక, నైవేద్యం స్వీకరించే వింత దేవుళ్లు ఎక్కడైనా ఉన్నారా?మన దేశంలోని కొన్ని పురాణ క్షేత్రాలు... 'అవును.. దేవుడికి కూడా ఆకలి వేస్తుంది!' అని నిరూపిస్తున్నాయి. ఒక్క 10 నిమిషాలు నైవేద్యం ఆలస్యమైతే చాలు.. అక్కడ దేవుడి విగ్రహం ఆకలితో చిక్కిపోతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం! ఆ అద్భుత క్షేత్రాల రహస్యాలు ఏంటో తెలుసా?గ్రహణం అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దేవాలయాల తలుపులను మూసివేయడం.. గ్రహణం విడుపు తర్వాత శుద్ధి కార్యక్రమాలు జరిపి, నిత్య సేవలను ప్రారంభించడమే..! కానీ, కొన్ని ఆలయాల్లో దేవుడి ఆకలి కారణంగా.. గ్రహణ సమయంలోనూ ఆలయాల తలుపులు తెరుచుకునే ఉంటాయి. కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఈ కోవలో ముందంజలో ఉంటుంది. ఇక్కడ కొలువుదీరిన కన్నయ్యకు ఆకలి చాలా ఎక్కువ. రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. అంతేకాదు.. ఈ ఆలయంలోని గర్భగుడి వెలుపల పెద్ద గొడ్డలి ఉంటుంది. ఉదయం ఆలయం తెరవడానికి తాళం మొరాయిస్తే.. దాన్ని ఈ గొడ్డలితో పగులగొట్టి మరీ.. దేవుడి ఆకలిని తీర్చేలా వెనువెంటనే నైవేద్యాలు పెడతారు. ఈ ఆలయంలో 10 నైవేద్యాల్లో ఏ ఒక్కటి తగ్గినా.. స్వామివారు సన్నబడతారట..! సైన్స్‌కు కూడా ఈ వింత అంతుచిక్కలేదట..! అందుకే.. ఇక్కడి పూజారులు గ్రహణ సమయంలో కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. స్వామివారు ఆకలిని తట్టుకోలేరనే ఉద్దేశంతో.. గ్రహణ పట్టు.. విడుపులతో సంబంధం లేకుండా నైవేద్యం సమర్పిస్తారు.రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంచుతారు. ఓసారి ఇక్కడి ఆలయాన్ని గ్రహణ సమయంలో మూసివేస్తే.. స్వామివారు ఆ పక్కనే ఉన్న మిఠాయి దుకాణం వ్యాపారి కలలోకి వచ్చి.. ‘‘నాకు చాలా ఆకలిగా ఉంది’’ అని చెప్పారట. అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి క్షేత్రంలో శివలింగం స్వయంభూ. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడు నవగ్రహాలను, 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. ఆయనకు గ్రహాలను శాసించే స్వామిగా పేరుంది. అలాంటి స్వామికి గ్రహణ దోషం ఎందుకుంటుంది? అందుకే.. ఇక్కడ గ్రహణ సమయంలో రాహు-కేతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఉజ్జయినిలోని మహాకాళుడికి కాలాతీతుడు.. అంటే కాలానికి అతీతుడు అనే పేరుంది. అందుకే.. ఈ స్వామివారికి గ్రహణ ప్రభావం అంటదు. గ్రహణ సమయంలో ఈ జ్యోతిర్లింగ దర్శన సమయాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక దివి నుంచి భువికి గంగాప్రవాహం వచ్చేప్పుడు.. ఆ ఉధృతిని తన జటాజూటంతో నిర్బంధించిన శివుడు ఉత్తరాఖండ్‌లోని కల్పేశ్వర్ ఆలయంలో కొలువుదీరాడు. ఈయనకు కూడా గ్రహణ సమయంలో పూజలు ఆగవు. ఇక ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో అమ్మవారు కల్కాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె సాక్షాత్తూ కాలచక్రానికే అధిపతి. అంటే.. గ్రహాలు, నక్షత్రాలు ఆమె కనుసన్నల్లోనే కదులుతాయి. అందుకే.. గ్రహణ ప్రభావం అమ్మవారిపై ఉండదనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక గయలోని విష్ణుపాద ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. ఇక్కడ గ్రహణ సమయంలో పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. -
రాధాకృష్ణులు.. ఇప్పటికీ అక్కడే! రాత్రయితే.. చిన్న చీమ కూడా ఆ ప్రాంతం దాటదు!
ఎన్నెన్నో ఆధ్యాత్మిక వింతలకు భారతదేశం ఆలవాలం. పూరీజగన్నాథుడి ఆలయంపై ఉండే ధ్వజం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలాజీ ఆలయంలో చమురు లేకుండానే దీపం వెలుగుతుంది. ఇలా సైన్స్‌కు కూడా అంతు చిక్కని విశేషాలెన్నెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే.. రాధాకృష్ణులు, గోపికలు రోజూ విహరించే ప్రదేశం ఒకటుంది. ఆ ప్రాంతంలో అన్నీ వింతలే.. చెట్ల కొమ్మలు ఆకాశంవైపు కాకుండా.. భూమివైపుగా పెరుగుతాయి. సైన్స్ కూడా హైపోథెసిస్ వరకే పరిమితమై.. అజెంప్షన్లతో ప్రకటనలు చేసిందే గానీ.. నిగూఢ రహస్యాలను ఛేదించలేకపోయింది. ఆ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలోని బృందావనంలో కనిపించే నిధివన్ అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక వింతల్లో ఒకటిగా ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ద్వాపరయుగం కొనసాగుతోందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతిరోజూ రాత్రి నిధివన్‌కు రాధాకృష్ణలు, గోపికలు చేరుకుంటారని భక్తుల విశ్వాసం. దట్టమైన అడవిలా ఉండే ఈ వనంలో ఉన్న రంగమహల్ కూడా అంతుచిక్కని రహస్యాలకు వేదికగా ఉంది. పూజారులు సాయంత్రం వేళలో ఈ మహల్లో రాధాకృష్ణుల కోసం ఓ మంచం వేసి, పక్కనే చందనం, లడ్డూలు, తాంబూలం, నీళ్ల బిందె, రాధమ్మ కోసం చీర, గాజులు, పండ్లు పెడతారు. ఆ తర్వాత మందిరం తలుపులకు తాళాలు వేస్తారు. ఉదయం 5 గంటలకు మందిరం తలుపులు తెరిచి చూస్తే.. ఆ మంచంపై ఎవరో పడుకున్నట్లు, నలిగిపోయి ఉంటుంది. నీళ్ల బిందెలో సగం నీళ్లు అయిపోయి కనిపిస్తాయి. తాంబూలం నమిలిన ఆధారాలు, సగం స్వీట్లు తిన్నట్లు అక్కడి దృశ్యాలు స్పష్టం చేస్తాయి. ఈ రహస్యాన్ని ఇప్పటికీ ఏ సైన్స్ కూడా ఛేదించకపోవడం గమనార్హం..!నిధివన్ ఓ దట్టమైన అడవిలా ఉంటుందని మనం చెప్పుకొన్నాం కదా? అయితే.. ఇక్కడి చెట్లన్నీ వింతగా ఉంటాయి. ఎక్కడైనా చెట్ల శాఖలు.. అంటే కొమ్మలు సాధారణంగా పైకి ఆకాశంవైపు పెరుగుతాయి. కానీ, నిధివన్లో మాత్రం శాఖలు భూమివైపునకు వంగుతూ పెరుగుతాయి. అంతేకాదు.. నిధివన్ చెట్లలో మరో విశేషాన్ని చూడవచ్చు. ఎక్కడైనా చెట్లు ఒంటరిగా పెరుగుతాయి. ఇక్కడ మాత్రం చెట్లు జంటలుగా.. జోడీలుగా పెరుగుతాయి. రాత్రిళ్లు ఈ చెట్లన్నీ గోపికలుగా మారుతాయని, ఉదయం అవ్వగానే మళ్లీ చెట్లరూపంలోకి రూపాంతరం చెందుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏడాదిపొడవునా ఇక్కడ ఆకుపచ్చటి చెట్లే కనిపిస్తాయి. ఎండిపోయిన కొమ్మలు కనిపించడం చాలా అరుదు. అయితే.. వృక్షశాస్త్రవేత్తలు మాత్రం నిధివన్లో ఉన్నవి సాధారణ తులసి చెట్లు కావని.. వనతులసి అని.. ఉత్తర మైదానాల్లోని కొన్ని ప్రత్యేక నేలల్లో ఉండే కెమికల్ కంపోజిషన్‌కు నీటికొరత తోడవ్వడం వల్ల కొమ్మలు పైకి కాకుండా.. కిందవైపునకు పెరుగుతున్నాయని ఒక అజెంప్షన్ మాత్రం వ్యక్తపరిచారు. అయితే.. ఇక్కడి చెట్లు ఒంటరిగా కాకుండా.. జంటగా పెరగడంపై ఇప్పటికీ శాస్త్రీయమైన కారణాలను చెప్పలేకపోయారు.నిధివన్లో ఇంకో వింతను చూడవచ్చు. సాధారణంగా పగటిపూట ఈ వనంలో కోతులు సందడి చేస్తాయి. పక్షులు కిలకిలరావాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాయి. కానీ, సాయంత్రం 7 దాటితే.. కోతులు, పక్షులు.. చివరకు ఉడతలు.. చిన్న చీమలు కూడా నిధివన్‌ను వీడి బయటకు వచ్చేస్తాయి. ఇందుకు కారణాలను సైన్స్ ఇప్పటకీ కనుక్కోలేకపోయింది. అయితే.. శతాబ్దాలుగా నిధివన్‌ను ఖాళీ చేయించడం వల్ల.. అక్కడి పక్షులు, జంతువుల్లో ఆ పద్ధతి సర్కేడియన్ రిథమ్‌గా మారడమో.. ఓ కండీషనల్ బిహేవియర్‌గా మారడమో జరిగి ఉండొచ్చనే సైకలాజికల్ థియరీల ఆధారంగా.. శాస్త్రవేత్తలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎవరైనా రాత్రివేళల్లో దొంగచాటుగా నిధివన్లోనికి వెళ్తే.. ఉదయానికి వాళ్లు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడమో.. కంటిచూపును కోల్పోవడమో.. బధిరులుగా మారిపోవడమో.. చనిపోవడమో జరుగుతుందని స్థానికులు బలంగా విశ్వసిస్తారు.నిధివన్ విషయంలో శాస్త్రీయ పరిశోధనల కోసం ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే.. నిధివన్ మేనేజ్మెంట్ అందుకు అంగీకరించలేదు. స్థానికులు కూడా ఇలాంటి చర్యలను అడ్డుకుంటూ వస్తున్నారు. నిధివన్లో కెమెరాలు పెట్టడానికి స్థానికులు అంగీకరించరు. దీంతో.. ఇక్కడ పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగలేదు. నిధివన్పై పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరిగాయి. కొన్ని టీవీ చానళ్లు, రిసెర్చర్లు రాత్రివేళల్లో నిధివన్ సరిహద్దుల వెలుపల హై సెన్సిటివ్ ఆడియో రికార్డర్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను పెట్టి.. రికార్డింగ్‌కు ప్రయత్నించారు. అయితే.. ఆ ప్రాంతం నుంచి రాత్రిళ్లు గజ్జెల సవ్వడి.. మహిళల గుసగుసలు వినిపించాయని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం అవి గాలి శబ్దాలు లేదా హాల్యుజినేషన్ అవ్వొచ్చు అని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా.. సైన్స్‌కు కూడా అంతుచిక్కని నిధివన్‌ను ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి మరిన్ని వింతలువిశేషాలను మా నుంచి మిస్సవ్వకుండా ఉండేందుకు ఈ చానల్ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. -
అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం
