
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాల్లో చివరి ఘట్టమైన రథోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది.

ప్రత్యేక పూజల అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ, కలెక్టర్ దాసరి హరిచందన అమ్మవారి రథానికి దిష్టి తీసి ఊరేగింపును ప్రారంభించారు.

బల్కంపేట పురవీధుల్లో ఎల్లమ్మను ఊరేగించారు.భక్తజనం పోటెత్తారు.