బ్రహ్మమానస పుత్రుడైన ప్రచేతనుడికి అసితుడు అనే కొడుకు ఉన్నాడు. అసితుడు బ్రహ్మచర్యాశ్రమంలో సకల విద్యలను అభ్యసించి, తపోవృత్తి కొనసాగించాడు. కొంతకాలానికి అసితుడు వివాహం చేసుకున్నాడు. ఎన్నేళ్లయినా సంతానం కలగకపోవడంతో పరమశివుడి గురించి తపస్సు చేశాడు.పరమశివుడు అతడికి ప్రత్యక్షమై రాధామంత్రాన్ని ఉపదేశించాడు. రాధామంత్ర ప్రభావంతో అసితుడి భార్య గర్భం దాల్చింది. నెలలు నిండాక పండంటి కొడుకు పుట్టాడు. అతడికి దేవలుడు అనే పేరు పెట్టారు. దేవలుడు యుక్తవయస్కుడయ్యాక మాలావతిని పెళ్లాడి, సంతానం పొందాడు. చివరకు విరక్తుడై, ఘోర తపస్సు ప్రారంభించాడు.దేవలుడి తపో తీవ్రతకు దేవేంద్రుడు భయపడ్డాడు. అతడి తపస్సును ఎలాగైనా భంగపరచాలనుకున్నాడు. రంభను పిలిచి, ‘నువ్వు ఎలాగైనా దేవలుడి తపస్సును భంగపరచాలి’ అని ఆదేశించాడు.ఇంద్రుడి ఆజ్ఞ మేరకు రంభ భూలోకానికి దిగివచ్చింది. దేవలుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి, అతడి తపోభంగం కోసం తన గాన, నాట్య కౌశలాలను అలుపెరగకుండా ప్రదర్శించింది. తపస్సమాధిలో ఉన్న అతడికి సపర్యలు చేయడం ప్రారంభించింది. అయినా దేవలుడు కన్నుతెరిచి ఆమెను చూడనైనా చూడలేదు. తన శాయశక్తులా ప్రయత్నించినా, ఫలితం లేకపోవడంతో విసిగి వేసారిపోయిన రంభ ‘దేవలా! నువ్వు నన్ను అష్టకష్టాలపాలు చేశావు. మరుజన్మలో నువ్వు అష్టావక్రుడిగా జన్మిస్తావు’ అని శపించింది. రంభ అంత దారుణంగా శపించినా, దేవలుడు తన తపస్సమాధిలోనే నిశ్చలంగా ఉన్నాడు. దేవలుడి స్థితి చూసి రంభ పశ్చాత్తాపం చెందింది. ‘నిన్ను అనవసరంగా శపించాను. నువ్వు అష్టావక్రుడిగా జన్మించినా, నీ తండ్రి కృప వల్ల దివ్యశరీరుడివి కాగలవు.’ అని పలికింది.∙∙ ఏకపాదుడు తన ఆశ్రమంలో శిష్యులకు వేదం బోధించేవాడు. ఏకపాదుడి శిక్షణ కఠినంగా ఉండేది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శిష్యుల చేత వేదం వల్లె వేయించేవాడు. సుజాత గర్భంలో ఉన్న దేవలుడు ‘గర్భంలో ఉన్న నాకే రోజూ వింటున్న వేదం కంఠోపాఠమైంది. నీ శిష్యులు రోజూ వల్లె వేస్తూనే ఉన్నారు. వారినెందుకు ఉభయ సంధ్యల్లోనూ వేదం వల్లె వేయమంటూ అంతలా హింసిస్తావు? ’ అని తండ్రిని ప్రశ్నించాడు.ఏకపాదుడు సహించలేకపోయాడు. ‘తండ్రినైన నా శిక్షణ విధానాన్ని వక్రంగా హేళన చేస్తావా? నువ్వు అష్టవంకరలతో జన్మిస్తావు’ అని శపించాడు. ప్రసవ సమయం దగ్గరపడుతున్న రోజుల్లో సుజాత ఒకనాడు ఇంటికి కావలసిన సంభారాలను తెమ్మని భర్త ఏకపాదుడిని కోరింది. అతడు ధనం కోసం జనక మహారాజు ఆస్థానానికి వెళ్లాడు. ‘వరుణ కుమారుడైన వందితో వాదంలో నెగ్గినట్లయితే, కోరినదంతా ఇస్తాను. వాదంలో ఓడిపోతే జలమజ్జితుడవై ఉండాలి’ అన్నాడు.ఏకపాదుడు సరేనని వందితో వాదానికి తలపడ్డాడు. వాదంలో ఓడిపోయి, జలమజ్జితుడై, నిర్బంధంలో చిక్కుకుపోయాడు. కొన్నాళ్లకు సుజాత మగబిడ్డను ప్రసవించింది. తండ్రి శాపఫలితంగా అతడు ఎనిమిది వంకరలతో జన్మించి, అష్టావక్రుడిగా ప్రసిద్ధుడయ్యాడు. అదే సమయంలో సుజాత తల్లి, ఉద్దాలకుడి భార్య ఒక కొడుకును కన్నది. అతడు శ్వేతకేతుడు. ఉద్దాలకుడి వద్ద శ్వేతకేతుడితో పాటు అష్టావక్రుడు కూడా పెరిగాడు. ఏకసంథాగ్రాహులైన ఇద్దరూ అనతికాలంలోనే విద్యాపారంగతులయ్యారు.ఒకనాడు తల్లి ద్వారా తన తండ్రి పరిస్థితి తెలుసుకున్న అష్టావక్రుడు– శ్వేతకేతుడితో కలసి జనక మహారాజు ఆస్థానానికి వెళ్లాడు. బాలకులైన వారిద్దరినీ ద్వారపాలకులు అడ్డుకున్నారు. ‘జ్ఞానం ఉన్నవాడు బాలుడైనా వృద్ధుడితో సమానం. వయసు మళ్లినవాడు కాదు’ అని అష్టావక్రుడు వారితో వాదించాడు. ద్వారపాలకులు వారిని లోపలకు వెళ్లనిచ్చారు. జనకుడి అనుమతి పొంది, వందితో వాదానికి దిగాడు అష్టావక్రుడు. సుదీర్ఘంగా సాగిన వాదంలో వంది ఓడిపోయాడు. జనక మహారాజు అష్టావక్రుడిని అభినందించి, ‘ఏం కావాలో కోరుకో’ అన్నాడు.‘మహారాజా! వందితో వాదంలో ఓటమి చెందిన నా తండ్రి జలమజ్జితుడై ఉన్నాడు. అతడిని విడిచిపెట్టు’ అని కోరాడు. జనకుడు జలమజ్జితుడైన ఏకపాదుడిని బయటకు రప్పించాడు. అష్టావక్రుడిని, ఏకపాదుడిని పూజించి, వారి వద్ద అద్వైత రహస్యాలను తెలుసుకున్నాడు. కొన్నాళ్లు ఆతిథ్యమిచ్చి, వారిని సాదరంగా సాగనంపాడు.అష్టావక్రుడి పితృభక్తికి సంతుష్టుడైన ఏకపాదుడు, ‘కుమారా! నీ అంగవైకల్యానికి కారకుడను నేనే. నీ పితృభక్తికి సంతోషించాను. నువ్వు వెంటనే వెళ్లి సమంగ నదిలో స్నానం చేసి రా’ అని ఆదేశించాడు. అష్టావక్రుడు సమంగ నదిలో ముమ్మారు మునిగి స్నానం చేశాడు. అతడి శరీరంలోని వంకరలన్నీ పోయి, సుందరాకారం వచ్చింది. తండ్రి తపోమహిమకు అష్టావక్రుడు చకితుడయ్యాడు. ఇంటికి చేరుకున్నాక తల్లిదండ్రులను పూజిస్తూ, ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ వచ్చాడు. - సాంఖ్యాయనపురావిశేషం..మధ్యప్రదేశ్‌లోని సిహోనియా పట్టణంలో ఉన్న ఈ పురాతన శివాలయం దాదాపు వెయ్యేళ్ల నాటిది. కచ్ఛపఘట వంశానికి చెందిన కీర్తిరాజ హయాంలో క్రీస్తుశకం 1015–1035 నడుమ ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్రకారుల అంచనా. ఇదివరకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు సూరజ్‌పాల్ భార్య రాణి కకనావతి పేరుమీద దీనికి ‘కకన్ మఠ్’ అనే పేరువచ్చిందని చెబుతారు. ఈ ఆలయాన్ని పరమశివుని భూతగణాలు రాత్రికి రాత్రే నిర్మించినట్లు స్థలపురాణ గాథ ప్రచారంలో ఉంది. -
తెలంగాణలో ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)
-
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
-
తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ?
-
అత్యంత శక్తిమంతమైన శ్రీ మహా వారాహి ఆలయం ఎక్కడో తెలుసా ? (ఫొటోలు)
-
శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా నీలమ్మ తల్లి పండుగ (ఫొటోలు)
-
చిత్తూరు గంగజాతర... కనులపండువగా అమ్మవారి దివ్యరూపం (ఫొటోలు)
-
తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)
-
ఏపీలో ఉన్న శ్రీ లలితా దేవి ఆలయం గురించి మీకు తెలుసా? (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
సహజ యోగంతో సహజ ప్రవర్తన : అద్వితీయ ఘట్టం
మనిషి ధ్యాసను అంతర్ముఖంగా తీసుకువెళ్లి వారి చిత్తాన్ని వారి శరీరంలోనే వున్న పరమాత్మ శక్తి అయిన ఆత్మ మీదకు మళ్లించగలిగితే మనిషి ఆధ్యాత్మికత పరిపక్వం చెంది, అతనిలో పరివర్తన వచ్చి చిన్నతనంలో తనలో స్వాభావికంగా వున్న దైవికమైన పసితనపు అమాయకత్వాన్ని తిరిగి స్థిర పరచవచ్చు, తద్వారా అతనిని సమతుల్యతలో ఉంచవచ్చు అని తలచారు మాతాజీ నిర్మలాదేవి.అదెలా సాధ్యపడుతుందంటే మన శరీరంలోనే అంతర్గతంగా భగవంతుని శక్తి ఒకటి నిక్షిప్తమై ఉంది. అదే కుండలినీ శక్తి. తల్లి గర్భంలో సుమారు 2–3 నెలల వయస్సు వున్న సమయంలో పసిపిల్లవాని తల మాడుభాగాన వున్న బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ శక్తి ప్రవేశించి వెన్నెముక భాగాన 3 నాడులుగాను, 7 చక్రాలుగాను ఏర్పడి మిగిలిన శక్తి వెన్నెముక చివరన వున్న త్రికోణాకారపు ఎముక (సాక్రమ్ బోన్)లో మూడున్నర చుట్లు చుట్టుకుని ఉంటుంది. అదే కుండలినీ శక్తి. పిల్లలలోని ఆ శక్తి వారికి 9–10 సం. వయసు వరకు వారి వెన్నెముక ద్వారా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తూ బాహ్యపరంగా ఉన్న పరమాత్మ ప్రేమ శక్తితో అనుసంధానమవుతూవుంటుంది. ఆ వయసులో పిల్లలు భగవంతుని రక్షణలోనే వుంటారు. క్రమేపీ అది తిరిగి సాక్రమ్ బోన్ లోకి వెళ్ళి నిద్రాణ స్థితిలో వుండిపోతుంది.అలా నిద్రాణ స్థితిలోకి వెళ్ళి΄ోయిన ఈ కుండలినీ శక్తిని తిరిగి జాగృతి చేసి ఉత్థానపరచి శిరస్సుమీద వున్న సహస్రార చక్రాన్ని ఛేదించి బాహ్యపరంగా వున్న పరమాత్మ ప్రేమశక్తి అయిన విశ్వవ్యాపిత పరమ చైతన్యశక్తితో అనుసంధానపరచగలిగితే మనిషి మరలా తనలో దైవత్వాన్ని నింపుకోగలుగుతాడు. అప్పుడిక మానవులు ఎదుర్కొనే ఈ శారీరిక, భౌతిక, మానసిక, భావోద్వేగ, సమస్యలకు తావే వుండదు. వారిలో వివేకం, మంచి చెడుల విచక్షణా జ్ఞానం స్థిరపడి, వారి ఆలోచనలలో, జీవన విధానంలో, ప్రవర్తనలో, అవగాహనలో సమతుల్యత ఏర్పడి ప్రపంచమంతా మనం కోరుకున్న విశ్వమానవ సౌభ్రాతృత్వం, వసుదైక కుటుంబం ఏర్పడి విశ్వనిర్మల ధర్మం స్థిరపడుతుంది అని శ్రీమాతాజీ నిర్మలాదేవి ఒక నిర్ణయానికి వచ్చారు. మానవులు తమ మూర్ఖత్వం వలన లేక అంధ విశ్వాసాల వలన భగవంతుని సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి వస్తే చాలా ప్రమాదానికి, భవంతుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది అని గ్రహించి అందుకు ఒకే ఒక పరిష్కారం మనిషి లోని కుండలినీ శక్తిని తిరిగి జాగృత పరిచి తద్వారా ఆత్మసాక్షాత్కారానికి పాదుకొల్పడం సాధ్యమవుతుందని తెలుసుకున్నారు. ఇంతకు పూర్వం కుండలినీ జాగృతి కావాలంటే సర్వస్వం త్యాగం చేసి అడవులకో, హిమాలయాలకో వెళ్ళి వందల సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తేగాని దొరకని భాగ్యం అది. ఈ ఆధునిక కాలంలో అది అసాధ్యం. మనిషి ఏ త్యాగమూ చేయనవసరం లేకుండా, దేనినీ పరిత్యజించనవసరం లేకుండా తన రోజువారీ జీవితానికి ఏ ఆటంకం లేకుండా ఈ కార్యం నిర్వహించడానికి, ఆత్మసాక్షాత్కారం ΄÷ందడానికి ఏదైనా మార్గం కనుగొనాలని శ్రీమతి నిర్మలాదేవి నిశ్చయించుకున్నారు. అది కూడా 1970వ సంవత్సరం మే 6వ తారీఖు లోపునే జరగాలని అనుకున్నారు. వెంటనే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న నార్గోల్ సముద్రతీరాన ఓ సరుగుడు చెట్టు చెంతనకూర్చుని ఒక రాత్రంతా సుదీర్ఘ ధ్యానం (తపస్సు)లో వున్నారు. అంతే! మే నెల 5వ తేదీ తెల్లవారు ఝామున శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం ఒక్కసారిగా తెరుచుకుంది. భూమినుండి ఒక్కసారిగా భూగర్భజలం ఉవ్వెత్తున ఆకాశం వైపు అతి వేగంగా లేచినట్లుగా తనలోని కుండలినీ శక్తి ఉత్థానం జరిగి మాడు మీద బ్రహ్మరంధ్రం ఛేదించుకుని ఆకాశంలోకి ఒక కాంతిపుంజం చక్రాల గుండా ప్రయాణించి 7 రంగుల హరివిల్లులా వెదజల్లబడింది. శ్రీమాతాజీ మాటల్లో చెప్పాలంటే ఒక రాకెట్టును అంతరిక్షంలోకి పంపినప్పుడు అది ఒక్కొక్క ఛాంబర్‌ను నెట్టుకుంటూ అత్యంత వేగంతో, నిప్పులు కక్కుకుంటూ, రంగురంగుల వెలుగులు విరజిమ్ముతూ ఆకాశంలోనికి ఎలా దూసు కెళుతుందో అలాంటి అనుభూతే కలిగిందన్నారు. ఇది ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అద్వితీయ, అపురూప ఘట్టం. మానవ మాత్రులకు ఇది అసాధ్యం అనుకున్న కార్యం సుసాధ్యం అయ్యిందని శ్రీ మాతాజీ నిర్మలాదేవి పేర్కొన్నారు.ఇంతకుముందు చెప్పినట్లుగా 1970 మే 5 తేదీన ముంబైకి దగ్గరలో గుజరాత్ రాష్ట్రం పరిధిలో వున్న నార్గోల్ సముద్ర తీరాన శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం తెరచిన సహస్రారధామ్ అనే ఆ స్థలాన్ని పుణ్యస్థలిగా భావించి ప్రతి ఏటా మే 5 తేదీన ప్రపంచవ్యాప్తంగా సహజయోగ సాధకులందరు దీనిని సహస్రార దినోత్సవంగా జరుపుకుంటారు. సహజయోగ సాధన చేస్తున్నవారు తమ శారీరిక, మానసిక, భావోద్వేగ బాధలనుండి, సమస్యలనుండి సునాయసంగా స్వాంతన పొందుతున్నారు. సహజయోగం పూర్తిగా ఉచితం.– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు -
దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చా?
-
శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)
-
కోనసీమ జిల్లా : అరటి తోటల మధ్య అందమైన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)
-
తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)
-
హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)
-
మంగళవారం స్పెషల్: మీ కష్టాలన్నీ తీర్చే ఆంజనేయస్వామి భక్తి పాటలు
-
సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)
-
ఉత్తరాంధ్ర శబరిమల (అయ్యప్ప స్వామి దేవాలయం) ఎక్కడ ఉందో తెలుసా (ఫొటోలు)
-
సింహాచలం అప్పన్న చందనోత్సవం..భారీగా భక్తులు (ఫొటోలు)
-
ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
వెండితెరపై ఆధ్యాత్మిక శోభ
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రేమకథలు, యాక్షన్, థ్రిల్, పొలిటికల్, హారర్... ఇలా అన్నమాట. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆధ్యాత్మిక ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. భక్తి, హిందుత్వం, మైథలాజీ, ధర్మం ఆధారంగా రూపొందుతోన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ కూడా బాగా ఉంటోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై ప్రేక్షకులకు ఆధ్యాత్మిక శోభ చూపించేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’, రవితేజ ‘ఇరుముడి’, మహేశ్‌బాబు ‘వారణాసి’, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’, నిఖిల్ ‘స్వయంభు’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ సినిమాలతో పాటు ‘మహావతార్ నరసింహా, వాయుపుత్ర’ వంటి యానిమేషన్ మూవీస్ కూడా రూపొందుతున్నాయి. ఆయా సినిమాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.హనుమంతుడు తోడుగా... ఆంజనేయస్వామికి హీరో చిరంజీవి ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపైనా హనుమంతుడి పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శిస్తుంటారాయన. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’లోనూ మరోసారి హనుమంతుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉండనున్నాయి. తొలి చిత్రం ‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, పురాణాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ కథతో రూపొందిన ‘విశ్వంభర’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ వద్ద 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు మేకర్స్. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ఓ హైలెట్‌గా నిలుస్తాయని టాక్. ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే విలన్లను రఫ్ఫాడిస్తున్న చిరంజీవి వెనక నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. వాస్తవానికి ‘విశ్వంభర’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ మూవీని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రాఫిక్స్, సీజీ వర్క్ కోసం భారీ సమయాన్ని వెచ్చిస్తున్నారు మేకర్స్. గత ఏడాది తన పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా చిరంజీవి స్వయంగా ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘‘చందమామ కథలా ‘విశ్వంభర’ ఉంటుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్ని అందించేందుకు సమయం పడుతోంది. 2026 వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అంటూ చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే గ్రాఫిక్స్‌కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందట. ఈ కారణంగా ఈ మూవీ గురించి ఎలాంటి కొత్త అప్డేట్ ఇవ్వడం లేదట చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్లు ‘విశ్వంభర’ ఈ వేసవి ముగిసేలోపు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే మరోసారి వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ గురించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.అయ్యప్ప మాలధారిగా... వరుస కమర్షియల్ సినిమాలతో దూసుకెళుతుంటారు రవితేజ. అయితే ఈసారి ఆయన రూట్ మార్చి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ.‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటాయి. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ అద్భుతంగా రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. ఈ సినిమా కోసం రవితేజ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘ఇరుముడి’ షూటింగ్ ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ, అమృతా అయ్యర్ జోడీగా నటించారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘హనుమాన్’ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజై, పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించి, అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ‘హనుమాన్’కి కొనసాగింపుగా ‘జై హనుమా న్ ’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (‘కాంతారా’ మూవీ ఫేమ్) నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రాముడి విగ్రహాన్ని హత్తుకుని ఉన్న హనుమంతుడిగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్’ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలున్నాయి. పైగా ‘కాంతారా, కాంతారా చాప్టర్ 2’ మూవీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో టైటిల్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ మరింత క్రేజ్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుందట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్‌గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. ‘హనుమాన్’ మూవీలో తనదైన నటనతో మెప్పించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్‌నగర్ టాక్. శ్రీరాముడు–రుద్ర ‘బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్నారు. ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు మహేశ్‌బాబు. వారణాసి నేపథ్యంలో భక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు మునుపెన్నడూ చూడని విధంగా శ్రీరాముడు, రుద్ర అనే రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణని జార్జియాతో పాటు పలు అంతర్జాతీయ ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. అంతేకాదు... ఈ మూవీ కోసం హైదరాబాద్ శివారులో వారణాసిని సృష్టించారు. అచ్చం వారణాసిలా తీర్చిదిద్దిన సెట్లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద ఒక గొప్ప అనుభూతినిచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు మేకర్స్. ఈ విజువల్ వండర్‌ను చూడటానికి తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. ఈ చిత్రం అందర్నీ గర్వపడేలా చేస్తుంది’ అని మహేశ్‌బాబు చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి.ఈ మూవీ భారతదేశంలోనే కాకుండా ‘గ్లోబ్‌ట్రోటర్, టైమ్ట్రోటర్’ అనే ట్యాగ్లై న్ లతో అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని సమాచారం. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ స్థాయిలో ‘వారణాసి’ విడుదల కానుంది. మహేశ్‌బాబు– రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీపై గ్లోబల్ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. స్వయంభు కోసం... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల కానుంది. నిఖిల్ నటిస్తున్న 20వ చిత్రం ‘స్వయంభు’. ఇది పూర్తిగా పురాణ, భారతీయ యోధుల చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని స్టైలిష్, హిస్టారికల్ యాక్షన్ మైథలాజికల్‌గా రూపొందిస్తున్నారు. నిఖిల్ వేషధారణ, యాక్షన్ లుక్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి రేపాయి.తన పాత్ర కోసం నిఖిల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవడంతో పాటు ఇంటె న్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందట. ఇండియాలోని టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయని తెలిసింది. ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం కావాల్సినంత సమయం తీసుకొని, వరల్డ్ క్లాస్ ఔట్పుట్ అందించేందుకు మేకర్స్ పూర్తి కమిట్మెంట్తో పని చేస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా ‘స్వయంభు’ రూపొందుతోంది.‘‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో, భయంతో అన్ని జాగ్రత్తలతో చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో నిఖిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దశావతార ఆలయం నేపథ్యంలో... హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేశ్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా భక్తి నేపథ్యంలో రూపొందుతోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అతను ఒంటరివాడు కాదు... అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నాయి’ అంటూ ఈ పోస్టర్లో ఇచ్చిన క్యాప్షన్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.అలాగే టైటిల్ టీజర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. శతాబ్దాల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో ఈ కథాంశం యాక్షన్, ఆధ్యాత్మికతలను మేళవిస్తుంది. సర్పదేవత పచ్చబొట్టుతో పాటు పవిత్రమైన విష్ణు నామాలు వంటి చిహ్నాలు కూడా టీజర్లో కనిపిస్తాయి. దుండగుల బారి నుంచి దశావతార ఆలయాన్ని హీరో ఎలా కాపాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న సాలిడ్ థ్రిల్లర్‌గా, భారతీయ ధర్మం, ఆచారాలపై ఆధారపడిన పౌరాణిక యాక్షన్ డ్రామాగా ‘హైందవ’ చిత్ర కథాంశం ఉండనుందట. ఈ మూవీలో ఓ ధార్మిక యోధుడి పాత్రలో కనిపించనున్నారట సాయి శ్రీనివాస్.నాగబంధం ‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై జరిపిన చారిత్రక దాడుల నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలను మేళవిస్తూ అభిషేక్ నామా తెరకెక్కించారు.మహా శివరాత్రి సందర్భంగా హీరో మహేశ్‌బాబు ‘నాగబంధం’ టీజర్‌ని విడుదల చేసి, ‘‘టీజర్ అద్భుతంగా ఉంది, సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. హిమాలయ శిఖరాల్లో దాగి ఉన్న ఒక అంతు చిక్కని రహస్యం, కాలానికే అందని ఒక పురాతన శక్తి నేపథ్యంలో అల్లుకున్న సస్పె న్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘నాగబంధం’ని రూపొందించారని సమాచారం. ఇందులో విరాట్ కర్ణ శక్తిమంతమైన యోధుడిగా నటించారు. ఈ చిత్రంలో నాగబంధం, శివ తంత్ర విద్య, నాగబంధం ఆలయం వెనక ఉన్న గుప్తనిధులు వంటి అంశాలు కథలో హైలెట్ కానున్నాయట. ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. గదాధారి హనుమాన్... రవి కిరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్‌పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘‘మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘గదాధారి హనుమాన్’.ఈ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోష న్స్ను అద్భుతంగా పండించాం. ఈ మూవీ గ్లింప్స్, టీజర్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ఫుల్ అన్న దానిపై ఓ సీక్వె న్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని రవికిరణ్ తెలిపారు.యానిమేషన్ కూడా... ఇదిలా ఉంటే... రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటు ‘మహావతార్ నరసింహా’, ‘వాయుపుత్ర’ వంటి యానిమేటెడ్ సినిమాలు కూడా రానున్నాయి. అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహా’ యానిమేటెడ్ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. 2037 వరకు ఏడు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న యానిమేటెడ్ ఫిల్మ్ ‘వాయుపుత్ర’ పైనా మంచి అంచనాలున్నాయి.రామాయణం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్షణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్ మాన్స్టర్మైండ్ క్రియేష న్న్స్ సహకారంతో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, పరశురాముడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.– డేరంగుల జగన్ మోహన్ -
మృత్యువుపై ఘనవిజయం... క్రీస్తు పునరుత్థానం
ఈస్టర్ ఓ జయధ్వని; ఈస్టర్ ఓ ఆశల హారం; ప్రతి హృదయంలో వికసించిన ప్రేమ పరిమళం. సమాధి తలుపులు తెరిచి దివ్యవర్చస్సుతో క్రీస్తు నిలిచిన రోజు. ప్రతి హృదయంలో ప్రేమ సందేశం మార్మోగుతున్న సమయం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మనిషిని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది.యేసుక్రీస్తు జీవితం ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తెచ్చింది. ప్రేమ, దయ, వినయం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా; పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి; కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా; పరమాత్ముని బాటలో నడవాలని బైబిల్ ప్రబోధిస్తు్తంది. మొదటి శతాబ్దకాలంలో ఇశ్రాయేలు దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో పౌలు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు యూదుజాతిలో పేరెన్నికగలవాడు. తార్సు ప్రాంతంలో జన్మించి ధర్మశాస్త్రంలో అమితాసక్తిని కలిగియుండి గమలియేలు అనే వ్యక్తి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. శరీరాకారంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సత్యంతో పౌలు మొదట్లో ఏకీభవించలేదు. క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న వారిపై అపరిమితమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. యేసు ‘క్రీస్తు’ కాదని వాదించుటే గాక, యేసుక్రీస్తును విశ్వసించినవారిని హింసించుటకు, దూషించుటకు ఇష్టపడ్డాడు.సిరియా దేశంలోని దమస్కు ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారని తెలిసి వారిని నాశనం చేయడానికి బయలుదేరాడు. దానికి యెరూషలేములోని క్రీస్తును ద్వేషించే మతపెద్దలు అంగీకరించారు. సరిగ్గా దమస్కు పొలిమేరకు చేరుకొనేసరికి మతగర్వంతో, ద్వేషంతో రగిలిపోతున్న పౌలుకు క్రీస్తు ప్రత్యక్షత దొరికింది. సమున్నతమైన క్రీస్తు రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తల్లిఒడిలో పరవశించే బిడ్డవలే దేవుని దివ్యరూపాన్ని చూసి పరవశించిపోయాడు. తన గత జీవిత దౌర్భాగాన్ని తలచుకొని కన్నీళ్ళు విడిచి నూతన వ్యక్తిగా మార్పు చెందాడు.ఈ విశిష్ట సంఘటనలను పౌలు స్వయంగా రోమన్ గవర్నర్ ఫేస్తు ముందు, రాజు అగ్రిప్ప ముందు వివరించాడు.ఒకానొక సందర్భంలో రోమా పట్టణంలో ఉన్న దేవుని ప్రజలకు ఓ పత్రిక వ్రాస్తూ యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఇలా అన్నాడు: ‘మనుష్యులమైన మనమంతా బలహీనులముగా ఉన్నప్పుడే క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును గాని, మనమింకను పాపులమై యుండగానే యేసు మన కొరకు చనిపోయెను, సర్వశక్తుడైన దేవునితో సమాధానాన్ని గలిగి రక్షించబడు నిమిత్తం క్రీస్తు సిలువమీద మరణించాడు’. దేవుడు ప్రేమాస్వరూపి అనే బైబిల్ బోధకు ఋజువు క్రీస్తు సిలువ మరణమే. పౌలు మూడు సువార్తయాత్రలు చేశాడు. వాటిలో ప్రతిచోటా తాను ఎక్కువగా మాట్లాడింది, తన వ్రాతల్లో వ్రాసింది క్రీస్తు మరణ పునరుత్థానాలను గురించే!‘యేసుప్రభువు సిలువపై చనిపోయారా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారా?’ అని ప్రశ్నించే చాలామందికి ఇటలీ దేశంలోని ట్యురిన్ నగరంలో ఉన్న ట్యురిన్ వస్త్రం నిలువెత్తు నిదర్శనంగా ఉంది. యేసు చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక విలువైన వస్త్రాన్ని కప్పారు. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుడతారు. యేసు చనిపోయిన తరువాత ఆయనకు చుట్టబడిన వస్త్రం నేటికి ఉందని పండితులు నిర్థారించారు. ఒక మనిషి ఆకారం దానిలో కనబడుతుంది. అతని చేతుల్లో మేకులు గాయాలు ఉన్నాయి. అతని దేహమంతా కూడా తూట్లు తూట్లుగా ఎవరో విభజించినట్లు విపరీతమైన గాయాలు కనబడుతున్నాయి.శాస్త్రవేత్తలు ఈ వస్త్రాన్ని చాలా సంవత్సరాల తర్వాత కనుగొని, దానిమీద పరిశోధనలు చేశారు. ఈరోజుకు కూడా ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ వస్త్రాన్ని మనం చూడవచ్చు. క్రీస్తు మరణ పునరుత్థానములకు సాక్ష్యం ఆ వస్త్రం. చరిత్రలో చాలామంది ఆ వస్త్రాన్ని దొంగిలించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు కాని, వారి వల్ల కాలేదు. అయితే ఆ వస్త్రం యేసుకు సంబంధించినది కాదు, 12 లేదా 13వ శతాబ్దికి చెందిన వస్త్రమని వాదించేవారు లేకపోలేదు. వాస్తవమేమంటే క్రీస్తు ప్రభువు మీద కప్పబడిన వస్త్రం ఆ తర్వాత కాలంలో చాలామంది చేతులు మారడం వలన అక్కడక్కడ పాడైంది. కొంతమంది మఠకన్యలు క్రీ.శ . 1534లో పాడైపోయిన వస్త్రానికి ఎక్కడెక్కడ అయితే రంధ్రాలు పడ్డాయో అక్కడ బాగు చేశారు. ఆ కారణాన్ని బట్టి ఆ వస్త్రం అనేది 13వ శతాబ్దానికి చెందినదని చాలామంది భావించడానికి అవకాశం దొరికింది. ఇటలీలో ఉన్న ట్యురిన్ వస్త్రాన్ని కొందరు ‘ద ఫిఫ్త్ గాస్పెల్’ అని కూడా పిలుస్తారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందు రోజు కొన్ని సంఘటనలు జరిగాయి. గెత్సేమనే తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికీ యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. దానిని ‘చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్’ అని పిలుస్తారు. ఇశ్రాయేలును సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను.అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తబిందువులుగా మారింది. వైద్య పరిభాషలో దానిని హెమటోహైడ్రోసిస్ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్థించాడు. పండిత పురుషోత్తమ చౌదరి అనే కవి క్రీస్తు గెత్సేమనే అనుభవాన్ని ఓ అద్భుతమైన పాటలో ఇలా వర్ణించాడు. ‘శ్రమచేత తన దీన శరీరము నుండి దిగజార చెమట రక్తపు బొట్లుగా నమితమౌ లోకపాపము చూచి నిట్టూర్పులప్పటప్పటికి బుచ్చి క్రమముగా దూత తన కడకరుగుదెంచి శాంతము బల్కి చనిన పిదపం తమ మనంబుల బోలు తమసమున యూద సైన్యము లేగుదెంచెనపుడు గెత్సేమనే వనికి’. ‘అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను’ (యెష 53:8). జగద్రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గూర్చిన ప్రవచనాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలము. ఏడువందల సంవత్సరాలకు పూర్వమే రక్షకుని గూర్చిన సిలువ మరణంతో పాటుగా ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడతాడు అని తెలియచెప్పబడింది. కఠినమైన సిలువ మరణానికి ముందు ఆయన ఎందుకు తీర్పు తీర్చబడ్డాడు? ప్రభువు తీర్చబడిన తీర్పు అన్యాయమైనదిగా ఎందుకు ఎంచబడింది? ఇస్కరియోతు యూదా ద్వారా అప్పగింపబడిన యేసుక్రీస్తు ప్రభువు నేరుగా అన్న, కయపల యొద్దకు తీసుకొని రాబడ్డారు. వాస్తవానికి మొదట అన్న యొద్దకు ఆ తదుపరి కయప యొద్దకు కొనిపోబడ్డారు. ఈ విషయం లేఖనాల్లో రెండు చోట్ల ప్రస్తావించబడింది.(యోహాను 18:1224, మత్తయి 26:57) వీరిద్దరూ యేసును అవమానించారు, హేళన చేశారు. ఆయన మీద ఉన్న అక్కసును వెళ్ళగక్కారు. అక్కడ నుండి రోమన్ గవర్నర్ అయిన పొంతి పిలాతు నొద్దకు తీసుకొని వెళ్ళారు. క్రీస్తు ప్రభువు గలలియ ప్రాంతంలో పెరిగినవాడు గనుక హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని గ్రహించి పిలాతు హేరోదు నొద్దకు పంపెను.హేరోదు మొదట యేసును చూచి మిగుల సంతోషించాడు. ఎన్నో ప్రశ్నలు అడిగినప్పటికి యేసు అతనికి బదులియ్యలేదు. కాసేపటి తరువాత హేరోదు యేసు ప్రభువును తృణీకరించి అపహసించి పిలాతు నొద్దకు తిరిగి పంపివేశాడు. చివరగా పొంతి పిలాతు అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించాడు. యేసుక్రీస్తు అన్యాయపు తీర్పు ఎలా తీర్చబడ్డాడు?మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. సిలువ మరణానికి ముందు యేసుక్రీస్తును యూదా మతపెద్దల ముందు మూడుసార్లు, రాజుల ముందు మూడుసార్లు నిలువబెట్టారు. అప్పటి కాలపు ప్రధాన యాజకుడైన కయప, అతని మామయైన మాజీ ప్రధాన యాజకుడు అన్న, యూదుల ఆలోచన సభయైన ‘సన్హెడ్రీన్’ ముందు యేసును దోషిగా నిలువబెట్టారు. యేసు తాను దేవుడనని, దేవుని కుమారుడనని ప్రకటించుకున్నాడు, మోషే ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ప్రవర్తించాడన్నది వారు చేసిన నేరారోపణ. ఆ తదుపరి మూడుసార్లు రోమన్ న్యాయస్థానం ముందు నిలువబెట్టారు.రోమన్ కైసరుకు పన్నులు కట్టవద్దన్నాడని, ప్రజలను రోమన్ చక్రవర్తులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని, తాను రాజునని చెప్పుకొనుచున్నాడని యేసుక్రీస్తు మీద నేరారోపణ చేశారు. అయితే పిలాతు ఏ నేరమును కనుగొనలేకపోయాడు. ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టించాడు. చివరగా పస్కాపండుగ సమయంలో ఒక నేరస్థుని విడుదల చేయగలిగే అధికారాన్ని వినియోగించాలని చూచినా, ప్రజల ఒత్తిడికి లోనై సిలువ మరణాన్ని అమలు చేయడానికి ఒప్పుకున్నాడు. తన తీర్పులో న్యాయంలేదని తెలిసినా ‘ప్రజల’ కోసం అన్యాయ తీర్పును అమలుపరచాడు. ధర్మశాస్త్ర ప్రకారం పస్కా పండుగ సమయంలో ఎవరినీ తీర్పు తీర్చకూడదు, శిక్ష విధించకూడదు. అయితే జరిగిందేమిటి? యేసుక్రీస్తు విషయంలో తీర్పు తీర్చారు. మరణశిక్షను అమలు పరిచారు. అపొ.కా 12:4 ప్రకారం పేతురును చెరసాలలో పెట్టింది పస్కా పండుగ సమయంలోనే. అంతకుముందు యాకోబును ఖడ్గంతో చంపేశారు. పేతురును కూడా పట్టుకున్నారు. అయితే పస్కా సమయంలో శిక్ష అమలు చేయకూడదు కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. అయితే అసలు వాస్తవం ధర్మశాస్త్రోపదేశకులు అని చెప్పుకొనేవారే ధర్మాన్ని అతిక్రమించారు. యూదుల ఆలోచన సభ లేదా న్యాయస్థానమైన సన్హెడ్రీన్లో గాని, రోమన్ కోర్టులో గాని నిబంధన ప్రకారం ఒక వ్యక్తి నేరస్థుడు అని తీర్పు వెలువడాలంటే ఆ న్యాయస్థానంలోని ప్రతి సభ్యుడు వారి వారి అభిప్రాయాలు తెలిపాక అందరి సమ్మతి, అంగీకారంతో శిక్ష అమలు చేయాలి. కాని యేసుక్రీస్తు ప్రభువు విషయంలో ప్రజల కేకలే గెలిచాయి.ఒక వేళ నేరం ఋజువై మరణశిక్ష విధించబడితే, అలా శిక్ష విధింపబడిన వ్యక్తికి కనీసం ఒక రోజు లేదా ఒక రాత్రి గడువును ఇవ్వాలి. ఆ వ్యక్తి మానసికంగా మరణానికి సిద్ధపడడానికి ఆ సమయం అవసరం. అయితే యేసుక్రీస్తు విషయంలో అలా కూడా జరగలేదు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత క్రూరమైన మరణాన్ని అమలుపరచారు. ఈ మానవ ప్రపంచ చరిత్రలో ఎంత భయంకర నేరస్థుడినైనా కూడా రాత్రివేళ న్యాయస్థానాల్లో నిలువబెట్టలేదు. నిబంధనల ప్రకారం చీకటి పడేలోపు తీర్పు వెలువరించాలి లేదా వాయిదా వేయాలి. అయితే యేసుక్రీస్తును ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టింది రాత్రివేళలోనే! ఇది అన్యాయం కాకపోతే మరేమిటి?ఏ దేశంలోనైనా ఏ న్యాయస్థానంలోనైనా నేరారోపణ ఎదుర్కొను వ్యక్తి తరుపున కనీసం మరొక వ్యక్తి వాదిస్తాడు. అటువంటి వ్యక్తి కోసం వాదించడానికి ఎవరూ లేకపోయినా, ఒకవేళ అడ్వొకేటుకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోయినా ప్రభుత్వం గాని, కోర్టువారు గాని ఆ వ్యక్తి కోసం వాదించడానికి ఒక ఉత్తరవాదిని నియమిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కోసం వాదించేవారు ఒక్కడు కూడా లేడు. ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగినా కొన్నింటికి సమాధానాలు చెప్పారు; కొన్ని సార్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన పక్షాన వాదించే వ్యక్తి లేకపోయినా తీర్పు తీర్చేశారు. ఇదికూడా అన్యాయమే!న్యాయవంతుడైన దేవునికి ఈ లోకం అన్యాయపు తీర్పు తీర్చింది. దేవున్ని విడిచి, మరచి బతుకుతున్న కర్కశ సమాజం ఆఖరకు సృష్టికర్తనే అన్యాయానికి గురిచేసింది. కొన్నిసార్లు నాకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నావు కదూ! నీ ప్రభువునే విడిచిపెట్టలేదు ఈ లోకం. నీవు నేను ఓ లెక్కా ఈ పాషాణ సమాజానికి? అయితే యేసుక్రీస్తు అన్యాయపు తీర్పును ఎందుకు సహించాడు? నిలదీసి అడుగుతున్న వ్యక్తులకు సమాధానం చెప్పలేక యేసు మౌనంగా ఉండిపోలేదు, ఆయన ఓ అద్భుత కార్యం నెరవేర్చబోతున్నాడు కాబట్టే అన్యాయాన్ని సహించాడు. ఆయన సహించింది కేవలం నీకోసం, నాకోసం. తప్పు చేసినపుడు శిక్షను భరించడం సమంజసమే కాని, ఏ నేరం లేని నిర్దోషియైన ప్రభువు ఘోర శిక్షను భరించాడంటే ఏదో బలమైన కారణం ఉంది. అదే అవధులు లేని ఆయన ప్రేమ! శుభ శుక్రవారం రోజున యెరూషలేములోని కల్వరి కొండపై యేసు తన ప్రాణాన్ని సకలలోక పాప పరిహారార్థమై అర్పించారు. అమూల్యమైన ఏడు మాటలు సిలువలో పలికి తన ప్రాణాన్ని అర్పించారు. ‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’ అని క్షమాపణ ప్రాముఖ్యతను తెలిపాడు. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’ అని తన పక్కన వేలాడుచున్న దొంగతో మాట్లాడి నిత్యత్యపు పరమార్థాన్ని తెలిపాడు. ‘అమ్మా! ఇదిగో నీ కుమారుడు’ అని మరియమ్మతో పలికి తల్లి బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ‘ఏలీ ఏలీ లామా సక్తాని’ అని పలికి దేవునితో ఎడబాటు తీవ్రతను తెలిపాడు.‘దప్పిగొనుచున్నాను’ అని పలికి తాను మానవునిగా శ్రమను అనుభవిస్తున్నానని తెలిపాడు. ‘సమాప్తమైనది’ అని పలికి తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దాని అర్థాన్ని నెరవేర్చాడు. ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ అని పలికి రక్షింపబడిన వ్యక్తి గమ్యస్థానము దేవున్ని చేరుకొని శాశ్వత ఆనందాన్ని పొందడమే అనే సత్యాన్ని తెలిపాడు. క్రీస్తు సిలువలో పలికిన ప్రతి మాట సర్వలోకానికి ఓ అద్భుత సందేశమే! క్రీస్తు మరణం శాస్త్రీయంగా ధ్రువీకరించబడింది. వందలాదిమంది రోమన్ సైనికులు క్రీస్తును సిలువ వేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. యేసు విచారించి అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు గురించిన చారిత్రక విషయాలు ఈ మధ్య కాలంలో కైసరయలో బయటపడ్డాయి. ఆకాలంలో ప్రధాన యాజకుడైన కయపకు సంబంధించిన విషయాలను కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. యేసుప్రభువును బల్లెపుపోటు పొడిచినప్పుడు ఆయన దేహంలో నుండి రక్తం, నీళ్లు బయటకు వచ్చిన అంశాన్ని అనేకమంది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఒక వ్యక్తి పూర్తిగా చనిపోయినప్పుడే ఆ వ్యక్తి దేహంలో నుంచి ఆ నీరులాంటి ద్రవం బయటకు వస్తుందని వారు కూడా ధ్రువీకరించారు.క్రీస్తు సిలువపై మరణించినప్పుడు అనేక అద్భుత సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నింటిలోనూ ముఖ్యమైనది దేవాలయపు తెర చినిగిపోవుట. పాతనిబంధన కాలంలో నిర్మించబడిన దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని అతిపరిశుద్ధ స్థలాన్ని వేరుచేయడానికి మూడు వందలమంది యాజకులచే తయారుచేయబడిన తెర ఉండేది. దాని మందం నాలుగు అంగుళాలు. మనుష్యులెవ్వరూ దానిని చింపలేనంత బలంగా ఉండేది. క్రీస్తు ప్రభువు మరణించగానే, ఆ తెర పైనుండి కిందకు చిరిగిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దాని అర్థం ‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును. యేసుక్రీస్తు మరణించిన సిలువపై ‘ఐఎన్‌ఆర్‌ఐ’ అనే మాటలు ఒక పత్రంపై వ్రాయబడ్డాయి. సిలువ వేయబడిన వ్యక్తి చేసిన నేరమేంటో బాహాటంగా అందరికీ తెలిసేటట్లు ఒక పత్రంపై అలా వ్రాసి దానిని అతని తలకుపైగా సిలువమీద పెట్టేవారు. కాబట్టి క్రీస్తుకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు ‘నజరేయుడైన యేసు యూదులకు రాజు’ అనే పై విలాసాన్ని వ్రాయించి సిలువమీద పెట్టించాడు. అది హెబ్రీ, గ్రీకు, రోమా(లాటిన్) భాషలలో వ్రాయబడింది. పిలాతు పై విలాసాన్ని ఆ విధంగా వ్రాయించడం ప్రధాన యాజకులకు నచ్చలేదు. యూదులరాజు అనికాక, యూదుల రాజునని తాను చెప్పుకున్నాడు అని వ్రాయమని కోరారు. వ్రాయబడిన పైవిలాసాన్ని మార్చడానికి పిలాతు నిరాకరించాడు. కొన్ని విషయాలను మార్చడం ఎవరివల్లా కాదు అని ఋజువైంది.అలెగ్జాండర్ అనే వ్యక్తి ఈ విషయాలన్ని ఇలా వ్యాఖ్యానించాడు. ‘హెబ్రీ, గ్రీకు, లాటిన్ ఈ మూడు భాషలూ మూడు జాతులను, వారి భావాలైన ప్రత్యక్షత, కళ, సాహిత్యం, అభివృద్ధి, యుద్ధం, ధర్మశాస్త్రం అనువాటిని తెలియచేస్తున్నాయి. ఎక్కడయితే మానవజాతికి గల ఈ మూడు కోరికలు ఉనికిలో ఉంటాయో, ఎక్కడయితే మానవ భాషలో ప్రాచుర్యం సాధ్యపడుతుందో, ఎక్కడయితే పాపం చేయడానికి ఒక హృదయం ఉంటుందో, మాట్లాడడానికి నాలుక ఉంటుందో, చదవడానికి కన్ను ఉంటుందో అక్కడ సిలువ ఒక సందేశాన్ని కలిగి యుంటుంది. శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతమయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు. ఆ దినాల్లో ధనికులు తన మరణానికి ముందే తమ సమాధిని సిద్ధపరచుకొనేవారు. క్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవరోజున సజీవుడై తిరిగిలేచాడు. బైబిల్ ప్రబోధించే అనేక దివ్యసత్యాల్లో ఒకటి క్రీస్తు పునరుత్థానము. మానవ చరిత్రలోనే ఓ అపూర్వ సంఘటన.వాస్తవానికి క్రీస్తు పునరుత్ధానం గూర్చి పాతనిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు, పోలికలు పుష్కలంగా ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని మిగతా లేఖనాల్లో కూడా పునరుత్థానం గురించి తెలియపరచబడింది. లేవీయకాండం పదునాలుగవ అధ్యాయంలో రెండు పక్షులు కనబడతాయి. యేసులోని రెండు ప్రాముఖ్యమైన క్షణాలు ఆ పక్షులలో మనకు తారసపడతాయి. ఒక వ్యక్తికి కుష్ఠు వ్యాధి గనుక వస్తే ఆ వ్యాధి తగ్గేంతవరకు పాళెమునకు వెలుపల జీవించాలి. తన్ను తాను ప్రత్యేకించుకుని ప్రజలకు దూరంగా నివసించాలి. కనీసం తమ ఇంటివారితో కూడా కలవకూడదనే నిబంధన ఉండేది.కొంతకాలానికి ఆ వ్యక్తికి కుష్ఠు తగ్గినట్లు అతడు భావిస్తే దానిని నిర్ధారించడానికి ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకునికి తన్నుతాను కనుపరచుకోవాలి. ఒకవేళ రోగి యొక్క దేహమును పరిశీలించి రోగము నుండి అతని దేహము బాగుపడిందని ప్రధాన యాజకుడు నిర్ధారిస్తే ఆ వ్యక్తి పవిత్రుడుగా కొనసాగేవాడు. తిరిగి సమాజంలో కలిసేందుకు ముందు ఆ వ్యక్తి రోగము నుండి విడుదల పొందాక ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్ర కట్టడి ప్రకారం అతడు రెండు పక్షులు తీసుకురావాలి. అవి సజీవమైన పక్షులై ఉండాలి. సదరు వ్యక్తి వాటిని యాజకుని యొద్దకు తీసుకువచ్చిన తర్వాత ఒక పక్షిని మట్టి పాత్రలో పెట్టి చంపాలి. చంపిన తర్వాత ఆ పాత్రలోని రక్తాన్ని ఎవరైతే పవిత్రత పొందాలి అని అనుకుంటున్నారో అతని మీద ఏడుసార్లు ప్రోక్షించాలి.అలా చేసిన తర్వాత ఆ మిగిలిన రెండో పక్షిని ఆ రక్తంలో ముంచి ఆ రక్తపు ముద్రలు దానిమీద ఉండగానే దానిని విడిచి పెట్టాలి. ప్రస్తావించబడిన ఆ రెండు పక్షులు యేసుప్రభువు జీవితంలోని రెండు ప్రధానమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక పక్షి మట్టి పాత్రలో చంపబడింది. మట్టి పాత్ర యేసయ్య మంటి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు అని సూచిస్తుంది. మట్టి పాత్రలో చంపబడిన ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు అనేదానికి ఒక సూచనగా కనబడుతుంది. ఆయన మరణించడం ద్వారా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి ఆయన రక్తాన్ని ఆ మనిషి మీద ప్రోక్షించడం ద్వారా ఆయన మరణం ద్వారా విడుదల అనేది కలిగిందని ఆ రెండో పక్షి సూచిస్తుంది. విడిచిపెట్టబడిన రెండవ పక్షి క్రీస్తు పునరుత్థానమును సూచిస్తుంది.‘‘మరియు క్రీస్తు లేపబడియుండిన యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే’’ (1 కొరింథీ 15:14). యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచాడా? అన్నది ఈ రోజుల్లో అనేకుల మదిలో మెదలుతున్న ప్రశ్న! అసత్యానికి, సత్యానికి మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరు వాదించే అంశాలు చాలా విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. వాస్తవాన్ని దాచిపెట్టి, అసత్యాన్ని ప్రతిబింబించేలా అపవాది వారిని ప్రోత్సహిస్తున్నాడు అనుటలో ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు సిలువపై మరణించలేదని, సుగంధ ద్రవ్యాలు పూసి, ఔషధాలు ఇచ్చి, స్పృహ కోల్పోయిన వ్యక్తిని బ్రతికించారని; ఆ తదుపరి ఆయన మగ్దలేనే మరియను పెండ్లి చేసుకొన్నాడని; కొందరైతే ఆయన కాశ్మీర్ వచ్చాడని రకరకాల కథలు చెబుతూవున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పటివేమీ కాదు. మొదటి శతాబ్దం నుండి ఉన్నవే. శిష్యులు ఆయన దేహమును ఎత్తుకొనిపోయి దాచిపెట్టి మృత్యుంజయుడైనాడని ప్రకటించారని వారి వాదన. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు సమాధి దగ్గర ఉంచినంత కావలివారిని బహుశా ఎవరి సమాధి దగ్గర పెట్టలేదేమో! ఆ తరువాతి కాలంలో ఒక్క యోహాను తప్ప క్రీస్తు శిష్యులందరూ పునరుత్థానాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ ప్రపంచం నలుమూలల హతసాక్షులయ్యారు. ఈస్టర్ శుభదినాన అనేక క్రైస్తవ సంఘాల్లో మిక్కిలి సమూయేలు వ్రాసిన ఈ భక్తిగీతాన్ని ఆలపిస్తారు. క్రీస్తు పునరుత్థాన సత్యాన్ని కీర్తిస్తారు. ‘యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు’. యేసుక్రీస్తు జీవితాన్ని అద్భుతంగా వివరించే నాలుగు సువార్తలు బైబిల్లో ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నాలుగు సువార్తలలో క్రీస్తు పునరుత్థానం గూర్చి చాలా స్పష్టంగా వివరించబడింది. శిష్యులైన మత్తయి, యోహానులు క్రీస్తు పునరుత్థానానికి ప్రత్యక్ష సాక్షులు. వైద్యుడైన లూకా రెండు గ్రంథాలను వ్రాశాడు. యేసుక్రీస్తును సమాధిలో పెట్టిన తరువాత విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లియైన మరియయు, సలోమేయు సుగంధ ద్రవ్యములను కొని తమ దగ్గర ఉంచుకున్నారు. ఆదివారం పెందలకడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి దగ్గరకు వస్తూ సమాధి ద్వారము నుండి మనకొరకు ఎవరు ఆ రాయిని పొర్లించును అని మాట్లాడుకున్నారు. ఆ రాతికి రోమా వారు ముద్రవేసి సైనికులను కావలి ఉంచారని కూడా వారికి తెలుసు. అయితే వారు వచ్చి చూసేసరికి అప్పటికే రాయి దొర్లించి ఉంది. రాయి దొర్లింపబడకుండా కూడా పునరుత్థానుడైన క్రీస్తు బయటకు వచ్చుండేవాడే కానీ మనుష్యులు లోపలికి వెళ్ళి పునరుత్థానం గూర్చి సాక్ష్యమిచ్చునట్లుగా రాయి దొర్లించబడింది.వారు సమాధిలో ప్రవేశించి నిలువుటంగీ ధరించిన ఒక పడుచువానిగా కనిపిస్తున్న ఒక దేవదూతను చూశారు. ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి అద్భుతమైన కొన్ని విషయాలను వారికి తెలియచేశాడు. యోహాను భక్తుడు తాను వ్రాసిన సువార్తలో క్రీస్తు పునరుత్థాన ప్రత్యక్షలను చాలా స్పష్టంగా వివరించాడు. మగ్దలేనే మరియ క్రీస్తు పునరుత్థానుడయ్యాడన్న సత్యాన్ని పేతురు, యోహానులకు తెలిపింది. వారు పరుగెత్తుకుంటూ సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి ఖాళీగా ఉంది. సమాధి లోపల నారబట్టలు పడియుండడం చూశారు.ఇక్కడ ఓ ప్రత్యేకమైన విషయాన్ని యోహాను ప్రస్తావించాడు. క్రీస్తు ప్రభువు తలకు చుట్టబడిన రుమాలు నారబట్టల యొద్ద ఉండకుండా వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండడం చూశారు. యేసుక్రీస్తు సమాధి నుండి ఏదో తొందరపాటుతో వెళ్ళిపోలేదని, అక్కడ జరిగిన సంఘటనలన్నియు ఒక పద్దతి ప్రకారం జరిగాయని చూపడానికి ఈ వివరణ అందించబడింది. ఒకవేళ క్రీస్తు దేహాన్ని ఎవరైనా ఎత్తుకుపోయినా, వారు తల రుమాలును ఇంత జాగ్రత్తగా చుట్టిపెట్టి ఉంచరు. పునరుత్థానం జరిగిన ఆదివారం సాయంత్రం శిష్యులందరూ సమావేశమయ్యారు. వారిలో ఏదో తెలియని కలవరం, భయం ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. భయం వలన వారు కూడియున్న గది తలుపులు గట్టిగా బిగించుకొనియున్నారు. అకస్మాత్తుగా క్రీస్తు వారి మధ్య నిలిచి ‘‘మీకు సమాధానం కలుగును గాక’’ అని ప్రకటించాడు. వారికి ఏది అవసరమో ఆయనకు తెలుసు కదా. తలుపులు తెరవకుండానే లోపలికి ప్రవేశించడం క్రీస్తు మహిమ. దేహాన్ని కలిగియుండుట వలన అది సాధ్యమయింది. యేసు చేసిన ప్రతి పనిలోనూ మనిషికి సమాధానం అనుగ్రహించడం చూస్తాం. ప్రస్తుత రోజులో మనిషికి అన్నీ ఉన్నాయి గాని, నిజమైన సమాధానం లేదు. వ్యక్తిగతంగా మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో కలహాలు, సమాజంలో గొడవలు, రాజ్యం మీదకి రాజ్యాలు లేవడం సర్వసాధారణంగా కనబడుతూనే ఉన్నాయి. నిజమైన శాంతి సమాధానాలు మనిషికి ఎక్కడ లభిస్తాయి? దేవుడు సమాధానకర్త గనుక ఆయన్ను ఎవరైతే తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తారో వారికి సమాధానం, పాపక్షమాపణ, ఆత్మరక్షణ, మోక్షరాజ్యం లభిస్తాయని బైబిల్ ప్రబోధిస్తుంది. పాప పశ్చాత్తాపంతో నూతన జీవితాన్ని ఆకాంక్షిస్తూ క్రీస్తు సిలువ చెంతకు చేరి ఆయన దివ్య చరణాలను ఆశ్రయించి ఆయన రక్తం ద్వారా తమ పాపములను కడుగుకొని, క్రీస్తు అనుగ్రహించు పునరుత్థాన శక్తితో జీవితయాత్రలో ఒక గమ్యాన్ని కలిగి విశ్వాసంతో సాగిపోవడం ద్వారా సర్వశక్తుడైన దేవుని మహిమపరచగలము అని క్రైస్తవులు విశ్వసిస్తారు. యేసు వారిని ఎదుర్కొని వారికి శుభమని చెప్పెను అని వ్రాయబడినట్లుగా ఈ మాటలు చదువుచున్న ప్రతి ఒక్కరికి ప్రేమమయుడైన క్రీస్తు ప్రభువు కృపాసింహాసనం నుండి అన్ని విషయాల్లో శుభం కలుగును గాక. ఈస్టర్ శుభాకాంక్షలు.‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును.మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతయయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు.యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు. డా. జాన్ వెస్లీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమహేంద్రవరం -
సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)
-
ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)
-
చైత్ర పూర్ణిమ.. ఎవరిని పూజించాలి?
సాధారణంగా పున్నమి అనగానే వెన్నెల గుర్తుకొస్తుంది. సంవత్సరంలో పన్నెండు పున్నములు వస్తాయి. ప్రతి పున్నమికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. పున్నమి నాడు మనఃకారకుడైన చంద్రుని పూజించడం మంచిదని పెద్దలు చెబుతారు. నేడు చైత్ర పౌర్ణమి. ఈ రోజున హనుమంతుడిని, సత్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. అలాగే అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. దీపోత్సవం, అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.పౌర్ణమి రోజున వ్రతమాచరించి సాయంత్రంపూట చంద్రుడిని ఆరాధించడం శుభఫలితాలను ఇస్తుంది. ఆ రోజున లలిత సహస్ర నామ పారాయణ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. శివకేశవుల ఆరాధన చేయడం మంచిది. అలాగే సత్యనారాయణ స్వామి పూజతో సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున ఉపవాసం చేసేవారు ఉప్పు వాడిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.పౌర్ణమి వ్రతం ఆచరించడం ద్వారా మానసిక సంబంధిత మార్పులు జరుగుతాయి. చంద్రుడు మనఃకారకుడు కావున మానసిక బలం చేకూరుతుంది. చైత్ర పౌర్ణమి నేతి దీపాలను వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. హనుమంతునికి, నారాయణ స్వామికి నేతి దీపం వెలిగించడం విశిష్ట ఫలితాలను ప్రసాదిస్తుంది.అక్కమహాదేవి జయంతి నేడు12వ శతాబ్దపు ప్రసిద్ధ కన్నడ కవయిత్రి అక్కమహాదేవి జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహిస్తారు.శ్రీశైలంలో ఆమె తపస్సు చేసినట్లుగా భావించేప్రాంతం, మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.పరమశివుని భర్తగా భావించి,వచన సాహిత్యానికి ఆమె చేసిన కృషి అద్వితీయం. 12వ శతాబ్దపు వీరశైవ భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొలి మహిళా కవయిత్రి.కర్ణాటకకు చెందిన ఆమె శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని ఆరాధించి, తపస్సు చేసిందామె.అక్కమహాదేవి జయంతిని పురస్కరించుకుని, శ్రీశైల దేవస్థానంతో పాటు కర్ణాటకలోని అనేక ప్రదేశాలలో, మహిళా విశ్వవిద్యాలయాలలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి.నేడు (ఏప్రిల్ 2, గురువారం) చైత్రపూర్ణిమ– డి.వి.ఆర్ -
దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)
-
బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)
-
ఒంటిమిట్ట : వైభవంగా కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)
-
శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
-
హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
శ్రీశైలంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు (ఫోటోలు)
-
అంగరంగ వైభవంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం (ఫొటోలు)
-
విశాఖపట్నంలో వైభవంగా పైడిమాంబ తొలేళ్ల సంబరం (ఫొటోలు)
-
రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)
-
International Women's Day 2026 క్రీస్తు నందున్న స్త్రీ సాధికారత
‘ఇప్పుడైతే క్రీస్తునందు’ అన్న దృష్టికోణంలో నుండి చూడగలిగితే అన్నీ సానుకూలంగానే దర్శనమిస్తాయి. బైబిలు గ్రంథం స్త్రీని చిన్నచూపు చూసింది. స్త్రీని తక్కువ చేసి మాట్లాడింది వంటివి కూడా అర్ధరహిత వ్యాఖ్యలే. ఆదామువలె స్త్రీ కూడా దేవుని సృష్టి. దేవుడు ఆమెను తన స్వహస్తాలతోనే నిర్మించాడు. సాటియైన సహాయం అన్న కీర్తి ఆమె సొంతం. ఈ మాట దేవుడే చెప్పాడు.సమానత్వం అనేది అది నుండి ఇప్పటి వరకూ ఉంది. అది విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. చూసే దృష్టిలోనే అంతా ఉంది. ఆ లోపం చూసే విధానపు తీరుదే. అసాధారణ ఆధ్యాత్మిక భావజాలం అలవరచుకుంటే అన్నీ అనుకూలమే. దేవుని పట్ల భయంతో ఇట్టివారే స్త్రీని గౌరవిస్తారు. ఉత్సాహ, ప్రోత్సాహాలతో ఆమెను అందలం ఎక్కిస్తారు. మమ్మల్ని పూజించకున్నా... దయచేసి గుర్తించి గౌరవించండి మాకు అదే చాలు అన్న వేడుకోలు యవ్వన స్త్రీలది. రోజు రోజుకు ఇలాంటి విషమ పరిస్థితులు నేటి సమాజంలో నెలకొంటున్నాయి. నేటి పురుష జన్మ వైవిధ్యం ఏమంటే, తల్లిగా దయతలచి ఒక స్త్రీ పెట్టిన భిక్షే అతనికి ఈ జన్మ. తమదైన పురుషజన్మ స్త్రీ నుండే, స్త్రీకి మరో జన్మ అను మరణకర సంకట స్థితి నుండే ఈ నా జన్మ అన్న సత్యం ఎరిగిన పురుషోత్తములే దేవునికి ఎప్పుడూ భయపడుతూ మెరుగైన సమాజం కోసం కృషి చేస్తారు. స్త్రీ శిశు సంక్షేమాన్ని కోరేవారంతా సమాజ ఉద్ధారకులే.చిన్న కుటుంబమైనా.. పెద్దదైన ఉమ్మడి కుటుంబమైనా... అందులోని వారంతా చేతులెత్తి మొక్కే విధంగా స్త్రీ సాధికారతను బైబిలు అద్భుతంగా వివరించింది (సామెతలు 31:10–31). తనలోని నైపుణ్యాన్ని గుర్తించి దానికి నిత్యం సానపెడుతూ శ్రమించే స్త్రీ విజయపథాన ఊరేగుతుంది అంటుంది బైబిలు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. శిరస్సు అంటే ఏలుబడి లేదా పరి΄ాలన. ఇది దేవుని నియమం. భర్తను మినహాయించి యావత్తూ కుటుంబాన్ని ఆమె ఏలుతుంది.స్త్రీ వినయ విధేయతలు, మరీ ముఖ్యంగా ఆమె వినమ్రత తగ్గింపు, అణుకువ వంటివి ఆకట్టుకొని ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ వినయ సంపన్నతతోనే యేసు ‘నన్ను ఎలా మంచివాడు అంటున్నావు? మంచివాడు, సత్పురుషుడు, సద్బోధకుడు ఒక్కడే. ఆయనే దేవుడు’ అంటూ తగ్గించుకోవడం చూస్తే స్త్రీలకు ఇది గొప్ప ్ర΄ోత్సాహకరమే. ఎప్పుడూ హెచ్చించుకోక తగ్గింపు స్వభావంతో క్రీస్తు తనకు శిరస్సైన దేవుని మెప్పించడం మాదిరిగానే స్త్రీలు కూడా తమ స్వపురుషులను మెప్పించవచ్చు.– జేతమ్ -
కన్నుల పండువగా శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల (ఫొటోలు)
-
వైభవంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం (ఫొటోలు)
-
హీరోయిన్ తమన్నా 'శివరాత్రి' జ్ఞాపకాలు (ఫొటోలు)
-
విశాఖపట్నం : ఆర్కే బీచ్ ఆధ్యాత్మిక సాగరంగా మారింది (ఫొటోలు)
-
శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం..12.5 అడుగుల ఎత్తైన శనిదేవుడి విగ్రహం (ఫొటోలు)
-
శ్రీశైలంలో స్వాముల పై లాఠీ ఛార్జ్.. ‘శివ’మెత్తిన స్వాములు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
-
మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)
-
సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)
-
వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)
-
గాజులరామారం : ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)
-
శ్రీకాకుళం : శోభా యాత్ర శోభాయమానం (ఫోటోలు)
-
కడప : అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం..హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి (ఫొటోలు)
-
కొమురవెల్లి : అగ్నిగుండంపై ఉత్సవ విగ్రహాలతో పూజారులు (ఫొటోలు)
-
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
భద్రాచలం : కన్నుల పండువగా శ్రీ సీతారాముల తెప్పోత్సవం (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)
-
తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి సహస్ర ఘటాభిషేకం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : సంబరంగా ముగిసిన దీక్ష విరమణ ఉత్సవాలు (ఫొటోలు)
-
సింహాచల పుణ్యక్షేత్రంలో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ..జోరుగా దీక్షల విరమణ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : జై భవానీ..జైజై..భవానీ..! (ఫొటోలు)
-
విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు (ఫొటోలు)
-
ద్వారకాతిరుమల అనివేటి మండపంలో శిల్పకళా వైభవం (ఫొటోలు)
-
అపూర్వ ఘట్టం, అరుదైన ఘనత : ప్రధాని మోదీ ప్రశంసలు
వారణాసి, సాక్షి : మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖీ (Devavrat Mahesh Rekhe) అరుదైన ఘనతను సాధించారు. శుక్ల యజుర్వేదం (మధ్యందిన శాఖ) నుండి దాదాపు 2,000 మంత్రాల అత్యంత సంక్లిష్టమైన పారాయణం ‘దండక్రమ పారాయణాన్ని’ పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. అద్భుతమైన ఆ వారణాసి అసాధారణమైన ఆధ్యాత్మిక క్షణాలకు వారణాసి వేదికగా నిలిచింది. వేద సంప్రదాయంలో అత్యంత క్లిష్టమైన వాటిల్లో ఒకటిగా ఈ పారాయణాన్ని భావించారు. దాదాపు 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా శాస్త్రీయంగా ఈ కార్యక్రమం జరిగింది.19 year old Chi. Devavrat Mahesh Rekhe reciting Danda krama Parayana infront of elderly vidwans in kashi 😍🙏 https://t.co/Z7Tx2tTqWV pic.twitter.com/DIbPa6w8UI— Adarsh Hegde (@adarshahgd) December 2, 2025 ఈ పవిత్ర కార్యానికి గౌరవసూచకంగా, దేవవ్రతకు రూ.5 లక్షల విలువైన బంగారు కంకణం, రూ.1,11,116 విలువైన బంగారు కంకణాన్ని బహుకరించారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం , జగద్గురు శంకరాచార్యుల ఆశీస్సులతో ఈ గుర్తింపు లభించింది. 500 మందికి పైగా వేద విద్యార్థులు, సాంప్రదాయ సంగీతకారులు , శంఖ రావాల ప్రతిధ్వనుల మధ్య వారణాసి పులకించిపోయింది. భక్తులు వీధుల్లో బారులు తీరి, జల్లులు కురిపించారు ఈ వేడుకలో, శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతి తీర్థ మహాసన్నిధానం నుండి ఆస్థాన విద్వాన్ డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ ప్రత్యేక ఆశీర్వాద సందేశాన్ని అందించారు. సంక్లిష్టమైన స్వర-నమూనాలు మరియు శబ్ద ఖచ్చితత్వానికి వేద పారాయణ కిరీటంగా గౌరవించబడే దండక్రమ పారాయణం చరిత్రలో మూడు సార్లు మాత్రమే నిర్వహించబడిందని, దేవవ్రత పారాయణం దోషరహితంగా అతి తక్కువ సమయంలో పూర్తయిందని శృంగేరి మఠం అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు 19 ఏళ్ల దేవవ్రత మహేష్ రేఖే అద్భుతమైన విజయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేవవ్రతుడి విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతిని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆ యువ పండితుడు శుక్ల యజుర్వేదంలోని 2,000 మంత్రాలతో కూడిన దండక్రమ పారాయణాన్ని 50 రోజుల పాటు నిరంతరాయంగా పూర్తి చేశాడని తెలుసుకుని సంతోషిస్తారని ఆయన అన్నారు. ఇంతటి అసాధారణ ఆధ్యాత్మిక క్రమశిక్షణను కాశీ పవిత్ర నేలపై జరగడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్బంగా దేవవ్రతుడి కుటుంబం, సాధువులు, పండితులు, అతని కఠినమైన వేద అభ్యాసానికి దేశవ్యాప్తంగా అతనికి మద్దతు ఇచ్చిన సంస్థల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. వల్లభరం శాలిగ్రామ్ సంగ్వేద్ విద్యాలయంలో అక్టోబర్ 2 నుండి నవంబర్ 30 వరకు పారాయణం నిర్వహించారు. శృంగేరి పీఠం వేదపోషక సభ ఆధ్వర్యంలో శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖ పరీక్షల ప్రధాన పరిశీలకుడు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే యువ పండితుడు మరియు అతని తండ్రి-గురువు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే ఇద్దరినీ సాధువులు , వేద పండితులు ప్రశంసించారు.19 वर्ष के देवव्रत महेश रेखे जी ने जो उपलब्धि हासिल की है, वो जानकर मन प्रफुल्लित हो गया है। उनकी ये सफलता हमारी आने वाली पीढ़ियों की प्रेरणा बनने वाली है। भारतीय संस्कृति में आस्था रखने वाले हर एक व्यक्ति को ये जानकर अच्छा लगेगा कि श्री देवव्रत ने शुक्ल यजुर्वेद की माध्यन्दिन… pic.twitter.com/YL9bVwK36o— Narendra Modi (@narendramodi) December 2, 2025 -
స్వామి అయ్యప్ప పడిపూజలో వితికా షేరు దంపతులు
-
తిరుచానూరు : పంచమి తీర్థం..పులకించిన జనం (ఫొటోలు)
-
ధ్వజారోహణం..దివ్య కాంతులతో వెలిగిపోతున్న అయోధ్య (ఫొటోలు)
-
తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)
-
హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)
-
తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
-
కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)
-
ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
#KartikaPournami : భక్త జనసంద్రంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ (ఫొటోలు)
-
శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం (ఫొటోలు)
-
శ్రీకాకుళం : దక్షిణ కాశీ అని పిలువబడే ఈ ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
కార్తీక సోమవారం..ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
తిరుమలలో వైభవంగా శ్రీవారికి పుష్పయాగం (ఫోటోలు)
-
ఇండియాలో తొలి మసీదు గురించి తెలుసా?
క్రీ.శ. 629 (హిజ్రీ 7) సంవత్సరంలో నిర్మించబడిన చేరమాన్ జుమా మస్జిద్, కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు; అది భారత ఉపఖండంలో మతసామరస్యానికి, ఆధ్యాత్మిక అన్వేషణకు, సంస్కృతీ సంప్రదాయాల సంగమానికి అపుర్వమైన చిహ్నంగా నిలిచింది. మస్జిద్ నిర్మాణ శైలిలో ఆ కాలపు కేరళ శిల్ప సౌందర్యం ప్రతిబింబిస్తుంది. కానోపు (గుడార ఆకారం) ఆకారంలో కట్టిన గోపురం, కలపతో నిర్మించిన పైకప్పు, పురాతన సాంప్రదాయ నూనెదీపం – ఇవన్నీ దక్షిణ భారత ఆర్కిటెక్చర్‌కి ఇస్లామిక్ రూపాన్ని అద్దిన అరుదైన ఉదాహరణ. కాలక్రమేణా అనేక పునరుద్ధరణలు జరిగినా, ప్రాథమిక రూపం చెక్కు చెదరకుండా కాపాడబడుతూ వస్తోంది. అక్కడి ఇమామ్‌లు ఇప్పటికీ తమ వంశావళిని మాలిక్ ఇబ్నె దినార్ వరకు కలిపి చెప్పుకుంటారు.మస్జిద్ చతురస్ర ఆకారంలో పురాతన కళా వైభవాన్ని చాటుతోంది. మస్జిద్ కు సంబంధించిన కాంప్లెక్స్ లో చేరామన్ మ్యూజియం, వెనుక భాగంలో అందమైన కొలను, కుడి పక్కన ఖబ్రస్తాన్ , అందులో పచ్చని నిశ్శబ్దంతో తలలూపుతున్న కొబ్బరి చెట్లు, వివిధ రకాల మొక్కలు, కాలానికి అనుగుణంగా మార్పు చెందిన రాతి మెట్లు, మస్జిద్ లోపలి భాగం మధ్యలో వేలాడుతున్న పురాతన నూనెదీపం, అత్యంత సుందరమైన చెక్క మింబర్ ఇవన్నీ ఆ ప్రదేశాన్ని ఒక చరిత్రకావ్యంలా మార్చేశాయి.అక్కడి స్థానికులు చెప్పిన ఒక మాట ప్రకారం ‘‘ఇది కేవలం మస్జిద్ కాదు, ఇది భారత దేశానికి ఇస్లాం ప్రవేశ ద్వారం.’’ఈ ఒక్క వాక్యంతో ఆ స్థలం ప్రాముఖ్యత పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సముద్ర గాలిలోనూ, ప్రార్థన ధ్వనిలోనూ, ఆ భూమి ఇంకా చెరామాన్ పెరుమాళ్ ఆత్మను ఆత్మీయంగా మీటుతూనే ఉన్న అనుభూతి కలుగుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కార్తీకమాసంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)
-
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
హైదరాబాద్ : భక్తి శ్రద్ధలతో ఛట్ పూజలు (ఫొటోలు)
-
కుచేలా... కుచేలా!
బెంగుళూరుకు చెందిన ఒక బంగారు వ్యాపారి శ్రీ కృష్ణ భక్తుడు. ప్రతి ఏడాదీ ఇతర భక్తులతో కలిసి క్రమం తప్పకుండా మథుర వెళ్ళివస్తూ ఉంటాడు. ‘ఎప్పుడూ మనం వెళ్ళి రావడమేనా, ఒక పేద వాడైన కృష్ణ భక్తుడికి ఆ అవకాశం కల్పిస్తే బాగుంటుంది కదా’ అని అతడి భార్య సూచించింది. అనుకున్నదే తడవుగా తమ బృందనాయకుడితో ఆ విషయం చెప్పాడు. బృంద నాయకుడు అతడి ఆలోచనకు హర్షం వెలిబుచ్చాడు. అయితే తాను ప్రయాణ ఖర్చులతో పాటు అన్ని ఖర్చులూ భరిస్తున్నట్లు ఎక్కడా బహిరంగపరచవద్దని కోరు కున్నాడు వ్యాపారి. అలాగే ఆ ఏడాది హరేకృష్ణ బృందం విమానంలో బయలుదేరింది. దేశ రాజధాని దిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మథుర చేరుకుంది. యమునా నదీతీరంలో శ్రీ కృష్ణ జన్మ స్థానమైన కారాగారాన్ని చూస్తూ ఒక బృంద సభ్యుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఉండబట్టలేని బంగారు వ్యాపారి కారణమేమిటని ప్రశ్నించాడు. ‘‘నేను చిన్న కూలీని. నా ఆదాయం అంతంత మాత్రమే. శ్రీ కృష్ణుడి భక్తుడినైనా ఇంతింత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చేంత స్తోమత నాకు లేదు. ఈ జన్మలో మథుర వస్తానని అనుకోలేదు. శ్రీ కృష్ణ జన్మస్థానం కళ్ళారా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. ఏ మహానుభావుడికో ఒక ఆలోచన వచ్చి నాకు ఈ ప్రయాణ అవకాశం కల్పించాడు. అతడి ఋణం ఎలా తీర్చుకోగలను? అతడికి కృతజ్ఞతలు తెలుపుదామంటే కూడా వీలుపడటం లేదు. ఎందుకంటే అతడు గుప్తదానం చేశాడు’’ అని విలపించాడు.బంగారు వ్యాపారి మనసు చలించింది. అయినా తానే ఆ గుప్తదాత అని చెప్పుకోదలచలేదు. గమ్మున ఉండిపోయాడు. ఆ బృందం అలాగే నైమిశారణ్యం, అయోధ్యలు చూసి విమానం ఎక్కారు. యాత్ర విజయవంతం అయినందులకు బృంద నాయకుడు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. విమానం బెంగళూరు విమానాశ్రయం చేరుకుంది. అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని అభినందనలు తెలుపుకున్నారు. లగేజీ అందించే సమయం వచ్చింది. లగేజీలు అందుకునే సమయంలో బంగారు వ్యాపారి సంచికన్నా కూలీ సంచి ముందు వచ్చింది. ఆనందంతో అతడు సంచి ఎత్తుకుంటూ ఉంటే సంచిపై అతడి పేరు చూశాడు వ్యాపారి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.‘శ్రీ కృష్ణలీలలు ఇంతింత కాదయా’ అనుకున్నాడు. ఎందుకంటే ఆ కూలీ పేరు కుచేలన్!– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
మొదటి ముడి
మన ఆత్మ ప్రాపంచిక విషయాలపై, వస్తువ్యామోహాలపై చిక్కుకున్నప్పుడు మన చిత్తం భౌతిక పరమైన విషయాలతో కప్పబడి, అది ఒక స్థాయి వరకు పెరిగి అక్కడ ఒకముడి ఏర్పడుతుంది. దానివలన మీరు కేవలం ఆ వస్తు ప్రపంచాన్నే చూస్తారు కానీ ఆత్మను కాదు. పదార్థానికి, ఆత్మకు మధ్యన గల ముడిఇదే. దీనినే ’జడ ప్రకృతి’ అని సంస్కృత భాషలో అంటారు. ఇదే ప్రథమ ముడి. ఎంతో సంక్లిష్టమైన ముడి. మీరిలా అనుకుంటారు. ‘ఈ రత్నం నాది, ఇదిగోఈ కుర్చీ నాది దానినుండి తనను దించేస్తారేమోనని అనుమానిస్తూ, తన కుర్చీని కాపాడుకోవాలనే ప్రణాళికలు వేస్తూ, ఎప్పుడూ ఆ పనిలోనే ఉంటాడు. ఆ కుర్చీ జీవం లేనిది. ఆ పదవి కూడా జీవం లేనిదే. ఈ ముడి పృథ్వీతత్వంతో ఏర్పడుతుంది. ఆ విధంగా భూతత్వ మూలకం అయిన మూలాధార చక్రం నుండి మొదలై, క్రమేపీ ఇడానాడి పైకిప్రాకుతూ ఆజ్ఞా చక్రం వద్ద ప్రత్యహంకారాన్ని కలుగజేస్తుంది. ఎక్కడయితే ముడి ఉంటుందో, అక్కడ ఆ ముడి విప్పబడటం కూడా ఉంటుంది. సహజయోగం ద్వారా అటువంటి ముడినుండి బయట పడటం చైతన్య తరంగాల ద్వారానే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ముడి విడి΄ోతుందో, అప్పుడే కుండలిని ఉత్థానం ప్రారంభం అవుతుంది. ఇది మొదటి ముడి. అది చాలా ముఖ్యమైనది.– డాక్టర్ పి. రాకేష్(పరమ పూజ్య శ్రీ మాతాజీ ప్రవచనాల ఆధారంగా) -
శివుని రామదాసత్వం
బ్రహ్మాది దేవతలందరూ తమ కోర్కెలు తీరటానికి శివుని ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి శివుడు రామాజ్ఞను పాలించే రామదాసుగా ఎలా అయ్యాడు? అని ‘పరాశర సంహిత’లో మైత్రేయ ముని పరాశర మహర్షిని అడిగినపుడు ఆ మహర్షి ఇలా చెప్పాడు: గార్ధభ నిస్స్వనుడనే రాక్షసుడు భయంకర రూపంతో దేవ దానవ యక్షాదులకు జయింప శక్యం కాని లోక కంటకుడయ్యాడు. అతడు పరమేశ్వర పరమ భక్తుడు. అతని బాధ పడలేక ఇంద్రాదులు బ్రహ్మ విష్ణువులతో కైలాసానికి వెళ్లారు. ఆ రాక్షసుని అంతం చేయమని ప్రార్థించారు.శివుడు, ‘ఆ రాక్షసుడు నా నిజ భక్తుడు. నేనెలా చంపగలను?’ అన్నాడు. విష్ణువు కోపంతో ‘నేనూ నీ భక్తుణ్ణే కదా! నా కంటే అతడు ఇష్టుడా నీకు? అయితే నాకు నీ పట్ల గల దృఢమైన భక్తి కవచంగా ధరించి నేనే వానిని సంహరిస్తాను’ అన్నాడు. శివుడు ‘నువ్వు ఆ రాక్షసుని చంపితే నేను నీకు దాస్యం చేస్తాను’ అన్నాడు. అప్పుడు విష్ణువు ‘నేను అతనిని చంపలేకపోతే నీ దాసులకు దాసుడనై కైలాసశిఖరంపై గడుపుతాను’ అన్నాడు.హరిహరులు పరస్పరం ప్రతిజ్ఞలు చేసుకున్నారు. విష్ణువు మోహినీ రూపంలోకి మారి రాక్షసుని మోహ విభ్రాంతులకు గురి చేశాడు. రాక్షసుడు ఆ మాయలో పడి మోహినిని పట్టుకోవటానికి వెంటపడి భూమిపై పడ్డాడు. అప్పుడు విష్ణువు తోడేలు రూపంలో అతనిని తినివేశాడు. రాక్షస సంహారం తర్వాత శివుడు విష్ణువుతో ‘నేను నీకు దాసుణ్ణి’ అన్నాడు. విష్ణువు, ‘మేమంతా నీ అధీనులము. నీ మహిమ వల్లనే ఇతడు మరణించాడు. కాబట్టి, నేను ఇప్పుడు నిన్ను దాసునిగా స్వీకరించలేను. రావణ సంహారం కోసం రామునిగా అవతరించినపుడు, హనుమ రూపంలో దాసునిగా ఉండి నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో’ అని చెప్పాడు. అలా రామావతారంలో శివుడు హనుమంతుని రూపంలో రామదాసుగా, రామభక్తునిగా జనుల పూజలందుకున్నాడు. హరిహరులకు భేదం లేదు. వారి వాగ్వివాదాలు, ప్రతిజ్ఞలు లోక కల్యాణానికే! – డా.చెంగల్వ రామలక్ష్మి -
కార్తీకమాసం ప్రారంభం.. ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
తెలంగాణలో గుప్త ఆలయం! సాహసోపేతమైన ప్రయాణం.. కోపాన్ని తగ్గించే కోనేరు.. మీకు తెలుసా? (ఫొటోలు)
-
శ్రీకృష్ణుడూ దేవుడే! శ్రీకృష్ణుని శివదీక్ష
శ్రీకృష్ణుడూదేవుడే! పరమశివుడూ దేవుడే! ఇద్దరూ ఘటనాఘటన సమర్థులే! హరిహరులకు భేదం లేదు. ఎవరి ఇష్ట దైవాన్ని వారు పూజించుకుంటూ ఉంటారు. అయితే భక్తులకు వరాలివ్వ గల కృష్ణ పరమాత్మ తానే వరం కోరి శివుని గురించి ఉగ్ర తపస్సు చేయటం విశేషం.కృష్ణుని అష్ట మహిషులలో రుక్మిణి మొదలైన వారికి ప్రద్యుమ్నాదులు జన్మించారు. కానీ, జాంబవతికిసంతానం కలగలేదు. ఆమె దీనంగా కృష్ణుని ప్రార్థిస్తే, కృష్ణుడు పుత్రుని కోసం ఆరునెలలు పాశుపత దీక్షను స్వీకరించి, తీవ్ర తపస్సు చేశాడు. మొదటి నెల రోజులు పళ్ళు భుజించి కృష్ణుడు శివ మంత్రాన్ని పఠించాడు. రెండవ నెలలో జలమే ఆహారంగా ఒంటి కాలి మీద నిలిచి తపస్సు చేశాడు. మూడవ నెలలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ, కాలి బొటన వేలు మీద నిలబడి తపస్సు చేశాడు. అలా ఆరునెలలు నిష్ఠగా చేశాక శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు.అప్పుడు కృష్ణుడు, ‘సంసారంలో బందీనైపోయాను. మాయా పాశాలలో చిక్కుకుపోయాను. నా ఈ తపస్సుకు కూడా ఈ సంసారమే కారణం. పుత్రార్థినై జాంబవతి కోసం సకామంగా తపస్సు చేశాను. మోక్ష ప్రదుడవైన నిన్ను ప్రసన్నుని చేసుకుని ముక్తి నిమ్మని కోరాలి కానీ లౌకికము, అశాశ్వతము అయిన కోరిక కోరుతున్నాను’ అంటాడు. శివుడు ‘నీకు చాలా మంది పుత్రులు కలుగుతారు. గృహస్థాశ్రమంలో చిరకాలం ఉంటావు. గాంధారి శాపం వల్ల, బ్రాహ్మణ శాపం వల్ల నీ వంశం అంతరిస్తుంది. ఇది ఇలాగే జరగవలసి ఉంది’ అని అంటాడు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!ఆకలి, నిద్ర, భయం, శోకం, హర్షం, మరణం ఇవన్నీ మానవ దేహం ధరించిన వారికి తప్పవు. మానుష జన్మలో మానుష లక్షణాలే ఉంటాయి. మాయాశక్తి సర్వులనూ ప్రేరేపిస్తుంది. స్వతంత్రురాలు ఆ జగదీశ్వరి మాత్రమే అని వ్యాసుడు దేవీ మహాత్మ్యాన్ని దేవీ భాగవతంలో చెపుతాడు. ఆ దేవిని నిరంతరం ధ్యానించటం ద్వారా లౌకిక సుఖాల పట్ల కొంతైనా విరక్తి సాధించవచ్చునంటారు పెద్దలు. ఇదీ చదవండి: Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే! – డా. చెంగల్వ రామలక్ష్మి -
నయనం అంటే అర్థం తెలుసా?
సనాతన ధర్మంలో సూర్యోపాసన ప్రముఖంగా చెప్పబడింది. సూర్యుడు మనలోని ప్రతి ఇంద్రియానికీ ప్రాణశక్తిని అందించి నడిపిస్తాడు. ‘సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ.’ సూర్యుడు సకల చరాచర జగత్తుకూ చక్షువు రూపంగా చెప్పబడ్డాడు. ఆదిత్య హృదయం సూర్యుడిని ‘నమస్సవిత్రే జగదేక చక్షుషే’ అంటుంది. జగత్తుకంతటికీ చక్షువైన సవిత్రునికి నమస్సులు. చక్షువు అంటే కన్ను లేదా చూచేది. కన్నులు ఉంటేనే చూడగలం. చక్షువు వస్తు పరిజ్ఞానం యొక్క విశేషాన్ని తెలియచేస్తుంది. దేనిని చూడాలన్నా కనులు ఉండాలి. వాటికి చూడగలిగే శక్తి ఉండాలి. సూర్యమండలంలో ఉన్న పరమాత్మ తేజస్సే మన కంటిలో నిలిచి వస్తువును చూడగలిగిన శక్తిని ప్రసాదిస్తున్నది. దీనినే ‘నయనము’ అని కూడా అంటారు. నయనమంటే తీసుకొని పోయేది అని అర్థం. ఎక్కడికి తీసుకు వెళుతుంది? త్రోవలో ఎదురయ్యే కంటకాల నుండి తప్పించి... మంచి మార్గంవైపు తీసుకొని పోతుంది. కంటి చూపునకు సంబంధించిన విద్య కాబట్టి దీనిని ‘చక్షుష్మతీ విద్య’ అన్నారు.‘చక్షుష్మతీ విద్యయా తమస్సుమతి’: చక్షుష్మతీ విద్యను తెలుసుకుంటే... తమస్సును అధిగమించగలం. చక్షుష్మతీ దేవిని వర్ణిస్తూ – ఒక చేతిలో బంతిని, మరొక చేతిలో పూవును పట్టుకొని వెండి సింహాసనంపైకూర్చుంటుంది, అని చెపుతారు. వెండి సింహాసనం మన కంటి చుట్టూ ఉండే తెల్లని వలయం, నల్లగుడ్డు మధ్యలో ఉండే తెల్లని బిందుస్థానానికి ప్రతీక. అక్కడే సూక్ష్మరూపంలో చక్షుష్మతీ దేవి ఉంటుంది. పూవు వికసనకు ప్రతీక... ముడుచుకు పోతే దేనినీ చూడలేం. వికసన ఉంటేనే చూడగలుగుతాం. అలాగే బంతి అనేది భ్రమణానికి ప్రతీక. కనుగుడ్లు తిరిగితేనే దేనినైనా చూడగలం. ఆదిత్యునిలోని చక్షుష్మతి అనే శక్తి కనులలో ఉన్నప్పుడే మనమేదైనా చూడగలుగుతాం. చూడగలిగే శక్తి లేనప్పుడు ఆపదల వలయంలో చిక్కుకుంటాం. అందుకే చక్షుష్మతీ అనుగ్రహానికై ప్రార్థించాలి.– పాలకుర్తి రామమూర్తి -
క్షీరసాగర మథనం-గరళ ఆవిర్భావం
దుర్వాసుని శాపం వల్ల అసురులకు తన త్రిలోకాధిపత్యాన్నీ, సకల సంపదలనూ కోల్పోయాడు ఇంద్రుడు. అసురుల చేతిలో ఎన్నో బాధలు అనుభవించి ఇతర దేవతలతో కలిసి చివరకు బ్రహ్మను ఆశ్రయించాడు. బ్రహ్మ వారిని విష్ణువు దగ్గరకు నడిపించాడు. ఆయన సాగరమథనం చేసి అందులోంచి పుట్టే అమృతాన్ని దేవతలు మాత్రమే సేవించేట్లుగా చేయడం ఒక్కటే ఈ సమస్యకు సరైన పరిష్కారం అన్నాడు. సత్వరం అసురులను మంచి మాటలతో ఒప్పించి అందరూ కలిసి మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకిని ఆ కవ్వమునకు తాడుగాను అమర్చి సాగర మథన కార్యక్రమానికి పూనుకొమ్మని చెప్పాడు. అలా మొదలైన ‘క్షీరసాగర మథనం’ (Ksheera Sagara Madhanam)అనే బృహత్కార్యంలో శ్రీమహావిష్ణువు కమఠ (తాబేలు) రూపం దాల్చి, మందర పర్వతం సాగరంలో మునగకుండా అడ్డుతగిలే ఆధారమై అమరాడు. చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులుఅసురులు వాసుకికి తలవైపున ఉండి లాగడం వలన వాసుకి నోటి నుండి వెలువడిన విషపు వేడిజ్వాలలు తగిలి నానాటికి కమిలిపోయి, అలిసిపోయి బలహీనులై మిగలసాగారు. దేవతలు తోకవైపు ఉండి లాగి బలవంతులుగానే మిగిలారు. అలా సాగిన సాగర మథనంలో వరుసగా సురభి, వారుణి, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్చైశ్రవము, పూర్ణచంద్ర మండలము, అప్సరలు, ధన్వంతరి ఉద్భవించారు. ఆ తరువాత క్షీరసాగరం నుండి అమృతం జనించక ముందు, హాలాహలం ప్రత్యక్షమవడం జరిగిందని కలిదిండి భావనారాయణ రచించిన ‘శ్రీవిష్ణుపురాణం’ చెబు తోంది. కం. అక్కజముగ దేవాసురు / లుక్కున, వడి, బట్టితిగుచు నుద్ధతులకడున్ / త్రొక్కుడువడి, వాసుకి, వడి / గ్రక్కిన గరళంబు భోగిగణములు గొనియెన్. దేవతలు అసురులు ఎంతో శ్రమపడి చెరొకవైపు పట్టి అవిరామంగా లాగడం వలన త్రొక్కుడుపడిన వాసుకి అలసిపోయి భళ్ళుమని ఒక్కసారిగా గరళాన్ని కక్కాడు. ఆ గరళాన్ని సర్ప సమూహాలు ఆరగించాయి – అని పై పద్యం భావం. అలా క్షీరసాగర మథనం సందర్భంగా పుట్టిన హాలాహలాన్ని నాగులు గ్రహించారని శ్రీవిష్ణుపురాణం కథనం చేసింది. – భట్టు వెంకటరావు -
సిరిసిల్ల కార్మికక్షేత్రం వెంకన్న రథోత్సవం పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
కృష్ణా నది ఒడ్డున గుహలో ఉన్న అమరలింగేశ్వర ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం (ఫొటోలు)
-
బైబై ఏనుగు సంతోషం పంచి.. బాధగా వీడ్కోలు (ఫొటోలు)
-
ఎర్ర సముద్రంలా మారిన ఇంద్రకీలాద్రి..పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
ఏపీలో 12 శిరస్సుల నాగేంద్రుడి రూపంలో సుబ్రమణ్య స్వామి క్షేత్రం ఎక్కడో తెలుసా.. (ఫొటోలు)


